ఫ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
నల్లగొండ : డిండి ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం సత్వరమే పూర్తి చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కోరారు. నాంపల్లి మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సీపీఐ మండల కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేసి దేవరకొండ మునుగోడు నియోజకవర్గాల రైతులకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేయాలని కోరారు. అనంతరం వివిధ గ్రామాల నుంచి పలువురు సీపీఐలో చేరారు. మెగావత్ భీముడు, వడ్త్యా బాలాజీ, మెగావత్ సందీప్, మెగావత్ పవన్, మెగావత్ భీమా, కొర్ర మున్నా పార్టీలో చేరినవారిలో ఉన్నారు. కార్యక్రమంలో ముదిగొండ మురళీకృష్ణ, ఆర్ అంజయ్య చారి, సుదనబోయిన రమేష్, నేతాళ్ల రాజు, కోరె సత్తయ్య, ఊరిపాక వెంకటయ్య, దండిగా వెంకటయ్య, గిరి స్వామి, బుషిపాక యాదయ్య, అగ్గిరాజు, దామెర రమేష్ పాల్గొన్నారు.


