చివ్వెంల(సూర్యాపేట) : ఇంటి గేటు తీస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై వృద్ధురాలు మృతిచెందింది. ఈ ఘటన చివ్వెంల మండల పరిఽ దిలోని గుంజలూరు గ్రామంలో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంజలూరు గ్రామానికి చెందిన సుంకరి అంజమ్మ(75) ఆదివారం తెల్లవారుజామున తన ఇంటి గేటు తెరిచేందుకు ప్రయత్నించగా.. ఇంట్లోకి విద్యుత్ సరఫరా అవుతున్న వైరు గేటు గ్రిల్స్‌కు ఆనుకోవడంతో ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై మృతిచెందింది. మృతురాలి మనుమడు సుంకరి నరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వి. మహేశ్వర్ తెలిపారు. మృతురాలికి ఒక కుమార్తె ఉంది.
తండ్రికి తలకొరివి
పెట్టిన కుమార్తె
ఆలేరు : ఆలేరు పట్టణంలోని రంగనాయకుల వీధికి చెందిన ఎలగల శ్రీనివాస్(48) అనారోగ్యంతో శనివారం రాత్రి మృతిచెందాడు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు గాయత్రి, గౌతమి ఉన్నారు. కుమారులు లేకపోవడంతో పెద్ద కుమార్తె గాయత్రి తండ్రికి తలకొరివి పెట్టింది. తండ్రి పాడె ముందు కుమార్తె రోదిస్తుండటం చూసిన గ్రామస్తులు కంటతడి పెట్టుకున్నారు.


