చిట్యాల : చిట్యాల మండలంలోని బోయగుబ్బ గ్రామ సర్పంచ్ రేగులగడ్డ స్వామిగౌడ్ స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ గ్రామంలో చెత్తను సేకరించారు. ఐదు నెలలుగా జీతాలు చెల్లించకపోవటంతో గ్రామ పంచాయతీ సిబ్బంది పనులకు రావటం లేదు. చెత్త సేకరణకు ఉపయోగించే ట్రాక్టర్ డ్రైవర్‌కు జీతం లేకపోవటంతో అతను కూడా విధులకు రావటం లేదు. గ్రామంలో చెత్త పేరుకుపోయింది. పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా ఉండేందుకు సర్పంచ్ స్వామిగౌడ్.. తానే ట్రాక్టర్ నడుపుతూ వీధి వీధికి వెళ్లి చెత్త సేకరించారు.
గ్రామపంచాయతీ చెత్త ట్రాక్టర్‌ను నడుపుతున్న సర్పంచ్ స్వామిగౌడ్


