సంస్థాన్ నారాయణపురం : సంస్థాన్ నారాయణపురం మండలానికి సాగు జలాలు అందించే రాచకొండ రిజర్వాయర్‌కు డీపీఆర్ సిద్ధం చేయాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. రాచకొండ రిజర్వాయర్ నిర్మించాలని సీపీఐ ఆధ్వర్యంలో సంస్థాన్ నారాయణపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం నిర్వహించిన మహాధర్నాలో రిటైర్డ్ ఇంజనీర్ ఇంద్రసేనారెడ్డితో కలిసి నెల్లికంటి సత్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలకులు మారినా ఎస్‌ఎల్‌బీసీ, డిండీ ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. డిండి ఎత్తిపోతల పథకం ఎత్తును 440 మీటర్లుగా నిర్ణయించడం అన్యాయమన్నారు. 436 మీటర్లుగా నిర్ణయించి దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు సాగు జలాలు అందించాలన్నారు. రాష్ట్రంలో సాగు జాలలు అందని నియోజకవర్గం మునుగోడు ఒక్కటే అన్నారు. ఈ కార్యక్రమాంలో మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, జిల్లా కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి, నాయకులు బచ్చనగోని గాలయ్య, పార్టీ మండల కార్యదర్శి దుబ్బక భాస్కర్, పల్లె శేఖర్‌రెడ్డి, కురుమిద్ద శ్రీనివాస్, చిలువేరు అంజయ్య, కలకొండ సంజీవ తదితరలున్నారు.
ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం


