నల్లగొండ : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని నల్లగొండ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య అన్నారు. నల్లగొండలో శనివారం ఐవీఎఫ్ ఆధ్వర్యంలో పలువురు మహిళలను, నూతన ఆర్యవైశ్య ప్రజా ప్రతినిధులను ఆమె సన్మానించి మాట్లాడారు. మహిళలకు ఓర్పు, సహనం ఎక్కువ అని కుటుంబ బాధ్యత, ఉద్యోగ బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వహిస్తారని చెప్పారు. ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీను మాట్లాడుతూ ఐవీఎఫ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. అనంతరం ఐవీఎఫ్ ఆధ్వర్యంలో మేయర్ చైతన్యను సన్మానించారు. కార్యక్రమంలో ఐవీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రేపాల భద్రాద్రి, రాష్ట్ర మీడియా కమిటీ చైర్మన్ కోటగిరి దైవాదీనం, కొమిరిశెట్టి రమ, పందిరి గీత, కార్పొరేటర్ యామ కవిత, కటకం శ్రీనివాస్, ఉప్పల స్వప్న, చందా భాగ్యలక్ష్మి, లెంకలపల్లి మంజుల, నళిని, తాళ్లపల్లి రాము, పారేపల్లి శ్రీనివాస్, నాల వెంకటేశ్వర్లు, బుక్కా వెంకయ్య, మేడం విశ్వప్రసాద్, వందనపు జ్యోతి, వీరెల్లి సతీష్, కోటగిరి రామకృష్ణ, కర్నాటి నగేష్, డాక్టర్ రాజేశ్వరి పాల్గొన్నారు.


