breaking news
Nagarkurnool
-
రాయలసీమ ప్రాజెక్టును రద్దు చేయండి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/సాక్షి, నాగర్‌కర్నూల్: ‘ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు విజ్ఞప్తి చేస్తున్నా.. పాలమూరు ప్రాజెక్టులను అడ్డుకోవద్దు. పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, డిండి, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులను పూర్తి చేసుకునేందుకు సహకరించండి. ఈ ప్రాజెక్టులను అడ్డుకోవడం న్యాయమా? ఒకనాడు పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్నామని మీరు చెప్పారు. మీరు బాధ్యతగా ఉండి, మమ్మల్ని బతకనివ్వండి. మా ప్రాజెక్టులను పూర్తి చేసుకోనివ్వండి. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి 4 టీఎంసీల నీరు తీసుకునేది..ఇప్పుడు 9.5 టీఎంసీల నీరు తీసుకెళ్లేందుకు ప్రాజెక్టులు పెట్టుకున్నరు. రోజుకు 3 టీఎంసీలు తీసుకునే రాయలసీమ ప్రాజెక్టును రద్దు చేసి ఉదారత చూపండి.రెండు తెలుగు రాష్ట్రాలను, తెలుగువారిని సమానంగా అభివృద్ధి చేయాలన్న మీ ఆలోచన నిజమైతే రాయలసీమ ప్రాజెక్టును రద్దు చేయండి. పాలమూరు ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు సహకరించండి. పాలమూరు బిడ్డలం మీ మేలు మర్చిపోం. మేం విజ్ఞప్తులు చేస్తాం. వినకపోతే ఎలా పోరాటం చేయాలో పాలమూరు బిడ్డలకు తెలుసు. పాలమూరు ప్రాజెక్టులను రెండున్నరేళ్లలో పూర్తిచేసేలా నేను బాధ్యత తీసుకుంటా..’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం జటప్రోలు గ్రామంలో రూ.200 కోట్లతో చేపట్టనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఇక్కడి మదనగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు. మేం అన్నం పెడితే.. నువ్ సున్నం పెట్టావు.. ‘పాలమూరు నుంచి 2009లో ఎంపీగా గెలిచిన కేసీఆర్ ఈ ప్రాంతానికి చేసింది, ఇచ్చింది ఏంటో చెప్పాలి. కరీంనగర్ నుంచి పారిపోయి పాలమూరుకు వలస వస్తే ఇక్కడి బిడ్డలు భుజాలపై పెట్టుకున్నారు. పదేళ్ల కాలం పాటు సీఎంగా ఉన్నా పాలమూరు ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదు? ఉమ్మడి రాష్ట్రంలో కన్నా కేసీఆర్ పాలనలోనే పాలమూరుకు అన్యాయం జరిగింది. పాలమూరు బిడ్డలు అన్నం పెడితే, కేసీఆర్ వారికి సున్నం పెట్టారు. పాలమూరు బిడ్డ సీఎం అయితే కేసీఆర్‌కు దు:ఖం వస్తోంది.2034 వరకు ఇంకో పదేళ్ల పాటు పాలమూరు బిడ్డనే ముఖ్యమంత్రిగా ఉంటారు. పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పాలమూరు, కల్వకుర్తి, బీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను పూర్తిచేసే బాధ్యత నేను తీసుకుంటా. డిసెంబర్ 9 కల్లా అన్ని ప్రాజెక్టుల భూసేకరణ పూర్తిచేసి, నిర్వాసితులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లిస్తాం. ఆయన అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్షంలో కూర్చుని మేము చేస్తున్న పనులు చూడాలి..’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. రెండున్నరేళ్లలో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు ‘కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ రూ.లక్ష కోట్లు ఖర్చు చేశాడు. ఒకే ఒక్క ప్రాజెక్టు కోసం లక్ష కోట్లు పెట్టిన పరిస్థితి ఎక్కడా లేదు. ఎవరైనా గుడిసె కట్టుకున్నా పదేళ్లు ఉంటది. కానీ కాళేశ్వరం 2019లో కడితే 2023లో కూలింది. మూడేళ్లకే ప్రాజెక్టు కూలుతుందా? బీఆర్ఎస్ పాలనలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయలేదు. తన ఇంటినిండా మాత్రం కొలువులు నింపుకున్నాడు. మా ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే 60 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. రెండున్నరేళ్ల కాలంలో మొత్తం లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో మాదిగ ఉప కులాలకు న్యాయం జరిగేలా చూసే క్రమంలో నోటిఫికేషన్ల జారీ ఆలస్యం అవుతోంది. ఆరు నెలలు ఆలస్యమైనా వారికి న్యాయం జరుగుతుంది. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు దేశానికే తలమానికంగా నిలువబోతున్నాయి..’ అని సీఎం చెప్పారు. మా పాలనలో మహిళలకు అందలం ‘కేసీఆర్ పాలనలో 2018 వరకు ఒక్క మహిళా మంత్రి కూడా లేరు. ఇలాంటి పరిస్థితి దేశంలో ఎక్కడా లేదు. ఆడవాళ్లు వంటింటికే పరిమితం కావాలన్న దుర్మార్గమైన ఆలోచన బీఆర్ఎస్ది. మా ప్రభుత్వం రాష్ట్రంలోని కోటిమంది మహిళలను కోటీశ్వరుల్ని చేసేలా పనిచేస్తోంది. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో బడిపంతుళ్ల హాజరు లెక్కలు చూసే అధికారం అక్కలకే ఇచ్చాం. పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులు, సోలార్ విద్యుత్ ప్లాంట్లు, ఇందిరా మహిళాశక్తి క్యాంటీన్ల ద్వారా మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నాం..’ అని ముఖ్యమంత్రి తెలిపారు.రాష్ట్రంలోని పేదల విద్య, ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యతేనని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. 2011లో వైఎస్సార్ మహిళలకు వడ్డీలేని రుణాలను అందించారని, బీఆర్ఎస్ పాలనలో ఈ రుణాలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తమ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేపడుతోందని మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి చెప్పారు.పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ఒక్క మోటారు ఆన్‌చేసి కేసీఆర్ ఎన్నికల డ్రామా ఆడారని మండిపడ్డారు. కాగా స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలకు వడ్డీలేని రుణాల కింద రూ.344 కోట్లను సీఎం ఈ సందర్భంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేశ్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి, పరి్ణకారెడ్డి, మేఘారెడ్డి, వీర్లపల్లి శంకర్, కలెక్టర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
సర్కార్ చదువే మేలు..
బాధ్యతలు చేపట్టిన రిజిస్ట్రార్ బహిరంగ సభకు హాజరైన ప్రజలు, మహిళా సంఘాల సభ్యులకు ప్రమాద బీమా చెక్కు అందజేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, దామోదర రాజనర్సింహ, ఎంపీ మల్లురవి, ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి● పిల్లలను చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్న తల్లిదండ్రులు ● బడిబాటలో 12,712 విద్యార్థుల చేరిక ● మూతబడిన పాఠశాలలపై ప్రత్యేక దృష్టి ● ప్రభుత్వం కల్పిస్తున్న వసతులతో సత్ఫలితాలు అచ్చంపేట: రాష్ట్ర సర్కార్ ప్రభుత్వ పాఠశాలపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని వసతులు కల్పించడంతో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. బడుల్లో అందిస్తున్న వసతులు, నాణ్యమైన విద్యా బోధన, కృతిమ మేధ(ఏఐ), అనుభవజ్జలైన ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజనం, యూనిఫాం, పాఠ్య, రాత పుస్తకాలు ఉచితంగా అందిస్తుండడంతో పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 940 పాఠశాలలో గడిచిన మూడేళ్లలో దాదాపు 11,036 ప్రవేశాలు తగ్గాయి. విద్యార్థుల నమోదు తగ్గుతుండటంపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. బడిబాట కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో జిల్లావ్యాప్తగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కలిపి 12,712 మంది విద్యార్థులు చేరారు. 2024–25 విద్యా సంవత్సరంలో 73,190 మంది విద్యార్థులుండగా.. 2025–26 లో ఆ సంఖ్య 75,347కు చేరింది. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. తెరుచుకున్న 24 పాఠశాలలు ఈ విద్యా సంవత్సరం నుంచి మూతపడిన పాఠశాలలు అనేది ఉండకూడదని ప్రభుత్వం నిర్ణయించడంతో గతేడాది జీరో ఎన్రోల్మెట్గా ఉన్న 84 స్కూళ్లు మూతపడగా.. ఈ ఏడాది వాటిలో 24 పాఠశాలలు తెరుచుకున్నాయి. జిల్లాలో ప్రభుత్వ పాఠశాల 1, డీఎన్టీ పాఠశాలలు 6, టీడబ్ల్యూపీఎస్ 1, మండల పరిషత్ పాఠశాలలు 49, ఎయిడెడ్ పాఠశాలు 3 చొప్పున విద్యార్థుల నమోదు లేక తెరుచుకోలేదు. పాయింట్ల పద్ధతికి ప్రయత్నం.. ఈ విద్యా సంవత్సరం పాఠశాలల వారీగా ఏ ఉపాధ్యాయుడు ఎక్కువ మంది పిల్లల్ని బడిలో చేర్పిస్తారో వారికి పాయింట్లు ఇచ్చి సర్వీస్ పుస్తకంలో నమోదు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల సమయంలో ఈ పాయింట్లకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు క్షేత్రస్థాయిలో పిల్లల నమోదుపై దృష్టి సారించి, ప్రభుత్వ పాఠశాలలో ఉండే వసతులపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంలో సఫలమయ్యారు. జిల్లాలో ఇలా.. పాఠశాల ఉపాధ్యాయులు జిల్లా, మండల 3,513 పరిషత్ పాఠశాలలు కేజీబీవీ 298 రెసిడెన్సియల్ 855 సంవత్సరం విద్యార్థులు 2022–23 84,226 2023–24 78,265 2024–25 73,190 2025–26 75,347 అచ్చంపేట రూరల్: పట్టణంలోని అంబేడ్కర్ కూడలిలో ధర్నాలు, రాస్తారోకోలు, ఇతర కార్యక్రమాలు చేస్తుంటారు. ఈ రోడ్డు గుండా శ్రీశైలం, హైదరాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ ప్రాంతాలకు అధికంగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. నిత్యం రద్దీగా ఉండే ప్రదేశంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో పాలకులు, అధికారులు పోస్టాఫీసు చుట్టు పక్కల ఉన్న డబ్బాలను తొలగించారు. ఎన్ని విమర్శలు వచ్చినా.. అక్కడ చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారికి నచ్చజెప్పి పంపించారు. అలాగే ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట, చుట్టు పక్కల ఉన్న డబ్బాలను తొలగించారు. ఆ ప్రాంతాలనే ఆక్రమించారు పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా, లింగాల రోడ్డు, పోస్టాఫీసు కార్యాలయం చుట్టు పక్కల ఉన్న స్థలాల్లో డబ్బాలను తొలగించడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగాయి. కానీ ఆ ప్రాంతాలనే ప్రస్తుతం కొందరు ఆక్రమించి, అదెకిస్తూ సంపాదిస్తున్నారు. పండ్లు, ఇతర వ్యాపారాలను సాగిస్తున్నారు. ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయంతో పాటు, సివిల్ కోర్టు ఉండటంతో ఆ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. చౌరస్తాలో యూ టర్న్ తీసుకోవాలంటే నరకమే. అటు, ఇటుగా వాహనాలు రావడంతో పాటు టర్నింగ్లోనే పోస్టాఫీసు ఎదుట ఆక్రమించిన స్థలంలోనే వ్యాపారం కొనసాగిస్తుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అద్దె వసూలు పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట దుకాణ సముదాయాలు ఉన్నాయి. వాటి ముందు చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారి నుంచి ప్రతి నెల అద్దె వసూలు చేస్తున్నారు. పండ్లు, పూలు, చాట్‌బండార్, మిర్చి, కూల్‌డ్రింక్స్, ఇతర వ్యాపారాలు చేసే వారు తోపుడు బండ్లను దుకాణాల ముందు ఉంచితే వారి నుంచి దర్జాగా అద్దె వసూలు చేస్తున్నారు. వారంతా రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట గతంలో డబ్బాలను తీసేయగా.. ప్రస్తుతం తోపుడు బండ్లు డ్రెయినేజీపై ఉంచి వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. అలాగే కూరగాయల మార్కెట్లో సమస్యను చెప్పనక్కర్లేదు. దుకాణాల ఎదుట చిన్న వ్యాపారాలు చేస్తుండటంతో నడవడానికి కూడా వీలు లేని పరిస్థితి ఉంటుంది. రోడ్లపైనే మురుగు పాతబస్టాండు, నెహ్రూ చౌరస్తాలో డ్రెయినేజీలోని పూడిక తీయడం సాధ్యంకాక పేరుకుపోతుంది. వర్షాల సమయంలో వరదంతా రహదారిపైనే పారుతుంది. లోతట్టు ప్రాంతాల్లోని దుకాణాల్లోకి నీరు చేరుతుంది. చిరుతను పట్టుకునేందుకు ప్రత్యేక రెస్క్యూ బృందం ● గాలింపు చర్యలు ప్రారంభం మెట్టుగడ్డ: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్లు అధికారి రిజిస్ట్రార్ ఫణీందర్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది, మహబూబ్‌నగర్ సబ్ రిజిస్ట్రార్లతో సమావేశం నిర్వహించారు. మహబూబ్‌నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సబ్ రిజిస్ట్రార్లకు సూచించారు. జూన్ 30న జిల్లా రిజిస్ట్రార్ రవీందర్ పదవీ విరమణ పొందడంతో ఇప్పటి వరకు ఈ స్థానం ఖాళీగానే ఉంది. నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన జిల్లా రిజిస్ట్రార్‌కు మహబూబ్‌నగర్ సబ్ రిజిస్ట్రార్లు, కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. అచ్చంపేటలో రోడ్డు స్థలాల ఆక్రమణలు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం పట్టించుకోని పాలకులు, మున్సిపల్ అధికారులు సమస్యను పరిష్కరిస్తాం... పట్టణంలోని ఆక్రమణలపై కౌన్సిల్ సమావేశంలో చర్చిస్తాం. కౌన్సిల్ తీర్మాణం ప్రకారం టౌన్‌ప్లానింగ్ అధికారికి చెబుతాం. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తాం. తాను ఇటీవలి కాలంలోనే బాధ్యతలు చేపట్టాను. రోడ్లను ఆక్రమించుకుని వ్యాపారాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటాం. – మురళి, మున్సిపల్ కమిషనర్, అచ్చంపేట జిల్లావ్యాప్తంగా.. జిల్లా, మండల పరిషత్ పాఠశాలలు 816, కేజీబీవీలు 20, ఎయిడెడ్ పాఠశాలలు 13, మోడల్ స్కూళ్లు 2, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల 1, జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లు 60, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలు 39, గిరిజన ఆశ్రమ పాఠశాలలు 15 మినీ గురుకులాలు 3, బీసీ గురుకులాలు (ఎంజీపీటీ) 12 సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ (టీజీఎస్‌డబ్ల్యూ) పాఠశాలలు 14, సీబీఎస్ఈ పాఠశాల ఒకటి, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలు 3 ఉన్నాయి. అన్ని పాఠశాలలో పెరిగారు.. జిల్లాలో అన్ని ప్రభుత్వపాఠశాలల్లో గతంలో కంటే విద్యార్థుల సంఖ్య పెరిగింది. మూతపడిన పాఠశాలలను మొదట గుర్తించి ఆ గ్రామాల్లో బడిఈడు పిల్లల్ని చేర్పించారు. దీంతో మూతబడిన 24 పాఠశాలలు తెరుచుకున్నాయి. అక్కడ ఉపాధ్యాయులను నియమించాం. హెచ్ఎంలు, ఉపాధ్యాయులు బాధ్యతగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించి విద్యార్థుల ప్రవేశాలు పెరగడానికి దోహదపడ్డారు. – రమేష్‌కుమార్, జిల్లా విద్యాధికారి సామర్థ్యాల పెంపు దృష్టి ఎన్సీఈఆర్టీ, విద్యా మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సాధన సర్వే (నాస్) జాతీయ సగటుతో పోలిస్తే.. తెలంగాణ ఫలితాలు తక్కువగా ఉన్నాయి. పీజీఐ, అసర్ నివేదికలు వివిధ స్థాయిలో ముఖ్యమైన అభ్యసన సామర్థ్యాల్లో అంతరాలు చూపించాయి. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల బోధన సామర్థ్యాల పెంచేలా సాధికారికత కల్పించడం, వినూత్న వ్యూహాలు, ప్రభావవంతమైన బోధన పద్ధతులపై దృష్టి పెట్టేలా ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. -
రెండేళ్లలో పూర్తి చేస్తాం
సాక్షి, నాగర్‌కర్నూల్/కొల్లాపూర్: పాలమూరులోని పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేసే బాధ్యత తాను తీసుకుంటున్నానని, రెండేళ్లలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం జటప్రోలులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పురాతన మదనగోపాలస్వామి ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన బహిరంగసభలో ప్రసంగించారు. ‘కొల్లాపూర్ ప్రాంతం.. ఒకవైపు కృష్ణానది, మరోవైపు నల్లమల అటవీ ప్రాంతం.. ఒకప్పుడు కౌన్ పూచ్తా కొల్లాపూర్ అనుకున్న ప్రాంతాన్ని, హమ్ జాదా లేనా కొల్లాపూర్ అంటూ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం’ అని అన్నారు. దేశంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా, తట్ట, పార పని చేసినా పాలమూరు బిడ్డలే ఉంటారని చెప్పారు. ఇక్కడి మట్టిలో పుట్టిన బిడ్డగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం బాధ్యతను తీసుకుంటానని అన్నారు. డిసెంబర్ 9 నాటికి అన్ని ప్రాజెక్టుల భూ నిర్వాసితులకు పెండింగ్ పరిహారాన్ని చెల్లిస్తామని, భూసేకరణ పూర్తి చేస్తామని తెలిపారు. రెండేళ్ల కాలంలో పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతామని పేర్కొన్నారు. ‘పాలమూరు బిడ్డగా ఇక్కడి పరిస్థితులు, కష్టాలు నాకు తెలుసు. గత ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి, కేఎల్ఐ, జూరాల, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులు కట్టకుండా నిర్లక్ష్యం చేసింది. రైతుల పొలాల్లోకి నీళ్లు రాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో కన్నా బీఆర్ఎస్ పాలనలోనే పాలమూరుకు తీవ్ర అన్యాయం జరిగింది. ఈ జిల్లాకు చెందిన వ్యక్తి సీఎం కావడం వల్ల మొన్న జూరాలకు నిమిషాలలో రూ.120 కోట్లు మంజూరు చేశాం. ఇక్కడి నుంచి గత ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన వాళ్లు దొంగలకు సద్దులు మోశారు. మొన్నటి ఎన్నికల్లో ఇంకో రెండు సీట్లు వచ్చుంటే.. ఈ జిల్లాకు మరో మంత్రి పదవి వస్తుండే.’ అని పేర్కొన్నారు. పాలమూరు ప్రాజెక్టులో ఒక్క మోటార్‌ను ప్రారంభించి చేతులు దులుపుకున్న కేసీఆర్.. ఈ గడ్డకు చేసిందేమీ లేదన్నారు. జిల్లాకు చెందిన మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లు తెచ్చింది ఏమీ లేదు. 98 జీఓ ద్వారా ఉద్యోగాలు ఇవ్వాలని శ్రీశైలం నిర్వాసితులు ఏళ్ల తరబడి అడుగుతూ వస్తున్నా.. వారిని గత ప్రభుత్వం ఎందుకు ఆదుకోలేదో చెప్పాలని సీఎం రేవంత్ ప్రశ్నించారు. కొల్లాపూర్ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలను మంత్రి జూపల్లి కృష్ణారావు తన దృష్టికి తెచ్చారని పేర్కొన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించి, కొల్లాపూర్ అభివృద్ధికి అవసరమై సహకారం అందిస్తామని వివరించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాలు ఏడాదిన్నర లోపు పూర్తి చేసి, దాని ప్రారంభానికి మళ్లీ ఇక్కడికి వస్తా సీఎం అన్నారు. మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,52,635 స్వయం సహాయక సంఘాలకు రూ.334 కోట్ల వడ్డీ లేని రుణాలను ఇస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. దీనికి సంబంధించిన చెక్కును మహిళా సంఘం సభ్యులకు అందజేశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని 2,671 స్వయం సహాయక సంఘాలకు రూ.6.33 కోట్ల చెక్కులను అందజేశారు. అలాగే బ్యాంక్ లింకేజీ రుణాలు, ప్రమాధ బీమా తదితర వాటిక సంబంధించి చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేష్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్, అనిరుధ్‌రెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డి, పర్ణికారెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, మేఘారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, నాయకులు బెల్లయ్యనాయక్, సరిత, జగదీశ్వర్‌రావు, శివసేనారెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఒబేదుల్లా కొత్వాల్, తదితరులు పాల్గొన్నారు. సాధికారత దిశగా పయనం: మంత్రి దామోదర రాజనర్సింహ మహిళలు ఆర్థిక సాధికారత సాధించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బీసీ రిజర్వేషన్లు చారిత్రాత్మకం: మల్లురవి బీసీ రిజర్వేషన్ల అమలు చారిత్రాత్మక నిర్ణయమని, ఈ ఘ నత సీఎం రేవంత్‌రెడ్డికే దక్కు తుందని ఎంపీ మల్లు రవి అన్నారు. రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేపట్టామని, విద్యార్థులకు కాస్మొటిక్, మెస్ చార్జీలు పెంచామన్నారు.కొల్లాపూర్ అభివృద్ధికిసహకరించాలి: మంత్రి జూపల్లి కొల్లాపూర్ నియోజకవర్గానికి అదనంగా మరో 3 వేల ఇళ్లు కేటాయించాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. కొల్లాపూర్ అభివృద్ధికి రూ.500 కోట్ల నిధులు మంజూరు చేయాలని, శ్రీశైలం నిర్వాసితులకు జీఓ 98 ప్రకారం ఉద్యోగాలు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని, మాదాసి కురువలకు ఎస్సీ కుల ధ్రువపత్రాలు ఇప్పించాలని, నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి రూ.15 లక్షలు, కొల్లాపూర్ మున్సిపాలిటీకి రూ.50 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మొలచింతలపల్లి శివారులో ఉన్న 1,600 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని, పెంట్లవెల్లి సింగిల్ విండో సొసైటీలోని 409 మంది రైతులకు రుణమాఫీ వర్తింపజేయాలని, సోమశిల– సిద్దేశ్వరం వంతెన నిర్మాణానికి త్వరగా అటవీశాఖ అనుమతులు ఇప్పించాలని సీఎం దృష్టికి తెచ్చారు. సంక్షేమానికి ప్రాధాన్యం: మంత్రి వాకిటి సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనా విధానంలో విద్య, ఉపాధి, రైతు, మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం లభిస్తోందని రాష్ట్ర పాడి పరిశ్రమ, మత్య్సశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మించడం అభినందనీయమన్నారు. సాగునీటి ప్రాజెక్ట్‌ల బాధ్యత నాదే: సీఎం రేవంత్‌డ్డి డిసెంబర్ 9 నాటికి భూసేకరణ పూర్తి చేస్తాం.. పరిహారం చెల్లిస్తాం బీఆర్ఎస్ పాలనలోనే పాలమూరుకు తీవ్ర అన్యాయం గత ప్రభుత్వంలో జిల్లా మంత్రులుతెచ్చింది ఏమీలేదు శ్రీశైలం నిర్వాసితులనుఎందుకు ఆదుకోలేదు జటప్రోలులో యంగ్‌ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు శంకుస్థాపన -
పాలమూరు అంటే కేసీఆర్‌కు చిన్నచూపు: సీఎం రేవంత్
సాక్షి, నాగర్ కర్నూల్: కృష్ణా జలాలు పొలాల్లో పారుతుంటే ఎందుకంత విషం చిమ్ముతున్నారంటూ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ పాలమూరుకు ఎందుకు న్యాయం చేయలేదంటూ ప్రశ్నించారు. పాలమూరులో ప్రాజెక్టులకు డిసెంబర్లో భూములు సేకరిస్తాం. రెండేళ్లలో ప్రాజెక్ట్‌లు పూర్తి చేసి చూపిస్తాం’’ అని రేవంత్ అన్నారు.సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లాలో పర్యటించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెంట్లవెల్లి మండలం జటప్రోల్లో రూ.150 కోట్లతో 22 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ముందుగా గ్రామంలోని పురాతన మదనగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన, ఆ తర్వాత భారీ బహిరంగ సభ ప్రసంగించారు. సభలో ఇందిరా మహిళాశక్తి కింద స్వయం సహాయక బృందాల మహిళలకు వడ్డీలేని రుణాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా బహిరంగ సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘‘రెండేళ్లు కాలేదు అప్పుడే దిగిపో.. దిగిపో అంటున్నారు. పాలమూరు అంటే కేసీఆర్ కుటుంబానికి చిన్నచూపు. కరీంనగర్ నుంచి పారిపోయిన కేసీఆర్ ఆదరిస్తే సున్నం పెట్టారు. వాల్మికీలను ఎస్టీ జాబితాలో చేర్పిస్తామన్న కేసీఆర్ ఎందుకు చేయలేదు?. చెప్పులు కుట్టమని, గొర్రెలు పెంచమని చేపలు పట్టమని చెప్పారు. ఆయన బిడ్డలే రాజ్యాలు ఏలాలా? పాలమూరు బిడ్డలకు పదవులు వద్దా?. మాదిగ కులాల వర్గీకరణ చేసినందుకు కేసీఆర్‌కు కడుపుమంటగా ఉంది. 25 వేల కోట్లు ఖర్చు పెడితే పాలమూరు ప్రాజెక్ట్‌లు పూర్తయ్యేవి. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం మూడేళ్లలో కూలేశ్వరం అయ్యింది’’ అంటూ రేవంత్ విమర్శలు గుప్పించారు. -
నేడు నాగర్‌కర్నూల్ జిల్లాలో సీఎం పర్యటన
సాక్షి, నాగర్‌కర్నూల్: ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో ని పెంట్లవెల్లి మండలం జటప్రోల్లో రూ.150 కోట్లతో 22 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. సీఎం హెలీకాప్టర్‌లో హైదరాబాద్ నుంచి బయలుదేరి.. జటప్రోల్ చేరుకుంటారు. ముందుగా గ్రామంలోని పురాతన మదనగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన, ఆ తర్వాత భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. సభలో ఇందిరా మహిళాశక్తి కింద స్వయం సహాయక బృందాల మహిళలకు వడ్డీలేని రుణాలను పంపిణీ చేయనున్నారు. -
చదువుతోనే సమాజంలో గుర్తింపు
నాగర్‌కర్నూల్ క్రైం: విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునప్పుడే సమాజంలో గుర్తింపు లభిస్తుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నసీం సుల్తానా అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. ఇంటర్ విద్య భవిష్యత్‌కు కీలక దశ అని.. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు. ఉన్నతస్థాయిలో స్థిరపడినప్పుడే సమాజానికి సేవచేసే అవకాశం లభిస్తుందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని చదువులో రాణించాలని విద్యార్థులకు సూచించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. అందరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని.. అప్పుడే సమాజంలో నేరాలు తగ్గుతాయన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రశాంతి పాల్గొన్నారు. -
వరాల జల్లు కురిసేనా..
నేడు జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన ముఖ్యమంత్రి పర్యటన ఇలా.. ● మధ్యాహ్నం ఒంటిగంటకు హైదరాబాద్ నుంచి హెలీకాప్టర్‌లో బయలుదేరుతారు. ● మధ్యాహ్నం 1:45 గంటలకు జటప్రోల్‌కు చేరుకుంటారు. ● 1:55 గంటలకు జటప్రోలులోని పురాతన మదనగోపాలస్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ● 2:10 గంటలకు యంగ్‌ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ● 2:20 నుంచి సాయంత్రం 4గంటల వరకు జటప్రోలులో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ● సభలోనే ఇందిరా మహిళాశక్తి కింద మహిళలకు వడ్డీలేని రుణాలను పంపిణీ చేస్తారు. ● సాయంత్రం 4:30 గంటలకు హెలీకాప్టర్ ద్వారా హైదరాబాద్‌కు తిరుగుపయనమవుతారు. -
కళాశాలల్లో అడ్మిషన్లు పెంచాలి
కోడేరు: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెంచాలని బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ డిప్యూటీ సెక్రటరీ, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్పెషల్ ఆఫీసర్ విశ్వేశ్వర్ అన్నారు. గురువారం కోడేరు జూనియర్ కళాశాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కళాశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న వసతులను పరిశీలించారు. అనంతరం అధ్యాపకులతో ఆయన సమావేశమై మాట్లాడారు. నీట్, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు విద్యార్థులను సమర్థవంతంగా సిద్ధం చేయాలన్నారు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా అధ్యాపకులు పనిచేయాలని సూచించారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని అన్నారు. ఆయన వెంట వైస్ ప్రిన్సిపాల్ పద్మావతి, పస్పుల శ్రీధర్‌బాబు తదితరులు ఉన్నారు. -
అందుబాటులో 6,119 మె.ట. యూరియా
కందనూలు: జిల్లాలో ప్రస్తుతం 6,119 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి యశ్వంత్‌రావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయంలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా యూరియా నిల్వలను పరిశీలించారు. అనంతరం డీఏఓ మాట్లాడుతూ.. రైతులకు యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మొక్కజొన్న పంటకు ఎకరా 5 బస్తాల యూరియా మాత్రమే ఉపయోగించుకోవాలని సూచించారు. అధికంగా యూరియా వినియోగించడం వల్ల పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంటుందన్నారు. ఫర్టిలైజర్ దుకాణ డీలర్లు ఎమ్మార్పీ ధరలకే విత్తనాలు, ఎరువులు విక్రయించాలని.. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో పనిచేస్తున్న ఏడీఏలు, ఏఓలు అప్రమత్తంగా ఉండాలని, రోజు సహకార సంఘాలను సందర్శించి రైతులకు సరపడా ఎరువులు సకాలంలో అందించాలని ఆదేశించారు. -
ప్రాదేశిక స్థానాల లెక్క తేలింది
సాక్షి, నాగర్‌కర్నూల్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా బుధవారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేసింది. సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏ క్షణంలోనైనా స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో పంచాయతీ ఎన్నికల కంటే ముందుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జిల్లా పరిషత్ ఎన్నికలు ఉంటాయన్న ఊహగానాలు ఊపందుకున్నాయి. రిజర్వేషన్లపై వీడని సందిగ్ధం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశం కీలకంగా మారింది. రానున్న ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పంచాయతీ సర్పంచుల పదవీకాలం పూర్తయ్యి ఏడాదిన్నర కాలం గడిచింది. సుదీర్ఘకాలంగా ప్రత్యేక పాలన కొనసాగుతుండటంతో తిరిగి ఎన్నికలు ఎప్పుడు చేపడుతారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెబుతోంది. ఈ క్రమంలోనే ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లు కల్పించేందుకు సన్నాహాలు చేపడుతోంది. ఈ ప్రక్రియ వేగవంతమైన ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగితేనే బీసీలకు రిజర్వేషన్ పెంపు అమలయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలన్న కోర్టు ఆదేశం నేపథ్యంలో రిజర్వేషన్ల అమలుపై సందిగ్ధం నెలకొంది. కొత్తగా బీసీలకు రిజర్వేషన్‌ను పెంచి ఎన్నికలు నిర్వహిస్తారా, లేక పాత రిజర్వేషన్లకే పరిమతమవుతారా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఖరారైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను ప్రకటించిన ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో 780 ఎంపీటీసీ స్థానాలు పంచాయతీ కన్నా ముందే జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ఊహగానాలు -
విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపాలి
నాగర్‌కర్నూల్ క్రైం: విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రెటరీ నసీం సుల్తానా అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జ్ఞాన సరస్వతి బాల కల్యాణ ఆశ్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ఆశ్రమంలోని వంటగది, పరిసరాలను పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులకు చదువు తప్ప వేరే ధ్యాస ఉండకూడదని, ముఖ్యంగా సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండాలన్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా విని, పరీక్షల్లో మార్కులు సాధించాలన్నారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకొని ఇతరులకు అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఆశ్రమ ఇన్చార్జ్ నారాయణరెడ్డి, బాలల హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు శ్రీశైలం, మల్లేష్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ ఢిఫెన్స్ కౌన్సిల్ సభ్యుడు పవనశేషసాయి పాల్గొన్నారు. -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
పెంట్లవెల్లి: మండలంలోని జటప్రోల్ గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో బుధవారం మంత్రి జూపల్లి, కలెక్టర్ బాదావత్ సంతోష్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం పర్యటన సజావుగా జరగడానికి శాఖల వారీగా అధికారులు బాధ్యతలు అప్పగించాలని కలెక్టర్‌కు సూచించారు. శుక్రవారం నిర్వహించే సభకు జిల్లా నలుమూలల నుంచి 70 వేల మంది పాల్గొంటారని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తు ప్రణాళికలు చేసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. పర్యటనలో ఎలాంటి లోపాలు లేకుండా టెంట్లు, స్టేజీ, రోడ్డు మార్గం, విద్యుత్ సరఫరా, తాగునీటి సదుపాయం, లైట్లు, టాయిలెట్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు సూచించారు. అధికారులతో సమీక్ష సీఎం పర్యటకు కావాల్సిన ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ బదావత్ సంతోష్ సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా పని విభజన చేసుకోవడంతో పాటు ఒకరినొకరు సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. హెలిప్యాడ్ వద్ద, సభాస్థలి పరిసరాల్లో భద్రతా సిబ్బంది నిరంతరం గస్తీ చేయాలని సూచించారు. ప్రోటోకాల్ విషయంలో అధికారులు జాగ్రత్తలు పాటించాలన్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నర్సింహయాదవ్, నాయకులు రామన్‌గౌడ్, గోవింద్‌గౌడ్, నల్లపోతుల గోపాల్, నాగిరెడ్డి, భీంరెడ్డి, కబీర్, బాలరాజు పాల్గొన్నారు. రేపు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సభా స్థలాన్ని పరిశీలించిన మంత్రి జూపల్లి, కలెక్టర్ బాదావత్ సంతోష్ -
మొక్కజొన్న రైతులకు అండగా ఎస్పీ
నాగర్‌కర్నూల్ క్రైం: మొక్క జొన్న కొనుగోలు చేసిన వ్యక్తి డబ్బులు ఇవ్వకపోవడంతో బాధిత రైతులు ఎస్పీగైక్వాడ్ వైభవ్ రఘునాథ్‌ను ఆశ్రయించడంతో ఆయన బాధితులకు న్యాయం చేశారు. ఇందుకు సంబంధించి బుధవారం ఎస్పీ వెల్లడించిన వివరాలు.. బిజినేపల్లి మండలంలోని ఖానాపూర్‌కు చెందిన ఆంజనేయులు నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని నందివడ్డెమాన్, ఖానాపూర్, నల్లవెల్లి గ్రామాలకు చెందిన దాదాపుగా 56మంది రైతులకు సంబంధించి రూ.కోటి విలువైన మొక్కజొన్నను కొనుగోలు చేశాడు. ఆంజనేయులు రైతులకు డబ్బులు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తుండటంతో బాధిత రైతులందరూ కలిసి రెండు నెలల క్రితం న్యాయం చేయాలని ఎస్పీని ఆశ్రయించారు. స్పందించిన ఎస్పీ రైతులకు న్యాయం చేయాలని పోలీసు సిబ్బందికి ఆదేశించడంతో ఆంజనేయులు నుంచి రూ.60లక్షల వరకు వసూలు చేసి బుధవారం రైతులకు అందజేశారు. రైతులకు న్యాయం చేసిన ఎస్పీకి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. గుర్తింపు లేని వ్యక్తులకు రైతులు తమ పంటలను విక్రయించొద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మకాలు చేయాలని సూచించారు. -
జోరుగా పైరవీలు..!
హైదరాబాద్‌కు చేరిన ధాన్యం లారీ పంచాయితీ లెక్కలు తేల్చడంలో అధికారుల మీనమేషాలు అక్రమంగా ధాన్యం తరలిస్తూ పట్టుబడిన క్రమంలో ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు బయటికి తీయడంలో సివిల్సప్లై శాఖ అధికారులు కుస్తీ పడుతున్నారు. వాస్తవానికి సీజన్ల వారీగా మిల్లులకు కేటాయించిన ధాన్యం, అందుకు సంబంధించి మిల్లులు తిరిగి ఇచ్చిన బియ్యం లెక్కలు ప్రతిరోజు అధికారులు ఆన్లైన్లో నమోదు చేస్తుంటారు. అయితే అక్రమంగా దొరికిన ధాన్యం లోడులారీ లెక్కలు తీయడంలో మాత్రం అధికారుల మీనమేషాలు లెక్కిస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆన్లైన్లో అన్ని లెక్కలు ఉన్నా.. విచారణ పేరిట కాలయాపన చేసి సదరు రైస్‌మిల్లు యజమానిని తప్పించే పనిలో సివిల్ సప్లయ్ శాఖ అధికారుల బిజీగా ఉన్నట్లు బాహటంగానే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజా పైరవీల నేపథ్యంలో అవినీతి లెక్కలు బయటకు వస్తాయా.. లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. కలెక్టర్‌కు ఫిర్యాదు ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇవ్వాలని నందిన్నెలోని సదరు రైస్ మిల్లుకు కేటాయిస్తే.. మిల్లు యజమాని ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలించి సొమ్ము చేసుకోవడంపై నందిన్నె గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం రైస్ మిల్లు యజమానిపై చర్య తీసుకోవాలంటూ కలెక్టర్ బీఎం సంతోష్‌కు వినతిపత్రం అందజేశారు. ఇదిలాఉండగా, ఈ ఽవ్యవహారంపై విచారణ జరుపుతున్న సివిల్ సప్లయ్ డీఎస్ఓ స్వామిని వివరణ కోరేందుకు ‘సాక్షి’ ఫోన్ ద్వారా ప్రయత్నించగా స్పందించలేదు. ● తాజాగా రాయచూర్ సమీపంలోని మిల్లులో 50 వేల బస్తాల ధాన్యం డంప్ ● ధాన్యం లారీ వ్యవహారంలో వెలుగుచూస్తున్న అక్రమాలు ● సదరు రైస్ మిల్లుకు మూడు సీజన్లలో రూ.45 కోట్ల ధాన్యం కేటాయింపు ● మర ఆడించి అందించింది రూ.5 కోట్ల బియ్యమే.. సాక్షి ప్రతినిధి మహబూబ్‌నగర్/గద్వాల: కేటీదొడ్డిలో అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన ధాన్యం లోడు లారీ పంచాయితీ హైదరాబాద్‌కు చేరింది. ప్రభుత్వంలోని కీలకంగా వ్యవహరించే పెద్దను ఆశ్రయించి అక్రమాల నుంచి బయటపడేందుకు రైస్‌మిల్లు యజమాని జోరుగా పైరవీలు చేస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ఈ అవినీతి బాగోతంలో తవ్వే కొద్ది అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వ సొమ్మును కాజేయడంలో కాకలుతీరిన సదరు రైస్‌మిల్లు యజమాని తనకున్న పలుకుబడితో 2022 రబీ, 2024 ఖరీఫ్, 2024–25 రబీ సీజన్లలో సుమారు రూ.45 కోట్ల విలువ గల ధాన్యాన్ని తన మిల్లుకు కేటాయించేలా చేసినా.. ప్రభుత్వానికి తిరిగి 10 శాతం మాత్రమే సీఎమ్మార్ బియ్యం అప్పగించినట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం కేటాయించిన ధాన్యంలో సుమారు రూ.5 కోట్ల విలువ గల ధాన్యాన్ని కర్ణాటకలోని రాయచూరు సమీపంలో ఉన్న ఓ రైస్ మిల్లులో గుట్టుగా దాచిపెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ముడుపులతో కెపాసిటీ పెంపు నందిన్నెకు చెందిన సదరు రైస్‌మిల్లు యజమాని అధికారంలో ఏ పార్టీ ఉంటే వారికి జైకొట్టి తన అక్రమ దందా కొనసాగిస్తుంటాడనే ఆరోపణలు వినవస్తున్నాయి. సాధారణంగా రైస్‌మిల్లుకు ధాన్యం కేటాయించే క్రమంలో అధికారులు మిల్లు కెపాసిటీని పరిగణలోకి తీసుకుంటారు. అయితే, ఈ మిల్లు సామర్థ్యం 6 టన్నులు ఉంటే దానిని 10 టన్నులకి పెంచుకుని పెద్దమొత్తంలో ధాన్యం కేటాయించుకున్నాడు. ఇందులో తనకు సహకరించిన సివిల్ సప్లయ్ శాఖలోని ఓ కీలక అధికారికి దాదాపు రూ.6 లక్షలు ముట్టజెప్పినట్లు సమాచారం. ప్రభుత్వ పెద్ద వరకు పంచాయితీ నందిన్నెలోని ఓ రైస్‌మిల్లు యజమాని ఈ నెల 15వ తేదీ తెల్లవారుజామున 3 గంటల సమయంలో 400 క్వింటాళ్ల వడ్ల ధాన్యం లారీ అక్రమంగా కర్ణాటకలోని రాయచూరుకు తరలిస్తుండగా.. విషయం తెలుసుకొని గ్రామస్తులు పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే. సదరు రైస్ మిల్లు యజమాని ఈ కేసు నుంచి బయటపడేందుకు గద్వాల సివిల్సప్లై శాఖలోని ఓ అధికారిని మొదట ఆశ్రయం పొందాడు. అయితే, పరిస్థితి సీరియస్ కావడంతో అధికార పార్టీకి చెందిన ఓ నేత ద్వారా ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే ఓ పెద్దను ఆశ్రయించినట్లు తెలిసింది. తనపై ఎలాంటి కేసులు నమోదు కాకుండా హైదరాబాద్‌లో తిష్టవేసి అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. ● 2022 రబీలో 1,425.520 మెట్రిక్ టన్నుల ధాన్యం, 2024 ఖరీఫ్‌లో 5,948.560 మెట్రిక్ టన్ను లు, 2024–25రబీలో 10,294.680 మెట్రిక్ టన్ను లు మొత్తంగా మూడు సీజన్లలో సుమారు రూ.45 కోట్ల విలువ గల (40కేజీల సామర్థ్యం ఉన్న 4 లక్ష ల ధాన్యం బస్తాలు) ధాన్యం సివిల్ సప్లయ్ శాఖ అ దికారులు సదరు మిల్లుకు కేటాయించారు. ఇందు లో ఇప్పటి వరకు 2024 ఖరీఫ్‌కు సంబంఽధించి 17 ఏసీకేల వరకు, మార్చి 2024–25 రబీకి సంబంధించి 13 ఏసీకేల వరకు బియ్యంగా మార్చి అందించారు. 2022 రబీకి సంబంధించి బియ్యం నేటికీ అందించలేదు. ప్రభుత్వానికి ఇప్పటి వరకు కేవలం రూ.5 కోట్ల విలువ గల బియ్యం అందించాడు. -
రూ.150 కోట్లు.. 22 ఎకరాల విస్తీర్ణం..
సాక్షి, నాగర్‌కర్నూల్: అధునాతన సౌకర్యాలు, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు, డిజిటల్ క్లాసులు, స్మార్ట్ బోర్డులు, విశాలమైన, విభిన్న రకాల ప్లేగ్రౌండ్స్‌తో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ జిల్లాలో కొలువుదీరనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా జిల్లాలోని పెంట్లవెల్లి మండలం జటప్రోలులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. ఇది పూర్తయితే జిల్లాలో పేద, మధ్యతరగతి వర్గాలకు ప్రభుత్వం ద్వారా ఉచితంగా నాణ్యమైన విద్య అందనుంది. జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. పేద, మధ్యతరగతి వర్గాల విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఉచిత విద్యను అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో తొలిసారిగా కొల్లాపూర్ నియోజకవర్గంలోని జటప్రోలులో స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. రూ.150 కోట్ల ఖర్చుతో జటప్రోలులోని సర్వే నంబర్ 176, 177లో 22 ఎకరాల విస్తీర్ణంలో సువిశాల భవనాలు, హాస్టళ్లు, మైదానాలు తదితర వసతులు ఏర్పాటు చేయనున్నారు. పెంట్లవెల్లి మండలంలోని జటప్రోలులో నిర్మాణం ఈనెల 18న భూమిపూజ చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి -
చదువుతోనే పేదరికం దూరం
మన్ననూర్: పేద, మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులంతా చక్కగా చదువుకొని ఉన్నత స్థాయిలో స్థిరపడాలని గిరిజన గురుకులాల ముఖ్య కార్యదర్శి డాక్టర్ శరత్ సూచించారు. పేదరికాన్ని దూరం చేసుకోవడానికి చదువే ముఖ్య సాధనమన్నారు. మన్ననూర్లోని ఆదిమజాతి గురుకుల పాఠశాల, కళాశాలను (పీటీజీ) బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా 7వ తరగతి విద్యార్థుల విద్యా ప్రమాణాలను పరిశీలించారు. విద్యార్థి దశలో లక్ష్యం నిర్ధేశించుకొని, దానిని సాధించేందుకు నిరంతరం కష్టపడాలన్నారు. విద్యార్థులు లక్ష్యం చేరుకోవడానికి అవసరమైన అన్ని వసతులు సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. విద్యార్థుల సంఖ్యను బట్టి అదనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను ఆయన పరిశీలించారు. ఉపాధ్యాయులే మార్గనిర్ధేశకులు విద్యార్థులు సహజంగా ఉపాధ్యాయులను అ నుకరిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా క్రమశిక్షణతో ఉండటంతో పాటు సమయపాలన తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. వస తి గృహంలో విద్యార్థుల కోసం తయారు చేసి న వంటను రుచి చూశారు. ప్రభుత్వం నూత నంగా ప్రవేశపెట్టిన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం, స్నాక్స్ అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల ని సూచించారు. అదేవిధంగా పాఠశాలలో విద్యార్థులకు ఏ చిన్న సమస్య తలెత్తినా సిబ్బందిపై శాఖా పరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆయన వెంట ఆర్సీఓ సుధాకర్, ఏపీఓ యాదమ్మ, ప్రిన్సిపాల్ పద్మావతి, ఉపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారు. రోస్టర్ విధానంతో మాలలకు అన్యాయం మన్ననూర్: సుప్రీం కోర్టు సూచనలు పాటించకుండా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రోస్టర్ విధానంతో మాలలకు తీరని అన్యాయం జరుగుతుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం అమ్రాబాద్ మండలంలోని వెంకటేశ్వర్లబావి, కుమ్మరోనిపల్లి గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అమ్రాబాద్‌లో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బూరుగు వెంకటేశ్వర్లుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీలను 3 గ్రూపులుగా విభజించి మాలలను 3వ గ్రూప్‌లో ఉంచి 5 శాతం రిజర్వేషన్ కేటాయించారన్నారు. అది కూడా మాలలకు పూర్తి స్థాయిలో దక్కకుండా కుట్ర పూరితమైన రోస్టర్ విధానం అమలులోకి తేవడం దురదుష్టకరమని మండిపడ్డారు. దీంతో మాల విద్యార్థి, నిరుద్యోగులకు తీరని నష్టం కలిగించేదిగా ఉన్న రోస్టర్ విధానాన్ని తక్షణమే సవరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవల విడుదలైన గ్రూప్ 3తో పాటు శాతవాహన యూనివర్సిటీ ఉద్యోగాల్లో గ్రూప్ 3లో 5 శాతంగా ఉన్న మాలలకు ఒక్క ఉద్యోగం కూడా కేటాయించ లేదంటే రోస్టర్ విధానం ఎంత లోపాభూయిష్టంగా ఉందనేది ఇట్టే అర్థమవుతుందన్నారు. రద్దు చేయాలి మాలలకు శాపంగా మారిన రోస్టర్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వడంతో పాటూ మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నిరసనలు చేపడతామన్నారు. కార్యక్రమంలో మల్లికార్జున్, నాసరయ్య, బాలస్వామి, బాలకిష్టయ్య, జక్క గోపాల్, పెర్ముల రాజేష్, శ్రీనివాస్, శ్రీకాంత్, కుమార్, నంద, రాముడు, రామాంజనేయులు, పాండు పాల్గొన్నారు. ఈవీఎంలకు పటిష్ట భద్రత గద్వాల: ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఈఓ, ఈవీఎంల నోడల్ అధికారి హరిసింగ్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న గోదాంలో ఎలక్ట్రిక్ ఓటింగ్ మిషన్లు భద్రపర్చిన స్ట్రాంగ్‌రూంలను రాష్ట్రస్థాయి బృందంతో కలిసి ఆయన తనిఖీ చేశారు. సాధారణ తనిఖీలలో భాగంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ, ఆర్డీఓ అలివేలు, తహసీల్దార్ మల్లిఖార్జున్, ఎన్నికల విభాగం సూపరిండెంట్ కరుణకర్, సురేష్ పాల్గొన్నారు. -
మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి
తిమ్మాజిపేట: ప్రస్తుతం ఎంతో మంది మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని.. వారి స్ఫూర్తితో మహిళలందరూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని హ్యూమన్ ట్రాఫికింగ్, షీ టీం జిల్లా ఇన్చార్జీలు సీఐ శంకర్, విజయలక్ష్మి అన్నారు. తిమ్మాజిపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం షీ టీం ఆధ్వర్యంలో పలు అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో ఇంటా, బయట నేరాలు పెరిగిపోతున్నాయని.. విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలలు, ఇతర ప్రదేశాల్లో వేధింపులకు గురయ్యే వారు ధైర్యంగా డయల్ 100 లేదా 87126 57676 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని చదువులో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐలు హరిప్రసాద్‌రెడ్డి, రమాదేవి, ఎంఈఓ సత్యనారాయణశెట్టి, శ్రీలత, శేఖర్‌గౌడ్, వెంకటయ్య పాల్గొన్నారు. -
ఆహ్లాదం.. అల్లంత దూరం!
అచ్చంపేట: పట్టణ ప్రజలు ఆహ్లాదకర వాతావరణానికి నోచుకోవడం లేదు. మున్సిపాలిటీలోని పార్కులు పచ్చదనం పంచలేక బోసిపోతున్నాయి. అచ్చంపేట పట్టణం రోజురోజుకు విస్తరిస్తుండగా.. అందుకు అనుగుణంగా పార్కుల ఏర్పాటుపై మున్సిపల్‌శాఖ దృష్టి సారించలేకపోతోంది. 50ఏళ్ల క్రితం ఏర్పాటుచేసిన పటేల్ పార్కు నిర్వహణ లేక నిరుపయోగంగా మారింది. 2011 జూలై 21న మధురానగర్ కాలనీలో ఎన్టీఆర్ పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేయగా.. ఆ స్థలంలో ప్రస్తుతం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ భవనం నిర్మితమైంది. పార్కులకు అనువుగా ఉన్న స్థలాలను మున్సిపల్ అధికారులు ధారాదత్తం చేయడంతో ఆహ్లాదకర వాతావరణం కరువైంది. ప్రకృతివనాల నిర్వహణ గాలికి.. పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం వార్డుకో పట్టణ ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసింది. ఖాళీగా ఉన్న మున్సిపల్ స్థలాల్లో చిట్టడవులను పెంచడం ద్వారా వాయు కాలుష్యం తగ్గి.. ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందుతుందని భావించింది. ఇందుకోసం పట్టణప్రగతి నిధులను ప్రత్యేకంగా వెచ్చించి.. ప్రకృతి వనాల్లో వేప, ఉసిరి, జామ, చింత, దానిమ్మ, టేకు, కానుగ ఇతర రకాల మొక్కలను నాటించింది. అయితే మొదట్లో వాటి నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించిన అధికారులు..కొన్నేళ్లుగా గాలికి వదిలేయడంతో అధ్వానంగా మారాయి. మొక్కలు, చెట్లు పెరగాల్సిన ప్రాంతాల్లో పిచ్చి మొక్కలు దర్శనిమిస్తూ.. అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. పట్టణ ప్రకృతి వనాలు కేవలం బోర్డులు, ఫెన్సింగ్లకే పరిమితమయ్యాయని చెప్పవచ్చు. పటేల్ పార్కు ఉనికి కనుమరుగు.. పట్టణ నడ్డిబొడ్డున సర్ధార్ వల్లబాయ్ పటేల్ పేరుతో ఏర్పాటు చేసిన పార్కు ఉనికి కనుమరుగవుతోంది. ఈ పార్కును అనుసరించి కూరగాయల మార్కెట్ గ్రంథాలయం ఉన్నాయి. రోజు ఎంతో మంది ప్రజలు వస్తుంటారు. అయితే పార్కును పునరుద్ధరించడంపై మున్పిపల్ అధికారులు దృష్టి సారించడం లేదు. శిథిలావస్థకు చేరినా పట్టించుకోవడం లేదు. పటేల్ పార్కును పునరుద్ధరించాలని 20ఏళ్లగా పట్టణ ప్రజలు కోరుతున్నారు. గ్రంథాలయ ఆవరణలో ఉన్న ఈ పార్కును పునరుద్ధరిస్తే పాఠకులకు సౌకర్యంగా ఉంటుంది. ● విద్యానగర్‌లోని అర్టీసీ బస్టాండ్ సమీపంలో మున్సిపల్‌శాఖ రూ. 10లక్షలు వెచ్చించి ఓపెన్ జిమ్, పార్కును పునరుద్ధరించారు. పట్టణ ప్రకృతివనం సైతం ఏర్పాటు చేశారు. అక్కడ ప్రస్తుతం ఆలయ నిర్మాణం చేపడుతుండటంతో పార్కు, ఓపెన్ జిమ్ నిర్వహణను గాలికొదిలేశారు. జిమ్ పరికరాలు వృథాగా పడి ఉన్నా మున్సిపల్ అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రకృతి వాతావరణానికి దూరంగా పట్టణవాసులు నిర్లక్ష్యపు నీడలో ప్రకృతివనాలు పార్కుల అభివృద్ధి పట్టని అధికారులు నిర్వహణ లోపంతో పిచ్చిమొక్కలకు నిలయాలుగా మారిన వైనం స్మృతివనం పేరిట నిధుల దుర్వినియోగం.. అటవీశాఖ కార్యాలయాన్ని అనుసరించి ఉన్న 10 ఎకరాల స్థలంలో ఏర్పాటుచేసిన స్మృతివనం నిరుపయోగంగా మారింది. దసరా, బతుకమ్మ సంబురాల నిర్వహణ సమయంలో తాత్కాలిక ఏర్పాట్లకు రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారే తప్ప శాశ్వత పనులు చేపట్టడం లేదు. అటవీశాఖ స్థల మార్పిడి చేయని కారణంగా ప్రజాధనం వృథా తప్ప.. ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. గతేడాది శ్రీశైలం ప్రధాన రహదారిలో ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియం, 132/33 కేవీ సబ్‌స్టేషన్ నడుమ ఏర్పాటుచేసిన పార్కును సైతం అభివృద్ధి చేయడం మరిచారు. ఇప్పటికై నా పార్కులు, పట్టణ ప్రకృతివనాలపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించి ప్రజలకు ఆహ్లాదం పంచే విధంగా తీర్చిదిద్దాలని కోరుతున్నారు. -
సమస్యల పరిష్కారానికి చర్యలు
నాగర్‌కర్నూల్: మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు పుర కమిషనర్ నాగిరెడ్డి అన్నారు. మంగళవారం 17వ వార్డులో ఆయన పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. మొదటగా కాలనీలోకి వచ్చే రోడ్డుకు అడ్డుగా నిర్మించిన గోడతో పాటు అసంపూర్తిగా నిలిచిన మిషన్ భగీరథ పైప్‌లైన్ నిర్మాణ పనులను కమిషనర్ పరిశీలించారు. వార్డులో కొత్తగా నివాసగృహాలు నిర్మించుకున్న వారికి ఇంటి నంబర్లు కేటాయించడంతో పాటు అంగన్వాడీ కేంద్రం, ఆరోగ్య ఉపకేంద్రం ఏర్పాటు చేయాలని కాలనీవాసులు కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించారు. నేడు డయల్ యువర్ డీఎం అచ్చంపేట రూరల్: అచ్చంపేట ఆర్టీసీ డిపో పరిధిలో ప్రయాణికుల సమస్యలను తెలుసుకునేందుకు గాను బుధవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీఎం మురళీ దుర్గాప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 94408 18849 నంబర్‌ను సంప్రదించి సమస్యలను తెలియజేయడంతో పాటు సూచనలు, సలహాలు ఇవ్వాలని సూచించారు. గుడిబండ వద్ద ‘డ్రై పోర్ట్’ అడ్డాకుల: మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని గుడిబండ సమీపంలో డ్రై పోర్ట్(రోడ్డు మార్గం ద్వారా ఓడరేవుకు అనుసంధానించబడిన ఇన్‌ల్యాండ్ టెర్మినల్) నిర్మాణానికి అధికారులతో కలిసి ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి మంగళవారం స్థలాన్ని పరిశీలించారు. గుడిబండ శివారులోని సర్వే నంబర్ 118లో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక సదుపాయాల సంస్థ, లాజిస్టిక్స్ డైరెక్టర్ అపర్ణ, ఇతర అధికారులు స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. డ్రై పోర్ట్ ఏర్పాటు చేయడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను అంచనా వేశారు. ఇటీవల దేవరకద్ర వద్ద ప్రతిష్టాత్మకమైన బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేయగా.. తాజాగా గుడిబండ వద్ద డ్రై పోర్ట్ నిర్మాణం కోసం స్థల పరిశీలన చేయడం శుభ పరిణామమని ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్, కర్నూలు, రాయచూర్ ప్రాంతాలకు సులభమైన కనెక్టివిటీ ఉండటం కూడా డ్రై పోర్ట్ నిర్మాణానికి కలిసి వస్తుందని చెప్పారు. చేనేత ఉత్పత్తులసంఘానికి అవార్డు అమరచింత: అమరచింత చేనేత ఉత్పత్తుల సంఘాన్ని ఉత్తమ సంఘంగా ఎంపిక చేసి జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు చేతుల మీదుగా కంపెనీ సీఈఓ చంద్రశేఖర్‌కు అవార్డును అందించారు. నాబార్డు ఏర్పడి నేటికి 44 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో మంగళవారం నాబార్డ్ ఆధ్వర్యంలో అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అమరచింత చేనేత ఉత్పత్తుల సంఘం సీఈఓ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆరేళ్లుగా సంఘాన్ని కొనసాగిస్తూ చేనేత కార్మికులే కంపెనీ షేర్ హోల్డర్స్‌గా నియమించడంతో పాటు వచ్చిన లాభాల్లో అందరికీ సమాన వాటా ఇస్తున్నామని తెలిపారు. తమ కృషిని గుర్తించి నాబార్డు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ సంఘంగా ఎంపిక చేసి అవార్డు ఇవ్వడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో నాబార్డ్ సీజీఎం ఉదయభాస్కర్, టీజీ క్యాబ్ చైర్మన్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. రైతుల దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టొద్దు జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): విద్యుత్ కనెక్షన్ల కోసం రైతులు పెట్టుకున్న దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టుకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని విద్యుత్ కార్పొరేట్ కమర్షియల్ డైరెక్టర్ చక్రపాణి అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని విద్యుత్ భవన్‌లోని మీటింగ్ హాల్లో విద్యుత్ అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు చెందిన కనెక్షన్లను త్వరగా మంజూరు చేయాలని, వాటికి సంబంధించిన విద్యుత్ సా మగ్రిని వెంటనే అందజేయాలని సూచించారు. -
ఊరబావిచెల్కకు ఆపదొచ్చింది!
సాక్షి, నాగర్‌కర్నూల్: ఆ గ్రామంలో 30 ఏళ్లుగా నివా సం ఉంటున్నారు.. ఇద్దరు వ్యక్తుల నుంచి కొనుగోలు చేసిన భూమిలో ఇళ్లను నిర్మించుకొని జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడా గ్రామస్తులకు పెద్ద కష్టమే వచ్చి పడింది. వారు ఉంటున్న భూమి తమ పేరిట పట్టాగా నమోదై ఉందని.. వెంటనే ఖాళీ చేయాలని నోటీసులు వచ్చాయి. దీంతో ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఇది పదర మండల కేంద్రంలోని ఊరబావిచెల్క గ్రామస్తుల దీనావస్థ. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. నల్లమల అటవీ ప్రాంతంలో భాగమైన పదర మండలకేంద్రం శివారులో ఉన్న సర్వేనంబర్ 126, 127లో గ్రామానికి చెందిన ఎ.బుచ్చిరెడ్డి, రాంరెడ్డి పేరిట 10.20 ఎకరాల్లో పట్టా భూములు ఉండేవి. ఈ భూమిని యజమానులు 1984 నుంచి గ్రామస్తులకు భాగాలుగా విక్రయాలు జరిపినట్టుగా స్థానికులు చెబుతున్నారు. అప్పటి నుంచి 40 ఏళ్లుగా ఒక్కొక్కరుగా సుమారు 80 మంది వరకు స్థలాలను కొనుగోలుచేసి ఇళ్లను నిర్మించుకున్నారు. ఇంటి స్థలాలను కొన్నట్టుగా పత్రాలు రాసుకోవడంతో పాటు గ్రామపంచాయతీ రికార్డుల్లోనూ నమోదు చేయించుకున్నారు. ఏటా ఇంటిపన్ను చెల్లిస్తూ 30ఏళ్లుగా అక్కడే నివాసం ఉంటున్నారు. కోర్టు నోటీసులతో ఆందోళన.. కొన్నేళ్లుగా సదరు భూములు తమ పేరిట రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నాయని.. ఆ భూములు తమకు చెందినవేనని పూర్వీకులు అంటున్నారు. వెంటనే ఖాళీ చేసి తమకు అప్పగించాలంటూ స్థానికులకు నోటీసులు సైతం జారీచేశారు. మంగళవారం పదర ఎస్ఐ సద్దాం ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నడుమ మరోసారి గ్రామానికి వెళ్లి స్థానికులకు నోటీసులు అందజేశారు. ఈ క్రమంలో స్థానికులు, భూ యజమానులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏళ్లుగా నివాసం ఉంటున్న తమను ఇప్పుడు ఖాళీ చేయమంటే తామంతా ఏమై పోవాలని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామస్తులు నిర్మించుకున్న ఇళ్లపై రగడ తమ పేరిట ఉన్న 8.20 ఎకరాల పట్టా భూమిని ఖాళీ చేయాలంటూ నోటీసులు 30ఏళ్ల క్రితం ఇళ్లు నిర్మించుకొని ఉంటున్నామని గ్రామస్తుల ఆందోళన -
ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
పెంట్లవెల్లి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 18న కొల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులకు సూచించారు. మంగళవారం పెంట్లవెల్లి మండలం జటప్రోల్లో కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఇతర అధికారులతో కలిసి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారిగా కొల్లాపూర్ నియోజకవర్గానికి వస్తున్నారన్నారు. జటప్రోల్లో రూ. 150కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేసిన అనంతరం సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే విధంగా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అత్యంత పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం హెలీపా్య్డ్, సభా స్థలాన్ని మంత్రి పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్, ఆర్డీఓ భన్సీలాల్ పాల్గొన్నారు. కాగా, జటప్రోల్ సమీపంలో నిర్మించే ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణానికి కేటాయించిన 16.06 ఎకరాల భూమి గోప్లాపూర్ శివారుకు చెందినదని.. కొత్తగా నిర్మించే పాఠశాలకు తమ గ్రామం పేరు పెట్టాలని కోరుతూ గ్రామస్తులు అధికారులకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు -
1987లో ఇంటిజాగ కొన్నాం..
మేము 1987లో బుచ్చి రెడ్డి వద్ద ఇంటిజాగ కొనుకున్నాం. ఇందు కు సంబంధించి పత్రా లు రాయించుకుని ఇళ్లు కట్టుకున్నాం. అప్పటినుంచి ఇంటిపన్ను గ్రామపంచాయతీకి చెల్లిస్తున్నాం. ఇప్పుడు వచ్చి ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని అనడం ఎక్కడి న్యాయం. – బత్తుల బాలింగయ్య, పదర న్యాయం చేయాలి.. గ్రామ శివారులోని ఊరబావిచెల్కలో ఉన్న భూమిని 30ఏళ్ల క్రితం మేం అందరం కొనుగోలు చేసి ఇళ్లను కట్టుకున్నాం. ఏళ్లుగా పన్నులు చెల్లిస్తూ ఈ ఇళ్లలోనే ఉంటున్నాం. ఇప్పుడు నోటీసులు పంపి ఇళ్లను ఖాళీచేయాలని అంటున్నారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలి. – కడారి బాలయ్య, పదర రికార్డుల్లో ఇళ్ల స్థలాలుగానే ఉంది.. పదర మండల కేంద్రంలోని ఊరబావిచెల్క భూములపై కేసు నడుస్తోంది. ఆ కేసు ఇంకా పెండింగ్‌లో ఉంది. రెవెన్యూ రికార్డుల్లో సదరు భూమిలో ఇళ్ల స్థలాలు ఉన్నట్టు నమోదై ఉంది. గ్రామపంచాయతీ రికార్డుల్లోనూ ఇళ్ల స్థలాలుగానే ఉంది. – సురేశ్‌బాబు, తహసీల్దార్, పదర ● -
జిల్లాను అగ్రగామిగా నిలుపుదాం
నాగర్‌కర్నూల్: అభివృద్ధి, ప్రజా సంక్షేమంలో జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకుసాగాలని దిశ కమిటీ చైర్మన్, ఎంపీ డా.మల్లు రవి అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మంగళవారం కలెక్టర్ బదావత్ సంతోష్, ఎమ్మెల్యేలు డా.రాజేశ్‌రెడ్డి, డా.వంశీకృష్ణ, డీఎఫ్ఓ రోహిత్ గోపిడి, అదనపు కలెక్టర్లు పి.అమరేందర్, దేవ సహాయంతో కలిసి నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్ కమిటీ (దిశ) సమావేశంలో జాతీయ రహదారులు, ఎస్సీ కార్పొరేషన్, వివిధ సంక్షేమ శాఖలు, విద్య, వైద్యం, గ్రామీణ నీటి సరఫరా, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, శిశు సంక్షేమం, పౌర సరఫరాలు, పరిశ్రమలు తదితర శాఖల పురోగతిపై దిశ కమిటీ చైర్మన్ మల్లు రవి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాలు అర్హులందరికీ అందించాల్సిన బాధ్యత అధికారులదేనని అన్నారు. ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే తనకు లేదా స్థానిక ఎమ్మెల్యేల దృష్టికి తీసుకురావాలని సూచించారు. జిల్లాలో కేటాయించిన లక్ష్యం మేరకు అన్ని రంగాలకు విరివిగా రుణాలు అందించాలని బ్యాంకర్లను ఆదేశించారు. ముఖ్యంగా వ్యవసాయం, చిరు వ్యాపారాలకు రుణాలు అందించి పేద ప్రజలకు ఆర్థికంగా అండగా నిలవాలన్నారు. విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో పురోగతి సాధించినప్పుడే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అన్నారు. ఇందుకోసం అధికారులు ప్రణాళికా బద్ధంగా ముందుకెళ్లాలన్నారు. జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని నేషనల్ హైవే అథారిటీ ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. మద్దిమడుగు – మాచారం బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. 2017 నుంచి 2025 వరకు జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందించిన రుణాల గ్రౌండింగ్‌ను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కాగా, జిల్లా ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో మెడికల్ ఏర్పాటు చేయడం జరిగిందని ఎంపీ మల్లు రవి అన్నారు. జిల్లా జనరల్ ఆస్పత్రిలో అధునాతన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో వ్యాధుల నివారణకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉపాధి అవకాశాలు పెంచడంతో ప్రజల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందనే ఉద్దేశంతో ఔత్సాహికులు పరిశ్రమలు స్థాపించేలా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఉపాధి హామీ పనులను సమర్థవంతంగా చేపట్టాలని, నీటిపారుదల కాల్వల ఆధునికీకరణ, పూడికతీత పనులకు ప్రాధాన్యమివ్వాలని ఆయన సూచించారు. సమావేశంలో డీఆర్డీఓ చిన్న ఓబులేషు, దిశ కమిటీ సభ్యులు వంకేశ్వరం మణెమ్మ, ఎం.భగవంతురెడ్డి, వి.చిన్నయ్య, మాదవత్ మోతీలాల్ తదితరులు ఉన్నారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు కృషి ప్రజాప్రతినిధులు, అధికారులుసమన్వయంతో ముందుకుసాగాలి దిశ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి -
సమస్యలు పరిష్కరిస్తాం..
అచ్చంపేట: మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని కమిషనర్ మురళి అన్నారు. సోమవారం ‘సాక్షి’ నిర్వహించిన ఫోన్ ఇన్‌లో అచ్చంపేట పట్టణ ప్రజలు పలు సమస్యలను ఏకరవు పెట్టారు. పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారిందని, రోడ్లపై మురుగు పారకుండా డ్రెయినేజీలు నిర్మించాలని, పిచ్చిమొక్కల తొలగింపు, వీధిదీపాలు, విద్యుత్ లైన్ల ఏర్పాటు, దోమల నివారణ, సీసీ రోడ్ల నిర్మాణం, బోరు మోటార్ల మరమ్మతు, తాగునీరు, పందుల బెడద తదితర సమస్యలను పలువురు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. కమిషనర్ స్పందించి రెండు, మూడు రోజుల్లో ఆయా ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి.. పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ● ప్రశ్న: మా వీధిలో వీధిదీపాలు వెలగడం లేదు. చీకట్లో ఇబ్బందులు పడుతున్నాం. – బాల్‌లింగం, 19వ వార్డు ● కమిషనర్: మా సిబ్బంది కాలనీ సందర్శించి పరిశీలిస్తారు. వీధిదీపాల ఏర్పాటు చేసి కాలనీలో చీకట్లు లేకుండా చూస్తాం. ● ప్రశ్న: ఉప్పునుంతల రోడ్డులో నిర్మాణంలో ఉన్న కల్వర్టును వెంటనే పూర్తి చేయించండి. – జంగయ్య, స్థానికుడు ● కమిషనర్: కల్వర్టు పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. అప్రోచ్ రోడ్డు పనులు పూర్తి చేసేలా ఆర్అండ్బీ అధికారలు దృష్టికి తీసికెళ్లి వారం రోజుల్లో రాకపోకలు పునరుద్ధరించే విధంగా చూస్తాం. ● ప్రశ్న: సాయినగర్ కాలనీలో ఇల్లు కట్టుకొని 25 ఏళ్లు అవుతుంది. శంకర్ మెకానిక్ నుంచి డ్రెయినేజీ, సీసీ రోడ్లు లేవు. చిన్నగా ఉన్న డ్రెయినేజీని పెద్దగా నిర్మించండి. – సుధాకర్, సాయినగర్‌కాలనీ ● కమిషనర్: మా సిబ్బంది వచ్చి పరిశీలిస్తారు. అవసరమైతే కొత్తగా డ్రెయినేజీ ఏర్పాటు చేస్తాం. ● ప్రశ్న: రాజీవ్‌నగర్ కాలనీ, డబుల్ బెడ్రూంల వద్ద డ్రెయినేజీ, చెత్తాచెదారం తొలగించండి. కరెంట్ సమస్య తీవ్రంగా ఉంది. శివసాయినగర్‌లో ట్రాన్స్ఫార్మర్ వద్ద కంచె ఏర్పాటు చేసి.. మురుగు కాల్వ శుభ్రం చేయండి. – సైదులు, రాజీవ్‌కాలనీ, స్వామి, శివసాయినగర్ ● కమిషనర్: డ్రెయినేజీలో చెత్తాచెదారం తొలగిస్తాం. కరెంట్ సమస్య, ట్రాన్స్ఫార్మర్ వద్ద కంచె ఏర్పాటు గురించి విద్యుత్ అధికారులకు సూచిస్తాం. మురుగు కాల్వ శుభ్రం చేయిస్తాం. ● ప్రశ్న: టంగాపూర్ కాలనీలో పెద్దమ్మగుడి వద్ద డ్రెయినేజీ సగం కట్టి వదిలేశారు. మురుగు కాల్వలు శుభ్రం చేయడం లేదు. – వందన, టంగాపూర్ కాలనీ ● కమిషనర్: కాంట్రాక్టర్‌తో మాట్లాడి వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. అలాగే మురుగు కాల్వను శుభ్రం చేయిస్తాం. ● ప్రశ్న: వినాయకనగర్‌లో సీసీ రోడ్డు వేయాలి. డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. కరెంట్ స్తంభాలు ఏర్పాటు చేయాలి. పారిశుద్ధ్య సిబ్బంది రోడ్లు శుభ్రం చేయడం లేదు. పెరిగిన చెట్లతో పాములు వస్తున్నాయి. – దేవి, వినాయకనగర్, సుప్రియ, మార్కెట్ రోడ్డు, బుజ్జి ఆదర్శనగర్, హమ్మద్ ఆర్టీసీ బస్టాండు ఏరియా ● కమిషనర్: అక్కడ డ్రెయినేజీని వెంటనే శుభ్రం చేయిస్తాం. ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగిస్తాం. సీసీ రోడ్డు నిర్మాణానికి కొంత సమయం పడతుంది. ప్రణాళికాబద్ధంగా అవసరమైన ప్రదేశాలను గుర్తించి చేపడుతాం. ప్రశ్న: మారుతినగర్లో కరెంటు స్తంభాలు వేశారు. వైరు లాగి వీధిదీపాలు ఏర్పాటు చేయండి. ముస్లిం శ్మశాన వాటికలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలి. – మల్లికార్జున్ మారుతినగర్, ఉస్మాన్ పట్టణవాసి కమిషనర్: విద్యుత్‌శాఖ వైరు లాగితే వెంటనే వీధిదీపాలు ఏర్పాటు చేస్తాం. శ్మశాన వాటికలోనూ ఏర్పాటు చేసేలా చూస్తాం. ప్రశ్న: చేపల మార్కెట్ లేక రోడ్లపై అమ్మకాలు జరుపుతున్నాం. మార్కెట్లోకి తరలించేలా చూడండి. మల్లంకుంట బఫర్ జోన్లో అసంపూర్తి, అక్రమ కట్టడాలను తొలగించండి. – రేణయ్య, పట్టణవాసి కమిషనర్: ఇంటిగేట్రేడ్ మార్కెట్ కోసం ప్రతిపాదనలు తయారు చేస్తున్నాం. మార్కెట్ నిర్మాణం జరిగితే అందరికీ అందులో అవకాశం కల్పిస్తాం. అక్రమ కట్టడాలను టౌన్ ప్లానింగ్ అధికారులు పరిశీలించి తొలగిస్తారు. ఇప్పటికే ఇరిగేషన్ అధికారులకు దీనిపై లేఖ రాశాం. ప్రశ్న: ఇళ్ల మధ్య పిచ్చిమొక్కలు పెరిగి పాములు, పురుగులు వస్తున్నాయి. మల్లకుంట రోడ్డుపై పడేసిన వ్యర్థాలతో దుర్వాసన వెదజల్లుతుండటంతో హాస్టల్ విద్యార్థులు పాఠశాలకు వెళ్లలేని పరిస్థితి ఉంది. వీధిదీపాలు లేక రాత్రి వేళ ఇబ్బందులు పడుతున్నారు. ఆదర్శనగర్‌లో మాలమహానాడు భవనం వద్ద పిచ్చిమొక్కలు తొలగించి, సీసీ రోడ్డు నిర్మించండి. – జగదీష్ 14 వార్డు పాత బస్టాండు, మల్లేష్ ఆదర్శనగర్ కమిషనర్: పిచ్చి మొక్కలు తొలగించేలా చర్యలు తీసుకుంటాం. వ్యర్థాలు వేసే వారిని గుర్తించి అక్కడ వేయకుండా అవగాహన కల్పిస్తాం. వెంటనే పాడైన వీధిదీపాలను ఏర్పాటు చేస్తాం. ప్రశ్న: సాయినగర్ ప్రాథమిక పాఠశాలలో మురుగు నిలుస్తోంది. ఆర్టీసీ బస్టాండు ఇన్ గేట్ వద్ద మురుగు కాల్వ శుభ్రం చేయడం లేదు. దోమల బెడద ఎక్కువగా ఉంది. – గణేష్, సాయినగర్, నారాయణ ఆర్టీసీ బస్టాండు ఏరియా కమిషనర్: సిబ్బందిని పంపించి మురుగు నిల్వకుండా పారిశుద్ధ్య చర్యలు చేపడుతాం. అలాగే ఆర్టీసీ బస్టాండు నుంచి మురుగు రాకుండా చేస్తాం. ప్రశ్న: వలపట్ల కాలనీ రోడ్డుపై మట్టిలో కూరుకుపోయిన సింగిల్ ఫేజ్ బోరు మోటార్ ప్లాట్ ఫాం నిర్మించి, మినీ ట్యాంకు నీళ్లు ఇచ్చేలా పునరుద్ధరించాలి. – సుధాకర్, 13వ వార్డు కమిషనర్: వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఉండటంతో మట్టిపోశాం. ఇంజినీరింగ్ అధికారులు పరిశీలించి వెంటనే పునరుద్ధరించే పనులు చేపడుతారు. ‘సాక్షి’ ఫోన్ ఇన్‌లో అచ్చంపేటమున్సిపల్ కమిషనర్ మురళి మున్సిపాలిటీలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి ప్రాధాన్య క్రమంలో సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం వీధి దీపాలు, విద్యుత్ లైన్ల ఏర్పాటుకు చర్యలు మా దృష్టికి వచ్చిన సమస్యలపై క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాం -
వైకల్యం ఉన్నవారిని వేధిస్తే చర్యలు
నాగర్‌కర్నూల్ క్రైం: మానసిక వైఫల్యం చెందిన వ్యక్తుల పట్ల సమాజం సహృద్భావంతో మెలిగి వారికి అన్ని రకాలుగా సహాయపడాలని, ఎవరైనా వేధింపులకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మెంబర్ శ్రీరాం ఆర్య అన్నారు. సోమ వారం మండలంలోని గుడిపల్లి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ దేశంలో వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని హక్కులను అమలు చేయడం వారి బాధ్యత అన్నారు. వైకల్యం గల వ్యక్తులను హింసించినా, వారితో క్రూరంగా ప్రవర్తించినా, అసహ్యంగా మాట్లాడినా, అగౌరవపరిచి నా జైలుశిక్ష విధిస్తారన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, ఇతర అనుకోని ప్రమాదాల నుంచి వైకల్యం గలవారిని ఇతర వ్యక్తులతో సమానంగా రక్షణ భద్రత కల్పించాలన్నారు. అంగవైకల్యం ఉన్న వారికి సంతాన ఉత్పత్తి కుటుంబ నియంత్రణ విషయంలో తగిన సమాచారంపై అవగాహన కల్పించాలన్నారు. వికలాంగులు తమ సమస్యల గురించి టోల్ ఫ్రీ నంబర్ 14416కు ఫోన్ చేసి వినియోగించుకోవాలన్నారు. ఉచిత న్యాయ సలహాలు, సూచనల కోసం టోల్ ఫ్రీ నంబర్ 15100కు ఫోన్ చేసి లబ్ధి పొందాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్ఎం కుర్మయ్య, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఎత్తిపోతలకు గ్రహణం
ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల్లో మరమ్మతుల పరంపర ● తరుచుగా సాంకేతిక సమస్యలతో నీటి సరఫరాకు ఆటంకం ● ప్రస్తుతం నెట్టెంపాడులో రెండు, కల్వకుర్తి రెండు, కోయిల్సాగర్లోఒక పంపుతోనే నీటి పంపింగ్ ● బకాయిలు చెల్లిస్తేనే పూర్తిస్థాయిలో మరమ్మతు చేస్తామంటూ ఏజెన్సీల కొర్రీ ● వరద సమయంలోనే హడావుడి చేస్తున్న వైనం గద్వాల: పాలమూరు బీడు భూములకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా పెద్దఎత్తున సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను నిర్మాణం చేపట్టి వాటి కింద సుమారు 6 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. అయితే.. ఆయా ఎత్తిపోతల పథకాల్లో మోటార్లు తరచుగా మరమ్మతుకు గురవుతుండటంతో నీటి పంపింగ్‌కు అడ్డంకిగా మారుతోంది. పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం కారణంగా ఎత్తిపోతలకు గ్రహణం పట్టినట్లయింది. నీటిని ఎత్తిపోసే పంపులకు సంబంధించి మోటార్లకు గత కొన్నేళ్లు సరైన మరమ్మతు చేయకపోవడం, మెయింటెనెన్స్ డబ్బులు సంబంధిత కంపెనీలకు చెల్లించకపోవడంతో సరైన నిర్వహణకు నోచుకోకపోవడంతో ఎత్తిపోతల ప్రాజెక్టులకు శాపంగా మారింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎత్తిపోతల పరిధిలోని లక్షలాది ఎకరాల ఆయకట్టు రెండో పంటకు సాగునీరు అందించడం ప్రశ్నార్థకంగా మారుతుంది. రెండు మోటార్లతో నెట్టెంపాడు.. జోగుళాంబ గద్వాల జిల్లావ్యాప్తంగా 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో మొత్తం ఏడు మోటార్లను ఏర్పాటు చేశారు. వీటిలో కేవలం రెండు మోటార్లు మాత్రమే పని చేస్తుండగా.. మిగిలిన ఐదు మోటార్లు మరమ్మతుకు గురయ్యాయి. ఈ మోటార్ల మెయింటెనెన్స్ బీహెచ్ఈఎల్ నిర్వహిస్తుండగా.. ప్రభుత్వం నుంచి బకాయిలు రాకపోవడంతో మెయింటెనెన్స్ పనులు ఆపేశారు. గతేడాది ఆగస్టులో సైతం గుడ్డెందొడ్డి లిఫ్టు వద్ద మోటార్లు కాలిపోగా.. నిర్వాహకులు చేతులెత్తెయడంతో అప్పటి సీఈ రఘునాథ్‌రావు ఆధ్వర్యంలో ఇంజినీర్ల బృందం గుడ్డెందొడ్డి లిఫ్టు వద్దకు చేరుకుని మోటార్లలో తలెత్తిన సాంకేతిక సమస్యను బీహెచ్ఈఎల్ వారిని ఫోన్ ద్వారా సంప్రదించి మరమ్మతు చేసిన దుస్థితి నెలకొంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పరిధిలో 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు గాను ర్యాలంపాడు జలాశయం ద్వారా 1.42 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందిస్తున్నారు. ● నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన కేఎల్ఐ నేటికీ పనులు అసంపూర్తిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కింద కేవలం 2.50 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది. ఈ ప్రాజెక్టులో మొత్తం 5 పంపులు ఏర్పాటు చేయగా.. రెండు పంపులు సాంకేతిక కారణాలతో మూలకు పడ్డాయి. మూడు మోటార్లు ఉన్నా.. రెండింటితోనే నీటి ఎత్తిపోతలు చేపడుతున్నారు. ఒక్క మోటారుతో కోయిల్‌సాగర్.. మరికల్, ధన్వాడ, చిన్నచింతకుంట, దేవరకద్ర మండలాల పరిధిలో రెండు పంటలకు 50 వేల ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో కోయిల్‌సాగర్ నిర్మించారు. ఈ ప్రాజెక్టుకు ఆది నుంచి సమస్యలే ఎదురవుతున్నాయి. తాజాగా జూరాల ప్రాజెక్టుకు భారీ వరద వస్తుంది. ఈ క్రమంలో నీటిని ఎత్తిపోయాల్సిన పంపుహౌస్‌లోని రెండు మోటార్లు నిరంతరాయంగా పనిచేస్తే 630 క్యూసెక్కుల చొప్పున 70 రోజులపాటు నడిస్తే 50 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. కానీ, రెండు మోటార్లలో ఒకటి సాంకేతిక సమస్యతో ఏడాదిగా పనిచేయడం లేదు. దీంతో ఒక్క మోటారుతోనే నీటిని ఎత్తిపోస్తున్నారు. -
18న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాక
పెంట్లవెల్లి: మండలంలోని జటప్రోల్ గ్రామం సర్వే నంబర్లు 147, 508లో 22 ఎకరాలలో నిర్మించిన రెసిడెన్సియల్ స్కూల్‌ను ఈ నెల 18న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడే బహిరంగ సభ నిర్వహించనుండటంతో సోమవారం కలెక్టర్ బదావత్ సంతోష్ పరిశీలించారు. ముందుగా హెలీప్యాడ్, సభావేదిక, పార్కింగ్ వంటి స్థలాలను పరిశీలించి.. అధికారులతో సమీక్షించారు. అధికారులు క్షేత్రస్థాయిలో దగ్గరుండి మూడు రోజుల్లో పనులు వేగవంతంగా పూర్తిచేయాలని సూచించారు. అసంపూర్తి పనులు మరింత ముమ్మరం చేయాలని జిల్లాస్థాయి అధికారులను ఆదేశించారు. అలాగే మండల రెవెన్యూ, ఇతర అధికారులు సభా స్థలాన్ని పరిశీలించాలని చెప్పారు. ఈ క్రమంలోనే మంగళవారం మంత్రి జూపల్లి కృష్ణారావు స్థల పరిశీలన చేస్తారని, ఆలోగా పనులు కొలిక్కి వచ్చేలా చూడాలన్నారు. సభావేదిక ఏర్పాట్లు, ఇతర పనుల్లో ఎలాంటి అలసత్యం వహించరాదని చెప్పారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ విజయసింహ, ఎంపీడీఓ దేవేందర్ ఉన్నారు. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ -
స్కానింగ్ సౌకర్యాన్ని వినియోగించుకోండి
నాగర్‌కర్నూల్ క్రైం: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో గర్భిణులకు స్కానింగ్ సదుపాయాన్ని కల్పించామని సద్వినియోగం చేసుకోవాలని జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉషారాణి అన్నారు. సోమవారం గర్భిణులకు అవసరమైన ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆస్పత్రికి రేడియాలజిస్ట్ వైద్యులు రిపోర్టు చేయడంతో స్కానింగ్ సేవలు తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చామని, సోమవారం నుంచి శనివారం వరకు గర్భిణులకు స్కానింగ్ సేవలు చేస్తారన్నారు. అలాగే రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి, పలు వ్యాధుల నిర్ధారణ కోసం డిజిటల్ ఎక్స్ రే ప్రతిరోజు 80 నుంచి 90 రోగులు వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. ప్రత్యేక వ్యాధి నిర్ధారణ నిమిత్తం అవసరమైన రోగులకు సిటీ స్కాన్ ఆస్పత్రిలో అందుబాటులో ఉందన్నారు. కార్యక్రమంలో రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్స్ ప్రశాంత్, రోహిత్, రేడియాలజిస్ట్ ఈశ్వరి, గ్రేడ్ వన్ మెడికో సోషల్ వర్కర్స్ జ్యోతి, విజయలక్ష్మి, బాలమ్మ, హెల్ప్ డెస్క్ ఇన్చార్జ్ యాదగిరి, సుజాత తదితరులు పాల్గొన్నారు. -
నీటిని పంపింగ్ చేస్తున్నాం..
నెట్టెంపాడు ఎత్తిపోతల స్టేజీ–1, 2లలో మొత్తం 7 మోటార్లు ఉన్నాయి. వీటిలో ఒకసారి మాత్రమే 6 పంపులతో నీటిని పంపింగ్ చేశాం. మోటార్లలో ఎలాంటి సమస్య లేదు. అయితే పంపుహౌస్‌లో గ్రిడ్‌ను రన్ చేసేందుకు ఎస్ఎఫ్సీ రన్ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి రిపేరు వస్తే సరిచేశాం. ప్రస్తు తం రెండు పంపుల ద్వారా నీటిని పంపింగ్ చేస్తున్నాం. దీనిపై బీహెచ్ఈఎల్ వారికి తెలియజేశాం. అయితే ఇతర ప్రాజెక్టులలో వారికి రావాల్సిన బిల్లులు బకాయిలు ఉండడంతో రిపేరు చేసేందుకు రావడం లేదు. ఇప్పటి వరకై తే రూ.2 కోట్ల బకాయిలు చెల్లించాం. – రహీముద్దీన్, ఎస్ఈ ఇరిగేషన్ శాఖ రెండు పంటలకు నీరివ్వాలి.. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం మోటార్లలో సాంకేతిక సమస్యపై ఇరిగేషన్‌శాఖ మంత్రి, కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లాను. నీటి పంపింగ్ కోసం అవసరమైన మోటార్లను పూర్తిస్థాయిలో సిద్ధం చేసి ఈ వానాకాలంలో లక్ష్యం మేర పంపింగ్ చేసుకుని పూర్తిస్థాయిలో ఆయకట్టు రైతులకు రెండు పంటలకు నీరివ్వాలని కోరాను. – కృష్ణమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే, గద్వాల ● -
నాగర్‌కర్నూల్
మంగళవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 2025వివరాలు 8లో u● ప్రశ్న: ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట మురుగు కాల్వ నిర్మాణానికి నిధులు మంజూరైనా పనులు చేయడం లేదు. హిందూ శ్మశాన వాటికలో నిర్మించిన దహన వాటికను వినియోగంలోకి తేవాలి. ఏపుగా పెరిగిన కంప చెట్లు తొలగించండి. – మండికారి బాలాజీ, పట్టణవాసి ● కమిషనర్: డ్రెయినేజీ నిర్మాణానికి రూ.8 లక్షల నిధులు మంజూరయ్యాయి. టెండర్ ప్రక్రియ పూర్తయ్యింది. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. శ్మశాన వాటికలో కంప చెట్లు తొలగించి దహన వాటికను వినియోగింలోకి తెస్తాం. న్యూస్‌రీల్ ప్రశ్న: లింగాల రోడ్డులో పాత ఆంధ్రాబ్యాంకు రోడ్డు, 9వ వార్డులో కుక్కల బెడద అధికంగా ఉంది. పిల్లల వెంట పడుతున్నాయి. వారం రోజులకోసారి కూడా చెత్తబండ్లు రావడం లేదు. వారం రోజులుగా తాగునీటి ఇబ్బందులు ఉన్నాయి. ఖాళీ ప్లాట్లలో చెత్త వేస్తున్నారు. – భాస్కర్‌రెడ్డి విద్యానగర్‌కాలనీ, జంగమ్మ 9వ వార్డు కమిషనర్: వీధికుక్కల నియంత్రణకు జిల్లాకేంద్రంలో ఏబీసీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక బృందం ద్వారా త్వరలోనే కుక్కలను పట్టుకుంటాం. ఇకపై రెగ్యులర్‌గా చెత్త ఆటోలు వస్తాయి. ఖాళీ ప్లాట్లలో చెత్త వేయకుండా చెత్త ఆటోల ద్వారా మైకులో ప్రచారం చేస్తాం. ఎవరి ప్లాట్లు వారే శుభ్రం చేసుకోవాలి. -
కాలుష్యపు కోరల్లో కృష్ణమ్మ
కృష్ణానదిలో కలుస్తున్న పరిశ్రమల వ్యర్థాలు ●కొల్లాపూర్: ఉమ్మడి పాలమూరు జిల్లా మీదుగా కృష్ణానది దిగువకు ప్రవహిస్తుంటుంది. అయితే కృష్ణానది తీరం వెంట పలు రసాయన, ఔషధ, ఆల్కహాల్ పరిశ్రమలు నెలకొల్పారు. వాటి వ్యర్థాలను నది తీరంలోకి వదిలిపెడుతున్నారు. కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను పరిశ్రమలు పట్టించుకోవడం లేదు. అలాగే నది తీర గ్రామాల్లోని చెత్తాచెదారాన్ని కూడా తీరం ఒడ్డునే పారబోస్తున్నారు. దీంతో ఎగువ నుంచి వరద జలాలు వదిలిపెట్టినప్పుడు కలుషితాలన్నీ నీటిలో కలిసి దిగువకు ప్రవహిస్తున్నాయి. కృష్ణానదికి ఉపనదులుగా ఉన్న తుంగభద్ర, మలప్రభ, ఘటప్రభ వంటి నదుల నుంచి కూడా కాలుష్య కారకాలు వచ్చి కృష్ణానదిలో కలుస్తున్నాయి. కొల్లాపూర్ నియోజకవర్గ సరిహద్దులోనే ఆయా నదులు సంగమం అవుతుంటాయి. కాలుష్య కారకాల వల్ల జటప్రోల్, మంచాలకట్ట, మల్లేశ్వరం, సంగమేశ్వరం, సోమశిల, అమరగిరి పరిసర ప్రాంతాల్లో నది నీళ్లు పచ్చగా మారుతున్నాయి. గత మూడేళ్లుగా నీళ్లు ఈ విధంగా కనిపిస్తున్నాయి. తీర ప్రాంతాల్లో కిలోమీటర్ల పొడవునా ఇలా నీటిపై పచ్చని రంగులో తెట్టెలు దర్శనమిస్తున్నాయి. నీటిమట్టం తగ్గేకొద్దీ కలుషిత నీరు అంతా దిగువకు ప్రవహిస్తూ పోతుంది. శుద్ధి చేసిన నీటినే.. మిషన్ భగీరథ స్కీంకు కృష్ణానది నుంచి ఎత్తిపోసే నీటినే వినియోగిస్తున్నాం. ఈ నీళ్లను రెగ్యులర్‌గా ఫిల్టర్ చేసి సరఫరా చేస్తున్నాం. మట్టి, చెత్త ఏమున్నా ఫిల్టరింగ్‌లో వెళ్లిపోతుంది. ఆరోగ్యానికి హాని కలిగించని ఖనిజ లవణాలు మాత్రమే ఉంటాయి. నీటి ఫిల్టరింగ్ను రెగ్యులర్‌గా పర్యవేక్షిస్తాం. నది నీటి కాలుష్యాన్ని పర్యవేక్షించే బాధ్యత మా శాఖ పరిధిలో లేదు. – అంజాద్పాష, డీఈఈ, మిషన్ భగీరథ మా దృష్టికి రాలేదు.. కృష్ణానదిలో కాలుష్య కారకాలు కలుస్తున్నాయనే విషయం మా దృష్టికి రాలేదు. ఇది మా పరిధిలోని అంశం కాదు. కాలుష్య నివారణ బోర్డుకు సంబంధించిన అధికారులు దీనిని పర్యవేక్షిస్తారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. – భన్సీలాల్, ఆర్డీఓ, కొల్లాపూర్ పచ్చగా మారుతున్నాయి.. కృష్ణానదిలో నీళ్లు మూడేళ్లుగా పచ్చగా మారుతున్నాయి. ఇవి పై నుంచి వస్తున్నాయి. వరద వచ్చినప్పుడు నీళ్లపై ఆకుపచ్చ రంగులో తెట్టెలు ఉంటున్నాయి. నీళ్లు తగ్గే సమయంలో అధికంగా కనిపిస్తాయి. ఈ ఏడాది కూడా కొన్నిచోట్ల ఈ నీటి తెట్టెలు కనిపించాయి. ఈ విషయం ఇక్కడికి వచ్చే అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. – బాలరాజు, మంచాలకట్ట, పెంట్లవెల్లి మండలం జీవనది కృష్ణమ్మ ఉమ్మడి పాలమూరు జిల్లాలో సుమారు వంద కి.మీ. మేర పారుతూ.. కోట్లాది మందికి తాగునీరు, లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. అలాగే లెక్కకు మించి వన్యప్రాణులు, మత్స్య సంపదకు జీవనాధారమైంది. ఇంతటి ప్రాముఖ్యత గల కృష్ణానది క్రమంగా కాలుష్యపు కోరల్లో చిక్కుకుంటోంది. ఎగువనున్న కొన్ని పరిశ్రమల నుంచి కాలుష్యపు నీటిని గుట్టుచప్పుడు కాకుండా కృష్ణానదిలోకి వదిలేస్తున్నారు. ఫలితంగా కృష్ణాజలాలు పచ్చరంగులోకి మారుతూ విషపూరితమవుతున్నాయి. ఈ పరిస్థితిని అడ్డుకోవాల్సిన కాలుష్య నియంత్రణ మండలి అధికారులు దరిదాపుల్లో లేకపోగా.. ఇతరత్రా అధికార యంత్రాంగం తమ పరిధిలో లేదంటూ చేతులు దులుపుకొంటోంది. కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా.. ఉమ్మడి మహబూబ్‌నగర్– రంగారెడ్డి జిల్లాలకు కొల్లాపూర్ మండలం ఎల్లూరు సమీపంలోని మిషన్ భగీరథ స్కీం నుంచే నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ స్కీంకు కృష్ణానది నీటినే వినియోగిస్తున్నారు. కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోసే కృష్ణానీటిని ఫిల్టర్ చేసి ప్రజలకు సరఫరా చేస్తున్నారు. కాలుష్య కాటుకు గురవుతున్న నీటిని సక్రమంగా శుద్ధి చేయకుంటే ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం కూడా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల ఆరోగ్యం, మత్స్యసంపద వృద్ధికి ఇబ్బందికరంగా నీటి కాలుష్యం మారకముందే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పలు ప్రాంతాల్లో ఆకుపచ్చ రంగులోకి నది నీళ్లు మూడేళ్లుగా అధికమవుతున్న నీటి కాలుష్యం వరదలతో దిగువకు పారుతున్న కలుషిత జలాలు దరిదాపుల్లో కానరాని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు -
ఆర్టీసీ ఉద్యోగుల సొంతింటి కల సాకారం
కల్వకుర్తి రూరల్: ఆర్టీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఆర్టీసీ కాలనీ ఏర్పాటు చేసుకొని ఉద్యోగులు తమ సొంతింటి కలను సాకారం చేసుకోవడం శుభ సూచకమని రీజినల్ మేనేజర్ సంతోష్ కుమార్ అన్నారు. కల్వకుర్తి మండలం తాండ్ర సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఆదివారం ఆర్టీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగుల ఇళ్ల నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎం మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి తమవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని ఆర్టీసీ ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఎం సుభాషిణి, అసోసియేషన్ అధ్యక్షుడు సయ్యద్ మహమ్మద్, యూనియన్ బ్యాంక్ మేనేజర్ శంకర్, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ సభ్యుడు గుమ్మకొండ రాములు, మాజీ సర్పంచ్ ఆనంద్, సీఎల్ శ్రీనివాస్ యాదవ్, అబ్రహం, మల్లేశం, విజయబాబు, సాయిరెడ్డి పాల్గొన్నారు. -
వేతన వ్యథ!
అవస్థలు పడుతున్నాం.. గ్రామాల్లో అన్ని పనులు చేసేది మేమే. ఇచ్చే కొద్దిపాటి జీతాలు కూడా పెండింగ్‌లో పెడుతుండటంతో అవస్థలు పడుతున్నాం. పెండింగ్ వేతనాల కోసం ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుంది. కార్మికుల ఇబ్బందులను ఎవరూ పట్టించుకోవడం లేదు. – కలమండల దాసు, కార్మికుడు, కాంసానిపల్లి, ఉప్పునుంతల మండలం ఒకట్రెండు రోజుల్లో చెల్లిస్తాం.. జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులకు ఒకట్రెండు రోజుల్లో మూడు నెలలకు సంబంధించిన వేతనాలు చెల్లిస్తాం. ఇప్పటికే ఆ ప్రక్రియ పూర్తయ్యింది. ఆయా పంచాయతీ కార్యదర్శుల నుంచి నివేదికలు తీసుకున్నాం. కార్మికుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తాం. – శ్రీరాములు, ఇన్చార్జి డీపీఓ ● పంచాయతీ కార్మికులకు అందని వేతనాలు ● మూడు నెలలుగా అవస్థలు ● పట్టించుకోని అధికారులు ● సమ్మెకు సిద్ధమవుతున్న కార్మికులు అచ్చంపేట రూరల్: గ్రామపంచాయతీల్లో పారిశుద్ధ్య పనులు చేసే కార్మికులకు మూడు నెలలుగా వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ పోషణ భారంగా మారడంతో ఆందోళన చెందుతున్నారు. తప్పని పరిస్థితుల్లో అప్పులు చేస్తూ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. గ్రామాల పరిశుభ్రతకు పాటుపడే తమకు నెలనెలా వేతనాలు అందించడంపై సంబంధిత అధికారులు శ్రద్ధ చూపడం లేదని కార్మికులు వాపోతున్నారు. పనులు చేసేందుకు నిరాసక్తత.. గ్రామాల్లో చెత్త సేకరణ, మురుగు కాల్వల శుభ్రత, పిచ్చిమొక్కల తొలగింపు, నీటి పైపుల లీకేజీలు, వీధి దీపాలకు మరమ్మతు, దోమల నివారణకు బ్లీచింగ్ పౌడర్ చల్లడం, ఫాగింగ్‌తో పాటు అన్ని పనులకు కార్మికులే ఆధారం. అయితే పంచాయతీల ఆదాయం మేరకు కార్మికులకు జీతాలు చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయం ఎక్కువగా ఉన్నచోట, నిధులు సమృద్ధిగా ఉన్న కొన్ని జీపీల్లోనే వేతనం చెల్లింపు సక్రమంగా కొనసాగుతుంది. మిగతా జీపీల్లో పనులు చేయించుకుంటున్నారే తప్ప ప్రతినెలా జీతాలు చెల్లించడం లేదు. మూడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో పనులు చేయడానికి కార్మికులు నిరాసక్తత చూపుతున్నారు. మరోవైపు చాలా ఏళ్లుగా జీపీల్లో పనులు చేస్తున్నా జీతాలు పెరగడం లేదని నిరుత్సాహంగా ఉన్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో ఆయా గ్రామాల్లోని కార్మికులను పంచాయతీ కార్యదర్శులు బుజ్జగిస్తూ పనులు చేయిస్తున్నారు. నిధుల కొరత.. పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో 2024 ఫిబ్రవరి 1నుంచి పల్లెల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. నాటి నుంచి పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాకపోవడంతో తీవ్ర నిధుల కొరత ఏర్పడింది. కొన్ని గ్రామాల్లో ఇంటి పన్నులు, ఇతర ఆదాయ మార్గాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని కార్మికుల వేతనాలు, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. చెత్త సేకరణకు వినియోగించే ట్రాక్టర్లకు కొన్ని నెలలుగా పంచాయతీ కార్యదర్శులే సొంత డబ్బులతో డీజిల్ పోయిస్తున్నారు. పంచాయతీల్లో పారిశుద్ధ్య, ఇతర పనుల నిర్వహణకు నిధులు లేకపోవడంతో కార్యదర్శులు అప్పులు చేయాల్సి వస్తోంది. జిల్లాలో 2,500 మందికి పైగా కార్మికులు.. జిల్లాలో 461 జీపీలు ఉండగా.. 2,500 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో కారోబార్లు, బిల్కలెక్టర్లు, వాటర్మేన్లు, పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. ప్రతి కార్మికుడికి రూ. 9,500 వేతనంగా నిర్ణయించినా.. కొన్ని జీపీల్లో అంతంతమాత్రంగానే వేతనాలు అందుతున్నాయి. నిధుల కొరత కారణంగా అనేక పంచాయతీల్లో వేతనాలు చెల్లించకుండా పెండింగ్‌లో ఉంచడంతో కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. తమకు నెలనెలా వేతనాలు చెల్లించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే నిరవధిక సమ్మె చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. డిమాండ్లు ఇవే.. పంచాయతీ ఉద్యోగులు, కార్మికులకు వేతనాలు క్రమంగా చెల్లించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. రెండో పీఆర్సీ పరిధిలోకి పంచాయతీ సిబ్బందిని తీసుకొచ్చి జీఓ నం.60 ప్రకారం వేతనాలు చెల్లించాలి. జీఓ నం.51ని సవరించి మల్టీపర్పస్ కార్మికుల విధానం రద్దు చేయాలి. పాత కేటగిరీల ప్రకారం ఉద్యోగులుగా గుర్తించాలి. కారోబార్లు, బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలి. అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలి. పంచాయతీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించి రిటైర్డ్మెంట్ బెనిఫిట్‌గా రూ. 5లక్షల చొప్పున చెల్లించాలి. మరణించిన కార్మికుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవడానికి ఆర్థిక సాయంతో పాటు ఇంటి స్థలాలు కేటాయించాలి. -
క్రీడలతో మానసికోల్లాసం : ఎస్పీ
కందనూలు: క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఆదివారం 1986–87 ఎస్ఎస్సీ బ్యాచ్ క్రికెట్ టోర్నీని ఎస్పీ ప్రారంభించారు. అంతకు ముందు పాఠశాలలో నిర్వహించిన పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 38ఏళ్ల క్రితం కలిసి చదువుకున్న స్నేహితులంతా ఒకచోట కలుసుకొని క్రీడా పోటీలు నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. క్రీడలతో మానసిక ఆరోగ్యం, స్నేహభావం మరింత పెంపొందుతుందని అన్నారు. అనంతరం పూర్వ విద్యార్థులతో కలిసి ఎస్పీ కొంతసేపు క్రికెట్ ఆడి ఉత్సాహం నింపారు. కాగా, పాఠశాలలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు కోసం పూర్వవిద్యార్థులు రూ. 20వేలు అందజేశారు. గగ్గలపల్లి ఉన్నత పాఠశాలకు రెండు క్రికెట్ కిట్స్ వితరణ చేశారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సయ్యద్ ఫసియొద్దీన్, నాగరాజు, శివకుమార్, విక్రమ్, రవీందర్రావు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
అపరిష్కృత సమస్యలు పరిష్కరించండి
కందనూలు: ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలని తపస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనుపటి మల్లిఖార్జున్ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సరస్వతీ శిశుమందిర్‌లో జిల్లా అధ్యక్షుడు రాజిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా కార్యనిర్వాహక సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ, ఉపాధ్యాయులకు నష్టం చేకూర్చే సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. అదే విధంగా పీఆర్పీ అమలు, పెండింగ్ డీఏలు, పదోన్నతులు, ఏకీకృత సర్వీసు, పెండింగ్ మెడికల్ బిల్లులు తదితర సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం విద్యార్థుల్లో దేశభక్తి నిర్మాణం, జాతీయ భావాజాలం, సభ్యత్వ అభియాన్ వంటి అంశాలపై జిల్లా కార్యవర్గానికి ఆయన దిశానిర్దేశం చేశారు. సమావేశంలో తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి శేఖర్, వెంకట్‌రెడ్డి, సురేఖ, నాగరాజు ఉన్నారు. -
మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు
పెద్దకొత్తపల్లి: నాయినోనిపల్లి మైసమ్మ జాతరకు ఆదివారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా తరలివచ్చి మైసమ్మ దేవతను దర్శించుకున్నారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులతో జాతర మైదానం కిక్కిరిసిపోయింది. భక్తుల సౌకర్యార్థం వనపర్తి, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. కాగా, మైసమ్మ జాతరకు భక్తుల రద్దీ పెరగడంతో పెద్దకొత్తపల్లిలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మైసమ్మ దేవతను 15వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు దేవాదాయశాఖ అధికారి రంగారావు తెలిపారు. రెవెన్యూ మేళాకు అనూహ్య స్పందన కందనూలు: జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన రెవెన్యూ మేళాకు అనూహ్య స్పందన లభించిందని కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. వివిధ సమస్యలపై పట్టణ ప్రజలు 288 దరఖాస్తులు సమర్పించినట్లు పేర్కొన్నారు. అందులో 148 ఇంటినంబర్ కోసం, 94 ఆస్తి మార్పిడి, 27 పేరు సవరణ, 19 ట్యాక్స్ రీవిజన్ దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటిని మూడు రోజుల్లోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. కాగా, రెవెన్యూ మేళాను మరో నాలుగు రోజులు పొడిగించడం జరిగిందని.. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. పౌరహక్కులను కాపాడాలి నాగర్‌కర్నూల్ రూరల్: పౌరహక్కులను కాపాడేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు అంతటి కాశన్న డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికీ మోహర్రం పండుగ సందర్భంగా పీర్ల వద్ద అలాయ్ ఆడే పరిస్థితి లేదని అన్నారు. గ్రామాల్లో కులవివక్ష, అంటరానితనంపై అవగాహన కల్పించేందుకు అధికారులు చొరవ చూపాలని కోరారు. అదే విధంగా దళిత కాలనీల్లో రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం చేపట్టడంతో పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులందరికీ లబ్ధి చేకూర్చాలని కోరారు. సమావేశంలో కేవీపీఎస్ మండల అధ్యక్షుడు రామకృష్ణ, అశోక్, సత్యనారాయణ, రాజు, శివ, అంబేడ్కర్ ఉన్నారు. -
నేడు మున్సిపల్ కమిషనర్‌తో ‘సాక్షి’ ఫోన్‌ఇన్
అచ్చంపేట: అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో భాగంగా సోమవారం పుర కమిషనర్ డి.మురళితో ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించనుంది. ఉదయం 11నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహించే ఫోన్ ఇన్ కార్యక్రమం కొనసాగనుంది. ఆయా వార్డుల్లో వీధిదీపాల ఏర్పాటు, సీసీరోడ్లు, మురుగుకాల్వల నిర్మాణం, పారిశుద్ధ్యం, ఇంటింటి చెత్త సేకరణ, రహదారుల శుభ్రత, తాగునీటి సరఫరాలో అంతరాయం తదితర సమస్యలను ప్రజలు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవచ్చు. సంప్రదించాల్సిన నంబర్లు : 93985 73135, 91770 68043 -
లో లెవల్.. హై రిస్క్!
●వంతెనలు లేక ప్రజలకు చింతలు రఘుపతిపేట వద్ద పనులు ప్రారంభించాం తెలకపల్లి, కల్వకుర్తి ప్రధాన రహదారిలో రఘుపతిపేట వద్ద దుందుభీ వాగుపై వంతెన నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఉప్పునుంతల, మొల్గర వాగుపై ఇప్పటికే సర్వే చేసి భూసార పరీక్షలు నిర్వహించాం. ఇందుకు అనుగుణంగా వంతెన డిజైన్ చేసి ఆర్అండ్బీ ఈఎన్సీకి పంపించాం. డిజైన అప్రూవల్ రాగానే నిర్మాణ పనులు ప్రారంభిస్తాం. – జలంధర్, ఆర్అండ్బీ డీఈ, అచ్చంపేట ● నిధులు మంజూరైనా మొదలు కాని పనులు ● హైలెవల్ బ్రిడ్జిల నిర్మాణాలు పూర్తయ్యేదెన్నడో? అచ్చంపేట: ప్రజా సంబఽంధాలు, అభివృద్ధిలో రహదారులు పాత్ర కీలకం. ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా నిర్మించిన అనేక రోడ్లు వర్షాల కారణంగా వచ్చిన వరదలకు ధ్వంసం కాగా.. దశాబ్దాల క్రితం పలుచోట్ల నిర్మించిన లో లెవల్ కాజ్‌వేలు, వంతెనలు శిథిలావస్థకు చేరాయి. జిల్లాలో దుందుభీ వాగు తిమ్మాజీపేట, తాడూరు, తెలకపల్లి, ఉప్పునుంతల, వంగూరు, అచ్చంపేట మండలాల్లో వివిధ గ్రామాల శివారు మీదుగా ఉన్న ప్రవహిస్తోంది. పాలకుల నిర్లక్షమే.. గత ప్రభుత్వ హయాంలో కొత్త వంతెనలు, రహదారుల మరమ్మతులకు రూ.కోట్లు మంజూరు చేసినా.. నిర్మాణాలు నత్తనడకన సాగతున్నాయి. కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించినా బిల్లులు రావడం లేదన్న సాకుతో నిర్మాణాలను మధ్యలోనే వదిలేస్తున్నారు. ● నాగర్‌కర్నూల్–పాలెం రహదారిలో నల్లవాగుపై వంతెన పనులు దాదాపు పూర్తయి రెండేళ్లు అవుతుంది. వంతెనకు ఇరువైపులా అప్రోచ్ పనులు పూర్తి వేయాల్సి ఉంది. ● తాడూరు మండలం సిర్సవాడ–మాధారం దుందుభీ వాగుపై 300 మీటర్ల వంతెన నిర్మాణానికి ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 7న రూ.20.20కోట్ల నిధులు మంజూరు చేసింది. పనులు మొదలు కాలేదు. ● ఉప్పునుంతల–మొల్గర మధ్య దుందుభీ వాగుపై ఉన్న కల్వర్టు తెగిపోయింది. హైలెవల్ వంతెన నిర్మాణానికి 2023 జులై 24న రూ.35కోట్ల నిధులు మంజూరయ్యాయి. 80 మీటర్ల పొడవు, 6 మీటర్ల ఎత్తులో కొత్త వంతెన నిర్మించాల్సి ఉంది. టెండర్ ప్రక్రియ పూర్తయినా నిర్మాణ పనులు దక్కించుకున్న కంట్రాక్టర్ పనులు మొదలు పెట్టలేదు. రెండేళ్ల క్రితం ఈ వాగు పొర్లడంతో చేపల వేటకు వెళ్లిన బాలుడు నీటిలో కొట్టుకపోయి మృతి చెందాడు. ● తెలకపల్లి–రఘపతిపేట దుందుభీ వాగుపై వంతెన నిర్మాణ కోసం రూ.45కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఇటీవల కాంట్రాక్టర్ పనులు ప్రారంభించారు. పిల్లర్ల దశలో పనులు ఉండటంతో ఈ వర్షాకాలంలో అవస్థలు తప్పవు. 2022 ఆగస్టు 30న రఘపతిపేట వద్ద దుందుభీ వాగు కాజ్‌వేపై బస్సు నీటిలో చిక్కుకుంది. ● కోడేరు–పెద్దకొత్తపల్లి ప్రధాన రహదారిలో బావాయిపల్లి డ్యామ్ నిర్మాణానికి మూడేళ్ల క్రితం రూ.96లక్షలు మంజూరయ్యాయి. పనులు దక్కించుకున్న కాంట్రాక్టరు ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదు. ● ఖానాపూర్–పసుపుల వాగుపై వంతెన నిర్మాణానికి ఆర్అండ్బీ శాఖ నుంచి రూ.4కోట్లు మంజూరైనా పనులు మొదలు కాలేదు. మూడేళ్ల క్రితం వాగు ఉధృతికి ఓ వ్యక్తి కొట్టుకపోయి మృతి చెందాడు. ● వెల్దండ మండలంలోని సిరసగండ్ల, చారకొండ వెళ్లే బైరాపూర్ వాగు ఉధృతికి 2022లో వంతెన కొట్టుకపోయింది. అప్పట్లో వంతెన నిర్మాణానికి రూ.3.50కోట్లు నిధులు మంజూరయినా.. పనులు ప్రారంభించలేదు. అలాగే చెర్కూర్, గాన్ గట్టుతండా మధ్య వాగుపై వంతెనకు రూ.4.15కోట్ల మంజూరైనా పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ● బిజినేపల్లి–జడ్చర్ల ప్రధాన రహదారి గుమ్మకొండ సమీపంలో వట్టెం రిజర్వాయర్ నుంచి కర్వెన రిజర్వాయర్‌కు వెళ్లే కెనాల్‌పై బ్రిడ్జి పనులు ప్రారంభించినా పూర్తి కాలేదు. ● అచ్చంపేట, నాగర్‌కర్నూల్ ప్రధాన రహదారిలో బల్మూర్ మండలం గట్టుతుమ్మన్–తుమ్మన్‌పేట స్టేజీ, కనకాల మైసమ్మ–జిన్‌కుంట మధ్య బిజినేపల్లి మండలంలోని మహాదేవునిపేట వద్ద వంతెనలు శిథిలావస్థలో ఉన్నాయి. ● లింగాల–చెన్నంపల్లి మధ్య పెద్ద వాగు ప్రవాహంతో చెన్నంపల్లి, ఎర్రపెంట, పద్మనపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. ● బల్మూర్ మండలంలోని చిన్నపల్లె చెరువు అలుగు పారితే చెన్నారం, వీరంరాజుపల్లి, రామాజీపల్లి ప్రజలు మండల కేంద్రానికి రావాలంటే కొండనాగుల, అచ్చంపేట మీదుగా ప్రయాణం చేయాల్సి వస్తోంది. ● గోకారం, తుర్కపల్లి మధ్య వాగుపై వంతెన నిర్మాణానికి రూ.4.50 కోట్లు మంజూరయ్యాయి. – వంగూరు, జూపల్లి మధ్య వాగుపై వంతెన నిర్మించాల్సి ఉంది. ● అచ్చంపేట మండలంలోని మన్నెవారిపల్లి, చందంపేట రహదారిపై దుందుభీవాగు దాటేందుకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఏజెన్సీ గ్రామాల ప్రజలు ఎక్కువగా ఈవంతెన దాటి దేవరకొండ, చందంపేటకు వెళ్తుంటారు. దుందుభీ పొర్లితే ఈప్రాంత వాసులు అచ్చంపేట మీదుగా 70కి.మీల దూరం అదనంగా తిరగాల్సి వస్తోంది. ● కొల్లాపూర్ మండలం నార్లాపూర్, ముక్కిడిగుండం మధ్య పెద్దవాగుపై వంతెన పనులు పూర్తి కాగా.. అప్రోచ్ రోడ్డు పనులు చేయాల్సి ఉంది. -
నిలబెట్టుకోవాలి
నాగర్కర్నూల్వైద్యులు నమ్మకాన్ని .. పట్టించుకోరు జడ్చర్లలో ఫుట్ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి రూ.5.50 కోట్లతో ప్రతిపాదించారు. శనివారం శ్రీ 12 శ్రీ జూలై శ్రీ 2025వివరాలు 8లో uమహిళల ఆర్థిక సాధికారతే ముఖ్యం రాష్ట్ర ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో మహిళా సాధికారత దిశగా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని జిల్లా ఇన్చార్జీ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం కల్వకుర్తి పట్టణంలో రూ.110 కోట్లతో పలు అభివృద్ధి పనులకు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, రాజేష్‌రెడ్డితో కలిసి శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే కసిరెడ్డి మాట్లాడుతూ సీఎం, మంత్రుల సహకారంతో కల్వకుర్తి ప్రజల అవసరాల కోసం వంద పడకల ఆస్పత్రిని మంజూరు చేశామని తెలిపారు. మున్సిపాలిటీలోని కొట్ర నుంచి పట్టణం వరకు 4.5 కి.మీల రోడ్డు వెడల్పు కోసం రూ.65 కోట్లు, పట్టణంలోని 99వ సర్వే నంబర్లో రూ.45 కోట్లతో 100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేపట్టారు. మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకు లింకేజీ ద్వారా అందించే రూ.7.13 కోట్ల రుణాల చెక్కులను మంత్రులు మహిళలకు అందజేశారు. డీఎస్పీ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో డివిజన్లోని పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. రెండు వరుసల బీటీ పనులకు.. వెల్దండ మండల కేంద్రం నుంచి చారకొండ మండలంలోని సిర్సనగండ్ల దేవస్థానం వరకు రూ.40 కోట్లతో మంజూరయిన రెండు వరుసల బీటీరోడ్డు నిర్మాణం కోసం వెల్దండలో మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు అంబేడ్కర్, ఇందిరాగాంధీ విగ్రహలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొట్రగేట్ నుంచి తలకొండపల్లి వరకు రూ.65కోట్ల మంజూరు కావడంతో 22 కిలోమీటర్ల రెండు వరుసల బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. నాగర్‌కర్నూల్/నాగర్‌కర్నూల్ రూరల్/కల్వకుర్తి/ కల్వకుర్తిటౌన్/వెల్దండ: ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించి వైద్యులు ప్రజలకు నమ్మకం కలిగించాలని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కష్ణారావు, దామోదర రాజనర్సింహ సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడ సమీపంలో 26 ఎకరాల్లో రూ.180 కోట్ల ఖర్చుతో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల నూతన భవనాలను ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేష్‌రెడ్డి, వంశీకష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి ప్రారంభించారు. దీంతో పాటు రూ.235 కోట్లతో 550 పడకల సామర్థ్యంతో అధునాతన వసతులతో నూతన ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన, భూమిపూజ చేశారు. అనంతరం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆస్పత్రుల్లోఅధునాతన వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి 35 కిలోమీటర్లకు ట్రామా కేంద్రం, జిల్లాకు ఓ నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మెడికల్ కళాశాలకు రూ.50 లక్షలతో ఎలక్ట్రిక్ బస్సు కొనుగోలు చేసి విద్యార్థుల రవాణా సదుపాయం కల్పిస్తామని మంత్రి జూపల్లి తెలిపారు. రూ.140 కోట్లతో రోడ్ల అభివృద్ధి రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ వనపర్తి, జడ్చర్ల రోడ్డు, మహబూబ్‌నగర్–మన్ననూరు రోడ్డు విస్తరణకు రూ.140 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్‌రెడ్డి మాట్లాడుతూ నియోజక వర్గంలో పేదలకు మెరుగైన వసతులు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నానని తెలిపారు. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ మెడికల్ కళాశాల, ప్రజా ప్రభుత్వ వైద్యశాల జిల్లాకే మకుటంగా అభివర్ణించారు. అనంతరం వనమహోత్సవంలో భాగంగా కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. తూడికుర్తిలో పీహెచ్సీ.. మండలంలోని తూడుకుర్తిలో రూ.2 కోట్లతో మంజూరైన ప్రాథమిక అరోగ్య కేంద్రానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ భూమి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. 28 ఏళ్ల క్రితమే దామోదర్‌రెడ్డి తన తండ్రి రాంచంద్రారెడ్డి పేరు మీద 10 ఎకరాల స్థలంలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి నెలకొల్పారని కొనియాడారు. నాగర్‌కర్నూల్ నుంచి జడ్చర్ల వరకు రూ.150 కోట్లతో 4లైన్ల రోడ్డు వేశామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ బాదావత్ సంతోష్, అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం, పీసీబీ సభ్యుడు బాలాజీసింగ్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్, డీసీహెచ్ఎస్ రామకృష్ణ, జిల్లా వైద్యాధికారి స్వరాజ్యలక్ష్మి, ఆర్డీఓ శ్రీను, మున్సిపల్ కమిషనర్ మహామూద్షేక్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రమాదేవి, ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉషారాణి, గ్రంథాలయ చైర్మన్ గంగాపురం రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు తదితరులు పాల్గొన్నారు. సాక్షి, నాగర్‌కర్నూల్: ‘బీఆర్ఎస్ సోషల్ మీడియాను బాగా వాడుకుంటోంది. ప్రభుత్వంపై ప్రతీ విషయంలో పోస్టులతో అబద్ధాలు ప్రచారం చేస్తోంది. అందుకు ధీటుగా కాంగ్రెస్ సోషల్ మీడియా పనిచేయడం లేదు. మనమూ అదేస్థాయిలో బీఆర్ఎస్ ప్రచారాన్ని తిప్పికొట్టడంలో విఫలమవుతున్నాం.’ అని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు చేతులమీదుగా నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని వంద పడకల ఆస్పత్రి భవనాన్ని ప్రారంభించిన అనంతరం నిర్వహించిన బహిరంగసభలో ఎమ్మెల్యే కసిరెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాకు ధీటుగా కౌంటర్ ఇవ్వడంలో కాంగ్రెస్ సోషల్ మీడియా పనిచేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. న్యూస్‌రీల్‘కాంగ్రెస్ సోషల్ మీడియా ఎక్కడుంది..’? ఆస్పత్రికి వచ్చే రోగులకు సిబ్బంది మెరుగైన సేవలు అందించాలి మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కష్ణారావు, దామోదర రాజనర్సింహ జిల్లావ్యాప్తంగా పలు అభివృద్ధి పనులకు భూమిపూజ -
ర్యాలంపాడులో కదలిక
సాగునీటి పారుదల శాఖ మంత్రి పర్యటనతో మరమ్మతు పనుల్లో చలనం ర్యాలంపాడు జలాశయం ఆనకట్ట గద్వాల: రూ.వేల కోట్లు వెచ్చించి నిర్మించిన ర్యాలంపాడు సాగునీటి ప్రాజెక్టు కొందరు అవినీతి అధికారులు, కాంట్రాక్టర్ల వల్ల ప్రమాదంలో పడింది. అందుబాటులోకి వచ్చిన ఏడాది కాలంలోనే జలాశయం మొదలుకొని, కుడి, ఎడమ తూముల అడుగుభాగాల్లో ఏర్పడిన లీకేజీలతో రూ.కోట్ల ప్రజాధనం నీట కొట్టుకుపోతుంది. దీనిపై పలుమార్లు సర్వేలు, డీపీఆర్ నివేదికలు గత, ప్రస్తుత ప్రభుత్వాలకు సమర్పించినా చలనం లేకుండా పోయింది. ఎట్టకేలకు ఇటీవల సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి క్షేత్రస్థాయిలో జలాశయాన్ని సందర్శించడంతో పాటు అధికారులతో వివరాలు సేకరించారు. ఈనేపథ్యంలో రెండు, మూడు రోజుల్లో మరమ్మతు కోసం సమగ్ర సర్వేకు అవసరమైన నిధుల మంజూరు అవుతున్నట్లు తెలిసింది. నడిగడ్డ ప్రాంతమైన గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు సుమారు రూ.2వేల కోట్లతో నెట్టెంపాడు ప్రాజెక్టును నిర్మించారు. ఈ ప్రాజెక్టు పరిధిలో 14ప్యాకేజీలు, రెండు లిఫ్టులు, ఏడు జలాశయాలు నిర్మించారు. సంగాల, చిన్నోనిపల్లి జలాశయాలు స్టాండ్‌బై కింద కేవలం నీటిని నిల్వ చేసుకునేందుకు నిర్మించగా.. మరో 5 జలాశయాలు ఆయకట్టుకు నీరు అందించేలా డిజైన్ చేశారు. ఇందులో ర్యాలంపాడు జలాశయం కింద ధరూరు, కేటీదొడ్డి, మల్దకల్ మండలాల్లో 1.05లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4టీఎంసీలు. మరోవైపు 1.30టీఎంసీల సామర్థ్యంతో 1.36లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా రూ.580 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న గట్టు ఎత్తిపోతలకు కూడా అవసరమైన 2.80టీఎంసీల నీటిని ర్యాలంపాడు జలాశయం నుంచే ఎత్తిపోసేలా నిర్మాణం చేపడుతున్నారు. నడిగడ్డలో 2లక్షల ఎకరాలకు.. 2022లో రిపోర్ట్ అందజేత సదరు సంస్థ 2022 మార్చిలో సర్వే పనులు చేపట్టి లీకేజీల మరమ్మతుకు సుమారు రూ.137 కోట్లు వ్యయం అవుతుందని 2023 జనవరిలో ఇరిగేషన్ శాఖకు రిపోర్ట్ అందించారు. అంచనాలు రూపొందించిన అధికారులు తుది నివేదికను 2024 డిసెంబర్లో ప్రభుత్వానికి సమర్పించారు. అనంతరం ఈ ఏడాది ఏప్రిల్‌లో పుణెకు చెందిన సీడబ్ల్యూసీ సంస్థ ఇంజినీర్ల నిపుణుల బృందం ర్యాలంపాడును సందర్శించి లీకేజీలను పరిశీలించారు. మరోసారి సర్వే చేసేందుకు రూ.1.86 కోట్లు అవసరం అవుతుందని నిపుణుల బృందం ఇరిగేషన్‌శాఖ ఈఎన్సీకి వివరించారు. విషయాన్ని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి వివరించడంతో రెండు, మూడు రోజుల్లో అందుకు కావాల్సిన నిధులు మంజూరు చేసేందుకు సముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఐదేళ్ల క్రితం జలాశయానికి గండి 2024 డిసెంబర్లో రూ.137 కోట్ల అంచనాతో నివేదిక ఏప్రిల్‌లో పూణెకు చెందిన సీడబ్ల్యూసీ సంస్థ నిపుణుల బృందం సందర్శన -
జలాశయానికి గండి..
ఇంతటి ప్రాధాన్యత ఉన్న ర్యాలంపాడును గుత్తేదారు చేపట్టిన లోపభూయిష్టమైన నిర్మాణం, కొరవడిన అధికారుల పర్యవేక్షణతో ఏకంగా జలాశయానికి గండిపడింది. జలాశయం అడుగుభాగాన రాక్‌టోల్ నుంచి పలుచోట్ల లీకేజీలు ఏర్పడి జలాశయం నుంచి నీరు బయటకు ఉబికి వస్తుండడాన్ని ఇరిగేషన్ అధికారులు మూడేళ్ల కిందటనే గుర్తించారు. తర్వాత సీఈ స్థాయిలో నిపుణుల కమిటీ జలాశయాన్ని సందర్శించి లీకేజీలు, అందుకు గల కారణాలు తెలుసుకొని, మరమ్మతు చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థకు సర్వే పనులు అప్పగించింది. ఇందుకోసం రూ.57లక్షలు వెచ్చించారు. -
నేడు జిల్లాలో మంత్రుల పర్యటన
నాగర్‌కర్నూల్: జిల్లాలోని కల్వకుర్తి, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాల్లో శుక్రవారం రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వైద్యారోగ్యశాఖ, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ, ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నారు. ఉదయం 9:30 గంటలకు మాడ్గుల మండల కేంద్రంలో రూ. 12.70కోట్లతో 30 పడకల ఆస్పత్రి భవనం, 10:15 గంటలకు కోనాపూర్ నుంచి మాడ్గుల గుండా దేవరకొండ రోడ్డు వరకు రూ. 70కోట్లతో చేపట్టే బీటీరోడ్డు నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం 220 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసి.. 11:45 గంటలకు వెల్దండకు చేరుకుంటారు. అక్కడ వెల్దండ – సిర్సనగండ్ల వరకు రూ. 40కోట్లతో నిర్మించే బీటీరోడ్డుకు, కల్వకుర్తి నుంచి కొట్ర గేట్ మీదుగా తలకొండపల్లి వరకు 22 కి.మీ. మేర రూ. 65కోట్ల వ్యయంతో నిర్మించే బీటీరోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2గంటలకు కల్వకుర్తికి చేరుకొని రూ. 45.50కోట్లతో 100 పడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన అనంతరం పబ్లిక్ మీటింగ్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3గంటలకు జిల్లా కేంద్రానికి చేరుకొని మెడికల్ కళాశాల నూతన భవనాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడే 550 పడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. నాగర్‌కర్నూల్ మండలం తూడుకుర్తిలో ప్రాథమిక ఆరోగ్యకేంద్రం భవన నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించనున్నారు. మంత్రుల పర్యటన సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. విద్య, వైద్యంలో జిల్లాను అగ్రభాగాన నిలపడమే లక్ష్యం విద్య, వైద్యరంగాల్లో జిల్లాను అగ్రభాగాన నిలపడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. జిల్లాలో మంత్రుల పర్యటన నేపథ్యంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల నూతన భవనంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి రూ. 9కోట్లు మంజూరైనట్లు తెలిపారు. త్వరలో వట్టెంలో నూతన పాఠశాల భవనం నిర్మిస్తామన్నారు. రూ. 200కోట్లతో నిర్మించే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సముదాయం టెండర్ దశలో ఉందన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పెండింగ్ పనులను పూర్తిచేస్తున్నట్లు చెప్పారు. జిల్లా కేంద్రంలో ఉన్న 100 పండకల ఆస్పత్రిని 330 పడకలకు పెంచడం జరిగిందన్నారు. పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో నూతన నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం మంత్రుల పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు. కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రమాదేవి, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, మాజీ కౌన్సిలర్లు నిజాం, సునేంద్ర, జక్కా రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్న అమాత్యులు ఏర్పాట్లు పూర్తిచేసిన అధికార యంత్రాంగం -
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
నాగర్‌కర్నూల్ రూరల్: మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మత్స్యశాఖ అధికారిణి రజిని సూచించారు. జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో గురువారం జాతీయ మత్స్య రైతుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చేపల సీడ్ ఉత్పత్తి, పెంపకం, చేపల మార్కెటింగ్ తదితర అంశాలపై మత్స్యకారులకు పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. చేపల రైతులు ఆక్వా కల్చర్ నిపుణుల సూచనలు పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో మత్స్యసహకార సంఘాల మండల అధ్యక్షుడు హరికృష్ణ, తెప్ప రుద్రయ్య పాల్గొన్నారు. -
విధుల్లో చేరిన జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్
కందనూలు: జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా టి.ఉషారాణి గురువారం బాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్ జీఎంసీ ఆస్పత్రి పిడియాట్రిక్ విభాగంలో పనిచేస్తున్న ఆమె బదిలీపై నాగర్‌కర్నూల్ జిల్లా జనరల్ ఆస్పత్రికి వచ్చారు. ఇక్కడ సూపరింటెండెంట్‌గా పనిచేసిన రఘు ఆమెకు స్వాగతం పలికి బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఉషారాణి మాట్లాడుతూ.. ఆస్పత్రికి వచ్చే ప్రజలకు వైద్యులు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని సూచించారు. క్రీడా అకాడమీలో ప్రవేశాలు కందనూలు: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గచ్చిబౌలి ఎల్బీ స్టేడియంలో నూతనంగా ఏర్పాటుచేసిన క్రీడా అకాడమీలో 2025–26 విద్యా సంవత్సరం బాలబాలికలకు ప్రవేశాలు కల్పిస్తున్నట్లు డీవైఎస్ఓ సీతారాం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హాకీ, అథ్లెటిక్స్, హ్యాండ్‌బాల్, పుట్‌బాల్ క్రీడాంశాల్లో ప్రవేశాల ఈ నెల 15, 16 తేదీల్లో ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు విద్యార్హత, జనన, క్రీడా ధ్రువపత్రాలు, ఆధార్‌కార్డు, 10 పాస్‌పోర్టు సైజ్ ఫొటోలతో ఉదయం 7గంటలకు ఎల్బీ స్టేడియానికి చేరుకోవాలని సూచించారు. అధిక సాంద్రత పద్ధతితో అధిక దిగుబడి బిజినేపల్లి: అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగుతో అధిక దిగుబడి సాధించవచ్చని పాలెం కేవీకే శాస్త్రవేత్త డా.శైల అన్నారు. గురువారం మండలంలోని అల్లీపూర్, పోలేపల్లి, నందివడ్డెమాన్, మహదేవునిపేట గ్రామాల్లో పత్తి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా అధిక సాంద్రత పద్ధతిలో సాగుచేసిన పత్తిపంట మొక్కల సంఖ్యను లెక్కించారు. ఈ పద్ధతిని అనుసరించిన రైతుల అభిప్రాయాలు తీసుకున్నారు. యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు నాగర్‌కర్నూల్: విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటామని ఎస్ఈ వెంకటనర్సింహారెడ్డి అన్నారు. విద్యుత్‌శాఖ ఎస్ఈగా గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించిన అనంతరం విలేకర్లతో మాట్లాడారు. విద్యుత్ సరఫరాలో తలెత్తే సమస్యలను ముందుండి పరిష్కరిస్తామని తెలిపారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. కాగా, గతంలో ఇక్కడ ఎస్ఈగా పనిచేసిన పాల్‌రాజ్ హైదరాబాద్‌లోని కార్పొరేషన్ కార్యాలయానికి బదిలీ కాగా.. ఆయన స్థానంలో మేడ్చల్ ఎమ్మార్టీ డీఈగా పనిచేస్తున్న వెంకట నర్సింహారెడ్డి ఇక్కడికి బదిలీపై వచ్చారు. -
పెరుగుతున్న జనాభాతో అనర్థాలు
బాదేపల్లిలోని శ్రీవెంకటేశ్వరకాలనీలో నివాసం ఉంటున్న అమరవాది ప్రభు, విజేత దంపతులు చిరు వ్యాపారంతో జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి వివాహం జరిగి 12 ఏళ్లు గడుస్తుండగా తల్లిదండ్రులతో కలిసి ఉమ్మడి కుటుంబంగా జీవిస్తున్నారు. వీరికి నాలుగేళ్ల వయస్సు గల ఓ పాప ఉంది. రోజురోజుకూ పెరుగుతున్న జనాభాతో అనేక అనర్థాలు జరుగుతున్నాయన్న ఆలోచనతో ఒకరిద్దరు సంతానం చాలని భావిస్తున్నారు. వీరినే ప్రయోజకులుగా తీర్చిదిద్ది దేశానికి సరైన విధంగా తయారు చేసే పరిస్థితి ఉంటుందన్నారు. అధిక జనాభాతో దేశంలో క్రమశిక్షణ లోపిస్తుందని అభిప్రాయపడుతున్నారు. -
ముగ్గురు పిల్లలుకావాలనుకుంటున్నాం..
గత మే నెల 14న మాకు వివాహమైంది. నేను డిగ్రీ పూర్తి చేసి ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ.. ఇంటి వద్ద వ్యవసాయ పనులు చేస్తాను. నా భార్య డిగ్రీ చదువుతోంది. ప్రతి ఇంట్లో ఒక్కరే పిల్లలు ఉంటున్నారు. ఈ విషయమై మేము ముగ్గురు పిల్లలను కనాలని భవిష్యత్ ప్లాన్ చేసుకున్నాం. మాకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కావాలనుకున్నాం. ఒక్కొక్కరికి మధ్య కొంత వయస్సు గ్యాప్‌తో పిల్లలను కనాలని భావిస్తున్నాం. – రాజేష్, మనుశ్రీ, కానాయపల్లి గ్రామం, కొత్తకోట మండలం భవిష్యత్‌కు ప్రణాళిక.. నాకు ఏడాది కిందట రాయచూరు జిల్లా ఆత్కూరు గ్రామానికి చెందిన జయలక్ష్మితో వివాహమైంది. ఇద్దరం ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నాం. మేం రెండేళ్ల తర్వాత పిల్లల కోసం ప్లాన్ చేసుకున్నాం. ప్రస్తుతం జీవన ప్రమాణాలు పెరగడమే కాకుండా, కుటుంబం జీవన వ్యయం కూడా పెరిగింది. ప్రైవేటు ఉద్యోగాలు చేస్తుండటంతో వచ్చిన డబ్బులను ఇప్పటి నుంచే పొదుపు చేసుకుని జాగ్రత్త పడితేనే భవిష్యత్‌లో ఏవైనా సమస్యలు ఎదురైతే వాటిని తట్టుకోవడానికి సులభం అవుతుంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని నా భార్య నేను కలిసి ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్తున్నాం. అందుకే ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు వద్దకున్నాం. – రమేష్, జయలక్ష్మి, గద్వాల పట్టణం స్థిరపడిన తర్వాతే పిల్లలు.. మాకు ఇటీవలే వివాహమైంది. అయితే ఆర్థిక ఇబ్బందులను అధిగమించి వ్యాపారంలో స్థిరపడిన తర్వాతే పిల్లలు కనాలన్న ఆలోచనతో ఉన్నాం. ఒకరిద్దరు సంతానం ఉంటే సరిపోతుందని భావిస్తున్నాం. మౌలిక సదుపాయాలు, విద్య, ఉద్యోగ, ఉపాధి తదితర అవకాశాలు పెరుగుతున్న జనాభాతో కోల్పోయే అవ కాశాలు ఉన్నాయి. ఒకరిద్దరి సంతానం ఉంటే వారి పర్యవేక్షణ సులభతరం అవుతుంది. వీరినే మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్ది దేశానికి సేవ చేస్తే సరిపోతుంది. – నరేష్, స్వప్న, నవాబుపేట -
సమాజానికి మంచి..
బాదేపల్లిలోని శ్రీసాయినగర్ కాలనీకి చెందిన నరేష్, వీణ దంపతులకు ఇద్దరు కుమారులు. ఆస్తులు ఉన్నా అధిక సంతానం అనర్థానికి దారి తీస్తుందన్నది వీరి అభిప్రాయం. ఇద్దరికి చక్కటి విద్యను అందించగలిగితే వారు ఉన్నత స్థాయికి ఎదగడంతోపాటు సమాజానికి మంచి చేస్తారని భావిస్తున్నారు. అధిక జనాభా వలన మౌలిక సదుపాయాల కల్పన, పర్యవేక్షణ, క్రమశిక్షణ గాడి తప్పుతుందని, పాలనాపరమైన సమస్యలు ఎదురవుతాయని, సరైన సేవలు, సౌకర్యాలు అందక ఆందోళనలు చోటు చేసుకునే పరిస్థితులు దాపురిస్తాయని పేర్కొంటున్నారు. -
భూగర్భజలాల పెంపునకు కృషి చేయాలి
వెల్దండ: ఉపాధి హామీ పథకం ద్వారా భూగర్భజలాల పెంపునకు దోహదపడే పనులు చేపట్టాలని కేంద్ర జలశక్తి అభియాన్ నోడల్ అధికారి అథర్వ పవస్ అన్నారు. గురువారం మండలంలోని చెదురుపల్లి బుగ్గకాల్వ చెరువులో చేపట్టిన ఒండ్రుమట్టి తొలగింపు పనులను ఆయన పరిశీలించారు. అనంతరం చెరువులో మట్టి తీయడం వల్ల వర్షాకాలంలో ఎంతమేర నీరు చేరిందనే దానిపై పరిశీలన చేశారు. ఉపాధి హామీ పథకం రైతులు, ప్రజలకు ఉపయోగపడే విధంగా చూడాలని సూచించారు. ముఖ్యంగా భూగర్భజలాల పెంపునకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఏపీడీ చంద్రశేఖర్, క్రాంతికుమార్, పవన్, ఇన్చార్జి ఎంపీడీఓ లక్ష్మణ్, ఏపీఓ ఈశ్వర్‌జీ, దేవేందర్, మంజుల పాల్గొన్నారు. -
వృద్ధిరేటు తగ్గుముఖం
సాక్షి, నాగర్‌కర్నూల్: ఏటా జనాభా వృద్ధిరేటు గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. గత దశాబ్దకాలంగా శిశుజననాలు తగ్గుతుండగా, వయో వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. శిశువుల రేటు కన్నా వృద్ధుల జనాభా క్రమంగా పెరుగుతున్న కారణంగా భవిష్యత్‌లో ‘ఇతరులపై ఆధారపడే వారి నిష్పత్తి’ పెరుగుతోంది. యువ జనాభా తగ్గుముఖం పడుతుండటం, వృద్ధుల జనాభా ఎక్కువగా ఉండటం వల్ల యువతపైనే సామాజిక, ఆర్థిక బాధ్యతలు పెరుగుతున్నాయి. 1991 నుంచి కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు, సామాజిక మార్పులు, ఉమ్మడి కు టుంబాలు విచ్ఛిన్నం కావడం, న్యూక్లియర్ కుటుంబాలకు ప్రాధాన్యం పెరగడం, ఎక్కువ మంది సంతానం ఉంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయన్న కారణంతో జననాల వృద్ధిరేటు గణనీయంగా పడిపోతోంది. 1951 నుంచి 2011 వరకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో చేపట్టిన జనాభా లెక్కల ఆధారంగా జనాభా వృద్ధిరేటు, మారుతున్న ట్రెండ్స్‌ను బట్టి పరిస్థితి అర్థమవుతోంది. సీ్త్ర, పురుష నిష్పత్తిలో పెరుగుతున్న అంతరం.. ఉమ్మడి జిల్లాలో మొత్తం జనాభాలో ప్రతి వెయ్యి మంది పురుషులకు ఉండాల్సిన సీ్త్రల నిష్పత్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఆడ పిల్లల జననాలపై వివక్ష, అబార్షన్లు తదితర కారణాలతో మొత్తం జనాభాలో సీ్త్రల నిష్పత్తి తగ్గుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లాలో 7,45,101 మంది పురుషులకు 7,41,676 మంది మాత్రమే సీ్త్రలు ఉన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో 4,37,986 మంది పురుషులు ఉంటే 4,23,780 మంది సీ్త్రలు ఉన్నారు. గద్వాల జిల్లాలో 3,09,274 మంది పురుషులు ఉండగా, 3,00,716 మంది సీ్త్రలు, వనపర్తి జిల్లాలో 2,94,833 మంది పురుషులు ఉంటే 2,82,925 మంది సీ్త్రలు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ జనాభా.. ఉమ్మడి జిల్లాలోని నాగర్‌కర్నూల్ జిల్లాలోనే ఎక్కు వశాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఈ జిల్లాలో 89.81 శాతం మంది గ్రామీణు లు కాగా, 10.19 శాతం పట్టణ ప్రాంతాల్లో ఉంటున్నారు. గద్వాల జిల్లాలో 89.64 శాతం మంది గ్రా మీణ ప్రాంతాల్లో, 10.36 శాతం మంది పట్టణాల్లో నివసిస్తున్నారు. వనపర్తి జిల్లాలో 84.03 శాతం గ్రామాల్లో, 15.97 శాతం పట్టణాల్లో ఉంటున్నారు. మహబూబ్‌నగర్ (నారాయణపేటతో కలిపి) జిల్లాలో 79.27 శాతం గ్రామీణ జనాభా ఉండగా, 20.73 శాతం మంది పట్టణాల్లో నివసిస్తున్నారు. 1991 నుంచి భారీగా తగ్గుదల ఉమ్మడి జిల్లాలో 1951 నుంచి చేపట్టిన జనాభా లెక్కలను పరిశీలిస్తే ప్రతి దశాబ్దానికి కనీసం 9 శాతం నుంచి 26 శాతం వ రకు జనాభా వృద్ధిరేటులో పెరుగుదల కనిపించింది. అయితే 1991 నుంచి కుటుంబ నియంత్రణ పకడ్బందీగా అమలు, సామా జికంగా మార్పుల కారణంగా జనాభా వృద్ధి భారీగా తగ్గింది. 1951 నుంచి 1961 వర కు 9.92 శాతం వృద్ధి కనిపించగా, 1971 నాటికి ఏకంగా 21.46 శాతం జనాభా వృద్ధి నమోదైంది. 1981 నాటికి 26.53 శాతం, 1991లో 25.87 శాతం జనాభా వృద్ధి చెందింది. అయితే 1991 లో 25.87 శాతం నుంచి 2001 నాటికి జనాభా వృద్ధి 14.20 శాతానికి, అక్కడి నుంచి 2011 నాటికి 15.34 శాతానికే పరిమితమైంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏటేటా తగ్గుతున్న జననాలు పెరుగుతున్న వయోవృద్ధుల సంఖ్య 1991 నుంచి జనాభా వృద్ధిరేటులో భారీగా తగ్గుదల భవిష్యత్‌పై ఆందోళన, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో సంతానాన్ని తగ్గించుకుంటున్న వైనం -
శతాబ్దాల చరిత్ర.. ఆదరణ లేక దీనావస్థ
నాగర్‌కర్నూల్ జిల్లాలో శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయాలు, చరిత్రను తెలియజేసే శిలాశాసనాలకు రక్షణ కరువవుతోంది. అధికార యంత్రాంగం వీటిపై పెద్దగా దృష్టిపెట్టడం లేదు. కేవలం ఆదాయం ఉన్న ఆలయాలను మాత్రమే పట్టించుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆలయాల నిర్వహణతోపాటు పురావస్తు విగ్రహాలు, శాసనాల రక్షణకు నిధుల లేమి ప్రధాన సమస్యగా మారింది. అయితే సోమశిల సర్క్యూట్ డెవలప్మెంట్లోభాగంగా కొల్లాపూర్ నియోజకవర్గంలోని పురాతన ఆలయాలకు మేలు జరుగుతుందని స్థానికులు భావిస్తున్నారు. – కొల్లాపూర్శాసనాలు, శిల్పాలు.. పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్‌లో 13వ శతాబ్దానికి చెందిన కాకతీయుల కాలం నాటి శిలాశాసనం ఉంది. దీన్ని పట్టించుకునే వారే లేరు. ఇటీవల పురావస్తు నిపుణుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి ఆ శాసనాన్ని సందర్శించారు. చరిత్రను తెలియజేసే శాసనాలను పరిరక్షించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కొల్లాపూర్‌లోని ఆర్ఐడీ కళాశాల సమీపం, పలు ప్రాంతాల్లో సురభి రాజులకు సంబంధించిన శాసనాలు ఉన్నాయి. మల్లేశ్వరం సమీపంలోని గుట్టపై పురాతన దేవతామూర్తుల విగ్రహాలు పూజలకు నోచుకోకుండా నిరుపయోగంగా ఉన్నాయి. సోమశిలలో పురాతన విగ్రహాలను మ్యూజియంలో ఉంచగా.. మరికొన్ని చెట్లకిందే ఉన్నాయి. అయితే వాటి విశిష్టతను తెలియజెప్పేవారు లేరు. జిల్లావ్యాప్తంగా పురాతన విగ్రహాలు, శిలాశాసనాలు చాలాచోట్ల రక్షణ లేకుండా ఉన్నాయి. ప్రచారం కల్పిస్తే గుర్తింపు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎన్నో ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి. వీటిలో అధికంగా నాగర్‌కర్నూల్ జిల్లాలోనే ఉన్నాయి. కృష్ణానది తీరం వెంట శతాబ్దాల కాలం కిందటే మునులు, రుషులు ఆలయాలను నిర్మించారు. వీటికి తగిన ప్రచారం కల్పిస్తే పర్యాటకులు, భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దేదీప్యమానంగా వెలుగొందిన జటప్రోలు మదనగోపాలస్వామి వంటి ఆలయాలను ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాస్కీ నిధులపైనే ఆశలు.. కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నియోజకవర్గంలోని సోమశిల పరిసర పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాల అభివృద్ధికి స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్టిమెంట్ (సాస్కీ) ద్వారా కేంద్రం రూ.68.10 కోట్లు కేటాయించింది. ఈ నిధుల వినియోగం, పర్యాటక అభివృద్ధి అంశాలను పరిశీలించేందుకు ఇటీవల మంత్రి జూపల్లి, రాష్ట్ర పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్‌రంజన్, మేనేజింగ్ డైరెక్టర్ వల్లూరి క్రాంతి కొల్లాపూర్‌లో పర్యటించారు. సోమశిల, అమరగిరి, జటప్రోలు, మంచాలకట్ట, మల్లేశ్వరం ప్రాంతాలను తిలకించారు. సాస్కీ నిధులతో చేపట్టబోయే పనుల ద్వారా పురాతన ఆలయాలు, శిలాశాసనాలకు తగిన గుర్తింపు లభించవచ్చని స్థానికులు భావిస్తున్నారు. రక్షణ చర్యలు చేపట్టాలి జిల్లాలోని పలు ప్రాంతాల్లో చారిత్రక శిలాశాసనాలు, పురాతన విగ్రహాలున్నాయి. అవన్నీ చరిత్రకు సాక్ష్యాలు. వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంతోపాటు స్థానికులపై ఉంది. పురావస్తు అధికారులు వాటి రక్షణకు చర్యలు చేపట్టాలి. జటప్రోలు మదనగోపాలస్వామి ఆలయం వంటి పురాతన ఆలయాలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు అధికారులు కృషిచేయాలి. – శివకృష్ణయాదవ్, కొల్లాపూర్ అధికారులు దృష్టి సారించాలి మల్లేశ్వరం సమీపంలోని గుట్టపై పురాతనమైన కాలభైరవ, 11వ శతాబ్దానికి చెందిన శేషశయన విష్ణుమూర్తి విగ్రహాలున్నాయి. వీటిని పరిరక్షించాలని ఏళ్లుగా అధికారులను కోరుతున్నా పట్టించుకోవడం లేదు. చారిత్రక ప్రాశస్త్యం ఉన్న విగ్రహాలు, ఆలయాలు, శాసనాలు ధ్వంసం కాకుండా కాపాడాలి. వీటి రక్షణకు చర్యలు చేపట్టాలి. – అశోక్నంద, మల్లేశ్వరం అద్భుతమైన శిల్పకళతో.. కొల్లాపూర్ నియోజకవర్గంలోని జటప్రోలు సమీపంలో కృష్ణానది తీరాన కొన్ని శతాబ్దాల కిందట సురభి రాజవంశస్తులు అద్భుతమైన శిల్పకళతో మదనగోపాలస్వామి ఆలయాన్ని నిర్మించారు. రాజుల పాలనలో ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఏటా నెలరోజులపాటు ఆలయం వద్ద జాతర సాగేది. దాదాపు వంద గ్రామాల ప్రజలు వచ్చేవారు. ప్రతివారం పెద్దఎత్తున పశువుల సంత సాగేది. అయితే శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంతో ఆలయం నీటిలో మునిగిపోయింది. కాలక్రమేణా ఆలయాన్ని జటప్రోలులో పునర్నిర్మించారు. కొన్నేళ్లపాటు పూజలు యథాతథంగా సాగాయి. రానురాను తన ప్రాభవాన్ని కోల్పోయింది. చివరికి ధూప, దీప, నైవేద్యాలు పెట్టేవారు కూడా కరువయ్యారు. ఏడేళ్ల కిందట దేవాదాయశాఖ అధికారులు ఒక పూజారిని ఏర్పాటు చేశారు. కానీ, భక్తుల రాకమాత్రం పూర్తిగా తగ్గిపోయింది. జటప్రోలులోనే ఉన్న అగస్తేశ్వరాలయం, 19 మూకగుడుల నిర్వహణను పట్టించుకునేవారే లేరు. ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలుగొందిన ఈ ఆలయం పూర్వవైభవానికి నోచుకోవడం లేదు. మరికొన్ని ఆలయాలు ఇలా.. జిల్లాలోని పలు ఆలయాలకు చారిత్రక ప్రాశస్త్యం ఉన్నప్పటికీ సరైన ఆదరణ లేక వెలవెలబోతున్నాయి. కొల్లాపూర్ నియోజకవర్గంలోని మంచాలకట్ట వద్ద కృష్ణానది తీరాన శతాబ్దాల చరిత్ర కలిగిన రామతీర్థాలయం ధూప, దీపాలకు నోచుకోవడంలేదు. అమరగిరి సమీపంలో కృష్ణాతీరంలోనే మునులు ప్రతిష్టించిన మల్లయ్యస్వామి (మల్లయ్యసెల) గుడి పరిస్థితి కూడా ఇంతే. పెద్దకొత్తపల్లి మండలం దేవుని తిర్మలాపూర్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి రెండో తిరుపతిగా ఒకప్పుడు పేరుండేది. క్రమంగా ప్రాభవం కోల్పోతోంది. పెంట్లవెల్లి మండల కేంద్రంలోని శివాలయం, చిన్నంబావి మండలంలోని బెక్కెం సమీపాన సూర్యదేవాలయం, పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్‌లో శివాలయం, నందీశ్వరాలయం, నాగర్‌కర్నూల్ జిల్లాలోని నందివడ్డెమాన్‌లో ఆలయాలకు సరైన ఆదరణ లభించడం లేదు. -
కాల్వల సామర్థ్యం సైతం అంతంతే..
కేఎల్ఐ మొదటి డిజైన్ ప్రకారం కాల్వలను వెడల్పు చేయకుండా కుదించారు. దీంతో పంపింగ్ చేసే నీటి సామర్థ్యాన్ని తట్టుకోలేక కాల్వల కట్టలు అక్కడక్కడ తెగిపోతున్నాయి. ఎల్లూరు, జొన్నలబొగుడ, గుడిపల్లిగట్టు పంపుహౌజ్‌లలో ఉన్న ఐదు మోటార్లు 4వేల క్యూసెక్కులకు పైగా నీటిని తోడిపోస్తాయి. ఈ నీరు వెళ్లాలంటే 9మీటర్ల వ్యాసం గల కాల్వలు ఉండాలి. ప్రస్తుతం 6, 7 మీటర్లతో ఏర్పాటు చేశారు. కాల్వల నిర్మాణం కూడా మొదట్లో 20.5 మీటర్ల వెడల్పుతో నిర్మించాలని ప్రాథమికంగా అంచనా వేసి రూపొందించారు. దీన్ని 10 నుంచి 14 మీటర్ల వరకు డిజైన్ చేశారు. ఆ తర్వాత తగ్గించి తవ్విన కాల్వలో 3,200 క్యూసెక్కులు మాత్రమే పారుతోంది. దీంతో తరచుగా కాల్వలకు గండ్లు పడి పంట పొలాలు నీటమునుగుతున్నాయి.ఈ సమస్యను అధిగమించాలంటే కాల్వల ఎత్తు సైతం పెంచాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. -
ఆధారాల సేకరణలో సీసీ కెమెరాలు కీలకం
బిజినేపల్లి: రోడ్డు ప్రమాదాలు, మహిళలపై వేధింపులు, చోరీలు వంటి నేరాలకు సంబంధించిన ఆధారాల సేకరణలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. మండలంలోని ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రదేశాల్లో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను బుధవారం ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డితో కలిసి ఎస్పీ ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుతం వైర్లెస్ సీసీ కెమెరాలు వచ్చాయని.. వ్యాపార దుకాణాల వద్ద, రద్దీ ప్రదేశాల్లో తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరస్తుల్లోనూ భయం పెరుగుతుందన్నారు. ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతో అవసరమన్నారు. అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటును ప్రధాన బాధ్యతగా తీసుకోవాలని పార్టీ నాయకులకు సూచించారు. ప్రజల సురక్షిత జీవనానికి పోలీసుశాఖ చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. భవిష్యత్‌లో మరిన్ని సాంకేతిక వనరులు సమకూర్చేందుకు తనవంతు సహకారం అందిస్తా నని తెలిపారు. కాగా, నందివడ్డెమాన్‌కు చెందిన తి ప్పిరెడ్డి రాంచంద్రారెడ్డి తదితర ఎన్ఆర్ఐల సామా జిక బాధ్యతగా సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించారని ఎస్పీ తెలిపారు. అలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని మరిన్ని సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు ముందుకురావాలని కోరారు. కార్యక్రమంలో డీఏస్పీ శ్రీనివాస్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, సీఐ అశోక్‌రెడ్డి, ఎస్ఐ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
నెరవేరని లక్ష్యం..
అచ్చంపేట: ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం జలాశయం జలకళ సంతరించుకుంది. అయితే ఉమ్మడి జిల్లా వరప్రదాయిని ఎంజీకేఎల్‌ఐకి మాత్రం పూర్తిస్థాయిలో నీరు వాడుకోలేని పరిస్థితి ఉంది. కేఎల్ఐ పరిధిలోని ఎల్లూరు, సింగోటం, జొన్నలబొగుడ, గుడిపల్లిగట్టు రిజర్వాయర్ల సామర్థ్యం కేవలం 4 టీఎంసీలు మాత్రమే ఉండటంతో చివరి ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. ఈ నేపథ్యంలో అదనపు రిజర్వాయర్ల నిర్మాణం అవసరమని గుర్తించిన అధికారులు.. గత ప్రభుత్వానికి సమర్పించిన ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. ఫలితంగా ఏటా ఎగువ నుంచి కృష్ణానదికి భారీగా వరద వస్తున్నా పూర్తిస్థాయిలో వినియోగించుకోలేని దుస్థితి నెలకొంది. నిల్వ చేసేందుకు రిజర్వాయర్ల సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదు. కేఎల్ఐ పనులు డిసెంబర్ నాటికి పూర్తిస్థాయిలో చేపట్టాలని.. నాలుగు, ఐదు టీఎంసీల సామర్థ్యంగల రిజర్వాయర్ల సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక అందజేయాలని ఇరిగేషన్ అధికారులను గతేడాది సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించినా ఇప్పటి వరకు అడుగు పడలేదు. అసంపూర్తిగా పనులు.. వరదల సమయంలో 40 టీఎంసీల కృష్ణా మిగులు జలాలను వినియోగించుకునేలా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 3లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని అధికారులు చెబుతున్నా.. డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లు నిర్మించని కారణంగా ఆ స్థాయిలో నీరు అందడం లేదన్నది నగ్నసత్యం. ప్రాజెక్టులోని పలు ప్యాకేజీల పనులు ఇంకా అసంపూర్తిగానే ఉండటంతో పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. ప్రతిపాదనలకే పరిమితం.. కేఎల్ఐ కింద 47 అదనపు రిజర్వాయర్లను ప్రతిపాదించగా.. వీటిలో కేవలం 10 మాత్రమే సాధ్యమని గుర్తించారు. ఇందుకు సంబంధించి సర్వే పూర్తిచేసి.. గత ప్రభుత్వానికి నివేదిక పంపించారు. పూర్తి ఆయకట్టకు సాగునీరు అందించాలంటే కనీసం 30 టీఎంసీలు నిల్వచేసే సామర్థ్యం గల రిజర్వాయర్లు అవసరమని ఇరిగేషన్‌శాఖ అధికారులు చెబుతున్నారు. గత ప్రభుత్వం రిజర్వాయర్ల సామర్థ్యం పెంపుపై డీపీఆర్ సిద్ధం చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఇంజినీరింగ్ అధికారులు 2.14 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యం ఉన్న జొన్నలబొగుడ జలాశయాన్ని 6 టీఎంసీల వరకు, సుమారు టీఎంసీ సామర్థ్యం ఉన్న గుడిపల్లిగట్టు జలాశయాన్ని 3నుంచి 4టీఎంసీల వరకు పెంచుకోవచ్చని అంచనా వేశారు. ప్రతిపాదించిన ప్రకారం నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి పరిధిలో ఇప్పటి వరకు ఒక రిజర్వాయర్ మంజూరు చేయని ప్రభుత్వం.. 2023 మార్చి 2న వనపర్తి ప్రాంతంలో ఖిల్లాఘనపురం గణప సముద్రం చెరువును రూ. 55కోట్లతో, బుద్ధారం చెరువును రూ. 42.2 కోట్లతో రిజర్వాయర్లుగా మార్చేందుకు నిధులు మంజూరు చేసింది. దీంతో కేఎల్ఐ కింద మొదట ప్రతిపాదించిన ప్రాంతాలకు రిజర్వాయర్లు మంజూరు చేయకుండా పాలకులు చిన్నచూపు చూస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘మిషన్ భగీరథ’కు తప్పని ఇబ్బందులు.. కేఎల్ఐ మొదటి లిఫ్ట్ ఎల్లూరు రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం కేవలం 0.35 టీఎంసీలు మాత్రమే. ఈ లిఫ్ట్‌తోనే మిషన్ భగీరథకు 7.2 టీఎంసీల నీటిని సరఫరా చేయాలి. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాలతో పాటు రంగారెడ్డి జిల్లాకు తాగునీటిని సరఫరా చేస్తారు. ఇక సింగోటం రిజర్వాయర్ నీటి సామర్థ్యం 0.55, గుడిపల్లిగట్టు రిజర్వాయర్ సామర్థ్యం 0.96 టీఎంసీలు మాత్రమే. అంటే ఒక టీఎంసీ కూడా కాదు. జొన్నలబొగుడ రిజర్వాయర్‌ను 2.14టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో నిర్మించారు. మరో 20 టీఎంసీల నీటి నిల్వ కోసం ఎనిమిదేళ్లుగా ప్రతిపాదిస్తున్నా ఇప్పటి వరకు అనుమతులు రాలేదు. దీంతో చెరువులు, కుంటలను నింపి వదిలేస్తున్నారు. ఏటా డిసెంబర్ నుంచి నీటినిల్వలు తగ్గిపోతున్నాయి. అయితే ఏడాది పాటు మిషన్ భగీరథకు తాగునీరు అందించాల్సి ఉండగా.. మార్చి నుంచే కేఎల్ఐ మోటార్లకు కృష్ణా జలాలు అందడం లేదు. కృష్ణా జలాల్లో కేఎల్‌ఐకి 40 టీఎంసీల కేటాయింపు ఉన్నప్పటికీ.. 15 టీఎంసీల నీటిని మాత్రమే ఎత్తిపోస్తున్నారు. ఇందులో మిషన్ భగీరథకు ప్రతినెలా 0.6 టీఎంసీల చొప్పున 7.2 టీఎంసీల నీటిని వినియోగిస్తున్నారు. మిగిలిన 7.8 టీఎంసీలు మాత్రమే సాగునీటికి వదులుతున్నారు. దీంతో పూర్తి ఆయకట్టుకు నీరు అందడం లేదు. కృష్ణానదికి వరద వస్తున్నా.. వినియోగించుకోలేని దుస్థితి అదనపు రిజర్వాయర్ల ప్రతిపాదనలు బుట్టదాఖలు జొన్నలబొగుడ, గుడిపల్లిగట్టు జలాశయాల సామర్థ్యం పెంపుపై జాప్యం ఎంజీకేఎల్ఐ చివరి ఆయకట్టుకు అందని సాగునీరు కాల్వలపై ఆధారపడి సాగుచేస్తున్న రైతులు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి జొన్నలబొగుడ, గుడిపల్లిగట్టు రిజర్వాయర్ల సామర్థ్యం పెంపు ప్రతిపాదనలతో పాటు మరికొన్ని రిజర్వాయర్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు చేశాం. వరదల సమయంలో కేఎల్ఐ నుంచి 20 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా 10 రిజర్వాయర్లకు డిజైన్ చేశాం. వీటి మంజూరుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం వరదలు మొదలు కావడంతో కేఎల్ఐ కాల్వలకు నీటిని ఎత్తిపోస్తున్నాం. అవసరం మేరకు చెరువులు, కుంటలకు నీటిని విడుదల చేస్తాం. – మాణిక్‌ప్రభు, ఇరిగేషన్‌శాఖ ఈఈ -
వైద్యం.. దైన్యం!
నాగర్‌కర్నూల్ క్రైం: ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవం చేయించుకోవాలంటే రూ.వేలల్లో ఖర్చవుతుండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాన్పు చేయించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. తమకు సమీపంలోని పీహెచ్సీ లేదా సీహెచ్‌సీల్లో ప్రతినెలా పరీక్షలు చేయించుకోవడంతో పాటు వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తున్నారు. అయితే గర్భిణులు పురిటినొప్పులతో సమీపంలోని పీహెచ్సీ లేదా పీహెచ్‌సీకి వెళ్తే హైరిస్క్ పేరుతో జిల్లా జనరల్ ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నారు. ఫలితంగా జిల్లా ఆస్పత్రి వైద్యులపై ఒత్తిడి పెరుగుతోంది. జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటైన తర్వాత జిల్లా ఆస్పత్రిని జనరల్ ఆస్పత్రిగా మార్చారు. అయితే అందుకు అనుగుణంగా సదుపాయాలు మాత్రం కల్పించలేదు. వైద్యుల కొరత, మౌలిక సదుపాయాల లేమితో కొట్టుమిట్టాడుతున్న ఆస్పత్రిలో గర్భిణులను పరీక్షించడం.. కాన్పులు చేయడం ఇబ్బందికరంగా మారింది. ఆరు నెలల్లో 2,289 కాన్పులు.. జిల్లా జనరల్ ఆస్పత్రిలో రోజు 160 మందికి పైగా గర్భిణులు వైద్యసేవలు పొందడంతో పాటు 20 మంది వరకు సాధారణ, సిజేరియన్ కాన్పులు అవుతున్నాయి. ఆరునెలల కాలంలో సాధారణ, సిజేరియన్ డెలివరీలు 2,289 జరిగాయి. అయితే పీహెచ్‌సీల్లోనూ ప్రసవాలు చేయాల్సి ఉండగా.. ఎక్కువ శాతం హైరిస్క్ పేరుతో గర్భిణులను జిల్లా జనరల్ ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నారు. దీంతో ఇక్కడి వైద్యులపై పనిభారం పెరిగి ఒత్తిడికి లోనవుతున్నారు. ఒకే ఆపరేషన్ థియేటర్.. ప్రసవాల కోసం వచ్చే గర్భిణుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు కల్పించకపోవడం ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా మేజర్ ఆపరేషన్ థియేటర్, మైనర్ ఆపరేషన్ థియేటర్, సెప్టిక్ ఆపరేషన్ థియేటర్ ఉండాల్సి ఉండగా.. కేవలం లేబర్‌రూం, సెఫ్టిక్ ఆపరేషన్ ఽఽథియేటర్ మాత్రమే కొనసాగుతుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకే ఆపరేషన్ థియేటర్ ఉండటం.. నిత్యం అధిక సంఖ్యలో ఆపరేషన్లు చేయాల్సి వస్తుండటంతో గర్భిణులకు ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం నెలకొందని పలువురు ఆందోళన చెందుతున్నారు. వేధిస్తోన్న వైద్యుల కొరత.. అనారోగ్య సమస్యలు ఉన్నవారితో పాటు హైరిస్క్ కేసులు జనరల్ ఆస్పత్రి వస్తున్నాయి. వైద్యసేవల్లో ఏదేని అనుకోని ఘటనలు జరిగినప్పుడు ఆస్పత్రి వైద్యులపై విమర్శలు, ఆరోపణలు వస్తుండటంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ముఖ్యంగా గైనకాలజీ విభాగంలో సరిపడా వైద్యులను కేటాయించక పోవడంతో ఉన్నవారిపైనే భారం పడుతోంది. ఇద్దరు ప్రొఫెసర్లు, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, 15మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు అవసరం ఉండగా.. కేవలం ఇద్దరు రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ముగ్గురు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు మాత్రమే గర్భిణులకు సేవలు అందిస్తున్నారు. జిల్లా జనరల్ ఆస్పత్రిలో వైద్యుల పోస్టులను భర్తీ చేయడంతో పాటు మెరుగైన సదుపాయాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. హైరిస్క్ పేరుతో జిల్లా జనరల్ ఆస్పత్రికి గర్భిణుల రెఫర్ గైనకాలజీ విభాగంలో సరిపడా వైద్యులు లేక అవస్థలు మౌలిక సదుపాయాలు సైతం కరువు ప్రతినెలా 400 పైగా కాన్పులు -
ఉచిత న్యాయ సేవలు వినియోగించుకోవాలి
కల్వకుర్తి టౌన్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందించే ఉచిత న్యాయ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని ఆ సంస్థ కార్యదర్శి నసీం సుల్తానా సూచించా రు. బుధవారం పట్టణంలోని ఓల్డేజ్ హో మ్, సబ్‌జైలులో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ముందుగా ఓల్డేజ్ హోమ్ సందర్శించి సమస్య ల ను తెలుసుకున్నారు. అక్కడ కల్పిస్తున్న వసతులపై ఆరా తీశారు. వృద్ధుల కోసం వండిన ఆహారాన్ని పరిశీలించి, పలు సూచనలు చేశారు. అనంతరం సబ్‌జైలును ఆమె పరిశీలించారు. ఖైదీలతో స్వయంగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మెనూ ప్రకారం ఖైదీలకు భోజనం అందించాలని జైలు సూపరింటెండెంట్ చంద్రశేఖర్‌కు సూచించారు. ఎవరికై నా న్యాయవాదిని పెట్టుకునే ఆర్థిక స్థోమత లేకపోతే.. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున న్యాయవాదిని నియమిస్తామని తెలిపారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఓల్డేజ్ హోమ్ నిర్వాహకుడు వెంకటయ్య పాల్గొన్నారు. -
ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి
కల్వకుర్తిరూరల్: స్థానిక ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది అన్నివిధాలా సన్నద్ధం కావాలని ఆర్డీఓ శ్రీనివాసులు అన్నారు. కల్వకుర్తి పట్టణంలో మంగళవారం బూత్‌స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు తూచ తప్పనిసరిగా పాటిస్తూ ఎన్నికల నిర్వహణలో భాగస్వాములు కావాలన్నారు. ముఖ్యంగా ఓటరు జాబితాలో తప్పులు లేకుండా చూడాలన్నారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహమ్ముద్ షేక్, తహసీల్దార్ ఇబ్రహీం, ఎన్నికల డీటీ రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు. -
11న మెగా జాబ్ మేళా
కందనూలు: కల్వకుర్తి పట్టణంలోని వైఆర్ఎం డిగ్రీ కళాశాలలో ఈ నెల 11న హెచ్‌సీఎల్ టెక్నాలజీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ ఆధికారి వెంకటరమణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024–25 సంవత్సరం ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, ఒకేషనల్ పూర్తిచేసి.. 75శాతం మార్కులు సాధించిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ సర్టిఫికెట్ల జిరాక్స్‌తో ఉదయం 10 గంటలకు హాజరుకావాలని సూచించారు. మరింత సమాచారం కోసం 83176 38406, 79818 34205 నంబర్లను సంప్రదించాలని తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు కల్వకుర్తి టౌన్: విధి నిర్వహణలో వైద్యసిబ్బంది నిర్లక్ష్యం వహించరాదని డీసీహెచ్ఎస్ రామకృష్ణ అన్నారు. మంగళవారం కల్వకుర్తి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో పలు రికార్డులతో పాటు వార్డులను పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చిన ప్రజలతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. అనంతరం సూపరింటెండెంట్ కార్యాలయంలో వైద్యులు, సిబ్బందితో డీసీహెచ్ఎస్ సమావేశమై మాట్లాడారు. సీహెచ్‌సీ సిబ్బంది సమయపాలన పాటిస్తూ.. రోగులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే సిబ్బంది చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ శివరాం, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ఉన్నారు. కార్మిక వ్యతిరేక జీఓను రద్దు చేయాలి కల్వకుర్తిరూరల్: రాష్ట్ర కార్మికశాఖ విడుదల చేసిన జీఓ 282ను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు డిమాండ్ చేశారు. కార్మికుల పనివేళలను 10 గంటలకు పెంచడాన్ని నిరసిస్తూ మంగళవారం పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జీఓ ప్రతులను దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లతో కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. కార్మికులపై అదనపు భారం మోపే విధంగా జారీ చేసిన జీఓను రద్దు చేయాలని.. లేనిపక్షంలో పెద్దఎత్తున ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు బాలయ్య, బాల్‌రెడ్డి, శ్రీనివాసులు, నర్సింహ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి టోర్నీలో చాంపియన్‌గా నిలవాలి మహబూబ్‌నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ టోర్నీలో జిల్లా జట్టు మెరుగైన ప్రతిభ కనబరిచి చాంపియన్‌గా నిలవాలని ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు, జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్పీ వెంకటేశ్ అన్నారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్లో బుధవారం నుంచి నెల 12తేదీ వరకు జరిగే రాష్ట్రస్థాయి బాలికల జూనియర్ ఫుట్‌బాల్ టోర్నీలో పాల్గొనే జిల్లా జట్టు మంగళవారం తరలివెళ్లింది. ఈసందర్భంగా జిల్లా జట్టును స్థానిక మెయిన్ స్టేడియంలో ఆయన అభినందించారు. ఫుట్‌బాల్‌లో జిల్లాలో క్రీడాకారులకు కొదువలేదన్నారు. జిల్లా క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. నిరంతర ప్రాక్టీస్‌తో క్రీడల్లో ఉన్నతస్థానాల్లో చేరుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు శంకర్ లింగం, ప్రధాన కార్యదర్శి భానుకిరణ్, కోశాధికారి కేఎస్.నాగేశ్వర్, సభ్యులు నందకిషోర్, కోచ్ వెంకట్రాములు, ప్రకాశ్, లక్ష్మణ్, భార్గవి, పూజ తదితరులు పాల్గొన్నారు. జిల్లా బాలికల జూనియర్ ఫుట్‌బాల్ జట్టు: ముడావత్ నిఖిత, ఎంవీ దయాంజలి, పి.ఆనంద వర్షిణి, వినుతశ్రీ, తిరుమల రుత్విక, డి.సునీత, పాత్లవత్ ఆర్తి, ఎ.వర్ష, ఎల్.అనూష, సి.మణిదీపిక, కె.నిహారిక, ఆర్.సావిత్రి, ఎం.కీర్తి, ఆర్.పూజ, స్వాతి, కె.నిత్య, శాన్విత, నర్వ రిశితారాజ్. -
అతివల ఆర్థికాభివృద్ధికి బాటలు
అచ్చంపేట: మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అతివల ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తోందని అచ్చంపేట ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. మెప్మా ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని బీఆర్ అంబేడ్కర్ ప్రజా భవన్లో మహిళా సంఘాల సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మహిళా సాధికారిత కోసం సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. ఇందిరా మహిళాశక్తి పథకం ద్వారా మహిళలను వ్యాపార రంగంలో ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. స్వయం ఉపాధి యూనిట్లను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని మహిళా సంఘాల సభ్యులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, మార్కెట్ చైర్పర్సన్ రజిత, సీబీఎం ట్రస్టు చైర్పర్సన్ చిక్కుడు అనురాధ, మల్లేష్, కౌన్సిలర్ సునీత పాల్గొన్నారు. -
స్వచ్ఛతపై సర్వే
వెల్దండ: స్వచ్ఛ సర్వేక్షన్లో భాగంగా మంగళవారం వెల్దండ మండలం రాచూర్‌లో పరిసరాల శుభ్రతపై అధికారులు సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీడీ చంద్రశేఖర్, స్వచ్ఛ సర్వేక్షన్ జిల్లా కోఆర్టినేటర్ ఊశన్న, స్వచ్ఛ గ్రామీణ ఆర్ఐ లింగమయ్య గ్రామంలో పర్యటించి వ్యక్తిగత మరుగుదొడ్లు, తాగునీటి సరఫరా, పరిసరాల శుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. పూర్తి సర్వే అనంతరం గ్రేడింగ్ ఇవ్వనున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీడీఓ లక్ష్మణ్, మురారి, దేవేందర్, క్రాంతి, కార్యదర్శి పద్మ, నందకిషోర్, విష్ణు, మంజుల, హజిబాబా పాల్గొన్నారు. -
సామాన్యులే టారె్గట్!
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలో ఫైనాన్స్ చిట్‌ఫండ్ డిపాజిట్లు, చిట్టీల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. సామాన్యులే లక్ష్యంగా అధిక వడ్డీల ఆశ చూపుతూ నిలువునా ముంచుతున్నారు. ఏళ్ల తరబడి కష్టించి కూడబెట్టిన సొమ్మును ఫైనాన్స్ నిర్వాహకులపై నమ్మకంతో పెట్టుబడులుగా పెట్టే బాధితులు చివరకు ఉన్నదంతా కోల్పో యి నిండా మోసపోతున్నారు. జిల్లాకేంద్ర ంలో సంచలనం రేపిన సాయిరాం ఫైనాన్స్ ఉదంతం ఇంకా కొలిక్కి రావడం లేదు. నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల పరిధిలో 1,647 మంది నుంచి వివిధ రూపాల్లో డిపాజిట్లు సేకరించిన ఫైనాన్స్ నిర్వాహకులు.. డబ్బులు తిరిగి ఇవ్వకుండా చేతులెత్తేయడంతో బాధితులు నిత్యం పోలీస్‌స్టేషన్, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఫైనాన్స్ మాటున ‘రియల్’ మాఫియా.. జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు, భూములు కొని వెంచర్లు వేసేందుకు పెద్దఎత్తున డబ్బులు అవసరం కావడంతో.. కొందరు ఫైనాన్స్ కంపెనీ నిర్వాహకుల అవతారం ఎత్తారు. ప్రజల నుంచి సేకరించిన డబ్బును రియల్ ఎస్టేట్ వ్యాపారాలకోసం మళ్లించారు. అందివచ్చిన లాభాలను సొంత అవసరాలకు వినియోగించడంతో పాటు విలాసాలకు విపరీతంగా ఖర్చు చేస్తున్నారు. అయితే రెండేళ్లుగా రియల్ ఎస్టేట్ ప్రభావం తగ్గుముఖం పడుతోందని.. పెట్టుబడులంతా రియల్ వ్యాపారాల్లో ఉన్నాయని.. తామేమీ చేయలేమని బుకాయిస్తూ చేతులెత్తేయడం పరిపాటిగా మారింది. పర్యవేక్షణ ఏది.. ఫైనాన్స్ కంపెనీల నిర్వాహకులు, అనధికార వడ్డీ వ్యాపారులు విచ్చలవిడిగా దందా కొనసాగిస్తున్నా సంబంధిత అధికారుల పర్యవేక్షణ కరువైంది. జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు వడ్డీ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. తమ డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నా స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బాధితుల నుంచి ఫిర్యాదు వచ్చినప్పుడే కేసులు నమోదు చేసి.. చర్యలు తీసుకుంటే దందాకు అడ్డుకట్ట పడటంతో పాటు డబ్బుల చెల్లింపునకు అవకాశం ఉంటుంది. కానీ పదేపదే ఫిర్యాదులు అందితే కానీ కేసులు నమోదు చేయడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. అడపాదడపా కేసులు నమోదు చేసినా.. విచారణకు ఏళ్ల పాటు సమయం పడుతోంది. ఇదే అదనుగా అధికారులను మచ్చిక చేసుకుంటూ నిందితులు తప్పించుకుని తిరుగుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చిట్‌ఫండ్స్, చిట్టీల పేరుతో మోసాలు జిల్లాలో అడ్డగోలు దందా అధిక వడ్డీ ఆశతో మోసపోతున్న బాధితులు ఫైనాన్స్ కంపెనీ పేరుతో రూ. 150కోట్లు సేకరించి చేతులెత్తేసిన వైనం విచ్చలవిడిగా డిపాజిట్లు.. జిల్లాకేంద్రంలో ఫైనాన్స్ కంపెనీ నిర్వహణ పేరుతో వివిధ వర్గాల నుంచి రూ. 150కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలోని వ్యాపార, ఉద్యోగ వర్గాలతో పాటు మధ్యతరగతి వర్గాలను లక్ష్యంగా చేసుకుని విచ్చలవిడిగా డిపాజిట్లను సేకరించారు. ఇందుకు అధిక వడ్డీ రేట్ల ఆశ చూపారు. కొన్నాళ్లకు సేకరించిన డిపాజిట్లకు వడ్డీ ఇవ్వకపోవడం.. గడువు తీరినా డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో మోసపోయినట్టు గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కొందరు తమ పిల్లల చదువు, మరికొందరు తమ కూతుళ్ల పెళ్లి, భవిష్యత్‌లో అవసరాలకు పనికొస్తాయని ఇంకొందరు పెట్టుబడులు పెట్టారు. చివరకు సదరు ఫైనాన్స్ నిర్వాహకులు చేతులెత్తయడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విచారణచేపడుతున్నాం.. జిల్లాలో చిట్‌ఫండ్, చిట్టీల పేరుతో డబ్బులు సేకరించి మోసం చేసిన కేసులో బాధితుల నుంచి ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 1,500 మందికి పైగా బాధితులు ఉన్నట్టు గుర్తించాం. దీనిపై కేసు నమోదు చేసి సమగ్రంగా విచారణ చేపడుతున్నాం. – శ్రీనివాస్, డీఎస్పీ, నాగర్‌కర్నూల్ -
ఆయకట్టుకు సాగునీరు
● కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాల్వలకు నీటి విడుదల ● 4.20 లక్షల ఎకరాలకు నీరందించాలని లక్ష్యం ● అసంపూర్తి పనులతో 50శాతం ఆయకట్టు మాత్రమే సాగు ● కేఎల్ఐ ప్రాజెక్టు కాల్వల నిర్వహణపకడ్బందీగా చేపడితేనే ప్రయోజనం సాక్షి, నాగర్‌కర్నూల్: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఆయకట్టుకు నీటి విడుదల ప్రారంభమైంది. మంగళవారం కొల్లాపూర్ మండలం ఎల్లూరు పంప్‌హౌజ్ వద్ద రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి కేఎల్ఐ కాల్వలకు నీటి సరఫరాను ఆరంభించారు. ఈ సారి కృష్ణానదిలో ముందస్తు వరద ప్రవాహంతో శ్రీశైలం రిజర్వాయర్ నిండి.. బ్యాక్‌వాటర్ నీటిమట్టం పెరిగింది. పుష్కలంగా సాగునీరు అందుబాటులో ఉండటంతో ఆయకట్టు రైతులు పంటల సాగుకు సన్నద్ధమయ్యారు. బోరుబావుల కింద సాగుచేస్తున్న రైతులు ఇప్పటికే వరినార్లు, విత్తనాలు వేసుకోగా.. కాల్వల కింద సాగుచేస్తున్న రైతులు నీటి కోసం ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం ఆయకట్టుకు నీటి విడుదల చేయడంతో రైతులు పంటల సాగులో నిమగ్నమయ్యారు. లక్ష్యం 4.20 లక్షలు.. ఇచ్చేది 2.50 లక్షల ఎకరాలకే.. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో మొత్తం 4.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇప్పటివరకు చేపట్టిన పనులు, రిజర్వాయర్లు, కాల్వల నిర్మాణం మేరకు 2.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు మించి నీరందించలేని పరిస్థితి నెలకొంది. పూర్తిస్థాయిలో నీటి సరఫరా చేపట్టాలంటే.. పెండింగ్ పనులను వేగంగా పూర్తిచేయాల్సి ఉంది. అయితే కేఎల్ఐ పనులు పూర్తిచేయడంలో ఏళ్లుగా జాప్యం కొనసాగుతుండటంతో ఈ సారి సైతం పరిమితంగానే ఆయకట్టు రైతులకు నీరు అందించాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ప్రధానంగా కేఎల్ఐ విస్తరణ పనుల్లో భాగమైన 28, 29, 30 ప్యాకేజీల్లో పెండింగ్ పనులు పూర్తికాలేదు. కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ, అచ్చంపేట నియోజకవర్గంలోని ఉప్పునుంతల మండలాల్లో చివరి వరకు నీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. నెరవేరని లక్ష్యం.. కేఎల్ఐ కింద మూడు లిఫ్టుల్లో మోటార్ల ద్వారా నీటి ఎత్తిపోతలు చేపడుతున్నారు. మొదటి లిఫ్టు ద్వారా ఎల్లూరు జలాశయంతో పాటు సింగోటం రిజర్వాయర్, రెండో లిఫ్టు ద్వారా జొన్నలబొగుడ రిజర్వాయర్, మూడో లిఫ్టుతో గుడిపల్లి రిజర్వాయర్‌ను నింపాల్సి ఉంటుంది. వీటికి అనుసంధానంగా ప్రధాన కాల్వలు, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ పూర్తిస్థాయిలో చేపట్టకపోవడంతో.. ప్రస్తుతం చెరువులను మాత్రమే నింపేందుకే అధికారులు పరిమితమవుతున్నారు. ఒక్కో రిజర్వాయర్ నీటినిల్వ సామర్థ్యం సైతం ఒక టీఎంసీలోపే కావడంతో ఎక్కువ నీటిని నిల్వ చేసుకునే అవకాశం లేదు. డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్, నెట్వర్క్ చానల్స్ లేకపోవడంతో లక్ష్యం నెరవేరడం లేదు. మూడు ప్రధాన రిజర్వాయర్లలో నీరు ఖాళీ అయ్యే కొద్దీ ఎప్పటికప్పుడు మోటార్లతో నీటిని ఎత్తిపోసుకోవడం తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితి నెలకొంది. నిర్వహణలో నిర్లక్ష్యం.. ప్రాజెక్టు కింద చేపట్టిన మూడు లిఫ్టుల్లోనూ ఐదేసి మోటార్లతో నీటి ఎత్తిపోతలను చేపట్టాల్సి ఉండగా.. ప్రతిసారి రెండు మోటార్లకు మించి పని చేయడం లేదు. మిగతా మోటార్ల మరమ్మతు కోసం ఏళ్ల సమయం పడుతోంది. కృష్ణానదిలోని నీటిని తీసుకునే ఇన్‌టెక్ వద్ద సర్జ్‌పూల్ నుంచి పంప్‌హౌస్‌లోకి నీరు చేరకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఇక్కడి గేట్లకు మరమ్మతు, నిర్వహణ లేక తుప్పుపట్టి బలహీనంగా మారుతున్నాయి. సరైన నిర్వహణ లేకపోతే గేట్లు పనిచేయని పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. మోటార్ల నిర్వహణతో పాటు పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరందించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. సాగునీటికి ఇబ్బంది లేకుండా.. కేఎల్ఐ కింద ఆయకట్టుకు నీటి సరఫరా ప్రారంభమైంది. రిజర్వాయర్లను ఎప్పటికప్పుడు ఎత్తిపోతల ద్వారా నీటితో నింపేలా చర్యలు తీసుకుంటాం. ఆయకట్టు రైతులకు సాగునీటి ఇబ్బంది లేకుండా చూస్తాం. మోటార్ల మరమ్మతు, నిర్వహణ పనులు చేపడుతున్నాం. – విజయభాస్కర్‌రెడ్డి, సీఈ, నీటిపారుదల శాఖ -
చదువుతోనే ఉజ్వల భవిష్యత్
మన్ననూర్: చదువుతోనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని.. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకోవాలని అడిషనల్ కలెక్టర్ అమరేందర్ సూచించారు. మంగళవారం డీఈఓ రమేశ్‌తో కలిసి మన్ననూర్ గిరిజన ఉన్నత పాఠశాలలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులతో పాటు మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో రాజీ పడొద్దని అధికారులకు అడిషనల్ కలెక్టర్ సూచించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న వసతులపై ఆరా తీశారు. అదే విధంగా ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులతో వేర్వేరుగా సమావేశమై సమస్యలను తెలుసుకున్నారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. క్రమశిక్షణ, పట్టుదలతో చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. విద్యార్థి దశలోనే మంచి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని తెలిపారు. అంతకు ముందు గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ట్రైకార్ పథకం కింద ఏర్పాటుచేసిన శానిటరీ న్యాప్కిన్స్ తయారీ కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ పరిశీలించారు. జిల్లాలోని అన్ని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లోని విద్యార్థినులకు న్యాప్కిన్స్ పంపిణీ చేసే సామర్థ్యానికి ఎదగాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ బాలకిషన్, నర్సింహులు, హెచ్ఎం సిద్దార్థ మహదేవ్ తదితరులు ఉన్నారు. -
వైఎస్సార్ సేవలు మరువలేనివి
కొల్లాపూర్: జిల్లావ్యాప్తంగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. కొల్లాపూర్‌లోని క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ చిత్రపటానికి రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాఽభివృద్ధికి వైఎస్సార్ చేసిన కృషిని వారు కొనియాడారు. జలయజ్ఞం కార్యక్రమంతో ఎంజీకేఎల్‌ఐతో పాటు అనేక ప్రాజెక్టుల నిర్మాణాలకు ఆయన బీజం వేశారని వివరించారు. వైఎస్సార్ అమలుచేసిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిదన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
చివరలో మొండిచేయి..!
‘ఇందిరమ్మ’ఆశావహులనువెంటాడుతున్న గతం ● 20 ఏళ్ల క్రితం లబ్ధిపొందారంటూఅనర్హులుగా తేల్చివేత ● అర్హులుగా చేర్చి.. ప్రొసీడింగ్‌లు సిద్ధమైన తర్వాత రద్దు ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగాఆందోళనలో వేలాది మంది.. ● అప్పట్లో ఈ పథకంలో భారీ స్కాం.. పలువురు నేతల స్వాహా పర్వం ● తమకు తెలియకుండానే బిల్లులు మింగారని లబ్ధిదారుల గగ్గోలు ● ఆ జాబితా ప్రకారం ఏరివేయడంపై మండిపాటు కూలగొట్టిన ఇంటి వద్ద కళావతి -
కలెక్టరేట్ ప్రజావాణికి 32 అర్జీలు
నాగర్‌కర్నూల్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై 32 అర్జీలు అందాయి. ప్రజల సమస్యలను కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ తెలుసుకొని అర్జీలు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు పంపించినట్లు ఆయన తెలిపారు. ఫిర్యాదులు త్వరగా పరిష్కరించండి నాగర్‌కర్నూల్ క్రైం: పోలీసు ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆదేశించారు. సోమ వారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వ హించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ పా ల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మూడు ఫిర్యాదులు భూ తగాదాలపై, ఒకటి తగున్యాయం కోసం, మరొకటి భార్యాభర్తల గొడవపై ఫిర్యాదు అందినట్లు తెలిపారు. స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ కసరత్తు స్టేషన్ మహబూబ్‌నగర్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఎన్నికల్లో సత్తా చాటడానికి పార్టీ సన్నద్ధమవుతోంది. తెలంగాణ ఏఐసీసీ ఇన్చార్జీ మీనాక్షి నటరాజన్ ఆమోదం మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ సోమవారం ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్‌చార్జ్‌లను నియమించారు. ఈ క్రమంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఇన్చార్జ్గా పార్టీ సీనియర్ నాయకుడు, పీఏసీ సభ్యుడు జె.కుసుమకుమార్ నియామకమరు. ఎన్నికల నేపథ్యంలో గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు కమిటీల నిర్మాణం చేపట్టనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడానికి ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ కీలకపాత్ర పోషించనున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు.. రాష్ట్రంలోని వివిధ ఉమ్మడి జిల్లాలకు మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు నేతలు ఇన్‌చార్జ్‌లుగా నియామకం అయ్యారు. ఇందులో సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్‌రెడ్డి ఖమ్మం, ఏఐసీసీ కార్యదర్శి ఎస్.సంపత్‌కుమార్ నల్లగొండ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ కె.శివసేనారెడ్డి రంగారెడ్డి జిల్లాలకు ఇన్‌చార్జీగా నియమితులయ్యారు. ప్రభుత్వ బడుల్లో వసతులు కల్పించాలి అచ్చంపేట రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆర్.కృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని పలు పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలల్లో చేపట్టిన నిర్మాణ పనులను అసంపూర్తిగా వదిలేయడంతో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పెండింగ్ పనులను పూర్తిచేయడంతో పాటు విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా అన్ని ప్రాథమిక పాఠశాలల్లో పూర్వపు ప్రాథమిక విద్య ప్రవేశపెట్టాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు శంకర్, లలితాబాయి, రాములు, బాబురావు, హన్మ, రామకృష్ణ, రామచంద్రు, బీచ్య, చంద్రకళ, రేణుక, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. నేడు పీయూ మాల్‌ప్రాక్టీస్ కమిటీ భేటీ మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూ పరిధిలోని డిగ్రీ సెమిస్టర్– 2, 4, 6, ఇంటిగ్రేటెడ్ బీఈడీ 2, 4, 6 పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన విద్యార్థులు మంగళవారం పీయూ మాల్‌ప్రాక్టిస్ కమిటీ ఎదుట హాజరుకావాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రవీణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుక్ అయిన విద్యార్థుల వివరాలను ప్రిన్సిపాల్స్ మెయిల్‌కు పంపించామని, వారు తప్పకుండా ఎగ్జామినేషన్ బ్రాంచ్‌లో, మాల్ ప్రాక్టిస్ చేసినందుకు గల కారణాలపై వివరణ ఇవ్వాలని సూచించారు. -
అడిషనల్ ఎస్పీ బదిలీ
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లా అడిషనల్ ఎస్పీ రామేశ్వర్‌ను బదిలీ చేస్తూ తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్త సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2021 డిసెంబర్లో అడిషనల్ ఎస్పీగా రామేశ్వర్ బాధ్యతలు చేపట్టారు. జిల్లాలో సుదీర్ఘకాలం పనిచేసిన ఆయనకు ప్రస్తుతం రాచకొండ క్రైం అదనపు డీసీపీగా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. లేబర్ కోడ్లతో కార్మికులకు అన్యాయం నాగర్‌కర్నూల్ రూరల్: కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లతో కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పొదిల రామయ్య, ఐద్వా జిల్లా కార్యదర్శి గీత అన్నారు. లేబర్ కోడ్స్ ఆధారంగా కార్మికుల పనివేళలను 10గంటలకు పెంచడాన్ని నిరసిస్తూ సోమవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కు వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యవస్థను విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు చేస్తోందన్నారు. అందులో భాగంగానే నాలుగు లేబర్ కోడ్లు అమలు చేస్తోందన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 8గంటల పనివేళలను రద్దుచేసి.. 10గంటలకు పెంచడం కార్మికులకు తీవ్ర అన్యాయం చేయడమేనని దుయ్యబట్టారు. కొత్త చట్టాలను రద్దుచేసే వరకు కార్మికులు సమష్టిగా పోరాడాల్సిన అవసరముందన్నారు. ఈ నెల 9న నిర్వహించే సార్వత్రిక సమ్మెలో కార్మికులు పెద్దఎత్తున పాల్గొని ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా గళమెత్తాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు అంతటి కాశన్న, మధు, బ్రహ్మం, కృష్ణయ్య, వెంకటస్వామి, బాలస్వామి, సురేశ్ తదితరులు పాల్గొన్నారు. రామన్‌పాడుకు కొనసాగుతున్న ఇన్‌ప్లో మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో పూర్తి స్థాయి నీటి మట్టం 1,021 అడుగులకు గాను సోమవారం నాటికి 1,018 అడుగుల నీటి నిల్వ ఉంది. జూరాల ఎడమ, కుడి కాల్వ ద్వారా 550 క్యూసెక్కులు, సమాంతర కాల్వ ద్వార 750 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎన్టీఆర్ కాలువ ద్వారా 520 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాలువ ద్వార 45 క్యూసెక్కులు, వివిధ లిఫ్టుల ద్వారా 872 క్యూసెక్కులు, తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. -
ఆదివాసీ చెంచుల అభ్యున్నతే లక్ష్యం
మన్ననూర్: ఆదివాసీ చెంచుల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం అమ్రాబాద్ మండలం మన్ననూర్లోని గిరిజన భవన్లో ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశంలో రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డితో కలిసి ఆయన ఆదివాసీ చెంచులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. అంతకు ముందు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో ఘనస్వాగతం పలికారు. మృగవాణి రెస్టారెంట్ వద్ద కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాండ్ వైభవ్ రఘునాథ్, ఇతర జిల్లా అధికారులు మంత్రులకు పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. నాడు, నేడు ఆదివాసీ చెంచులను అక్కున్న చేరుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. కాంగ్రెస్ హయాంలోనే ఎంతో మందికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి సొంతింటి కలను సాకారం చేశామని.. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్యత తీసుకుంటుందని అన్నారు. అచ్చంపేట ప్రాంతంలోని చెంచులకు ప్రస్తుతం 836 ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. మన్ననూర్ ఐటీడీఏ పరిధిలో ఉన్న 5 జిల్లాల్లోని చెంచులతో పాటు రాష్ట్రంలోని ఐటీడీఏల పరిధిలో విడతల వారీగా 13,266 చెంచు కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఇంటి నిర్మాణ బిల్లులు రూ. 5లక్షలతో పాటు అదనంగా మరో రూ.లక్ష అందిస్తామన్నారు. ● ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. దశాబ్దాలుగా పూరి గుడిసెల్లో నివాసం ఉంటున్న ఆదివాసీ చెంచుల సొంతింటి కలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నెరవేరుస్తున్నారని అన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో మొదటి విడతగా 3,600 ఇళ్లు మంజూరయ్యాయని.. అర్హులైన ప్రతి చెంచు కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు. పూర్తిగా వెనకబడిన ఈ ప్రాంతానికి అదనంగా మరో 1,500 ఇళ్లు మంజూరు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ● ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల పథకం పేద కుటుంబాలకు పండుగ వాతావరణం తీసుకొచ్చిందన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు. కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 11,622 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేసినట్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, అచ్చంపేట నగర పంచాయతీ చైర్మన్ శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రజిత, అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయం, ఐటీడీఏ పీఓ రోహిత్‌రెడ్డి, ఆర్డీఓ మాధవి, ఐటీడీఏ ఏఓ జాఫర్ హుస్సేన్, డీఈలు వెంకటేశ్వర సింగ్, హేమలత, నాయకులు హరినారాయణ, రహీం, రవి, శ్రీనివాసులు, మేరాజ్, వెంకటరమణ, రేణయ్య, మల్లేష్, మల్లికార్జున్, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, హన్మంత్‌రెడ్డి, రాజారాం, గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం హామీలకే పరిమితం: మంత్రి జూపల్లి గత ప్రభుత్వం హామీలకే పరిమితమైంది తప్ప ఆచరణలో ఏ ఒక్క అభివృద్ధి పని చేపట్టలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. మాయ మాటలతో కాలయాపన చేసి రూ. 8లక్షల కోట్ల అప్పు రాష్ట్ర ప్రజలపై పెట్టిందని ఆరోపించారు. గత పాలకులు చేసిన అప్పును కాంగ్రెస్ ప్రభుత్వం తీరుస్తూనే.. ఏడాదిన్నర కాలంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందన్నారు. పేదరిక నిర్మూలన కోసం చేయాల్సింది ఇంకా ఎంతో ఉందన్నారు. ప్రభుత్వం ఆదివాసీ చెంచులకు అందించే ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నాడు, నేడు అక్కున్న చేర్చుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే.. ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్యత మాదే రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి -
మెప్మా ఆధ్వర్యంలో..
జిల్లావ్యాప్తంగా మహిళా సంఘాలతో 7,28,000 మొక్కలు నాటాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ మేరకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో పక్కా ప్రణాళికలు రూపొందించారు. గత నెలలోనే అన్ని పురపాలికల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మొక్కలు నాటేందుకు స్థల సేకరణ సైతం పూర్తిచేశారు. మొక్కల సంరక్షణ బాధ్యతలు నిర్వహించే మహిళా సంఘాల సభ్యులను అమృత్ మిత్రలుగా పిలవనున్నారు. అయితే మొక్కలు నాటే కార్యక్రమం ఇప్పటికే చేపట్టాల్సి ఉండగా.. వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో అడుగు పడలేదు. -
జిల్లా క్రీడాకారులు జాతీయస్థాయికి ఎదగాలి
మహబూబ్‌నగర్ క్రీడలు: ఉమ్మడి జిల్లా క్రికెట్ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఎండీసీఏ చీఫ్ ప్యాట్రన్, ప్రముఖ న్యాయవాది మనోహర్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో సోమవారం నుంచి జరిగే హెచ్‌సీఏ బి–డివిజన్ టుడే లీగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే ఎండీసీఏ ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టును ఆదివారం జిల్లాకేంద్రం పిల్లలమర్రి రోడ్డు సమీపంలోని క్రికెట్ మైదానంలో ప్రకటించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను మనోహర్‌రెడ్డి అభినందించి మాట్లాడారు. ఇటీవల జరిగిన ఇంట్రా డిస్ట్రిక్ట్ టోర్నమెంట్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు ప్రతిభచాటడం అభినందనీయమన్నారు. టుడే లీగ్‌లో మెరుగైన నైపుణ్యాన్ని ప్రదర్శించాలని కోరారు. ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ మాట్లాడుతూ వేసవిలో నిర్వహించిన ఇంట్రా డిస్ట్రిక్ట్ క్రికెట్ టోర్నమెంట్లలో గ్రామీణ క్రీడాకారులు వెలుగులోకి వచ్చారన్నారు. మొదటిసారిగా ఉమ్మడి జిల్లాలో ఇంట్రా డిస్ట్రిక్ట్ క్రికెట్ లీగ్ నిర్వహించిన హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. బీ–డివిజన్ టుడే లీగ్ చాంపియన్‌షిప్‌లో ఉమ్మడి జిల్లా క్రికెట్ గ్రూప్–బీలో ఉన్నట్లు పేర్కొన్నారు. జిల్లా జట్టు తొలి లీగ్ మ్యాచ్‌ను సోమవారం రాకేష్ లెవన్ జట్టుతో ఆడనుందన్నారు. టుడే లీగ్‌లో పది మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉమ్మడి జిల్లా జట్టుకు దక్కుతుందని, ఈ మ్యాచుల్లో క్రీడాకారులు తమ వ్యక్తిగత ప్రతిభను చాటుకోవాలని పిలుపునిచ్చారు. ఎండీసీఏ మైదానంలో రెండు లేదా టుడే లీగ్ మ్యాచ్‌లు, బీసీసీఐ మ్యాచ్ జరిగేలా హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. అనంతరం ఎండీసీఏ తరపున క్రీడాకారులను క్రీడాదుస్తులు అందజేశారు. కార్యక్రమంలో ఎండీసీఏ ఉపాధ్యక్షుడు సురేష్‌కుమార్, సభ్యుడు కృష్ణమూర్తి, కోచ్‌లు అబ్దుల్లా, ముఖ్తార్ తదితరులు పాల్గొన్నారు. ఎండీసీఏ ఉమ్మడి జిల్లా జట్టు శ్రీకాంత్– కెప్టెన్ (షాద్‌నగర్), అబ్దుల్ రాఫె బిన్ అబ్దుల్లా (మహబూబ్‌నగర్), మహ్మద్ షాదాబ్ అహ్మద్– వైస్ కెప్టెన్ (మహబూబ్‌నగర్), ఎండీ ముఖితుద్దీన్ (మహబూబ్‌నగర్), జయసింహ (పెబ్బేర్), శ్రీకాంత్ (మహబూబ్‌నగర్), అక్షయ్ (నారాయణపేట), సంజయ్ (మహబూబ్‌నగర్), ఛత్రపతి (గద్వాల), రాంచరణ్, గగన్ (నాగర్‌కర్నూల్), శశాంక్ (మహబూబ్‌నగర్), హర్షిత్, జి.కేతన్‌కుమార్, అక్షయ్ సాయి (జడ్చర్ల), జశ్వంత్ (నాగర్‌కర్నూల్) ఉన్నారు. -
పచ్చదనం పరిచేలా..
అచ్చంపేట రూరల్: పట్టణ ప్రాంతాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘ఉమెన్ ఫర్ ట్రీస్ (మహిళలతో మొక్కలు)’ కార్యక్రమంతో పచ్చదనం పెంపే లక్ష్యంగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా మొదటి విడతగా ఓ ప్రాంతాన్ని ఎంపికచేసి నాటిన మొక్కలను రెండేళ్ల వరకు సంరక్షించాలని ఆదేశాలు జారీ చేసింది. గత మేలో ఈ కార్యక్రమంపై మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించగా.. ఎక్కడ మొక్కలు నాటాలో గుర్తించే ప్రక్రియను ఇటీవల ప్రారంభించారు. 10 మంది చొప్పున.. జిల్లాలో నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ మున్సిపాలిటీలు ఉండగా.. మహిళా సంఘాల సభ్యులతో మొక్కలు నాటించేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. అందులో భాగంగా మున్సిపాలిటీల్లోని ప్రతి మహిళా సంఘంలో 10 మంది సభ్యులను ఎంపిక చేశారు. వీరు 200 చొప్పున మొక్కలు నాటాల్సి ఉంటుంది. ఒక్కో మున్సిపాలిటీలో ఒక్కొక్క సంఘం 2,000 చొప్పున మొక్కలు నాటి పెంచాలని లక్ష్యంగా నిర్దేశించారు. స్థలాలు లేని చోట కొంత వెసులుబాటు ఇచ్చారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రెండేళ్ల వరకు మొక్కల సంరక్షణ బాధ్యతలు ఎంపికై న వారే చూస్తారు. ఈ ప్రక్రియ పర్యవేక్షణ నిమిత్తం ఒక్కో పట్టణానికి నోడల్ అధికారిని సైతం నియమించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగానే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సదరు బాధ్యతల నిర్వహణ కోసం ఒకరికి రూ. 5వేల వరకు ప్రతి నెలా చెల్లిస్తారు. కార్యక్రమం విజయవంతమైతే వచ్చే ఏడాది మరిన్ని మొక్కలు నాటే అవకాశం ఉంటుంది. నాటనున్న మొక్కలు.. పండ్లు, నీడనిచ్చే వాటితో పాటు ప్రజోపయోగ మొక్కలను అధికారులు ఎంపిక చేశారు. అందులో రావి, వేప, బయో డీజిల్, ఉత్తరేణి తదితర రకాలు ఉన్నాయి. పురపాలికల్లోని ప్రధాన చెరువుల వద్ద మొక్కలు నాటాలని నిర్ణయించారు. అలాగే రద్దీ ప్రదేశాలు, పార్కులు, ప్రభుత్వ కార్యాలయాల స్థలాలు, తదితర చోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించారు. మహిళా సంఘాలకుమొక్కల సంరక్షణ బాధ్యత సరికొత్త కార్యక్రమానికి కేంద్రం శ్రీకారం ఒక్కో సంఘం 2,000 చొప్పున మొక్కలు నాటేలా ప్రణాళిక మున్సిపాలిటీల్లో ఆహ్లాదకర వాతావరణం దిశగా అడుగులు -
జంతువుల పెంపకంలో జాగ్రత్తలు తప్పనిసరి
నాగర్‌కర్నూల్: పెంపుడు జంతువులతో ప్రాణాంతక వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున.. వాటి పెంపకంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. ఆదివారం ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా జిల్లా పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో పెంపుడు జంతువులకు రేబిస్ వ్యాధినిరోధక టీకాల కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సమాజంలో చాలా మందికి పెంపుడు జంతువులపై అమితమైన ప్రేమ ఉంటుందన్నారు. ఇంట్లో కుటుంబ సభ్యుల తరహాలోనే ప్రేమాభిమానాలతో పెంచుకుంటారని.. పెంపుడు జంతువులకు చిన్నపాటి హాని జరిగినా విలవిల్లాడిపోతారన్నారు. అయితే జంతువుల పెంపకంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని సూచించారు. జంతువులు, పక్షుల నుంచి జూనోసిస్ వ్యాధులైన రేబిస్, బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ వంటివి మనుషులకు సంక్రమిస్తాయన్నారు. పెంపుడు జంతువులతో జాగ్రత్తగా ఉండటం, పరిశుభ్రత పాటించడం, టీకాలు వేయించడం ద్వారా జూనోసిస్ వ్యాధులను నివారించవచ్చని అన్నారు. ప్రజారోగ్య సంరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలన్నారు.జూనోసిస్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యాంటీ రేబిస్ టీకాను కోర్సు ప్రకారం కుక్కలకు వేయించాలని కలెక్టర్ సూచించారు. కాగా, రేబిస్ వ్యాధి సోకకుండా ముందుజాగ్రత్తగా పెంపుడు జంతువుల యజమానులతో పాటు పశువైద్యులు, సిబ్బందికి టీకాలు వేశారు. అనంతరం అధికారులతో కలిసి కలెక్టర్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి బి.జ్ఞాన శేఖర్, వైద్యారోగ్యశాఖ ఇమ్యునైజేషన్ అధికారి రవినాయక్ తదితరులు పాల్గొన్నారు. ప్రాణాంతక వ్యాధుల నివారణకు టీకాలు వేయించాలి కలెక్టర్ బదావత్ సంతోష్ -
కొనసాగిన కేంద్ర బృందం పర్యటన
వనపర్తి రూరల్: పెబ్బేరు, శ్రీరంగాపురం మండలాల్లో ఆదివారం కేంద్ర బృందం 28వ కమిటీ నీతి ఆయోగ్ ఉప కార్యదర్శి అర్వింద్‌కుమార్, సెంట్రల్ వాటర్ కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ అరుణ్‌కుమార్, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు శాస్త్రవేత్త యాదయ్య పర్యటించారు. కంచిరావుపల్లి, తాటిపాముల, కంభాళాపురం శివారులోని భీమా 15వ ప్యాకేజీలోని ప్రధాన, మైనర్ కాల్వలు, కంభాళాపురం తండా 27 ప్యాకేజీలోని 18/19 కాల్వ 7ఆర్ మైనర్ కాల్వను, శ్రీరంగాపురం రంగసముద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడి సాగునీటి సరఫరా ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. కాల్వల్లో జమ్ము, పూడిక పేరుకుపోవడంతో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందడం లేదని రైతులు వివరించారు. ఫీడర్ ఛానల్, డిస్ట్రిబూష్యన్ షట్టర్లు, కాల్వల వెడల్పు పెంచడం, లైనింగ్ సరిగా లేదని జెడ్పీ మాజీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు సబిరెడ్డి వెంకట్‌రెడ్డి, వెంకట్రామారెడ్డి రైతులతో కలిసి కేంద్ర బృందానికి సమస్యల వినతిపత్రం అందజేశారు. వారి వెంట ఇరిగేషన్ సీఈ సత్యనారాయణరెడ్డి, ఎస్సీ శ్రీనివాస్‌రెడ్డి, ఈఈ కేశవరావు, డీఈ కిరణ్‌కుమార్, డీసీసీ అఽధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌యాదవ్, ఏఈలు, ఇతర అధికారులు ఉన్నారు. -
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
నాగర్‌కర్నూల్: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సోమవారం అమ్రాబాద్ మండలం మన్ననూర్‌లో పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని మంత్రి నివాసం నుంచి ఉదయం 8గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి.. 10:30 గంటలకు మన్ననూర్ మృగవాణి అతిథిగృహానికి చేరుకొని స్థానిక రెవెన్యూ అంశాలపై అధికారులతో చర్చిస్తారన్నారు. అనంతరం అమ్రాబాద్ బీటీరోడ్డు నిర్మాణానికి, గిరిజన భవనం ప్రహరీ నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అనంతరం ఆదివాసీ చెంచులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేస్తారన్నారు. మంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జాప్యం లేకుండా విద్యుత్ కనెక్షన్లు నాగర్‌కర్నూల్ క్రైం: కొల్లాపూర్ నియోజకవర్గంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటులో ఎలాంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్ఈ సీహెచ్ పౌల్రాజ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ కనెక్షన్లు, ట్రాన్స్ఫార్మర్ల కోసం డీడీలు చెల్లించిన రైతులకు మెటీరియల్ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉందన్నారు. సీనియార్టీ ప్రకారం రైతులకు మెటీరియల్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 1వ తేదీ వరకు 200 మంది రైతులకు మంజూరైన ట్రాన్స్ఫార్మర్లు బిగించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇప్పటికే ఆయా మండలాల్లోని సబ్స్టేషన్లలో ట్రాన్స్ఫార్మర్లు అందుబాటులో ఉన్నాయని.. 11కేవీ పనులు పూర్తయిన వెంటనే వాటిని బిగిస్తామని తెలిపారు. మైసమ్మ జాతరలోతగ్గిన భక్తుల రద్దీ పెద్దకొత్తపల్లి: నాయినోనిపల్లి మైసమ్మ జాతరలో భక్తుల రద్దీ తగ్గింది. ఆదివారం తొలి ఏకాదశి, మొహర్రం పండుగ ఉండటంతో భక్తులు తక్కువ సంఖ్యలో వచ్చారు. దీంతో జాతర మైదానం వెలవెలబోయింది. సుమారు 3వేల మంది భక్తులు మైసమ్మ దేవతను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. కోయిల్‌సాగర్‌లో 22.6 అడుగుల నీటిమట్టం దేవరకద్ర: కోయిల్‌సాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం ఆదివారం సాయంత్రం వరకు 22.6 అడుగులకు చేరింది. కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకంలో భాగంగా జూరాల నుంచి ఒక పంపును రన్ చేసి నీటిని విడుదల కొనసాగిస్తున్నారు. గత నెల రోజులుగా ప్రాజెక్టులోకి వస్తున్న నీటితో రోజుకు కొంత మేర నీటిమట్టం పెరుగుతోంది. జూరాల నుంచి నీరు రాక ముందు 11 అడుగులు ఉండగా.. 11.6 అడుగులు పెరిగి 22.6 అడుగులకు చేరింది. అయితే పాత అలుగు స్థాయి 26.6 అడుగులు కాగా.. మరో 4 అడుగుల నీరు రావాల్సి ఉంది. ఇక ప్రాజెక్టు పూర్తిస్థాయి గేట్ల లెవల్ వరకు 32.6 అడుగులు ఉండగా మరో 10 అడుగుల నీరు చేరితే ప్రాజెక్టు పూర్తిగా నిండుతుంది. బకాయిలు విడుదల చేయాలి కందనూలు: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకుడు తారాసింగ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిగ్రీ కళాశాలల విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. -
ఇంటర్ పాఠ్యపుస్తకాలు అందేదెన్నడో?
కందనూలు: కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ అభ్యసిస్తున్న విద్యార్థినులకు పాఠ్యపుస్తకాలు నేటికీ అందలేదు. ఇంటర్ తరగతులు ప్రారంభమై నెలరోజులకు పైగా అయినప్పటికీ పాఠ్యపుస్తకాలు అందించకపోవడం విద్యాభ్యాసంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అధ్యాపకులు ఏ పాఠం చెబుతున్నారో.. తాము ఏం చదవాలో.. ఏం రాయాలో అర్థంకాక విద్యార్థినులు అయోమయానికి గురవుతున్నారు. కొందరు పాత పుస్తకాలతో నెట్టుకొస్తున్నారు. అయితే కొత్త కోర్సుల్లో చేరిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బాలికా విద్య బలోపేతం, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు మధ్యలోనే చదువు మానేయకుండా నిరోధించేందుకు ఏర్పాటైన కస్తూర్బా, ఆదర్శ విద్యాలయాలకు పాఠ్యపుస్తకాలు అందకపోవడం గమనార్హం. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లాలో 20 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు ఉండగా.. గతేడాది 11, ఈ ఏడాది 9 కేజీబీవీల్లో ఇంటర్ విద్య ప్రవేశపెట్టారు. ఈ విద్యా సంవత్సరం 1,926 మంది విద్యార్థినులకు ప్రవేశాలు కల్పించారు. వీరిలో ప్రథమ సంవత్సరం 1,200 మంది, రెండో సంవత్సరం 796 మంది విద్యార్థినులు ఉన్నారు. అదే విధంగా కోడేరు, వెల్దండలోని ఆదర్శ విద్యాలయాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి మొత్తం 346 మంది విద్యనభ్యసిస్తున్నారు. నాగర్‌కర్నూల్, లింగాల, కొల్లాపూర్, వెల్దండ, చారకొండ, పెంట్లవెల్లి, అమ్రాబాద్ కేజీబీవీల్లో ఎంపీసీ, బైపీసీ కోర్సులు ఉండగా.. బిజినేపల్లి, తెలకపల్లి, కల్వకుర్తి, బల్మూర్, తాడూర్, తిమ్మాజిపేట, ఉప్పునుంతల, వంగూర్ కేజీబీవీల్లో సీఈసీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సులు ఉన్నాయి. అచ్చంపేట, కోడేరు, పెద్దకొత్తపల్లి, ఊర్కొండ, పదరలో ఏఐ, ఎంపీహెచ్‌డబ్ల్యూ, కంప్యూటర్ సైన్స్, అకౌంటింగ్ కోర్సులు కొనసాగుతున్నాయి. ప్రతి కోర్సులో 40 మంది విద్యార్థినులు చదువుకునే అవకాశం ఉంది. ఆయా కోర్సుల్లో చేరిన వారికి ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించాల్సి ఉండగా.. ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటి వరకు ఒక్క కొత్త పాఠ్యపుస్తకం కూడా అందలేదు. దీంతో కొన్ని విద్యాలయాల్లో పాత పుస్తకాలతో బోధన కొనసాగిస్తున్నారు. అయితే ఈ సంవత్సరం కొత్తగా ప్రవేశపెట్టిన ఏఐ, ఇతర కోర్సుల పాఠ్యపుస్తకాలు లేకుండా విద్యార్థినులకు బోధన ఎలా సాగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి విద్యార్థినులకు పాఠ్యపుస్తకాలు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. కేజీబీవీ, ఆదర్శ విద్యాలయాల్లో అరకొర అభ్యాసనం ఇంటర్ విద్యార్థినులకు పుస్తకాల పంపిణీలో జాప్యం పాత పుస్తకాలతోనే నెట్టుకొస్తున్న వైనం కొత్త కోర్సుల్లో చేరిన వారి పరిస్థితి అగమ్యగోచరం -
రైతు సేవలే లక్ష్యం
సహకార రంగాలఅభివృద్ధికి పటిష్ట చర్యలు ● త్వరలో అందుబాటులోకి మొబైల్ బ్యాంకింగ్ ● విద్యా రుణాలకు పెద్దపీట.. ఆశాజనకంగా వసూళ్లు ● రుణమాఫీతో 34,731 మంది రైతులకు ఊరట ● నేడు అంతర్జాతీయ సహకార దినోత్సవం మహబూబ్‌నగర్ (వ్యవసాయం): ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రైతు సేవలే లక్ష్యంగా సహకార రంగ అభివృద్ధికి పాలక మండలి, అధికారులు కృషి చేస్తున్నారు. సింగిల్ విండో సొసైటీలు, డీసీసీబీ బ్రాంచ్‌ల ద్వారా రైతుల మేలు కోసం ఆర్థిక లావాదేవీలపై సంబంధిత శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇస్తూ రైతులను చైతన్య పరుస్తున్నారు. శనివారం అంతర్జాతీయ సహకార దినోత్సవం నేపథ్యంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా షెడ్యూల్ ప్రకారమే ఏడాది పొడవునా సహకార దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 78 సింగిల్ విండో సొసైటీలు, 22 డీసీసీబీ బ్రాంచ్‌లు పనిచేస్తున్నాయి. వీటి కింద అనేక మంది సభ్యత్వం కలిగి ఉన్నారు. రైతుల ఆర్థిక పరిపుష్టి కోసం ఇటు బ్యాంకులు.. అటు సొసైటీలు పరస్పర సహకారంతో కృషి చేస్తున్నాయి. సహకార శాఖ రాష్ట్ర కమిషనర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం అంతర్జాతీయ సహకార దినోత్సవం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే జిల్లాలో రైతు చైతన్య కార్యక్రమాలు షెడ్యూల్ విడుదల చేశారు. ఇక మహబూబ్‌నగర్ జిల్లాలో మార్చి 22 నుంచి ఇక్కడి సింగిల్ విండో పర్సన్ ఇన్చార్జిలు, అధికారులు రైతు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు, ప్రగతిపై నివేదిక జిల్లాలో సహకార బ్యాంకులు, సింగిల్ విండో సొసైటీలు వాటి పరిధిలో జరిగే ఆర్థిక లావాదేవీలు, ప్రగతిపై డీసీసీబీ అధికారులు ప్రణాళిక రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీతోపాటు స్వల్పకాలిక, దీర్ఘకాలిక పంట రుణాలు, విద్యా రుణాలు, గ్రామీణ గృహ రుణాలు, కర్షకమిత్ర రుణాలు, రుణ వసూళ్లపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఖాతాదారుల సౌకర్యం కోసం రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా అనుమతితో మొబైల్ బ్యాంకింగ్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఖాతాదారుల లావాదేవీలు సులభతరం, సమయాన్ని ఆదా చేసుకోవడం, డిజిటల్ లావాదేవీలతో బ్యాంకు సమర్థత పెంచుకోవడానికి ఉపయోగపడే విధంగా అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. విదేశీ విద్యకు చేయూత రైతు కుటుంబాల్లో ఉన్నత విద్య చదవాలనే ఆసక్తి కలిగిన పిల్లలకు డీసీసీబీ తరపున ప్రత్యేకంగా విద్యా రుణాలు అందిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రైతుల పిల్లలకు స్వదేశీ, విదేశీ విద్యా రుణాలు అందించేందుకు పాలక మండలి ప్రత్యేకంగా రుణాల పాలసీ ప్రకటించింది. ఒక్కో విద్యార్థికి కనీసం రూ.35 లక్షలు ఇచ్చేందుకు నిర్ణయించారు. 2024 ఏప్రిల్ 1 నుంచి 2024 నవంబర్ 30 వరకు మొత్తం 79 మంది విద్యార్థులకు రూ.3.82 కోట్ల రుణాలు అందజేశారు. -
విద్యార్థులకు ఇబ్బందులు కలిగించొద్దు
మన్ననూర్: పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ దేవసహాయం అన్నారు. శుక్రవారం ఆయన మన్ననూర్లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికలు, పీటీజీ పాఠశాల/కళాశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల ప్రిన్సిపాళ్లు రూపాదేవి, పద్మావతి, ఉపాధ్యాయులు, సిబ్బందితో కలిసి అక్కడి పరిసరాలను కలియదిరిగారు. విద్యా బోధన, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాంలు అందరికీ అందించారా.. అని ఆరాతీశారు. వసతి గృహం, పాఠశాలలో విద్యార్థుల సమస్యలు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యార్థులు రాత్రి సమయంలో పడుకునేందుకు మంచాలు, కొన్ని అదనపు టాయిలెట్స్ నిర్మాణాలు అవసరమని ప్రిన్సిపాల్ రూపాదేవి అదనపు కలెక్టర్ దృష్టికి తేగా స్పందించిన ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమకూర్చేందుకు కృషిచేస్తానన్నారు. వైస్ ప్రిన్సిపాల్ సరిత, డీఎల్పీఓ వెంకటప్రసాద్, మండల వ్యవసాయాధికారికారి మహేష్‌రెడ్డి, గ్రామ కార్యదర్శి భీముడు పాల్గొన్నారు. -
ప్రతి చెంచుకు శాశ్వత గృహాలు
నాగర్‌కర్నూల్: ఆశ్రమ పాఠశాలలు, గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో మెరుగైన సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్య అందించాలని, చెంచుపెంటల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో చెంచుల ఇళ్ల నిర్మాణాలు, గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల విద్య, సదుపాయాలపై ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రోహిత్ గోపిడితో కలిసి ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపల్, వార్డెన్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఇతర అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఎనిమిది మండలాల పరిధిలో ఉన్న చెంచులకు శాశ్వత గృహాల మంజూరు నిర్మాణానికి వేగవంతంగా చర్యలు తీసుకోవాలన్నారు. చెంచు పెంటల్లో ఇది వరకే గుర్తించిన అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల నిర్మాణాలు అత్యంత పారదర్శకంగా అమలుచేయాలన్నారు. చెంచులు ఎవరు కూడా శాశ్వత గృహాలు లేకుండా ఉండరాదని, రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంగా ఇళ్ల నిర్మాణాలను చేపట్టిందని, అదే స్ఫూర్తితో జిల్లాలో అధికారులు పనిచేయాలన్నారు. అలాగే జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం తదితర సమస్యలను గుర్తించడానికి ఒక్కొక్క వసతి గృహానికి ఒక ప్రత్యేకాధికారిని నియమించామన్నారు. ఆశ్రమ, గిరిజన వసతి గృహాలను తప్పనిసరిగా ప్రభుత్వం ప్రకటించిన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. చెంచు గిరిజన విద్యార్థులకు మెరుగైన వసతులతో పాటు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రిన్సిపల్ లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఆశ్రమ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు సమయపాలన పాటించి విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని, అప్పాపూర్ చెంచు పెంటలోని ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న హెచ్ఎం ఆంజనేయులును ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు, నాలుగు జతల ఏకరూప దుస్తులు, నోట్ పుస్తకాలు, దుప్పట్లు, టవల్స్, ట్రంకు బాక్సులు, షూలు పంపిణీ చేశారా.. అని పాఠశాలల వారీగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీపురంలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ బాలుర రెసిడెన్షియల్ గురుకుల కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందించే వసతులు, ఉపాధ్యాయుల హాజరు, భోజన సౌకర్యం తదితర అంశాలను పరిశీలించారు. -
ఎక్కడి రైళ్లు అక్కడే..!
● బోయపల్లి గేట్ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు ● 4 గంటల పాటు పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ● నిలిచిపోయిన హంద్రీ, బెంగ ళూరు, చైన్నె ఎగ్మోర్, ఔరంగాబాద్ ఎక్స్‌ప్రెస్, వందే భారత్ రైళ్లు ● తీవ్ర అవస్థలు పడిన ప్రయాణికులు ● రాత్రి 10 గంటల తర్వాత రైళ్ల పునరుద్ధరణ స్టేషన్ మహబూబ్‌నగర్/ మదనాపురం/ జడ్చర్ల టౌన్ : జిల్లాకేంద్రంలోని రైల్వేస్టేషన్ నుంచి బోయపల్లి రైల్వే గేటు సమీపంలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. రామగుండం నుంచి ఎరువులతో తమిళనాడు వెళుతున్న గూడ్స్ రైలుకు సంబంధించిన ఒక బోగి శుక్రవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో పట్టాలు తప్పడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో హైదరాబాద్ – బెంగళూరు మార్గంలో ఎక్కడికక్కడ రైళ్లను నిలిపివేశారు. హైదరాబాద్ కాచిగూడ నుంచి యాక్షన్ రిలీఫ్ ట్రైన్ (ఏఆర్టీ)ను తెప్పించి.. మరమ్మతులు చేసి రాత్రి 10 గంటల తర్వాత రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. కాగా.. దాదాపు నాలుగు గంటల పాటు వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. రైల్వే స్టేషన్లలో పడిగాపులు కాశారు. సౌత్ సెంట్రల్ రైల్వే హెల్ప్ లైన్ నంబర్లు, డెస్క్‌లను ఏర్పాటు చేసింది. కర్నూలు వైపు వెళుతున్న హంద్రీ ఎక్స్‌ప్రెస్‌ను జడ్చర్ల రైల్వే స్టేషన్లో, చెంగల్పట్టు (చైన్నె ఎగ్మోర్) దివిటిపల్లి వద్ద, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ను (తిమ్మాపూర్) వద్ద, కాచిగూడ–మైసూరు (బెంగుళూరు ఎక్స్‌ప్రెస్)ను బాలానగర్ స్టేషన్లో, వందేభారత్ డోకూరు స్టేషన్లో, ఔరంగాబాద్ ఎక్స్‌ప్రెస్ కౌకుంట్ల స్టేషన్లో, యశ్వంత్‌పురా వందేభారత్, రాయచూర్ డెమో రైళ్లను మదనాపురం స్టేషన్లో, అలోక్ స్పెషల్ కర్నూలులో, గూడ్స్ రైలును గొల్లపల్లి స్టేషన్లో నిలిపివేశారు. రైళ్ల రాకపోకలు ఆలస్యం అవుతాయని గుర్తించి హంద్రీ ఎక్స్‌ప్రెస్‌లో 70 శాతం మంది ప్రయాణికులు వెళ్లిపోయారు. ఆటోల్లో బస్టాండ్‌కు చేరుకుని అక్కడి నుంచి కర్నూలుకు వెళ్లారు. వెంకటాద్రి, బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌లలోని ప్రయాణికులు ఇళ్లకు వెళ్లిపోగా..గుంటూరు రైలుకు వచ్చే ప్రయాణికులు స్టేషన్లోనే పడిగాపులు కాశారు. దివిటిపల్లి, మదనాపురం, కౌకుంట్ల స్టేషన్లలో రైళ్లను నిలిపివేయడం వల్ల తిండి లేక చిన్న పిల్లలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఇబ్బందులు పడ్డారు. వనపర్తి రైల్వేస్టేషన్లో నిలిచిన వందేభారత్, రాయచూర్ డెమో రైళ్లు రైలులో జ్వరంతోనే.. ఎమ్మిగనూరు గంజిల గ్రామానికి చెందిన కె.లక్ష్మి అనారోగ్యంతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిశ్చార్జి అయి స్వగ్రామానికి వెళ్లేందుకు భర్త పెద్దలింగన్నతో కలపి హంద్రీ ఎక్స్‌ప్రెస్ ఎక్కింది. జడ్చర్ల స్టేషన్లో రైలు నిలవటంతో ఇబ్బందులు పడ్డారు. జ్వరం రావడంతో మాత్రలు వేసుకుని రైలులోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. మూడు నెలల తర్వాత ఇంటికి వెళ్దామంటే ఇలా ఇబ్బందులు వస్తాయని అనుకోలేదని ఆ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యలో నిలిపేస్తే ఎలా..? కొన్నేళ్ల క్రితం గొంతుకు శస్త్రచికిత్స అయ్యింది. అందుకే ఎక్కువ సేపు రైలులో ఉండలేనందున బస్సుకు వెళ్దామని పోతున్న. రైళ్ల రాకపోకలు ఇబ్బంది కలిగినప్పుడు బస్సు సౌకర్యం కల్పిస్తే బాగుంటది. ఇలా మధ్యలో రైళ్లు నిలిపివేస్తే ఎలా.? – శివమూర్తి, కర్నూలు -
దండిగా నిధులు.. ఊరంతా పనులు
సీఎం స్వగ్రామంలో ఎక్కడ చూసినా అభివృద్ధి పనుల కోసం చేపట్టిన నిర్మాణాలే కనిపిస్తున్నాయి. ఇప్పటికే గ్రామ పంచాయతీ భవనం పూర్తికాగా.. ప్రధాన రహదారులు, అంతర్గత, సీసీ రోడ్ల పనులు కొనసాగుతున్నాయి. కొండారెడ్డిపల్లి నుంచి పోల్కంపల్లి వద్దనున్న హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారి వరకు రోడ్డును సైతం నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. ఇందుకోసం రూ.33 కోట్లు కేటాయించారు. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, మిషన్ భగీరథ, విద్యుత్ శాఖల ఆధ్వర్యంలో పెద్దఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రధానంగా పాలశీతలీకరణ కేంద్రం, వెటర్నరీ ఆస్పత్రి, గ్రామ పంచాయతీ, రైతు వేదిక ఆధునీకరణ, లైబ్రరీ, బీసీ, ఎస్సీ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, చిల్డ్రన్స్ పార్కు, ఓపెన్ జిమ్, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీలు, సెంట్రల్ లైటింగ్, ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు, గ్రామం నుంచి మండల కేంద్రానికి, ఇతర గ్రామాలకు అనుసంధానంగా నాలుగు వరుసల రహదారులు, ఇంటింటా మిషన్ భగీరథ నీటి సౌకర్యం, సోలార్ విద్యుత్ ఏర్పాటు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కొనసాగుతున్న అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు -
ఆర్బీఐ అనుమతితో..
వాణిజ్య బ్యాంకులకు ధీటుగా సహకార బ్యాంకులను అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో త్వరలో సహకార బ్యాంకుల పరిధిలో మొబైల్ బ్యాంకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. ఆర్బీఐ అనుమతితో వినియోగదారులందరికీ మొబైల్ బ్యాంకింగ్‌తోపాటు యూపీఐ సేవలు అందుబాటులోకి తీసుకువస్తాం. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31 నాటికి రూ.1,800 కోట్ల బిజినెస్ టర్నోవర్ లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే బ్యాంకు డిపాజిట్లు రూ.400 కోట్లకు చేరుకున్నాయి. – మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి, చైర్మన్, డీసీసీబీ34,731 మందికి మేలు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ పథకం–2024 కింద డీసీసీబీ పరిధిలో అనేక మందికి ప్రయోజనం కలిగింది. ఈ బ్యాంకు ద్వారా రూ.2 లక్షల వరకు స్వల్పకాలిక రుణాలు అర్హత కలిగిన 68,495 మంది సభ్యులకు గాను రూ.47,684.81 లక్షల రుణం పొందారు. ఇందుకు సంబంధించి 2024 నవంబర్ నాటికి మూడు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసింది. దీంతో రూ.2 లక్షల రుణం కలిగి ఉన్న 34,731 సభ్యులకు రూ.20,639.30 లక్షల రుణమాఫీ జరిగింది. ● -
అభివృద్ధి జోరు..
సీఎం రేవంత్‌రెడ్డి స్వగ్రామంలో పనులు వేగవంతం ●గ్రామానికి అన్ని హంగులు.. మా గ్రామానికి చెందిన ఎనుముల రేవంత్‌రెడ్డి సీఎం కావడం మాకెంతో గర్వకారణం. ఇప్పటికే గ్రామంలో అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. వెటర్నరీ ఆస్పత్రి, పాలశీతలీకరణ కేంద్రం, బస్టాండ్, పంచాయతీ భవనాలతోపాటు రోడ్లతో గ్రామం రూపురేఖలు మారుతున్నాయి. – వేమారెడ్డి, కొండారెడ్డిపల్లి, వంగూరు మండలం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ.. కొండారెడ్డిపల్లిలో అన్ని అభివృద్ధి పనులను సమాంతరంగా పూర్తిచేస్తున్నాం. ఇప్పటికే కొన్ని భవన నిర్మాణాలు, సీసీరోడ్లు, సోలార్ విద్యుత్ ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. పనులను ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నాం. దసరా నాటికి పనులను పూర్తి చేసేలా వేగం పెంచాం. – దేవసహాయం, ఇన్చార్జ్ అధికారి, అదనపు కలెక్టర్ సాక్షి, నాగర్‌కర్నూల్/ వంగూరు: సీఎం రేవంత్‌రెడ్డి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో విస్తృతంగా చేపట్టిన అభివృద్ధి పనులు కొన్ని రోజులుగా వేగం పుంజుకున్నాయి. జిల్లాలోని వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో తొలి విడతలో ఇప్పటికే సుమారు రూ.150 కోట్ల నిధులతో పెద్దఎత్తున అభివృద్ధి పనులను చేపట్టగా.. మరోవిడత అభివృద్ధి పనుల ప్రతిపాదనలకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం గ్రామంలో ఎక్కడ చూసినా అధునాతన భవనాలు, రోడ్ల విస్తరణ, సుందరీకరణ ఇతరత్రా అభివృద్ధి పనుల హడావుడే కనిపిస్తోంది. ఆయా పనుల పర్యవేక్షణకు ఇన్చార్జ్గా జిల్లా అదనపు కలెక్టర్ దేవసహాయంను ప్రభుత్వం నియమించింది. ఈ క్రమంలోనే దసరా పండుగకు సీఎం రేవంత్‌రెడ్డి తన సొంత గ్రామంలో పర్యటించనున్న నేపథ్యంలో ఈలోపే ప్రధాన పనులను పూర్తిచేసేలా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ తర్వాత ఇక్కడే.. కొండారెడ్డిపల్లిలో ఇంటింటికీ సోలార్ విద్యుత్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. గ్రామంలోని మొత్తం 515 ఇళ్లకు గానూ ఇప్పటి వరకు 405 ఇళ్లలో సోలార్ విద్యుత్ ఏర్పాటు చేశారు. ఇంటిపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుదుత్పత్తి చేసి, తమ అవసరాలకు వినియోగించుకోవడమే కాక మిగులు విద్యుత్‌ను ఎస్పీడీసీఎల్కు విక్రయించుకునేలా గ్రిడ్‌కు అనుసంధానం చేస్తున్నారు. ఈ ప్రక్రియ కేబుల్ వైర్లను స్తంభాలకు కాకుండా అండర్ గ్రౌండ్ కేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ తర్వాత ఇక్కడే ప్రభుత్వం అండర్ గ్రౌండ్ కేబుళ్లను గ్రామంలో ఏర్పాటు చేస్తుంది. మారనున్న ముఖచిత్రం.. కొండారెడ్డిపల్లిలో చేపట్టిన అభివృద్ధి పనులతో గ్రామ ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది. పెద్దఎత్తున నిధులు వెచ్చించి విస్తృతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నారు. గ్రామంలోని అన్ని కాలనీలకు అంతర్గత సీసీరోడ్లు, ఎల్ఈడీ సెంట్రల్ లైటింగ్, విశాలమైన రహదారులు, అధునాతన ప్రభుత్వ భవనాలు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీలు, ఇంటింటా సోలార్ వెలుగులు, గ్రామం చుట్టూ సుందరీకరణ పనులతో మెరిసిపోయేలా అధికారులు తీర్చిదిద్దుతున్నారు. కొండారెడ్డిపల్లిలో ప్రధానంగా చేపట్టిన పనుల వివరాలు పనులు నిధులు (రూ.కోట్లలో) రహదారుల విస్తరణ 21 మిషన్ భగీరథ పైప్‌లైన్ 31.1 అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ, ఎస్టీపీ 9.30 అంతర్గత సీసీ రోడ్లు 8.70 విద్యుత్ ఫీడర్ల ఏర్పాట్లు 2.85 పాలశీతలీకరణ కేంద్రం 2.50 గ్రామ పంచాయతీ భవనం 0.72 బీసీ కమ్యూనిటీ హాల్ 0.58 గ్రంథాలయం 0.55 వెటర్నరీ ఆస్పత్రి భవనం 0.45 ఎల్ఈడీ లైట్లు 0.40 చుట్టూరా సుందరీకరణతో మెరిసిపోయేలా కొండారెడ్డిపల్లి మొదటి విడతలో సుమారు రూ.150 కోట్లు కేటాయింపు అధునాతన భవనాలు, రోడ్ల విస్తరణతో మారుతున్న రూపురేఖలు ఈ దసరాలోగా పూర్తి చేసేందుకు అధికారుల కసరత్తు -
కాంగ్రెస్‌లో కష్టపడిన వారికే పదవులు
కందనూలు: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడిన వారికే పదవులు దక్కుతాయని, కాంగ్రెస్ పార్టీ కోసం గ్రామీణ స్థాయిలో పనిచేస్తున్న యువజన కాంగ్రెస్ లీడర్లకే అవకాశం ఉంటుందని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన యూత్ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్‌రెడ్డితో కలిసి పాల్గొని మాట్లాడారు. దేశంలో ఏ పార్టీలో లేని స్వేచ్ఛ కాంగ్రెస్‌లో ఉంటుందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని కాంగ్రెస్ పార్టీ యువజన సంఘం నేతలు కష్టపడితేనే వారికి పదవుల రూపంలో ప్రతిఫలం దక్కుతుందన్నారు. ఇందుకోసం పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలన్నారు. ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి మాట్లాడుతూ గల్లీలో పార్టీ కోసం కష్టపడితేనే ఢిల్లీలో అధికారం వచ్చే అవకాశం ఉంటుందన్నారు. యువజన కాంగ్రెస్ వల్లే తాను గెలిచినట్లు గుర్తు చేశారు. సోషల్ మీడియా వారియర్లుగా యువజన కాంగ్రెస్ లీడర్లు ఎదగాలని, అందుకు తన సంపూర్ణ సహకారం అందిస్తానన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్‌రెడ్డి మాట్లాడుతూ రాబోయే పంచాయతీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలన్నారు. సోషల్ మీడియానే వేదికగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రచారం చేయా లని, గ్రామాల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుపొందేలా ప్రతి కార్యకర్త పాటు పడాలని కోరారు. సమావేశంలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వినోద్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు తదితరులు పాల్గొన్నారు. -
క్షయ రోగులకు మెరుగైన చికిత్స అందించాలి
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాలో అనుమానిత క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి మెరుగైన చికిత్స అందించాలని డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పీహెచ్‌సీల పర్యవేక్షణ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్షయ వ్యాధి అనుమానితులు, పొగ, మద్యపానం చేసేవారు, తక్కువ బరువు ఉన్నవారు, ఇంతకు ముందు క్షయ వ్యాధి చికిత్స తీసుకున్న కుటుంబ సభ్యులను గ్రామాల్లో నిర్వహించే ఆరోగ్య శిబిరాలకు తరలించి కళ్లె, ఎక్స్ రే పరీక్షలు నిర్వహించి వెంటనే క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి చికిత్స ప్రారంభించాలని సూచించారు. గుర్తించిన క్షయ వ్యాధిగ్రస్తులకు ప్రతినెలా పోషకాహార కిట్ అందజేయాలని, సంపూర్ణ చికిత్స తీసుకునేలా క్షేత్రసాయి సిబ్బంది పర్యవేక్షించాలన్నారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరికి అబాకార్డ్ (ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్)లను జనరేట్ చేయాలని, అబాకార్డు ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వర్షాకాలంలో వచ్చే డెంగ్యూ, చికన్ గున్యా, మలేరియా వ్యాధుల నివారణ చర్యల గురించి ప్రతి శుక్రవారం ప్రజలందరూ వారి ఇంట్లో డ్రై డే పాటించేలా చూడాలన్నారు. గర్భం దాల్చిన వారందరినీ 12 వారాల్లోపు నమోదు చేసుకోవాలని, గర్భిణుల్లో రక్తహీనతను అరికట్టాలన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి రవికుమార్, వైద్యులు లక్ష్మణ్, కృష్ణమోహన్, డీపీఓ రేనయ్య, ఏపీఓలు శ్రీను, విజయ్‌కుమార్, నిరంజన్, మినహాజ్, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు. -
నేడు సర్టిఫికెట్ల పరిశీలన
కందనూలు: జిల్లాలోని కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న సీఆర్టీలు, పీజీ సీఆర్టీలు, పీఈటీ బోధన పోస్టులకు 2023లో రాత పరీక్ష ద్వారా మెరిట్ రోస్టర్ ఆధారంగా ఎంపిక చేసిన అభ్యర్థులకు 1:3 నిష్పత్తి ప్రకారం శుక్రవారం డీఈఓ కార్యాలయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు డీఈఓ రమేష్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సర్టిఫికెట్ల వెరిఫికేషనకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా పదో తరగతి, ఇంటర్మీడియేట్, డిగ్రీ, మాస్టర్ డిగ్రీ (పీజీ), బీఈడీ, ఎంఈడీ, యూజీడీపీఈడీ, బీపీఈడీ, డిప్లొమా సర్టిఫికెట్లతోపాటు స్థానికం, కులం, ఆదాయ ధ్రువపత్రాలు తీసుకురావాలన్నారు. దివ్యాంగులైతే అందుకు సంబంధించిన సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలని, గతంలో పనిచేసిన అనుభవం ఉంటే ఎక్స్పీరియన్స్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు తేవాలని సూచించారు. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు డీఈఓ కార్యాలయంలో వెరిఫికేషన ఉంటుందని, రోస్టర్, మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థుల వివరాలను డీఈఓ జిల్లా వెబ్సైట్లో పొందుపరిచామని చెప్పారు. ఓపెన్ డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభం కందనూలు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పరిధిలో 2025 సంవత్సరానికి డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని నాగర్‌కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మదన్మోహన్, విశ్వవిద్యాలయ అధ్యయన కేంద్ర సమన్వయకర్త అంజయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు, అధ్యాపకుల సమక్షంలో అడ్మిషన్లకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఇంటర్, ఐటీఐ లేదా ఇతర డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వచ్చే నెల 13లోగా ఓపెన్ డిగ్రీలో ప్రవేశం పొందాలని సూచించారు. అడ్మిషన్ కోసం విద్యార్థులు 10వ తరగతి మెమో, ఇంటర్ మెమో లేదా ఇతర అర్హతల సర్టిఫికెట్లు, ఆధార్, కుల ధ్రువపత్రం, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలను అప్లోడ్ చేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. పూర్తి వివరాల కోసం సెల్ నం.73829 29779 లేదా నెల్లికొండ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో సంప్రదించాలని సూచించారు. అలాగే 2, 3 సంవత్సరం విద్యార్థులు అడ్మిషన్ ఫీజు చెల్లించాలన్నారు. ఆయిల్‌పాం సాగును ప్రోత్సహించాలి కందనూలు: జిల్లాలో ఆయిల్‌పాం సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర ఉద్యాన శాఖ డైరెక్టర్ రామలక్ష్మి అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఉద్యాన శాఖ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఆయిల్‌పాం సాగును ప్రోత్సహించి, రైతువేదికల వారిగా అవగాహ న సదస్సులు నిర్వహించాలని, తద్వారా లక్ష్యా న్ని సాధించాలని ఆదేశించారు. ఆయిల్‌పాం సాగు ద్వారా రైతులకు స్థిరమైన ఆదా యం వస్తుందన్నారు. సమావేశంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి వెంకటేశం, ప్రీయూనిక్ ఆయిల్‌పాం, డ్రిప్ కంపెనీ సిబ్బంది పాల్గొన్నారు. -
తుంగభద్రలో ఇసుకతీతకు గ్రీన్‌సిగ్నల్
రాజోళి: తుంగభద్ర నదిలో బోట్ల ద్వారా ఇసుక తీసేందుకు ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇసుక కొరత తీరనుంది. ప్రభుత్వ పనులతో పాటు ఇతర నిర్మాణాలకు ఆన్లైన్ ద్వారా ఇసుక తీసుకునేందుకు సులభతరమైంది. జోగుళాంబ గద్వాల జిల్లాలో రెండు నదులు ఉన్నప్పటికీ.. ఎక్కువగా ఇసుక లభ్యత ఉండేది తుంగభద్ర నదిలోనే. అయితే తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో తుంగభద్ర నది ఉండటంతో ఇసుక తీసుకునే క్రమంలో తరచు వివాదాలు తలెత్తుతున్నాయి. అనుమతులు ఉన్న వాహనాలకు సైతం ఇసుక లభించేది కాదు. దీంతో ఇసుకకు డిమాండ్ పెరిగి.. సామాన్యులకు చాలా ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే తుంగభద్ర నది నుంచి ఆన్లైన్ ద్వారా ఇసుక తీసుకునేందుకు అనుమతులు వచ్చాయి. దీంతో ఉ మ్మడి జిల్లా ప్రజలకు ఇసుక కష్టాలు తీరనున్నాయి. బోట్ల సహాయంతో.. నదిలో నీటి ప్రవాహం ఉంటే ఇసుక తోడేందుకు గతంలో కుదిరేది కాదు. కానీ ఏపీ ప్రభుత్వం నదిలో నీరున్నా బోట్ల ద్వారా ఇసుకను తోడుతోంది. ఒక్కోసారి తెలంగాణ సరిహద్దులోకి వచ్చి మరీ తోడుకుంటున్నారు. దీంతో జిల్లావాసులకు ఇసుక లభించడం లేదనే వాదనలు ఉన్నాయి. ప్రస్తుతం బోట్ల ద్వారా ఇసుకను తీసుకునేందుకు అనుమతులు ఇవ్వడంతో తెలంగాణ తరఫున కూడా నదిలో బోట్ల ద్వారా ఇసుకను తోడే అవకాశం లభించింది. ఇందుకోసం బోట్లకు ఇసుక తీసే యంత్రాలను అమర్చి నదిలోకి పంపుతారు. వాటి ద్వారా నదిలో నుంచి సామర్థ్యం మేర ఇసుక తోడిన తర్వాత ఒడ్డు మీద డంప్ చేస్తారు. ఆ తర్వాత ఆన్లైన్లో ఇసుక కోసం దరఖాస్తు చేసుకున్న వారికి టిప్పర్ల ద్వారా సరఫరా చేయనున్నారు. వచ్చే ఏడాది జూన్ వరకు అనుమతి.. నదిలో ఉన్న ఇసుకను కార్గో సాండ్ బోట్స్ డ్రైజింగ్ మెకానిజం పద్ధతిలో తీసేందుకు పది రోజుల క్రితం టీజీ ఎండీసీ టెండర్లు నిర్వహించింది. ఈ టెండర్ ద్వారా 7.25లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక తీసేందుకు ఓ గుత్తేదారు అనుమతులు పొందారు. నదిలో నుంచి తోడిన ఇసుకను ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి సరఫరా చేయనున్నారు. వచ్చే ఏడాది జూన్ 21వ తేదీ వరకు ఇసుక అనుమతులు కొనసాగుతాయి. ఈ మేరకు గురువారం తుమ్మిళ్లలో ఇసుక తోడివేత ప్రారంభమైంది. ఎట్టకేలకు బోట్ల ద్వారా తోడివేత ఉమ్మడి జిల్లాలో తీరనున్న ఇసుక కొరత 7.25లక్షల మెట్రిక్ టన్నులు తీసేందుకు అనుమతులు -
తప్పని పాట్లు
ఓపెన్ ప్లాట్లు..●దోమలు ఎక్కువయ్యాయి.. వానాకాలం ప్రారంభంలోనే దోమలు విజృంభించి రోగాలకు కారణం అవుతున్నాయి. ఇళ్ల మధ్య ఖాళీ స్థలాల్లో చెత్తాచెదారం, పిచ్చిమొక్కలతో పాటు నీరు నిలిచినా అధికారులు పట్టించుకోవడం లేదు. కనీసం ఫాగింగ్ కూడా చేయడం లేదు. దీంతో ప్రజలు రోగాల బారినపడాల్సి వస్తోంది. – మైబన్న, శ్రీనగర్‌కాలనీ, నాగర్‌కర్నూల్ సాక్షి, నాగర్‌కర్నూల్: వానాకాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధుల విజృంభించే అవకాశం ఉంది. ముందస్తుగా అప్రమత్తమై, పకడ్బందీగా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాల్సిన మున్సిపల్ అధికారుల్లో కదలిక కనిపించడం లేదు. జిల్లాలోని మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా కనిపిస్తోంది. పట్టణాల్లోని కాలనీల్లో ఇళ్ల మధ్య ఉన్న ఖాళీ స్థలాలన్నీ మురికి కూపాలను తలపిస్తున్నాయి. శివారు ప్రాంతాలు, నూతనంగా ఏర్పడుతున్న కాలనీల్లో పరిస్థితి అధ్వానంగా కనిపిస్తోంది. ఆయా ప్రాంతాల్లో ఇంకా డ్రైనేజీల నిర్మాణం చేపట్టకపోవడంతో నీరంతా సమీపంలోని ఖాళీ స్థలాల్లోకి చేరుతోంది. వానాకాలం సీజన్లో నీటి ఉధృతి పెరిగి ఓపెన్ ప్లాట్లు అన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రోజుల తరబడి నిల్వ ఉండే నీటిలో దోమలు గుడ్లు పెడుతూ, తర్వాత సంతతి వేగంగా వృద్ధిచెందుతోంది. దీంతో తరచుగా సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నామని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మురికి నీరు, చెత్తాచెదారం పేరుకుపోయి దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. ఖాళీ స్థలాలపై పట్టింపు కరువు.. మున్సిపాలిటీల్లోని ఓపెన్ ప్లాట్లలో నీటి నిల్వ కారణంగా దోమలు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. పట్టణాల్లోని ఖాళీ స్థలాలు, లోతట్టు ప్రదేశాల్లో నీరు నిల్వ ఉన్నచోట దోమల లార్వా వృద్ధిచెందకుండా ఆయిల్‌బాల్స్ చల్లడం వంటి చర్యలు తీసుకున్నా ప్రయోజనం ఉంటుంది. వానాకాలం సీజన్లో ఎక్కువ కాలం నీరు నిల్వకుండా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉండగా, ఎక్కడా అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. నిబంధనల ప్రకారం ఓపెన్‌ప్లాట్లలో పిచ్చిమొక్కలు, మురుగు, వర్షపునీరు చేరకుండా జాగ్రత్తపడాల్సిన ఆయా స్థలాల యజమానులకు సూచించాలి. తమ స్థలాన్ని చదును చేసుకునేలా వారికి మున్సిపాలిటీ అధికారులు నోటీసులు జారీ చేయాలి. కానీ సంబంధిత అధికారులు విస్మరిస్తుండటంతో సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. మున్సిపాలిటీల్లోని ఇళ్ల మధ్య ఖాళీ స్థలాలతో ఇబ్బందులు నీళ్లు నిలిచి మురికికూపాల్లా మారుతున్న వైనం దోమల ఉధృతికి ఆవాసాలుగా ఖాళీ ప్రదేశాలు శివారు ప్రాంతాలు, నూతన కాలనీల్లో మరింత అధ్వాన పరిస్థితి వాటర్ లాగింగ్ ఏరియాల్లో కనిపించని పారిశుధ్య చర్యలు అమలుకాని నిబంధనలు.. ఓపెన్ స్థలాలకు వేకెంట్ ల్యాండ్ టాక్స్ చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ, కొత్తగా రిజిస్ట్రేషన్ చేస్తున్న సమయంలోనే ఈ టాక్స్ వసూలు చేస్తున్నారు. ఇప్పటికే వందల సంఖ్యలో ఏర్పాటైన ఓపెన్ప్లాట్ల యజమానుల వివరాలు సైతం అధికారుల వద్ద లేవు. సీజనల్ వ్యాధుల నిర్మూలన చర్యల్లో భాగంగా ఖాళీ స్థలాలను అధికార యంత్రాంగమే శుభ్రం చేయాల్సి ఉండగా ఈ విషయంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఓపెన్ ప్లాట్లను చదును చేసినప్పుడు అయిన ఖర్చును ఆయా యజమానులు ఇంటి నిర్మాణం, ఇతర అనుమతులు కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో వసూలు చేసుకునేందుకు అవకాశం ఉంది. కనీసం ఓపెన్ప్లాట్ల యజమానులకు నోటీసులు ఇవ్వడంలోనూ అలసత్వం వీడటం లేదు. -
వెనకబడిన వర్గాల సంక్షేమానికి కృషిచేయాలి
నాగర్‌కర్నూల్: వెనకబడిన వర్గాల శ్రేయస్సుకు బ్యాంకర్లు కృషి చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన డీసీసీ, డీఎల్ఆర్సీ (బ్యాంకర్ల) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విజన్‌కు అనుగుణంగా బ్యాంకులు జిల్లా అభివృద్ధికి సహకరించాలన్నారు. జిల్లావ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో రుణాలు అందించి.. వారి ఆర్థికాభ్యున్నతికి తోడ్పాటునందించాలని, ఈ విషయంలో బ్యాంకర్ల పాత్ర ఎంతో కీలకం అన్నారు. అలాగే రైతులకు విరివిగా రుణాలు మంజూరు చేయాలన్నారు. అలాగే ప్రభుత్వ పథకాలకు, ఇందిరా మహిళ శక్తి రుణాలు, మహిళా స్వయం సహాయక సంఘాల బ్యాంకు లింకేజీ, విద్యార్థులకు సంబంధించి ఉన్నత చదువులకు విద్యా రుణాలను అధిక సంఖ్యలో మంజూరు చేయాలని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలకు సంబంధించి బ్యాంకర్లకు కేటాయించిన రుణ మంజూరు లక్ష్యాలను వందశాతం పూర్తిచేయాలన్నారు. బ్యాంకర్లు లబ్ధిదారులకు సంబంధించిన దరఖాస్తులను తప్పనిసరి పరిస్థితుల్లో తిరస్కరించేటప్పుడు అందుకు గల కారణాలు తెలియజేయాలన్నారు. ఈ నెల 15న నిర్వహించే దిశ సమావేశానికి రుణాల వివరాల పూర్తి సమాచారంతో హాజరుకావాలని ఆదేశించారు. ● స్వచ్ఛభారత్ మిషన్ లక్ష్య సాధనకు ఆయా శాఖల అధికారులు కృషి చేయాలని, ప్రతి గ్రామంలో వందశాతం ఓడీఎఫ్ ప్లస్ అమలు చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు, పరిశుభ్రత అందించడమే ప్రధాన లక్ష్యం అన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా సమీక్ష నిర్వహించారు. ఆయా సమావేశాల్లో అదనపు కలెక్టర్ దేవసహాయం, నాబార్డు డీడీఎం మనోహర్‌రెడ్డి, ఆర్బీఐ ఎల్డీఓ రాములు, లీడ్ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్, డీఆర్డీఓ ఓబులేసు, డీఏఓ చంద్రశేఖర్, డీపీఓ శ్రీరాములు, డీఈఓ రమేష్‌కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాంలాల్, ఆయా శాఖల జిల్లా అధికారులు రాజేశ్వరి, ఖాజా నాజిమ్ అలీ అప్సర్, రజిని, పీఆర్ ఈఈ విజయ్, మిషన్ భగీరథ ఈఈ సుధాకర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. కొండారెడ్డిపల్లిపై ప్రత్యేక దృష్టి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి గ్రామ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. ఆయా శాఖల అధికారులు ప్రతి పనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని, మిగిలిన పనులకు తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. గ్రామంలో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ గడువులోగా పూర్తిచేయాలని చెప్పారు. అంతకు ముందు గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ ఆరాతీశారు. ప్రతి పనిపై ప్రగతి వివరాలు, ఎదురయ్యే సవాళ్లు, పూర్తయ్యే గడువు గురించి తెలుసుకున్నారు. -
ప్రతిపాదనలు పంపాం
జనరల్ ఆస్పత్రితో పాటు ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మరో 300 పడకల ఆస్పత్రిని త్వరలోనే ఏర్పాటు చేసి వైద్య విద్యార్థులకు ప్రాక్రీస్తో పాటు రోగులకు అన్ని వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం. – డా.రఘు, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ అనుమతులు మంజూరయ్యాయి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో నాలుగో సంవత్సరం విద్యార్థులకు తరగతులను బోధించేందుకు ఎన్ఎంసీ నుంచి అనుమతులు మంజూరయ్యాయి. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో విద్యార్థులకు కావాల్సిన అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నాం. – డా.రమాదేవి, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ● -
‘బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేద్దాం’
నాగర్‌కర్నూల్: బాలల హక్కుల పరిరక్షణ, పిల్లలందరికీ సమాన అవకాశాలు, విద్య, వైద్య సదుపాయాలు కల్పించేందుకు విద్య, వైద్య, పోలీస్, సీ్త్ర శిశు సంక్షేమ, కార్మిక శాఖల అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ కొత్తకోట సీతా దయాకర్‌రెడ్డి సూచించారు. బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా పర్యటనలో భాగంగా బిజినేపల్లి, తాడూరు మండలాల్లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం, అంగన్వాడీ కేంద్రం, అనాథ బాలికల విద్యాలయాన్ని ఆమె సందర్శించారు. విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు, అందుతున్న భోజనం, విద్యా తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జ్యోతి ప్రజ్వలనతో చేసి సమీక్ష నిర్వహించారు. మిషన్ వాత్సల్య జిల్లా బాలల పరిరక్షణ విభాగం, బాలల హక్కుల పరిరక్షణ, వారి కోసం ఉద్దేశించిన చట్టాల అమలు తీరు గురించి చర్చించా రు. కార్యక్రమంలో కమిషన్ సభ్యులు కంచర్ల వందనగౌడ్, అపర్ణ, మర్రిపల్లి చందన, గోగుల సరిత, ప్రేమలత అగర్వాల్, వచనకుమార్, సంబంధిత శాఖల అధికారులు, కలెక్టర్ బాదావత్ సంతోష్, అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం, అదనపు ఎస్పీ రామేశ్వర్, జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి రమాదేవి, జిల్లా బాలల సంరక్షణ చైర్మన్ లక్ష్మణరావు, డీఈఓ రమేష్‌కుమార్, జిల్లా బాలల సంరక్షణ అధికారి శ్రీశైలంగౌడ్, సీడీపీఓలు, సూపర్వైజర్లు, తదితర అధికారులు పాల్గొన్నారు. -
అధికారులు స్పందించాలి..
రెండు నెలలుగా జీతా లు అందకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. ఎంఆర్ఐ సంస్థ టెండర్ ప్రకారం ప్రతి నెల జీతాలు ఇవ్వాల్సి ఉంది. కానీ, రెండు నెలల జీతాలు రాని విషయమై ఉన్నతాధికారులు సకాలంలో స్పందించి సిబ్బందికి జీతాలు ఇప్పించాలి. వేతనాలు రాకపోవడంతో కుటుంబాలు గడవటం చాలా కష్టంగా ఉంది. – మాసన్న, 108 పైలెట్, మహబూబ్‌నగర్ రెండు, మూడురోజుల్లో.. ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న 108, 102 సిబ్బందికి రెండు నెలలకు సంబంధించిన జీతాలు రావాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి మరో రెండు, మూడు రోజుల్లో జీతాలు చెల్లించే అవకాశం ఉంది. నాలుగు స్లాబ్‌ల ప్రకారం సీనియర్, జూనియర్ సిబ్బందికి జీతాలు ఉంటాయి. – రవికుమార్, ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ ● -
కనిపించని ఎరువుల తయారీ..
జిల్లాలోని మున్సిపాలిటీల్లో డంపింగ్ యార్డుల వద్ద కంపోస్టు ఎరువుల తయారీ కోసం సెగ్రిగేషన్ షెడ్లను ఏర్పాటు చేశారు. ఇందుకోసం సుమారు రూ. 50 లక్షల నుంచి రూ.కోటి వరకు నిధులను వెచ్చించారు. కానీ ఎక్కడా ఎరువులు, కంపోస్టు తయారీ చేపట్టడం లేదు. తడిచెత్తను సేకరించి ఎరువుగా మార్చితే మున్సిపాలిటీలకు ఆదాయ వనరులుగా మారే అవకాశం ఉంది. సేంద్రియ ఎరువులను హరితహారం కింద నాటిన మొక్కలకు వినియోగించేందుకు అవకాశం ఉండగా ఎక్కడా అమలుకావడం లేదు. చెత్తయార్డుగా మార్చారు కొల్లాపూర్ మున్సిపాలిటీకి చెందిన చెత్తను రోజూ తీసుకొచ్చి మా గ్రామ శివారులో ప్రధాన రోడ్డు పక్కనే వేస్తున్నారు. స్థానికులతో పా టు పర్యాటక ప్రాంతమైన అమరగిరికి వస్తున్న పర్యాటకులు దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పలుమార్లు అధికారులు విన్నవించినా చర్యలు తీసుకోవడం లేదు. – భరత్‌కుమార్, అమరగిరి, కొల్లాపూర్ మండలం -
ఆయిల్‌పాం సాగులో ఆదర్శంగా నిలవాలి
ఊర్కొండ: ఆయిల్‌పాం సాగుపై రైతుల దృష్టి సారించి, రాష్ట్రంలో నాగర్‌కర్నూల్ జిల్లా ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. బుధవారం ఊర్కొండ మండలంలోని మాదారంలో జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతు శ్రీకాంత్‌కు చెందిన 10 ఎకరాల్లో చేస్తున్న ఆయిల్‌పాం ప్లాంటేషన్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. మాదారం గ్రామం నుంచి శ్రీకాంత్ పొలం వరకు ట్రాక్టర్లో ప్రయాణించారు. మాదారంలోనే మరో రైతు కృష్ణారెడ్డి ఆయిల్‌పాం మొదటి క్రాప్ కట్టింగ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఆయిల్‌పాం తోటల సాగుకు పొలాలు అనుకూలంగా ఉన్నాయని ఆయిల్‌పాం పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు గతంలో ధ్రువీకరించారన్నారు. రైతులకు ప్రోత్సాహకం ఆయిల్‌పాం సాగు చేసే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. ఒకసారి మొక్క నాటితే నాలుగేళ్లకు దిగుబడి ప్రారంభమై 30 ఏళ్లకు వస్తుందన్నారు. జిల్లాలో ఇప్పటికే 7 వేల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు చేసినట్లు వెల్లడించారు. జిల్లాలో 60 వేల మంది రైతులు 10 ఎకరాల పొలం కలిగిన ఉన్నారని, వారందరూ ఆయిల్‌పాం సాగుపై దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి వెంకటేశం, తహసీల్దార్ యూసఫ్‌అలీ తదితరులు ఉన్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యతగా ఉండాలి తాడూరు: విద్యార్ధులకు ప్రభుత్వం అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ సిబ్బందికి సూచించారు. బుధవారం మండలంలోని సిర్సవా డ ఉన్నత పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం తయారీ, పరిసరాల శుభ్రత అంశాలను స్వయంగా పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్యం, పోషణపై ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటుందని, దానికి అందరి సహకారం కావాలని కోరారు. విద్యార్థులకు అందించే నోట్, పాఠ్య పుస్తకాలు, దస్తులు గురించి ఆరా తీశారు. అనంతరం పదో తరగతి విద్యార్థులకు లెక్కలు బోధించడంతో వారితో చేయించారు. సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
మెడికల్ కాలేజీ, ఆస్పత్రిపై నజర్
నాగర్‌కర్నూల్ క్రైం: స్థానిక ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మౌలిక వసతులు కల్పించేందుకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 27మెడికల్ కళాశాలల నిర్వహణపై నేష నల్ మానిటరింగ్ కమిటీ ఇటీవల అసంతృప్తి వ్య క్తం చేసిన విషయం తెలిసిందే. ఇందులో నాగర్‌కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉండటంతో అధి కారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో తరగతులు ప్రారంభించి ఇప్పటికే మూడేళ్లు పూర్తి చేసుకుని నాలుగో సంవత్సరంలోకి ప్రవేశించడంతో నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆదేశాల అనుగుణంగా సదుపాయాలు కల్పించడంతో నాలుగో సంవత్సరం విద్యార్థులకు తరగతుల నిర్వహణకు అనుమతులు మంజూరు చేసినట్లు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రమాదేవి తెలిపారు. కలెక్టర్ ఆధ్వర్యంలో నిరంతరం తనిఖీలు జనరల్ ఆస్పత్రికి వచ్చే రోగులతో పాటు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో కలెక్టర్ బాదావత్ సంతోష్ వాటిలో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ, సిబ్బందికి తగు సూచనలు చేస్తున్నారు. ఇటీవలే ఆరోగ్యశ్రీ సీఈఓ ఉదయ్‌కుమార్ సైతం జనరల్ ఆస్పత్రిని, ప్రభుత్వ మెడికల్ కళాశాలను సందర్శించి మౌలిక వసతుల కల్పనకు కావాల్సిన వివరాలతో పాటు వైద్య విద్యార్దుల సంఖ్యకు అనుగుణంగా ప్రొఫె సర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు, బోధనేతర సిబ్బంది ఖాళీల వివరాలను, వైద్య పరికరాల గురించి ఆరా తీశారు. మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ప్రస్తుతం 300 పడకలు ఉండగా మరో 305 పడకలు అదనంగా ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదన లు సిద్ధం చేశారు. పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే వైద్యకళాశాల విద్యార్థులకు మెడికల్ ప్రాక్టీస్ తో పాటు ఆస్పత్రికి వచ్చే రోగులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందే అవకాశం ఉండనుంది. తీరు మార్చుకోని వైద్యులు ఐదు రోజుల క్రితం జనరల్ ఆస్పత్రి, మెడికల్ కళాశాలను ఆరోగ్యశ్రీ సీఈఓ, కలెక్టర్ తనిఖీ చేసేందుకు వచ్చి, వెళ్లిన రోజే ఎమర్జెన్సీ వార్డులో విధులు నిర్వహిస్తున్న ఓ వైద్యురాలు రోగులను పరీక్షించకుండా తన ఫోన్లో క్యాండిక్రష్ గేమ్ ఆడుతున్న వీడియో వైరల్‌గా మారడంతో పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి మరో 305 పడకలు ఏర్పాటుకు కసరత్తు నిర్లక్ష్యం వీడని వైద్యులు -
ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి
నాగర్‌కర్నూల్ క్రైం: ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకెళ్తేనే జీవితంలో స్థిరపడతారని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నసీం సుల్తానా అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని చదువులో రాణించాలని సూచించారు. ఉపాధ్యాయులు చెప్పే ప్రతి పాఠ్యాంశాన్ని శ్రద్ధగా విని అర్థం చేసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చదువును అశ్రద్ధ చేయొద్దన్నారు. సమయం దొరికినప్పుడల్లా పుస్తకాలు చదివి కొత్త విషయాలు తెలుసుకోవాలని తెలిపారు. ఎస్బీఐ రీజినల్ మేనేజర్ సునీత మాట్లాడుతూ.. తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. ప్రతి సంవత్సరం ఎస్బీఐ కొంత కార్పస్ ఫండ్ సమాజ సేవకు వినియోగిస్తుందని.. నాగర్‌కర్నూల్ శాఖ ఆధ్వర్యంలో 230 మంది పదో తరగతి విద్యార్థులకు జామెట్రీ బాక్సులు పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్బీఐ చీఫ్ మేనేజర్ రాకేశ్ శర్మ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికాంతారావు, హెచ్ఎం శోభన్‌బాబు పాల్గొన్నారు. -
అభివృద్ధిలో జిల్లాను అగ్రస్థానంలో నిలుపుదాం
నాగర్‌కర్నూల్: అభివృద్ధి, ప్రజా సంక్షేమంలో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రతి అధికారి కృషి చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. జిల్లా ప్రగతి, సంక్షేమ పథకాల అమలు తీరుపై మంగళవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనుల పురోగతి, అడ్డంకులు, ప్రజలకు అందుతున్న సేవలపై సమగ్రంగా చర్చించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సమీకృత కలెక్టరేట్లో పనిచేస్తున్న అన్ని శాఖల అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు విధానం పాటించాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ, సమయపాలన పాటించని అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి, వందశాతం లక్ష్యాలు సాధించాలన్నారు. ప్రభుత్వ శాఖల పురోగతిపై నిర్వహించే సమీక్షకు సంబంధిత జిల్లా అధికారులు పూర్తిస్థాయి సమాచారంతో హాజరు కావాలని.. అనుమతులకు సంబంధించిన ప్రతి ఫైల్ ఈ–ఆఫీస్ ద్వారానే పంపించాలని సూచించారు. జిల్లా అధికారులకు కేటాయించిన గురుకులాలను తప్పనిసరిగా తనిఖీలు చేయాలన్నారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందేలా చూడాలన్నారు. భోజనం నాణ్యతపై తరచూ సమీక్షలు జరిపి.. అవసరమైన మార్పులు చేయాలన్నారు. ప్రజావాణి, ముఖ్యమంత్రి కార్యాలయం ద్వారా వచ్చే ప్రతి దరఖాస్తును వారం రోజుల్లోగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. పరిష్కారం సాధ్యపడని దరఖాస్తుల విషయంలో తగిన కారణాలను స్పష్టంగా తెలియజేస్తూ.. సంబంధిత నివేదికలను సమర్పించాలని అధికారులకు సూచించారు. అభివృద్ధి పనులను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే పూర్తి చేయాలన్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై దృష్టి సారించండి.. జిల్లాలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. ఆపరేషన్ ముస్కాన్–11పై కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. బాలల భవిష్యత్‌కు బంగారు బాటలు వేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్‌ను అన్ని శాఖల అధికారుల సమన్వయంతో నిర్వహించాలని సూచించారు. ఎక్కడైనా బాలకార్మికులు కనిపిస్తే డ యల్ 1098కు సమాచారం అందించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. బాలలను పనిలో పెట్టుకునే వారికి చట్టప్రకారం శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. తప్పిపోయిన పిల్లలందరినీ గుర్తించి.. తల్లిదండ్రులకు అప్పగించడమే కాకుండా ఉపాధి అవకాశాల నిమిత్తం వృత్తివిద్య కోర్సుల్లో శిక్షణకు సన్నద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. మానసిక స్థితి సరిగా లేని బాలలకు పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం కల్పించి.. మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. కాగా, గతేడాది నిర్వహించిన ఆపరేషన్ స్మైల్‌లో 30 మంది, ముస్కాన్ కార్యక్రమంలో 24 మంది బాలకార్మికులకు విముక్తి కల్పించినట్లు అధికారులు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయం, ఏఎస్పీ రామేశ్వర్, కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్, సంక్షేమశాఖ అధికారిణి రాజేశ్వరి, చైల్డ్ ప్రొటెక్షన్ చైర్మన్ లక్ష్మణరావు తదితరులు ఉన్నారు. సంక్షేమ పథకాల అమలులోనిర్లక్ష్యం వహించొద్దు కలెక్టరేట్లో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి కలెక్టర్ బదావత్ సంతోష్ -
నీరు పారే దారేది?
మున్సిపాలిటీల్లో నాలాలపైపర్యవేక్షణ కరువు ● చాలా చోట్ల కాల్వలుఅన్యాక్రాంతం ● సాఫీగా పారని వరద,మురుగునీరు ● వానాకాలంలో కాలనీలను ముంచెత్తుతున్న వరద ● వాననీటి నిర్వహణకు కరువైన ప్రణాళిక సాక్షి, నాగర్‌కర్నూల్: చినుకు పడిందంటే చాలు.. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల్లో వణుకు పుడుతోంది. వరద, బురదనీరు ఎప్పుడు తమ ఇళ్లలోకి వచ్చి చేరుతుందోనని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఏళ్లుగా ఉన్న వరదనీటి కాల్వలు, నాలాలు క్రమంగా అన్యాక్రాంతం అవుతున్నాయి. వివిధ నిర్మాణాలతో కుంచించుకుపోతున్నాయి. ఫలితంగా వర్షం పడినప్పుడు నీరంతా బయటకు వెళ్లే దారి లేక సమీపంలోని కాలనీలను ముంచెత్తుతోంది. వానాకాలం నేపథ్యంలో ముందస్తుగానే మేల్కొని వాననీటి నిర్వహణపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాల్సిన అధికార యంత్రాంగం.. ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో లోతట్టు ప్రాంతాలు, నాలాల సమీప ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. -
ఔత్సాహికులకు నిరుత్సాహం
● ఉమ్మడి జిల్లాలో ఏర్పాటుకు నోచుకోని స్పోర్ట్స్ స్కూల్ మహబూబ్‌నగర్ క్రీడలు: స్పోర్ట్స్ స్కూళ్లు ఔత్సాహిక క్రీడాకారులకు వరంగా మారుతున్నాయి. రాష్ట్రంలో హైదరాబాద్ (హకీంపేట), కరీంనగర్, ఆదిలాబాద్‌లో క్రీడా పాఠశాలలు ఉండగా.. 20 మంది బాలురు, 20 మంది బా లికల చొప్పున ప్రవేశాలు కల్పిస్తున్నారు. ప్రస్తు తం స్పోర్ట్స్ స్కూళ్లలో చిన్నారులను చేర్పించాలనే సంకల్పం చాలామంది తల్లిదండ్రుల్లో కనిపిస్తోంది. అయితే రాష్ట్రంలో కేవలం మూడు స్పోర్ట్స్ స్కూళ్లే ఉండటంతో చాలా మంది వి ద్యార్థులకు అవకాశాలు దక్కడం లేదు. వనపర్తిలో స్థల సేకరణ ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోనైనా రెండు స్పోర్ట్స్ స్కూళ్లు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. ఇప్పటికే వనపర్తి జిల్లాకేంద్రంలోని మర్రికుంట సమీపంలో స్పోర్ట్స్ స్కూల్ కోసం స్థల సేకరణ చేపట్టారు. వెంటనే వనపర్తిలో స్పోర్ట్స్ స్కూల్‌ను ప్రారంభించాలని ఆ ప్రాంత క్రీడాభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు. మెరుగైన క్రీడా వసతులు గతేడాది రాష్ట్రంలోని మూడు స్పోర్ట్ స్కూళ్లలో ఉమ్మడి జిల్లా నుంచి 29 మంది విద్యార్థులు 4వ తరగతిలో ప్రవేశాలు పొందారు. వనపర్తితోపాటు ఉమ్మడి జిల్లాలో మరోచోట స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటైతే మరింత ఎక్కువ మంది చిన్నారులు స్పోర్ట్స్ స్కూళ్లకు ఎంపికవుతారు. స్పోర్ట్స్ స్కూళ్లలో చిన్నారులకు ఎన్నో మెరుగైన క్రీడావసతులు అందుబాటులోకి వస్తాయి. తొలుత చిన్నారులకు ఫ్లెక్సిబిలిటీ తదితర అంశాల్లో పరీక్షించి వారు ఏ క్రీడల్లో రాణించే అవకాశం ఉందో అందులో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అదేవిధంగా క్రీడా శిక్షణతోపాటు చదువుకూ ప్రాధాన్యం ఉంటుంది. నైపుణ్యాలు వెలికి.. స్పోర్ట్స్ స్కూళ్లతో చిన్నారుల్లో దాగివున్న క్రీడానైపుణ్యాలను వెలికితీయవచ్చు. ప్రస్తుతం ఆయా క్రీడల్లో అంతర్జాతీయ, జాతీయస్థాయిల్లో రాణిస్తున్న క్రీడాకారుల్లో చాలామంది స్పోర్ట్స్ స్కూల్ నుంచి వచ్చిన వారే. – శ్రీనివాస్, డీవైఎస్ఓ, మహబూబ్‌నగర్ ● -
పోలీసు ప్రజావాణికి 15 అర్జీలు
నాగర్‌కర్నూల్ క్రైం: పోలీసు ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఎస్పీ పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. భూ తగాదాలపై 10, తగున్యాయం కోసం 5 ఫిర్యాదులు అందాయని.. సంబంధిత అధికారులు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు.విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంచాలిపెద్దకొత్తపల్లి: ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ.. విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంచాలని డీఈఓ రమేశ్‌కుమార్ అన్నారు. సోమవారం మండలంలోని వావిళ్లబావి, బాచారం ప్రాథమిక, కల్వకోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో డీఈఓ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులతో పాటు మధ్యాహ్న భోజనం, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలన్నారు. విద్యార్థుల అభ్యసన స్థాయికి అనుగుణంగా బోధనా పద్ధతులు కొనసాగించాలని సూచించారు. ప్రతి విద్యార్థికి మెరుగైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే ఉపాధ్యాయులపై చర్యలు తప్పవన్నారు. డీఈఓ వెంట జిల్లా బాలికా విద్య కోఆర్డినేటర్ శోభారాణి, జిల్లా టెస్టుబుక్స్ మేనేజర్ నర్సింహులు ఉన్నారు.ఆర్టీసీ అభివృద్ధికి కష్టపడి పనిచేయాలిస్టేషన్ మహబూబ్‌నగర్: ఆర్టీసీ సంస్థ అభివృద్ధి కోసం ఉద్యోగులు కష్టపడి పనిచేయాలని డిప్యూటీ రీజినల్ మేనేజర్ లక్ష్మిధర్మ అన్నారు. జిల్లాకేంద్రంలోని డిపోలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లకు సోమవారం త్రైమాసిక అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను మిగతా వారు స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ఆర్టీసీలో ప్రమాదాల శాతాన్ని తగ్గించాలని సూచించారు. ఆర్టీసీ టూర్ ప్యాకేజీలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, మీ అనుకూలమైన సమయాల్లో వీటి గురించి గ్రామాల్లో, కాలనీల్లో ప్రచారం చేయాలని కోరారు. టూర్ ప్యాకేజీల వల్ల అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో టూటౌన్ సీఐ ఎజాజుద్దీన్, డిపో మేనేజర్ సుజాత, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.175 ఎంబీబీఎస్ సీట్లకు ఎన్ఎంసీ అనుమతిపాలమూరు: మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలకు 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎంబీబీఎస్‌లో ప్రవేశాల కోసం 175 సీట్లు మంజూరు చేస్తూ ఎన్ఎంసీ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో కళాశాలలో పర్యటించిన ఎన్ఎంసీ బృందం.. పలు లోపాలు ఉన్నట్లు నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధిత అధికారులు లోపాలపై ఇచ్చిన నివేదికపై సంతృప్తి చెందిన ఎన్ఎంసీ.. సీట్లు జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం కళాశాలలో ఉన్న సమస్యలను రాబోయే నాలుగు నెలల వ్యవధిలో పరిష్కరించుకోవాలని ఎన్ఎంసీ ఆదేశించింది. -
ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయొద్దు
నాగర్‌కర్నూల్: ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయొద్దని కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తమ సమస్యలను పరిష్కరిస్తారనే నమ్మకంతో ప్రజలు వ్యయ, ప్రయాసాలకోర్చి కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణికి వస్తారని, వారి నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజావాణికి వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి.. పరిష్కారమార్గం చూపాలని సూచించారు. ఏదేని దరఖాస్తు పరిష్కారం కాని పక్షంలో సంబంధిత అర్జీదారుకు తెలియజేయాలని సూచించారు. కాగా, ప్రజావాణికి వివిధ సమస్యలపై 46 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.అమరేందర్, కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం
పెంట్లవెల్లి: ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం పెంట్లవెల్లిలో రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్‌తో కలిసి ఆయన మైనార్టీ మహిళలకు 109 కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదల అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభు త్వం పనిచేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలుచేస్తూ వస్తున్నట్లు చెప్పారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు మంజూరు చేస్తామ న్నారు. పెంట్లవెల్లి మండలాన్ని అన్నివిధాలా అభి వృద్ధి చేయడంతో పాటు ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామన్నారు. మైనార్టీల అభ్యున్నతి కోసం రూ. 20లక్షలు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. అనంతరం పెంట్లవెల్లి కస్తూర్బాగాంధీ బాలి కల విద్యాలయంలో రత్నగిరి ఫౌండేషన్, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రూ. 17లక్షల విలువైన కిడ్ బెడ్స్ ను మంత్రి జూపల్లి అందజేశారు. కేజీబీవీలో కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకొని చదువులో ఉన్నతంగా రాణించాలని విద్యార్థినులకు సూ చించారు. కార్యక్రమంలో నాయకులు రామన్‌గౌడ్, నర్సింహ యాదవ్, నల్లపోతుల గోపాల్, ఎర్ర శ్రీనివాసులు, ఎండీ కబీర్, మాజీ సర్పంచ్ సువర్ణమ్మ, గోపినాయక్, తిరుపాటి నాగరాజు, ధర్మతేజ, ఆంజనేయులు, భీంరెడ్డి, కుమార్ పాల్గొన్నారు. పేదల అభ్యున్నతికి నిరంతర కృషి అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు అందిస్తాం రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు -
ఇబ్బంది పడుతున్నాం..
మా కాలనీలోని డ్రెయినేజీ పూర్తిగా పాడైంది. కనీసం డ్రెయినేజీలోని చెత్తాచెదారం, పూడిక తొలగించడం లేదు. నిత్యం దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్నాం. మురుగునీరు బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలి. – కొట్ర మహేశ్, శ్రీపురం చౌరస్తా, నాగర్‌కర్నూల్ పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి.. వానాకాలం నేపథ్యంలో పారిశుద్ధ్య సమస్యలపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తాం. డ్రెయినేజీలు లేని ప్రాంతాల్లో నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నుంచి మురుగు బయటికి రాకుండా చూస్తాం. ప్రస్తుతానికి జెట్టింగ్ మిషన్ల ద్వారా మురుగునీటి తొలగింపు చేపడతాం. – నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్, నాగర్‌కర్నూల్ ● -
అసలేం జరుగుతోంది..
నాగర్‌కర్నూల్: జిల్లా పంచాయతీ అధికారిని కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేశారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందుకు సంబంధించిన ఆర్డర్ కాపీ కూడా ఇటీవల కలెక్టరేట్‌కు చేరినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఉన్నతాధికారుల నుంచి మాత్రం స్పష్టమైన ప్రకటన రావడం లేదు. ఒకవేళ ఇదే నిజమైతే తెరవెనక ప్రయత్నాలు ఏమైనా కొనసాగుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు నేతల ఆగ్రహమే కారణమా? జిల్లా పంచాయతీ అధికారి బదిలీ వెనక ఇద్దరు ప్రధాన నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల జిల్లాలో జరిగిన రెండు సంఘటనలు వారి ఆగ్రహానికి కారణమై ఉండవచ్చని పలువురు చెబుతు న్నారు. జూన్ 21న కొల్లాపూర్ మండలంలోని సోమశిలలో ఓ రిసార్ట్‌ను కూలగొట్టేందకు డీపీఓ తమ సిబ్బందితో వెళ్లిన విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు అక్కడికి చేరుకొని రిసార్ట్‌కు అన్ని అనుమతులు ఉన్నాయని.. కేవలం అధికార పార్టీకి చెందిన నాయకులు కక్షపూరితంగా కూల్చివేసేందుకు అధికారులను పంపారని ఆందోళనకు దిగారు. కొందరు పెట్రోల్ బాటిళ్లతో రిసార్ట్ ఎదుట బైఠాయించి నిరసన తెలియజేశారు. ఇక చేసేదేమీ లేక అధికారులు వెనుదిరిగారు. ఇదిలా ఉంటే, కొన్ని నెలల క్రితం అచ్చంపేట నియోజకవర్గంలోని దోమలపెంటలో బీఆర్ఎస్ నాయకుడికి చెందిన హోటల్ ప్రభుత్వ స్థలంలో ఉందంటూ కూల్చేశారు. అయితే సదరు బాధితుడు హైకోర్టును ఆశ్రయించడంతో హోటల్ తిరిగి కట్టించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అధికారులు సదరు బాధితుడికి హోటల్ నిర్మించి ఇచ్చారు. ఈ రెండు సంఘటనలు అధికార పార్టీ నేతలకు ఆగ్రహం తెప్పించినట్లు తెలుస్తోంది. వారి ఆగ్రహంతోనే డీపీఓను కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేశారనే ప్రచారం సాగుతోంది. ఆది నుంచి వివాదాస్పదమే.. జిల్లా పంచాయతీ అధికారి తీరు ఆది నుంచి కొంత వివాదాస్పదంగానే ఉంది. కేవలం అధికార పార్టీ నేతల మాటలకు తలొగ్గి పనిచేస్తూ.. ఇతరుల ఫిర్యాదులను పెద్దగా పట్టించుకోవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు కొన్ని సంఘటనలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. పెద్దకొత్తపల్లి మండలం చిన్నకార్పాములలో ప్రభుత్వం నిర్మించిన డంపింగ్ యార్డును కొందరు ఉద్దేశపూర్వకంగా కూలగొట్టారని.. సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని గత మార్చి 27న బీజేపీ నాయకులు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తెలకపల్లి మండల కేంద్రంలో 40 దుకాణాలను అనుమతులు లేకుండా నిర్మించారని.. వీటిపై చర్యలు తీసుకోవాలని కొందరు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ విచారణకు ఆదేశించారు. అయితే నాలుగు నెలలుగా విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఈ దుకాణాల అక్రమ నిర్మాణంపై ఇప్పటి వరకు మూడుసార్లు ఫిర్యాదు లు అందినా కనీస స్పందన కరువైంది. అన్ని ఫిర్యాదులపైఒకేలా స్పందించాలి.. అధికారులు అన్ని ఫిర్యాదులపై ఒకేలా స్పందించాలి. కేవలం అధికార పార్టీకి చెందిన నాయకుల మాటలు విని కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదు. పెద్దకొత్తపల్లి మండలం చిన్న కార్పాములలో డంపింగ్ యార్డు కూలగొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని మూడు నెలల క్రితం ఫిర్యాదు చేసినా ఇప్పటికీ స్పందన లేదు. – ఎల్లేని సుధాకర్‌రావు, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు కమిషనరేట్‌కు డీపీఓ అటాచ్ అంటూ ప్రచారం ఇప్పటికే ఆర్డర్ కాపీ కలెక్టరేట్‌కు చేరిందంటూ చర్చ స్పష్టత ఇవ్వని ఉన్నతాధికారులు సోమశిల రిసార్ట్, అచ్చంపేట హోటల్ ఘటనలే కారణమా..? -
పారిశుద్ధ్యం.. అస్తవ్యస్తం
సాక్షి, నాగర్‌కర్నూల్: అసలే వానాకాలం.. మున్సిపాలిటీల్లో మురుగుతో పాటు వర్షపునీరు రోడ్లపైనే పారుతోంది. డ్రెయినేజీల్లో చెత్తాచెదారం నిండిపోవడంతో నీరు పారేందుకు వీలులేక రోడ్లపైకి చేరుతోంది. వానాకాలానికి ముందే అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అధికార యంత్రాంగం.. నిర్లక్ష్యం వహిస్తోంది. జిల్లాకేంద్రంతో పాటు ఇతర మున్సిపాలిటీల్లో ఎక్కడా సంబంధిత యంత్రాంగంలో సన్నద్ధత కనిపించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వానాకాలంలో పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టిపెట్టాలని ప్రజలు కోరుతున్నారు. శివారు ప్రాంతాల్లో అధ్వానం.. జిల్లా కేంద్రంతో పాటు కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ మున్సిపాలిటీల్లోని శివారు ప్రాంతాల్లో డ్రెయినేజీల నిర్మాణం చేపట్టకపోవడంతో మురుగు రోడ్లపైనే పారుతోంది. ఇళ్లలోకి వర్షపునీరు, మురుగు చేరుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోనూ డ్రెయినేజీ నిర్వహణకు చర్యలు చేపట్టడం లేదు. జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీలో పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. నాలాలు అన్యాక్రాంతం.. వానాకాలంలో వరదనీటిని పట్టణం నుంచి బయటకు పంపేందుకు కీలకమైన నాలాలు చాలాచోట్ల అన్యాక్రాంతానికి గురవుతున్నాయి. నాలాలను కబ్జాచేసి నిర్మాణాలు చేపడుతున్నా పర్యవేక్షణ కరువైంది. ఏళ్ల క్రితం నిర్మించిన నాలాలకు మరమ్మతులు, నిర్వహణ లేక పూడిక, చెత్తాచెదారంతో కనిపిస్తున్నాయి. మురుగు, వరదనీరు పారేందుకు వీలులేక రోడ్లపైనే పారుతూ.. ఇళ్లలోకి చేరుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. మున్సిపాలిటీల్లోకంపు కొడుతున్న కాలనీలు రోడ్లపైనే పారుతున్న మురుగు శివారు ప్రాంతాల్లో డ్రైయినేజీలు కరువు ఇళ్లలోకి చేరుతున్న మురుగునీరు వానాకాలం నేపథ్యంలో ఎక్కడా కనిపించని పారిశుద్ధ్య చర్యలు -
సర్వేయర్లు కావాలె..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేధిస్తున్న కొరత ● రోజురోజుకూ పెరిగిపోతున్న దరఖాస్తులు ● పరిష్కరించలేక చేతులెత్తేస్తున్న సర్వే ల్యాండ్ అధికారులు ● 2 వేలకుపైగానే ఎఫ్‌లైన్ అర్జీల పెండింగ్ ● తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయిస్తున్న రైతులు రికార్డులు శిథిలావస్థకు.. ఉమ్మడి ఇల్లాలో సర్వే చేసేందుకు సిబ్బంది కొరతతోపాటు ఉన్న సమస్యలను పరిష్కరించాల్సిన అవసరముంది. రీ సర్వే చేయకపోవడంతో చాలా కార్యాలయాల్లో రికార్డులు శిథిలావస్థకు చేరాయి. కొత్తగా వచ్చిన భూ భారతి చట్టంలో లైసెన్స్ సర్వేయర్ సంతకం పెట్టిన తర్వాత ఆటోమేటిక్‌గా రిజిస్ట్రేషన్ చేసేలా పేర్కొనడం ఆందోళన కలిగిస్తోంది. దీని ద్వారా పొరపాట్లు జరిగే ఆస్కారం ఎక్కువగా ఉందని పలువురు అభిప్రాయపడు తున్నారు. ప్రభుత్వ ఉద్యోగి తప్పు చేస్తే అతనిపై చర్యలకు అధికారం ఉన్నతాధికారులకు ఉంటుంది. లైసెన్స్ సర్వేయర్ తప్పు చేస్తే ఏమి టి పరిస్థితి అనేది ఎక్కడా లేదు. ఇందుకోసం సర్వేయర్ల పోస్టులను భర్తీ చేయడంతోపాటు వారి సమస్యలను పరిష్కరిస్తేనే క్షేత్రస్థాయిలో సమస్యలకు పరిష్కారం లభించనుంది. మహబూబ్‌నగర్ న్యూటౌన్: ఉమ్మడి జిల్లాలో భూములకు సంబంధించిన దరఖాస్తుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. దీనికితోడు సర్వేయర్ల కొరత వేధిస్తుండటంతో ఏళ్లు గడిచినా సర్వే చేయలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఫలితంగా భూములకు అధికారికంగా సర్వే చేయింకునేందుకు ఇబ్బందులు తప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆర్వోఆర్– 2025 భూ భారతి చట్టంలో రీ సర్వేను సైతం ప్రాధాన్యత అంశంగా చేర్చారు. మళ్లీ కొత్తగా భూ భారతి చట్టంలో స్కెచ్ మ్యాపులు వేసేలా.. మరోవైపు లైసెన్స్ సర్వేయర్ల కోసం చర్యలు తీసుకుంటున్నారు. వీటి ద్వారా ఎంత వరకు ప్రయోజనం చేకూరుతుంది.. ఏమైనా నష్టం కలుగుతుందా అనేది అమల్లోకి వస్తేనే తెలియనుంది. సర్వేయర్ల కొరతను తీర్చేందుకు లైసెన్స్ సర్వేయర్లను తీసుకొస్తున్నారు. మా భూములు కొలతలు చేయాలంటూ ఉమ్మడి జిల్లాలో 2 వేలకు పైగానే ఎఫ్‌లైన్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న సర్వేయర్లను జాతీయ రహదారి, పాలమూరు– రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన భూ సేకరణకు వినియోగిస్తుండటంతో ఇతర పనులకు సమయం ఇవ్వడం లేదు. దీంతో చాలామంది రైతులు ప్రైవేటు సర్వేయర్లను ఆశ్రయిస్తున్నారు. అధికారికంగా లేకపోవడంతో భూముల హద్దుల వివాదాలు తేలడం లేదు. ప్రభుత్వానికి సంబంధించిన వాటిని సర్వే చేసేందుకు ఉన్నవారికి సమయం సరిపోవడం లేదు. జిల్లా పోస్టులు ఉన్నవారు ఖాళీలు మహబూబ్‌నగర్ 27 18 9 నారాయణపేట 8 3 5 జోగుళాంబ గద్వాల 20 9 11 నాగర్‌కర్నూల్ 28 13 15 వనపర్తి 26 13 13 ఉమ్మడి జిల్లాలో పరిస్థితి ఇలా.. -
ఇంటర్ కళాశాలలకు మహర్దశ
కందనూలు: ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు మహర్దశ పట్టింది. విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో కూడిన మెరుగైన విద్య అందించేందుకు గాను ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. జిల్లాలో 14 జూనియర్ కళాశాలలు ఉండగా.. రూ. 1.22కోట్లు మంజూరయ్యాయి. దశాబ్దకాలం తర్వాత జూనియర్ కళాశాలలకు నిధులు మంజూరు కావడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. వసతులు మెరుగు.. పదేళ్లుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు నిధులు రాకపోవడంతో నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. సరైన వసతులు లేక విద్యార్థులు, అధ్యాపకులు నానా అవస్థలు పడ్డారు. ఎట్టకేలకు ప్రభుత్వం నిధులు కేటాయించడంతో మౌలిక వసతులు మెరుగుపడనున్నాయి. తరగతి గదుల మరమ్మతుకు అవకాశం లభించింది. విద్యార్థులకు టాయిలెట్లు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం, భవనాలకు రంగులు వేయడం, సీసీ కెమెరాలు ఏర్పాటు వంటి పనులు చేపట్టనున్నారు. సమస్యలు తీరుతాయి.. చాలా సంవత్సరాల తర్వాత జూనియర్ కళాశాలలకు నిధులు మంజూరు కావడం ఆనందంగా ఉంది. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు కళాశాలలను బాగు చేసుకునే అవకాశం లభించింది. నిధులను సద్వినియోగం చేసుకోవాలి. – వెంకటరమణ, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి కళాశాలల వారీగా నిధుల కేటాయింపు ఇలా.. పదేళ్ల తర్వాత నిధులు మంజూరు జిల్లాలో 14 కాలేజీలకు రూ.1.22 కోట్లు కేటాయింపు -
డబుల్బెడ్రూం ఇళ్ల పనుల పూర్తిపై నిర్లక్ష్యం సరికాదు
నాగర్‌కర్నూల్ రూరల్: జిల్లాలో అసంపూర్తిగా ఉన్న డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనుల పూర్తిపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్దం పర్వతాలు అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేయడం సరికాదన్నారు. డబుల్బెడ్రూం ఇళ్ల పనులను వెంటనే పూర్తిచేసి.. పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఎం నాయకులు పొదిల రామయ్య, అశోక్, వెంకటేశ్, మధు, చంద్రశేఖర్, సత్యనారాయణ, మల్లికార్జున్ ఉన్నారు. -
తెలంగాణ గుండెచప్పుడు సాయిచంద్
అమరచింత: సాయిచంద్ పాట తెలంగాణ రాష్ట్రానికే గుండె చప్పుడుగా మారిందని.. బీఆర్ఎస్ కుటుంబాన్ని విడిచి వెళ్లడం బాధాకరమని మాజీ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం అమరచింతలో గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ సాయిచంద్ విగ్రహావిష్కరణ కార్యక్రమం సాయి అభిమానుల సమక్షంలో కనులపండువగా సాగింది. విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో మాజీమంత్రులతోపాటు మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ గొంతుకగా సాయి ప్రతి ఒక్కరి హృదయాల్లో గూడుకట్టుకున్నారని.. సిద్దిపేటలో చెత్త సేకరణ వాహనాలకు ఎలాంటి పాట బాగుంటుందని ఆలోచించానని, తను రాసి పాడిన పాటే ఇప్పటికీ మార్మోగుతుందని హరీశ్‌రావు అన్నారు. ఉద్యమ సమయంలో తన పాటలతో లక్షలాది మంది ప్రజలను ఉర్రూతలూగించిన వ్యక్తి సాయిచంద్ అని కొనియాడారు. భర్త లేకున్నా.. చిన్న పిల్లలతో కలిసి రజని చేస్తున్న పోరాటం అభినందనీయని.. ఆమె ఆశయ సాధనకు తామంతా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాజకీయపరంగా రజనికి కేసీఆర్ అభయం ఇచ్చారని.. వారి కుటుంబానికి మనోధైర్యం ఇద్దామన్నారు. సాయికి నివాళి అర్పించాలంటే మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలి.. కేసీఆర్ సీఎం కావాలని మనందరం సంకల్పించాలని కోరారు. -
బడులు బాగుపడేనా..?
ఉపాధ్యాయులకు పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలు తనిఖీ చేసే అంశాలు.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రగతికి సంబంధించిన అంశాలతో పాటు సైన్స్ ల్యాబ్‌ల వినియోగం, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన పథకం అమలు, పారిశుద్ధ్య చర్యలు, వైద్యం, తాగునీటి సదుపాయాలు, లైబ్రరీ ఇతర సౌకర్యాలను పరిశీలిస్తారు. ప్రాథమిక పాఠశాల తనిఖీ అధికారి రోజుకు రెండు స్కూళ్లను సందర్శించాలి. మూడు మాసాల్లో కనీసం వంద పాఠశాలలను తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఉన్నత పాఠశాలలకు సంబంధించి రోజుకు ఒక స్కూల్‌ను తనిఖీ చేయాలి. మూడు నెలల్లో దాదాపు 50 పాఠశాలలను తనిఖీ చేయాల్సి ఉంటుంది. తనిఖీ నివేదికలను డీఈఓకు అందజేస్తారు. వీటిపై ఉన్నతాధికారులు ప్రతినెలా 5వ తేదీన సమీక్షిస్తారు. ఉపాధ్యాయ సంఘాల వ్యతిరేకత.. పాఠశాలల తనిఖీలతో పాటు పర్యవేక్షణ బాధ్యతలు ఉపాధ్యాయులకు అప్పగించే విధానంపై పలు ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు, ఎంఈఓలు, జీహెచ్‌ఎంల పర్యవేక్షణలో ఉన్న పాఠశాలలను స్కూల్ అసిస్టెంట్లతో తనిఖీలు చేయించడం సరైంది కాదని పలువురు హెచ్ఎంలు పేర్కొంటున్నారు. అలాగే తనిఖీ చేసే ఉపాధ్యాయులకు హెచ్ఎంలు ఎంత వరకు సహకరిస్తారనేది అతిపెద్ద ప్రశ్న. మరోవైపు మండలానికి ముగ్గురు ఉపాధ్యాయులను నియమించడం వల్ల విద్యార్థులకు బోధనలో నష్టం జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలను ఉపాధ్యాయులకు అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కందనూలు: సర్కారు బడుల్లో విద్యా ప్రమాణాలు దిగజారిపోతున్నాయనే భావనలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేసైనా సరే.. తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చదివించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇది ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితులను అధిగమించడానికి, పాఠశాలలపై మరింత పర్యవేక్షణ పెంచడానికి రాష్ట్ర విద్యాశాఖ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలను ఉపాధ్యాయులకు అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. విద్యావ్యవస్థలో మార్పునకు సర్కారు చర్యలు ఇకపై పాఠశాలలను తనిఖీ చేయనున్న టీచర్లు బోధనపై ప్రభావం చూపుతుందని ఉపాధ్యాయ సంఘాల ఆందోళన జిల్లాలో 131 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, 125 ప్రాథమికోన్నత, 560 ప్రాథమిక పాఠశాలలు ఉండగా.. 3,513 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో జీహెచ్ఎంలు 152 మంది, పీఎస్ హెచ్ఎంలు 105, ఎస్జీటీలు 1,511 మంది, స్కూల్ అసిస్టెంట్లు 1,745 మంది ఉన్నారు. అయితే జిల్లాలో పనిచేస్తున్న మొత్తం ఉపాధ్యాయుల్లో 2శాతం మందిని తనిఖీ అధికారులుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంచాలి
తాడూరు: ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం పెంచేలా విద్యాబోధన ఉండాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శనివారం తాడూరు కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంతో పాటు మేడిపూర్ ఉన్నత పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను తెలుసుకోవడంతో పాటు ఏఐ బోధనా ప్రక్రియను పరిశీలించారు. అదే విధంగా అటల్ టింకరింగ్ సైన్స్ ల్యాబ్స్ ఏర్పాటుకు అవసరమైన గదులను కలెక్టర్ పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. మేడిపూర్ పాఠశాల విద్యార్థులు పదో తరగతిలో సాధించిన ఫలితాలపై ఆరా తీశారు. కేజీబీవీలో విద్యాబోధనను గమనించారు. పాఠ్యపుస్తకాల పంపిణీ, బోధనా లక్ష్యాలను తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఏఐ విద్యను సమర్థవంతంగా అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రతి విద్యార్థికి పాఠ్యపుస్తకాలు, నోట్‌పుస్తకాలు, యూనిఫామ్స్ అందించాలన్నారు. విద్యార్థుల భోజనం తయారీకి వినియోగించే పప్పుదినుసులు, వంట నూనె, బియ్యం ఇతర సామగ్రి నాణ్యతగా ఉండాలన్నారు. మెనూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అదే విధంగా సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని పాఠశాలల పరిసరాలను శుభ్రంగా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న వసతులను ప్రజలకు వివరించి.. విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచాలన్నారు. కాగా, కేజీబీవీలో నెలకొన్న సమస్యలను ప్రత్యేకాధికారిణి కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఇంటర్లో 80 మందికి గాను 70 మంది చేరినట్లు తెలిపారు. -
శనేశ్వరాలయానికి భక్తుల తాకిడి
బిజినేపల్లి: నందివడ్డెమాన్ జేష్ట్యాదేవి సమేత శనేశ్వరాలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. శనిదోష నివారణ కోసం శనేశ్వరుడికి తిలతైలాభిషేకాలు నిర్వహించేందుకు తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు.ఆలయ ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి ఆధ్వర్యంలో శనేశ్వరుడికి తిలతైలాభిషేకాలు, గోత్రనామార్చనలు చేశారు. అనంతరం శివాలయాన్ని సందర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో అర్చకులు శాంతికుమార్, ఉమామహేశ్వర్, సిబ్బంది గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. ఖైదీలకు మెరుగైన వసతులు కల్పించాలి నాగర్‌కర్నూల్ క్రైం: సబ్‌జైలులో ఖైదీలకు మెరుగైన వసతులు కల్పించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నసీం సుల్తానా అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సబ్‌జైలులో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. క్షణికావేశం, ఇతరాత్ర కారణాలతో నేరాలకు పాల్పడి జైలుశిక్ష అనుభవిస్తున్న ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. ఎవరికై నా న్యాయవాదిని నియమించుకోలేని పరిస్థితి ఉంటే.. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా న్యాయవాదిని నియమిస్తామని తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
జలయజ్ఞం ప్రాజెక్టులు పూర్తి
గద్వాల/ధరూరు: కాంగ్రెస్ హయాంలో జలయజ్ఞం కింద చేపట్టిన నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను డిసెంబర్ నాటికి పూర్తి చేయడంతో పాటు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి అందుబాటులోకి తీసుకొస్తామని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టులను మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా జూరాల గేట్ల మరమ్మతు, ర్యాలంపాడు జలాశయం లీకేజీలపై అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. అనంతరం జోగుళాంబ గద్వాల కలెక్టరేట్లో మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి మంత్రి ఉత్తమ్ విలేకర్లతో మాట్లాడారు. జూరాల ప్రాజెక్టు సాంకేతికపరంగా పూర్తి భద్రంగా ఉందన్నారు. ప్రాజెక్టుకు ఉన్న 62 గేట్లలో 58 గేట్లు నిర్విరామంగా సురక్షితంగా పనిచేస్తున్నాయని.. మిగిలిన నాలుగు గేట్లకు అవసరమైన మరమ్మతులు చేపడుతున్నట్లు వివరించారు. గతంలో జూరాలకు 11 లక్షల క్యూసెక్కులకు పైగా వచ్చిన వరదను విజయవంతంగా ఎదుర్కొన్నట్లు గుర్తుచేశారు. అయితే జూరాల జలాశయంలో సిల్ట్ పేరుకుపోయిన కారణంగా నీటినిల్వ సామర్థ్యం 25 శాతం తగ్గిందని.. డీసిల్టింగ్ చేపట్టి జలాశయంలో పూర్తిస్థాయి నీటిని నిల్వ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల నిర్వహణకు అవసరమైన ఇంజినీర్లు, లస్కర్లు కూడా లేని దయనీయ పరిస్థితిలో తెచ్చిపెట్టారని విమర్శించారు. జూరాల డ్యాంపై నుంచి భారీ వాహనాల రాకపోకలు ప్రమాదకరమని నీటిపారుదలశాఖ అధికారులు నివేదికలు ఇచ్చినా.. వాటిని బుట్టదాఖలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ నాయకులదని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం వచ్చిన 18 నెలల కాలంలోనే పాత ప్రాజెక్టుల ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ప్రాజెక్టుల నిర్వహణ కోసం 110 మంది ఇంజినీర్లతో పాటు 1,800 మంది లస్కర్లను నియా మకం చేశామన్నారు. సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ.. పాత ప్రాజెక్టుల నిర్వహణ సక్రమంగా చేపట్టడంతో పాటు కొత్త ప్రాజెక్టులను పూర్తిచేసి బీడు భూములను సస్యశ్యామలం చేయ డమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. రూ.3.5 కోట్లతో మరో గ్యాంటీ క్రేన్.. జూరాల డ్యాం సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఉన్న గ్యాంటీ క్రేన్‌కు అదనంగా రూ. 3.5 కోట్లతో మరో గ్యాంటీ క్రేన్ మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ర్యాలంపాడు జలాశయానికి ఏర్పడిన లీకేజీలకు పూర్తిస్థాయిలో మరమ్మతు చేస్తామన్నారు. అందులో నాలుగు టీఎంసీల నీటిని నిల్వ చేసి.. పూర్తిస్తాయి ఆయకట్టుకు సాగునీటిని అందిస్తామని స్పష్టం చేశారు. నెట్టెంపాడు ప్రాజెక్టు పనుల పూర్తికి అవసరమైన రూ. 500కోట్లు మంజూరు చేస్తామన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి కోరిక మేరకు ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ, ఆర్అండ్ఆర్, కెనాల్స్ నిర్మాణ పనులను యుద్దప్రాతిపదికన పూర్తి చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి విజ్ఞప్తి మేరకు రామన్‌పాడ్ కింద డీ–6 పరిధిలో ఎమర్జెన్సీ క్రేన్, గేట్లు వంటి నిర్మాణాలు చేపడతామన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్రాధాన్యం జూరాల జలాశయంలో డీసిల్టింగ్‌కు చర్యలు సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దుష్ప్రచారాన్ని నమ్మొద్దు: మంత్రి వాకిటి ప్రాజెక్టుల నిర్వహణలో నిర్లక్ష్యం.. జూరాల ప్రాజెక్టు భద్రంగా ఉందని.. ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకుల దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. ప్రతిపక్ష నాయకులు ప్రజల్లో అనవసరంగా ఆందోళన కలిగించే ప్రచారం చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మాట్లాడుతూ.. జూరాల జలాశయంలో సిల్ట్ పేరుకుపోయి నీటినిల్వ సామర్థ్యం తగ్గిందని, పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో కలెక్టర్ బీఎం సంతోష్, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మేఘారెడ్డి, పర్ణికారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, ఈఎన్సీ శ్రీనివాస్, సీఈ ప్రమీల, సత్యనారాయణ, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఎస్ఈ రహీముద్దీన్ తదితరులు ఉన్నారు. -
శ్రీశైలం జలాశయానికి జలకళ
సాక్షి, నాగర్‌కర్నూల్: ఈసారి వానాకాలం సీజన్ ప్రారంభంలోనే కృష్ణానది నీటితో కళకళలాడుతోంది. ఎగువన కర్ణాటక ప్రాంతంలో కురిసిన వర్షాలకు వస్తున్న వరద నీటితో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జూరాల ప్రాజెక్ట్ నిండటంతో గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం రిజర్వాయర్ శరవేగంగా నిండుతోంది. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి సామర్థ్యం 215.80 టీఎంసీలకు శుక్రవారం నాటికి 125.1322 టీఎంసీలకు చేరింది. సాధారణంగా జూలై, ఆగస్టు నెలల్లో ఈస్థాయి నీటిమట్టానికి చేరుకునే ఈ ప్రాజెక్టులోఈసారి జూన్ నెలలోనే జలాశయం సగానికి పైగా నిండటం విశేషం. ● వారం రోజులుగా కర్ణాటక రాష్ట్రంలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్ట్‌ల నుంచి జూరాల జలాశయానికి నీటి వరద కొనసాగుతోంది. ప్రస్తుతం జూరాలలో 7.371 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేపడుతున్నారు. జూరాల ఆయకట్టుతో పాటు భీమా, కోయిల్‌సాగర్ లిఫ్ట్ కెనాల్, ఆర్డీఎస్ లింక్ కెనాళ్లకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్ట్ నుంచి దిగువకు 1.14 లక్షల వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం జలాశయంలో గరిష్ట నీటిమట్టం 885 అడుగులకు ప్రస్తుతం 865.7 అడుగల ఎత్తుకు చేరుకుంది. ఇంకా వర్షాలతో పాటు వరద కొనసాగితే మరో 10–15 రోజుల్లోనే శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిండుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జూన్ మాసంలోనే కృష్ణానదిలో నీటి ప్రవాహం పెరగడంతో సాగునీటి ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ఈసారి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద మొత్తం 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్ కింద 29వ ప్యాకేజీ విస్తరణ పనులు సైతం కొనసాగుతున్నాయి. ఇప్పటికే శ్రీశైలం జలాశయానికి భారీగా నీరు వస్తుండడంతో కేఎల్ఐ కింద ఆయకట్టుకు ముందస్తుగానే సాగునీరు అందించేందుకు వీలుంది. జూరాల ప్రాజెక్ట్ ఇప్పటికే నిండటంతో ప్రాజెక్ట్ ఆయకట్టుకు నీటి విడుదల ప్రారంభమైంది. శ్రీశైలం జలాశయంలో పెరిగిన నీటి మట్టం ఈసారి ముందుగానే ఆయకట్టుకు నీటి సరఫరా.. మూడు మోటార్లు సిద్ధంగా ఉన్నాయి.. ఈసారి ముందుగానే కృష్ణానదిలో నీటి ప్రవాహం అందుబాటులో ఉండటంతో కేఎల్ఐ ద్వారా ఆయకట్టుకు నీరందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఎల్లూరు వద్ద పంప్‌హౌస్‌లో మూడు మోటార్లు అందుబాటులో ఉన్నాయి. ఎప్పటికప్పుడు నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లను నింపేలా చర్యలు తీసుకుంటాం. రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. – శ్రీనివాస్‌రెడ్డి, ఈఈ, నీటిపారుదల శాఖ మరమ్మతులు పూర్తయితేనే పూర్తిస్థాయి వినియోగం కృష్ణానదిలో నీరు సమృద్ధిగా ఉన్నప్పటికీ కేఎల్ఐ కింద పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరందించాలంటే మోటార్ల మరమ్మతులను వేగంగా పూర్తిచేయాల్సి ఉంది. కేఎల్ఐ ప్రాజెక్ట్‌లో భాగమైన ఎల్లూర్ పంప్‌హౌస్‌లో మొత్తం ఐదు మోటార్లకు రెండు మోటార్లు రిపేర్‌లో ఉన్నాయి. 3వ, 5వ మోటార్లు గతంలోనే పాడవగా, వీటి మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.14 కోట్లు కేటాయించింది. మోటార్ల రిపేరు పనులు కొనసాగుతున్నాయి. సీజన్ ప్రారంభం అయ్యే నాటికి మోటార్లను సిద్ధంగా ఉంచుతామని అధికారులు చెబుతున్నారు. కేఎల్ఐ కింద పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరందించాలంటే మోటార్ల మరమ్మతును పూర్తిచేయాల్సి ఉంది. కేఎల్ఐ రిజర్వాయర్ల సామర్థ్యం టీఎంసీ కన్నా తక్కువగా ఉండటంతో ఎక్కువ నీటిని స్టోరేజీ చేసుకునే అవకాశం లేదు. అందువల్ల ప్రతి వారం రోజులకు ఒకసారి మూడు రిజర్వాయర్లను నింపుకోవాల్సి ఉంటుంది. అలాగే మిషన్‌భగీరథ నీటి సరఫరాతో పాటు సాగునీటి సరఫరాకు మోటార్ల ద్వారా నిరంతరం నీటి ఎత్తిపోతలను కొనసాగించాల్సి ఉంది. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
కొల్లాపూర్ రూరల్: పశువులకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వెటర్నరీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా పశువైద్యాధికారి జ్ఞాన శేఖర్ సూచించారు. శుక్రవారం కొల్లాపూర్, సింగోటం, పెంట్లవెల్లి పశువైద్య కేంద్రాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు పశువులు, జీవాలకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని పశువుల పెంపకందారులకు అందుబాటులో ఉండాలని వైద్యులకు సూచించారు. ఆయన వెంట కొల్లాపూర్ పశువైద్యాధికారి యాదగిరి, సిబ్బంది వెంకటస్వామి ఉన్నారు. -
స్నాతకోత్సవానికి వేళాయె
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో 2023– 25 విద్యా సంవత్సరం వరకు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ, ఫార్మ వంటి కోర్సులు చదువుతూ అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు గోల్డ్‌మెడల్స్ ప్రదానం చేసే స్నాతకోత్సవానికి యూనివర్సిటీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. అందులో భాగంగా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల జాబితాను సిద్ధం చేశారు. మొత్తం 88 మంది విద్యార్థులకు మెడల్స్ అందజేసేందుకు కసరత్తు చేస్తున్నారు. వీరితో పాటు కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు సైతం కాన్వకేషన్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు అధికారులు విద్యార్థుల నుంచి దరఖాస్తులు సైతం స్వీకరించారు. గతేడాది చివరలో కూడా కాన్వకేషన్ నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేసినప్పటికీ కొన్ని కారణాలతో నిర్వహించలేదు. ఈ క్రమంలోనే తాజాగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ము ఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ మేరకు పీ యూ వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్‌బాబు గవర్నర్‌కు ఆహ్వానం అందించారు. ఈ క్రమంలో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో గవర్నర్ ఇచ్చే తేదీల ఆధారంగా కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉంది. స్పాన్సర్లకు అవకాశం.. కాన్వకేషన్‌లో మెడల్స్ ఇచ్చేందుకు అధికారులు పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. అయితే ఆసక్తి గలవారు స్పాన్సర్షిప్ చేస్తే వారి పేరు మీద కూడా మెడల్స్ ప్రదానం చేయనున్నారు. ఇందుకోసం వ్యక్తులు యూనివర్సిటీ పేరు మీద రూ.2 లక్షలు డిపాజిట్ చేస్తే కేవలం ఆ డబ్బుల మీద వచ్చే వడ్డీతో మాత్రమే మెడల్స్‌ను విద్యార్థులకు అందజేస్తారు. అందుకోసం ఆసక్తి గలవారు నేరుగా యూనివర్సిటీ అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. పీయూలో 4వ కాన్వకేషన్‌కు సిద్ధమవుతున్న అధికారులు ఘనంగా నిర్వహిస్తాం.. పీయూ 4వ కాన్వకేషన్ కార్యక్రమాన్ని సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నిర్వహించేందుకు పెద్దఎత్తున కసరత్తు చేస్తున్నాం. కార్యక్రమానికి హాజరుకావాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మకు ఆహ్వానం అందించారు. ముఖ్యంగా గోల్డ్‌మెడల్స్ ఇచ్చేందుకు స్పాన్సర్లు ముందుకు వస్తే వారి పేరు మీద కూడా అందిస్తాం. ఇందు కోసం రూ.2 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. – శ్రీనివాస్, పీయూ వీసీ 88 మంది విద్యార్థులకు గోల్డ్‌మెడల్స్ పీయూ పరిధిలో 2022–23, 2023–24, 2024–25 విద్యాసంవత్సరానికి సంబంధించి యూనివర్సిటీ టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు త్వరలో నిర్వహించే 4వ స్నాతకోత్సవ కార్యక్రమంలో గోల్డ్‌మెడల్స్ అందించనున్నట్లు పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రవీణ పేర్కొన్నారు. ఇందులో ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్, సోషల్ సైన్స్, కామర్స్‌లో 21 మంది విద్యార్థులు, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్‌లో 27 మంది, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీలో 14 మంది, ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో 9, యూజీ కోర్సులలో టాపర్స్‌లో 17 మంది గోల్డ్‌మెడల్స్ అందించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు గోల్డ్‌మెడల్స్ సాధించిన విద్యార్థుల జాబితాను సంబంధిత కళాశాలలకు పంపించామని, వాటిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే నాలుగు రోజుల్లో తెలపవచ్చని పేర్కొన్నారు. –ప్రవీణ, పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మకు ఆహ్వానం యూజీ, పీజీ, పీహెచ్డీ, ఫార్మలో మొత్తం 88 మందికి గోల్డ్‌మెడల్స్ రూ.2 లక్షలు స్పాన్సర్ చేస్తే వారి పేరు మీద విద్యార్థులకు గోల్డ్‌మెడల్స్ ఇచ్చే అవకాశం -
దేశానికే రోల్ మోడల్ తెలంగాణ
కల్వకుర్తి రూరల్: అభివృద్ధి, ప్రజా సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తోందని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి కల్వకుర్తి మండలం జంగారెడ్డిపల్లిలో రూ. 26కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఇప్పటికే మహిళా సంఘాల సభ్యులతో పెట్రోల్ బంక్‌లు, ఇందిరా మహిళాశక్తి క్యాంటీన్లు, రైస్‌మిల్లులు తదితర వాటిని ఏర్పాటు చేయిస్తున్నట్లు చెప్పారు. పేదల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని పథకాలను అమలు చేస్తున్నామన్నారు. అదే విధంగా విద్య, వైద్యరంగాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 100 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామన్నారు. నిరుద్యోగ యువతకు 60వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. రైతుభరోసా పథకం ద్వారా రైతులకు సకాలంలో పంట పెట్టుబడి సాయం అందించినట్లు చెప్పారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మా ట్లాడుతూ.. కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి గ్రామానికి బీటీరోడ్డు సౌకర్యం కల్పించడమే తమ లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఎంపీ మల్లు రవి సహకారంతో దాదాపు రూ. 600కోట్లతో సీసీ, బీటీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. వచ్చేనెల 7న వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పొ ల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు బాలాజీ సింగ్, మాజీ జెడ్పీటీసీ అశోక్‌రెడ్డి, సంజీవ్ యాదవ్, విజయకుమార్‌రెడ్డి, ఆనంద్ కుమార్, లింగారెడ్డి, మాజీ ఎంపీటీసీ రామకృష్ణ, రాజేశ్‌రెడ్డి, పండిత్రావు, భూపతి రెడ్డి, ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, సుదర్శన్‌రెడ్డి, బాలస్వామిగౌడ్ పాల్గొన్నారు. -
తీరని ‘కౌలు’ కష్టం!
అడియాశలుగానే మారిన ‘రైతుభరోసా’ ●ప్రభుత్వం ఆదుకోవాలి.. నాకు రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. దీనికి తోడు ఎకరాకు రూ. 8వేల చొప్పున మూడెకరాలను కౌలుకు తీసుకొని పత్తిసాగు చేస్తున్నా. కౌలు డబ్బులే కాకుండా పెట్టబడికి రూ.లక్ష వరకు ఖర్చు అవుతోంది. మొత్తంగా ఐదెకరాలకు రూ. 1.50 లక్షల పెట్టుబడి అవుతుంది. గతేడాది పంట దిగుబడి రాక రూ. 50వేలు నష్టపోయా. ప్రభుత్వం కౌలు రైతులకు సైతం భరోసా ఇచ్చి ఆదుకోవాలి. – నిమ్మల బాలింగయ్య, జంగంరెడ్డిపల్లి, అమ్రాబాద్ పెట్టుబడులు పెరిగాయి.. 13 ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నా. ఒక పంటకు ఎకరా రూ. 10వేల చొప్పున 8 ఎకరాలు, మరో ఐదెకరాలు రూ. 8వేల చొప్పున కౌలు చెల్లిస్తున్నా. ఏటేటా పెట్టుబడులు పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు ఇస్తామన్నా రైతుభరోసా అందించి ఆదుకోవాలి. పెట్టుబడి సాయం మాకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. పంటల బీమా పథకాన్ని కూడా వర్తింపజేయాలి. – రాసమోల్ల శివ, తెలుగుపల్లి, అమ్రాబాద్ అచ్చంపేట: కౌలు రైతులకు సాగు కష్టాలు తీరడం లేదు. ఏటా కౌలు ధరలు పెరుగుతుండటం.. ప్రైవేటులో అప్పులు తెచ్చి సాగు చేయడం.. అష్టకష్టాలు పడి పండించిన పంటను విక్రయించేందుకు తీవ్ర ఇబ్బందులు పడటం పరిపాటిగా మారాయి. పంటల విక్రయం, ఎరువుల కొనుగోలుకు సైతం నానాయాతన పడక తప్పడం లేదు. గత ప్రభుత్వా ల మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా వారిపై కనికరం చూపడం లేదు. రాష్ట్రంలోని కౌలు రైతులందరికీ రైతుభరోసా పథకం కింద సీజన్‌కు రూ. 12వేల చొప్పున అందిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులను సైతం స్వీకరించింది. అయితే ఇప్పటి వరకు ఆ ఊసెత్తడం లేదు. దీంతో కౌలు రైతుల ఆశలు అడియాశలుగానే మారాయి. ఎకరా రూ.15వేల వరకు.. రెండేళ్ల క్రితం కౌలు ధరలు అంతంత మాత్రంగానే ఉండేవి. కానీ ప్రస్తుతం కౌలు ధరలు అమాంతం పెరిగాయి. ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఎకరాకు రూ.10వేల నుంచి 15వేల వరకు కౌలు తీసుకుంటున్నారు. వీరికి ప్రభుత్వ పరంగా ఎలాంటి చేయూత అందడం లేదు. కనీసం బ్యాంకుల్లో పంట రుణాలకు కూడా వీరు అర్హులు కాలేకపోతున్నారు. సాగు పెట్టుబడుల కోసం అధిక వడ్డీలకు ప్రైవేటు అప్పులు చేయాల్సి వస్తోంది. ప్రకృతి వైపరీత్యాలతో పంటలకు నష్టం వాటిల్లినా ప్రభుత్వపరంగా అందించే సాయం పట్టాదారుల ఖాతాల్లోకి చేరుతుంది. వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకోవాలన్నా పట్టాదారుల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయాలన్నా పట్టాదారుల పేరుమీదే కొనుగోలు చేస్తున్నారు. చివరి దాకా కష్టాలే.. కౌలు రైతుకు సాగు సీజన్ ప్రారంభం ఉంచి మొదలుకుని సీజన్ పూర్తయ్యే వరకు కష్టాలు వెన్నంటి ఉంటున్నాయి. ప్రస్తుతం వ్యవసాయ రంగంలోని ప్రతీది ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఫలితంగా విత్తనాల కొనుగోలు నుంచి మొదలుకుని పంట అమ్మే వరకు పట్టాదారు పాస్‌పుస్తకం అవసరమవుతోంది. ఈ క్రమంలో కౌలురైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాల జిరాక్స్ ఇచ్చేందుకు భూ యాజమానులు కొందరు వెనకడుగు వేస్తున్నారు. దీంతో ఎరువులు, విత్తనాల కోసం దళారులను ఆశ్రయించి మోసపోతున్నారు. విత్తన, ఎరువుల ధరలకు తోడు పెరుగుతున్న కౌలు పెట్టుబడుల కోసం తప్పని ప్రైవేటు అప్పులు ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు జిల్లావ్యాప్తంగా 70వేల మందికి పైగానే.. జిల్లాలో 7,59,793 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గతేడాది వానాకాలంలో 4,35,692 ఎకరాల్లో సాగుచేయగా.. ఈ ఏడాది 5,38,462 ఎకరాలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అంచనా. మొత్తం 3,22,724 మంది రైతులు ఉండగా.. వీరిలో 70వేల మందికి పైగా కౌలురైతులు ఉన్నారని వ్యవసాయాధికారుల ప్రాథమిక అంచనా. అయితే వీరిలో చాలా మంది తమకు ఉన్న ఎకరం, ఆరెకరం భూమితో పాటుగా మూడెకరాల నుంచి ఐదెకరాల వరకు కౌలుకు తీసుకొని పంటసాగు చేస్తున్నారు. వీరికి బ్యాంకుల నుంచి పంట రుణాలు ఇవ్వక.. రైతుభరోసా అందక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. పంట పెట్టబడులకు ప్రైవేటు అప్పులపైనే ఆధారపడుతున్నారు. -
ప్రమాదంలో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు
ఇప్పటికే ప్రాజెక్టులోని 18 గేట్ల వద్ద రబ్బర్ సీల్, ఇనుప రోప్‌లు దెబ్బతిన్నాయి. అందులో 8, 12, 19, 21, 25, 27, 50 నంబర్ గేట్లతో పాటు మరికొన్నింటి నుంచి నీరు నిత్యం లీకేజీ అవుతోంది. అయినప్పటికీ అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఎగువ నుంచి వరద రావడం.. ప్రాజెక్టులోని మరో రెండు గేట్ల వద్ద ఇనుప రోప్‌లు తెగిపోవడంతో ఎప్పుడేం జరుగుతుందోనని సమీప గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ● మరమ్మతుకు నోచుకోని ఆనకట్ట క్రస్ట్‌గేట్లు ● ఒకదాని తర్వాత మరొకటి తెగిపోతున్న గేట్ల ఇనుప రోప్‌లు ● ‘సాక్షి’ ముందే హెచ్చరించినా స్పందించని యంత్రాంగం ● తాత్కాలిక మరమ్మతులతోనేసరిపెడుతున్న వైనం ● భారీ వరదలు వస్తే ప్రమాదం తప్పదంటున్న సమీప గ్రామాల ప్రజలు లీకేజీల మయం.. -
మాదకద్రవ్యాల నిర్మూలన అందరి బాధ్యత
నాగర్‌కర్నూల్ క్రైం: మాదకద్రవ్యాలను నిర్మూలించాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా జడ్జి రమాకాంత్ అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం జిల్లా పోలీసుశాఖ, మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానం నుంచి చేపట్టిన అవగాహన ర్యాలీని కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్‌తో కలిసి జిల్లా జడ్జి ప్రారంభించగా.. జిల్లా జనరల్ ఆస్పత్రి వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలు గ్రామస్థాయి వరకు వచ్చాయన్నారు. సమాజానికి ఒక చీడపురుగులా మాదకద్రవ్యాల వ్యవస్థ మారిందని.. వాటిని రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. యువత మాదకద్రవ్యాల జోలికి వెళ్లకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కళాశాలలు, పాఠశాలల్లో చదివే విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిరోధక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ● కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయని అన్నారు. వీటిని విక్రయించే వారి సమాచారం తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో మత్తు పదార్థాల నిరోధక కమిటీలను బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. డ్రగ్స్ వినియోగంతో ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలపై అందరికీ అవగాహన ఉండాలన్నారు. ఇప్పటికే జిల్లాలో డ్రగ్స్ బారిన పడిన యువత కోసం ప్రభుత్వ ఆస్పత్రిలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అక్కడ మెరుగైన వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. డ్రగ్స్ నిర్మూలనలో యు వత ముఖ్యభూమిక పోషించి సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ● ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ మాట్లాడుతూ.. జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలన కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థులకు మాదకద్రవ్యాలతో కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు జిల్లా పోలీసుశాఖ సత్వర చర్యలు చేపడుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నసీం సుల్తానా, జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ అధికారిణి రాజేశ్వరి, డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి జిల్లా జడ్జి రమాకాంత్ -
ఏసీబీ నజర్!
కల్వకుర్తి టౌన్: అవినీతి అధికారులకు ఏసీబీ భయం పట్టుకుంది. బుధవారం కల్వకుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ–2 రాంచందర్‌జీ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన నేపథ్యంలో ఇతర శాఖల్లోని అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఒక్కో పనికి ఓ రేటు కట్టి మరీ వసూలు చేస్తున్నారని.. లంచం ఇవ్వకుంటే పనిచేయడం లేదని ప్రజలు బహిరంగంగా చెబుతు న్నారు. అయితే ఇటీవల పలు ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు మంజూరు చేసేందుకు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అధికారులు ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటిపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఈ మేరకు పట్టణంలోని పలు కార్యాలయాలపై ఏసీబీ నిఘా పెట్టిందని తెలిసింది. ముఖ్యంగా లబ్ధిదారులకు పథకాలను చేర్చడంలో కీలకంగా వ్యవహరించే రెవెన్యూ, మున్సిపల్ శాఖలపై అవినీతి ఆరోపణలు ఉండటంతో ఏసీబీ అధికారులు ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలుస్తోంది. పలు శాఖల అధికారులపై అవినీతి ఆరోపణలు ప్రభుత్వ పథకాలు అందించడంలోనూ చేతివాటం ఏసీబీ దాడులతో అవినీతిపరుల గుండెల్లో రైళ్లు -
పొంచి ఉన్న ముప్పు..
జూరాల ప్రాజెక్టుకు అత్యంత సమీపంలో మా గ్రామం ఉంటుంది. 2009 భారీ వరదల్లో పంట పొలాలు మునిగిపోవడంతో పాటు గుడిసెలు, పశుగ్రాసం నీటిలో కొట్టుకుపోయాయి. అప్పటి వరద ప్రవాహాన్ని చూసి భయపడ్డా. ఇప్పుడు క్రస్ట్‌గేట్ల ఇనుప రోప్‌లు తెగిపోయిందంటున్నారు. గేట్లు కొట్టుకుపోతే మా గ్రామం నీటిలో మునిగిపోవడం ఖాయం. ప్రభుత్వం చొరవ చూపి ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడాలి. – అలంపూర్ ఆశన్న, నందిమళ్ల గొర్రెలు కొట్టుకుపోయాయి.. 2009లో వచ్చిన భారీ వరదలతో మూలముళ్ల గ్రామం అతలాకుతలం అయింది. భయంతో జనం పరుగులు తీశారు. నేను గొర్రెలను మేత కోసం నది సమీపంలోకి తీసుకెళ్లగా.. వరద నీటిలో చిక్కుకుని కొట్టుకుపోయాయి. ఇలాంటి ఘటనలు మరోమారు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. – బీసన్న, మూలమళ్ల ముందస్తు వరదతో పనులకు అడ్డంకి.. డ్యాం క్రస్ట్‌గేట్లకు మరమ్మతు చేసేందుకు మూడేళ్ల క్రితం రూ.11కోట్ల నిధులు వచ్చాయి. 2022లో పనులు కొంతమేర వేగవంతంగా జరిగాయి. 2023లో గ్యాంటీ క్రేన్‌కు సమస్య తలెత్తడంతో పనులకు ఆటంకం ఏర్పడింది. క్రస్ట్‌గేట్ల ఇనుప రోప్‌లు తెగిపోయిందన్న మాట వాస్తవం కాదు. ఇది వరకే ఎనిమిది గేట్లకు సంబంధించి మరమ్మతులు మొదలుపెట్టాం. అయితే ముందస్తు వరద రావడంతో పనులకు అడ్డంకిగా మారింది. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఎలాంటి ప్రమాదం లేదు. మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేస్తాం. – రహీముద్దీన్, ఎస్ఈ, ఇరిగేషన్‌శాఖ ప్రభుత్వ నిర్లక్ష్యమే.. జూరాల ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లు దెబ్బతిన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రాజెక్టు నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాంట్రాక్టర్ సకాలంలో పనులు చేయకపోయినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. క్రస్ట్‌గేట్ల రూప్లు తెగినా పట్టించుకోని స్థితిలో ప్రాజెక్టు అధికారులు ఉండటం దారుణం. – చింతలన్న, నందిమళ్ల ● -
నిర్లక్ష్యమేలా..?
నాగర్కర్నూల్శుక్రవారం శ్రీ 27 శ్రీ జూన్ శ్రీ 2025కృష్ణాబేసిన్‌లో తెలంగాణ తొలి ప్రాజెక్టు.. ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయినిప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు మరమ్మతుపై అంతులేని నిర్లక్ష్యం వెంటాడుతోంది. ఫలితంగా ప్రాజెక్టు ఆయువుపట్టుగా నిలిచే క్రస్ట్‌గేట్ల ఇనుప రోప్‌లు ఒకదాని తర్వాత మరొకటి తెగిపోతున్నాయి. ఇది వరకే 8 గేట్ల వద్ద ఇనుప రోప్‌లు తెగిపోగా.. తాజాగా 4, 36వ గేట్లకు సంబంధించిన రోప్‌లు తెగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇంత జరుగుతున్నా.. అధికారులు మాత్రం తాత్కాలిక మరమ్మతులతోనే సరిపెడుతున్నారు. – గద్వాల/అమరచింత జూరాల ప్రాజెక్టులోని మొత్తం క్రస్ట్‌గేట్లకు రబ్బర్ సీల్స్, రోప్స్, పేయింటింగ్, సాండ్ బ్లాస్టింగ్, గేట్ల స్ట్రెన్తెనింగ్ వంటి మరమ్మతుల కోసం మూడేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం రూ.11 కోట్లు విడుదల చేసింది. అయితే నాటి నుంచి కేవలం 23శాతం పనులను మాత్రమే పూర్తిచేశారు. తాజాగా వరదలు మొదలయ్యే సమయంలో క్రస్ట్‌గేట్లకు ఉన్న ఇనుప రోప్‌లు తెగిపోతుండటంతో ప్రాజెక్టు మనుగడపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీనిపై గతంలోనే పలుమార్లు ‘సాక్షి’ వరుస కథనాలతో హెచ్చరించినా..అధికార యంత్రాంగం స్పందించలేదు. జూరాల ప్రాజెక్టు మరమ్మతుపై నిర్లక్ష్యం వీడ లేదు. -
కళ్లను అశ్రద్ధ చేయొద్దు
నాగర్‌కర్నూల్ క్రైం: ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆరు నెలలకోసారి కంటి పరీక్షలు చేయించుకోవాలని డీఎంహెచ్ఓ డా.స్వరాజ్యలక్ష్మి సూచించారు. జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ భవనంలో గురువారం జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో కంటివైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్లను అశ్రద్ధ చేయొద్దన్నారు. ఎవరికై నా కంటి సమస్యలు ఉంటే వెంటనే సంబంధిత వైద్యులను సంప్రదించాలని సూచించారు. శిబిరంలో మొత్తం 120 మందిని పరీక్షించి.. 46 మందికి శస్త్రచికిత్సలు అవసరమని గుర్తించినట్లు డీఎంహెచ్ఓ తెలిపారు. కంటి పొర, క్యాటరాక్ట్ సమస్యలతో బాధపడుతున్న వారిని ప్రత్యేక అంబులెన్స్‌లో మహబూబ్‌నగర్ ఏనుగొండలోని లయన్ రామిరెడ్డి కంటి ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.వెంకటదాసు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. రవికుమార్ నాయక్, ఆప్తాలమిక్ అధికారి కొట్ర బాలాజీ, కుమార్, శ్రీను, సురేశ్ పాల్గొన్నారు. -
రోగులకు అందుబాటులో మెరుగైన వైద్యం
లింగాల: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా అదనపు వైద్యాధికారి తారాసింగ్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని బుధవారం జిల్లా అదనపు వైద్యాధికారి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఆస్పత్రి తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోకి చేరడంతో త్వరలో అన్ని రకాల పోస్టులు భర్తీ అవుతాయన్నారు. దీంతో రోగులకు 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. త్వరలో సాధారణ కాన్పులు చేయడంతో పాటు ఆపరేషన్ థియేటర్‌ను కూడా ప్రారంభిస్తామన్నారు. మృతదేహాలకు ఇక్కడే పోస్టుమార్టం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రోగులు రూ.వేలు ఖర్చు పెట్టి ఆస్పత్రులకు వెళ్లొద్దని, సర్కార్ దవాఖానాలోనే అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. రేపు రెడ్‌క్రాస్ సొసైటీ సర్వసభ్య సమావేశం నాగర్‌కర్నూల్ క్రైం: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా సర్వసభ్య సమావేశాన్ని ఈనెల 27న జిల్లా కేంద్రంలోని ఎస్జేఆర్ ఫంక్షన్ హాల్లో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నట్లు జిల్లా రెడ్‌క్రాస్ కార్యదర్శి రమేష్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీలో శాశ్వత సభ్యత్వం కలిగిన సభ్యులతో పాటు ప్యాట్రన్, వైస్ ప్యాట్రన్ సభ్యత్వం కలిగిన వారు సమావేశానికి హాజరు కావాలని కోరారు. రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ కలెక్టర్ సూచనలతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని తెలిపారు. రేపు పాలెంలో పాలిసెట్ కౌన్సెలింగ్ బిజినేపల్లి: మండలంలోని పాలెం శ్రీవేంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (ఏ)లో శుక్రవారం నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా.రాములు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 29వ తేదీ వరకు నిర్వహించే పాలిసెట్ కౌన్సెలింగ్‌కు వచ్చే విద్యార్థులు తమ వెంట ఒరిజినల్ టీసీ, పది, సమాన తరగతుల మెమోలు, బోనఫైడ్లు, ఆదాయం సర్టిఫికెట్, స్థానిక ధ్రువీకరణపత్రం ఆధార్‌కార్డు రెండు సెట్ల జిరాక్స్ కాపీలతో పాటు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో తీసుకొని రావాలని సూచించారు. స్లాట్ బుకింగ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు 27, 28, 29 తేదీల్లో హాజరు కావాలన్నారు. దరఖాస్తుల ఆహ్వానం కందనూలు: సాహస రంగంలో పాల్గొన్న వ్యక్తులను గుర్తించడానికి యువజన, క్రీడల మంత్రిత్వ శాఖ టెంజింగ్ నార్వే నేషనల్ అడ్వెంజర్ అవార్డు–2024 ఎంపికకు http://awards. gov.in అనే వెబ్సైట్ ద్వారా జిల్లాలోని యువత దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన, క్రీడల అధికారి సీతారాం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అవార్డులు భూమిపై సాహసయాత్రలు, సముద్రంలో, ఆకాశంలో చేసే సాహస యాత్రలకు ఈ అవార్డు ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన వారు జూన్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. 37 వాహనాలకు వేలం తెలకపల్లి: మండల కేంద్రంలోని ఎకై ్సజ్ కార్యాలయంలో గురువారం ఉదయం 11గంటలకు వివిధ కేసుల్లో పట్టుబడిన 37 వాహనాలకు సంబంధించిన వేలం నిర్వహిస్తున్నట్లు ఎకై ్సజ్ ఎస్ఐ జనార్దన్ పేర్కొన్నారు. ద్విచక్ర వాహనాలకు రూ.5వేలు, ఫోర్ వీలర్ వాహనాలకు రూ.20వేలు చెల్లించి వేలం పాటలో పాల్గొనాలని కోరారు. వేలంలో వాహనం దక్కని వారికి వెంటనే డిపాజిట్ తిరిగి చెల్లిస్తామన్నారు. కేంద్ర బీమా పథకాలను వినియోగించుకోవాలి పాన్‌గల్: కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ శివకుమార్ అన్నారు. బుధవారం మండలంలోని తెల్లరాళ్లపల్లితండాలో దర్దీ ఆబా జన భాగీదారి అభియాన్‌లో భాగంగా ఇన్స్యూరెన్స్, పీఎం జనధన్ ఖాతాలు, సురక్ష బీమా యోజన, జీవన జ్యోతి బీమా తదితర వాటిపై తండా వాసులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ బీమా చేయించుకోవడంతో కుటుంబానికి కలిగే ప్రయోజనాలను వివరించి వారితో ప్రతిజ్ఞ చేయించారు. -
మదనగోపాలస్వామి ఆలయాన్ని సుందరీకరిస్తాం
పెంట్లవెల్లి: జటప్రోల్ గ్రామంలోని మదనగోపాలస్వామి ఆలయాన్ని సుందరీకరించి, భక్తులకు అన్ని వసతులు కల్పిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం మంత్రి స్పెషల్ పీఎస్ జయేశ్ రంజన్, పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వల్లూరు క్రాంతితో కలిసి జటప్రోల్తో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న పురాతన ఆలయాలు, కత్వ వాటర్ ఫాల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జటప్రోల్ గ్రామాన్ని, ఆలయాన్ని అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి సంవత్సరం నిర్వహించే మదనగోపాలస్వామి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించాలన్నారు. గ్రామ సమీపంలో ఉన్న కత్వ వాటర్‌ఫాల్స్‌ను వీక్షించేందుకు వచ్చే పర్యాటకుల కోసం సీసీ రోడ్డు వేయించాలని, రైతులకు ఉపయోపడే విధంగా చెక్‌డ్యాం నిర్మాణం చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోవింద్‌గౌడ్, నల్లపోతుల గోపాల్, భీంరెడ్డి, నాగిరెడ్డి, గుర్క ఆంజనేయులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. పర్యాటకుల కోసం వసతుల ఏర్పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు -
మాదకద్రవ్యాల నిర్మూలన అందరి బాధ్యత
బిజినేపల్లి: దేశ భవిష్యత్‌లో కీలకంగా వ్యవహరించే యువతపై చెడు ప్రభావం చూపిస్తున్న మాదక ద్రవ్యాలను నిర్మూలించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎస్పీ గైక్వాడ్ వైభవ్‌రఘునాథ్ అన్నారు. బుధవారం పాలెం వ్యవసాయ కళాశాల విద్యార్థుల కు మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పి ంచారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ మట్లాడుతూ.. మాదక ద్రవ్యాలకు బానిసయి న వారు సమాజం నుంచి తిరస్కరణకు గురవుతున్నారని, అంతేకాక శారీరక, మానసిక, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశా రు. మాదక ద్రవ్యాలను సరఫరా చేసే వారి సమాచారం పోలీసు అధికారులకు తెలియజేస్తే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ఎవరైనా మాదక ద్రవ్యాలు తాగుతున్నట్లు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇస్తే వారికి కౌన్సెలింగ్ ఇచ్చి, సాధారణ స్థితికి మారుస్తామన్నారు. కార్యక్రమంలో కళాశాల అసోసియేట్ డీన్ డా.పుష్పావతి, కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.సత్యనారాయాణ, సీఐ కనకయ్యగౌడ్, ఎస్ఐ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఎస్పీ గైక్వాడ్ వైభవ్‌రఘునాథ్ -
అవగాహన కల్పిస్తున్నాం
జిల్లాలో సీజనల్ వ్యాధు ల నివారణకు ముందస్తు అవగాహన చర్య లు చేపడుతున్నాం. ఆరోగ్యకేంద్రాల వారీగా వైద్య సిబ్బందిని అప్ర మత్తం చేశాం. కేసులు ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాధుల బారిన పడకుండా ఉండాలి. ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని పారిశుద్ధ్య, వైద్య సిబ్బందికి సహకరించాలి. – డా.స్వరాజ్యలక్ష్మి, డీఎంహెచ్ఓ, నాగర్‌కర్నూల్ ● -
కొండారెడ్డిపల్లి అభివృద్ధిలో వేగం పెంచండి
వంగూరు: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అధికారులను ఆదేశించారు. బుధవారం గ్రామంలో నిర్వహించిన సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన కలెక్టర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత కొండారెడ్డిపల్లిలోనే అంతర్గత విద్యుత్ లైన్ల ద్వారా విద్యుత్ సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే వంద శాతం సోలార్ విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ కొండారెడ్డిపల్లిని రాష్ట్రంలోనే ఆదర్శగ్రామంగా నిలపాలని కోరారు. ఫోర్‌లైన్స్ రోడ్డు, పాలశీతలీకరణ కేంద్రం పనులు పూర్తి చేయడంతో పాటు అండర్ డ్రెయినేజీ పనులు ప్రారంభించాలన్నారు. నిధుల కొరత లేదు కొండారెడ్డిపల్లితో పాటు అచ్చంపేట నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఎలాంటి నిధుల కొరత లేదని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో ముఖ్యమంత్రి సోదరుడు, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎనుముల కృష్ణారెడ్డి, వేమారెడ్డి, రాఘవేందర్, వంశీ, రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రత్యేక అధికారిగా దేవసహాయం కొండారెడ్డిపల్లిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారిగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దేవసహాయాన్ని నియమించినట్లు కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. ఇక నుంచి గ్రామ అభివృద్ధిని మరింత వేగవంతం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
ఒకటే పార్టీ.. 2 సమావేశాలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: గద్వాల అంటేనే గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు. ఇది నిజమేనని మరోసారి రుజువైంది. పార్టీ ఒక్కటే.. సమావేశాలు మాత్రం రెండు చోట్ల జరిగాయి. బుధవారం జిల్లాకేంద్రంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం గ్రూప్ రాజకీయాలకు వేదికగా మారింది. వచ్చిన పరిశీలకులకు సైతం ఒకింత ఇబ్బందిపడినట్లు సమాచారం.భిన్నాభిప్రాయాలు..కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర పరిశీలకులు విశ్వనాథ్, దీపక్‌జాన్‌తోపాటు మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ బుధవారం గద్వాలలో జరిగిన ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. అయితే గద్వాలలో ఉన్న రెండు గ్రూపులను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే బండ్లతో ఆయన క్యాంపు కార్యాలయంలో, సరిత వర్గంతో హరిత హోటల్లో సమావేశాలు నిర్వహించారు. అయితే పరిశీలకులే వేర్వేరుగా సమావేశాలు నిర్వహించడంపై పార్టీ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వర్గ విభేదాలను ప్రోత్సహించేలా పరిశీలకులే వ్యవహరించారని ఓవైపు.. వేర్వేరుగా అయితేనే ఇరువర్గాల మధ్య రాజీ కుదుర్చడం సులువవుతుందని మరోవైపు పార్టీలో చర్చ జరుగుతోంది.2, 3 రోజుల్లో శుభవార్త..సరిత వర్గంతో భేటీ సందర్భంగా పార్టీలో ముందు నుంచి పనిచేసిన వారికి తప్పకుండా న్యాయం జరుగుతుందని, పార్టీ ఏ ఒక్క నాయకుడు, కార్యకర్తను వదులుకోదని ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర పరిశీలకుడు విశ్వనాథ్ అన్నారు. సరితకు రెండు, మూడు రోజుల్లో శుభవార్త వస్తుందని సైతం హామీ ఇచ్చినట్లు పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. కాగా.. బండ్ల, సరిత మధ్య బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన ఆధిపత్య పోరు కాంగ్రెస్‌లో సైతం కొనసాగుతుండటంపై పరిశీలకుల మధ్య హాట్‌హాట్‌గా చర్చ జరిగినట్లు పార్టీ శ్రేణులు గుసగుసలాడుతున్నాయి. -
స్థానిక పోరుకు లైన్‌క్లియర్
సాక్షి, నాగర్‌కర్నూల్: స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఉత్తర్వులతో గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. ఇప్పటికే పంచాయతీ సర్పంచ్ల పదవీకాలం పూర్తయ్యి 17 నెలల సమయం గడిచినా తిరిగి ఎన్నికలు నిర్వ హించని నేపథ్యంలో ఎట్టి పరిస్థితు ల్లో సెప్టెంబర్ నెలలోగా ఎన్నికలు పూర్తిచేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో రానున్న రెండు, మూడు నెలల కాలంలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో, ఆశావహుల్లో సందడి మొదలైంది. పల్లెల్లో పడకేసిన పాలన.. గ్రామ పంచాయతీలకు 2019 జనవరిలో ఎన్నికలు జరగ్గా.. గతేడాది ఫిబ్రవరి 2 నాటికి పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. సుమారు ఏడాదిన్నర కాలంగా సర్పంచ్‌లు లేక గ్రామాల్లో పాలన బోసిపోయింది. సకాలంలో ఎన్నికలు చేపట్టకపోవడంతో కేంద్రం నుంచి వచ్చే నిధులు సైతం నిలిచిపోయి.. గ్రామాల్లో పెద్దగా అభివృద్ధి పనులు చోటుచేసుకోలేదు. చాలావరకు గ్రామాల్లో అత్యవసర పనులు మాత్రమే చేపట్టారు. ప్రధానంగా తాగునీరు, పారిశుద్ధ్యం, వీధిలైట్లు, డ్రెయినేజీ తదితర పనులు తప్పా మిగతా అభివృద్ధి పనులు, శాశ్వత సమస్యల పరిష్కారానికి చర్యలు కరువయ్యాయి. మేజర్ గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణ సైతం అస్తవ్యస్తంగా తయారైంది. పాలకవర్గాలు లేకపోవడంతో వారి స్థానంలో నియమించిన ప్రత్యేకాధికారులు గ్రామాల్లో అడుగు పెట్టకపోవడంతో గ్రామాల్లో పరిపాలన మందగించింది. దీంతో పూర్తి భారం పంచాయతీ కార్యదర్శులపైనే పడటంతో వారు సైతం ఏమీ చేయలేక చేతులేత్తేస్తున్న పరిస్థితి తలెత్తుతోంది. వీడని సందిగ్ధం.. స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ లోగా నిర్వహించాలన్న హైకోర్టు తీర్పు నేపథ్యంలో ముందుగా ఏ ఎన్నికలు నిర్వహిస్తారన్నది ఆసక్తిగా మారింది. ముందుగా పంచాయతీ ఎన్నికలా.. లేక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు చేపడుతారా.. అన్నదానిపై చర్చ మొదలైంది. అలాగే బీసీ రిజర్వేషన్లను 42 శాతం అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ దీనిపై పార్లమెంట్ ఆమోదం తెలపాల్సి ఉంది. దీంతో బీసీ రిజర్వేషన్ల అమలు సాధ్యమవుతుందా.. లేక పాత పద్ధతిలోనే నిర్వహిస్తారా.. అన్న దానిపై కూడా సందిగ్ధం నెలకొంది. ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీల జనాభా ప్రాతిపదికన మాత్రమే ఓటర్ల జాబితా అందుబాటులో ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన కులగణన ద్వారా బీసీల జనాభా, ఓటర్ల డాటా కూడా అందుబాటులోకి వచ్చింది. ఒకవేళ బీసీ రిజర్వేషన్ల అమలుకు ఆమోదం లభిస్తే అదనంగా బీసీ జనాభా డేటా బేస్‌ను అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ఇందుకు మరింత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ నెలలోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఆలోపే ముగించేందుకు ప్రభుత్వం కసరత్తు ముందుగా పంచాయతీనా.. ప్రాదేశికమా అన్నదానిపై కొరవడిన స్పష్టత రాజకీయ పార్టీలు, ఆశావహుల్లో మొదలైన సందడి బీసీ రిజర్వేషన్ల అమలుపైనే ఉత్కంఠ -
సీజనల్ వ్యాధులతో జరభద్రం
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లావ్యాప్తంగా కొన్ని రోజులుగా కురుస్తున్న ముసురు వర్షాల కారణంగా చలి గాలులు వీస్తుండడంతో సీజనల్ వ్యాధులు సోకే ప్రమాదం ఉందని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. వర్షాల కారణంగా ఇంటి పరిసరాలు, పాత టైర్లు, నీటి తొట్టిల్లో నీరు నిల్వ ఉండి దోమలు వ్యాప్తి చెందుతాయన్నారు. దీంతో ప్రజలు డెంగ్యూ, మలేరియా, చికెన్‌గున్యా, వైరల్ ఫీవర్ తదితర వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రణాళిక ప్రకారం.. వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశాకార్యకర్తలు ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమం నిర్వహిస్తూ గ్రామాలు, మండల కేంద్రాలు, పట్టణాల్లో నేరుగా ప్రజల వద్దకు వెళ్లి ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. దోమల వ్యాప్తి పెరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నారు. గంబూషియా చేపలను సేకరించి గ్రామాల్లోని మురికి కుంటల్లో వదిలి దోమల వ్యాప్తిని అరికడుతున్నారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కోరారు. జిల్లాలో నమోదయిన కేసులు జిల్లాలోని నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేటలో 2024 సంవత్సరంలో 89 డెంగ్యూ, 3 చికన్‌గున్యా, 4 మలేరియా కేసులు నమోదయ్యాయి. 2025లో ఇప్పటి వరకు నలుగురు డెంగ్యూ బారిన పడగా.. చికన్‌గున్యా, మలేరియా కేసులు నమోదుకాలేదు. డెంగీ, మలేరియా కేసులు పెరగకుండా పటిష్ట చర్యలు అవగాహన కల్పిస్తున్న వైద్య ఆరోగ్యశాఖ -
ఎమర్జెన్సీ పేరుతో ప్రజాస్వామ్యంపై దాడి!
కందనూలు: ఎమర్జెన్సీ పేరుతో అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యంపై దాడి చేసిందని బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చంద్రశేఖర్ తివారీ మా ట్లాడుతూ.. ప్రజాస్వామ్య పరిరక్షణకు బీజేపీ తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఎమర్జెన్సీ కా లంలో ఇందిరాగాంధీ రాజ్యాంగాన్ని కాలరాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల హక్కుల ను పాతాళానికి నొక్కడంతో పాటు మీడియా గొంతు నొక్కా రని ఆరోపించారు. కోర్టులు సైతం బెదిరింపులకు లోనయ్యాయని, వేలాది మంది అమాయకులు జై లుశిక్ష అనుభవించారని నాటి రోజులను గుర్తుచేశారు. ఆ సమయంలో జనసంఘ్ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రయత్నం చేసిందన్నారు. అనంత రం ఎమర్జెన్సీ కాలంలో జరిగిన అరాచకాలపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రావు, పార్లమెంట్ అభ్యర్థి భరత్‌ప్రసాద్, జిల్లా ఇన్చార్జ్ మాదగాని శ్రీనివాస్‌గౌడ్, ప్రమోద్‌కుమార్, సుధాకర్‌రెడ్డి, ఎల్లేని సుధాకర్‌రావు పాల్గొన్నారు. -
రైతులకు ఎరువుల కొరత రానివ్వం
నాగర్‌కర్నూల్: రైతులకు అవసరమైన ఎరువును సమృద్ధిగా సరఫరా చేసేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలిపారు. మంగళవారం హైదరాబాద్ నుంచి ప్రధాన కార్యదర్శి కె రామకష్ణారావు ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆన్లైన్ ద్వారా అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. ఈ సందర్భంగా వన మహోత్సవం, ఇందిరమ్మ ఇళ్లు, ఎరువుల లభ్యత, ఆయిల్‌పాం పంట విస్తరణ, సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు, భూ భారతి దరఖాస్తుల పరిష్కారం వంటి పలు అంశాలపై సీఎస్ కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నియంత్రణకు గ్రామాల్లో నిరంతరం పారిశుద్ధ్య పనులు చేపడుతున్నామని వివరించారు. జిల్లావ్యాప్తంగా వన మహోత్సవంలో భాగంగా 41 లక్షల మొక్కలు నాటేందకు ప్రణాళికలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో 1,200 మంది రైతులను గుర్తించి 3,500 ఎకరాల్లో ఆయిల్‌పాం పంట సాగు చేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. కార్యక్రమంలో అటవీ శాఖ జిల్లా అధికారి రోహిత్ గోపిడి, అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ బదావత్ సంతోష్ -
‘పది’ ఫలితాల్లో 5వ స్థానానికి చేరుకుంటాం
తిమ్మాజిపేట: ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫలితాల్లో నాగర్‌కర్నూల్ జిల్లాను రాష్ట్రంలో 12 నుంచి 5వ స్థానానికి చేర్చేందుకు ఉపాధ్యాయులు, విద్యార్థులు లక్ష్యంగా పెట్టుకోవాలని విద్యాశాఖ జిల్లా అధికారి రమేష్‌కుమార్ అన్నారు. మండలంలోని గొరిట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు నీటి సౌకర్యం కల్పించేందుకు గ్రామానికి చెందిన మొసలి శ్యామ్‌సుందర్‌రెడ్డి సొంత ఖర్చులతో చేపట్టిన పైప్‌లైన్ పనులను మంగళవారం డీఈఓ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ కష్టపడి చదివి పదో తరగతి పరీక్షల్లో మండల టాపర్లుగా నిలిచిన విద్యార్థులను హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, జిల్లా స్థాయిలో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి ఘనంగా సన్మానించారని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే అన్ని వసతులు ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు బోధన అందించడంతో పాటు విద్యార్థులకు క్రీడా మైదానం, ఉచిత నోట్, పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్నం భోజనం ఉంటుందన్నారు. త్వరలో విద్యార్థులకు కంప్యూటర్ బోధన చేస్తామన్నారు. ఈ ఏడాది నుంచి 8 నుంచి 10 తరగతులకు ఖాన్ అకాడమీ వారు ఉచితంగా ఆన్లైన్లో అన్ని సబ్జెక్టులపై అవగాహన కల్పిస్తారన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ సత్యనారాయణ, దాత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, హెచ్ఎం గోవిందప్ప, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ వసీమాబేగం, నాయకులు అచ్యుతారెడ్డి, జానకీరాంరెడ్డి, నారాయణ, చిన్నయ్య, మన్నెంరెడ్డి, బాల్‌రెడ్డి, పెంటయ్య, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. -
సాగవుతున్నా పడావుగా చూపించారు..
నాకు చౌదర్పల్లిలో 4.02 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. బోరు సాయంతో పంటలు సాగు చేస్తున్నాం. నా బ్యాంక్ ఖాతాలో రైతు భరోసా కింద రెండు గుంటలకు మాత్రమే డబ్బులు రూ.300 పడ్డాయి. అధికారులు భూమి పడావు (నాట్ కల్టివేటింగ్) కింద చూపించడంతో నాకు అన్యాయం జరిగింది. – భాగ్యమ్మ, చౌదర్పల్లి, దేవరకద్ర అర్హులైన రైతులందరికీ న్యాయం చేయాలి.. 2021, 22, 23లో పంట వేసినట్లు ఉంటేనే ప్రభుత్వం 2025లో రైతు భరోసా పథకాన్ని అమలు చేసింది. చాలామంది రైతులు ఈ విష యం తెలియక పంట ఎన్రోల్మెంట్ చేసుకోలేదు. అలాంటి రైతు భూములను అధికారులు పడావుగా చూపించి రైతు భరోసా పథకం అమలుకు నోచుకోకుండా చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రజావాణిలో ఈ మేరకు వినతిపత్రం అందించాం. ప్రభుత్వం మానవతా దృక్పథంతో పునఃసమీక్షించి అర్హులైన రైతులందరికీ న్యాయం చేయాలి. – పట్నం చెన్నయ్య, తెలంగాణ దళిత పాంథర్స్ అధ్యక్షుడు 30వ తేదీ వరకు పెట్టుబడి సాయం జమ జిల్లాలో చాలా మంది రైతుల నుంచి రైతు భరోసా రావడం లేదని ఫిర్యాదులు వస్తున్నా యి. వారి నుంచి వివరాలు సేకరిస్తున్నాం. సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తాం. ఈనెల 30వ తేదీ వరకు రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ కానుంది. అప్పటికీ రైతు భరో సా పడని రైతులు ఎవరైనా ఉంటే వారి జాబి తా రూపొందించి కలెక్టర్‌కు అందజేసి వారందరికీ కూడా పంట పెట్టుబడి సాయం అందేలా చూస్తాం. – బి.వెంకటేష్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి ● -
విద్యార్థులు మనోధైర్యంతో ముందుకు సాగాలి
తాడూరు: విద్యార్థులు మనోధైర్యంతో ముందుకు సాగాలని జిల్లా లీగల్ సెల్ కార్యదర్శి నసీం సుల్తానా అన్నారు.మంగళవారం రాష్ట్ర హైకోర్టు ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాన్ని ఏర్పర్చుకొని సాధించాలన్నారు. ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగాలన్నారు. పాఠశాలలో వంటగది, తరగతి, డార్మెటరీ గదులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థినులకు పుస్తకాలు అందజేశారు. అనంతరం మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అదేవిధంగా జానేశ్వర వాత్సల్య మందిరం సందర్శించారు.ముగిసిన క్రీడా పాఠశాలలకు ఎంపికలుకందనూలు: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో మంగళవారం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలోని క్రీడా మైదానంలో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో 4వ తరగతి ప్రవేశం కొరకు జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి 65 మంది విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికై న విద్యార్థులను జూలై 4, 5వ తేదిల్లో హైదరాబాద్‌లోని హాకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్లో రాష్ట్ర ఎంపికలకు హాజరవుతారని జిల్లా యువజన, క్రీడల అధికారి సీతారాం తెలిపారు. కార్యక్రమంలో డీఈఓ రమేష్‌కుమార్, ఎంఈఓ భాస్కర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతాంకల్వకుర్తి రూరల్: కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల నరసింహ అన్నారు. మంగళవారం పట్టణంలోని యూటీఎఫ్ భవనంలో సీపీఐ జిల్లా మహాసభలకు సంబంధించి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 1, 2వ తేదీలలో జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు డాక్టర్ శ్రీనివాస్, ఆనంద్ జి, ఫయాజ్, వెంకటయ్య, కేశవులు గౌడ్, నరసింహ, చంద్రమౌళి, భరత్, పరశురాములు, ధారదాసు ఉన్నారు. -
ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ కమిషన్ల బదిలీ
నాగర్‌కర్నూల్/మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: రాష్ట్రవ్యాప్త బదిలీలలో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కొందరు మున్సిపల్ కమిషనర్లకు స్థానచలనం కలగగా, మరికొందరికి పదోన్నతి లభించింది. ఈ మేరకు మంగళవారం సీడీఎంఏ టీకే శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేవారు. ఇప్పటివరకు జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ (గ్రేడ్ –2)గా పనిచేస్తున్న టి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మహబూబ్‌నగర్‌కు బదిలీపై వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న డి.మహేశ్వర్‌రెడ్డికి ఇంకా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్లో ఉంచారు. వనపర్తి జిల్లాలోని అమరచింత కమిషనర్ (గ్రేడ్–1)గా పనిచేస్తున్న ఎం.రవిబాబును నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు డిప్యూటీ కమిషనర్‌గా బదిలీ అయింది. ఆయన స్థానంలో నల్లగొండ జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో శానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సీహెచ్.నాగరాజు పదోన్నతిపై వస్తున్నారు. నాగర్‌కర్నూల్‌లో కమిషనర్ (గ్రేడ్–2) గా పనిచేస్తున్న బి.నరేష్‌బాబును మహబూబ్‌నగర్ జిల్లాలోని కొత్త మున్సిపాలిటీ అయిన దేవరకద్రకు పంపిస్తున్నారు. అక్కడికి మేడ్చల్ నుంచి నాగిరెడ్డి (గ్రేడ్–2) కమిషనర్‌గా వెళ్తున్నారు. అలంపూర్‌లో ఇన్చార్జ్ కమిషనర్‌గా పనిచేస్తున్న పి.చంద్రశేఖర్ పదోన్నతిపై కొల్లాపూర్‌కు బదిలీ అయ్యారు. అక్కడ పనిచేస్తున్న టి.శ్రీనివాసన్‌కు ఇంకా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. అలంపూర్‌కు ఎవరినీ నియమించలేదు. మక్తల్‌లో ఇన్చార్జ్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఎన్.శంకర్‌నాయక్‌ను అక్కడే రెగ్యులర్ అధికారిగా పదోన్నతి కల్పించారు. నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో శానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న డి.మురళిని కమిషనర్‌గా (గ్రేడ్–3) పదోన్నతిపై అచ్చంపేటకు పంపిస్తున్నారు. ఇక్కడ ఇంతవరకు ఇన్చార్జ్ కమిషనర్‌గా పనిచేసిన జి.యాదయ్య కోస్గికి మేనేజర్‌గా వెనక్కి వెళ్తున్నారు. మేడ్చల్‌లో రెవెన్యూ ఆఫీసర్ (ఆర్ఓ)గా పనిచేస్తున్న ఖాజా ఆరీఫొద్దీన్ను పదోన్నతిపై వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ కమిషనర్ (గ్రేడ్–3)గా బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్న ఎస్.అశోక్‌రెడ్డికి ఇంకా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. ఇక మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏఎంసీగా పనిచేస్తున్న జె.పవన్‌కుమార్‌ను కమిషనర్ (గ్రేడ్–2)గా పదోన్నతిపై ముడుచింతలపల్లికి పంపిస్తున్నారు. ఇక్కడికి ఏఎంసీగా ఎ.రాజన్న పదోన్నతిపై వస్తున్నారు. అలాగే పాలమూరులో శానిటరీ ఇన్స్పెక్టర్లుగా పనిచేస్తున్న యు.గురులింగం పదోన్నతిపై ఆందోల్–జోగిపేట మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్–3) గా, డి.వాణికుమారి జీహెచ్ఎంసీలో అసిస్టెంట్ ఎస్టేట్ ఆఫీసర్‌గా, కె.రవీందర్‌రెడ్డిని నల్లగొండ మున్సిపాలిటీ ఏఎంసీ కమిషనర్ (గ్రేడ్–3) గా పంపించారు. నలుగురు ఎస్ఐలకు గ్రేడ్–3 కమిషనర్లుగా పదోన్నతి వెయిటింగ్ లిస్ట్‌లో మహేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసన్, అశోక్‌రెడ్డి నాగర్‌కర్నూల్ మున్సిపల్ కమిషనర్‌గా నాగిరెడ్డి -
‘ముందస్తు’గా మేస్తున్నారు..!
కల్వకుర్తి టౌన్: జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో అధికారులు ముందస్తు ప్రణాళికల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. వేసవిలో తాగునీటి ఎద్దడిని ఆసరాగా చేసుకొని అధికారులు తమ బినామీల పేరుతో పనులు చేసి రూ.లక్షలు కొల్లగొడుతున్నారు. ఈ పనులన్నీ కేవలం పేపర్ల మీదనే జరగడం మరో విశేషం. ఇలాంటి పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపులో సహకరించని ఉద్యోగులను బెదిరించి మరీ రికార్డులు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కల్వకుర్తి మున్సిపాలిటీలో ముందస్తు ప్రణాళికలో భాగంగా సుమారు రూ.20 లక్షల వరకు పేపర్ల పైనే బిల్లుల చెల్లింపులు జరిగాయని ప్రచారం జరుగుతోంది. బాక్స్, నామినేషన్ పద్ధతిలో.. మున్సిపాలిటీల్లో అత్యవసర పనులు చేసేందుకు ఎక్కువగా బాక్స్, నామినేషన్ పద్ధతిలో టెండర్లు వేస్తుంటారు. ఇలా చేసే పనులకు సంబంధించి పూర్తి వ్యవహారం అంతా ఇంజినీరింగ్ శాఖ అధికారి అజమాయిషీలో ఉంటుంది. దీంతో ఇంజినీరింగ్, అకౌంట్స్ అధికారులను ప్రసన్నం చేసుకునే వారికి టెండర్లు దక్కుతుంటాయి. కల్వకుర్తి మున్సిపాలిటీలో గతంలో పాలకవర్గం ఉన్న సమయంలో ఇక్కడ పనిచేసిన ఓ అధికారి పనులు చేసినట్లుగా పేపర్లలో చూయించి, అకౌంట్ సెక్షన్ అధికారి చేతులు తడిపి బిల్లులు చేయించుకున్నట్లు కాంట్రాక్టర్లు చెప్పుకోవడం విశేషం. అవినీతిలో అందెవేసిన చెయ్యి.. మున్సిపాలిటీల్లో అవినీతి జరిగేందుకు ఆస్కారం ఉండేవి ఇతర అంశాల్లో చేపట్టే పనులు. పాలకవర్గం మీటింగ్‌లో పలు ఇతర అంశాలను ఎజెండాలో చేర్చి.. అధికారులకు, పాలకవర్గాలకు ఇష్టం వచ్చినట్లుగా వాటిని అమలు చేస్తారు. అలాంటి వాటిలో ‘తిలా పాపం.. తలా పిడికెడు’ అన్నట్లుగా అధికారులు, పాలకవర్గం సభ్యులు వాటాలు పంచుకుంటారు. ఇక్కడ లోపాలు అందరికీ తెలియడంతో ఎవరిని ఎవరూ ప్రశ్నించకుండా తేలు కుట్టిన దొంగల్లా పనులు చేసుకుంటున్నారు. పేపరుపై చేసిన పనులకు చెల్లింపులు సహకరించని ఉద్యోగులపై బెదిరింపులకు దిగుతున్న వైనం మున్సిపల్ అధికారుల చేతివాటం -
మహిళలకు రక్షణ కరువు
బిజినేపల్లి: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళల మాన ప్రాణాలకు రక్షణ కరువైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాల్‌నర్సింహ అన్నారు. సోమవారం బిజినేపల్లిలో నిర్వహించిన 18వ మండల మహాసభలో ఆయన మాట్లాడారు. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజా సమస్యలను విస్మరిస్తున్నాయని అన్నారు. దళితులు, మహిళలపై దాడులు పెరిగాయన్నారు. అటవీ ప్రాంతంలోని ఖనిజ సంపద కొల్లగొట్టేందుకు ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను హతమార్చడం దారుణమన్నారు. చెంచు గిరిజనులను కూడా అటవీ ప్రాంతంలో లేకుండా చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.కోట్ల విలువచేసే ఖనిజ సంపదను ఆదానీ, అంబానీలకు నిసిగ్గుగా కట్టబెడుతుందని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వ విధానాలు ఉన్నాయని.. వీటిని ప్రతిఘటించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ, రైతుభరోసా వంటి ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదన్నారు. మన్మోహన్సింగ్ హయాంలో ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం వంటి వాటిని సీపీఐ సాధించిందని గుర్తుచేశారు. అంతకుముందు ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి.. సభా ప్రాంగణం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు ఆనంద్జీ, వార్ల వెంకటయ్య, ఈర్ల చంద్రమౌళి, టి.నర్సింహ, మారేడు శివశంకర్, కృష్ణాజీ, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.జీఓ 51ని సవరించాలిబిజినేపల్లి: గ్రామపంచాయతీల్లో మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేసేందుకు జీఓ 51ని సవరించాలని తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బత్తుల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని కారుకొండ తండా పంచాయతీ ఆవరణలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కారోబార్, బిల్ కలెక్టర్లకు ప్రత్యేక స్థానం కల్పించి.. కనీస వేతనం రూ. 26వేలు ఇవ్వాలని, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. కార్మికులకు పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు సాయి, మశన్న, శివశంకర్, కృష్ణయ్య, కొండయ్య పాల్గొన్నారు.కల్వకుర్తి డీఎస్పీగా వెంకట్రెడ్డికల్వకుర్తిటౌన్: కల్వకుర్తి డీఎస్పీగా వెంకట్‌రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న డీఎస్పీ వెంకటేశ్వర్లు డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయగా.. డీజీపీ కార్యాలయంలో పోస్టింగ్ కోసం వెయిటింగ్ చేస్తున్న వెంకట్‌రెడ్డిని కల్వకుర్తి డీఎస్పీగా నియమించారు. డీఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన వెంకట్‌రెడ్డికి డివిజన్లోని సీఐలు, ఎస్ఐలు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.26న అప్రెంటిస్‌షిప్ మేళాకందనూలు: మహబూబ్‌నగర్ ఒకేషనల్ కళాశాలలో ఈ నెల 26న అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహించనున్నట్లు డీఐఈఓ వెంకటరమణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2023 తర్వాత ఐటీఐ పూర్తిచేసిన వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ ఒరిజనల్ సర్టిఫికెట్స్‌తో అప్రెంటిస్‌షిప్ మేళాకు హాజరు కావాలని సూచించారు.నేడు మండలస్థాయి క్రీడాకారుల ఎంపికలుకందనూలు: తెలంగాణ క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల నిమిత్తం మంగళవారం మండల స్థాయిలో క్రీడాకారుల ఎంపికలు నిర్వహించనున్నట్లు డీవైఎస్ఓ సీతారాం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడా పాఠశాలల్లో 4వ తరగతి ప్రవేశానికి సంబంధించి జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించే మండలస్థాయి ఎంపికలకు 8–9 ఏళ్ల వయసు ఉన్న బాలబాలికలు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు ఆధార్‌కార్డు, స్టడీ, జననం, కుల ధ్రువపత్రాలు, ఐదు ఫొటోలు తీసుకురావాలని సూచించారు. -
పెన్షనర్ల హక్కులను కాపాడుకుందాం
కందనూలు: పెన్షనర్ల హక్కులను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందని పెన్షనర్ల సంఘం జిల్లా ఆధ్యక్షుడు రాంచంద్రారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం, ఆలిండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు సోమవారం కలెక్టర్ బదావత్ సంతోష్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెన్షనర్ల పాలిట ఆశనిపాతంగా మారిన ఫైనాన్స్ బిల్లు–2025ను ఉపసంహరించుకోవాలని కోరారు. ఏ పెన్షన్ రూల్స్‌కు సంబంధం లేకుండా ప్రభుత్వ పెన్షనర్లను వేర్వేరు గ్రూపులుగా విభజించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదన్నారు. వేతన సవరణ సంఘం సిఫారసులను పాత పెన్షనర్లకు కాకుండా.. కొత్తగా రిటైర్డ్ అయిన వారికి మాత్రమే వర్తించే విధంగా చేయడం సరికాదని అన్నారు. పెన్షనర్ల హక్కులను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీధర్, కోశాధికారి వెంకటశెట్టి, సీనియర్ సిటిజన్స్ అధ్యక్షుడు చెన్నయ్య, మండలశాఖ అధ్యక్షుడు బుసిరెడ్డి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
అచ్చంపేట రూరల్: అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. సోమవారం మండలంలోని హాజీపూర్ సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో మండల ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజా ర్టీతో గెలిపించాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు, రైతుభరోసా, రైతు రుణమాఫీ వంటి పథకాలను అందిస్తున్నామన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో పాటుపడుతోందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. నిర్వాసితులకు అండగా ఉంటాం.. చారకొండ: మండలంలోని సిర్సనగండ్లలో ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వపరంగా అండగా ఉంటామని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. నిర్వాసిత కుటుంబాలు అచ్చంపేటలో ఎమ్మెల్యేను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ ఇళ్లు, స్థలాలు ఇస్తామని నిర్వాసితులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకట్‌గౌడ్, మండల అధ్యక్షుడు బాల్‌రాంగౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి మహేందర్, నర్సింహారెడ్డి, సురేందర్‌రెడ్డి, గోరటి శివ, మాజీ సర్పంచ్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
నేడు రైతులతో సీఎం ముఖాముఖి నాగర్‌కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా పథకం ద్వారా వానాకాలం పంట పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో విజయవంతంగా జమ చేసిన సందర్భంగా మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారని కలెక్టర్ బదావత్ సంతోష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి రైతు వేదిక వద్ద ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మండలస్థాయి అధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమించినట్లు తెలిపారు. రైతువేదికల వద్దకు ప్రజాప్రతినిధులు, రైతులు అధిక సంఖ్యలో చేరుకొని ముఖ్యమంత్రి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. నాగర్‌కర్నూల్ రూరల్: రైతులకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు టి.సాగర్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు నకిలీ విత్తనాలతో మోసపోతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారన్నారు. వానాకాలంలో పంటల సాగుకు అవసరమైన విత్తనాలు అందుబాటులో లేక రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. రైతు రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయలేదని.. నామమాత్రంగా రుణమాఫీ పథకం వర్తింపజేసి చేతులు దులుపుకొన్నారని విమర్శించారు. రైతుభరోసా ఇవ్వడంలోనూ విఫలమైందన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్దం పర్వతాలు, నాయకులు ఆర్.శ్రీనివాసులు, ఆంజనేయులు, గీత, దశ్యానాయక్, ఆంజనేయులు తదితరులు ఉన్నారు. -
ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇవ్వాలి
నాగర్‌కర్నూల్: వివిధ సమస్యలపై ప్రజావాణికి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వివిధ సమస్యల పరిష్కారం కోసం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఎన్నో వ్యయ, ప్రయాసలకోర్చి వస్తారని.. అధికారులు శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజావాణి ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టవద్దన్నారు. కాగా, ప్రజావాణికి 72 ఫిర్యాదులు అందాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులు వేగిరం చేయాలి వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొండారెడ్డిపల్లి గ్రామ పరిధిలో రూ. 21కోట్లతో చేపట్టిన నాలుగు లైన్ల రహదారి పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. గ్రామస్తుల తాగునీటి అవసరాలు తీర్చేందుకు రూ. 3కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ పథకం, రూ. 2.85కోట్లతో చేపట్టిన విద్యుత్ ఆధునికీకరణ పనుల్లో పురోగతి ఉండాలన్నారు. గ్రామంలో 515 ఇళ్లకు సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు ప్రతిపాదించగా.. ఇప్పటివరకు 407 ఇళ్లకు సోలార్ విద్యుత్ ఏర్పాటు పనులు పూర్తయ్యాయన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ దేవ సహాయం, డీఆర్డీఓ చిన్న ఓబులేషు, పీఆర్ ఈఈ విజయ్ ఉన్నారు. -
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
చారకొండ/వెల్దండ: గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. సోమవారం చారకొండ మండలం చంద్రాయన్పల్లిలో రూ. 4.48కోట్లతో బీటీరోడ్డు నిర్మాణానికి వారు శంకుస్థాపన చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. అదే విధంగా వెల్దండ మండలంలో రూ. 4.48కోట్లతో భైరాపూర్–అజిలాపూర్ బీటీరోడ్డు నిర్మాణానికి, కుప్పగండ్ల–పెద్దాపూర్ మార్గంలో రూ. 2.50కోట్లతో వంతెన నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాలు అన్నివిధాలా అభివృద్ధి చెందుతున్నాయని వివరించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో అర్హులందరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అన్నారు. ప్రతి గ్రామానికి బీటీరోడ్డు సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంతో ప్రతి పేద కుటుంబం సొంతింటి కలను సాకారం చేస్తామన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమాల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు బాలాజీ సింగ్, మాజీ జెడ్పీటీసీ వెంకట్‌గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ వెంకటయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాల్‌రాంగౌడ్, మాజీ సర్పంచులు వసంత, భూపతిరెడ్డి, నాయకులు సాంబయ్యగౌడ్, వెంకటయ్యగౌడ్, మోతీలాల్ నాయక్, సంజీవ్‌కుమార్, పర్వత్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, కృష్ణ, ఎర్ర శ్రీను, హరికిషన్, నారాయణ, రాంచంద్రాద్రారెడ్డి, వెంకట్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దివ్యాంగులపై చులకనభావం వద్దు
నాగర్‌కర్నూల్ క్రైం: దివ్యాంగులపై వేధింపులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మెంబర్ శ్రీరాం ఆర్య అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సోమవారం నాగర్‌కర్నూల్ మండలం తూడుకుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగులు తమ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు తోడ్పాటు అందించాలని సూచించారు. వైకల్యం కారణంగా చిన్నచూపు చూడరాదని.. వ్యక్తిగత స్వేచ్ఛ హరించరాదన్నారు. వైకల్యం గల వ్యక్తులను హింసించడం, అనుమతి లేకుండా పరిశోధనలు చేయడం, ఆహారం ఇవ్వకపోవడం, లైంగికంగా వేధించడం వంటి చర్యలకు పాల్పడితే ఐదేళ్ల వరకు జైలుశిక్షతో పాటు రూ. 50వేల నుంచి రూ. 5లక్షల వరకు జరిమానా విధించబడుతుందని అన్నారు. తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యుల నుంచి దివ్యాంగులను అకారణంగా విడదీయరాదన్నారు. దివ్యాంగులు టోల్‌ఫ్రీ నంబర్ 14416ను సంప్రదించి రక్షణ పొందాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్ఎం రఘు పాల్గొన్నారు. -
ప్రకృతి వ్యవసాయం దిశగా..
● సహజ సిద్ధమైన ప్రకృతి సేద్యానికిప్రభుత్వ ప్రోత్సాహం ● జిల్లాలో 15 క్లస్టర్ల ఏర్పాటు ● మొదలైన మట్టి నమూనాల సేకరణ ● ఆసక్తి చూపుతున్న రైతులు అచ్చంపేట రూరల్: పంటల సాగులో రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగం పెరిగింది. వీటిని వినియోగించి పండించిన ఆహార ధాన్యాలు, కూరగాయలు తినడంతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య సంరక్షణ కోసం ప్రకృతి సిద్ధంగా పండించిన పంటలపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ప్రకృతి సేద్యంతో పండించిన ఆహార పదార్థాలు, కూరగాయల షాపులు వెలుస్తున్నాయి. అయితే ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రయోగాత్మకంగా 2వేల ఎకరాల్లో.. జిల్లాలో ప్రయోగాత్మకంగా 2వేల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేపట్టేందుకు జిల్లా వ్యవసాయశాఖ ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు ఆసక్తి ఉన్న రైతులను ఎంపిక చేస్తున్నారు. రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగం లేకుండా సహజ సిద్ధంగా ప్రకృతి వ్యవసాయం చేసేలా రైతులకు ప్రోత్సాహం అందించనున్నారు. అయితే జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకంలో 60శాతం నిధులను కేంద్రం భరిస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను సమకూర్చాల్సి ఉంటుంది. ఒక్కో క్లస్టర్లో 125మంది రైతులు.. జిల్లాలోని ప్రతి మండలంలో రెండు, మూడు గ్రామాలను కలిపి ఒక క్లస్టర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో క్లస్టర్ పరిధిలో ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ఆసక్తి ఉన్న 125 మంది రైతులను ఎంపికచేసి.. 125 ఎకరాల్లో ప్రకృతి సేద్యాన్ని చేపడతారు. రైతులు ఎకరా విస్తీర్ణంలో తమకు నచ్చిన పంట సాగు చేయవచ్చు. అది పూర్తిగా ప్రకృతి సేద్యం విధానాల ద్వారా మాత్రమే చేపట్టాల్సి ఉంటుంది. కూరగాయలు, పప్పు దినుసులు పండిస్తే లాభసాటిగా ఉంటుందని వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 15 క్లస్టర్లలో 2వేల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేపట్టనున్నారు. విధిగా భూసార పరీక్షలు.. జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకానికి ఎంపిక చేసిన రైతుల భూమి నుంచి మట్టి నమూనాలు సేకరించి.. భూసార పరీక్షలు నిర్వహిస్తారు. ఆ నివేదికలకు అనుగుణంగా భూమిలో ఉన్న లోపాలను సరిచేసేందుకు చర్యలు తీసుకుంటారు. పంటల సాగుకు జీవామృతం, ఘన జీవామృతం, పచ్చిరొట్ట, వివిధ ఆకుల కషాయాలు, అగ్నిఅస్త్రం తదితర ప్రకృతి సిద్ధంగా తయారు చేసిన ఎరువులను వినియోగించాల్సి ఉంటుంది. వీటి తయారీ కోసం రైతులకు అవసరమైన శిక్షణ ఇస్తారు. సాగు పద్ధతులు, సేంద్రియ ఎరువులు వినియోగించే విషయంలో రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రతి క్లస్టర్‌కు కృషి సఖి లేదా కమ్యూనిటీ రీసోర్స్ పర్సన్లు ఇద్దరు ఉంటారు. వీరు నెలలో 16 రోజులు సేంద్రియ సాగు చేస్తున్న క్షేత్రాలను సందర్శించి రైతులకు సూచనలు చేస్తారు. ఆయా గ్రామాలకు చెందిన స్వయం సహాయ సంఘాల్లో సభ్యురాళ్లను కృషి సఖి, రీసోర్స్ పర్సన్లుగా ఎంపిక చేస్తారు. ప్రస్తుతం ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ఆసక్తి చూపించే రైతుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. మరో రెండు వారాల్లో ఈ ఎంపిక పూర్తి చేస్తారు. సొసైటీలు, ఎన్జీఓల ద్వారా బయో రీసోర్స్ సెంటర్లు.. రైతులకు జీవామృతం లాంటివి తయారు చేసుకోవడానికి ప్రతి సంవత్సరం రూ. 4వేల చొప్పున రెండేళ్లకు ప్రభుత్వం రూ. 8వేలు అందిస్తుంది. జీవామృతం తయారు చేసుకోలేని వారు బయో రీసోర్స్ సెంటర్ల నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లావ్యాప్తంగా 10 బయో రీసోర్స్ సెంటర్లు ఏర్పాటుచేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే ఆసక్తి గల వారు రీసోర్స్ సెంటర్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన సమగ్ర వివరాలు త్వరలోనే వ్యవసాయశాఖకు అందే అవకాశం ఉంది. అవగాహన కల్పిస్తాం.. జిల్లాలో ఏర్పాటుచేసిన క్లస్టర్లలో ప్రకృతి సేద్యంపై ఆసక్తిగల రైతులను గుర్తిస్తున్నాం. వారికి ప్రత్యేకంగా శిక్షణనిస్తాం. ప్రకృతి వ్యవసాయంపై రైతులకు ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. పకడ్బందీగా మట్టి నమూనాలు సేకరించి ఏ పంటకు అనుకూలమో తెలియపరుస్తాం. ఇప్పటికే ఆయా మండలాల్లో వ్యవసాయాధికారులు మట్టి నమూనాల సేకరణలో నిమగ్నమయ్యారు. – చంద్రశేఖర్, డీఏఓ -
కానరాని పల్లెవెలుగు!
‘ఈ చిత్రంలోని ప్రైవేటు వాహనంలో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నది బల్మూర్ మండలం రామోజీపేట గ్రామ విద్యార్థులు. ఈ మండలంలో మెజార్టీ గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. మైలారం, అంబగిరి, నర్సాయపల్లి, రామోజీపల్లి, వీరాన్రాజుపల్లి, చెన్నారం గ్రామాల ప్రజలకు ఆటోలు, జీపులే దిక్కు. ఎక్కడికై నా వెళ్లాలంటే ప్రైవేటు వాహనాల్లో కిక్కిరిసి ప్రయాణించాల్సిందే. ఇక విద్యార్థుల అవస్థలు వర్ణణాతీతం.’ .. ఇలా జిల్లాలోని అనేక గ్రామాల ప్రజలు ఆర్టీసీ బస్సు సౌకర్యానికి నోచుకోక అవస్థలు పడుతున్నారు. మెజార్టీ గ్రామాలకు చేరని ప్రగతిచక్రం ఉచిత బస్సు ప్రయాణానికి దూరం.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం గ్రామీణ మహిళలకు అందని ద్రాక్షగా మారింది. తమ గ్రామాల నుంచి మండల కేంద్రానికి వచ్చేందుకు బస్సులు లేకపోవడంతో ఆటోలు, జీపుల్లో సామర్థ్యానికి మించి ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఇదిలా ఉంటే, ఆర్టీసీ జిల్లాలోని మెజార్టీ రూట్లలో అద్దె బస్సులనే వినియోగిస్తోంది. అయితే అద్దె బస్సుల నిర్వాహకులు లాభదాయకమైన రూట్లను మాత్రమే ఎంచుకుంటున్నారు. దీంతో చాలా వరకు గ్రామాలకు బస్సు సౌకర్యం ఉండటం లేదు. ఒక్కో మండలంలో ఐదు నుంచి పది గ్రామాలకు మాత్రమే బస్సు సౌకర్యం అందుతుండగా.. మిగతా రూట్లలో ఆటోలు, జీపులే దిక్కవుతున్నాయి. అన్ని రూట్లలో అనుకూలమైన వేళల్లో బస్సులు నడుపుతూ.. ప్రైవేటు వాహనాలను నియంత్రిస్తే ఆక్యూపెన్సీ పెరిగే అవకాశం ఉండగా.. అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. జిల్లాలో నాలుగు ఆర్టీసీ డిపోలు ఉండగా.. ఒక్కో డిపో నుంచి ఏడాదికి సుమారు రూ. 8కోట్ల వరకు లాభం ఆర్జిస్తున్నప్పటికీ.. గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలోని అనేక గ్రామాలకు నేటికీ ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో విపరీతమైన రద్దీ ఉంటోంది. ఇందుకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచకపోవడం.. గతంలో బస్సు సౌకర్యం ఉన్న గ్రామాలకు బస్సులను నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. బస్సులు లేక ప్రైవేటు వాహనాల్లో సామర్థ్యానికి మించి కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. విద్యార్థులు సైతం ఆటోల్లో ప్రమాదకరంగా ప్రయాణించాల్సి వస్తోంది. ప్రైవేటు వాహనాలే దిక్కు.. జిల్లాలోని అచ్చంపేట, లింగాల, బల్మూర్, అమ్రాబాద్, పదర, కొల్లాపూర్ మండలాల్లో చాలా వరకు గ్రామాల ప్రజలకు ప్రైవేటు వాహనాలే దిక్కవుతున్నాయి. అచ్చంపేట మండలంలోని మన్నెవారిపల్లి, బక్కలింగయ్యపల్లి, సిద్ధాపూర్, లింగాల మండలంలోని చెన్నంపల్లి, అప్పాయిపల్లి, ధారారం, బల్మూరు మండలంలోని మైలారం, రామోజీపల్లి, అంబగిరి, చెన్నారం, అమ్రాబాద్ మండలం తుర్కపల్లి, జంగిరెడ్డిపల్లి, కల్మూలోనిపల్లి, కుమ్మరోనిపల్లి, తిర్మలాపూరం, లక్ష్మాపూర్, కొల్లాపూర్ మండలం సోమశిల, అమరగిరి, ముక్కిడిగుండం, కుడికిళ్ల, పెంట్లవెల్లి మండలం మంచాలకట్ట, మధవానినగర్, ఉప్పునుంతల మండలం కంసానిపల్లి గ్రామాలకు బస్సు సౌకర్యం లేక విద్యార్థులు, ప్రజలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామీణ ప్రజలకు ఆటోలు, జీపులే దిక్కు పరిమితికి మించి ప్రయాణంతో ప్రమాదాలు విద్యార్థులకు తప్పని అవస్థలు -
జూరాల కాల్వకు నీటి విడుదల
అమరచింత: జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద వస్తుండటంతో ఆయకట్టు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాలతో ప్రధాన ఎడమ కాల్వకు ఆదివారం డీఈ నారాయణ, కిసాన్‌సెల్ జిల్లా అధ్యక్షుడు వేముల శ్రీనివాస్‌రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి అయ్యూబ్‌ఖాన్ ప్రత్యేక పూజలు చేసి నీటిని వదిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మునుపెన్నడూ లేని విధంగా ముందుస్తుగా ఆయకట్టుకు సాగునీటిని వదులుతున్నామని చెప్పారు. రిజర్వాయర్లతో పాటు ఎత్తిపోతల పథకాలకు సైతం నీటిని తరలిస్తున్నట్లు చెప్పారు. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా పీజేపీ సిబ్బంది నిరంతరం కాల్వ వెంట తిరుగుతూ ప్రతి రైతుకు అందేలా చర్యలు తీసుకుంటున్నమన్నారు. కార్యక్రమంలో పీజేపీ ఏఈ ఆంజనేయులు, కాంగ్రెస్ నాయకులు మహేందర్‌రెడ్డి, అరుణ్ కుమార్, చంద్రశేఖర్‌రెడ్డి, చుక్కా ఆశిరెడ్డి, పీఎసీఎస్ అధ్యక్షుడు గాడి కృష్ణమూర్తి, రహమతుల్లా, పరమేష్, నల్గొండ శ్రీను, మొగిలి గంగాధర్‌గౌడ్, బంగారు భాస్కర్, తులసీరాజ్, ఏకే వెంకటేశ్వర్‌రెడ్డి, హన్మంతునాయక్ తదితరులు పాల్గొన్నారు. కుడి, ఎడమ కాల్వలకు.. జూరాలకు ఎగువ నుంచి వరద వస్తుండటంతో ఎడమ కాల్వ ద్వారా 920 క్యూసెక్కులు, నీటిని, కుడి కాల్వ ద్వారా 500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఏటా వానాకాలం పంటల సాగుకు జులై చివర, ఆగస్టులో సాగునీరు వదిలే వారని.. ఈసారి ముందస్తుగా జూన్‌లోనే ఆయకట్టుకు నీటిని అందించడం హర్షణీయమన్నారు. -
రైతుభరోసా @ రూ.372 కోట్లు
నాగర్‌కర్నూల్: రైతుభరోసా పథకం ద్వారా ఇప్పటి వరకు జిల్లాలో 2,89,015 మంది రైతుల ఖాతాల్లో రూ. 372.215 కోట్లు జమ చేసినట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుభరోసా పథకం సుస్థిరమైన వ్యవసాయ అభివృద్ధికి పునాది వేస్తోందన్నారు. రానున్న రోజుల్లో మరింత మంది రైతులకు ఈ పథకం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వట్టెం వెంకన్న సన్నిధిలో కలెక్టర్.. బిజినేపల్లి: వట్టెం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఆదివారం కలెక్టర్ బదావత్ సంతోష్ దంపతులు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ కమిటీ సభ్యులు, అర్చక బృందం వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న కలెక్టర్ దంపతులు, కుటుంబ సభ్యులతో అర్చకులు గోత్రనామార్చన పూజలు చేయించి ఆశీర్వచనాలు అందజేశారు. -
ఉత్సాహంగా జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు
కల్వకుర్తి రూరల్: పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఆదివారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహించారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి స్వాములు, జనంపల్లి సంతోష్ అథ్లెటిక్స్ ఎంపికలను ప్రారంభించగా.. 150 మంది క్రీడాకారులు వివిధ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. జూలై 6న హనుమకొండలో నిర్వహించే 11వ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్స్ పోటీల్లో పాల్గొనే అండర్–10, 12, 14 బాలబాలికల తుది జట్టును ఎంపిక చేయనున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో అంజయ్య, ప్రసాద్, బాలయ్య, రాజేందర్, మల్లేష్, సుభాషిణి, రాజు, సురేశ్, ప్రేమ్ సాగర్, స్వాతి, మల్లయ్య, భాస్కర్, రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఉపాధ్యాయ సమస్యలపై నిరంతర పోరాటం తెలకపల్లి: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఎస్టీయూ నిరంతరం పోరాడుతుందని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పర్వత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సదానందంగౌడ్, మాజీ ఎమ్మెల్సీ కత్తి నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని కేకే రెడ్డి పాఠశాలలో ఎస్టీయూ రాష్ట్ర, జిల్లాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సర్వీస్ నిబంధనలు అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు సర్వీస్ సెక్టార్‌పై మాట్లాడిన మొట్టమొదటి సంఘం ఎస్టీయూ అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకోసారి కరువు భత్యం ఇవ్వాలని ప్రతిపాదించి సఫలీకృతమయ్యామని చెప్పారు. యూనియన్ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ఉపాధ్యాయులకు అండగా నిలుస్తూ.. సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని పోరాటం సాగిస్తోందన్నారు. 2024 డిసెంబర్ డీఎస్సీ ఉపాధ్యాయులకు పోస్టింగ్ ఇప్పించేందుకు కృషి చేశామన్నారు. అనంతరం సంఘం నిబంధనలు, నాయకత్వ లక్షణాలను వివరించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు సుధాకర్‌రెడ్డి, మురళి, నర్సింహారెడ్డి, సుధాకర్, సైదయ్య, ఈశ్వర్, రఘురాంరెడ్డి, లక్ష్మణరావు, రమేశ్, మండల కార్యదరి జహంగీర్‌పాషా, బాలస్వామి, వేదావతి, సుఽజాత, సరళ పాల్గొన్నారు. రామన్‌పాడులో 1,016 అడుగులు మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1,021 అడుగులకుగాను ఆదివారం 1,016 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జలాశయం నుంచి కుడి, ఎడమ కాల్వలకు 12 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు. -
యోగాతో ఒత్తిడిని అధిగమిద్దాం
నాగర్‌కర్నూల్/నాగర్‌కర్నూల్ క్రైం: ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడిని అధిగమించేందుకు యోగా దోహదపడుతుందని జిల్లా జడ్జి రమాకాంత్ అన్నారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో జిల్లా జడ్జి పాల్గొని.. న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బందితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. యోగాతో ఏకాగ్రత పెరగడంతో పాటు అధిక బరువును నియంత్రించవచ్చన్నారు. అదే విధంగా రక్తప్రసరణ మెరుగుపడి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ యోగా ఆచరించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నసీం సుల్తానా, సీనియర్ సివిల్‌జడ్జి వెంకట్రాం, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్‌జడ్జి శ్రీనిధి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికాంతరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా జడ్జి రమాకాంత్