వెల్దండ: ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్ అన్నారు. శుక్రవారం మండలంలోని చొక్కన్నపల్లి, బొల్లంపల్లి, గుండాల, కొట్ర తదితర గ్రామాల్లో వివిధ పనులను పరిశీలించారు. జాతీయ ఉపాధి హమీ పథకంలో చేపడుతున్న పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. మహిళా సంఘాలకు మంజూరు చేసిన గ్రీన్‌నెట్‌లను పూర్తిచేసే విధంగా చూడాలన్నారు. తోటల నిర్వహణ, మొక్కల పెరుగుదల, నీటి వినియోగం తదితర అంశాలను వివరించారు. రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందించాలన్నారు. బొల్లంపల్లిలో జాతీయ ఉపాధి హామీ ఉపాధి పనులతో నిర్మించిన క్యాటిషెడ్ సందర్శించారు. ఇందిరమ్మ ఇళ్లను వేగవంతంగా పూర్తి చేసి వచ్చే నెలల్లో ప్రారంభించాలని అదేశించారు. పనులను నాణ్యతగా చేపట్టి పూర్తి చేయాలన్నారు. గుండాల గ్రామంలో సామూహిక మరుగుదొడ్ల సముదాయాన్ని పరిశీలించారు. గ్రామస్తులకు ప్రభుత్వం అందిస్తున్న పనులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచులు ప్రసాద్‌గౌడు, శిరీష, శారద, డీఆర్‌డీఓ చిన్న ఓబులేష్, ఏపీడీ చంద్రశేఖర్, ఎంపీడీఓ కృష్ణయ్య, ఏపీఓ ఈశ్వర్‌జీ, ఈసీ దేవేందర్, టీఏ సత్యనారాయణ, కార్యదర్శులు గిరిగౌడు, అన్నపూర్ణ, భాస్కర్, వాణి తదితరులు పాల్గొన్నారు.


