కందనూలు: జిల్లాకేంద్రంలోని శ్రీపురం రోడ్డులో ఉన్న ఈద్గా రంజాన్ పర్వదినానికి ముస్తాబైంది. శనివారం ఈద్గా వద్దకు ముస్లింలు ఉదయం 8 గంటలకు ర్యాలీగా చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం ఈద్గా వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తాగునీరు, నీడ వసతి కల్పించారు. ఈద్గా పరిసరాల్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు కల్పిస్తున్నారు.
జిల్లాకేంద్రంలోని శ్రీపురం రోడ్డులో ప్రత్యేక ప్రార్థనలకు ముస్తాబైన ఈద్గా


