కందనూలు: జిల్లాలోని కాంగ్రెస్ కార్యకర్తలకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా బాధ్యతలను అప్పగించింది. జిల్లా ఉపాధ్యక్షులుగా అనంతరెడ్డి, హరినారాయణగౌడ్, వెంకటస్వామి, మాధవరెడ్డి, రాముయాదవ్, జగదీశ్వరుడు, ప్రధాన కార్యదర్శులుగా బాల్‌రాంగౌడ్, పుల్జాల కృష్ణారెడ్డి, రామనాథం, వెంకట్‌రెడ్డి, నాగేశ్వర్‌రావు, రామలింగయ్యయాదవ్, వెంకట్రామరెడ్డి, వెంకటయ్యగౌడ్, రాంచంద్రారెడ్డి, తిరుపతిరెడ్డి, వెంకటస్వామి, వేణుగోపాల్‌యాదవ్‌లను నియమించారు. అలాగే ట్రెజరర్‌గా రఘురాం, జిల్లా ప్రతినిధులుగా కపిలవాయి శేఖర్, శ్రీకాంత్‌రెడ్డి, కృష్ణారెడ్డి, విష్ణు, కార్యదర్శులుగా ఎడ్ల ఆనంద్, వెంకటేష్, మల్లయ్య, కట్టి ఈశ్వర్, కావలి శ్రీను, లింగారెడ్డి, మోతీలాల్, మహేశ్వర్‌రెడ్డి, వెంకటస్వామిలను నియమించారు. ఇప్పటికే డీసీసీ అధ్యక్షుడిగా వంశీకృష్ణ ఉండగా.. తాజా గా నియమించిన ఈ కమిటీతో జిల్లాలో పూర్తిస్థాయిలో కమిటీ ఏర్పాటు చేసినట్లయ్యింది.
ప్రభుత్వ విప్‌గా యెన్నం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డికి ప్రభుత్వ విప్‌గా అవకాశం దక్కింది. ఈమేరకు గురువారం రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉత్తర్వులు జారీచేశారు. ఉమ్మడి జిల్లాలో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేకు కీలకమైన విప్ పదవి వరించడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి జిల్లాకు చెందిన రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగా, మంత్రులుగా జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరిలకు అవకాశం దక్కింది. ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జి.చిన్నారెడ్డి ఉన్నారు. తాజాగా మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డికి ప్రభుత్వ విప్‌గా అవకాశం రావడంతో ఆయన సైతం కేబినెట్ సత్సమాన ర్యాంకులో వ్యవహరించనున్నారు. 2012 ఉప ఎన్నికలో యెన్నం మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2023 ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.
బీఆర్‌ఎస్ హయాంలో ఇద్దరికీ..
ఉమ్మడి జిల్లాలో బీఆర్‌ఎస్ పాలనలో ఇద్దరు మంత్రులతో పాటు మరో ఇద్దరు ప్రభుత్వ విప్‌లుగా వ్యవహరించారు. బీఆర్‌ఎస్ హయాంలో గతంలో మంత్రులుగా శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డితో పాటు ప్రభుత్వ విప్‌లుగా ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, గువ్వల బాలరాజు వ్యవహరించారు. 2016లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ నుంచి గెలుపొందిన కూచుకుళ్ల అనంతరం బీఆర్‌ఎస్‌లో చేరారు. 2019లో బీఆర్‌ఎస్ ఆయనకు ప్రభుత్వ విప్‌గా అవకాశం కల్పించింది.
రామలింగేశ్వరస్వామికి విశేషాలంకరణ
అడ్డాకుల: ఉగాది పండుగ, తెలుగు కొత్త సంవత్సరం ఆరంభం సందర్భంగా కందూర్ సమీపంలో స్వయంభూగా వెలిసిన శ్రీరామలింగేశ్వరస్వామికి గురువారం విశేషాలంకరణ చేశారు. స్వామివారి శివలింగాన్ని పూలు, పండ్లతో అందంగా అలంకరణ చేశారు. ఆలయంలో స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.


