breaking news
iran
-
ఇరాన్‌పై ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’ ప్రయోగానికి అమెరికా ప్లాన్?
వాషింగ్టన్: ఇరాన్‌తో యుద్ధాన్ని అమెరికా మళ్లీ ప్రారంభిస్తే.. ఆ దేశంలోని అణు కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై భారీ దాడులు చేసే అవకాశాలను అమెరికా సైన్యం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇందులో ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’ (MOAB)గా పిలిచే అత్యంత శక్తిమంతమైన బాంబును ఉపయోగించే ప్రణాళిక కూడా ఉన్నట్లు ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ సీఎన్ఎన్ వెల్లడించింది. ఈ వివరాలను అమెరికా అధికారులను ఉటంకిస్తూ రాయిటర్స్ పేర్కొంది. అయితే ఈ నివేదికను రాయిటర్స్ స్వతంత్రంగా ధ్రువీకరించలేకపోయింది.ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా?అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశిస్తే.. ఇరాన్‌లోని ఇంధన కేంద్రాలు, పిక్‌యాక్స్ మౌంటైన్ వంటి అణు కేంద్రాలపై దాడులు చేసే అవకాశాలను సైన్యం ఇప్పటికే సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే ప్రస్తుతానికి ఈ దాడులు ఎప్పుడు జరుగుతాయనే దానిపై ఇంకా స్పష్టత లేదు. అమెరికా మధ్యంతర ఎన్నికలకు ముందు కానీ.. లేదంటే ఎన్నికల తర్వాత ఈ సైనిక చర్యలను పునఃప్రారంభించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సదరు కథనం పేర్కొంది.భూగర్భ కేంద్రాలపై ఎంతవరకు ప్రభావం?MOAB బరువు సుమారు 9,800 కిలోలు. ఇది అణ్వాయుధం కాదు కానీ, భారీ పేలుడు సృష్టించగలదు. అయితే గ్రానైట్ పొరలతో రక్షణ కల్పించిన భూగర్భ అణు కేంద్రాలను ధ్వంసం చేయడంలో ఈ బాంబు ఎంతవరకు ప్రభావవంతంగా పనిచేస్తుందనే సందేహాలు అమెరికా అధికారుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీని భారీ పేలుడు పరిధి కారణంగా జరిగే ప్రాణనష్టంపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.యుద్ధం నుంచి బయటపడేందుకు, తమకు విజయం లభించినట్లు చూపించేందుకు ట్రంప్ ప్రభుత్వం వివిధ సైనిక ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు సీఎన్ఎన్ నివేదించింది. అయితే, ఇరాన్‌పై కొత్త దాడులకు సంబంధించి తుది నిర్ణయం తీసుకున్నట్లు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.ఇదీ చదవండి: భారత్, చైనాపై సుంకాల ముప్పు.. 10 రోజుల్లో ట్రంప్ కీలక నిర్ణయం! -
పాక్ డబుల్ గేమ్.. దాయాది పిల్లిమొగ్గలు!
పొరుగు దేశంతో స్నేహం.. మరో దేశంతో వ్యూహాత్మక సంబంధం.. ఆర్థిక అవసరాలు.. స్వదేశంలో రాజకీయ ఒత్తిళ్లు. ఈ నాలుగు అంశాల మధ్య పాకిస్థాన్ విదేశాంగ విధానం చిక్కుముడిగా మారిందా?. ‘రెండు పడవల మీద కాళ్లు పెడితే ప్రయాణం సాఫీగా సాగదు’ అన్న చందంగా సౌదీ అరేబియా, ఇరాన్‌లతో సంబంధాల విషయంలో ఇస్లామాబాద్ ఇరకాటంలో పడిందా? సౌదీ అరేబియాపై యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారుల దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ వైఖరిపై చర్చ మొదలైంది. సౌదీ అరేబియా, పాకిస్థాన్, తుర్కియే కలిసి మక్కా సంయుక్త రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం ఒక దేశంపై సాయుధ దాడి జరిగితే.. మిగతా దేశాల భద్రతకు కూడా ముప్పుగా పరిగణించాలి. అయితే, సౌదీపై దాడులు కొనసాగుతున్నప్పటికీ పాకిస్థాన్ ప్రత్యక్ష సైనిక ప్రతిస్పందనపై స్పష్టత ఇవ్వకపోవడం ఆసక్తికరంగా మారింది. ‘మాటలు కోటలు దాటుతాయి.. చేతలు గడప దాటవు’ అన్నట్లుగా పాక్ వైఖరి ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.కాగా, 2026 ఆగస్టు 7న మక్కాలో సౌదీ అరేబియా, పాకిస్థాన్, తుర్కియే మక్కా సంయుక్త రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఏదైనా సభ్య దేశంపై సాయుధ దాడి జరిగితే అది మిగతా సభ్య దేశాలపై జరిగిన దాడిగానూ పరిగణించేలా ఈ ఒప్పందాన్ని రూపొందించారు. అయితే, దీనికి సంబంధించిన కార్యాచరణ, సైనిక సహకారం ఎలా ఉండాలన్నది పరిస్థితులు, కూటమి నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.మరోవైపు, సౌదీ అరేబియాపై హౌతీల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం వాటిని ఖండించింది. సౌదీ సార్వభౌమత్వం, భద్రతకు మద్దతుగా నిలుస్తామని ప్రకటించింది. కానీ ప్రత్యక్షంగా ఎలాంటి సైనిక చర్య చేపడుతుందన్న విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. సెప్టెంబర్‌లోనూ ఒప్పందం కింద తక్షణ సైనిక ప్రతిస్పందనపై చర్చ జరగలేదని పాకిస్థాన్ విదేశాంగ శాఖ వెల్లడించింది. దీంతో ‘అడకత్తెరలో పోకచెక్క’ అన్నట్లుగా సౌదీకి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలా? లేక మరోవైపు సంబంధాలను దృష్టిలో పెట్టుకుని వెనకడుగు వేయాలా? అన్న సందిగ్ధంలో పాక్ ఉందనే చర్చ జరుగుతోంది.సౌదీ సాయం.. పాకిస్థాన్‌కు సవాల్!ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్థాన్‌కు సౌదీ అరేబియా కీలక భాగస్వామి. ఆర్థిక సహాయం, పెట్టుబడులు, ఇంధన రంగ సహకారం వంటి అంశాల్లో ఇరు దేశాల మధ్య దీర్ఘకాల సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో సౌదీ భద్రతకు మద్దతు ఇవ్వాల్సిన దౌత్యపరమైన అవసరం పాకిస్థాన్‌పై ఉంది. ‘ఉప్పు తిన్నవాడు నీళ్లు తాగక తప్పదు’ అన్నట్లుగా తనకు ఆర్థికంగా అండగా నిలిచిన సౌదీకి మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత పాక్‌పై ఉందనే వాదన వినిపిస్తోంది.అదే సమయంలో సౌదీకి మద్దతుగా యెమెన్ యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొంటే.. ఇరాన్‌తో సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. హౌతీలకు ఇరాన్ మద్దతు ఇస్తోందన్నది అంతర్జాతీయంగా విస్తృతంగా నమోదైన అంశం. ఇరాన్‌తో దౌత్య సంబంధాలను కొనసాగించాల్సిన అవసరం కూడా పాకిస్థాన్‌కు ఉంది. దీంతో సౌదీకి ఇచ్చిన రక్షణ హామీని అమలు చేయడం, మరోవైపు ప్రాంతీయ యుద్ధంలోకి పూర్తిగా దిగకుండా ఉండటం మధ్య ఇస్లామాబాద్ సమతుల్యం పాటించాల్సి వస్తోంది. ‘అటు చూస్తే నుయ్యి.. ఇటు చూస్తే గొయ్యి’ అన్న పరిస్థితి పాక్ ముందున్న సవాళ్లను ప్రతిబింబిస్తోంది.స్వదేశంలో షియా వర్గాల నిరసనల భయమా?పాకిస్థాన్ నిర్ణయాలను ప్రభావితం చేసే మరో అంశం దేశీయ రాజకీయ, మతపరమైన పరిస్థితులు. అక్కడ గణనీయమైన షియా ముస్లిం జనాభా ఉంది. సౌదీకి మద్దతుగా ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలపై ప్రత్యక్ష సైనిక చర్యకు దిగితే.. దేశంలో నిరసనలు చెలరేగే అవకాశం ఉందన్న ఆందోళనలు విశ్లేషణల్లో వ్యక్తమవుతున్నాయి.గతంలోనూ యెమెన్ యుద్ధంలో పాల్గొనాలన్న సౌదీ అభ్యర్థనపై పాకిస్థాన్ పార్లమెంటు తటస్థ వైఖరిని సమర్థించింది. అందువల్ల ఈసారి కూడా దేశీయ రాజకీయ పరిణామాలు, ప్రజాభిప్రాయం ఇస్లామాబాద్ నిర్ణయాలపై ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, షియా వర్గాల నిరసనల భయమే పాకిస్థాన్ సైనిక చర్యకు వెనుకాడటానికి ప్రధాన కారణమని నిర్ధారించే అధికారిక ఆధారాలు లేవు. ‘ఇల్లు చక్కదిద్దుకోలేనివాడు.. ఊరిని ఉద్ధరించలేడు’ అన్నట్లుగా స్వదేశంలో తలెత్తే పరిణామాలను కూడా పాక్ పాలకులు పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తోంది.మాటల్లో మద్దతు.. చేతల్లో నిల్!సౌదీపై హౌతీల దాడులను పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఖండించారు. సౌదీ ప్రజలు, ప్రభుత్వానికి అండగా ఉంటామని ప్రకటించారు. మక్కా రక్షణ ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని పాకిస్థాన్ విదేశాంగ శాఖ కూడా స్పష్టం చేసింది. సౌదీలో ఇప్పటికే పాకిస్థాన్ సైనిక సిబ్బంది, వనరులు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. అయితే, హౌతీలపై దాడుల్లో పాకిస్థాన్ యుద్ధ విమానాలు పాల్గొంటున్నాయన్న వార్తలను ఆ దేశ ప్రభుత్వం ఖండించింది. ఇదే సమయంలో సౌదీపై దాడులు కొనసాగుతుండటంతో రక్షణ ఒప్పందం వాస్తవంగా ఎలా అమలవుతుందన్న ప్రశ్న ముందుకొస్తోంది. పాకిస్థాన్ ప్రత్యక్ష సైనిక చర్యకు దిగుతుందా? లేక రక్షణ, నిఘా, సాంకేతిక సహకారం వంటి మార్గాలకే పరిమితమవుతుందా? అన్నది స్పష్టత రావాల్సి ఉంది. ‘చెప్పేది శ్రీరంగ నీతులు.. చేసేది మరోటి’ అన్న విమర్శలకు తావివ్వకుండా పాక్ తన వైఖరిని కార్యాచరణలో చూపిస్తుందా? అన్నదే ఇప్పుడు కీలక ప్రశ్న.మొత్తంగా.. సౌదీతో ఆర్థిక, రక్షణ బంధాలు.. ఇరాన్‌తో దౌత్య సంబంధాలు.. స్వదేశంలో రాజకీయ, మతపరమైన సమీకరణాలు.. ఈ మూడు అంశాల మధ్య పాకిస్థాన్ క్లిష్టమైన నిర్ణయాన్ని ఎదుర్కొంటోంది. ‘ఒక చేత్తో చప్పట్లు రావు’ అన్నట్లుగా రక్షణ ఒప్పందం అమలుకు సభ్య దేశాల మధ్య సమన్వయం అవసరం. మక్కా ఒప్పందం కేవలం ప్రకటనలకే పరిమితమవుతుందా? లేక సౌదీపై దాడుల నేపథ్యంలో ఆచరణలోనూ ఉమ్మడి రక్షణ చర్యలు కనిపిస్తాయా? అనేది రానున్న పరిణామాలే తేల్చనున్నాయి.ఇదీ చదవండి: గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు.. కీలక నిర్ణయాలు తీసుకున్న పాకిస్తాన్, ఒమన్! -
పశ్చిమాసియా రాజకీయాల్లో ముగిసిన ఓ శకం.. ఇక పరిణామాలేంటి?
పశ్చిమాసియా రాజకీయాల్లో ఓ శకం ముగిసింది. అదే.. ఇరాక్ నుంచి అమెరికా వైదొలిగింది. ఇప్పుడు పరిస్థితులు అంతకంటే పెద్ద సంక్షోభానికి తెరలేస్తుందా అన్నట్లుగా తయారవుతున్నాయి. 2001 సెప్టెంబర్ 11 దాడుల తర్వాత ప్రపంచాన్ని గడగడలాడించిన 'వార్ ఆన్ టెర్రర్' (War on Terror).. పాతికేళ్ల తర్వాత ఇప్పుడు అధికారికంగా ముగింపు దశకు చేరుకుంది. సెప్టెంబర్ 30 నాటికి ఇరాక్ గడ్డపై మిగిలి ఉన్న చివరి అమెరికన్ బలగాలు కూడా పూర్తిగా వెనక్కి వచ్చేశాయి.ఇరాక్ ఉత్తర ప్రాంతాల్లో ఉన్న ఆ కొన్ని వందల మంది సైనికులు సైతం తమ సైనిక సామగ్రితో స్వదేశానికి పయనమయ్యారు. పైకి చూస్తే ఇది ఒక యుద్ధం ముగింపులా కనిపించవచ్చు. కానీ, అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకుల మాటల్లో మాత్రం అమెరికా నిష్క్రమణ అనేది శాంతికి ఆరంభం కాదని, అగ్నిపర్వతం బద్ధలవ్వడానికి సంకేతమనే ఆందోళన వ్యక్తమవుతోంది. అసలు ఇరాక్ అనేది ఒక సహజమైన దేశమా? లేక వలస పాలకులు బలవంతంగా నిర్మించిన రాజ్యమా? అమెరికా ఔట్ అయ్యాక.. ఇరాక్‌లో ఏం జరగబోతోంది..? పూర్తి వివరాలు ఈ కింది వీడియోలో చూడండి.. -
ఇరాన్ కొత్త గేమ్.. ట్రంప్–నెతన్యాహుకు చుక్కలే!
ఇరాన్ యుద్ధంలో మరో కీలక మలుపు! అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో సైనికంగా దెబ్బతిన్నా.. హార్ముజ్ జలసంధి వద్ద కొత్త వ్యూహాలతో ఇరాన్ ఎదురుదాడికి దిగుతోంది. చమురు నౌకలపై దాడులను పెంచడంతో పాటు, తమ ఆంక్షలను ఉల్లంఘించే నౌకలకు ఈ మార్గాన్ని మూసివేయాలని భావిస్తోంది. ప్రపంచ చమురు ధరలు తగ్గకుండా చూడటం, నవంబర్ 3న జరిగే అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ రిపబ్లికన్ల అవకాశాలను దెబ్బతీయడం కూడా తమ వ్యూహంలో భాగమని ఇరాన్ అధికారులు చెబుతున్నారు.మరోవైపు, ఇరాన్‌పై మళ్లీ భారీ సైనిక దాడులు చేయాలా? లేదంటే ఆర్థిక ఆంక్షలు, నౌకాదళ దిగ్బంధనంతో ఒత్తిడి కొనసాగించాలా? అనే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సందిగ్ధంలో ఉన్నాడట. ఇటు ఇరాన్ అణు కార్యక్రమం తిరిగి ఊపందుకుంటోందన్న ఆందోళనతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కొత్త దాడులకు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.హార్ముజ్ వద్ద కొత్త ఎత్తుగడలుఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైనప్పటి నుంచి హార్ముజ్ జలసంధిపై పట్టు సాధించేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోంది. యుద్ధానికి ముందు ప్రపంచ చమురు, ఎల్ఎన్జీ రవాణాలో దాదాపు ఐదో వంతు ఈ మార్గం నుంచే సాగేది. నౌకల రాకపోకలను పరిమితం చేసి అమెరికాపై ఒత్తిడి పెంచాలని టెహ్రాన్ భావిస్తోంది. గత పది రోజులుగా దాడుల వ్యూహాన్ని మార్చినట్లు ఇద్దరు సీనియర్ ఇరాన్ అధికారులు రాయిటర్స్‌కు వెల్లడించారు.చిన్న పడవలతో నిఘా.. ఆపై దాడులు!అమెరికా దాడుల్లో ఇరాన్ రాడార్ వ్యవస్థలు దెబ్బతినడంతో ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) కొత్త పద్ధతిని అనుసరిస్తున్నట్లు అమెరికా సైనిక అధికారి తెలిపారు. ఆయుధాలు లేని చిన్న పడవల్లో నిఘా సిబ్బందిని పంపి, అమెరికా నౌకాదళంతో పాటు ఇతర లక్ష్యాల కదలికలను గుర్తిస్తున్నట్లు వివరించారు. గత వారం ఇలాంటి ఓ పడవలోని సిబ్బంది సమాచారాన్ని ఐఆర్‌జీసీకి చేరవేస్తున్నట్లు గుర్తించిన అమెరికా బలగాలు వారిని బయటకు పంపించి, పడవను ధ్వంసం చేశాయని తెలిపారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదన్నారు.గల్ఫ్ ఆఫ్ ఒమన్ వరకూ విస్తరణ?హార్ముజ్కే పరిమితం కాకుండా గల్ఫ్ ఆఫ్ ఒమన్, ఖతార్, యూఏఈ తీరాలకు సమీపంలోని సముద్ర జలాల్లోనూ కార్యకలాపాలను విస్తరించాలన్నది ఇరాన్ వ్యూహంగా కనిపిస్తోంది. గత 48 గంటల్లో ట్యాంకర్లతో సహా వాణిజ్య నౌకలకు సంబంధించి కనీసం ఐదు ఘటనలు నమోదయ్యాయి. వీటిలో డ్రోన్ దాడులు కూడా ఉన్నట్లు సమాచారం. తమ ఆంక్షలను ఉల్లంఘించే నౌకలకు హార్ముజ్ మార్గాన్ని పూర్తిగా మూసివేస్తామని ఇరాన్ అధికారులు హెచ్చరిస్తున్నారు. చమురు ధరలను తగ్గించేందుకు అమెరికా, దాని మిత్రదేశాలు చేసే ప్రయత్నాలను అడ్డుకుంటామని పేర్కొంటున్నారు. హార్ముజ్ వద్ద వాణిజ్య నౌకలకు ముప్పు తీవ్రంగానే ఉందని జాయింట్ మారిటైమ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ కూడా హెచ్చరించింది.దాడులు చేయాలా? ఆగాలా?ఇరాన్‌పై మళ్లీ సైనిక చర్య చేపట్టే అంశంపై ట్రంప్, నెతన్యాహు చర్చించినట్లు ఆక్సియోస్ కథనం వెల్లడించింది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని పునరుద్ధరించే ప్రయత్నాల్లో భాగంగా ‘పికాక్స్ మౌంటెన్’ ప్రాంతాన్ని యురేనియం శుద్ధి కేంద్రంగా ఉపయోగించే అవకాశం ఉందని ఇజ్రాయెల్ ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, సెంట్రల్ కమాండ్ నాయకత్వం సైనిక చర్యకు మద్దతిస్తున్నట్లు కథనం పేర్కొంది. అయితే ట్రంప్ సలహాదారుల్లో ఎక్కువమంది ఆర్థిక ఆంక్షలు, ఇతర ఒత్తిడి మార్గాలకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.దాడులపై ట్రంప్ తుది నిర్ణయం తీసుకోలేదని, నవంబర్ 3న జరిగే మధ్యంతర ఎన్నికలకు ముందు ఇరాన్‌పై దాడి చేయబోమని ఆయన ప్రకటించినట్లు వైట్‌హౌస్ తెలిపింది. ట్రంప్, నెతన్యాహు మళ్లీ యుద్ధం ప్రారంభించే అంశంపై చర్చించారన్న వార్తలను వైట్‌హౌస్ అధికారి ఖండించారు. ఇరువురు నేతల మధ్య క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుగుతాయని నెతన్యాహు కార్యాలయం పేర్కొంది.ఎన్నికలే అసలు లెక్కా?ఇజ్రాయెల్‌లో అక్టోబర్ 27న, అమెరికాలో నవంబర్ 3న ఎన్నికలు జరగనున్నాయి. ఇరాన్‌పై మళ్లీ దాడులు చేస్తే నెతన్యాహుకు రాజకీయంగా ప్రయోజనం కలగవచ్చన్న అంచనాలున్నా, ఇరాన్ ప్రతిదాడులతో ఎన్నికలు వాయిదా పడే ప్రమాదం ఉందన్న ఆందోళన కూడా ఉంది. అమెరికాలో యుద్ధం కారణంగా చమురు ధరలు పెరిగితే ట్రంప్ రిపబ్లికన్లకు ఎన్నికల్లో నష్టం వాటిల్లవచ్చు. అందుకే సైనిక చర్యపై ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు విశ్లేషణలు చెబుతున్నాయి.అమెరికా ఇరాన్ ఓడరేవులపై నౌకాదళ దిగ్బంధనాన్ని కొనసాగిస్తూ ఆర్థిక ఆంక్షలను కఠినతరం చేస్తోంది. హార్ముజ్ వద్ద ఇరాన్ కొత్త వ్యూహాలు, అమెరికా–ఇజ్రాయెల్ సైనిక సన్నద్ధత మధ్య ట్రంప్ తీసుకునే నిర్ణయం యుద్ధ భవిష్యత్తుతో పాటు ప్రపంచ చమురు ధరలు, ఎన్నికల రాజకీయాలపైనా ప్రభావం చూపనుంది.ఇదీ చదవండి: 30 ఏళ్ల తర్వాత వీడిన మిస్టరీ! -
ట్రంప్‌కు ఇరాన్ షాక్.. హార్ముజ్‌పై కొత్త ట్విస్ట్!
అమెరికాతో చర్చలకు ఇరాన్ కొత్త మెలిక పెట్టింది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలంటే తమ ఏడు షరతులను అంగీకరించాల్సిందేనని తేల్చిచెప్పింది. వాషింగ్టన్ స్పందన తమకు సంతృప్తికరంగా లేదని, కొన్ని అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని ఇరాన్ భద్రతా మండలి కార్యదర్శి మొహ్సేన్ రెజాయ్ ప్రకటించారు. దీంతో ఇరాన్-అమెరికా మధ్య దౌత్య ప్రయత్నాలు మరోసారి సందిగ్ధంలో పడ్డాయి.కాగా, అమెరికా నుంచి వచ్చిన ప్రతిపాదనలో కొన్ని షరతులను అంగీకరించినప్పటికీ, మరికొన్నింటిపై స్పష్టత లేదని రెజాయ్ వెల్లడించారు. తమ ఏడు షరతులు నెరవేరే వరకు అమెరికాకు హార్ముజ్ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని, చర్చలు కూడా ముందుకు సాగవని స్పష్టం చేశారు. ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల మధ్య సందేశాల మార్పిడి జరుగుతున్నప్పటికీ, ప్రధానంగా ఏ అంశాన్ని ముందుగా అమలు చేయాలన్న దానిపై విభేదాలు ఉన్నట్లు సమాచారం.అణు చర్చలకు ఇప్పట్లో నో!మరోవైపు.. ప్రస్తుత చర్చల్లో ఇరాన్ అణు కార్యక్రమాన్ని చేర్చడాన్ని టెహ్రాన్ వ్యతిరేకిస్తోంది. తమ తక్షణ ప్రాధాన్యం హార్ముజ్ జలసంధిలో భద్రతను పునరుద్ధరించడమేనని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ తెలిపారు. అణు కార్యక్రమంపై చర్చలకు బదులుగా ఆంక్షల సడలింపు పొందేందుకు ఐక్యరాజ్యసమితి అణు పర్యవేక్షణ సంస్థ తనిఖీలకు ఇరాన్ అంగీకరించిందన్న వార్తలను కూడా ఆయన ఖండించారు.అక్టోబర్ 4న ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఖెర్ ఖాలిబాఫ్ సైతం ఏడు షరతులు నెరవేరే వరకు అమెరికాకు జలసంధిని తెరిచేది లేదని ప్రకటించారు.త్వరలోనే యుద్ధం ముగిస్తాం: ట్రంప్అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం యుద్ధాన్ని త్వరగానే ముగించగలమని వ్యాఖ్యానించారు. ఇరాన్ వైఖరిలో కొంత మార్పు కనిపిస్తోందని పేర్కొంటూనే, నవంబర్ 3న జరిగే అమెరికా మధ్యంతర ఎన్నికలకు ముందు ఉద్రిక్తతలు పెంచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నప్పటికీ అమెరికా దిగ్బంధం మాత్రం కొనసాగుతుందని గతంలో స్పష్టం చేశారు. ఇరాన్ అణ్వాయుధాన్ని పొందేందుకు అనుమతించబోమని మరోసారి ప్రకటించారు.ఇక, అమెరికా దౌత్య ప్రయత్నాలను పక్కనపెట్టి సైనిక చర్యలకు దిగితే తాము గతంలో కంటే మెరుగైన సన్నద్ధతతో ఉన్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ హెచ్చరించారు. దేశ రక్షణ కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తమ క్షిపణుల పరిధిని పెంచనున్నట్లు ఇరాన్ సైనిక వర్గాలు కూడా ప్రకటించాయి.సౌదీలో ఉద్రిక్తత..ఇదిలా ఉండగా, సౌదీ అరేబియాలోని రియాద్ కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన క్షిపణి దాడి ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఈ దాడిలో ఇప్పటి వరకు 13 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడినట్లు సౌదీ అధికారులు వెల్లడించారు. రియాద్‌పై దాడికి ఇరాన్ మద్దతున్న హౌతీ తిరుగుబాటుదారులే కారణం కాగా.. ఈ దాడిని ట్రంప్ తీవ్రంగా ఖండించారు. హౌతీలపై సౌదీ సైనిక చర్యల్లో అమెరికా కూడా పాల్గొనే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సైతం దాడిని ఖండించారు.దాడి నేపథ్యంలో రియాద్ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. పలు విమానాలను రద్దు చేయగా, మరికొన్నింటిని ఇతర విమానాశ్రయాలకు మళ్లించినట్లు విమాన ట్రాకింగ్ సంస్థలు వెల్లడించాయి. మొత్తంగా.. హార్ముజ్ జలసంధి తెరవడం, ఇరాన్ అణు కార్యక్రమం, అమెరికా ఆంక్షలు, సౌదీపై దాడులు.. ఇలా పలు అంశాలు ఒకదానితో మరొకటి ముడిపడటంతో యుద్ధానికి ముగింపు పలికే దౌత్య ప్రయత్నాలు కఠినంగా మారుతున్నాయి. ఇదీ చదవండి: పెను సంక్షోభం దిశగా ప్రపంచం.. భారత్‌కూ తప్పని సెగ! -
ఇజ్రాయెల్‌కు టెన్షన్.. ఇరాన్ ‘రివర్స్ కౌంట్‌డౌన్’ మొదలైందా?
బాంబులు పడ్డాయి.. భవనాలు నేలమట్టమయ్యాయి.. కొండపై భారీ గుంత ఏర్పడింది.. అంతా ముగిసిపోయిందనుకున్నారంతా! కానీ.. కొన్ని నెలలు గడిచేసరికి అక్కడ మళ్లీ వాహనాలు తిరుగుతున్నాయి.. శిథిలాలు తొలగిపోతున్నాయి.. భూమిలో భారీ యంత్రాలు పనిచేస్తున్నాయి! అసలు అక్కడ ఏం జరుగుతోంది? ఇరాన్ మళ్లీ అణ్వాయుధ కార్యక్రమాన్ని పట్టాలెక్కిస్తోందా? ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతున్న ప్రశ్న!ఇది సాధారణ సైనిక స్థావరం కాదు. టెహ్రాన్‌కు ఈశాన్యంగా ఉన్న మిన్జదాయీ (Minzadayi) ప్రాంతంలోని అత్యంత రహస్యమైన సముదాయం. ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమానికి సంబంధించిన కీలక పనులు ఇక్కడ జరిగేవని ఇజ్రాయెల్ గతంలో ఆరోపించింది. 2026 మార్చిలో అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఈ ప్రాంతంలోని పలు భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొన్ని భూగర్భ నిర్మాణాలు కూడా ప్రభావితమైనట్లు అంచనాలు వచ్చాయి. కానీ.. ఇప్పుడు సీన్ మారింది!సెప్టెంబర్ ప్రారంభంలో తీసిన హై-రిజల్యూషన్ శాటిలైట్ చిత్రాల్లో మిన్జదాయీలో మళ్లీ కదలికలు కనిపించాయి. ధ్వంసమైన భవనాల శిథిలాలను తొలగిస్తున్నారు. బాంబు పడటంతో ఏర్పడిన గుంతను పూడ్చేశారు. భారీ ఎర్త్ మూవింగ్ యంత్రాలు పనిచేస్తున్నాయి. అంతేకాదు.. గతంలో ఖాళీగా కనిపించిన పార్కింగ్ ప్రాంతాల్లో మళ్లీ కార్లు, ట్రక్కులు కనిపించాయి. సెక్యూర్ పరిధిలోనూ వాహనాల రాకపోకలు పెరిగాయి. ఇవన్నీ సాధారణ పునర్నిర్మాణ పనులేనా? లేక ఇజ్రాయెల్ దాడులతో దెబ్బతిన్న అణు కార్యక్రమాన్ని ఇరాన్ మళ్లీ పునరుద్ధరిస్తోందా? అన్న అనుమానాలు మొదలయ్యాయి.మళ్లీ మొదలైందా?అమెరికాకు చెందిన Institute for Science and International Security తాజా శాటిలైట్ చిత్రాలను విశ్లేషించింది. మిన్జదాయీలో జరుగుతున్న పునరుద్ధరణ చర్యలు.. అక్కడ చేపట్టే కార్యకలాపాలకు ఉన్న ప్రాధాన్యాన్ని సూచిస్తున్నాయని పేర్కొంది. అయితే చిత్రాల్లో కనిపిస్తున్న కదలికలే అణ్వాయుధ తయారీ తిరిగి ప్రారంభమైందని నిర్ధారించవని కూడా స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ప్రాంతంలో అణ్వాయుధ వ్యవస్థలకు అవసరమైన కీలక భాగాలపై శాస్త్రవేత్తలు పనిచేసేవారు. మరో మధ్యప్రాచ్య భద్రతా సంస్థ విశ్లేషణ ప్రకారం.. 2022లో ఏర్పాటైన ఈ కేంద్రం అణ్వాయుధాలకు సంబంధించిన పరిశోధన, అభివృద్ధి మౌలిక వసతుల పునర్నిర్మాణానికి ఉపయోగపడుతోంది.దాడులతో ఆపలేకపోయారా?ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిలిపివేయడమే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ 2026 ఫిబ్రవరి 28 నుంచి దాడులు ప్రారంభించాయి. ఆ దాడులు ఇరాన్ అణు మౌలిక వసతులకు భారీ నష్టం కలిగించాయి. అనంతరం జరిగిన శాంతి చర్చల్లోనూ అమెరికా కీలక షరతులు విధించింది. అధిక స్థాయి యురేనియం శుద్ధిని శాశ్వతంగా నిలిపివేయాలని.. భవిష్యత్తులో అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయబోమని ఇరాన్ హామీ ఇవ్వాలని అమెరికా కోరింది. అయితే ఈ అంశాల్లో ఇరాన్ పూర్తిగా అంగీకరించకపోవడంతో చర్చలు ముందుకు సాగలేదు.ఇప్పుడు అసలు టెన్షన్ ఇదే!ఒకవైపు శాంతి చర్చలు.. మరోవైపు అణు కేంద్రాలపై నిఘా.. ఇంకోవైపు దాడికి గురైన రహస్య స్థావరాల్లో మళ్లీ కదలికలు.. ఇప్పుడు ఇదే విషయం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఇజ్రాయెల్ బాంబులతో నేలమట్టమైనట్లు కనిపించిన మిన్జదాయీ.. ఇప్పుడు మళ్లీ ఎందుకు మేల్కొంటోంది? అక్కడ జరుగుతున్నది కేవలం శిథిలాల తొలగింపా? లేక ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని మరోసారి రహస్యంగా పట్టాలెక్కించే ప్రయత్నమా?. ప్రస్తుత శాటిలైట్ చిత్రాలు కార్యకలాపాలు పునఃప్రారంభమైన సంకేతాలను చూపుతున్నప్పటికీ.. అవి అణ్వాయుధ కార్యక్రమం తిరిగి మొదలైందని నిర్ధారించవు. అయినా.. ప్రపంచం చూపు ఇప్పుడు మరోసారి ఇరాన్ వైపే ఉంది.📍 Uydu görüntüleri, mart ayında İsrail saldırısına uğrayan Tahran’ın kuzeydoğusundaki Minzadayi yerleşkesinde araç hareketliliği, enkaz kaldırma, onarım ve toprak çalışmalarının yeniden yoğunlaştığını ortaya koydu. -Vantor Technologies https://t.co/vXWaj4KNR2— SavunmaTR (@SavunmaTR) October 7, 2026ఇదీ చదవండి: సౌదీకి కొత్త భయం.. పాక్ వల్ల సాధ్యమేనా? -
ఇరాన్‌పై బిగ్ ట్విస్ట్.. ట్రంప్, వాన్స్ సంచలన వ్యాఖ్యలు
ఏడు నెలలుగా కొనసాగుతున్న ఇరాన్-అమెరికా యుద్ధానికి ముగింపు పలికేందుకు చర్చలు జరుగుతున్న వేళ.. టెహ్రాన్ నాయకత్వంపై అమెరికా చేసిన వ్యాఖ్యలు మరోసారి కలకలం రేపుతున్నాయి. ఇరాన్లో అసలు నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారో స్పష్టంగా తెలియడం లేదని అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలకు మరుసటి రోజే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందిస్తూ.. ‘ఇరాన్‌ను ఎవరు నడుపుతున్నారో ఎవరికీ తెలియదు’ అని అన్నారు. దీంతో యుద్ధం కంటే ఇప్పుడు ఇరాన్ అధికార వ్యవస్థపై అమెరికా వ్యక్తం చేస్తున్న సందేహాలే అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.రాయిటర్స్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జేడీ వాన్స్ మాట్లాడుతూ.. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీతో అమెరికా చర్చలు జరుపుతోందని తెలిపారు. అయితే, దేశంలో వాస్తవంగా నిర్ణయాలు తీసుకునే అధికారం వీరికి ఎంతవరకు ఉందో స్పష్టంగా తెలియడం లేదని అన్నారు. ఇరాన్ రాజకీయ వ్యవస్థలో నిర్ణయాలు ఎవరు?.. ఎలా తీసుకుంటారో పూర్తిగా అర్థం చేసుకోవడం అమెరికాకు సవాలుగా మారిందని వాన్స్ వ్యాఖ్యానించారు.వాన్స్ వ్యాఖ్యలపై మరుసటి రోజే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్‌తో చర్చలు, యుద్ధానికి ముగింపు వంటి అంశాలపై అమెరికా ముందుకు వెళ్తున్నప్పటికీ.. ‘అతిపెద్ద సమస్య ఏమిటంటే.. ఇరాన్‌ను ఎవరు నడుపుతున్నారో ఎవరికీ తెలియదు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ నాయకత్వంపై అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఇద్దరూ దాదాపు ఒకే రకమైన సందేహాలను వ్యక్తం చేయడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది.ఇరాన్ సీరియస్.. ఇదిలా ఉండగా.. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ విషయంలోనూ గత కొంతకాలంగా అమెరికా అనుమానాలు వ్యక్తం చేస్తోంది. యుద్ధం సమయంలో ఆయన ప్రజల ముందుకు రాకపోవడం, ఆయన ప్రస్తుత పరిస్థితి, ఆచూకీపై స్పష్టమైన సమాచారం లేకపోవడంతో పలు ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఇరాన్ మాత్రం ఈ వాదనలను ఖండిస్తోంది. మొజ్తబా ఖమేనీనే దేశ సుప్రీం లీడర్‌గా కొనసాగుతున్నారని, ఆయన దేశాన్ని నడిపిస్తున్నారని స్పష్టం చేస్తోంది. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ కూడా అమెరికా వ్యాఖ్యలను తోసిపుచ్చారు. అమెరికా అధికారులకు తమ ఇరానియన్ ప్రతినిధులు ఎవరన్నది, దేశ నిర్ణయ వ్యవస్థ ఎలా పనిచేస్తుందన్నది తెలుసని చెప్పారు. అసలు సమస్య ఇరాన్లో నాయకత్వం లేదా నిర్ణయ వ్యవస్థలో లేదని.. అమెరికా అధికారుల పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు, గందరగోళమైన సందేశాలేనని ఆయన ఆరోపించారు.ఇదిలా ఉంటే.. యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇరాన్ తన అణు కార్యక్రమంపై కూడా కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వాన్స్ స్పష్టం చేశారు. అమెరికా డిమాండ్లను అంగీకరించాలంటే ఇరాన్ తన అణు ఇంధన శుద్ధి సామర్థ్యాన్ని గణనీయంగా తగ్గించుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. అంటే శాంతి చర్చల్లో కేవలం యుద్ధ విరమణ మాత్రమే కాకుండా.. ఇరాన్ అణు కార్యక్రమం కూడా ప్రధాన అంశంగా మారింది. ఇరాన్‌తో జరుగుతున్న చర్చల్లో వాన్స్ కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ.. తానే ఈ చర్చలకు నాయకత్వం వహిస్తున్నానని చెప్పేందుకు ఆయన నిరాకరించారు. గతంలో వాన్స్ మధ్యవర్తిత్వంతో తాత్కాలిక శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ.. అది ఎక్కువ కాలం కొనసాగలేదు. ఇప్పుడు మరోసారి చర్చలు మొదలైన నేపథ్యంలో ఇరాన్ నాయకత్వంపై అమెరికా సందేహాలు, అణు శుద్ధి సామర్థ్యంపై అమెరికా డిమాండ్లు కీలకంగా మారాయి. ఇదీ చదవండి: రష్యాలో కొత్త వైరస్ కలకలం.. భారత్‌కు ముప్పు ఉందా? -
ఇరాన్ దెబ్బతో ట్రంప్ షాకింగ్ డెసిషన్?!
పశ్చిమాసియా ఉద్రిక్తతల్లో అమెరికా అనూహ్య నిర్ణయం తీసుకుంది. బ్రిటన్‌లోని కీలకమైన రాయల్ ఎయిర్ ఫోర్స్ ఫెయిర్‌ఫోర్డ్ స్థావరం నుంచి తమ బి-1 బాంబర్లన్నింటినీ వెనక్కి తరలించింది. ఇరాన్ ముప్పు ఉందన్న సమాచారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అయితే ఈ తరలింపుపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో మాత్రం మరో కారణం చెబుతున్నారు. లండన్‌కు సుమారు 145 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫెయిర్‌ఫోర్డ్ స్థావరంలో అమెరికా సుమారు 12 బి-1 బాంబర్లను మోహరించింది. ఇరాన్‌పై అమెరికా చేపట్టిన సైనిక చర్యల్లో ఈ స్థావరం కీలకంగా మారింది. అయితే సెప్టెంబర్ 27న స్థావరానికి సమీపంలో ఐదుగురు యువకులను ఉగ్రవాద చర్యలకు సన్నాహాలు చేస్తున్నారన్న అనుమానంతో పోలీసులు అరెస్టు చేశారు. వారి వాహనాల్లో పేలుడు పదార్థాలు లభించకపోయినా కొంత పెట్రోల్ దొరికినట్లు పోలీసులు తెలిపారు. తొలుత వాళ్లు ఇరాన్ ఏజెంట్లు అంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత వారిని బెయిల్‌పై విడుదల చేశారు. మరో యూకే-ఇరాన్ ద్వంద్వ పౌరుడిని కూడా అరెస్టు చేసి బెయిల్‌పై విడుదల చేశారు. ఈ పరిణామాల తర్వాత బాంబర్లను అమెరికాలోని స్వదేశీ స్థావరాలకు తరలించారు. దీనిపై ట్రంప్ మాట్లాడుతూ.. తమకు ముప్పు ఉందని సమాచారం వచ్చిందని, అలాంటి పరిస్థితుల్లో బాంబర్లను అక్కడే ఎందుకు ఉంచాలని ప్రశ్నించారు. ముప్పు సృష్టించిన వ్యక్తులు ఎవరన్నది తమకు తెలుసని కూడా చెప్పారు. ఆ ముప్పు ఇరాన్‌తో ముడిపడి ఉందా అని అడిగితే.. అవుననే అర్థం వచ్చేలా సమాధానం ఇవ్వడం కొసమెరుపు.ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా బాంబర్ల తరలింపు ముందుజాగ్రత్త చర్యేనని చెప్పారు. తమ సైనిక సిబ్బంది భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. బ్రిటన్‌లోని అమెరికా ఆస్తులకు ఇరాన్ నుంచి ముప్పు ఉందన్న అంచనాలు కొనసాగుతున్నాయని నాటో వర్గాలు కూడా తెలిపాయి.రుబియో మాత్రం మరోలా.. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. బాంబర్ల తరలింపునకు బ్రిటన్‌లో జరిగిన అనుమానిత కుట్రతో నేరుగా సంబంధం ఉందని చెప్పలేమని విదేశాంగ మంత్రి మార్కో రుబియో స్పష్టం చేశారు. అమెరికా రక్షణ శాఖ అవసరాన్ని బట్టి ప్రపంచవ్యాప్తంగా తన సైనిక వనరులను ఎప్పటికప్పుడు పునర్వ్యవస్థీకరిస్తుంటుందని చెప్పారు. అంటే ఓవైపు ట్రంప్ ఇరాన్ ముప్పును ప్రస్తావిస్తుండగా.. రుబియో మాత్రం ఈ రెండు పరిణామాలను నేరుగా ముడిపెట్టకపోవడం గమనార్హం.ఫెయిర్‌ఫోర్డ్ ఎందుకంత కీలకం?ఫెయిర్‌ఫోర్డ్ అమెరికాకు యూరప్‌లో అత్యంత కీలకమైన బాంబర్ స్థావరాల్లో ఒకటి. భారీ బాంబర్లను నిర్వహించగల అరుదైన వైమానిక స్థావరాల్లో ఇది కూడా ఒకటి. అమెరికా ఇరాన్‌పై చేపట్టిన చర్యల్లో ఇక్కడి నుంచి బాంబర్లు కార్యకలాపాలు సాగించాయి. అమెరికా నుంచి నేరుగా పశ్చిమాసియాకు వెళ్లడం కంటే ఇక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తే దూరం, సమయం తగ్గుతాయి. అందుకే ఈ స్థావరం నుంచి బాంబర్లను వెనక్కి తరలించడం వ్యూహాత్మకంగా ప్రాధాన్యం సంతరించుకుంది.అయితే బాంబర్లను అమెరికాకు తరలించినంత మాత్రాన ఇరాన్‌పై దాడి చేసే అమెరికా సామర్థ్యం పూర్తిగా తగ్గిపోయినట్లు కాదంట!. పెంటగాన్ ప్రకారం.. అమెరికా బాంబర్ బలగాలు ప్రపంచవ్యాప్తంగా అవసరమైన చోట ఖచ్చితమైన దాడులు నిర్వహించేందుకు సిద్ధంగానే ఉన్నాయి. అయితే ఫెయిర్‌ఫోర్డ్ నుంచి లభించే వేగవంతమైన ప్రాంతీయ స్పందన సామర్థ్యం మాత్రం తాత్కాలికంగా తగ్గే అవకాశం ఉందని రక్షణ నిపుణులు చెబుతున్నారు.ఇరాన్ రియాక్షన్ ఏంటంటే.. ఫెయిర్‌ఫోర్డ్ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ ఆరోపణలు నిరాధారమని పేర్కొంది. మరోవైపు బ్రిటన్ ప్రధాని ఆండీ బర్న్‌హామ్ మాత్రం ఈ కుట్ర వెనుక ఇరాన్ ప్రమేయం ఉండొచ్చని ఇంతకు ముందు ప్రకటించారు. దీంతో అసలు కుట్రకు ఎవరు తెర వెనుక ఉన్నారన్నది ఇంకా పూర్తిగా తేలలేదు.ఉన్నట్లుండి ఎందుకు వెనక్కి తగ్గారు?ఇక్కడే ఇప్పుడు కీలక ప్రశ్న. అమెరికా అధ్యక్షుడు స్వయంగా ఇరాన్ ముప్పును ప్రస్తావించగా.. ఆయన విదేశాంగ మంత్రి మాత్రం నేరుగా సంబంధం లేదంటున్నారు. మరోవైపు ఫెయిర్‌ఫోర్డ్ సమీపంలో అరెస్టులు, ఇరాన్ నుంచి గతంలో వచ్చిన హెచ్చరికలు, అమెరికా బాంబర్ల ఆకస్మిక తరలింపు.. ఇవన్నీ ఒకేసారి చోటుచేసుకున్నాయి. అయితే ఈ పరిణామాల మధ్య ఖచ్చితమైన సంబంధం ఏమిటన్నది అమెరికా అధికారికంగా పూర్తిగా వెల్లడించలేదు.ఇదీ చదవండి: ఫ్లైదుబాయ్ ఫ్లైట్‌ను కూల్చేయాలనుకున్న ఇజ్రాయెల్! -
మరిన్ని ఆంక్షల వేళ.. ఇరాన్లో అనూహ్య పరిణామం!
అమెరికా ఆంక్షలు, నౌకాదళ దిగ్బంధనంతో చమురు ఎగుమతులు, ఆదాయాలపై తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న ఇరాన్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ చమురు మంత్రి మొహ్సెన్ పాక్నెజాద్ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. తన వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించినప్పటికీ.. దీని వెనక వ్యవహారం వేరే ఉందన్న చర్చ ఇప్పుడు జోరుందుకుంది. రాజీనామా ప్రకటన తర్వాత.. ఇరాన్ అధ్యక్ష రాయబార కార్యాలయంలో హైడ్రామా నడిచింది. పాక్నెజాద్ను పునరాలోచన చేయాలని అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కోరారు. అయినప్పటికీ పాక్నెజాద్ తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో చివరకు రాజీనామాను ఆమోదించారు. ఆ వెంటనే నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీ (NIOC) చీఫ్ హమీద్ బోవర్డ్ను తాత్కాలిక చమురు మంత్రిగా నియమించారు. అమెరికా గురి వల్లే..ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు చమురు ఎగుమతులే ప్రధాన ఆదాయ వనరు. ప్రస్తుతం అమెరికా ఆంక్షలు, నౌకల రాకపోకలపై ఆంక్షలతో ఆ రంగంపైనే తీవ్ర ప్రభావం పడుతోంది. ఫిబ్రవరి చివర్లో అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమయ్యే ముందు హార్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచ ముడిచమురు, ఎల్ఎన్జీ రవాణాలో దాదాపు ఐదో వంతు జరిగేది. తర్వాత హార్ముజ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడం, వాణిజ్య నౌకల రాకపోకలపై ఆంక్షలు విధించడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఇరాన్ చమురు ఎగుమతులను అడ్డుకోవడం, ఆ దేశానికి చమురు ద్వారా వచ్చే ఆదాయం, విదేశీ మారకద్రవ్య ప్రవాహాన్ని పరిమితం చేయడమే అమెరికా చర్యల లక్ష్యంగా ఉంది. దీనివల్ల టెహ్రాన్‌తో పాటు ఇతర నగరాల్లో పెట్రోల్ కోసం పొడవాటి క్యూలు కనిపిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.రికార్డు స్థాయికి ఇరాన్ కరెన్సీ పతనంఅమెరికా ఒత్తిడితో పాటు ఇరాన్ ఆర్థిక పరిస్థితి కూడా మరింత దిగజారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ కరెన్సీ రియాల్ తాజాగా డాలర్‌తో పోలిస్తే రికార్డు కనిష్టానికి పడిపోయింది. ఒక డాలర్‌కు సుమారు 26.88 లక్షల రియాళ్లకు చేరినట్లు సమాచారం. గత ఏడాది కాలంలో రియాల్ విలువ సగానికి పైగా పడిపోయింది. దేశంలో ద్రవ్యోల్బణం 70 శాతాన్ని దాటినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. నిత్యావసర వస్తువులు, ఇళ్ల ఖర్చులు సామాన్యులపై భారంగా మారుతున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం మార్చి 21 నుంచి జూన్ 20 మధ్య ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఏడాది ప్రాతిపదికన 10.1 శాతం కుదించుకుంది. ఇదే సమయంలో చమురు, గ్యాస్ రంగ కార్యకలాపాలు ఏకంగా 26.4 శాతం తగ్గినట్లు సమాచారం.బోవర్డ్ చేతిలో కీలక బాధ్యతఇలాంటి పరిస్థితుల్లో తాత్కాలిక చమురు మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న హమీద్ బోవర్డ్పై కీలక బాధ్యతలు పడనున్నాయి. ఆయన ఇప్పటికే ప్రభుత్వ రంగంలోని నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీకి నాయకత్వం వహిస్తున్నారు. చమురు ఎగుమతుల ద్వారా ఆదాయాన్ని కొనసాగించడం, అమెరికా ఆంక్షలు–దిగ్బంధనాన్ని ఎదుర్కొంటూ ఇంధన రంగాన్ని నడిపించడం ఆయన ముందున్న ప్రధాన సవాళ్లుగా మారాయి.పాక్నెజాద్ మాత్రం రాజీనామాకు ముందు చమురు ఆదాయాలపై ప్రజలకు భరోసా ఇచ్చారు. తాము ఇప్పటికే విక్రయించిన చమురుకు సంబంధించిన ఆదాయం వస్తూనే ఉందని, అది కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.అమెరికా నుంచి మరిన్ని ఆంక్షలుమరోవైపు ఇరాన్‌పై అమెరికా ఆర్థిక ఒత్తిడి మరింత పెరుగుతోంది. శుక్రవారం అమెరికా ట్రెజరీ ఇరాన్‌కు చెందిన రైలు, ఆటోమొబైల్ రంగాలను లక్ష్యంగా చేసుకుని కొత్త ఆంక్షలు ప్రకటించింది. ‘ఆపరేషన్ ఎకనామిక్ అవుట్‌కాస్ట్’లో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు అమెరికా తెలిపింది. ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ.. యుద్ధానికి నిధులు సమకూర్చుకునే టెహ్రాన్ సామర్థ్యాన్ని తగ్గించడమే లక్ష్యమని చెప్పారు. ఇరాన్ మిగిలిన చమురు ఆదాయ మార్గాలను కూడా కట్టడి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అమెరికా వెల్లడించింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా చమురు ధరలు తగ్గుతున్నాయని శనివారం వ్యాఖ్యానించారు. ఇరాన్ అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యాలను దాదాపుగా వదులుకుందని ఆయన పేర్కొన్నారు. ఈ సమయంలో అమెరికా–ఇరాన్ మధ్య యుద్ధం ఎనిమిదో నెలలోకి ప్రవేశించింది. అయితే పాక్నెజాద్ రాజీనామాకు అమెరికా ఆంక్షలు లేదంటే యుద్ధ పరిస్థితులే కారణమని ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా చెప్పలేదు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన పదవి నుంచి తప్పుకున్నారని అధ్యక్ష కార్యాలయం తెలిపింది. అయినప్పటికీ దేశంలోని కీలకమైన చమురు రంగంపై అమెరికా ఒత్తిడి పెరుగుతున్న సమయంలోనే మంత్రి మారడం అంతర్జాతీయంగా ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: నిరసన వెంటనే తుపాకీ పట్టారే! -
ఇరాన్లో హై అలర్ట్.. గన్స్ పట్టిన మహిళలు!
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ.. ఇరాన్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా, ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతలు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో.. సామాన్య పౌరులను సైతం యుద్ధానికి సిద్ధం చేస్తోంది ఇరాన్. ఇందులో భాగంగా రాజధాని టెహ్రాన్‌లో మహిళలకు సైనిక శిక్షణ ఇచ్చారు. తుపాకులను ఎలా ఉపయోగించాలి? అత్యవసర పరిస్థితుల్లో తమను, కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలి? వంటి అంశాలపై వారికి శిక్షణ అందించారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఇమామ్ హుస్సేన్ స్క్వేర్‌లో ఏర్పాటు చేసిన సైనిక శిక్షణ కేంద్రానికి పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. ముందుగా సైనిక అధికారులు, శిక్షకులు వారికి పలు సూచనలు చేశారు. అనంతరం హ్యాండ్గన్లతో సహా వివిధ ఆయుధాలను ఎలా పట్టుకోవాలి, ఎలా కాల్చాలి అనే అంశాలపై ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చారు. ఒక రోజు ముందే హఫ్తె తిర్ స్క్వేర్‌లో మరో పౌర సైనిక శిక్షణ కేంద్రాన్ని ఇరాన్ ప్రారంభించింది. అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు భూతల దాడికి దిగితే ఎదుర్కొనేందుకు పౌరులను సిద్ధం చేయడమే ఈ కేంద్రాల ఉద్దేశమని అక్కడి దృశ్యాలు, నివేదికలు సూచిస్తున్నాయి.Iran is now training women for combat duty alongside men. https://t.co/xy9mNbqecl— R-E-A-L-I-T-Y (@mihareality) October 4, 2026ఈ సందర్భంగా సైనిక శిక్షణలో పాల్గొన్న 45 ఏళ్ల రహెలె గదిరి మాట్లాడుతూ.. యుద్ధ సమయంలో తన కుటుంబాన్ని, పరిసర ప్రాంతాన్ని రక్షించుకునే సామర్థ్యం ఉంటే భయం కొంత తగ్గుతుందని చెప్పారు. అంటే.. ఈ శిక్షణలో పాల్గొంటున్న కొందరికి ప్రత్యక్ష పోరాటం కంటే, అత్యవసర పరిస్థితుల్లో కుటుంబాన్ని కాపాడుకునేందుకు సిద్ధంగా ఉండటమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.ట్రంప్ హెచ్చరిక.. ఇరాన్ కౌంటర్..మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు ఉద్రిక్తతలను మరింత పెంచాయి. ఇరాన్‌పై తదుపరి చర్య విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన సంకేతాలు ఇచ్చారు. ఇరాన్ ఇప్పటికే తీవ్రంగా దెబ్బతిన్నదని, ఇక తమ ముందున్న మార్గం సులభమైందా? లేదా కఠినమైనదా అన్నదే ప్రశ్న అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అనంతరం, ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఘాటుగా స్పందించారు. సైనిక చర్య లేదా కొత్త ఆంక్షలతో ఈ సంక్షోభానికి పరిష్కారం లభించదని స్పష్టం చేశారు. తమపై మరోసారి సైనిక దాడి జరిగితే.. గతం కంటే మరింత బలంగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు. న్యాయం, సమానత్వం ఆధారంగా జరిగే చర్చల ద్వారానే సంక్షోభానికి ముగింపు పలకగలమని పేర్కొన్నారు. దీంతో ఒకవైపు అమెరికా-ఇరాన్ మధ్య దౌత్య చర్చలు నిలిచిపోగా.. మరోవైపు ఇరాన్లో పౌరులకు సైనిక శిక్షణ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.Iranian women being trained in the use of firearms as part of a large-scale state program of basic military training for the population. https://t.co/AJWxWGmJtr— Truth Seeker (@mib_63) October 2, 2026నాడు నిరసనలు.. నేడు గన్స్.. ఇదిలా ఉండగా.. గతంలో ఇరాన్‌లోని మహిళలు ప్రభుత్వ విధానాలపై తీవ్రంగా విమర్శలు, నిరసనలు వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా తప్పనిసరి హిజాబ్ నిబంధనలు, మోరాలిటీ పోలీసింగ్, మహిళలపై ఆంక్షలకు వ్యతిరేకంగా “ఉమెన్ లైఫ్, ఫ్రీడమ్” ఉద్యమంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. తాజాగా కూడా టెహ్రాన్‌లోని అల్లామెహ్ తబాతబాయీ యూనివర్సిటీ విద్యార్థులు తప్పనిసరి హిజాబ్, మోరాలిటీ పోలీస్, రాజకీయ అణచివేతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్‌తో యుద్ధ ఉద్రిక్తతలు పెరగడంతో.. అదే దేశంలో కొందరు మహిళలు కుటుంబాలు, పరిసరాలను రక్షించుకునేందుకు తుపాకీ శిక్షణ తీసుకోవడం ఆసక్తికర పరిణామంగా మారింది.ఇదీ చదవండి: పాకిస్తాన్లో హైటెన్షన్.. Iranian women are undergoing military training to join a volunteer force and defend their country. Hear their stories in the interviews below. 👇 https://t.co/lDPsN35nu0— The Specter (@specter_affairs) September 30, 2026 -
7 షరతులు ఓకే చెప్పండి.. లేదా?
టెహ్రాన్: అమెరికాకు ఇరాన్ మరోసారి ఝలక్ ఇచ్చింది. ఇరాన్ విధించిన ఏడు షరతులను నెరవేర్చే వరకు హర్ముజ్ జలసంధిని ఎట్టిపరిస్థితుల్లో తిరిగి తెరవబోయేది లేదని తెలిపింది. ఈ ఏడు షరతులు జూన్‌లో ఇరాన్–అమెరికా మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందం అనగా.. ఇస్లామాబాద్ మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ (MOU) ఆధారంగా ఉన్నాయని ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్ స్పీకర్ కీలక ప్రకటన విడుదల చేశారు.మహమ్మద్ గాలిబాఫ్ మాట్లాడుతూ, "ఇరాన్ వైఖరి “పూర్తిగా స్పష్టంగా, దృఢంగా” ఉంది. అమెరికా ఈ ఏడు షరతులను అమలు చేసే వరకు హోర్ముజ్ జలసంధి తెరవడం జరగదు. ఒకవైపు అమెరికా బహిరంగంగా ఒక రకమైన సందేశాలు ఇస్తూనే, మరోవైపు మధ్యవర్తి ద్వారా వేరే ప్రతిపాదనలు పంపుతోంది. ఇకపై చర్చల్లో జాప్యాన్ని లేదా అమెరికా ఏకపక్ష డిమాండ్లను ఇరాన్ అంగీకరించదు". అని అన్నారు. ఇరాన్ నుంచి వచ్చిన దౌత్య ప్రతిపాదనకు అమెరికా ఇచ్చిన సమాధానం కొన్ని రోజుల క్రితమే తమకు అందిందని ఆయన తెలిపారు.ఇదే సమయంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రతిపాదనకు అమెరికా అంగీకరిస్తే, ఏడు రోజుల్లో హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. టెహ్రాన్‌లో విదేశీ రాయబారులు, దౌత్యవేత్తలతో జరిగిన సమావేశంలో అరాఘ్చీ ఈ విషయాన్ని వెల్లడించారు. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ఈ జలమార్గాన్ని తిరిగి తెరవడానికి అమెరికా అంగీకరించాల్సిన షరతులను ఇరాన్ ఇప్పటికే స్పష్టంగా తెలియజేసిందని ఆయన అన్నారు.అమెరికా దౌత్య మార్గాన్ని ఎంచుకోవాలని ఇరాన్ ఆశిస్తోందని అరాఘ్చీ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే అమెరికా మళ్లీ సైనిక చర్యల వైపు వెళితే, దానికి ప్రతిస్పందించేందుకు ఇరాన్ గతంలో కంటే “మరింత సిద్ధంగా ఉంది” అని హెచ్చరించారు. వారు సైనిక పరిష్కారాల వైపు వెళితే, మేము గతంలో కంటే మరింత సిద్ధంగా ఉన్నాం అని అరాఘ్చీ పేర్కొన్నారు.ప్రస్తుతం వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య ఖతార్ మధ్యవర్తిత్వంతో ఏడు రోజుల విశ్వాస నిర్మాణ ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నాయి. జూన్‌లో కుదిరిన అవగాహన ఒప్పందాన్ని మరింత విస్తృత రూపంలో పునరుద్ధరించడంతో పాటు, ఇరాన్ అణు కార్యక్రమం హర్ముజ్ జలసంధికి సంబంధించిన అంశాలపై చర్యలు తీసుకోవడం ఈ ప్రతిపాదనలో ఉన్నట్లు సమాచారం.అయితే.. ఓవైపేమో ఇరాన్ అమెరికాతో ఒప్పందం కోసం యత్నిస్తుంటే మరోవైపేమో అమెరికన్లు, ఇజ్రాయెల్ దేశస్థులపై దాడులు తీవ్ర కలకలం రేవుతున్నాయి. ఇటీవలే దుబాయి నుంచి ఇజ్రాయెల్ వెళ్తున్న ప్లై దుబాయ్ విమానాన్ని కో ఫైలట్ హమాం అల్ హమామి కూల్చే యత్నం చేయగా భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యసాహాసాలతో ఈ ఫ్లైట్‌ను కాపాడిన సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి దాడులు మరికొన్ని చేయాలని ఉగ్రవాద సంస్థ ఆల్‌ఖైదా పిలుపునిచ్చింది. తన మద్ధతుదారులు ప్రారంభించిన అల్బయాన్ పత్రికలో ఈ ప్రకటన విడుదల చేసింది దీంతో వాతావరణం ఆందోళన కరంగా మారింది. -
ఈజీ వే లేదా హార్డ్ వే.. ఇరాన్‌కు ట్రంప్ స్వీట్ వార్నింగ్
ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుంటానని ప్రకటించిన ట్రంప్.. టెహ్రాన్ ముందు రెండు మార్గాలే ఉన్నాయని హెచ్చరించారు. అవి.. ‘ఈజీ వే.. లేదా హార్డ్ వే’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఇప్పటికే తీవ్రంగా దెబ్బతిందని పేర్కొన్న ఆయన.. అమెరికా తదుపరి చర్య ఏంటనేది త్వరలోనే తేలుస్తానన్నారు. అయితే, తాను తీసుకోబోయే నిర్ణయం సైనిక చర్యా, దౌత్యపరమైన చర్యా అన్నదానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.వైట్‌హౌస్ నుంచి ఒహియోకు బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్‌పై తమ తదుపరి వ్యూహాన్ని ఖరారు చేస్తున్నట్లు చెప్పారు. ఇరాన్ ఇప్పటికే ధ్వంసమైంది. ఇప్పుడు అది సులభమైన మార్గమా.. కఠినమైన మార్గమా అన్నదే ప్రశ్న అన్న ఆయన వ్యాఖ్యలు పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలకు దారితీశాయి. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యం సాధించే ప్రయత్నాలను దాదాపు విరమించుకుంటోందని కూడా ట్రంప్ పేర్కొన్నారు. అలాగే, అమెరికా మిత్రదేశాలకు చెందిన లక్ష్యాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. అదే సమయంలో కొత్త ఘర్షణను నివారించేందుకు ఇరాన్ దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తోంది.క్యాంప్ డేవిడ్‌లో కీలక భేటీట్రంప్ తాజా వ్యాఖ్యలకు ముందు అమెరికా అత్యున్నత జాతీయ భద్రతా అధికారులు క్యాంప్ డేవిడ్‌లో రహస్య సమావేశం నిర్వహించారు. ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, దౌత్య చర్చలు, అవసరమైతే తిరిగి భారీ సైనిక చర్య చేపట్టే అవకాశాలపై ఈ భేటీలో చర్చించినట్లు Axios తెలిపింది. యెమెన్‌లో సౌదీ అరేబియా-హౌతీ ఘర్షణలపై అమెరికా విధానంపైనా చర్చ జరిగినట్లు సమాచారం. దౌత్యపరమైన చర్చలు ప్రతిష్ఠంభనలో ఉన్న సమయంలోనే ఈ సమావేశం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. చర్చల ద్వారా పరిష్కారం లభించకపోతే ఇరాన్‌పై అమెరికా మళ్లీ పెద్దఎత్తున సైనిక చర్యకు దిగే అవకాశాలను ట్రంప్ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి.ఇరాన్ కూడా సిద్ధం.. మరోవైపు అమెరికా మళ్లీ భారీ స్థాయిలో దాడులు ప్రారంభిస్తే గతంలో కంటే మరింత విస్తృతంగా, తీవ్రంగా ప్రతిదాడి చేసేందుకు ఇరాన్ సిద్ధమవుతున్నట్లు రాయిటర్స్ వెల్లడించింది. ఇరాన్ సైనిక కమాండర్లు అమెరికాకు సంబంధించిన లక్ష్యాలతో పాటు.. అమెరికా సైనిక చర్యలకు మద్దతు ఇచ్చే దేశాలు, మధ్యప్రాచ్యం వెలుపల ఉన్న కొన్ని ప్రాంతాలను కూడా లక్ష్యాలుగా పరిగణిస్తున్నట్లు సమాచారం. అయితే, ఇరాన్ కూడా దౌత్య మార్గాన్ని పూర్తిగా మూసివేయలేదు. కొత్త ఘర్షణను నివారించేందుకు చర్చలు కొనసాగిస్తున్నప్పటికీ.. ఇరాన్‌లోని కొందరు అధికారులు అమెరికాతో ఒప్పందం కుదిరే అవకాశాలు తక్కువగా ఉన్నాయని భావిస్తున్నట్లు సమాచారం.ఇదిలా ఉండగా.. ఇటీవల ఇరాన్ ఒక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. అమెరికా తన ఇరాన్ పోర్టులపై విధించిన నౌకా దిగ్బంధనాన్ని ఎత్తివేస్తే.. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని ఏడు రోజుల్లో తిరిగి తెరవడానికి సిద్ధమని టెహ్రాన్ సంకేతాలు ఇచ్చింది. ఈ ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరించారు. అయితే అమెరికా అధికారిక స్పందనపై ఇరాన్ తొలుత భిన్నంగా స్పందించినప్పటికీ, ఖతార్ మధ్యవర్తిత్వం ద్వారా అమెరికా సమాధానం అందినట్లు తర్వాత వెల్లడించింది. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య మధ్యవర్తుల ద్వారా సంప్రదింపులు కొనసాగుతున్నప్పటికీ.. తుది ఒప్పందంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.యెమెన్ అంశం కూడా కీలకమే..ఇరాన్‌తో ఉద్రిక్తతలకు తోడు యెమెన్‌లో హౌతీలపై సౌదీ అరేబియా సైనిక చర్యకు సిద్ధమవుతోంది. ఎర్ర సముద్రంలో కీలకమైన బాబ్ అల్ మండేబ్ జలమార్గంపై హౌతీల ప్రభావాన్ని తగ్గించడమే లక్ష్యంగా సౌదీ మద్దతు ఉన్న యెమెన్ బలగాలు ఆపరేషన్‌కు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ చర్యకు అమెరికా నిఘా సహకారం అందిస్తున్నట్లు కూడా రిపోర్టులు పేర్కొంటున్నాయి. దీంతో ఇరాన్-అమెరికా వివాదం కేవలం రెండు దేశాల మధ్య సమస్యగా కాకుండా.. హార్ముజ్ జలసంధి, యెమెన్, హౌతీలు, గల్ఫ్ దేశాలు, అంతర్జాతీయ చమురు రవాణాపై ప్రభావం చూపే విస్తృత ప్రాంతీయ సంక్షోభంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఇదీ చదవండి: హసీనా అప్పగింతకు భారత్ గడువు ఇవ్వలేదు.. -
హౌతీలకు చావుదెబ్బ.. ఇటు జీ7 సంచలన నిర్ణయం!
పశ్చిమాసియాలో యుద్ధ మంటలు మరింత తీవ్రంగా మారుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ దాడులు, యెమెన్‌లో హౌతీలపై దాడులు, గాజాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలతో ఇప్పటికే ప్రపంచ ఇంధన మార్కెట్లు ఉక్కిరి బిక్కిరవుతున్నాయి. ఈ ప్రభావం ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కూడా పెద్ద సవాలుగా మారింది. యుద్ధం దెబ్బకు ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరడంతో.. అమెరికాలోనే కాదు, యూరప్‌లోనూ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో ధరలకు కళ్లెం వేసేందుకు ఓ కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యూరప్ దేశాలు తమ వద్ద ఉన్న డీజిల్ నిల్వలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే అమెరికా నుంచి డీజిల్ ఎగుమతులపై నిషేధం విధించే అవకాశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అలాంటి నిర్ణయం ప్రపంచ మార్కెట్లో డీజిల్ కొరతను మరింత పెంచే ప్రమాదం ఉండటంతో యూరప్‌లో ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ట్రంప్‌తో మాట్లాడారు. అనంతరం G7 దేశాల నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ట్రంప్ కూడా ఈ చర్చల్లో పాల్గొని యూరప్ డీజిల్ నిల్వలను విడుదల చేయడానికి చర్చలు జరిపినట్లు అమెరికా అధికారులు తెలిపారు.చివరకు G7 ఒక కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు నెలల వ్యవధిలో మొత్తం 100 మిలియన్ బ్యారెళ్ల చమురు, డీజిల్ తదితర ఇంధన నిల్వలను సమన్వయంతో విడుదల చేయనుంది. ఇందులో తొలి 20 రోజుల్లోనే గణనీయమైన మొత్తంలో డీజిల్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఈ ప్రక్రియను అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) ద్వారా సమన్వయం చేయనున్నారు.ట్రంప్‌కు కొత్త టెన్షన్ఇక్కడ మరో కీలక అంశం ఉంది. అమెరికాలో డీజిల్ ధరలు ఇటీవల రికార్డు స్థాయికి చేరాయి. యుద్ధం కారణంగా ఇంధన సరఫరాలపై ఒత్తిడి పెరగడంతో ధరలు ఎగిశాయి. నవంబర్ 3న అమెరికా మధ్యంతర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పెరిగిన జీవన వ్యయం, ఇంధన ధరలు ట్రంప్ ప్రభుత్వానికి రాజకీయంగా కూడా కీలక అంశంగా మారాయి.అందుకే డీజిల్ ధరలను అదుపులోకి తీసుకురావడానికి వేగంగా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్రంప్ స్వయంగా కూడా యూరప్ భారీగా డీజిల్ నిల్వలను విడుదల చేయడానికి అంగీకరించిందని ప్రకటించారు. అనంతరం అమెరికా డీజిల్ ఎగుమతులపై నిషేధం విధించబోమని స్పష్టం చేశారు. G7 దేశాలు కూడా పరస్పరం ఇంధన ఎగుమతులపై ఆంక్షలు విధించబోమని స్పష్టం చేశాయి. అంటే ఒకవైపు నిల్వలను విడుదల చేస్తూనే.. మరోవైపు అంతర్జాతీయ సరఫరా గొలుసుకు మరింత దెబ్బ తగలకుండా చర్యలు తీసుకుంటున్నాయి.అసలు టెన్షన్ ఇక్కడే.. అయితే చమురు నిల్వలను విడుదల చేయడం తక్షణ ఉపశమనానికి మాత్రమే. పశ్చిమాసియాలో అసలు సమస్య మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. హర్ముజ్ జలసంధి, బాబ్ అల్-మండెబ్ సముద్ర మార్గాలపై నెలకొన్న ఉద్రిక్తత ప్రపంచ ఇంధన సరఫరాకు పెద్ద ముప్పుగా మారింది.హర్ముజ్ ద్వారా భారీ స్థాయిలో చమురు రవాణా జరుగుతుంది. అక్కడ నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడితే ప్రపంచ మార్కెట్‌పై నేరుగా ప్రభావం పడుతుంది. G7 కూడా తాజాగా హర్ముజ్‌లో అంతర్జాతీయ నౌకాయాన హక్కులు, స్వేచ్ఛాయుత రాకపోకలను వెంటనే పునరుద్ధరించాలని పిలుపునిచ్చింది.మరోవైపు యెమెన్‌లోని హౌతీల చర్యల కారణంగా బాబ్ అల్-మండెబ్–ఎర్ర సముద్ర మార్గం కూడా ప్రమాదంలో ఉంది. తాజాగా ఒమన్ సమీపంలో ఓ క్రూడ్ ఆయిల్ ట్యాంకర్‌ను క్షిపణి తాకినట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ తెలిపింది. సిబ్బంది సురక్షితంగా ఉన్నప్పటికీ.. వాణిజ్య నౌకల భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి.హౌతీలపై భారీ దాడులుఇదే సమయంలో యెమెన్‌లో పోరాటం మరింత తీవ్రరూపం దాల్చింది. గత 24 గంటల్లో 474 ఆపరేషన్లు నిర్వహించి 1,540 మంది హౌతీ ఫైటర్లను హతమార్చినట్లు యెమెన్ సైన్యం ప్రకటించింది. తైజ్ ప్రాంతంలో అత్యధిక నష్టం జరిగినట్లు తెలిపింది. పలువురికి గాయాలైనట్లు సమాచారం. మరోవైపు దక్షిణ సౌదీ అరేబియాను లక్ష్యంగా చేసుకుని వచ్చిన మూడు బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకున్నట్లు సౌదీ నేతృత్వంలోని సంకీర్ణం తెలిపింది. దీంతో యెమెన్–సౌదీ సరిహద్దుల్లోనూ ఉద్రిక్తత కొనసాగుతోంది.గాజాలోనూ దాడులు.. వెస్ట్‌బ్యాంక్‌లో హింసపశ్చిమాసియా సంక్షోభం ఇరాన్, యెమెన్తోనే ఆగలేదు. గాజా సిటీలోని ఓ నివాస సముదాయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో చిన్నారి సహా నలుగురు మరణించినట్లు పాలస్తీనా వైద్య వర్గాలు తెలిపాయి. పలువురు గాయపడ్డారు. ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లోనూ పాలస్తీనియన్లపై సెటిలర్ దాడులు జరిగినట్లు సమాచారం. మరోవైపు హమాస్ ఆర్థిక నెట్‌వర్క్‌ను దెబ్బతీసేందుకు అమెరికా, ఫ్రాన్స్‌తో కలిసి చర్యలు కొనసాగిస్తామని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.ఒక్క యుద్ధం.. ఎన్నో ప్రభావాలుఇలా పశ్చిమాసియాలోని ఒక్కో ఫ్రంట్ మరోదానితో ముడిపడి ఉంది. ఇరాన్ యుద్ధం చమురు సరఫరాపై ప్రభావం చూపుతోంది.. హౌతీల దాడులు సముద్ర రవాణాపై ఒత్తిడి పెంచుతున్నాయి. హర్ముజ్ ఉద్రిక్తత ప్రపంచ చమురు మార్కెట్‌ను కుదిపేస్తోంది.. గాజా, వెస్ట్‌బ్యాంక్‌లో హింస ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది.దీని ప్రభావమే ఇప్పుడు G7 అత్యవసర నిల్వలను రంగంలోకి దించడం. అయితే 100 మిలియన్ బ్యారెళ్ల విడుదలతో ధరలపై కొంత ఒత్తిడి తగ్గే అవకాశం ఉన్నా.. పశ్చిమాసియాలో యుద్ధం, సముద్ర మార్గాల భద్రతపై అనిశ్చితి కొనసాగినంతకాలం ఇంధన మార్కెట్ టెన్షన్ మాత్రం పూర్తిగా తగ్గే పరిస్థితి కనిపించడం లేదు.ఇదీ చదవండి: కీవ్‌లో ఏం జరుగుతోంది? మూడు వంతెనలు నాశనం -
కో–పైలట్ వెనుక ఇరాన్ ఉంటే.. తీవ్రమైన దాడి చేస్తాం: ట్రంప్
జెరూసలెం: ఇజ్రాయెల్ వెళుతున్న ఫ్లై దుబాయ్ విమానాన్ని కూల్చేసే ప్రయత్నం చేసిన కో–పైలట్ వెనుక ఇరాన్ ఉన్నట్లు తెలిస్తే ఆ దేశంపై తీవ్రస్థాయి దాడి తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. కో–పైలట్ కత్తితో కెప్టెన్‌పై దాడి చేయడంతో ఫ్లై దుబాయ్ విమానం అదుపుతప్పి వేగంగా కిందకు దిగిన విషయం.. సహ ప్రయాణీకులు సకాలంలో అడ్డుకోవడంతో హైజాక్ ముప్పు, 9/11 తరహా దాడిని నివారించడం తెలిసిందే. కో–పైలట్‌కు, ఇరాన్‌కు ఏమైనా సంబంధం ఉందా? అని కొందరు విలేకరులు ప్రశ్నించగా.. దర్యాప్తు సాగుతోందని ట్రంప్ సమాధానమిచ్చారు. తనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇరాన్ ప్రమేయం ఉందన్న ట్రంప్ ఆ అనుమానానికి గల కారణాలను మాత్రం వివరించలేదు. దాడి వెనుక ఇరాన్ ఉన్నట్లు తేలితే అమెరికా ప్రతీకారం తీర్చుకుంటుందా అని ప్రశ్నించగా.. ‘‘వారిపై తీవ్రమైన దాడి జరుగుతుంది. ఆందోళన చెందకండి’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. -
విలక్షణ దౌత్యంతో వేగే మార్గం?
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించిన ట్రంప్‌కు, శ్వేతసౌధంలో జిన్‌పింగ్‌కు ఆతిథ్యం ఇచ్చిన ట్రంప్‌కు మధ్య వ్యత్యాసాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తిస్తున్నది. ఇరాన్‌ను నాశనం చేస్తానని హూంకరించిన ట్రంప్ ఎక్కడ? విమానాశ్రయంలో సతీ సమేతంగా జిన్‌పింగ్‌కు స్వాగతం పలికిన ట్రంప్ ఎక్కడ? ట్రంప్ విలక్షణ మనస్తత్వాన్ని, దౌత్యనీతిని రాజకీయ పరిశీలకులు జాగ్రత్తగా విశ్లేషిస్తున్నారు.ట్రంప్, జిన్‌పింగ్ శిఖరాగ్ర సమావేశంలో కీలకమైన ఒప్పందాలు కానీ, నిర్ణయాలు కానీ లేవు. సమావేశంలో జిన్‌పింగ్‌దే పైచేయిగా కన్పడుతున్నది. అమెరికా చైనాను తనతో సమవుజ్జీగా, సమ అగ్రరాజ్యంగా పరిగణిస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి. ఇది జిన్‌పింగ్‌కు చెప్పుకోదగిన రాజకీయ విజయం. జిన్‌పింగ్ ఈరోజు కోసం ఎన్నో ఏళ్ళుగా వేచి చూస్తు న్నాడు. ఫ్రాన్స్, యూకే, జర్మనీ, ఇటలీ వంటి యూరోపియన్ దేశాధినేతలు, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వంటి నేతలతో ట్రంప్ వ్యవహార శైలికి; పుతిన్, జిన్‌పింగ్‌లతో వ్యవహార శైలి హస్తి మశకాంతరము.దూకుడు–పరిణతిట్రంప్ మనస్తత్వం విలక్షణమైనది. దూకుడు శైలితో బెదిరింపు ప్రధానంగా అన్ని దేశాలతో వ్యవహరిస్తున్నాడు. అధ్యక్షుని హోదాలో అమెరికా దేశపు పూర్తి బలాన్ని చూపడానికి ఉత్సాహం చూపిస్తాడు. వ్యక్తిగత పొగడ్తలకు ప్రాధాన్యతనిస్తాడు. వ్యాపార, ఆర్థిక లాభా లకు, లావాదేవీలకు పెద్దపీట వేస్తాడు. కొంత చిన్నపిల్లల మనస్తత్వం కూడా ప్రస్ఫుటంగా కన్పడుతుంది. తను చెప్పిన మాట అందరూ వినాలి. తన మాటే వేదమనే మంకుపట్టు. అందరికంటే ముందు తనే అన్ని విషయాలను ప్రపంచానికి తెలియపర్చాలని ఉవ్విళ్లూరుతుంటాడు. ఈ బలహీనతలను వినియోగించుకొని పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు ఆసిఫ్ మునీర్ ట్రంప్‌కు దగ్గరయ్యాడు. తనకు నచ్చకపోతే కనీస దౌత్య మర్యాదలను కూడా ట్రంప్ పాటించడు. ఉదాహరణకు ఇటలీ ప్రధాని మెలోని తనతో ఫొటో కోసం వెంపర్లాడిందని పదిమందిలో పదే పదే చెప్పాడు. వైట్ హౌస్‌లో సమావేశమైనప్పుడు మీడియా సాక్షిగా జెలెన్స్కీని తూల నాడాడు. ఈ అహంకార, దుడుకు వైఖరి ఆధారంగానే ట్రంప్నుఅంచనా వేయకూడదు. ట్రంప్ తాను అమెరికా అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాననే స్పృహ చూపించడు. కానీ రష్యా, చైనా, భారత్ లతో చాలావరకు సంయమనాన్ని పాటిస్తున్నాడు. బలవంతులలో వ్యవహరించేటప్పుడు, తన మాదిరి అహంకార స్వభావ వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు ట్రంప్ పరిణితిని ప్రదర్శిస్తున్నాడు. ఉదాహర ణకు జిన్‌పింగ్, పుతిన్‌లను తన స్నేహితులుగా అభివర్ణిస్తాడు. విచిత్రంగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ను కూడా తన మిత్రుడిగా పరిగణిస్తాడు. ఇటీవల, ఉత్తర కొరియాను లక్ష్యంగా చేసుకొని ప్రతి సంవత్సరం అమెరికా–దక్షిణ కొరియాలు సంయుక్తంగా నిర్వహించే సైనిక విన్యాసాలను పూర్తిగా కుదించి దాదాపుగా అపేశాడు. అణ్వస్త్ర సామర్థ్యం కల్గిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్, ట్రంప్‌లాగా దూకుడు నిర్ణయాలు తీసుకోవటంలో సిద్ధహస్తుడు. బెదిరింపు–ప్రశంసట్రంప్ రెండవసారి గెలుపుతో వైట్‌హౌస్‌లోకి భారతదేశపు మిత్రుడు వచ్చాడనుకున్న ఆనందం భారత్‌కు ఎక్కువకాలం నిలవ లేదు. ట్యారిఫ్ వార్తో మొదలుపెట్టి, రష్యా నుండి చమురు కొను గోలు విషయంలో బెదిరింపులు, హెచ్1బీ వీసాలపై కఠిన ఆంక్షలు, ప్రస్తుతం మళ్లీ వంద శాతం సుంకాల వరకు భారత్ ఎడల ట్రంప్ వైఖరి ఒక మిత్రదేశపు వైఖరి ఎంతమాత్రమూ కాదు. రాజకీయంగా కూడా వ్యక్తిగతంగా ప్రధాని మోదీని ఇరుకున పెట్టే దిశలో పదేపదే తానే ఇండియా–పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని (ఆపరేషన్సిందూర్ను) ఆపానని ప్రకటించాడు.జాగ్రత్తగా పరిశీలిస్తే– ఒకవైపు బెదిరించి, భారత్ సహనాన్ని పరీక్షిస్తూనే, మరొకవైపు తాను అమెరికన్ ప్రయోజనాలను పరిరక్షి స్తున్నట్లు మోదీ నిబద్ధతతో భారత్ ప్రయోజనాలను పరిరక్షిస్తు న్నాడంటాడు. మోదీ తనకు మంచి మిత్రుడనీ, కఠినంగా బేర సారాలు ఆడే వ్యక్తి (టఫ్ నెగోషియేటర్) అనీ ప్రశంసిస్తాడు. ఓవైపు బెదిరిస్తూనే మరోవైపు ప్రశంసించటం ప్రత్యేక శైలి దౌత్యనీతి. వ్యక్తిగతంగా ట్రంప్ వ్యవహార శైలి విషయంలో సమస్యలు, భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ప్రపంచంలో అత్యంత శక్తిమంత మైన దేశానికి ట్రంప్ అధ్యక్షుడనే విషయాన్ని అందరూ గుర్తించాలి. మనకిష్టమున్నా లేకున్నా ట్రంప్‌తో వ్యవహారం, దౌత్యం నెరపాల్సిందే. ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా వాణిజ్యం మనకు లాభదాయకం. అమెరికాలో మనకు వాణిజ్య మిగులు ఉన్నది. 1.6 మిలియన్ల భారతీయులు యూఎస్ఏలో పని చేస్తున్నారు. సుమారు 3.7 లక్షల మంది అమెరికాలో చదువుకుంటు న్నారు. సమారు 1.5 మిలియన్ల భారత సంతతి ప్రజలు అమెరికన్ పౌరసత్వాన్ని పొంది అక్కడ నివసిస్తున్నారు. పొరుగున పాకిస్తాన్, చైనాలతో సరిహద్దు సమస్యలు, సీమాంతర ఉగ్రవాదం నేపథ్యంలో ప్రపంచ అగ్రరాజ్యమైన అమెరికాతో సత్సంబంధాలు కలిగిఉండటం అభిలషణీయం. మౌనం–ప్రయోజనంఅమెరికాపై ఆధారపడుతూ ట్రంప్‌ను నేరుగా ఎదుర్కోవటం కొరివితో తల గోక్కోవటమే. ఈ విషయంలో మార్క్ కార్నీ (కెనడా), నరేంద్ర మోదీ (భారత్) మంచి ఉదాహరణలుగా ఉన్నారు. భారత్, కెనడా రెండు దేశాలకు అమెరికాతో సత్సంబంధాలు కీలకం. కానీ రెండు దేశాలు ట్రంప్‌కు సాగిలపడి మోక రిల్లటానికి సిద్ధంగా లేవు. ఇతర దేశాధినేతలతో పోల్చితే కార్నీ, మోదీల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క. ఇరుదేశాధినేతలు చాలా సమయస్ఫూర్తితో, పరిణతితో ట్రంప్‌తో నెగ్గుకొస్తున్నారని చెప్పు కోవాలి. ట్రంప్ దుర్భాషలకు వీరు నేరుగా ఎప్పుడూ సమాధానం చెప్పరు. కానీ తమదైన శైలిలో తమ దేశాల ప్రయోజనాలను కాపాడే చర్యలు నిష్కర్షగా తీసుకొంటున్నారు. ట్రంప్, కెనడాను 51వ రాష్ట్రంగా అభివర్ణించాడు. ‘లేక్ ఒంటా రియో’ పేరును ‘లేక్ అమెరికా’గా మార్చుతూ ఉత్తర్వులు జారీ చేశాడు. ఈ విషయంలో కార్నీ నేరుగా ట్రంప్‌ను నిందించలేదు. ఎప్పటికీ ‘లేక్ ఒంటారియో’గానే ఉంటుందని ప్రకటించి ఆగి పోయాడు. కానీ ట్రంప్ వేసిన ట్యారిఫ్‌లకు ప్రతిగా కెనడా తన ప్రయోజనాలను రక్షించుకోవటానికి అన్ని చర్యలు తీసుకున్నది. ట్రంప్ భారత్ ఆర్థిక వ్యవస్థను ‘మృత ఆర్థిక వ్యవస్థ’గా అభి వర్ణించినా, ఆపరేషన్ సిందూర్‌ను ఆపేశానని పదే పదే ప్రకటించినా, ఉక్రెయిన్ యుద్ధాన్ని భారత్ పోషిస్తున్నదని నిందించినా, మోదీ ఏనాడూ వాదనలోనికి దిగలేదు. కానీ భారత్ ప్రయోజనాల రక్షణకు, ఆ దేశంతో వాణిజ్య ఒప్పందపు చర్చలలో కఠినంగా వ్యవహరిస్తున్నాము. అయితే, మొన్న విదేశాంగ మంత్రి జైశంకర్ ‘నా ప్రధాన ఆందోళనల్లో ఒకదాన్ని నా భాగస్వామి పూర్తిగా అర్థం చేసుకోకపోతే, దాని ప్రభావం సంబం«ధాలపై స్పష్టంగా ఉంటుంది’ అని గట్టిగానే మాట్లాడారు. కానీ దాన్ని ఇంకా మన విధానంగా భావించలేము. స్థూలంగా పరిశీలిస్తే భారత్, కెనడా, రష్యా, చైనాలు ట్రంప్ వ్యక్తిగత ప్రకటనలు, దూషణలకు, తిరస్కారాలకు ప్రతిస్పందించకుండా, చేతల విషయంలో తమ తమ దేశాల ప్రయోజనాలను కాపాడుకొంటూ ట్రంప్‌కు నిజమైన దౌత్య నీతిని బోధిస్తున్నాయి.-వ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్); సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు-గురజాల శ్రీనివాసరావు -
ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో ఇరాన్ హస్తం?.. వెలుగులోకి ఆధారాలు?
టెల్ అవీవ్: దుబాయ్ నుండి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానం హైజాక్ యత్నం ఘటనలో విస్తుపోయే నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. భారతీయ పైలట్‌పై కత్తితో దాడి చేసి విమానాన్ని కూల్చేందుకు యత్నించిన ఒమన్ కో-పైలట్‌కు సంబంధించిన మరిన్ని సంచలన వివరాలను ఇజ్రాయెల్ మీడియా, అధికారులు బయటపెట్టారు.నిందితుడు తన సోషల్ మీడియా ఖాతాలలో యూదులను చంపడం గురించి తరచూ చర్చించాడని ఓ ఇజ్రాయెల్ అధికారి ‘ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్’తో పేర్కొన్నారు. దాడికి పాల్పడిన ఒమన్ జాతీయుడు పూర్తిగా ఇస్లామిస్ట్ ఉగ్రవాద భావజాలానికి బానిసయ్యాడని, అతని సోషల్ మీడియా పోస్టులే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని అధికారులు వెల్లడించారు.కరపత్రాల్లో ఏముందంటే? ఎమిరేట్స్ వర్గాలను ఉటంకిస్తూ ‘ఐ24న్యూస్’ జర్నలిస్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితుడైన కో-పైలట్ లగేజీలో ‘ఫ్రీ పాలస్తీనా’ గ్రూపులకు సంబంధించిన కరపత్రాలు, ప్రచురణలు, ఇతర పాలస్తీనా అనుకూల సామగ్రి లభించాయి. ఆ పైలట్ పదేపదే పాలస్తీనియన్లకు మద్దతు తెలుపుతూ, ఇజ్రాయెల్ పట్ల తీవ్రమైన శత్రుత్వాన్ని వ్యక్తం చేశాడని ఆ మూలం తెలిపింది. కో-పైలట్ ఇస్లామిక్ తీవ్రవాద భావజాలం, ఉగ్రవాద ఉద్దేశ్యాల కోణంలో ఈ ఆధారాలు కీలకంగా మారాయి.నన్ను చంపండి.. నన్ను చంపండిప్రయాణికులు, సిబ్బంది కలిసి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని కట్టేసిన తర్వాత, అతను విమాన సిబ్బందిని ఉద్దేశించి ‘నన్ను చంపండి.. నన్ను చంపండి’ అంటూ అరిచాడని అధికారులు తెలిపారు. ఇతను ఆత్మహత్య చేసుకోవడానికి, విమానంతో సహా కుప్ప కూలిపోవడానికి పక్కా ప్రణాళికతో వచ్చినట్లు స్పష్టమవుతోందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ‘ఫాక్స్ న్యూస్’తో అన్నారు.అక్కడ ఉన్న ప్రయాణికుల భద్రత, నిందితుడి ఇస్లామిస్ట్ ధోరణులు, తీవ్రవాద భావజాలం, దొరికిన కరపత్రాలను పరిగణనలోకి తీసుకుంటే ఇదొక ఉగ్రవాద యత్నంగా భావించడానికి తగిన ఆధారాలున్నాయని నెతన్యాహు పేర్కొన్నారు. అయితే, దర్యాప్తు పూర్తిగా ముగిసే వరకు తుది ఉద్దేశంపై కచ్చితమైన నిర్ధారణకు రాలేమని, సౌదీ అరేబియా, యూఏఈ, ఇజ్రాయెల్ దర్యాప్తు బృందాలు సంయుప్తంగా విచారణ జరుపుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఎఫ్‌జెడ్ 1073 విమానంలో ఏం జరిగింది?ఫ్లైదుబాయ్ విమానం ఎఫ్‌జెడ్ 1073 యూఏఈలోని దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి ఇజ్రాయెల్ మెట్రో నగరం టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ ఎయిర్‌పోర్టుకు బయలుదేరింది. ప్రయాణం ప్రారంభమైన సుమారు రెండున్నర గంటల తర్వాత, ఒమన్ జాతీయుడైన కో-పైలట్ అకస్మాత్తుగా విమానాన్ని హైజాక్ చేసి కూల్చేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో కాక్‌పిట్‌లో ఆపత్కాలంలో సిబ్బంది వినియోగించే క్రాష్ యాక్స్‌తో భారతీయ సంతతి పైలట్ స్మిత్ మచ్చార్‌పై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ పెనుగులాట కారణంగా విమానం ఒక్కసారిగా 33 వేల అడుగుల క్రూయిజింగ్ ఎత్తు నుంచి దాదాపు 16,600 అడుగుల ఎత్తు వరకు (17 వేల అడుగులకు పైగా) కుప్పకూలినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ డేటా స్పష్టం చేసింది.ప్రాణాలకు తెగించి.. సురక్షిత ల్యాండింగ్ఈ ప్రమాదకర సమయంలో తీవ్ర గాయాలనప్పటికి, కెప్టెన్ స్మిత్ మచ్చర్ వెనకడుగు వేయలేదు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఎంతో ధైర్యసాహసాలు ప్రదర్శించి కాక్‌పిట్ డోర్ తెరిచి విమానాన్ని అదుపులోకి తెచ్చేందుకు పోరాడారు.ఇంతలో అప్రమత్తమైన సిబ్బంది, ప్రయాణికులు వెంటనే కాక్‌పిట్‌లోకి చొచ్చుకెళ్లి దాడి చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకుని కట్టేశారు. ఆ తర్వాత కెప్టెన్ మచ్చార్ సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయంలో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. -
హౌతీలకు బిగ్ షాక్.. పాక్ మతపెద్ద సంచలన వ్యాఖ్యలు
యెమెన్‌లో హౌతీలకు, సౌదీ అరేబియాకు మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ ఇస్లామిక్ మతపెద్ద హఫీజ్ మహమ్మద్ తాహిర్ మెహమూద్ అష్రఫీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలను ఉగ్రవాదులుగా అభివర్ణిస్తూ.. వారికి ఇస్లాంతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. సౌదీ అరేబియాను లక్ష్యంగా చేసుకుంటున్న హౌతీలు అమాయక ప్రజలు, మహిళలు, పిల్లలు, వృద్ధులపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.సౌదీ అరేబియాలోని మదీనా ఇస్లామిక్ యూనివర్సిటీలో నిర్వహించిన రెండు రోజుల సదస్సు ముగింపు సందర్భంగా అష్రఫీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు పాక్ ప్రభుత్వ వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ ఆఫ్ పాకిస్తాన్ (APP) వెల్లడించింది. సౌదీ అరేబియా ఎదుర్కొంటున్న భావజాలపరమైన సవాళ్లపై నిర్వహించిన ఈ సదస్సులో ఆయన హౌతీలను తీవ్రంగా విమర్శించారు. హౌతీలు ఇస్లాం, పాలస్తీనా పేర్లను ఉపయోగించుకుంటున్నప్పటికీ.. వారి చర్యలకు ఇస్లామిక్ విలువలతో సంబంధం లేదని అష్రఫీ అన్నారు. సౌదీ నౌకలను లక్ష్యంగా చేసుకుంటూ, ఇజ్రాయెల్ నౌకలకు మాత్రం మార్గం కల్పించారంటూ ఆరోపించారు. యెమెన్ ప్రజల భద్రత, విద్య, వైద్య రంగాల కోసం సౌదీ అరేబియా భారీగా సాయం చేస్తున్నప్పటికీ హౌతీలు దానిని తిరస్కరిస్తున్నారని పేర్కొన్నారు.సౌదీకి పాక్ మద్దతు..సౌదీ అరేబియాకు పాకిస్తాన్ అండగా నిలుస్తుందని అష్రఫీ స్పష్టం చేశారు. సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్అజీజ్, క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ నేతృత్వంలోని రాజ్యానికి పాక్ ప్రభుత్వం, సాయుధ దళాలు, మతపెద్దలు, ప్రజలు పూర్తి మద్దతు ఇస్తారని అన్నారు. ఇస్లాం పేరుతో యువతను తప్పుదోవ పట్టించే తాలిబన్లు, అల్‌ఖైదా, ఐసిస్, హౌతీల వంటి సంస్థలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే, హౌతీలపై సైనిక చర్య విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వ వైఖరి భిన్నంగా ఉంది. సౌదీ అరేబియాకు మద్దతు ప్రకటించినప్పటికీ, యెమెన్‌లో హౌతీలపై దాడులు చేయాలన్న పిలుపులపై ఇస్లామాబాద్ గతంలో వెనుకడుగు వేసింది. పాకిస్తాన్ సైన్యం చర్యలు సౌదీ భూభాగాన్ని రక్షించడానికే పరిమితమవుతాయని అక్కడి రక్షణ మంత్రి పేర్కొన్నట్లు గత నివేదికలు వెల్లడించాయి.గతంలోనూ వివాదాల్లో అష్రఫీఅష్రఫీ ఇటీవల మరో వివాదంతో వార్తల్లో నిలిచారు. 2026 సెప్టెంబర్ 11న మత సామరస్యం, సయోధ్యకు సంబంధించిన హ్యూబర్ట్ వాల్టర్ అవార్డును కాంటర్బరీ ఆర్చ్‌బిషప్ సారా ముల్లాలీ నుంచి అందుకున్నారు. అయితే, 2007లో అల్‌ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్‌ను ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలు వెలుగులోకి రావడంతో సెప్టెంబర్ 17న ఆ అవార్డును వెనక్కి తీసుకున్నారు. రష్యన్లు, అమెరికన్లు, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఇస్లాం కోసం పోరాడిన వ్యక్తిగా బిన్ లాడెన్‌ను ఆయన అప్పట్లో అభివర్ణించినట్లు బీబీసీ నివేదించింది. అంతేకాకుండా, దైవదూషణ ఆరోపణలను ఉపయోగించి వ్యక్తులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ముఠాకు అష్రఫీ రక్షణ కల్పించారని ది టెలిగ్రాఫ్ పత్రిక సెప్టెంబర్ 24న కథనం ప్రచురించింది. ఆ ముఠాకు ఆయన సోదరుడు నాయకత్వం వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయని పేర్కొంది. ఇదీ చదవండి: ఫ్లైదుబాయ్ ఘటనపై బిగ్ బ్లాస్ట్.. ఇరాన్ సంచలన ఆరోపణలు! -
ఫ్లైదుబాయ్ ఘటనపై బిగ్ బ్లాస్ట్.. ఇరాన్ సంచలన ఆరోపణలు!
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఫ్లైదుబాయ్ విమాన ఘటన మరో వివాదానికి దారితీసింది. ఈ ఘటన వెనుక ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఉన్నారంటూ ఇరాన్ సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఘటనను ఉద్దేశపూర్వకంగా సృష్టించిన ‘ఫాల్స్ ఫ్లాగ్’ ఆపరేషన్‌గా అభివర్ణించింది. దీంతో, ఈ ఘటన మరో టర్న్ తీసుకుంది.ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ ప్రెస్ టీవీ కథనం ప్రకారం.. ఫ్లైదుబాయ్ ఘటనను ఉపయోగించుకుని అక్టోబర్ 7 హమాస్ దాడిపై నెతన్యాహుపై వస్తున్న విమర్శల నుంచి దృష్టి మళ్లించడం, ఆయన రాజకీయ స్థితిని బలోపేతం చేయడం, ఇరాన్‌తో మరోసారి ఘర్షణకు కారణాన్ని సృష్టించడం లక్ష్యంగా ఈ ఘటనను రూపొందించారని ఆరోపించింది. అయితే ఈ వాదనను సమర్థించే ఆధారాలను మాత్రం సదరు కథనం వెల్లడించలేదు. ఇజ్రాయెల్‌కు సంబంధించిన విమానంలో భద్రతా ఘటనను సృష్టించి, దాన్ని ఉగ్రదాడిగా చూపడం ద్వారా ఇరాన్‌పై అనుమానాలు వచ్చేలా చేయాలని కుట్ర పన్నారని ఆరోపించింది. ఈ ఘటనను నెతన్యాహు రాజకీయంగా ఉపయోగించుకోవాలని ప్రయత్నించారని పేర్కొంది. అదే సమయంలో నెతన్యాహు, యూఏఈ అధ్యక్షుడు బిన్ జాయెద్ మధ్య ఈ ఘటనకు ముందు జరిగిన సమావేశాన్ని కూడా ఇరాన్ మీడియా ప్రస్తావించింది.फ्लाईदुबई विमान केस में ईरान का इज़राइल पर बड़ा आरोप, नेतन्याहू की साज़िश का दावा#Flydubai #Iran #Israel #Netanyahu #12Baje12Reporter #ATVideo @SumitDefence | @ashraf_wani pic.twitter.com/b08Ffba9Cu— AajTak (@aajtak) October 2, 2026సోషల్ మీడియాలోనూ ‘ఫాల్స్ ఫ్లాగ్’ ప్రచారంఫ్లైదుబాయ్ ఘటన జరిగిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలోనూ దీనిని ‘ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్’గా పేర్కొంటూ పోస్టులు భారీగా వైరల్ అయ్యాయి. ఇజ్రాయెల్, మొసాద్, నెతన్యాహు ఈ ఘటనను కావాలనే సృష్టించారంటూ పలువురు ఆరోపణలు చేశారు. అయితే ఫ్యాక్ట్ చెకింగ్ సంస్థలు, అధికారిక వర్గాలు ఇటువంటి వాదనలకు ఇప్పటివరకు ఆధారాలు లేవని పేర్కొన్నాయి.ఇజ్రాయెల్ ఖండనమరోవైపు ఇజ్రాయెల్ ఈ ‘ఫాల్స్ ఫ్లాగ్’ ప్రచారాన్ని ఖండించింది. ఇలాంటి ఆరోపణలు కుట్ర సిద్ధాంతాలేనని, సోషల్ మీడియాలో నిరాధారమైన ప్రచారం జరుగుతోందని పేర్కొంది. ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ముందుగానే ఎలాంటి నిర్ణయానికి రావడం సరికాదని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.ట్రంప్ కీలక వ్యాఖ్యలుఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ ఘటనలో ఇరాన్ ప్రమేయం ఉండొచ్చని వ్యాఖ్యానించారు. తనకు అందుతున్న సమాచారాన్ని బట్టి కో-పైలట్‌కు ఇరాన్‌తో సంబంధం ఉండే అవకాశం ఉందని, అయితే దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఇరాన్ ప్రమేయం నిర్ధారణ అయితే ఆ దేశంపై అమెరికా తీవ్ర చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. అయితే ఇరాన్ ప్రమేయానికి సంబంధించి ఇప్పటివరకు దర్యాప్తు సంస్థలు తుది నిర్ధారణకు రాలేదు. యూఏఈ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి విమాన ఘటనకు గల కారణాలు, ఉద్దేశం, ముందస్తు ప్రణాళిక లేదా ఉగ్రవాద సంబంధాలపై విచారణ చేపట్టింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఊహాగానాలు, ధృవీకరించని సమాచారాన్ని ప్రచారం చేయొద్దని యూఏఈ అధికారికంగా కోరింది.అసలు ఏం జరిగింది?సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానం FZ1073లో కాక్‌పిట్‌లో తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. కాక్‌పిట్‌లో భారతీయ కెప్టెన్ స్మిట్ మచ్చార్‌పై ఒమన్‌కు చెందిన కో-పైలట్ దాడి చేశాడు. కెప్టెన్ గాయపడినప్పటికీ కాక్‌పిట్ తలుపు తెరవగలిగారు. దీంతో ప్రయాణికులు, విమాన సిబ్బంది జోక్యం చేసుకుని దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఇతర పైలట్లు విమానాన్ని నియంత్రణలోకి తీసుకుని సురక్షితంగా ల్యాండ్ చేశారు. -
ఫ్లైదుబాయ్ ఘటనలో కొత్త ట్విస్టులు
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న వేళ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాక్‌పిట్‌లో జరిగిన దాడి వెనుక ఉద్దేశం ఏమిటి? విమానాన్ని కూల్చే ప్రయత్నమేనా? లేక మరేదైనా కారణమా? అన్న అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారితీశాయి.ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నెతన్యాహూ.. ఒమన్‌కు చెందిన కో-పైలట్ ఇస్లామిక్ తీవ్రవాద భావజాలానికి ప్రభావితుడై ఉండొచ్చని తెలిపారు. అతడి వ్యక్తిగత సమాచారంలో కొన్ని అంశాలు బయటపడ్డాయని, దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. అదుపులోకి తీసుకున్న సమయంలో కో-పైలట్ “కిల్ మీ.. కిల్ మీ” అంటూ అరచినట్లు పేర్కొన్నారు. అతడు ఆత్మహత్యా ధోరణిలో ఉన్నట్లు కనిపించిందని, విమానాన్ని ప్రమాదంలోకి నెట్టే ఉద్దేశం ఉండి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఫ్లైదుబాయ్ ఘటనను తీవ్రంగా పరిగణించారు. భారత పైలట్ స్మిట్ మచ్చార్‌పై దాడి చేసిన ఆ కోపైలట్‌కు ఇరాన్‌తో లింకులు ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేశారు. దర్యాప్తు జరుగుతోందని.. అదే గనుక నిజమని తేలితే ఇరాన్‌పై భీకరదాడులు జరుపుతామని హెచ్చరించారు.కాక్‌పిట్‌లో రక్తపాతం..వీడియో బయటకుఫ్లైదుబాయ్ ఎఫ్‌జెడ్1073 విమానం దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. విమానంలో 174 మంది ప్రయాణికులు, ఎనిమిది మంది సిబ్బంది ఉన్నారు. విమాన కాక్‌పిట్‌లో కో-పైలట్ భారతీయ కెప్టెన్ స్మిట్ మచ్చార్‌పై దాడి జరిగింది. ఈ సమయంలో విమానం ఒక్కసారిగా వేల అడుగుల ఎత్తు నుంచి కిందికి దిగడంతో ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.బయటకు వచ్చిన వీడియోల్లో విమానం లోపల గందరగోళ పరిస్థితులు కనిపించాయి. ప్రయాణికులు కాక్‌పిట్ వైపు పరుగులు తీస్తూ కనిపించారు. “అతడు విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించాడు” అంటూ కొందరు ప్రయాణికులు అరుస్తున్న దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి.గాయాలతోనే తలుపు తెరిచి..దాడిలో తీవ్రంగా గాయపడిన కెప్టెన్ స్మిట్ మచ్చర్ రక్తస్రావంతో ఉన్నప్పటికీ కాక్‌పిట్ తలుపు తెరిచినట్లు ఆ దృశ్యాలు ఉన్నాయి. దీంతో ప్రయాణికులు లోపలికి వెళ్లి కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. “అతడు నన్ను చాలా సార్లు కొట్టాడు” అంటూ కెప్టెన్ చెప్పిన దృశ్యాలు వీడియోల్లో కనిపించినట్లు సమాచారం.ఈ సమయంలో కొందరు ప్రయాణికులు ధైర్యంగా ముందుకు వచ్చారు. ట్జ్వికా మానెస్, అసఫ్ రాజువాన్, యానివ్ హయూన్ వంటి ప్రయాణికులు కాక్‌పిట్‌లోకి వెళ్లి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోవడంలో సహకరించారు.ప్లంబర్, డెంటిస్ట్.. ప్రయాణికులే హీరోలుఈ ఘటనలో ప్రయాణికుల పాత్ర కీలకంగా మారింది. విమానంలో ఉన్న డెంటిస్ట్ షోటా ముసాయెవ్ గాయపడిన కెప్టెన్‌కు ప్రథమ చికిత్స అందించారు. అలాగే విమానంలో ఉన్న ఆఫ్-డ్యూటీ పైలట్లు పరిస్థితిని చక్కదిద్దడంలో సహకరించారు. ప్రయాణికుడు యానివ్ హయూన్.. విమాన ప్రమాదాలకు సంబంధించిన టీవీ షోలు చూసిన అనుభవం ఆ సమయంలో తనకు ఉపయోగపడిందని చెప్పినట్లు సమాచారం.కోలుకుంటున్న భారత పైలట్ఘటన తర్వాత సౌదీ అరేబియాలోని టబూక్ ఆస్పత్రిలో చికిత్స పొందిన కెప్టెన్ స్మిట్ మచ్చర్‌ను అనంతరం యూఏఈకి తరలించారు(ఎయిర్‌లిఫ్ట్). యూఏఈలో భారత రాయబారి దీపక్ మిట్టల్ ఆస్పత్రికి వెళ్లి కెప్టెన్, ఆయన కుటుంబ సభ్యులను కలిశారు. స్మిట్ ఆరోగ్యం నిలకడగా ఉందని, కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారని తెలిపారు. “ధైర్యవంతుడైన భారత ముద్దుబిడ్డ” అంటూ స్మిట్‌ను ఆయన ప్రశంసించారు. మానవ ప్రాణాలను కాపాడటంలో ఆయన గొప్ప సేవ చేశారని పేర్కొన్నారు.కో-పైలట్ UAE అదుపులోకిఘటన తర్వాత సౌదీ అధికారులు కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణ అనంతరం అతడిని యూఏఈ అధికారులకు అప్పగించారు. ఈ ఘటన ఉగ్రవాద సంబంధమా? ముందస్తు ప్రణాళిక ఉందా? కో-పైలట్ ఒక్కడే ఈ చర్యకు పాల్పడ్డాడా? అన్న అంశాలపై దర్యాప్తు జరుగుతోంది. ఈ దర్యాప్తులో ఇజ్రాయెల్ కూడా భాగం కావొచ్చని సమాచారం. ఘటనపై అనుమానాలు?ఈ ఘటన తర్వాత విమాన భద్రతా వ్యవస్థపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒమన్, ఇజ్రాయెల్‌కు అధికారిక దౌత్య సంబంధాలు లేనప్పటికీ.. ఆ దేశానికి చెందిన వ్యక్తి ఇజ్రాయెల్ వెళ్లే విమానంలో విధులు నిర్వహించడం ఎలా సాధ్యమైందన్న చర్చ మొదలైంది. ఏమైనా లోపాలు జరిగాయా? అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది.మరోవైపు.. అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్లంబర్ అయిన యానివ్ హయూన్ ఆ సమయంలో విమానం కంట్రోల్ చేశాడన్న కోణాన్ని ఏకిపారేస్తున్నాయి. హయూన్ నేరుగా ప్రధాని నెతన్యాహూను కలవడం, ఆ సమయంలో జరిగిందంతా డ్రామాగా అభివర్ణిస్తూ కథనాలు ఇస్తున్నాయి. ఇటు ఒమన్‌కు చెందిన వ్యక్తికి.. ఇజ్రాయెల్‌కు విమానం నడిపే అవకాశం ఎలా దక్కింది? అని మాజీ పైలట్లు ప్రశ్నిస్తున్నారు. ఇంకోవైపు ఎన్నికల్లో లబ్ధి కోసమే నెతన్యాహూ ఈ డ్రామాలు ఆడుతున్నారేమో అని ఇజ్రాయెల్ ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇదీ చదవండి: ఎలక్షన్ దాకా ఆగడం ఎందుకు? బాంబులేస్తే పోలా! -
మళ్లీ రణరంగమా? ఇరాన్ చుట్టూ అమెరికా యుద్ధ వలయం!
పశ్చిమాసియాను మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? ఇరాన్‌పై అమెరికా మళ్లీ సైనిక చర్యకు సిద్ధమవుతోందా? తాజా పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. కొత్త దాడులకు అవకాశం కచ్చితంగా ఉందని ట్రంప్ చెప్పడం.. పైగా గల్ఫ్ ప్రాంతానికి భారీగా సైనిక బలగాలను తరలించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బలగాలే గనుక చేరుకుంటే మిడిల్ఈస్ట్లో అమెరికా సైనిక ఉనికి గతంలో ఎన్నడూలేని స్థాయికి చేరే అవకాశం కనిపిస్తోంది.దాదాపు 9 వేల మంది సైనికులు, మెరైన్లను యుద్ధ నౌకల సమూహంతో కలిసి మిడిల్‌ఈస్ట్‌కు తరలిస్తున్నట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. ఈ బలగాల తరలింపు సాధారణ మోహరింపు కాదని, ఇరాన్ చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా వ్యూహాత్మకంగా తన సైనిక సామర్థ్యాన్ని పెంచుతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా బలగాలకు అదనంగా ఈ కొత్త దళాలు చేరితే.. మధ్యప్రాచ్యంలో అమెరికా నావికాదళ ఉనికి మరింత బలపడనుంది. మొత్తం మీద 20 వేల మందికి పైగా సైనికులు, వందలాది యుద్ధ విమానాలు, అత్యాధునిక ఆయుధ వ్యవస్థలతో అమెరికా సైనిక శక్తి ఈ ప్రాంతంలో అత్యున్నత స్థాయికి చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఇంధన సరఫరాకు కీలకమైన హార్ముజ్ జలసంధి, ఇరాన్ అణు కార్యక్రమం, ఇటీవలి ప్రాంతీయ దాడుల నేపథ్యంలో ఈ మోహరింపు ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకవైపు చర్చలకు తాము సిద్ధమంటూ ఇరాన్ సంకేతాలు ఇస్తుండగా.. మరోవైపు అమెరికా సైనిక బలగాలను పెంచడం పశ్చిమాసియాలో తదుపరి పరిణామాలపై ఉత్కంఠను పెంచుతోంది.మూడు విమాన వాహక నౌకలతో సిద్ధంఅమెరికా నౌకాదళానికి చెందిన యూఎస్ఎస్ థియోడోర్ రూజ్వెల్ట్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్, యూఎస్ఎస్ మాకిన్ ఐలాండ్ యాంఫిబియస్ రెడీనెస్ గ్రూప్ పశ్చిమాసియా వైపు కదులుతున్నాయి. వీటిలో వేలాది మంది నావికులు, మెరైన్లు ఉన్నారు. ప్రస్తుత ఏర్పాట్ల ప్రకారం అక్టోబర్ చివరి నాటికి ఈ ప్రాంతంలో మూడు ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు ఉండే అవకాశం ఉందని అమెరికా అధికారి ఒకరు తెలిపారు. యూఎస్ఎస్ జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్, యూఎస్ఎస్ జార్జ్ వాషింగ్టన్ క్యారియర్లు ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్నాయి. 2003 తర్వాత.. తొలిసారిగా ఒకేసారి మూడు క్యారియర్ స్ట్రైక్ గ్రూపులు ఆ రీజియన్‌లో ఉండే పరిస్థితి ఏర్పడనుందని అధికారులు చెబుతున్నారు.ఇరాన్‌పై ట్రంప్ హెచ్చరికలుఇరాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌కు వెళ్తున్న విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించిన ఘటనలో కో–పైలట్‌కు ఇరాన్‌తో సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం ఉందని ట్రంప్ పేర్కొన్నారు. "ఇరాన్‌తో సంబంధం ఉన్నట్లు తేలితే తీవ్ర పరిణామాలు ఉంటాయి" అంటూ ట్రంప్ హెచ్చరించారు. ‘‘వారిపై చాలా తీవ్రంగా దాడి జరుగుతుంది’’ అని వ్యాఖ్యానించారు.ఎన్నికల వరకు ఆగుతారా?నవంబర్ 3న జరగనున్న అమెరికా ఎన్నికల తర్వాత ఇరాన్‌పై బాంబు దాడులను పెంచే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ట్రంప్ ‘‘అది సాధ్యమే’’ అని సమాధానం ఇచ్చారు. ఇరాన్ ప్రతిపాదించిన తాజా కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించినట్లు ట్రంప్ తెలిపారు. హార్ముజ్ జలసంధిని తెరవాలన్న ప్రతిపాదన ఉన్నప్పటికీ.. మొత్తం ఒప్పందం తనకు ఆమోదయోగ్యంగా లేదని పేర్కొన్నారు. అయితే తాజాగా మధ్యప్రాచ్యంలో భారీగా సైనిక బలగాలను మోహరించడం చూస్తుంటే.. ఎన్నికల వరకు అమెరికా వేచి చూస్తుందా? లేక అంతకుముందే సైనిక చర్యకు దిగుతుందా? అనే చర్చ మొదలైంది.హార్ముజ్‌లో ట్యాంకర్‌పై దాడిఇదిలా ఉండగా, ప్రపంచ ఇంధన సరఫరాకు కీలకమైన హార్ముజ్ జలసంధిలో 25 లక్షల బ్యారెళ్ల చమురు తీసుకెళ్తున్న సూపర్ ట్యాంకర్‌పై గుర్తుతెలియని ఆయుధంతో దాడి జరిగింది. ఘటనలో నౌకలో మంటలు చెలరేగినట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ తెలిపింది. ఈ ఘటనతో గల్ఫ్ ప్రాంతంలో భద్రతా ఆందోళనలు మరింత పెరిగాయి.ఇరాన్ మరోలా..మరోవైపు ఇరాన్ అమెరికాతో చర్చలకు తాము ఎప్పుడూ దూరంగా లేమని అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తెలిపారు. చర్చల సమయంలోనే తమపై మూడుసార్లు దాడులు జరిగాయని ఆరోపించారు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ (IRGC) సీనియర్ సలహాదారు బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ రెజా నక్దీ మాత్రం అమెరికా ప్రభావం ఈ ప్రాంతంలో తగ్గుతోందని వ్యాఖ్యానించారు. ఇరాక్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు.అమెరికా భారీ సైనిక మోహరింపు, ట్రంప్ దూకుడు వ్యాఖ్యలు, హార్ముజ్ పరిణామాలు.. మొత్తం మీద మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. అనూహ్యంగా మధ్యవర్తులు ఎంట్రీ ఇచ్చి ఇరాన్–అమెరికా మధ్య మళ్లీ చర్చలను తెరపైకి తెస్తారా? లేదంటే మరోసారి సైనిక ఘర్షణ దిశగా పరిస్థితులు వెళ్తాయా అన్నది ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది.ఇదీ చదవండి: ఫ్లైదుబాయ్ ఘటన.. అంతుచిక్కని ప్రశ్నలివే! -
ఫ్లైదుబాయ్ ఘటనలో ఇరాన్ హస్తం? ట్రంప్ అనుమానాలు
దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ ప్రయాణికుల విమానంలో చోటుచేసుకున్న దాడి వెనుక ఇరాన్ ప్రమేయం ఉండొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, ప్రాథమికంగా తనకు అందిన సమాచారం ప్రకారం ఇరాన్‌తో సంబంధం ఉండే అవకాశాలున్నాయని గురువారం వైట్‌హౌస్‌లో విలేకరులకు తెలిపారు.ఇరాన్ ప్రమేయం ఉంటే తీవ్ర పరిణామాలుఈ ఘటన వెనుక ఇరాన్ ఉన్నట్లు దర్యాప్తులో తేలితే అమెరికా ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ.. ఇరాన్‌పై తీవ్రంగా దాడి చేస్తామని హెచ్చరించారు.సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానం ఎఫ్‌జెడ్1073లో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం ఇజ్రాయెల్ వైపు ప్రయాణిస్తున్న సమయంలో కోపైలట్ కెప్టెన్‌పై కత్తితో దాడి చేసి, విమానాన్ని అదుపులోకి తీసుకుని కూల్చేందుకు ప్రయత్నించినట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. దాడిలో గాయపడిన భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ప్రతిఘటించి కాక్‌పిట్ తలుపు తెరవడంతో ప్రయాణికులు, సిబ్బంది జోక్యం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.విమానం తీవ్రంగా కిందకు దిగడంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. అనంతరం ప్రత్యామ్నాయ సిబ్బంది విమానాన్ని సౌదీ అరేబియాలోని టబుక్ విమానాశ్రయంలో అత్యవసరంగా దించారు. విమానంలో ఉన్న ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడగా, గాయపడిన పైలట్లకు చికిత్స అందించారు.దర్యాప్తులో అసలు కారణాలపై ఆరాఈ ఘటనకు సంబంధించి నిందితుడి నేపథ్యం, దాడికి దారితీసిన పరిస్థితులు, ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయా అనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కోపైలట్ తీవ్రవాద భావజాల ప్రభావానికి లోనై ఉండొచ్చని వ్యాఖ్యానించినప్పటికీ, దాడి వెనుక అసలు ఉద్దేశం ఇంకా స్పష్టంగా తెలియలేదు. -
అమెరికాలో మధ్యంతర ఎన్నికలు.. ట్రంప్‌పై ఇరాన్ పిడుగు!
టెహ్రాన్: అంతర్జాతీయ రాజకీయాల్లో ఊహించని సరికొత్త డ్రామా తెరపైకి వచ్చింది. అమెరికాలో మధ్యంతర (మిడ్‌టర్మ్) ఎన్నికల వేళ అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఇరాన్ గట్టిగానే షాకిచ్చింది.ట్రంప్ పాలనా విధానాలను, ఆయన తీసుకుంటున్న అడ్డగోలు నిర్ణయాలను నేరుగా వ్యతిరేకించాలంటూ ఇరాన్‌కు చెందిన అత్యంత శక్తివంతమైన సైనిక దళం ‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్’ (IRGC) అమెరికన్ ఓటర్లకు ఒక బహిరంగ లేఖను సంధించింది. సరిగ్గా ఎన్నికలకు ఐదు వారాల ముందు విడుదలైన ఈ 25 పేజీల సంచలన లేఖ ఇప్పుడు అమెరికా రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది! ట్రంప్ రాజకీయ భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తూ ఇరాన్ వేసిన ఈ మాస్టర్ ప్లాన్ అగ్రరాజ్యంలో పెద్ద మంటలే రేపుతోంది.అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దళాలు ఇరాన్‌పై యుద్ధం ప్రారంభించి ఏడు నెలలు గడిచిన తరుణంలో ఈ లేఖ వెలువడడం ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా పౌరులకు, అక్కడి స్వార్థపూరిత రాజకీయ నాయకత్వానికి మధ్య చాలా తేడా ఉందని ఐఆర్జీసీ ఈ లేఖలో ఎత్తిచూపింది. ఇరాన్ సామాన్య ప్రజలు, అమెరికన్ పౌరులు ఇద్దరూ కూడా ఖరీదైన యుద్ధాలను ప్రోత్సహించే లీడర్ల బాధితులేనని వాదించింది. ఇజ్రాయెల్‌కు ట్రంప్ ఇస్తున్న గుడ్డి మద్దతును నిలిపివేయాలని, విదేశీ సైనిక జోక్యాలను తక్షణమే వ్యతిరేకించాలని అమెరికన్లను ఈ లేఖ కోరింది.వాషింగ్టన్ తన ఓటమిని అంగీకరించాలిటెహ్రాన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఐఆర్జీసీ అధికార ప్రతినిధి జనరల్ హోస్సేన్ మొహెబ్బీ ఈ లేఖపై నిప్పులు చెరిగారు. ప్రస్తుత సంఘర్షణకు తెరపడాలంటే వాషింగ్టన్ తన ఓటమిని అంగీకరించి, సైనిక బలగాలను వెనక్కి తీసుకోవడమే ఏకైక మార్గమని తేల్చిచెప్పారు. అమెరికాలో ప్రస్తుతం రాజకీయ వ్యవస్థ అత్యంత బలహీనంగా ఉన్న తరుణాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ లేఖను విడుదల చేశామని ఆయన కుండ బద్దలు కొట్టారు. అణు ఆయుధాల ముసగులో ట్రంప్ చేస్తున్న డ్రామాలన్నీ ప్రపంచాన్ని మోసం చేయడానికేనని, తమ యురేనియం శుద్ధి కేవలం శాంతియుత ప్రయోజనాల కోసమేనని స్పష్టం చేశారు.‘డెత్ టు అమెరికా’ అసలు అర్థం అదే!ఇరాన్ రాజకీయ వ్యవస్థలో తరచూ వినిపించే వివాదాస్పద నినాదం ‘డెత్ టు అమెరికా’పై కూడా ఈ లేఖలో క్లారిటీ ఇచ్చారు. ఈ నినాదం అమెరికన్ ప్రజలను ఉద్దేశించి కాదని, వైట్‌హౌస్‌ను కేంద్రంగా చేసుకుని పాలిస్తున్న ‘దయ్యం లాంటి పాలక వర్గాన్ని’ అంతం చేయాలని కోరుతూ చేసే ప్రార్థన మాత్రమేనని వివరించారు. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ వేలాది వైమానిక దాడులు చేసినప్పటికీ, తమ మౌలిక సదుపాయాలను దెబ్బతీశారే తప్ప తాము నిర్దేశించుకున్న ఏ ఒక్క లక్ష్యాన్నీ సాధించలేకపోయాయని, చివరికి అమెరికా సైనిక ఆస్తులకే భారీ నష్టం వాటిల్లిందని ఐఆర్జీసీ ఘాటుగా హెచ్చరించింది.ఎన్నికల గండం నుంచి గట్టెక్కేందుకు ట్రంప్ తంటాలు..ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న ఈ మధ్యంతర ఎన్నికలు కేవలం కాంగ్రెస్ స్థానాల కోసమే అయినప్పటికీ, ఇవి పూర్తిగా ట్రంప్ పాలనా తీరుపై ప్రజాభిప్రాయాన్ని తెలిపే రెఫరెండ్లా మారాయి. ద్రవ్యోల్బణం,పెరుగుతున్న జీవన వ్యయం వల్ల రిపబ్లికన్ పార్టీకి, ట్రంప్ విధానాలకు వ్యతిరేకత తీవ్రస్థాయిలో పెరుగుతోంది. ఈ ఎన్నికల ఉచ్చు నుంచి బయటపడేందుకు ట్రంప్ తంటాలు పడుతూ.. అమెరికన్ ఓటర్లకు ఏకంగా ఐదు వేల డాలర్లు ఇస్తానంటూ వరాల జల్లు కురిపిస్తున్నారు.వియత్నాం యుద్ధ కాలంలో అమెరికన్ సైనికులను తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టడానికి ప్రసారాలను ఉపయోగించిన ‘హనోయ్ హన్నా’తరహా వ్యూహాన్నే ఇప్పుడు ఇరాన్ అచ్చం దింపిందని రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు. వాషింగ్టన్ పెద్దలను లైట్ తీసుకుని, నేరుగా అమెరికన్ ఓటర్లతోనే ఇరాన్ చక్రం తిప్పుతుండటంతో ట్రంప్‌నకు నిద్రపట్టడం లేదు.మరోవైపు ఇరాన్ కరెన్సీ 'రియల్' విలువ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా పడిపోయి, ఒక అమెరికన్ డాలర్‌కు ఏకంగా 25 లక్షల రియల్స్‌కు చేరినప్పటికీ... ఇరాన్ మాత్రం తగ్గేదేలే అన్నట్టు ట్రంప్‌ను వేదికపైనే కార్నర్ చేస్తుండటం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది!ఇదీ చదవండి : మూడోసారి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్? -
కాగితపు పులిలా ఐరాస!.. షోలే మీమ్‌తో ఇరాన్ పంచ్!
భారతీయ సినిమాలతో ఇరాన్ చేస్తున్న ‘మీమ్ డిప్లమసీ’ ఇప్పుడు మరో లెవల్‌కు చేరింది. మొన్న బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’.. నిన్న ప్రభాస్ ‘బాహుబలి’.. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ క్లాసిక్ ‘షోలే’లోని థాకూర్ బల్దేవ్ సింగ్‌ను రంగంలోకి దించింది. ఈసారి ఇరాన్ టార్గెట్ అమెరికా కాదు.. ఐక్యరాజ్యసమితి (ఐరాస). యుద్ధాలు, అంతర్జాతీయ సంక్షోభాల సమయంలో ఐరాస సమర్థంగా డీల్ చేయలేకపోతోందంటూ తన అభిప్రాయాన్ని ఓ వ్యంగ్య మీమ్ ద్వారా చెప్పింది. భారత్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం ఎక్స్‌లో ఓ మీమ్‌ను పోస్టు చేసింది. అందులో రెండు ఫొటోలను పక్కపక్కన పెట్టింది. మొదటి ఫొటోలో మార్వెల్ సూపర్‌హీరో డాక్టర్ స్ట్రేంజ్‌ను పలు చేతులతో చూపించింది. దానిపై స్కూల్ పుస్తకాల ప్రకారం ఐక్యరాజ్య సమితి అని రాసింది. అంటే పుస్తకాల్లో ఐరాసకు ప్రపంచ సమస్యలను పరిష్కరించేంత శక్తి, అనేక మార్గాల్లో పనిచేసే సామర్థ్యం ఉన్నట్లు చూపిస్తున్నారనే కోణం. అదే పక్కన ‘షోలే’లోని థాకూర్ బల్దేవ్ సింగ్ ఫొటోను పెట్టింది. షోలే చిత్రంలో గబ్బర్ చేతిలో చేతులు కోల్పోయిన థాకూర్ పాత్ర కింద యూఎన్ ఇన్ రియాలిటీ అని క్యాప్షన్ ఇచ్చింది. అంటే వాస్తవ పరిస్థితుల్లో పెద్ద అంతర్జాతీయ సంక్షోభాలపై చర్య తీసుకునే విషయంలో ఐరాస ‘చేతులు కట్టేసిన’ సంస్థలా ఉందన్నది ఇరాన్ వ్యంగ్య సందేశం. UN according to school booksUN in reality pic.twitter.com/GQ4gOG8fC0— Iran in India (@Iran_in_India) September 29, 2026ఆరాఘ్చీ విమర్శల వేళ..ఈ మీమ్ రావడానికి ముందు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆరాఘ్చీ ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌తో సమావేశమయ్యారు. అమెరికా, ఇజ్రాయెల్ చర్యలపై ఐరాస తగినంతగా స్పందించడం లేదని అరాఘ్చీ విమర్శించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. యూఎన్ చార్టర్, అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనల విషయంలో ప్రపంచ సంస్థ మౌనం వహించకూడదని, అమెరికా నుంచి వస్తున్నాయని ఇరాన్ పేర్కొంటున్న బెదిరింపులను ఐరాస స్పష్టంగా ఖండించాలని ఆయన కోరినట్లు సమాచారం. అయితే తాజా మీమ్‌లో ఇరాన్ ఏదైనా నిర్దిష్ట ఐరాస తీర్మానం లేదంటే ఒక్క ఘటనను నేరుగా ప్రస్తావించలేదు. ప్రపంచ సంక్షోభాల సమయంలో ఐరాసకు ఉన్న అధికారిక పాత్రకు, ఆచరణలో అది చూపగల ప్రభావానికి మధ్య వ్యత్యాసం ఉందన్న తన విమర్శను మాత్రమే మీమ్ రూపంలో వ్యక్తం చేసింది. భారతీయ సినిమాలే ఎందుకు?ఇరాన్ దౌత్య కార్యాలయాలు భారతీయ సినిమాలను తమ డిజిటల్ ప్రచారంలో ఉపయోగించడం ఇటీవల వరుసగా కనిపిస్తోంది. సెప్టెంబర్ 27న హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సులేట్ ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ యుద్ధ సన్నివేశాన్ని పోస్టు చేసింది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఐరాస ప్రసంగంలో ‘తలవంచబోం’ అన్న సందేశాన్ని బాహుబలి పోరాటంతో పోల్చింది. అంతకుముందు బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ సన్నివేశాన్ని.. ట్రంప్‌పై సెటైరిక్‌గా ఇరాన్ దౌత్య వర్గాలు ఉపయోగించాయి. ఇప్పుడు ‘షోలే’లోని థాకూర్ పాత్రతో ఐరాసపై సెటైర్ చేయడం ద్వారా భారతీయ పాప్ కల్చర్‌ను మరోసారి తన అంతర్జాతీయ సందేశానికి వాడుకుంది.మీమ్ డిప్లమసీకి కొత్త రూపంసాధారణంగా దేశాలు అంతర్జాతీయ వివాదాలపై ప్రకటనలు, ప్రెస్నోట్లు, అధికారిక ప్రసంగాల ద్వారా తమ వైఖరిని వెల్లడిస్తాయి. ఇరాన్ మాత్రం సోషల్ మీడియాలో మీమ్స్, సినిమాల సన్నివేశాలు, వ్యంగ్య వీడియోలను ఉపయోగిస్తూ తన సందేశాన్ని ప్రజలకు చేరువ చేస్తోంది. ఇటువంటి పోస్టులు క్లిష్టమైన భౌగోళిక రాజకీయ అంశాలను సులభమైన, వెంటనే అర్థమయ్యే విజువల్స్‌గా మార్చుతున్నాయి. ఇదీ చదవండి: ట్రంప్ సంచలన నిర్ణయంతో కొత్త చర్చ! -
ఒక డాలర్‌కు 25 లక్షల రియాల్స్
ఇరాన్: అమెరికాతోపాటు పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలతో ఇరాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇరాన్ కరెన్సీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోంటోంది. విలువ నానాటికీ పడిపోతోంది. మంగళవారం ఇరాన్ కరెన్సీ విలువ అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయింది. టెహ్రాన్‌లోని వ్యాపారులు ఒక అమెరికన్ డాలర్‌కు 25 లక్షలకు పైగా రియాల్స్‌ను మారకం చేసుకున్నారు. సెప్టెంబర్ 2న ఒక డాలర్‌కు 22 లక్షల రియాల్స్ వచ్చాయి. కేవలం 27 రోజుల వ్యవధిలోనే మరోసారి భారీగా పతనం కావడం గమనార్హం. ఈ ఏడాది ఫిబ్రవరిలో పశి్చమాసియాలో యుద్ధం మొదలైంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులకు దిగాయి. ఇరాన్ సైతం ప్రతిదాడులు సాగిస్తోంది. యుద్ధం మొదలైన తర్వాత ఇరాన్ కరెన్సీ పదేపదే కొత్త కనిష్ట స్థాయిలకు చేరుకుంటోంది. -
అమెరికా సంచలన నిర్ణయం.. ఇరాక్ నుంచి బలగాల నిష్క్రమణ
ఇరాక్‌లోని చివరి సైనిక స్థావరాల నుంచి అమెరికా బలగాలు బుధవారం నాటికి పూర్తిగా వైదొలగనున్నాయి. 20 ఏళ్లకు పైగా సాగిన అమెరికా సైనిక ఉనికి ముగియడాన్ని ఇరాన్, దాని మద్దతు ఉన్న సాయుధ వర్గాలు విజయంగా అభివర్ణిస్తున్నాయి. ఈ పరిణామంతో ఇరాక్‌లో ఇరాన్ ప్రభావం మరింత పెరగవచ్చని, మరోవైపు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తిరిగి బలపడేందుకు భద్రతాపరమైన ఖాళీ ఏర్పడే అవకాశం ఉందని ఇరాక్ భద్రతా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అమెరికా బలగాల ఉపసంహరణకు 2024లో అప్పటి అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో ఒప్పందం కుదిరింది. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని అమలు చేస్తోంది. 2003లో సద్దాం హుస్సేన్‌ను గద్దె దించేందుకు అమెరికా ఇరాక్‌పై దాడి చేసింది. 2011 చివర్లో అమెరికా బలగాలు వెనుదిరిగాయి. అయితే 2014లో ఇస్లామిక్ స్టేట్ భారీ ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న తర్వాత, ఇరాక్ భద్రతా బలగాలకు సహాయం చేసేందుకు అమెరికా సైన్యం తిరిగి వచ్చింది. 2014 నుంచి 2017 వరకు ఇస్లామిక్ స్టేట్‌పై జరిగిన ప్రధాన పోరులో అమెరికా కీలక పాత్ర పోషించింది.ఇరాక్ భద్రతా విశ్లేషకుడు జాసిమ్ అల్-బహాద్లీ మాట్లాడుతూ.. అమెరికా నేతృత్వంలోని కూటమి వెళ్లిపోవడం వల్ల ఇరాక్‌లో ఇరాన్ ప్రభావాన్ని అడ్డుకునే సైనిక సమతుల్యత తొలగిపోతుందని అన్నారు. ఇరాన్ అనుకూల మిలీషియా వర్గాలు ఈ పరిణామాన్ని తమ విజయంగా చూపించుకుని భద్రతా నిర్ణయాలు, రాజకీయ వ్యవహారాల్లో మరింత ప్రభావం సాధించేందుకు ప్రయత్నించవచ్చని తెలిపారు. ఇరాకీలకు చారిత్రక విజయంఇరాన్ మద్దతు ఉన్న సాయుధ వర్గాల కూటమి ‘ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్’ కమాండర్ అబు మోజ్తబా అల్-యాసిరి అమెరికా నిష్క్రమణను “ఇరాక్ ఇస్లామిక్ ప్రతిఘటన వర్గాలకు, ఇరాకీలకు చారిత్రక విజయం, అమెరికా ప్రాజెక్టుకు ఘోర పరాజయం”గా అభివర్ణించారు. సెప్టెంబర్ 30న “ఇరాక్ చరిత్రలోని చీకటి అధ్యాయం ముగింపును” జరుపుకుంటామని తెలిపారు.అయితే ఫలూజా ప్రాంతానికి చెందిన సున్నీ గిరిజన నేత అబ్దుల్రహ్మాన్ అల్-జుబాయీ మాట్లాడుతూ.. ఇరాక్ భద్రతా వ్యవస్థ పూర్తిగా బాధ్యత చేపట్టేందుకు ఇంకా సిద్ధంగా లేదని అన్నారు. అమెరికా నేతృత్వంలోని కూటమి ఈ విధంగా వెళ్లిపోవడం వల్ల ఏర్పడే ఖాళీపై ఇరాకీలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు.ఇస్లామిక్ స్టేట్ కూడా మరోసారి చురుగ్గా మారే ప్రమాదం ఉందని ఇరాక్ అధికారులు చెబుతున్నారు. ఆ సంస్థకు ఇప్పటికీ రహస్య కార్యకర్తల నెట్వర్క్ ఉందని, అమెరికా నిఘా సమాచారం, సాంకేతిక సహాయం, డ్రోన్ల మద్దతు లేకపోవడం ఉగ్రవాదులకు తిరిగి సమూహాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించవచ్చని కుర్దిష్ కమాండర్ సిర్వాన్ బర్జానీ తెలిపారు. ఉపసంహరణ నేపథ్యంలో ఆ సంస్థకు చెందిన రహస్య కార్యకర్తల కదలికలు పెరిగినట్లు గమనించామని ఆయన చెప్పారు.ఇరాక్ భద్రతా బలగాల ప్రకారం, అమెరికా నిష్క్రమణను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడులకు సిద్ధమైనట్లు అనుమానిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ముఠాను గుర్తించారు. అమెరికా బలగాల నిష్క్రమణ తర్వాత ఇరాక్‌లో ఇరాన్ ప్రభావం, భద్రతా పరిస్థితి, ఇస్లామిక్ స్టేట్ కార్యకలాపాలు ఎలా మారతాయన్నది కీలకంగా మారనుంది. -
ప్రభాస్ వీడియో క్లిప్ తో అమెరికాకు ఇరాన్ వార్నింగ్
-
మెట్టు దిగిన ఇరాన్?.. పశ్చిమాసియా యుద్ధంలో కీలక పరిణామం
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధానికి తెరదించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా, ఇరాన్ నేరుగా కాకుండా మధ్యవర్తుల ద్వారా మరోసారి చర్చలకు సిద్ధమయ్యాయి. సోమవారం ఇరు దేశాల అధికారులు మధ్యవర్తులతో వేర్వేరుగా సంప్రదింపులు జరిపారు. ఏడు నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు తాజా దౌత్య ప్రయత్నాల్లో భాగంగా ఈ చర్చలు జరుగుతున్నాయి.ఇరాన్ గత వారం ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సందర్భంగా ప్రతిపాదించిన ఏడు రోజుల కాల్పుల విరమణ ప్రణాళికను కొద్దిగా సవరించి తాజా చర్చల్లో ముందుకు తీసుకెళ్లే అవకాశముంది. ఖతార్ మధ్యవర్తులు న్యూయార్క్‌లో ఉన్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీతో, అలాగే అమెరికా వర్గాలతో విడివిడిగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. యుద్ధంలో అమెరికాదే విజయం: ట్రంప్మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం యుద్ధం త్వరలోనే ముగుస్తుందని, అమెరికా గెలుస్తుందని వ్యాఖ్యానించారు. సోమవారం వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధికారులు మధ్యవర్తులతో చర్చలు జరిపినట్లు తెలిపారు. “మేం గెలవబోతున్నాం. నా వరకు ఇది ఎలాగైనా సరే జరుగుతుంది. చాలా త్వరగానే ఇది ముగిసిపోతుంది” అని ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధంలో అమెరికా విజయం సాధించిన తర్వాత గ్యాస్ ధరలు కూడా గణనీయంగా తగ్గుతాయని చెప్పారు.ఇరాన్ కీలక ప్రతిపాదన ఇదే..ఇరాన్ ప్రతిపాదనలో ప్రధానంగా యుద్ధాన్ని నిలిపివేయడం, లెబనాన్‌లోనూ శత్రుత్వ చర్యలకు ముగింపు పలకడం, ఫ్రీజ్ చేసిన తమ బిలియన్ల డాలర్ల ఆస్తులను విడుదల చేయడం, ఇరాన్ చమురుపై ఆంక్షలను ఎత్తివేయడం వంటి అంశాలు ఉన్నాయి. అలాగే ఇరాన్ పోర్టులపై అమెరికా విధించిన నావికా దిగ్బంధాన్ని తొలగించాలని కోరుతోంది.దీనికి ప్రతిగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్ సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అంతేకాకుండా ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికాతో చర్చలను పునఃప్రారంభించేందుకు ప్రతిపాదించింది. శుద్ధిచేసిన యురేనియం అంశంపైనా చర్చలు జరపాలని అమెరికా కోరుతోంది. ..అయినా చర్చలకు గ్రీన్ సిగ్నల్ఇరాన్ ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం తిరస్కరించినట్లు ప్రకటించారు. ఆర్థిక ఒత్తిడి కారణంగానే ఇరాన్ వేగంగా ఒప్పందం కుదుర్చుకోవాలని చూస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఆదివారం ఇదే అంశంపై మాట్లాడుతూ.. ఈ వారంలో అమెరికా ప్రతినిధులు మరోసారి చర్చలు జరిపే అవకాశం ఉందని ట్రంప్ తెలిపారు. సోమవారం కూడా మధ్యవర్తులతో అమెరికా అధికారులు మాట్లాడినట్లు వైట్‌హౌస్‌లో ట్రంప్ వెల్లడించారు. మరోవైపు, అమెరికా అధికారికంగా తమ ప్రతిపాదనను తిరస్కరించిన సమాచారం తమకు ఇంకా అందలేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీ చెబుతున్నారు. వాషింగ్టన్ నుంచి స్పష్టమైన సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని ఆయన తెలిపారు. శాంతియుత పరిష్కారం కోరుకుంటే తాము ఇప్పటికే పరిష్కార మార్గాన్ని ప్రతిపాదించామని పేర్కొన్నారు. హర్ముజ్‌పైనే అసలు పట్టుప్రస్తుత చర్చల్లో హర్ముజ్ జలసంధి కీలక అంశంగా మారింది. ఈ మార్గం ద్వారా ప్రపంచ ఇంధన రవాణాలో భారీగా చమురు, ఎల్ఎన్జీ రవాణా జరుగుతుంది. యుద్ధం కారణంగా ఇక్కడ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ప్రభావం పడుతోంది. సోమవారం కూడా దౌత్య ప్రయత్నాలపై ఆశలు, యుద్ధంపై ఆందోళనల మధ్య చమురు ధరలు పెరిగాయి.గతంలో ఏప్రిల్, జూన్‌లో మధ్యవర్తుల ప్రయత్నాలతో కాల్పుల విరమణలు కుదిరినా అవి ఎక్కువకాలం కొనసాగలేదు. అయితే ఇప్పుడు ఇరాన్ మాత్రం తమ షరతులు నెరవేరిన తర్వాతే హర్ముజ్‌ను పూర్తిగా తెరిచే అంశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేసింది. దీంతో తాజా మధ్యవర్తిత్వ చర్చలు యుద్ధానికి ముగింపు పలుకుతాయా? లేదంటే మరోసారి విఫలమవుతాయా?.. రాబోయే రోజుల్లో ఏం జరగనుందా? అనే ఉత్కంఠ నెలకొంది.ఇదీ చదవండి: ఎల్ నినో ఏం చేయబోతోందో తెలుసా? -
అమెరికా- ఇరాన్ యుద్ధం.. మధ్యలో బాహుబలి..!
అమెరికా- ఇరాన్ యుద్ధం ఇప్పట్లో అగేలా కనిపించడం లేదు. ఒకరికొకరు వార్నింగ్ ఇవ్వడం.. దాడులు చేయడం ఈ రెండు దేశాలకు కామన్ అయిపోయింది. అయితే ఈ హెచ్చరికలు కాస్తా కొత్త తరహాలో కనిపిస్తున్నాయి. సినిమాల్లోని సీన్స్‌ను జోడించి శత్రుదేశాలకు వార్నింగ్ ఇవ్వడం చూస్తుంటే ఫుల్ ఫన్నీగా అనిపిస్తోంది. తాజాగా హైదరాబాద్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ప్రభాస్- రాజమౌళి కాంబోలో వచ్చిన బాహుబలి మూవీ వీడియోను హైదరాబాద్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం ట్విటర్లో పంచుకుంది. కాలకేయులతో బాహుబలి యుద్ధం చేస్తున్న వీడియో తెగ ఆకట్టుకుంటోంది. కాలకేయులకు ఎదురొడ్డి బాహుబలి పోరాడినట్లే.. మేం కూడా మా మాతృదేశం కోసం రక్తం చిందించి ప్రాణత్యాగానికైనా సిద్ధపడతాం అంటూ ట్వీట్లో రాసుకొచ్చింది. ఇటీవలే ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ పెజెష్కియన్ ఐరాస సమావేశంలో 'ఎవరికీ ఎన్నడూ తలవంచము.. మోకరిల్లము' అంటూ మాట్లాడారు. ఈ కామెంట్స్‌ను ఉద్దేశించి హైదరాబాద్‌లోని ఎంబసీ బాహుబలి వీడియోను షేర్ చేసింది.(ఇది చదవండి: ప్రెగ్నెన్సీతో సమంత.. ఆ విషయంలో ఎక్కువ ఫోకస్..!)Dr. Pezeshkian, President of I.R #Iran at UNGA: "Will never bow our head or bend the knee"Like Baahubali standing against the Kalakeyas, we also shed our own blood in sacrifice for the homeland. pic.twitter.com/xc1S9H346Q— Iran In Hyderabad (@IraninHyderabad) September 27, 2026 -
ఆస్పత్రి శిధిలాల కింద మోజ్తాబా కమేనీ.. ఇదే అసలు నిజం
టెహ్రాన్: అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై నిర్వహించిన భీకర వైమానిక దాడుల్లో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నట్లు ఇరాన్ మతగురువు, అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ సభ్యుడు అయతుల్లా మొహ్సెన్ హైదరీ అలెకాసిర్ సంచలన విషయాలు వెల్లడించారు.ఖతార్‌కు చెందిన ప్రముఖ ‘అల్ అరబీ’ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వివరాలను బయటపెట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా చేపట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ’లో భాగంగా టెహ్రాన్‌లోని అధికారిక కేంద్రాలు, నివాస సముదాయాలపై యుద్ధ నౌకలు, సబ్మెరైన్లు, టోమహాక్ క్షిపణులతో మెరుపు దాడులు జరిగాయి. ఈ దాడుల్లో దివంగత ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు.శిథిలాల కింద చిక్కుకున్న మోజ్తాబా ఖమేనీ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయిన ప్రాంతానికి సమీపంలో ఉన్న వైద్య కేంద్రాలపై కూడా దాడులు జరిగాయి. ఈ దాడుల సమయంలో మూడో ఆసుపత్రిలో ఉన్న మోజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడి భవన శిథిలాల కింద చిక్కుకున్నారు. అప్రమత్తమైన అత్యవసర సిబ్బంది శిథిలాలను తొలగించి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆయన్ని రక్షించి అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు అలెకాసిర్ తెలిపారు. ఇదీ చదవండి: అయతుల్లా అలీ ఖమేనీ ఒంటి చేయి రహస్యం ఇదేనా?అజ్ఞాతంలో ఖమేనీ.. పొంతన లేని ప్రకటనలు మార్చి 8న ఇరాన్ సుప్రీం లీడర్‌గా మోజ్తాబా ఖమేనీ ఎన్నికైనప్పటికీ, ఆ తర్వాత ఆయన భౌతికంగా లేదా మీడియా ముందు బహిరంగంగా కనిపించలేదు. దీంతో ఆయన ఆరోగ్యంపై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా వర్గాల సమాచారం ప్రకారం.. వైమానిక దాడుల్లో ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారని, ఆయన శరీరంపై బలమైన గాయాలైనట్లు నివేదికలు వచ్చాయి. మరోవైపు, గత వారం ‘ఫాక్స్ న్యూస్’తో మాట్లాడిన ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ మాత్రం మోజ్తాబా ఖమేనీ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టం చేశారు.సుప్రీం లీడర్ ఎంపిక ప్రక్రియ శత్రు దేశాల దాడుల ముప్పును ఎదుర్కొంటూనే అత్యంత గోప్యంగా ఈ ఎంపిక జరిగిందని అలెకాసిర్ వెల్లడించారు. అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ నిర్వహించిన ఓటింగ్‌లో మొత్తం 59 ఓట్లకు గానూ మోజ్తాబా ఖమేనీ 50 ఓట్లు సాధించి ఘన విజయం సాధించగా, మరో ఎనిమిది మంది అయతుల్లా అలీరేజా అరఫీకి ఓటు వేశారు. దేశాన్ని చట్టపరంగా, మతపరంగా నడిపించేందుకు ఖమేనీ మాత్రమే తగిన నాయకుడని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. 🇮🇷 🇮🇱 Detalles publicados por primera vez: Durante la guerra, el MOSSAD estuvo muy cerca del asesinato de Mujtaba Khamenei, el hijo de Ali Khamenei. Mohsen Heydari, miembro de la Asamblea iraní de expertos, afirmó que Mojtaba Jamenei fue rescatado de los escombros tras el ataque al hospital de Teherán. Heydari añadió que Jamenei resultó herido durante el ataque. Otros tres hospitales de Teherán fueron bombardeados después de que se supo que su estado se había estabilizado en el hospital. Según Heydari, cuando Jamenei estaba siendo tratado en el tercer hospital, el mismo centro médico también fue atacado y luego fue rescatado de los escombros.— Señor del caos visual ☭ 🇨🇱 (@Darwin_48) September 27, 2026 -
డూమ్స్‌డే వార్: ఇరాన్ బిగ్ వార్నింగ్.. ట్రంప్ రియాక్షన్ ఇదే
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ముగింపు కోసం దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ.. పరిస్థితులు మాత్రం మరోసారి ఉద్రిక్తంగా మారుతున్నాయి. హర్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరాన్ ప్రతిపాదించిన ఏడు రోజుల రోడ్‌మ్యాప్‌ను అమెరికా తిరస్కరించడంతో.. అవసరమైతే భయానక యుద్ధాన్ని సైతం ఎదుర్కొనేందుకు తమ దేశం పూర్తిగా సిద్ధంగా ఉందని ఇరాన్ అంటోంది. ఈసారి యుద్ధం మొదలైతే అదీ ఎవరూ ఊహించని స్థాయిలో భీకరంగా మారొచ్చు అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పష్టం చేశారు. యుద్ధం పునఃప్రారంభమైతే అది ‘డూమ్స్‌డే వార్’(Doomsday War)ప్రళయం తరహా) స్థాయికి చేరినా ఎదుర్కొనేందుకు సిద్ధం అని అమెరికాను హెచ్చరించారాయన. అదే సమయంలో దౌత్యానికి తలుపులు మాత్రం మూసివేయలేదని చెప్పారు.హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం, యుద్ధాన్ని ముగించే దిశగా ఇరాన్ ఏడు రోజుల ప్రణాళికను ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనను అమెరికా తిరస్కరించింది. ఇరాన్ తమను ఫ్రీజ్ చేసిన బిలియన్ల డాలర్ల నిధులను విడుదల చేయాలని, ఆంక్షలను ఎత్తివేయాలని కోరిందని.. అందుకు తాము సిద్ధంగా లేమని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి మైక్ వాల్ట్జ్ తెలిపారు. ఇవి కేవలం అమెరికా విధించిన ఆంక్షలు కాదని, ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్న ఆంక్షలని ఆయన పేర్కొన్నారు.‘యుద్ధం త్వరలో ముగుస్తుంది’.. ట్రంప్మరోవైపు.. ఆరాఘ్ఛి వార్నింగ్ వెలువడ్డ కాసేపటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఈ వారంలో ఇరాన్‌తో మరిన్ని చర్చలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. యుద్ధంలో అమెరికా ‘త్వరలోనే విజయం సాధిస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు. అయితే ఇరాన్ ప్రతిపాదనను తిరస్కరించినప్పటికీ దౌత్య మార్గాలు పూర్తిగా మూసుకుపోలేదని నిపుణులు చెబుతున్నారు.న్యూయార్క్‌లో ఐరాస సర్వసభ్య సమావేశాల సందర్భంగా ఇరాన్ ప్రతినిధులతో దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నాయని సెంటర్ ఫర్ మిడిల్ ఈస్ట్ స్ట్రాటజిక్ స్టడీస్ సీనియర్ పరిశోధకుడు అబ్బాస్ అస్లానీ తెలిపారు. మధ్యవర్తుల ద్వారా అమెరికా అధికారిక స్పందన కోసం ఇరాన్ ఎదురుచూస్తోందని చెప్పారు. ఇరుదేశాలు తమకు ఉన్న ప్రధాన ఒత్తిడి సాధనాలను ముందుగా ఎవరు వదులుకుంటారన్నదే ఇప్పుడు కీలకంగా మారిందని ఆయన విశ్లేషించారు.డ్రోన్ స్వాధీనం చేసుకున్నామన్న ఇరాన్ ప్రకటనపై..హర్ముజ్ జలసంధిలో అమెరికాకు చెందిన అధునాతన అండర్‌వాటర్ డ్రోన్‌ను ఇరాన్ సైన్యం స్వాధీనం చేసుకుందన్న వార్తలు కూడా ఉద్రిక్తతను పెంచాయి. అయితే ఇరాన్ చేసిన ఈ ప్రకటనను అమెరికా సైన్యం ఖండించింది. డ్రోన్ తమ ఆధీనంలోకి వెళ్లిందన్న వాదనలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. ఇరాన్‌పై అమెరికా దాడులకు ఉపయోగిస్తున్న బ్రిటన్‌లోని ఓ వైమానిక స్థావరం సమీపంలో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పేలుడు పదార్థాలు, ఉగ్రవాదానికి సంబంధించిన నేరాల అనుమానంతో వారిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వాళ్లు ఇరాన్ పౌరులని తెలుస్తోంది.నస్రల్లా హంతకుల్ని శిక్షించాల్సిందేమరోవైపు హెజ్బొల్లా నేత హసన్ నస్రల్లా హత్యకు రెండేళ్లు పూర్తైన సందర్భంగా ఇరాన్ మరోసారి ఇజ్రాయెల్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. నస్రల్లా హత్యను ‘క్షమించరాని నేరం’గా అభివర్ణించిన ఇరాన్ విదేశాంగ శాఖ.. బాధ్యులను గుర్తించి చట్టపరంగా శిక్షించాలని ప్రపంచ దేశాలను కోరింది. 2024 సెప్టెంబర్ 27న బీరుట్‌లోని దక్షిణ శివార్లపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో నస్రల్లా మరణించిన విషయం తెలిసిందే.మొత్తంగా హర్ముజ్ జలసంధి తెరవడం, ఆంక్షల ఎత్తివేత, అణు కార్యక్రమం వంటి అంశాలపై అమెరికా–ఇరాన్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఒకవైపు చర్చలకు అవకాశం ఉందన్న సంకేతాలు కనిపిస్తుండగా.. మరోవైపు యుద్ధం మళ్లీ మొదలైతే పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని ఇరాన్ హెచ్చరించడం పరిస్థితి తీవ్రతను చాటుతోంది.ఇదీ చదవండి: భారత్-కెనడా బంధంలో కీలక ‘మలుపు’! -
ఇరాన్లో కలకలం.. ఆస్పత్రి శిథిలాల కింద మోజ్తబా ఖమేనీ?
మొదట దాడి.. ఆ తర్వాత ఆస్పత్రికి తరలింపు.. అక్కడ కూడా బాంబుల మోత.. ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ చుట్టూ ఇప్పుడు మరో సంచలన కథనం తెరపైకి వచ్చింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో గాయపడిన ఆయనను టెహ్రాన్‌లోని ఆస్పత్రికి తరలించగా.. ఆ తర్వాత నగరంలోని మూడు ఆస్పత్రులపై దాడులు జరిగాయని ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ సభ్యుడు మొహ్సెన్ హెయ్‌దారీ చెప్పినట్లు ‘న్యూయార్క్ పోస్ట్’ కథనం వెల్లడించింది. మూడో ఆస్పత్రి శిథిలాల నుంచి మోజ్తబా ఖమేనీని బయటకు తీసి, అనంతరం గుర్తుతెలియని ప్రాంతానికి తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. శిథిలాల నుంచి బయటపడిన తర్వాత మోజ్తబా ఖమేనీ ఎక్కడ ఉన్నారన్నది స్పష్టంగా తెలియడం లేదని హెయ్‌దారీ చెప్పినట్లు నివేదిక పేర్కొంది. ఆయన బహిరంగంగా కనిపించకపోవడంతో ఆరోగ్య పరిస్థితిపై మళ్లీ అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, మోజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై ఇప్పటికే భిన్న కథనాలు ఉన్నాయి. అమెరికా వర్గాల సమాచారాన్ని ఉటంకిస్తూ కొన్ని నివేదికలు ఆయన తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నాయి. మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ మాత్రం ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని చెబుతున్నారు. మోజ్తబా ఖమేనీతో తాను సుదీర్ఘంగా సమావేశమై చర్చలు జరిపినట్లు పెజెష్కియాన్ వెల్లడించారు.అంటే.. ఒకవైపు ఆస్పత్రి శిథిలాల నుంచి బయటకు తీసినట్లు ఓ ఇరాన్ అధికారి చెబుతున్న వాదన.. మరోవైపు ఆయన ఆరోగ్యంగా ఉన్నారని ఇరాన్ అధ్యక్షుడి ప్రకటన. దీంతో అసలు మోజ్తబా ఖమేనీ ప్రస్తుత పరిస్థితి ఏమిటన్నది కీలక ప్రశ్నగా మారింది. ఇదిలా ఉండగా.. మోజ్తబా ఖమేనీ సుప్రీం లీడర్‌గా ఎంపికైన విధానంపైనా హెయ్‌దారీ కీలక వివరాలు వెల్లడించినట్లు నివేదిక పేర్కొంది. మార్చి 8న అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ సమావేశంలో ఆయన పేరును ప్రతిపాదించినట్లు చెప్పారు. ఇదే సమయంలో ఖోమ్‌లోని అసెంబ్లీ సెక్రటేరియట్‌పై దాడి జరిగిందని, ఎనిమిది మంది మరణించారని ఆయన ఆరోపించినట్లు సమాచారం.దాడిలో ఎంపికకు సంబంధించిన పత్రాలు ధ్వంసమైన నేపథ్యంలో సభ్యులు తమ ఓట్లను కాగితాలపై నమోదు చేసి, అనంతరం రహస్య గదిలో సమావేశమైనట్లు ఆయన చెప్పినట్లు నివేదిక పేర్కొంది. మొత్తం 59 మంది సభ్యుల్లో 50 మంది మోజ్తబా ఖమేనీకి మద్దతు పలికినట్లు, ఎనిమిది ఓట్లు అయతుల్లా అలీరెజా అరాఫీకి వచ్చినట్లు, ఒకరు ఓటింగ్‌కు దూరంగా ఉన్నట్లు సమాచారం.ఇదీ చదవండి: మేమంతా చనిపోయే వాళ్లం: నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు -
ట్రంప్ తిరస్కరణ.. ఇరాన్ కీలక ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ శాంతి ప్రతిపాదనను తిరస్కరించారన్న వార్తల నేపథ్యంలో ఇరాన్ మరోసారి కీలక ప్రకటన చేసింది. అమెరికా, ఇజ్రాయెల్‌తో నెలకొన్న వివాదానికి దౌత్యమే ఏకైక పరిష్కారమని ఇరాన్ స్పష్టం చేసింది. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలంటే తమ షరతులు నెరవేర్చాల్సిందేనని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తేల్చిచెప్పారు.హార్ముజ్ జలసంధిని తెరవడానికి తమ షరతులు స్పష్టంగా ఉన్నాయని అరాఘ్చీ చెప్పుకొచ్చారు. తమ ప్రతిపాదనపై అమెరికా తిరస్కరణను మధ్యవర్తులు అధికారికంగా తమకు తెలియజేయలేదని చెప్పారు. మధ్యవర్తుల నుంచి తుది సమాచారం కోసం ఎదురుచూస్తున్నామని.. ఆ తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఈ వారం న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా ఇరాన్ తన శాంతి ప్రతిపాదనను అమెరికాకు పంపింది. ఖతార్ మధ్యవర్తిత్వంతో ఈ ప్రతిపాదనను వాషింగ్టన్కు చేరవేసింది. ఇందులో హార్ముజ్ జలసంధిని ఏడు రోజుల వ్యవధిలో తిరిగి తెరవడం, ప్రాంతీయంగా జరుగుతున్న పోరాటానికి విరామం ఇవ్వడం, ఆ తర్వాత విస్తృత చర్చలు జరపడం వంటి అంశాలు ఉన్నాయి.అయితే ఈ ప్రతిపాదనను తాను తిరస్కరించినట్లు ట్రంప్ శనివారం వెల్లడించారు. ఇరాన్ తీవ్ర ఒత్తిడిలో ఉండటం వల్లే వెంటనే హార్ముజ్‌ను తెరవడానికి ఒప్పందం కోరుతోందని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు ఇరాన్ తన అణు కార్యక్రమంపై కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్న సంకేతాలు ఇచ్చింది. అమెరికా ప్రతిపాదనను అంగీకరించినా.. యురేనియం శుద్ధి చేసే హక్కుపై, అధిక శుద్ధి చేసిన యురేనియాన్ని దేశం నుంచి తరలించడంపై తాము రాజీ పడబోమని ఇరాన్ అధికార వర్గాలు తెలిపాయి.ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ మాత్రం అణు కార్యక్రమంతో పాటు ఇతర అంశాలపై చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అయితే బెదిరింపులు, ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. తమ దేశం యుద్ధాన్ని కోరుకోవడం లేదని.. ఒత్తిళ్లు, బెదిరింపులు, దాడుల నుంచి తమను తాము రక్షించుకుంటామని తెలిపారు.ప్రపంచ చమురు సరఫరాపై ప్రభావంహార్ముజ్ జలసంధిపై నెలకొన్న ప్రతిష్టంభన ప్రపంచ ఇంధన సరఫరాలపై ఆందోళనలను పెంచుతోంది. ప్రపంచంలోని కీలక సముద్ర మార్గాల్లో ఒకటైన ఈ జలసంధి ద్వారా చమురు రవాణా గణనీయంగా తగ్గినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. దీంతో అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ప్రభావం పడే అవకాశాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ ఇప్పటికే హార్ముజ్ అంశంపై సౌదీ అరేబియాతోనూ చర్చలు జరిపింది. మరోవైపు అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్, దాని మిత్ర బలగాలు ప్రతిదాడులతో సమాధానం ఇస్తున్నాయి. దీంతో హార్ముజ్ అంశం కేవలం ఇరాన్-అమెరికా మధ్య వివాదంగా కాకుండా.. మొత్తం పశ్చిమాసియా ప్రాంతంపై ప్రభావం చూపే అంశంగా మారింది.ఇదీ చదవండి: భారత్‌కు పాకిస్తాన్ సంచలన హెచ్చరిక -
భారత్ పసిడి 'కూత'
భారత కబడ్డీ జట్లు నిరాశపర్చలేదు...ఆసియా క్రీడల్లో తమ స్థాయిని మళ్లీ చూపిస్తూ పురుషుల, మహిళల కబడ్డీ టీమ్‌లు తమ స్వర్ణాలను నిలబెట్టుకున్నాయి. అథ్లెటిక్స్‌లో కూడా భారత్ మూడు పతకాలతో మెరిసింది. మారథాన్ సావన్ అనూహ్యంగా రజతాన్ని అందించగా, షాట్‌పుటర్ తజీందర్ కూడా సిల్వర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. మరో వైపు ప్రాచి కూడా ఏషియాడ్‌లో వరుసగా రెండో పతకాన్ని అందుకోగా...సీనియర్ స్క్వాష్ స్టార్ జోష్న తన భాగస్వామి సెంథిల్‌తో కలిసి కంచు మోత మోగించింది. ఓవరాల్‌గా ఏడో రోజు 7 పతకాలతో భారత బృందం మురిపించగా... బ్యాడ్మింటన్, బాక్సింగ్‌లలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి.హోరాహోరీ పోరులో... మహిళల కబడ్డీలో భారత జట్టు తమ స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకుంది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో భారత్ 37–34 పాయింట్ల తేడాతో ఇరాన్‌పై విజయం సాధించింది. ఈ క్రీడల్లో ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్‌లలో ఏకపక్ష విజయాలు సాధించిన భారత్‌కు తుది పోరులో మాత్రం పోటీ ఎదురైంది. తొలి అర్ధ భాగం ముగిసేసరికి భారత్ 22–16తో ఆధిక్యంలో నిలిచింది. వీటిలో 16 రెయిడ్ పాయింట్లు సాధించిన జట్టు 3 బోనస్ పాయింట్లు, ఒక ఆలౌట్‌ను స్కోర్ చేసింది. అయితే రెండో అర్ధ భాగంలో కోలుకొని వరుసగా పాయింట్లు సాధించిన ఇరాన్ గట్టి పోటీనిస్తూ స్కోరును దాదాపు సమంగా 26–27 వద్దకు తీసుకొచ్చింది. అయితే ఈ దశలో ఒత్తిడిని అధిగమిస్తూ సంజు దేవి సూపర్ రైడ్‌తో మన జట్టు మళ్లీ ముందంజ వేసింది. ఆ తర్వాత కెప్టెన్ పుష్ప రాణా ప్రత్యర్థిని ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించడంతో జట్టుకు పట్టు చిక్కింది. ఈ దశలో ఇరాన్ సూపర్ టాకిల్‌తో కొంత పోరాడినా... చివరకు భారత మహిళలదే పైచేయి అయింది. 2010 ఆసియా క్రీడల్లో మహిళల కబడ్డీని మొదటి సారి ప్రవేశపెట్టిన తర్వాత భారత్‌కు ఇది నాలుగో స్వర్ణం కావడం విశేషం. 2010, 2014, 2022, 2026లలో భారత్ పసిడి గెలవగా, 2018లో మాత్రం ఇరాన్‌కు బంగారు పతకం దక్కింది.పురుషులకు తొమ్మిదో స్వర్ణం... కబడ్డీలో భారత పురుషుల జట్టు మరోసారి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆసియా క్రీడల చరిత్రలో ఏకంగా 9వ స్వర్ణాన్ని తమ ఖాతాలో వేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో భారత్ 40–34 పాయింట్ల తేడాతో ఇరాన్‌ను ఓడించింది. జట్టులో అత్యంత అనుభవజ్ఞుడైన పవన్ సెహ్రావత్ లేకుండానే తుది పోరులో బరిలోకి దిగిన భారత్ ఆరంభంలో తడబడింది. అయితే అర్జున్ దేశ్వాల్, దేవాంక్ వరుస పాయింట్లు రాబట్టడంతో కోలుకుంది. అర్ధభాగం ముగిసే సరికి భారత్ 17–18తో వెనుకబడింది. అయితే రెండో అర్ధభాగంలో జట్టు మెరుగైన ప్రదర్శన కనబర్చింది. కీలక దశలో ప్రత్యర్థిని ఆలౌట్ చేయడంతో ఆధిక్యం 29–24కు పెరిగింది. సమయం దగ్గరవుతుండటంతో భారత్ దూకుడు తగ్గించి జాగ్రత్తపడింది. ఈ దశలో ఇరాన్ ఎంత ప్రయత్నించినా పాయింట్లు రాబట్టడంలో విఫలమైంది. 1990 ఆసియా క్రీడల్లో పురుషుల కబడ్డీని ప్రవేశపెట్టిన తర్వాత వరుసగా 7 స్వర్ణాలు గెలుచుకున్న భారత్ 2018 క్రీడల్లో కాంస్యానికి పరిమితమైంది. అయితే 2022లో మళ్లీ పసిడిని అందుకున్న మన బృందం ఈ సారి దానిని నిలబెట్టుకుంది.తజీందర్ వెండి వెలుగులు... ఆసియా క్రీడల్లో వరుసగా మూడో స్వర్ణం సాధించే లక్ష్యంతో బరిలోకి దిగిన భారత అథ్లెŠట్ తజీందర్‌పాల్ సింగ్ తూర్ కల నెరవేరలేదు. శనివారం జరిగిన పురుషుల షాట్‌పుట్ ఈవెంట్లో తజీందర్ రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. గుండును అతను 20.64 మీటర్ల దూరం విసిరాడు. ఇరాన్ అథ్లెట్ మొహమ్మద్ రెజా (20.81 మీటర్లు) స్వర్ణం గెలుచుకోగా, మొహమ్మద్ తొలు (సౌదీ అరేబియా–20.48 మీటర్లు) కాంస్యం అందుకున్నాడు. పంజాబ్‌కు చెందిన తూర్ 2018, 2022 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించాడు. ప్రాచి చౌదరికి కాంస్యం గత ఆసియా క్రీడల్లో మహిళల 4్ఠ400 మీటర్ల రిలేలో రజతం సాధించిన భారత అథ్లెట్ ప్రాచి చౌదరి ఈ సారి వ్యక్తిగత విభాగంలో పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. మహిళల 400 మీటర్ల పరుగులో ప్రాచి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. 53.21 సెకన్లలో పరుగు పూర్తి చేసిన ఉత్తరప్రదేశ్ అథ్లెట్ ప్రాచి మూడో స్థానంలో నిలిచింది. ఈ ఈవెంట్లో సల్వా నాసర్ (బహ్రెయిన్–49.29 సెకన్లు) స్వర్ణం సాధించగా, జెహ్రీ జరీ (ఇరాన్–52.38 సెకన్లు) రజత పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ పోటీల బరిలోకి నిలిచిన మరో భారత అథ్లెట్ కిరణ్ పహల్ ఐదో స్థానంతో ముగించింది. సిల్వర్ సావన్పురుషుల మారథాన్ రేస్‌లో భారత్‌కు 44 ఏళ్ల తర్వాత పతకం లభించింది. అద్భుత ప్రదర్శనతో సత్తా చాటిన సావన్ బర్వాల్ రజత పతకం గెలుచుకున్నాడు. 42.195 కిలోమీటర్ల దూరాన్ని సావన్ 2 గంటల 11 నిమిషాల 37 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. జపాన్‌కు చెందిన ఇచిటకా యమషిత (2 గంటల 10 నిమిషాల 49 సెకన్లు) స్వర్ణం గెలుచుకోగా, ప్యూ ఫెంగ్ (చైనా – 2 గంటల 12 నిమిషాల 13 సెకన్లు)కు కాంస్యం దక్కింది. 1982 ఆసియా క్రీడల్లో హోసూర్ కుక్కప్ప సీతారన్ కాంస్యం గెలిచిన తర్వాత మారథాన్‌కు మళ్లీ ఇప్పుడే పతకం దక్కడం విశేషం. అంతకు ముందు 1951 ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు ఛోటా సింగ్, సూరత్ సింగ్ మారథాన్‌లో స్వర్ణ, కాంస్యాలు నెగ్గారు. పతకాన్ని గెలిచే క్రమంలో సావన్ కొత్త జాతీయ రికార్డును కూడా నెలకొల్పాడు. గత ఏప్రిల్‌లోనే తానే నెలకొల్పిన 2 గంటల 11 నిమిషాల 58 సెకన్ల టైమింగ్‌ను అతను బద్దలు కొట్టాడు. ఈ రేస్‌లో పాల్గొన్న మరో భారత అథ్లెట్ కార్తీక్ కర్కేరా 17వ స్థానంతో ముగించాడు. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ జిల్లా జోగీందర్ నగర్ సావన్ స్వస్థలం. అతని తండ్రి కుల్దీప్ ఢిల్లీలో డ్రైవర్‌గా పని చేశాడు. స్కూల్ గ్రౌండ్లో పరుగెడుతూ ఆసక్తి పెంచుతున్న సావన్ 14 ఏళ్ల వయసులోనే 1500 మీటర్ల పరుగులో శిక్షణ పొందాడు. 2015లో అండర్–18 కేటగిరీలో తొలిసారి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న అతను మరో మూడేళ్ల తర్వాత ఫెడరేషన్ కప్‌లో 5000 మీటర్ల పరుగుతో తన సీనియర్ ప్రస్థానాన్ని మొదలు పెట్టాడు. లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సావన్... 2023లో దుబాయ్‌లో జరిగిన ఆసియా హాఫ్ మారథాన్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచి అందరి దృష్టినీ ఆకర్షించాడు. గత ఏడాది జాతీయ క్రీడల్లో 5,000 మీటర్లు, 10,000 మీటర్లలో స్వర్ణం సాధించిన సావన్ స్పోర్ట్స్ కోటాలో ఆర్మీలో ఉద్యోగం దక్కించుకున్నాడు. ప్రస్తుతం అమెరికాలోని కొలరాడో స్ప్రింగ్స్‌లో అతను శిక్షణ పొందుతున్నాడు.షూటింగ్లో మరో రజతం భారత్‌కు షూటింగ్ మరో పతకాన్ని అందించింది. మహిళల 50 మీటర్ల 3 పొజిషన్స్ టీమ్ ఈవెంట్లో మన జట్టు రజత పతకాన్ని గెలుచుకుంది. తిలోత్తమ సేన్, విదర్స వినోద్, ఆషి చోక్సీలతో కూడిన భారత జట్టు మొత్తం 1763 పాయింట్ల స్కోరుతో రెండో స్థానంలో నిలిచింది. ఈ పోరులో చైనా (1773 పాయింట్లు) స్వర్ణం సాధించగా, కజకిస్తాన్ (1754 పాయింట్లు) కాంస్యం సొంతం చేసుకుంది. ఇదే ఈవెంట్ వ్యక్తిగత విభాగంలోనూ మెరుగైన ప్రదర్శనే కనబర్చినా... భారత షూటర్లకు అదృష్టం కలిసి రాలేదు. తిలోత్తమ నాలుగో స్థానంతో విదర్స ఐదో స్థానంతో ముగించారు. ఈ ఆసియా క్రీడల మహిళల 10 మీ. ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో రజతం సాధించిన విదర్సకు ఇది రెండో పతకం కాగా... ఆషి 2022 ఆసియా క్రీడల్లో ఒక రజతం, ఒక కాంస్యం నెగ్గింది.స్క్వాష్‌లో కాంస్య పతకంస్క్వాష్ మిక్స్డ్ డబుల్స్‌లో భారత్ కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. భారత జోడి జోష్నా చిన్నప్ప–వెలవన్ సెంథిల్ కుమార్ శనివారం జరిగిన సెమీఫైనల్లో పరాజయంపాలైంది. హాంకాంగ్‌కు చెందిన టాంగ్ మింగ్ హాంగ్–లీ కా యి చేతిలో భారత ద్వయం 1–2 (10–11, 11–2, 10–11) స్కోరుతో ఓటమిని ఎదుర్కొంది. అయితే ఈ పోరు స్వల్ప వివాదంతో ముగిసింది. చెరో గేమ్ గెలిచిన తర్వాత మూడో గేమ్ కూడా హోరాహోరీగా సాగింది. 10–10తో స్కోరు సమంగా ఉన్న సమయంలో భారత్ పాయింట్ సాధించి సంబరాలు చేసుకుంది. అయితే భారత ద్వయం అరుస్తూ ప్రత్యర్థి ఏకాగ్రతను దెబ్బ తీశారంటూ రిఫరీ ఈ పాయింట్‌ను అనుమతించకుండా మళ్లీ ఆడించారు. ఈ సారి హాంకాంగ్‌ది పైచేయి కావడం జోష్నా–సెంథిల్ జోడి నిరాశగా వెనుదిరిగింది. నిజానికి 10–7తో ఆధిక్యంలో నిలిచిన భారత్ 3 మ్యాచ్ పాయింట్లు చేజార్చుకుంది. ఆసియా క్రీడల చరిత్రలో జోష్నాకు ఇది 6వ పతకం కావడం విశేషం. వరుసగా 2010, 2014, 2018, 2022, 2026లలో కలిపి ఆమె 2 రజతాలు, 4 కాంస్యాలు నెగ్గింది. సెంథిల్‌కు ఆసియా క్రీడల్లో ఇదే తొలి పతకం. -
ఇరాన్‌ను చిత్తు చేసిన భారత్.. ఆసియా గేమ్స్‌లో నాలుగో స్వర్ణం
ఆసియా గేమ్స్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం వచ్చి చేరింది. ఇప్పటికే మహిళల కబడ్డీ జట్టు స్వర్ణంతో మెరవగా, తాజాగా డిఫెండింగ్ చాంపియన్ భారత పురుషుల కబడ్డీ జట్టు కూడా పసిడి పతకం గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో భారత్ 40-34 తేడాతో ఇరాన్‌ను చిత్తు చేసి స్వర్ణం ఒడిసిపట్టింది. తొలి హాఫ్‌లో భారత్‌కు ఇరాన్ గట్టి పోటీనిచ్చింది. ఒక దశలో 18-17తో సమానంగా నిలిచాయి. అయితే రెండో సగంలో భారత రైడర్లు విజృంభించి వరుస టాకిల్ పాయింట్లతో భారత్ ఆధిక్యాన్ని అంతకంతకూ పెంచుకుంటూ పోయారు. ఆట చివరి నిమిషాల్లో కాస్త హైడ్రామా నెలకొంది. చివర్లో ఇరాన్ మరో 5 పాయింట్లు సాధించి ఆధిక్యాన్ని తగ్గించగలిగిందే కానీ భారత్ చేతిలో ఓటమి తప్పించుకోలేకపోయింది. పురుషుల కబడ్డీలో ఆసియా గేమ్స్‌లో భారత్ చాంపియన్స్‌గా నిలవడం ఇది వరుసగా తొమ్మిదో సారి కావడం విశేషం. 1990 నుంచి వరుసగా 9 సార్లు భారత పురుషుల కబడ్డీ జట్టు స్వర్ణ పతకాలు గెలుస్తూ వస్తోంది. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు ఇది నాలుగో స్వర్ణం కాగా, ఇప్పటివరకు 4 స్వర్ణాలు, 11 రజతాలు, 13 కాంస్యాలు కలిపి మొత్తం 28 పతకాలు సాధించింది. పతకాల పట్టికలో భారత్ ప్రస్తుతం పదో స్థానంలో కొనసాగుతోంది. అంతకముందు మహిళల కబడ్డీ జట్టు కూడా స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. హోరాహోరీగా సాగిన ఫైనల్లో భారత్ 37-34 తేడాతో ఇరాన్‌ను చిత్తు చేసింది.INDIA BEATS IRAN TWICE IN KABADDI FINALS AT ASIAN GAMES 2026! 🤩🔥- Indian Men’s Team win the Gold 🥇- Indian Women’s Team win the Gold 🥇BOTH TEAM SUCCESSFULLY DEFENDS TITLE! pic.twitter.com/l2O4aO4rqb— The Khel India (@TheKhelIndia) September 26, 2026 INDIAN MEN KABADDI AT ASIAN GAMES!1990 🥇1994 🥇1998 🥇2002🥇2006🥇2010 🥇2014 🥇2018 🥉2022 🥇2026 🥇INDIA ARE NOW 9 TIMES CHAMPIONS! 🏆 pic.twitter.com/zBFc99cMUl— The Khel India (@TheKhelIndia) September 26, 2026 India are Asian Games Kabaddi champions! 🇮🇳Indian men's Kabaddi team beats Iran 40-34 in a thriller to win record-extending ninth gold medal at Asian Games.2nd Gold of the day after Indian Women team hit the Golden glory 🫡🙌 pic.twitter.com/undO5ttwsJ— Megh Updates 🚨™ (@MeghUpdates) September 26, 2026ఇదీ చదవండి: కబడ్డీ బాటలోనే హాకీ జట్లు.. డబుల్ స్వర్ణాలపై గురి! -
బంతి అమెరికా కోర్టులో.. ఇరాన్ నెక్స్ట్ మూవ్ ఏంటి?
ఇరాన్–అమెరికా యుద్ధానికి తెరపడుతుందన్న ఆశలు మళ్లీ ఆవిరవుతున్నాయా? హర్ముజ్ జలసంధిని ఏడు రోజుల్లో తెరిచి.. యుద్ధాన్ని నిలిపివేసేందుకు ఇరాన్ ప్రతిపాదించిన ప్లాన్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించాడనే కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఇదే నిజమైతే.. ఇప్పుడు ఇరాన్ తదుపరి అడుగు ఏంటి? హర్ముజ్ పరిస్థితి ఎలా మారుతుంది? యుద్ధం మళ్లీ తీవ్ర రూపం దాల్చుతుందా?.. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వేదికగా ఇరాన్ తన ప్రతిపాదనను అమెరికా ముందుంచింది. ఖతార్ మధ్యవర్తిత్వంతో ఈ ప్రతిపాదనను వాషింగ్టన్కు పంపినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తెలిపారు. అమెరికా అంగీకరిస్తే ఏడు రోజుల కౌంట్‌డౌన్ మొదలై.. హర్ముజ్ జలసంధిలో సాధారణ నౌకాయానం పునరుద్ధరించవచ్చని చెప్పారు. అదే సమయంలో ప్రాంతీయంగా అన్ని రంగాల్లో పోరాటాన్ని నిలిపివేసి విస్తృత చర్చలకు వెళ్లొచ్చని ప్రతిపాదించారు.అయితే ఇందుకు ప్రతిగా అమెరికా ఇరాన్ పోర్టులపై దిగ్బంధాన్ని ఎత్తివేయాలని, స్తంభింపజేసిన ఇరాన్ నిధులను విడుదల చేయాలని, చమురు ఆంక్షలను తొలగించాలని ఇరాన్ కోరుతోంది. అణు కార్యక్రమంపై మాత్రం తమ హక్కుల్లో ఎలాంటి రాయితీ ఇవ్వబోమని ఇరాన్ వర్గాలు స్పష్టం చేశాయి. ముఖ్యంగా యురేనియం శుద్ధి విషయంలో రాజీ ఉండదని తెలిపాయి.ట్రంప్ తిరస్కరిస్తే.. తర్వాత?‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ కథనం ప్రకారం.. ఇరాన్ తన డిమాండ్లను అంగీకరిస్తుందన్న నమ్మకం ట్రంప్‌కు లేదని, తిరిగి బాంబుల దాడి చేసే అవకాశం ఉందని ఆయన తన సిబ్బందితో చెప్పినట్లు అమెరికా అధికారులు పేర్కొన్నారు. మరో నివేదిక ప్రకారం.. నవంబర్‌లో జరిగే అమెరికా మధ్యంతర ఎన్నికల తర్వాత బాంబుల దాడులు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశాన్ని ట్రంప్ అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. గతంలోనూ చర్చల ప్రయత్నాలు విఫలమై.. కొంతకాలం కాల్పుల విరమణ తర్వాత మళ్లీ దాడులు జరిగిన నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.హర్ముజ్ సంగతేంటి?ఇరాన్ ప్రతిపాదనలో కీలక అంశం హర్ముజ్ జలసంధి. ప్రపంచంలోని అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గాల్లో ఒకటైన ఈ జలసంధి ద్వారా రవాణా తీవ్రంగా దెబ్బతినడంతో ఇప్పటికే ప్రపంచ ఇంధన సరఫరాపై ప్రభావం పడింది. అమెరికా–ఇరాన్ మధ్య ఒప్పందం కుదరకపోతే హర్ముజ్ పరిస్థితి మరింత కాలం అనిశ్చితంగానే కొనసాగే అవకాశం ఉంది. ఇరాన్ మాత్రం అమెరికా తమపై సైనిక ఒత్తిడి తగ్గించి, పోర్టుల దిగ్బంధాన్ని ఎత్తివేస్తే ఏడు రోజుల్లో జలసంధిని తిరిగి తెరవడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతోంది. అంటే ఇప్పుడు బంతి అమెరికా కోర్టులోనే ఉందన్నది ఇరాన్ వాదన.ఇరాన్ ముందున్న దారులేంటి?అమెరికా తన ప్రతిపాదనను అంగీకరించకపోతే ఇరాన్ ముందున్న మార్గాలు ప్రధానంగా మూడు. మొదటిది.. దౌత్య మార్గాన్ని కొనసాగిస్తూ ఖతార్, ఒమన్ వంటి మధ్యవర్తుల ద్వారా చర్చలను ముందుకు తీసుకెళ్లడం. రెండోది.. హర్ముజ్ జలసంధిపై తన నియంత్రణను కొనసాగిస్తూ అమెరికాపై ఒత్తిడి పెంచడం. అయితే ఇది ప్రపంచ ఇంధన సరఫరాపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఇరాన్‌కూ ఆర్థిక, దౌత్యపరమైన ఒత్తిళ్లు పెరగొచ్చు. మూడోది.. అమెరికా సైనిక చర్యలకు ప్రతిస్పందిస్తూ ప్రాంతీయంగా తన మిత్ర బలగాల ద్వారా ఒత్తిడి పెంచడం. కానీ ఈ మార్గం యుద్ధం మరింత విస్తరించే ప్రమాదాన్ని పెంచుతుంది. మరోవైపు ఏడు రోజుల ప్రతిపాదనను ముందుకు తెచ్చిన ఇరాన్.. హర్ముజ్‌ను తిరిగి తెరవడం, కాల్పుల విరమణ, తదుపరి అణు చర్చలను ఒకే ప్యాకేజీగా మలచాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. అందువల్ల అమెరికా స్పందన ఆధారంగా ఈ మూడు మార్గాల్లో ఏది ముందుకు వస్తుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది.మరోవైపు సౌదీపై హౌతీల దాడులుఇదిలా ఉండగా.. ఇరాన్ మద్దతుగల యెమెన్ హౌతీలు సౌదీ అరేబియాపై దాడులు కొనసాగిస్తున్నారు. రియాద్ వైపు వచ్చిన రెండు డ్రోన్లను, ఖమీస్ ముషైత్ వైపు ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణిని అడ్డుకున్నట్లు సౌదీ నేతృత్వంలోని సంకీర్ణం తెలిపింది. ఈ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో సౌదీ అరేబియా భద్రతకు మద్దతుగా పాకిస్థాన్, టర్కీ రక్షణాధికారులు రియాద్‌లో సమావేశమై భద్రతా పరిస్థితిపై చర్చించారు.ఇరాన్ ప్రతిపాదనకు అమెరికా స్పందన ఎలా ఉండబోతోంది? ట్రంప్ వైఖరి నేపథ్యంలో హర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకుంటుందా? లేదంటే పశ్చిమాసియాలో పోరాటం మళ్లీ ముదురుతుందా? అన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. ఇరాన్ ఏడు రోజుల గడువుతో శాంతి ప్రతిపాదనను ముందుకు తెచ్చిన నేపథ్యంలో.. తదుపరి నిర్ణయం అమెరికా చేతుల్లోనే ఉందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.ఇదీ చదవండి: ట్రంపరితనంతో మళ్లీ బాంబుల మోతేనా? -
ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మరో గోల్డ్
ఏషియన్ గేమ్స్ 2026లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. మహిళల కబడ్డీలో భారత జట్టు గోల్డ్ మెడల్ సాధించింది. హోరాహోరీగా సాగిన ఫైనల్ భారత్ ఇరాన్‌ను 37-34తో ఓడించి, వరుసగా రెండో ఆసియా క్రీడల్లో ఛాంపియన్‌గా నిలిచింది.ఫైనల్లో భారత జట్టు తొలి అర్ధభాగంలో ఆధిపత్యం ప్రదర్శించింది. విరామ సమయానికి 22-16తో ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధభాగంలో ఇరాన్ గట్టిగా పోరాడింది. ఆ దశలో ఇరాన్ 18-15తో ఆధిక్యం సాధించినప్పటికీ.. తొలి అర్ధభాగంలో భారత్ సాధించిన ఆరు పాయింట్ల ఆధిక్యం కీలకంగా మారింది.చివరి నిమిషాల్లో ఇరాన్ వరుసగా పాయింట్లు సాధిస్తూ భారత్‌పై ఒత్తిడి పెంచింది. అయితే భారత డిఫెన్స్ కీలక సమయంలో పట్టు కోల్పోకుండా మ్యాచ్‌ను ముగించింది. చివరికి 37-34తో విజయం సాధించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది.ఈ విజయంతో ఆసియా క్రీడల మహిళల కబడ్డీలో భారత్ నాలుగో స్వర్ణ పతకం సాధించింది. 2018 జకార్తా ఆసియా గేమ్స్‌లో మాత్రమే భారత్ స్వర్ణాన్ని కోల్పోయింది. ఆ ఏడాది ఇరాన్ చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లోనూ భారత్ స్వర్ణం సాధించింది. తాజాగా ఇరాన్‌ను ఓడించి టైటిల్‌ను విజయవంతంగా నిలబెట్టుకుంది.విజయం అనంతరం భారత క్రీడాకారిణులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించి ‘వందే మాతరం’ నినాదాలతో సంబరాలు చేసుకున్నారు.కాగా, మహిళల కబడ్డీలో పతకంతో భారత్ ఖాతాలో మూడో స్వర్ణం, మొత్తంగా 27వ పతకం చేరింది. ప్రస్తుతం భారత్ పతకాల పట్టికలో 12వ స్థానంలో కొనసాగుతోంది. చైనా 169 పతకాలతో అగ్రస్థానంలో దూసుకుపోతుంది. ఇదీ చదవండి: ఏషియన్ గేమ్స్ క్వార్టర్ ఫైనల్లో టీమిండియా ప్రత్యర్ది ఖరారు -
ఇరాన్ బిగ్ ఆఫర్.. నో చెప్పి షాకిచ్చిన ట్రంప్!
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధానికి తెరదించేలా ఇరాన్ చేసిన కీలక ప్రతిపాదనకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించలేదని ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. ఏడు రోజుల్లో హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం, కాల్పుల విరమణకు వెళ్లడం వంటి ప్రతిపాదనను ఇరాన్ అమెరికా ముందు ఉంచగా.. ట్రంప్ దాన్ని తిరస్కరించినట్లు అమెరికా అధికారులను ఉటంకిస్తూ కథనం వెల్లడించింది.ఇదే సమయంలో నవంబర్‌లో జరిగే అమెరికా మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్‌పై అమెరికా మళ్లీ బాంబు దాడులు ప్రారంభించే అవకాశం ఉందని ట్రంప్ తన సన్నిహితులకు చెప్పినట్లు సదరు కథనంలో నివేదించింది. అయితే ఇరాన్ ప్రతిపాదనపై అమెరికా నుంచి అధికారిక స్పందన ఇంకా వెలువడలేదని పేర్కొంది.ఇరాన్ ప్రతిపాదన ఏంటి?ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఈ ప్రతిపాదనను వెల్లడించారు. ఖతార్ మధ్యవర్తుల ద్వారా అమెరికాకు తమ ప్రతిపాదనను పంపినట్లు తెలిపారు. అమెరికా కొన్ని షరతులను అంగీకరిస్తే ఏడు రోజుల్లో హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచి, సాధారణ నౌకా రాకపోకలను పునరుద్ధరిస్తామని చెప్పారు. ఇరాన్ షరతుల్లో ప్రధానంగా అమెరికా నౌకాదళ దిగ్బంధాన్ని ఎత్తివేయడం, ఇరాన్ చమురు ఎగుమతులపై ఆంక్షలను సడలించడం, మధ్యప్రాచ్యవ్యాప్తంగా కాల్పుల విరమణ పాటించడం ఉన్నాయి. లెబనాన్‌లోనూ శత్రుత్వాన్ని నిలిపివేయాలని ఇరాన్ కోరింది. దీనికి ప్రతిగా హార్ముజ్‌ను తెరిచి, అమెరికాతో అణు కార్యక్రమంపై చర్చలను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమని చెప్పుకొచ్చారు.ట్రంప్ వైఖరి ఏంటి?ఇరాన్ ప్రతిపాదనతో దౌత్యపరమైన చర్చలకు అవకాశం కనిపించినప్పటికీ, ట్రంప్ మాత్రం ఒప్పందంపై అనుమానంతో ఉన్నట్లు వాల్‌స్ట్రీట్ కథనం పేర్కొంది. ఇరాన్ తన డిమాండ్లను పూర్తిగా అమలు చేస్తుందన్న నమ్మకం ట్రంప్‌కు లేదని అమెరికా అధికారులను ఉటంకించింది. మరోవైపు అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తుల ద్వారా సానుకూల, నిర్మాణాత్మక చర్చలు జరుగుతున్నాయని ఓ అమెరికా అధికారి రాయిటర్స్‌కు తెలిపారు. అందువల్ల ప్రస్తుతం పరిస్థితి ఒకవైపు ఇరాన్ ఏడు రోజుల్లో హార్ముజ్‌ను తెరిచే ప్రతిపాదన.. మరోవైపు ట్రంప్ దానిపై విముఖతగా కనిపిస్తోంది. ఇరాన్ మాత్రం అమెరికా అధికారిక స్పందన కోసం ఎదురుచూస్తోంది.ఇదీ చదవండి: భారత్‌కు పాక్ ప్రధాని సంచలన హెచ్చరిక -
షరతులకు అంగీకరిస్తేనే.. హార్మూజ్‌ను తెరుస్తాం
దుబాయ్: తమ షరతులకు అమెరికా ఒప్పుకుంటే హార్మూజ్ జలసంధిని తెరవడానికి అభ్యంతరం లేదని ఇరాన్ స్పష్టంచేసింది. జలసంధిలో అమెరికా నౌకా దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని, తమ చమురు అమ్మకాలపై ఆంక్షలను రద్దు చేయాలని, లెబనాన్‌లో సైతం కాల్పుల విరమణ పాటించాలని తేల్చిచెప్పింది. అలా చేస్తే ఏడు రోజుల్లో హార్మూజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తామని వెల్లడించింది. అలాగే తమ అణు కార్యక్రమంపై చర్చలను పునఃప్రారంభించడానికి ముందుకొచి్చంది. న్యూయార్క్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గురువారం జరిగిన ఒక ప్రైవేట్ సమావేశంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఈ ప్రతిపాదనకు సంబంధించిన వివరాలను వెల్లడించినట్లు తెలిసింది. ఈ సమావేశానికి హాజరైన క్విన్సీ ఇన్స్టిట్యూట్ థింక్ ట్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ట్రిటా పార్సీ మాట్లాడుతూ.. నవంబర్‌లో జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికలకు ముందు ఇరాన్‌తో త్వరితగతిన ఒప్పందం కుదరడం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సహాయపడుతుందని అరాగ్చీ అభిప్రాయపడినట్లు తెలిపారు. అరాగ్చీ తాజా ప్రతిపాదనపై ఇరాన్ ఐరాస మిషన్ గానీ, ఇతర ఇరాన్ అధికారులు గానీ ఇంకా స్పందించలేదు. అయితే, ఈ రాజీ మార్గాలను ఇరాన్ భద్రతా దళాలపై పట్టు కలిగిన పిడివాదులు అంగీకరిస్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా, శుక్రవారం ఉదయం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఖతార్ ప్రధానమంత్రికి ఆతిథ్యం ఇచ్చారు. తాజాగా ఐక్యరాజ్యసమితి వేదికగా ఇరాన్, అమెరికా మధ్య జరిగిన పరోక్ష చర్చల సమయంలో ఖతార్ కీలక మధ్యవర్తిగా వ్యవహరించింది. మరోవైపు ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడానికి తాము తొందరపడడం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంకేతాలిస్తుండడం గమనార్హం. -
ఇంకా ప్రపంచానిది ఆటవిక న్యాయమేనా?
ఐక్యరాజ్య సమితి (ఐరాస) సర్వ ప్రతి నిధి సభలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సెప్టెంబర్ 22న ఒక సంచలన ప్రకటన చేశారు. ఆ వేదికపై సాగే ప్రసంగాల ప్రమాణాల ప్రకారం చూసినా కూడా అది అసాధారణమైనదే. ఇరాన్‌తో ఫిబ్రవరిలో మొదలైన యుద్ధం గురించి అందరూ అనుకున్నట్లు గానే ఆయన ప్రస్తావించారు. ఒప్పందం కుదుర్చుకుంటే పునర్నిర్మాణానికి తెహ్రాన్‌కు అవకాశం చిక్కుతుంది; లేకపోతే ‘నన్ను ఇరాన్‌ను సర్వనాశనం చేయమంటారా? ప్రజల ప్రాణాలు హరించే, దేశాలను ధ్వంసం చేసే అవకాశం దానికి ఎన్న టికీ ఇవ్వకుండా వేగంగా ఆ పనిని పూర్తి చేసేయమంటారా?’ అని ట్రంప్ ప్రశ్నించారు. ‘బతికి బట్ట కట్టనివ్వకుండా దాన్ని నరకంలోని నెట్టేయమంటారా?’ అని కూడా హూంకరించారు. ‘అణ్వస్త్రం’ అనే మాటను ట్రంప్ నేరుగా చెప్పకపోయి ఉండవచ్చుకానీ, ఇరాన్‌ను రూపుమాపుతామని ఆయన చేసిన హెచ్చరిక అసాధారణమైంది. ఇరాన్ తప్పించి, మరి ఏ ఇతర దేశమూ ఇవెక్కడి అనాగరికపు మాటలని ప్రశ్నించకపోవడం మరింత నిర్ఘాంతపరచేదిగా ఉంది. ఆఫ్రికాకు ఇప్పటికీ స్థానం లేదా?ట్రంప్ హెచ్చరిక శూన్యంలోంచి పుట్టుకొచ్చింది కాదు. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెరెస్ తన ప్రసంగంలో ఈ చర్చకు తెర లేపారు. దీన్ని ఆయన కడపటి ఉన్నత స్థాయి ప్రసంగంగా చెప్పుకోవచ్చు. ఆయన రెండవ విడత పదవీ కాలం ఈ డిసెంబర్ 31తో ముగుస్తోంది. ఆయన వాషింగ్టన్ పేరును నేరుగా ప్రస్తా వించలేదుకానీ, ‘మన ప్రపంచంలో అభిప్రాయభేదాలు తీవ్రతర మవుతున్నాయి. బీటలు అగాథంగా పరిణమిస్తున్నాయి’ అని అన్నారు. ప్రపంచం పాలనా వ్యవస్థలు ఇప్పటికీ ‘బలాధిక్య వాస్తవి తకతలను, చాలావరకు గతించిన శకానికి చెందిన ప్రయోజనాలను ప్రతిబింబిస్తున్నాయి’ అని వ్యాఖ్యానించారు. భద్రతా మండలిలో సంస్కరణలు తప్పనిసరిగా తేవాలనీ, అది ఏ ప్రపంచాన్ని శాసించాలనుకుంటోందో, దానికి తగ్గ రూపంలో ఎంతమాత్రం లేదనీ కూడా కుండ బద్దలుకొట్టారు. ఆయన సునిశితమైన రీతిలో లేవ నెత్తిని సంస్థాగత అంశానికి కరతాళ ధ్వనులతో ప్రతిస్పందన లభించింది. ‘ఆఫ్రికాయే ఇందుకు తిరుగులేని ఉదాహరణ. ఐరాస ఏర్పడి నపుడు, ఆఫ్రికాలో చాలాభాగం వలస పాలనలో ఉంది. ఆఫ్రికాకు నేటికీ మండలిలో శాశ్వత ప్రాతినిధ్యం లేదు. ఆఫ్రికాకు శాశ్వత స్థానాలు లేకుండా 21వ శతాబ్దపు భద్రతా మండలి కొనసాగడం అసమంజసం, నిర్హేతుకం’ అని ఆయన అన్నారు. ఐరాసను ‘గొప్ప, గొప్ప సామర్థ్యం’ ఉన్న సంస్థగా ట్రంప్ అభివర్ణించారు. ‘గ్లోబలిస్టు బ్యురోక్రాట్ల తీవ్ర వామపక్ష అజెండాను రుద్దే పనిని’ అది మానుకోవాలని అన్నారు. గాజా ప్రణాళిక–శాంతి బోర్డునకు ఆమోదం తెలిపినందుకు భద్రతా మండలికి కృతజ్ఞతలు తెలిపారు. అంతవరకు ఆయన ఐరాస స్థానంలో ఈ బోర్డు ‘పనిచేస్తే చేయవచ్చనే’ ధోరణిని ప్రధర్శించారు.ఫ్రాన్స్ సముచిత వైఖరిఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ పదవీకాలం 2027తో ముగుస్తుంది కనుక, ఈ తడవ మాక్రాన్ చేసిన ప్రసంగాన్ని ఆయన చివరి ఐరాస సర్వ ప్రతినిధి సభ ప్రసంగంగా భావించాలి. ఆయన హార్మూజ్ పైకన్నా గాజాపై ఎక్కువ దృష్టి పెట్టారు. ‘ఏదో శాంతి కుదిర్చినట్లుగా కొందరు డప్పు కొట్టుకుంటున్నారు. కానీ, ఆ శాంతి ఒక్క క్షణం కూడా మానవతావాద సాయం అందేందుకు తలుపులు తెరిచింది లేదు’ అని ట్రంప్ పేరును నేరుగా ప్రస్తావించ కుండానే చురకలంటించారు. దేశాలు ‘ఆటవిక న్యాయానికి తిరిగి వెళ్ళాలని కోరుకుంటున్నాయా లేక నాగరిక అంతర్జాతీయ సమాజం దిశగానా?’ అని అడిగారు. ఇజ్రాయెల్ భద్రతను ఒక సాకుగా చేసు కుని, పొరుగు దేశాల సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించేందుకు దాన్ని ఒక ‘లైసెన్సు’గా మలచుకోవడం ‘వినాశకర’ తప్పిదమవు తుందని ఆయన అన్నారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న దేశంగా ఫ్రాన్స్ బహుళపక్షీయతకు, మానవతా కారిడార్లకుఎంతో అవసరమైన మద్దతును అలా వ్యక్తపరచిందని చెప్పవచ్చు. శాశ్వత సభ్యత్వం ఉన్న మిగిలిన దేశాల నుంచి స్పందన ఒకే రీతిగాకన్నా అసంపూర్ణంగా ఉందనే భావించాలి. ఇజ్రాయెల్– పాలస్తీనా రెండు దేశాలుగా ఉండాలనే పరిష్కారానికి మద్దతును బ్రిటన్ ప్రధాని ఆండీ బర్న్‌హామ్ పునరుద్ఘాటించారు. చైనా అధ్య క్షుడు షీ జిన్‌పింగ్ సెప్టెంబర్ 24న శ్వేత సౌధంలో శిఖరాగ్ర సమా వేశం ఉన్న దృష్ట్యా సర్వ ప్రతినిధి సభకు హాజరు కాలేదు. జిన్‌పింగ్ బదులు చైనా ఉపాధ్యక్షుడు హ్యాన్ జెంగ్ హాజరయ్యారు. ఇరాన్ లేదా గాజాల పేరును నేరుగా ప్రస్తావించకుండా, నిర్నిరోధ బల ప్రయోగాన్ని చైనా వ్యతిరేకించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఈ సమావేశాలకు హాజరు కాలేదు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవరోవ్ ఆ దేశ ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తూ, ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా విరామం ఇవ్వదలచు కోలేదని స్పష్టం చేశారు. చర్చలకు సిద్ధమేనంటూ, ఇతర మార్గాల ద్వారా యుద్ధం కొనసాగుతుందని తేల్చేశారు.ఇండియా ఆచితూచి...భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న ఐదు దేశాలు(పీ5) ఒకే వైఖరితో లేవని తేటతెల్లమైంది. భారతదేశానికి భద్రతా మండ లిలో శాశ్వత సభ్యత్వం లేదు. వీటో చేయగలిగిన అధికారం చలా యించగలిగినదిగా మండలిలో సభ్యత్వం చేజిక్కించుకోవాలని భారత్ ఉబలాటపడుతోంది. జిన్‌పింగ్, పుతిన్ మాదిరిగానే ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ సమావేశాలకు హాజరు కాలేదు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ భారత ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించారు. ‘సంస్కరణాయుత బహుళ పక్ష వాదానికి’ జై శంకర్ పిలుపునిచ్చారు. బడుగు దేశాలు వాటి ప్రమేయం లేని, అవి ఏ పాపం ఎరుగని సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయని ఆయన వాదించారు. పశ్చిమాసియాలో సాగర మార్గాలకు భద్రత కల్పించా లనీ, అంతర్జాతీయ చట్టాలను పాటించాలనీ కోరారు. ఇరాన్‌ను ‘రూపుమాపుతా’మని వచ్చిన హెచ్చరికపై భారత్ ఎలాంటి వ్యాఖ్యా చేయలేదు. అమెరికా, రష్యా, ఇరాన్‌లతో సంబంధాలను కాపాడుకుంటోంది. అమెరికావి అనాగరికపు మాటలని అన లేదు. ఐరాస భద్రతా మండలిని సంస్కరించాలని కోరింది. సభ్యత్వం పొందేందుకు భారత్‌కు ఉన్న హక్కును చాటుకుంది. పాలస్తీనా ఓట్లు, ఇంధన భద్రత, శక్తిమంతమైన దేశాల నుంచి దెబ్బ తినకుండా కంచె ఏర్పరుచుకోవడం అనే అంశాలను భారత్ ఏనాటి నుంచో మిళితం చేసుకుంటూ వస్తోంది. ఇపుడు అమెరికా నుంచిరెండవ విడత సుంకాల విధింపు బెడద నేపథ్యంలో, ఐరాస 81వ సర్వ ప్రతినిధి సభ సమావేశాల్లోనూ అదే వైఖరిని కొనసాగించింది. విభేదాల బదులు పరస్పరం ఆధారపడటం నేర్చుకోండని గుటెరస్ కోరారు. లొంగదీసుకునేందుకు ఒక మార్గంగా విధ్వంసాన్ని ట్రంప్ ఎంచుకున్నారు. తుది గడువును ఆయనే విధిస్తు న్నారు. ఓ మోస్తరు శక్తి కలిగిన దేశాలు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోరుకుంటున్నాయికానీ, నియమ నిబంధనలను పాటించి తీరాలనీ, అంతర్జాతీయ సూత్రాలకు కట్టుబడి ఉండాలనీ ధైర్యంగా చెప్పలేకపోతున్నాయి. హాజరు పట్టీలకు పరిమితమైతే ప్రయోజనం ఏముంది? ఈ సమస్య భారతదేశానిది మాత్రమే కాదు. ఐరాస ఎదుర్కొంటున్న, ఇంకా జవాబు దొరకని ప్రశ్న.-వ్యాసకర్త ‘సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్’ డైరెక్టర్, న్యూఢిల్లీ- సి. ఉదయ్ భాస్కర్ -
ఇరాన్లో అరాచకం.. అంత పెద్ద శిక్ష ఎందుకు?
ఒకే ఇంట్లో పుట్టారు.. కలిసి పెరిగారు.. కలిసి చదువుకున్నారు.. కానీ ఇప్పుడు ఇద్దరి భవిష్యత్తూ జైలు గోడల మధ్యే! 19 ఏళ్ల కవల సోదరీమణులు టరానెహ్, రొమినా రహిమీ.. ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్నారనే ఆరోపణలతో అరెస్టయ్యారు. నాలుగు నెలల పాటు ఆచూకీ కోసం వారి తల్లి.. ఆస్పత్రులు, కోర్టులు, జైళ్ల చుట్టూ తిరిగింది. చివరకు జైలులో కూతుళ్లను చూసిన ఆమె.. ముఖాలు వాచిపోయి, శరీరాలపై గాయాలతో ఉన్న వారిని చూసి షాక్‌కు గురైంది. ఇప్పుడు టరానెహ్కు మరణశిక్ష, రొమినాకు 27 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు కుటుంబం చెబుతోంది. ఒక కూతురిని ఉరితాడి నుంచి కాపాడేందుకు.. ఆ తల్లి ఇప్పుడు ఐక్యరాజ్యసమితి తలుపు తట్టింది.వివరాల మేరకు.. ఇరాన్‌లోని ఇస్ఫహాన్‌లో జనవరిలో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో టరానెహ్, రొమినా పాల్గొన్నారని వారి కుటుంబం తెలిపింది. జనవరి 8, 9 తేదీల్లో షోహదా స్క్వేర్ ప్రాంతంలో జరిగిన ఆందోళనల్లో వారు నినాదాలు చేశారని బంధువులు చెప్పారు. ఆ తర్వాత ముసుగులు ధరించిన వ్యక్తులు ఇంట్లోకి వచ్చి ఇద్దరు సోదరీమణులను తీసుకెళ్లారని కుటుంబం ఆరోపించింది. వారి తలలకు సంచులు కప్పి తీసుకెళ్లారని, వారు ఎక్కడ ఉన్నారో కుటుంబానికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఆ వ్యక్తులు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సభ్యులని తర్వాత గుర్తించినట్లు కుటుంబం పేర్కొంది.కూతుళ్లు ఎక్కడున్నారో తెలియక వారి తల్లి మార్జీహ్ నౌర్మొహమ్మది ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టులు, జైళ్ల చుట్టూ తిరిగారు. దాదాపు నాలుగు నెలల తర్వాత కుటుంబానికి ఫోన్ వచ్చింది. తమ కూతుళ్లు జైలులో ఉన్నారని, వచ్చి కలవాలని చెప్పినట్లు బంధువు మసూద్ నౌర్మొహమ్మది వెల్లడించారు.కూతుళ్లను చూసి షాక్మేలో ఇస్ఫహాన్‌లోని దౌలతాబాద్ జైలులో తల్లికి కూతుళ్లను చూసేందుకు అనుమతి లభించింది. అయితే అక్కడ కనిపించిన తమ పిల్లలను చూసి ఆమె షాక్‌కు గురయ్యారని కుటుంబం తెలిపింది. ముఖాలు వాచిపోయి, శరీరాలపై గాయాలు కనిపించాయని.. చేతులు, మోచేతులు, కాళ్లకు గాయాలున్నాయని కుటుంబం ఆరోపించింది. జైలులో సిబ్బంది తమను ఒక సెల్ నుంచి మరో సెల్‌కు జుట్టు పట్టుకుని లాగేవారని సోదరీమణులు చెప్పినట్లు బంధువు తెలిపారు.ఒకరికి ఉరి.. మరొకరికి 27 ఏళ్ల జైలుజనవరి నిరసనలకు సంబంధించిన కేసులో మొత్తం 16 మందిని అరెస్టు చేసినట్లు బాధిత కుటుంబం తెలిపింది. వారిపై మోలోటోవ్ కాక్టెయిల్స్ తయారు చేయడం, భద్రతా బలగాలపై దాడులకు పాల్పడటం వంటి ఆరోపణలు నమోదయ్యాయి. మొహరెబెహ్ అంటే ‘దేవుడిపై యుద్ధం’ అనే అభియోగం కూడా మోపినట్లు కథనం పేర్కొంది. ఇరాన్లో ఇది మరణశిక్షకు దారితీసే నేరంగా పరిగణించబడుతుంది. అయితే తమ కూతుళ్లు ఎలాంటి హింసకు పాల్పడలేదని కుటుంబం చెబుతోంది. జూలైలో ఇస్ఫహాన్ జైలులో ఏర్పాటు చేసిన కోర్టులో సోదరీమణులను హాజరుపరిచారని, ఆగస్టు చివర్లో టరానెహ్కు మరో తొమ్మిది మందితో కలిసి మరణశిక్ష విధించినట్లు కుటుంబం తెలిపింది. రొమినాకు 27 ఏళ్ల జైలు శిక్ష పడినట్లు పేర్కొంది.شنق بعد اغتصاب!.. هذه قصة الفتاة الإيرانية ترانه رحيمي التي انتزعت منها اعترافات إعدامها تحت تهديد الاغتصاب#ترانه_رحيمي #رومينا_رحيمي #إيران #أصفهان #احتجاجات_إيران pic.twitter.com/IZMuuwJ7wl— blinx (@BlinxNow) September 18, 2026ఇదిలా ఉండగా.. అరెస్టు తర్వాత వారిద్దరినీ వేర్వేరు గదుల్లో నిర్బంధించారని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. అయినప్పటికీ ఒకరి అరుపులు మరొకరికి వినిపించేలా ఉండేవని తెలిపింది. తీవ్రంగా కొట్టడం, మానసిక వేధింపులు, లైంగిక వేధింపులకు గురిచేశారని కుటుంబ సభ్యులు, కేసుతో సంబంధం ఉన్న న్యాయవాదులు ఆరోపించినట్లు కథనం పేర్కొంది.ఐక్యరాజ్యసమితికి కుటుంబం..టరానెహ్ మరణశిక్షను నిలిపివేసేందుకు, రొమినాకు న్యాయపరమైన రక్షణ కల్పించేందుకు కుటుంబం అంతర్జాతీయ జోక్యాన్ని కోరుతోంది. బ్రిటన్‌కు చెందిన మానవ హక్కుల న్యాయవాదుల ద్వారా ఐక్యరాజ్యసమితి ప్రత్యేక విధానాల కింద కేసుకు సంబంధించిన సమాచారాన్ని సమర్పించినట్లు కథనం తెలిపింది. ఇక, టరానెహ్ గుర్రాలపై ఆసక్తి ఉన్న క్రీడాకారిణి కాగా.. రొమినా స్వతంత్ర భావాలు కలిగిన యువతిగా కుటుంబం వివరించింది. నిరసనలకు ముందు ఇద్దరూ షోహదా స్క్వేర్ సమీపంలోని ఓ షూ దుకాణంలో పార్ట్‌టైమ్‌గా పనిచేసేవారని తెలిపింది.ఇదీ చదవండి: బీచ్‌లో అమ్మాయిలతో అదేం పని.. వీడియో వైరల్ -
హార్ముజ్ కోసం ట్రంప్–ఇరాన్ కీలక బేరం!
అమెరికా–ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలకు తెరదించే దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల నేపథ్యంలో ఇరు దేశాల ప్రతినిధులు దశలవారీ ఒప్పందంపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా అమెరికా ఇరాన్‌పై విధించిన ఆర్థిక దిగ్బంధనాన్ని సడలిస్తే.. ఇరాన్ వ్యూహాత్మకమైన హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఇన్నాళ్లూ కత్తులు దూసుకున్న అమెరికా–ఇరాన్ ఇప్పుడు ఒకే టేబుల్ వద్దకు వచ్చాయి. యుద్ధాన్ని ఆపేందుకు జరుగుతున్న చర్చల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. ఇరు దేశాల చేతుల్లో ఉన్న రెండు బలమైన అస్త్రాలే ఇప్పుడు బేరసారాలకు వచ్చాయి. ఒకటి అమెరికా ఆంక్షలు.. మరొకటి ఇరాన్ చేతిలో ఉన్న హార్ముజ్ జలసంధి!ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ప్రధాన బేరసారాల అంశంగా మారింది. హార్ముజ్ ద్వారా నౌకల రాకపోకలు స్వేచ్ఛగా సాగాలని అమెరికా కోరుతోంది. మరోవైపు తమ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తున్న అమెరికా ఆంక్షలు, దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. స్తంభించిన పరిస్థితిని దశలవారీగా పరిష్కరించడమే సాధ్యమైన మార్గమని ఇరాన్‌కు చెందిన సీనియర్ అధికారి పేర్కొన్నట్లు ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది.ప్రతిపాదిత ఒప్పందంలో తొలి దశగా ట్రంప్ ప్రభుత్వం ఇరాన్‌పై విధించిన ఆర్థిక దిగ్బంధనాన్ని ఎత్తివేయడం, దానికి ప్రతిగా టెహ్రాన్ హార్ముజ్ మీదుగా నౌకల రాకపోకలను పునరుద్ధరించడం ఉండొచ్చని ఆ కథనం తెలిపింది. అంతేకాకుండా విదేశాల్లో ఫ్రీజ్ చేసిన ఇరాన్ ఆస్తులను మోక్షం కల్పించే అంశాన్ని కూడా టెహ్రాన్ కోరవచ్చని తెలుస్తోంది.ట్రంప్ ప్రభుత్వం ఆర్థిక ఒత్తిడిని తగ్గిస్తే.. ఇరాన్ ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన జలమార్గాన్ని తెరవాలన్నది ప్రతిపాదన. అయితే ఇది తుది శాంతి ఒప్పందం కాకపోవచ్చని, గత జూలైలో కుదిరిన అవగాహన విఫలమైన నేపథ్యంలో ఈసారి ఇరు దేశాల రాయితీలు ఎంతకాలం అమల్లో ఉంటాయన్నదే కీలకమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.హార్ముజ్ తెరవడానికి ఇరాన్ రెడీ.. కానీ!అమెరికా సైనిక ఒత్తిడిని తగ్గించి, ఇరాన్ నౌకాశ్రయాలపై దిగ్బంధనాన్ని ఎత్తివేస్తే వారం రోజుల్లోనే హార్ముజ్‌ను తిరిగి తెరవడానికి సిద్ధంగా ఉందట. ఈ ప్రతిపాదనను మధ్యవర్తుల ద్వారా సెప్టెంబర్ 16న ట్రంప్ ప్రభుత్వానికి చేరవేసినట్లు తెలుస్తోంది. అయితే అసలు చిక్కు ఇక్కడే ఉంది.తమ వద్ద ఉన్న బలమైన బేరసారాల అస్త్రాన్ని ముందుగా వదులుకోవడానికి ట్రంప్ ప్రభుత్వం, ఇరాన్ రెండూ సిద్ధంగా లేవు. అమెరికా వద్ద ఆర్థిక ఆంక్షలు, దిగ్బంధనం ప్రధాన ఒత్తిడి సాధనాలైతే.. ఇరాన్ చేతిలో హార్ముజ్ జలసంధి ఉంది. దీంతో ఎవరు ముందుగా మెట్టు దిగాలన్నదే చర్చల్లో కీలకంగా మారింది.ట్రంప్ ఒత్తిడి.. ఇరాన్ ప్రతిఘటనట్రంప్ ప్రభుత్వం మాత్రం టెహ్రాన్‌పై ఒత్తిడి తగ్గించే సంకేతాలు ఇవ్వడం లేదు. ఇరాన్ చమురు ఎగుమతులను దెబ్బతీసే ఆంక్షలకు తోడు ఈ నెలలో ఆ దేశ వాణిజ్య విమానయాన సంస్థలు, వాటి సహాయక నెట్‌వర్క్‌లపైనా అమెరికా చర్యలు తీసుకుంది. ఒప్పందానికి రాకపోతే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ మరింత క్షీణిస్తుందని ట్రంప్ హెచ్చరించారు.మరోవైపు ఇరాన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. అమెరికా తమపై విధించిన ఆర్థిక, సైనిక ఒత్తిడిని ముందుగా తగ్గించాలని టెహ్రాన్ కోరుతోంది. ‘‘మా వేళ్లు ట్రిగ్గర్‌పైనే ఉన్నాయి’’ అని పదే పదే చెబుతూ వస్తుండడం.. పరిస్థితి ఎంత సున్నితంగా ఉందో వెల్లడిస్తోంది.ట్రాన్సిట్ ఫీజుపై ఇరాన్ మెట్టు దిగుతుందా?హార్ముజ్ మీదుగా వెళ్లే నౌకల నుంచి ట్రాన్సిట్ ఫీజు వసూలు చేయాలన్న తన డిమాండ్‌ను ప్రధాన ఒప్పందం నుంచి పక్కన పెట్టేందుకు ఇరాన్ సిద్ధంగా ఉన్నట్లు ప్రాంతీయ వర్గాలు చెబుతున్నాయి. ఆ అంశాన్ని ప్రత్యేక అనుబంధంలో చేర్చే అవకాశం ఉందని సమాచారం. గల్ఫ్ దేశాలు మాత్రం ఇలాంటి రుసుముల చెల్లింపును వ్యతిరేకిస్తున్నాయి.అయితే ఫీజు అంశాన్ని పక్కన పెట్టడం అంటే.. హార్ముజ్‌పై తన నియంత్రణను ఇరాన్ వదులుకున్నట్లు కాదని సంబంధిత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ప్రధాన డీల్‌లో మాత్రం ముందుగా హార్ముజ్ రాకపోకలను పునరుద్ధరించడంపైనే దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తోంది.ఎన్నికల తర్వాతే డీల్?అమెరికా మధ్యంతర ఎన్నికలు నవంబర్ 3న జరగనున్నాయి. ఈ ఎన్నికల తర్వాత అమెరికా–ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ట్రంప్ ఇప్పటికే చెప్పారు. అయితే న్యూయార్క్‌లో ఇప్పుడు చర్చలు మళ్లీ వేగం పుంజుకోవడంతో.. ఎన్నికలకు ముందే ఏదైనా తాత్కాలిక అవగాహన కుదురుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.ఇరాన్ మాత్రం తమ డిమాండ్ల జాబితా చాలా పెద్దదేనని సంకేతాలిస్తోంది. దీంతో ట్రంప్ ప్రభుత్వం ఎంత మేరకు ఆర్థిక ఆంక్షలను సడలిస్తుంది? దానికి ప్రతిగా ఇరాన్ హార్ముజ్‌పై ఎలాంటి హామీ ఇస్తుంది? అన్నదే కీలకంగా మారింది.గల్ఫ్ దేశాలకూ టెన్షన్అమెరికా–ఇరాన్ చర్చలను గల్ఫ్ దేశాలు కూడా నిశితంగా గమనిస్తున్నాయి. హార్ముజ్‌పై ఇరాన్‌కు శాశ్వత నియంత్రణ కల్పించే ఏ ఒప్పందాన్నైనా అవి వ్యతిరేకిస్తున్నాయి. అదే సమయంలో యుద్ధం మరింత విస్తరించకుండా ఉద్రిక్తతలు తగ్గాలని కోరుకుంటున్నాయి. ఎందుకంటే హార్ముజ్ కేవలం ఇరాన్–అమెరికా మధ్య బేరసారాల అంశం కాదు. ప్రపంచ ఇంధన రవాణాకు ఇది అత్యంత కీలకమైన మార్గం. ఈ జలసంధిలో నౌకల రాకపోకలు సాధారణ స్థితికి వస్తే అంతర్జాతీయ చమురు సరఫరాపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే ట్రంప్–ఇరాన్ చర్చల్లో ఏ చిన్న పురోగతినైనా గల్ఫ్ దేశాలు, ఇంధన మార్కెట్లు నిశితంగా గమనిస్తున్నాయి.ఇదీ చదవండి: మీకు దణ్ణం పెడతాం.. ఏఐని ఆపండి -
భారత సముద్ర మార్గం నుంచి అమెరికాపై దాడులు చేస్తాం : ఇరాన్
వాషింగ్టన్: అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న సైనిక ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను ఉద్దేశించి చేసిన హెచ్చరికలపై ఆ దేశం తీవ్రంగా స్పందించింది. అమెరికా తమపై మళ్లీ దాడులకు దిగితే, ఈ యుద్ధాన్ని హిందూ మహాసముద్రం వరకు విస్తరిస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ సీనియర్ సలహాదారు యాహ్యా రహీమ్ సఫావీ హెచ్చరించారు.ఇరాన్‌ను నామరూపాలు లేకుండా ధ్వంసం చేస్తామని ట్రంప్ చేసిన ఘాటు వ్యాఖ్యలకు బదులుగా.. ఇరాన్ తన సైనిక వ్యూహాలను మార్చుకుంటున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు పర్షియన్ గల్ఫ్, ఎర్రసముద్రంలోని హర్మూజ్ జలసంధి వరకే పరిమితమైన దాడులు.. భవిష్యత్తులో అమెరికా స్థావరాలు, యుద్ధనౌకలను లక్ష్యంగా చేసుకుని హిందూ మహాసముద్రం నుంచి తిప్పికొడతామని సఫావీ పేర్కొన్నట్లు ఇరాన్‌కు చెందిన ఫార్ న్యూస్ ఏజెన్సీ ప్రసారం చేసింది. అమెరికా కవ్వింపు చర్యలు, ఆర్థిక ఆంక్షలు, నౌకాశ్రయాల దిగ్బంధాన్ని తిప్పికొట్టేందుకే ఈ వ్యూహాత్మక మార్పు చేస్తున్నట్లు ఇరాన్ ఐఆర్జీసీ స్పష్టం చేసింది.భారత సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతలు సఫావీ హెచ్చరికలతో గల్ఫ్ ఆఫ్ ఓమన్, పర్షియన్ గల్ఫ్‌తో పాటు భారత సముద్ర భూభాగమైన హిందూ మహాసముద్ర ప్రాంతంలోనూ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఐరోపాను ఆసియాతో కలిపే బాబ్ అల్-మండెబ్ జలసంధి, ఎర్రసముద్రం, గల్ఫ్ ఆఫ్ ఆడెన్ తదితర సముద్ర రవాణా మార్గాల్లో నెలకొన్న ఈ ఘర్షణ వాతావరణం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది.భారత్‌పై ప్రభావం - దౌత్య యత్నాలు ఈ ప్రాంతంలో యుద్ధ వాతావరణం ఏర్పడితే భారత్ యొక్క ముడిచమురు దిగుమతులు, సముద్ర వాణిజ్య మార్గాలు తీవ్రంగా దెబ్బతింటాయి. వాణిజ్య నౌకలపై దాడులను తీవ్రంగా ఖండించిన భారత్.. అంతర్జాతీయ జలాల్లో రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, దౌత్య మార్గాల ద్వారానే శాంతిని పునరుద్ధరించాలని పిలుపునిచ్చింది. మరోవైపు, ఇరాన్ బహిరంగంగా తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ.. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలను తగ్గించేందుకు న్యూయార్క్‌లో అమెరికా-ఇరాన్ ప్రతినిధుల మధ్య తెరవెనుక చర్చలు కూడా కొనసాగుతుండటం గమనార్హం. -
అమెరికాకు లొంగే ప్రసక్తే లేదు!
ఐక్యరాజ్యసమితి: అమెరికాతో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ ఎట్టిపరిస్థితుల్లోనూ లొంగిపోదని, ఎవరికీ తలవంచే ప్రసక్తే లేదని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తేల్చిచెప్పారు. సంఘర్షణను ముగించడానికి దౌత్యమే ఏకైక మార్గమని స్పష్టంచేశారు. దాడులకు ప్రతిస్పందించే హక్కు ఇరాన్‌కు ఉందన్నారు. తమ చట్టబద్ధమైన హక్కులను ఎందుకు వదులుకోవాలని ప్రశ్నించారు. శాంతియుత అణు సాంకేతికతను పొందడం ఇరాన్ హక్కు అని ఉద్ఘాటించారు. పౌర వినియోగ అణు కార్యకలాపాలకు, అణ్వాయుధాల తయారీకి మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉందన్నారు. శాంతియుత అణు సాంకేతికతపై ఆంక్షలు విధించాలన్న ఆలోచన మానుకోవాలని సూచించారు. ఇతర దేశాల అనుమతితో సంబంధం లేకుండా తమను తాము రక్షించుకునే హక్కు ఇరాన్‌కు ఉందని ఉద్ఘాటించారు. ఈ విషయంలో ఇరాన్ ఎవరి అనుమతీ కోరబోదని పేర్కొన్నారు. అణు తనిఖీల విషయంలో ద్వంద్వ ప్రమాణాలను పెజెష్కియన్ ప్రశ్నించారు. ఇజ్రాయెల్ వద్ద అణ్వాయుధాలు, ఇతర ఆయుధ సామర్థ్యాలు ఉండగా, ఇరాన్ మాత్రం అంతర్జాతీయ తనిఖీల కోసం ఒత్తిడిని ఎదుర్కొంటోందని ఆక్షేపించారు. అణ్వాయుధాలు ఇజ్రాయెల్ చేతిలో ఉండగా, తనిఖీలు చేస్తామంటూ ఇరాన్‌ను వేధిస్తున్నారని విమర్శించారు. హార్మూజ్ జలసంధి గుండా ఇరాన్ నౌకల రాకపోకలకు ఇతర దేశాలు అడ్డుకుంటున్నాయని ఆరో పించారు. హార్మూజ్ వల్ల తమకు ప్రయోజనం లేనప్పుడు ఇతర దేశాలు కూడా ప్రయోజనం పొందడానికి వీల్లేదన్నారు. ఈ జలసంధిలో శత్రుదేశాల నౌకాదళాలను శాశ్వతంగా మోహరించడం, యుద్ధాన్ని విస్తరించడం వల్ల మనం ఆశించిన శాంతి సాధ్యం కాదని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో బుధవారం పెజెస్కియాన్ ప్రసంగించారు. ఇరాన్ తన పొరుగు దేశాలను ప్రత్యర్థులుగా పరిగణించదని, బలమైన పొరుగు దేశాలు ఉండాలని కోరుకుంటోందని తెలిపారు. టెహ్రాన్‌పై సైనిక చర్యకు మద్దతు ఇస్తున్న ఇతర దేశాలు ఈ జలమార్గాన్ని ఉపయోగించుకోవడాన్ని తాము అంగీకరించబోమని వెల్లడించారు. అమాయక విద్యార్థులను చంపడం ఏమిటి? ఇరాన్ ఒక ఉగ్రవాద దేశం అంటూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలను పెజెష్కియాన్ తీవ్రంగా ఖండించారు. తాము ఉగ్రవాదులం కాదని.. ముమ్మాటికీ ఉగ్రవాద బాధితులమని తేల్చిచెప్పారు. ఇరాన్ స్వయంగా ఉగ్రవాదానికి లక్ష్యంగా మారిందని అన్నారు. ఇరాన్ భూభాగంపై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు విచ్చలవిడిగా దాడులు చేస్తున్నాయని మండిపడ్డారు. మినాబ్ పాఠశాలపై అమెరికా–ఇజ్రాయెల్ దాడికి సంబంధించిన ఫొటోలను కూడా ప్రదర్శించారు. ఈ రాక్షసకాండలో అమాయక చిన్నారులు బలైపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికీ ఇరాన్ పౌరులపై దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అయితే, జనరల్ అసెంబ్లీలో పెజెష్కియాన్ మాట్లాడుతుండగా అమెరికా ప్రతినిధులు బయటకు వెళ్లిపోవడం గమనార్హం. అస్థిరతకు మేము కారణం కాదు ప్రత్యర్థి దేశాలు తమ విశ్వవిద్యాలయాలు, ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు, ఆసుపత్రులు సహా పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నారని పెజెష్కియాన్ ఆరోపించారు. తమ దేశంపై జరుగుతున్న పిరికిపంద దాడులకు సాధారణ ప్రజలే లక్ష్యమయ్యారని ఆక్షేపించారు. ప్రత్యర్థులపై ఇరాన్ సైన్యం చేస్తున్న ప్రతిదాడులను సమర్థించుకున్నారు. ఇరాన్ తనను తాను రక్షించుకుంటోందని చెప్పారు. తమ పౌరులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకోవడాన్ని తమ దళాలు అడ్డుకుంటున్నాయని తెలిపారు. తాము ప్రతిస్పందిస్తున్నాం తప్ప ఇతర దేశాల్లోని సాధారణ పౌరులను ఏనాడూ లక్ష్యంగా చేసుకోలేదని వెల్లడించారు. గాజాలోని పరిస్థితిని సైతం ప్రస్తావించారు. అస్థిరతకు తాము కారణం కాదన్నారు. స్వతంత్రంగా జీవించాలని మాత్రమే తాము కోరుకుంటున్నామని తేల్చిచెప్పారు.అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అమెరికా, ఇరాన్ ప్రతినిధులు మూడు గంటల పాటు సమావేశమయ్యారు. తాజా పరిణామాలపై చర్చించారు. ఈ చర్చల్లో అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, అధ్యక్షుడి సీనియర్ సలహాదారు జేర్డ్ కుష్నర్ పాల్గొనగా, ఇరాన్ తరఫున విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రాతినిధ్యం వహించారు. ఈ సమావేశం ‘చాలా ఫలవంతమైనది’గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభివరి్ణంచారు. అయితే, ఈ చర్చల ఫలితంగా అమెరికా, ఇరాన్ మధ్య తక్షణ ఒప్పందం గానీ, శాంతి సాధనలో పురోగతి గానీ కనిపించలేదు. -
ట్రంప్-జిన్‌పింగ్ భేటీలో ఇరాన్ అంశం.. ఇదే కీలకం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ గురువారం వైట్‌హౌస్‌లో భేటీ కానున్న నేపథ్యంలో ఇరాన్ అంశం కీలక చర్చగా మారే అవకాశం ఉంది. ఇరాన్ క్షిపణి దాడికి ముందు చైనా సంస్థలు టెహ్రాన్‌కు అధిక స్పష్టత కలిగిన ఉపగ్రహ చిత్రాలను అందించాయన్న నివేదిక నేపథ్యంలో ఈ అంశంపై ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతలు తలెత్తే అవకాశముంది.జూలై 17న జోర్డాన్‌లోని మువాఫాక్ సాల్టీ వైమానిక స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడి చేసింది. ఆ దాడిలో ముగ్గురు అమెరికా సైనికులు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు. దాడికి ముందు ఇరాన్‌కు అందిన ఉపగ్రహ చిత్రాలకు, ఈ దాడికి సంబంధం ఉందని అమెరికా అధికారులు భావిస్తున్నట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. అయితే, సంబంధిత చైనా సంస్థల పేర్లను అమెరికా అధికారులు వెల్లడించలేదు. చైనా ప్రభుత్వం కూడా తమ సంస్థలు అమెరికా సైనికులను లక్ష్యంగా చేసుకునే దాడికి చిత్రాలను అందించాయన్న ఆరోపణలను తిరస్కరించింది.చైనా–ఇరాన్ సంబంధాలపై అమెరికా గత కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇరాన్‌కు లక్ష్య నిర్ధారణలో ఉపయోగపడే ఉపగ్రహ చిత్రాలు, నావిగేషన్ సేవలు, డ్రోన్లు, క్షిపణులకు సంబంధించిన పరికరాలను చైనా సంస్థలు అందిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. మేలో ట్రంప్ ప్రభుత్వం 3 చైనా సంస్థలపై ఆంక్షలు విధించింది. అవి ఇరాన్‌కు ఉపయోగపడే ఉపగ్రహ చిత్రాలను అందించడం, సేకరించడం లేదా ప్రచురించడంలో పాలుపంచుకున్నాయని అమెరికా ఆరోపించింది.ట్రంప్ కూడా ఈ అంశంపై స్పందిస్తూ.. “చైనా మనపై గూఢచర్యం చేస్తుందని వారు అంటున్నారు. వారు చెప్పింది నిజమే. మనం కూడా వారిపై గూఢచర్యం చేస్తున్నాం” అని అన్నారు. షీతో ఈ అంశాన్ని ప్రస్తావిస్తారా అని అడిగినప్పుడు, చైనా అధ్యక్షుడు “సహేతుకంగా వ్యవహరించారు.. మనం కూడా సహేతుకంగా వ్యవహరిస్తున్నాం” అని ట్రంప్ పేర్కొన్నారు.ఇరాన్‌తో పాటు వాణిజ్యం, కృత్రిమ మేధ, అరుదైన ఖనిజాలు, తైవాన్ అంశాలు కూడా ట్రంప్-జిన్‌పింగ్ చర్చల్లో ఉంటాయి. సెప్టెంబర్ 23 నుంచి 25 వరకు షీ అమెరికాలో పర్యటిస్తున్నారు. నవంబర్‌లో ప్రస్తుత వాణిజ్య సంధి గడువు ముగియనున్న నేపథ్యంలో ఆర్థిక సంబంధాల్లో స్థిరత్వాన్ని కొనసాగించడంపైనా ఇరు దేశాలు దృష్టి పెట్టనున్నాయి. ఇరాన్‌కు సంబంధించిన ఉపగ్రహ చిత్రాల వ్యవహారం ఈ భేటీలో మరో కీలక విభేదంగా మారుతుందా? అనేది ఇప్పుడు చూడాల్సి ఉంది. -
ఇరాన్ వెన్ను విరిచేలా.. భారత్ అండతోనే ట్రంప్ మాస్టర్ ప్లాన్
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి వేదికగా ఇరాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆ దేశ ఆధిపత్యానికి చెక్ పెట్టేలా భారత్‌కు అండగా నిలిచారు. ‘ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనమిక్ కారిడార్’(IMEC)కు ఆయన పూర్తి మద్దతు ప్రకటించారు. ఐరాస సమావేశాల నేపథ్యంలో గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్‌తో నిర్వహించిన సమావేశంలో ట్రంప్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.ఇరాన్ చెక్పాయింట్లు, హర్మూజ్ జలసంధి వంటి కీలక ప్రాంతాల ద్వారా కాకుండా, పైప్లైన్లు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు రవాణాను సురక్షిత ప్రాంతాలకు మార్చడానికి ఈ కారిడార్ ఎంతగానో దోహదపడుతుందని ట్రంప్ పేర్కొన్నారు.దశాబ్ద కాలంగా ఈ ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న సవాళ్లను అధిగమించే దశలో మనం ఉన్నాం అని పునరుద్ఘాటించారు.జీ20 ఒప్పందం ఇదే..ప్రపంచ చమురు బాండాగారమైన సౌదీ అరేబియా నుంచి భారత్, అమెరికా, యూఏఈ, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూరోపియన్ యూనియన్ దేశాలు సంయుక్తంగా రైలు, నౌకాయాన, ఇంధన, డిజిటల్ రంగాలను అనుసంధానించేలా 2023 సెప్టెంబర్‌లో జరిగిన జీ20 సమ్మిట్‌లో ఈ కారిడార్ ఒప్పందం కుదిరింది.వ్యూహాత్మక ప్రత్యామ్నాయం..ఈ కారిడార్ దక్షిణాసియా, పశ్చిమాసియా, ఐరోపా అంతటా అనుసంధానాన్ని, వాణిజ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. చైనాకు చెందిన ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్’ అలాగే ఇరాన్ నియంత్రిత చెక్పాయింట్లకు ఇది బలమైన ప్రత్యామ్నాయంగా నిలవడమే కాకుండా, భారత్-ఐరోపా మధ్య రవాణా సమయాన్ని సగానికంటే ఎక్కువగా తగ్గించగలదని భావిస్తున్నారు.ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరికలు..ఐరాస సర్వసభ్య సమావేశంలో ఇరాన్‌ను ఆర్థికంగా ఏకాకి చేశామని, తమ డిమాండ్లకు తలొగ్గకపోతే ఇరాన్ ఒక దేశంగా మనుగడ కొనసాగించే అవకాశాన్ని కోల్పోతుందని ట్రంప్ హెచ్చరించారు. గతంలో అమెరికా చేపట్టిన ఆపరేషన్ మిడ్నైట్ హామర్ ఇరాన్ అణు కార్యక్రమాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. -
ఇరాన్‌తో 3 గంటల చర్చలు.. గుడ్‌న్యూస్ చెప్పిన ట్రంప్
అమెరికా–ఇరాన్ మధ్య దాదాపు ఏడు నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి తెరపడే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ వేదికగా ఇరు దేశాల ప్రతినిధుల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి మధ్య సుమారు మూడు గంటలపాటు సమావేశం జరిగినట్లు ఇరు వర్గాలు ధ్రువీకరించాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సమావేశంలో నేరుగా పాల్గొనలేదు. ఆయన రాయబారులు, ఇరాన్ ప్రతినిధులు మధ్యే చర్చలు సాగాయి. ఈ భేటీపై ట్రంప్ మాత్రం సానుకూల వ్యాఖ్యలు చేశారు. అమెరికా–ఇరాన్ ప్రతినిధుల మధ్య జరిగిన సమావేశం ‘చాలా బాగుంది’ అని ఆయన చెప్పారు. ఇరాన్‌కు ఒప్పందం చేసుకోవడం ప్రయోజనకరమని వ్యాఖ్యానించారు.మరోవైపు విట్కాఫ్ కూడా చర్చలు సుదీర్ఘంగా జరిగాయని, అవి నిర్మాణాత్మకంగా ఉండాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. మధ్యవర్తుల ద్వారా ఇరు వర్గాల మధ్య చర్చలు కొనసాగుతాయని చెప్పారు.హర్ముజ్ తెరవాలంటే మూడు షరతులుఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశం హర్ముజ్ జలసంధి. ప్రపంచంలోని కీలక చమురు రవాణా మార్గాల్లో ఒకటైన ఈ జలసంధి ద్వారా భారీ స్థాయిలో చమురు, గ్యాస్ రవాణా జరుగుతుంది. యుద్ధం కారణంగా ఇక్కడ రవాణా తీవ్రంగా దెబ్బతినడంతో ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం పడుతోంది. అయితే జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్ అమెరికా ముందు మూడు ప్రధాన షరతులు పెట్టినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది.మొదటిది.. ఇరాన్‌పై కొనసాగుతున్న అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని వెంటనే ఎత్తివేయాలి.రెండోది.. అమెరికా వద్ద స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలి.మూడోది.. ఇరాన్ మద్దతు ఉన్న వివిధ ‘రెసిస్టెన్స్ ఫ్రంట్ల’పై కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించాలి.ఈ షరతులను నెరవేర్చినట్లయితే హర్ముజ్ జలసంధిని ఏడు రోజుల్లో తిరిగి తెరవగలమని ఇరాన్ గతంలోనే మధ్యవర్తుల ద్వారా అమెరికాకు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.ఆ విషయంలో ట్రంప్ ‘నో’మరోవైపు ట్రంప్ వైఖరిలో మాత్రం కీలకమైన అంశం మారలేదు. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాన్ని పొందకూడదని ఆయన స్పష్టం చేశారు. ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రసంగించిన సమయంలో కూడా ఇరాన్ విషయంలో తన ముందు రెండు మార్గాలున్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఒకటి ఒప్పందం చేసుకుని ఇరాన్ భవిష్యత్తును మార్చడం.. మరో మార్గం తీవ్ర సైనిక చర్య అని హెచ్చరించారు.అయితే అదే సమయంలో ఇరాన్‌తో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని కూడా ఆయన చెప్పారు. ‘ఎలాగైనా ఒప్పందం కుదుర్చుకుంటాం.. వేగంగా పూర్తి చేస్తాం’ అన్నట్టుగా వ్యాఖ్యానించారు. దీంతో ట్రంప్ ఒకవైపు కఠిన హెచ్చరికలు చేస్తూనే.. మరోవైపు చర్చలకు తలుపులు తెరిచి ఉంచిన పరిస్థితి కనిపిస్తోంది.వాళ్లే ముందడుగు వేయాలిఇరాన్ వైపు నుంచి కూడా తాజాగా దౌత్యానికి అవకాశం ఉందన్న సంకేతాలు వచ్చాయి. అమెరికా నిజంగా సమస్యను దౌత్యపరంగా పరిష్కరించాలనుకుంటున్నట్లు అధికారికంగా స్పష్టం చేయాలని, ఆ తర్వాత చర్చలకు విధివిధానాలు, షెడ్యూల్ ఖరారు చేయాలని ఇరాన్ కోరుతోంది.ఇక హర్ముజ్ విషయంలోనూ ఇదే వైఖరిని ఇరాన్ అవలంబిస్తోంది. అమెరికా సైనిక ఒత్తిడిని తగ్గించి, దిగ్బంధనాన్ని ఎత్తివేస్తే ఏడు రోజుల్లో జలసంధిని తెరవడానికి సిద్ధమని చెబుతోంది. అంటే ముందుగా అమెరికా చర్య తీసుకోవాలి.. ఆ తర్వాతే హర్ముజ్ తెరుచుకుంటుందన్నది ఇరాన్ ప్రతిపాదన.ఇప్పట్లో డీల్ కష్టమేనా?మూడు గంటల చర్చలు జరిగినప్పటికీ అమెరికా–ఇరాన్ మధ్య ఎలాంటి తుది ఒప్పందం కుదరలేదు. సమావేశంలో కొన్ని షరతులు, యుద్ధం ముగింపు మార్గాలు, హర్ముజ్ పునఃప్రారంభం వంటి అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. రానున్న రోజుల్లో మరోసారి చర్చలు జరిగే అవకాశం ఉంది.ప్రస్తుతం పరిస్థితి ‘యుద్ధం నుంచి చర్చల వైపు అడుగు’ వేసినంతవరకే ఉంది. అమెరికా తన సైనిక, ఆర్థిక ఒత్తిడిని తగ్గించాలన్నది ఇరాన్ డిమాండ్ కాగా.. ఇరాన్ అణ్వాయుధం దిశగా వెళ్లకుండా హామీ ఇవ్వాలన్నది ట్రంప్ ప్రధాన డిమాండ్. ఈ రెండు వైఖరుల మధ్యే అసలు పేచీ ఉంది.ప్రపంచం చూపు హర్ముజ్‌పైనే..హర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకుంటుందా లేదా అన్నదే ఇప్పుడు అంతర్జాతీయంగా కీలకంగా మారింది. యుద్ధం కారణంగా ఈ మార్గంలో ఇంధన రవాణా దెబ్బతినడంతో చమురు మార్కెట్లలో ఆందోళన పెరిగింది. మరోవైపు సౌదీ అరేబియా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు ఎగుమతులను కొనసాగించే ప్రయత్నం చేస్తోంది. అమెరికా కూడా హర్ముజ్‌పై ఆధారాన్ని తగ్గించేందుకు గల్ఫ్ దేశాలతో ప్రత్యామ్నాయ ఇంధన రవాణా మౌలిక వసతులపై చర్చలు జరుపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో న్యూయార్క్‌లో జరిగిన ఈ మూడు గంటల భేటీకి ప్రాధాన్యత పెరిగింది. తదుపరి చర్చల్లో ఈ రెండు వైఖరుల మధ్య ఎంతవరకు సయోధ్య కుదురుతుందన్నదే అసలు కీలకం కానుంది.ఇదీ చదవండి: నా మాట వినకపోతే మీ గతి అదోగతే! -
మాట వినకపోతే నరకానికే..
ఐక్యరాజ్యసమితి: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సాక్షిగా ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తమతో ఒప్పందానికి ఇకనైనా ముందుకు రాకపోతే ఇరాన్‌ను నాశనం చేస్తామని, నరకానికి పంపిస్తామని తేల్చిచెప్పారు. ట్రంప్ మంగళవారం ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశంలో 37 నిమిషాలపాటు ప్రసంగించారు. ఇరాన్‌పై మరిన్ని సైనిక చర్యలు ఉంటాయని స్పష్టంచేశారు. ఇరాన్‌తో ఏడు నెలలుగా సాగుతున్న యుద్ధాన్ని సమర్ధించారు. ఇరాన్ అణ్వాయుధాలు సొంతం చేసుకోకుండా ఈ యుద్ధం నిరోధించిందని, పశ్చిమాసియాలో ఆధిపత్య శక్తిగా ఇరాన్ స్థానాన్ని అంతం చేసిందని పేర్కొన్నారు. ఇరాన్‌కు పునర్నిర్మించుకొనే అవకాశం ఇవ్వాలా?. నాశనం చెయ్యాలా అనేది తేల్చుకోవాల్సి ఉందన్నారు. లేదంటే ఇరాన్‌ను నరకంలోకి నెట్టేయాలా? అని ప్రశ్నించారు. ఒకవైపు ఇరాన్‌పై సైనిక చర్యలు తప్పవంటూనే మరోవైపు త్వరలో ఒప్పందం కుదురుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తంచేశారు. నవంబర్ 3న జరిగే అమెరికా మధ్యంతర ఎన్నికల తర్వాత వాషింగ్టన్, టెహ్రాన్లు ఒక ఒప్పందానికి వస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఉగ్రవాదానికి ప్రధాన స్పాన్సర్ టెహ్రాన్ ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని కొనసాగించాలని ప్రపంచ దేశాలను ట్రంప్ పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే ఉగ్రవాదానికి ప్రధాన స్పాన్సర్ టెహ్రాన్ అని ఆరోపించారు. ఉగ్రవాద మూకలను పెంచి పోషిస్తోందని మండిపడ్డారు. ఇరాన్ ఒకప్పుడు పశ్చిమాసియాపై ఆధిపత్యం చెలాయించేందని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. ఇరాన్‌పై యుద్ధం తన రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేయదని, మధ్యంతర ఎన్నికలలో తాను అభ్యర్ధిని కాదని ట్రంప్ వ్యాఖ్యానించారు. తాను ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేశానని, భారీ మెజారిటీతో గెలిచానని, మరో రెండున్నర ఏళ్లపాటు పదవిలో ఉంటానని స్పష్టంచేశారు. ఈ మధ్యంతర ఎన్నికలు అమెరికా కాంగ్రెస్‌పై తమ నియంత్రణను నిర్ణయిస్తాయానని చెప్పారు. మిగిలిన తన పదవీ కాలాన్ని నిర్దేశిస్తాయని వెల్లడించారు. వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులను ట్రంప్ ఖండించారు. ఈ విషయంలో తీర్మానానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి భారీ మెజారిటీతో ఓటు వేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇరాన్‌పై ఒత్తిడిని కొనసాగించడంలో మనం అంతే ఐక్యంగా ఉండాలని కోరారు. సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా నౌకాదళం హార్మూజ్ జలసంధి గుండా బిలియన్ బ్యారెళ్లకు పైగా చమురును రవాణా చేసిందని పేర్కొన్నారు. ఇకపై సూపర్ ఇంటెలిజెన్స్ పారిశ్రామిక విప్లవం, ఇంటర్నెట్ కంటే కృత్రిమ మేధ పెద్ద మార్పును తీసుకురాగలదని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ‘కృత్రిమ మేధ’అనే పదాన్ని ‘సూపర్ ఇంటెలిజెన్స్’తో భర్తీ చేయాలని అన్నారు. ఇకపై అమెరికా ప్రభుత్వ పత్రాల్లో కృత్రిమ మేధకు బదులుగా సూపర్ ఇంటెలిజెన్స్ లేదా ‘ఎస్ఐ’ని మాత్రమే ఉపయోగించనున్నట్లు తెలిపారు. ‘ఇకపై అమెరికాకు సంబంధించిన అన్ని పత్రాల్లోనూ బహుశా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆరి్టఫిíÙయల్ అనే పదానికి బదులుగా సూపర్ అనే పదాన్ని ఉపయోగిస్తారని భావిస్తున్నట్లు వెల్లడించారు. సూపర్ ఇంటెలిజెన్స్ అనే కొత్త ప్రపంచానికి స్వాగతం అని వ్యాఖ్యానించారు. ఇది ఎలా సాగుతుందో చూద్దామని, వినడానికి ఇది చాలా బాగుందని చెప్పారు. అధునాతన ఏఐ సాంకేతికత కోసం జరుగుతున్న పోటీని ఒక వ్యూహాత్మక పోటీగా అభివరి్ణంచారు. భారత్, పాక్ యుద్ధాన్ని నేనే ఆపేశా.. గత ఏడాది భారత్–పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపేశానని ట్రంప్ పునరుద్ఘాటించారు. అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది యుద్ధాలను పరిష్కరించానని అన్నారు. తద్వారా ఆయా దేశాల నాయకులతో స్నేహ పూర్వక సంబంధాలను ఏర్పరచుకోవడం గొప్ప గౌరవంగా అభివర్ణించారు. వీటిలో అనేక యుద్ధాలు ఎన్నో ఏళ్లుగా, కొన్ని దశాబ్దాలుగా కూడా కొనసాగుతూ వచ్చాయని వెల్లడించారు. వాటిని నిలిపివేసిన ఘనత తనకే దక్కిందన్నారు. రష్యా, ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ముగించడానికి, అవసరమైతే, కొత్త చట్టం కింద తనకు లభించిన భారీ సుంకాల అధికారాలను వినియోగిస్తానని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ అధ్యక్షుడు, విదేశాంగ మంత్రి గైర్హాజరు ఐరాస సాధారణ సభ వార్షిక సమావేశంలో పాల్గొనడానికి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ న్యూయార్క్‌కు చేరుకున్నారు. కానీ, ట్రంప్ ప్రసంగానికి వారు హాజరు కాలేదు. జనరల్ అసెంబ్లీ హాల్లో ఉన్న ఇరాన్ ప్రతినిధులు ట్రంప్ ప్రసంగం ప్రారంభం కాగానే బయటకు వెళ్లిపోయారు. కేవలం ఒక్కరు మాత్రమే హాల్లో ఉన్నట్లు తెలిసింది. -
హౌతీల దాడులతో మారిన యుద్ధక్షేత్రం
ఈ సెప్టెంబరు నెలలో ఇరాన్ యుద్ధ క్షేత్రం హార్మూజ్ జలసంధి నుంచి సౌదీ అరేబియా, యెమెన్లకు మారింది. గాజా –ఇజ్రాయెల్ యుద్ధం తరువాత మళ్లీ ఒక్కసారిగా హౌతీ తిరుగుబాటుదారులు యెమెన్ మధ్య, దక్షిణ ప్రాంతాలలోనికి చొచ్చుకుపోయారు. ఎర్రసముద్రాన్ని, బాబెల్ మాండెబ్ జలసంధిని దాదాపుగా తమ నియంత్రణలోనికి తీసుకొని నేరుగా సౌదీ అరేబియాపై భీకర దాడులు ప్రారంభించటం ద్వారా సౌదీ– అమెరికా–ఇజ్రాయెల్‌లకు హౌతీలు సవాలు విసిరినట్లయింది. ఎవరీ హౌతీలు?ఉత్తర యెమెన్‌లోని సాదా పర్వత ప్రాంతాలలో నివసించే షియా ఇస్లాంకు చెందిన ‘జ్యాదీ’ తెగ ప్రజలనే ‘హౌతీ’లుగా పిలుస్తారు. గత వెయ్యేళ్లుగా ఉత్తర యెమెన్ ప్రాంతాన్ని జ్యాదీ తెగకు చెందిన ఇమామ్‌లు పాలించారు. 1962లో ఇమామ్‌ల పాలనను కూలదోసి ఉత్తర యెమెన్ రిపబ్లిక్ ఏర్పడింది. 1990వ దశకంలో ఉత్తర–దక్షిణ యెమెన్ల విలీనంతో సానా రాజధానిగా యెమెన్ ఏర్పడింది. జ్యాదీ తెగకే చెందిన అలీ అబ్దుల్లా సాలే యెమెన్‌ను పరిపాలిస్తూ సౌదీ అనుకూల సలాఫి మదరసాలను ప్రోత్సహించాడు. దీన్ని తమ సంస్కృతిని నిర్మూలించే ప్రక్రియగా భావించిన జ్యాదీలు తిరుగుబాటు ప్రారంభించారు. హుస్సేన్ అల్ హౌతీ నాయకత్వంలో ఈ తిరుగుబాటు మొదలైంది. 2004–10 కాలంలో అబ్దుల్లా ప్రభుత్వానికీ, హౌతీలకూ మధ్య ఆరు యుద్ధాలు జరి గాయి. సానాలోని యెమెన్ ప్రభుత్వానికి సౌదీ అరేబియా మద్దతు నివ్వటంతో అది హౌతీలకు శత్రువయింది.2011లో ఉత్తర ఆఫ్రికాలో ప్రారంభమైన అరబ్ స్ప్రింగ్ నిరసనలు యెమెన్కూ వ్యాపించాయి. 2012లో అబ్దుల్లా సాలే రాజీ నామాతో సౌదీ సహాయంతో మన్సూర్ హాదీ అధ్యక్షుడిగా మరో ప్రభుత్వం ఏర్పడింది. అందులో హౌతీలకూ స్థానం కల్పించారు. కానీ చమురు నిల్వలున్న దక్షిణ–మధ్య యెమెన్‌లతో పోలిస్తే జ్యాదీల (హౌతీల) ఉత్తర యెమెన్‌లో పేదరికం అధికం. 2014లో చమురు సబ్సిడీలను ఎత్తివేయటంతో హౌతీలు తిరుగుబాటు ప్రారంభించారు. దీనితో హాదీ ప్రభుత్వం కూలిపోయింది. సౌదీ అరేబియా జోక్యంతో 2015–22 మధ్య హౌతీలకూ, సౌదీ మద్దతున్న యెమెనీ ప్రభుత్వానికి మధ్య తీవ్ర యుద్ధం జరిగింది. 2022లో యునైటెడ్ నేషన్స్ చొరవతో కొంతమేరకు శాంతిస్థాపన జరిగింది. ఇదే సమయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మద్దతుతో కొన్ని స్థానిక తెగలు దక్షిణ యెమెన్‌లోని కొన్ని ప్రాంతాలను తమ అధీనంలోనికి తీసుకున్నాయి. ఇప్పుడు యెమెన్‌లో సుమారు 30 శాతం ప్రాంతం హౌతీల అధీనంలో ఉండగా, మిగిలిన ప్రాంతం సౌదీ మద్దతున్న ఇంటర్నే షనల్లీ రికగ్నయిజ్డ్ గవర్నమెంట్, యూఏఈ మద్దతున్న సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ అధీనంలో ఉన్నాయి. 80 శాతం ప్రజలు హౌతీల అధీనంలోని ఉత్తర యెమెన్‌లో నివసిస్తున్నారు.సంకటంలో సౌదీ అరేబియాఇరాన్ మతగురువు అయతుల్లా ఖమేని అంత్యక్రియలకు హాజరై తిరిగి వస్తున్న హౌతీ నాయకుల ఇరానియన్ విమానం యెమెన్ రాజధాని సానాలో ల్యాండ్ అవకుండా సౌదీ అరేబియా విమానాశ్రయ రన్‌వేను ధ్వంసం చేయటంతో జూలై 2026లో అప్ప టివరకు ఉన్న కాల్పుల విరమణ, శాంతి ఒప్పందం రద్దయ్యాయి. హార్మూజ్ జలసంధిపై అమెరికా తన పట్టు బిగించటంతో హౌతీలు ఎర్ర సముద్రంలో పెరిమ్, అల్ హయిదా దీవులను వశం చేసుకున్నారు. కీలకమైన మోకా రేవు పట్టణాన్ని అదుపులోనికి తీసు కోవటంతో బాబెల్ మాండెబ్ జలసంధిని నియంత్రిస్తున్నారు. ఎర్ర సముద్రం నుండి సౌదీ నౌకలపై నిషేధం విధించారు. హార్మూజ్ జలసంధికి ప్రత్యామ్నాయంగా సౌదీ అరేబియా అబాకిక్ చమురు క్షేత్రాన్ని ఎర్ర సముద్ర తీరంలోని యాన్బూ రేవు పట్టణంతో కలిపే 1,200 కిలోమీటర్ల తూర్పు–పశ్చిమ పైప్‌లైన్ గుండా ప్రతిరోజూ 7 మిలియన్ బ్యారెల్స్ చమురును ఎగుమతి చేస్తున్నది. సౌదీ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఈ పైప్‌లైన్‌పై హౌతీలు దాడి చేశారు. అంతటితో ఆగకుండా అరామ్కో కంపెనీకి చెందిన చమురుశుద్ధి కర్మాగారాలు, చమురు టర్మినల్స్పై కూడా డ్రోన్లు, మిస్సైల్స్‌తో దాడి జరిగింది. తాయిఫ్, ఆభా, రియాద్, జీజన్, నజ్రాన్లపై దాడితో సౌదీ సంకట స్థితిలో పడింది.సాలీనా 83 బిలియన్ డాలర్ల రక్షణ వ్యయంతో సౌదీ అరేబియా ప్రపంచంలో ఎనిమిదవ స్థానంలో ఉన్నది. అమెరికన్ ఎఫ్–15 యుద్ధ విమానాలు, పేట్రియాట్, థాడ్ మిస్సైల్ డిఫెన్స్ వ్యవస్థలు కలిగి ఉన్న సౌదీ అరేబియాలో విధ్వంసం సృష్టించటంతో హౌతీల సైనిక శక్తి అందరి దృష్టిని ఆకర్షించింది. హిజ్బుల్లా మాదిరిగా హౌతీలను ఇరానియన్ ప్రాక్సీలుగా పరిగణిస్తారు. హౌతీలకు క్రూయిజ్, బాలాస్టిక్ మిస్సైల్స్, డ్రోన్ టెక్నాలజీని, ఆర్థిక సహా యాన్ని ఇరాన్ అందించటంలో సందేహం లేదు. అయినా హౌతీల గెరిల్లా పోరాట పటిమను తక్కువ అంచనా వేయకూడదు. వారు ఇరాన్‌తో మైత్రీ బంధాన్ని కలిగి ఉన్నప్పటికీ, పూర్తిగా ఇరాన్‌పై ఆధారపడటం లేదు. ఇరాన్ ప్రయోజనాలను కాపాడినప్పటికీ, తమ ప్రాంతీయ లక్ష్యాల విషయంలో రాజీపడరు. ఇరాన్‌కు ప్రధాన శత్రు వులు యూఎస్ఏ, ఇజ్రాయెల్. కానీ హౌతీల శత్రువు సౌదీ. రాజీ కుదిరేనా?వైమానిక దాడులలో హౌతీలను లొంగదీసుకోవడం సాధ్యం కాదని సౌదీకి తేటతెల్లమైంది. దిక్కుతోచని పరిస్థితులలో మళ్లీ ట్రంప్ సహాయాన్ని అర్థించింది. కానీ ట్రంప్ తెలివిగా హౌతీలపై ప్రత్యక్ష దాడులకు నిరాకరించాడు. ఇజ్రాయెల్ సహాయాన్ని కూడా సౌదీ అర్థించినట్లుగా వార్తలొస్తున్నాయి. సైనికపరంగా హౌతీలను ఎదుర్కొనలేమని దౌత్యమార్గంలో సంప్రదింపులకు తలుపులు తెరి చింది. ఒమన్, ఈజిప్టు మధ్యవర్తులుగా ఇరాన్‌తో సంప్రదింపులు జరుపుతున్నది. ఇరాన్ ద్వారా హౌతీలతో ఒప్పందం కుదుర్చుకొని ప్రస్తుత యుద్ధాన్ని తన నుండి ప్రక్కకు మరల్చటానికి తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నది. ప్రపంచ మార్కెట్లలో క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లకు పైకి చేరటం భారత్ ఆర్థిక వ్యవస్థకు అశనిపాతం. భారత్ చమురును రష్యా నుండి బాబెల్ మాండెబ్ ద్వారానే దిగుమతి చేసుకుంటున్నది. ఈ ప్రాంతంలో అనిశ్చిత పరిస్థితి సహజంగానే ఆందోళన కలిగించే అంశం. ఇరాన్, ఒమన్‌లతో మనకున్న సత్సంబంధాలను ఉపయోగించి బాబెల్ మాండెబ్ ద్వారా మన చమురు దిగుమతు లకు ఆటంకం లేకుండా చేయటానికి దౌత్య ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. ఇదే సమయంలో సౌదీతో సంబంధాలు చెడిపోకుండా చూసుకోవాలి. ఇది కత్తిమీద సామే.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
రణమా? శరణమా?.. ఐరాస వేదికగా ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్!
న్యూయార్క్: ఐక్యరాజ్య సమితి వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన షరతులకు ఇరాన్ ఒప్పుకోవాలని, లేదంటే ప్రపంచ పటం నుంచి ఇరాన్‌ను తుడిచేయాలా? అని హెచ్చరించారు.న్యూయార్క్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి 81వ సాధారణ మహాసభల్లో ఇరాన్ లక్ష్యంగా నిప్పులు చెరిగారు. ట్రంప్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో పెను కలకలం రేపుతున్నాయి. ప్రపంచ దేశాలు తీవ్ర భయాందోళనలోకి గురవుతున్నాయి. ఐరాస వేదికగా ప్రపంచ దేశాల నాయకులను ఉద్దేశించి ప్రసంగించిన ట్రంప్ ఇరాన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలా? లేక ఆ దేశాన్ని ప్రపంచ పటం నుంచి శాశ్వతంగా తుడిచిపెట్టేయాలా?’అని హెచ్చరించారు. ఈ సందర్భంగా పశ్చిమాసియాలో (మిడిల్ ఈస్ట్) ఇకపై ఇరాన్ ఆటలు సాగవు. ఆ ప్రాంతాన్ని శాసించే దుర్మార్గపు దాదాగిరికి తాము ఇప్పటికే చరమగీతం పలికాం. మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్ సాగిస్తున్న దౌర్జన్యాలు, ఆధిపత్య ధోరణి పూర్తిగా ముగిసిపోయాయని తేల్చిచెప్పారు. ట్రంప్ చేసిన ఈ హెచ్చరికలు రాబోయే రోజుల్లో అంతర్జాతీయంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయనే దానిపై సర్వత్రా ఆందోళనలు నెలకొన్నాయి. -
UFO: 50 ఏళ్ల తర్వాత.. ఇరాన్ ఆకాశంలో మరో వింత వస్తువు
1976లో ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఆకాశంలో కనిపించిన వింత వస్తువు(యూఎఫ్‌వో) ఘటనకు సరిగ్గా 50 ఏళ్ల తర్వాత.. అదే నగరంలో మరోసారి ఓ మిస్టరీ వస్తువు కలకలం రేపుతోంది. ఆకాశంలో ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగుల లైట్లతో తక్కువ ఎత్తులో ఎగురుతున్నట్లు కనిపిస్తున్న ఈ వస్తువుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అసలు అది డ్రోనా? ఒకటి కంటే ఎక్కువ డ్రోన్లా? లేక దూరం నుంచి కనిపించిన మరో సాధారణ వస్తువా? అనేది ఇప్పటివరకు మాత్రం దీనిపై అధికారిక స్పష్టత లేదు. దీంతో ఆ వస్తువు ఏమై ఉండొచ్చనే దానిపై అనేక రకాల ఊహాగానాలు మొదలయ్యాయి.ఈ వీడియోలు సెప్టెంబర్ 20న చిత్రీకరించినవిగా చెబుతున్నారు. వాటిలో రాత్రి ఆకాశంలో తక్కువ ఎత్తులో ఎగురుతున్నట్లు కనిపించే ఒక వస్తువు కనిపిస్తోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఒక పోస్టు ప్రకారం, ఈ ఘటన టెహ్రాన్‌లోని అజాదెగాన్ ఎక్స్‌ప్రెస్‌వే సమీపంలో జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఆ వస్తువు కచ్చితంగా ఎక్కడ కనిపించింది. ఎంత ఎత్తులో ఉంది? దాని వేగం ఎంత? దాని పరిమాణం ఎంత? అనే విషయాలపై ఇప్పటివరకు అధికారిక సమాచారం లేదు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో ఈ వీడియోలు వెలుగులోకి వచ్చాయి.ఈ దృశ్యాలపై సోషల్ మీడియాలో కొందరు ఇది సైనిక డ్రోన్ అయి ఉండవచ్చని.. ఒకేసారి అనేక డ్రోన్లు ఎగురుతూ ఉండవచ్చని చెబుతున్నారు. మరికొందరు, దూరం నుంచి చూస్తున్నప్పుడు ఆ లైట్లు గాలిపటం లేదా మరేదైనా వస్తువుకు సంబంధించినవిగా కనిపించి ఉండవచ్చంటున్నారు. సెప్టెంబర్ 20న ఇరాన్, అమెరికా మధ్య మరోసారి తీవ్ర హెచ్చరికలు వెలువడ్డాయి. తమపై మరోసారి దాడి జరిగితే.. ఈ ప్రాంతంలోని అమెరికా స్థావరాలపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని ఇరాన్ సైన్యం హెచ్చరించింది.A number of videos are circulating showing an unidentified object in the skies above Tehran, Iran, it’s not immediately clear what is being filmed. pic.twitter.com/bHNAQGFPNv— OSINTdefender (@sentdefender) September 21, 2026అదే సమయంలో ఈ ప్రాంతంలో విమానాల రద్దు, గగనతల మూసివేతలు, ఇతర అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని అమెరికా విదేశాంగ శాఖ ప్రయాణికులను హెచ్చరించిన సంగతి తెలిసిందే. 1976 సెప్టెంబర్ 19న ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన వస్తువు కనిపించినట్లు ఇరాన్ అధికారులు తెలిపారు. దానిని పరిశీలించేందుకు ఇరాన్‌కు చెందిన F-4 యుద్ధ విమానాలను పంపినట్లు సమాచారం.తర్వాత యూఎఫ్‌వో పరిశోధకులు ఈ ఘటనపై విస్తృతంగా అధ్యయనం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన నివేదికలు అమెరికా ప్రభుత్వం డీక్లాసిఫై చేసిన పత్రాల్లో కూడా ఉన్నాయి. అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (NSA) ఆర్కైవ్‌లో జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్, డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (DIA) అమెరికా రక్షణ శాఖ రిపోర్టులు ఉన్నాయి. అయితే, 1976లో కనిపించిన వస్తువుకు, తాజాగా టెహ్రాన్‌లో కనిపించిన లైట్లకు సంబంధం ఉందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు.ఇదీ చదవండి: సినిమా రేంజ్లో.. బస్సు హైజాక్! -
ఇరాన్‌పై అమెరికా క్షిపణుల వర్షం
టెహ్రాన్: ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. దక్షిణ ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ ఓడరేవుపై అమెరికా పెద్ద ఎత్తున దాడి చేసిందని తెలిపింది. ఈ దాడిలో భారీగా ఆస్తి ప్రాణ నష్టం జరిగినట్లు ప్రకటించింది. అమెరికా క్షిపణుల అటాక్‌లో 12 మంది మరణించగా, ఏడుగురు గాయపడ్డారని పేర్కొంది. అదే విధంగా 760 వరకూ వాణిజ్య నౌకలు దెబ్బతిన్నాయని తెలిపింది. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.ఇరాన్ అధికారి తన ప్రకటనలో "అమెరికా దాడుల్లో 12 మంది మరణించగా, ఏడుగురు గాయపడ్డారు. 420 చేపల వేట నౌకలు (వీటిలో సుమారు 70 సాంప్రదాయ ధోలు, 350 చిన్న పడవలు ఉన్నాయి) 340 వాణిజ్య నౌకలు దెబ్బతిన్నాయి". అని న్యాయవ్యవస్థ ప్రతినిధి అలీ కజెమీ ప్రకటన విడుదల చేశారు. అయితే దీనిని అమెరికా ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.అయితే ఈ దాడులు ఎప్పుడు జరిగాయి, బాధ్యులను గానీ కజెమీ స్పష్టం చేయలేదు. అంతర్జాతీయ మానవతా చట్టం ప్రకారం విచక్షణ, అనుపాతం, ముందుజాగ్రత్త వంటి సూత్రాలను దాడి చేసినవారు ఉల్లంఘించారని ఆయన పేర్కొన్నారు. దీనిపై అధికారులు ఫిర్యాదులను నమోదు చేసుకుంటున్నారని, దాదాపు 300 నౌకల నష్ట వివరాల అంచనా పూర్తయ్యిందని పేర్కొన్నారు.పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలుకాగా అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా తమ దేశ పౌరులకు కీలక ఆదేశాలు జారీ చేసింది." ఏ కారణంతోనూ ఇరాన్‌కు వెళ్లొద్దు. అక్కడున్న అమెరికా పౌరులు ఇప్పుడే ఇరాన్ నుంచి బయిటకు వచ్చేయండీ" అని ప్రకటన విడుదల చేసింది. ఇరాన్లో భద్రతా పరిస్థితులు సంక్షిష్టంగా మారుతున్నాయని హెచ్చరించింది.అదే విధంగా అక్కడి నిరసనలకు, భారీ జన సమూహాలకు దూరంగా ఉండాలని అమెరికాతో బహిరంగంగా అనుబంధం ఉన్న ప్రాంతాలలో తక్కువ ప్రొఫైల్ పాటించాలని పేర్కొంది. వైమానిక దాడులు జరిగితే కిటీకీలు, అద్దాలు తలుపులకు దూరంగా ఉండాలని సూచించింది. ఈ నేపథ్యంలో అమెరికా మరోసారి ఇరాన్‌పై పెద్దఎత్తున దాడులకు తెగబడుతుందా అనే ఆందోళనలు సర్వత్రా నెలకొన్నాయి. -
భీకరంగా మారబోతున్న ఇరాన్ యుద్ధం!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న వేళ అమెరికా కీలక హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణించవద్దని తన పౌరులను ఆదేశించింది. ఇప్పటికే అక్కడ ఉన్నవారు వెంటనే దేశం విడిచి వెళ్లాలని సూచించింది. పరిస్థితులు వేగంగా మారే అవకాశం ఉందని.. విమాన సర్వీసులు రద్దు కావడం, గగనతలం మూసివేయడం, సరిహద్దుల వద్ద ఆంక్షలు విధించడం వంటి పరిణామాలు ఎదురుకావొచ్చని హెచ్చరించింది.అమెరికా వర్చువల్ ఎంబసీ ఇన్ ఇరాన్ తాజాగా విడుదల చేసిన భద్రతా హెచ్చరికలో.. ‘‘ఏ కారణంతోనూ ఇరాన్‌కు వెళ్లొద్దు. అక్కడున్న అమెరికా పౌరులు ఇప్పుడే ఇరాన్ నుంచి బయటకు వచ్చేయండి’’ అని స్పష్టం చేసింది. ఇరాన్లో భద్రతా పరిస్థితులు సంక్లిష్టంగా మారుతున్నాయని ఆ హెచ్చరికలో పేర్కొంది. విమానాశ్రయాలు, విమానయాన సంస్థలు, సరిహద్దు మార్గాలకు సంబంధించిన పరిణామాలను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించింది. ఇతర దేశాలకు వెళ్లాలని భావించే వారు ఆయా దేశాల ప్రవేశ నిబంధనలను ముందుగానే తెలుసుకోవాలని తెలిపింది.అమెరికన్లకు పలు సూచనలుఇరాన్లో ఉన్న అమెరికన్లు నిరసనలు, భారీ జనసమూహాలకు దూరంగా ఉండాలని అమెరికా సూచించింది. అమెరికాతో బహిరంగంగా అనుబంధం ఉన్న ప్రాంతాల్లో తక్కువ ప్రొఫైల్ పాటించాలని తెలిపింది. వైమానిక దాడులు జరిగితే కిటికీలు, అద్దాల తలుపులకు దూరంగా ఉండాలని.. కూలిన శిథిలాల వైపు వెళ్లొద్దని హెచ్చరించింది.అత్యవసర పరిస్థితుల్లో దౌత్య అధికారులను సంప్రదించేందుకు ‘స్మార్ట్ ట్రావెలర్ ఎన్రోల్మెంట్ ప్రోగ్రామ్ (STEP)’లో నమోదు చేసుకోవాలని సూచించింది. పశ్చిమాసియాలో ప్రయాణించే లేదంటే ఆ ప్రాంతం మీదుగా వెళ్లే అమెరికన్లు అప్రమత్తంగా ఉండాలని.. విమాన సర్వీసులు, గగనతల మార్గాల్లో ఆకస్మిక మార్పులు, రద్దులు జరిగే అవకాశం ఉందని అమెరికా తాజాగా హెచ్చరించింది.హౌతీల దాడులతో మరింత టెన్షన్అమెరికా–ఇరాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో.. ఇరాన్ మద్దతున్న హౌతీల కార్యకలాపాలను కూడా అమెరికా ప్రస్తావించింది. సౌదీ అరేబియాపై, ముఖ్యంగా పౌర విమానాశ్రయాలపై హౌతీలు దాడులకు పాల్పడ్డారని తెలిపింది. ప్రస్తుత సైనిక ఘర్షణలు వేగంగా మరింత విస్తరించే అవకాశం ఉందని హెచ్చరించింది.ఇరాన్‌కు మద్దతిచ్చే గ్రూపులు అమెరికా ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని అమెరికా పేర్కొంది. మధ్యప్రాచ్యంతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ గతంలో అమెరికా దౌత్య కార్యాలయాలు, సంస్థలు లక్ష్యంగా దాడులు జరిగిన విషయాన్ని గుర్తుచేసింది. అమెరికా వ్యాపార సంస్థలు, సంస్థలు, ఇతర ప్రయోజనాలపైనా ముప్పు ఉండొచ్చని తెలిపింది.సౌదీలోనూ ఆంక్షలుఇరాన్తో పాటు సౌదీ అరేబియాలో ఉన్న అమెరికన్లకు కూడా ఇటీవల భద్రతా సూచనలు జారీ అయ్యాయి. హౌతీల దాడుల నేపథ్యంలో తైఫ్, యన్బు ప్రాంతాలకు అమెరికా ప్రభుత్వ ఉద్యోగులు అధికారిక లేదా వ్యక్తిగత ప్రయాణాలు చేయాలంటే ప్రత్యేక అనుమతి తీసుకోవాలని సూచించింది. మరోవైపు రియాద్ వైపు బాలిస్టిక్ క్షిపణి దూసుకురావడంతో సౌదీ అధికారులు అత్యవసర హెచ్చరిక జారీ చేశారు. ఆ క్షిపణిని అడ్డుకున్నట్లు సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు తెలిపాయి. బిష్, తైఫ్, ఫరాసాన్, యన్బు ప్రాంతాల్లో పౌరులు, మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని దాడులకు ప్రయత్నాలు జరిగినట్లు పేర్కొన్నాయి. హౌతీల దాడులను ఖతార్ ఖండిస్తూ.. సౌదీ అరేబియాకు సంఘీభావం ప్రకటించింది.ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్ అంతర్జాతీయ రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. భద్రతా పరిస్థితులు, గగనతల పరిమితులు, విమాన మార్గాల్లో మార్పుల కారణంగా పలు అంతర్జాతీయ సర్వీసులు రద్దు లేదా నిలిపివేతకు గురయ్యాయి. అయితే గల్ఫ్ ప్రాంతంలోని అన్ని విమాన మార్గాలు పూర్తిగా మూసుకుపోలేదు. కొన్ని రూట్లలో సర్వీసులు కొనసాగుతున్నప్పటికీ.. విమాన సంస్థలు పరిస్థితిని బట్టి షెడ్యూళ్లను మార్చుతున్నాయి. తాజాగా ఇరాన్ నుంచి వచ్చే అంతర్జాతీయ విమానాల్లో దాదాపు మూడో వంతు రద్దైనట్లు సమాచారం. మాహాన్ ఎయిర్ కూడా ఇస్తాంబుల్, అంకారా, మస్కట్ వంటి అంతర్జాతీయ మార్గాల్లో సర్వీసులను నిలిపివేసింది. దీంతో ఇరాన్‌కు ప్రయాణం చేయడం, అక్కడి నుంచి బయటకు రావడం గతంతో పోలిస్తే మరింత కష్టంగా మారింది. మరోవైపు అమెరికా–ఇరాన్ మధ్య దౌత్య సంబంధాలు తీవ్ర ఉద్రిక్తతలో ఉన్నప్పటికీ.. చర్చలకు సంబంధించిన మార్గాలు పూర్తిగా మూసుకుపోలేదు. సెప్టెంబర్ 20న ట్రంప్ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో సమావేశానికి తాను సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇవ్వగా.. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ యూఎన్ జనరల్ అసెంబ్లీకి వెళ్లే కార్యక్రమంలో భాగంగా దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. చైనా కూడా ఇరాన్, అమెరికా సంయమనం పాటించి జూన్‌లో కుదిరిన శాంతి ఒప్పందానికి తిరిగి రావాలని కోరుతోంది. అంటే.. ఒకవైపు సైనిక ఉద్రిక్తతలు, మరోవైపు పరోక్ష దౌత్య ప్రయత్నాలు ఏకకాలంలో కొనసాగుతున్నాయి.ఇదీ చదవండి: మొసలి కన్నీరుపై ఇరాన్ ఫైర్ -
ఇరాన్ చుట్టూ ఉచ్చు.. మూడు వైపులా టెన్షన్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి వేడెక్కాయి. ఒకవైపు అమెరికా–ఇరాన్ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరగా.. మరోవైపు ఇరాన్ మద్దతున్న హౌతీలు సౌదీ అరేబియా రాజధాని రియాద్‌పై క్షిపణులు, డ్రోన్లతో దాడికి దిగారు. ఇదే సమయంలో ఇరాన్–ఫ్రాన్స్ మధ్య దౌత్య వివాదం కూడా ముదురుతోంది. దీంతో ఇప్పటికే నెలలుగా కొనసాగుతున్న ప్రాంతీయ సంక్షోభం కొత్త మలుపు తీసుకుంటోంది.అమెరికా కొత్త దాడికి సిద్ధమవుతోందన్న సమాచారం తమ వద్ద ఉందని ఇరాన్ సైన్యం ప్రకటించింది. అమెరికా లేదా దాని మిత్రదేశాలు మరోసారి దాడి చేస్తే.. ఈసారి ప్రతిస్పందన పరిమితం కాదని, అమెరికా స్థావరాలు.. ప్రయోజనాలపై సుదీర్ఘంగా దాడులు కొనసాగిస్తామని ఇరాన్ సైనిక కమాండ్ హెచ్చరించింది. అమెరికా మిత్రదేశాలను కూడా ఈ ఘర్షణలో భాగస్వాములుగానే పరిగణిస్తామని స్పష్టం చేసింది.మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్‌పై ఒత్తిడి పెంచారు. ఒప్పందానికి ముందుకు రావాలని.. లేదంటే ఇరాన్ ఆర్థికంగా మరింత కుదేలవుతుందని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఈ వారంలో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి న్యూయార్క్ వెళ్లనున్న నేపథ్యంలో ఆయనతో భేటీకి తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ చెప్పడం గమనార్హం. రియాద్‌పై హౌతీల మెరుపుదాడిఇదిలా ఉండగానే యెమెన్‌లోని ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు సౌదీ రాజధాని రియాద్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. సెప్టెంబర్ 19న క్షిపణి, డ్రోన్లతో దాడి ప్రయత్నం జరిగినట్లు సౌదీ అరేబియా ధ్రువీకరించింది. రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో భారీ పేలుడుతో దట్టమైన పొగ అలుముకుంది. అయితే సౌదీ నేతృత్వంలోని కూటమి ఆ దాడిని అడ్డుకున్నట్లు తెలిపింది. పెద్దగా నష్టమూ జరగలేదని వెల్లడించింది. హౌతీలు రియాద్‌తో పాటు యాన్బు, తాయిఫ్, బైష్, ఫరాసాన్ ప్రాంతాల్లోనూ దాడులకు ప్రయత్నించినట్లు సమాచారం. యాన్బు సౌదీ చమురు ఎగుమతులకు కీలక కేంద్రం కావడంతో ఈ దాడులు మరింత ఆందోళనకు కారణమయ్యాయి. ఎందుకంత కీలకం బాబ్-ఎల్-మండేబ్..యెమెన్‌లో హౌతీల దూకుడు ఇటీవలి రోజుల్లో మరింత పెరిగింది. వ్యూహాత్మకమైన మొఖా ప్రాంతంతో పాటు బాబ్ ఎల్ మందెబ్ జలసంధికి సమీప ప్రాంతాలపై వారి పట్టు పెరిగింది. ఈ మార్గం ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌తో కలుపుతుంది. ఆసియా–యూరప్ మధ్య నౌకాయానానికి ఇది కీలకమైన మార్గం.ఇప్పటికే హర్ముజ్ జలసంధిలో ఇరాన్ ఆంక్షల కారణంగా ఇంధన రవాణాపై తీవ్ర ఒత్తిడి ఉంది. ఇప్పుడు బాబ్ ఎల్ వద్ద కూడా భద్రతా సమస్యలు పెరగడంతో ప్రపంచ చమురు సరఫరాపై ఆందోళన మరింత పెరిగింది. హౌతీల దాడుల నేపథ్యంలో సౌదీ చమురు ఎగుమతుల మార్గాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. తాజా పరిణామాల్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగానే కొనసాగుతోంది. చైనాకు కూడా టెన్షన్.. ఇరాన్‌పై ఒత్తిడిహౌతీల దూకుడుతో సౌదీ మాత్రమే కాకుండా చైనా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఓ ప్రముఖ మీడియా సంస్థ కథనం ఇచ్చింది. సౌదీ విజ్ఞప్తి నేపథ్యంలో హౌతీలను అదుపులో ఉంచేందుకు ఇరాన్‌పై చైనా ప్రైవేటుగా ఒత్తిడి తెచ్చినట్లు మూడు ఇరాన్ వర్గాలను ఉటంకిస్తూ ఆ వార్తను ప్రచురించింది. ఎర్ర సముద్ర మార్గం చైనా వాణిజ్యానికి కూడా కీలకం కావడంతో ఈ పరిణామాలను బీజింగ్ నిశితంగా గమనిస్తోంది. ఇటు ఫ్రాన్స్‌తోనూ కొత్త వివాదంఇక ఇరాన్–ఫ్రాన్స్ సంబంధాల్లోనూ కొత్త చిచ్చు రేగింది. టెహ్రాన్‌లో ఫ్రెంచ్ రాయబార కార్యాలయానికి అనుబంధంగా ఉన్న ఫ్రెంచ్ భాషా కేంద్రాన్ని ఇరాన్ అధికారులు మూసివేశారు. సరైన లైసెన్స్ లేకుండా కార్యకలాపాలు నిర్వహించడంతో పాటు జాతీయ భద్రతకు వ్యతిరేకమైన చర్యలకు పాల్పడిందని ఇరాన్ ఆరోపించింది. వ్యక్తుల నెట్‌వర్క్‌లను నిర్మించడం, నైపుణ్యం ఉన్న ఇరానియన్లు దేశం విడిచి వెళ్లేందుకు సహకరించడం వంటి ఆరోపణలను కూడా చేసింది. అయితే ఫ్రాన్స్ ఈ చర్యను తీవ్రంగా ఖండించింది. తమ సాంస్కృతిక సంస్థలపై మరో దాడిగా అభివర్ణించింది. ఇరాన్ రాయబారిని పిలిపించి వివరణ కోరనున్నట్లు ప్రకటించింది. ఈ వివాదం ఇప్పటికే ఇరుదేశాల మధ్య ఉన్న దౌత్య ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది. ‘మొసలి కన్నీరు’ అంటూ ఫైర్ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్-నోయెల్ బారో ఇరాన్లో మానవ హక్కుల పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తీవ్రంగా స్పందించారు. ఫ్రాన్స్ గతంలో అల్జీరియాలో చేసిన చర్యలను ప్రస్తావిస్తూ.. ఇరాన్‌పై ఇప్పుడు సానుభూతి చూపడం ‘మొసలి కన్నీరు’ అంటూ బారోను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అమెరికా దాడుల్లో ఇరాన్ పాఠశాల విద్యార్థులు చనిపోయిన సమయంలో ఫ్రాన్స్ మౌనం వహించిందని కూడా అరాఘ్చీ ఆరోపించారు.ఒకవైపు చర్చలు.. మరోవైపు దాడులుఇలా చూస్తే ప్రస్తుతం ఇరాన్ చుట్టూ ఒకేసారి పలు స్థాయిల్లో ఉద్రిక్తతలు కనిపిస్తున్నాయి. అమెరికాతో ప్రత్యక్ష ఘర్షణ మళ్లీ ముదిరే సంకేతాలు, సౌదీపై హౌతీల దాడులు, హర్ముజ్–బాబ్ ఎల్ మండేబ్ జలమార్గాలపై ఒత్తిడి, ఫ్రాన్స్‌తో దౌత్య వివాదం.. ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడుతున్నాయి.అయితే ఇదే సమయంలో చర్చలకు అవకాశం పూర్తిగా మూసుకుపోలేదు. ట్రంప్–ఇరాన్ మధ్య కఠిన ప్రకటనలు కొనసాగుతున్నప్పటికీ, ఇరాన్ అధ్యక్షుడితో భేటీకి ట్రంప్ సిద్ధంగా ఉన్నట్లు చెప్పడం దౌత్య మార్గం ఇంకా తెరిచే ఉందనే సంకేతంగా నిలుస్తోంది. మరోవైపు హౌతీలను నియంత్రించేందుకు చైనా ప్రయత్నాలు కూడా తెరవెనుక దౌత్యం కొనసాగుతున్నట్లు సూచిస్తున్నాయి.ఇదీ చదవండి: ఆ ఏడు కండీషన్స్‌తో ఇరాన్ యుద్ధం ముగిసేనా? -
ట్రంప్‌నకు ఇరాన్ అల్టిమేటం.. 7 షరతులు
ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధం తీవ్రరూపు దాలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ మరోసారి అమెరికాకు భారీ ఆఫర్ ఇచ్చింది. యుద్ధాన్ని ఆపాలంటే తమ వద్ద ఒక ప్లాన్ ఉందని తెలిపింది.. టెహ్రాన్ ప్రతిపాదించిన ఏడు షరతులను అంగీకరిస్తే వెంటనే యుద్ధం ముగిసిపోతుందని లేకపోతే అమెరికా వద్ద మరో ప్లాన్ ఏది లేదని స్పష్టం చేసింది.ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయీ... ఈ విషయమై మాట్లాడుతూ అమెరికా ముందు తన ఇరాన్‌కు చెందిన ఏడు ప్రతిపాదనలను ఖతార్ మధ్యవర్తిత్వంతో అమెరికాకు చేరవేశాం. ప్రస్తుతం యుద్ధం మెుదలై ఏడు నెలలు కావస్తుందని ఇరాన్ షరతులపై ట్రంప్ స్పందన కోసం ఎదురుచూస్తోన్నామన్నారు.ఆయన మాట్లాడుతూ "ఏదైనా చర్చలు ప్రారంభించడానికి ఇరాన్ తన ఏడు షరతులను అమెరికా ప్రభుత్వానికి ప్రకటించింది. టెహ్రాన్ సందేశం స్పష్టంగా, నిస్సందేహంగా ఉంది. వాషింగ్టన్ తాను సృష్టించుకున్న చిక్కుముడి నుండి బయటపడాలనుకుంటే, అందులో మరింత చిక్కుకోకుండా ఉండాలంటే, ఇరాన్ హక్కులు, షరతులను అంగీకరించడం తప్ప దానికి మరో మార్గం లేదు," అని ఆయన ఆదివారం తెల్లవారుజామున Xలో పోస్ట్ చేశారు.ఇరాన్ ప్రధాన డిమాండ్లు ?మెుహ్సెన్ రెజాయీ ప్రకారం, ఇరాన్ ప్రతిపాదనల్లో ప్రధానంగా అన్ని రంగాల్లో యుద్ధాన్ని ముగించడం, ఇరాన్‌కు చెందిన స్వాధీనం చేసుకున్న ఆస్తులను విడుదల చేయడం, ఇరాన్ నౌకాశ్రయాలపై అమెరికా విధించిన నావికా దిగ్బంధాన్ని తొలగించడం వంటి అంశాలు ఉన్నాయి. అదే విధంగా యెమెన్‌కు చెందిన హౌతీలు, సౌదీ అరేబియా మధ్య కొనసాగుతున్న పోరాటానికి సైతం ముగింపు పలకాలని ఇరాన్ స్పష్టం చేస్తోంది. మధ్యప్రాచ్యంలో వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న సైనిక ఘర్షణలకు సమగ్ర ముగింపు రావాలన్నదే తమ ఉద్దేశమని రెజాయీ తెలిపారు.ఖతార్ ద్వారా అమెరికాకు సందేశం.ఇరాన్, అమెరికా మధ్య నేరుగా కాకుండా మధ్యవర్తి దేశం ఖతార్ ద్వారా సంప్రదింపులు కొనసాగుతున్నట్లు తెలిపారు. ఇరాన్ షరతులను ఖతార్ అమెరికాకు చేరవేసిందని, ప్రస్తుతం వాషింగ్టన్ నుంచి అధికారిక స్పందన కోసం వేచి చూస్తున్నామని ఆయన చెప్పారు. “ఈ షరతులను అంగీకరించడం అమెరికా ప్రయోజనానికే” అని వ్యాఖ్యానించారు. అదే సమయంలో అమెరికా నుంచి మరోసారి దాడి జరిగే అవకాశం ఉందని కూడా ఆయన హెచ్చరించారు.మరో అమెరికా దాడి జరిగే అవకాశం?ఇరాన్ సైనిక అంచనాల ప్రకారం అమెరికా మరోసారి ఇరాన్‌పై దాడి చేసే అవకాశం ఇంకా చాలా ఎక్కువగానే ఉందని రెజాయీ పేర్కొన్నారు. అందుకే తమ దేశం కొత్త వ్యూహంతో ముందుకు వెళ్తోందని, ఈ యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించడమే ప్రస్తుత లక్ష్యమని చెప్పారు. ట్రంప్ స్పందనపై సస్పెన్స్?ఇరాన్ తన ఏడు షరతులను అమెరికా ముందుంచిన నేపథ్యంలో, వాషింగ్టన్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ఒకవైపు యుద్ధాన్ని ముగించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగుతుండగా, మరోవైపు ఇరాన్ మరో అమెరికా దాడి జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. దీంతో మధ్యప్రాచ్యంలో యుద్ధానికి నిజంగా ముగింపు పలికే దిశగా ఇరాన్-అమెరికా చర్చలు సాగుతాయా? లేక ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయా? అన్నది ఆసక్తికరంగా మారింది. -
పశ్చిమాసియాలో మళ్లీ భీకర యుద్ధం.. ట్రిప్‌ను అర్ధంతరంగా ముగించిన ట్రంప్!
వాషింగ్టన్: పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఘర్షణ వాతావరణం తారాస్థాయికి చేరడంతో వైట్‌హౌస్ తీవ్ర అప్రమత్తమైంది. ఈ భద్రతా సంక్షోభం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వీకెండ్ క్యాంప్ డేవిడ్ పర్యటనను అకస్మాత్తుగా రద్దు చేసుకున్నారు. హుటాహుటిన రాజధాని వాషింగ్టన్కు తిరుగుపయనమయ్యారు. ఉద్రిక్తతల తీవ్రత దృష్ట్యా ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు తన టెక్సాస్ పర్యటనతో పాటు, ఎలాన్ మస్క్‌తో జరగాల్సిన కీలక భేటీని కూడా రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఐక్యరాజ్య సమితిలో ప్రసంగం అనంతరం తిరిగి ఇజ్రాయెల్ వెళ్లనున్నట్లు అమెరికా మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు, మేరీలాండ్‌లోని క్యాంప్ డేవిడ్ నిర్బంధ గగనతలంలోకి అనుమతి లేకుండా ఒక సాధారణ విమానం ప్రవేశించడం కలకలం రేపింది. వెంటనే రంగంలోకి దిగిన నార్త్ అమెరికన్ ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాలు, ఫ్లేర్లను వదులుతూ ఆ విమానాన్ని అడ్డగించి, పైలట్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించాయి.9 దేశాల్లో అమెరికా హై-అలర్ట్పశ్చిమాసియాలో ఎప్పుడైనా భారీ సైనిక ఘర్షణ చెలరేగే ముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో ఓమాన్, లెబనాన్, జోర్డాన్, ఇరాక్, బహ్రెయిన్, కువైట్, యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియాతో సహా మొత్తం తొమ్మిది దేశాల్లోని తమ పౌరులకు అమెరికా రాయబార కార్యాలయాలు అత్యవసర భద్రతా హెచ్చరికలు జారీ చేశాయి. గగనతలాలు అకస్మాత్తుగా మూతపడే అవకాశం ఉన్నందున, విమాన సర్వీసుల రద్దుకు సిద్ధంగా ఉండాలని సూచించాయి.సౌదీపై హూతీల దాడి.. రియాద్‌లో ఎయిర్ అలర్ట్ యెమెన్‌కు చెందిన ఇరాన్ మద్దతుదారులు హూతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని సున్నితమైన ప్రాంతాలపై, ఎర్రసముద్ర తీరంలోని ఇంధన కేంద్రాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డారు. రియాద్‌లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో భారీగా పొగలు కమ్ముకోవడంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. సౌదీ రక్షణ దళాలు ఒక బాలిస్టిక్ క్షిపణిని గాల్లోనే అడ్డుకుని ధ్వంసం చేసినట్లు ప్రకటించాయి. ఈ తీవ్ర పరిణామాల నేపథ్యంలో సౌదీ సివిల్ డిఫెన్స్ చరిత్రలోనే మొదటిసారిగా రియాద్, అల్-ఖర్జ్ నగరాల్లో వైమానిక దాడుల హెచ్చరికల సైరన్లు మోగించింది.రూ.26 వేల కోట్ల భారీ ఆయుధ ప్యాకేజీపశ్చిమాసియా ఘర్షణల వేళ.. ఇజ్రాయెల్‌కు సుమారు రూ.26 వేల కోట్ల భారీ ఆయుధ ప్యాకేజీని అమెరికా ఆమోదించింది. ఇందులో ఒక్కొక్కటి టన్ను బరువున్న సుమారు 40 వేల అత్యాధునిక బాంబులు ఉన్నాయి. అమెరికా ఆయుధాగారంలో ఉన్న అత్యంత విధ్వంసకరమైన ఆయుధాల్లో 'ఎంకే-84' ఒకటి. ఇందులో భాగంగా ఇజ్రాయెల్‌కు 20 వేల 'ఎంకే-84' బాంబులతో పాటు మరో 20 వేల 'బీఎల్‌యూ-117' బాంబులను పంపేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. వీటితో పాటు 20 వేల 'ఐ-2000' పెనెట్రేటర్ వార్‌హెడ్స్‌ను కూడా ఈ ప్యాకేజీలో చేర్చారు. ఈ 'ఎంకే-84' బాంబులు విస్ఫోటనం చెందితే, వాటి లోహపు శకలాలు వేలాది అడుగుల దూరం వరకు ఎగిరిపడి తీవ్ర ప్రాణనష్టాన్ని కలిగిస్తాయి.ఇదీ చదవండి : అమెరికాతో ఇక కురుక్షేత్రమే.. ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్ -
అమెరికాతో ఇక కురుక్షేత్రమే.. ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్
టెహ్రాన్: పశ్చిమాసియాలో కొనసాగుతున్న అమెరికా-ఇరాన్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాన్ని ముగించాలని ఇరాన్ అమెరికాకు పిలుపునిచ్చింది. యుద్ధం ముగియాలంటే అమెరికా తమ ఏడు డిమాండ్లకు అంగీకరించాలని, లేదంటే ఆ దేశంతో చావోరేవో తేల్చుకుంటామని ఇరాన్ స్పష్టం చేసింది.ఒకవేళ తాము పెడుతున్న ఏడు షరతులకు అమెరికా ఒప్పుకుంటే, ఖతార్ మధ్యవర్తిత్వంతో చర్చలు జరుపుతామని తెలిపింది. మరి ఇరాన్ డిమాండ్లపై అమెరికా ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.ఈ సందర్భంగా ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సేన్ రెజాయీ ప్రముఖ ఖతార్ ఆంగ్ల మీడియా సంస్థ 'అల్ జజీరా'తో మాట్లాడారు. “అమెరికా-ఇరాన్ దేశాల మధ్య యుద్ధాన్ని ముగించాలని కోరుకుంటున్నాం. ఇందులో భాగంగా ఖతార్ మధ్యవర్తిత్వంతో మా డిమాండ్లు ఏంటో అమెరికాకు తెలియజేశాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందన కోసం ఎదురు చూస్తున్నాం” అని ఆయన వెల్లడించారు.ఇరాన్ డిమాండ్లు ఇవేఅన్ని రకాల సరిహద్దుల్లోనూ యుద్ధాన్ని పూర్తిగా ఆపివేయడం,విదేశీ బ్యాంకుల్లో స్తంభింపజేసిన ఇరాన్ నిధులను విడుదల చేయడం.ఇరాన్‌పై విధించిన నావికా దిగ్బంధాన్ని ఎత్తివేయడం. ఇలా మొత్తం ఏడు స్పష్టమైన డిమాండ్లను ఖతార్ ద్వారా అమెరికాకు తెలియజేసినట్లు రెజాయ్ సోషల్ మీడియా వేదికగా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.ఈ సందర్భంగా ట్రంప్ బెదిరింపుల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, ఈ షరతులను అంగీకరించడమే అమెరికాకు మంచిదని రెజాయ్ స్పష్టం చేశారు. అమెరికా వైపు నుంచి భవిష్యత్తులోనూ దాడులు జరిగే అవకాశం ఉందని తమ సైనిక అంచనాలు చెబుతున్నాయని, దానిని ఎదుర్కొనేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. గల్ఫ్ ప్రాంతం నుంచి అరేబియా సముద్రం వరకు విస్తరించి ఉన్న అమెరికా నావికాదళ ఆస్తులను లక్ష్యంగా చేసుకుని తమ సైనిక వ్యూహాలను మార్చుకున్నట్లు తెలిపారు. ఒకవేళ అమెరికా దాడులకు దిగితే, ప్రాంతీయంగా ఉన్న అమెరికా సైనిక స్థావరాలు, వాణిజ్య సంస్థలపై తీవ్ర ప్రతిస్పందన ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు.అణు విధానం ఇరాన్ అణు విధానంలో ఎలాంటి మార్పు లేదని రెజాయ్ స్పష్టం చేశారు. అణు ఆయుధాలను నిషేధించే మతపరమైన ఫత్వాకు (డిగ్రీకి) తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. అయితే, అమెరికా అనుసరించే దురుసు విధానాల వల్ల తాము 'న్యూక్లియర్ నాన్-ప్రొలిఫరేషన్ ట్రీటీ' నుంచి వైదొలగవలసి వచ్చే పరిస్థితి రావొచ్చని హెచ్చరించారు.మధ్యవర్తిత్వ ప్రయత్నాలు గతేడాది ఫిబ్రవరిలో అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల తర్వాత ప్రారంభమైన ఈ సంఘర్షణను ముగించేందుకు ఖతార్,పాకిస్థాన్ దేశాలు దౌత్యపరమైన మధ్యవర్తిత్వ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఒకవైపు దౌత్య చర్చలకు సిద్ధమంటూనే, మరోవైపు సైనిక సన్నద్ధతను కూడా ఇరాన్ విడనాడలేదని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ఇరాన్ ప్రతినిధి బృందానికి అమెరికా విదేశాంగ శాఖ వీసాలు జారీ చేసినట్లు సమాచారం. -
యుద్ధానికి మూల్యం చెల్లిస్తున్నారు
దుబాయ్: అమెరికా ఆంక్షలు, ఏడాదిన్నర కాలంగా కొనసాగుతున్న యుద్ధాలకు మూల్యాన్ని ఇరాన్ ప్రజలు చెల్లిస్తున్నారని ఆ దేశానికి చెందిన ప్రముఖ మానవ హక్కుల ఉద్యమకారిణి, నోబెల్ గ్రహీత నర్గీస్ మహ్మదీ(54) వ్యాఖ్యానించారు. ఆర్థిక ఇబ్బందులు, బలగాల అణచివేత కారణంగా సామాన్యులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నారన్నారు. ‘ఒక్కసారి ఇరాన్ వీధుల్లోకి వెళ్లి చూడండి. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏమిటో మీకు అర్థమవుతుంది. వారిప్పుడు మేల్కొన్నారు. హక్కుల కోసం పోరాడాలని తీర్మానించుకున్నారు’ అని మహ్మదీ అన్నారు. ‘నేటి ఇరాన్ యువతలో హక్కుల పట్ల అవగాహన ఉంది. ఈ విషయంలో వారికి స్పష్టత ఉంది. వారే మాకు ఆశ, శ్వాస’అని ఆమె పేర్కొన్నారు. తీవ్ర అనారోగ్యానికి గురైన నర్గీస్ మహ్మదీని ఇరాన్ ప్రభుత్వం జైలు నుంచి తాత్కాలికంగా విడుదల చేసింది. శుక్రవారం ఆమె అసోసియేటెడ్ ప్రెస్‌కు ఇచి్చన వర్చువల్ ఇంటర్వ్యూలో తన నిర్బంధానికి సంబంధించిన వివిధ అంశాలను ఆమె వివరించారు. బాల్యంతోపాటు జైలులో ఉన్న సమయంలో తనకు ఎదురైన అనుభవాల గురించి రాసిన ‘ఎ ఉమన్ నెవర్ స్టాప్స్ ఫైటింగ్’ పుస్తకం ఫ్రెంచి, జర్మన్, తదితర 9 భాషల్లో ఈ నెలలో విడుదల కానుంది. ఇంగ్లి‹Ù, పార్సీ ఎడిషన్లు వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. అమెరికాతో కొనసాగుతున్న యుద్ధం, ముదిరిన ఆర్థిక సంక్షోభం కారణంగా ఇరాన్ ప్రజలు పలు రకాలుగా కష్టాలను ఎదుర్కొంటున్నారని, భారీ మూల్యం చెల్లిస్తున్నారని మహ్మదీ పేర్కొన్నారు. తమ పాలకులపై ఇరాన్ వాసుల్లో నిశ్శబ్దంగా తీవ్ర వ్యతిరేకత పెరుగుతోందంటూ ఆమె ఇస్లాం డ్రెస్ కోడ్‌ను ఉల్లంఘించిన కారణంగా 22 ఏళ్ల మహ్సా అమీనిని అధికారులు నిర్బంధించడం, అనంతరం ఆమె ఆస్పత్రిలో చనిపోవడంతో మొదలైన అల్లర్లు దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో కొనసాగిన విషయాన్ని ప్రస్తావించారు. అమీనిని స్మరించుకుంటూ ఈ పుస్తకాన్ని విడుదల చేస్తున్నామన్నారు. హక్కుల కోసం పోరాడుతున్న నర్గీస్ మహ్మదీకి ఇరాన్ ప్రభుత్వం వివిధ ఆరోపణలు మోపి మొత్తం 44 ఏళ్ల జైలు శిక్షలు విధించిన సంగతి తెలిసిందే. -
ఇరాన్లో ఏం జరుగుతోంది.. అమెరికా, ఇజ్రాయెల్‌కు కొత్త పరీక్ష!
టెహ్రాన్: అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో శుక్రవారం భారీ ర్యాలీ జరిగింది. వేలాది మంది మిలటరీ దుస్తులు ధరించి, ఇరాన్ జెండాలు చేతబట్టి ర్యాలీలో పాల్గొన్నారు. అమెరికా దురాక్రమణ ప్రయత్నాలను అడ్డుకుంటామని, అవసరమైతే ప్రాణాలైనా అర్పిస్తామని నినాదాలు చేశారు. ఫిబ్రవరిలో అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైన తర్వాత టెహ్రాన్‌లో జరిగిన అతిపెద్ద ర్యాలీ ఇదేనని పలు కథనాలు పేర్కొంటున్నాయి. సుమారు 3 లక్షల మంది పాల్గొన్నట్టు ఇరాన్ ప్రభుత్వ టీవీ అంచనా వేసింది.ఇరాన్ ప్రభుత్వం చేపట్టిన ‘జన్ఫాదే–ఇరాన్’ (ఇరాన్ కోసం ప్రాణాలర్పించేవారు) ప్రచారోద్యమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఇందులో పాల్గొన్న వారికి ఆయుధ శిక్షణ కూడా ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను అణచివేయడంలో కీలకంగా ఉండే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్, బసీజ్ మిలీషియాలకు వీరు అదనపు బలంగా ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేరేందుకు ఇప్పటికే 6 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారని రివల్యూషనరీ గార్డ్ చీఫ్ జనరల్ హస్సన్ హస్సన్జాదెహ్ తెలిపారు. త్వరలోనే ఇతర నగరాల్లోనూ ఇలాంటి ర్యాలీలు నిర్వహిస్తామని బసీజ్ విభాగం నూతన సారథి హొస్సేన్ తాయెబ్ ప్రకటించారు.ర్యాలీని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, మిలటరీ కమాండర్లు, సీనియర్ అధికారులు పరిశీలించారు. కొందరు పాల్గొనేవారు అమెరికా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆ దేశాల జెండాలను తొక్కుకుంటూ వెళ్లారు. మరోవైపు ఓ ట్రక్కుపై మహిళా గార్డులు మెషీన్ గన్లతో కనిపించడం ర్యాలీలో ప్రత్యేకంగా నిలిచింది.Women present in today's rally of ´Sacrifice for Iran' in Tehran pic.twitter.com/YiiLOO3rov— Farzaneh Ashoorioun | فرزانه عشوریون (@frzaneh_a) September 18, 2026 ఇరాన్‌కు ప్లస్.. ఇదిలా ఉండగా.. యుద్ధం కొనసాగుతున్న వేళ జరిగిన ఈ భారీ ర్యాలీని ఇరాన్ ప్రభుత్వం దేశ ప్రజాబలాన్ని, ప్రతిఘటన సామర్థ్యాన్ని ప్రదర్శించే కార్యక్రమంగా ముందుకు తీసుకెళ్లింది. అమెరికా ఆంక్షలు, ఆర్థిక ఒత్తిళ్ల మధ్య దేశంలో ఐక్యతను చాటే ప్రయత్నంగానూ దీనిని అంతర్జాతీయ మీడియా విశ్లేషించింది. ఇప్పటికే 6 లక్షల మంది వాలంటీర్లు నమోదు చేసుకున్నట్లు అధికారులు చెబుతుండటం, ఇతర నగరాల్లోనూ ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ప్రకటించడం.. యుద్ధ పరిస్థితుల్లో ప్రజలను మరింతగా సమీకరించేందుకు ఇరాన్ ప్రయత్నిస్తున్న విషయాన్ని సూచిస్తోంది.ట్రంప్‌కు టెన్షన్.. ఇదే ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. ఇరాన్ ప్రజలు అమెరికా దాడులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుతారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశించిన సమయంలో.. యుద్ధం మధ్యలో ఇరాన్ ప్రభుత్వం భారీ స్థాయిలో ప్రజలను సమీకరించి ప్రతిఘటనకు సిద్ధమవుతున్నట్లు చూపిస్తోంది. ఈ పరిణామం అమెరికా-ఇజ్రాయెల్ వ్యూహాలపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది.ఇదీ చదవండి: ఉత్కంఠకు తెర.. రష్యా ఆంక్షల బిల్లుపై ట్రంప్ సంతకం🚨🇮🇷 🇺🇸 Iranians marched under a "we will kill" banner showing Trump in crosshairs as 600,000 sign up for military trainingGen. Hassan Hassanzadeh gave that recruitment figure at Friday's rally in Tehran, where state media counted 300,000 in the streets under the banner "ones… pic.twitter.com/BxKY00yrnz— Mario Nawfal (@MarioNawfal) September 19, 2026 -
ముస్లిం దేశాలను విడదీసే కుట్ర.. ఇరాన్ సంచలన వ్యాఖ్యలు
ఇస్లామిక్ ప్రపంచంలో అత్యంత పవిత్రమైన మక్కా నగరాన్ని లక్ష్యంగా చేసుకుని హౌతీలు డ్రోన్ దాడికి యత్నించారన్న సౌదీ అరేబియా ఆరోపణలు పశ్చిమాసియాలో కొత్త రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు మక్కా దిశగా వచ్చిన డ్రోన్‌ను నిషేధిత గగనతలంలోకి ప్రవేశించకముందే కూల్చివేశామని ప్రకటించగా.. హౌతీలు మాత్రం మక్కా లేదా ఇతర పవిత్ర స్థలాలను లక్ష్యంగా చేసుకోలేదని స్పష్టం చేశారు.ఈ వివాదంపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ స్పందిస్తూ.. పవిత్ర స్థలాల భద్రతను అడ్డం పెట్టుకుని ముస్లిం దేశాల మధ్య చిచ్చు పెట్టేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, మక్కా పేరుతో జరుగుతున్న ఈ ఆరోపణలను రాజకీయం చేయడం మానుకోవాలని హితవు పలికారు. నిరాధార ఆరోపణలతో ముస్లిం దేశాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. మక్కా, మదీనా, అల్‌అక్సా మసీదు సహా పవిత్ర స్థలాలు, యాత్రికుల భద్రత అందరి బాధ్యత అని పేర్కొన్నారు. మతపరమైన పవిత్రతను ప్రాంతీయ ఉద్రిక్తతలకు ఆయుధంగా మార్చొద్దని ఆయన హెచ్చరించారు. ఈమేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు.కేవలం ఒక డ్రోన్‌ను అడ్డగించామన్న ప్రకటన ఆధారంగా ఒక నిర్దిష్ట వర్గాన్ని నేరుగా నిందించలేమని ఆయన పేర్కొన్నారు. యెమెన్ ప్రభుత్వం ఈ ఆరోపణలను ఇప్పటికే స్పష్టంగా ఖండించిందని గుర్తుచేశారు. పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్ పాల్పడుతున్న నేరాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి, ఇస్లామిక్ దేశాల మధ్య విభేదాలు సృష్టించడానికే ఇలాంటి అబద్ధపు ప్రచారాలు జరుగుతున్నాయని, దీనిపట్ల ఈ ప్రాంత దేశాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.సౌదీ ప్రకటన.. ఇదిలా ఉండగా.. మక్కా గగనతలంలోకి ప్రవేశించకముందే మంగళవారం సాయంత్రం ఒక డ్రోన్‌ను తమ గగనతల రక్షణ వ్యవస్థ కూల్చివేసిందని సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు వెల్లడించాయి. ఈ ఘటనను మేజర్ జనరల్ తుర్కీ అల్-మల్కీ తీవ్రమైన 'ఉగ్రవాద చర్య'గా అభివర్ణించారు. అయితే, ఈ ఆరోపణలను హౌతీ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ యహ్యా సారీ తీవ్రంగా ఖండించారు. ఇవన్నీ సౌదీ అరేబియా అల్లిన కట్టుకథలని కొట్టిపారేశారు. తమ దాడులు కేవలం సౌదీ సైనిక స్థావరాలు, చమురు కేంద్రాలపై మాత్రమే ఉంటాయని చెప్పారు.పాక్ రియాక్షన్.. ఇక మక్కా ఘటనపై పాకిస్తాన్ వైఖరి మరింత కీలకంగా మారింది. సౌదీ అరేబియా, పాకిస్తాన్, తుర్కియే మధ్య కుదిరిన మక్కా సంయుక్త రక్షణ ఒప్పందానికి తాము కట్టుబడి ఉన్నామని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పష్టం చేశారు. కూటమిలో తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తుందన్నారు. రక్షణ వ్యూహాలకు సంబంధించిన వివరాలను మాత్రం గోప్యంగా ఉంచుతామని ఆయన పేర్కొన్నారు. ఇస్లామిక్ పవిత్ర స్థలాల రక్షణ కోసం ప్రత్యేకంగా ఒప్పందం ఉండాల్సిన అవసరం లేదని, ఒకవేళ మక్కాపై దాడి జరిగితే దాన్ని రక్షించడం ప్రతి ముస్లిం దేశం మొదటి బాధ్యత అని ఆయన అన్నారు. మూడు దేశాలు సంతకం చేసిన దేశాల్లో దేని ప్రాదేశిక సమగ్రత లేదా భౌగోళిక సరిహద్దులపై దాడి జరిగినా ఒప్పందం ప్రకారం ముందుకెళ్తామని వివరించారు.ఇదీ చదవండి: పాపం సౌదీ.. కీలక సమయంలో హ్యాండిచ్చిన ట్రంప్ -
గాల్లో ఇంజిన్ ఫెయిల్.. ఊడిన టైర్..! విమానంలో ఒక్కసారిగా అలజడి..!
-
ఇరాన్ విమానంలో భయానక సీన్
టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ఒక్కసారిగా భారీగా కుదుపులకు గురైంది. ఏం జరుగుతుందో అర్థంకాక ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. ఇంతలో క్యాబిన్ పైకప్పు భాగాలు ఊడిపడి సీట్లపై వేలాడుతూ కనిపించాయి. లగేజీ బిన్లు తెరుచుకుని బ్యాగులు కిందపడటంతో పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. చివరకు పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించి విమానాన్ని తిరిగి ఎయిర్‌పోర్టుకు తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది.ఇరాన్‌కు చెందిన సెపెహ్రాన్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737 విమానం మంగళవారం సాయంత్రం మషద్ నుంచి కెర్మాన్‌షాకు బయల్దేరింది. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ల్యాండింగ్ గేర్‌లోని ఓ టైరు ఊడిపోయింది. ఆ టైరు దెబ్బతినడంతో దాని భాగాలు ఇంజిన్‌ను తాకాయి. దీంతో ఇంజిన్‌లో సమస్య తలెత్తి విమానం తీవ్రంగా కుదుపులకు లోనైంది. పైలట్ సాంకేతిక సమస్యను గుర్తించి విమానాన్ని మషద్ వైపు మళ్లించారు. అత్యవసర పరిస్థితిని ప్రకటించి తిరిగి ల్యాండ్ చేయాలని నిర్ణయించారు.భయంతో కేకలు..విమానం తిరిగి వస్తున్న సమయంలో కుదుపులు మరింత తీవ్రంగా మారాయి. ఆ ప్రభావంతో క్యాబిన్ పైకప్పు లోపలి లైనింగ్ భాగాలు ఊడిపోయి ప్రయాణికులపై పడినట్లు వీడియోల్లో కనిపించింది. ఆ సమయంలో ప్రాణ భయంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. కొన్ని చోట్ల విమానం లోపలి నిర్మాణంలోని భాగాలు కూడా బయటకు కనిపించాయి. లగేజీ బిన్లు తెరుచుకోవడంతో బ్యాగులు సీట్లపై, మార్గంలో పడిపోయాయి. సేఫ్‌గా ల్యాండింగ్..అయితే విమానం మషద్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. లగేజీలు కిందపడ్డా కూడా ప్రయాణికులు, సిబ్బంది ఎవరూ గాయపడలేదు. అనంతరం ప్రయాణికులను మరో విమానంలో కెర్మాన్‌షాకు పంపించినట్లు సమాచారం. ఘటన అనంతరం రన్‌వేను కొంతసేపు మూసివేసి తనిఖీలు నిర్వహించారు.విమానంలో సాంకేతిక లోపానికి అసలు కారణమేంటన్న దానిపై ఇరాన్ పౌర విమానయాన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ఎయిర్‌లైన్స్‌కు చెందిన మరో విమానం ఆగస్టు 25న మషద్‌లో ల్యాండ్ అవుతుండగా రన్‌వేపై నుంచి పక్కకు వెళ్లిన ఘటన జరిగింది.WATCH: Cabin ceiling falls apart onboard a Sepehran Airlines Boeing 737 after a tire reportedly burst shortly after takeoff from Mashhad Airport causing engine damage and severe vibrations. pic.twitter.com/R7RP1AwZYX— Breaking Aviation News & Videos (@aviationbrk) September 15, 2026 -
ఒమన్‌లో జరగాల్సిన ఇరాన్ కీలక భేటీ.. వాయిదా!
ఒమన్: గల్ఫ్ అరబ్ దేశాలతో ఇరాన్ నిర్వహించాల్సిన సమావేశం వాయిదా పడింది. అయితే, ప్రాంతీయ దేశాల అభ్యర్థన మేరకే భేటీని వాయిదా వేసినట్లు సమాచారం. దీంతో ఇరాన్, గల్ఫ్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.ఒమన్‌లో జరగాల్సిన ఈ సమావేశంలో సౌదీ అరేబియా, ఖతార్, ఇరాక్ పాల్గొనాల్సి ఉంది. అయితే, హోర్ముజ్ జలసంధికి సంబంధించిన భవిష్యత్ పరిణామాలు, ఈ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులపై ఇరాన్ ఆయా దేశాలతో చర్చించాలని భావించినట్లు తెలుస్తోంది.అలాగే, ప్రపంచంలోని కీలకమైన సముద్ర మార్గాల్లో హోర్ముజ్ జలసంధి ఒకటి. చమురు రవాణాకు కూడా ఇది ఎంతో ముఖ్యమైన మార్గం కావడంతో అక్కడి పరిస్థితులపై గల్ఫ్ దేశాలతో పాటు ఇతర దేశాలు కూడా ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంటాయి.ఇదిలా ఉండగా.. బహ్రెయిన్ ఇప్పటికే ఇరాన్ అధికారులతో సమావేశానికి నిరాకరించింది. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాల వైఖరి మరోసారి చర్చకు వచ్చింది. ఇరాన్‌తో చర్చలు జరపడం విషయంలో ఆయా దేశాలు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.మరోవైపు.. ఇరాన్ పాలక వ్యవస్థ కారణంగానే ప్రాంతంలో శాంతి, స్థిరత్వానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని గల్ఫ్ దేశాలు భావిస్తున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో ఇరాన్ ప్రతిపాదించిన భేటీ వాయిదా పడటం ప్రాధాన్యం సంతరించుకుంది.ఇదీ చదవండి: సంక్షోభంలో నేపాల్.. వెలుగులు పంచుతున్న భారత్ -
హర్ముజ్ సంక్షోభంలో బిగ్ ట్విస్ట్.. అనూహ్య పరిణామాలు!
పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతున్న కొద్దీ.. ప్రపంచాన్ని కలవరపెడుతున్న హర్ముజ్ జలసంధి సంక్షోభం మరింత కష్టతరంగా మారుతోంది. ఇప్పటికే దిగ్భందనాలు, సముద్ర రవాణాపై ఆంక్షలు, నౌకలపై దాడులు, చమురు సరఫరాకు అంతరాయాలతో పరిస్థితి ఆందోళనకరంగా మారగా.. మరోవైపు ఈ సమస్యకు దౌత్యపరమైన పరిష్కారం చూపేందుకు జరుగుతున్న ప్రయత్నాలపైనా అనిశ్చితి నెలకొంది. సమస్యను చర్చల ద్వారా చక్కదిద్దేందుకు కీలకమైన సమావేశం జరగాల్సి ఉండగా.. చివరి నిమిషంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. హర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు, భద్రత, భవిష్యత్ నిర్వహణపై ఇరాన్, గల్ఫ్ దేశాల మధ్య ఒమన్‌లో సోమవారం కీలక సమావేశం జరగాల్సి ఉంది. అయితే ఈ భేటీని వాయిదా వేస్తున్నట్లు ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ అల్ బుసైదీ ప్రకటించారు. ప్రాంతీయ దేశాల మధ్య ఏకాభిప్రాయం సాధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కొత్త తేదీని మాత్రం ప్రకటించలేదు. ఇటు ఇరాన్ కూడా సమావేశం వాయిదా పడిన విషయాన్ని ధ్రువీకరించింది. కొన్ని దేశాల అభ్యర్థన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఒమన్‌తో సమన్వయం చేసుకుని తదుపరి తేదీని ఖరారు చేస్తామని తెలిపింది.తద్వారా.. హర్ముజ్‌పై ఒక తాత్కాలిక అవగాహనకు రావాల్సిన సమయంలోనే దౌత్య ప్రక్రియకు బ్రేక్ పడినట్టయింది. అసలు సమస్య ఇదే..హర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాకు అత్యంత కీలకమైన మార్గం. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఈ మార్గంలో నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రపంచ ఇంధన సరఫరాపైనా ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఇరాన్, ఒమన్ మధ్య హర్ముజ్‌లో రాకపోకలను సాధారణ స్థితికి తీసుకొచ్చే మార్గాలపై ఇప్పటికే పలు దఫాల చర్చలు జరిగాయి. ఇప్పుడు గల్ఫ్ దేశాలను కూడా భాగస్వామ్యం చేసి ఆ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.అయితే ఇరాన్ వైఖరి మాత్రం స్పష్టంగా ఉంది. అమెరికా తమపై దాడులు, బెదిరింపులు, ఇతర ఒత్తిళ్లు కొనసాగిస్తున్నంతకాలం జలసంధిలో రాకపోకలను పూర్తిగా సాధారణ స్థితికి తీసుకురావడం సాధ్యం కాదని ఆ దేశం చెబుతోంది. అంటే.. గల్ఫ్ దేశాలతో ఇరాన్ ఒక అవగాహనకు వచ్చినా, అమెరికా–ఇరాన్ మధ్య ప్రధాన వివాదం పరిష్కారం కాకపోతే హర్ముజ్‌లో పూర్తి స్థాయిలో రాకపోకలు పునరుద్ధరించడం కష్టమే. అందుకే ఇప్పుడు గల్ఫ్ దేశాలతో జరిగే చర్చలతోపాటు అమెరికా–ఇరాన్ మధ్య దౌత్యపరమైన పరిష్కారం కూడా కీలకంగా మారింది.నౌకపై దాడితో మరింత టెన్షన్ఈ దౌత్య ప్రయత్నాలకు సమాంతరంగానే హర్ముజ్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఆదివారం ఓ వాణిజ్య నౌకను ప్రాజెక్టైల్ తాకడంతో మంటలు చెలరేగాయి. సిబ్బందిని నౌక నుంచి తరలించాల్సి వచ్చింది. ఇరాన్ అధికారిక వర్గాల ప్రకారం.. ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు. దీంతో కీలక సముద్ర మార్గంలో నౌకల భద్రతపై ఆందోళనలు మరింత పెరిగాయి.హర్ముజ్‌లో రాకపోకలు ఇప్పటికే భారీగా తగ్గిపోయాయి. ఇక్కడ పరిస్థితి మరింత దిగజారితే ప్రపంచ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే ఈ జలసంధిపై ఏ చిన్న పరిణామం జరిగినా అంతర్జాతీయ చమురు మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడుతోంది.సౌదీ పైప్‌లైన్‌పైనా దాడిహర్ముజ్ సంక్షోభానికి తోడు సౌదీ అరేబియాలోని కీలక చమురు మౌలిక సదుపాయాలపైనా దాడులు జరగడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. తూర్పు ప్రాంతాల నుంచి ఎర్ర సముద్ర తీరంలోని యన్బుకు చమురును తరలించే ఈస్ట్–వెస్ట్ పైప్‌లైన్‌పై డ్రోన్ దాడులు జరిగాయి. దీంతో ఆ మార్గంలో చమురు సరఫరా నిలిచిపోయింది.హర్ముజ్ ద్వారా రవాణా దెబ్బతిన్న సమయంలో ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగపడే ఈ పైప్‌లైన్ కూడా పనిచేయకపోవడం మార్కెట్లలో ఆందోళన పెంచింది. ఇప్పటికే హర్ముజ్ ఎఫెక్ట్‌తో రోజుకు మిలియన్ల బ్యారెళ్ల చమురు సరఫరా దెబ్బతినగా.. సౌదీ పైప్‌లైన్ మూసివేతతో ప్రపంచ సరఫరాపై మరింత ఒత్తిడి పెరిగే పరిస్థితి ఏర్పడింది.బాబ్ అల్ మాండెబ్లోనూ మంటలుమరోవైపు హర్ముజ్‌కు మరో కీలక ప్రత్యామ్నాయ సముద్ర మార్గమైన(ఎర్ర సముద్రం-Red Sea) బాబ్ అల్ మాండెబ్ జలసంధిలోనూ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. యెమెన్‌లో హౌతీల దాడులు తీవ్రతరం కావడంతో సౌదీ అరేబియాపైనా ఒత్తిడి పెరుగుతోంది. దీంతో ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన రెండు మార్గాలపైనా ఒకేసారి భద్రతా ముప్పు నెలకొంది.ఇలాంటి పరిస్థితుల్లో సౌదీ అరేబియా అమెరికా సాయం కోరినట్లు సమాచారం. హౌతీల పురోగతిని అడ్డుకోవడంలో అమెరికా మరింత చురుగ్గా వ్యవహరించాల్సిన అవసరం ఉందనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. అదే సమయంలో అమెరికా నుంచి ప్రస్తుతానికి నిఘా సమాచార సహకారానికే పరిమితమైన స్పందన కనిపిస్తోంది.ట్రంప్‌కు కొత్త చిక్కులుహర్ముజ్ జలసంధి మూసివేత, నౌకలపై వరుస దాడులు, సౌదీ చమురు మౌలిక సదుపాయాలపై దాడులు, బాబ్ అల్ మాండెబ్ వద్ద హౌతీల దూకుడు.. ఇలా సంక్షోభం ఒక్క హార్ముజ్కే పరిమితం కాకుండా ప్రాంతంలోని కీలక ఇంధన మార్గాలన్నింటికీ విస్తరిస్తోంది. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఒత్తిడి మరింత పెరుగుతోంది. ఇరాన్‌తో యుద్ధం ఈ ఏడాదిలోనే ముగిసే అవకాశం ఉందని, ఇరాన్ చర్చలకు సిద్ధంగా ఉందని ట్రంప్ చెబుతున్నారు. యుద్ధం ముగిసిన వెంటనే ఇంధన ధరలు భారీగా తగ్గుతాయని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం ట్రంప్ అంచనాలకు భిన్నంగా సాగుతున్నాయి. హర్ముజ్‌పై దౌత్య ప్రయత్నాలు వాయిదా పడటం, సముద్ర మార్గాల్లో నౌకలపై దాడులు కొనసాగడం, సౌదీ చమురు రవాణా మార్గానికి దెబ్బ తగలడం, మరోవైపు బాబ్ అల్ మాండెబ్ వద్ద హౌతీల పట్టు పెరగడం.. యుద్ధాన్ని త్వరగా ముగించాలన్న అమెరికా ప్రయత్నాలకు కొత్త సవాళ్లు విసురుతున్నాయి. పైగా సౌదీ అరేబియా హౌతీలను ఎదుర్కొనేందుకు అమెరికా సైనిక సాయం కోరగా.. ఇప్పటివరకు వాషింగ్టన్ నిఘా సమాచార సహాయానికే పరిమితమైంది. దీంతో ఒకవైపు యుద్ధం ముగుస్తుందని ట్రంప్ చెబుతున్నా.. మరోవైపు సంక్షోభం మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తుండటం ఆయనకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. రాకెట్లా చమురు ధరలుహర్ముజ్ సంక్షోభం ఇలాగే కొనసాగితే దాని ప్రభావం పశ్చిమాసియాకే పరిమితం కాదు. ప్రపంచ చమురు సరఫరాలో గణనీయమైన భాగం ఈ ప్రాంతంలోని సముద్ర మార్గాలపై ఆధారపడి ఉంటుంది. సరఫరాకు అంతరాయం కొనసాగితే చమురు ధరలు మరింత పెరిగి.. రవాణా ఖర్చులు, ద్రవ్యోల్బణం, ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా చేరింది. తాజా దాడులు, హర్ముజ్ చర్చల వాయిదాతో మార్కెట్లలో సరఫరా భయాలు మరింత పెరిగాయి. అందుకే ఇప్పుడు అందరి చూపూ హర్ముజ్‌పైనే. జలసంధిలో రాకపోకలు ఎప్పుడు సాధారణ స్థితికి వస్తాయి? ఇరాన్, గల్ఫ్ దేశాల మధ్య దౌత్య ప్రయత్నాలు ఎప్పుడు మళ్లీ మొదలవుతాయి? అమెరికా–ఇరాన్ మధ్య ఎలాంటి అవగాహన కుదురుతుంది? అన్నదే కీలకంగా మారింది. ప్రస్తుతానికి మాత్రం చర్చలకు బ్రేక్ పడటంతో హర్ముజ్ సంక్షోభం మరింత ముదిరే సంకేతాలు కనిపిస్తున్నాయి.ఇదీ చదవండి: 45 వేల కోట్లు ఉంటేనే మళ్లీ మాములు స్థితికి! -
లొంగేది లేదు.. సుప్రీం లీడర్ బతికే ఉన్నారు: ఇరాన్ అధ్యక్షుడి వార్నింగ్
అమెరికా, ఇజ్రాయెల్ ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ తేల్చిచెప్పారు. అదే సమయంలో ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ బతికే ఉన్నారని, ఆయన తన విధులను కొనసాగిస్తున్నారని సంచలన ప్రకటన చేశారు. ఖమేనీ ఆచూకీపై వస్తున్న ఊహాగానాలన్నీ అమెరికా, ఇజ్రాయెల్ సృష్టిస్తున్న సమాచార యుద్ధంలో భాగమేనని ఆరోపించారు. ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు హాజరైన పెజెష్కియాన్.. ప్రత్యేక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.‘దేవుడి దయవల్ల మా సుప్రీం లీడర్ బతికే ఉన్నారు. ఆయన తన విధులను కొనసాగిస్తున్నారు’ అని పెజెష్కియాన్ స్పష్టం చేశారు. అయితే, మొజ్తబా ఖమేనీ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఆరు నెలల క్రితం అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాయపడినప్పటి నుంచి ఖమేనీ బహిరంగంగా కనిపించకపోవడంతో ఆయన ఆరోగ్యం, పాలనా సామర్థ్యంపై తీవ్ర ఊహాగానాలు మొదలయ్యాయి. తన తండ్రి, మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఆ దాడుల్లో మరణించిన తర్వాత కూడా మొజ్తబా ఖమేనీ బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండటం ఈ అనుమానాలకు మరింత కారణమైంది.సుప్రీం లీడర్‌దే నిర్ణయం..అయితే, ఖమేనీ ఎక్కడున్నారో గుర్తించలేకపోవడంతోనే అమెరికా, ఇజ్రాయెల్ ఆయనపై ఊహాగానాలు వ్యాప్తి చేస్తున్నాయని పెజెష్కియాన్ ఆరోపించారు. ఇరాన్ నాయకులు, సైనిక కమాండర్లు, శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయని.. అందుకే సుప్రీం లీడర్ ఆచూకీని భద్రతా కారణాలతో గోప్యంగా ఉంచుతున్నామని తెలిపారు. ఇరాన్లో తుది నిర్ణయాధికారం మాత్రం సుప్రీం లీడర్దేనని స్పష్టం చేశారు. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ ఒత్తిళ్లకు ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగబోదని పెజెష్కియాన్ స్పష్టం చేశారు. ఇరాన్ సైనిక బలగాలను ఎదుర్కొనే బదులు పౌర మౌలిక వసతులు, ఆహార సరఫరాలు, ప్రజల జీవనోపాధులపై దాడులు చేస్తున్నారని ఆయన తీవ్రంగా ఆరోపించారు. ప్రజలను బెదిరించి ఇరాన్‌ను లొంగదీసుకోలేరని, తమ దేశం ఎప్పటికీ లొంగబోదని ఎక్స్ వేదికగా తేల్చిచెప్పారు.అణు కార్యక్రమంపై..ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న ఆరోపణలను కూడా పెజెష్కియాన్ కొట్టిపారేశారు. తమ అణు కార్యక్రమం అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగానే సాగిందని, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (NPT) పరిధిలోనే పనిచేస్తున్నామని చెప్పారు. ఇరాన్ అణు కార్యకలాపాలను అంతర్జాతీయ సంస్థలు నిరంతరం పర్యవేక్షించాయని పేర్కొన్నారు. అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామన్న ఆరోపణలకు ఆధారాలు ఏమిటని ప్రశ్నించారు. అణు అంశంపై చర్చలకు ఇరాన్ సిద్ధంగానే ఉందని తెలిపారు. అయితే అమెరికాతో తక్షణమే ప్రత్యక్ష చర్చలకు తిరిగి వెళ్లే పరిస్థితి లేదన్నారు. తన తండ్రి అలీ ఖమేనీ హత్య తర్వాత అమెరికాపై ఇరాన్లో నమ్మకం తీవ్రంగా దెబ్బతిందని చెప్పారు. ఇరాన్‌పై దాడులు నిలిపివేయడంతో పాటు ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో ఇజ్రాయెల్ అణు కార్యక్రమంపై అంతర్జాతీయ స్థాయిలో ఎందుకు తగినంత పరిశీలన జరగడం లేదని ప్రశ్నించారు.మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలకు శాశ్వత పరిష్కారం కోసం ఇరాన్, సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్థాన్ సహా ప్రాంతీయ దేశాలు కలిసి ప్రత్యేక భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని పెజెష్కియాన్ ప్రతిపాదించారు. యుద్ధాల కంటే పరస్పర సహకారం, వాణిజ్యం, ఆర్థిక సంబంధాలే ప్రాంతానికి మేలు చేస్తాయని అన్నారు. యూఏఈతో తమకు ఎలాంటి సమస్య లేదని, పొరుగు దేశాలను సోదర దేశాలుగానే చూస్తామని స్పష్టం చేశారు. మొత్తంగా ఒకవైపు తమ సుప్రీం లీడర్ బతికే ఉన్నారని స్పష్టం చేస్తూనే.. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్‌కు లొంగేది లేదంటూ పెజెష్కియాన్ చేసిన వ్యాఖ్యలు ఇరాన్ వైఖరిని మరోసారి స్పష్టం చేశాయి. ఖమేనీ ఆచూకీ మాత్రం ఇంకా రహస్యంగానే ఉండటం ఈ పరిణామాలకు మరింత ప్రాధాన్యం తెచ్చింది.ఇదీ చదవండి: సముద్రం అడుగున బంగారు ఖజానా.. చైనా సంచలన అన్వేషణ! -
భారత్‌కు డబుల్ టెన్షన్.. హౌతీల చర్యతో మరో సంక్షోభం!
ఒకవైపు హార్ముజ్ జలసంధి.. మరోవైపు బాబ్ ఎల్-మండేబ్! ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన రెండు సముద్ర ద్వారాలపైనా ముప్పు పెరగడంతో భారత్‌కు కొత్త తలనొప్పి మొదలైంది. యెమెన్ తీరంలో కేవలం 18 గంటల్లో హౌతీలు చేపట్టిన మెరుపు దాడులు ఇప్పుడు ప్రపంచ దృష్టిని బాబ్ ఎల్-మండేబ్పైకి మళ్లించాయి. ఈ కీలక జలసంధిపై హౌతీలు పట్టు సాధించారు. దీంతో, గల్ఫ్ చమురు సరఫరాల నుంచి భారత్-యూరప్ వాణిజ్యం వరకు దాని ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే హార్ముజ్ సంక్షోభంతో ఇంధన సరఫరాలపై ఒత్తిడి ఎదురవుతున్న వేళ.. మరో సముద్ర మార్గం కూడా ప్రమాదంలో పడటం భారత్‌కు డబుల్ షాక్‌గా మారే అవకాశముంది.బాబ్ ఎల్-మండేబ్ ఎందుకంత కీలకం?యెమెన్, జిబౌటీ మధ్య ఉన్న బాబ్ ఎల్-మండేబ్ సుమారు 29 కిలోమీటర్ల వెడల్పు గల కీలక జలసంధి. ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ ఏడెన్, ఆపై అరేబియా సముద్రంతో అనుసంధానించే ఈ మార్గం.. సూయజ్ కాలువ ద్వారా యూరప్, ఆసియా మధ్య సముద్ర వాణిజ్యానికి ప్రధాన ద్వారం. చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, కంటైనర్ సరుకులు, పారిశ్రామిక ఉత్పత్తులు పెద్ద ఎత్తున ఈ మార్గం గుండా రవాణా అవుతాయి. భారత్‌కు ఈ మార్గం మరింత కీలకం. దేశం నుంచి యూరప్‌కు డీజిల్, ఏవియేషన్ ఇంధనం, ఔషధాలు, వస్త్రాలు, యంత్ర పరికరాలు సహా అనేక ఉత్పత్తులు సూయజ్ మార్గం మీదుగా వెళ్తాయి. ఈ మార్గానికి అంతరాయం ఏర్పడితే భారత ఎగుమతుల రవాణా ఖర్చులు ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉంది.హౌతీల మెరుపు దాడులుతాజా పరిణామాల్లో హౌతీలు యెమెన్ ఎర్ర సముద్ర తీరంలో వేగంగా ముందుకు సాగినట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. వ్యూహాత్మకమైన మోఖా పోర్టును స్వాధీనం చేసుకున్నట్లు రాయిటర్స్ వెల్లడించగా.. బాబ్ ఎల్-మండేబ్‌లో కీలక స్థానంలో ఉన్న మయూన్ (పెరిమ్) ద్వీపం కూడా హౌతీల ఆధీనంలోకి వెళ్లినట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. జుకర్, హనిష్ దీవుల వైపునకు కూడా వారు చేరుకున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది. ఈ పరిణామాలతో బాబ్ ఎల్-మండేబ్ ప్రవేశ మార్గాలపై హౌతీల నియంత్రణ పెరిగింది. హౌతీ నేతలు ఇప్పటికే ఈ జలసంధిపై తమ ఆధిపత్యాన్ని ప్రకటించారు.మూసుకుపోతే ఏం జరుగుతుంది?బాబ్ ఎల్-మండేబ్‌లో నౌకల రాకపోకలకు ముప్పు ఏర్పడితే.. షిప్పింగ్ కంపెనీలు ఈ మార్గాన్ని దాటేందుకు వెనుకడుగు వేసే అవకాశం ఉంది. సముద్ర బీమా ప్రీమియాలు పెరగడం, నౌకలు ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లడం అనివార్యంగా మారొచ్చు. 2023లో హౌతీల దాడుల సమయంలోనే దీనికి ఉదాహరణ కనిపించింది. వందలాది కాదు.. వేలాది నౌకలు సూయజ్ కాలువ మార్గాన్ని తప్పించి ఆఫ్రికా చుట్టూ కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా ప్రయాణించాల్సి వచ్చింది. దీంతో ప్రయాణ సమయం, ఇంధన వ్యయం, సరుకు రవాణా ఖర్చులు భారీగా పెరిగాయి.Houthis chant in celebration on the captured Bab el-Mandeb coastMany take a break to cool off with a dip https://t.co/yZxW5lL1pn pic.twitter.com/E3GPN3iO0C— RT (@RT_com) September 11, 2026భారత్‌పై డబుల్ ఎఫెక్ట్?బాబ్ ఎల్-మండేబ్ సంక్షోభం భారత్‌ను రెండు వైపులా దెబ్బతీసే అవకాశం ఉంది. మొదటిది.. ఇంధన ధరలు. సముద్ర రవాణాకు అంతరాయం ఏర్పడితే చమురు సరఫరాలపై ఒత్తిడి పెరిగి అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు మరింత పెరగొచ్చు. ఇప్పటికే గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతల కారణంగా ఇంధన మార్కెట్లు ఒత్తిడిలో ఉన్న నేపథ్యంలో ఇది భారత్‌కు భారంగా మారొచ్చు.రెండోది.. ఎగుమతులు. భారత్ నుంచి యూరప్‌కు వెళ్లే సరుకులు ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తే ప్రయాణ దూరం భారీగా పెరుగుతుంది. ఉదాహరణకు ముంబై నుంచి రోటర్‌డామ్‌కు సూయజ్ మార్గంలో దాదాపు 15,700 కిలోమీటర్ల దూరం ఉండగా.. కేప్ ఆఫ్ గుడ్ హోప్ చుట్టూ వెళ్లాల్సి వస్తే దాదాపు 23,000 కిలోమీటర్లకు చేరుతుంది. అంటే అదనపు ఇంధనం, ఎక్కువ సమయం, అధిక బీమా, పెరిగిన ఫ్రైట్ ఛార్జీలు భారత ఎగుమతులపై నేరుగా ప్రభావం చూపుతాయి. అందుకే బాబ్ ఎల్-మండేబ్ ఇప్పుడు యెమెన్ తీరంలోని ఓ చిన్న జలసంధి మాత్రమే కాదు.. భారత్ ఇంధన భద్రత, యూరప్ వాణిజ్యం, ప్రపంచ షిప్పింగ్ వ్యవస్థకు కీలక పరీక్షగా మారింది.ఇదీ చదవండి: బ్రిక్స్ సదస్సుకు దేశాధినేతలు, విశిష్ట అథితులు -
‘మరో దారి లేదు..’ ఇరాన్ యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఇరాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై తమ సైనిక చర్యను ఉగ్రవాదంపై పోరులో భాగంగా ఆయన అభివర్ణించారు. గెలుపే లక్ష్యంగా పోరాడుతున్నామని.. వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. పశ్చిమాసియా సంక్షోభంపై పూటకో ప్రకటన చేస్తున్న ఆయన.. ఇప్పుడు మరోసారి తన వైఖరిని స్పష్టం చేశారు.9/11 దాడులకు పాతికేళ్లు పూర్తైన సందర్భంగా వాషింగ్టన్‌లోని పెంటగాన్‌లో జరిగిన స్మారక కార్యక్రమంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2001 నాటి ఉగ్రదాడులను గుర్తుచేసుకుంటూ.. పెంటగాన్‌పై దూసుకొచ్చిన హైజాక్ విమానంలో 64 మంది, భవనంలో 125 మంది మరణించిన విషయాన్ని ట్రంప్ గుర్తుచేశారు. ‘వార్ ఆన్ టెర్రర్’లో సేవలందించిన అమెరికా సైనికులకు నివాళులర్పించిన ఆయన.. ప్రస్తుతం ఇరాన్‌పై జరుగుతున్న సైనిక చర్యను కూడా ప్రస్తావించారు. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాన్ని పొందకుండా అమెరికా సైనికులు పనిచేస్తున్నారని చెప్పారు.9/11 విషాదాన్ని, ఇరాన్‌పై యుద్ధాన్ని నేరుగా ముడిపెడుతూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మనం ఎప్పటికీ, ఎప్పటికీ మర్చిపోం. అందుకే ఈరోజు పోరాడుతున్నాం. మనకు మరో మార్గం లేదు. విజయం తప్ప మరోటి ఉండదు. మేం గట్టిగా పోరాడతాం. గెలవడానికి పోరాడతాం’’ అని ట్రంప్ అన్నారు.ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధం ఆరు నెలలకు పైగా కొనసాగుతున్నప్పటికీ ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించడం లేదు. వరుస సైనిక దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అమెరికాలోనూ ఈ యుద్ధంపై రాజకీయంగా తీవ్ర చర్చ, వ్యతిరేకత కొనసాగుతోంది.ట్రంప్ తీరుపై విమర్శలు9/11 వార్షికోత్సవం సందర్భంగా న్యూయార్క్‌లోని గ్రౌండ్ జీరోలో జరిగే ప్రధాన స్మారక కార్యక్రమానికి ట్రంప్ హాజరుకాకుండా వాషింగ్టన్లోనే ఉండటంపై విమర్శలు వచ్చాయి. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ న్యూయార్క్ వెళ్లి వరల్డ్ ట్రేడ్ సెంటర్ స్థలంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.పెంటగాన్ కార్యక్రమంలో ట్రంప్ ప్రసంగం దాదాపు 20 నిమిషాల పాటు సాగింది. అమెరికా ఎదుర్కొంటున్న ప్రస్తుత సవాళ్లను ప్రస్తావిస్తూ.. ‘‘అమెరికా ఈరోజు పరీక్షను ఎదుర్కొంటోంది. ఆ పరీక్షలో మనం ఘనంగా విజయం సాధిస్తున్నాం’’ అని చెప్పారు. అయితే 9/11 దాడుల సమయంలో, అనంతరం అమెరికాకు మద్దతుగా నిలిచిన మిత్రదేశాల సహకారాన్ని ట్రంప్ తన ప్రసంగంలో ప్రస్తావించకపోవడంపై కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి.‘ఇరాన్ రక్షణ వ్యవస్థలు కుప్పకూలాయి’అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కూడా పెంటగాన్ కార్యక్రమంలో ఇరాన్‌పై కఠిన వ్యాఖ్యలు చేశారు. దాదాపు అర్ధ శతాబ్దంగా అమెరికా నాశనాన్ని కోరుకుంటున్న ‘‘ఇస్లామిక్ థియోక్రసీ’’గా ఇరాన్‌ను అభివర్ణించారు. ఇరాన్ రక్షణ వ్యవస్థలు పూర్తిగా కూలిపోయాయని ఆయన పేర్కొన్నారు. ‘‘మేం ఇప్పటికీ ఉగ్రవాదులను వారు చేరాల్సిన చోటుకు పంపుతున్నాం. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని కలిగి ఉండకుండా చూస్తున్నాం. ఆర్థిక ఒత్తిడి రోజురోజుకూ పెరుగుతోంది’’ అని హెగ్సెత్ అన్నారు. 9/11 తర్వాత మొదలైన ‘‘చెడుపై పోరాటం’’ ఇంకా కొనసాగుతోందని, అది ‘‘జడ్జ్మెంట్ డే’’ వరకు కొనసాగుతుందని వ్యాఖ్యానించారు.అమెరికాలోనూ ముప్పు పొంచి ఉందని హెగ్సెత్ హెచ్చరించారు. విదేశాల్లో, దేశంలో ఉన్న ఇస్లామిక్ ఉగ్రవాదులతో పాటు అమెరికా శక్తిని బలహీనపర్చాలని, అమెరికన్లను చంపాలని చూస్తున్న శత్రువులపై అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ట్రంప్ నాయకత్వంలో ఇరాన్ సైనిక సామర్థ్యాలను నిర్వీర్యం చేస్తున్నామని చెప్పిన ఆయన.. దేశ సేవకు సిద్ధంగా ఉండే ‘‘బలమైన, ధైర్యవంతమైన యోధుల’’ కొత్త తరం అవసరమని పేర్కొన్నారు.సౌదీ అరేబియాపై చర్యకు డిమాండ్మరోవైపు న్యూయార్క్‌లో జరిగిన 9/11 స్మారక కార్యక్రమంలో బాధిత కుటుంబాల తరఫున టెర్రీ స్ట్రాడా అమెరికా ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తి చేశారు. 9/11 బాధితురాలి భర్త అయిన ఆమె.. దాడులతో సౌదీ అరేబియాకు సంబంధాలున్నాయన్న ఆరోపణలపై ఆ దేశాన్ని బాధ్యులను చేయాలని ట్రంప్ ప్రభుత్వాన్ని కోరారు. ‘‘ఒక్కొక్కటిగా మాకు ద్రోహాలు ఎదురవుతూనే ఉన్నాయి. అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికీ దాన్ని మార్చగలరు’’ అని స్ట్రాడా అన్నారు. అమెరికాతో స్నేహం కోరుకుంటే 9/11 ఉగ్రవాదులతో సంబంధాలపై సౌదీ అరేబియా చేస్తున్న నిరాకరణలను ఆపేలా ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు.సాధారణంగా 9/11 వార్షికోత్సవ కార్యక్రమాలు 2001లో మరణించిన దాదాపు 3,000 మందిని స్మరించుకోవడానికే పరిమితమవుతాయి. అయితే 25వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో ట్రంప్ ప్రభుత్వం ఇరాన్‌పై కొనసాగిస్తున్న యుద్ధాన్ని సమర్థించేందుకు కూడా ఈ వేదిక ఉపయోగపడింది.ఇదీ చదవండి: ఇంట్రెస్టింగ్.. ట్రంప్ వారసుడెవరు? -
సౌదీలో ఆయిల్ పైప్‌లైన్ టార్గెట్.. పెరుగుతున్న టెన్షన్
అంతర్జాతీయం: సౌదీ అరేబియాలోని కీలక చమురు పైప్‌లైన్ వ్యవస్థపై గురువారం రోజున దాడి జరిగింది. పైప్‌లైన్‌కు సమీపంలోని పంపింగ్ స్టేషన్లను ప్రాజెక్టైల్స్‌తో లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా వర్గాల సమాచారం. దీంతో దాడి దాడి విషయంలో ముందుజాగ్రత్త చర్యగా పైప్‌లైన్ కార్యకలాపాలను సౌదీ అరేబియా నిలిపివేసింది. ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. పైప్‌లైన్ భద్రతను పరిశీలించడంతోపాటు నష్టాన్ని అంచనా వేసే పనిలో ప్రత్యేక బృందాలు నిమగ్నమయ్యాయి.అలాగే, దాడి ప్రభావం శాటిలైట్ చిత్రాల్లోనూ కనిపించింది. ఓ పంపింగ్ స్టేషన్ వద్ద భారీగా మంటలు చెలరేగిన ఆనవాళ్లు కనిపించగా.. మరో స్టేషన్ వద్ద గురువారం దట్టమైన నల్ల పొగలు వెలువడ్డాయి. అయితే పైప్‌లైన్ ప్రధాన భాగానికి ఎంతమేర నష్టం జరిగిందనే విషయంపై స్పష్టత లేదు. పంపింగ్ స్టేషన్లకు మాత్రమే నష్టం జరిగితే మరమ్మతులు త్వరగా పూర్తయ్యే అవకాశం ఉందని అమెరికా అధికారులు, నిపుణులు భావిస్తున్నారు. దాడికి పాల్పడింది ఎవరన్నదానిపై స్పష్టత రాలేదుఅయితే ఇరాక్ నుంచి వచ్చిన డ్రోన్లతో దాడి జరిగి ఉండొచ్చని అమెరికా వర్గాల అంచనా. గతంలో ఇరాన్‌కు అనుకూలంగా ఉండే ఇరాక్ మిలీషియా గ్రూపులు సౌదీ అరేబియాపై డ్రోన్లతో దాడులు చేసిన ఘటనలు ఉన్నాయి. ప్రస్తుత దాడి కూడా అలాంటదే అయి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన నిఘా సమాచారాన్ని అమెరికా అధికారులు సేకరిస్తున్నారు.అమెరికా–ఇరాన్ యుద్ధం నేపథ్యంలో సౌదీ చమురు మౌలిక వసతులపై జరిగిన ఈ దాడి ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరాన్ హోర్ముజ్ జలసంధి మార్గాన్ని ఇంచుమించుగా మూసివేయడంతో.. పెర్షియన్ గల్ఫ్ నుంచి నౌకల ద్వారా ఎగుమతి కావాల్సిన సౌదీ చమురులో రోజుకు సుమారు 50 లక్షల బ్యారెళ్లను ఈస్ట్–వెస్ట్ పైప్‌లైన్‌తో ఎర్ర సముద్రంలోని యాన్బు పోర్టుకు తరలిస్తున్నారు. దీంతో సౌదీ చమురు ఎగుమతులకు ఈ పైప్‌లైన్ కీలక మార్గంగా మారింది. మరోవైపు హౌతీ యోధులు సౌదీ నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరిస్తుండటంతో ఎర్ర సముద్రం మార్గంపైనా ఆందోళనలు కొనసాగుతున్నాయి.పైప్‌లైన్ కార్యకలాపాలు ఎప్పటికి తిరిగి ఎప్పుడు మొదలవుతుందనేది ప్రస్తుతానికి తెలియరాలేదు. ఇదే సమయంలో సౌదీ అరేబియా ముడి చమురు ఉత్పత్తి గత నెలలో 1990 తర్వాత కనిష్ఠ స్థాయికి పడిపోయినట్లు ఒపెక్‌కు సమాచారం అందింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఇప్పటికే బ్యారెల్‌కు 100 డాలర్లను దాటాయి. ఈ పరిస్థితుల్లో సౌదీ చమురు రవాణా వ్యవస్థపై దాడి జరగడం ప్రపంచ చమురు సరఫరాపై మరింత ఆందోళనకు దారితీస్తోంది.ఇవి కూడా చదవండి: ఇజ్రాయెల్‌పై యుద్ధంలో ఇరాన్‌కు బిగ్ షాక్ -
ఇజ్రాయెల్‌పై యుద్ధంలో ఇరాన్‌కు బిగ్ షాక్
లెబనాన్: గోటి చుట్టు రోకటి పోటులా ఇరాన్ అనుకూల ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లాకు కోలుకోలేని బిగ్ షాక్ తగిలింది. ఇటీవల ఇజ్రాయెల్ చేపట్టిన ‘ఆపరేషన్ న్యూ ఆర్డర్’ లో తమ అధినేత హాసన్ నస్రల్లాను పోగొట్టుకుని తీవ్ర సంక్షోభంలో ఉన్న ఆ సంస్థకు.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ మరో కోలుకోలేని దెబ్బకొట్టింది. దక్షిణ లెబనాన్ సరిహద్దుల్లో ఇజ్రాయెల్ ఆర్మీ సృష్టించిన భీకర ‘కృత్రిమ భూకంపం’ ధాటికి హెజ్బొల్లాకు చెందిన అత్యంత కీలకమైన వ్యూహాత్మక భూగర్భ స్థావరాలు, కమాండ్ సెంటర్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి.అంతర్జాతీయ కథనాల ప్రకారం.. దక్షిణ లెబనాన్ సరిహద్దు ప్రాంతంలో ఒక్కసారిగా భూమి తీవ్రంగా కంపించింది. రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రతతో ఈ భూప్రకంపనలు నమోదయ్యాయి. అయితే, ఇది ప్రకృతి సిద్ధంగా వచ్చిన భూకంపం కాదని, ఇజ్రాయెల్ సైన్యం జరిపిన అత్యంత భారీ భూగర్భ పేలుళ్ల వల్లే ఈ ప్రకంపనలు సంభవించాయని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వేతో పాటు అంతర్జాతీయ మీడియా సంస్థలు ధృవీకరించాయి.సరిహద్దుల్లో ఇరాన్ మద్దతు గల హెజ్బొల్లా నిర్మించుకున్న భారీ భూగర్భ సొరంగాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సైన్యం ఈ వినాశకర దాడి చేపట్టింది. అలీ అల్-తాహర్ పర్వత శ్రేణి సమీపంలో ఏకంగా 1,100 టన్నుల (1.1 మిలియన్ కిలోల) అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థాలను ఉపయోగించి హెజ్బొల్లా బంకర్లను ఒకేసారి పేల్చివేశారు.ఈ భారీ పేలుడు ధాటికి పుట్టిన షాక్‌వేవ్స్ భూమి లోపల 10 కిలోమీటర్ల లోతు వరకు ప్రయాణించడంతో, ఆ తీవ్రతకు సరిహద్దు ప్రాంతాలు దద్దరిల్లాయి. ఇరాన్ ఆర్థిక,సాంకేతిక సాయంతో గత రెండు దశాబ్దాలుగా (20 ఏళ్లుగా) హెజ్బొల్లా నిర్మించుకున్న దాదాపు 2 కిలోమీటర్ల పొడవైన అత్యాధునిక అండర్‌గ్రౌండ్ నెట్వర్క్ ఈ దాడిలో నాశనమైంది.ఇది హెజ్బొల్లాకు చెందిన అత్యంత కీలకమైన ‘బద్ర్’ప్రాంతీయ విభాగానికి ప్రధాన కమాండ్ సెంటర్‌గా వ్యవహరిస్తోంది. ఇక్కడే భారీగా దాచి ఉంచిన క్షిపణులు, డ్రోన్లు, యాంటీ-ట్యాంక్ ఆయుధాలు, వందలాది ల్యాండ్ మైన్స్ ఈ పేలుడుతో పాటు గాల్లో కలిసిపోయాయి. భూగర్భంలో ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో పేలుడు సంభవించడంతో ఆ ప్రకంపనలు పదుల కిలోమీటర్ల దూరంలో ఉన్న లెబనాన్ నగరాల వరకు తాకాయి. ముఖ్యంగా దక్షిణ లెబనాన్‌లోని నబాటియా ప్రాంత పరిధిలో ఉన్న భవనాలు తీవ్రంగా ఊగిపోవడంతో, స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. భూగర్భంలో జరిగిన ఈ భారీ విస్ఫోటనం వల్ల స్థానికంగా భూమిపై పెద్ద ఎత్తున పగుళ్లు ఏర్పడ్డాయని, పర్యావరణానికి భారీ నష్టం వాటిల్లిందని రక్షణ నిపుణులు,శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.👉ఇదీ చదవండి : ఇరాన్ పికాక్స్.. ట్రంప్‌కు ఎందుకంత పట్టుదల? -
సౌదీ యువరాజుకు షాకిచ్చిన ట్రంప్
హూతీలపై అమెరికా దాడులు చేయాలంటూ రెండుసార్లు సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ చేసిన విజ్ఞప్తిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించినట్లు ఆక్సియోస్ సంచలన నివేదిక వెల్లడించింది. ఎర్ర సముద్రంలో కీలకమైన బాబ్ అల్-మందెబ్ జలసంధికి హూతీలు చేరువవుతున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది. ప్రస్తుతం అమెరికా నేరుగా ఈ పోరాటంలో జోక్యం చేసుకునే ఉద్దేశం లేదని ట్రంప్ ఆ అభ్యర్థనను తిరస్కరించినట్లు నివేదిక తెలిపింది.బాబ్ అల్ మందెప్ జలసంధి దిశగా హూతీలు ప్రవేశిస్తున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ట్రంప్ బృందంలోని ఓ సీనియర్ అధికారి మట్లాడుతూ.. ఎర్ర సముద్రాన్ని తెరిచి ఉంచడం అమెరికా ప్రధాన ప్రాధాన్యత. అయితే, విస్తృత స్థాయి పోరాటాన్ని ప్రాంతీయ భాగస్వాములే నిర్వహించాలన్నది అమెరికా విధానం. ఎర్ర సముద్రంలో నౌకా రాకపోకల స్వేచ్ఛ, మా ప్రధాన జాతీయ భద్రతా ప్రయోజనాల పరిరక్షణపై అమెరికా దృష్టి సారించింది. అదే సమయంలో ప్రాంతీయ భద్రతా సవాళ్లను పరిష్కరించడంలో ప్రాంతీయ భాగస్వాములు ముందుండేలా మేము వారికి మద్దతు ఇస్తున్నామని ఆయన తెలిపారు.మొఖా నుంచి బాబ్ అల్-మండెబ్ జలసంధి సుమారు 80 కిలోమీటర్లు (50 మైళ్లు) దూరంలో ఉంది. ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ అడెన్‌తో కలిపే ఈ జలసంధి ద్వారా సాధారణంగా ప్రపంచ వాణిజ్య వస్తువుల్లో సుమారు 12 శాతం రవాణా అవుతాయి. సౌదీ మద్దతు ఉన్న యెమెన్ ప్రభుత్వ దళాలను హూతీ బలగాలు దక్షిణం వైపు ధుబాబ్ ప్రాంతానికి వెనక్కి నెట్టాయని ఇద్దరు యెమెన్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
తొమ్మిది రోజుల ముందే...
టోక్యో: నాలుగేళ్లకోసారి జరిగే ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలు అధికారికంగా ప్రారంభం కాకపోయినా... కొన్ని క్రీడాంశాల్లో పోటీలు మొదలయ్యాయి. జపాన్ వేదికగా ఈ నెల 19 నుంచి ఏషియన్ గేమ్స్ ప్రారంభం కావాల్సి ఉండగా... బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, క్రికెట్, హాకీ, మోడర్న్ పెంటాథ్లాన్ క్రీడల్లో పోటీలు ముందే మొదలవుతున్నాయి. ప్రధాన పోటీల ప్రారంభానికి తొమ్మిది రోజుల ముందు గురువారం పురుషుల బాస్కెట్‌బాల్‌లో ఖతార్ జట్టు ఇరాన్‌పై విజయం సాధించింది. గ్రూప్ ‘బి’లో భాగంగా జరిగిన ఈ పోరులో ఖతార్ 59–35 పాయింట్ల తేడాతో ఇరాన్‌ను చిత్తు చేసింది. ఒలింపిక్స్ కన్నా ఎక్కువ మంది అథ్లెట్లు ఆసియా క్రీడల్లో పాల్గొంటున్నారు. 43 క్రీడాంశాల్లో 17 వేల మందికి పైగా అథ్లెట్లు, క్రీడాధికారులు భాగస్వాములు కానున్నారు. సెపె్టంబర్ 19న క్రీడల ఆరం¿ోత్సవం నిర్వహించనుండగా... మరుసటి రోజు నుంచి పతక పోటీలు జరుగుతాయి. 1994 తర్వాత తొలిసారి జపాన్ ఈ క్రీడలకు ఆతిథ్యమిస్తుండగా... అనేక క్రీడాంశాల్లో 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌కు ఈ పోటీలు అర్హత ప్రమాణాలు కానున్నాయి. అయితే ప్రస్తుతం జపాన్‌లో భారీ వర్షాలు కురుస్తుండటంతో అథ్లెట్లకు ఇబ్బందులు తప్పేలాలేవు. మంగళవారం భారీ వర్షం కారణంగా అథ్లెట్ల ప్రాక్టీస్‌కు తీవ్ర అంతరాయం వాటిల్లింది. అక్టోబర్ 4 వరకు ఆసియా క్రీడలు కొనసాగనున్నాయి. భారత యువ ఓపెనర్, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, చైనాకు చెందిన 13 ఏళ్ల స్విమ్మర్ యూ జిది, ఫిలిప్పైన్ టెన్నిస్ సంచలనం అలెగ్జాండ్రా ఇయాలా ఈ క్రీడల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. -
ఇరాన్ దెబ్బ.. అమెరికా ఫైటర్ జెట్లకు చిల్లు!
ఇరాన్ మరోసారి అమెరికాపై విరుచుకుపడింది. జోర్డాన్‌లోని కీలక అమెరికా వైమానిక స్థావరంపై రాత్రికి రాత్రే భారీ క్షిపణి దాడులు జరిపింది. క్షిపణుల వర్షం కురిపించడంతో పలు యుద్ధవిమానాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఏకంగా ఒక ఏ-10 థండర్‌బోల్ట్ విమానం నాశనం కాగా.. మరో ఎనిమిది ఎఫ్-15 యుద్ధవిమానాలు దెబ్బతిన్నట్లు సమాచారం.జోర్డాన్‌లోని మువాఫాక్ సాల్టీ ఎయిర్‌బేస్‌పై ఇరాన్ ఈ దాడులు జరిపినట్లు సీబీఎస్ న్యూస్ ఏజెన్సీ ఓ కథనం ఇచ్చింది. ఇరాన్‌పై అమెరికా సైనిక కార్యకలాపాలకు ఈ స్థావరం కీలక కేంద్రంగా ఉండడం గమనార్హం. ఇక దాడులను అడ్డుకునేందుకు అమెరికా బలగాలు 30కి పైగా పేట్రియాట్ క్షిపణులను ప్రయోగించినట్లు తెలుస్తోంది. Iran’s ballistic missile attack on Muwaffaq Salti Air Base in Jordan last night damaged several American aircraft -CBS Roughly eight F-15s suffered light damage and one A-10 was severely damaged, losing a wing. pic.twitter.com/DQydfG4WYH— OSINTtechnical (@Osinttechnical) September 10, 2026దెబ్బతిన్న విమానాలపై అమెరికా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. ఒక ఏ-10 థండర్‌బోల్ట్ తీవ్రంగా దెబ్బతిని, దాని ఒక రెక్క పూర్తిగా కనిపించకుండా పోయినట్లు వెల్లడించింది. సుమారు ఎనిమిది ఎఫ్-15లకు స్వల్ప నష్టం వాటిల్లినప్పటికీ.. వాటిని తిరిగి పునరుద్ధరించినట్లు పేర్కొంది.అందుకు ప్రతీకారంగానే..ఇటీవల అమెరికా ఐదు ఇరాన్ చమురు ట్యాంకర్లను ధ్వంసం చేయడంతో ఉద్రిక్తత మరింత ముదిరింది. దీనికి ప్రతీకారంగానే ఇరాన్ అమెరికా స్థావరాలు, మిత్రదేశాలపై వరుస దాడులకు దిగినట్లు తెలుస్తోంది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్జీసీ) తమ దాడుల్లో జోర్డాన్‌లోని అల్ అజ్రాక్ అమెరికా స్థావరాన్ని భారీ క్షిపణులతో లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించింది. అలాగే హర్ముజ్ జలసంధి వైపు వెళ్తున్న పలు నౌకలపైనా దాడులు చేసినట్లు వెల్లడించింది.Iranian Strike Damages EIGHT 🇺🇸 F-15s In Jordan (CBS)The overnight strike reportedly damaged multiple US warplanes at an air base in Jordan. While an A-10 suffered significant damage, the eight F-15s sustained lighter damage and were returned to service. (CBS)The escalation… pic.twitter.com/dyAEspAra6— RT_India (@RT_India_news) September 10, 2026అయితే ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల్లో 20 జోర్డాన్ గగనతలంలోకి వచ్చినట్లు ఆ దేశ సైన్యం తెలిపింది. వీటిలో 18 క్షిపణులను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయని, మిగిలిన రెండు జనావాసాలు లేని ప్రాంతాల్లో పడినట్లు వెల్లడించింది.యుద్ధానికి ముగింపు పలుకుతాం.. కానీ ఇవే షరతులుమరోవైపు యుద్ధానికి ముగింపు పలికేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ సంకేతాలు ఇచ్చింది. అయితే అమెరికా తమ కొన్ని షరతులకు అంగీకరించాలని స్పష్టం చేసింది. లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ సైన్యాన్ని వెనక్కి తీసుకోవడం, యెమెన్‌పై దిగ్బంధాన్ని ఎత్తివేయడం, ఇరాన్‌కు చెందిన స్తంభింపజేసిన 24 బిలియన్ డాలర్ల ఆస్తులను విడుదల చేయడం, తమ అణు, క్షిపణి సామర్థ్యాల్లో జోక్యం చేసుకోకపోవడం వంటి డిమాండ్లను ముందుపెట్టింది.ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధానికి త్వరలో ముగింపు పలకాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. నవంబర్‌లో జరిగే మధ్యంతర ఎన్నికల తర్వాత యుద్ధం ముగిసిపోతుందని బుధవారం ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్ ఇక ఎక్కువ కాలం యుద్ధాన్ని కొనసాగించే పరిస్థితిలో లేదని పేర్కొన్నారు.అయితే ట్రంప్ వ్యాఖ్యలకు భిన్నంగా అమెరికా ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ తెలిపింది. యుద్ధం ట్రంప్ పదవీకాలంలో మరో రెండేళ్ల పాటు కొనసాగే అవకాశం ఉందని ఆయనకు సన్నిహితంగా ఉన్న ఉన్నతాధికారులు ప్రైవేటుగా హెచ్చరిస్తున్నట్లు పేర్కొంది. దీంతో ఇరాన్–అమెరికా ఘర్షణకు తక్షణమే తెరపడుతుందా? మరింత కాలం కొనసాగుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది.ఇదీ చదవండి: ట్రంప్ ఎండ్ గేమ్ ప్లాన్ ఇదేనంట! -
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు
అమెరికా–ఇరాన్ యుద్ధానికి ఎప్పుడు తెరపడుతుందన్న ఉత్కంఠ కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబర్‌లో జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికలు ముగిసిన వెంటనే ఇరాన్‌తో యుద్ధం ముగుస్తుందని ఆయన అంచనా వేశారు. ‘‘ఎన్నికల తర్వాత వెంటనే యుద్ధం ముగుస్తుంది.. ఇరాన్ ఇక ఎక్కువ కాలం తట్టుకోలేదు’’ అని ట్రంప్ అన్నారు.బుధవారం రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌కు బయలుదేరే ముందు విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్ అమెరికా ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అయితే అమెరికా విధిస్తున్న ఆర్థిక ఒత్తిడిని తట్టుకునే పరిస్థితిలో ఇరాన్ లేదని పేర్కొన్నారు. నవంబర్ ఎన్నికల వరకు ఇరాన్ యుద్ధాన్ని కొనసాగించలేదన్న ధీమాను వ్యక్తం చేశారు.చర్చలకు అవకాశం ఉన్నా..ఇరాన్‌తో దౌత్యపరమైన చర్చలు జరిగే అవకాశాన్ని ట్రంప్ పూర్తిగా కొట్టిపారేయలేదు. ‘‘చర్చలు జరగొచ్చు.. కానీ ప్రస్తుతం మేము దానిని పరిశీలించడం లేదు’’ అని స్పష్టం చేశారు. అంటే, యుద్ధం ముగింపు విషయంలో చర్చల కంటే అమెరికా ఒత్తిడికే ట్రంప్ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.ఇప్పటికే అమెరికా–ఇరాన్ యుద్ధం ఏడో నెలలోకి ప్రవేశించింది. తక్షణమే యుద్ధం ముగిసే పరిస్థితులు కనిపించడం లేదనే సమయంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.హర్ముజ్‌లో మళ్లీ ఉద్రిక్తతమరోవైపు హర్ముజ్ జలసంధి సమీపంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అమెరికా ఐదు ఇరాన్ చమురు ట్యాంకర్లను ముంచినట్లు సమాచారం వెలువడిన నేపథ్యంలో.. ఇరాన్ 10 నౌకలపై దాడి చేసినట్లు తెలిపింది. ఈ పరిణామాలతో అంతర్జాతీయ చమురు మార్కెట్లు ఒక్కసారిగా కుదుపునకు గురయ్యాయి. బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లను దాటింది.తగ్గిన ఆదరణఇరాన్ యుద్ధం కారణంగా ఇప్పటికే అమెరికాలో ట్రంప్ పట్ల ఉన్న ప్రజాదరణ విపరీతంగా పడిపోయింది. యుద్ధంతో పాటు పెరుగుతున్న జీవన వ్యయంపై ఓటర్లలో అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాతే యుద్ధం ముగుస్తుందని ట్రంప్ చెప్పడం అమెరికా రాజకీయాల్లోనూ ఆసక్తికరంగా మారింది. యుద్ధం ముగిసిన వెంటనే చమురు ధరలు కూడా తగ్గుతాయని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఇరాన్‌తో తక్షణ చర్చలకు అమెరికా సిద్ధంగా లేదని ఆయన స్పష్టం చేశారు. నవంబర్ 3న జరగనున్న మధ్యంతర ఎన్నికలు సాధారణంగా అధికారంలో ఉన్న అధ్యక్షుడి పాలనపై ప్రజల తీర్పుగా విశ్లేషకులు పరిగణించనున్నారు . ఇటు ఉక్రెయిన్ సంక్షోభంపైనా.. ఉక్రెయిన్ యుద్ధంపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుద్ధాన్ని ముగించేందుకు ఒప్పందం చేసుకోవాలని కోరుకుంటున్నాడని ట్రంప్ తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా అంగీకరిస్తే డీల్ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం 2022 ఫిబ్రవరి 24న రష్యా పూర్తిస్థాయి దాడితో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఐదో ఏడాదిలోకి అడుగుపెట్టినా కాల్పులకు మాత్రం తెరపడలేదు. యుద్ధం ప్రారంభమైన కొద్ది రోజులకే ఇరు దేశాల మధ్య బెలారస్లో చర్చలు మొదలయ్యాయి. ఆ తర్వాత ఇస్తాంబుల్‌లో ప్రత్యక్షంగా చర్చలు జరిగాయి. 2022 ఏప్రిల్ నాటికి ఆ చర్చలు నిలిచిపోయాయి. 2025లో మరోసారి శాంతి చర్చలకు ప్రయత్నాలు జరిగాయి. రష్యా–ఉక్రెయిన్ ప్రతినిధులు ఇస్తాంబుల్‌లో సమావేశమైనా కాల్పుల విరమణ, భూభాగాల అంశాల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ ఏడాది కూడా అమెరికా మధ్యవర్తిత్వంతో చర్చలను పునఃప్రారంభించేందుకు ప్రయత్నాలు జరిగాయి. తాజాగా అమెరికా ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ మాస్కో, కీవ్‌లలో పర్యటించి కొత్తగా చర్చలకు ఊపిరిపోసే ప్రయత్నం చేశారు. అయితే భూభాగాలపై రష్యా, ఉక్రెయిన్ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.ఇదీ చదవండి: ఇరాన్‌పై సంచలన ఆరోపణలు -
‘యురేనియం’పై దర్యాప్తునకు ఇరాన్ సహకరించలేదు
వియన్నా: ఇరాన్‌లోని వివిధ అప్రకటిత ప్రదేశాలలో తనిఖీ అధికారులు గుర్తించిన యురేనియం ఆనవాళ్లపై దీర్ఘకాలంగా సాగుతున్న దర్యాప్తునకు ఇరాన్ సహకరించలేదని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(ఐఏఈఏ) బోర్డు బుధవారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి నివేదించింది. ఇరాన్‌పై మండలికి నివేదించడం గత 20 ఏళ్లలో ఇదే మొదటిసారి. వియన్నాలోని ఐఏఈఏ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఇరాన్ అంశంపై ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. 35 మంది సభ్యులు కలిగిన బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌లో 23 దేశాలు ఆ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. చైనా, రష్యా, నైజర్ దీనిని వ్యతిరేకించగా 8 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఒక దేశం ఓటు వేయలేదు. ఈ తీర్మానాన్ని అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ ప్రవేశపెట్టాయి. యురేనియం ఆనవాళ్లకు సంబంధించిన విచారణకు ఇరాన్ సహకరించకపోవడం ద్వారా అణువ్యాప్తి నిరోధక బాధ్యతలను ఉల్లంఘించిందని ఐఏఈఏ బోర్డు నిర్ధారించింది. 2003 వరకు ఇరాన్ రహస్య అణు ఆయుధ కార్యక్రమాన్ని కలిగి ఉందనడానికి, అక్కడ లభించిన యురేనియం ఆనవాళ్లే సాక్ష్యమని పశి్చమ దేశాల ప్రతినిధులు చెబుతున్నారు. అణ్వాయుధాలు తయారు చేసే ఉద్దేశం తమకు లేదని ఇరాన్ చెబుతోంది. శాంతియుత అవసరాల కోసమే యురేనియం నిల్వ చేస్తున్నట్లు వాదిస్తోంది. ఇరాన్, అమెరికా మధ్య ఘర్షణ తీవ్రమవుతున్న తరుణంలో ఇరాన్‌కు సంబంధించిన యురేనియం అంశాన్ని ఐఏఈఏ బోర్డు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి నివేదించడం గమనార్హం. -
హర్ముజ్‌లో ఇరాన్ ఎదురుదాడి.. సంచలన ప్రకటన
పశ్చిమాసియాలో అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి.హర్ముజ్ జలసంధి ప్రవేశద్వారం వద్ద అమెరికాకు చెందిన అత్యాధునిక మానవరహిత జలాంతర్గామిని పట్టుకున్నట్లు ఇరాన్ ప్రకటించింది. అదే సమయంలో అమెరికా దళాలు ఐదు ఇరానియన్ చమురు ట్యాంకర్లను ధ్వంసం చేసినట్లు ప్రకటించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్జీసీ) అధికారిక మీడియా ‘సెపాహ్ న్యూస్’ ప్రకారం.. సంక్లిష్టమైన నిఘా ఆపరేషన్‌లో అమెరికాకు చెందిన డైవ్ ఎల్డీ(Dive-LD) మానవరహిత అండర్‌వాటర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యాధునిక అండర్‌వాటర్ టెక్నాలజీ కలిగిన వాహనంగా దీన్ని ఇరాన్ అభివర్ణించింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసింది. మరోవైపుహర్ముజ్ జలసంధిపై ఓ అమెరికా డ్రోన్( MQ-9 Reaper)ను కూల్చివేసినట్లు కూడా ఐఆర్జీసీ ప్రకటించింది.అమెరికా రియాక్షన్ ఇదేఇరాన్ ప్రకటనపై అమెరికా స్పందించింది. తమ మానవరహిత అండర్‌వాటర్ వాహనం ఒకటి అంతకుముందు రోజు పనిచేయకుండా నిలిచిపోయిందని అమెరికా సైన్యం తెలిపింది. అయితే ఇరాన్ స్వాధీనం చేసుకున్నది అదే వాహనమా అనేది మాత్రం స్పష్టం చేయలేదు. ఆ వాహనం పాత మోడల్ అని.. అందులో సున్నితమైన సమాచారం, రహస్య సోనార్ లేదంటే రాడార్ పరికరాలు లేవని పెంటగాన్ వెల్లడించింది.ఐదు చమురు ట్యాంకర్లపై అమెరికా దాడిఇదే సమయంలో ఇరాన్‌పై అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకారం.. తమ యుద్ధనౌకపై ఇరాన్ క్షిపణి దాడులకు ప్రతిస్పందనగా ఐదు ఇరానియన్ ముడిచమురు ట్యాంకర్లను ధ్వంసం చేశారు. గత రెండు రోజుల్లో అమెరికా నౌకపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో రెండుసార్లు దాడికి ప్రయత్నించిందని సెంట్కామ్ పేర్కొంది.ఇరాన్ విమానయాన సంస్థలపై ఆంక్షలుమరోవైపు అమెరికా ఆర్థిక శాఖ ఇరాన్‌కు చెందిన మరో 27 విమానయాన సంస్థలను ప్రత్యేక ఆంక్షల జాబితాలో చేర్చింది. ఇరాన్ పాలనకు, ఐఆర్‌జీసీకి ఆయుధాల రవాణా, సిబ్బంది తరలింపులో వాణిజ్య విమానయాన సంస్థలు సహకరిస్తున్నాయని అమెరికా ఆరోపించింది.‘వాళ్లు పశ్చాత్తాపపడే వరకు..’ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ మాత్రం.. యుద్ధంలో విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. యుద్ధాన్ని ఇరాన్ ఎప్పుడూ కోరుకోలేదని.. అయితే దాడులను ఎదుర్కొనేందుకు తమ ప్రతిఘటన కొనసాగుతుందని తెలిపారు. ఆక్రమణదారులు పూర్తిగా పశ్చాత్తాపపడే వరకు బలంగా పోరాడతామని పేర్కొన్నారు.మళ్లీ ముదిరిన అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలుఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులతో ఫిబ్రవరి 28న మొదలైన యుద్ధానికి ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో ప్రతిదాడులు చేసింది. అనంతరంహర్ముజ్ జలసంధిపై తన పట్టును మరింత బిగించింది. జూన్ 18న యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా, ఇరాన్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ.. తాజాగా చోటుచేసుకున్న పరిణామాలతో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి.ఇదీ చదవండి: ఇరాన్‌కు దిమ్మతిరిగే షాక్.. భారీ దెబ్బకొట్టిన అమెరికా -
మొజ్తబా ఖమేనీపై సంచలన ఆరోపణలు
పశ్చిమాసియా యుద్ధంలో తండ్రి అయతొల్లా ఖమేనీ మరణాంతరం.. ఊహించని రీతిలో ఇరాన్‌కు సుప్రీం బాధ్యతలు చేపట్టాడు మొజ్తబా ఖమేనీ. అయితే యుద్ధంలో గాయపడిన ఆయన.. దాదాపు ఆరు నెలల నుంచి ఆయన అజ్ఞాతంలోనే ఉంటూ పాలనలో కీలక భాగస్వామ్యం వహిస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా ఆయన మీద సంచలన ఆరోపణలు తెర మీదకు వచ్చాయి.ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీకి లండన్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో రెండు విలాసవంతమైన ఫ్లాట్లు ఉన్నాయంటూ బ్రిటన్ మీడియాలో వచ్చిన కథనాలు తీవ్ర చర్చకు దారితీశాయి. బ్రిటన్‌లోని ‘ది సండే టైమ్స్’ సహా పలు మీడియా సంస్థల కథనాల ప్రకారం.. లండన్‌లోని కెన్సింగ్టన్లో పాలెస్ గ్రీన్ ప్రాంతంలో ఉన్న ఓ భవనంలో రెండు విలాసవంతమైన అపార్ట్మెంట్లు మొజ్తబా ఖమేనీకి చెందినవిగా పేర్కొన్నారు. ఆ భవనం ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి అత్యంత సమీపంలోనే ఉండటం ఈ వ్యవహారంపై మరింత ఆసక్తిని పెంచింది.అయితే ఈ ఆరోపణలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఖమేనీకి ఇరాన్‌లోనే కాదు.. విదేశాల్లోనూ ఎలాంటి ఆస్తులు లేవని ఇరాన్ రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.‘ఆరోపణలు పూర్తిగా నిరాధారం’బ్రిటన్ మీడియా సంస్థలు చేసిన ఆరోపణలను ఇరాన్ రాయబార కార్యాలయం ‘పూర్తిగా నిరాధారం’గా అభివర్ణించింది. మొజ్తబా ఖమేనీ తన తండ్రిలాగే ఎలాంటి ఆస్తులు కలిగి లేరని పేర్కొంది. ఆయన నిరాడంబరమైన జీవనశైలిని ఇరాన్ ప్రజలు బాగా తెలుసని తెలిపింది. ఖమేనీకి దేశంలోగానీ.. విదేశాల్లోగానీ ఆస్తులు ఉన్నాయన్న ప్రచారం ఆయన జీవితం, వ్యక్తిత్వంపై తప్పుడు అభిప్రాయాన్ని సృష్టించేందుకేనని రాయబార కార్యాలయం ఆరోపించింది.లండన్‌లోని కెన్సింగ్టన్లో పాలెస్ గ్రీన్ ప్రాంతంలో ఉన్న ఓ భవనంలో రెండు విలాసవంతమైన అపార్ట్మెంట్లు.. ఆరో, ఏడో అంతస్తుల్లో ఉన్నాయని, వాటిని 2014, 2016 సంవత్సరాల్లో మధ్యవర్తుల ద్వారా కొనుగోలు చేసినట్లు బ్రిటన్ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఆస్తుల యాజమాన్యం ఖమేనీతో ముడిపడి ఉందన్న విషయాన్ని ఇటీవలే గుర్తించినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి.అరెస్టులతో ముడిపెట్టి ప్రచారంలండన్లో యూదు సమాజానికి సంబంధించిన వ్యక్తులు, ప్రాంతాలపై నిఘా పెట్టినట్లు అనుమానిస్తూ నలుగురు ఇరానియన్, బ్రిటిష్-ఇరానియన్ వ్యక్తులను శుక్రవారం అరెస్టు చేసిన నేపథ్యంలో ఈ ఆస్తుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాన్ని గమనించే అవకాశం ఉన్న ప్రాంతంలో ఈ ఫ్లాట్లు ఉండటంపై కూడా బ్రిటన్ మీడియాలో చర్చ జరిగింది. రాయబార కార్యాలయానికి 50 మీటర్లలోపే ఈ భవనం ఉందని కొన్ని కథనాలు పేర్కొన్నాయి. అయితే బ్రిటన్ మీడియా కథనాలకు ఇరాన్ ఇచ్చిన సమాధానం మాత్రం స్పష్టంగా ఉంది. మొజ్తబా ఖమేనీకి ఎక్కడా ఆస్తులు లేవని.. ఆయన నిరాడంబర జీవితం గడుపుతున్నారని రాయబార కార్యాలయం చెబుతోంది. ఇదీ చదవండి: అలా నెతన్యాహు ఇరుకున్నారా? -
ఇరాన్‌కు దిమ్మతిరిగే షాక్.. భారీ దెబ్బకొట్టిన అమెరికా
వాషింగ్టన్: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. అమెరికా నౌకాదళానికి చెందిన యుద్ధనౌకపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ (IRGC) వరుసగా రెండుసార్లు బాలిస్టిక్ క్షిపణులతో దాడికి ప్రయత్నించడంతో.. అమెరికా తీవ్రంగా స్పందించి ప్రతి దాడి చేసింది. ఇరాన్‌కు చెందిన ఐదు ముడి చమురు రవాణా నౌకలను అమెరికా బలగాలు తాజాగా ధ్వంసం చేశాయని యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) వెల్లడించింది.గత రెండు రోజుల్లో అమెరికా నేవీ యుద్ధనౌకపై ఇరాన్ రెండుసార్లు క్షిపణి దాడికి ప్రయత్నించిందని CENTCOM తెలిపింది. అయితే రెండు దాడులను అమెరికా యుద్ధనౌక విజయవంతంగా తప్పించుకుని, ప్రాంతీయ జలాల్లో తన కార్యకలాపాలను కొనసాగించిందని పేర్కొంది. ఈ ఘటనల్లో అమెరికా సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేసింది. కాగా, ఇరాన్ తాజా దాడి ప్రయత్నాలకు ప్రతిస్పందనగా ఐదు చమురు నౌకలపై దాడులు చేసినట్లు అమెరికా తెలిపింది.ఐఆర్జీసికి చెందిన చెందిన చమురు అక్రమ రవాణా నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్నట్లు ఆరోపించిన M/T Kaviz, M/T Charminar, M/T Horizon 1, M/T Riesco నౌకలను గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో, M/T Derya నౌకను ఇరాన్‌లోని ఖార్గ్ ఐలాండ్ సమీపంలో లక్ష్యంగా చేసుకున్నట్లు CENTCOM వెల్లడించింది. అయితే, దాడులకు ముందు నౌకల్లోని సిబ్బందిని ఖాళీ చేయాలని అమెరికా బలగాలు ఆదేశించాయని, ఆ తర్వాత నౌకలను పనికిరాకుండా చేశాయని పేర్కొంది. ఈ నౌకలు ఇరాన్ నుంచి భారీ స్థాయిలో చమురు అక్రమ రవాణా చేస్తూ, ఐఆర్‌జీసీతో పాటు దాని ప్రాంతీయ మద్దతుదారులకు నిధులు సమకూర్చే బహుళ బిలియన్ డాలర్ల ‘షాడో ఫ్లీట్’లో భాగమని అమెరికా ఆరోపించింది.CENTCOM forces destroyed five Iranian crude oil carriers, Sept. 8, after the Islamic Revolutionary Guard Corps (IRGC) targeted a U.S. Navy warship with ballistic missiles twice over the past two days. The U.S. warship successfully evaded the attempted Iranian attacks and… pic.twitter.com/Gi8a2tloN1— U.S. Central Command (@CENTCOM) September 8, 2026ఇదే తరహాలో సెప్టెంబర్ 5న కూడా మూడు ఇరాన్ చమురు నౌకలను అమెరికా ధ్వంసం చేసింది. అప్పట్లో అమెరికా విమాన వాహక నౌక, గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్పై ఐఆర్జీసీ దాడికి ప్రయత్నించిందని CENTCOM పేర్కొంది. ఇప్పటివరకు అమెరికా నేవీ నౌకలపై ఇరాన్ చేసిన అన్ని దాడి ప్రయత్నాలు విఫలమయ్యాయని తెలిపింది. అయితే ఇరాన్ ప్రభుత్వ మీడియా మాత్రం తాజా అమెరికా దాడుల్లో రెండు చమురు ట్యాంకర్లు దెబ్బతిన్నాయని తెలిపింది. ఒకటి జాస్క్ సమీపంలో, మరొకటి ఖార్గ్ ఐలాండ్ సమీపంలో దాడికి గురయ్యాయని పేర్కొంది. నౌకల్లోని సిబ్బందిని సురక్షితంగా తరలించామని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది.తాజా పరిణామాలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా చర్యలకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించినట్లు సమాచారం. కువైట్, బహ్రెయిన్ నౌకాశ్రయాల సమీపంలో ప్రయాణించే చమురు నౌకలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా.. అమెరికా నేవీ నౌకలపై ఇరాన్ దాడికి ప్రయత్నిస్తే.. ప్రతిసారీ మరిన్ని చమురు ట్యాంకర్లను ఇరాన్ కోల్పోవాల్సి వస్తుందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో హెచ్చరించారు. ఇదీ చదవండి: ఈనెల 11న మోదీ, పుతిన్ భేటీ.. -
హర్ముజ్‌లో ఇక నో ఎంట్రీ!.. ఇరాన్ కొత్త రూట్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకూ ముదురుతున్న వేళ.. హర్ముజ్ జలసంధిపై ఇరాన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ మార్గంలో నౌకల రాకపోకలు భారీగా తగ్గిపోయాయి. ఇప్పుడు మరింత కఠిన ఆంక్షలకు ఇరాన్ సిద్ధమవుతోంది. జలసంధి సమీపంలో కొత్తగా ‘నిషేధిత జోన్’ ఏర్పాటు చేయడంతోపాటు.. నౌకల కోసం ఒమన్‌తో కలిసి కొత్త షిప్పింగ్ రూట్‌ను ప్రకటించనున్నట్లు వెల్లడించింది.ఇరాన్ ప్రకటించబోయే కొత్త నిషేధిత ప్రాంతం హర్ముజ్ జలసంధికి వెలుపల గల గల్ఫ్ ప్రాంతాల్లో ఉంటుందని ఆ దేశ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయీ తెలిపారు. ఈ ప్రాంతం అమెరికా నౌకాదళం ఏర్పాటు చేసిన దిగ్బంధ రేఖ నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. ఆ జోన్లోకి ప్రవేశించే నౌకలను ఇరాన్ ఆంక్షల జాబితాలో చేర్చనున్నట్లు హెచ్చరించారు.అయితే ఈ నిషేధిత ప్రాంతానికి సంబంధించిన ఖచ్చితమైన సరిహద్దులను ఇరాన్ ఇంకా వెల్లడించలేదు. రాబోయే రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.ఒమన్‌తో కలిసి కొత్త రూట్ఇదే సమయంలో హర్ముజ్ గుండా సాగే నౌకలకు ప్రత్యామ్నాయంగా కొత్త అంతర్జాతీయ షిప్పింగ్ మార్గాన్ని ఏర్పాటు చేయాలని ఇరాన్, ఒమన్ నిర్ణయించాయి. ఈ రూట్ ఇరాన్, ఒమన్ జలాల్లోనే ఉంటుంది. దీనికి సంబంధించిన మ్యాప్‌లు, ఏర్పాట్లపై ఇరు దేశాలు ఇప్పటికే అంగీకారానికి వచ్చినట్లు రెజాయీ వెల్లడించారు. త్వరలోనే దీనిపై అధికారికంగా సంతకాలు చేయనున్నారు.కొత్త మార్గాన్ని ఇరాన్ నిర్వహించనుంది. అయితే అమెరికా నుంచి తమపై కొనసాగుతున్న ‘దాడులు, బెదిరింపులు, విధ్వంసక చర్యలు’ ఆగే వరకు హర్ముజ్ జలసంధి పూర్తిగా తెరిచి ఉంటుందని హామీ ఇవ్వలేమని ఇరాన్ స్పష్టం చేసింది.రోజుకు పది నౌకలే!ప్రపంచ రవాణాకు కీలకమైన హర్ముజ్‌లో ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల ప్రభావం ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తోంది. గత పది రోజుల్లో ఈ జలసంధి గుండా రోజుకు సగటున కేవలం 10 సరుకు నౌకలు మాత్రమే ప్రయాణిస్తున్నాయి. మే తర్వాత ఇదే అత్యల్ప స్థాయి.శనివారం కేవలం రెండు నౌకలు, ఆదివారం ఆరు నౌకలు మాత్రమే ఈ మార్గంలో ప్రయాణించాయి. వాటిలో ఎక్కువ శాతం ఇరాన్ సూచించిన మార్గాన్నే ఉపయోగించినట్లు సమాచారం. సముద్ర రవాణా డేటా సంస్థ కేప్లర్ ప్రకారం.. బుధవారం తర్వాత హర్ముజ్ నుంచి ఒక్క భారీ ముడిచమురు రవాణా నౌక (వీఎల్సీసీ) కూడా బయటకు రాలేదు.చమురు మార్కెట్‌పై ప్రభావంహర్ముజ్ ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన మార్గం. యుద్ధానికి ముందు ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు ఐదో వంతు ఈ జలసంధి గుండా రవాణా అయ్యేది. ఎల్ఎన్జీ సరఫరాకు కూడా ఇది ప్రధాన మార్గమే. నౌకల రాకపోకలు తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలపై ఒత్తిడి పెరుగుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ ధర 0.8 శాతం పెరిగి బ్యారెల్‌కు 97 డాలర్లకు పైగా చేరింది.మూడు ఆయిల్ ట్యాంకర్లపై అమెరికా దాడిమరోవైపు అమెరికా-ఇరాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు కూడా కొనసాగుతున్నాయి. శనివారం అమెరికా దళాలు మూడు ఇరాన్ చమురు ట్యాంకర్లపై దాడులు చేశాయి. వీటిలో ఒకటి ఖార్గ్ ద్వీపం సమీపంలో ఉన్నట్లు సమాచారం. అంతకుముందు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అమెరికా యుద్ధ నౌకలపై దాడులు చేసినట్లు అమెరికా పేర్కొంది.అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకారం.. దిగ్బంధ నిబంధనలను అమలు చేసే క్రమంలో ఇప్పటికే 92 వాణిజ్య నౌకలను దారి మళ్లించారు. మూడు నౌకలను నిర్వీర్యం చేసి, మరో రెండు నౌకలను తనిఖీ కోసం అదుపులోకి తీసుకున్నారు.ఖార్గ్‌పై 550 దాడులా?ఇరాన్ చమురు ఎగుమతులకు కీలకమైన ఖార్గ్ ద్వీపం కూడా ఈ ఘర్షణల్లో ప్రధాన లక్ష్యంగా మారింది. గత కొన్ని నెలల్లో ఖార్గ్‌పై సుమారు 550 సార్లు దాడులు జరిగినప్పటికీ.. అక్కడ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని ఇరాన్ ఇంధన శాఖ మంత్రి మొహ్సెన్ పక్ణేజాద్ తెలిపారు. యుద్ధానికి ముందు ఇరాన్ ఎగుమతి చేసే ముడిచమురులో దాదాపు 90 శాతం ఖార్గ్ ద్వీపం నుంచే వెళ్లేది. అయితే ఏప్రిల్ మధ్య నుంచి అమెరికా దిగ్బంధం కారణంగా ఈ సరఫరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.‘రోజుకు 90 లక్షల బ్యారెళ్లు వెళ్తున్నాయి’హర్ముజ్ పూర్తిగా మూసుకుపోయిందన్న వార్తలను అమెరికా ఖండిస్తోంది. రోజుకు సుమారు 90 లక్షల బ్యారెళ్ల చమురు ఇప్పటికీ ఈ జలసంధి గుండా వెళ్తోందని అమెరికా ఇంధనశాఖ మంత్రి క్రిస్ రైట్ తెలిపారు. పైప్లైన్ల ద్వారా ప్రత్యామ్నాయంగా తరలిస్తున్న చమురును కలుపుకుంటే యుద్ధానికి ముందు రవాణాలో మూడింట రెండొంతులు లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలో సరఫరా కొనసాగుతోందని చెప్పారు. ఇరాన్ మాత్రం రోజుకు 10–15 లక్షల బ్యారెళ్ల చమురు విక్రయిస్తున్నామని చెబుతోంది. తమ ఉత్పత్తి, వాణిజ్యం సాధ్యమైనంత వరకు కొనసాగుతున్నాయని ఆ దేశం పేర్కొంటోంది.‘దాడి చేస్తే మరింత తీవ్రంగా స్పందిస్తాం’ఇదిలా ఉండగా.. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ ఖలీబాఫ్ అమెరికాను తీవ్రంగా హెచ్చరించారు. తమ దేశ ప్రయోజనాలు, భద్రతపై దాడులు జరిగితే ఇకపై స్పందన మరింత వేగంగా, భారీగా, బాధాకరంగా ఉంటుందని అన్నారు. ఇప్పటికే అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరిగింది. కరెన్సీ విలువలో హెచ్చుతగ్గులు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలు తీవ్రంగా మారుతున్నాయి. అయినప్పటికీ ఆర్థిక సంస్కరణలు చేపట్టాల్సిన బాధ్యత తమ ప్రభుత్వానిదేనని ఇరాన్ ఆర్థిక మంత్రి అలీ మదానిజాదెహ్ స్పష్టం చేశారు.చర్చలకు బ్రేక్.. మళ్లీ దాడులుఇరాన్-అమెరికా మధ్య దౌత్యపరమైన చర్చలు నిలిచిపోవడం, జూన్‌లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు గురైంది. ఆ తర్వాత మళ్లీ పరస్పర దాడులు ప్రారంభం కావడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. ఈ నేపథ్యంలో హర్ముజ్‌లో కొత్త నిషేధిత జోన్, ఇరాన్-ఒమన్ కొత్త షిప్పింగ్ రూట్ ప్రకటనలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. హర్ముజ్ గుండా నౌకల రాకపోకలపై ఇరాన్ తీసుకునే తదుపరి నిర్ణయాలు.. చమురు ధరల నుంచి అంతర్జాతీయ వాణిజ్యం వరకు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.ఇదీ చదవండి: చైనా కాస్ట్లీ కలను చిదిమేసిన నేపాల్ వరద -
ఇలాంటి పనులు ట్రంప్‌కు మాత్రమే సాధ్యం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేసినా ఓ ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు మరోసారి అదే కనిపించింది. ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని వరుస పోస్టులతో విరుచుకుపడుతున్న ఆయన.. తాజాగా ఏకంగా ఇరాన్ మ్యాప్‌పై తన ముఖాన్ని పెట్టారు. అక్కడితో ఆగారా అంటే అదీ లేదు.. ‘ఇరాన్ ఓ విఫల దేశం’ అంటూ సందేశం ఇచ్చారు. ఆదివారం ట్రూత్ సోషల్‌లో గంట వ్యవధిలో ఇరాన్‌కు సంబంధించిన ఏడు పోస్టులు పెట్టిన ట్రంప్.. ఆ దేశంపై అమెరికా ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో చూపించేందుకు మ్యాప్‌లు, గ్రాఫిక్స్‌ను ఉపయోగించారు. తాజా పోస్టుల్లో ఒకదానిలో ఇరాన్ మ్యాప్ కనిపించగా.. దానిపై ట్రంప్ ముఖాన్ని ఉంచారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందని చెప్పేందుకు ఈ చిత్రాన్ని ఉపయోగించారు. మరో పోస్టులో ఇరాన్ చమురు ఎగుమతులు భారీగా పడిపోయాయని పేర్కొన్నారు. ఇరాన్‌కు కీలకమైన ఖర్గ్ ద్వీపాన్ని క్షిపణులతో పేల్చేసినట్లు ఓ పోస్ట్ చేశారు. అలాగే హర్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణా మళ్లీ పెరిగిందంటూ మరో గ్రాఫిక్‌ను పోస్ట్ చేశారు. హర్ముజ్కూ ‘ట్రంప్’ ముద్ర?ట్రంప్ ఇంతటితో ఆగలేదు. వ్యూహాత్మకంగా కీలకమైన హర్ముజ్ జలసంధికి ‘ట్రంప్ స్ట్రెయిట్’ అని పేరు మార్చాలని గతంలో వ్యాఖ్యానించారు. ఆ వెంటనే వైట్‌హౌజ్ వర్గాలు అదే పేరుతో ఓ మ్యాప్‌ను రిలీజ్ చేశారు. ఇక ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన ఈ జలమార్గం ప్రస్తుతం అమెరికా-ఇరాన్ ఘర్షణకు ప్రధాన కేంద్రంగా మారింది. అమెరికా ఆంక్షలు, నౌకా దిగ్బంధంతో ఇరాన్ చమురు ఎగుమతులు తీవ్రంగా దెబ్బతిన్నాయని అమెరికా చెబుతుండగా.. హర్ముజ్‌పై తన ప్రభావాన్ని కొనసాగిస్తామని టెహ్రాన్ స్పష్టం చేస్తోంది. ట్రంప్‌తో మాములుగా ఉండదుట్రంప్కు ఇలాంటి పనులు కొత్తేం కాదు. రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’ పేరును ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’గా, అలాస్కాలోని ‘డెనాలి’ పేరును ‘మౌంట్ మెకిన్లీ’గా మార్చేందుకు ఏకంగా కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికా ఫెడరల్ ప్రభుత్వ వినియోగంలో ఈ పేర్లు అధికారికంగా అమల్లోకి వచ్చాయి. ఇటీవల మరో అడుగు ముందుకేసి కెనడా లేక్ ఒంటారియోను ‘లేక్ అమెరికా’గా పేరు మార్చాలంటూ యాపిల్ మ్యాప్స్‌కు ట్రంప్ సూచించినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. గూగుల్ ఇప్పటికే అమెరికా వినియోగదారుల కోసం ఆ పేరును చూపించడం ప్రారంభించింది. ట్రంప్ రాజకీయ అస్త్రంట్రంప్ తాజా ఇరాన్ పోస్టులను గమనిస్తే.. మ్యాప్‌లు కేవలం భౌగోళిక వివరాల కోసం కాకుండా రాజకీయ సందేశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే సాధనంగా ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇరాన్ మ్యాప్‌పై తన ముఖం, ‘ఫెయిలింగ్ నేషన్’ అనే వ్యాఖ్య.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై చమురు ఎగుమతులు, కరెన్సీ పతనం, హర్ముజ్ సంక్షోభాన్ని కలిపి చూపించే గ్రాఫిక్స్.. ఇవన్నీ ఒకే సందేశాన్ని బలపరిచేలా ఉన్నాయి. ఇరాన్‌పై ఆర్థిక, సైనిక ఒత్తిడిని పెంచుతున్న సమయంలో ట్రంప్ సోషల్ మీడియా పోస్టులు కూడా అదే దూకుడును ప్రతిబింబిస్తున్నాయి. అయితే టెహ్రాన్ మాత్రం అమెరికా ఒత్తిడికి తలొగ్గేది లేదని చెబుతోంది. దీంతో ట్రంప్ తాజా ‘మ్యాప్ పోస్టు’ కూడా అమెరికా-ఇరాన్ ఘర్షణలో మరో రాజకీయ సందేశంగా మారింది.ఇదీ చదవండి: అంతులేని వెతుకులాట! -
హార్మూజ్‌లో అమెరికా నౌకపై ఇరాన్ దాడి!
కైరో: హార్మూజ్ జలసంధిలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న అమెరికాకు చెందిన మానవ రహిత నౌకపై దాడి చేసినట్లు ఇరాన్ ఆదివారం ప్రకటించింది. అయితే, ఈ విషయాన్ని అమెరికా సైన్యం ఖండించింది. ఇరాన్ చెప్పిందంతా అబద్ధమేనని కొట్టిపారేసింది. తమ నౌకపై ఎలాంటి దాడి జరగలేదని వివరించింది. హార్మూజ్‌లో ఇరాన్‌కు చెందిన మూడు చమురు నౌకలపై అమెరికా దాడికి దిగిన సంగతి తెలిసిందే. అందుకు ప్రతీకారంగా మరుసగా రోజే అమెరికా నౌకపై ఇరాన్ దాడి చేసినట్లు సమాచారం. పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని చెప్పడానికి ఇదొక నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ చమురు, సహజ వాయువు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిపై ఇరాన్ తన పట్టును పెంచుకొనేందుకు ప్రయత్నిస్తోంది. -
ట్యాంకర్ బీభత్సం.. 11 మంది మృతి
టెహ్రాన్: పశ్చిమ ఇరాన్లో ఇంధన ట్యాంకర్ పేలిపోవడంతో 11 మంది మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడినట్లు ప్రభుత్వ మీడియా తెలిపింది. ఇరాన్‌లోని కుర్దిష్ నగరం సనందజ్ సమీపంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గర ట్యాంకర్ పలు వాహనాలను ఢీకొన్న తర్వాత మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రాంతం టెహ్రాన్‌కు సుమారు 400 కిలోమీటర్ల దూరంలో పశ్చిమాన ఉంది.ట్యాంకర్లో బ్రేక్ వ్యవస్థలో లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు నివేదిక పేర్కొంది. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. హమదాన్ నుంచి మరీవాన్ వైపు ట్యాంకర్ వెళ్తుండగా, బ్రేక్ వ్యవస్థలో సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు గవర్నర్ తెలిపారు. ఇరాన్ ఇంటర్నేషనల్ తన నివేదికలో ఈ వివరాలను పేర్కొంది.2018లో ఇలాంటి ప్రమాదంలో 15 మంది మృతితాజా ఘటనకు ముందు 2018లో సనందజ్ సమీపంలో ఇలాంటి రోడ్డు ప్రమాదం జరిగింది. అప్పుడు ఇంధన ట్యాంకర్ అంతర్ నగర ప్రయాణికుల బస్సును ఢీకొనడంతో 15 మంది మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు.ఇరాన్లో ప్రతి ఏడాది రోడ్డు, రవాణా ప్రమాదాల్లో 17,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. అసురక్షిత వాహనాలు, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు, సరైన అత్యవసర సేవలు లేకపోవడం వల్ల ఆ దేశంలో రోడ్డు ప్రమాద మరణాల రేటు అధికంగా ఉందని నిపుణులు చెబుతున్నారు.At least 11 people were killed and seven others injured after a fuel tanker crashed, exploded and caught fire on the Sanandaj-Hamadan road in western Iran, the governor of Sanandaj said Saturday.The tanker was traveling from Hamadan toward Marivan when a technical failure in its… pic.twitter.com/lYntHeoNIu— Iran International English (@IranIntl_En) September 5, 2026 -
ఇజ్రాయెల్‌పై భారీ అటాక్‌కు ఇరాన్ ప్లాన్?
జెరూసలెం పోస్ట్ ఒక సంచలన నివేదిక ప్రచురించింది. ఇజ్రాయెల్‌పై భారీ దాడికి ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొంది. టెల్‌అవీవ్‌పై గతంలో హమాస్ జరిపిన అక్టోబర్ 7 తరహా దాడికంటే మరింత విస్తృతమైన, బహుముఖ దాడికి ఇరాన్ సిద్ధమయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇజ్రాయెల్ నిఘా వర్గాల అంచనాలను ఉటంకిస్తూ ఈ కథనాన్ని ప్రచురించింది. ఇజ్రాయెల్‌పై దాడికి ఇరాన్‌తో అనుబంధంగా ఉన్న ప్రాంతీయ సాయుధ సంస్థలను సమన్వయంతో ఒకేసారి రంగంలోకి దించాలని ప్రణాళిక రచిస్తోన్నట్లు పేర్కొంది. లెబనాన్‌లోని హిజ్బుల్లా, యెమెన్‌లోని హూతీలు, గాజాలోని హమాస్‌తో పాటు ఇరాక్, సిరియాల్లోని ఇరాన్ అనుకూల మిలీషియాలను ఒకేసారి ఇజ్రాయెల్‌పై దాడికి ఉపయోగించే అవకాశాన్ని ఇరాన్ పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ఈ దాడి గతంలో హమాస్ చేసిన దాడికంటే చాలా పెద్దదిగా ఉండేలా ప్రణాళిక వేస్తున్నట్లు కథనాలు ప్రచురితమయ్యాయి.2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడి చేసిన సమయంలో ఇరాన్‌తో పాటు ఆ దేశానికి చెందిన ఇతర అనుకూల బలగాలు దాడులు చేయలేదు. అయితే ఈ సారి అలా కాకుండా ఇరాన్ తాజా వ్యూహం లక్ష్యంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్థానికంగా ఒక సంస్థ దాడి చేసి, దాని ప్రభావంతో ఇతర సంస్థలు యుద్ధంలోకి వస్తాయనే విధానానికి బదులుగా, అన్ని అనుబంధ బలగాలు ఒకేసారి దాడి ప్రారంభించేలా ముందస్తు సమన్వయం చేయాలని ఇరాన్ ప్రయత్నిస్తున్నట్లు నివేదిక తెలిపింది.ఇందులో భాగంగా ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్కు చెందిన ఖుద్స్ ఫోర్స్ ఉన్నతాధికారులు హిజ్బుల్లా, హౌతీలు, ఇరాక్‌లోని ఇరాన్ అనుకూల మిలీషియా కమాండర్లతో సమావేశాలు నిర్వహించినట్లు సమాచారం. కాన్ఫరెన్స్ కాల్స్‌తో పాటు ప్రత్యక్ష సమావేశాల ద్వారా భవిష్యత్ దాడుల సమన్వయం, కార్యకలాపాల విస్తరణపై చర్చలు జరిగినట్లు నివేదిక పేర్కొంది. హమాస్, హిజ్బుల్లా మధ్య ఇరాన్ సహకారంతో సమన్వయం పెరిగినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు గుర్తించినట్లు తెలుస్తోంది. ఉత్తరంవైపు హిజ్బుల్లా, దక్షిణం వైపు హమాస్ తదితర బలగాల నుంచి ఒకేసారి ఒత్తిడి తీసుకురావడమే ఈ సమన్వయానికి ప్రధాన ఉద్దేశంగా భావిస్తున్నారు.అదేవిధంగా ఇరాన్ గతంలో అమెరికా, ఇజ్రాయెల్‌తో జరిగిన ఘర్షణల్లో దెబ్బతిన్న తన సైనిక సామర్థ్యాలను తిరిగి బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. అంతేకాకుండా, ఇరాన్ అనుకూల బలగాల మధ్య సైనిక, వ్యక్తిగత సంబంధాలు మరింత బలపడటం కోసం , ఆ గ్రూపుల మధ్య సంయుక్తగా శిక్షణలు నిర్వహించడం వంటి పరిణామాలు కూడా చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే, ఇరాన్ తన ప్రాంతీయ మిత్ర బలగాలను విడివిడిగా కాకుండా ఒకే వ్యూహం కింద సమన్వయం చేసి, ఇజ్రాయెల్‌పై బహుముఖ ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు ఈ నివేదిక సూచిస్తోంది.అయితే ఇజ్రాయెల్ సైతం ఎక్కడా తగ్గే విధంగా కనిపించడం లేదు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ సైతం ఈ అంశమై గతంలో ట్రంప్‌తోనూ విభేదించిన సంగతి తెలిసిందే. ఒకవేళ ఇరాన్ ఈ కథనంలో ప్రచురించినట్లు భారీ దాడికి ప్రణాళిక రచిస్తే పరిస్థితి ఇప్పటి కంటే ఎంతో ఉద్రిక్తంగా మారడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. -
అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు
-
ట్రంప్ పద్మవ్యూహం.. ఇరాన్‌కు తప్పని చిక్కులు?
వాషింగ్టన్: పశ్చిమాసియా రణరంగంలో ఇరాన్‌ను దౌత్యపరంగా, సైనిక పరంగా కట్టడి చేసేందుకు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యూహాలు రచిస్తున్నారు. ఆ దేశాన్ని ప్రాంతీయంగా పూర్తిగా ఏకాకిని చేసేలా అమెరికా ఓ పద్మవ్యూహాన్ని సిద్ధం చేసినట్లు ‘యాక్సియోస్’ నివేదిక వెల్లడించింది.‘యాక్సియోస్’ నివేదికలో.. ట్రంప్ ప్రధానంగా మూడు కీలక అంశాలపై దృష్టి సారించారు. ఇరాన్‌పై యుద్ధం ముగిసిన తర్వాత పశ్చిమాసియాలో ఇరాన్ ప్రభావానికి చెక్ పెట్టేందుకు ఇజ్రాయెల్, దాని పొరుగున ఉన్న అరబ్ దేశాలతో కలిసి ఒక బలమైన ప్రాంతీయ కూటమిని ఏర్పాటు చేయాలని ట్రంప్ భావిస్తున్నారు. ఈ కూటమికి అమెరికా పూర్తిస్థాయి భద్రతా హామీ ఇవ్వనుంది.2023 అక్టోబర్ 7 నాటి దాడి తర్వాత మొదలైన సంక్షోభాన్ని సమర్థవంతంగా ముగించేందుకు ట్రంప్ బృందం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా గాజా ప్రణాళిక తదుపరి దశను వేగవంతం చేయడం, ఇజ్రాయెల్ - సిరియా మధ్య కొత్త భద్రతా ఒప్పందాన్ని కుదర్చడం, ఇజ్రాయెల్ - లెబనాన్ ఒప్పందాన్ని అమలు చేయాలని చూస్తున్నారు.'అబ్రహం ఒప్పందాలను' మరింత విస్తరింపజేస్తూ ఇజ్రాయెల్, సౌదీ అరేబియాల మధ్య దౌత్య సంబంధాలను పునరుద్ధరించడమే ట్రంప్ ప్రధాన లక్ష్యం. ఇది సాకారమైతే పశ్చిమాసియా రాజకీయాల్లో అదొక మైలురాయిగా మారడమే కాకుండా, ట్రంప్‌కు దౌత్యపరంగా అతిపెద్ద విజయంగా నిలుస్తుంది.ట్రంప్ వ్యూహాలు స్పష్టంగా ఉన్నప్పటికీ, వీటి అమలుకు పలు రాజకీయ అడ్డంకులు ఎదురవుతున్నాయని యాక్సియోస్ పేర్కొంది. రాబోయే ఇజ్రాయెల్ సాధారణ ఎన్నికలు, అమెరికా మధ్యంతర ఎన్నికల ప్రభావం ఈ ప్రణాళికపై పడే అవకాశం ఉంది. ఇజ్రాయెల్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు వేచి చూడకుండా, ఒకవేళ అక్కడ రాజకీయ ప్రతిష్టంభన ఏర్పడినా తన వ్యూహంతో ముందుకు వెళ్లేందుకే ట్రంప్ మొగ్గు చూపుతున్నట్లు అమెరికా ఉన్నతాధికారులు వెల్లడించారు.కాగా, యుద్ధానంతరం పశ్చిమాసియాలోని మిత్రదేశాలన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకురావడంలో ట్రంప్ ఎంతవరకు సఫలమవుతుందో వేచి చూడాలి.👉ఇదీ చదవండి: ఇరాన్ పికాక్స్.. ట్రంప్‌కు ఎందుకంత పట్టుదల? -
పశ్చిమాసియాలో ఉద్రిక్తత.. మూడు ఇరాన్ ట్యాంకర్లు ధ్వంసం
వాషింగ్టన్: అమెరికా కీలక ప్రకటన చేసింది. ఇరాన్‌కు చెందిన మూడు క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లను ధ్వంసం చేసినట్లు ప్రకటించింది.ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ అమెరికా నేవీ యుద్ధ నౌకలపై బాలిస్టిక్ క్షిపణులతో దాడికి దిగడంతో ప్రతీకార దాడులు చేసినట్లు పేర్కొంది. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ వివరాలు తెలిపింది.అమెరికా సెంట్రల్ కమాండ్ ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ. అమెరికా ఇరాన్ రెచ్చగొట్టే విధంగా చేసిన దాడులను తమ విమాన వాహక నౌక, గైడెడ్-మిస్సైల్ డ్రాయర్ విజయవంతంగా తిప్పికొట్టిందని పేర్కొంది. ఖర్గ్ ద్వీపం తీరంలో, జాస్క్ సమీపంలో ఉన్న M/T డౌనీ, M/T స్టార్క్1 అనే రెండు IRGC క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లను అమెరికా బలగాలు ధ్వంసం చేశాయని తెలిపింది. అలాగే ఒమన్ సముద్రంలో లోడ్ చేయకుండా ఉన్న మరో ట్యాంకర్‌పై సైతం దాడి చేసి నేలమట్టం చేశాయని పేర్కొంది. ఈ విషయమై సెంట్రల్ కమాండ్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ మాట్లాడుతూ "IRGCకి మా సందేశం స్పష్టంగా ఉండాలి. మీరు మా రెండు నౌకలపై కాల్పులు జరిపితే, మేము దానికి ప్రతిగా మీ వైపు నుంచి మూడింటిపై దాడి చేస్తాం. మరింత ఎక్కువ ఆర్థిక మూల్యాన్ని విధిస్తాము" అని కూపర్ పేర్కొన్నారు. అమెరికా బలగాలను రక్షించడానికి తాము ఏ క్షణంలోనైనా వెనుకాడబోమని ఆయన స్పష్టం చేశారు.ఇదిలా ఉండగా, పర్షియన్ గల్ఫ్‌లోని ఖార్క్ ద్వీపం సమీపంలో ఉన్న ఇరాన్ ట్యాంకర్‌పై అమెరికా దాడి చేసిందని ఇరాన్ ధృవీకరించింది. ఈ ఘటనలో ప్రాణనష్టం ఏమీ జరగలేదని, ట్యాంకర్ సిబ్బందిని సురక్షితంగా ఖాళీ చేయిస్తున్నట్లు స్థానిక వర్గాలు పేర్కొన్నట్లు ఆ దేశ మీడియా కథనాలు ప్రచురించింది, ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ఖర్గ్‌కు ద్వీపానికి చెందిన ఒక AI-సృష్టించిన వీడియోను జతచేస్తూ ఖార్గ్ ద్వీపం "చిన్నాభిన్నం" అవుతోందని పేర్కొన్నారు. -
ఇరాన్ పికాక్స్.. ట్రంప్‌కు ఎందుకంత పట్టుదల?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన ప్రకటన చేశారు. ప్రపంచంలోనే అత్యంత పటిష్ఠమైన భూగర్భ అణు కేంద్రంగా భావిస్తున్న ‘పికాక్స్ మౌంటెన్’పై తమ నిఘా కొనసాగుతోందని.. త్వరలోనే దానిపై దాడి చేసే అవకాశం ఉందని ప్రకటించారు. తద్వారా ఇరాన్‌ను మరో తీవ్ర హెచ్చరిక జారీ చేశారాయన. ఓవల్ ఆఫీసులో శుక్రవారం విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. అక్కడ అణు కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే ఎంతకైనా వెనుకాడబోమని స్పష్టం చేశారాయన.ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేసుకోకుండా అడ్డుకోవడమే అమెరికా సైనిక చర్యల ప్రధాన లక్ష్యం. మేం ఐదు నెలలుగా చర్యలు తీసుకుంటున్నాం. ఈ సమయంలో ఇరాన్‌కు అణ్వాయుధం లేకుండా చేశాం. ఒకవేళ ఆ దేశం అణ్వాయుధాన్ని పొందితే పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా మారతాయి. అందుకే మా నిరంతర నిఘా కొనసాగుతుంది అని అన్నారాయన. పికాక్స్ మౌంటెన్‌పై నిఘానటాంజ్ యురేనియం శుద్ధి కేంద్రానికి సమీపంలో ఉన్న పికాక్స్ మౌంటెన్ అత్యంత లోతైన భూగర్భ నిర్మాణాలతో కూడిన ప్రాంతంగా భావిస్తున్నారు. అక్కడ రెండు లోతైన సొరంగ వ్యవస్థలు ఉన్నట్లు సమాచారం. ఇజ్రాయెల్ నిఘా వర్గాల అంచనా ప్రకారం.. ఇరాన్ వేలాది సెంట్రిఫ్యూజ్‌లను ఈ భూగర్భ కేంద్రానికి తరలించినట్లు గతంలో వార్తలు వచ్చాయి.‘‘పికాక్స్లో ఏదైనా కార్యకలాపం జరుగుతున్నట్లు గుర్తిస్తే చాలా త్వరలోనే దాడి చేయవచ్చు. అక్కడి ప్రతీ కదలిక మాకు తెలుసు. ఇరాన్ అంతటా జరుగుతున్న కదలికలపై నిఘా ఉంది. ఏదైనా తప్పు జరిగితే తీవ్రంగా దాడి చేస్తాం’’ అని ట్రంప్ హెచ్చరించారు.భూగర్భంలో అత్యంత లోతుగా నిర్మించిన ఈ కేంద్రం.. సాధారణ వైమానిక దాడులను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉందన్న అంచనాలు ఉన్నాయి. అయితే అమెరికా ఇక్కడ దాడి చేస్తే ఇరాన్ అణు మౌలిక వసతులపై యుద్ధం మరింత తీవ్రతరం అయ్యే అవకాశముంది.ట్రంప్ ఇలా అనడం ఇదే తొలిసారి కాదు. జులైలోనే పికాక్స్ మౌంటెన్‌ను అమెరికా టార్గెట్ చేసే అవకాశం ఉందని ఆయన బహిరంగంగా హెచ్చరించారు. అప్పట్లో ‘‘త్వరలోనే, భారీగా దాడి చేస్తాం’’ అంటూ వ్యాఖ్యానించారు. తాజాగా మరోసారి ఇదే స్థావరాన్ని ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరాన్ అణు కార్యకలాపాలకు పికాక్స్ భవిష్యత్తులో కీలక కేంద్రంగా మారే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలోనే ట్రంప్ దృష్టి దీనిపైనే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.ఎక్కడ ఉంది.. ఎందుకు కీలకం? ఇరాన్‌లోని జాగ్రోస్ పర్వత శ్రేణిలో ఉన్న పికాక్స్ మౌంటెన్.. దేశంలోని ప్రధాన యురేనియం శుద్ధి కేంద్రం నతాంజ్‌కు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. పర్వతం లోపల వందల మీటర్ల లోతులో రెండు భారీ భూగర్భ టన్నెల్ సముదాయాలను నిర్మిస్తున్నారు. అత్యంత పటిష్ఠమైన ఈ నిర్మాణం వల్ల సాధారణ బంకర్-బస్టర్ బాంబులతోనూ దీనిని పూర్తిగా ధ్వంసం చేయడం కష్టమని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్ తన అణు పరికరాలు, సెంట్రిఫ్యూజ్‌లు లేదా యురేనియం నిల్వలను ఇక్కడ భద్రపరిచే అవకాశం ఉండటంతో.. భవిష్యత్తులో అణు కార్యక్రమాలను తిరిగి కొనసాగించేందుకు ఇది కీలక స్థావరంగా మారొచ్చన్నదే అమెరికా ఆందోళన.ఇజ్రాయెల్‌కు అండగా..అమెరికా జోక్యం చేసుకోకపోతే ఇజ్రాయెల్, మొత్తం మిడిల్ఈస్ట్ మరింత తీవ్రమైన ముప్పును ఎదుర్కొనేవని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ అణ్వాయుధాన్ని అభివృద్ధి చేసుకునే పరిస్థితిని తాము అడ్డుకున్నామని చెప్పారు. ఇరాన్ నుంచి యూరప్, అమెరికా నగరాలపైనా భవిష్యత్తులో ముప్పు ఏర్పడే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.ఇదిలా ఉండగా.. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఇటీవల ఇరాన్‌కు చెందిన పలు సైనిక స్థావరాలపై దాడులు చేసినట్లు ప్రకటించింది. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)కు చెందిన వైమానిక రక్షణ వ్యవస్థలు, రాడార్లు, సముద్ర కార్యకలాపాలకు సంబంధించిన ప్రాంతాలు, మైన్లు అమర్చే సామర్థ్యాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది.రాడార్లను రెండుసార్లు ధ్వంసం చేశాంఇరాన్ రాడార్ వ్యవస్థలపై అమెరికా దాడులను కూడా ట్రంప్ ప్రస్తావించారు. అత్యాధునిక రాడార్ వ్యవస్థలను ఇరాన్ రెండుసార్లు ఏర్పాటు చేసినా.. వాటిని అమెరికా ధ్వంసం చేసిందన్నారు. ‘‘రాడార్‌ను మళ్లీ ఏర్పాటు చేసి మళ్లీ దాడికి గురికావడం వారికి విసుగొచ్చిందని అనుకుంటున్నా’’ అని వ్యాఖ్యానించారు.అమెరికా తాజా దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. తమ సార్వభౌమత్వాన్ని అమెరికా ఉల్లంఘించిందని ఆరోపించింది. పలు ప్రావిన్సుల్లో సైనికేతర మౌలిక వసతులు, పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించింది. అమెరికా దాడులకు ప్రతిగా పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలపై ‘తీవ్రమైన ప్రతిదాడులు’ చేపట్టినట్లు ఇరాన్ విదేశాంగ శాఖ ప్రకటించింది.ఇదీ చదవండి: అబ్బే.. అదసలు విషయమే కాదు: ట్రంప్ -
ఇరాన్ యుద్ధం అమెరికాకు పెద్ద విషయమే కాదు: ట్రంప్
ఇరాన్‌తో జరుగుతున్న సైనిక ఘర్షణ అమెరికాకు పెద్ద విషయం కాదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. దీనిని యుద్ధం అని పిలవడం కంటే 'సైనిక ఘర్షణ' అని చెప్పడమే సరైందని వ్యాఖ్యానించారు. ఇరాన్‌పై అమెరికా అడపాదడపా దాడులు చేస్తోందని, ప్రస్తుతం తమ దేశం నేరుగా యుద్ధంలో లేదని చెప్పారు.వైట్‌హౌస్‌లో శుక్రవారం విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. 'చాలామంది దీనిని యుద్ధం అని పిలవడం లేదు. నేను సైనిక ఘర్షణ అంటాను. ఎందుకంటే ఇది మాకు పెద్ద విషయం కాదు' అని ట్రంప్ పేర్కొన్నారు.'ఇరాన్ అణ్వాయుధం తయారు చేయకుండా అడ్డుకున్నాం'ఇరాన్‌పై అమెరికా సాధించిన విజయాలను ట్రంప్ మరోసారి ప్రస్తావించారు. తమ చర్యలతో ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేయకుండా అడ్డుకున్నామని అన్నారు. హర్మూజ్ జలసంధిపై అమెరికాకు గణనీయమైన నియంత్రణ ఉందని కూడా పేర్కొన్నారు.మధ్యంతర ఎన్నికల వేళ యుద్ధంపై చర్చఅమెరికాలో నవంబర్‌లో కీలక మధ్యంతర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇరాన్ ఘర్షణపై ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న వైఖరి ప్రాధాన్యం సంతరించుకుంది. యుద్ధం కారణంగా ఇంధన ధరలు పెరగడం అమెరికా ప్రజలపై ఆర్థిక భారం పెంచుతోంది.ఇంధన ధరల పెరుగుదల వచ్చే ఎన్నికల్లో రిపబ్లికన్లకు నష్టం కలిగించే అవకాశం ఉందన్న ఆందోళనల మధ్య.. ఇరాన్‌తో జరుగుతున్న ఘర్షణ తీవ్రతను తగ్గించి చూపేందుకు ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే విమర్శలు కూడా ఉన్నాయి.ఇదిలా ఉంటే, అమెరికా-ఇరాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో హర్మూజ్ జలసంధి భద్రత, అంతర్జాతీయ నౌకాయానం, చమురు సరఫరాలపై ఆందోళనలు మాత్రం కొనసాగుతున్నాయి.చదవండి: పాకిస్తాన్‌కు వెళ్తున్న రష్యా నౌకపై డ్రోన్ దాడి.. అందులో23 మంది భారతీయులు -
ఇరాన్‌కు వాన్స్ బిగ్ వార్నింగ్.. ట్రంప్ వద్ద సీక్రెట్ ప్లాన్
వాషింగ్టన్: ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరు దేశాలు శాంతి ఒప్పందానికి అంగీకరించకపోవడంతో పరిస్థితి మళ్లీ మెుదటికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల అమెరికా ప్రపంచ దేశాలను హెచ్చరించింది. ఇరాన్‌కు సహాయం చేస్తే ఊరుకోం అని తెలిపింది. ఈ ఉద్రిక్తతల నడుమ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.జేడీవాన్స్ మీడియాతో మాట్లాడుతూ..ఇరాన్‌ను ఎదుర్కొనేందుకు ట్రంప్ ప్రభుత్వం వద్ద ఆర్థిక, సైనిక, దౌత్యపరమైన చర్యలతో పాటు రహస్యంగా ఒత్తిడి చేసేలా ప్లాన్ ఉంది. ఇరాన్‌పై చేపట్టబోయే తదుపరి చర్యలను బహిరంగంగా వెల్లడించదు. మా వద్ద ఇంకా చాలా అదనపు సాధనాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని అధ్యక్షుడు ఉపయోగిస్తారు.. మరికొన్నింటిని ఉపయోగించకపోవచ్చు. ఏది జరిగినా అది పరిశీలనలోనే ఉంది. ఆర్థిక ఒత్తిడి, సైనిక ఒత్తిడి, దౌత్యపరమైన ఒత్తిడి, రహస్య ఒత్తిడి.. ఇవన్నీ అధ్యక్షుడి వద్ద ఉన్న మార్గాల్లో భాగమే” అని వాన్స్ పేర్కొన్నారు.ఇరాన్‌పై అమెరికా అనుసరిస్తున్న విధానం కేవలం సైనికపరమైన అంశాలకే పరిమితం కాదని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఇంధన సంక్షోభం తలెత్తకుండా చూడటం కూడా తమ కర్తవ్యాల్లో ఒకటని చెప్పారు. హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలను ఇరాన్ ఇప్పటికీ లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు. వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించడంతో పాటు చమురు, సహజవాయువు సరఫరా నిరంతరం కొనసాగేందుకు అమెరికా సైన్యం చేపడుతున్న చర్యలను ఆయన సమర్థించారు.ఇరాన్‌కు ఎలా ప్రతిస్పందించాలన్న విషయంలో వాషింగ్టన్ తనకు ఉన్న అన్ని అవకాశాలను తెరిచి ఉంచుకోవాల్సిన అవసరం ఉందని వాన్స్ చెప్పారు. అయితే రానున్న నెలల్లో ఇరాన్‌పై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు.అయితే ఈ యుద్ధాన్ని ముగిసినట్లు ప్రకటించే అంశాన్ని ట్రంప్ ప్రైవేటుగా పరిశీలిస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక పేర్కొంది.అమెరికాలో మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో యుద్ధం కారణంగా ఇంధన ధరలు అధికంగా కొనసాగుతున్న పరిస్థితుల్లో ట్రంప్ యుద్ధానికి ముగింపు ప్రకటించే అంశంపై ఆలోచిస్తున్నట్లు ఆ నివేదిక తెలిపింది. మరోవైపు వాస్తవ పరిస్థితులేమో దీనికి భిన్నంగా ఉన్నాయి. అమెరికా పశ్చిమాసియాలో తన సైనిక బలగాల మోహరింపును మరింతగా పెంచింది. ఈ నేపథ్యంలో ఏం జరగనుందా అనే టెన్షన్ వాతావరణం నెలకొంది. -
‘హబీబీ.. దా!’.. అమెరికాను ఆటాడుకున్న ఇరాన్
ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటల యుద్ధం ఓ రేంజ్లో సాగుతోంది. ఓసారి ‘హర్ముజ్ సీమైన్లను తొలగించి.. పూర్తిగా ఆధీనంలోకి తెచ్చుకున్నాం’ అంటారు. మరోసారి హర్ముజ్‌లో ఇరాన్ మళ్లీ సీమైన్లు పెడుతోందని.. తమ సైన్యం అడ్డుకుంటోందని అంటారు. ఇంకోసారి ఇరాన్లో అమెరికా నిఘా ఎంత పక్కాగా ఉందో చెబుతూ.. ‘వాళ్లు బాత్రూమ్కు వెళ్లినా మాకు తెలిసిపోతుంది’ అని వ్యాఖ్యానించారు. మరి ట్రంప్ ఇంతలా మాట్లాడుతుంటే.. ఇరాన్ ఏం చేసిందో తెలుసా?.. ‘హబీబీ.. ఇరాన్‌కు రా!’ అంటూ అమెరికాను ఓ ఆటాడుకుంటోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్ముజ్ విషయంలో చేస్తున్న హెచ్చరికలకు నేరుగా స్పందించకుండా.. ఒక వీడియో గేమ్ రూపంలో వ్యంగ్యాస్త్రం సంధించింది ఇరాన్. ఆ దేశ ఎంబసీకి చెందిన సోషల్ మీడియా ఖాతా ఈ వ్యంగ్య వీడియోను పోస్టు చేసింది. కేవలం 35 సెకన్ల నిడివి ఉన్న యానిమేషన్లో హర్ముజ్ జలసంధి 3డీ మ్యాప్ కనిపిస్తుంది. ఆ తర్వాత అది ‘మైన్స్వీపర్’ గేమ్‌లా మారుతుంది. పాత కంప్యూటర్లలో బాంబులు ఎక్కడున్నాయో గుర్తిస్తూ ఆడే ఈ గేమ్‌ను.. హర్ముజ్‌లోని సీమైన్లకు అన్వయిస్తూ ఇరాన్ ఈ వీడియో రూపొందించింది. దానితోపాటు ‘హబీబీ (అంకుల్ సామ్).. ఇరాన్‌కు రా!’ అంటూ సందేశం ఇచ్చింది. అంటే మైన్స్వీపర్లో బాంబుల కోసం వెతికినట్టే.. అమెరికా కూడా హర్ముజ్‌లో సీమైన్ల కోసం వెతుకుతోందన్న భావన వచ్చేలా హేళన చేస్తూ వీడియోను రూపొందించిందన్నమాట.అసలు మైన్ల గొడవేంటి?పశ్చిమాసియా యుద్ధం మొదలైనప్పటి నుంచి.. హార్ముజ్ జలసంధిలో సీమైన్లు ఏర్పాటు చేసి నౌకల రాకపోకలను అడ్డుకునేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో దాదాపు ఐదు నెలల తర్వాత సీక్రెట్ ఆపరేషన్‌తో వాటిని సమర్థవంతంగా తొలగించామని.. ఇది అమెరికా సైన్యం సాధించిన అజేయ విజయమని ట్రంప్ ప్రకటించారు. అయితే రెండ్రోజులకే నాలిక మడతేసి.. ఇరాన్ మళ్లీ కొత్తగా సీమైన్లు ఏర్పాటు చేస్తోందని ఆరోపించారు. అయినప్పటికీ అంతర్జాతీయ నౌకా మార్గాల్లో వాటిని తొలగించే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు.Habibi (Uncle Sam), come to Iran! pic.twitter.com/Ay6FdpwF8E— Iran Embassy in Sierra Leone (@IRANinSalone) September 3, 2026ఈ క్రమంలో.. హార్ముజ్ జలసంధిలోని ఇరాన్‌కు చెందిన లారక్ దీవిపై అమెరికా రెండు రాకెట్ లాంచర్లను ధ్వంసం చేసింది. ఆ లాంచర్లతో సీమైన్లను హార్ముజ్‌లోకి పంపేందుకు ఇరాన్ సిద్ధమవుతోందని అమెరికా ఆరోపించింది. దీనికి ప్రతిగా జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణులను ప్రయోగించడంతో దాదాపు నెల రోజుల తర్వాత పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంది. ఈ క్రమంలో అమాయకులు సైతం ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇరాన్ మాత్రం అమెరికా వాదనలను ముందు నుంచే కొట్టిపారేస్తోంది. హర్ముజ్ సీమైన్ల విషయంలో అమెరికా తొలి నుంచి చెబుతోందంతా అబద్ధమేనని.. మార్కెట్లను శాంతింపజేసే ప్రయత్నమేనని అంటోంది. అంతేకాదు.. హర్ముజ్‌పై పూర్తి నియంత్రణ తమదేనంటూ ఉద్ఘాటించింది. దీంతో అమెరికా-ఇరాన్‌ల మధ్య‘ఎవరి నిఘా ఎంత?’.. ‘హార్ముజ్‌పై ఎవరి పట్టు?’ అనే రీతిలో పోరు కొనసాగుతోంది.ట్రంప్ మాటలకు మాటలతోనే కాదు..తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా ఇరాన్‌పై సైనిక దాడులు కొనసాగిస్తోంది. మరోవైపు ఇరాన్ కూడా అమెరికా స్థావరాలు, ప్రాంతీయ మిత్రదేశాలపై క్షిపణి, డ్రోన్ దాడులకు దిగుతోంది. దీంతో హర్ముజ్ చుట్టూ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇదే సమయంలో చమురు ఎగుమతులను అడ్డుకోవడం, ఆంక్షలను కఠినతరం చేయడం ద్వారా ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచాలని అమెరికా ప్రయత్నిస్తోంది. అయితే హర్ముజ్ విషయంలో అమెరికా సైనిక బలం, ఇరాన్ వ్యూహాత్మక ప్రతిస్పందన.. రెండూ ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి.ఇదీ చదవండి: శని గ్రహంపై సరికొత్త మిస్టరీ! -
సముద్ర రవాణా ఇక ఆర్కిటిక్ వైపు?
ప్రపంచ సగటుతో పోలిస్తే వేగంగా పెరుగుతున్న ఆర్కిటిక్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, గ్రీన్ లాండ్‌ను వశం చేసుకుంటామనే ట్రంప్ బెదిరింపులు, అసాధారణ స్థాయిలో కరిగిపోతున్న మంచు; రష్యా, ఇరాన్లపైన అమెరికా ఆర్థిక యుద్ధం క్రమంగా ప్రపంచ దేశాలను ఆర్కిటిక్ సముద్ర జలాల వైపు నడిపిస్తున్నాయి. అమెరికా నాయకత్వంలోని పాశ్చాత్య దేశాల అదుపాజ్ఞలలో ఉన్న హార్మూజ్, బాబెల్ మాండెబ్, సూయెజ్, మలక్కా జలసంధుల నుండి దూరంగా సురక్షిత ఆర్కి టిక్ సముద్ర మార్గం గుండా సరకుల రవాణాకు రష్యా, చైనా పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నాయి. ఆసియా, ఐరోపాలను కలిపే కేప్ ఆఫ్ గుడ్‌హోప్, సూయెజ్ కాలువ మార్గాలలో అశాంతి, అనిశ్చిత స్థితి వలన అందరి చూపు ఆర్కిటిక్ వైపు మళ్లింది. ప్రపంచ సగటుతో పోల్చితే ఆర్కిటిక్ సముద్రంలో ఉష్ణోగ్రతలు మూడు నుండి నాలుగు రెట్లు వేగంగా పెరుగుతున్నాయి. దీనినే పర్యావరణ శాస్త్రజ్ఞులు ‘ఆర్కిటిక్ ఆంప్లిఫికేషన్ ’గా అభివర్ణిస్తున్నారు. పారిశ్రామిక విప్లవానికి ముందు ఉష్ణోగ్రతల కంటే ఐరోపాలో 2.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పెరిగితే ఆర్కిటిక్ సముద్రంలో 3.3. డిగ్రీల సెల్సియస్ పెరిగింది. గత సంవత్సరంలో అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఆర్కిటిక్‌లో 5.8 శాతం మంచుపొర క్షీణించింది. వేగంగా క్షీణిస్తున్న మంచుపొర ఆర్కిటిక్ జలాలను నౌకాయానానికి మరింత అనుకూలంగా చేస్తున్నది. రష్యాకు సానుకూలంఆర్కిటిక్ జలాలలో మూడు ప్రధాన నౌకా మార్గాలున్నాయి. అవి. 1. నైరుతి మార్గం 2. వాయవ్య మార్గం 3. ధ్రువ ప్రాంతం మీదుగా వెళ్లే (ట్రాన్స్ పోలార్) మార్గం. కెనడా తీరంలోని వాయవ్య మార్గంలో అనువైన రేవు పట్టణాలు లేవు. అందువలదన ఈ ప్రాంతంలో కేవలం విహార యాత్రికుల క్రూయిజ్ షిప్పులు, పరిశోధనా నౌకలు మాత్రమే సంచరిస్తున్నాయి. ఉత్తర ధ్రువాన్ని ఆనుకుని ఉన్న ట్రాన్స్పోలార్ మార్గం పూర్తిగా మంచుతో కప్పబడి నౌకాయానానికి ఏ మాత్రం వీలుగా లేదు. ప్రస్తుత ప్రపంచ దృష్టి అంతా రష్యా తీరంలోని నైరుతి ఆర్కిటిక్ సముద్ర మార్గంపైననే ఉన్నది. రష్యా తీరంలో ముర్మన్స్క్నుండి వ్లాదివోస్తోక్ మధ్యలో 70కి పైగా రేవు పట్టణాలు ఉన్నాయి. ముర్మన్స్క్ రేవు పట్టణం సంవత్సరం పొడవునా అందుబాటులో ఉంటుంది. రష్యన్ న్యూక్లియర్ ఐస్ బ్రేకర్ నౌకాదళ ప్రధాన కార్యాలయం ఇక్కడనే ఉన్నది. 2025లో ఈ ఆర్కిటిక్ సముద్ర మార్గం గుండా 37 మిలియన్ టన్నులుగా ఉన్న రవాణా 2026లో ఇప్పటికే 40 మిలియన్ టన్నులకు చేరింది. ఈ రవాణా ప్రధానంగా రష్యన్ చమురు, గ్యాస్ ఎగుమతుల రూపంలో ఉన్నది. యామాల్ ద్వీపకల్పంలోని నోవాటెక్ చమురు క్షేత్రాలలో ఉత్పత్తి అవుతున్న చమురు, సహజవాయువులను ఈ మార్గం గుండా చైనాకు ఎగుమతి చేస్తున్నారు. రష్యా–చైనా మధ్య గత సంవత్సరం 103 నౌకలు ఈ మార్గంలో ప్రయాణించాయి. ఈ మార్గంలో చమురు ట్యాంకర్లే కాకుండా క్రమంగా సరకుల రవాణా చేసే భారీ కంటెయినర్ కార్గో షిప్పుల ప్రయాణం కూడా ప్రారంభమైంది. 2023లో 7 కంటెయినర్ షిప్పులు ప్రయాణిస్తే ఈ సంవత్సరం ఇప్పటికే 30 కంటెయినర్ షిప్పులు ప్రయాణించాయి.చైనా వడి వడి అడుగులుచైనా వ్యూహాత్మకంగా ఆర్కిటిక్ సముద్ర మార్గంపై అమితా సక్తిని చూపిస్తున్నది. చైనాకు ఆర్కిటిక్ తీరం లేదు. 2013లో ఆర్కిటిక్ కౌన్సిల్లో అబ్జర్వర్‌గా చేరింది. 2017లో చైనా తన ప్రతిష్ఠాత్మక బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ) పథకాన్ని ఆర్కిటిక్‌కు విస్తరిస్తూ ‘పోలార్ సిల్క్ రోడ్’ను ప్రతిపాదించింది. 2018లో ఆర్కిటిక్ విధాన శ్వేతపత్రంలో చైనా తనను తాను ‘నియర్ ఆర్కిటిక్ స్టేట్’గా అభివర్ణించుకున్నది. ఆర్కిటిక్ సముద్ర జల మార్గంలో 2024లో 15 చైనా నౌకలు ప్రయాణించగా, వాటి సంఖ్య 2026 నాటికి 30కి పైగా చేరింది. చైనాలో నింగ్బో నుండి కంటె యినర్ షిప్పులు సూయెజ్ కాలువ గుండా ప్రయాణిస్తే యూకేలోని అతిపెద్ద కంటెయినర్ టర్మినల్ ఫీలిక్స్స్టోవే చేరటానికి 40 రోజులు పడుతుంది. ఆర్కిటిక్ సముద్ర మార్గంలో నింగ్బో నుండి ఫీలిక్స్ స్టోవేకు 20 రోజుల్లో చేరుతున్నారు. చైనాకు చెందిన సీవోఎస్సీవో (కాస్కో) ఈ మార్గంలో కంటెయినర్ రవాణాను చేపట్టింది. నౌకల రవాణాను సుగమం చేయటానికి చైనా ఆర్కిటెక్ జలాలలోకి గ్జ్యూ లాంగ్, గ్జ్యూ లాంగ్–2 ఐస్‌బ్రేకర్ షిప్పులను ప్రవేశపెట్టింది. 2025లో రష్యా, చైనా ఆర్కిటిక్ సముద్ర రవాణాలో పరస్పరం సహకరించుకోవటానికి ఒప్పందం కుదుర్చుకొన్నాయి.అంతర్జాతీయంగా రష్యన్ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేయటానికి రష్యాపై అమెరికా తీవ్ర ఆంక్షలను విధించింది. అంతర్జాతీయ నెఫ్ట్ చెల్లింపుల వ్యవస్థ నుండి రష్యాను బహిష్కరించింది. అయి నప్పటికీ చైనా, భారత్, ఇరాన్ వంటి దేశాలతో లావాదేవీల ద్వారా రష్యా తన వాణిజ్యాన్ని కొనసాగిస్తున్నది. ఆర్కిటిక్ జలాలలో రష్యా–చైనా వ్యూహాలను అమెరికా, ఐరోపాలు నిశితంగా గమనిస్తున్నాయి. ప్రస్తుతం రష్యన్ ఆర్కిటిక్ ఎకానమీ, రష్యన్ జీడీపీలో పది శాతం కంటే తక్కువగానే ఉన్నది. కానీ రానున్న 20 సంవత్సరాలలో ఇది 60 శాతానికి చేరినా ఆశ్చర్యపడనవసరం లేదు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ గ్రీన్ లాండ్ వివాదాన్ని భుజాలకెత్తుకున్నాడు. ఆర్కిటిక్ జలాలలో రష్యా–చైనా లపై నిఘా వేయటానికి గ్రీన్ లాండ్ కీలకం. అందుకే గ్రీన్‌లాండ్‌ను అమెరికాలో అంతర్భాగం చేయాలని పట్టు బడుతున్నాడు. 2026 ఫిబ్రవరిలో నాటో ‘ఆపరేషన్ ఆర్కిటిక్ సెంట్రీ’ని ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఆర్కిటిక్ జలా లపై నాటో బలగాలు గట్టి నిఘాను పెడుతున్నాయి. అయితే ఆర్కిటిక్ రష్యాను ఎదుర్కొనే నౌకాశక్తిగానీ, ఐస్ బ్రేకింగ్ షిప్పుల సామ ర్థ్యాలుగానీ, యూఎస్, నాటోలకు లేవు. అదే రకంగా రష్యాకూ పరిమితులున్నాయి. రష్యా మీద ఆంక్షల వలన పాశ్చాత్య షిప్పింగ్ కంపెనీలు, బీమా కంపెనీలు ముందుకు రాకపోవడంతో ఆర్కిటిక్ ప్రపంచ రవాణా మార్గంగా అభివృద్ధి చెందటం కష్టం.భారత్ కార్యకలాపాలు1920 స్వాల్బార్డ్ ఒప్పందంపై సంతకం చేయటం ద్వారా భారత్ ఆర్కిటిక్ వైపు అడుగులు వేసింది. 2007లో తన మొదటి పరిశోధనా/ అన్వేషణ నౌకను ఆర్కిటిక్‌కు పంపించింది. 2013లో ఆర్కిటిక్ కౌన్సిల్లో అబ్జర్వర్‌గా చేరింది. 2022లో ఆర్కిటిక్ పాలసీని ప్రకటించింది. శాస్త్ర–వైజ్ఞానిక అంశాల లక్ష్యంగా ఉన్న ఆర్కిటిక్ సముద్ర జలాలను భారత్ 2022 తర్వాత వనరులు, ఆర్థిక లక్ష్యాలు, వ్యూహాత్మక కోణంలో నుండి పరిశీలించటం ప్రారంభించింది. 2024లో చెన్నై–వ్లాదివోస్తోక్ మార్గాన్ని ‘ఈస్టర్న్ మారిటైమ్ కారిడార్’గా అభివృద్ధి చేయటానికి రష్యాతో ఒప్పందం కుదుర్చు కున్నది. రష్యన్ ఆర్కిటిక్ తీరంలో ప్రాజెక్టుల అభివృద్ధికి ఒక బిలియన్ డాలర్ల లైన్ ఆఫ్ క్రెడిట్‌ను ఏర్పాటు చేసింది. వచ్చే సంవ త్సరం (2027)లో మొట్టమొదటి భారతీయ రవాణా నౌక ఆర్కిటిక్ జలాలలో ప్రయాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గురజాల శ్రీనివాసరావు వ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
ఇరాన్‌పై అమెరికా నిఘా మామూలుగా లేదట!
ఇరాన్‌పై అమెరికా నిఘా ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇరాన్లో ఏం జరుగుతుందో తమకు క్షణక్షణం తెలుసని.. అక్కడి వ్యక్తులు తమ కంటపడకుండా కనీసం బాత్రూమ్కు కూడా వెళ్లలేరంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై మరోసారి దాడి చేయాల్సి వస్తే ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.వైట్‌హౌస్‌లో ఇవాళ విలేకరులతో మాట్లాడిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్ హర్ముజ్ జలసంధి ప్రాంతంలో రాడార్ వ్యవస్థలు, క్షిపణి వ్యవస్థలు, సముద్రంలో మైన్లు వేసే సామర్థ్యాన్ని తిరిగి నిర్మించేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. వాటిని అమెరికా నిఘా వ్యవస్థలు గుర్తించాయని.. నిర్మాణం పూర్తయ్యేలోపే లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేశామని పేర్కొన్నారు. ‘‘ఇరాన్ నాయకత్వం మమ్మల్ని తక్కువ అంచనా వేస్తోంది. కానీ, వాళ్లేం చేస్తున్నారో మాకు అంతా కనిపిస్తోంది. వాళ్లు కదలలేరు. ప్రశాంతంగా బాత్రూమ్కు కూడా వెళ్లలేరు’’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ సైనిక సామర్థ్యాలు, అక్కడి కదలికలపై అమెరికా ఎంత విస్తృతంగా నిఘా కొనసాగిస్తుందో చెప్పే క్రమంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ రాడార్ వ్యవస్థలు, క్షిపణి సామర్థ్యాలు, హోర్ముజ్ జలసంధి వద్ద సైనిక కార్యకలాపాలపై అమెరికాకు పూర్తి సమాచారం ఉందని ఆయన చెప్పుకొచ్చారు.మరోవైపు.. పశ్చిమాసియా ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి ట్రంప్ భద్రత విషయంలో అమెరికా భద్రతా బలగాలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. దీనికి నిదర్శనంగా టర్కీలో చోటుచేసుకున్న ఘటనను చెప్పుకోవచ్చు. ఇరాన్ నుంచి ట్రంప్‌పై ముప్పు ఉందన్న నిఘా సమాచారంతో.. ఆయన ప్రయాణాన్ని అత్యంత రహస్యంగా మార్చారు. అంకారా నుంచి బయలుదేరే సమయంలో ట్రంప్ పాత ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ఉన్నట్లు బయట ప్రపంచానికి కనిపించినప్పటికీ.. అనంతరం క్యాటరింగ్ వాహనం ద్వారా మరో చిన్న సైనిక విమానంలోకి రహస్యంగా తరలించారు. మీడియా, కొంతమంది సిబ్బందికి కూడా ఆయన అసలు విమానంలో లేరన్న విషయం వెంటనే తెలియలేదు. అంటే.. ట్రంప్ భద్రత కోసం అమెరికా ఎంత స్థాయిలో రహస్య ఆపరేషన్లు నిర్వహించిందో ఈ ఘటన స్పష్టం చేస్తోంది. ఇప్పుడు ఇరాన్ కదలికలపై తమ నిఘా సామర్థ్యాన్ని చాటుకునే క్రమంలో ట్రంప్ చేసిన ‘‘బాత్రూమ్కు కూడా వెళ్లలేరు’’ వ్యాఖ్యలు.. భద్రతా వ్యవస్థపై ఆయనకున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తున్నాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.హర్ముజ్ మా ఆధీనంలోనే..ఇరాన్ ఆంక్షల కారణంగా నెలలుగా తీవ్ర ఉద్రిక్తతకు కేంద్రంగా మారిన హర్ముజ్ జలసంధిపై కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంపై అమెరికాకు బలమైన నియంత్రణ ఉందని చెప్పారు. ప్రతిరోజూ భారీ మొత్తంలో చమురును తీసుకెళ్లే నౌకలు అక్కడి నుంచి వెళ్తున్నాయని.. అప్పుడప్పుడు ఇరాన్ డ్రోన్లు దాడి చేసినా వాటిని కూల్చివేస్తున్నామని తెలిపారు.ఇరాన్ సముద్రంలో మైన్లు వేయడానికి ప్రయత్నిస్తోందని, ఇందుకోసం ప్రత్యేకంగా రాకెట్ వ్యవస్థను సిద్ధం చేస్తోందని ట్రంప్ ఆరోపించారు. ఆ సామర్థ్యాన్ని అమెరికా దాడుల్లో ధ్వంసం చేశామని పేర్కొన్నారు.భారీ దాడి.. 18 మంది మృతిఇటీవల.. దాదాపు నెల గ్యాప్ తర్వాత అమెరికా, ఇరాన్ మధ్య పరస్పర దాడులు జరిగాయి. ఇందులో ఇరాన్లో కనీసం 18 మంది మృతి చెందగా, 108 మంది గాయపడ్డారని తాజా నివేదికలు చెబుతున్నాయి. హర్ముజ్ సమీపంలోని కుహెస్తక్ ప్రాంతంలో ఓ వివాహ వేడుక జరుగుతున్న ఇంటిపై అమెరికా దాడి జరిగినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడినట్లు ఏపీ నివేదించింది. అయితే అమెరికా సైన్యం మాత్రం తామేమీ పౌరులను లక్ష్యంగా చేసుకోలేదని తెలిపింది.అమెరికాకు ఇరాన్ దీటైన బదులుఅమెరికా దాడులకు ఇరాన్ కూడా తీవ్రంగా స్పందించింది. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు, అమెరికా మిత్రదేశాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు సమాచారం. కువైట్, బహ్రెయిన్, జోర్డాన్, యూఏఈ, ఇరాక్‌లోని కుర్దిస్తాన్ ప్రాంతాల్లో అమెరికా ప్రయోజనాలకు చెందిన లక్ష్యాలపై ఇరాన్ దాడులు చేసినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి.‘ఏ క్షణమైనా దాడి చేస్తాం’ఇరాన్‌తో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ట్రంప్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా అవసరమైతే ఇరాన్‌పై ఎప్పుడైనా కొత్త దాడికి దిగేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఆ దాడులు భీకరంగా ఉండొచ్చని కూడా వ్యాఖ్యానించారు. అయితే తాజా దాడుల తర్వాత పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగదని, త్వరలోనే ముగిసే అవకాశం ఉందన్న ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: ఇరాన్ అధ్యక్షుడితో మోదీ భేటీ.. అమెరికా కన్నెర్ర -
అమెరికా పునాదులు కదిలిస్తాం?
-
ట్రంప్ అన్నాడో లేదో.. మ్యాప్ మార్చేసిన వైట్‌హౌస్!
వాషింగ్టన్: ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్న హార్ముజ్ జలసంధి పేరును మార్చే అంశం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనపై వైట్‌హౌస్ ఏకంగా మ్యాప్‌నే మార్చి ‘ట్రంప్ స్ట్రెయిట్’గా చూపించింది. అంతేకాదు.. దానికి ‘It’s got a nice ring to it’ అంటూ క్యాప్షన్ పెట్టింది. అంటే.. ‘పేరు వినడానికి బాగానే ఉంది’ అన్నట్టుగా స్పందించింది. దీంతో, అమెరికా చర్యలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది.ట్రంప్ బుధవారం తన ట్రూత్ సోషల్ ఖాతాలో హార్ముజ్ జలసంధికి ‘ట్రంప్ స్ట్రెయిట్’గా పేరు మార్చాలా? అని ప్రశ్నించారు. ‘ఇప్పుడు ఇది అమెరికా నియంత్రణలో ఉంది కాబట్టి.. హార్ముజ్ స్ట్రెయిట్ పేరును ట్రంప్ స్ట్రెయిట్‌గా మార్చాలా? అమెరికా మాదిరిగానే ఇది కూడా మునుపెన్నడూ లేనంత ‘హాట్’గా ఉంటుంది!’ అంటూ వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యలు వెలువడిన కొద్దిసేపటికే వైట్‌హౌస్ అధికారిక సోషల్ మీడియా ఖాతా స్పందించింది. హార్ముజ్ జలసంధిని ‘Trump Strait’గా పేర్కొంటూ ఓ మ్యాప్‌ను పోస్టు చేసి.. ‘It’s got a nice ring to it’ అని రాసుకొచ్చి అందరికీ షాకిచ్చింది. దీంతో అధ్యక్షుడి వ్యాఖ్యను వైట్‌హౌస్ కూడా సరదాగా స్వీకరించినట్టు స్పష్టమైంది.నిజంగానే పేరు మారుస్తారా?అయితే ప్రస్తుతానికి హార్ముజ్ జలసంధికి అధికారికంగా ‘ట్రంప్ స్ట్రెయిట్’ అనే పేరు పెట్టినట్లు ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. ఇది ట్రంప్ చేసిన ప్రతిపాదన, దానికి వైట్‌హౌస్ ఇచ్చిన వ్యంగ్యాత్మక స్పందన మాత్రమే. అంతర్జాతీయ జలమార్గమైన హార్ముజ్ పేరును అమెరికా ఒక్కపక్షంగా మార్చడం అంత సులభం కాదు. అంతేకాదు.. ట్రంప్ తర్వాత తన ప్రతిపాదనను కొంత తేలికగా తీసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. పేరు మార్చడం గురించి తాను సీరియస్‌గా అన్నారా అని ప్రశ్నించగా, ‘అది అలా సరదాగా చెప్పాను’ అన్నట్టుగా పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే, ట్రంప్ గతంలో సరదాగా ప్రస్తావించిన కొన్ని పేరు మార్పులు తర్వాత అధికారిక చర్యలుగా మారడంతో ఈ వ్యవహారంపై ఆసక్తి నెలకొంది.ఇది మొదటిసారి కాదు..ట్రంప్ భౌగోళిక పేర్ల మార్పుపై ఆసక్తి చూపడం ఇదే మొదటిసారి కాదు. 2025లో ఆయన ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’ను ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’గా పిలవాలని ఆదేశించారు. ఇటీవల కెనడాతో వాణిజ్య వివాదం మధ్య లేక్ ఒంటారియోకు ‘లేక్ అమెరికా’ అనే పేరు ప్రతిపాదించి, దానిపై అధికారిక చర్యలు కూడా చేపట్టారు.ఇదీ చదవండి: ఇరాన్‌పై ఇజ్రాయెల్ మిషెన్ ఇంకా పూర్తి కాలేదు: నెతన్యాహు -
ఇరాన్‌కు సహకరిస్తే ఊరుకునేది లేదు!
ఇరాన్ తమ ఆంక్షల నుంచి తప్పించుకునే అవకాశమే లేదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అంటున్నారు. ఆ దేశానికి ఆదాయం సమకూర్చేలా ఎలాంటి వ్యవస్థలను ఏర్పాటు చేయడంలోనూ ఇతర దేశాలు సహకరించకూడదని స్పష్టం చేశారు. అలా చేస్తే ఆయా దేశాలపైనా అమెరికా ఆంక్షలు విధించాల్సి వస్తుందని తేల్చిచెప్పారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌తో బిష్కెక్లో భేటీ అయిన తరుణంలో ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది.ఇరాన్‌తో సంబంధాలు కొనసాగించే హక్కు ప్రతి దేశానికీ ఉందని రూబియో పేర్కొన్నారు. అమెరికా కూడా గతంలో ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు జరిపిందని గుర్తుచేశారు. అయితే ఆర్థికంగా ఇరాన్‌కు సహకరించడం, అమెరికా ఆంక్షలను తప్పించుకునేందుకు మార్గాలు సృష్టించడం మాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. ఇరాన్ ఆంక్షలను తప్పించుకుని ఆదాయం సంపాదించేలా ఏ దేశమైనా సహకరిస్తే.. ఆ దేశంపైనా అమెరికా చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఇరాన్ సంపాదించే ఆదాయాన్ని ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడానికి, అణ్వాయుధాల తయారీకి ఉపయోగించే అవకాశం ఉందని రూబియో ఆరోపించారు.భారత్–ఇరాన్ వాణిజ్యంపై కామెంట్..మోదీ–పెజెష్కియాన్ భేటీపై స్పందించిన మార్కో రూబియో.. భారత్, ఇరాన్ మధ్య కొత్త వాణిజ్య ఒప్పందం గురించి తనకు తెలియదని అన్నారు. ఇరాన్‌తో సంబంధాలు పెట్టుకోవడం ఆయా దేశాల విదేశాంగ విధానానికి సంబంధించిన విషయమని పేర్కొన్నారు. అయితే అమెరికా ఆంక్షలను తప్పించుకునేందుకు ఇరాన్‌కు సహకరించడం వేరు అని స్పష్టం చేశారు. వాణిజ్య సంబంధాల ద్వారా ఇరాన్‌కు నిధులు సమకూరేలా చేసి.. వాటిని అమెరికా వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించే పరిస్థితిని తాము అంగీకరించబోమని రూబియో వ్యాఖ్యల సారాంశం.మోదీ–పెజెష్కియాన్ భేటీలో..షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సు సందర్భంగా కిర్గిజ్‌స్థాన్ రాజధాని బిష్కెక్లో ప్రధాని మోదీ, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సమావేశమయ్యారు. భారత్–ఇరాన్ సంబంధాలను మరింత బలోపేతం చేయడం, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించడం వంటి అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. అదే సమయంలో పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ప్రాంతీయ పరిస్థితులపైనా అభిప్రాయాలు పంచుకున్నారు. శాశ్వత శాంతి కోసం జరిగే ప్రయత్నాలకు భారత్ మద్దతు కొనసాగిస్తుందని మోదీ స్పష్టం చేశారు.వాణిజ్య నౌకల భద్రతపై భారత్ ఆందోళనపశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావం సముద్ర రవాణాపైనా పడుతున్న నేపథ్యంలో.. వాణిజ్య నౌకలు, నావికుల భద్రత అంశం కూడా ఇరువురు నేతల చర్చల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. వాణిజ్య నౌకాయానం, స్వేచ్ఛాయుత రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు కలగకూడదని భారత్ స్పష్టం చేసింది. పౌరులు, పౌర మౌలిక వసతులు, వాణిజ్య నౌకలు, నావికులను దాడుల పరిధిలోకి తీసుకురావొద్దని న్యూఢిల్లీ తన వైఖరిని పునరుద్ఘాటించింది.దౌత్యపరమైన పాత్రకు పిలుపుమరోవైపు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్ తన దౌత్య సంబంధాలను ఉపయోగించాలని కోరారు. సమస్యలను చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలన్నది తమ ప్రభుత్వ విధానమని చెప్పారు.అమెరికా మాత్రం దౌత్య మార్గాన్ని పక్కనపెట్టి బలప్రయోగం, యుద్ధం, ఆంక్షల బాట పట్టిందని ఆయన విమర్శించారు. ఇరాన్ యుద్ధాన్ని కోరుకోవడం లేదని, ప్రజల రక్షణతో పాటు శాంతి, స్థిరత్వానికి అనుకూలమైన పరిస్థితులు కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడి పెంచుతున్న అమెరికాట్రంప్ ప్రభుత్వం ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచుతోంది. ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలు, సంస్థలు అమెరికా ఆంక్షల పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రూబియో తాజా వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇరాన్‌తో సంబంధాలు కొనసాగించడాన్ని పూర్తిగా నిషేధించడం లేదని చెబుతూనే.. ఆంక్షలను తప్పించుకునేలా ఆర్థిక సహకారం అందించే దేశాలను మాత్రం అమెరికా ఉపేక్షించబోదన్న సంకేతాన్ని వాషింగ్టన్ ఇచ్చింది.భారత్‌కు సవాల్ఇరాన్తో భారత్‌కు దీర్ఘకాలిక చారిత్రక, వ్యూహాత్మక, ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. మరోవైపు అమెరికాతోనూ భారత్ కీలక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తోంది. దీంతో ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలను విస్తరించడంతో పాటు అమెరికా ఆంక్షలను ఉల్లంఘించకుండా ఉండటం న్యూఢిల్లీకి కీలకంగా మారింది.మోదీ–పెజెష్కియాన్ భేటీ తర్వాత రూబియో చేసిన తాజా హెచ్చరిక.. ఇరాన్ విషయంలో భారత్ సహా ఇతర దేశాలపై అమెరికా నిఘా, ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉందన్న సంకేతంగా కనిపిస్తోంది.ఇదీ చదవండి: గూగుల్ తర్వాత యాపిల్ అదే పని చేసిందిగా! -
మళ్లీ భగ్గుమన్న పశ్చిమాసియా
దుబాయ్/టెహ్రాన్: పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెచ్చరిల్లాయి. ఇరుపక్షాల మధ్య మళ్లీ దాడులు, ప్రతిదాడులు మొదలయ్యాయి. మంగళవారం ఇరాన్లో ఓ పెళ్లి వేడుక జరుగుతున్న ఇంటితో సహా పలు లక్ష్యాలపై అమెరికా సైన్యం విరుచుకుపడింది. భారీ సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. పెళ్లి జరుగుతున్న ఇంటిలో నాలుగేళ్ల చిన్నారి సహా కనీసం నలుగురు మరణించారని, పదుల సంఖ్యలో జనం గాయపడ్డారని స్థానిక అధికారులు వెల్లడించారు. అమెరికా దాడుల్లో మొత్తం 12 మంది మృతిచెందారని పేర్కొన్నారు. మరో 68 మంది గాయపడ్డారని ఇరాన్ మీడియా తెలియజేసింది. అమెరికా సైన్యం ప్రధానంగా ఇరాన్ దక్షిణ తీరాన్ని టార్గెట్ చేసింది. అమెరికా దుశ్చర్య పట్ల ఇరాన్ తీవ్రంగా స్పందించింది. వెంటనే ప్రతీకార చర్యలకు దిగింది. పశ్చిమాసియాలో అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని మంగళవారం రాత్రి క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. అమెరికా, ఇరాన్ మధ్య ఈ స్థాయిలో ఉద్రిక్తతలు పెరగడం జూలై తర్వాత ఇదే మొదటిసారి కావడం గమనార్హం. అమెరికా జవాన్లను తరిమికొడతాం ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు, రాడార్ వ్యవస్థలు, మారిటైమ్ మౌలిక సదుపాయాలు, కమ్యూనికేషన్ కేంద్రాలపై దాడులు చేశామని అమెరికా సైన్యం ప్రకటించింది. హార్మూజ్ జలసంధి సమీపంలోనూ అమెరికా దాడులకు పాల్పడినట్లు ఇరాన్ ఆరోపించింది. అమెరికాకు బుద్ధి చెప్పడానికి బహ్రెయిన్, జోర్డాన్, కువైట్, ఖతార్, ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై ప్రతి దాడులు చేశామని పేర్కొంది. పశ్చిమాసియా నుంచి అమెరికా సైనికులను తరిమికొట్టడమే తమ ధ్యేయమని తేలి్చచెప్పారు. పరాయి దేశం సైనిక స్థావరాలు ఇక్కడ ఉండడానికి వీల్లేదని స్పష్టంచేసింది. ఈ ప్రాంతంలో అమెరికాకు ఆశ్రయం ఇచ్చే దేశాలు ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. జోర్డాన్‌తోపాటు ఉత్తర ఇరాక్‌లో తమ దాడుల్లో పలువురు అమెరికా జవాన్లు మరణించారని ఇరాన్ మిలటరీ కమాండ్ ప్రకటించింది. అయితే, దీన్ని అమెరికా సైన్యం ఖండించింది. తమకు ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని పేర్కొంది. ఇరాన్ డ్రోన్లను మధ్యలోనే కూల్చివేశామని బహ్రెయిన్‌లోని అమెరికా నావికాదళం వెల్లడించింది. హార్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై, ఆ ప్రాంతంలోని అమెరికా సైనికులపై దాడి చేయడానికి ఇరాన్ ప్రయతి్నంచిన నేపథ్యంలోనే తాము రంగంలోకి దిగాల్సి వచి్చందని అమెరికా సెంట్రల్ కమాండ్ స్పష్టంచేసింది. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక ఇరాన్ గనక ప్రతీకార చర్యకు దిగితే తమ ప్రతిస్పందన భీకర స్థాయిలో ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా హెచ్చరించారు. ‘‘ఇరాన్ మరింత తీవ్రంగా, భారీ స్థాయిలో మళ్లీ దాడి జరుగుతుంది. కానీ, అది అన్నింటికంటే పెద్ద దాడి మాత్రం కాదు. అసలైన అతిపెద్ద దాడి ఇంకా జరగాల్సి ఉంది’’అని పేర్కొన్నారు. పశ్చిమాసియా మళ్లీ అగి్నగుండంగా మారుతుండడంతో అమెరికా ప్రభుత్వం అప్రమత్తమైంది. పశ్చిమాసియా ప్రాంతం అంతటా వర్తించే ప్రయాణ హెచ్చరికను పునరుద్ధరించింది. అక్కడ పరిస్థితులు సంక్లిష్టంగా ఉన్నాయని, ఊహించని పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని తెలియజేసింది. పశ్చిమాసియాలో అమెరికన్లు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. -
అమెరికా ఘోర తప్పిదం
గత నెల రోజులుగా ప్రశాంతంగా వున్న పశ్చిమాసియాలో మళ్లీ చిచ్చురేగింది. తాజాగా అమెరికా మొదలెట్టిన క్షిపణి దాడులు, ఇరాన్ సాగిస్తున్న ప్రతిదాడులతో అది భగ్గున మండుతోంది. దక్షిణ ఇరాన్‌లోని సిరిక్ ప్రాంతంలో పెళ్లి వేడుకలు జరుగుతున్న ఇంటిపై అమెరికా క్షిపణి పడి అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. వేరేచోట జరిగిన దాడిలో నలుగురు ఇరాన్ రెవల్యూషనరీ గార్డులు చనిపోయారు. ఈ దాడులకు ప్రతీకారంగా గల్ఫ్, జోర్డాన్‌లలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేసింది. ఇజ్రాయెల్‌తో కలిసి అకారణంగా తానే ప్రారంభించిన ఈ యుద్ధంలో అమెరికా సర్వభ్రష్టమైంది. దీన్నుంచి బయటపడటానికి చేసిన యత్నాలన్నీ విఫలంకాగా... ప్రపంచ దేశాలతో ఇరాన్ ఆర్థిక లావాదేవీలన్నిటినీ ‘కనీవినీ ఎరుగని రీతిలో’ దెబ్బతీసే ఆర్థిక దిగ్బంధం ప్రారంభించామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించి వారం రోజులవుతుండగా తాజా దాడులు మొదలయ్యాయి. రోజులు మారాయని, తన ఆధిపత్య విధానాలకు కాలం చెల్లిందని అమెరికా గ్రహించుకోలేక ఈ నిరర్థక యుద్ధానికి తెరలేపింది. ఇది సోవియెట్‌తో పోటీపడుతూ ఆధిక్యత సాధించటానికి ప్రయత్నించిన ’60ల, ’70ల కాలం కాదు. సోవియెట్ పతనం తర్వాత కొన్నాళ్లపాటు సాగిన ఏకధ్రువ ప్రపంచం కూడా కాదు. కనీసం ట్రంప్ తొలి ఏలుబడినాటి పరిస్థితులు కూడా ఇప్పుడు లేవు. ఇరాన్ ఆర్థిక దిగ్బంధం గురించి గత నెల 25న ట్రంప్ ప్రకటన చేసిన వెనువెంటనే చైనా, ఖతార్‌లు ఈ చట్టవిరుద్ధ, ఏకపక్ష ఆంక్షల్ని గుర్తించదల్చుకోలేదని చెప్పడాన్ని బట్టే వర్తమాన పరిస్థితులేమిటో అర్థమవుతాయి. ఉక్రెయిన్ యుద్ధంలో పీకల్లోతు మునిగిన రష్యా కూడా ఈ ఆంక్షల్ని పాటించే స్థితిలో లేదు. అమెరికా ఆంక్షల వల్ల 2018లో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కొంతమేర దెబ్బతిన్న మాట వాస్తవమే. కానీ దాన్ని పూర్తిస్థాయిలో ధ్వంసం చేయటం, చమురు ఎగుమతుల్ని సంపూ ర్ణంగా నిలిపేయటం అమెరికాకు సాధ్యం కాలేదు. కనీసం అప్పుడున్న అంతర్జాతీయ, ప్రాంతీయ పరిస్థితులు ఏదోమేర ఆంక్షలు అమలుకు దోహదపడ్డాయి. అప్పట్లో సౌదీ, యూఏఈ, బహ్రైన్, ఈజిప్టులు ఖతార్‌తో సంబంధాలు తెంచుకున్నాయి. కువైట్, ఒమన్‌లు మాత్రం దానితోనే కలిసి నడిచాయి. కానీ 2021 తర్వాత ఈ పరిస్థితి మారింది. ఎడమొహం, పెడమొహంగా ఉండే సౌదీ, ఇరాన్‌లు సంబంధాలు పునరుద్ధరించు కున్నాయి. ప్రాంతీయంగా గల్ఫ్ దేశాలన్నిటిమధ్యా ఇప్పుడు అవగాహన కుదిరింది. నిరుడు సెప్టెంబర్ 9న దోహాపై ఇజ్రాయెల్ సాగించిన దాడి వీటి కళ్లు తెరిపించింది. ఇజ్రాయెల్, అమెరికాలు ఇరాన్‌పై మొదలెట్టిన యుద్ధాన్ని గల్ఫ్ దేశాలు వ్యతిరేకించక పోవచ్చుగానీ... పాలస్తీనా ఏర్పాటుకు అనువైన రాజకీయ పరిష్కారం దొరికే వరకూ ఇజ్రాయెల్‌తో సాధారణ సంబంధాలు అసాధ్యమని సౌదీ స్పష్టంగా తేల్చిచెప్పింది. ఈలోగా ఆంక్షల్ని అధిగమించటానికి అంతర్జాతీయంగా ఇరాన్ ఇప్పటికే ఏర్పర్చుకున్న నెట్వర్క్ అమెరికా ఆటల్ని సాగనివ్వటంలేదు. తాజా పరిణామాలన్నీ గల్ఫ్ దేశాల కళ్లు తెరిపించాయి. అమెరికాకు స్వప్రయోజనాలు తప్ప తమ భద్రత గురించి పట్టదని వాటికి అర్థమైంది. సైనిక స్థావరాలకు అమెరికాను అనుమతించినప్పుడు గల్ఫ్ దేశాల ఆలోచన వేరు. ఆ స్థావరాలుంటే ఎవరూ తమవైపు కన్నెత్తిచూడబోరని అవి అమాయకంగా విశ్వసించాయి. కానీ తనపై దాడి జరిగినప్పుడల్లా ఇరాన్ చేస్తున్న ప్రతీకార దాడులతో ఆ స్థావరాల సంగతటుంచి, తమ మౌలిక సదుపాయాలు ధ్వంసమవుతున్నాయని గల్ఫ్ దేశాలు లబోదిబోమంటున్నాయి. ఈమధ్య మూడు సౌదీ కంపెనీలు షేర్ల జారీకి ప్రయత్నించి, తాజా దాడులతో ఆ ప్రతిపాదనను పక్కనబెట్టాయి. యూఏఈ శాఖను ప్రారంభించదల్చుకున్న ప్రముఖ సంస్థ విన్ రిసార్ట్స్ ఆ ఆలోచనకు స్వస్తి చెప్పింది. వివిధ ప్రభుత్వ విభాగాలకు ఖతార్ నిధులు కత్తిరించింది. ఎఫ్ 1 రేసులు, పలు సదస్సులు, వేలాదిమంది హాజరయ్యే దోహా ఫోరం, క్రిప్టో సదస్సు వంటివన్నీ ఆర్నెల్లుగా మూలనబడ్డాయి. రియల్ ఎస్టేట్ స్తంభించింది. వేలాదిమంది అమెరికన్లు వీటన్నిటా పెట్టుబడులు పెట్టి దిక్కుతోచని స్థితిలో పడ్డారు. తమ ఆర్థికవ్యవస్థల గురించి లేశమాత్రమైనా ఆలోచించకుండా ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు గల్ఫ్ దేశాలను కలవరపరుస్తోంది. అందుకే ఇప్పటికైనా ట్రంప్ తన పోకడలకు స్వస్తిచెప్పాలి. -
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. యూఏఈ విమాన సర్వీసులపై భారీ ప్రభావం
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు యూఏఈ నుంచి నడిచే విమాన సర్వీసులపై భారీ ప్రభావం చూపుతున్నాయి. Emirates, Etihad Airways, flydubai, Air Arabia వంటి ప్రాంతీయ విమానయాన సంస్థలు కొన్ని కీలక సర్వీసులను కొనసాగిస్తున్నప్పటికీ, పలు మార్గాల్లో విమానాలు రద్దు, ఆలస్యం లేదా దారి మళ్లింపులకు గురవుతున్నాయి.సెప్టెంబర్ 1న అమెరికా బలగాలు ఇరాన్‌లోని సైనిక స్థావరాలపై దాడులు చేయగా, అనంతరం ఇరాన్ బహ్రెయిన్, కువైట్, జోర్డాన్‌లోని అమెరికా ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. దీంతో గల్ఫ్ ప్రాంతంలోని గగనతల పరిస్థితులు మరింత అనిశ్చితంగా మారాయి.నిలిచిపోయిన అంతర్జాతీయ సర్వీసులుAir Canada, British Airways, Cathay Pacific, Singapore Airlines, ITA Airways, Finnair, Philippine Airlines, AirBaltic, Korean Air, Pegasus, Virgin Atlantic, Lufthansa, Eurowings, SWISS తదితర అంతర్జాతీయ సంస్థలు దుబాయ్ లేదా అబుదాబికి సంబంధించిన కొన్ని సర్వీసులను వివిధ తేదీల వరకు నిలిపివేశాయి.ప్రస్తుత పరిస్థితుల్లో విమానం బుక్ అయినా, విమానాశ్రయానికి బయలుదేరే ముందు తప్పనిసరిగా విమాన స్థితిని తనిఖీ చేసుకోవాలని యూఏఈ విమానాయాన సంస్థలు ప్రయాణికులకు సూచిస్తున్నాయి.చదవండి: "ట్రంప్ స్ట్రయిట్"గా మార్చాలా..? అమెరికా అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు -
ట్రంప్ స్ట్రయిట్‌గా మార్చాలా..? అమెరికా అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. గతకొంతకాలంగా వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన స్ట్రయిట్ ఆఫ్ హార్ముజ్‌ను తన పేరుతో "ట్రంప్ స్ట్రయిట్"గా మార్చాలా..? అని ట్రూత్ వేదికగా పోస్ట్ చేశాడు. అమెరికా మాదిరిగానే ఇది కూడా గతంలో కంటే మరింత 'హాట్'గా ఉంటుందని వ్యాఖ్యానించాడు.ఇటీవల కెనడాతో వివాదం కొనసాగుతున్న సమయంలో లేక్ ఒంటారియో పేరును 'లేక్ అమెరికా'గా మార్చేందుకు ట్రంప్ ఆదేశాలు జారీ చేశాడు. అంతకుముందు గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును 'గల్ఫ్ ఆఫ్ అమెరికా'గా మార్చుతున్నట్లు కూడా ప్రకటించాడు. ఈ పేర్ల మార్పులను సంబంధిత దేశాలు వ్యతిరేకించాయి. ఒకవేళ హర్మూజ్‌ను ట్రంప్ తన పేరుతో మార్చాలని ప్రయత్నించినా, అదే జరిగే అవకాశం ఉంది.కాగా, ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో స్ట్రయిట్ ఆఫ్ హర్మూజ్‌పై అమెరికా నియంత్రణ ఉందని ట్రంప్ పదేపదే చెబుతున్నారు. అయితే ఈ నియంత్రణపై ఇరాన్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.హర్మూజ్ ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఇంధన రవాణా మార్గాల్లో ఒకటి. పెర్షియన్ గల్ఫ్‌ను గల్ఫ్ ఆఫ్ ఒమన్‌తో కలిపే ఈ జలమార్గం ద్వారా భారీగా చమురు, గ్యాస్ రవాణా జరుగుతుంది.అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధానికి ముందు ప్రపంచ చమురు వాణిజ్యంలో సుమారు ఐదో వంతు హర్మూజ్ జలసంధి ద్వారా రవాణా అయ్యేది. అయితే యుద్ధం ప్రారంభమైన తర్వాత ఈ మార్గంలో నౌకల రాకపోకలు భారీగా తగ్గాయి.చదవండి: ‘ట్రంపిజం’ ప్రపంచాన్ని ఎలా మారుస్తోంది? మనపై ప్రభావం ఇలా.. -
అమెరికా–ఇరాన్ యుద్ధం: గల్ఫ్‌లో హైటెన్షన్.. తాజా పరిణామాలు ఇవే
దాదాపు నెల రోజుల తర్వాత మళ్లీ పశ్చిమాసియా భగ్గుమంటోంది. కాల్పుల విరమణను తుంగలో తొక్కి.. శాంతి చర్చలను పక్కన పెట్టి.. అమెరికా-ఇరాన్‌ను పరస్పర దాడులు జరుపుతున్నాయి. తాజాగా అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ వరుస క్షిపణి, డ్రోన్ దాడులకు దిగింది. మరోవైపు అమెరికా బలగాలు హర్ముజ్ జలసంధిపై దాదాపు పూర్తి నియంత్రణ సాధించాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో తాజా పరిణామాలు ఇవిగో..US-Iran War Live Updatesఅరబ్ దేశాలకు ఇరాన్ వార్నింగ్అమెరికా బలగాలను పంపించేయండి.. లేదంటే దాడులే అంటూ అరబ్ దేశాలను ఇరాన్ హెచ్చరించింది. తమ భూభాగాల్లోని అమెరికా బలగాలను, సైనిక స్థావరాలను తొలగించాలని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ (IRGC) పొలిటికల్ వింగ్ డిప్యూటీ జనరల్ యదొల్లా జవానీ హెచ్చరించారు. అమెరికా దాడులకు తమ దేశాల నుంచి ఏదైనా వేదికగా మారితే ‘తీవ్రమైన’ ప్రతీకారం తప్పదన్నారు. కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లను ప్రత్యేకంగా ప్రస్తావించారు.బెత్లహెమ్‌లో పాలస్తీనా ఇంటి కూల్చివేతవెస్ట్ బెత్లహెమ్లోని నహాలిన్ పట్టణంలో పాలస్తీనాకు చెందిన ఓ ఇంటిని ఇజ్రాయెల్ బలగాలు కూల్చివేశాయి. సైనిక వాహనాలు, బుల్డోజర్లతో పట్టణంలోకి ప్రవేశించిన బలగాలు.. 15 ఏళ్లకు పైగా నివాసంగా ఉన్న ఆ భవనాన్ని నేలమట్టం చేసినట్లు తెలుస్తోంది.బహ్రెయిన్‌పై ఇరాన్ డ్రోన్ దాడులు?బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాన్ని ఇరాన్ భారీ డ్రోన్ దాడులతో లక్ష్యంగా చేసుకున్నట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఈ దాడిపై ఇప్పటివరకు అధికారిక ధ్రువీకరణ వెలువడలేదు. ఇదే సమయంలో బహ్రెయిన్ రక్షణ దళాలు తమ గగనతలంలోకి వచ్చిన పలు ఇరాన్ వైమానిక దాడులను అడ్డుకున్నట్లు ప్రకటించాయి.జోర్డాన్లోకి 13 బాలిస్టిక్ మిసైళ్లుఇరాన్ నుంచి వచ్చిన 13 బాలిస్టిక్ క్షిపణులను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు ఎదుర్కొన్నట్లు జోర్డాన్ ప్రకటించింది. అయితే ఈ క్షిపణుల వల్ల నష్టం జరిగిందా?.. ఎక్కడ పడ్డాయి? అనే వివరాలను అధికారులు వెల్లడించలేదు.మష్హద్లో విషాదంఇరాన్లోని ఈశాన్య నగరం మష్హద్లో ప్రభుత్వానికి, సాయుధ దళాలకు మద్దతుగా జరుగుతున్న కార్యక్రమంలోకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మరణించగా.. 10 మందికి పైగా గాయపడ్డారు. డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తులో ఇది రోడ్డు ప్రమాదమేనని, రాజకీయ ఉద్దేశం ఉన్నట్లు ఆధారాలు లేవని అధికారులు తెలిపారు.జోర్డాన్‌లో అమెరికా స్థావరంపై ఇరాన్ దాడిజోర్డాన్లోని ప్రిన్స్ హసన్ ఎయిర్‌బేస్‌పై భారీ బాలిస్టిక్ క్షిపణి దాడి చేసినట్లు ఇరాన్ IRGC ప్రకటించింది. అక్కడ RQ-4, MQ-9 డ్రోన్లను ఉంచిన హ్యాంగర్లను లక్ష్యంగా చేసుకున్నామని తెలిపింది. పలు డ్రోన్లు ధ్వంసమయ్యాయని, అమెరికా సిబ్బందిలో కొందరు మరణించారని, మౌలిక వసతుల్లో మంటలు చెలరేగాయని పేర్కొంది. అయితే దీనిపై అమెరికాగానీ, జోర్డాన్గానీ ఇంకా స్పందించలేదు. లవాన్ ద్వీపంపై అమెరికా దాడులుఇరాన్లోని లవాన్ ద్వీపంపై అమెరికా జరిపిన తాజా దాడుల్లో ముగ్గురు బసీజ్ పారామిలటరీ సభ్యులు మరణించినట్లు ఇరాన్ సెమీ అధికారిక మెహర్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.పెళ్లి వేడుకపై దాడి.. ఘోరంఇరాన్లోని సిరిక్ సమీపంలో జరిగిన పెళ్లి వేడుకపై అమెరికా దాడి జరిగిందని ఇరాన్ అధికారులు ఆరోపించారు. ఈ ఘటనలో నాలుగేళ్ల చిన్నారి సహా ఐదుగురు మరణించగా.. మరో 50 మంది గాయపడినట్లు తెలిపారు. ఇరాన్ విదేశాంగ శాఖ ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది.హర్ముజ్‌లో షిప్పింగ్ ట్రాఫిక్ డౌన్హర్ముజ్ జలసంధి మీదుగా మంగళవారం కేవలం నాలుగు వాణిజ్య నౌకలు మాత్రమే ప్రయాణించాయి. సాధారణంగా 10 రోజుల సగటు రోజుకు సుమారు 13 నౌకలుగా ఉండగా.. తాజా సంఖ్య దాని కంటే గణనీయంగా తక్కువగా ఉంది. కేప్లర్ ప్రాథమిక షిప్పింగ్ డేటా ప్రకారం నాలుగు నౌకల్లో ఒకటి భారీ క్రూడ్ ఆయిల్ క్యారియర్, మిగిలినవి వివిధ రకాల సరకు/చమురు రవాణా నౌకలు. అయితే సోమవారం హర్ముజ్ జలసంధి మీదుగా 17 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా జరిగినట్లు అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్ రైట్ తెలిపారు. యుద్ధం కారణంగా రాకపోకలు తగ్గిన తర్వాత ఒక్కరోజులో నమోదైన అత్యధిక చమురు రవాణా ఇదేనని పేర్కొన్నారు.బహ్రెయిన్‌లో వరుస అలర్ట్లుబహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆరు గంటల వ్యవధిలో మూడోసారి ‘పొంచి ఉన్న ముప్పు’పై అలర్ట్ జారీ చేసింది. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. అధికారిక మార్గాల్లో వచ్చే సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని కోరింది.ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది: ట్రంప్అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. హర్ముజ్ జలసంధిపై అమెరికా బలగాలు దాదాపు పూర్తి నియంత్రణ సాధించాయని అన్నారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలుతున్నదని పేర్కొన్నారు. ఇరాన్‌పై అమెరికా దాడులు, ఆ తర్వాత టెహ్రాన్ ప్రతీకార చర్యల నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఇరాన్ ప్రతీకార దాడులుఅమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ తన భూభాగం నుంచి క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించినట్లు IRGC ప్రకటించింది. అమెరికా దాడులను ‘నిరాశతో కూడిన దాడులు’గా అభివర్ణించింది. ప్రతీకార చర్యల్లో పెద్ద సంఖ్యలో అమెరికా బలగాలను హతమార్చినట్లు పేర్కొన్నప్పటికీ.. ఈ వాదనపై అమెరికా నుంచి తక్షణ ధ్రువీకరణ రాలేదు.ఇరాన్ ప్రతీకార దాడుల పరిధి కువైట్, బహ్రెయిన్, జోర్డాన్, ఇరాక్‌లోని ఎర్బిల్ వరకు విస్తరించినట్లు తెలుస్తోంది. మరోవైపు గల్ఫ్ దేశాలు తమ వైమానిక రక్షణ వ్యవస్థలను అప్రమత్తం చేశాయి. ముఖ్యంగా హర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు, చమురు రవాణాపై యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు కారణమవుతోంది.ఇదీ చదవండి: అమెరికా సైనికుల రాక.. సెక్స్‌వర్కర్ల వేట! -
మళ్లీ భగ్గుమన్న పశ్చిమాసియా
-
ఓటీటీలోకి వచ్చేస్తున్న ట్రంప్ ‘సీక్రెట్ జర్నీ’
తన ప్రాణాలకు ముప్పు లేదని తరచూ చెప్పే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భద్రత విషయంలో మాత్రం ఏమాత్రం రాజీపడరు. అలాంటిది ప్రాణభయంతో ప్రయాణిస్తున్న విమానాన్ని రహస్యంగా మార్చడం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. అసలు ఆ రోజు ఏం జరిగిందన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అయితే ఆ విషయాలు ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాటో సదస్సు కోసం జూలై 8న టర్కీలోని అంకారాకు వెళ్లారు. సదస్సు ముగించుకుని అమెరికాకు తిరుగు ప్రయాణంలో.. భద్రతా కారణాలతో ఎయిర్ ఫోర్స్ వన్ నుంచి రహస్యంగా మరో సైనిక విమానంలోకి మార్చారు. ఆ సందర్భంగా చోటుచేసుకున్న ఈ ఘటనను.. ‘ఇన్‌స్టాడాక్స్: ది డీకాయ్ ప్లేన్’ పేరుతో నెట్‌ఫ్లిక్స్ రూపొందించింది. ఈ ప్రత్యేక డాక్యుమెంటరీ సెప్టెంబర్ 4(ఎల్లుండి) నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఇందులో ఏం చూపించబోతున్నారు? ఇది ఎన్ని వివాదాలు.. అభ్యంతరాలకు దారి తీస్తుందో ? అనే ఆసక్తి నెలకొంది.డీకాయ్ ప్లేన్ అంటే.. ట్రంప్ ‘ఎయిర్ ఫోర్స్ వన్’లోనే ప్రయాణిస్తున్నారని బయటకు కనిపించేలా చేస్తూనే.. వాస్తవంగా ఆయనను మరో సైనిక విమానంలోకి తరలించడమే డీకాయ్ ప్లేన్. అసలు ట్రంప్ ఏ విమానంలో ఉన్నారో గుర్తించకుండా ఉండేందుకు ఈ ఏర్పాటు చేశారు. ఇరాన్ నుంచి ముప్పు ఉందని ఇజ్రాయెల్ హెచ్చరించిన నేపథ్యంలోనే అమెరికా భద్రతా అధికారులు ఈ ఏర్పాట్లు చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆ ముప్పును నిర్ధారించుకోకుండానే అమెరికా బలగాలు ఈ సీక్రెట్ జర్నీ ఆపరేషన్ నిర్వహించినట్లు తర్వాత తేలింది.క్యాటరింగ్ ట్రక్కులో..ఈ రహస్య ఆపరేషన్‌లో అత్యంత ఆసక్తికరమైన అంశం ట్రంప్ విమానం మారిన విధానం. ఒక విమానం నుంచి మరో సైనిక విమానానికి ఆయనను సాధారణంగా విమానాశ్రయాల్లో ఆహారం, పానీయాలు తరలించే క్యాటరింగ్ ట్రక్కులో తీసుకెళ్లినట్లు రిపోర్టులు వెల్లడించాయి. ఈ రహస్య బదిలీ గురించి ట్రంప్ వెంట ఉన్న మీడియా ప్రతినిధుల్లో చాలామందికి కూడా సమాచారం లేదని కథనాలు పేర్కొన్నాయి.కొందరు మాత్రమే వెంట..ట్రంప్‌తో పాటు ఈ రహస్య బదిలీలో కొద్దిమంది మాత్రమే పాల్గొన్నట్లు సమాచారం. వైట్‌హౌస్ సిబ్బంది, అప్పటి రక్షణ శాఖ కార్యదర్శి పీట్ హెగ్సెత్ తదితరులు ఆయనతో వెళ్లినట్లు కథనాలు తెలిపాయి. మరోవైపు అప్పటి విదేశాంగ మంత్రి మార్కో రూబియో, స్టీఫెన్ మిల్లర్, అప్పటి వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తదితరులు డీకాయ్‌గా ఉన్న విమానంలోనే కొనసాగారు.బ్రిటన్‌లో మళ్లీ విమానం మార్పు?టర్కీ నుంచి ట్రంప్ ప్రయాణించిన సైనిక విమానం బ్రిటన్‌లోని రాయల్ ఎయిర్‌ఫోర్స్ మిల్డెన్‌హాల్ స్థావరానికి చేరినట్లు రిపోర్టులు పేర్కొన్నాయి. అక్కడ ఆయన మరోసారి విమానం మార్చి.. ఖతార్ నుంచి అందిన బోయింగ్ 747లో అమెరికాకు బయలుదేరినట్లు సమాచారం.ట్రంప్ ఏమన్నారు?ఈ వ్యవహారం బయటకు రావడంతో ట్రంప్ విమానం ఎందుకు మార్చారన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సోషల్ మీడియాలో మీమ్స్, ఊహాగానాలు వెల్లువెత్తాయి. అనంతరం ట్రంప్ దీనిపై స్పందిస్తూ.. తనకు ఇలాంటి ముప్పు పొంచి ఉండడం సహజమేనని, భయపడే రకం తాను కాదని.. అయితే సీక్రెట్ సర్వీస్, మిలిటరీ అధికారులు సురక్షితమైన మార్గమని సూచించడంతో తాను వారి ఆదేశాలను పాటించినట్లు చెప్పారు. ట్రంప్ మాత్రమే కాదు గతంలో ఎంతో మంది అమెరికా అధ్యక్షులు, ఆ మాటకొస్తే పలువురు ప్రపంచ అధినేతల కోసం ఇలాంటి సీక్రెట్ జర్నీలు ఏర్పాటు చేశారు.ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ కథనం..ఇప్పటివరకు వార్తలు, ఊహాగానాలకే పరిమితమైన ఈ రహస్య ప్రయాణం వెనుక కథను Instadocs: The Decoy Plane పేరిట నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఘటనను తొలిసారి రిపోర్ట్ చేసిన జర్నలిస్టులతో పాటు వైట్‌హౌస్, విమానయాన రంగానికి చెందినవారు, మాజీ సీక్రెట్ సర్వీస్ సిబ్బందితో చేసిన ఇంటర్వ్యూలను ఇందులో చూపించనున్నారు. సెప్టెంబర్ 4న స్ట్రీమింగ్ ప్రారంభం కానుండటంతో.. ట్రంప్ ‘సీక్రెట్ జర్నీ’ మరోసారి ఆసక్తిని రేకెత్తిస్తోంది.ఇదీ చదవండి: అమెరికా సైనికులొస్తున్నారు.. అలర్ట్This July, while flying back from a NATO summit in Turkey, President Trump slipped off Air Force One in a catering truck and secretly boarded a different aircraft — leaving traveling reporters to fly on, unaware the president was no longer with them.Instadocs: The Decoy Plane,… pic.twitter.com/iuADnXxMoV— Netflix (@netflix) September 1, 2026 -
హార్ముజ్‌పై ట్రంప్ సంచలన కామెంట్స్.. ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరుకున్నాయి. హార్ముజ్ జలసంధిపై అమెరికాకు దాదాపు పూర్తి నియంత్రణ ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కూడా పూర్తిగా కుప్పకూలుతున్నదని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు రెండు దేశాల మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి.ఈ క్రమంలో ట్రూత్ సోషల్‌లో ట్రంప్ స్పందిస్తూ.. ఇరాన్‌ను మళ్లీ చర్చల టేబుల్ వద్దకు తీసుకురావడానికి తాను ప్రయత్నించడం లేదని స్పష్టం చేశారు. ఇరాన్‌తో ఒప్పందం కుదిరినా తనకు పెద్దగా పట్టింపు లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం హార్ముజ్ జలసంధిపై అమెరికాకు దాదాపు పూర్తి నియంత్రణ ఉండటం, ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉండటమే తనకు సరైన పరిస్థితి అన్నట్లుగా వ్యాఖ్యానించారు.మరోవైపు.. ఇరాన్‌పై అమెరికా తాజాగా భారీ వైమానిక దాడులు చేసింది. హార్ముజ్ సమీపంలోని ఇరాన్ సైనిక స్థావరాలు, రాడార్ వ్యవస్థలు, వైమానిక రక్షణ కేంద్రాలు, సముద్ర సంబంధిత లక్ష్యాలపై దాడులు జరిగినట్లు అమెరికా ప్రకటించింది. ఇరాన్ సముద్రంలో మైన్లు ఏర్పాటు చేసేందుకు చేసిన ప్రయత్నాలు, అమెరికా బలగాలు, వాణిజ్య నౌకలపై దాడులకు ప్రతిస్పందనగానే ఈ దాడులు చేపట్టినట్లు అమెరికా పేర్కొంది.ఇదీ చదవండి: పెద్దన్నా.. ఏంటీ కన్ఫ్యూజన్? ఆంక్షలా.. దాడులా? అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా క్షిపణులు, డ్రోన్లతో ప్రాంతంలోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. జోర్డాన్, బహ్రెయిన్, కువైట్ ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరాన్ మాత్రం అమెరికా దాడులకు తీవ్రమైన మూల్యం చెల్లించాల్సి వస్తుంది అంటూ హెచ్చరించింది.చమురు ధరలకు సెగహార్ముజ్ జలసంధిలో రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ప్రపంచ చమురు మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు ఐదో వంతు ఈ జలసంధి మీదుగా సాగుతుంది. తాజా దాడుల నేపథ్యంలో బుధవారం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 95.52 డాలర్లకు, WTI ధర 91.02 డాలర్లకు చేరింది. ఇదిలా ఉండగా.. అమెరికా నౌకాదళ దిగ్బంధం కారణంగా ఇరాన్ చమురు ఎగుమతులు భారీగా దెబ్బతిన్నాయి. మార్చిలో రోజుకు సుమారు 20 లక్షల బ్యారెళ్లుగా ఉన్న ఇరాన్ క్రూడ్ లోడింగ్స్ ఆగస్టులో కేవలం 2.2–2.55 లక్షల బ్యారెళ్లకు పడిపోయినట్లు రాయిటర్స్ తెలిపింది. దీంతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి మరింత పెరుగుతోంది.మొత్తంగా.. అమెరికా-ఇరాన్ మధ్య ఆరు నెలలుగా కొనసాగుతున్న ఘర్షణ మరో కీలక మలుపు తిరిగింది. హార్ముజ్‌పై నియంత్రణ, చమురు ఎగుమతులు, అమెరికా సైనిక చర్యలే ఇప్పుడు ఇరుదేశాల మధ్య ప్రధాన పోరాటంగా మారాయి. తాజా పరిణామాలతో యుద్ధం మరింత విస్తరించే ప్రమాదం ఉందన్న ఆందోళనలు పెరుగుతున్నాయి -
అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతీకార దాడులు
మిడిల్ ఈస్ట్‌లో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్‌లోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) స్థావరాలపై అమెరికా తాజా దాడుల తర్వాత ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది.ఇరాన్ మంగళవారం రాత్రి జోర్డాన్, బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరాలు లక్ష్యంగా బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. జోర్డాన్‌లో సైరన్లు మోగగా, ఆ దేశ గగనతలంలోకి ప్రవేశించిన 13 ఇరాన్ క్షిపణుల్లో పదింటిని వైమానిక రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. మిగిలిన మూడు క్షిపణులు జనావాసాలకు దూరంగా ఉన్న ప్రాంతాల్లో పడినట్లు జోర్డాన్ సాయుధ దళాలు వెల్లడించాయి.జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై జరిగిన దాడుల్లో అమెరికా సైనికులకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే ఇరాన్‌కు చెందిన IRGC మాత్రం జోర్డాన్‌లోని క్యాంప్ టిటిన్పై దాడి చేసి భారీ సంఖ్యలో అమెరికా సైనికులను హతమార్చినట్లు ప్రకటించింది.మరోవైపు బహ్రెయిన్‌లోని షేక్ ఇసా ఎయిర్ బేస్ వద్ద అమెరికా సైనికులు, రాడార్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని కామికేజ్ డ్రోన్లతో భారీ దాడి చేసినట్లు IRGC ప్రకటించింది. అయితే ఈ దాడిపై బహ్రెయిన్ లేదా అమెరికా నుంచి అధికారిక ధృవీకరణ రాలేదు.బహ్రెయిన్, కువైట్‌కు హెచ్చరికలుఅమెరికా దాడులు ప్రారంభమైన కొద్దిసేపటికే ఇరాన్ సైనిక ప్రతినిధి ఇబ్రహీం జోల్ఫఘారి తీవ్ర హెచ్చరికలు చేశారు. బహ్రెయిన్, కువైట్ విషయంలో ఇకపై ఇరాన్ సంయమనం పాటించబోదని తెలిపారు. “బహుమతులు దారిలో ఉన్నాయి” అంటూ హెచ్చరించారు.అమెరికా దాడులకు ఇదే కారణంఇరాన్పై తాజా దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించారు. హర్మూజ్ జలసంధిలో సముద్రపు మైన్లు అమర్చేందుకు ఇరాన్ ప్రయత్నించడం, అమెరికా సైనిక స్థావరంపై ఎనిమిది క్షిపణులు ప్రయోగించడం తమ దాడులకు కారణమని ట్రంప్ తెలిపారు.చదవండి: ఇరాన్‌పై మళ్లీ దాడులు మొదలుపెట్టిన అమెరికా -
ఇరాన్‌పై మళ్లీ దాడులు మొదలుపెట్టిన అమెరికా
ఇరాన్‌లోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)కు చెందిన లక్ష్యాలపై అమెరికా బలగాలు దాడులు ప్రారంభించాయి. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ దాడులు ప్రారంభమైనట్లు అమెరికా వెల్లడించింది.Today at 12 p.m. ET, U.S. forces began striking Islamic Revolutionary Guard Corps (IRGC) targets in Iran. The strikes follow recent attempted attacks by the IRGC against commercial shipping in the Strait of Hormuz and against American service members deployed to the region.— U.S. Central Command (@CENTCOM) September 1, 2026హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని IRGC ఇటీవల దాడులకు ప్రయత్నించిందని అమెరికా పేర్కొంది. అలాగే ఈ ప్రాంతంలో మోహరించిన అమెరికా సైనికులపై కూడా IRGC దాడులకు ప్రయత్నించినట్లు తెలిపింది.ఈ పరిణామాల నేపథ్యంలోనే IRGC లక్ష్యాలపై అమెరికా సైనిక చర్య చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ప్రపంచంలోని కీలకమైన చమురు రవాణా మార్గాల్లో ఒకటైన హర్మూజ్ జలసంధి చుట్టూ ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్తతలు తాజా దాడులతో మరింత పెరిగే అవకాశం ఉంది.కాగా, అమెరికా-ఇరాన్ మధ్య దాదాపు నెల రోజుల తర్వాత ఈ ఆదివారం మరోసారి దాడి-ప్రతిదాడులు జరిగాయి. తొలుత హర్ముజ్ జలసంధిలోని ఇరాన్ లారక్ దీవిపై అమెరికా దాడి చేయగా (ముగ్గురు చనిపోయారు).. ప్రతీకారంగా ఇరాన్ జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసింది. ఇరాన్ ప్రతిదాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్ననే తీవ్ర దాడులు తప్పవని గట్టి వార్నింగ్ ఇచ్చాడు.చదవండి: ఉత్తరకొరియా బిగ్ వార్నింగ్.. ఇలాగైతే ప్రపంచం.. -
పెద్దన్నా.. ఏంటీ కన్ఫ్యూజన్?? ఆంక్షలా.. దాడులా?
ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వ్యూహం ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో తీవ్ర గందరగోళానికి దారి తీసింది. ఒకవైపు ఇరాన్ ఆర్థిక వ్యవస్థను క్రమంగా ఉక్కిరిబిక్కిరి చేసేలా కఠిన ఆంక్షలు విధిస్తామని హెచ్చరిస్తున్న ట్రంప్.. మరోవైపు అవసరమైతే ఇరాన్‌పై భారీ సైనిక దాడులు తప్పవంటూ బెదిరిస్తున్నారు. ఆ వెంటనే అదో చిన్న యుద్ధమంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ విషయంలో పెద్దన్న వైఖరిలో స్పష్టత కనిపించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ బలగాల సంయుక్త దాడితో పశ్చిమాసియా యుద్ధం మొదలైంది. అంటే ఆర్నెలు పూర్తయ్యిందన్నమాట. అయితే ఇరాన్‌పై అమెరికా తాజాగా మరోసారి సైనిక చర్యకు దిగింది. దాదాపు నెల రోజుల తర్వాత జరిగిన దాడి ఇది. హర్ముజ్ జలసంధిలో సముద్ర గనులను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొంటూ అమెరికా సైన్యం.. ఇరాన్ రాకెట్ లాంచర్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిపింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ మరో అడుగు ముందుకేశారు. ఇరాన్ కీలక ఇంధన కేంద్రంగా ఉన్న ఖర్గ్ ద్వీపాన్ని ‘తునాతునకలు చేస్తాం’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఓ ఏఐ వీడియోతో హెచ్చరించారు.అయితే దీనికి కొద్ది రోజుల ముందే అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ మరో వ్యూహాన్ని ప్రకటించారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసేలా కొత్త ఆంక్షలను అమలు చేయనున్నామని.. దీనిని ఆయన ‘ఆర్థిక డీ-డే’గా అభివర్ణించారు. ఈ ఆర్థిక ఒత్తిడి ద్వారా ఇరాన్‌ను చర్చల బాట పట్టించవచ్చని.. తద్వారా మరోసారి సైనిక ఉద్రిక్తతకు వెళ్లాల్సిన అవసరం ఉండదని ఆయన సంకేతాలిచ్చారు. ఇరాన్ యుద్ధం విషయంలో ట్రంప్ పట్ల ప్రజాదరణ క్రమంగా తగ్గిపోతున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. ఈ అటు ప్రత్యర్థి డెమోక్రట్లే కాదు.. ఇటు సొంత పార్టీ రిపబ్లికన్లోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ‘ఏ వ్యూహమో ఏమో.. ఏమీ అర్థం కావడం లేదు’ఆరు వారాల్లో ముగుస్తుందని ట్రంప్ గతంలో చెప్పిన యుద్ధం.. ఆరు నెలలు దాటినా కొనసాగుతుండటం కూడా ప్రశ్నలకు తావిస్తోంది. ట్రంప్, ఆయన కేబినెట్ సభ్యులు పలుమార్లు ఈ యుద్ధం ముగిసిందని, అమెరికా విజయం సాధించిందని ప్రకటించినప్పటికీ.. ఇరాన్‌తో ఉద్రిక్తతలు మాత్రం పూర్తిగా చల్లారలేదు. ట్రంప్ వైఖరిలో తరచూ కనిపిస్తున్న ఈ మార్పులపై అమెరికా రాజకీయ వర్గాల్లో అసంతృప్తి పెరుగుతోంది. ట్రంప్ పాలనలోని విధానాలపై అవగాహన ఉన్న మాజీ భద్రతా అధికారి ఒకరు.. ఇరాన్‌పై యుద్ధం స్పష్టమైన ప్రణాళిక లేకుండానే ప్రారంభమైందని, ఇప్పటికీ పరిస్థితులకు అనుగుణంగానే నిర్ణయాలు మారుతున్నాయని వ్యాఖ్యానించారు. ట్రంప్‌తో ఎవ్వరూ సంతృప్తిగా లేరా?రిపబ్లికన్ పార్టీలో ఇరాన్ ఉద్రిక్తతలపై భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. యుద్ధం మరింత పొడిగితే చమురు ధరలు పెరిగి.. అమెరికన్లపై భారం పడుతుందని, వచ్చే మధ్యంతర ఎన్నికలపై ప్రభావం చూపొచ్చని కొందరు ఆందోళన చెందుతున్నారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సహా యుద్ధంపై అప్రమత్తంగా ఉన్న వర్గాలు సైతం సంఘర్షణ త్వరగా ముగియాలని కోరుకుంటున్నాయి. మరోవైపు ఇరాన్‌పై మరింత కఠినంగా వ్యవహరించాలని కోరుకునే హార్డ్లైన్ వర్గం కూడా ట్రంప్ తీరుపై పూర్తిగా సంతృప్తిగా లేదు.ట్రంప్ ప్రచార బృందంలో పని చేసిన ఓ మాజీ అధికారి మాట్లాడుతూ.. ఇరాన్‌ను అదుపులోకి తీసుకురావాలన్న ట్రంప్ లక్ష్యాన్ని సమర్థించే రిపబ్లికన్లు కూడా ప్రస్తుత పరిణామాలతో అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. మరో రిపబ్లికన్ వ్యూహకర్త ఈ పరిస్థితిని సరదాగా ‘ఫ్రెండ్లీ జోన్లో చిక్కుకున్నట్లుంది’ అంటూ అభివర్ణించారు. అంటే.. ట్రంప్ తీసుకుంటున్న ఏ నిర్ణయం కూడా పూర్తిగా ఏ వర్గాన్నీ సంతృప్తిపరచడం లేదన్నమాట.మధ్యంతర ఎన్నికల వేళ పెరుగుతున్న ఒత్తిడిఅమెరికాలో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇరాన్ యుద్ధం ట్రంప్ ప్రభుత్వానికి రాజకీయంగా కూడా సవాలుగా మారుతోంది. ఇప్పటికే అధిక ధరలతో అమెరికన్లు ఇబ్బంది పడుతున్న సమయంలో.. హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు చమురు సరఫరాపై ప్రభావం చూపితే పరిస్థితి మరింత కఠినంగా మారే అవకాశం ఉంది.ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హర్ముజ్ జలసంధి గుండా గతంలో ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు ఐదో వంతు రవాణా జరిగేది. ఈ మార్గంలో అంతరాయం ఏర్పడితే అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అమెరికాలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికే ఆందోళన కలిగిస్తున్నాయి.‘ఇది వ్యూహంలో భాగమే’అయితే ట్రంప్ ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్నవారు మాత్రం ఈ పరిణామాలను మరోలా చూస్తున్నారు. ఇరాన్‌పై సైనిక, ఆర్థిక ఒత్తిడిని ఒకేసారి కొనసాగించడం ఉద్దేశపూర్వక వ్యూహమేనని వారు చెబుతున్నారు. ఒకవైపు హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలు పూర్తిగా నిలిచిపోకుండా ఒత్తిడి కొనసాగిస్తూ.. మరోవైపు ఆంక్షల ప్రభావం ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై పడే వరకు వేచి చూడాలన్నది ట్రంప్ వ్యూహంగా వారు పేర్కొంటున్నారు.మాజీ అమెరికా రాయబారి జేమ్స్ జెఫ్రీ కూడా తాజా పరిణామాలను ఇరువైపులా జరుగుతున్న ప్రతిచర్యలుగానే అభివర్ణించారు. ఇరాన్, అమెరికా రెండూ పూర్తిస్థాయి దాడులకు తిరిగి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నట్లు కనిపించడం లేదని పేర్కొన్నారు.యుద్ధం త్వరగా ముగిస్తే మంచిదిఇదిలా ఉండగా.. ట్రంప్ యంత్రాంగంలోనే యుద్ధాన్ని ముగించాలన్న అభిప్రాయం బలపడుతున్నట్లు చర్చ జరుగుతోంది. చమురు పరిశ్రమకు చెందిన ఓ ఉన్నతాధికారి ప్రకారం.. ఘర్షణలను ముగించాలన్న ఒత్తిడి భారీగా ఉంది. ఇరాన్ పూర్తిగా బలహీనపడే వరకు ఒత్తిడి కొనసాగించాలని భావించే అధికారులు కూడా ఉన్నారు. ఇరాన్‌ను తీవ్ర ఆర్థిక, సైనిక ఒత్తిడిలోకి నెట్టినప్పుడే అది అమెరికాతో తమకు అనుకూలమైన ఒప్పందానికి వస్తుందని వాళ్లు అభిప్రాయపడుతున్నారు.ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదుఅమెరికా విధిస్తున్న ఆంక్షలు తమను చర్చల బాట పట్టిస్తాయన్న వాదనను ఇరాన్ తీవ్రంగా ఖండిస్తోంది. అమెరికా వాదనలు అబద్ధాలంటూ ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘెర్ ఘలీబాఫ్ విమర్శించారు. అమెరికా ఆంక్షల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు చైనా కూడా ఇరాన్‌కు మద్దతుగా నిలుస్తోంది. ఇరాన్ నుంచి పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేసే చైనా.. అంతర్జాతీయ చట్టాలకు ఆధారం లేని ఏకపక్ష అమెరికా ఆంక్షలను వ్యతిరేకిస్తామని స్పష్టం చేసింది.మొత్తంగా.. ఇరాన్‌పై ట్రంప్ ఒత్తిడి మాత్రం తగ్గడం లేదు. ఆర్థిక ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి చేయాలా? సైనిక దాడులతో లొంగదీసుకోవాలా? లేక ఒత్తిడితోనే చర్చల బాట పట్టించాలా? అన్నది మాత్రం స్పష్టంగా కనిపించడం లేదు. ఒకవైపు యుద్ధం ముగిసిందంటూనే.. మరోవైపు దాడుల హెచ్చరికలు చేయడం, ఆ తర్వాత మళ్లీ చర్చలకు సంకేతాలివ్వడం అమెరికా వ్యూహంపై సందేహాలకు తావిస్తోంది. ఇరాన్‌ను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ట్రంప్ నిర్ణయం ఏదైనా కావొచ్చు.. కానీ యుద్ధాన్ని ఎప్పుడు, ఎలా ముగించాలన్నదే ఇప్పుడు ఆయన ముందున్న అసలు సవాలు!. ఇదీ చదవండి: ఈసారి కాస్త గట్టిగానే కొడతాం -
‘ఈసారి గట్టిగానే కొడతాం’.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరాయి. అమెరికా దాడులకు ప్రతిగా జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేసింది. అయితే దీనికి దీటుగా స్పందిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరించారు. ‘‘మేం వారిని గట్టిగా కొడతాం. ప్రతిస్పందన తప్పకుండా ఉంటుంది’’ అని ఆయన అన్నారు. ఫాక్స్ న్యూస్‌తో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ దాడులకు కచ్చితంగా ప్రతీకారం ఉంటుంది. ఈసారి గట్టిగానే కొడతాం. అది వాళ్లు కోలుకోలేని స్థాయిలోనే ఉంటుందని అని అన్నారు. అయితే ఆ ప్రతీకార చర్యలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై స్పష్టత ఇవ్వకపోయినా.. అమెరికా సైనిక, ఆర్థిక మార్గాల్లో చర్యలకు సిద్ధమవుతున్న సంకేతాలు ఇచ్చారు. అలాగే ఇరాన్‌ను ఓ విఫల దేశంగా అభివర్ణిస్తూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పటికే ఇరాన్ నౌకాదళం, వైమానిక దళం, కరెన్సీ వంటి కీలక వ్యవస్థలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఇరాన్ నాయకత్వం తీవ్ర గందరగోళంలో ఉందని, దేశాన్ని సరిగ్గా నడిపించే స్థితిలో లేదని అన్నారు. అదే సమయంలో హర్ముజ్ జలసంధి సురక్షితంగానే ఉందని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా బలగాలపై ఇరాన్ దాడులు చేసినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో జోర్డాన్ సైన్యం అప్రమత్తమైంది. తమ గగనతలంలోకి వచ్చిన ఎనిమిది క్షిపణులను అడ్డుకున్నట్లు జోర్డాన్ ప్రకటించింది. దాదాపు నెల రోజుల తర్వాత.. లారక్ ద్వీపంపై అమెరికా బలగాలు దాడులు చేశాయి. ఆ దాడుల్లో సాధారణ పౌరులు సైతం మరణించారని ఆరోపిస్తూ ఇరాన్ ఈ దాడులకు పాల్పడింది.మరోవైపు ఇరాన్ సాయుధ దళాలు, అమెరికా మధ్య ఉద్రిక్తతలు గల్ఫ్ ప్రాంతానికీ విస్తరించాయి. తూర్పు హర్ముజ్ జలసంధిపై అమెరికాకు చెందిన MQ-9 డ్రోన్‌ను తమ వాయు రక్షణ వ్యవస్థ అడ్డుకున్నట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది.‘ఖర్గ్’పై ట్రంప్ పోస్టు.. ఇరాన్‌కు సందేశమేఇరాన్లోని ఖర్గ్ ద్వీపంపై ట్రంప్ ఆదివారం చేసిన సోషల్ మీడియా పోస్టు కూడా తీవ్ర చర్చకు దారితీసింది. ద్వీపాన్ని పేల్చేస్తూ అమెరికా సైనిక దాడులకు సంబంధించినట్లు కనిపించే ఏఐ రూపొందించిన వీడియోను ఆ పోస్టుతో జత చేశారు. అయితే ఖర్గ్ ద్వీపంపై అమెరికా సైన్యం రాత్రి దాడులు చేయలేదని ఓ అమెరికా అధికారి స్పష్టం చేశారు. ట్రంప్ పోస్టు వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించగా.. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వ్యూహాత్మకంగా సందేశాలు ఇస్తారని, ఇరాన్‌కు ఆయన ఓ సందేశం పంపుతున్నారని చెప్పారు.ఐరాసను ఆశ్రయించిన ఇరాన్అమెరికా దాడులపై ఇరాన్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని ఆశ్రయించింది. లారక్ ద్వీపంపై అమెరికా దాడిలో సైనికులు, పౌరులు మరణించారని, పలువురు గాయపడ్డారని ఇరాన్ ఆరోపించింది. ఈ దాడి తమ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించడమేనని పేర్కొంది. జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై తాము చేసిన దాడులు ‘‘ఆత్మరక్షణ చర్యల్లో భాగమే’’ అని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా మరిన్ని దాడులకు పాల్పడితే తాము వెనక్కి తగ్గబోమని హెచ్చరించింది. అమెరికా దాడులను నిలిపివేయాలని భద్రతా మండలిని కోరింది.ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై దెబ్బఇరాన్పై అమెరికా తాజాగా ప్రకటించిన ఆంక్షల ప్రభావం తీవ్రంగా ఉండొచ్చని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ అన్నారు. తాజా ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ‘‘వారాలు లేదా నెలల్లో కుప్పకూలే అవకాశం ఉందని’’ వ్యాఖ్యానించారు. అయితే అమెరికా అసలు లక్ష్యం ఇరాన్ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేయడం కాదని.. చర్చలకు ఇరాన్‌ను రప్పించే ప్రయత్నమేనని బెసెంట్ స్పష్టం చేశారు. యూఏఈకి ఇరాన్ డ్రోన్.. తీవ్ర ఆగ్రహంఇరాన్ తమపై డ్రోన్ దాడికి ప్రయత్నించిందని యూఏఈ ఆరోపించింది. గగనతల రక్షణ వ్యవస్థలు ఆ డ్రోన్‌ను అడ్డుకున్నాయని తెలిపింది. ఈ ఘటనను ‘‘ప్రమాదకరమైన ఉద్రిక్తత’’గా అభివర్ణిస్తూ ఇరాన్ చర్యను తీవ్రంగా ఖండించింది.హర్ముజ్‌లో ట్యాంకర్‌పై దాడి జరిగిందా?హర్ముజ్ జలసంధిలో ఓ సూపర్ ట్యాంకర్ రెండు సముద్ర గనులను ఢీకొని నిలిచిపోయిందన్న ఇరాన్ ప్రభుత్వ మీడియా, రెవల్యూషనరీ గార్డ్స్ వాదనలను అమెరికా సెంట్రల్ కమాండ్ ఖండించింది. ఆ వార్త పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. హర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన మార్గం కావడంతో.. అక్కడ ఎలాంటి చిన్న ఘటన జరిగినా అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది.ఇరాన్‌కు అండగా ఈయూ ఒత్తిడిఇరాన్ తన అస్థిరత సృష్టించే చర్యలను నిలిపివేసి శాంతి చర్చలకు రావాల్సిందేనని యూరోపియన్ యూనియన్ పేర్కొంది. అమెరికాతో పాటు ఇతర మిత్రదేశాలతో కలిసి ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని కొనసాగిస్తామని తెలిపింది. మరోవైపు ఇరాన్ పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్.. ఈ ప్రాంతంలో అమెరికాను చుట్టుముట్టేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. చమురు ఎగుమతి చేసే దేశాలపై ఒత్తిడి పెంచడం ద్వారా అమెరికాపై ఆర్థిక ప్రభావం చూపాలని సూచించారు.ఇదీ చదవండి: H4 వీసాదారులకు ట్రంప్ ఝలక్ -
ఇరాన్‌పై మరింత తీవ్ర దాడులు తప్పవు.. ట్రంప్ వార్నింగ్
అమెరికా, ఇరాన్ మధ్య దాదాపు నెల రోజుల తర్వాత (ఆదివారం) మరోసారి దాడి-ప్రతిదాడులు జరిగాయి. తొలుత హర్ముజ్ జలసంధిలోని ఇరాన్ లారక్ దీవిపై అమెరికా దాడి చేయగా (ముగ్గురు చనిపోయారు).. ప్రతీకారంగా ఇరాన్ జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసింది. దీంతో ఇరుదేశాల మధ్య ఘర్షణలు మరోసారి తారాస్థాయికి చేరినట్లైంది.ఇరాన్ ప్రతిదాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించాడు. ఇరాన్‌పై మరింత తీవ్ర దాడులు తప్పవని గట్టి వార్నింగ్ ఇచ్చాడు.ఇరాన్ ప్రతిదాడుల తర్వాత ట్రంప్ తన ట్రూత్ ఖాతాలో ఇరాన్‌లోని కీలక చమురు కేంద్రం 'ఖార్గ్ ద్వీపం' పేలిపోతున్నట్లు ఓ ఏఐ వీడియోను పోస్ట్ చేశాడు. అయితే దీనిపై అమెరికాకు చెందిన ఓ కీలక అధికారి భిన్నంగా స్పందించాడు. అమెరికా ఖార్గ్ ద్వీపాన్ని లక్ష్యంగా చేసుకోలేదని ఆయన తెలిపాడు.ఖార్గ్ ద్వీపం యుద్ధానికి ముందు ఇరాన్ చమురు ఎగుమతుల్లో సుమారు 90 శాతం నిర్వహించేది. ఒకవేళ అక్కడ దాడి జరిగితే ప్రపంచ ఇంధన మార్కెట్లపై భారీ ప్రభావం పడే అవకాశం ఉంది.ఇరాన్ అధ్యక్షుడి శాంతి స్వరంజోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడుల తర్వాత ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ శాంతి స్వరం వినిపించాడు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో కిర్గిజిస్థాన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇరాన్ ఇంకా చర్చల ద్వారా ఒప్పందానికి రావాలని కోరుకుంటోందని అన్నాడు. యుద్ధం కొనసాగడం ఎవరికీ ప్రయోజనం కలిగించదని పేర్కొన్నాడు.చదవండి: అమెరికా మెరుపు దాడులు.. ఇరాన్ ఎదురుదెబ్బ! -
ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
బిష్కెక్: ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. కిర్గిస్థాన్‌లో జరుగుతున్న షాంఘై కో-ఆపరేషన్ సదస్సు సందర్భంగా వారిద్దరు భేటీ అయ్యారు. రెండేళ్ల తర్వాత ఇద్దరు నేతలు సమావేశం కావడం ఇదే తొలిసారి. మోదీ-పెజెష్కియాన్ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు.సోమవారం సాయంత్రం రష్యా అధ్యకక్షుడు పుతిన్‌తో కూడా మోదీ సమావేశం కానున్నారు. కిర్గిజిస్థాన్ అధ్యక్షుడు సదిర్ జపరోవ్ ఆహ్వానం మేరకు 6వ ప్రపంచ నోమాడ్ క్రీడల అధికారిక ప్రారంభ వేడుకలో పుతిన్ పాల్గొంటారు.అర్మేనియా ప్రధాని నికోల్ పాషిన్యాన్‌తో కూడా మోదీ సమావేశమయ్యారు. ''బిష్కెక్లో జరుగుతున్న ఎస్సీఓ సదస్సు సందర్భంగా అర్మేనియా ప్రధాని నికోల్ పాషిన్యాన్‌తో సమావేశం జరిగింది. రక్షణ, ఐటీ, అంతరిక్షం, విద్య, ఔషధాలు తదితర రంగాల్లో భారత్–అర్మేనియా సహకారం మరింత పెరగనుంది. రానున్న రోజుల్లో వాణిజ్యం, పెట్టుబడుల సంబంధాలను మరింత బలోపేతం చేస్తామని కూడా మేము విశ్వసిస్తున్నాం'' అని మోదీ తెలిపారు.కాగా, కిర్గిజిస్థాన్ రక్షణ అధికారులు, కిర్గిజ్ రిపబ్లిక్ మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు సోమవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన విషయాన్ని మీడియాకు తెలిపారు. భారత్–కిర్గిజిస్థాన్ మధ్య పెరుగుతున్న రక్షణ సంబంధాలను అధికారులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. కిర్గిజిస్థాన్ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన కెప్టెన్ తాలైబెక్ మాట్లాడుతూ.. “ప్రధాని మోదీని కలవడం మాకు జీవితంలో ఒక్కసారే వచ్చే అవకాశం. ఆయన ఇక్కడ కిర్గిజిస్థాన్‌కు రావడం గొప్ప విషయం” అని అన్నారు. -
ఇరాన్ ఆర్థిక మూలాలపై ట్రంప్ వేట.. బ్యాంక్ మిస్ర్ కు బిగ్ షాక్!
-
అమెరికా మెరుపు దాడులు.. ఇరాన్ ఎదురుదెబ్బ!
పశ్చిమాసియాలో అమెరికా–ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిలోని ఇరాన్ లారక్ దీవిపై అమెరికా దాడి చేయగా.. ప్రతీకారంగా ఇరాన్ అమెరికా బలగాలపై క్షిపణి దాడులకు దిగింది. లారక్ దీవిలో ఇరాన్ రాకెట్ లాంచర్లను అమెరికా బలగాలు ధ్వంసం చేసిన కొన్ని గంటల్లోనే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్, జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. దీంతో ఇరుదేశాల మధ్య ఘర్షణ మరోసారి తీవ్రరూపం దాల్చింది.హర్ముజ్ జలసంధిలోని లారక్ దీవిపై అమెరికా బలగాలు రెండు ఇరానియన్ లాంచర్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ సిబ్బంది సముద్రంలో నౌకా విధ్వంసక మైన్లను ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్లు గుర్తించిన నేపథ్యంలోనే ఈ దాడి చేసినట్లు అమెరికా వెల్లడించింది. లారక్‌పై జరిగిన దాడి.. జూలై చివరి తర్వాత ఇరాన్ భూభాగంపై అమెరికా చేసిన తొలి దాడిగా తెలుస్తోంది.అమెరికా అధికారుల ప్రకారం.. లారక్‌లోని లాంచర్లు హర్ముజ్ జలసంధిలో సముద్ర మైన్లను ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ జలమార్గంలో మైన్లను అమర్చడం ద్వారా అంతర్జాతీయ నౌకాయానానికి తీవ్ర ముప్పు ఏర్పడే అవకాశం ఉండటంతో ముందస్తు చర్యగా దాడి చేసినట్లు వాషింగ్టన్ చెబుతోంది.‘ప్రతీకారం తప్పదు’.. ఇరాన్ హెచ్చరికఅమెరికా దాడిని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. లారక్ దాడిలో తమ సైనిక సిబ్బందితో పాటు పౌరులు కూడా మరణించినట్లు, గాయపడినట్లు ఇరాన్ వెల్లడించింది. ఈ దాడికి తప్పకుండా ప్రతిస్పందిస్తామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్(IRGC) హెచ్చరించింది. అమెరికా దాడికి ‘ప్రతిస్పందన, శిక్ష’ ఉంటుందని ఇరాన్ స్పష్టం చేసింది.ఆ హెచ్చరికకు అనుగుణంగానే ఇరాన్ ప్రతీకార దాడికి దిగింది. జోర్డాన్‌లో అమెరికా బలగాలు ఉన్న కింగ్ హుస్సేన్, అల్ అజ్రాక్ స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసినట్లు IRGC ప్రకటించింది. ఇరాన్ దాడిలో రెండు స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది.8 క్షిపణులను అడ్డుకున్న జోర్డాన్ఇరాన్ దాడులను జోర్డాన్ గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకున్నట్లు ఆ దేశం ప్రకటించింది. మొత్తం ఎనిమిది క్షిపణులను తమ గగనతలంలోనే కూల్చివేసినట్లు తెలిపింది. దీంతో ఇరాన్–అమెరికా ఘర్షణ ప్రభావం ప్రాంతంలోని ఇతర దేశాలపై కూడా పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.హర్ముజ్ జలసంధే అసలు కేంద్రంఈ మొత్తం పరిణామాలకు హర్ముజ్ జలసంధే కీలక కేంద్రంగా మారింది. ఇరాన్‌కు చెందిన లారక్ దీవి హార్ముజ్ దీవికి దక్షిణంగా, ఖేష్మ్ దీవికి తూర్పున ఉంది. సుమారు 49 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మాత్రమే ఉన్నప్పటికీ.. అత్యంత కీలకమైన సముద్ర మార్గానికి సమీపంలో ఉండటంతో దీనికి వ్యూహాత్మక ప్రాధాన్యం ఉంది. లారక్‌లో IRGC నేవీ స్థావరం కూడా ఉంది.ప్రపంచ ఇంధన సరఫరాకు హర్ముజ్ జలసంధి అత్యంత కీలకం. ప్రపంచ చమురు, ద్రవీకృత సహజవాయువు (LNG) రవాణాలో దాదాపు ఐదో వంతు ఈ మార్గం గుండా సాగుతుంది. దీంతో ఈ జలమార్గంలో మైన్లు వేయాలన్న ఇరాన్ చర్యలను అమెరికా తీవ్రంగా పరిగణిస్తోంది.ఒమన్ వైపు మారిన నౌకలుహర్ముజ్ జలసంధిలో ఇరాన్ దాడుల నేపథ్యంలో కొన్ని నౌకలు ఒమన్ తీరానికి సమీపంలోని దక్షిణ మార్గం గుండా ప్రయాణిస్తున్నాయి. అయితే ఆ మార్గంలోనూ ఇరాన్ మైన్లు అమర్చే సామర్థ్యం కలిగి ఉంటే.. అంతర్జాతీయ నౌకాయానానికి మరింత ఇబ్బంది ఏర్పడే ప్రమాదం ఉందని అమెరికా రక్షణ రంగ మాజీ అధికారి డేవిడ్ డెస్ రోచెస్ విశ్లేషించారు.ట్రంప్ ‘జీరో టాలరెన్స్’ హెచ్చరికహర్ముజ్లో మైన్లను ఏర్పాటు చేసే ప్రయత్నాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలోనే తీవ్రంగా హెచ్చరించారు. మైన్లను అమర్చే ఏ నౌక లేదంటే పడవనైనా ఒక క్రమపద్ధతిలో ధ్వంసం చేస్తామని హెచ్చరించినట్లు సమాచారం. మైన్ల ఏర్పాటు విషయంలో ‘జీరో టాలరెన్స్’ విధానం అమల్లో ఉందని ట్రంప్ స్పష్టం చేశారు.పెరిగిన చమురు ధరలు.. ముదిరిన ఆందోళనఅమెరికా లారక్ దాడి వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లలో ఆందోళన పెరిగింది. చమురు ధరలు రెండు శాతానికి పైగా పెరిగాయి. హార్ముజ్ జలసంధిలో నౌకాయానం మరింత దెబ్బతింటే ప్రపంచ ఇంధన సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో మార్కెట్లు అప్రమత్తమయ్యాయి.అమెరికా–ఇరాన్ మధ్య తాజా దాడులు ఇరు దేశాల మధ్య ఇప్పటికే కొనసాగుతున్న ఘర్షణను మరింత ప్రమాదకర దశలోకి తీసుకెళ్లే అవకాశముంది. ఒకవైపు హర్ముజ్ జలసంధిలో నౌకాయానాన్ని సురక్షితంగా కొనసాగించేందుకు అమెరికా ప్రయత్నిస్తుండగా.. మరోవైపు ఆ మార్గంపై తన ప్రభావాన్ని కొనసాగించేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోంది. లారక్‌పై అమెరికా దాడి, దానికి ప్రతీకారంగా జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేయడం.. ఈ పోరాటం మళ్లీ నేరుగా ఇరుదేశాల మధ్య సైనిక ఘర్షణగా మారుతున్న సంకేతాలను ఇస్తోంది. ఇదీ చదవండి: 270 మందితో వెళ్తున్న బోటు బోల్తా -
ట్రంప్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్ ఉక్కిరిబిక్కిరి..!
బాంబులు, క్షిపణులతోనే కాదు.. ఇప్పుడు డాలర్‌తో ఇరాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేయాలని అమెరికా వ్యూహం రచిస్తోంది. ఇరాన్‌కు ఆర్థికంగా అండగా నిలుస్తున్నాయన్న ఆరోపణలతో ఈజిప్ట్‌కు చెందిన బాంక్ మిసర్ యూఏఈ శాఖలపై అమెరికా ట్రెజరీ కొరడా ఝళిపించింది. యూఎస్ ఆర్థిక వ్యవస్థతో ఆ బ్యాంక్ శాఖలకు ఉన్న డాలర్ లావాదేవీల మార్గాన్ని కట్ చేసే ప్రతిపాదన చేసింది. డొనాల్డ్ ట్రంప్ సర్కార్ చర్యతో ఇరాన్‌కు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఉన్న మార్గాలను ఒక్కొక్కటిగా మూసివేసే ప్రయత్నం మరింత ముదిరింది. 2024 జనవరి నుంచి 2026 జూన్ వరకు బాంక్ మిసర్ యూఏఈ సుమారు 1.8 బిలియన్ డాలర్ల లావాదేవీలను ఇరాన్ షాడో బ్యాంకింగ్ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న 103 సంస్థల కోసం ప్రాసెస్ చేసిందని అమెరికా ఆరోపిస్తోంది.అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ఇప్పటికే ప్రపంచ దేశాలకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌కు సహకరించే సంస్థలు అమెరికా డాలర్, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను ఉపయోగించుకునే అవకాశం కోల్పోతాయని ఆయన తేల్చి చెప్పారు. ఈ చర్య ‘ఆపరేషన్ ఎకనామిక్ అవుట్‌కాస్ట్’లో భాగంగా చేపట్టినట్లు అమెరికా తెలిపింది. అయితే బాంక్ మిసర్‌పై చర్య ఇప్పటికిప్పుడు పూర్తిస్థాయిలో అమల్లోకి రాదు. ప్రతిపాదిత నిబంధనపై 30 రోజుల పాటు ప్రజల అభిప్రాయాలను స్వీకరించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు.ఈజిప్ట్‌కు షాక్..అమెరికా నిర్ణయంపై ఈజిప్ట్ స్పందించింది. ఈ చర్య యూఏఈలోని బాంక్ మిసర్ శాఖలు, వాటి డాలర్ లావాదేవీలకు మాత్రమే పరిమితం అవుతుందని స్పష్టం చేసింది. ఈజిప్ట్‌లోని బ్యాంక్ కార్యకలాపాలకు ఇది వర్తించదని తెలిపింది. మరోవైపు, యూఏఈ సెంట్రల్ బ్యాంక్ బాంక్ మిసర్ శాఖల లావాదేవీలపై ప్రత్యేక, అత్యవసర పరిశీలన ప్రారంభించింది.కాగా, ఇరాన్‌పై అమెరికా ఒత్తిడి ఇప్పుడు సరికొత్త దశకు చేరుకుంది. ఇరాన్‌కు డబ్బు చేరే మార్గాలను కట్ చేయడం.. డాలర్ వ్యవస్థ నుంచి దూరం చేయడం.. దాని ఆర్థిక భాగస్వాములపై కూడా ఒత్తిడి పెంచడం ద్వారా టెహ్రాన్‌ను ఆర్థికంగా ఏకాకిని చేయాలని వాషింగ్టన్ ప్రయత్నిస్తోంది. బాంక్ మిసర్ యూఏఈ శాఖలపై తాజా చర్య అందులో భాగమే. మొత్తంగా.. ఇరాన్‌పై అమెరికా యుద్ధం ఇప్పుడు మరో ఫ్రంట్‌కు చేరింది. ఆయుధాలతో యుద్ధం చేస్తూనే.. మరోవైపు డాలర్‌ను ఆయుధంగా మార్చుకుని ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై అమెరికా గట్టి దెబ్బ కొట్టేందుకు సిద్ధమవుతోంది.చదవండి: చమురు మంట.. సామాన్యుడికి మరింత భారం.. -
ట్రంప్ ఉక్కిరి బిక్కిరి.. చుట్టుముట్టిన అంతర్జాతీయ సంక్షోభాలు!
తనను తాను ‘శాంతి అధ్యక్షుడు’ (Peace President)గా అభివర్ణించుకునే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రస్తుతం అంతర్జాతీయ వేదికపై ఏకకాలంలో పలు సంక్షోభాలను ఎదుర్కొంటున్నారు. ఇరాన్‌తో యుద్ధం తీవ్ర ప్రతిష్టంభనకు దారితీయగా, మరోవైపు అమెరికా దీర్ఘకాల మిత్రదేశమైన కెనడాతో భారీ వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. ఇరాన్ తీరంలో నిలిచిపోయిన ముడి చమురు రవాణా, కెనడాపై భారీగా విధించిన దిగుమతి సుంకాలు, వివాదాస్పద ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు అగ్రరాజ్యాన్ని తీవ్ర ఆర్థిక, రాజకీయ ఒత్తిడిలోకి నెడుతున్నాయి.కెనడాతో రాజుకున్న వాణిజ్య సమరంఅమెరికా తన అతిపెద్ద వాణిజ్య భాగస్వాముల్లో ఒకటైన కెనడా ఉత్పత్తులపై 50 శాతం సుంకాలను విధించడంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఆగస్టు 21 గడువు నాటికి జరిగిన చర్చల్లో అమెరికా ఆమోదయోగ్యం కాని నిబంధనలను చేర్చడంతో చర్చలు పూర్తిగా విఫలమయ్యాయి. దీనికి ప్రతిగా సెప్టెంబర్ 8 నుంచి తాము కూడా సమాన స్థాయిలో ప్రతీకార సుంకాలు విధిస్తామని కెనడా స్పష్టం చేసింది. దాంతో ఇరు దేశాల మధ్య సంపూర్ణ వాణిజ్య యుద్ధం మొదలయ్యింది.‘లేక్ అమెరికా’ పేరు మార్పు వివాదంకెనడా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని ఆరోపించిన ట్రంప్ ఈ వివాదాన్ని మరింత పెంచుతూ సరిహద్దు సరస్సు ‘లేక్ అంటారియో’ పేరును ‘లేక్ అమెరికా’గా మారుస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ఈ సరస్సులో దాదాపు 75 శాతం కెనడాలోని అంటారియో ప్రావిన్స్ పరిధిలో ఉండటంతో అక్కడి ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అటు అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్ర గవర్నర్ కాథీ హోచుల్ సైతం తాము ఈ పేరు మార్పును పరిగణనలోకి తీసుకోబోమని తేల్చిచెప్పారు.లొంగే ప్రసక్తే లేదన్న కెనడా ప్రధానివాషింగ్టన్ చర్చల వైఫల్యం అనంతరం కెనడా ప్రధాని మార్క్ కార్నీ దేశ ప్రజలనుద్దేశించి తీవ్రస్థాయిలో ప్రసంగించారు. అమెరికా తమను లొంగదీసుకోవాలని చూస్తోందని, కానీ తాము ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి తలొగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 34 కోట్ల జనాభా, భారీ ఆర్థిక వ్యవస్థ కలిగిన అగ్రరాజ్యం ముందు 4 కోట్ల జనాభా ఉన్న కెనడా వెనక్కి తగ్గకుండా ధీటుగా నిలబడటం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.ఇరాన్ ప్రతిఘటన – హార్ముజ్ జలసంధి మూసివేతమరోవైపు ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడులకు ప్రతిగా ఇరాన్ వ్యూహాత్మక అస్త్రాన్ని ప్రయోగించింది. ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం, ఎల్ఎన్జీలో 19 శాతానికి మార్గమైన హార్ముజ్ జలసంధిని నిలిపివేసింది. ఫలితంగా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో తీవ్ర కొరత ఏర్పడి, ప్రపంచవ్యాప్తంగా ఎరువుల సరఫరా, ఆహార భద్రతపై ప్రతికూల ప్రభావం పడింది. అమెరికాలో కూడా పెట్రోల్ ధరలు, జీవన వ్యయం భారీగా పెరిగాయి.ట్రంప్ ప్రకటనలు.. యుద్ధంలో ప్రతిష్టంభనయుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ కాల్పుల విరమణ కోసం అర్థిస్తోందని, ఒప్పందం చివరి దశకు వచ్చిందని ట్రంప్ 38 సార్లు ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిష్కారం లభించలేదు. యుద్ధం 60 రోజులు దాటినా ఇరాన్ నుంచి ఉన్న తక్షణ ముప్పు ఏమిటనే అంశంపై స్పష్టత రాలేదు. గతంలో ఇచ్చిన హామీలకు విరుద్ధంగా మధ్యప్రాచ్యంలో ముగింపు లేని యుద్ధంలో అమెరికా చిక్కుకుపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.రాజకీయ సంక్షోభం.. పడిపోయిన ప్రజాదరణఈ వరుస వివాదాలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ 33 శాతానికి పడిపోయింది. నవంబర్ 3న జరగనున్న మధ్యంతర ఎన్నికలకు ముందు కెనడాతో వాణిజ్య యుద్ధం మరింత ముదరడం, ఇరాన్ సంక్షోభం సమసిపోకపోవడం రిపబ్లికన్ పార్టీకి గట్టి సవాలుగా మారింది. ఫలితంగా ప్రతినిధుల సభలో రిపబ్లికన్లు మెజారిటీని కోల్పోయే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇది కూడా చదవండి: ముగుస్తున్న ‘ఫరక్కా’ గడువు.. ముంచుకొస్తున్న జలయుద్ధం! -
యుద్ధం ఇంకా ఉంది!
వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించి ఆరు నెలలవుతోంది. ఇప్పటికే వందలాది మంది మరణించారు. దాడులకు ముగింపు ఎప్పుడో ఎవరూ చెప్పలేకపోతున్నారు. యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ముగిస్తామని, పశ్చిమాసియాలో శాంతియుత వాతావరణం నెలకొల్పుతామని మొదట్లో పదేపదే ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేడు మాట మార్చేశారు. ఇరాన్‌పై దాడులను ఆపే విషయంలో తొందరపడడం లేదని అంటున్నారు. వైమానిక దాడులు, దిగ్బంధనం ద్వారా ఇరాన్ నాయకత్వాన్ని, సైన్యాన్ని, ఆర్థిక వ్యవస్థను చాలావరకు నాశనం చేశానని ట్రంప్ తాజాగా వెల్లడించారు. ఇరాన్‌ను తమ దారికి తెచ్చేందుకు సైనిక చర్యకు బదులుగా, ఆర్థికంగా ఒత్తిడిని పెంచడంపైనే దృష్టి సారిస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం పేర్కొంది. ఇరాన్‌తో వ్యాపారం కొనసాగించే ఏ దేశమైనా లేదా సంస్థ అయినా కఠిన ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఆంక్షలను ప్రధాన ఆయుధంగా ఉపయోగించాలని అమెరికా నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇరాన్ నాయకత్వం ఇప్ప టికే చాలావరకు బల హీన పడిందని డొనాల్డ్ ట్రంప్ తేల్చిచెప్పారు. వారు (ఇరాన్) సైని కులకు జీతాలు చెల్లించడం లేదని, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలిపారు. ఇరాన్ సామర్థ్యం చాలా తక్కువగా ఉందన్నారు. ఇరాన్‌తో ఇప్పటికిప్పుడు చర్చలు ప్రారంభించాలన్న ఉద్దేశం కూడా లేదని స్పష్టంచేశారు. అందుకు సమయం ఉందని పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఇరాన్‌పై యుద్ధం వల్ల అమెరికాకు 37.5 బిలియన్ డాలర్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అంచనా. పశ్చిమాసియా సంక్షోభానికి దౌత్యపరమైన పరిష్కారం కనిపెట్టేందుకు ఖతార్, పాకిస్తాన్‌లు తమ వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. త్వరగా చర్చలు ప్రారంభించాలని అమెరికా, ఇరాన్‌లను కోరుతున్నాయి. మొత్తం సమస్యకు హార్మూజ్ జలసంధి కేంద్ర బిందువుగా మారింది. జలసంధిపై పట్టుకోసం అమెరికా, ఇరాన్‌లు ఆరాటపడుతున్నాయి. హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం, ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలు ప్రారంభించడం లక్ష్యంగా జూన్‌లో కుదిరిన ప్రాథమిక ఒప్పందంపై ట్రంప్ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. -
ట్రంప్‌కు ఎదురుగాలి!
రెండో దఫా అధికార పీఠం అధిరోహించి కూడా రెండేళ్లు కావస్తున్నా అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్‌కు దౌత్యనీతి ఒంటబట్టలేదు. తాను నిర్దేశించినదాన్ని అంగీకరించటమే తప్ప మరోవిధంగా మాట్లాడే హక్కు, అధికారం ఏ దేశానికీ లేదని ఆయన ఇప్పటికీ నమ్ముతున్నారు. ఆయన దృష్టిలో కేవలం అదే దౌత్యం. భారత్ నుంచి కెనడా వరకూ... ఇరాన్ నుంచి వెనిజులా వరకూ ఆయనది ఇదే బాణీ. ట్రంప్‌ను నేరుగా ప్రతిఘటించే వారుండొచ్చు, పరోక్షంగా చెప్పిచూద్దామనుకునే వారుండొచ్చు... మార్గాలు వేరైనా ట్రంప్ షరతులకు తలొగ్గబోమని చెప్పడమే వీరందరి సారాంశం. చాన్నాళ్లుగా విసుగెత్తి ఉన్నారేమో... కెనడా ప్రధాని మార్క్ కెర్నీ చాలా కరకుగానే వ్యవహరించారు. ఒకదాని వెంబడి మరో గొంతెమ్మ కోర్కెతో చీకాకుపరుస్తున్న అమెరికా తీరును నిరసిస్తూ వాణిజ్య ఒప్పందంపై చర్చలు సాగిస్తున్న తమ ప్రతినిధి బృందాన్ని వెనక్కురావాలని ఆదేశించారు. ఒప్పందం దాదాపు ఖరారై సంతకాలు జరపడమే తరువాయి అనుకునే దశలో ఎదురైన ఈ ఊహించని పరిణామం అమెరికాను అయోమయంలోకి నెట్టింది. ఇలాంటి భంగపాట్లే ఇరాన్ దగ్గర ఎదురయ్యాయి. మన దేశంతో చర్చలు ఒక కొలిక్కి వచ్చాయని అమెరికా అనేకమార్లు ప్రకటించింది. కానీ అదేమీ జరగలేదు. వెనిజులా అధ్యక్షుడు మదురోను ట్రంప్ తన సైన్య బలంతో ఈ ఏడాది మొదట్లో అపహరించి, అమెరికాలో ఆయనపై విచారణ తంతు సాగిస్తున్నారు. ఇకపై అది తమ భూభాగమని అమెరికా చెప్పడం ఆ దేశ ప్రజల్ని మాత్రమే కాదు... అత్యధిక దేశాలను ఆగ్రహోదగ్రుల్ని చేస్తోంది. ఇక ఇరాన్ సంగతి చెప్పనవసరం లేదు. యుద్ధాన్ని తాత్కాలికంగా నిలిపేశామని చెప్పటం నుంచి హార్మూజ్ తమదేనని ప్రకటించటం వరకూ ట్రంప్ ఎన్ని చేసినా ఇరాన్ నిబ్బరంగా ‘నీ లెక్కేమిట’న్నట్టే వ్యవహరిస్తోంది. మిత్ర దేశమైన దక్షిణ కొరియాదీ అదే వైఖరి. ఏటా 11 రోజులపాటు అమెరికా, దక్షిణ కొరియాలు ఉమ్మడి సైనిక విన్యాసాలు జరుపుతాయి. ఈసారి అయిదో రోజుకల్లా అమెరికా సైనికులు తట్టా బుట్టా సర్దుకుని తిరుగుముఖం పట్టారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్ ఉన్‌తో చెలిమి కోసం ట్రంప్ తహతహలాడటంపై ఆగ్రహించి దక్షిణ కొరియా ఈ నిర్ణయం తీసుకుందంటున్నారు. ఈ విన్యాసాల ఉద్దేశం ఉత్తర కొరియాను భయపెట్టడం. తీరా ఆ దేశంతోనే అమెరికా చేతులు కలుపుతుంటే... ఈ విన్యాసాలకు అర్థమేమిటన్నది దక్షిణ కొరియా ప్రశ్న. వాస్తవానికి ఉత్తర కొరియా పూర్తి స్థాయి అణ్వస్త్ర దేశంగా మారింది. ఆ దేశం దగ్గర ‘చాలా శక్తిమంతమైన’ ఆయుధా లున్నాయని ట్రంపే కొద్దికాలం క్రితం ప్రకటించారు. దాన్ని మరిచి కొత్త చుట్టరికాలు కలుపుకుందామని ట్రంప్ ప్రయత్నించినంత మాత్రాన ఆ దేశం నమ్మే అవకాశమేమీ లేదు. ఇరాన్తోసహా అన్ని దేశాలతోనూ దౌత్యపరంగా వరస వైఫల్యాలు తప్పడం లేదు గనుక ఉత్తర కొరియాకు దగ్గరై అమెరికా జనాన్ని ఆశ్చర్యపరచాలని ట్రంప్ భావిస్తున్నట్టు కనబడుతోంది. కానీ వేరే దేశాలతో పెంచుకున్న వైరం వికటిస్తున్న విధంగానే ఉత్తర కొరియాతో చెలిమి సైతం బెడిసికొట్టే అవకాశం లేకపోలేదు. చివరకు ఉత్తర కొరియాఏం చేస్తుందన్నది అలావుంచితే... ఆసియా–పసిఫిక్ దేశాలన్నిటా ట్రంప్ అంతరంగంపై ఇప్పటికే ఉన్న సందేహాల్ని మరింతగా పెంచింది. ఈ దేశాలన్నీ చైనా దూకుడువల్ల చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఇలాంటి సమయంలో తమకు అండగా నిలిచి, చైనాకు కళ్లెం వేయాల్సిన అమెరికా ఆడుతున్న వింతనాటకాలు వాటికి మింగుడుపడటం లేదు.అందుకే దక్షిణ కొరియా, జపాన్ ఇటీవల సాన్నిహిత్యమవుతున్నాయి. ఆ రెండింటిమధ్యా ఇబ్బందికర చరిత్రవున్నా ట్రంప్ వింత చేష్టలు వారిని సన్నిహితం చేశాయి. కెనడా ఉత్పత్తులపై 50 శాతం అదనపు సుంకాలు వేయాల్సివస్తుందని ట్రంప్ ప్రకటించగా, దానికి ప్రతిగా వచ్చే నెల 8 నుంచి అమెరికా ఉత్పత్తులపై 15 నుంచి 50 శాతం వరకూ సుంకాలు విధిస్తామని కెర్నీ ప్రకటించారు. అమెరికా అదనపు సుంకాల విలువ 2,000 కోట్ల డాలర్లయితే, కెనడా సుంకాలు 2,760 కోట్ల డాలర్లు. ఈ ప్రపంచం తనకు భయపడటం మాట అటుంచి... జాలి కూడా చూపబోదని ట్రంప్‌కు ఎంత త్వరగా తెలిస్తే అమెరికా ప్రజలకు అంత మేలు. -
ఇరాన్ కళ్లుగప్పి.. హర్ముజ్‌లో అమెరికా సీక్రెట్ ఆపరేషన్!
ఇరాన్‌తో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా కీలక ప్రకటన చేసింది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిలో ఇరాన్ ఏర్పాటు చేసిన మందుపాతరలను(సీ మైన్స్) పూర్తిగా తొలగించినట్లు తెలిపింది. అమెరికా దళాలు అత్యంత రహస్య ఆపరేషన్ నిర్వహించి.. శ్రమించి వాటిని తొలగించాయని అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ వెల్లడించారు. ఈ చర్యను అమెరికా సైనిక కార్యకలాపాల్లో ‘మేజర్ మైలురాయి’గా అభివర్ణించారు.హర్ముజ్‌పై పట్టు సాధించే క్రమంలో ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కొన్ని నెలల క్రితం అంతర్జాతీయ షిప్పింగ్ మార్గాల్లో సీ మైన్స్‌ను ఏర్పాటు చేసింది. వీటి కారణంగా అమెరికా బలగాల కదలికలు నిలిచిపోవడంతో పాటు వాణిజ్య నౌకల రాకపోకలకు తీవ్ర ముప్పు ఏర్పడింది. వాటిని తొలగించడమూ అంత సులువు కాదని.. చాలా సమయం పట్టొచ్చని అప్పట్లో చర్చలు నడిచాయి. ఈ క్రమంలో హర్ముజ్ బ్లాకేడ్(నిర్బంధం) కొనసాగిస్తున్న అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) వీటి తొలగింపునకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. అయితే ఇరాన్ ఏర్పాటు చేసిన సముద్రపు మైన్స్‌ను తొలగించేందుకు అమెరికా బలగాలు అత్యంత రహస్యంగా ఆపరేషన్ చేపట్టాయి. ముందుగా మైన్స్ ఉన్న ప్రాంతాలను గుర్తించి.. అమెరికా నేవీకి చెందిన ప్రత్యేక డైవింగ్ బృందాలను రంగంలోకి దించారు. సముద్రంలోకి వెళ్లిన ఈ బృందాలు మైన్స్‌ను గుర్తించి, వాటిని సురక్షితంగా తొలగించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ వెల్లడించారు. అంతర్జాతీయ షిప్పింగ్ మార్గాల్లో ఏర్పాటు చేసిన మైన్స్‌ను పూర్తిగా తొలగించడం అమెరికా సైనిక కార్యకలాపాల్లో ‘మేజర్ మైలురాయి’ అని ఆయన పేర్కొన్నారు.హర్ముజ్‌లో మైన్స్ తొలగింపుతో పాటు గత కొన్ని నెలల్లో సుమారు 1,500 వాణిజ్య నౌకలు ఈ జలసంధిని దాటేందుకు అమెరికా దళాలు సహకరించినట్లు కూపర్ తెలిపారు. ఈ నౌకల ద్వారా ప్రపంచ మార్కెట్లకు దాదాపు 750 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు రవాణా అయినట్లు వెల్లడించారు. హర్ముజ్‌లో సురక్షిత రవాణా మార్గాలను పునరుద్ధరించడం అంతర్జాతీయ వాణిజ్యానికి కీలక పరిణామమని ఈ సందర్భంగా అమెరికా ప్రకటించుకుంది.ఇదిలా ఉంటే.. మైన్స్ తొలగించినంత మాత్రాన హర్ముజ్‌లో ముప్పు పూర్తిగా తొలగిపోయినట్లు కాదని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్ నుంచి డ్రోన్లు, క్షిపణుల ముప్పు ఇంకా తొలగిపోలేదు. దీంతో నౌకల రాకపోకలు పూర్తిగా సాధారణ స్థితికి చేరడానికి సమయం పట్టే అవకాశం ఉంది.ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిమరోవైపు ఇరాన్‌పై అమెరికా ఆర్థిక, సైనిక ఒత్తిడిని మరింత పెంచుతోంది. ఇరాన్ నౌకాశ్రయాల్లోకి ప్రవేశించేందుకు.. అక్కడి నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన 75 నౌకలను వెనక్కి పంపినట్లు అమెరికా తెలిపింది. మరో మూడు నౌకలపై సైనిక చర్యలు(స్వల్ప దాడులు!) తీసుకున్నట్లు వెల్లడించింది. అయితే మానవతా అవసరాల కోసం ప్రయాణించే నౌకలకు మాత్రం మినహాయింపులు ఇచ్చినట్లు పేర్కొంది.ఇదే సమయంలో హర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచి, నౌకల రాకపోకలను సాధారణ స్థితికి తీసుకురావడంపై దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఖతార్, ఒమన్ వంటి దేశాలు ఇరాన్‌తో చర్చలు జరుపుతున్నాయి. అమెరికా దిగ్బంధాన్ని ఎత్తివేయడం, ఆంక్షలను సడలించడం వంటి అంశాలపై ఇరాన్ పట్టుబడుతున్నట్లు సమాచారం.చమురు మార్కెట్లపై ప్రభావం?ప్రపంచ ఇంధన సరఫరాలో హర్ముజ్ జలసంధిది అత్యంత కీలకమైన స్థానం. ఈ మార్గంలో నౌకల రాకపోకలు పూర్తిస్థాయిలో పునరుద్ధరించగలిగితే చమురు, గ్యాస్ సరఫరాపై ఉన్న ఒత్తిడి తగ్గి అంతర్జాతీయ ధరలు కొంత స్థిరపడే అవకాశం ఉంది. అయితే అమెరికా–ఇరాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో హర్ముజ్ పూర్తిగా సురక్షితంగా మారిందని చెప్పడానికి ఇంకా పరిస్థితులను నిశితంగా గమనించాల్సి ఉంది.ఇదీ చదవండి: కెనడాకు బీపీ తెప్పించిన ట్రంప్.. ఏం చేశారంటే? -
పేట్రియాట్ల కొరత తీవ్రం
వాషింగ్టన్: అమెరికా సైన్యం పశ్చిమాసియాలో ఇరాన్‌తో యుద్ధంలో మునిగిపోయింది. తరచుగా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగిస్తోంది. ఇరాన్ సైన్యం ప్రయోగించే ఆయుధాల నుంచి రక్షించుకోవడానికి అధునాతన క్షిపణి నిరోధకాలను (పేట్రియాట్లు) మోహరించింది. పశ్చిమాసియాలోని తమ మిత్రదేశాలకు వీటిని అందజేస్తోంది. మరోవైపు యూరప్‌లో అధునాతన క్షిపణి నిరోధకాల కొరత అత్యంత తీవ్రస్థాయిలో ఉందని అమెరికా రక్షణ అధికారి, నాటో అధికారి తెలియజేశారు. ఒకవేళ రష్యా సైన్యం యూరప్‌పై దాడి చేస్తే తాము రక్షించలేమని పరోక్షంగా తేల్చిచెప్పారు. రష్యా క్షిపణులను అడ్డుకొనే ఇంటర్సెప్టర్లు లేవని పేర్కొన్నారు. రష్యాకు చెందిన అత్యంత వేగవంతమైన బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేయగల పేట్రియాట్ క్షిపణి నిరోధకాల కొరత వేధిస్తుండడం అత్యంత ఆందోళనకరమని అమెరికా రక్షణ అధికారి తెలిపారు. ఐరోపా ఖండంలో అమెరికన్, నాటో దళాల వద్ద పేట్రియాట్ల నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయని ధ్రువీకరించారు. సైనిక ప్రధాన కార్యాలయం లేదా విద్యుత్ కేంద్రంపై రష్యా బాలిస్టిక్ క్షిపణులతో దాడికి దిగిన పక్షంలో, పేట్రియాట్ క్షిపణుల కొరతతో బాధపడుతున్న ఉక్రెయిన్ మాదిరిగానే నాటో కూడా అదే పరిస్థితిని ఎదుర్కొని, తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. ఇరాన్‌పై యుద్ధం ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ వల్ల అమెరికా సైన్యం ఇతర ప్రాంతాల్లో విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు స్పష్టమవుతోంది. అమెరికా–ఇరాన్ యుద్ధానికి దాదాపు ఆరు నెలలు పూర్తయ్యాయి. యూరప్‌లోని అమెరికా క్షిపణి నిల్వలను ఇప్పటికే పశ్చిమాసియాకు తరలించారు. అక్కడ ఇరాన్ డ్రోన్లు, క్షిపణులను అడ్డుకోవడానికి అమెరికా, గల్ఫ్ మిత్రదేశాలు పేట్రియాట్‌లతో సహా గణనీయమైన సంఖ్యలో ఇంటర్సెప్టర్లను ప్రయోగించాయి. మరోవైపు సాధ్యమైనంత త్వరగా మిస్సైల్ ఇంటర్సెప్టర్లు అందజేయాలని తమ ప్రభుత్వాన్ని యూరప్‌లోని అమెరికా సైన్యం కోరుతోంది. -
ట్రంప్ నెక్ట్స్ టార్గెట్ చైనా బ్యాంకులేనా?
ఇరాన్‌తో సంబంధాలున్నాయనే కారణంతో.. చైనా బ్యాంకులను లక్ష్యంగా చేసుకుని తమ ప్రభుత్వం ఆంక్షలకు సిద్ధమవుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. టెహ్రాన్‌ను ఏకాకిని చేసేందుకు, వాషింగ్టన్ చేస్తున్న ప్రయత్నాలలో ఇది ఒక పెద్ద ముందడుగు అనే చెప్పాలి.ఇరాన్ ప్రభుత్వాన్ని ఆర్థికంగా బలహీనపరిచేందుకు అమెరికా ఇప్పటికే ఆంక్షలను మరింత కఠినతరం చేస్తోంది. ఈ వారం అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ కూడా ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని పెంచుతామని ప్రకటించారు. ముఖ్యంగా.. ఇరాన్‌తో వ్యాపారం కొనసాగించే ఇతర దేశాలు, సంస్థలపై కూడా సెకండరీ ఆంక్షలు విధించే అవకాశాన్ని అమెరికా పెంచుతోంది. దీంతో ఇరాన్‌తో వాణిజ్యం చేసే దేశాలకు కూడా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది.చైనా ఎందుకు టార్గెట్?ఇరాన్‌కు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ముఖ్యంగా ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేసే దేశాల్లో చైనా కీలకంగా ఉంది. ఇరు దేశాల మధ్య చమురు, ఇతర వస్తువుల వ్యాపారానికి సంబంధించిన చెల్లింపుల్లో చైనా బ్యాంకులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందుకే అమెరికా నిజంగానే చైనా బ్యాంకులపై ఆంక్షలు విధిస్తే.. అది కేవలం ఇరాన్‌పైనే కాకుండా అమెరికా-చైనా సంబంధాలు, ప్రపంచ చమురు మార్కెట్, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.ఇప్పటివరకు అమెరికా.. పెద్ద చైనా బ్యాంకులపై ఇరాన్‌కు సంబంధించి ఆంక్షలు విధించలేదు. అయితే ఇరాన్ ప్రభుత్వానికి, దాని సైన్యానికి సహాయం చేస్తున్నాయని ఆరోపిస్తూ చైనా, హాంకాంగ్‌లోని కొన్ని కంపెనీలపై ఇప్పటికే చర్యలు తీసుకుంది. మరోవైపు అమెరికా విధించే సెకండరీ ఆంక్షలను చైనా చట్టవిరుద్ధమైనవిగా వ్యతిరేకిస్తోంది. దీంతో చైనా బ్యాంకులపై అమెరికా తదుపరి చర్యలు తీసుకుంటే.. ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. -
మోజ్తాబా ఖమేనీపై ఇరాన్ కపట నాటకం.. బయటపెట్టిన ట్రంప్!
వాషింగ్టన్: అమెరికా-ఇజ్రాయెల్‌లు సంయుక్తగా జరిపిన దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ మరణించారనే ప్రచారం అప్పట్లో జోరందుకుంది. తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు గైర్హాజరు కావడంతో ఆ ప్రచారానికి ఊతం ఇచ్చినట్లైంది.ఈ క్రమంలో మోజ్తాబా తన అనుచరులతో మాట మంతి నిర్వహించడం, ఆయనే స్వయంగా మాట్లాడిన వీడియోలను ఇరాన్ విడుదల చేసింది. దీంతో మోజ్తాబా మరణంపై కొనసాగుతున్న ప్రచారానికి పులిస్టాప్ పడినట్లైంది. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఖమేనీ ఆచూకీపై అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నారు.తాజాగా అమెరికాకు చెందిన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు గ్లెన్ బెక్ నిర్వహించిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు. గత కొన్ని నెలలుగా ఖమేనీ కనిపించకపోవడంపై వస్తున్న వార్తలను ఆయన ప్రస్తావించారు. ‘ఖమేనీ చనిపోయాడని నేను అనుకోవడం లేదు. కానీ వైమానిక దాడుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా ఆయన ఎడమ వైపు శరీరం, చేయి, కాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆయన పరిస్థితి విషమంగానే ఉంది.. కానీ ప్రాణాలతోనే ఉన్నారు’ అని ట్రంప్ స్పష్టం చేశారు.ఒకవేళ మొజ్తాబా ఖమేనీ పూర్తిగా అచేతన స్థితిలోకి వెళ్ళినా, మరణించినా.. ఇరాన్ ప్రభుత్వం ఆ నిజాన్ని దాచిపెడుతోందని ట్రంప్ ఆరోపించారు. ప్రపంచాన్ని, ఇరాన్ ప్రజలను నమ్మించడానికి ఇరాన్ రహస్య నాటకం ఆడుతోందన్నారు. గత కొన్ని నెలలుగా మొజ్తాబా ఖమేనీ బహిరంగంగా కనిపించకపోవడం వెనుక ఇస్రాయెల్ క్షిపణి దాడుల ప్రభావం ఉందనే అనుమానాలకు ట్రంప్ వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూర్చాయి. ఇరాన్ తన దేశాధినేత పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని చూపిస్తున్నప్పటికీ.. అంతర్గతంగా ఆ దేశ నాయకత్వం ఎంతటి బలహీన స్థితిలో ఉందో ట్రంప్ మాటలు స్పష్టం చేస్తున్నాయి.అవన్నీ పాత వీడియోలేనాఇరాన్ అత్యున్నత నాయకుడికి సంబంధించిన పాత వీడియో దృశ్యాలను ఇరాన్‌కు చెందిన ‘ఫార్స్ న్యూస్’ విడుదల చేసిందని ‘అల్ అరబియా’ నివేదించింది. అల్ అరబియా కథనం ప్రకారం, ఆయన అత్యున్నత నాయకుడిగా బాధ్యతలు చేపట్టకముందే ఈ దృశ్యాలు చిత్రీకరించినట్లు ఆరోపించిందిఎవరి మాటలు నమ్మాలిప్రపంచానికి తమ సుప్రీం లీడర్ ఆరోగ్యంగా ఉన్నారనే సంకేతాలు ఇచ్చేందుకు ఇరాన్ మీడియా ఈ వీడియోలను విడుదల చేసింది. ఆగస్టు నెలలో ఇరాన్ మీడియా ఈ వీడియోను విడుదల చేయడానికి ముందు, ఇరాన్ అత్యున్నత నాయకుడి ఆరోగ్యం విషమంగా ఉందని, ఆయనను అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారని ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. ఆ వార్తలు వచ్చిన కొద్ది రోజులకే ఇరాన్ అధికారిక వార్తా సంస్థ 'మెహర్ న్యూస్' ఒక వీడియోను విడుదల చేసింది. తేదీ లేని ఆ వీడియోలో సుప్రీం లీడర్ ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించారు.అంతకుముందు, ఖమేనీ అత్యంత విషమ పరిస్థితిలో ఉన్నారని ఇజ్రాయెల్ మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఇరాన్ అంతర్గత వర్గాలు, అలాగే ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ యంత్రాంగానికి సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ ‘ది జెరూసలేం పోస్ట్’ ప్రచురించిన కథనాల ప్రకారం, ఇరాన్ నాయకత్వంలో ఆయన ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి.అవన్నీ ఊహాగానాలే ఆ తర్వాత కొద్దిసేపటికే, అత్యున్నత నాయకుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ పేర్కొన్నారు. ఆయన శారీరక పరిస్థితికి సంబంధించిన ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. ఏడు నుండి ఎనిమిది గంటల పాటు కూర్చుని చర్చించగలిగే వ్యక్తికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు అని అధ్యక్షుడు అన్నారు. ఆగస్టు ప్రారంభంలో తాను ఆయనతో మంచి సమావేశాన్ని నిర్వహించినట్లు ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త సైనిక దాడులలో తన తండ్రి, మాజీ సర్వోన్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత, మొజ్తాబా ఖమేనీ ఆ పదవిని చేపట్టారు. ఆ పదవిని చేపట్టినప్పటి నుండి, మొజ్తాబా ఖమేనీ ఎక్కడా బహిరంగంగా కనిపించకుండా కేవలం లిఖితపూర్వక ప్రకటనల ద్వారా మాత్రమే వ్యవహరిస్తున్నారు.👉ఇదీ చదవండి: ‘యుద్ధంతో జీవించలేం’.. ఇరాన్లో వినిపిస్తున్న కొత్త స్వరం -
భారత కంపెనీలకు షాకిచ్చిన ట్రంప్..
ఇరాన్‌పై అమెరికా ఆర్థిక ఒత్తిడి రోజురోజుకు పెరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ నుంచి పెట్రోలియం, పెట్రోకెమికల్ ఉత్పత్తుల దిగుమతుల్లో భాగస్వామ్యం ఉన్నాయన్న ఆరోపణలతో భారత్‌కు చెందిన నాలుగు కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది. మొత్తం సుమారు 119 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.10 వేల కోట్లకు పైగా) విలువైన ఇరాన్ చమురు వ్యాపారానికి సంబంధించి ఈ చర్యలు తీసుకున్నట్లు అమెరికా పేర్కొంది. ‘ఆపరేషన్ ఎకనామిక్ అవుట్‌కాస్ట్’లో భాగంగా ఈ ఆంక్షలు అమెరికా ప్రకటించింది.ఆంక్షలు విధించిన కంపెనీలు ఇవే.. PP Softtech Private Limited, Sadashiva Overseas Limited, Prakrutees Infra Impex India Private Limited, Portease Partners LLP కంపెనీలపై చర్యలు తీసుకున్నారు.ఇక, వీటిలో మొదటి మూడు సంస్థలు ఇరాన్ మూలం కలిగిన పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నాయని అమెరికా ఆరోపించింది. నాలుగో సంస్థ అయిన Portease Partners ఇరాన్ పెట్రోకెమికల్ ఉత్పత్తుల పలు షిప్మెంట్లను భారత్‌కు తీసుకురావడంలో కస్టమ్స్ బ్రోకర్‌గా సహకరించిందని పేర్కొంది. 2023 మే నుంచి 2026 ఫిబ్రవరి మధ్య ఈ లావాదేవీలు జరిగినట్లు పేర్కొంది. ఈ మూడు సంస్థలకు సంబంధించి అమెరికా పేర్కొన్న దిగుమతుల విలువే దాదాపు 119 మిలియన్ డాలర్లు. Portease Partners ద్వారా నిర్వహించబడిన షిప్మెంట్ల విలువను ఇందులో చేర్చలేదు.ముగ్గురు భారతీయులపైనా ఆంక్షలుఇదిలా ఉండగా.. కంపెనీలతో పాటు ముగ్గురు భారతీయులపై కూడా అమెరికా చర్యలు తీసుకుంది. PP Softtech డైరెక్టర్ ప్రశాంత్ గార్గ్‌తో పాటు Portease Partners భాగస్వాములు ఇంద్రిస్మియా అషరఫ్మియా షేఖ్, హరీశ్ రామచంద్ర రంగిలను కూడా ఆంక్షల జాబితాలో చేర్చింది. అయితే, అమెరికా ఆంక్షలు కేవలం నాలుగు భారత కంపెనీలకు మాత్రమే పరిమితం కాలేదు. ఇరాన్ ఆదాయ మార్గాలను ప్రపంచవ్యాప్తంగా దెబ్బతీయడమే లక్ష్యంగా ‘ఆపరేషన్ ఎకనామిక్ అవుట్‌కాస్ట్’ పేరుతో విస్తృత ఆంక్షల కార్యక్రమాన్ని వాషింగ్టన్ ప్రారంభించింది. దాదాపు 60 మంది వ్యక్తులు, సంస్థలు, నౌకలపై తాజాగా చర్యలు తీసుకున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. చైనా, హాంకాంగ్‌కు చెందిన పలు సంస్థలు, వ్యక్తులు కూడా ఈ జాబితాలో ఉన్నారు.ఇది కూడా చదవండి: అమెరికాకు కెనడా స్ట్రాంగ్ కౌంటర్ఈ నేపథ్యంలో ఆంక్షల విధింపుపై అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ.. ఇరాన్ ప్రభుత్వ ఆర్థిక సంబంధాలపై ఒత్తిడిని మరింత పెంచుతామని స్పష్టం చేశారు. ఇరాన్‌తో ఆర్థిక సంబంధాలు కొనసాగించే సంస్థలు కూడా భవిష్యత్తులో అమెరికా ఆంక్షల ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు.. అమెరికా ఆంక్షలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. తాజా చర్యలు అంతర్జాతీయ చట్టాలను, ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను ఉల్లంఘించే ప్రయత్నమని ఇరాన్ విదేశాంగ శాఖ ఆరోపించింది. ఇరాన్ ఆర్థిక మంత్రి అలీ మదనిజాదెహ్ స్పందిస్తూ.. తమ దేశం ఈ ఆంక్షలను ఎదుర్కొనేందుకు పూర్తిగా సిద్ధంగా ఉందని చెప్పారు. ఇందుకోసం రెండేళ్ల ప్రణాళికను రూపొందించినట్లు వెల్లడించారు.భారత్‌పై ప్రభావం?ఇరాన్ చమురు వ్యాపారానికి సంబంధించి భారత కంపెనీలపై అమెరికా వరుసగా చర్యలు తీసుకోవడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలోనూ ఇరాన్‌తో చమురు సంబంధాల ఆరోపణలపై భారత సంస్థలు, వ్యక్తులను అమెరికా ఆంక్షల పరిధిలోకి తీసుకొచ్చింది. తాజా చర్యలతో ఇరాన్‌తో వాణిజ్యం చేసే భారతీయ సంస్థలపై అమెరికా నిఘా మరింత కఠినమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. -
యుద్ధం ముగింపు, హార్మూజ్ తెరవడంలో ‘అద్భుత పురోగతి’!
ఇస్లామాబాద్: అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ చర్చలు ప్రారంభమయ్యేలా చేసేందుకు పాకిస్థాన్ నేతలు టెహ్రాన్‌లో చర్చలు జరిపారు. యుద్ధాన్ని ఆపేందుకు శాంతి దిశగా మార్గంపై జరిగిన చర్చల్లో పాకిస్థాన్, ఇరాన్ అద్భుతమైన రీతిలో పురోగతి సాధించాయని పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మంగళవారం తెలిపారు. ఆయన టెహ్రాన్ పర్యటన ముగిసింది.మరింత ఉద్రిక్తత పెరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం, ఘర్షణను వేగంగా ముగించే అంశాలపై ఇరు దేశాలు చర్చించాయని పాకిస్థాన్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్, ఇరాన్ నేతల మధ్య జరిగిన సమావేశం గురించి ఈ ప్రకటన వెలువడింది. ప్రాంతీయ శాంతి, వివాదానికి చర్చల ద్వారా పరిష్కారం కనుగొనే మార్గంపై కూడా ఇరు పక్షాలు అభిప్రాయాలను పంచుకున్నాయని ప్రకటనలో పేర్కొన్నారు.“ఇరాన్ అధ్యక్షుడు తమ ప్రభుత్వ దృక్కోణాన్ని స్పష్టంగా వివరించారు. చర్చించిన అంశాలపై మేము ఎంతో నిర్మాణాత్మకంగా అభిప్రాయాలను పంచుకున్నాం” అని మునీర్‌తో కలిసి టెహ్రాన్ వెళ్లిన అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ ఎక్స్‌లో పోస్టు చేశారు.దీనిపై వైట్ హౌస్, విదేశాంగ శాఖ స్పందించలేదు. టెహ్రాన్ పర్యటనకు ముందు మునీర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడారని రాయిటర్స్ సోమవారం తెలిపింది. ఇరాన్‌ను ఒంటరి చేయాలని ప్రయత్నిస్తున్న ట్రంప్, ఇరాన్‌కు “ఏ విధమైన సహాయ మార్గాన్నైనా” అందించే ఏ దేశమైనా ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని గత వారం హెచ్చరించారు. దీనికి ప్రతిగా ఇరాన్ గల్ఫ్ నుంచి చమురు ఎగుమతులను పూర్తిగా నిలిపివేస్తామని హామీ ఇచ్చింది. -
ట్రంప్ వార్నింగ్.. ఇరాన్‌కు కటీఫ్ చెప్పాల్సిందేనా?
ఇరాన్‌పై అమెరికా ఆంక్షల ఉచ్చు మరింత బిగుస్తోంది. ఇరాన్‌తో ఆర్థిక సంబంధాలు కొనసాగించే దేశాలు వెంటనే వాటిని తగ్గించుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఇరాన్‌ను ఆర్థికంగా ఒంటరిని చేసి.. చివరకు అమెరికాతో చర్చలు, ఒప్పందానికి దిగేలా ఒత్తిడి చేయడమే వాషింగ్టన్ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే ఈ హెచ్చరికలకు ఇరాన్ ప్రధాన భాగస్వాములైన చైనా, రష్యా ఎంతవరకు తలొగ్గుతాయన్నది ఇప్పుడు కీలకంగా మారింది. అదే సమయంలో ఈ పరిణామం భారత్‌కు మాత్రం కొత్త చిక్కును తెచ్చిపెట్టింది.ఒకవైపు అమెరికాతో వేగంగా బలపడుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యం.. మరోవైపు ఇరాన్‌తో భారత్‌కు ఉన్న చారిత్రక, వాణిజ్య, వ్యూహాత్మక బంధం. ఈ రెండింటినీ సమతుల్యం చేయడం ఢిల్లీకి సవాల్‌గా మారింది. ముఖ్యంగా ఇరాన్‌తో ఆర్థిక సంబంధాలు కొనసాగించే దేశాలపై సెకండరీ ఆంక్షలు విధించే అవకాశం ఉందన్న హెచ్చరిక నేపథ్యంలో.. భారత్ ఎంతవరకు అమెరికా ఒత్తిడిని పరిగణనలోకి తీసుకుంటుందన్నదే ఆసక్తికరంగా మారింది. అయితే ఇది భారత్‌కు పూర్తిగా కొత్త పరిస్థితి కాదు.రష్యా విషయంలో వెనక్కి తగ్గని ఢిల్లీఉక్రెయిన్ సంక్షోభం తర్వాత రష్యాపై అమెరికా, పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించినప్పటికీ.. భారత్ మాస్కోతో సంబంధాలను పూర్తిగా తెంచుకోలేదు. ముఖ్యంగా దేశీయ ఇంధన అవసరాలను దృష్టిలో పెట్టుకుని రష్యా నుంచి భారీగా క్రూడ్ కొనుగోళ్లను కొనసాగించింది. 2026 జూన్‌లో రష్యా చమురు భారత్ మొత్తం క్రూడ్ దిగుమతుల్లో సగానికి పైగా వాటా సాధించినట్లు రాయిటర్స్ డేటా పేర్కొంది. అంటే అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని భారత్ కొనసాగించింది. అయితే ఇరాన్ విషయంలో సమీకరణాలు కొంత భిన్నంగా ఉన్నాయి.ఇప్పటికే భారీగా తగ్గిన వాణిజ్యంభారత్–ఇరాన్ ద్వైపాక్షిక వాణిజ్యం గతంతో పోలిస్తే భారీగా క్షీణించింది. 2018–19లో దాదాపు 17 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్యం.. 2025–26లో సుమారు 1.6 బిలియన్ డాలర్లకు పడిపోయింది. భారత్ ప్రధానంగా ఇరాన్‌కు బియ్యం, టీ, ఔషధాలు తదితర వస్తువులను ఎగుమతి చేస్తోంది. అమెరికా ఆంక్షలు మరింత కఠినతరం కావడం, యూఏఈ వంటి మార్గాల ద్వారా చెల్లింపులు, రీ-ఎగుమతులపై ఆంక్షల ప్రభావం పెరగడం భారత ఎగుమతిదారులకు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. ముఖ్యంగా బాస్మతి, టీ, ఫార్మా రంగాలపై ప్రభావం పడొచ్చు. అయితే ఇరాన్‌తో వాణిజ్యం ఇప్పటికే పరిమిత స్థాయికి చేరినందున.. భారత్ మొత్తంగా ఎదుర్కొనే ఆర్థిక దెబ్బ కంటే, కొన్ని రంగాల్లోని ఎగుమతిదారులపై ప్రభావమే ఎక్కువగా ఉండొచ్చు.చమురు కంటే పెద్ద ముప్పు.. హర్ముజ్భారత్కు ఇరాన్ విషయంలో అసలు ఆందోళన కేవలం ఆ దేశం నుంచి ఎంత చమురు కొనుగోలు చేస్తున్నామన్నది కాదు.. హర్ముజ్ జలసంధి. ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన ఈ మార్గంలో ఉద్రిక్తత పెరిగితే అంతర్జాతీయ చమురు ధరలు ఒక్కసారిగా ఎగిసే అవకాశం ఉంది. చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడే భారత్‌లో దీనివల్ల దిగుమతి బిల్లు పెరగడంతో పాటు రూపాయి, ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెరగొచ్చు.అయితే తాజా అమెరికా ఆంక్షల ప్రకటన తర్వాత వెంటనే చమురు ధరలు పెరగలేదు. ఆంక్షలు ఇరాన్‌పై ఒత్తిడిని పెంచి, చివరకు దౌత్యపరమైన పరిష్కారానికి దారితీయవచ్చన్న అంచనాలు కూడా మార్కెట్లలో కనిపించాయి. సోమవారం బ్రెంట్ క్రూడ్ ధర 2.35 శాతం తగ్గి 92.17 డాలర్ల వద్ద ముగిసింది.ఇదీ చదవండి: జింగ్‌పిన్ రాక.. భారత్‌తో బంధం బలపడేనా?చాబహార్‌ను వదులుకోవడం అంత సులభమా?ఇరాన్‌తో భారత్ సంబంధాల్లో చాబహార్ పోర్టు మరో కీలక అంశం. పాకిస్థాన్‌ను దాటకుండా అఫ్గానిస్థాన్, మధ్య ఆసియాకు చేరుకునే మార్గంగా ఇది భారత్‌కు వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగి ఉంది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో చాబహార్లో భారత కార్యకలాపాలు కొనసాగించడం సవాల్‌గా మారుతున్నప్పటికీ.. ఇరాన్‌తో పూర్తిగా సంబంధాలు తెంచుకుంటే ఈ కీలక కనెక్టివిటీ మార్గంపై భారత్ తన ప్రభావాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే ఇరాన్ భారత్‌కు కేవలం వాణిజ్య భాగస్వామి మాత్రమే కాదు.. పశ్చిమాసియాలో వ్యూహాత్మక భాగస్వామి కూడా.మరి మోదీ సర్కార్ ఏం చేస్తుంది?ప్రస్తుతానికి భారత్‌పై అమెరికా నేరుగా ఆంక్షలు విధించలేదు. తాజా చర్యల్లో భారత్‌ను లక్ష్యంగా చేసుకున్న నిర్ణయం కూడా కనిపించలేదు. దీంతో ఢిల్లీకి ఇంకా కొంత దౌత్యపరమైన వెసులుబాటు ఉంది. అమెరికాతో సంబంధాలను దెబ్బతీయకుండా.. అదే సమయంలో ఇరాన్‌తో అవసరమైన వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకోవడం భారత్ ముందున్న వాస్తవిక మార్గంగా కనిపిస్తోంది. రష్యా విషయంలో అనుసరించినట్టుగా జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తూనే, ఆంక్షల పరిధిలోకి వెళ్లకుండా సంబంధాలను పరిమిత స్థాయిలో కొనసాగించే ప్రయత్నం చేయొచ్చు.కటీఫ్ కాదు.. కత్తిమీద సాము!కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో “ఇరాన్‌కు భారత్ కటీఫ్ చెబుతుంది” అనుకోవడం తొందరపాటు అంచనా. అదే సమయంలో అమెరికా హెచ్చరికలను పూర్తిగా విస్మరించి ఇరాన్‌తో యథావిధిగా ఆర్థిక సంబంధాలు కొనసాగించడం కూడా ఢిల్లీకి అంత సులభం కాదు. వాణిజ్యం ఇప్పటికే గణనీయంగా తగ్గిపోయింది. చమురు విషయంలో భారత్‌కు ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలున్నాయి. కానీ చాబహార్, మధ్య ఆసియా కనెక్టివిటీ, పశ్చిమాసియాలో వ్యూహాత్మక ప్రయోజనాలు, హర్ముజ్ భద్రత వంటి అంశాలను ఒక్కసారిగా పక్కన పెట్టడం సాధ్యం కాదు. అందుకే భారత్ ముందున్న మార్గం ‘ఇరాన్‌కు కటీఫ్’ కంటే.. ‘అమెరికా ఆంక్షలకు చిక్కకుండా ఇరాన్‌తో అవసరమైన సంబంధాలను కొనసాగించడం’ అయ్యే అవకాశమే ఎక్కువ.రష్యా విషయంలో అమెరికా ఒత్తిడిని తట్టుకుని జాతీయ ప్రయోజనాలను కాపాడుకున్న భారత్.. ఇప్పుడు ఇరాన్ విషయంలోనూ అదే వ్యూహాన్ని అనుసరిస్తుందా? లేక అమెరికాతో పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి మరింత ప్రాధాన్యం ఇస్తుందా? ఈ సమతుల్యమే మోదీ సర్కార్‌కు అసలు పరీక్ష.:::వెబ్‌డెస్క్ ప్రత్యేకం -
ఇరాన్ తో వ్యాపారం చేస్తే.. చైనా, రష్యాకు ట్రంప్ వార్నింగ్?
-
అమెరికా ఆంక్షలు.. ఇరాన్ ప్రతిఘటన.. గల్ఫ్ లో యుద్ధ భయం..!
-
మొజ్తాబా ఖమేనీ మరో సంచలన వీడియో విడుదల
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఉనికిపై సస్పెన్స్ నెలకొన్న సమయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మొజ్తబా ఖమేనీకి సంబంధించిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఈసారి ఆయన స్వరం కూడా వినిపించింది. తొలిసారి మొజ్తబా ఖమేనీ గొంతు వినిపించగా.. యుద్ధం తర్వాత మరోసారి తేదీ లేని వీడియో విడుదలైంది. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా అలీ ఖమేనీ మతపరమైన విద్యా అధ్యయన సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న అరుదైన వీడియోను ఇరాన్ తొలిసారిగా విడుదల చేసింది. ఈ వీడియోలో మొజ్తబా.. ఓ విద్యార్థి తన థీసిస్‌ను వివరిస్తుండగా వింటూ.. ఆ పరిశోధనపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మొజ్తబా ఆరోగ్యంపై అనే సందేహాలు వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది.ఇదీ చదవండి: ట్రంప్ ఉక్కుపాదం.. ఇరాన్‌పై ‘ఎకనామిక్ డీ-డే’!ఫిబ్రవరి 28న అమెరికా–ఇజ్రాయెల్ సమన్వయ దాడుల్లో ఆయన తండ్రి ఖమేనీ మృతి చెందగా.. ఆ దాడుల్లో మొజ్తబా తీవ్రంగా గాయపడినట్లు వార్తలు వచ్చాయి. ఇరాన్‌కు చెందిన ఫార్స్ వార్తా సంస్థ తాజా వీడియోను విడుదల చేసింది. ఇందులో మొజ్తబా గొంతు కూడా తొలిసారిగా వినిపించింది. ఇరాన్ పాలనా వ్యవస్థలోని ‘ఇస్లామిక్ సెక్యూరిటీ మోడల్’ గురించి ఆయన విద్యార్థులకు వివరిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. అయితే ఈ వీడియో ఎప్పుడు చిత్రీకరించారన్న విషయం మాత్రం స్పష్టంగా తెలియలేదు. First Look Iran’s Supreme Leader Mojtaba Khamenei appears in newly released footage for the first time.A rare public glimpse into Iran’s new leadership. pic.twitter.com/qaMDZ25BLI— Dr Tariq Tramboo (@tariqtramboo) August 24, 2026 -
మేం సిద్ధం.. మా దాడి మొదలవుతుంది: ఇరాన్
ఇరాన్‌పై అమెరికా ఆంక్షలను మరింత విస్తరించడంతో మరోసారి ఉద్రిక్తతలు రాజుకుంటున్నాయి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఆదాయ మార్గాలను దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా కొత్త ఆంక్షలను ప్రకటించింది. అయితే ఈ చర్యలకు తాము భయపడబోమని ఇరాన్ తేల్చిచెప్పింది. ఆంక్షలను ఎదుర్కొనేందుకు ‘పూర్తిగా సిద్ధంగా ఉన్నామని’ ప్రకటించడంతోపాటు.. అవసరమైతే అమెరికా ప్రయోజనాలు, కీలక ఇంధన మార్గాలపై ఎదురుదాడికి దిగుతామని హెచ్చరించింది.అమెరికా కొత్త ఆంక్షలపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘర్ ఘలీబాఫ్ తీవ్రంగా స్పందించారు. అమెరికా చేస్తున్న ఆంక్షల బెదిరింపులనుOperation Economic Outcast ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారు. ఇరాన్ ప్రధాన వాణిజ్య భాగస్వాములు కూడా అమెరికా ఒత్తిడికి తలొగ్గబోరని ధీమా వ్యక్తం చేశారు. అలాగే.. అమెరికా మరిన్ని దేశాలతో ఆర్థిక సంబంధాలను తెంచుకునే స్థితిలో లేదని ఘలీబాఫ్ వ్యాఖ్యానించారు. ఇరాన్‌తో వాణిజ్యం చేస్తున్న దేశాలు అమెరికా హెచ్చరికలను పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదని తమకు సమాచారం అందుతోందన్నారు. దీంతో ఆంక్షల విషయంలో అమెరికా ఒత్తిడికి దీటుగా దౌత్య, ఆర్థిక మార్గాల్లో ప్రతిఘటనకు ఇరాన్ సిద్ధమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.‘పూర్తిగా సిద్ధంగా ఉన్నాం’ఇరాన్ ఆర్థిక మంత్రి అలీ మదానిజాదే అమెరికాకు మరింత ఘాటైన హెచ్చరిక జారీ చేశారు. కొత్త ఆంక్షలను ఎదుర్కొనేందుకు ఇరాన్ ‘పూర్తిగా సిద్ధంగా ఉంది’ అని ప్రకటించారు. అమెరికా తమపై ఆర్థిక దాడికి దిగితే.. తమ వద్ద కూడా ప్రతిస్పందించేందుకు అవసరమైన సాధనాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ‘‘ఇక మేం కేవలం రక్షణాత్మక చర్యల కోసమే పరిమితం కాబోం. శత్రువులు మా నుంచి దాడిని ఎదురుచూడాల్సి ఉంటుంది’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. చైనా, రష్యాలు అమెరికా తాజా చర్యలను అంగీకరించలేదని, ఇతర దేశాలు కూడా వాషింగ్టన్ ఒత్తిడికి తలొగ్గకపోవచ్చని మదానిజాదే పేర్కొన్నారు.అమెరికా ప్రయోజనాలే టార్గెట్?ఆర్థిక ఆంక్షల విషయంలో ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ హొస్సేన్ మొహెబ్బీ కూడా అమెరికాను హెచ్చరించారు. ఇరాన్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటే.. అమెరికా కీలక ప్రయోజనాలు, ఇంధన రవాణా మార్గాలపై భారీ దెబ్బలు తప్పవని హెచ్చరించినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. అంతేకాదు.. గల్ఫ్ ప్రాంతం నుంచి చమురు ఎగుమతులను మరింత తగ్గించే అవకాశం ఉందని కూడా ఇరాన్ సంకేతాలు ఇచ్చింది. అదే జరిగితే ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పటికే ఉద్రిక్తతలకు కేంద్రంగా మారిన హర్ముజ్ జలసంధిలో పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారే ప్రమాదం ఉంది.60 మందిపై అమెరికా ఆంక్షలుఇరాన్కు వచ్చే ప్రతి కీలక ఆదాయ మార్గాన్ని అడ్డుకునే లక్ష్యంతో అమెరికా తాజా చర్యలకు దిగింది. అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ 60 మంది వ్యక్తులు, సంస్థలు, నౌకలపై కొత్త ఆంక్షలు విధించినట్లు ప్రకటించారు. ఇరాన్‌తో వ్యాపార సంబంధాలు కొనసాగించే దేశాలు, సంస్థలపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందని బెసెంట్ హెచ్చరించారు. ముఖ్యంగా ఇరాన్ చమురు ఆదాయాన్ని నగదుగా మార్చేందుకు సహకరించే సంస్థలు అమెరికా ఆంక్షల పరిధిలోకి వస్తాయని స్పష్టం చేశారు.అయితే ఇరాన్ చమురు వ్యాపారంలో కీలక పాత్ర పోషిస్తున్న చైనా ఆర్థిక సంస్థలను తాజా ఆంక్షల జాబితాలో చేర్చకపోవడం గమనార్హం. ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలను కొనసాగించే దేశాలు అమెరికా డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి వెలేస్తామని బెసెంట్ ఇప్పటికే హెచ్చరించారు.ఆరు నెలలుగా యుద్ధం.. తగ్గని వేడిఅమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడులు ప్రారంభించి దాదాపు ఆరు నెలలు గడుస్తున్నా.. సంక్షోభానికి శాశ్వత పరిష్కారం కనిపించడం లేదు. ఇటీవలి వారాల్లో పెద్దస్థాయి దాడులు కొంత తగ్గినా.. ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన పరిష్కారం మాత్రం ఇంకా దూరంగానే ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ సాంప్రదాయిక సైనిక సామర్థ్యం దెబ్బతిన్నప్పటికీ.. క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసే సామర్థ్యం మాత్రం ఆ దేశానికి మిగిలి ఉందని విశ్లేషణలు చెబుతున్నాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాలు, చమురు నౌకలు, కీలక ఇంధన మార్గాలపై ముప్పు కొనసాగుతోంది.ఆర్థిక దెబ్బకు.. సైనిక కౌంటర్?ఇరాన్‌ను ఆర్థికంగా ఒంటరి చేసేందుకు అమెరికా ఆంక్షలను మరింత కఠినతరం చేస్తుండగా.. వాటికి తలొగ్గకుండా ఎదురుదాడికి సిద్ధమని ఇరాన్ స్పష్టం చేయడం ఇప్పుడు కీలక పరిణామంగా మారింది. ఒకవైపు **చమురు, డాలర్ లావాదేవీలు, నౌకాయానంపై అమెరికా ఒత్తిడి పెంచుతుండగా.. మరోవైపు హర్ముజ్ జలసంధి, ఇంధన సరఫరా మార్గాలను ఇరాన్ ప్రతీకార చర్యలకు ఉపయోగించే అవకాశం ఆందోళన కలిగిస్తోంది.డొనాల్డ్ ట్రంప్ గనుక ఆర్థిక యుద్ధాన్ని మరింత తీవ్రం చేస్తే.. ఇరాన్ ఎలాంటి కౌంటర్ ఇస్తుందన్నదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఆర్థిక ఆంక్షలతో ఇరాన్‌ను లొంగదీసుకోవాలని అమెరికా చూస్తుంటే.. ‘‘ఆంక్షలు మమ్మల్ని ఆపలేవు.. అవసరమైతే ఎదురుదాడికి దిగుతాం’’ అనే సంకేతాలను టెహ్రాన్ స్పష్టంగా ఇస్తోంది. దీంతో ఇరాన్-అమెరికా ఘర్షణ మరోసారి ఆర్థిక రంగం నుంచి సైనిక చర్యల దిశగా మళ్లుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: డొనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట -
ట్రంప్, నెతన్యాహు వారసులపై ఇరాన్ కన్ను!
ఇరాన్-అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న వేళ సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. మొన్నటిదాకా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హతమార్చేందుకు ఇరాన్ ప్రణాళికలు వేస్తోందన్న చర్చ జరిగింది తెలిసిందే. ఇప్పుడు శత్రుదేశాల వారసులపైనా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన కుమారుల్లో ఒకరిని ఇరాన్ హత్య చేసేందుకు ప్రయత్నించిందని ఆరోపించడం తీవ్ర చర్చనీయాంశమైంది.ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకి ఇద్దరు కొడుకులు. అయితే వాళ్ల భద్రత కోసం ఆయన భారీగా ఖర్చు పెడుతున్నారంటూ ఈ మధ్యకాలంలో రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో ఆయన స్పందిస్తూ.. ఇరాన్ తన కుమారుల్లో ఒకరిని లక్ష్యంగా చేసుకుని హత్యకు ప్రయత్నించిందని చెప్పారు. కుటుంబానికి భద్రత కల్పించడం విలాసం కాదని.. ప్రస్తుత పరిస్థితుల్లో అది అవసరమని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ప్రయత్నం ఎప్పుడు, ఎలా జరిగిందన్న వివరాలను నెతన్యాహు వెల్లడించలేదు. అలాగే కొడుకులు యాయిర్, అవ్నెర్లలో ఎవరిని టార్గెట్ చేశారన్నది కూడా చెప్పలేదు. బారన్‌పై బౌంటీ?మరోవైపు ఇరాన్ ప్రభుత్వ టీవీలో ప్రసారమైన ఓ వీడియో అమెరికాలో కలకలం రేపింది. ‘‘Where to Kill Barron Trump’’ పేరుతో ప్రసారమైన ఈ వీడియోలో డొనాల్డ్ ట్రంప్ 20 ఏళ్ల కుమారుడు బారన్ కదలికలను చూపిస్తూ, అతడి గురించి వివరాలు ప్రస్తావించినట్లు కథనాలు పేర్కొన్నాయి. అతడిని లక్ష్యంగా చేసుకునేందుకు 10 మిలియన్ డాలర్ల (రూ.95 కోట్లకు పైగా) బహుమతిని ప్రకటించినట్లు సమాచారం.బారన్ భద్రతా బలగాల కళ్లుగప్పి ఎలా కదులుతున్నాడన్న అంశాలను కూడా వీడియోలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఎక్స్‌బాక్స్, ఫిఫా గేమ్స్, డిస్కార్డ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో అతడి ఖాతాల వివరాలు తమకు లభించాయని వీడియోలో పేర్కొన్నట్లు సమాచారం.మెలానియాపైనా గతంలో బెదిరింపులుట్రంప్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం ఇరాన్ మీడియాకు ఇదే తొలిసారి కాదు. గతంలో అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని కూడా ఇరాన్ ప్రభుత్వ టీవీ ఓ బెదిరింపు వీడియో ప్రసారం చేసినట్లు నివేదికలు వెల్లడించాయి. అందులో ఆమె ప్రయాణాలు, బహిరంగ ప్రదేశాల్లో కదలికలకు సంబంధించిన వివరాలను ప్రస్తావించినట్లు సమాచారం.మరింత ముదిరిన ఉద్రిక్తతలుఇరాన్పై అమెరికా ‘ఎకనామిక్ డీ-డే’ పేరుతో కొత్త ఆంక్షలు ప్రకటించిన సమయంలోనే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందని ట్రంప్ వ్యాఖ్యానించగా.. అమెరికా చర్యలను ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్, నెతన్యాహు కుటుంబ సభ్యులపై వెలువడిన బెదిరింపులు ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచేలా ఉన్నాయి.ఇదీ చదవండి: H-1B ఉద్యోగులకు కొత్త రూల్ -
ట్రంప్ ఉక్కుపాదం.. ఇరాన్‌పై ‘ఎకనామిక్ డీ-డే’!
వాషింగ్టన్: ఆంక్షలు, సైనిక చర్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై మరో పిడుగు పడింది. మరిన్ని ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఆ దేశానికి వచ్చే ప్రతి ఆదాయ మార్గాన్ని దెబ్బతీయడమే లక్ష్యమని ప్రకటించింది. అంతేకాదు ఆ దేశంతో ఆర్థిక లావాదేవీలు కొనసాగించే ఇతర దేశాలు, సంస్థలకూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తద్వారా ఆ దేశాన్ని ఒంటరిని చేయాలనే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది.ఇరాన్‌కు ఆర్థికంగా సహకరిస్తే అమెరికా ఆంక్షల పరిధిలోకి వస్తారని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ స్పష్టం చేశారు. సంస్థలు, దేశాలపై ఇక ఉపేక్ష ఉండదని బెసెంట్ తేల్చిచెప్పారు. ఇరాన్ తరఫున మనీలాండరింగ్‌కు పాల్పడే ఏ సంస్థ అయినా అమెరికా డాలర్ వ్యవస్థ నుంచి తొలగించబడుతుందని హెచ్చరించారు. ‘‘గడియారం తిరగడం ఇప్పుడే మొదలైంది’’ అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఇరాన్ పాలక వ్యవస్థకు ఆర్థికంగా అండగా నిలిచే వారెవరైనా అమెరికా శక్తిని పరీక్షించేందుకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు అమెరికా-ఇరాన్లలో ఎవరితో సంబంధాలు కొనసాగించాలనే విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు.‘గ్రే ఏరియాల్లో’ ఇక వ్యాపారాలు కుదరవుఇరాన్తో ఆర్థిక సంబంధాలను కొనసాగిస్తూ అమెరికా ఆంక్షలను తప్పించుకునే ప్రయత్నాలను ఇక సహించబోమని బెసెంట్ స్పష్టం చేశారు. ఇరాన్ చమురు విక్రయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని నగదుగా మార్చేందుకు సహకరించే సంస్థలు, లావాదేవీలకు మధ్యవర్తిత్వం వహించే సంస్థలపై కూడా చర్యలు తప్పవన్నారు. ‘‘ఇరాన్‌తో ఎలాంటి ఆర్థిక సంబంధమైనా కొనసాగించడం.. బాధ్యత వహించే వారిని అమెరికా ఆంక్షల పరిధిలోకి తీసుకువస్తుంది’’ అని హెచ్చరించారు.ఐదు కీలక రంగాలే లక్ష్యంఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారాలుగా ఉన్న ఐదు కీలక రంగాలపై అమెరికా ప్రత్యేకంగా దృష్టి సారించింది. డిజిటల్ ఆస్తులు, సాంకేతికత, బంగారం, విమానయానం, నౌకాయానం రంగాలను లక్ష్యంగా చేసుకుని ఆంక్షలు విధించనున్నట్లు అమెరికా ప్రకటించింది. వీటితోపాటు ఇరాన్ చమురు ఆదాయాన్ని అడ్డుకోవడం, ఆ దేశానికి సహకరిస్తున్న సంస్థలు, నౌకలు, వ్యక్తులపై చర్యలు తీసుకోవడం ద్వారా ఆర్థిక మూలాలను తెంచే ప్రయత్నం చేస్తోంది.తాజా చర్యల్లో ప్రపంచంలోని పలు ప్రాంతాలకు చెందిన సుమారు 60 సంస్థలు, నౌకలు, వ్యక్తులను లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా వెల్లడించింది. ఇరాన్‌కు కీలక వాణిజ్య భాగస్వాములుగా ఉన్న చైనా, టర్కీ, యూఏఈ వంటి దేశాలపై కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.దేశాధినేతలకు ట్రంప్ ఫోన్లుఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రపంచ దేశాల అధినేతలకు ఫోన్ చేసి ఇరాన్‌తో ఆర్థిక సంబంధాలను తెంచుకోవాలని కోరుతున్నారని బెసెంట్ తెలిపారు. అమెరికాకు మద్దతు ఇచ్చే దేశాలు భాగస్వామ్య ప్రయోజనాలను పొందుతాయని, ఇరాన్‌తో సంబంధాలు కొనసాగించే దేశాలు ఒంటరితనాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.అయితే ఈ చర్యల వెనుక ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే ప్రమాదం కూడా ఉందని అమెరికా వర్గాలు అంగీకరిస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని, తప్పిదాలను సరిదిద్దుకునేందుకు దేశాలకు అవకాశం ఇస్తున్నామని బెసెంట్ పేర్కొన్నారు.‘ఆపరేషన్ ఎకనామిక్ ఔట్‌కాస్ట్’ఇరాన్‌పై చేపట్టిన తాజా ఆర్థిక ఒత్తిడి కార్యక్రమాన్ని అమెరికా ‘‘ఆపరేషన్ ఎకనామిక్ ఔట్‌కాస్ట్’’Operation Economic Outcastగా పేర్కొంది. దీనిని బెసెంట్ ‘‘ఎకనామిక్ డీ-డే’’గా అభివర్ణించారు. ఇరాన్‌కు వచ్చే అన్ని ఆర్థిక మార్గాలను ఒక్కొక్కటిగా మూసివేసి ఆ దేశాన్ని అంతర్జాతీయంగా ఒంటరిగా చేయడమే లక్ష్యంగా అమెరికా ముందుకు సాగుతున్నట్లు ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.వెనక్కి తగ్గేదేలేఅమెరికా కొత్త ఆంక్షలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. అమెరికా వద్ద ఇరాన్‌ను ఎదుర్కొనేందుకు కొత్త మార్గాలు లేకపోవడంతోనే పాత ఆంక్షలను పదేపదే అమలు చేస్తోందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ విమర్శించారు. అమెరికా ఒత్తిడికి తాము తలొగ్గబోమని స్పష్టం చేశారు.ఇరాన్ ఆర్థిక మంత్రి అలీ మదానీ-జాదే కూడా అమెరికా ప్రకటించిన కొత్త ఆర్థిక ఒత్తిడి కార్యక్రమంపై స్పందించారు. ఆంక్షలు, ఆర్థిక ఒత్తిళ్లు ఇరాన్‌కు కొత్తేమీ కాదని, వాటిని ఎదుర్కొనే సామర్థ్యం తమకు ఉందనే సంకేతాలు ఇచ్చారు.రియాల్ పతనం.. రికార్డు కనిష్ఠానికిమరోవైపు అమెరికా ఆంక్షలతోపాటు యుద్ధ ప్రభావం ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడుతోంది. ఇరాన్ కరెన్సీ రియాల్ డాలర్‌తో పోలిస్తే రికార్డు స్థాయిలో పతనమైంది. ఒక డాలర్‌కు సుమారు 20.2 లక్షల రియాల్స్ వరకు పడిపోయింది.యుద్ధానికి ముందే అధిక ద్రవ్యోల్బణం, ప్రతికూల వృద్ధితో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ సతమతమవుతోంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయి. బియ్యం ధరలు దాదాపు 60 శాతం పెరగగా.. గొడ్డు మాంసం ధరలు 150 శాతానికి పైగా పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి కూడా ఇరాన్ ఆర్థిక వ్యవస్థలో 5 శాతానికి పైగా సంకోచం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.‘ఇరాన్ పూర్తిగా కుప్పకూలుతోంది’ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ ఆర్థిక, సైనిక పరిస్థితిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ‘‘పూర్తిగా కుప్పకూలుతోంది’’ అంటూ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఆ దేశం ఆర్థిక, సైనిక పరంగా ‘డెత్ స్పైరల్’లోకి వెళ్తోందని వ్యాఖ్యానించారు.చమురు.. హర్ముజ్‌పైనే అసలు పోరుఇరాన్పై అమెరికా ఆర్థిక ఒత్తిడి వెనుక ప్రధాన లక్ష్యం చమురు ఆదాయాన్ని అడ్డుకోవడమే. ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిలో పరిస్థితులు ఇప్పటికే తీవ్రంగా దెబ్బతిన్నాయి. అక్కడ నౌకాయానం అంతరాయానికి గురికావడంతో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు, గ్యాస్ ధరలపై ఒత్తిడి పెరిగింది.ఇరాన్ చమురు ఎగుమతులను అడ్డుకోవడం ద్వారా ఆ దేశానికి వచ్చే విదేశీ మారకద్రవ్యాన్ని నిలిపివేయాలని అమెరికా భావిస్తోంది. అయితే ఇప్పటివరకు విధించిన ఆంక్షలు, సముద్ర దిగ్బంధనం ఇరాన్‌పై ఒత్తిడి పెంచినా.. రాజకీయంగా ఆశించిన ఫలితాన్ని పూర్తిగా సాధించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.చర్చల టేబుల్‌పైకి రావాల్సిందే: హెగ్సెత్అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కూడా ఇరాన్ ఆర్థిక ఒత్తిడిని ఎక్కువ కాలం తట్టుకోలేదని వ్యాఖ్యానించారు. చివరకు అణు కార్యక్రమంపై చర్చలకు తిరిగి రావడం తప్ప ఇరాన్‌కు మరో మార్గం ఉండదని అన్నారు. అవసరమైతే అమెరికా సైనిక చర్యలకు కూడా వెనుకాడబోదని హెచ్చరించారు.దీంతో ఇరాన్‌పై అమెరికా వ్యూహం సైనిక చర్యల నుంచి ఆర్థిక యుద్ధం వైపు మరింతగా మళ్లుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. చమురు, డాలర్ లావాదేవీలు, నౌకాయానం, బంగారం, సాంకేతిక రంగాలను లక్ష్యంగా చేసుకున్న తాజా ఆంక్షలు ఎంతవరకు ప్రభావం చూపుతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలు కొనసాగించే దేశాలు అమెరికా ఒత్తిడికి ఎలా స్పందిస్తాయన్నదే తదుపరి కీలక పరిణామంగా మారనుంది.ఇదీ చదవండి: మేం రెడీ.. రెండేళ్లకు సరిపడా!: ఇరాన్ -
అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్.. రెండేళ్ల ప్లాన్ రెడీ!
అమెరికా విధిస్తున్న కొత్త ఆంక్షలను ఎదుర్కొనేందుకు ఇరాన్ ప్రభుత్వం ముందుగానే సిద్ధమైందని.. ఆ దేశ ఆర్థిక మంత్రి అలీ మదానిజాదె వెల్లడించారు. అమెరికా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇరాన్ ప్రజల సంకల్పాన్ని, దేశ అధికారుల నిర్ణయాన్ని మార్చలేకపోయిందని ఆయన పేర్కొన్నారు. అమెరికా చర్యలు మరోసారి విఫలమయ్యే అవకాశముందని, ఇరాన్ మరో ఓటమిని అమెరికాకు ఇవ్వబోతోందని ఆయన వ్యాఖ్యానించారు.రెండేళ్ల ప్రణాళిక సిద్ధం!కొత్త ఆంక్షల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఇరాన్ ప్రభుత్వం రెండేళ్ల ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసిందని మదానిజాదె తెలిపారు. అమెరికా నుంచి ఇలాంటి చర్యలు వస్తాయని తమకు చాలాకాలంగా తెలుసని, అందుకు అనుగుణంగానే ప్రభుత్వం ఇప్పటికే సిద్ధమైందని చెప్పారు. ఆంక్షల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరిగినా, పరిస్థితులను నిర్వహించేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం చేపడుతోందని ఆయన వెల్లడించారు.అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలుఅమెరికా, ఇరాన్ మధ్య సంబంధాలు ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తంగా ఉన్న సమయంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమెరికా ఆంక్షలు ఇరాన్ ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, ఆదాయ మార్గాలపై ప్రభావం చూపించే లక్ష్యంతో ఉంటాయి. అయితే.. ఇరాన్ మాత్రం వాటిని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యూహాలను అమలు చేస్తామని చెబుతోంది. దీంతో రానున్న రోజుల్లో ఇరు దేశాల మధ్య ఆర్థిక, రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. -
‘పాక్’ అసిమ్ మునీర్‌కి ట్రంప్ ఫోన్.. ఇరాన్ వెళ్లిన మునీర్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత వారం పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌తో మాట్లాడినట్లు రాయిటర్స్ వెల్లడించింది. ఇరాన్‌తో చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో, పాకిస్థాన్ తనకున్న ప్రభావాన్ని ఉపయోగించి ఇరాన్‌ను మళ్లీ అమెరికాతో చర్చల టేబుల్ వద్దకు తీసుకురావాలని ట్రంప్ కోరినట్లు పాకిస్థాన్‌కు చెందిన 3 వర్గాలు తెలిపాయి.ట్రంప్ ప్రారంభించిన ఈ ఫోన్ సంభాషణ మునీర్ ఇరాన్ పర్యటనకు కొన్ని రోజుల ముందు జరిగింది. అయితే ఆ సంభాషణలోని పూర్తి వివరాలు బయటకు రాలేదు. వైట్‌హౌస్ కూడా దీనిపై స్పందించలేదు.ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో మునీర్ సోమవారం టెహ్రాన్ చేరుకున్నారు. ఆయనతో పాటు పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ కూడా వెళ్లారు. ప్రాంతీయ శాంతి, స్థిరత్వాన్ని ప్రోత్సహించడమే ఈ పర్యటన లక్ష్యమని పాకిస్థాన్ సైన్యం తెలిపింది.ఇరాన్ గల్ఫ్ నుంచి చమురు ఎగుమతులను అడ్డుకునే చర్యలకు దిగుతామని హెచ్చరిస్తుండగా, ఇరాన్‌కు ఆర్థికంగా సహకరించే దేశాలపై చర్యలు తీసుకుంటామని ట్రంప్ హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్ అమెరికా-ఇరాన్ మధ్య మధ్యవర్తిగా వ్యవహరించే ప్రయత్నాన్ని మళ్లీ ప్రారంభించింది. గతంలోనూ పాకిస్థాన్ ఇరు దేశాల మధ్య చర్చలకు సహకరించి జూన్‌లో తాత్కాలిక శాంతి ఒప్పందం కుదరడంలో పాత్ర పోషించింది. అయితే ఆ ఒప్పందం తర్వాత విఫలమైంది.ఇరాన్-అమెరికా మధ్య చర్చలు మళ్లీ ప్రారంభం కావాలని ట్రంప్ కోరుతున్నారు. అందుకోసం ఇరాన్‌పై ప్రభావం ఉన్న పాకిస్థాన్‌ను రంగంలోకి దించి, అసిమ్ మునీర్ ద్వారా టెహ్రాన్‌ను చర్చలకు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు.ఇదీ చదవండి: ఒక్క పొరపాటు.. అపార్ట్మెంట్లు కూలిపోతాయని దడుసుకున్నారు.. -
హర్ముజ్ విషయంలో మరో బాంబు పేల్చిన ఇరాన్
టెహ్రాన్: ఇరాన్ పార్లమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే ఓడలపై పన్ను విధించేందుకు అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇరాన్‌కు సంబంధించిన మీడియా కథనాలు ఈ కీలక విషయాలు వెల్లడించాయి.ఆ దేశ మీడియా కథనాల ప్రకారం.. "హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించడానికి అనుమతి ఉన్న దేశాల ఓడల నుండి సముద్రయాన సేవలకు రుసుము వసూలు చేయబడుతుంది రుసుములకు బదులుగా సముద్ర సేవలు, భద్రత మరియు బీమా వంటి సౌకర్యాలు కల్పించబడతాయి.పర్యావరణ సేవలు మరియు, ప్రత్యేక పరిస్థితులలో, ఇంధనం కూడా అందించబడతాయి. చెల్లింపు ఇరానియన్ రియాల్స్‌లో లేదా ఇరాన్ ఎంచుకున్న ఏదైనా ఇతర కరెన్సీలో చేయబడుతుంది". అని తెలిపాయి.కాగా ఇటీవల ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరాయి. అమెరికా ఇరాన్‌పై ఆర్థిక యుద్ధం ప్రకటిస్తున్నట్లు తెలిపింది.ఇరాన్‌పై ఆర్థిక యుద్ధంఇరాన్పై ట్రంప్ ప్రభుత్వం సాగిస్తున్న ఆర్థిక యుద్ధం ఇప్పుడు తుది దశలోకి ప్రవేశించిందని అమెరికా ఆర్థిక కార్యదర్శి స్కాట్ బెస్సాంట్ అన్నారు. ఇరాన్ ప్రధాన ఆదాయ వనరులను నిలిపివేయడమే అమెరికా లక్ష్యమని బెస్సాంట్ తెలిపారు. ఇరాన్‌పై ఒత్తిడిని పెంచడానికి అమెరికా తన ప్రభుత్వ సంస్థలన్నింటినీ, అధికారాలన్నింటినీ వినియోగిస్తుందని బెస్సెంట్ చెప్పారు. దీనిని ఒక శత్రువుపై చేపట్టే అతిపెద్ద ఆర్థిక చర్యగా ట్రంప్ గతంలో అభివర్ణించారు మరియు ఇరాన్‌ను ఏకాకిని చేయడంలో పాలు పంచుకోవాలని ఇతర దేశాలకు విజ్ఞప్తి చేశారు.గల్ఫ్ దేశాలకు ఇరాన్ హెచ్చరిక ఈ ఉద్రిక్తతల నడుమ ఇరాన్ సైతం గల్ఫ్ దేశాలకు కీలక హెచ్చరిక జారీ చేసింది. అమెరికా ఆర్థిక కఠిన చర్యలకు మద్దతు ఇచ్చే గల్ఫ్ దేశాలను ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్‌పై ఆర్థిక ఆంక్షలు విధించడంలో అమెరికాకు మద్దతు ఇచ్చే ఏ దేశాన్నైనా శత్రువుగా పరిగణిస్తామని ఇరాన్ కొత్త జాతీయ భద్రతా అధిపతి మొహ్సెన్ రెజాయీ అన్నారు.కాగా ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య హర్ముజ్ అంశంలో పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఈ కీలకమైన జలసంధిపై పట్టు సాధించేందుకు అమెరికా యత్నిస్తుంది. ఇప్పుడు ఇరాన్ దానికి టోల్ టాక్స్ వసూలు చేస్తుండడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
హర్ముజ్‌పై పట్టు కోసం ఇరాన్ కొత్త ఎత్తుగడ
హర్ముజ్.. ప్రపంచ చమురు సరఫరాకు గుండెకాయలాంటి ఈ కీలక సముద్ర మార్గంపై ఆధిపత్య పోరు మరింత తీవ్రంగా మారుతోంది. జలసంధిపై ఇరాన్ ప్రభావం, అమెరికా ఒత్తిడి మధ్య నౌకల రాకపోకలపై ఉత్కంఠ కొనసాగుతోంది. దీనికి తోడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, తీసుకుంటున్న చర్యలు కూడా ఈ పోరుకు మరింత ఆజ్యం పోశాయి. ఈ నేపథ్యంలో జలసంధిపై తన పట్టు సడలుతోందనే సంకేతాల మధ్య.. ఇరాన్ కొత్త వ్యూహాలను అమలు చేయాలని నిర్ణయించింది.గత కొంతకాలంగా హర్ముజ్ జలసంధిలో పరిస్థితులు మారిపోయాయి. ఇరాన్ సూచించే మార్గం కంటే.. ఒమన్ తీరానికి సమీపంలోని ప్రత్యామ్నాయ మార్గాన్నే అంతర్జాతీయ నౌకలు ఎక్కువగా ఎంచుకుంటున్నాయి. షిప్ ట్రాకింగ్ సంస్థల సమాచారం ప్రకారం.. ఇటీవల హర్ముజ్ దాటిన నౌకల్లో 80 శాతానికి పైగా ఒమన్ మార్గంలో ప్రయాణించినట్లు తెలుస్తోంది. అమెరికా నౌకాదళ భద్రతతో ఈ మార్గంలో రాకపోకలు పెరిగినట్లు విశ్లేషణలు చెబుతున్నాయి. దీంతో హర్ముజ్‌పై ఇరాన్ నియంత్రణ సడలుతోందనే చర్చ మొదలైంది. సరిగ్గా ఇదే సమయంలో.. నౌకల నుంచి సేవల పేరుతో రుసుములు వసూలు చేసే ప్రతిపాదనకు ఇరాన్ పార్లమెంట్ కమిషన్ ఆమోదం తెలిపింది.టెహ్రాన్ కొత్త ప్లాన్ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రత, విదేశాంగ విధాన కమిషన్ ‘హర్ముజ్ జలసంధి భద్రత, అభివృద్ధి కోసం వ్యూహాత్మక చర్యలు’ ప్రణాళికలోని ఆర్టికల్-3కు ఆమోదం తెలిపింది. దీని ప్రకారం హర్ముజ్ గుండా ప్రయాణించే నౌకలకు ఇరాన్ అందించే సముద్ర భద్రత, పర్యావరణ సేవలు, ప్రత్యేక పరిస్థితుల్లో ఇంధన సరఫరా, బీమా తదితర సేవలకు రుసుములు వసూలు చేయనుంది. ఈ ఫీజులను హర్ముజ్ గుండా ప్రయాణించేందుకు అనుమతి పొందిన దేశాల నౌకల నుంచే వసూలు చేస్తామని ఇరాన్ తెలిపింది. చెల్లింపులు ఇరాన్ కరెన్సీ రియాల్ లేదంటే టెహ్రాన్ నిర్ణయించే ఇతర కరెన్సీలో ఉండవచ్చని వెల్లడించింది.అమెరికా మద్దతుదారులకూ వార్నింగ్ఓవైపు ట్రంప్ ఇరాన్ మద్దతుదారులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆంక్షల మోతకు సిద్ధపడాలంటూ చెబుతున్నారు. అయితే ఇటు అమెరికా ఆంక్షలపై ఇరాన్ మరింత ఘాటుగా స్పందిస్తోంది. ఆర్థిక ఒత్తిడి కొనసాగితే హర్ముజ్ నుంచే కాదు.. పర్షియన్ గల్ఫ్ నుంచి కూడా ఒక్క చుక్క చమురు బయటకు వెళ్లదని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయ్ హెచ్చరించారు. అమెరికా చర్యలకు మద్దతిచ్చే దేశాలను కూడా ఇరాన్ వ్యతిరేక శక్తులుగా పరిగణిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. చమురు రవాణా విషయంలో ఎలాంటి ఒత్తిడినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని టెహ్రాన్ సంకేతాలు ఇస్తోంది.నౌకలకు ఇరాన్ హెచ్చరికలుహర్ముజ్ నిబంధనలు ఉల్లంఘించే నౌకలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇరాన్ పర్షియన్ గల్ఫ్ స్ట్రెయిట్ అథారిటీ హెచ్చరించింది. నిబంధనలు అతిక్రమించే నౌకలకు జరిమానాలు, భవిష్యత్ ప్రయాణాలపై ఆంక్షలు, అవసరమైతే స్వాధీనం వంటి చర్యలు ఉంటాయని తెలిపింది. ఉల్లంఘన చేసే నౌకలకు సహకరించే షిప్పింగ్ సంస్థలు, సరుకు యజమానులను కూడా సమస్యాత్మక జాబితాలో చేర్చుతామని పేర్కొంది.ఇంకా రూట్లోనే..ఇరాన్ బెదిరింపులు పెద్దగా పని చేయడం లేదా? అనే చర్చా నడుస్తోంది. మరోవైపు హర్ముజ్‌లో తన ప్రభావాన్ని పెంచుకునేందుకు అమెరికా కూడా ప్రయత్నిస్తోంది. ఒమన్ మార్గంలో ప్రయాణించే నౌకలకు రక్షణ కల్పిస్తున్నామని, ప్రపంచ చమురు సరఫరా నిరాటంకంగా కొనసాగడమే తమ లక్ష్యమని వాషింగ్టన్ చెబుతోంది. గల్ఫ్ దేశాల నుంచి బయలుదేరే భారీ క్రూడాయిల్ ట్యాంకర్లు హర్ముజ్‌పైనే ఎక్కువగా ఆధారపడతాయి. అయితే భద్రతా కారణాలతో కొన్ని నౌకలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం ఇరాన్‌కు సవాల్‌గా మారింది.ప్రపంచ చమురు మార్కెట్‌పై ప్రభావం?ప్రపంచ చమురు రవాణాలో హర్ముజ్ జలసంధికి అత్యంత కీలక స్థానం ఉంది. ఈ మార్గంలో అంతరాయం ఏర్పడితే చమురు ధరలు, అంతర్జాతీయ వాణిజ్యం, ఇంధన సరఫరాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. 80 శాతం నౌకలు ప్రత్యామ్నాయ మార్గం పట్టినా.. హర్ముజ్‌పై పట్టు కోల్పోకుండా ఉండేందుకు ఇరాన్ కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. రుసుముల ప్రతిపాదన నుంచి కఠిన హెచ్చరికల వరకు.. చమురు మార్గంపై తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు టెహ్రాన్ ప్రయత్నిస్తోంది.ఇదీ చదవండి: శత్రువులు చేతులు కలుపుతారా?.. సర్కత్రా ఉత్కంఠ! -
మిడిల్ఈస్ట్లో బిగ్ ట్విస్ట్.. ఇరాన్ నిర్ణయంపై ఉత్కంఠ
దశాబ్దాలుగా సాగుతున్న వైరం.. ఎప్పుడూ ప్రత్యర్థులుగా కనిపించిన దేశాలు.. ఇప్పుడు ఒకే వేదికపైకి వస్తాయా? మిడిల్ఈస్ట్ రాజకీయాల్లో ఇదే ఇప్పుడు అతిపెద్ద చర్చ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిళ్లు, ఇరాన్‌పై పెరుగుతున్న ఆంక్షలు, ప్రాంతీయ భద్రతా ఆందోళనల మధ్య అనూహ్య పరిణామం తెరపైకి వచ్చింది. సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీ ఏర్పాటు చేసిన మక్కా రక్షణ కూటమిలో చేరాలని ఇరాన్‌కు ఆహ్వానం అందినట్లు వచ్చిన వార్తలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇరాన్-సౌదీ అరేబియా.. ఈ రెండు పేర్లు వినగానే గుర్తొచ్చేది ఆధిపత్య పోరు. గల్ఫ్ ప్రాంతంలో ప్రభావం కోసం ఇరు దేశాల మధ్య ఏళ్లుగా సాగుతున్న పోటీ. యెమెన్‌లో హౌతీల అంశం నుంచి సిరియా, లెబనాన్ వరకు పలు పరిణామాల్లో ఈ విభేదాలు బయటపడ్డాయి. అలాంటి రెండు దేశాలు భద్రతా వేదికపై దగ్గరవుతాయా? అనే ప్రశ్న ఇప్పుడు మిడిల్ఈస్ట్లో కొత్త చర్చకు తెరతీసింది. ఒకప్పుడు ఒకరిపై ఒకరు అనుమానంతో చూసుకున్న దేశాలు.. ఇప్పుడు ఒకే భద్రతా గొడుగు కిందకు వస్తాయా? అనేది ఆసక్తికరంగా మారింది. అమెరికా ప్రభావం, ప్రాంతీయ భద్రతా పరిణామాలు, మారుతున్న ప్రపంచ రాజకీయాల నేపథ్యంలో ఈ పరిణామం మిడిల్ఈస్ట్ భవిష్యత్ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశముంది.మక్కా కూటమిలోకి ఇరాన్?సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీ ఆగస్టు 7న మక్కా సంయుక్త రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం.. ఈ మూడు దేశాల్లో ఏదో ఒక దేశంపై సాయుధ దాడి జరిగితే, అది మిగిలిన దేశాలపై జరిగిన దాడిగానే పరిగణిస్తారు. రక్షణ సహకారం, వ్యూహాత్మక సమన్వయం, సంయుక్త భద్రతా చర్యలు ఈ ఒప్పందంలో భాగంగా ఉంటాయని ప్రకటించారు. అయితే ఈ కూటమి ఏర్పడిన కొద్ది రోజులకే మరో ఆసక్తికర పరిణామం తెరపైకి వచ్చింది. మక్కా ఒప్పందంలో చేరాలని ఇరాన్‌కు ఆహ్వానం అందినట్లు ‘అల్ మయదీన్’ నివేదించింది. ఇరాన్ పార్లమెంట్‌కు అనుబంధంగా ఉన్న ఖానే మెల్లత్ వార్తా సంస్థ అధిపతి మెహదీ రహీమి ఈ విషయాన్ని వెల్లడించినట్లు పేర్కొంది. ఆ ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని ఆయన చెప్పినట్లు సమాచారం. అయితే ఇరాన్ ప్రభుత్వం గానీ, సౌదీ, పాకిస్థాన్, టర్కీ ప్రభుత్వాలు గానీ దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు.ట్రంప్ ప్రభావమేనా?ఈ పరిణామాల వెనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాల ప్రభావం ఉందా? అన్న చర్చ కూడా మొదలైంది. ఇరాన్‌పై అమెరికా ఒత్తిడి పెరగడం, ఆంక్షల భయం, గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడంతో ప్రాంతీయ దేశాలు తమ భద్రతా వ్యూహాలను పునరాలోచిస్తున్నాయి. ఇప్పటివరకు మిడిల్ఈస్ట్లో భద్రతకు అమెరికా కీలక శక్తిగా ఉండేది. అయితే ఇటీవలి పరిణామాల్లో ప్రాంతీయ దేశాలే తమ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలనే ఆలోచనలోకి వచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మక్కా కూటమి కూడా ఇదే దిశలో మరో అడుగుగా భావిస్తున్నారు. శత్రువుల మధ్య కొత్త స్నేహమా?ఇరాన్ నిజంగా మక్కా కూటమిలో చేరితే అది సాధారణ పరిణామం కాదు. ఎందుకంటే ఈ కూటమిలో ప్రధాన దేశమైన సౌదీ అరేబియాతో ఇరాన్‌కు గతంలో తీవ్ర విభేదాలున్నాయి. 2016లో తెగిపోయిన దౌత్య సంబంధాలు 2023లో చైనా మధ్యవర్తిత్వంతో తిరిగి ప్రారంభమైనప్పటికీ.. అనుమానాలు పూర్తిగా తొలగిపోలేదు.యెమెన్‌లో ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు, సౌదీ ప్రయోజనాల మధ్య ఉన్న విభేదాలు కూడా ఈ సంబంధాలకు సవాలుగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఒకే రక్షణ వేదికపైకి రావడం జరిగితే.. అది మిడిల్ఈస్ట్ రాజకీయాల్లో భారీ మార్పుగా మారే అవకాశం ఉంది.ఇరాన్ లెక్కలు ఏంటి?ఇరాన్ మాత్రం ఈ పరిణామాన్ని పూర్తిగా వ్యతిరేకించలేదు. ప్రాంతీయ దేశాలు తమ స్వంత భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. మరోవైపు ట్రంప్ ప్రభుత్వం నుంచి వస్తున్న ఒత్తిళ్ల నేపథ్యంలో తనకు అనుకూలమైన కొత్త వ్యూహాలను రూపొందించుకోవాల్సిన పరిస్థితిలో టెహ్రాన్ ఉంది.అయితే.. మక్కా కూటమిలో చేరడం ద్వారా ఇరాన్‌కు లాభమా? లేదంటే తన పాత మిత్ర, ప్రత్యర్థి సమీకరణాలను మార్చుకోవాల్సి వస్తుందా? అన్నది కీలక ప్రశ్న.ఇరాన్ తీసుకునే నిర్ణయంపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఒకప్పుడు ప్రత్యర్థులుగా ఉన్న దేశాలు నిజంగా చేతులు కలిపితే.. అది ట్రంప్ హయాంలో మిడిల్ఈస్ట్లో అతిపెద్ద దౌత్య మలుపుగా నిలిచే అవకాశం ఉంది.ఇదీ చదవండి: అమెరికాలో కాల్పులు.. భారతీయుడి దుర్మరణం -
‘న్యూ యూఎస్ టెరిటరీ’.. ట్రంప్ పోస్టుతో ముదిరిన మంటలు!
వాషింగ్టన్: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి హార్ముజ్ జలసంధి వద్దకు చేరాయి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ఈ జలమార్గాన్ని ‘NEW US Territory’గా పేర్కొంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్‌లో మరోసారి పోస్టు చేయడం అంతర్జాతీయంగా కలకలం రేపింది. ఆగస్టు 18న ఇదే చిత్రాన్ని తొలిసారి షేర్ చేసిన ట్రంప్.. తాజాగా మళ్లీ దాన్ని పంచుకోవడం ద్వారా హార్ముజ్‌పై తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదన్న సంకేతం ఇచ్చారు.అంతకుముందు ఆగస్టు 14న లాంగ్ ఐలాండ్‌లోని పోలీస్ అకాడమీలో మాట్లాడిన ట్రంప్.. ‘త్వరలోనే హార్ముజ్ జలసంధిని అమెరికా భూభాగంగా ప్రకటిస్తాను’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే సోషల్ మీడియాలో పోస్టు చేయడం లేదా అధ్యక్షుడి ప్రకటనతోనే హార్ముజ్‌పై అమెరికాకు చట్టపరమైన సార్వభౌమాధికారం ఏర్పడదు. ట్రంప్ వ్యాఖ్యలను ప్రస్తుతానికి రాజకీయ, వ్యూహాత్మక ఒత్తిడిలో భాగంగానే చూడాల్సి ఉంటుంది.ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయీ.. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవలేని అమెరికా అసమర్థతకు, అదే జలసంధిని సొంతం చేసుకుంటామన్న వాదనకు మధ్య ఉన్న అంతరం.. వాషింగ్టన్ నుంచి హార్ముజ్ వరకు ఉన్న 7,000 మైళ్ల దూరం కంటే ఎక్కువగా ఉందంటూ ఎద్దేవా చేశారు. పర్షియన్ గల్ఫ్‌లో అమెరికా అనంతర వ్యవస్థకు స్వాగతం అంటూ అమెరికాకు ఘాటు కౌంటర్ ఇచ్చారు.🔴President Trump just posted a map labeling the Strait of Hormuz as “NEW U.S. Territory.” The critical waterway is clearly circled and claimed. This follows his repeated statements that America now controls the Strait. Iran’s ability to threaten global oil shipping is being… pic.twitter.com/4TbQoFMNWC— Commentary Donald J. Trump Posts From Truth Social (@TrumpDailyPosts) August 22, 2026ఇదే సమయంలో ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ఇరాన్‌పై ఇప్పటివరకు లేనంత కఠినమైన ఆంక్షలు విధించనున్నట్లు అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ప్రకటించారు. ముఖ్యంగా ఇరాన్ చమురుకు ప్రధాన కొనుగోలుదారుగా ఉన్న చైనాపై కూడా వాషింగ్టన్ ఒత్తిడి పెంచుతోంది. ఇరాన్ చమురు ఎగుమతులకు సహకరించే దేశాలు, సంస్థలపై ద్వితీయ ఆంక్షలు విధించే అవకాశాన్ని అమెరికా పరిశీలిస్తోంది. ఈ క్రమంలో అమెరికా చర్యలను ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వాషింగ్టన్ విధించబోయే ద్వితీయ ఆంక్షలకు అంతర్జాతీయ చట్టంలో ఎలాంటి ఆధారం లేదని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ స్పష్టం చేశారు. అంతేకాదు, అమెరికా ఆర్థిక యుద్ధంలో తమతో చుట్టుపక్కల దేశాలు చేరితే వాటిని శత్రువులుగా పరిగణిస్తామని రెజాయీ హెచ్చరించారు.ఇది కూడా చదవండి: ఎల్‌నినో సెగ.. ప్రపంచ వాణిజ్య మార్గాలకు గండం!ప్రస్తుతం అసలు సమస్య అంతా హార్ముజ్ జలసంధి చుట్టూనే తిరుగుతోంది. ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన ఈ మార్గంలో చమురు, ఎల్ఎన్జీ రవాణా భారీగా దెబ్బతింది. కొద్దిమంది వాణిజ్య నౌకలు మాత్రమే జలసంధిని దాటుతుండగా.. పెద్ద సంఖ్యలో క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లు, ఎల్ఎన్జీ నౌకలు రాకపోకలకు దూరంగా ఉంటున్నాయి. ఇరాక్ విజ్ఞప్తి మేరకు కొన్ని ఇరాకీ చమురు నౌకలకు మాత్రం హార్ముజ్ గుండా వెళ్లేందుకు ఇరాన్ అనుమతించినట్లు సమాచారం. హార్ముజ్ సంక్షోభం ఎక్కువకాలం కొనసాగితే దాని ప్రభావం అమెరికా, ఇరాన్లకే పరిమితం కాకపోవచ్చు. చమురు సరఫరా తగ్గితే అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. చమురు దిగుమతులపై ఆధారపడే భారత్ వంటి దేశాలపై కూడా దీని ప్రభావం పడే అవకాశముంది. ఇంధన ధరలు పెరిగితే రవాణా ఖర్చులు, పరిశ్రమల వ్యయాలు, ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంటుంది. -
పర్షియన్ గల్ఫ్‌లో ‘మంటలు’.. యూఎస్ వైఖరిపై ధ్వజం
టెహ్రాన్: అమెరికా తన వైఖరిని మార్చుకుని, ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ‘హార్ముజ్ జలసంధి’ మూసివేసే ఉంటుందని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహసేన్ రెజాయ్ స్పష్టం చేశారు. అమెరికా చేస్తున్న వాదనల్లో వాస్తవం లేదని, ఆ దేశం తన ప్రవర్తనను సరిదిద్దుకునేంత వరకు ఈ జలమార్గాన్ని తెరిచే ప్రసక్తే లేదని ఐఆర్ఐబీ ఇంటర్వ్యూలో ఆయన హెచ్చరించారు.వాషింగ్టన్ ప్రత్యక్ష సైనిక దాడులకు స్వస్తి చెప్పి, ఆర్థిక ఆంక్షల వైపు మళ్లిందని రెజాయ్ పేర్కొన్నారు. ఇరాన్‌పై ఆర్థిక దిగ్బంధం విధిస్తే లొంగిపోతుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు భరోసా ఇచ్చారని ఆయన విమర్శించారు. అయితే ఆంక్షలను అధిగమించి చమురు ఎగుమతులు కొనసాగించే మార్గాలను తాము ఎప్పటినుంచో నేర్చుకున్నామని తెలిపారు. పర్షియన్ గల్ఫ్ తీరంలో 50 శాతానికి పైగా భూభాగం ఇరాన్‌దేనని, హార్ముజ్ నిర్వహణ బాధ్యత తమదేనని తేల్చిచెప్పారు.ఈ జలసంధి అమెరికా భూభాగమంటూ ట్రంప్ చేసిన ప్రకటనలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఆర్థిక దిగ్బంధం ముగింపు, స్తంభింపజేసిన నిధుల విడుదల, చమురు ఆంక్షల ఎత్తివేతతో కూడిన 14 అంశాల ఒప్పందాన్ని అమెరికా నెరవేరిస్తేనే జలసంధిని తెరుస్తామని పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ గలీబాఫ్ స్పష్టం చేశారు. మరోవైపు, యూఎస్ నౌకాదళ భద్రతతో చమురు రవాణా నిరాటంకంగా సాగుతోందని అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్ రైట్ పేర్కొన్నారు. అంతర్జాతీయ చమురు సరఫరాలో అత్యంత కీలకమైన హార్ముజ్ సంక్షోభం ప్రస్తుతం ప్రపంచ ఇంధన మార్కెట్లలో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.ఇది కూడా చదవండి: బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ సీక్రెట్ హిస్టరీ ఇదే! -
ట్రంప్ కొత్త అస్త్రం.. ప్రతీకారం భీకరంగా ఉంటుందన్న ఇరాన్
అమెరికా–ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. ఇరాన్‌పై చరిత్రలోనే అత్యంత కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించగా.. దానికి ఇరాన్ తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించింది. కొత్త ఆంక్షలు, బెదిరింపులకు సమాధానం విధ్వంసకరంగా ఉంటుందని టెహ్రాన్ వార్నింగ్ ఇచ్చింది.‘అమెరికా బెదిరింపులకు గట్టి సమాధానం’.. అమెరికా నుంచి ఎదురయ్యే ఎలాంటి కొత్త బెదిరింపులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని ఇరాన్ సాయుధ దళాలు ప్రకటించాయి. ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ అలీ అబ్దొల్లాహీ మాట్లాడుతూ.. “భూమి, సముద్రం, గగనం, వాయు రక్షణ, సైబర్ రంగాల్లో మా బలగాలు పూర్తి అప్రమత్తంగా ఉన్నాయి. శత్రువుల కొత్త బెదిరింపులకు శిక్షాత్మక, వినాశకర ప్రతిస్పందన ఇస్తాం” అని హెచ్చరించారు.ఆంక్షల యుద్ధం విఫలమవుతుంది: అరాఘ్చీఅమెరికా ప్రతిపాదిస్తున్న ఆర్థిక ఆంక్షలు విఫలమవుతాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పష్టం చేశారు. ఆర్థిక ఒత్తిళ్లతో ఇరాన్‌ను లొంగదీసుకోవాలన్న ప్రయత్నాలు ఫలించవని అన్నారు. దౌత్య మార్గమే సమస్యలకు పరిష్కారమని పేర్కొంటూనే.. తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు అన్ని మార్గాల్లో సిద్ధంగా ఉన్నామని తెలిపారు.ట్రంప్ లక్ష్యం.. ఇరాన్‌పై గరిష్ఠ ఒత్తిడిఇరాన్కు సహకరించే ఏ దేశంపైనైనా ఆర్థిక చర్యలు తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ సోమవారం కొత్త ఆంక్షల వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. అయితే ట్రంప్ మాత్రం.. “ఇరాన్ ఒక ఒప్పందాన్ని కోరుకుంటోంది. కానీ సరైన ఒప్పందానికి ఇంకా సిద్ధంగా లేదు” అని వ్యాఖ్యానించారు. అంతేకాదు, హర్ముజ్ జలసంధిని ప్రస్తుతం “అమెరికా భూభాగంగా చూస్తున్నాను” అంటూ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి కారణమయ్యాయి.హర్ముజ్.. ఇరాన్ చేతిలో కీలక ఆయుధంప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన మార్గం హార్ముజ్ జలసంధి. ఈ మార్గం ద్వారా రోజూ భారీ స్థాయిలో చమురు రవాణా జరుగుతుంది. ఇరాన్ వద్ద ఉన్న క్షిపణులు, డ్రోన్ల సామర్థ్యంతో ఈ ప్రాంతంలో నౌకా రవాణాకు అంతరాయం కలిగించే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే హర్ముజ్ ప్రాంతంలో జరిగిన ఘటనల్లో పలువురు నావికులు ప్రాణాలు కోల్పోయారు.చమురు మార్కెట్లపై ఆందోళనఅమెరికా కొత్త ఆంక్షల హెచ్చరికలతో అంతర్జాతీయ చమురు ధరలు పెరిగాయి. ఇరాన్ చమురు సరఫరాపై ఆంక్షలు మరింత కఠినమైతే ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇరాన్ నుంచి ఎగుమతి అయ్యే చమురులో ఎక్కువ భాగాన్ని చైనా కొనుగోలు చేస్తోంది. దీంతో అమెరికా ఒత్తిడి ప్రధానంగా బీజింగ్పైనా పడే అవకాశముంది. చైనా మాత్రం.. “ఆంక్షలు, ఒత్తిళ్లు సమస్యను పరిష్కరించవు. చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యం” అని స్పష్టం చేసింది.చర్చలకు ఒమన్ ప్రయత్నాలుహర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలను సాధారణ స్థితికి తీసుకురావడానికి ఒమన్ మధ్యవర్తిత్వం చేస్తోంది. ఒమన్, ఇరాన్ విదేశాంగ మంత్రులు ఫోన్లో చర్చించి.. నౌకా రవాణాపై కొత్త ఒప్పందం కోసం చర్చలు పునఃప్రారంభించే అంశాన్ని పరిశీలించారు.యెమెన్ హౌతీలతో మరో సమస్యఇదే సమయంలో యెమెన్‌కు చెందిన హౌతీ గ్రూప్ బాబ్ అల్ మందెబ్ జలసంధిలో సౌదీ నౌకలపై దిగ్బంధం ప్రకటించడంతో ఎర్ర సముద్ర రవాణాపైనా ప్రభావం పడింది. సౌదీ అరేబియాలోని యన్బు పోర్టుకు వచ్చే ట్యాంకర్ రాకపోకలు గణనీయంగా తగ్గినట్లు సమాచారం.అమెరికా ఆర్థిక ఆంక్షల బెదిరింపులు.. ఇరాన్ ప్రతీకార హెచ్చరికలు.. హర్ముజ్‌పై ఆధిపత్య పోరు.. ఇవన్నీ పశ్చిమాసియా సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తున్నాయి. దౌత్య చర్చలు కొనసాగుతున్నప్పటికీ, ఇరు దేశాల నుంచి వస్తున్న కఠిన ప్రకటనలు కొత్త ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి.ఇదీ చదవండి: ప్లీజ్.. ప్లీజ్.. మా చక్కెర కొనరా? -
అమెరికా ఆంక్షలకు తగ్గేదేలే అంటున్న టెహ్రాన్
-
ఇరాన్‌పై ట్రంప్ కొత్త గేమ్.. మద్దతుదారులకు మూడినట్లే!
ఇరాన్‌ను ఒంటరి చేసేందుకు అమెరికా ఇక నేరుగా రంగంలోకి దిగింది! టెహ్రాన్‌ను మాత్రమే కాదు.. దానికి అండగా నిలిచే దేశాలు, సంస్థలను కూడా టార్గెట్ చేస్తానంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన హెచ్చరిక చేశారు. ఇరాన్‌కు డబ్బు అందించినా.. వ్యాపారం చేసినా.. చమురు తరలింపులో సహకరించినా భారీ ఆర్థిక మూల్యం చెల్లించాల్సిందే అని తేల్చిచెప్పారు. ఇరాన్‌ను అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నుంచి పూర్తిగా వేరుచేసేలా ఇప్పటివరకు ఎన్నడూ లేనంత కఠినమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. దీంతో టెహ్రాన్‌కు అండగా నిలిచే దేశాలపై కూడా అమెరికా ఆంక్షల పిడుగు పడబోతోందా? అన్న ఉత్కంఠ మొదలైంది.ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో చేసిన పోస్టులో.. ఇరాన్‌కు ఆర్థిక సంస్థలు, వ్యాపారాలు, విమానాశ్రయాలు లేదా ప్రభుత్వ సంస్థలు ఎలాంటి సహాయం చేసినా ఆయా దేశాలు “భారీ ఆర్థిక పరిణామాలు” ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. అయితే ఏ దేశాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. ఇరాన్‌కు సహాయం చేసే మార్గాలపై కూడా ట్రంప్ ప్రత్యేకంగా హెచ్చరించారు. చమురు అక్రమ రవాణా, ఆర్థిక స్వాప్ ఒప్పందాలు, నగదు బదిలీలు, ఎక్స్ఛేంజ్ హౌస్‌లు, నౌకల రిజిస్ట్రీలు, ఫ్రంట్ కంపెనీల ద్వారా టెహ్రాన్‌కు మద్దతు ఇచ్చినా అమెరికా చర్యలు తప్పవన్న సంకేతాలు ఇచ్చారు. అంటే ఇరాన్‌తో నేరుగా వ్యాపారం చేసే సంస్థలతో పాటు పరోక్షంగా ఆ దేశానికి ఆర్థిక చేయూత అందించే వ్యవస్థలపైనా అమెరికా కన్నేయనుంది.ఇరాన్‌తో ఒప్పందం చేసుకునేందుకు తన ప్రభుత్వం అనేక అవకాశాలు ఇచ్చిందని ట్రంప్ పేర్కొన్నారు. కానీ టెహ్రాన్ వాటిని ఉపయోగించుకోలేదని ఆరోపించారు. ఇప్పుడు ఇరాన్‌పై అపూర్వ స్థాయిలో ఆర్థిక యుద్ధం, అంతర్జాతీయ ఒంటరితనం ప్రారంభించబోతున్నామని ప్రకటించారు. అమెరికా మిత్రదేశాలు కూడా ఈ చర్యలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇరాన్ సైనిక సామర్థ్యం ఇప్పటికే తీవ్రంగా దెబ్బతిన్నదని ట్రంప్ అన్నారు. ఆ దేశ నౌకాదళం ధ్వంసమైందని, వైమానిక దళం బలహీనపడిందని, సైనిక కర్మాగారాలు భారీగా దెబ్బతిన్నాయని ఆరోపించారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్ర ఒత్తిడిలో ఉందని పేర్కొన్న ఆయన.. కొత్త చర్యలతో టెహ్రాన్ అంతర్జాతీయంగా కార్యకలాపాలు నిర్వహించే సామర్థ్యం మరింత తగ్గిపోతుందని అన్నారు.ఇరాన్ అణు కార్యక్రమంపైనా ట్రంప్ మరోసారి కఠిన వైఖరి వ్యక్తం చేశారు. “ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని కలిగి ఉండదు” అంటూ తన పరిపాలన వైఖరిని పునరుద్ఘాటించారు. ట్రంప్ తాజా హెచ్చరికతో ఇప్పుడు అసలు ప్రశ్న ఇరాన్ గురించే కాదు.. ఇరాన్‌కు అండగా నిలిచే దేశాల సంగతేంటి? అన్నదే. టెహ్రాన్‌తో వాణిజ్య, ఆర్థిక సంబంధాలు కొనసాగించే దేశాలపై అమెరికా చర్యలు మొదలుపెడితే అంతర్జాతీయ వాణిజ్య సమీకరణాలు కూడా మారే అవకాశం ఉంది. దీంతో ఇరాన్‌ను ఒంటరి చేయాలన్న ట్రంప్ వ్యూహం.. ఇప్పుడు ఆ దేశానికి మద్దతిచ్చే వారిని కూడా చుట్టుముట్టే స్థాయికి చేరిందా? అన్న చర్చ మొదలైంది. -
ఇరాన్ యుద్ధం తెచ్చిన విద్యా సంక్షోభం
యుద్ధం జరిగేది ఎక్కడో సరిహద్దుల్లో కావచ్చు.. కానీ దాని ప్రభావం మాత్రం వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న నిరుపేద కుటుంబాల జీవితాలను అతలాకుతలం చేస్తోంది. పశ్చిమాసియాలో ఇరాన్ యుద్ధం కారణంగా ఎగిసిపడుతున్న ఇంధన ధరలు, నిత్యావసరాల ఖర్చులు పేద దేశాల్లోని పాఠశాల విద్యపై భారీ పిడుగుపాటులా పరిణమించాయి. ఫలితంగా తల్లిదండ్రులు తమ చిన్నారుల చేతుల్లోని పుస్తకాలను లాగేసి, కుటుంబ ఆర్థిక అవసరాలు తీరేందుకు వారిని ప్రమాదకరమైన పనుల్లోకి నెడుతున్నారు.వేల మైళ్ల దూరంలో యుద్ధ సెగలుఇరాన్ కేంద్రంగా సాగుతున్న ఉద్రిక్తతలు కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా పెను మార్పులకు దారితీస్తున్నాయి. ముడి చమురు, రవాణా ఛార్జీల పెరుగుదల వల్ల పేద దేశాల్లో సామాన్య కుటుంబాల బడ్జెట్ పూర్తిగా తలకిందులైంది. బతుకుదెరువు భారంగా మారడంతో, సరిహద్దు రేఖకు వేల కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్న అట్టడుగు వర్గాల పిల్లల చదువులు అర్ధాంతరంగా ఆగిపోయే ప్రమాదం ఏర్పడింది.బోటు ప్రయాణం భారం.. తప్పని బాల కార్మికులుకంబోడియాలోని టోన్లే సాప్ సరస్సు సరిహద్దుల్లో నివసించే 13 ఏళ్ల సౌ శ్రేయ్నిచ్ పరిస్థితి ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. భవిష్యత్తులో ఉపాధ్యాయురాలు కావాలని కలలు కంటున్న ఈ బాలిక చదువు ఇప్పటికే ఎంతో ఆలస్యమైంది. చేపల వేటపై ఆధారపడే ఆమె కుటుంబం, డీజిల్ ధరలు పెరగడంతో వేట సాగించలేకపోతోంది. దీంతో కుటుంబ పోషణ కోసం చదువును మధ్యలోనే ఆపేసి, తల్లిదండ్రులతో కలిసి శ్రమించాల్సిన దుస్థితి నెలకొంది.యూనిసెఫ్ హెచ్చరిక: పేదరికంలోకి మరో 2.34 కోట్ల మందిఐక్యరాజ్యసమితి బాలల నిధి (యూనిసెప్) నివేదిక ప్రకారం ఈ సంక్షోభ ప్రభావం ఇలాగే కొనసాగితే ఈ ఏడాది చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా అదనంగా 2.34 కోట్ల మంది పిల్లలు తీవ్ర పేదరికంలోకి చేరుకుంటారు. ఇందులో సుమారు 80 శాతం మంది చిన్నారులు ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని పేద దేశాలకు చెందినవారే ఉండటం అంతర్జాతీయ సమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.హోటల్ పనుల్లోకి బాలికలువియత్నాంలో 16 ఏళ్ల లీ, 13 ఏళ్ల న్హీ అనే అక్కాచెల్లెళ్ల కుటుంబం డీజిల్ ధరల పెరుగుదల వల్ల తీవ్ర ఇబ్బందుల్లో పడింది. వారి తండ్రి చేపల వేట ఆగిపోవడంతో, తొమ్మిది మంది పిల్లల కుటుంబ పోషణ కష్టమై, ఆ ఇద్దరు బాలికలు హనోయ్‌లోని ఒక రెస్టారెంట్లో ప్రమాదకరమైన పనుల్లో చేరాల్సి వచ్చింది. బాల కార్మిక చట్టాల ఉల్లంఘనకు దారితీసిన ఈ పరిస్థితిని గుర్తించిన బ్లూ డ్రాగన్ చిల్డ్రన్స్ ఫౌండేషన్ జోక్యంతో వారు తిరిగి పాఠశాలకు చేరుకోగలిగారు.పాఠశాలల నిర్వహణపై తీవ్ర వ్యయ భారంఇంధన ధరల భారం విద్యార్థుల ప్రయాణానికే కాకుండా పాఠశాలల నిర్వహణపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. మారుమూల ప్రాంతాలకు ఉపాధ్యాయులు చేరుకోవడం, విద్యా సామగ్రి సరఫరా చేయడం, విద్యుత్ ఛార్జీలు చెల్లించడం వంటివి పాఠశాలలకు భారంగా మారాయి. ప్రభుత్వాలు ఇంధన, ఆహార సబ్సిడీలకే ఎక్కువ నిధులు కేటాయించాల్సి రావడంతో విద్య, వైద్య రంగాల బడ్జెట్లపై తీవ్ర కోతలు పడుతున్నాయి.మధ్యాహ్న భోజనంపై ప్రభావంప్రపంచవ్యాప్తంగా దాదాపు 46.6 కోట్ల మంది పిల్లలు బడిలో పెట్టే మధ్యాహ్న భోజనంపైనే ఆధారపడి చదువుకుంటున్నారు. రవాణా, ఎరువుల ధరలు పెరగడంతో ఈ పథకాల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారుతోంది. మరోవైపు, దక్షిణాసియా వంటి ప్రాంతాల్లో ఆర్థిక ఒత్తిడి పెరిగినప్పుడు మగపిల్లల చదువులకే ప్రాధాన్యం ఇస్తూ, ఆడపిల్లలను బడి మానిపించడం, బాల్య వివాహాలు చేయడం పెనుముప్పులా పరిణమించిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇది కూడా చదవండి: జాబిల్లిపై రాకెట్ క్రాష్.. భారీ గుంతను గుర్తించిన నాసా! -
ట్రంప్ మ్యాప్‌ల సంబరం!
హార్మూజ్ జలసంధిని ‘చాలా త్వరలోనే’ అమెరికా భూభాగంగా మారుస్తానని గతవారం ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించినప్పుడు ఇరాన్‌పై మళ్లీ భీకర దాడులకు తెగబడొచ్చని కొందరు అనుమానించారు. తీరా మంగళవారం ఆయన చేసిందల్లా ‘అమెరికా కొత్త భూభాగం’ అని రాసివున్న హార్మూజ్ జలసంధి మ్యాప్‌ను విడుదల చేయటమే. దీంతో ఇరాన్ దౌత్యవేత్తలు ప్రతిదాడికి దిగారు. కాలిఫోర్నియాను ఇరాన్ భూభాగంగా చూపుతూ ఇరాన్ కాన్సులేట్ ఒక చిత్రపటాన్ని విడుదల చేసింది. వేరే దేశాల భూభాగాలు డిమాండ్ చేయటం, వాటిని అమెరికా భౌగోళిక చిత్రపటాల్లో భాగంగా చూపటం ట్రంప్‌కు కొత్తేం కాదు. రెండోసారి అధికారంలోకొచ్చిన వెంటనే గ్రీన్‌లాండ్‌పై ఆయన కన్నుపడింది. అలాగే కెనడాను అమెరికాలో విలీనం చేసుకుని 51వ రాష్ట్రంగా మారుస్తామనీ, పనామా కాల్వ ఇకపై తమదేననీ, గాజాను ‘సొంతం’ చేసుకుంటామనీ కూడా పలుమార్లు చెప్పారు. అందుకు సంబంధించి ఒక వీడియో రూపొందించి విడుదల చేశారు. వెనిజులా మ్యాప్‌లో అమెరికా జెండాను సూచించే రంగులు నింపారు. అలాగే ఇకపై గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా వ్యవహరించాలంటూ ఉత్తర్వులు జారీచేశారు. అట్లాంటిక్ మహాసముద్రంలోని ఈ ప్రాంతం మెక్సికోకు పశ్చిమ, దక్షిణ దిశల్లో, అమెరికాకు ఉత్తరంవైపు, క్యూబాకు ఆగ్నేయంవైపు ఉంది. పేరు మార్చినా ప్రాదేశిక జల పరిధులేమీ మారడంలేదు గనుక మెక్సికో, క్యూబాలు ఈ విషయంలో మౌనంగా ఉండిపోయాయి. ఇక పర్షియన్ గల్ఫ్ పేరును గల్ఫ్ ఆఫ్ అరేబియాగా మారుస్తామని తొలి ఏలుబడిలో 2017లో ప్రకటించారు. దాంతో అప్పటి ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ జాగ్రఫీ చదువుకోమని ట్రంప్‌కు సలహా ఇచ్చారు. నిరుడు మే నెలలో సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ పర్యటనకెళ్లే ముందు పేరు మార్పు ఉంటుందని ప్రకటించారు. అటు తర్వాత ఎందుకో దాని జోలికి పోలేదు. ఈ ‘భౌగోళిక చిత్రపట దురాక్రమణల్ని’ చూసి జనం కాలక్షేపానికి నవ్వుకోవచ్చు. ట్రంప్ ప్రదర్శిస్తున్న అమాయకత్వమో, అజ్ఞానమో చూసి జాలిపడే వారూ ఉండొచ్చు. కానీ అగ్ర రాజ్యాల చరిత్ర తెలిసినవారు దాన్నంత తేలిగ్గా వదిలేయరు. ఒక విశాల పాలస్తీనా భూభాగంలోకి కొన్ని దశాబ్దాల్లో భారీయెత్తున యూదుల్ని తరలించి, అక్కడ నరమేధాలకు పాల్పడి ఇజ్రాయెల్‌ను సృష్టించి, అందుకు ఐక్యరాజ్యసమితి ఆమోదాన్ని ‘రాబట్టిన’ చరిత్ర ఆ దేశాలది. కనుక ఇప్పుడు ఉబుసుపోక మాట్లాడే మాటల్లో వేరే అర్థాలు ఉండొచ్చన్న అనుమానాలు రావటం సహజం. రాజకీయావతారం ఎత్తి దాదాపు పదిహేనేళ్లవుతున్నా పూర్వాశ్రమంలో నిర్వహించిన రియలెస్టేట్ వ్యాపార ప్రభావంనుంచి ట్రంప్ బయటపడలేకపోతున్నారన్నది వాస్తవం. రియలెస్టేట్ యజమాని మాదిరే ఆయన భూదాహంతో అల్లాడిపోతున్నారు. ‘మళ్లీ అమెరికాను ఉన్నతంగా చేద్దాం’ అనే నినాదం సారాంశం ఖనిజ సంపద పుష్కలంగా ఉండే ప్రాంతాలను అమెరికాలో విలీనం చేసుకోవటమేనన్న సందేశాన్ని ట్రంప్ పంపుతున్నారు. అందుకే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్ గ్రీన్లాండ్ సందర్శనకెళ్లినప్పుడు డెన్మార్క్, గ్రీన్లాండ్ల నుంచి తీవ్ర నిరసనలు ఎదురయ్యాయి. దాంతో చేసేదిలేక ఆమె మధ్యలోనే ఆ పర్యటనను విరమించుకుని వెనక్కిపోవాల్సి వచ్చింది. జనం భావోద్వేగాలు రెచ్చగొట్టి అధికారంలోకొచ్చినవారు వాటిపైనే మనుగడ సాగించాలనుకోవటం సహజం. అలాగైతేనే వారి వైఫల్యాలు మరుగునపడతాయి మరి. ఈ బాపతు నేతలు అందరి దృష్టి తమపైనే ఉండాలన్న తపనతో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. ట్రంప్ దీనికి భూదాహాన్ని కూడా చేర్చారు. ఈ భౌగోళిక చిత్రపటాల్ని చూసిన ‘మాగా’ జనం నిజంగానే ట్రంప్ వాటిని జయించుకొస్తారన్న భ్రమల్లో ఉంటారు. ఒకపక్క అరేబియా సముద్రంలో లంగరేసిన విమానవాహక నౌక యూఎస్ఎస్ అబ్రహాం లింకన్‌లో దుర్భర పరిస్థితులున్నాయనీ, కొందరు ఆత్మహత్యా యత్నం కూడా చేశారనీ వార్తలొస్తున్నాయి. అందులో పనిచేసే రక్షణ సిబ్బందిని వెనక్కు పిలిపించాలని వారి కుటుంబాలనుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. అందుకే చవకబారు చిత్రపట వివాదాలు కట్టిపెట్టి ఇరాన్‌తో సంధికి ప్రయత్నించడం అమెరికా శ్రేయస్సుకు, రాజకీయంగా ట్రంప్‌కు మంచిది. -
ముందుచూపే ఇరాన్‌ను బతికించిందా?.. ఇక మీదట ఎలా?
అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరుతున్నాయి. ఇప్పటికే యుద్ధం, సముద్ర దిగ్బంధనం, చమురు ఎగుమతులపై ఆంక్షలతో సతమతమవుతున్న ఇరాన్‌పై మరిన్ని కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. గతంలో ఎన్నడూ లేనంత కఠినమైన చర్యలు తీసుకుంటామని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ హెచ్చరించారు. ఈ పరిస్థితిని ముందే అంచనా వేసిన ఇరాన్ ప్రభుత్వం.. ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టింది? ఇక మీదట ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతోంది? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఇరాన్‌పై అమెరికా ఇప్పటికే విస్తృతమైన ఆంక్షలు అమలు చేస్తోంది. 2025 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు వెయ్యికి పైగా ఇరాన్‌కు చెందిన వ్యక్తులు, నౌకలు, విమానాలపై ఆంక్షలు విధించింది. ఇప్పుడు ఈ జాబితాను మరింత విస్తరించేందుకు వాషింగ్టన్ సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఇరాన్ చమురు వ్యాపారానికి సహకరిస్తున్న సంస్థలు, ఆర్థిక లావాదేవీలు, రవాణా వ్యవస్థలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. ఇరాన్ చమురుకు చైనా ప్రధాన కొనుగోలుదారు. దీంతో అక్కడి చిన్న రిఫైనరీలపై అమెరికా ఇప్పటికే ద్వితీయ ఆంక్షలు విధించింది. ఇరాన్‌తో లావాదేవీలు నిర్వహించే పెద్ద చైనా బ్యాంకులపైనా చర్యలు తీసుకునే అవకాశముందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అదే జరిగితే ఇరాన్ చమురు ఆదాయానికి మరింత గండి పడటమే కాకుండా అమెరికా–చైనా సంబంధాలపైనా ప్రభావం పడే అవకాశం ఉంది.హర్ముజ్ మూసుకుపోతే..ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు మరో కీలక సమస్య హర్ముజ్ జలసంధి. ప్రపంచ చమురు, సహజవాయువు రవాణాలో యుద్ధానికి ముందు దాదాపు ఐదో వంతు ఈ మార్గం గుండా సాగేది. ఇప్పుడు యుద్ధం, దిగ్బంధనం కారణంగా నౌకల రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఫలితంగా ఇరాన్‌కు మాత్రమే కాకుండా అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌కూ ఆందోళన మొదలైంది.అయితే హర్ముజ్‌ను తెరిచే విషయంలో ఇరాన్ కూడా తన షరతులను స్పష్టం చేస్తోంది. అమెరికా దిగ్బంధనం ఎత్తివేయడం, స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం, చమురు ఆంక్షలు తొలగించడం, సైనిక చర్యలను నిలిపివేయడం వంటి హామీలు లభించే వరకు జలసంధిని తెరవబోమని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ గాలిబాఫ్ స్పష్టం చేశారు.సముద్ర మార్గం దెబ్బతింటే..హర్ముజ్ సంక్షోభం సుదీర్ఘమైతే దిగుమతులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఇరాన్ ముందుగానే గుర్తించింది. సముద్ర మార్గాల్లో సరుకుల రవాణా దెబ్బతిన్నా దేశంలో ఆహారం, వినియోగ వస్తువులు, పారిశ్రామిక ముడిసరుకుల కొరత రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసుకుంది. పాకిస్థాన్, టర్కియే తదితర దేశాలతో ఉన్న భూ సరిహద్దుల ద్వారా సరుకులను దిగుమతి చేసుకుంటోంది. కాస్పియన్ సముద్రం మీదుగా రష్యా, మధ్య ఆసియా దేశాల నుంచి సరుకులను తీసుకొచ్చే మార్గాలపైనా దృష్టి పెట్టింది.యుద్ధానికి ముందే సరిహద్దు ప్రావిన్సులకు కొన్ని అధికారాలు అప్పగించి అత్యవసర వస్తువుల నిల్వలను పెంచుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పుడు ఆ ముందస్తు నిల్వలే సంక్షోభ సమయంలో ఇరాన్‌కు కొంత ఊరటనిస్తున్నాయి.చమురు ఆదాయం తగ్గితే..అయితే ప్రత్యామ్నాయ దిగుమతి మార్గాలు ఉన్నప్పటికీ ఇరాన్‌కు అసలు సమస్య ఆదాయమే. దేశ ఆర్థిక వ్యవస్థకు చమురు ప్రధాన ఆదాయ వనరు. యుద్ధం, ఆంక్షలు, రవాణా సమస్యల కారణంగా చమురు ఎగుమతులు దెబ్బతింటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం భారీగా తగ్గిపోతుంది. అదే సమయంలో యుద్ధంతో దెబ్బతిన్న మౌలిక వసతుల పునర్నిర్మాణానికి అదనపు ఖర్చులు అవసరమవుతాయి.ఇప్పటికే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, తక్కువ వేతనాలు, ప్రజల కొనుగోలు శక్తి తగ్గడం వంటి సమస్యలను ఎదుర్కొంటోంది. చమురు ఆదాయం మరింత పడిపోతే ఈ భారమంతా సామాన్య ప్రజలపై పడే ప్రమాదం ఉంది.ఇంధన కొరత ముంచుకొస్తుందా?చమురు ఎగుమతుల సమస్యకు తోడు ఇరాన్‌కు ఇంధన సరఫరా కూడా సవాలుగా మారుతోంది. విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా వ్యవస్థలు యుద్ధానికి ముందే ఒత్తిడిలో ఉన్నాయి. దిగ్బంధనం మరింతకాలం కొనసాగితే ఈ రంగాల్లో సంక్షోభం తీవ్రమయ్యే అవకాశం ఉంది.శరదృతువు, చలికాలం వరకు పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇంధనం, విద్యుత్, గ్యాస్ కొరత ఏర్పడవచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిశ్రమలకు తాత్కాలికంగా విద్యుత్ సరఫరా తగ్గించి.. గృహ అవసరాలకు సరఫరాను కాపాడాల్సిన పరిస్థితి రావచ్చని వియన్నా ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ స్టడీస్‌కు చెందిన ఆర్థికవేత్త మహ్దీ ఘోద్సీ పేర్కొన్నారు.ఇంధన వినియోగాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ఇప్పటికే వ్యక్తిగత వాహనాలకు ఇచ్చే సబ్సిడీ పెట్రోల్ కోటాలను తగ్గించింది. ఇంధన ధరలు పెంచే అంశాన్నీ పరిశీలిస్తోంది.యుద్ధానికి ముందే బలహీనంగా..ఇరాన్ ఆర్థిక సంక్షోభానికి ప్రస్తుత యుద్ధమే కారణం కాదు. దశాబ్దాలుగా కొనసాగుతున్న అమెరికా ఆంక్షలు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నుంచి ఒంటరితనం, దేశీయ అవినీతి, పాలనా వైఫల్యాలు ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచాయి. ఇప్పుడు వీటికి యుద్ధం, సముద్ర దిగ్బంధనం, చమురు ఎగుమతుల అంతరాయం తోడయ్యాయి.అంటే ఇరాన్ ప్రస్తుతం ఒకేసారి రెండు యుద్ధాలు చేస్తోంది. బయట సైనిక పోరాటం కొనసాగుతుండగా.. లోపల ఆర్థిక వ్యవస్థను కుప్పకూలకుండా కాపాడుకునే పోరాటం సాగుతోంది.పెజెష్కియాన్ ప్రభుత్వం ఏం చేస్తోంది?ఈ పరిస్థితుల్లో అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రభుత్వం వచ్చే రెండేళ్లకు ఆర్థిక స్థిరీకరణ లక్ష్యాలను నిర్దేశించుకుంది. మార్కెట్లను స్థిరీకరించడం, ప్రజల జీవనోపాధిని రక్షించడం, దేశ ఆర్థిక స్థైర్యాన్ని పెంచడం ప్రధాన లక్ష్యాలుగా పెట్టుకుంది. అయితే అత్యవసర చర్యలు కొంతకాలం మాత్రమే ఉపశమనం కల్పించగలవని నిపుణులు చెబుతున్నారు. అమెరికా, పశ్చిమ దేశాలు, ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతలను తగ్గించడంతో పాటు దేశీయంగా ఆర్థిక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.ఇక ముందు ఎలా?ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్ ముందు రెండు ప్రధాన మార్గాలు కనిపిస్తున్నాయి. అమెరికాతో రాజీకి వచ్చి ఆంక్షలు, దిగ్బంధనం నుంచి ఉపశమనం పొందడం ఒకటి. ఒత్తిడికి తలొగ్గకుండా సైనిక, ఆర్థిక ప్రతిఘటనను కొనసాగించడం రెండోది. ఇరాన్ ఇప్పటివరకు రెండో మార్గానికే ఎక్కువగా మొగ్గు చూపుతోంది. అయితే యుద్ధం, హర్ముజ్ సంక్షోభం, చమురు ఎగుమతుల అంతరాయం మరింతకాలం కొనసాగితే ఇరాన్ ముందస్తు ఏర్పాట్లకు కూడా పరిమితులు ఏర్పడే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయ దిగుమతి మార్గాలు, అత్యవసర నిల్వలు కొంతకాలం దేశాన్ని ఆదుకోగలిగినా.. చమురు ఆదాయం లేకుండా దీర్ఘకాలం ఆర్థిక వ్యవస్థను నడపడం మాత్రం కష్టమే.అదే సమయంలో హర్ముజ్ జలసంధి సంక్షోభం ఇరాన్ సరిహద్దులు దాటి ప్రపంచాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. చమురు సరఫరా తగ్గితే అంతర్జాతీయంగా ధరలు పెరగవచ్చు. ఇంధన ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కూడా పెరిగే ప్రమాదం ఉంది. -
ఇరాన్‌తో సంబంధాలు కట్.. యూఏఈ సంచలన ఆరోపణలు
పశ్చిమాసియా సంక్షోభం మరో మలుపు తిరిగేలా కనిపిస్తోంది. ఇరాన్–యూఏఈ మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. గల్ఫ్‌లో నౌకాయానాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని యూఏఈ ఆరోపించగా.. ఆ వాదనలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇవి పూర్తిగా నిరాధార ఆరోపణలని, ఇలాంటి ప్రకటనలు ప్రాంతీయ శాంతి, భద్రతకు విఘాతం కలిగిస్తాయని ఇరాన్ విదేశాంగశాఖ స్పష్టం చేసింది. మరోవైపు.. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్‌తో అన్ని రకాల వాణిజ్య, ఆర్థిక లావాదేవీలను తదుపరి ఆదేశాలు వెలువడే వరకు నిలిపివేస్తున్నట్లు యూఏఈ ప్రకటించింది.మంగళవారం గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ నుంచి రెండు బాలిస్టిక్ క్షిపణులు తమ వైపు దూసుకొచ్చినట్లు యూఏఈ రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. తమ వైమానిక రక్షణ వ్యవస్థలు ఈ రెండు క్షిపణులను గుర్తించాయని పేర్కొంది. వాటిలో ఒకటి యూఏఈ ప్రాదేశిక జలాల వెలుపల సముద్రంలో పడగా.. మరో క్షిపణి తమ ప్రాదేశిక జలాల్లోనే కూలిపోయిందని వెల్లడించింది.ఆ తర్వాత విడుదల చేసిన మరో ప్రకటనలో.. ఈ రెండు క్షిపణులు సముద్ర రవాణాను లక్ష్యంగా చేసుకున్నట్లు తమ అంచనాల్లో తేలిందని యూఏఈ పేర్కొంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా భారీ నష్టం జరిగినట్లు ఇప్పటివరకు సమాచారం లేదు.‘నిరాధార ఆరోపణలు’.. ఇరాన్ కౌంటర్యూఏఈ ఆరోపణలపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. తమ దేశం నుంచి యూఏఈపై క్షిపణి ప్రయోగించారన్న ఆరోపణలను ‘పూర్తిగా ఖండిస్తున్నట్లు’ ఇరాన్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ తెలిపారు. ప్రాంతీయ దేశాల మధ్య విశ్వాసాన్ని పెంచే ప్రయత్నాలకు ఇలాంటి ఆరోపణలు విఘాతం కలిగిస్తాయని అన్నారు. పొరుగు దేశాలతో సత్సంబంధాల సూత్రాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి నిరాధార ఆరోపణలకు దూరంగా ఉండాలని యూఏఈ సహా ప్రాంతీయ దేశాలకు సూచించారు.అమెరికా, ఇజ్రాయెల్ చర్యల కారణంగా ఇప్పటికే మధ్యప్రాచ్యంలో పరిస్థితులు సంక్లిష్టంగా మారాయని బఘాయీ పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో తప్పుడు ఆరోపణలు చేయడం ప్రాంతీయ భద్రతను మరింత దెబ్బతీస్తుందని అన్నారు.యూఏఈలో మిసైల్ అలర్ట్ఈ ఆరోపణలకు కొద్దిసేపటి ముందు యూఏఈ ప్రజలకు ఫోన్ ద్వారా అత్యవసర హెచ్చరిక సందేశం వచ్చింది. ‘సంభావ్య క్షిపణి ముప్పు’ ఉన్నందున సమీపంలోని సురక్షిత భవనంలోకి వెళ్లాలని అధికారులు సూచించారు. కొద్దిసేపటికే ఆ అలర్ట్‌ను ఉపసంహరించుకున్నారు.జూన్‌లో తప్పుడు అలారం వెలువడిన తర్వాత.. జూలైలో జరిగిన మరో ఘటనలో క్షిపణి యూఏఈ భూభాగంలోకి ప్రవేశించకపోయినప్పటికీ హెచ్చరిక జారీ చేశారు. తాజాగా వచ్చిన అలర్ట్ మాత్రం ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో మరింత ఆందోళనకు దారితీసింది.ఇరాన్‌తో సంబంధాలు కట్!తాజా పరిణామాల నేపథ్యంలో యూఏఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్‌తో అన్ని రకాల వాణిజ్యం, వాణిజ్య మార్పిడి, ఆర్థిక లావాదేవీలను తదుపరి ఆదేశాలు వెలువడే వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. యూఏఈ విదేశాంగశాఖ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ అఫ్రా అల్ హమెలీ.. ప్రాంతీయ ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తతల్లో ఉన్న ఇరాన్–యూఏఈ సంబంధాలు మరింత దిగజారే పరిస్థితి ఏర్పడింది.ఇప్పటికే ఆయిల్ ట్యాంకర్లపై దాడులుయూఏఈకి చెందిన ప్రభుత్వ చమురు సంస్థ ADNOC ట్యాంకర్లు గత కొన్ని వారాలుగా వరుస దాడులకు గురవుతున్నాయి. దీంతో గల్ఫ్ ప్రాంతంలో సముద్ర రవాణా భద్రతపై ఆందోళనలు పెరిగాయి.ఫిబ్రవరి 28న మధ్యప్రాచ్య యుద్ధం ప్రారంభమైన సమయంలో ఇరాన్ దాడుల్లో యూఏఈ తీవ్రంగా ప్రభావితమైన దేశంగా నిలిచింది. దాదాపు 3,000 క్షిపణులు, డ్రోన్లు యూఏఈ వైపు ప్రయోగించినట్లు సమాచారం. అయితే జూన్‌లో ఇరుపక్షాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత కొంతకాలం దాడులు తగ్గాయి. తాజాగా ఆ ఒప్పందం కుప్పకూలడంతో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి.‘హర్ముజ్ మూసివేత కొనసాగుతుంది’మరోవైపు ఇరాన్ కీలక హెచ్చరిక చేసింది. ప్రపంచంలోని అత్యంత వ్యూహాత్మక చమురు రవాణా మార్గాల్లో ఒకటైన హర్ముజ్ జలసంధి మూసివేత కొనసాగుతుందని స్పష్టం చేసింది. అమెరికాతో శాంతి ఒప్పందం కుదిరే వరకు హర్ముజ్‌ను తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ తన వైఖరిని వెల్లడించింది. యూఏఈ నుంచి గల్ఫ్ వెలుపలికి వెళ్లే నౌకలకు హర్ముజ్ కీలక మార్గం కావడంతో.. ఇరాన్ తాజా ప్రకటన యూఏఈ ఆర్థిక వ్యవస్థతో పాటు అంతర్జాతీయ చమురు రవాణాపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది.హర్ముజ్.. మరోసారి యుద్ధ కేంద్రంగా!ఒకవైపు క్షిపణి ఆరోపణలు, మరోవైపు వాణిజ్య ఆంక్షలు, ఇంకోవైపు హర్ముజ్ మూసివేతపై ఇరాన్ హెచ్చరికలు.. మొత్తంగా గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితి మరోసారి ఉద్రిక్తంగా మారింది. ఇరాన్ ఆరోపణలను ఖండిస్తున్నప్పటికీ.. యూఏఈ మాత్రం సముద్ర రవాణాపై ముప్పు పెరిగిందని చెబుతోంది. ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్ముజ్‌పై ఆధిపత్యం తమదేనంటూ ఓ మ్యాప్(ఏఐ జనరేటెడ్) రిలీజ్ చేశారు కూడా. ఈ నేపథ్యంలో హర్ముజ్ జలసంధి చుట్టూ పరిణామాలు తదుపరి రోజుల్లో మరింత కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. -
హర్ముజ్‌లో ఒక్కసారిగా మారిన సీన్
ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ ముదురుతున్న వేళ.. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిపై ఆధిపత్య పోరు మరింత ఉత్కంఠగా మారింది. ఈ వ్యూహాత్మక జలమార్గంపై తమదే పైచేయి అని ఇరాన్ చెప్పుకుంటోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ అడుగు ముందుకేసి తమ భూభాగంలోకే వస్తుందంటూ మ్యాప్ రిలీజ్ చేశారు. అయితే.. తాజా షిప్పింగ్ గణాంకాలు మాత్రం ఆసక్తికర విషయాన్ని వెల్లడిస్తోంది.గత రెండు వారాల్లో హర్ముజ్ గుండా ప్రయాణించిన నౌకల్లో అత్యధిక శాతం ఒమన్ వైపు ఉన్న మార్గాన్ని ఎంచుకున్నాయి. దీంతో హర్ముజ్‌పై ఇరాన్ గతంలో ఉన్నంత స్థాయిలో నియంత్రణ కొనసాగించడం కష్టమవుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో అమెరికా నౌకాదళ బలగాల ఉనికి, ఇరాన్ నౌకలపై దాడుల భయం, చమురు రవాణా మార్గాల్లో మార్పులు.. ఈ జలసంధిలో శక్తి సమీకరణాలు వేగంగా మారుతున్నాయని స్పష్టం చేస్తున్నాయి.షిప్పింగ్ డేటా సంస్థ కేప్లర్ గణాంకాల ప్రకారం.. గత రెండు వారాల్లో హర్ముజ్ జలసంధి గుండా వెళ్లిన నౌకల్లో 80 శాతానికి పైగా ఒమన్ వైపు ఉన్న మార్గాన్ని ఉపయోగించాయి. ఈ మార్గాన్ని ఐక్యరాజ్యసమితి అనుమతించినప్పటికీ.. ఇరాన్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.నెల రోజుల క్రితం వరకు ఈ మార్గంలో దాదాపు ఎలాంటి నౌకా రాకపోకలు లేవని కేప్లర్ తెలిపింది. ఇప్పుడు మాత్రం పెద్ద సంఖ్యలో వాణిజ్య నౌకలు ఇరాన్ అభ్యంతరాలను పక్కనబెట్టి ఒమన్ వైపు నుంచి ప్రయాణిస్తున్నాయి. ఇరాన్ ఉత్తర ఒమన్ తీరానికి సమీపంలోని మార్గాలను ఉపయోగించే నౌకలను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ.. అమెరికా నౌకాదళ రక్షణపై ఆధారపడుతూ కొన్ని నౌకలు ఆ మార్గాన్ని ఎంచుకుంటున్నాయి.కేప్లర్ క్రూడ్ ఆయిల్ విశ్లేషణ విభాగం అధిపతి హోమయూన్ ఫలక్‌షాహీ స్పందిస్తూ.. హర్ముజ్‌పై ఇరాన్ కొంతవరకు నియంత్రణ కోల్పోయినట్లు కనిపిస్తోంది అని అంటున్నారు.ఇరాన్ టోల్ వసూళ్లకూ బ్రేక్!హర్ముజ్ గుండా ప్రయాణించే నౌకల నుంచి రవాణా రుసుములు వసూలు చేయాలని ఇరాన్ గతంలో ప్రయత్నించింది. అయితే నౌకలు ఇరాన్ ప్రాధాన్యమిస్తున్న మార్గాన్ని కాకుండా ఒమన్ వైపు ఉన్న మార్గాన్ని ఎంచుకోవడంతో ఆ ప్రయత్నాలను అమలు చేయడం కష్టంగా మారింది. ఇరాన్ టోల్ వసూలు చేయాలన్న ప్రతిపాదనను మధ్యప్రాచ్యంలోని చాలా దేశాలు అంగీకరించడం లేదని పికరింగ్ ఎనర్జీ పార్ట్నర్స్ వ్యవస్థాపకుడు డాన్ పికరింగ్ పేర్కొన్నారు.అంటే.. నౌకల రాకపోకలను బెదిరించడం మాత్రమే కాకుండా వాటి నుంచి తన నిబంధనల ప్రకారం రుసుములు వసూలు చేయాలన్న ఇరాన్ ప్రయత్నానికీ ఇప్పుడు పరిమితులు ఏర్పడుతున్నాయి.చమురు ట్యాంకర్లలో ‘డార్క్ ట్రాఫిక్’హర్ముజ్ ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ దేశాలు చమురు రవాణాలో కొత్త మార్గాలను అనుసరిస్తున్నాయి. కువైట్, సౌదీ అరేబియా, యూఏఈలు వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్స్ (వీఎల్సీసీ)ను ఉపయోగించి పెర్షియన్ గల్ఫ్ నుంచి హర్ముజ్ మీదుగా చమురును తరలిస్తున్నాయి. ప్రమాదకర ప్రాంతాన్ని దాటిన తర్వాత గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో ఇతర ట్యాంకర్లకు చమురును బదిలీ చేస్తున్నట్లు సమాచారం.ఇరాన్ దాడుల ముప్పు నుంచి తప్పించుకునేందుకు కొన్ని ట్యాంకర్లు తమ ట్రాన్స్పాండర్లను ఆపివేస్తున్నాయి. కొన్ని నౌకలు వారాలపాటు తమ గుర్తింపు సంకేతాలను నిలిపివేస్తున్నాయి. దీంతో సాధారణ షిప్పింగ్ ట్రాకింగ్ వ్యవస్థలకు అవి కనిపించకుండా పోతున్నాయి. ఈ విధానాన్ని ‘డార్క్ ట్రాఫిక్’గా వ్యవహరిస్తున్నారు. ఉపగ్రహ చిత్రాలు, ఇతర సాంకేతిక వ్యవస్థలతో కొన్ని నౌకలను గుర్తించగలిగినా.. వాటి కదలికలను పూర్తిస్థాయిలో అంచనా వేయడం కష్టమవుతోంది.ట్రంప్.. అదే మాటమరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం హర్ముజ్‌పై అమెరికాదే పైచేయి అని స్పష్టం చేస్తున్నారు. అమెరికా నౌకాదళ బలగాలు ఈ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో.. హర్ముజ్‌పై తమకు పూర్తి నియంత్రణ ఉందని ట్రంప్ ప్రకటించారు.మంగళవారం మరింత దూకుడుగా స్పందించిన ఆయన.. హర్ముజ్‌ను అమెరికా నియంత్రణలోకి తీసుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు. అంతేకాదు.. జలసంధి మ్యాప్‌ను షేర్ చేస్తూ దానిని ‘కొత్త అమెరికా భూభాగం’గా అభివర్ణించారు. అమెరికా ఇంధనశాఖ మంత్రి క్రిస్ రైట్ స్పందిస్తూ.. హర్ముజ్ గుండా వెళ్తున్న చమురు, హర్ముజ్‌ను తప్పించి ఇతర మార్గాల ద్వారా తరలిస్తున్న చమురు కలిపి ఒక వారంలో రోజుకు సుమారు 1.5 కోట్ల బ్యారెళ్లకు చేరుకుంది.యుద్ధానికి ముందు హర్ముజ్ ప్రాంతం గుండా రోజుకు సుమారు 2 కోట్ల బ్యారెళ్ల చమురు రవాణా జరిగేది. ప్రస్తుత ప్రవాహం దానికి దగ్గరగా ఉండటాన్ని చూపిస్తూ.. ఇరాన్ హర్ముజ్‌ను పూర్తిగా మూసివేయడంలో విఫలమైందని అమెరికా వాదిస్తోంది.అరాఘ్చీ కౌంటర్ఇరాన్–అమెరికా మధ్య మాటల యుద్ధం కూడా తీవ్రంగా కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇరాన్‌తో ఎలాంటి చర్చలు జరగడం లేదని, ప్రస్తుతం ఎలాంటి చర్చలు షెడ్యూల్ కాలేదని చెప్పారు. అమెరికా నౌకాదళ దిగ్బంధం కొనసాగుతోందని, హర్ముజ్‌లోని సముద్రపు గనులను తొలగించినట్లు కూడా ఆయన ప్రకటించారు. దీనికి భిన్నంగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఘాటుగా స్పందించారు. అమెరికా తన లక్ష్యాలను సాధించలేకపోవడంతో ఇప్పుడు ఇరాన్ షరతులపై చర్చలు జరపాలని ‘వేడుకుంటోంది’ అని వ్యాఖ్యానించారు.ఇరాన్–యూఏఈ మధ్యా ఉద్రిక్తత!హర్ముజ్ సంక్షోభం నేపథ్యంలో ఇరాన్–యూఏఈ మధ్య కూడా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సముద్ర రవాణాను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. వాటిలో ఒక క్షిపణి యూఏఈ ప్రాదేశిక జలాల్లో పడిందని.. మరో క్షిపణి ఆ జలాలకు వెలుపల సముద్రంలో పడిందని తెలిపింది.అయితే ఈ ఆరోపణలను ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ ఖండించారు. అవి నిరాధార ఆరోపణలని.. ఇలాంటి వ్యాఖ్యలు ఇరుగు పొరుగు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసి ప్రాంతీయ నమ్మకాన్ని బలహీనపరుస్తాయని అన్నారు.మరోవైపు.. ఇరాన్‌తో వాణిజ్యం, వాణిజ్య మార్పిడి, ఆర్థిక లావాదేవీలన్నింటినీ తదుపరి ఆదేశాలు వెలువడే వరకు నిలిపివేస్తున్నట్లు యూఏఈ ప్రకటించింది.చమురు ధరలపై ప్రభావంహర్ముజ్ ఉద్రిక్తతలు అంతర్జాతీయ చమురు మార్కెట్‌పైనా ప్రభావం చూపుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 59 సెంట్లు లేదా 0.7 శాతం పెరిగి బ్యారెల్‌కు 91.46 డాలర్లకు చేరాయి. మూడు వారాల తర్వాత తొలిసారిగా ఈ స్థాయికి చేరడం గమనార్హం. అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూటీఐ) ధర 75 సెంట్లు లేదా 0.9 శాతం పెరిగి 85.25 డాలర్లకు చేరింది. హర్ముజ్ మీదుగా చమురు రవాణాకు అంతరాయం కొనసాగితే.. సరఫరా భయాలు మరింత పెరిగి ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.ఇరాన్–ఒమన్ చర్చలపై ఆశలుహర్ముజ్లో నౌకాయానాన్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి ఇరాన్, ఒమన్ మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఇరుదేశాలకు జలసంధి తీర ప్రాంతాలు ఉండటంతో స్వేచ్ఛాయుత నౌకాయానంపై ఒక ఒప్పందం కుదిరే అవకాశాలపై ఆసక్తి నెలకొంది. అమెరికా ప్రత్యక్ష భాగస్వామ్యం లేకుండా ఈ చర్చలు జరగడం ట్రంప్‌కు అసంతృప్తి కలిగించినట్లు తెలుస్తోంది.ఇరాన్–ఒమన్ మధ్య హర్ముజ్ రవాణా ఒప్పందం కుదిరిన తర్వాతే అమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చలను పునఃప్రారంభించేందుకు అంతర్జాతీయ మధ్యవర్తులు ప్రయత్నించే అవకాశం ఉందని ఖతార్ విదేశాంగశాఖ ప్రతినిధి మాజెద్ అల్ అన్సారీ తెలిపారు.‘షరతులు నెరవేర్చే వరకు క్లోజ్’ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘలీబాఫ్ మాత్రం తమ వైఖరిని స్పష్టం చేశారు. అమెరికా నౌకాదళ దిగ్బంధాన్ని ఎత్తివేయడం, ఆంక్షలను తొలగించడం, స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం వంటి షరతులను అమెరికా నెరవేర్చే వరకు హర్ముజ్ జలసంధి మూసే ఉంటుందని ఆయన ప్రకటించారు. దీంతో హర్ముజ్ కేవలం నౌకాయాన సమస్యగా కాకుండా.. ఇరాన్–అమెరికా మధ్య రాజకీయ, సైనిక, ఆర్థిక పోరాటానికి ప్రధాన వేదికగా మారింది.ఎవరి పట్టు ఎంత?ఇరాన్ దాడుల ముప్పుతో కొన్ని వాణిజ్య నౌకలు తమ కదలికలను గుర్తించే ట్రాన్స్పాండర్లను ఆపేస్తున్నాయి. మరికొన్ని నౌకలు ప్రమాదకర మార్గాలను వదిలి ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణిస్తున్నాయి. అదీ అమెరికా రక్షణ నడుమ. అయితే 80 శాతానికి పైగా నౌకలు ఒమన్ మార్గాన్ని ఎంచుకోవడం మాత్రం హర్ముజ్‌పై ఇరాన్ సంప్రదాయ ఆధిపత్యానికి గట్టి సవాలుగా మారింది. అదే సమయంలో చమురు రవాణా యుద్ధానికి ముందు స్థాయికి ఇంకా చేరుకోకపోవడం అమెరికా పూర్తి నియంత్రణ వాదనకూ పరిమితులు ఉన్నాయని చెబుతోంది. అందుకే ప్రస్తుతం హర్ముజ్‌లో కనిపిస్తున్నది ఒకరి సంపూర్ణ విజయం కాదనేది విశ్లేషకుల మాట. -
‘హర్మూజ్ జలసంధి మాదే’.. మ్యాప్ విడుదల చేసిన డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్/టెహ్రాన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. ప్రపంచంలోనే అత్యంత వ్యూహాత్మక చమురు రవాణా మార్గం హర్మూజ్ జలసంధి కొత్త అమెరికా భూభాగంగా పేర్కొంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా ఏఐ జనరేటెడ్ మ్యాప్ ఫొటోను పోస్ట్ చేశారు. ఇరాన్‌తో నెలకొన్న సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.అయితే, ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. హర్మూజ్ జలసంధి తమదేనని, అది తమ నియంత్రణలోనే ఉంటుందని ఇరాన్ స్పష్టం చేసింది. గతంలో ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ ఘరీబాబాదీ మాట్లాడుతూ.. హర్మూజ్ ‘ఇరాన్‌దే, ఇరాన్దిగానే ఉంటుంది’ అని స్పష్టం చేశారు. ప్రస్తుతం హర్మూజ్‌ను తిరిగి తెరవడం అమెరికా,ఇరాన్ చర్చల్లో ప్రధాన అంశంగా మారింది. అమెరికా ఆంక్షలు, నౌకాదళ చర్యలను ఉపసంహరించుకోవాలని ఇరాన్ కోరుతుండగా.. అమెరికా మాత్రం జలసంధి స్వేచ్ఛగా తెరవాలని ఒత్తిడి చేస్తోంది. ఇరువైపులా రాజీ కుదరకపోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. చర్చలు ఎందుకు విఫలమవుతున్నాయి?అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన 60 రోజుల అవగాహన గడువు ఆగస్టు 17న ముగిసింది. అయితే, కీలక అంశాలపై పురోగతి లేకపోవడంతో ఆ ఒప్పందాన్ని పొడిగించబోమని ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. హర్మూజ్‌ను తెరవడం,ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు, అమెరికా నౌకాదళ చర్యలు, ఇరాన్ అణు కార్యక్రమం వంటి అంశాలపై ఇరువర్గాల మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. ఇరాన్ మాత్రం అమెరికా ముందుగా తన సైనిక ఒత్తిడిని తగ్గించి ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తోంది. అమెరికా మాత్రం ఇరాన్‌పై ఒత్తిడిని కొనసాగిస్తూ హర్మూజ్ జలసంధి పూర్తిగా తెరవాలని కోరుతోంది.ప్రపంచ చమురు మార్కెట్‌పై ప్రభావంహర్మూజ్ జలసంధి మూసివేత లేదా రవాణాపై పరిమితులు కొనసాగితే ప్రపంచ ఇంధన సరఫరాకు భారీ దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ప్రాంతంలోని ఉద్రిక్తతల కారణంగా నౌకల రాకపోకలు గణనీయంగా తగ్గాయి. ఫలితంగా చమురు ధరలు, రవాణా వ్యయాలు, బీమా ఖర్చులు పెరిగే ప్రమాదం ఉంది. -
‘యుద్ధంతో జీవించలేం’.. ఇరాన్లో వినిపిస్తున్న కొత్త స్వరం
అమెరికా–ఇజ్రాయెల్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల వేళ ఇరాన్లో అంతర్గత చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. యుద్ధ మార్గమా? లేక దౌత్య మార్గమా? అనే ప్రశ్నపై దేశ రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మాజీ అధ్యక్షుడు మహ్మద్ ఖటామీ చేసిన వ్యాఖ్యలు టెహ్రాన్‌లో కొత్త చర్చకు దారితీశాయి.‘‘యుద్ధంతో ఎప్పటికీ జీవించలేం.. సమస్యలను పరిష్కరించేందుకు దౌత్య మార్గాలను అన్వేషించాలి’’ అని ఖటామీ చేసిన వ్యాఖ్యలు.. ప్రస్తుత ఇరాన్ విధానంపై పరోక్ష విమర్శలుగా భావిస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ నుంచి ఎదురవుతున్న ఒత్తిళ్లను ఎదుర్కొంటూనే.. దేశ అంతర్గత సమస్యలు, ప్రజల జీవన పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.సంస్కరణవాద నేత ఖటామీ స్వరంమహ్మద్ ఖటామీ 1997 నుంచి 2005 వరకు ఇరాన్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన సంస్కరణవాద భావజాలానికి దగ్గరగా ఉన్న నేతగా గుర్తింపు పొందారు. పాశ్చాత్య దేశాలతో సంబంధాల మెరుగుదల, రాజకీయ సంస్కరణలు, పరిమిత దౌత్య విధానాలకు ఆయన మద్దతు ఇచ్చేవారు. ప్రస్తుతం అధికారంలో లేకపోయినా.. ఇరాన్లో ఆయనకు ఉన్న రాజకీయ ప్రభావం కారణంగా తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముఖ్యంగా యుద్ధ వాతావరణంలో ఉన్న దేశంలో శాంతి, చర్చల ప్రస్తావన చేయడం రాజకీయంగా కీలక సంకేతంగా మారింది.‘‘ప్రజలు యుద్ధంలో జీవించలేరు’’యుద్ధం ద్వారా శాశ్వత పరిష్కారం సాధ్యం కాదని ఖటామీ స్పష్టం చేశారు. విదేశీ శక్తుల నుంచి వచ్చే బెదిరింపులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ.. దేశ ప్రజల ఆర్థిక పరిస్థితులు, సాధారణ జీవనం కూడా ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఉండాలని సూచించారు. అమెరికా ఆంక్షలు, అంతర్జాతీయ ఒత్తిళ్లు ఇప్పటికే ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దీర్ఘకాలిక ఘర్షణలు కొనసాగితే ప్రజలపై మరింత భారం పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.మరోవైపు కఠిన వైఖరిలో అధికార వర్గంఅయితే ఇరాన్ అధికార వ్యవస్థలోని కీలక వర్గాలు మాత్రం అమెరికా, ఇజ్రాయెల్ విషయంలో కఠిన వైఖరినే కొనసాగిస్తున్నాయి. సుప్రీం లీడర్ వర్గం విదేశీ ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తోంది. ఇరాన్లో అత్యంత ప్రభావశీలమైన శక్తిగా ఉన్న ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కూడా ప్రతిఘటన విధానానికే మద్దతు ఇస్తోంది. భద్రత, విదేశాంగ విధానం, ప్రాంతీయ వ్యూహాల్లో కీలక పాత్ర పోషించే ఐఆర్జీసీ.. అమెరికా, ఇజ్రాయెల్‌పై వ్యతిరేకతను దేశ రక్షణలో భాగంగా చూస్తోంది.అధ్యక్షుడి పాత్ర పరిమితంప్రస్తుత ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ గతంలో దౌత్య సంబంధాల పునరుద్ధరణకు అనుకూలంగా మాట్లాడిన నేతగా గుర్తింపు పొందారు. అయితే ఇరాన్ రాజకీయ వ్యవస్థలో తుది నిర్ణయాధికారం సుప్రీం లీడర్, భద్రతా వ్యవస్థ చేతుల్లో ఉంటుంది. అందువల్ల అధ్యక్షుడి వైఖరి కంటే.. సుప్రీం లీడర్ వర్గం, సైనిక వ్యవస్థ నిర్ణయాలే కీలకంగా మారుతాయి.ఆర్థిక సమస్యలు.. ప్రజల్లో అసంతృప్తిఇరాన్లో యుద్ధ వాతావరణం, ఆంక్షలు, ఆర్థిక ఇబ్బందులు ప్రజల్లో అసంతృప్తిని పెంచుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా యువతలో ఉద్యోగాలు, జీవన ప్రమాణాలు, అంతర్జాతీయ అవకాశాలపై ఆందోళనలు పెరుగుతున్నాయి. యుద్ధం మరింత కొనసాగితే ఈ సమస్యలు తీవ్రం కావచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో దేశంలో కొంత వర్గం దౌత్యానికి అవకాశం ఇవ్వాలని కోరుతోంది.ముందున్న మార్గం ఏంటి?ఖటామీ వ్యాఖ్యలు వెంటనే ఇరాన్ విదేశాంగ విధానాన్ని మార్చే అవకాశం లేకపోయినా.. దేశంలో ఉన్న అంతర్గత భిన్నాభిప్రాయాలను మాత్రం బయటపెట్టాయి. ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా కఠినంగా ముందుకు వెళ్లాలనే వర్గం.. మరోవైపు దేశ ప్రయోజనాల కోసం చర్చలకు అవకాశం ఇవ్వాలనే వర్గం మధ్య ఇరాన్లో చర్చ కొనసాగుతోంది. యుద్ధం మరింత తీవ్రం అవుతుందా? లేదంటే దౌత్యానికి కొత్త మార్గం తెరుచుకుంటుందా? అనేది రాబోయే పరిణామాలపై ఆధారపడి ఉంది. ఖటామీ వ్యాఖ్యలు మాత్రం ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో కొత్త ప్రశ్నలకు తెరలేపాయి. -
ఓ ఫేక్ న్యూస్.. అమెరికా–ఇరాన్ అణు చర్చల్లో కలకలం
క్షిపణులు, డ్రోన్లతో సాగుతున్న అమెరికా–ఇరాన్ ఘర్షణ ఇప్పుడు మరో కొత్త మలుపు తీసుకుంది. యుద్ధం కేవలం మైదానంలోనే కాదు.. సోషల్ మీడియా వేదికలపైనా సాగుతోంది. తాజాగా ఓ తప్పుడు సమాచారం అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టించింది. ఎలాంటి నిర్ధారణ లేకుండానే ఇజ్రాయెల్, అమెరికా రాజకీయ వర్గాల్లోకి చేరి.. చివరకు అణు చర్చలపై ప్రభావం చూపే స్థాయికి చేరుకుంది.ఆగస్టు 5న ‘ఎక్స్’ (X) వేదికగా ఓ గుర్తుతెలియని భారతీయ ఖాతా నుంచి ఓ సంచలన పోస్టు వెలువడింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ అహ్మద్ వహీది.. ‘‘అమెరికా, ఇజ్రాయెల్ వద్ద అణ్వాయుధాలు ఉన్నంత కాలం.. ఇరాన్ కూడా తన అణు ఆయుధాల లక్ష్యాన్ని వదులుకోదు’’ అని వ్యాఖ్యానించినట్లు అందులో పేర్కొన్నారు. దీనికి అణు పేలుడు మేఘాన్ని పోలిన ఏఐ రూపొందించిన చిత్రాన్ని కూడా జత చేశారు.అయితే ఈ వ్యాఖ్యలు నిజంగా వహీది చేశారనే ఆధారాలు ఏవీ లేవు. ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేసిందనే ఆధారాలు కూడా లేవు. అయినప్పటికీ ఆ పోస్టు వేగంగా వైరల్ అయింది.భారత్ టు అమెరికా వయా ఇజ్రాయెల్.. సుమారు 1.75 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న ఆ భారతీయ ఖాతా నుంచి మొదలైన ఈ ప్రచారం.. కొన్ని గంటల్లోనే మరో భారతీయ ఖాతా ద్వారా హిందీలోకి అనువదించబడింది. ఆ తర్వాత ఇజ్రాయెల్‌కు చెందిన కొన్ని సోషల్ మీడియా ఖాతాలు దీనిని విస్తృతంగా ప్రచారం చేశాయి. ఇజ్రాయెల్‌లోని ఓ టీవీ ఛానల్ ఈ తప్పుడు సమాచారాన్ని ఆధారంగా చేసుకుని.. ‘‘ఇరాన్ తొలిసారి అణుబాంబు తయారీ లక్ష్యాన్ని అంగీకరించింది’’ అన్నట్టుగా కథనం ప్రసారం చేసింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ జెరూసలేంలోని మౌంట్ హెర్జెల్ వద్ద చేసిన ప్రసంగంలో కూడా దీనిని ఇరాన్ ఉద్దేశాలకు నిదర్శనంగా ప్రస్తావించారు.అమెరికాలోనూ ఈ ప్రచారం ప్రభావం చూపింది. ఐక్యరాజ్యసమితిలో ట్రంప్ ప్రభుత్వ ప్రతినిధి మైక్ వాల్ట్జ్ ఈ పోస్టును షేర్ చేస్తూ.. ఇరాన్ అసలు ఉద్దేశాలను అంగీకరించిందన్న అర్థంలో వ్యాఖ్యానించారు. అమెరికా సెనేటర్ రిక్ స్కాట్ కూడా దీన్ని పంచుకున్నారు. అయితే తర్వాత మైక్ వాల్ట్జ్ తన పోస్టును ఎలాంటి వివరణ లేకుండా తొలగించారు.అణు చర్చలపై ప్రభావంఅమెరికా–ఇరాన్ మధ్య ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా, ఇజ్రాయెల్ అనుమానాలు వ్యక్తం చేస్తుండగా.. తాము శాంతియుత అవసరాల కోసమే అణు కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని టెహ్రాన్ చెబుతోంది. ఇలాంటి సమయంలో అణ్వాయుధాలపై ఇరాన్ నేత వ్యాఖ్యలంటూ వచ్చిన తప్పుడు ప్రచారం.. దౌత్య చర్చల వాతావరణాన్ని మరింత క్లిష్టంగా మార్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.ఫేక్ న్యూస్ పవర్ అది!ఈ ఘటన సోషల్ మీడియా యుగంలో తప్పుడు సమాచారానికి ఉన్న ప్రభావాన్ని మరోసారి బయటపెట్టింది. ఒక గుర్తుతెలియని ఖాతా నుంచి వచ్చిన నిర్ధారణ లేని పోస్టు.. భాషలు, దేశాల సరిహద్దులు దాటి.. ప్రపంచ నాయకుల ప్రసంగాల్లోకి చేరింది. నిజానిజాలు నిర్ధారించకుండానే ప్రచారం జరిగితే.. అంతర్జాతీయ రాజకీయాలు, యుద్ధ నిర్ణయాలపైనా ప్రభావం చూపగలదని ఈ ఉదంతం స్పష్టం చేసింది. -
ఇరాన్ కొత్త వార్ ప్లాన్.. అమెరికా సైనికుడి ప్రాణానికి భారీ బౌంటీ!
పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. అమెరికా సైనికుడిని హతమార్చినా, సజీవంగా పట్టుకుని అప్పగించినా 30 వేల డాలర్ల నజరానా అందిస్తామని ప్రకటించింది. ఈ చర్యకు పాల్పడేది మహిళ అయితే రివార్డును రెట్టింపు చేసి 60 వేల డాలర్లు ఇస్తామని ఇరాన్ సైన్యం ప్రకటించినట్లు ఆ దేశ అధికారిక వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ వెల్లడించింది.ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ ఈ నజరానా పథకాన్ని ప్రకటించినట్లు సమాచారం. అమెరికాపై పోరాటానికి ఆర్థికంగా మద్దతు ఇచ్చేందుకు ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో అభ్యర్థనలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నట్లు ఐఆర్ఎన్ఏ కథనాన్ని ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా తెలిపింది. అయితే అమెరికా సైనికులను ఎక్కడ, ఎప్పుడు పట్టుకోవాలనే విషయంపై ఎలాంటి వివరాలను ఇరాన్ వెల్లడించలేదు.హార్మూజ్ ప్రతిష్ఠంభన వేళ..హార్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలపై ప్రతిష్ఠంభన కొనసాగుతున్న సమయంలో ఇరాన్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికాతో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న నేపథ్యంలో ఇరాన్ తీసుకున్న తాజా నిర్ణయం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. అయితే ప్రస్తుతం ఇరాన్ భూభాగంలో అమెరికా బలగాల పెద్దఎత్తున మోహరింపు లేదని తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. ఏప్రిల్‌లో కూలిపోయిన అమెరికా యుద్ధ విమాన పైలట్‌ను రక్షించేందుకు చేపట్టిన చర్య మినహా ఇరాన్లో అమెరికా బలగాల ప్రత్యక్ష మోహరింపునకు సంబంధించిన ఘటనలు పరిమితంగానే ఉన్నట్లు సమాచారం.ట్రంప్‌పైనా గతంలో ముప్పు?ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కూడా ఇరాన్ వైపు నుంచి గతంలో హత్యా ముప్పులు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఆ నేపథ్యంలో ట్రంప్ భద్రతా ఏర్పాట్లపై కూడా అప్పట్లో పలు కథనాలు వెలువడ్డాయి. తాజాగా అమెరికా సైనికులపై నేరుగా నజరానా ప్రకటించడం.. ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తతలతో ఉన్న అమెరికా-ఇరాన్ సంబంధాలను మరింత ప్రమాదకర దిశలోకి తీసుకెళ్లే పరిణామంగా మారింది. -
ట్రంప్‌కు మళ్లీ కోపమొచ్చింది! ఈసారి..
ఇరాన్‌పై యుద్ధ వ్యూహంలో తమతో కలిసిరాని మిత్రదేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ట్రంప్.. ఇప్పుడు మరో మిత్రదేశంపై గుర్రుగా ఉన్నారు. ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా చేపడుతున్న చర్యలకు మద్దతు ఇవ్వకపోవడంపై దక్షిణ కొరియాపై అసహనం వ్యక్తం చేసిన ఆయన.. సంయుక్త సైనిక విన్యాసాలను గణనీయంగా తగ్గించాలని పెంటగాన్‌ను ఆదేశించారు.ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌ను అణు ఆయుధాల నుంచి దూరం చేసే ప్రయత్నాల్లో అమెరికాతో కలిసి పనిచేయాలా అని దక్షిణ కొరియా అధ్యక్షుడిని ఇటీవల అడిగానని.. అందుకు సియోల్ "వద్దు, ధన్యవాదాలు" అంటూ సమాధానం ఇచ్చిందని ట్రంప్ పేర్కొన్నారు. సైనిక విన్యాసాలపై ట్రంప్ నిర్ణయందక్షిణ కొరియా నిర్ణయంతో అసంతృప్తి చెందిన ట్రంప్.. అమెరికా, దక్షిణ కొరియా మధ్య జరిగే వార్షిక సంయుక్త సైనిక విన్యాసాలను భారీగా తగ్గించాలని రక్షణ శాఖకు ఆదేశించినట్లు తెలిపారు. అయితే ఈ ఏడాది జరగనున్న ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్ (Ulchi Freedom Shield) విన్యాసాలను పూర్తిగా రద్దు చేసే అవకాశం లేకపోయిందని చెప్పారు. ముందుగానే ప్రణాళిక ఖరారైందని, అందుకే పూర్తిగా నిలిపివేయలేకపోతున్నామని స్వయంగా ట్రంపే తెలిపారు. ఈ సైనిక విన్యాసాలు ఆగస్టు 17 నుంచి 27 వరకు జరగనున్నాయి.ఉత్తర కొరియాపై ట్రంప్ వ్యాఖ్యలుఅమెరికా-దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలపై తన అసంతృప్తికి మరో కారణంగా ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో తనకు ఉన్న మంచి సంబంధాలను కూడా ట్రంప్ ప్రస్తావించారు. ఈ విన్యాసాలు భారీ ఖర్చుతో కూడుకున్నవని, ఉత్తర కొరియాకు అనవసరంగా శత్రుత్వ సంకేతాలు పంపుతున్నాయని ఆయన అన్నారు. తన అధ్యక్ష పదవీకాలంలో ఉత్తర కొరియా ఎలాంటి ముప్పు కలిగించకుండా గౌరవప్రదంగా వ్యవహరించిందని పేర్కొన్నారు.మాంచి స్నేహంఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మధ్య సంబంధాలు అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రత్యేక చర్చకు దారితీశాయి. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. పరస్పరం ఇద్దరు నేతలు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. అయితే 2018లో సింగపూర్‌లో జరిగిన చారిత్రక భేటీతో ట్రంప్–కిమ్ సంబంధాల్లో కీలక మలుపు వచ్చింది. ఆ తర్వాత కూడా కిమ్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని ట్రంప్ పలుమార్లు పేర్కొన్నారు.ఇరాన్‌పై అమెరికా ఒత్తిడి వ్యూహంఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా ఒత్తిడి పెంచుతున్న సమయంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరాన్‌ను అణు ఆయుధాల నుంచి దూరంగా ఉంచేందుకు మిత్రదేశాల మద్దతును కూడగట్టే ప్రయత్నాల్లో భాగంగానే అమెరికా చర్యలు కొనసాగుతున్నాయి. దక్షిణ కొరియా వైఖరి, అమెరికా సైనిక నిర్ణయం రెండు దేశాల మధ్య భద్రతా సహకారంపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు.ఉ.కొరియా సవాల్‌కు..ఇటు.. దక్షిణ కొరియాతో సంయుక్త సైనిక విన్యాసాలను తగ్గిస్తామని ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఆసియా భద్రతా వర్గాల్లో చర్చకు దారితీసింది. సాధారణంగా అమెరికా-దక్షిణ కొరియా నిర్వహించే ఈ డ్రిల్స్ ఉత్తర కొరియా క్షిపణి, అణు బెదిరింపులకు ప్రతిస్పందనగా భావిస్తారు. ఇటీవలి కాలంలో ఉత్తర కొరియా వరుసగా బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు నిర్వహిస్తూ అమెరికా, దాని మిత్రదేశాలకు సవాలు విసురుతోంది. ఇలాంటి సమయంలో సంయుక్త సైనిక విన్యాసాల తీవ్రత తగ్గితే అది కిమ్ దేశానికి ఎలాంటి సంకేతాలు ఇస్తుందనే చర్చ మొదలైంది.అయితే ట్రంప్ మాత్రం ఈ నిర్ణయాన్ని ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలతో ముడిపెట్టలేదు. కిమ్ జోంగ్ ఉన్‌తో తనకు ఉన్న సంబంధాలు, భారీ ఖర్చుతో కూడిన సైనిక విన్యాసాల అవసరంపై ఆయన ఎక్కువగా ప్రస్తావించారు. మరోవైపు దక్షిణ కొరియాకు అమెరికా భద్రతా హామీలు కొనసాగుతాయని నిపుణులు చెబుతున్నప్పటికీ.. డ్రిల్స్ తగ్గింపు ఉత్తర కొరియా వైఖరిపై ప్రభావం చూపుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. -
ట్వీట్ తో హార్మోజ్ ను స్వాధీనం చేసుకోలేరు.. ట్రంప్ కు ఇరాన్ కౌంటర్
-
అలా చేస్తేనే.. దారి తెరుస్తాం.. ట్రంప్‌కు ఇరాన్ దిమ్మతిరిగే కౌంటర్
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరుకున్నాయి. హార్ముజ్ జలసంధిని ఎప్పుడు తెరవాలి, ఎప్పుడు మూసివేయాలన్నది ఇరాన్ నిర్ణయమేనని ఆ దేశ డిప్యూటీ విదేశాంగ మంత్రి కాజెమ్ ఘరీబాబాది స్పష్టం చేశారు. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓటమి వాస్తవాన్ని అంగీకరించండి.. ఊహల్లో విహరించడం ఆపండి. అప్పటివరకు ఇరాన్ దిగ్బంధాన్ని కొనసాగిస్తుంది అంటూ హెచ్చరించారు. కేవలం ఆదేశాలు ఇవ్వడం, ట్వీట్ చేయడం లేదా యుద్ధనౌకలను మోహరించడం ద్వారా జలసంధిపై నియంత్రణ సాధించలేరని అమెరికాకు కౌంటరిచ్చారు.మరోవైపు, ప్రపంచంలోని కీలక చమురు రవాణా మార్గాల్లో ఒకటైన హార్ముజ్ జలసంధిలో రాకపోకలు భారీగా పడిపోయాయి. శుక్రవారం కేవలం రెండు నౌకలు మాత్రమే ఈ మార్గం గుండా వెళ్లినట్లు షిప్ ట్రాకింగ్ సంస్థ Kpler విశ్లేషణ తెలిపింది. వాటిలో ముడి చమురు రవాణా కనిపించకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. యుద్ధానికి ముందు రోజుకు 130కి పైగా నౌకలు ఈ మార్గంలో ప్రయాణించేవి. జలసంధి మూసివేత కొనసాగితే చమురు, ఇంధన సరఫరాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పటికే అమెరికాలో పెరుగుతున్న పెట్రోల్ ధరలను ప్రజలు భరించాల్సి ఉంటుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. మరోవైపు.. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు వేగంగా పెరుగుతున్నాయి.ఇదే సమయంలో హార్ముజ్ జలసంధిని త్వరలో అమెరికా భూభాగంగా ప్రకటిస్తానని ట్రంప్ చెప్పడం పరిస్థితిని మరింత ఉత్కంఠభరితంగా మార్చింది. ఇరాన్‌తో ఒప్పందం కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ, అవసరమైతే ఆ దేశంపై ఆర్థికంగా మరింత కఠిన చర్యలు తీసుకుంటామని ట్రంప్ హెచ్చరించారు. ఒకవైపు హార్ముజ్‌పై ఇరాన్ పట్టు.. మరోవైపు దాన్ని అమెరికా భూభాగంగా ప్రకటిస్తామంటున్న ట్రంప్.. ఈ ప్రతిష్ఠంభన ఎటు దారితీస్తుందన్నదే ఇప్పుడు ప్రపంచ దేశాల ఆందోళన.చర్చలకు నో ఛాన్స్?ఇదిలా ఉండగా.. అమెరికా-ఇరాన్ మధ్య దౌత్య చర్చలు కూడా ముందుకు కదలడం లేదు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి.. అమెరికాతో చర్చలు పునఃప్రారంభించడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఖతార్, పాకిస్తాన్ వంటి దేశాలు మధ్యవర్తిత్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. అవి అధికారిక శాంతి చర్చలు కాదని ఇరాన్ స్పష్టం చేసింది. -
ఇరాన్‌కు ఖతార్ స్ట్రాంగ్ కౌంటర్.. ముగ్గురు పైలట్లపై బిగ్ సస్పెన్స్!
గల్ఫ్ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగేలా ఇరాన్-ఖతార్ మధ్య పైలట్ల వివాదం తెరపైకి వచ్చింది. ముగ్గురు ఇరాన్ యుద్ధ విమాన పైలట్లను ఖతార్ బలగాలు సజీవంగా పట్టుకున్నాయని ఇరాన్ వర్గాలు ప్రకటించగా ఖతార్ మాత్రం ఆ ఆరోపణలను పూర్తిగా ఖండించింది.ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ IRNA కథనం ప్రకారం, మార్చిలో ఖతార్‌లోని ఒక సైనిక స్థావరంపై దాడి చేసే మిషన్‌లో పాల్గొన్న మూడు యుద్ధ విమానాలు దెబ్బతిన్నాయి. వాటిలోని పైలట్లు విమానాల నుంచి బయటకు దూకిన అనంతరం ఖతార్ బలగాలకు చిక్కారని ఇరాన్ సైనిక అధికారి పేర్కొన్నారు. ఈ ముగ్గురి ఆచూకీ కోసం అంతర్జాతీయ రెడ్‌క్రాస్ సహాయం కోరినట్లు ఇరాన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ తెలిపింది. అయితే ఖతర్ కథనం పూర్తిగా భిన్నంగా ఉంది.ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ప్రకారం, ఆ ఇరాన్ పైలట్లు ఖతార్ గగనతలంలోకి ప్రవేశించారు. వారిని సంప్రదించేందుకు అధికారులు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ స్పందన రాలేదని తెలిపారు. అనంతరం చేపట్టిన గాలింపు, రక్షణ చర్యల్లో ఒక పైలట్ మృతదేహాన్ని మాత్రమే గుర్తించినట్లు ఖతార్ వెల్లడించింది. అంతేకాదు, ఆ మృతదేహాన్ని ఇరాన్‌కు అప్పగించే అంశంపై కూడా ఖతార్ సంప్రదింపులు జరిపిందని తెలిపింది. ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను పరిశీలించేందుకు ఇరాన్‌ను ఆహ్వానించినప్పటికీ, ఇప్పటివరకు స్పందన రాలేదని ఆరోపించింది.ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. ముగ్గురు పైలట్లు సజీవంగా ఖతార్ అదుపులో ఉన్నారా? లేక ఒక పైలట్ మాత్రమే మరణించాడా?. ఈ వివాదం కేవలం ముగ్గురు సైనికుల ఆచూకీకి సంబంధించినది కాదు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తతల్లో ఉన్న ప్రాంతంలో ఇరాన్, ఖతార్ మధ్య ఈ ఆరోపణలు కొత్త రాజకీయ, సైనిక పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. ఇరాన్‌పై జరిగిన దాడులకు ప్రతిస్పందనగా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలను కూడా ఇరాన్ లక్ష్యంగా చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గల్ఫ్ దేశాల్లోని స్థావరాలను అమెరికా, ఇజ్రాయెల్ తమ సైనిక చర్యలకు ఉపయోగించుకుంటున్నాయని ఇరాన్ చాలాకాలంగా ఆరోపిస్తోంది. అందుకే ఈ పైలట్ల వ్యవహారం ఇప్పుడు ఒక కీలక ప్రశ్నగా మారింది. -
హర్ముజ్‌ను అమెరికా భూభాగంగా ప్రకటిస్తా!: ట్రంప్
ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన హర్ముజ్ జలసంధిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటిదాకా కేవలం దాని నియంత్రణ మాత్రమే తమదేనంటూ ఆయన ప్రకటించుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే సైన్యం మోహరించామని చెబుతున్నారు. అయితే తాజాగా ఈ వ్యూహాత్మక జలమార్గాన్ని అమెరికా భూభాగంగా ప్రకటిస్తానని మరో సంచలనానికి తెర తీశారు. “ఇరాన్‌ను ఓడించడం ఖాయం. ఆ తర్వాత.. అతి త్వరలో హర్ముజ్ జలసంధిని అమెరికా భూభాగంగా ప్రకటిస్తాను” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ఈ నిర్ణయం ఎలా అమలు చేస్తారు? దీనికి అంతర్జాతీయంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అనే అంశాలపై ఆయన ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడమే తమ లక్ష్యమని ట్రంప్ చెబుతుండగా.. ఇరాన్‌పై మరింత కఠిన ఆర్థిక చర్యలు తీసుకుంటామని అమెరికా వర్గాలు చెబుతున్నాయి.‘కొంత ఎక్కువ చెల్లించాల్సి రావచ్చు’.. అమెరికన్లకు ట్రంప్ఇరాన్పై చర్యల కారణంగా ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉందని ట్రంప్ అంగీకరించారు. “అమెరికన్లు పెట్రోల్ కోసం కొంచెం ఎక్కువ చెల్లించాల్సి రావచ్చు. కానీ ఇరాన్ అణ్వాయుధ శక్తిగా మారకుండా అడ్డుకోవడం ప్రపంచానికి చేసే సేవ” అని అన్నారు.హర్ముజ్‌పై అధికారం మాదే: ఇరాన్ స్పష్టంట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ ఘాటుగా స్పందించింది. హర్ముజ్ జలసంధిపై నియంత్రణ తమదేనని ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి కాజెమ్ ఘరీబాబాది స్పష్టం చేశారు. “ఒక ట్వీట్‌తోనో, విమాన వాహక నౌకతోనో హార్ముజ్‌ను స్వాధీనం చేసుకోలేరు. ఇరాన్ ఓటమిని అంగీకరించే వరకు ఈ మార్గంపై మా నియంత్రణ కొనసాగుతుంది” అని ఆయన పేర్కొన్నారు.ప్రపంచానికి చమురు షాకే!ప్రపంచ ఇంధన మార్కెట్లకు హర్ముజ్ జలసంధి అత్యంత కీలకం. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురు, ఎల్ఎన్జీలో దాదాపు 20 శాతం ఈ మార్గం గుండా రవాణా అవుతుంది. అయితే ఫిబ్రవరి 28వ తేదీన మొదలైన అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో నౌకల రాకపోకలు భారీగా తగ్గాయి. ఫలితంగా ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 90 డాలర్లకు చేరువైంది. అమెరికాలో పెట్రోల్ ధర గ్యాలన్‌కు 4 డాలర్ల స్థాయికి చేరింది.నిలిచిన చర్చలు.. పెరుగుతున్న ఉద్రిక్తతఅమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చలు నిలిచిపోయాయి. యుద్ధాన్ని ముగించే దిశగా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. మరోవైపు ఇరాన్‌పై మరిన్ని ఆర్థిక ఆంక్షలు విధిస్తామని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ తెలిపారు.హర్ముజ్ జలసంధిపై ఆధిపత్యం కోసం సాగుతున్న ఈ పోరు కొనసాగితే.. ప్రపంచ చమురు సరఫరా, ఇంధన ధరలపై మరింత ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


