దుబాయ్: ఇరాన్‌పై అమెరికా సైన్యం ప్రతీకారంతో రగిలిపోతోంది. జోర్డాన్‌లో జరిగిన దాడిలో ఇద్దరు అమెరికా జవాన్లు మరణించడంతో యుద్ధం మరింత ఉధృతమవుతోంది. అమెరికా ఆదివారం ఇరాన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. వైమానిక దాడులకు దిగింది. క్షిపణులు డ్రోన్లు, ప్రయోగించింది. ఇరాన్ సైతం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా జోర్డాన్‌లో అమెరికా స్థావరాలపై గురిపెట్టింది.
రానున్న రోజుల్లో ఇది పూర్తిస్థాయి యుద్ధంగా మారే సూచనలు కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. కోట్ల మంది ఆధారమైన పౌర మౌలిక సదుపాయాలను ఇరుపక్షాలు లక్ష్యంగా చేసుకుంటున్నాయి. జోర్డాన్‌లో శుక్రవారం జరిగిన దాడికి ప్రతిస్పందనగా ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్‌జీసీ)పై ఆదివారం భీకర దాడుల చేసినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది.
మరోవైపు ఇరాన్ వైమానిక దాడుల నుంచి రక్షించుకోవడానికి బహ్రెయిన్, కువైట్, జోర్డాన్ తమ గగనతల రక్షణ వ్యవస్థలను క్రియాశీలం చేశాయి. తమ పొరుగు దేశమైన జోర్డాన్ వైపు ప్రయోగించిన క్షిపణుల వల్ల మంటలు భూభాగంలోకి వ్యాపించే అవకాశం ఉందని, అదే జరిగితే ఇరాన్‌కు తగిన బుద్ధి చెప్తామని ఇజ్రాయెల్ హెచ్చరించింది.
ఇరాన్ అణు విద్యుత్ కేంద్రం నిర్మాణ స్థలంపై దాడి
ఇరాన్ సైనిక తీరప్రాంత నిఘా, గగనతల రక్షణ వ్యవస్థలు, క్షిపణి, డ్రోన్ నిల్వ స్థావరాలపై దాడి చేసినట్లు అమెరికా మిలటరీ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. హార్మూజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణను దెబ్బతీయడానికి, ఐఆర్‌జీసీ దళాలను శిక్షించడానికి వ్యూహం రూపొందించినట్లు పేర్కొంది. నైరుతి ప్రాంతంలో నిర్మించతలపెట్టిన అణు విద్యుత్ కేంద్రం నిర్మాణ స్థలాన్ని అమెరికా లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపినట్లు ఇరాన్ అణు శక్తి సంస్థ పేర్కొంది.


