మొజ్తాబా ఖమేనీ మరో సంచలన వీడియో విడుదల | Mojtaba Khamenei Voice Finally Heard Video Goes Viral, Iran Releases Rare Footage Of Supreme Leader, Voice Heard For First Time | Sakshi
Sakshi News home page

మొజ్తాబా ఖమేనీ మరో సంచలన వీడియో విడుదల

Aug 25 2026 9:35 AM | Updated on Aug 25 2026 10:50 AM

Mojtaba Khamenei Voice Finally Heard: Iran Shares New Video

ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఉనికిపై సస్పెన్స్‌ నెలకొన్న సమయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మొజ్తబా ఖమేనీకి సంబంధించిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఈసారి ఆయన స్వరం కూడా వినిపించింది. తొలిసారి మొజ్తబా ఖమేనీ గొంతు వినిపించగా.. యుద్ధం తర్వాత మరోసారి తేదీ లేని వీడియో విడుదలైంది. 

ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తబా అలీ ఖమేనీ మతపరమైన విద్యా అధ్యయన సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న అరుదైన వీడియోను ఇరాన్‌ తొలిసారిగా విడుదల చేసింది. ఈ వీడియోలో మొజ్తబా.. ఓ విద్యార్థి తన థీసిస్‌ను వివరిస్తుండగా వింటూ.. ఆ పరిశోధనపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మొజ్తబా ఆరోగ్యంపై అనే సందేహాలు వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది.

ఇదీ చదవండి: ట్రంప్‌ ఉక్కుపాదం.. ఇరాన్‌పై ‘ఎకనామిక్‌ డీ-డే’!

ఫిబ్రవరి 28న అమెరికా–ఇజ్రాయెల్‌ సమన్వయ దాడుల్లో ఆయన తండ్రి ఖమేనీ మృతి చెందగా.. ఆ దాడుల్లో మొజ్తబా తీవ్రంగా గాయపడినట్లు వార్తలు వచ్చాయి. ఇరాన్‌కు చెందిన ఫార్స్‌ వార్తా సంస్థ తాజా వీడియోను విడుదల చేసింది. ఇందులో మొజ్తబా గొంతు కూడా తొలిసారిగా వినిపించింది. ఇరాన్‌ పాలనా వ్యవస్థలోని ‘ఇస్లామిక్‌ సెక్యూరిటీ మోడల్‌’ గురించి ఆయన విద్యార్థులకు వివరిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. అయితే ఈ వీడియో ఎప్పుడు చిత్రీకరించారన్న విషయం మాత్రం స్పష్టంగా తెలియలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement