breaking news
Chiranjeevi
-
కాజల్, తమన్నాని గుర్తుపట్టలేకపోయిన చిరంజీవి!
మెగాస్టార్ చిరంజీవి.. 70 ఏళ్లు దాటినా నేటి తరం హీరోలకు పోటీ ఇచ్చేలా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇకపై ఏడాదికి ఒక సినిమా వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ స్థాయికి తగ్గ విజయం దక్కలేదనే మెగా అభిమానుల బాధ.. ‘మనశంకర వరప్రసాద్ గారు’ చిత్రంతో తీరిపోయింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద రూ. 350 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. మెగా ఫ్యాన్స్‌తో పాటు చిరంజీవి కూడా ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. తన సంతోషాన్ని షేర్ చేసుకోవడానికి తాజాగా సీనియర్ పాత్రికేయులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తన సినీ కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. రాజకీయాల్లోకి వెళ్లడంతో దాదాపు పదేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరమైనా.. ఆ ఫీలింగ్ కలగలేదట. కానీ రాజకీయాల్లో బిజీ కావడంతో కొత్తగా వచ్చిన నటీనటుల గురించే తెలుసుకోలేకపోయారట. రీఎంట్రీ తర్వాత చేసిన తొలి సినిమా ‘ఖైదీ 150’ లో హీరోయిన్గా నటించిన కాజల్ గురించి అప్పటి వరకు చిరంజీవికి తెలియట. ‘ఖైదీ 150 సినిమాలో కాజల్ హీరోయిన్ అని చెబితే.. అసలు కాజల్ ఎవరు అని అడిగేశా. అంతలా ఇండస్ట్రీని మర్చిపోయా. తమన్నా అంటే ఎవరో కూడా తెలియదు. అంతలా ఇండస్ట్రీని మర్చిపోయాను. రీఎంట్రీ తర్వాత ఇండస్ట్రీని ఎంత గా మిస్ అయ్యానో అర్థమైంది’ అని చిరంజీవి అన్నారు. అంతేకాదు తన అనుభవాలన్నీ కలిసి కొన్ని పాడ్ కాస్ట్‌లు చేయాలనే ఆలోచన కూడా ఉందని చెప్పారు. -
'పొగరెక్కిన పోటుగాడు కంచె దాటినాడే'.. క్రేజీ సాంగ్ వీడియో
చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమా ‘మన శంకరవరప్రసాద్ గారు’నుంచి తాజాగా వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. మూవీలో చాలా ఫన్నీగా సాగిన ఈ గీతాన్ని చిరంజీవినే పాడటం విశేషం. 'ఆ పెద్దిరెడ్డి వీధి మొదలు పెద్ద వదిన గారు' అంటూ సాగే ఈ పాటకు బాగానే విజిల్స్ పడ్డాయి. పొగరెక్కిన పోటుగాడు కంచెదాటినాడే అనే చరణం నుంచి చిరు తన గొంతు కలుపుతారు. అందుకే ప్రత్యేకంగా యూట్యూబ్‌లో ఈ సాంగ్‌ను విడుదల చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే రూ. 350 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. ఇందులో వెంకటేశ్ వెంకీ గౌడగా అతిథి పాత్రలో కనిపించి నవ్వులతో మెప్పించగా నయనతార తనదైన రీతిలో మంచి నటనతో ఆకట్టుకుంది. -
చిరంజీవి చెప్పింది తప్పు.. సింగర్ చిన్మయి షాకింగ్ కామెంట్స్
-
చిరంజీవి కాస్టింగ్ కౌచ్ వ్యాఖ్యలపై 'చిన్మయి' కౌంటర్
‘మనశంకర వరప్రసాద్’ మూవీ సక్సెస్ మీట్లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది లేదని మాట్లాడారు. ఈ వ్యాఖ్యలను ప్రముఖ సింగర్ చిన్మయి విభేదించారు. అయితే, చిరంజీవి పట్ల గౌరంవంగానే ఆమె స్పందించారు. కానీ, ఇండస్ట్రీలో మహిళల పట్ల జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ గురించి ఆమె మరోసారి బలంగానే రియాక్ట్ అయ్యారు.చిరంజీవి వ్యాఖ్యలపై చిన్మయి ఇలా స్పందించారు. 'ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదు అనేది పూర్తిగా అపద్దం. ఇంగ్లీష్‌లో ‘కమిట్మెంట్’ అంటే వృత్తి పట్ల నిబద్ధత అని అర్థం వస్తుంది.. కానీ, ఇండస్ట్రీలో ఆ పదానికి అర్థం పూర్తిగా వేరు ఉంటుంది. మహిళలు తమ శరీరాన్ని అప్పగించకపోతే ఇండస్ట్రీలో ఛాన్సులు రావు. ఇక్కడ చాలామంది మగవారు మహిళల నుంచి లైంగిక ప్రయోజనాలను ఆశించడం సర్వసాధారణం. లెజెండరీ చిరంజీవి గారి తరం వేరు.. ఇప్పుడు జరుగుతున్నది వేరు. చిరంజీవి జనరేషన్లో మహిళా ఆర్టిస్టులను గౌరవించేవారు… ప్రస్తుతం పరిశ్రమలో అలాంటి వాతావరణం లేదు. చిరు తరంలో మహిళా కళాకారులతో స్నేహితులుగా తమ కుటుంబ సభ్యులుగా ఉండేవారు. ఒకరినొకరు గౌరవించుకునేవారు. లెజెండ్లతో పనిచేసిన వారందరూ లెజెండ్లే. చిరు నాటి రోజులు ఇప్పుడు లేవు ' అని చిన్మయి పేర్కొంది. ఇదే సందర్భంలో తనకు జరిగిన అన్యాయాన్ని కూడా చిన్మయి లేవనెత్తారు. లిరిసిస్ట్ వైరాముత్తు తనను లైంగికంగా వేధించిన సమయంలో తన తల్లి అక్కడే ఉందని ఆమె గుర్తుచేసుకున్నారు. తన తల్లి పక్కనే ఉన్నా సరే మగవారి బుద్ధి చూపించాడని వైరాముత్తు గురించి విరుచుకుపడింది. తనపై లైంగిక దాడి చేయమని కోరుకోలేదని, సినిమా ఛాన్సుల కోసమే తనతో కలిసి పనిచేశానంది. అతన్ని ఒక గురువుగా, పురాణ గీత రచయితగా గౌరవించానని ఆమె గుర్తుచేసుకుంది. సీనియర్ నటి షావుకారు జానకి వంటి వారు కూడా మీటూ ఉద్యమాన్ని అర్థం చేసుకోలేదని చిన్మయి వాపోయింది. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ బాధితులను అవమానించారని గుర్తుచేసుకుంది. ఇండస్ట్రీ ఎప్పటికీ అద్దం లాంటిది కాదని, ఇక్కడ పని కావాలంటే శరీరం ఇవ్వాల్సిందేనని దానిని కోరుకునే పురుషులే ఎక్కువ ఉన్నారని ఆమె తెలిపింది.Casting couch is rampant, women are refused roles if they don’t offer ‘full commitment’ - a word that means completely different in the film industry.If you come from an English educated background and believe ‘commitment’ means ‘professionalism’, showing up to work and being…— Chinmayi Sripaada (@Chinmayi) January 26, 2026 -
'మన శంకరవరప్రసాద్ గారు' రూ. 350 కోట్ల జర్నీ
చిరంజీవితో అనిల్ రావిపూడి సినిమా చేస్తున్నారని ప్రకటన వచ్చినప్పుడు పెద్దగా ఎవరూ నమ్మలేదు. విశ్వంభర వంటి సినిమా ఉండగా అనిల్‌తో ప్రాజెక్ట్ ఏంటి అంటూ చెప్పుకొచ్చారు. అయితే, సెడెన్‌గా అధికారికంగా ప్రకటన రావడంతో ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు. సినిమా షూటింగ్‌తో పాటు విడుదల వరకు పనులు అన్నీ వేగంగా పూర్తి అయ్యాయి. దీంతో జనవరి 12న ‘మన శంకరవరప్రసాద్ గారు’ థియేటర్లోకి వచ్చేశాడు. మొదటి ఆటతోనే హిట్ టాక్ తెచ్చుకుని భారీ కలెక్షన్స్ సాధించాడు.‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా రెండు వారాలు పూర్తి చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 350 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ క్రమంలో తాజాగా ఒక వీడియోను మేకర్స్ విడుదల చేశారు. సినిమా ప్రకటన నుంచి థియేటర్స్‌లో సక్సెస్ సెలబ్రేసన్స్ వరకు ఉన్న ప్రధాన అంశాలను ఒక వీడియోలో చూపించారు. నెట్టింట వైరల్ అవుతున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ మెమోరీస్ మీరూ చూసేయండి. -
ఫ్లాప్ వస్తే ఎవర్నీ తిట్టను.. బాధ్యత నాదే! కొరటాలకు కౌంటర్?
'మన శంకరవరప్రసాద్‌గారు' సినిమా సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఈ మూవీ విజయోత్సవ వేడుకల్లో చిరు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఆయన మాట్లాడుతూ.. ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య.. ఈ రెండు సినిమాల షూటింగ్‌కు ఉత్సాహంగా వెళ్లాను. మళ్లీ మన శంకరవరప్రసాద్‌గారు షూటింగ్ కూడా అంతే ఎంజాయ్ చేశాను. నేనే బాధ్యత తీసుకుంటా..ఈ సినిమాలన్నీ సక్సెస్ఫుల్ అయ్యాయి. మధ్యలో కొన్ని సినిమాలు ఏదో డౌట్‌గా అనిపించాయి. వాటిని నేను తప్పుపట్టను. తప్పు నా మీద వేసుకుంటాను కానీ ఒకరిపై నెట్టను అన్నాడు. దీంతో ఆచార్య సినిమా విషయంలో వచ్చిన విమర్శలకు చిరు కౌంటరిచ్చాడంటూ నెట్టింట చర్చ మొదలైంది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటించిన మూవీ ఆచార్య (2022). ఎవరి పని వాళ్లు చేసుకుంటే బెటర్ఆ సినిమా డిజాస్టర్ కాగా దానికి కొరటాలే కారణమని చిరంజీవి అన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అనంతరం ఓ ఇంటర్వ్యూలో కొరటాల శివ.. ఎవరి పని వాళ్లు చేసుకుంటే ఈ ప్రపంచమంతా హ్యాపీగా ఉంటుంది అని కామెంట్స్ చేశాడు. ఆచార్య స్క్రిప్ట్ విషయంలో చిరంజీవి జోక్యం చేసుకోవడం వల్లే ఫ్లాప్ అయిందన్న ఆరోపణలు వస్తున్న సమయంలో కొరటాల ఇలాంటి కామెంట్స్ చేశాడు. దీంతో ఆయన చిరంజీవిని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశాడని పలువురూ భావించారు.డైరెక్టర్‌కు కౌంటర్?అయితే కొరటాల మాత్రం.. సాధారణంగా పని గురించి మాట్లాడాను తప్ప ఆ వ్యాఖ్యల వెనక మరో ఉద్దేశం లేదని వివరణ ఇచ్చాడు. అయినప్పటికీ నెట్టింట చర్చ మాత్రం ఆగలేదు. ఇప్పుడు చిరంజీవి తన కామెంట్స్‌తో.. తాజాగా కొరటాల శివకు పరోక్షంగా కౌంటరిచ్చారని పలువురు భావిస్తున్నారు.చదవండి: 3 సబ్జెక్టులు ఫెయిల్.. చిరంజీవి పరువు తీయొద్దన్నా.. అనిల్ రావిపూడి తండ్రి -
3 సబ్జెక్ట్స్ ఫెయిల్.. చిరంజీవి పరువు తీయకురా అంటే..
పుత్రోత్సాహం.. కొడుకు పుట్టినప్పుడు కాదు ప్రయోజకుడైనప్పుడు తండ్రికి కలుగుతుంది. ప్రయోజకుడైన అనిల్ రావిపూడిని చూసి ఆయన తండ్రి బ్రహ్మయ్య కూడా అంతే సంతోషపడుతున్నాడు. కాకపోతే కొడుకు ఫెయిల్యూర్స్ నుంచి సక్సెస్ దిశగా సాగిన ప్రయాణాన్ని మన శంకరవరప్రసాద్‌గారు ఇండస్ట్రీ హిట్ సెలబ్రేషన్స్‌లో బ్రహ్మయ్య గుర్తు చేసుకున్నాడు.కుళ్లుగా ఉందిముందుగా ఇండస్ట్రీకి ఇంతమంచి దర్శకుడినిచ్చినందుకు చిరంజీవి బ్రహ్మయ్యను ప్రశంసించాడు. బ్రహ్మయ్య ప్రతిరోజు సెట్‌కు వచ్చి కొడుకు ఎదుగుదలను చూసి సంతోషించేవాడు. ఈయన్ను చూస్తే నాకే కుళ్లు వచ్చేస్తుంది. నాకంటే ఎక్కువ పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నాడు. ఆర్టీసీ డ్రైవర్‌గా కష్టపడి కొడుకును చదివించాడు. అయితే సినిమాల్లో అనిల్ రావిపూడిని చెడగొట్టిందే ఈయన. ఇంకేం కావాలిఅనిల్ ఎనిమిదేళ్ల వయసున్నప్పుడు నాన్నా.. చిరంజీవి సినిమా రిలీజైందనగానే అమ్మకు చెప్పకు పదా అని సినిమాకు తీసుకెళ్లేవాడు. నేను సినిమాల్లో వేసుకున్న డ్రెస్‌లను కొడుక్కి కుట్టించి అతడు డ్యాన్స్ చేసుంటే సంతోషపడ్డాడు ఇప్పుడు కొడుకు ఇంత గొప్ప దర్శకుడు అయి సూపర్ స్టార్స్‌ను డైరెక్ట్ చేస్తుంటే తండ్రిగా అతడికి ఇంకేం కావాలి అని మెచ్చుకున్నాడు.మూడు సబ్జెక్ట్స్ ఫెయిల్బ్రహ్మయ్య మాట్లాడుతూ.. నా కొడుకు బీటెక్ చదివేటప్పుడు మూడో సంవత్సరంలో మూడు సబ్జెక్టులు పోయాయి. చిరంజీవి సినిమాలు తెగ చూసేవాడు. అప్పుడు నేను.. చిరంజీవికి చెడ్డ పేరు తీసుకురాకురా.. ఆయన సినిమాలు చూసి చెడిపోయావంటారు అని భయపెట్టాను. దాంతో చదువు పూర్తి చేసి చిరంజీవిని డైరెక్ట్ చేసే స్థాయికి వచ్చాడు.చిరంజీవి స్పీడ్అనిల్ వంద మైళ్ల స్పీడులో సినిమా తీస్తే చిరంజీవి దాన్ని 200 మైళ్ల స్పీడులో ముందుకు తీసుకెళ్లాడు. ఉదయం తొమ్మిదిన్నరకు షూటింగ్ అంటే ఏడున్నరకే ఆయన సెట్లో ఉండేవాడు. మేము ఆదరాబాదరాగా పరిగెత్తేవాళ్లం అని చెప్పుకొచ్చాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో చిరంజీవి హీరోగా నటించిన మన శంకరవరప్రసాద్‌గారు మూవీ రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే!చదవండి: మన శంకరవరప్రసాద్‌గారు మూవీలో రమణ గోగుల్ సాంగ్ డిలీట్.. ఎందుకంటే? -
పద్మ అవార్డు విజేతలకు చిరంజీవి శుభాకాంక్షలు
కేంద్రప్రభుత్వం ప్రకటించిన పద్మ విభూషణ్, పద్మ భూషణ్ అవార్డ్ విజేతలకు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు. బాలీవుడ్ నటుడు ధర్మేంద్రకు పద్మ విభూషణ్ దక్కడం సంతోషంగా ఉందని చిరు పేర్కొన్నారు. ప్రియమైన నటుడు మమ్ముట్టి, డాక్టర్ నోరి దత్తాత్రేయుడుకు పద్మ భూషణ్ అవార్డ్ దక్కడం సంతోషంగా ఉందన్నారు. ప్రియమైన మిత్రులు మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్, సోదరుడు మాధవన్, మన ఛాంపియన్ రోహిత్ శర్మ, ప్రపంచ కప్ విజేత కెప్టెన్ హర్మన్ ప్రీత్‌లు పద్మశ్రీని అందుకోవడం అభినందనీయం అన్నారు. కళలు, సైన్స్, వైద్యం, సాహిత్యం, క్రీడల రంగాలలో విశేష కృషి చేసిన 2026 పద్మ అవార్డు గ్రహీతలందరికీ హృదయపూర్వక అభినందనలు అంటూ చిరు పేర్కొన్నారు. Honouring such distinguished individuals brings great pride and joy…Sri Dharamji’s Padma Vibhushan, my dear @mammukka and Dr Dattatreyudu Nori garu’s Padma Bhushan are recognitions earned through decades of dedication, excellence and grace.Very happy to see dear friends…— Chiranjeevi Konidela (@KChiruTweets) January 26, 2026 -
అనిల్ రావిపూడికి చిరు కార్ గిఫ్ట్.. ధర ఎంతో తెలుసా..!
-
‘మనశంకర వరప్రసాద్ గారు’ మూవీ బ్లాక్‌బస్టర్ సక్సెస్‌మీట్ (ఫొటోలు)
-
సుస్మితకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు: చిరంజీవి
మనశంకర వరప్రసాద్ గారు మూవీ బ్లాక్‌బస్టర్ కావడంతో తాజాగా సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. చిత్ర యూనిట్‌తో పాటు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ ఈ వేడుకలో పాల్గొన్నారు. రెండువారాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ రూ. 350 కోట్ల క్లబ్లో చేరింది. దీంతో ఈ చిత్ర నిర్మాతలుగా సాహు గారపాటి, సుస్మిత కొణిదెల విజయం అందుకున్నారని చిరు పేర్కొన్నారు. ఈ క్రమంలో తన కూతురు సుస్మిత ఒక నిర్మాతగా పడిన కష్టం గురించి చిరు పలు విషయాలను పంచుకున్నారు.సుస్మిత గురించి చిరంజీవి ఇలా అన్నారు. 'చరణ్ వద్ద సలహా తీసుకున్న తర్వాతే సుస్మిత ఇండస్ట్రీలోకి వచ్చింది. రంగస్థలం మూవీ కోసం కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన ఆమె ఒక నిర్మాతగా మరో అడుగు ముందుకు వేసింది. సుస్మిత అనుకుంటే ఇంట్లో ఉన్న హీరోలతో సినిమాలు చేయవచ్చు. కానీ, ఆమె మొదట వెబ్ సీరిస్‌లను నిర్మించి నిర్మాతగా పలు విషయాలను తెలుసుకుంది. ఆ తర్వాతే మరో నిర్మాత సాహు గారపాటితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ ప్రయాణంలో ఆమెకు నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. నిర్మాతలుగా వారిద్దరే చెరో సగం పెట్టుబడి పెట్టారు. డబ్బు అవసరం అయితే అప్పుగా తెచ్చుకుంది కానీ నన్ను ఎన్నడూ అడగలేదు. పలు దపాలుగా నా రెమ్యునరేషన్ కూడా సమయానికి ఇచ్చేశారు. కూతురుగా కాకుండా ఒక నిర్మాతగా చాలా ప్రొఫెషనల్‌గా సుస్మిత పనిచేసింది. ఈ మూవీకి చాలా డబ్బు పెట్టుబడి పెట్టి ఆమె విజయం సాధించడంతో ఒక తండ్రిగా నేను సంతోషిస్తున్నాను.' అని చిరు అన్నారు. ఆపై ‘మనశంకర వరప్రసాద్ గారు’ మూవీ గురించి మరిన్ని విషయాలను చిరు పంచుకున్నారు. పూర్తి వీడియోలో చూడండి. -
అనిల్ రావిపూడికి ఒక రేంజ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి (ఫోటోలు)
-
ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదు.. నాకు కష్టపడటంలోనే ఆనందం: చిరంజీవి
‘మనశంకర వరప్రసాద్’ సినిమా సక్సెస్ మీట్లో మెగాస్టార్ చిరంజీవి హాజరై తన అనుభవాలను పంచుకున్నారు. చిరంజీవి మాట్లాడుతూ అన్నం, అమ్మ, సినిమా సక్సెస్ ఎప్పుడూ బోర్ కొట్టదు. వింటేజ్ చిరంజీవితో పాటు ఆ వింటేజ్ షీల్డ్ లు ఈ సినిమా ద్వారా మళ్లీ చూడటం ఆనందంగా ఉంది. చిత్ర పరిశ్రమలోకి రావాలనుకునే యువతను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మగపిల్లలైనా, ఆడపిల్లలైనా ఎంకరేజ్ చేయాలి. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదు. ఇండస్ట్రీ అద్దం లాంటిది.. మనం ఎలా బిహేవ్ చేస్తామో రిజల్ట్ కూడా అలానే ఉంటుంది. ప్రతి ఒక్కరి వర్కింగ్ స్టైల్ వేరుగా ఉంటుంది. కొందరు ఔట్‌డోర్ యూనిట్ బిల్లులు ఎక్కువగా వెయ్యడం జరుగుతుంది. ఈ సినిమాను 85 రోజుల్లోనే అనుకున్న బడ్జెట్లో పూర్తి చేశాం. సంక్రాంతి సందర్భంగా విడుదలైన అన్ని సినిమాలు విజయవంతం కావడం సంతోషకరం. ఈ సినిమా సక్సెస్ అనంతరం కొందరు చెప్పిన మాటలు నన్ను ఎమోషనల్ ఫీలింగ్ కలిగించాయి. ఈ వయస్సులో కూడా ఎందుకు కష్టం అంటున్నారు.. నాకు కష్టపడటంలోనే ఆనందం. అందుకు తగ్గ ఉత్సాహం అభిమానుల శ్రేయోబిలాషుల ప్రశంసల నుంచే లభిస్తుందని అన్నారు. మెగాస్టార్ మాటలు అక్కడి అభిమానులను, చిత్రబృందాన్ని ఉత్సాహపరిచాయి. -
అనిల్ రావిపూడికి 'రేంజ్ రోవర్' గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి
రెండో ఇన్నింగ్స్‌లో చిరంజీవి సినిమాలైతే చేస్తున్నాడు గానీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ కాలేదు. కానీ ఈసారి సంక్రాంతికి మాత్రం చిరు ఫుల్ జోష్ చూపించాడు. 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీతో ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నాడు. ఇప్పటికే రూ.300 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాతలు ప్రకటించుకున్నారు. ఈ క్రమంలోనే చిరు.. దర్శకుడు అనిల్ రావిపూడికి ఖరీదైన బహుమతి ఇచ్చాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'సైక్ సిద్ధార్థ'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)గత పదేళ్ల కాలంలో 9 సినిమాలు చేసిన అనిల్ రావిపూడి.. ప్రతి దానితోనూ సక్సెస్ అందుకున్నాడనే చెప్పొచ్చు. 'ఎఫ్ 3'కి యావరేజ్ టాక్ వచ్చింది. ఇతడి సినిమాల్లో ఉండేది క్రింజ్ కామెడీ అని ట్రోల్స్ వస్తుంటాయి. కానీ ప్రతిసారి ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి అనిల్ చిత్రాలకు మంచి ఆదరణ దక్కుతూనే ఉంది. ఈసారి కూడా అదే ప్రూవ్ అయింది. దీంతో చిరు ఆనందంతో.. రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కారుని అనిల్‌కి గిఫ్ట్ ఇచ్చారు.అనిల్ రావిపూడి బహుమతిగా అందుకున్న ఈ కారు ధర హైదరాబాద్ మార్కెట్లో దాదాపు రూ.2 కోట్ల పైనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలని నిర్మాణ సంస్థ.. సోషల్ మీడియాలో పంచుకోగా అవి వైరల్ అవుతున్నాయి. ఈ మూవీలో చిరు సరసన నయనతార హీరోయిన్ కాగా, వెంకటేశ్ కీలక పాత్ర పోషించారు. భీమ్స్ అందించిన పాటలు జనాల్ని బాగానే ఎంటర్టైన్ చేస్తున్నాయి.(ఇదీ చదవండి: పవన్ ఫ్యాన్స్‌ని అన్‌బ్లాక్ చేసిన హరీష్ శంకర్!)A MEGA GIFT to the HIT MACHINE 🔥🔥🔥Moments of Megastar @KChiruTweets garu honouring @AnilRavipudi with a surprising gift, a brand-new Range Rover ❤️🔥#ManaShankaraVaraPrasadGaru THE ALL-TIME REGIONAL INDUSTRY BLOCKBUSTER 💥💥💥 pic.twitter.com/o3C2DvAoL1— Shine Screens (@Shine_Screens) January 25, 2026 -
ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు స్టార్ హీరోలు
మా తమ్ముళ్లు జెమ్స్ అని చిరంజీవి ఓ సినిమాలో డైలాగ్ చెప్తాడు. చిరంజీవి, వెంకటేశ్, నాగార్జునను ఒకేచోట చూసినప్పుడు అభిమానుల నోట కూడా ఇదే డైలాగ్ వస్తుంది. మా ముగ్గురు హీరోలు జెమ్స్ అని గొప్పగా చెప్పుకుంటారు. దశాబ్దాల తరబడి కొనసాగుతున్న స్నేహం వారిది.స్టార్ హీరోలు ఒకేచోటఎప్పుడు తారసపడ్డా ఆత్మీయంగా పలకరించుకుంటారు. ఆప్యాయంగా మాట్లాడుకుంటారు. ముగ్గురి ముఖాల్లోనూ వారికి తెలియకుండానే ఓ చిరునవ్వు కనిపిస్తుంది. తాజాగా ఈ స్టార్ హీరోలు మరోసారి కలిశారు. మేఘా సంస్థ అధినేత కృష్ణారెడ్డి ఇంట్లో ఓ పార్టీ జరగ్గా దానికి ఈ ముగ్గురూ హాజరయ్యారు. వీరితో డాక్టర్ గురవారెడ్డి ఓ ఫోటో దిగారు. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయగా నెట్టింట వైరల్‌గా మారింది. అదిరిపోయిన సంక్రాంతిఇది చూసిన అభిమానులు వీళ్లు అప్పటికీ.. ఇప్పటికీ.. యంగ్‌గానే కనిపిస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. చిరంజీవి ఇటీవలే సంక్రాంతి పండక్కి 'మన శంకర వరప్రసాద్‌గారు' సినిమాతో బ్లాక్‌బస్టర్ కొట్టాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీలో వెంకటేశ్ కీలక పాత్రలో నటించాడు. నయనతార కథానాయికగా నటించింది. ఈ చిత్రం ఇప్పటికే రూ.300 కోట్లు దాటేసింది.చదవండి: చిరంజీవి, వెంకటేశ్‌ల ఏంటీ బాసూ సంగతి.. పాట రిలీజ్ -
'హుక్ స్టెప్' అలా పుట్టింది: కొరియోగ్రాఫర్ ఆట సందీప్
ఈసారి సంక్రాంతి రిలీజైన సినిమాల్లో చిరంజీవి 'మన శంకర వరప్రసాద్' సక్సెస్ అందుకుంది. కంటెంట్ పరంగా కొత్తగా ఏం లేనప్పటికీ.. కుటుంబ ప్రేక్షకులకు దీన్ని చూసేందుకే ఎక్కువ ఆసక్తి చూపించారు. దీంతో రూ.300 కోట్లకు పైగా కలెక్షన్ వచ్చాయని మూవీ టీమ్ ప్రకటించారు. ఇందులో ప్రధానంగా చిరు వేసిన 'హుక్ స్టెప్' సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. అయితే ఆ స్టెప్ ఎలా పుట్టిందో కొరియోగ్రాఫర్ ఆట సందీప్ మాస్టర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఆ రికార్డ్ ఇకపై చిరంజీవి సొంతం!)'రేపు పాట షూటింగ్. ఇంకా హుక్ స్టెప్ కంపోజ్ చేస్తున్నాను. స్టెప్ రావట్లేదు. ఒకపక్కన ఫోన్ కాల్స్. నిజంగా చెబుతున్న ఆ టైంలో చాలా గందరగోళానికి గురయ్యా. భయం ఏంటంటే చిరంజీవితో సాంగ్ చేస్తున్నా. మరోవైపు వాళ్లు వీళ్లు ఊరికే ఫోన్ చేస్తున్నారు. నా భయం ఏంటంటే చిరంజీవి ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుందా? లేదంటే ఓ కాస్ట్యూమర్ చేస్తున్నాడా? డ్యాన్సర్స్ కోసం చేస్తున్నారా? లేదంటే ప్రాపర్టీస్ కోసం చేస్తున్నారా? ఎవరు చేస్తున్నారో తెలియట్లేదు. ఊరికే ఫోన్స్ వస్తున్నాయి. ఇంకా ఆ టైంలో నా ఫోన్‌ని తీసి నేలకేసి కొడదామనుకున్నా. అప్పటిదాకా రాని స్టెప్.. ఫోన్ పట్టుకోగానే వచ్చింది. అప్పుడు వచ్చిన స్టెప్ ఏదైతే ఉందో.. అదే హుక్ స్టెప్. నేను కంపోజ్ చేయడం ఒకత్తెయితే.. కూరకు ఉప్పు, మసాలా, కారం జోడించినట్లు చిరంజీవి గ్రేస్ కలిపారు' అని సందీప్ మాస్టర్ చెప్పాడు.దాదాపు 15-20 ఏళ్ల క్రితం డ్యాన్స్ షోలతో గుర్తింపు తెచ్చుకున్న సందీప్.. తోటి డ్యాన్సర్ జ్యోతిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లిద్దరూ కలిసి హైదరాబాద్‌లోనే డ్యాన్స్ స్కూల్స్ కూడా రన్ చేస్తున్నారు. దాదాపు 18 ఏళ్ల తర్వాత తనకు చిరంజీవితో పనిచేసే అవకాశమొచ్చిందని ఆట సందీప్ రీసెంట్ టైంలో పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. చూడటానికి సింపుల్‌గా అనిపించే ఈ స్టెప్.. అటు ఫ్యామిలీ ఆడియెన్స్, ఇటు కుర్రాళ్లకు బాగానే నచ్చేసిందని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: సిరై రివ్యూ: ప్రేక్షకుల్ని కంటతడి పెట్టించే సినిమా.. పోలీస్ ఉండేది ఇలానే) -
చిరంజీవి- వెంకీ 'సంక్రాంతి' సాంగ్ ఫుల్ వీడియో
చిరంజీవి- వెంకటేశ్ ఇద్దరూ కలిసి అదిరిపోయే రేంజ్లో తొలిసారి స్టెప్పులు వేశారు. సంక్రాంతి కానుకగా విడుదలైన మన శంకరవరప్రసాద్ గారు మూవీలో వారు నటించిన విషయం తెలిసిందే. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీ నుంచి తాజాగా 'అదిపోద్ది సంక్రాంతి' వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఇందులో చిరు, వెంకీ పోటీపడి స్టెప్పులు వేశారు. భీమ్స్ సంగీతం అందించగా.. కాసర్ల శ్యామ్ పాటను రాశారు. నకాశ్ అజీజ్, విశాల్ దడ్లానీ ఆలపించారు. ఫుల్ జోష్ తెప్పించే సాంగ్‌ను మీరూ చూసేయండి. -
సర్ప్రైజ్.. 'మన శంకర వరప్రసాద్‌గారి' కోసం వస్తున్న నయనతార
'మన శంకర వరప్రసాద్‌గారు' రెండో వారంలోనూ జోరు చూపిస్తున్నారు. శనివారం నాడు ఏకంగా లక్ష టికెట్లు బుక్‌మైషోలో అమ్ముడుపోయాయి. ఆపై గణతంత్ర దినోత్సవం స్పెషల్ ఉంది కాబట్టి ఈ రెండురోజులు థియేటర్స్ ఫుల్ కానున్నాయి. అయితే, నేడు (జనవరి 25)న సాయింత్రం 5గంటలకు మూవీ యూనిట్ గ్రాండ్‌గా సక్సెస్ సెలబ్రేషన్స్ చేయనుంది. ఈ వేడుకలో నయనతార కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. మూవీ ప్రమోషన్స్‌కు దూరంగా ఉండే నయన్ చాలా ఏళ్ల తర్వాత వేదికపై మాట్లాడనుంది. అయితే, ఈ కార్యక్రమం హైదరాబాద్‌లో ఎక్కడ జరుగుతుంది అనేది అధికారికంగా ప్రకటించలేదు. కానీ, పార్క్ హయత్‌లో జరగవచ్చు అనే వార్తలు వస్తున్నాయి.మన శంకర వరప్రసాద్‌గారు మూవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆల్ టైమ్ హైయెస్ట్ షేర్ సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. దీంతో చిత్ర నిర్మాతలు సంతోషంగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటర్స్‌తో పాటు మూవీ టీమ్ అంతా పాల్గొంటుంది. కానీ, అందరి చూపు నయనతారపైనే ఉంది. సినిమా విడుదలకు ముందు కొన్ని ప్రమోషనల్ వీడియోలతో చాలా మందిని ఆశ్చర్యపరిచిన నయన్.. ఇప్పుడు ఏకంగా సక్సెస్మీట్కు వస్తున్నట్లు టాక్ రావడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మన శంకర వరప్రసాద్‌గారు’ మూవీ అనేక రికార్డులు సృష్టిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి, నయనతార నటింఆచరు. ఈ మూవీ ఇప్పటికే రూ. 300 కోట్ల క్లబ్లో చేరింది. మూవీ క్లోజింగ్ కలెక్షన్స్ రూ. 450 కోట్ల వరకు రాబట్టవచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. View this post on Instagram A post shared by Shine Screens (@shinescreenscinema) -
'మన శంకర వరప్రసాద్‌గారు' స్టోరీ.. ఈ మూవీ నుంచే తీసుకున్నా: అనిల్
చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పటికీ దూసుకుపోతుంది. అయితే, మూవీ చూసిన తర్వాత చాలామంది అనేక విమర్శలు చేశారు. ఈ మూవీ డాడీ, విశ్వాసం, తులసి సినిమాలకు దగ్గరగా ఉందంటూ కామెంట్లు చేశారు. ఆ మూడు కథలను బేస్ చేసుకుని ‘మన శంకర వరప్రసాద్ గారు’ స్క్రిప్ట్‌ను రెడీ చేశారంటూ నెట్టింట పోస్టులు షేర్ చేశారు. అయితే, ఈ అంశంపై తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడి అసలు విషయం చెప్పారు.మన శంకర వరప్రసాద్ గారు స్టోరీపై వస్తున్న విమర్శలకు దర్శకుడు అనిల్ రావిపూడి ఇలా స్పందించాడు. 'అజిత్ నటించిన 'విశ్వాసం' మూవీ ఛాయలు మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో కనిపిస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి తప్పులేదు. ఎందుకంటే..? ఈ రెండు సినిమాల్లో హీరోయిన్గా నయనతార నటించారు. విశ్వాసం మూవీ కథను పాప పాత్ర టర్న్ చేస్తుంది. వాస్తవానికి అలాంటి కాన్సెప్ట్ కథతో తెలుగులో 'డాడీ' మూవీ ఎప్పుడో వచ్చింది. నేను 'డాడీ' మూవీని రిఫరెన్స్‌గా తీసుకునే 'మన శంకర వరప్రాద్'ను తెరకెక్కించాను. డాడీ మూవీలో చిరు ఎమోషన్స్ బాగా పండించారు. కానీ, సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. డాడీ స్టోరీ చుట్టూ ఒక బలమైన కోటరి లేకపోవడంతోనే ప్రేక్షకులను మెప్పించలేదని నా అభిప్రాయం. అయితే, డాడీ మూవీ నాకు బాగా నచ్చింది. అందులోని ప్రధానమైన కాన్సెప్ట్‌ను రిఫరెన్స్‌గా తీసుకున్నాను. ఇందులో దాచేది ఏం లేదు. ఓపెన్‌గానే చెబుతున్నాను. మన శంకర వరప్రసాద్ గారు చిత్రానికి మూలం 'డాడీ' స్టోరీనే..' అంటూ అనిల్ హూందాగా చెప్పారు. ఈ విషయంలో అనిల్‌ను మెచ్చుకోవాల్సింది. తను నిజాయితీగానే క్లారిటీ ఇచ్చాడు. అయితే, ఫ్యామిలీ పల్స్ బాగా పట్టేసుకున్న అనిల్ తనదైన స్టైల్లో మన శంకర వరప్రసాద్ గారు కథన సిద్ధం చేసుకున్నారు. ఆయన చెప్పినట్లుగా కేవలం డాడీ మూవీ కాన్సెప్ట్‌ను మాత్రమే తీసుకున్నారు. కానీ, కథలో చిరు అభిమానులకు కావాల్సినంత స్టఫ్‌ను అనిల్ ఇచ్చారు. అందుకే సినిమా సూపర్ హిట్ అయింది. -
'మన శంకర వరప్రసాద్ గారు' ఫేక్ కలెక్షన్స్.. అనిల్ సమాధానం
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా కలెక్షన్స్‌పై వస్తున్న రూమర్స్‌కు దర్శకుడు అనిల్ రావిపూడి తాజాగా ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ ఇప్పటికే రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈమేరకు ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అయితే, కొందరు అదంతా ఫేక్ కలెక్షన్స్ అంటూ ట్రోల్స్ చేయడం ప్రారంభించారు. దీంతో దర్శకుడు స్పందించారు.'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం టాలీవుడ్లో అనేక రికార్డ్లను అధిగమించి సత్తా చాటుతుంది. ఇప్పటికీ బుక్‌మైషోలో టికెట్ల అమ్మకాల్లో ట్రెండింగ్‌లో ఉంది. కానీ, 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా కలెక్షన్ నంబర్స్ ఫేక్ వేశారని సోషల్‌మీడియాలో కొందరు పోస్టులు షేర్ చేశారు. ఇదే అంశంపై అనిల్ ఇలా స్పందించారు. 'ఈ సంక్రాంతికి చాలా సినిమాలు థియేటర్స్‌లోకి వచ్చాయి. అయితే, తాము చాలా ఓపెన్‌గానే కలెక్షన్స్ వివరాలు ఎప్పటికప్పడు ప్రకటిస్తూనే ఉన్నాం. వాటిని కొందరు మీడియా మిత్రులు కూడా షేర్ చేస్తూనే ఉన్నారు. అందులో ఎలాంటి దాపరికం లేదు. ఫేక్ కలెక్షన్స్ వివరాలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ప్రేక్షకులు చిరంజీవిని ఎలా చూడాలని అనుకున్నారో అంతే రేంజ్లో మేము తెరపై ఆయన కనిపించేలా జాగ్రత్త పడ్డాం. ముఖ్యంగా చిరంజీవి ఫ్యాన్స్ ఎక్కడెక్కడో ఉన్నవారంతా థియేటర్‌కు వచ్చేశారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ సినిమా చూశారు. అందుకే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పెరిగాయి. కేవలం వారంలోనే సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోయింది. నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్స్ యజమానులకు కూడా లాభాలు వచ్చేశాయి. అని అనిల్ రావిపూడి పేర్కొన్నారు.బుక్‌మై షోలోనూ ఈ మూవీ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇప్పటివరకు 25 మిలియన్ టికెట్లు అమ్ముడుపోయినట్లు ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసేవారి సంఖ్య ఊహించలేమని మేకర్స్ అన్నారు. -
'జన నాయగన్' ప్రభావం చిరంజీవి మూవీపై పడనుందా..?
మన శంకర వరప్రసాద్‌గారు మూవీ భారీ హిట్ కొట్టేసింది.. ఇదే ఊపులో చిరంజీవి- దర్శకుడు బాబీ కాంబినేషన్లో సినిమా ప్రారంభం కానుంది. 'మెగా 158' వర్కింగ్ టైటిల్‌తో ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలతో మొదలు కానుందని సమాచారం. కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. అయితే, విజయ్ నటించిన జన నాయగన్ వాయిదా ఎఫెక్ట్ చిరు మూవీపై పడనుందా అంటూ నెట్టింట అనేక ప్రశ్నలు కనిపిస్తున్నాయి.జన నాయగన్ సినిమాను కూడా కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. తెలుగులో చిరంజీవి మూవీతో ఎంట్రీ ఇవ్వాలని ఆ సంస్థ ప్లాన్ చేసుకుంది. ఇప్పటికే మెగా 158 ప్రాజెక్ట్‌తో నిర్మాతలు వెంకట్ కె. నారాయణ, నిషా వెంకట్ కొనంకి ఢీల్ కుదుర్చుకున్నారు. అయితే జన నాయగన్ సెన్సార్ గొడవ కారణంగా ఆ సంస్థ కోర్టు చుట్టూ తిరుగుతుంది. ఈ క్రమంలో చిరు- బాబీ సినిమా మరింత ఆలస్యం కానుందని వార్తలు వస్తున్నాయి. వాస్తవంగా ఫిబ్రవరిలో ప్రారంభం కావాల్సిన చిరంజీవి మూవీ.. జన నాయగన్ ఎఫెక్ట్ వల్ల మరింత ఆలస్యం కావచ్చని తెలుస్తోంది. అయితే, అంత వరకు చిరు, బాబీ వేచి చూస్తారా..? అనే చర్చ ఇండస్ట్రీలో మొదలైంది. ఇదే సమయంలో మరికొందరు అదంతా రూమర్స్ మాత్రమేనని తెలుపుతున్నారు. జన నాయగన్ వివాదం ఉన్నప్పటికీ చిరు వంటి స్టార్ హీరోతో వచ్చిన ఛాన్స్‌ను ఆ సంస్థ వదులుకోదని చెబుతున్నారు. అనుకున్న సమయానికే షూటింగ్ పనులు ప్రారంభమవుతాయని ఫ్యాన్స్ తెలుపుతున్నారు.‘వాల్తేరు వీరయ్య’ విజయం తర్వాత చిరు- బాబీ కాంబోలో ఈ మూవీ రానున్నడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తిగా యాక్షన్ మోడ్‌లో ఉంటుందని తెలుస్తోంది. మెగాస్టార్ మునుపెన్నడూ చేయని శక్తిమంతమైన పాత్రలో తెరపై కనిపిస్తారని టాక్.. ఇందులో చిరుతో పాటు మరో స్టార్ కూడా తెర పంచుకునే అవకాశమున్నట్లు ప్రచారం సాగుతోంది. -
అలా రజనీకాంత్ సినిమాలు చూడలేం, చిరంజీవి కూడా అంతే!
సక్సెస్ అందుకోవడం కన్నా దాన్ని కొనసాగించడం చాలా కష్టం. కానీ, కెరీర్ మొదలైనప్పటినుంచి అపజయమనేదే ఎరుగకుండా విజయాల పరంపరతో దూసుకెళ్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. అతడు డైరెక్ట్ చేసిన 9వ సినిమా మన శంకరవరప్రసాద్‌గారు బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. ఇందులో చిరు స్టైల్, డ్యాన్స్, కామెడీ చూసి ఫ్యాన్స్ కడుపు నిండిపోయింది.రజనీకాంత్‌ను అలా ఊహించుకోగలమా?అయితే కొందరు మాత్రం చిరంజీవి వయసుకు తగ్గ పాత్రలు చేయాలని, తాతగా నటిస్తే బెటర్ అని విమర్శిస్తున్నారు. ఈ ట్రోలింగ్‌కు గట్టి కౌంటరిచ్చాడు అనిల్ రావిపూడి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ప్రతి హీరోకు కొన్ని బలాలుంటాయి. వాటిని వదిలేసి మనమెప్పుడూ ప్రయోగాలు చేయకూడదు. రజనీకాంత్‌గారిని తన వాకింగ్ స్టైల్ లేకుండా ఒక సినిమా చేయమనండి, మనం చూడగలమా? అలాగే చిరంజీవి కూడా..ఒక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లేకుండా రజనీకాంత్‌గారి సినిమా ఊహించుకోగలమా? అది రజనీకాంత్‌గారి స్టైల్. అలాంటి రజనీకాంత్‌తో పర్ఫామెన్స్ ఓరియంటెడ్ సినిమా చేస్తే జనాలు ఒప్పుకోరు. ఆయనకు తగ్గ ఎలిమెంట్స్ ఆయన సినిమాలో కచ్చితంగా ఉండాలి. అలాగే చిరంజీవికి తగ్గ అంశాలు ఆయన మూవీలో ఉండాలి. చిరంజీవిగారు అనగానే మనకు గుర్తొచ్చేవి డ్యాన్సు, ఫైట్లు, పాటలు, కామెడీతో పాటు మంచి పర్ఫామెన్స్ లేదా కథాబలం.నేను చేసి చూపించా..ఆయన ఈ వయసులో ఇలాంటి సినిమాలు చేయాలా? అంటే దానికి తగ్గట్లుగా కథ రాస్తే చేయొచ్చు. నేను తీసి చూపించానుగా! చిరంజీవి- నయనతార మధ్య లవ్‌స్టోరీ పెట్టాను. ఎక్కడా ఓవర్‌గా చూపించలేదు. ఆయన వయసుకు తగ్గట్టుగా చాలా హుందాగా ఉంది. ఇలాంటి ప్రయోగాలు మనం చేయొచ్చు. ప్రేక్షకులు ఆ ఎపిసోడ్ ఎంజాయ్ చేశారు. హీరో బలాలను వాడుకుంటేనే సినిమాలు అద్భుతంగా ఆడతాయి. మరో విషయం.. చిరంజీవిగారు తన లుక్స్ మెయింటైన్ చేస్తారు. తాత పాత్రలెందుకు చేయాలి?అలుపు, ఆయాసం లేకుండా హుషారుగా హుక్ స్టెప్ సాంగ్‌లో డ్యాన్స్ చేశారు. ఆయన అలాగే ఉండాలని కోరుకుంటాను. ఒక మనిషి అంత ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్నప్పుడు మనమెందుకు ఆయన తండ్రి, తాత పాత్రలు మాత్రమే చేయాలని రుద్దాలి? కావాలని ఒక వ్యక్తిని తగ్గించడానికే కొందరు ఇలా మాట్లాడుతున్నారు. చిరంజీవి.. గాడ్‌ఫాదర్, సైరా నరసింహారెడ్డి అని మధ్యమధ్యలో ప్రయోగాలు చేశారు.. కానీ ఈ సినిమాకే ఎందుకింత పెద్ద ఫలితం వచ్చిందంటే జనాలు ఆయన్ను పాత చిరంజీవిగా చూడాలనుకున్నారు అని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు.చదవండి: శశిరేఖ.. ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది -
శశిరేఖ ఫుల్ వీడియో సాంగ్.. నయన్‌తో చిరు స్టెప్పులు
మన శంకరవరప్రసాద్‌గారు మూవీతో సంక్రాంతికి బ్లాక్‌బస్టర్ హిట్టు కొట్టాడు మెగాస్టార్ చిరంజీవి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ జనవరి 12న విడుదల కాగా ఇప్పటివరకు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తాజాగా మన శంకరవరప్రసాద్‌గారు సినిమా నుంచి శశిరేఖ ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు.అప్పుడేమో ట్రోల్స్..ఈ పాట విడుదలైన కొత్తలో ఇదేం పాట? అని ట్రోల్స్ వచ్చాయి. కానీ తర్వాత అదే హిట్టు సాంగ్‌గా మారిపోయింది. తాజాగా రిలీజ్ చేసిన పాటలో నయనతారతో కలిసి హుషారుగా స్టెప్పులేశాడు చిరంజీవి. అది చూసిన అభిమానులు బాస్ గ్రేస్ చూస్తుంటే మరోసారి సినిమా చూడాలనిపిస్తోందని కామెంట్లు చేస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ పాటకు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ సమకూర్చాడు. భీమ్స్‌తో పాటు మధుప్రియ ఆలపించింది. -
ఆ సీన్ రీల్స్ పిల్లలకు చూపించొద్దు : అనిల్ రావిపూడి
‘‘నా టార్గెట్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే. ప్రేక్షకులు థియేటర్స్‌కు వచ్చి, నా సినిమాలు చూస్తూ నవ్వుతుంటే అదే నాకు ఎనర్జీ. ఆ నవ్వే నా సక్సెస్ సీక్రెట్ ’’ అని అనిల్ రావిపూడి అన్నారు. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించగా, వెంకటేశ్ కీలక పాత్రలో నటించారు. సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలైంది. ‘‘మా సినిమా విజయపథంలో దూసుకెళుతోంది’’ అని అనిల్ రావిపూడి పేర్కొన్నారు. ఇంకా గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో అనిల్ రావిపూడి పంచుకున్న విశేషాలు... → ‘మన శంకర వరప్రసాద్‌గారు’ ఇప్పటికే రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. థియేటర్స్‌లో మా సినిమా ఇంకా దాదాపు 80 శాతం ఆక్యుపెన్సీతో ప్రదర్శితమవుతోంది. ఈ సినిమా కోసం చిరంజీవిగారు ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. ఆయనలో ఉన్న ఓ ప్రత్యేకమైన కామెడీ టైమింగ్, ఒకప్పటి ఆయన స్టైల్‌ను ఈ సినిమాలో చూపించాలనుకున్నాను. అన్నీ కుదిరాయి. సక్సెస్ టూర్లో భాగంగా థియేటర్స్ విజిట్ చేసినప్పుడు... చిరంజీవిగారిని స్క్రీన్‌పై చక్కగా ప్రజెంట్ చేశానని చెప్పారు.→ చిరంజీవి, వెంకటేశ్‌గార్ల వంటి స్టార్ హీరోలు ఉన్న ఈ సినిమా స్క్రిప్ట్‌ను తక్కువ రోజుల్లోనే పూర్తి చేశాను. కానీ సవాల్‌గా అనిపించింది. కొత్తవారిని ప్రోత్సహించడంలో చిరంజీవిగారు ముందుంటారు. ‘హుక్ స్టెప్’ సాంగ్ కోసం ఆట సందీప్‌ను ప్రోత్సహించారు. అలాగే ఈ చిత్రంలోని ‘ఫ్లైయింగ్ హై’ పాటను చిరంజీవిగారి చిన్న చెల్లెలు మాధవిగారి కుమార్తె నైరా పాడారు. నైరా ఫిల్మ్ కోర్స్ చేశారని, సింగర్‌గా ట్రై చేయించమని చిరంజీవిగారు చెప్పారు కానీ, పాట పాడించమని రికమండ్ చేయలేదు. అయితే నైరా ఈ పాటను సింగిల్ టేక్‌లో పాడారు. → చిరంజీవి–వెంకటేశ్‌గార్ల కాంబినేషన్ సీన్స్‌ని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఎప్పటికైనా ఓ మల్టీస్టారర్ ఫిల్మ్ చేస్తాను. ఇక ‘మన శంకర వరప్రసాద్‌గారు’లో ‘మద్యపానం.. మహదానందం’ సీన్స్‌ను ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. విభిన్న రకాలుగా రీల్స్ చేస్తున్నారు. అయితే ఈ ‘మధుపానం..’ సీన్స్‌కి సంబంధించిన రీల్స్‌కు పిల్లలను దూరంగా ఉంచాలని కోరుతున్నాను. → ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా హిందీలో రీమేక్ అవుతోంది (అక్షయ్ కుమార్ హీరో). అలాగే ‘భగవంత్ కేసరి’ సినిమా కోర్ పాయింట్‌తో ‘జన నాయగన్’ తీశారు. ఇలా నా డైరెక్షన్లో వచ్చిన సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ కావడం హ్యాపీగా ఉంది. నా సినిమాలను నేరుగా ఇతర భాషల్లోకి రిలీజ్ చేయవచ్చు. అయితే ఎమోషన్స్, యాక్షన్ యూనివర్సల్‌గా వర్కౌట్ అవుతాయి కానీ కామెడీకి మాత్రం ప్రతి భాషకి ఒక ప్రత్యేకమైన టైమింగ్ ఉంటుంది కాబట్టి నేరుగా రిలీజ్ చేయలేం. → నా తర్వాతి సినిమా కోసం టైటిల్ లాక్ చేశాను. ఓ విచిత్రమైన జర్నీ స్టార్ట్ కాబోతోంది. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికే రిలీజ్ చేస్తాను. సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ కావడం ఓ ఫిల్మ్ ఫెస్టివల్‌లా అనిపిస్తోంది. ఇందులో నేను ఓ ముఖ్య పాత్రధారిగా ఉండటం హ్యాపీ. అలాగే వరుస విజయాలతో దర్శకుడిగా వంద శాతం సక్సెస్ స్ట్రైక్ అనే ఫీలింగ్ బాగుంది. -
నా వల్ల చిరంజీవి సినిమాకు నష్టం జరగకూడదనుకున్నా: హర్ష వర్ధన్
తన లైఫ్‌లో చిరంజీవి సినిమాలో నటించే అవకాశం రావడం నా అదృష్టమని టాలీవుడ్ హర్షవర్ధన్ అన్నారు. మనశంకర వరప్రసాద్దగారు సూపర్ హిట్ కావడం సంతోషంగా ఉందన్నారు. ఇది నా లైఫ్‌లో బెస్ట్ మూమెంట్ అని తెలిపారు. తనకు మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చిందని హర్షవర్ధన్ సంతోషం వ్యక్తం చేశారు.అయితే ఈ సినిమాకు నా వల్ల నష్టం జరగకూడదని నిర్ణయించుకున్నాని హర్షవర్ధన్ తెలిపారు. తన కాలికి గాయం కావడంతో రెండు నెలలకు పైగా టైమ్ పడుతుందని అన్నారు. దీంతో చిరంజీవి సినిమా మిస్ అవుతానని చాలా బాధపడ్డానని తెలిపారు. అందుకే నా వల్ల మూవీ ఆలస్యం కాకూడదనే.. నా బదులు ఎవరినైనా తీసుకోండని అనిల్‌తో చెప్పానని హర్షవర్ధన్ వెల్లడించారు.కానీ అనిల్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు.. మీరు అవన్నీ మాట్లాడొద్దు..అంతా నేను చూసుకుంటానని అన్నారు. మీరు కేవలం నడవకూడదు అంతేకదా.. డైలాగ్స్, యాక్టింగ్ చేస్తే చాలని నాకు ధైర్యం చెప్పారు. అనిల్‌కు నా పట్ల మంచి అభిప్రాయం ఉంది..నారాయణ క్యారెక్టర్‌కు నువ్వు తప్ప ఎవరినీ పెట్టే ప్రసక్తే లేదని అనిల్ రావిపూడి చెప్పారని హర్షవర్ధన్ పంచుకున్నారు. నా వల్ల సినిమా ఆలస్యమైతే ఎక్కడా తీరని మచ్చలా ఉండిపోతుందేమో భయపడ్డానని తెలిపారు. నా వల్ల #chiranjeevi గారి సినిమాకి భారీ నష్టం.. నా జీవితంలో అది తీరని మచ్చలా ఉండిపోతుంది- Actor #HarshaVardhan Exclusive Interview https://t.co/Fhr5TvdjTw#ManaShankaraVaraPrasadGarutrailer #anilravipudi pic.twitter.com/I8FPpPgBiW— TeluguOne (@Theteluguone) January 22, 2026 -
నాకు నాన్న లేరు.. 'చిరు' సార్‌ను చూస్తే ఏడుపొచ్చింది: ఖుషి
చిరంజీవి- అనిల్ రావిపూడి మూవీ 'మన శంకరవరప్రసాద్‌గారు'.. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది. కుటుంబ కథా చిత్రంగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగానే రాబట్టింది. ఇందులో చిరంజీవి కూతురు నిక్కీ పాత్రలో బాలనటి ఖుషి నటించింది. చిరు కూతురుగా తను చాలా చక్కగా నటించి ప్రశంసలు కూడా అందుకుంటుంది. నయనతార, చిరు వంటి స్టార్స్‌తో ఖుషి కూడా తన స్థాయికి మించి నటించి మెప్పించింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఖుషి మాట్లాడుతూ సినిమా విశేషాలు పంచుకుంది.చిరంజీవి కూతురుగా నటించినందుకు చాలా సంతోషంగా ఉందని ఖుషి పేర్కొంది. అయితే, తనకు నాన్నలేరని తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో చెప్పింది. కానీ, తన తండ్రికి సంబంధించిన వివరాలను చెప్పేందుకు ఆమె ఇష్టపడలేదు. రాజస్థాన్‌కు చెందిన తమ కుటుంబం రెండేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చిందని చెప్పింది. ఇక్కడే 7వ తరగతి చదువుతున్నట్లు తెలిపింది. తన మదర్ కూడా అదే స్కూల్లో పనిచేస్తున్నారని పేర్కొంది.తనకొక బ్రదర్ కూడా ఉన్నాడని తమ సంరక్షణ అమ్మ మాత్రమే చూసుకుంటుందని ఖుషి చెప్పుకొచ్చింది. సినిమా సెట్స్‌లో చిరంజీవి గారిని నాన్న అని పిలిచినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యేదానినని ఒక్కోసారి కన్నీళ్లు కూడా వచ్చేవని గుర్తుచేసుకుంది. తనకు కూడా అలాంటి నాన్న ఉంటే బాగుండేదని ఆమె అభిప్రాయ పడింది. చిరు సార్‌తో చాలా మెమరీస్ ఉన్నాయని ఖుషి పంచుకుంది. చిరు సార్‌ను కలిసిన ప్రతిసారి కేక్స్, చాక్లెట్స్ ఇచ్చేవారని తెలిపింది. మెగాస్టార్‌తో గారితో మరో సినిమా ఛాన్స్ రావాలని ఆశపడుతున్నానని కోరుకుంది. నయనతారతో కూడా మంచి బాండింగ్ ఏర్పడిందని ఖుషి చెప్పింది. అయితే, నయన్‌ను అక్క అని పిలుస్తానని, తను చాలా యంగ్‌గా కనిపిస్తారని తెలిపింది. నయన్ గారు దుస్తులు కొనిచ్చారని చెబుతూ.. 'మన శంకరవరప్రసాద్‌గారు' సినిమా తనకు చాలా ఇచ్చిందని ఖుషి పేర్కొంది. -
300 కోట్లతో బాక్సాఫీస్ బద్దలు కొట్టిన బాస్
-
ఇది ప్రారంభం మాత్రమే.. మేనకోడలిపై మెగాస్టార్ ప్రశంసలు
మెగాస్టార్ చిరంజీవి తన మేనకోడలిపై ప్రశంసలు కురిపించారు. మనశంకర వరప్రసాద్‌గారు చిత్రంలోని పాటపాడిన తన మేనకోడలు నైరాను కొనియాడారు. నా చిన్న మేనకోడలు నైరా ఫ్లై.. హై పాట పాడటం చూసి.. నా హృదయం ఆనందంతో నిండిపోయిందని మెగాస్టార్ ట్వీట్ చేశారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని.. నీ మార్గంలో నువ్వు మరింత అంతులేని అవకాశాలతో ముందుకు సాగాలని కోరుకుంటున్నానంటూ పోస్ట్ చేశారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశిస్తున్నట్లు తన ట్వీట్లో రాసుకొచ్చారు.కాగా.. ఇటీవల మెగాస్టార్ హీరోగా వచ్చిన సంక్రాంతి సినిమా మనశంకర వరప్రసాద్‌గారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. రిలీజైన 8 రోజుల్లోనే ఏకంగా ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. అత్యధిక వసూళ్లు సాధించిన ప్రాంతీయ చిత్రంగా అరుదైన ఘనత సొంతం చేసుకుంది. కాగా.. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతమందించిన సంగతి తెలిసిందే. Watching my little niece #Naira sing the #FlyingHigh song from my film #ManaShankaraVaraPrasadGaru filled my heart with indescribable joy ❤️https://t.co/Ghbnf7gQtXThis is just the beginning, my dear. May your path always be bright, joyful, and filled with endless… pic.twitter.com/hxcaTwLiWw— Chiranjeevi Konidela (@KChiruTweets) January 21, 2026 -
చిరంజీవి మూవీలో కృతి శెట్టి లక్కీ ఛాన్స్ కొట్టేసిందిగా..!
-
రేవంత్ టీంలో చిరంజీవి.. దావోస్‌లో తెలంగాణ రైజింగ్ సందడి (చిత్రాలు)
-
'ఉప్పెన' తర్వాత సరైన హిట్ లేదు.. ఇప్పుడు చిరంజీవితో!
హిట్ కొట్టడం ఈజీనే. కానీ దాన్ని కొనసాగిస్తూ సినిమాలు చేయడం, అవకాశం దక్కించుకోవడం చాలా కష్టం. చాలా కొద్దిమంది హీరోహీరోయిన్లకు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అవును ఇదంతా హీరోయిన్ కృతిశెట్టి గురించే. 'ఉప్పెన'తో హీరోయిన్గా బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ.. తర్వాత చాలానే మూవీస్ చేసింది గానీ సరైన హిట్ కొట్టలేకపోయింది. ఇప్పుడు మెగా ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: మేడారం జాతర మొక్కు.. టాలీవుడ్ హీరోయిన్‌పై విమర్శలు!)ప్రస్తుతం 'మన శంకరవరప్రసాద్' చిత్ర సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న చిరంజీవి.. త్వరలో కొత్త ప్రాజెక్ట్ మొదలుపెట్టనున్నారు. ఇదివరకే దర్శకుడు బాబీతో చిరు మరోసారి కలిసి పనిచేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఫిబ్రవరిలో లాంచ్ కానుందని, మార్చి నుంచి షూటింగ్ మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది. ఈ మూవీలోనే కృతిశెట్టిని తీసుకున్నారని తెలుస్తోంది. చాలామంది హీరోయినా అని అనుకుంటున్నారు. కానీ చిరు కుమార్తె పాత్రలో కృతి కనిపించనుందని టాక్.గతంలో 'వాల్తేరు వీరయ్య' సినిమాతో తొలి హిట్ అందుకున్న చిరు-బాబీ.. ఇప్పుడు బెంగాల్ బ్యాక్ డ్రాప్లో సాగే కూతురు సెంటిమెంట్ కాన్సెప్ట్‌తో మూవీ చేయనున్నారని టాక్. మలయాళ హీరో మోహన్ లాల్ ఓ కీలక పాత్ర చేయబోతున్నారని టాక్. ఇకపోతే ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా పలువురు పేర్లు అనుకుంటున్నప్పటికీ ప్రియమణిని ఫైనల్ చేశారని అంటున్నారు. అలానే ఏఆర్ రెహమాన్‌ని సంగీత దర్శకుడిగా ఫైనల్ చేసే పనిలో ఉన్నారట. మరి ఈ విషయాల్లో ఎంత నిజముందనేది మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే ఛాన్సుంది.(ఇదీ చదవండి: గోల్డెన్ ఛాన్స్ వదులుకున్న నాగార్జున?) -
సంక్రాంతి సినిమా హిట్.. మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్
మనశంకర వరప్రసాద్‌గారు మూవీ సూపర్ హిట్ కావడంపై మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. తన సినిమాను సూపర్ హిట్ చేసిన ప్రేక్షక దేవుళ్లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ ప్రయాణంలో తనకు ఎల్లప్పుడు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.మెగాస్టార్ తన పోస్ట్‌లో రాస్తూ..'మన శంకరవరప్రసాద్ గారు సినిమాపై ప్రేక్షక దేవుళ్లు చూపిస్తున్న ఆదరణ, అపూర్వమైన విజయాన్ని చూస్తుంటే నా మనసు కృతజ్ఞతతో నిండిపోతోంది. నేను ఎప్పుడూ చెప్పేది నమ్మేది ఒక్కటే. నా జీవితం మీ ప్రేమాభిమానాలతో ముడిపడింది. మీరు లేనిదే నేను లేను. ఈ రోజు మళ్లీ అదే నిజమని మీరు నిరూపించారు. ఈ విజయం పూర్తిగా నా ప్రియమైన తెలుగు ప్రేక్షకులది, నా ప్రాణసమానమైన అభిమానులది, నా డిస్ట్రిబ్యూటర్లది, సినిమాకు ప్రాణం పెట్టి పనిచేసిన ప్రతీ ఒక్కరిది. ముఖ్యంగా దశాబ్దాలుగా నా వెంట నిలబడి ఉన్నవారందరిది' అంటూ ఎమోషనల్‌గా రాసుకొచ్చారు.మీరు వెండితెర మీద నన్ను చూడగానే మీరు వేసే విజిల్స్, చప్పట్లే నన్ను నడిపించే శక్తి. రికార్డులు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ, మీరు నాపై కురిపించే ప్రేమ మాత్రం శాశ్వతం. ఈ బ్లాక్‌బస్టర్ విజయం వెనుక ఎంతో కృషి చేసిన మా దర్శకుడు హిట్ మెషీన్ అనిల్ రావిపూడికి, నిర్మాతలు సాహు, సుస్మితలకు, అలాగే మొత్తం టీమ్ అందరికీ, నాపై మీరందరూ చూపిన అచంచలమైన నమ్మకానికి ధన్యవాదాలు. ఈ సంబరాన్ని అలాగే కొనసాగిద్దాం. మీ అందరికీ ప్రేమతో... లవ్ యూ ఆల్.. ఇట్లు మీ చిరంజీవి' అంటూ పోస్ట్ చేశారు.కాగా.. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా మనశంకర వరప్రసాద్‌గారు జనవరి 12న థియేటర్లలో విడుదలైంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించింది. విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో కనిపించి అభిమానులను మెప్పించారు. తాజాగా ఈ మూవీ అత్యంత వేగంగా రూ.300 కోట్ల క్లబ్లో చేరిన రీజినల్ సినిమాగా రికార్డ్ సృష్టించింది. From the heart, with love & gratitude 🙏🏻 pic.twitter.com/LJ2g32x3qC— Chiranjeevi Konidela (@KChiruTweets) January 20, 2026 -
చిరంజీవి సినిమాకు రివ్యూ ఇచ్చేసిన అల్లు అర్జున్
అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య సత్సంబంధాలు లేవని గత కొన్నాళ్లుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అందుకు తగ్గట్లే కనిపించిన కొన్ని సంఘటనలు ఇవన్నీ నిజమేనేమో అనిపించేలా చేశాయి. కానీ అదంతా సోషల్ మీడియాలో రూమర్స్ మాత్రమేనని క్లారిటీ వస్తుంటాయి. ఇప్పుడు కూడా అల్లు అర్జున్.. చిరంజీవి కొత్త సినిమాకు తనదైన స్టైల్లో రివ్యూ ఇచ్చేశాడు. ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: క్యారవాన్‌లో అసభ్య ప్రవర్తన.. హీరో చెంప పగలగొట్టా: పూజా హెగ్డే)తాజాగా 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా చూసిన అల్లు అర్జున్.. చిత్రబృందానికి శుభాకాంక్షలు చెప్పాడు. మెగాస్టార్ చిరంజీవి మళ్లీ వింటేజ్‌గా అదరగొట్టేశాడని అన్నాడు. వెంకటేశ్, నయనతార, కేథరిన్, బుల్లిరాజు అలియాస్ రేవంత్ కూడా ఆకట్టుకున్నారని రాసుకొచ్చాడు. హుక్ స్టెప్, మెగావిక్టరీ సాంగ్స్ ఇచ్చిన భీమ్స్‌కి కంగ్రాట్స్ చెప్పాడు. నిర్మాతలు సుస్మిత, సాహు గారపాటిని ప్రశంసించాడు. అలానే దర్శకుడు అనిల్ రావిపూడి గురించి ప్రస్తావిస్తూ.. 'సంక్రాంతికి వస్తారు-హిట్ కొడతారు-రిపీట్' అని డైలాగ్ వేశాడు. ఇది సంక్రాంతి బ్లాక్ బస్టర్ మాత్రమే కాదు.. సంక్రాంతి 'బాస్'బస్టర్ అని చిరుకి బన్నీ సూపర్ ఎలివేషన్ ఇచ్చాడు.చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. సినిమాలో కంటెంట్ అంతంత మాత్రంగానే ఉందని టాక్ కొందరి నుంచి వినిపించినప్పటికీ.. బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయంలో మాత్రం దుమ్మురేపుతోంది. ఇప్పటికే రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లు మార్క్ దాటేసింది. ఈ విషయాన్ని నిర్మాతలే అధికారికంగా ప్రకటించారు కూడా.(ఇదీ చదవండి: పదేళ్లుగా సినిమాలకు దూరమైనా ఇప్పటికీ.. ఈ బ్యూటీని గుర్తుపట్టారా?)CONGRATULATIONS TO THE ENTIRE TEAM OF #ManaShankaraVaraPrasadGaru The BOSS IS BACK ❤️🔥 L - I - T 🔥Happy to see our megastar @KChiruTweets garu light up the screens again 🔥Full #VintageVibes ⁰@VenkyMama garu rocked the show . #VenkyGowda ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದಿರಾ (Thumba… pic.twitter.com/SI8CF7r9VO— Allu Arjun (@alluarjun) January 20, 2026 -
ఆ రికార్డ్ ఇకపై చిరంజీవి సొంతం! తొలివారం కలెక్షన్ ఎంతంటే?
ప్రభాస్ 'రాజాసాబ్' తప్పితే సంక్రాంతి రిలీజైన మిగతా సినిమాలన్నీ పాజిటివ్ టాక్ అందుకున్నాయి. కానీ చిరంజీవి చిత్రానికి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు ప్రతి థియేటర్లు ఇప్పటికీ హౌస్‌ఫుల్స్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తొలివారం పూర్తయ్యేసరికి కళ్లు చెదిరే కలెక్షన్స్ వచ్చాయి. ఈ మేరకు నిర్మాతలు అధికారికంగా నంబర్స్ ప్రకటించారు. అలానే ఆల్ టైమ్ రికార్డ్ అన్నట్లు చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 28 సినిమాలు)చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రానికి తొలివారం పూర్తయ్యేసరికి రూ.292 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని పోస్టర్ రిలీజ్ చేశారు. అలానే తెలుగు రాష్ట్రాల్లో ప్రతిచోటా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయిపోయినట్లు తెలుస్తోంది. రిలీజైన తర్వాత ఏడురోజు అంటే నిన్న కూడా చాలాచోట్ల హౌస్‌ఫుల్స్ పడ్డాయి. దీంతో ఏడో రోజు వసూళ్లలో 'అల వైకుంఠపురములో'ని చిరు చిత్రం అధిగమించినట్లు సమాచారం.మరోవైపు తొలివారంలోనే ఈ రేంజు వసూళ్లు అందుకున్న ప్రాంతీయ చిత్రం ఇదేనని నిర్మాతలు ఘనంగా ప్రకటించుకున్నారు. అంటే చిరంజీవి సరసన కొత్త రికార్డ్ చేరినట్లే. ఇకపోతే ఇవాళ్టి నుంచి అందరూ నార్మల్ లైఫ్‌కి వచ్చేస్తారు కాబట్టి వసూళ్లు కాస్త తగ్గొచ్చు. కాకపోతే లాంగ్ రన్లో ఎంత వసూళ్లు వస్తాయనేది చూడాలి? ఫిబ్రవరి తొలివారం వరకు పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ లేకపోవడం 'మన శంకరవరప్రసాద్'కి కలిసొచ్చేలా కనిపిస్తోంది.(ఇదీ చదవండి: హ్యాట్రిక్ ఫ్లాప్స్ తర్వాత మెగా హీరో హారర్ మూవీ.. గ్లింప్స్ రిలీజ్)Every theatre, every centre..Every region and every heart…THE SWAG KA BAAP has conquered everything 😎₹292+ crores Gross in the FIRST WEEK for #ManaShankaraVaraPrasadGaru ❤️🔥ALL TIME RECORD FOR A REGIONAL FILM 💥💥💥#MegaSankranthiBlockbusterMSG enters into BLOCKBUSTER… pic.twitter.com/AaBGtzHDQh— Shine Screens (@Shine_Screens) January 19, 2026 -
2027 పొంగల్ కి.. అప్పుడే ఖర్చిఫ్ వేసారుగా..!
-
నో బ్రేక్
పెద్దగా బ్రేక్ తీసుకోకుండా షూటింగ్ చేయాలని ఫిక్స్ అయినట్లు ఉన్నారు చిరంజీవి. సంక్రాంతి పండగని కుటుంబ సభ్యులతో కలిసి జోరుగా జరుపుకోవడంతో పాటు ‘మన శంకర వరప్రసాద్‌గారు’ సక్సెస్ సంబరంలో ఉన్న ఆయన మరో వారంలో కొత్త సినిమా సెట్లోకి అడుగుపెట్టనున్నారట. బాబీ కొల్లి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే.ఈ నెల 25న ఈ చిత్రం షూటింగ్‌ని ఆరంభించాలనుకుంటున్నారట. ఈ చిత్రంలో ఫుల్ మాస్ రోల్లో చిరంజీవి కనిపించనున్నారని టాక్. ఇదిలా ఉంటే... ఈ నెల 12న రిలీజ్ చేసిన ‘మన శంకర వరప్రసాద్‌గారు’ ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 261 కోట్లు వసూలు సాధించి, రూ. 300 కోట్ల దిశగా దూసుకెళుతోందని చిత్రబృందం పేర్కొంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సుష్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రంలో వెంకటేశ్ కీలక పాత్ర చేసిన విషయం తెలిసిందే. -
సీనియర్ హీరోలకు బ్లాక్‌బస్టర్.. అనిల్ 10వ సినిమా ఎవరితో?
కథలో, దాన్ని తెరపై చూపించే విధానంలో ఏమాత్రం తేడా వచ్చినా సినిమా షెడ్డుకు పోవడం ఖాయం! కానీ అపజయం అనేది మా ఇంటావంటా లేదంటూ సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. కెరీర్లో ఒక్క పరాజయం కూడా చూడకుండా వరుసగా 9 సూపర్ హిట్లు కొట్టేసి శెభాష్ అనిపించుకున్నాడు. దీంతో అతడి పదో సినిమా ఎవరితో? ఎప్పుడు? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ విషయాన్ని ఓసారి చూసేద్దాం..ఫస్ట్ సినిమా నుంచే..అనిల్ రావిపూడి సహాయ దర్శకుడిగా, సంభాషణల రచయితగా కెరీర్ మొదలుపెట్టాడు. 2015లో నందమూరి కల్యాణ్ 'పటాస్' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తొలి సినిమాకే బ్లాక్‌బస్టర్ కొట్టాడు. ఆ మరుసటి ఏడాది తీసిన సుప్రీమ్ కూడా ఘన విజయం సాధించింది. రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్ 3, భగవంత్ కేసరి.. ఇలా అన్నీ హిట్లు, సూపర్ హిట్లే అందుకున్నాడు. బ్లాక్‌బస్టర్ సినిమాలుగతేడాది సంక్రాంతి వస్తున్నాం మూవీతో మరో బ్లాక్‌బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. పొంగల్ పండగను క్యాష్ చేసుకునేందుకు ఈసారి కూడా సంక్రాంతికే బరిలోకి దిగాడు.. కాదు, మెగాస్టార్‌ను బరిలోకి దింపాడు. చిరంజీవితో 'మన శంకరవరప్రసాద్‌గారు' మూవీ తీశాడు. ఈ చిత్రం 2026 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాగా పాజిటివ్ రెస్పాన్స్‌తో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ మూవీ రూ.200 కోట్లు దాటేసింది. సీనియర్ హీరోలతో సినిమాలుఈసారైనా అనిల్ రావిపూడి దొరుకుతాడేమోనని చూసిన ట్రోలర్స్‌కు భంగపాటే ఎదురైంది. చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ.. ఇలా అందరు సీనియర్ హీరోలతో సినిమాలు చేశాడు అనిల్. మరి నాగార్జునతో ఎప్పుడు? అని అతడి ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. మంచి కథ, సమయం కుదిరితే ఆయనతో కచ్చితంగా సినిమా చేస్తానని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో హామీ ఇచ్చాడు. చిరంజీవి బంపరాఫర్మరోవైపు మెగాస్టార్.. తనకు అఖండ విజయాన్ని అందించాడన్న ఆనందంతో ఓ బంపరాఫర్ ఇచ్చాడు. అనిల్ కథ సిద్ధం చేస్తే.. తాను, వెంకటేశ్ కలిసి పూర్తిస్థాయి సినిమా చేస్తామన్నాడు. అవసరమైతే వెంకీ సినిమాలో అతిథి పాత్రలోనైనా కనిపించేందుకు సిద్ధమన్నాడు. ఇంత మంచి ఆఫర్ ఇస్తే అనిల్ ఎందుకు కాదంటాడు? కానీ, వెంటనే ఒప్పేసుకుని సినిమా చేసే పరిస్థితి లేకపోవచ్చు.రామ్‌చరణ్‌తో సినిమా!మన శంకరవరప్రసాద్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అనిల్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. 'రామ్‌చరణ్‌తో సినిమా తప్పకుండా చేస్తాను. ముందు ఈ సినిమా బ్లాక్‌బస్టర్ చేయండి.. వెంటనే రామ్‌చరణ్ దగ్గరకు వెళ్లిపోతాను' అన్నాడు. అతడు కోరినట్లుగానే ప్రేక్షకులు సినిమాకు మంచి విజయాన్ని అందించారు. మరి అనిల్.. చరణ్‌తో సినిమా చేస్తాడా? అన్నది చూడాలి!పదో సినిమాపై బజ్అసలే అనిల్ రావిపూడి కెరీర్లో 10వ సినిమా.. హిట్ స్ట్రీక్ పోకుండా మూవీ తీయాలన్న ఒత్తిడి అతడిపై చాలానే ఉంది. కథ, హీరో ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. అది ఏమాత్రం బెడిసికొట్టినా అనిల్ రావిపూడిని ఆడేసుకుంటారు. మళ్లీ బ్లాక్‌బస్టర్ ఇచ్చాడంటే మాత్రం నెత్తిన పెట్టేసుకుంటారు. మరి ఆ పదో సినిమా చరణ్‌తోనా? చిరు-వెంకీతోనా? నాగ్తోనా? లేదంటే వేరే హీరోతోనా?అన్నది రానున్నరోజుల్లో చూడాలి! -
థియేటర్లలో హౌస్‌ఫుల్.. రికార్డులు సృష్టిస్తోన్న చిరంజీవి మూవీ
'మన శంకరవరప్రసాద్‌గారు' డబుల్ సెంచరీ కొట్టారు. చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ మన శంకరవరప్రసాద్‌గారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించగా విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో యాక్ట్ చేశాడు. సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలిరోజే బ్లాక్‌బస్టర్ టాక్ సంపాదించుకుంది.డబుల్ సెంచరీరెండురోజుల్లోనే సెంచరీ (రూ.100 కోట్లు) కొట్టిన ఈ మూవీ ఇప్పుడు నాలుగురోజుల్లోనే డబుల్ సెంచరీ (రూ.200 కోట్లు) మార్క్‌ను చేరుకోవడం విశేషం. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. 'థియేటర్లలో విజిళ్లు.. బయటేమో హౌస్‌ఫుల్ బోర్డులు.. రెండువందల కోట్ల కలెక్షన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు శతకోటి వందనాలు' అంటూ చిరు- అనిల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ వీకెండ్ పూర్తయ్యేసరికి సినిమా మరిన్ని రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. Whistles inside - Housefuls outside…BOX-OFFICE OVERFLOWING EVERY SIDE 💥💥#ManaShankaraVaraPrasadGaru కి "రెండువంద"ల కోట్ల కలెక్షన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు శతకోటి వందనాలు. 🙏🏻🙏🏻🙏🏻#MegaSankranthiBlockbusterMSG grosses 200 CRORE+ worldwide and racing ahead with BLOCKBUSTER… pic.twitter.com/CO2GTdqUfS— Shine Screens (@Shine_Screens) January 16, 2026 చదవండి: నా సినిమా చూసి విడాకులు క్యాన్సిల్ చేసుకున్నారు: చిరంజీవి -
'MSG' చూసి ఓ జంటలో మార్పు.. విడాకులు క్యాన్సిల్
అనిల్ రావిపూడి సినిమా వస్తోందంటే హిట్టు గ్యారెంటీ.. అందులోనూ సంక్రాంతికి వస్తున్నాడంటే బ్లాక్‌బస్టర్ పక్కా! పైగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా అంటే బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే.. అనిల్ రావిపూడి- చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన మన శంకరవరప్రసాద్‌గారు సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్పెషల్ ఇంటర్వ్యూ నయనతార హీరోయిన్గా యాక్ట్ చేయగా వెంకటేశ్ కీలక పాత్రలో కనిపించాడు. ఈ సినిమాను సంక్రాంతి హిట్ బొమ్మగా ప్రేక్షకులు ఆల్రెడీ డిసైడ్ చేశారు. అందుకే సంక్రాంతి కానుకగా చిరు, వెంకీ, అనిల్ రావిపూడిల స్పెషల్ ఇంటర్వ్యూ రిలీజ్ చేశారు. అందులో చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఓ జంట విడాకులు తీసుకోవాలని మూడు నెలలుగా అనుకుంటోంది. విడాకులు క్యాన్సిల్ఇద్దరూ వేర్వేరుగా మన శంకరవరప్రసాద్‌గారు మూవీ చూశారు. సినిమా చూడగానే ఇద్దరూ ఫోన్ మాట్లాడుకుని విడాకులు రద్దు చేసుకుని కలిసిపోయారు. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ప్రమేయం ఉండకూడదు. వారి సమస్యలను వారే పరిష్కరించుకోవాలి అని హీరో తల్లి చెప్పే డైలాగులు సినిమాలో ఉంటాయి. అవే వారిలో మార్పు తెచ్చాయి. ఇలాంటి సీన్స్ రాసిన అనిల్ రావిపూడికి హ్యాట్సాఫ్' అని మెచ్చుకున్నాడు.సినిమా కథ విషయానికి వస్తే..శంకర వరప్రసాద్(చిరంజీవి) నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్. అతడి భార్య పేరు శశిరేఖ (నయనతార). ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో విడిపోతారు. ఇద్దరు పిల్లల్ని తీసుకుని శశిరేఖ తండ్రి దగ్గరకు వెళ్లిపోతుంది. ఆరేళ్ల తర్వాత పిల్లలు చదివే స్కూల్లో పీఈటీ టీచర్‌గా చేరతాడు శంకర్. తండ్రిపై ద్వేషం పెంచుకున్న పిల్లలకు ఆయన ఎలా దగ్గరయ్యాడు? అసలు భార్యాభర్తల మధ్య గొడవేంటి? మళ్లీ కలిశారా? లేదా? అన్నదే కథ!చదవండి: భర్తతో సమంత తొలి సంక్రాంతి -
అదే ఫాలో అయ్యాడు..! బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు
-
సిగ్గు లేకుండా తిందాం.. దోశలు వేస్తూ.. పిచ్చ కామెడీ
-
ఒక్క క్లిక్‌తో ఐదు సినిమాల రివ్యూస్.. ప్లస్ ఏంటి? మైనస్ ఏంటి?
ఈ సంక్రాంతి సీజన్లో టాలీవుడ్లో ఐదు సినిమాలు రిలీజ్ అయ్యాయి. జనవరి 9 నుంచి 14 వరకు వచ్చిన ఈ చిత్రాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'ది రాజా సాబ్', మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వర ప్రసాద్ గారు'తో పాటు రవితేజ 'భారత మహాసయులకు విజ్ఞప్తి', నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒక రాజు', శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' ఉన్నాయి. ఈ సినిమాలు పండగ సీజన్లో బాక్సాఫీస్‌ను హీట్ చేశాయి. మరి ఏ చిత్రం సూపర్ హిట్ అయింది? ప్లస్ పాయింట్లు, మైనస్ పాయింట్లు ఏంటి? పూర్తి వివరాల కోసం రివ్యూస్ చదివేయండి1) ‘ది రాజా సాబ్’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి2) ‘మన శంకర్ వరప్రసాద్’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి3) ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి4) ‘అనగనగా ఒక రాజు’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి5) ‘నారీ నారీ నడుము మురారి’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బాక్సాఫీస్‌ను రఫ్పాడిస్తున్న ‘వరప్రసాద్ గారు’.. 3 రోజుల కలెక్షన్స్ ఎంతంటే..
మెగాస్టార్ చిరంజీవి హిట్ సినిమా పడితే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందేనని‘మన శంకరవరప్రసాద్ గారు’తో మరోసారి నిరూపించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం తొలి రోజు నుంచే హిట్ టాక్ సంపాదించుకుంది. ఫస్ట్ డేనే వరల్డ్‌వైడ్ గ్రాస్‌గా రూ.84 కోట్లు రాబట్టిన ఈ సినిమా, రెండు రోజుల్లోనే సెంచరీ (100 కోట్లు) కొట్టేసింది. మూడో రోజు కూడా కలెక్షన్స్ తగ్గకుండా భారీగా సాగింది. పండగ సీజన్ కావడంతో సినీ ప్రేక్షకులు పెద్ద ఎత్తున సినిమాకు తరలివెళ్లారు. దీంతో మూడు రోజుల్లో వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ.152 కోట్లకు చేరుకుందని మేకర్స్ అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు.(మనశంకర వరప్రసాద్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఇటీవల కాలంలో చిరంజీవి సినిమాకు ఈ స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. ఈ సినిమా ద్వారా మెగాస్టార్ తన పాత ఫామ్‌ను తిరిగి తెచ్చుకున్నాడని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడికి ఇది వరుసగా 9వ హిట్. అతని సంక్రాంతి సెంటిమెంట్ మళ్లీ వర్కౌట్ అయింది. గతంలో సంక్రాంతి సమయంలో విడుదలైన అతని చిత్రాలు అన్నీ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో, ఈ సారి కూడా అదే మ్యాజిక్ పనిచేసింది.ఈ చిత్రంలో చిరుకి జోడీగా నయనతార నటించగా..క్యాథరిన్ కీలక పాత్రలో పోషించింది. ఇక విక్టరీ వెంకటేశ్ క్యామియో.. ఈ సినిమాకు మరింత ప్లస్ యింది. సినిమాకు హిట్ టాక్ రావడంతో కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.మరో అదిరిపోయే సంక్రాంతి 🥳🥳🥳🙏🙏🙏🙏అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు 🥳🔥🔥🔥 pic.twitter.com/QBPAE3BKBG— Anil Ravipudi (@AnilRavipudi) January 15, 2026 -
స్పెషల్ సంక్రాంతి
ఒకవైపు సంక్రాంతి సంబరాలు... మరోవైపు సక్సెస్ సంబరాలతో సుష్మిత కొణిదెల ఫుల్ జోష్‌గా ఉన్నారు. తండ్రి చిరంజీవి హీరోగా ఆమె నిర్మించిన ‘మన శంకర వరప్రసాద్‌గారు’ ఈ సంక్రాంతికి విడుదలై, సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అందుకే సుష్మిత ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇది తనకు ‘సూపర్ సంక్రాంతి... స్పెషల్ సంక్రాంతి’ అంటున్నారామె. ఇంకా సంక్రాంతి పండగ గురించి ‘సాక్షి’కి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో సుష్మిత పలు విశేషాలు పంచుకున్నారు.మా చిన్నప్పుడు చెన్నైలో ఉండేవాళ్లం. అక్కడ సంక్రాంతి సెలబ్రేషన్స్ మా ఇంటికే పరిమితం. కాలేజ్ టైమ్‌లో హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. అప్పట్నుంచి బెంగళూరులో మా ఫామ్‌హౌస్‌లో జరుపుకోవడం ఆనవాయితీ అయింది. పండగలప్పుడు అందరూ కలిసి మన సంప్రదాయం ప్రకారం జరుపుకోవాలని మా నాన్నగారు అనుకుంటారు. అలా అందరూ కలిసి ఈ పండగ నాలుగు రోజులు హాయిగా కబుర్లు చెప్పుకుంటూ, ఆటలు ఆడుకుంటూ, పిండివంటలు, నాన్‌వెజ్ అవీ తింటూ సరదాగా గడపటం వల్ల బంధాలు బలపడతాయని ఆయన నమ్ముతారు. అది నిజం అని మాకు అర్థం అయింది.వేడి కాఫీ... హాట్ దోసెభోగితో ్రపారంభించి, కనుమ వరకూ మా సెలబ్రేషన్స్ హంగామాగా ఉంటాయి. భోగి రోజున తెల్లవారుజాము ఐదు గంటలకల్లా చలి మంట వేస్తాం. అక్కడే లైవ్ కిచెన్ ఏర్పాటు చేసుకుంటాం. ముందు వేడి వేడి కాఫీతో మొదలుపెట్టి, రకరకాల దోసెల వరకూ బ్రేక్‌ఫాస్ట్ ఫుల్లుగా లాగించేస్తాం. ముందు మా నాన్న ఒక దోసె వేస్తారు. ఆ తర్వాత ఇంట్లో మిగతా మగవాళ్లు కూడా గరిటె తిప్పుతారు. భోగి రోజు మా ఇంట్లో లేడీస్‌కి దాదాపు రెస్ట్ అన్నమాట (నవ్వుతూ). ఆ తర్వాత లంచ్ కూడా గ్రాండ్‌గా ఉంటుంది. వెజిటేరియన్ నుంచి నాన్ వెజిటేరియన్ వరకూ బోలెడన్ని వంటకాలు. మా ఇంటికి ఉపాసన వచ్చాక సంక్రాంతి మెనూ ఇంకా పెద్దదైంది. ముఖ్యంగా ఈ పండగకి మేం ‘మిక్సర్’ చేస్తాం. ఆ మిక్సర్ నా ఫేవరెట్. నో డైట్... ఓన్లీ చీట్ అనుకుని, నచ్చినవన్నీ తింటాం.నేను... చరణ్ వేరే జట్టుచిన్నప్పట్నుంచి నాకు కైట్స్ పెద్దగా ఇంట్రస్ట్ లేదు. కైట్స్ అంటే మాత్రం వరుణే (హీరో వరుణ్ తేజ్). తను హైట్‌గా ఉంటాడు కాబట్టి అదో అడ్వాంటేజ్. అయితే సేఫ్టీగా ఎగురవేస్తాం. అలాగే అందరం కలిసి అంత్యాక్షరి ఆడతాం. మా కజిన్ నైనికా గొంతు బాగుంటుంది. ‘మన శంకర వరప్రసాద్‌గారు’లోని ఫ్యామిలీ మాంటేజ్ సాంగ్ తనే పాడింది. ఆ తర్వాత మా పిన్ని పద్మజ కూడా బాగా పాడుతుంది. ఇక ‘టగ్ ఆఫ్ వార్’ (తాడు లాగే ఆట) గేమ్ సందడి భలేగా ఉంటుంది. ఈ గేమ్‌లో నన్ను, చరణ్ (హీరో రామ్‌చరణ్)ని వేరే జట్టులో వేస్తారు. ఇద్దరం ఒకే జట్టులో ఉంటే చీట్ చేస్తామని అలా ΄్లాన్ చేస్తారు. యంగ్æ, మిడిల్ ఏజ్డ్, ఎల్డర్స్... ఇలా మూడు జట్లుగా విడిపోయి టగ్ ఆఫ్ వార్ ఆడతాం. చిన్నవాళ్లందరం కలిసి కబడ్డీ కూడా ఆడతాం.ఈసారి అమ్మ చీరలే...పండగకి మంచి మంచి ఔట్ఫిట్స్ సెలక్ట్ చేసుకుంటుంటాను. అయితే ఈసారి సినిమాప్రొడక్షన్తో బిజీ కాబట్టి ΄్లాన్ చేయలేదు. మా అమ్మ దగ్గర మంచి మంచి చీరలు ఉన్నాయి. ఆవిడ వార్డ్రోబ్ ఓపెన్ చేసి, నచ్చిన చీరలు కట్టుకోవాలనుకుంటున్నాను. సంక్రాంతి అంటేనే నాకో పెద్ద సెలబ్రేషన్‌లా అనిపిస్తుంది. పల్లెటూళ్లల్లో బాగా చేసుకుంటారు. మేం స్వయంగా విలేజ్‌కి వెళ్లకపోయినా అక్కడ బంధువులు అందరూ కలిసి ఎలా చేసుకుంటారో మేం అలా చేసుకుంటాం. ఫ్యామిలీ అంతా గ్యాదర్ అయినప్పుడు ఆ స్ట్రెంత్, ఆ వైబ్ వేరు. పిల్లలకు మన సంప్రదాయాలు తెలుస్తాయి... కుటుంబ అనుబంధాల విలువ కూడా తెలుస్తుంది.ఆ డైలాగ్ ఇష్టంఈసారి మా సంక్రాంతి సెలబ్రేషన్ హైదరాబాద్‌లోనే. ‘మన శంకర వరప్రసాద్‌గారు’ రిలీజ్ హడావిడి, ప్రమోషన్, ఇప్పుడు సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తూ హైదరాబాద్‌లో పండగ చేసుకుంటున్నాం. నా గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బేనర్ మీద మా నాన్నగారితో సినిమా తీయడం, అది సూపర్ హిట్ కావడంతో ఇది మాకు ‘సూపర్ సంక్రాంతి... స్పెషల్ సంక్రాంతి’లా భావిస్తున్నాను. ఈ సినిమాలో ఒక సీన్లో ‘రేఖ... శశిరేఖ’ అని నాన్న చెప్పిన డైలాగ్ నాకు ఇష్టం. మా అమ్మ పేరు (సురేఖ) కూడా ఉంది కాబట్టి, ఆ విధంగానూ ఈ సినిమా నాకు స్పెషల్. అమ్మ మనసు ఎప్పుడూ పిల్లల కష్టం గురించే ఆలోచిస్తుంటుంది. ఆ కష్టం తాలూకు సక్సెస్ గురించి కూడా ఆలోచించదు. ఒకవైపు సినిమాప్రొడక్షన్, పిల్లలను చూసుకుంటూ కష్టపడిపోతున్నావని అమ్మ తెగ ఫీల్ అయ్యేది (నవ్వుతూ). ఇక మేం ఎంజాయ్ చేస్తున్నట్లే అందరూ తమ ఫ్యామిలీతో కలిసి ఈ సంక్రాంతి జరుపుకోవాలని, అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఇంటర్వ్యూ: డి.జి. భవాని -
ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్.. మెగా హీరోలు..
-
చిరంజీవి రెమ్యునరేషన్ ఎంతో చెప్పిన 'అనిల్ రావిపూడి'
'మన శంకరవరప్రసాద్‌గారు' సినిమా హిట్ కావడంతో భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. రెండురోజుల్లోనే రూ. 120 కోట్ల గ్రాస్ వచ్చినట్లు ప్రకటించారు. అయితే, సినిమాకు పెద్ద బడ్జెట్ కాకపోయినప్పటికీ చిరంజీవి, నయనతార, వెంకటేశ్ వంటి స్టార్స్ ఉండటంతో వారి రెమ్యునరేషన్ ఎక్కువగా ఉంటుందని టాక్.. ఈ మూవీకి నిర్మాతలుగా సాహు గారపాటితో పాటు చిరు కూతురు సుస్మిత కొణిదెల కూడా ఉన్నారు. దీంతో మెగాస్టార్ రెమ్యునరేషన్ ఎంత ఉంటుంది అనే ప్రశ్న ఎక్కువమందిలో కలుగుతుంది. ఈ క్రమంలో తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు.'మన శంకరవరప్రసాద్‌గారు' సినిమాకు గాను తను రెమ్యేనరేషన్ మాత్రమే తీసుకున్నానని అనిల్ రావిపూడి అన్నారు. అందరూ అనుకుంటున్నట్లు తాను షేర్ ఏమీ తీసుకోవడం లేదన్నారు. చిరంజీవి కూడా సినిమా బడ్జెట్‌ను బట్టి తన పారితోషికం తీసుకున్నారని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీలో నయనతార, వెంకటేశ్ వంటి ఇద్దరు స్టార్స్ ఉన్నారు.. ఆపై ఆయన కూతురు నిర్మాత కాబట్టి ఆమెకు కూడా కాస్త నాలుగు రూపాయలు మిగలాలి కదా అనే దృష్టిలో చిరు ఉన్నారని తెలిపారు. చిరు ఇమేజ్‌కు తగ్గట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారని అనిల్ రావిపూడి చెప్పారు.ఎవరికి ఎంత రెమ్యునరేషన్..?చిరంజీవి ప్రతి సినిమాకు రూ. 50 కోట్ల నుంచి 70 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారని టాక్ వుంది. అయితే, తన కూతురు నిర్మాతగా ఉన్నారు కాబట్టి ఇందులో తన పారితోషికాన్ని కాస్త తగ్గించారని సమాచారం. ఇందులో శశిరేఖగా నయనతార ప్రేక్షకులను మెప్పించింది. ఈ పాత్ర కోసం ఆమె ముందుగా రూ. 15 కోట్లు అడిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఫైనల్‌గా రూ. 6 కోట్ల రెమ్యునరేషన్‌తో ఢీల్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. వెంకటేశ్ రూ. 9 కోట్లు, అనిల్ రావిపూడి రూ. 25 కోట్లు తమ రెమ్యునరేషన్‌గా తీసుకున్నారని సమాచారం. View this post on Instagram A post shared by Shine Screens (@shinescreenscinema) -
'మన శంకరవరప్రసాద్ గారు' రెండురోజుల కలెక్షన్స్
'మన శంకరవరప్రసాద్ గారు' సినిమాతో బాక్సాఫీస్ వద్ద చిరంజీవి మార్క్ ఏంటో చూపుతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డే రూ. 84 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా రెండు రోజుల కలెక్షన్స్‌ను అధికారికంగా తెలిపారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. ఇందులో చిరంజీవితో పాటు వెంకటేశ్, నయనతార, కేథరిన్ థ్రెసా, సచిన్ ఖేడ్కేర్ తదితరులు నటించారు. ఈ మూవీని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించారు.'మన శంకరవరప్రసాద్ గారు' రెండురోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 120 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ మేరకు ఒక పోస్టర్‌ను పంచుకున్నారు. సినిమా బాగుందని టాక్ రావడం ఆపై సంక్రాంతి సెలవులు కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా థియేటర్‌కు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. రెండు తెలుగురాష్ట్రాల్లో సినిమాకు టికెట్ ధరలు కూడా కాస్త అధికంగా ఉండటంతో కలెక్షన్స్‌పై సానుకూల ప్రభావం చూపుతుంది. చిరంజీవి కెరీర్లో సైరా నరసింహారెడ్డి (రూ. 244 కోట్లు), వాల్తేరు వీరయ్య (రూ. 235 కోట్లు) చిత్రాలు అత్యధిక కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేశాయి. అయితే, 'మన శంకరవరప్రసాద్ గారు' సులువుగా రూ. 350 కోట్ల మార్క్‌ను దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.#HappyBhogi2026 to everyone ❤️SWAG KA BAAP is setting Box-office on fire across the globe 🔥🔥🔥₹120Crore Gross worldwide in 2 DAYS for #ManaShankaraVaraPrasadGaru ❤️🔥❤️🔥❤️🔥#MegaBlockbusterMSGMegastar @KChiruTweetsVictory @VenkyMama@AnilRavipudi #Nayanthara… pic.twitter.com/bIsz1HS9eu— Shine Screens (@Shine_Screens) January 14, 2026 -
చిరంజీవి కుమారుడిగా చైల్డ్ ఆర్టిస్ట్.. ఎవరో తెలుసా?
మెగాస్టార్-చిరంజీవి కాంబోలో వచ్చిన సంక్రాంతి సినిమా 'మనశంకర వరప్రసాద్‌గారు'. ఈనెల 12న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్‌ను తెచ్చుకుంటోంది. నయనతార హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో.. వెంకటేశ్ కీలకపాత్రలో మెప్పించారు. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.అయితే ఈ చిత్రంలో అబ్బాయిగా నటించి అందరిని ఆశ్చర్యపోయేలా చేసింది చిన్నారి గురించి నెట్టింట చర్చ మొదలైంది. ఇంతకీ ఎవరీ బుజ్జాయి అంటూ తెగ వెతికేస్తున్నారు. ఆమె చిన్నారి పేరు ఊహ కాగా.. ఉప్పల్ ప్రాంతానికి చెందిన బుజ్జితల్లి ప్రస్తుతం రెండో తరగతి చదువుతోంది. సినిమాలపై ఇష్టంతో ఇప్పటికే 20కిపైగా చిత్రాల్లో నటించి మెప్పించింది. తాజాగా విడుదలైన మన శంకరవరప్రసాద్ గారులో చిరంజీవికి కుమారుడిగా నటించడం చాలా ఆనందాన్ని ఇచ్చిందంటూ తెగ మురిసిపోతోంది. షూటింగ్ సెట్లో చిరంజీవి తనను ఎంత ప్రేమగా చూసుకునేవారని అంటోంది. -
'మన శంకర వరప్రసాద్ గారు' కాస్త తగ్గితేనే మంచిది
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాకు మంచి స్పందన వస్తుంది. ఈ మూవీని చిత్ర నిర్మాతలు కూడా చాలా దూకుడుగా ప్రమోట్ చేస్తున్నారు. ఫస్ట్ డే రూ. 84 కోట్ల గ్రాస్ వచ్చినట్లు ప్రకటించారు. సినిమా బాగుందని టాక్ రావడంతో కుటుంబంతో కలిసి సినిమాకు వెళ్దామనుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అయితే, రెండు తెలుగురాష్ట్రాల్లో టికెట్ ధరలు అధికంగా ఉండటం వల్ల ప్రేక్షకులు ఫ్యామిలీతో పాటు కలిసి థియేటర్‌కు వెళ్లేందుకు జంకుతున్నారు. దీంతో సినిమా కలెక్షన్స్‌పై ప్రభావం చూపవచ్చని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి.సంక్రాంతి సందర్భంగా చాలా సినిమాలు విడుదల కానున్నాయి. ఇప్పటికే ది రాజా సాబ్ రీవర్షన్ చేయడంతో బాగుందని టాక్ వచ్చింది. ఆపై రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి థియేటర్లోకి వచ్చేసింది. సినిమా బాగుందని టాక్ కనిపిస్తోంది. జనవరి 14న మరో రెండు సినిమాలు విడుదల కానున్నాయి. వీటికి కూడా మంచి టాక్ వస్తే.. టికెట్ ధరలు తక్కువ కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిన్న చిత్రాలవైపే మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. టికెట్ ధరలు తగ్గిన తర్వాత మన శంకర వర ప్రసాద్ గారు చూద్దాంలే అనుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇంతలో పండగ సందడి ముగుస్తుంది కాబట్టి ఆ తర్వాత ఎవరిపనుల్లో వారు పడిపోవడం సహజం. చిరు సినిమాకు మంచి టాక్ ఉంది కాబట్టి టికెట్ ధరల విషయంలో స్వల్ప సర్దుబాటు చేయడం వల్ల సినిమాకు మరింత ప్రయోజనం చేకూరుతుంది. టికెట్ ధరలను తగ్గించడం వల్ల సినిమాకు నష్టం వాటిల్లడం కంటే ఎక్కువ లాభాలు వచ్చే ఛాన్స్ ఉందని సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.రెండు రాష్ట్రాల్లో టికెట్ ధరలు ఇలా..'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రానికి జనవరి 19 వరకు తెలంగాణలో టికెట్ ధరలు ఎక్కువగానే ఉంటాయి. ప్రస్తుతం ఉన్న ధరలకు సింగిల్ స్క్రీన్‌లో రూ.50 (జీఎస్టీతో కలిపి) మల్టీప్లెక్స్‌లలో రూ.100 (జీఎస్టీతో కలిపి) ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా జనవరి 22 వరకు అధిక ధరలు ఉంటాయి. ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలకు అధనంగా సింగిల్ స్క్రీన్‌లో రూ.100 (జీఎస్టీతో కలిపి) మల్టీప్లెక్స్‌లలో రూ.125 (జీఎస్టీతో కలిపి) ఉంటుంది.మన శంకరవరప్రసాద్ గారు బాక్స్ఆఫీస్ బద్దలుకొట్టేసారు 💥💥💥₹84 CRORES+ WORLDWIDE GROSS for#ManaShankaraVaraPrasadGaru (Premieres + Day 1) ❤️🔥❤️🔥❤️🔥ALL TIME RECORD OPENINGS EVERYWHERE 🔥🔥🔥#MegaBlockbusterMSGMegastar @KChiruTweetsVictory @VenkyMama@AnilRavipudi #Nayanthara… pic.twitter.com/qId5atqw8T— Shine Screens (@Shine_Screens) January 13, 2026 -
'మన శంకర వర ప్రసాద్‌గారు' ఓల్డ్ సాంగ్స్ ఖర్చు ఎంతో తెలుసా?
ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాల్లో 1980 కాలం నాటి పాటలను ఉపయోగిస్తున్నారు. అందులో ఎక్కువగా ఇళయరాజా పాటలు తీసుకోవడం విశేషం. ఈ జనరేషన్ సినీ ఫ్యాన్స్‌కు ఆ సాంగ్స్ బాగా నచ్చుతున్నాయి కూడా.. అందుకే దర్శకులు కూడా వాటిపై మక్కువ చూపుతున్నారు. రీసెంట్గా కిరణ్ అబ్బవరం మూవీ 'కే ర్యాంప్' కోసం హీరో రాజశేఖర్ నటించిన పాత సినిమా పాటను 'ఇదేమిటమ్మ మాయా..' తీసుకున్నారు. సినిమాకు కూడా బాగా కలిసొచ్చింది కూడా.. ఆ సమయంలో నెట్టింట భారీగా వైరల్ అయింది. అయతే, సంక్రాంతి రేసులో ఉన్న 'మన శంకర వర ప్రసాద్‌గారు' సినిమాలో కూడా పాత పాటలను ఉపయోగించి క్రేజ్ తెచ్చారు.చిరంజీవి- అనిల్ రావిపూడి సినిమా 'మన శంకర వర ప్రసాద్‌గారు'లో సంగీత దర్శకులు ఇళయరాజా స్వరపరిచిన రజనీకాంత్ 'దళపతి' చిత్రంలోని 'సుందరి కన్నల్ ఒరు సేథి' అనే ఐకానిక్ పాటను పదే పదే ఉపయోగించారు. హీరో, హీరోయిన్ల లవ్ ట్రాక్ కోసం ఈ సాంగ్‌ను మూడు భాషల నుంచి తీసుకున్నారు. 'దళపతి' సినిమా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళంలో కూడా విడుదలైంది. అయితే, చిరు సినిమా కోసం అన్ని భాషలకు సంబంధించిన ట్యూన్ హక్కులను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆపై సినిమాలో అక్కడక్కడ మరికొన్ని పాత పాటలను దర్శకుడు వాడారు. దీంతో ఈ పాటల రైట్స్ కోసం అడియో కంపెనీలకు భారీగానే డబ్బు చెల్లించినట్లు తెలుస్తోంది. మన శంకర వర ప్రసాద్గారులో ఉపయోగించిన పాత పాటల అన్నింటికి కలిపి సుమారు కోటి రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం. అది కూడా కేవలం ట్యూన్స్ వరకు మాత్రమే అనుమతి తీసుకున్నట్లు టాక్.. అయితే, 'మన శంకర వర ప్రసాద్ గారు' సినిమాకు ఆ పాత పాటలకు బాగా ఉపయోగపడ్డాయి. ఆ ట్యూన్ వచ్చిన ప్రతిసారి ఫ్యాన్స్ విజిల్స్ వేస్తూ ఎంజాయ్ చేశారు. చిరంజీవి పాట 'రామ్మా చిలకమ్మ'కు వెంకీ డ్యాన్స్ చేస్తుంటే ప్రేక్షకులు చేసిన గోల మామూలుగా ఉండదు. ఆపై 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ పాటకు చిరు స్టెప్పులు వేసి ప్రేక్షకుల్లో జోష్ నింపారు. ఇలా అన్ని పాటలకు కోటి రూపాయలు ఖర్చు చేసినప్పటికీ మూవీ లవర్స్ మాత్రం బాగా ఎంజాయ్ చేశారని చెప్పొచ్చు. -
రాజాసాబ్ 'బాడీ డబుల్' ఎఫెక్ట్.. ప్రభాస్‌పై ట్రోలింగ్
‘రాజాసాబ్’ సినిమా విడుదలైన తర్వాత హీరో ప్రభాస్ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు గురవుతున్నారు. ఈ విమర్శలకు కారణం సినిమాలో బాడీ డబుల్‌ను అధికంగా వాడారనే భావన ప్రేక్షకుల్లో కలగడమే. ప్రభాస్ సీన్లలో ఎక్కువగా హెడ్ రీప్లేస్మెంట్ టెక్నిక్ ఉపయోగించి బాడీ డబుల్‌తో చిత్రీకరించారని ప్రేక్షకులు అంటున్నారు. దీంతో ఆయన స్వయంగా యాక్షన్, డ్యాన్స్ సీన్లలో పాల్గొనలేదనే అభిప్రాయం బలపడుతోంది.అయితే ఇదే సమయంలో విడుదలైన 'మన శంకర వరప్రసాద్' సినిమాలో 70 ఏళ్ల మెగాస్టార్ ప్రతి సీన్లోనూ స్వయంగా పాల్గొన్నారు. డ్యాన్స్‌లు, ఫైట్లు అన్నీ ఆయనే చేసి అందరినీ ఆకట్టుకున్నారు. అవి మరీ అంత క్లిష్టమైన సీన్లు కాకపోయినా, ఒక్క సీన్ కూడా డూప్‌కు వదలకుండా మెగాస్టార్ స్వయంగా చేశారని ప్రేక్షకులు ఆ రెండు సినిమాలను పోలుస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. 70 ఏళ్ల చిరంజీవి ఒక్క సీన్ కూడా డూప్‌కు వదలకుండా చేస్తే మరి 40 ఏళ్లు దాటిన ప్రభాస్ మాత్రం ఎందుకు చేయలేకపోతున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నలు వేస్తున్నారు. ఆ ప్రశ్నలకు ఫ్యాన్స్ కూడా బలంగా సమాధానం చెప్పలేకపోతున్నారు. కారణం ‘రాజాసాబ్’లో టెక్నికల్ లోపాలు లేదా నిర్లక్ష్యం వల్లనో కానీ హెడ్ రీప్లేస్మెంట్ షాట్లు స్పష్టంగా కనిపించడం సినిమా చూసిన ప్రేక్షకులకు తెలిసిపోవడమే. -
కంగ్రాట్స్ మామయ్య.. చిరుకు మెగా కోడలు స్పెషల్ విషెస్
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటేస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మనశంకర వరప్రసాద్ గారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ రోజే థియేటర్లలో రిలీజైంది. మొదటి షో నుంచి హిట్ టాక్ రావడంతో మెగా ఫ్యాన్స్ సంబురాల్లో మునిగిపోయారు. పలువురు టాలీవుడ్ సినీతారలు మూవీ టీమ్‌ను అభినందిస్తున్నారు.తాజాగా మెగా కోడలు ఉపాసన కొణిదెల సైతం మనశంకర వరప్రసాద్‌కు అభినందనలు తెలిపింగి. 'ఇది మెగా సంక్రాంతి.. హృదయపూర్వక అభినందనలు మామయ్య' అంటూ ఈ సినిమాలోని ఓ వీడియో క్లిప్‌ను షేర్ చేసింది. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ చిత్రానికి మొదటి షో నుంచే సూపర్ హిట్ అంటూ ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించగా.. వెంకీమామ కీలక పాత్రలో కనిపించారు. కాగా.. ఈ సినిమాను ఏఎంబీ సినిమాస్‌లో రామ్ చరణ్ వీక్షించారు. It’s a MEGA SANKRANTHI hearty congratulations Mamaya @KChiruTweets @NayantharaU @sushkonidela ❤️❤️❤️❤️❤️🧿🙌 pic.twitter.com/xFhxbcV8Sc— Upasana Konidela (@upasanakonidela) January 12, 2026 -
బాస్ చింపేశాడు.. చిరంజీవిపై అల్లు అరవింద్ ప్రశంసలు
మెగాస్టార్ చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్టు అందుకోబోతున్నాడు. జనవరి 12న విడుదలైన ఈ చిత్రానికి ఎక్కడ చూసినా పాజిటివ్ టాకే వినిపిస్తోంది. వింటేజ్ చిరును చూశామని అభిమానులు సంతోషంతో ఎగిరి గంతేస్తున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ 'మన శంకర వరప్రసాద్‌గారు' సినిమా చూసి తన అభిప్రాయం చెప్పాడు.బాస్ ఈజ్ బాస్అల్లు అరవింద్ మాట్లాడుతూ.. సినిమా చూసి చాలా ఎగ్జయిట్ అయ్యాను. బాస్ చింపేశాడు. బాస్ ఈజ్ బాస్. రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు వంటి సినిమాలు చూసినప్పుడు కలిగిన అనుభూతి, ఆనందం మళ్లీ ఇన్నాళ్లకు కలిగింది. పాత చిరంజీవిని చూసే అవకాశం దొరికింది. సినిమా చాలా అద్భుతంగా ఉంది. వింటేజ్ చిరును తీసుకొచ్చారు. చిరంజీవి- వెంకటేశ్ కాంబినేషన్ అదిరిపోయింది. జనాలకు ఇది పైసా వసూల్ మూవీ అని ప్రశంసలు కురిపించాడు. మన శంకరవరప్రసాద్ గారు మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
కాంబో సూపర్ హిట్.. డైరెక్టర్‌కు మెగాస్టార్ అభినందనలు
మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన చిత్రం 'మనశంకర వరప్రసాద్‌గారు'. ఈ మూవీ సంక్రాంతి కానుకగా ఈ రోజే థియేటర్లలో విడుదలైంది. తొలిసారి వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ కావడంతో ఫ్యాన్స్‌లోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇవాళ విడుదలైన ఈ సినిమాకు అందుకు తగ్గట్టుగానే పాజిటివ్ టాక్ వస్తోంది. తొలి షో నుంచే ఆడియన్స్ నుంచి సూపర్ హిట్ అనే కామెంట్స్ వస్తున్నాయి. దీంతో మూవీ టీమ్ సంబురాల్లో మునిగిపోయింది.మనశంకర వరప్రసాద్ గారు మూవీకి హిట్ టాక్ రావడంతో అనిల్ రావిపూడిని మెగాస్టార్ అభినందించారు. చిరు హత్తుకున్న వీడియోను డైరెక్టర్ అనిల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ స్వీట్స్ తినిపించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ సూపర్ హిట్ కాంబో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించగా.. వెంకీమామ కీలక పాత్రలో మెరిశారు. Cherishing moments with Megastar @KChiruTweets garu for team #ManaShankaraVaraPrasadGaru ❤️🔥✨Experience the BIGGEST FAMILY ENTERTAINER of Sankranthi 2026 in cinemas 💥#MegaBlockbusterMSG IN CINEMAS NOW ❤️ pic.twitter.com/dhcbC4L7pL— Shine Screens (@Shine_Screens) January 12, 2026 Sometimes, words aren’t needed at all ❤️🤗#ManaShankaraVaraPrasadGaru pic.twitter.com/wWZ77wGUIH— Anil Ravipudi (@AnilRavipudi) January 12, 2026 -
మన శంకర వరప్రసాద్ గారు హిట్టా.. ఫట్టా
-
ప్రీమియర్స్‌తోనే అఖండ-2ను దాటేసిన 'మన శంకరవరప్రసాద్ గారు'
తెలుగు రాష్ట్రాల్లో 'మన శంకరవరప్రసాద్ గారు' థియేటర్స్ హౌస్‌ఫుల్ అవుతున్నాయి. మూవీకి పాజిటీవ్ టాక్ రావడంతో థియేటర్స్ కూడా పెరగనున్నాయి. అయితే, ఉత్తర అమెరికాలో కూడా చిరంజీవి సత్తా చాటుతున్నారు. ఓవర్సీస్లో బాలకృష్ణ అఖండ-2 సినిమాకు వచ్చిన ఫైనల్ కలెక్షన్స్‌ను కేవలం ప్రీమియర్స్‌తోనే మన శంకరవరప్రసాద్ గారు దాటేశారు. సినిమాకు పాజిటీవ్ టాక్ రావడంతో అక్కడ బుకింగ్స్ జోరు కనిపిస్తుంది.బాలకృష్ణ - బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అఖండ 2’. ఉత్తర అమెరికాలో ఈ మూవీ ఫైనల్ కలెక్షన్స్ 1 మిలియన్ డాలర్స్ (రూ. 9కోట్లు) రాబట్టింది. అయితే, 'మన శంకరవరప్రసాద్ గారు' కేవలం ప్రీమియర్స్ ద్వారానే 1.2 మిలియన్ డాలర్స్( రూ.11కోట్లు) రాబట్టాడు. దీంతో ఇండస్ట్రీ కూడా ఆశ్యర్యపోతుంది. భారీ సినిమాలు పోటీ ఉండగా ఇంతటి రేంజ్లో కలెక్షన్స్ రావడంతో ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బుక్‌మైషోలో కేవలం 24గంటల్లో 5లక్షలకు పైగా టికెట్లు కొనుగోలు చేశారు.ప్రీమియర్స్ పూర్తికాగానే చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంది. చిరంజీవి, అనిల్ రావిపూడితో పాటు నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఆపై కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Shine Screens (@shinescreenscinema) -
బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్.. సంతోషంలో చిరంజీవి, అనిల్ రావిపూడి
సంక్రాంతి బరిలో మన శంకర వరప్రసాద్‌గారు దిగేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజైన మొదటి రోజే బ్లాక్‌బస్టర్ టాక్ అందుకుంటోంది. ప్రీమియర్స్ నుంచే సినిమాకు హిట్ టాక్ మొదలైంది. 'బాస్ ఈజ్ బ్యాక్.. ఈ సంక్రాంతి బాస్‌దే..' అంటూ సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్లు వస్తున్నాయి. సెలబ్రేషన్స్ఇది చూసిన చిత్రయూనిట్ సెలబ్రేషన్స్ జరుపుకుంది. హీరో చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సినిమా విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.సంక్రాంతి హిట్ బొమ్మఅనిల్ రావిపూడి ముందుగా చెప్పినట్లుగానే సినిమాలో వింటేజ్ చిరును చూపించాడు. అద్భుతమైన యాక్టింగ్, గ్రేస్, డ్యాన్స్‌తో మెగాస్టార్ అభిమానులను ఎంతగానో అలరించాడు. మొత్తానికి ఈ సినిమా మెగా ఫ్యాన్స్‌కు అసలైన పండగను తీసుకొచ్చింది. మరి ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి! A beautiful moment celebrating a MEGA BLOCKBUSTER RESPONSE 😀❤️🔥Hit Machine, director @AnilRavipudi, producers @sahugarapati7 & @sushkonidela met Megastar @KChiruTweets to share the happiness after the blockbuster response from the premieres of #ManaShankaraVaraPrasadGaru 🔥… pic.twitter.com/ZL8Tsch547— Gold Box Entertainments (@GoldBoxEnt) January 11, 2026 (మన శంకర వరప్రసాద్‌గారు మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
'మన శంకర వర ప్రసాద్ గారు'.. మూవీలో ఇదొక్కటే మైనస్
సంక్రాంతికి 'మన శంకర వర ప్రసాద్ గారు' వచ్చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి పండుగ పరీక్షలో డిస్టింక్షన్ కొట్టేశారు. కామెడీతో పాటు భారీ యాక్షన్స్ కూడా ఇందులో ఉన్నాయి. నిర్మాతలను కమర్షియల్‌గా కూడా గట్టెక్కించే సినిమా అని చెప్పాలి. అనకాపల్లి నుంచి అమెరికా వరకు ప్రీమియర్స్‌లో దుమ్మురేపింది. సినిమా చూసిన ప్రేక్షకులు బాగుంది అంటూ రివ్యూలు కూడా ఇచ్చేశారు. అయితే, ఒక విషయంలో మాత్రం చిరంజీవి అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది.'మన శంకర వర ప్రసాద్ గారి' గురించి ఎక్కడ చూసిన సానుకూల స్పందన కనిపిస్తుంది. ప్రేక్షకులు ఈ సినిమాను ఆస్వాదించినప్పటికీ, సంగీత దర్శకులు ఇళయరాజా స్వరపరిచిన రజనీకాంత్ 'దళపతి' చిత్రంలోని 'సుందరి కన్నల్ ఒరు సేథి' అనే ఐకానిక్ పాటను పదే పదే ఉపయోగించారు. ఇప్పుడు ఇదే అంశం గురించి నెట్టింట చర్చలు జరుగుతున్నాయి. మూవీలో ఈ పాటను చాలాసార్లు ఉపయోగించారు. ప్రధానంగా చిరంజీవి, నయనతార కనిపించిన ప్రధాన సీన్స్‌లలో ఈ సాంగ్ ఉంటుంది. ఇళయరాజా అనుమతితోనే ఈ పాటను సినిమాలో చేర్చారా అనే సందేహాలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన రాయల్టీ బాధ్యతలను క్లియర్ చేశారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాపీరైట్ విషయాలపై ఇళయరాజా దృఢమైన వైఖరిని తీసుకుంటారని తెలిసిందే. ఇప్పటికే తమిళ హీరోల సినిమాలపై కూడా ఆయన కేసులు వేశారు. ఇప్పుడు 'మన శంకర వర ప్రసాద్ గారు' మూవీ వియషయంలో ఆయన వైఖరి ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. సినిమాకు మంచి టాక్ రావడంతో ఈ పాట కారణం వల్ల థియేటర్ల ప్రదర్శనకు అంతరాయం కలిగించడానికి చట్టపరమైన సమస్యలు ఏమైనా వస్తాయా అనే సందేహాలు వస్తున్నాయి. ఈ విషయంలో చిరు అభిమానులు స్పష్టతను కోరుకుంటున్నారు. నిర్మాతల నుండి ఏదైనా ఒక ప్రకటన వస్తే ఈ ఊహాగానాలకు చెక్ పడుతుంది. -
‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: ‘మన శంకరవరప్రసాద్ గారు’నటీనటులు: చిరంజీవి, వెంకటేశ్, నయనతార, కేథరిన్ థ్రెసా, సచిన్ ఖేడ్కేర్, రఘుబాబు, అభినవ్ గోమఠం తదితరులునిర్మాణ సంస్థ:షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్నిర్మాతలు: సాహు గారపాటి, సుస్మిత కొణిదెలరచన-దర్శకత్వం: అనిల్ రావిపూడిసంగీతం: భీమ్స్ సిసిరోలియోసినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డిఎడిటర్: తమ్మిరాజువిడుదల తేది: జనవరి 12, 2026ఈ సంక్రాంతికి బరిలోకి దిగిన రెండో పుంజు ‘మన శంకరవరప్రసాద్ గారు’. ‘భోళా శంకర్’ లాంటి డిజాస్టర్ తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకొని చిరంజీవి ఈ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ఈ మూవీపై బజ్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(జనవరి 12) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి అందించింది? చిరు ఖాతాలో భారీ హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం. (Mana Shankara Vara Prasad Garu Movie Review)కథశంకరవరప్రసాద్(చిరంజీవి) నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్. ఆయన టీమ్(కేథరీన్, హర్ష వర్ధన్, అభినవ్ గోమఠం) కేంద్ర హోంమంత్రి నితీష్ శర్మ(శరత్ సక్సేనా) రక్షణ బాధ్యలతను చూస్తుంటుంది. వృత్తిపట్ల ఎంతో నిబద్ధతతో ఉండే శంకరవరప్రసాద్.. పర్సనల్ లైఫ్‌ని లీడ్ చేయడంలో మాత్రం ఫెయిల్ అవుతాడు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భార్య శశిరేఖ(నయనతార) అతనికి విడాకులు ఇచ్చి.. బడా వ్యాపారవేత్త అయిన తన తండ్రి జీవీఆర్(సచిన్ ఖేడ్కెర్) దగ్గరకు వెళ్తుంది. పిల్లలను కూడా చూపించపోవడంతో ఆరేళ్లుగా వరప్రసాద్ అదే బాధలో ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి నితీష్.. తనకున్న పలుకుబడితో బోర్డింగ్ స్కూల్లో చదువుతున్న తన పిల్లలకు పీఈటీ టీచర్‌గా వరప్రసాద్‌ని పంపిస్తాడు. తండ్రిపై ద్వేషం పెంచుకున్న పిల్లలకు వరప్రసాద్ ఎలా దగ్గరయ్యాడు? అసలు శశిరేఖ, వరప్రసాద్ విడిపోవడానికి గల కారణం ఏంటి? మైనింగ్ వ్యాపారవేత్త వెంకీ గౌడ(వెంకటేశ్), శశిరేఖకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? చివరకు శశిరేఖ, వరప్రసాద్ మళ్లీ కలిశారా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..ఎలా ఉందంటే..అనిల్ రావిపూడి సినిమాల్లో కథ పెద్దగా ఉండదు. ఆయన సినిమాలో కొత్తదనం, ట్విస్టులు, లాజిక్కుల గురించి వెతకడం అంటే.. ప్యూర్ వెజ్ రెస్టారెంట్‌కి వెళ్లి చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చినట్టే ఉంటుంది. పాత కథతోనే ఫ్యామిలీ ఆడియన్స్‌ని థియేటర్స్‌కు రప్పించడం ఆయన స్టైల్. కథ-కథనం కంటే.. హీరోకి ఉన్న ప్లస్ పాయింట్స్‌ని ఎలా వాడుకోవాలనేదానిపైనే ఎక్కువ ఫోకస్ పెడతాడు. హీరోని ఎలా చూపిస్తే.. ఆడియన్స్ కనెక్ట్ అవుతారు? ఎక్కడ ఏ సీన్ పెడితే నవ్వుకుంటారు? అనేది అనిల్‌కి బాగా తెలుసు. ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాలన్నింటికీ ఇదే మ్యాజిక్ వర్కౌట్ అయింది. ఇప్పుడు మన శంకరవరప్రసాద్ గారు చిత్రానికి కూడా అనిల్ ఆ పనే చేశాడు. మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్‌ని గట్టిగా వాడుకొని.. ఫ్యాన్స్ ఆయన్ని తెరపై ఎలా చూడాలని కోరుకుంటున్నారో అలాగే చూపించాడు. అలా అని చిరులో ఉన్న మాస్ యాంగిల్‌ని పక్కన పెట్టలేదు. మధ్య మధ్యలో యాక్షన్ సీన్లను పెట్టి మాస్ లుక్‌ని కూడా చూపించాడు. అయితే ముందుగా చెప్పినట్లు ఈ సినిమాలో చెప్పుకోవడానికి కథే లేదు. కోపంలో విడాకులు తీసుకున్న భార్యను పొందేందుకు భర్త చేసిన ప్రయత్నమే ఈ సినిమా కథ. ఇక్కడ అనిల్ రావిపూడి చేసిన మ్యాజిక్ ఏంటంటే.. ఈ సింపుల్ లైన్‌కి చిరంజీవి మేనరిజాన్ని హైలెట్ చేసేలా సన్నివేశాలు అల్లుకోవడమే! ఈ మధ్య కాలంలో... ఇంకా చెప్పాలంటే రీఎంట్రీ తర్వాత చిరంజీవిని తెరపై ఇంత స్టైలిష్‌గా, ఇంత హుషారుగా ఎవరూ చూపించలేదు. ఈ రకంగా చూస్తే చిరంజీవి ఫ్యాన్స్‌కి ఇది స్పెషల్ చిత్రమే. అయితే కథగా చూస్తే మాత్రం మెగాస్టార్ చిరంజీవి స్థాయికి సరిపోలేదనే చెప్పాలి. ఒకానొక దశలో చిరంజీవిని చిన్న కమెడియన్లా చూపించారనే ఫీలింగ్ కలుగుతుంది.ఓ రౌడీ ముఠా.. హోం మంత్రికి వార్నింగ్ ఇచ్చే సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. చిరు ఎంట్రీ సీన్‌తోనే అనిల్ రావిపూడి తరహా కామెడీ ప్రారంభం అవుతుంది. హుక్ స్టెప్ సాంగ్ వరకు కథనం రొటీన్‌గానే సాగుతుంది. ఇక వరప్రసాద్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. వరప్రసాద్- శశిరేఖల ప్రేమ.. పెళ్లి.. విడాకులకు దారీతీసిన సంఘటనలు అన్నీ నవ్వులు పూయిస్తాయి. స్కూల్ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యాక కథనం కాస్త బోరింగ్‌గా సాగుతుంది. బుల్లిరాజా(రేవంత్) ఎంట్రీతో మళ్లీ నవ్వులు మొదలవుతాయి. ఇలా ప్రేక్షకుడికి బోర్ కొట్టకుండా ప్రతి పది నిమిషాలకు ఒక కామెడీ సీన్‌ని పెట్టి ఫస్టాఫ్ ముగించాడు. ఇక సెకండాఫ్ ప్రారంభంలో కథనం కాస్త నెమ్మదిగా సాగుతుంది. వీరేంద్ర పాండే పాత్ర ఎంట్రీతో మళ్లీ కథనం పుంజుకుంటుంది. కథతో సంబంధం లేకున్నా.. విడాకుల అంశంపై హీరో పాత్రతో ఓ మంచి సందేశం ఇప్పించాడు. అది కూడా కామెడీగానే చూపించినా.. సినిమా చూసిన ప్రేక్షకుడు కాస్త ఆలోచిస్తాడు. ఇక వెంకటేశ్ పాత్ర ఎంట్రీతో మళ్లీ నవ్వులు స్టార్ట్ అవుతాయి. వెంకీ గౌడగా వెంకటేశ్ ఎంట్రీ నుంచి కథనం పరుగులు పెడుతుంది. క్లైమాక్స్ రొటీన్‌గానే ఉంటుంది. సాధారణ సమయంలో రిలీజ్ అయితే ఫలితం ఎలా ఉండేదో తెలియదు కానీ.. సంక్రాంతి పండక్కి వచ్చి ‘మన శంకరవరప్రసాద్’ మంచి పనే చేశాడు. ముందుగా చెప్పినట్లుగా కొత్తదనం ఆశించకుండా, లాజిక్కులు వెతక్కుండా హాయిగా నవ్వుకోవడానికి అయితే ఈ సినిమా చూడొచ్చు. (Positives And Negatives Of Mana Shankara Vara Prasad Garu Movie)ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాకు ప్రధాన బలం మెగాస్టార్ చిరంజీవినే. ఆయన లుక్స్, ఎక్స్ప్రెషన్స్, డైలాగులు.. ఇవన్నీ చూస్తే ఒకప్పటి మెగాస్టార్ మన కళ్లముందు కనిపిస్తాడు. ఒకవైపు తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకుంటూనే.. యాక్షన్ సీన్లను ఇరగదీశాడు. ఇక డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హుక్ స్టెప్ పాటకు ఆయన వేసిన స్టెప్పులకు థియేటర్స్‌లో విజిల్స్ వేయడం గ్యారెంటీ. శశిరేఖగా నయనతార తనదైన నటనతో ఆకట్టుకుంది. తెరపై అందంగా కనిపించింది. హీరో మామగారిగా సచిన్ ఖేడ్కర్ చక్కగా నటించాడు. వెంకీ గౌడ పాత్రలో వెంకటేశ్ ఒదిగిపోయాడు. చిరు-వెంకీ కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటాయి. హీరో తల్లిగా జరీనా వాహబ్ తెరపై కనిపించేది కాసేపే అయినా.. నయనతారతో ఆమె చెప్పే సంభాషణలు ఆలోచింపజేస్తాయి. వరప్రసాద్ టీమ్ సభ్యులుగా నటించిన కేథరిన్, హర్షవర్ధన్, అభినవ్ గోమఠంతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధిమేరకు చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. భీమ్స్ సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. మీసాల పిల్ల, హుక్ స్టెప్ సాంగ్ తెరపై మరింత ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
'ఖైదీ 150' తర్వాత 'మన శంకర వరప్రసాద్ గారు' రికార్డ్
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రీమియర్ షోల విషయంలో దుమ్మురేపుతున్నాడు. హైదరాబాద్‌లో ఏకంగా 200 స్క్రీన్స్‌లలో ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు. రూ. 600 టికెట్ ఉన్నప్పటికీ దాదాపు అన్ని థియేటర్స్ హౌస్‌ఫుల్ అయ్యాయి. ఆపై నార్త్ అమెరికాలో కూడా టికెట్స్ బుకింగ్ జోరు కనిపిస్తుంది. ఈ క్రమంలో తాజాగా చిత్ర యూనిట్ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. అమెరికాలో కేవలం ప్రీమియర్స్ ద్వారానే 9 లక్షల డాలర్లు (రూ. 8.12కోట్లు) కలెక్ట్ చేసినట్లు ప్రకటించారు. 1మిలియన్ మార్క్ కూడా చేరవచ్చని తెలుస్తోంది. దీంతో చిరంజీవి కెరీర్లో మరో అతిపెద్ద ఓవర్సీస్ ఓపెనింగ్గా ఈ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది.‘మన శంకర వరప్రసాద్ గారు’ అమెరికా ప్రీమియర్స్‌లో సత్తా చాటుతున్నాడు. ప్రీమియర్స్ కలెక్షన్స్ పరంగా చిరు కెరీర్లో రెండో చిత్రంగా నిలిచింది. మొదటి స్ధానంలో ఖైదీ 150 మూవీ ఉంది. చిరు రీఎంట్రీ మూవీ కావడంతో కేవలం ప్రీమియర్స్ ద్వారా 1.25 మిలియన్ డాలర్స్ వచ్చాయి. ఆ తర్వాత అంతటి రేంజ్ ఓపెనింగ్స్ కలెక్షన్స్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీకి దక్కింది. అయితే, చిరు హిట్ సినిమా వాల్తేరు వీరయ్య కూడా 6 లక్షల డాలర్ల వద్దే ఆగిపోయింది. సంక్రాంతి పండుగ కాబట్టి చిరు సినిమాకు పాజిటీవ్ టాక్ వస్తే తన కెరీర్లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ నిలిచే ఛాన్స్ ఉంది. View this post on Instagram A post shared by Shine Screens (@shinescreenscinema) -
ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా.. బాధగా ఉంది : విజయ్ దేవరకొండ
టాలీవుడ్లో ఫేక్ రివ్యూలు, నెగెటివ్ రేటింగ్స్ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా నిర్మాతలు ఈ సమస్యపై కోర్టును ఆశ్రయించారు. బుక్ మై షో (BookMyShow) వంటి ఆన్లైన్ టికెటింగ్ పోర్టల్లలో రేటింగ్స్, రివ్యూలు ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కోర్టు ఆదేశాల మేరకు బుక్ మై షో ఈ సినిమాకు రేటింగ్స్ , రివ్యూలను తాత్కాలికంగా నిలిపివేసింది. దీనిపై స్టార్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ విషయం తనకు సంతోషాన్నిచ్చినప్పటికీ, కొంత బాధను కూడా కలిగిస్తోందని ట్వీట్ చేశారడు.‘ఫేక్ రేటింగ్స్, రివ్యూలకు చెక్ పెట్టడం సంతోషకరం. ఇది చాలా మంది కష్టం, కలలు, డబ్బును కాపాడుతుంది. అదే సమయంలో బాధ కలిగిస్తోంది ఎందుకంటే... మన సొంత మనుషులే ఇలాంటి సమస్యలు సృష్టిస్తున్నారు. ‘మనం బతుకుతూ ఇంకొకరికి బతికించాలి’ అనే సూత్రం ఏమైంది? అందరూ కలిసి ఎదగాలనే భావన ఎక్కడికి వెళ్లింది?(చదవండి: మొన్న అల్లు అర్జున్, ఇప్పుడు ప్రభాస్‌పై కక్ష.. హరీశ్‌రావు సంచలన కామెంట్)'డియర్ కామ్రేడ్' సినిమా నుంచే నాకు ఇలాంటి దాడులు ఎదురయ్యాయి. అలా చెబితే ఎవరూ పట్టించుకోలేదు .ఒక మంచి సినిమాను ఎవరూ ఆపలేరని నాకే తిరిగి చెప్పారు. కానీ నాతో సినిమా తీసిన దర్శకులకు, నిర్మాతలకు ఈ సమస్య యొక్క తీవ్రత తర్వాత అర్థమయింది.ఇలాంటి పనులు చేసేది ఎలాంటి మనుషులు అని ఆలోచిస్తూ, నా కలలను , నా లాగే నా తర్వాత వచ్చే చాలా మంది కలలను కాపాడుకోవడానికి వారితో ఎలా వ్యవహరించాలో అని ఆలోచిస్తూ అనేక రాత్రులు నిద్రలేకుండా గడిపాను. ఇన్నాళ్లకు ఈ విషయం బహిరంగంగా వచ్చినందుకు సంతోషిస్తున్నాను. (చదవండి: చిరు-అనిల్ రావిపూడి.. ఈసారి హిట్ కొడతారా?)మెగాస్టార్ లాంటి పెద్ద హీరో సినిమాకు కూడా ముప్పు ఉందని కోర్టు గుర్తించినందుకు ఆనందంగా ఉంది. ఈ ఆదేశాలతో సమస్యను పూర్తి పరిష్కారం లభించదు కానీ, ఆందోళన చెందాల్సిన విషయాల్లో ఒకటి తగ్గుతుంది. ఇదంతా పక్కనపెట్టి ఇప్పుడైతే మనం ‘మన శంకరవరప్రసాద్’(Mana Shankara Varaprasad Garu) తో పాటు సంక్రాంతికి వస్తున్న అన్ని సినిమాలు విజయవంతంగా అలరించాలని కోరుకుందాం’ అని విజయ్ ట్వీట్ చేశాడు. Happy and Sad to see this - Happy to know hardwork, dreams and money of many is protected in a way. And Sad because of the reality of our own people causing these problems. What happened to live and let live? and growing together?Since the Days of Dear Comrade i first began… pic.twitter.com/gF55B8nXqt— Vijay Deverakonda (@TheDeverakonda) January 11, 2026 -
తొలిసారి నయన్ ఇలా.. చిరంజీవి ఏమో.. 'మన శంకర వరప్రసాద్ గారు' విశేషాలు
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా విడుదలకు సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో అంటే ఆదివారం సాయంత్రం ప్రీమియర్లతో షోలు పడనున్నాయి. వరస హిట్స్ కొడుతున్న దర్శకుడు అనిల్ రావిపూడితో చిరు చేసిన మూవీ కావడం పాజిటివ్‌గా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఈ చిత్రంపై మిశ్రమ స్పందన ఉన్నప్పటికీ కొన్ని విషయాలు మాత్రం ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. ఇంతకీ అవేంటి?2017లో చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత నుంచి పలు కమర్షియల్, పీరియాడిక్ మూవీస్ చేశారు. కానీ పూర్తిస్థాయిలో ఫ్యామిలీ సబ్జెక్ట్‌తో చేసిన సినిమా ఇదే. దానికి తోడు సంక్రాంతికి మూవీ రిలీజ్ చేస్తుండటంతో మెగా ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు.పదేళ్ల క్రితం 'పటాస్'తో దర్శకుడిగా మారిన అనిల్ రావిపూడి.. దాదాపు ప్రతి మూవీతోనూ హిట్ అందుకుంటున్నాడు. 'ఎఫ్3' చిత్రం మాత్రమే ఓకే ఓకే అనిపించుకుంది గానీ మిగిలనవన్నీ కూడా హిట్స్‌గా నిలిచాయి. గతేడాది రిలీజైన 'సంక్రాంతికి వస్తున్నాం' అయితే కేవలం తెలుగులోనూ విడుదలైనప్పటికీ రూ.250 కోట్లకు పైనే వసూళ్లు సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అలా ఈ డైరెక్టర్ ట్రాక్ రికార్డు.. 'మన శంకర వరప్రసాద్' కలిసొచ్చేలానే కనిపిస్తోంది.నయనతార.. హీరోయిన్గా సినిమాలు చేయడం తప్పితే ప్రమోషన్లకు హాజరైంది లేదు. అలాంటిది ఈ చిత్రం కోసం ప్రారంభంలో ఓ ప్రమోషనల్ వీడియోలో కనిపించింది. రీసెంట్గా మరో వీడియో కూడా చేసింది. విదేశాల్లో ఉండటం వల్ల ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరు కాలేపోయింది. ఒకవేళ వచ్చుంటే మాత్రం రికార్డ్ అయిపోయేది.రీసెంట్ టైంలో చిరంజీవి ప్రతి సినిమాలో ఎవరో ఒక హీరో కీలక పాత్ర చేస్తున్నారు. ఈ మూవీలో వెంకటేశ్ అలాంటి రోల్లో కనిపించనున్నారు. వెంకీ పాత్ర దాదాపు 20 నిమిషాల పాటు ఉండనుంది. 'ఏంటి బాసూ సంగతి..' అనే పాటలో చిరు-వెంకీ కలిసి డ్యాన్స్ కూడా చేయనున్నారు. ఇప్పటికే ఆ సాంగ్ రిలీజ్ చేశారు.ఈ సినిమా రెమ్యునరేషన్స్ విషయానికొస్తే.. చిరంజీవి రూ.70-75 కోట్ల వరకు తీసుకున్నారట. ఈయన కెరీర్లో ఇదే అత్యధికమని టాక్. వెంకటేశ్‌కి రూ.10-15 కోట్లు, నయనతారకు రూ.9 కోట్లు, దర్శకుడు అనిల్ రావిపూడికి రూ.20-25 కోట్ల పారితోషికం ఇచ్చారని సమాచారం.టికెట్ బుకింగ్ సైట్ బుక్ మై షోలో ఇన్నాళ్లు ఏ సినిమా రిలీజైనా సరే రివ్యూలు, రేటింగ్స్ లాంటివి ఉండేది. ఈ మూవీ కోసం అలాంటివే లేకుండా చిత్రబృందం ఏకంగా కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకుంది. తెలుగు వరకు అయితే ఇలా చేసిన తొలి చిత్రమిదే!రీఎంట్రీలో చిరంజీవి పలు సినిమాలు చేసినప్పటికీ.. ఇందులో తన వింటేజ్ చిత్రాలని గుర్తుచేసేలా కొన్ని సీన్స్ ఉన్నాయి. అలానే మూవీలో ఓ సన్నివేశంలో చిరు పాటలకు వెంకీ, వెంకటేశ్ పాటలకు చిరు డ్యాన్స్ చేస్తారని రూమర్ అయితే ఉంది. ఇందులో నిజమెంత అనేది మరికొన్ని గంటల్లో తెలిసిపోతుంది.ఇలా పలు విశేషాలతో థియేటర్లలోకి వస్తున్న 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ హిట్ అవ్వడం చిరంజీవికి చాలా కీలకం. ఎందుకంటే తర్వాత రాబోయే 'విశ్వంభర'కు కాస్తోకూస్తో బజ్ రావాలంటే ఇది సక్సెస్ కావాల్సిందే. మరి ఈసారి చిరు-అనిల్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి. -
పొగిడినా.. విమర్శించినా నవ్వుతా : అనిల్ రావిపూడి
‘‘ప్రతి సంక్రాంతికీ నా సినిమా ఉండాలని నేను కోరుకోవడం లేదు. ఈ బ్రాండ్ నాకు వద్దు. కుదిరినప్పుడల్లా సంక్రాంతికి వచ్చి కుర్రాడు ఏదో నవ్విస్తున్నాడు అనే ఫీలింగ్ ఉంటే చాలు’’ అని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూ΄÷ందిన తాజా సినిమా ‘మన శంకర వరప్రసాద్‌గారు’. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటించగా, వెంకటేశ్ కీలక పాత్రలో నటించారు. అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రం రేపు(సోమవారం) రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో అనిల్ రావిపూడి పంచుకున్న విశేషాలు...→ ఈ సినిమా అంతా చిరంజీవిగారు చేసిన శంకరవరప్రసాద్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే సాగుతుంది. ఈ తరహా సినిమా చేయడం నాకు కూడా కొత్తే. ఈ చిత్రంలో ఫన్ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోషనల్ రైడ్ కూడా ఉంది. భార్యా భర్తల మధ్య ఓ ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారనే విషయాన్ని ఈ సినిమాలో చూపించాను. చిరంజీవిగారు సెల్ఫ్ సెటైర్స్ వేసుకున్నారు. అది ఆయన గొప్పదనం. ఇది ఆడియన్స్‌ను అలరించడానికి మాత్రమే. → కర్ణాటకకు చెందిన మైనింగ్ బిజినెస్‌మేన్ వెంకీ గౌడ అనే పాత్రలో వెంకటేశ్‌గారు నటించారు. చిరంజీవి, వెంకటేశ్‌గార్ల కాంబినేషన్ సీన్స్ 20 నిమిషాలు ఉంటాయి. వారితో షూటింగ్ చేసిన సమయం నా లైఫ్‌లో మెమొరబుల్ మూమెంట్. మా సినిమా టికెట్ ధరలు ఫ్యామిలీ ఆడియన్స్ చూసేలా ఉండాలని, చిరంజీవిగారు స్ట్రిక్ట్‌గా చెప్పారు. దీంతో మేం నార్మల్ హైక్స్ కోసమే రిక్వెస్ట్ పెట్టుకున్నాం. → ఈ సినిమాలోని హుక్‌స్టెప్ సాంగ్ బాగా వైరల్ అవుతోంది. అయితే ఈ పాటకు బదులు మేం ముందుగా మరో మెలోడీ ట్యూన్ అనుకున్నాం. కానీ, ఆ తర్వాత వద్దనుకుని లాస్ట్ షెడ్యూల్లో ఈ ‘హుక్ స్టెప్’ సాంగ్‌ను షూట్ చేశాం. ఫైనల్‌గా ఇలా మెగా మ్యాజిక్ జరిగింది. భీమ్స్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. → నా సినిమాల ప్రొడక్షన్స్ , బడ్జెట్ విషయాల్లో నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. అయితే నా లైఫ్‌లో నేను ప్రొడక్షన్స్ , డిస్ట్రిబ్యూషన్ చేయను. ఇక సోషల్ మీడియాలో నాపై కొన్ని విమర్శలు వస్తుంటాయి. పొగడ్తలను స్వీకరిస్తున్నప్పుడు, విమర్శలను కూడా తీసుకోవాలి. అందుకే నేను దేనికీ A. నన్ను విమర్శించినా నవ్వుతా.. పొగిడినా నవ్వుతా. చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణగార్లతో సినిమాలు చేశాను. నాగార్జునగారితో కూడా సినిమా చేయాలని ఉంది. అవకాశం కోసం చూస్తున్నాను. నా కొత్త సినిమా ఇంకా ఖరారు కాలేదు. -
'మన శంకర వరప్రసాద్' యూనివర్స్‌పై అనిల్ రావిపూడి క్లారిటీ
తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకులు తమకంటూ ప్రత్యేకమైన సినిమాటిక్ యూనివర్స్‌లు సృష్టించుకోవడం కొత్తేమీ కాదు. ఒక సినిమాలో పాత హిట్ సినిమాల రిఫరెన్సులు, క్యారెక్టర్లు వాడుతూ ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వడం ఇప్పుడు ట్రెండ్‌గా మారిన విషయం తెలిసిందే. అలాంటి మరో యూనివర్స్ క్రియేట్ చేసే అవకాశం గురించి దర్శకుడు అనిల్ రావిపూడి తాజాగా స్పందించారు. చిరంజీవి, వెంకటేశ్ లాంటి ఇద్దరు స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్‌లో పెట్టి సినిమా తీసిన ఆయన, ఈ కాంబినేషన్‌తో యూనివర్స్ సృష్టించే ఆలోచన ఉందా అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేశ్ పోలీస్ పాత్రలో కనిపించారు. కానీ చిరంజీవి సినిమాలో మాత్రం ఆయనను మైనింగ్ డాన్ వెంకీ గౌడగా చూపిస్తున్నట్టు అనిల్ రావిపూడి స్పష్టం చేశారు. అంటే ఈ రెండు సినిమాలు ఒకే యూనివర్స్‌లో లేవని ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే భవిష్యత్తులో వెంకటేశ్‌తో మరో సినిమా చేసే అవకాశం వస్తే మాత్రం అందులో తప్పకుండా చిరంజీవి క్యామియో పెట్టే ప్రయత్నం చేస్తాను. అప్పుడు తనకంటూ ప్రత్యేకమైన వరప్రసాద్ యూనివర్స్‌ను సృష్టిస్తానని ఆయన చెప్పారు. అంటే రాబోయే రోజుల్లో వెంకీ హీరోగా నటించే సినిమాలో చిరంజీవి శంకర వరప్రసాద్‌గా కనిపించే అవకాశం ఉందన్నమాట. ఈ ఆలోచన నిజంగా ప్రేక్షకులకు పెద్ద కిక్ ఇచ్చేలా ఉంది. అభిమానులు కూడా ఆ రోజు త్వరగా రావాలని కోరుకోవడంలో ఆశ్చర్యం లేదు. -
'చిరంజీవి' సినిమాకు రివ్యూలు, రేటింగ్స్ బంద్.. కోర్టు ఆర్డర్
సినిమాలకు ఫేక్ రివ్యూలు ఇవ్వడం వల్ల తాము నష్టపోతున్నట్లు నిర్మాతలు తరచూ అంటుంటారు. ముఖ్యంగా పెద్ద సినిమాలో ఒకే సమయంలో విడుదలైనప్పుడు వారి అభిమానులు ఇలాంటి ఫేక్ రివ్యూలతో రంగంలోకి దిగుతారు. దీంతో సినిమా పరిశ్రమ దెబ్బతింటుందని విశ్లేషకులు అంటున్నారు. అయితే, ఇప్పుడు అలాంటి ఫేక్ రివ్యూలకు కోర్టు ఆర్డర్‌తో చెక్ పడింది. ఈ ట్రెండ్ 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంతోనే ప్రారంభం అవుతుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది.మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాకు సంబంధించి ఆన్లైన్ టికెటింగ్ పోర్టల్లలో రేటింగ్‌లు , రివ్యూలను నిలిపివేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు 'బుక్ మై షో' తమ పోర్టల్‌లో పేర్కొంది. సినిమా చూసిన ప్రేక్షకులతో పాటు కొందరు బాట్లను ఉపయోగించి నకిలీ రేటింగ్‌లు ఇస్తున్నట్లు గుర్తించారు. దీనిని కట్టడి చేసేందుకు 'BlockBIGG' & 'Aiplex' సంస్థలు రంగంలోకి దిగాయి. ఇక నుంచి బాట్స్ ఉపయోగించి ఆన్లైన్ పోర్టల్‌లో ఎవరూ ఫేక్ రివ్యూలు ఇవ్వడం కుదరదు. అలా ఎవరైన ప్రయత్నం చేసినా నేరం అవుతుందని పేర్కొంది.తెలుగు సినీ పరిశ్రమలో ఇది సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. సినిమాలపై కుట్రపూరితంగా జరిగే నెగెటివ్ రేటింగ్స్, ఫేక్ రివ్యూలకు ఇక నుంచి చెక్ పడనుంది. కోర్టు ఆదేశాల ప్రకారం 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీకి ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో రివ్యూలు, రేటింగ్స్ చట్టబద్ధంగా నిలిపివేయబడ్డాయి. -
చిరంజీవి సినిమాకు బెనిఫిట్స్.. ప్రభాస్‌కు నో.. కారణం ఇదేనా?
సంక్రాంతి పండగ సందర్భంగా 'మన శంకర వరప్రసాద్‌గారు, ది రాజా సాబ్' చిత్రాలు రేసులో ఉన్నాయి. అయితే, ప్రభాస్ రాజాసాబ్ సినిమాకు ప్రీమియర్స్‌కు తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు. ప్రీమియర్స్ లేకుండానే సినిమా విడుదల చేయాల్సి వచ్చింది. దీంతో సినిమా కలెక్షన్స్‌పై భారీ దెబ్బ పడింది. బయ్యర్లకు చుక్కలు కనిపించాయి. అయితే, కొన్ని గంటల్లోనే చిరంజీవి సినిమాకు ప్రీమియర్స్ షోలతో పాటు టికెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం నుంచి జీఓ విడుదల చేశారు. ఈ అంశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. ప్రభాస్ సినిమాకు అనుమతి ఎందుకు ఇవ్వలేదంటూ గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆయన వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.నాకు సంబంధం లేదు: మంత్రితాను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం బంద్ చేశానని చెప్పారు. పుష్ప-2 సినిమా ఘటన తర్వాత ప్రీమియం షోలకు అనుమతి ఇవ్వడం లేదని చెప్పారు. అయితే, రాజాసాబ్, చిరంజీవి సినిమా టికెట్ల రేట్లు, ప్రీమియం షో అనుమతికి సంబంధించిన ఫైల్ తన దగ్గరకి రాలేదని పేర్కొన్నారు. నాకు తెలియకుండానే జీవోలు ఇచ్చారని సంచలన కామెంట్ చేశారు. ఇందులో తనకు ఎలాంటి సంబంధం లేదని అవసరం లేని నిందలు తనపై వేయకండి అంటూ ఆవేదన చెందారు. కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఒకవేళ వెంకట్ రెడ్డి ఉండొద్దు అంటే ఇంత విషం ఇచ్చి చంపండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.మన శంకరవరప్రసాద్ గారు విడుదలకు 2 రోజుల ముందే తెలంగాణ నుంచి ప్రత్యేక జీవో వచ్చేసింది. 11వ తేదీ రాత్రి 8 గంటల నుంచి ప్రీమియర్స్ వేసుకునేందుకు తెలంగాణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టికెట్ ధర రూ. 600 రూపాయలుగా నిర్ణయించింది. ఆపై నైజాంలో ఎన్ని ప్రీమియర్స్ షోలు కావాలంటే అన్ని వేసుకోవచ్చు ఇలా సానుకూలంగా అవకాశం కల్పించింది. అయితే,రాజాసాబ్ సినిమా ప్రీమియర్స్‌కు రాత్రి 10.30 దాటినా ప్రత్యేక జీవో రాలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు.ప్రభాస్ ఫోన్ కాల్ చేయకపోవడంతో..ప్రభాస్, చిరంజీవి సినిమాలకు సంబంధించి తెలంగాణ ప్రభత్వం వ్యవహరించిన తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. దీంతో అనేక అంశాలు తెరపైకి వస్తున్నాయి.టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ GO జారీ వెనుకున్న కీలక అధికారి రాజా సాబ్ గురించి కలత చెందాడట. ప్రభాస్ తనను నేరుగా సంప్రదించకపోవడంతో ఆయన బాధపడ్డారని తెలుస్తోంది. అయితే, ప్రభాస్ మొదటి నుంచి రాజకీయ విషయాలకు దూరంగా ఉంటారని తెలిసిందే.., కానీ ఆ అధికారి అతని నుండి నేరుగా కాల్ వస్తుందని ఆశించారని.. దీని కారణంగానే జీఓ విషయంలో ఆలస్యం అయిందని ఒక వర్గం ప్రచారం చేస్తుంది.రాజా సాబ్ నష్టం వెనుక నిర్మాత దిల్ రాజు ఉండవచ్చని కూడా కొందరు పేర్కొంటున్నారు. అతని వ్యాపార ప్రత్యర్థి నైజాం ఏరియాలో రాజా సాబ్ సినిమా పంపిణీదారుడిగా ఉన్నారట. అతన్ని ఆర్థికంగా దెబ్బతీసేందుకు, అతను ప్రభుత్వంలోని తనకు తెలిసిన సన్నిహితులతో గేమ్ ప్లాన్ చేశారని మరికొందరు ఆరోపించారు.ఈ విషయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కూడా విమర్శలు ఉన్నాయి. పలు రాజకీయ కారణాలతో జీఓను విడుదలను ఆలస్యం చేస్తూ వచ్చారని, పదేపదే మరో ఐదు నిమిషాలు అంటూ కాలక్షేపం చేశారని అంటున్నారు. అయితే, రాత్రి 10 తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్స్ వద్ద రచ్చ చేయడంతో వారిని కంట్రోల్ చేయడంలో పోలీసులకు సవాలుగా మారింది. దీంతో చివరి నిమిషంలో జీఓ విడుదల చేశారని వార్తలు వచ్చాయి. ఇందులో ఏది నిజమో, అబద్ధమో తేలాల్సి ఉంది.చిరంజీవి సినిమాకు బెనిఫిట్స్.. కారణం ఇదేనా..?టాలీవుడ్‌కు చెందిన ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు విడుదలౌతుందటే.. వారిని వేర్వేరుగా చూడటం ఏంటి అంటూ ఇతర హీరోల అభిమానులు కూడా మండి పడుతున్నారు. అయితే, మన శంకర వర ప్రసాద్‌గారికి బెనిఫిట్స్ దొరకడం వెనుక నిర్మాత సాహు గారపాటి పాత్ర చాలా కీలకంగా పనిచేసిందని అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబంతో ఆయనకు స్నేహం ఉందట. చాలా కాలంగా ఇరు కుటుంబాలు స్నేహంగా ఉండటం వల్లనే సకాలంలో జీఓను ఆయన తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఇలా పలు రకాలుగా రాజా సాబ్ అంశంలో వైరల్ అవుతుంది.మంత్రికి చెప్పకుండా జీఓ ఎవరిచ్చారు..?రాజా సాబ్, చిరంజీవి సినిమాలకు సంబంధించి టికెట్ ధరల పెంపు విషయంలో జీఓ ఎవరిచ్చారో తనకు తెలియదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సినిమాటోగ్రఫీ మినిస్టర్‌గా ఆయన ఇవ్వాల్సిన అనుమతులు ఎవరిచ్చారనేది రాజకీయ వర్గల్లో చర్చ నడుస్తోంది. అయితే, ఈ అంశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాత్ర ఉందని అంటున్నారు. ఆయన సన్నిహితుడు రోహిన్ రెడ్డి అనఫీషియల్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉన్నారంటూ ప్రచారం ఉంది. ఆయన నేతృత్వంలో ఇదంతా జరిగిందని సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి. అందుకే తాజాగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. -
నయనతారపై ట్రోలింగ్.. స్పందించిన అనిల్ రావిపూడి
అనిల్ రావిపూడి వర్కింగ్ స్టైల్ గురించి అందరికి తెలిసిందే. సినిమాను తెరకెక్కించడమే కాదు..ఆ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేలా ప్రమోషన్స్ చేస్తాడు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా విజయంలో అనిల్ ప్రమోషన్స్ కూడా పాత్ర కూడా బాగానే ఉంది. స్టార్ హీరో వెంకటేశ్‌తో ఇన్‌స్టా రీల్స్ కూడా చేయించి.. సినిమాను అందరికి రీచ్ అయ్యేలా చేశాడు. ఇప్పుడు అదే స్ట్రాటజీని ‘మనశంకరవరప్రసాద్ గారు’ చిత్రానికి కూడా అప్లై చేశాడు. సినిమా అనౌన్స్ మెంట్ నుంచే ప్రమోషన్స్ చేయడం మొదలు పెట్టాడు. షూటింగ్ మొదలైన రోజే.. మెగాస్టార్ చిరంజీవిపై ఓ స్పెషల్ వీడియో వదిలాడు. ఒకపక్క షూటింగ్ చేస్తూనే..మరోపక్క ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. చివరకు నయనతారతో కూడా సినిమా ప్రమోషన్స్ చేయించిన ఘనత అనిల్‌కే దక్కింది.సాధారణంగా నయనతార మూవీ ప్రమోషన్స్‌కి చాలా దూరంగా ఉంటారు.తనతో సినిమాలు తీసే దర్శక నిర్మాతలతో ముందుగానే ప్రమోషన్స్‌కి రానని అగ్రిమెంట్ చేసుకుంటారు. దానికి ఒప్పుకుంటేనే సినిమాకు నయన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ఎంత పెద్ద స్టార్ సినిమాలో నటించినా, దిగ్గజ దర్శకులు డైరెక్ట్ చేసినా ఆమె మాత్రం ప్రమోషన్స్‌కి వెళ్లరు.అయితే మనశంకరవరప్రసాద్ గారు సినిమాకు వచ్చేసరికి ఆమె తీరే మారిపోయింది. చాలా హుషారుగా ప్రమోషన్స్ చేసున్నారు. ఆమెతో చేయించిన స్పెషల్ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అదే సమయంలో నయనతారపై కొంతమేర ట్రోలింగ్ కూడా నడిచింది. ముఖ్యంగా తమిళ ప్రేక్షకులు ఆమె తీరును తప్పుబట్టారు. కోలీవుడ్‌లో ఎంత పెద్ద స్టార్ హీరోలతో నటించినా, చివరికి తను స్వయంగా నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా ప్రమోషన్స్‌కు రాని నయనతార... తెలుగు సినిమాల కోసం ఇలా ముందుకు రావడం ఏంటీ? అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. తెలుగు సినిమా మీకు అంత ఎక్కువైపోయిందా? అంటూ ఆమెపై విమర్శలు చేశారు.తాజాగా ఈ ట్రోలింగ్‌పై ‘మనశంకర్ వరప్రాసద్ గారు’ మూవీ దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించారు. ఇలాంటి ట్రోలింగ్‌ని ఆమె పట్టించుకోదని.. తనకు నచ్చిన పని చేస్తుందని చెప్పారు. ‘ఒక్కో సినిమాకు ఒక్కో వైబ్ ఉంటుంది. ప్రతి మూవీకి దర్శకుడు వెళ్లి హీరో, హీరోయిన్లకు కథ చెబుతాడు. అయితే వాళ్లను ఎలా ట్రీట్ చేస్తున్నామనేది ముఖ్యం. మన ప్రవర్తనను బట్టి.. వాళ్లు కూడా మారుతుంటారు. నేను అందరితో కలిసిపోతుంటాను. ప్రతి ఆర్టిస్ట్‌ని కంఫర్టబుల్‌గా ఉండేలా చూసుకుంటాను. చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా వచ్చి నా భుజంపై చేయి వేసి మాట్లాడతారు. అంతలా వాళ్లతో కలిసిపోతాను. మనం జన్యూన్‌గా అడిగినప్పుడు.. మనకున్న బాండ్‌ని బట్టి చేయను అనే వాళ్లు కూడా ప్రమోషన్స్ చేస్తారు. నయనతార చాలా నిజాయితీగా పని చేస్తారు. తను నటించే సినిమాలకు 100 శాతం న్యాయం చేస్తారు. ‘సినిమాకు ఇది అవసరం..దర్శకుడు పని తీరు ఇలా ఉంటుంది’ అని అమె బలంగా నమ్మినప్పుడు కచ్చితంగా ప్రమోషన్స్ చేస్తారు’ అని అనిల్ చెప్పుకొచ్చారు.‘మన శంకరవరప్రసాద్ గారు’ విషయానికొస్తే.. చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో వెంకటేశ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. A Sweet New year Surprise to all of you from team #ManaShankaraVaraPrasadGaruGRAND RELEASE WORLDWIDE IN THEATERS ON 12th JANUARY.#MSGonJan12th pic.twitter.com/gT1uHFTwmX— Nayanthara✨ (@NayantharaU) January 1, 2026 -
మాట నిలబెట్టుకున్న మెగాస్టార్.. వరుణవి కోసం..
చిన్నారి వరుణవి గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. సరిగమప లిటిల్ ఛాంప్స్ అనే సింగింగ్ రియాలిటీ షోలో ఈ చిన్నారి పాల్గొంది. పాపకు కళ్లు లేనప్పటికీ.. కమ్మనైన మాటలు, పాటలతో అందరినీ ఫిదా చేస్తుంటుంది. అందుకే తనను అందరూ ఎంతో స్పెషల్‌గా ట్రీట్ చేస్తుంటారు. ఎలిమినేషన్ అనేది లేకుండా గ్రాండ్ ఫినాలే వరకు వరుణవిని తీసుకొచ్చారు.మాటిచ్చిన మెగాస్టార్ఈ షోకి సుధీర్ యాంకర్‌గా వ్యవహరిస్తుండగా దర్శకుడు అనిల్ రావిపూడి, పాటల రచయిత అనంత్ శ్రీరామ్, సింగర్ శైలజ జడ్జిలుగా ఉన్నారు. ఇటీవలే అనిల్ రావిపూడి.. వరుణవి కోరిక మేరకు ఆమెను చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లాడు. ఆ సమయంలో చిన్నారి గాత్రానికి, మాటలకు తెగ మురిసిపోయాడు మెగాస్టార్. తనకు ఎటువంటి సహాయం చేయడానికైనా రెడీ అని మాటిచ్చాడు.మాట నిలబెట్టుకున్న చిరంజీవిఇప్పుడా మాటను నిలబెట్టుకున్నాడు. సరిగమప లిటిల్ ఛాంప్స్ గ్రాండ్ ఫినాలేకు చిరంజీవి కూతురు, నిర్మాత సుస్మిత హాజరైంది. మెగాస్టార్ పంపించిన రూ.5 లక్షల చెక్కును వరుణవి కుటుంబానికి అందించింది. ఈ డబ్బును వరుణవి పేరుపై ఫిక్స్డ్ డిపాజిట్ చేయబోతున్నట్లు తెలిపింది.చదవండి: నాచే నాచే కాపీనా? రాజాసాబ్‌కు ఏకంగా చెప్పు చూపించాడా? -
తెలంగాణలోనూ చిరంజీవి సినిమా టికెట్ ధరల పెంపు
ప్రభాస్ 'రాజాసాబ్' చిత్రానికి తెలంగాణలో టికెట్ ధరలు పెంచినందుకే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు'కి పెంపు ఉంటుందా లేదా అని అందరూ మాట్లాడుకున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి జీవో వచ్చింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. 11వ తేదీన వేసే ప్రీమియర్ల ఒక్కో టికెట్ రూ.600గా నిర్ణయించారు.(ఇదీ చదవండి: 'రాజాసాబ్' తొలిరోజు కలెక్షన్ అన్ని కోట్లా?)అలానే 12వ తేదీ నుంచి ఏడు రోజుల పాటు ఒక్కో టికెట్‌పై సింగిల్ స్క్రీన్లలో రూ.50, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 'రాజాసాబ్'లానే దీనిపై కూడా ఎవరైనా న్యాయవాది పిటిషన్ వేసే అవకాశముంది. కాకపోతే ఈ రెండు రోజుల కోర్టు సెలవులు కాబట్టి సోమవారం నాడు ఇలాంటిది ఏమైనా ఉండే అవకాశముంది.'మన శంకరవరప్రసాద్ గారు' సినిమాలో చిరంజీవి, నయనతార జంటగా నటించారు. వెంకటేశ్ కీలక పాత్ర పోషించారు. భీమ్స్ సంగీతమందించగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా దీన్ని తెరకెక్కించారు.(ఇదీ చదవండి: ఒక్కో డైరెక్టర్ ఒక్కోలా షాకిచ్చారు.. లేటెస్ట్గా 'రాజాసాబ్')ఏపీలో జారీ చేసిన జీవో విషయానికొస్తే ముందు రోజు వేసే స్పెషల్ ప్రీమియర్ టికెట్ ధరని జీఎస్టీతో కలిపి రూ.500గా నిర్ణయించారు. జనవరి 11న రాత్రి 8గంటల నుంచి 10లోపు ఈ షోలు ఉంటాయి.ఆపై తొలి పదిరోజులపాటు టికెట్ ధరలను పెంచుకోవచ్చని ప్రభుత్వం అనుమతి వచ్చింది. సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరపై రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.125 జీఎస్టీతో కలిపి పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. విడుదల మొదటిరోజు రాష్ట్రవ్యాప్తంగా 5 షోలు ప్రదర్శించవచ్చని జీఓలో పేర్కొంది. -
మెగా ఫ్యాన్స్ కు పిచ్చెక్కిస్తున్న హుక్ స్టెప్ సాంగ్
-
'చిరంజీవి' సినిమా.. టికెట్ ధరల పెంపునకు అనుమతి
మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్ నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రానికి టికెట్ ధరలు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ మూవీ విడుదల కానుంది. ముందు రోజు వేసే స్పెషల్ ప్రీమియర్ టికెట్ ధరను జీఎస్టీతో కలిపి రూ.500గా నిర్ణయించారు. జనవరి 11న రాత్రి 8గంటల నుంచి 10లోపు ఈ షోలు ఉంటాయని తెలిపింది.ఆపై తొలి పదిరోజులపాటు టికెట్ ధరలను పెంచుకోవచ్చని ప్రభుత్వం అనుమతి వచ్చింది. సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరపై రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.125 జీఎస్టీతో కలిపి పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. విడుదల మొదటిరోజు రాష్ట్రవ్యాప్తంగా 5 షోలు ప్రదర్శించవచ్చని జీఓలో పేర్కొంది.మనశంకర్ వరప్రసాద్ విషయానికొస్తే.. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తోంది. విక్టరీ వెంకటేశ్ కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. దీంతో మూవీపై బజ్ క్రియేట్ అయింది. -
చిరు వెంకీ జస్ట్ టీజర్ మాత్రమే..! ముందుంది రచ్చ రంబోలా
-
చిరంజీవి హుక్ స్టెప్, బాలీవుడ్‌లోనూ టాప్!
ఇప్పుడు తెలుగు ప్రేక్షక సమూహం హుషారుగా హుక్ స్టెప్పులేస్తోంది. మెగా నృత్యాల హోరును అనుసరిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్‌గారు గా తమని పలకరించేందుకు హుక్ స్టెప్పులు వేసుకుంటూ వస్తుండడంతో తెలుగు నాట హుక్ స్టెప్ టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. మరి ఇంతకీ ఈ హుక్ స్టెప్ ఏమిటి? దీనికి మన దేశంలో పాప్యులారిటీ ఎలా పెరిగింది?‘హుక్ స్టెప్ గురించి సంక్షిప్తంగా చెప్పాలంటే ఓ నృత్యం.. సులభంగా కనిపించాలి. అందరూ నేర్చుకునేలా ప్రేరేపించాలి ‘ అని బాలీవుడ్లో తౌబా తౌబా అనే పాటకు నృత్యంతో వైరల్ అయి సంచలనం సృష్టించిన కొరియోగ్రాఫర్ బోస్కో మార్టిస్ చెబుతున్నాడు. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ నర్తించిన బ్యాడ్ న్యూజ్లోని తౌబా తౌబా పాట స్టెప్స్ ‘ప్రతి ఒక్కరూ చేయడానికి ప్రయత్నించారని ఆయన గుర్తు చేస్తారు. ఆ పాట హిట్‌తో‘ హుక్ స్టెప్‌ను కొరియోగ్రాఫ్ చేయడం ఇప్పుడు తన నృత్య ప్రక్రియలో ఒక భాగమైందని ఆయన చెప్పాడు.పెరిగిన కొరియోగ్రాఫర్ ప్రాధాన్యత...‘హుక్ స్టెప్ కు పెరుగుతున్న ప్రజాదరణ కొరియోగ్రాఫర్లను మరింత పాప్యులర్ చేసింది. హుక్ స్టెప్ గొప్పతనం ఏమిటంటే దాని చుట్టూ అల్లుకునే సందడిలో స్టార్ మాత్రమే కాదు కొరియోగ్రాఫర్ కూడా అందరి దృష్టినీ ఆకర్షిస్తారని అది తమకు చాలా ఉపయుక్తమైన అంశమని కొరియోగ్రాఫర్లు అంటున్నారు. నృత్యం అత్యంత ప్రజాదరణ పొందాడానికి దోహదపడేది సౌలభ్యం మాత్రమే ‘ప్రతి వ్యక్తి పుట్టుకతోనే డ్యాన్సర్ కాదు. మైఖేల్ జాక్సన్ లేదా ప్రభుదేవా లాగా అందరూ నృత్యం చేయలేరు. అవి ప్రజలు చూసి బాగున్నాయంటారు. కానీ అవి సులభమైనవైతే అవి మరింత హిట్ కావడం తధ్యం ఎందుకంటే వాటిని అనుసరించడం సులభం అని వారు భావిస్తారు అలాంటివే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి‘‘ నేను పరిశ్రమలోకి ప్రవేశించినప్పుడు, ప్రభుదేవా లాంటి డ్యాన్స్‌లు అందివ్వాలని అనుకున్నా కానీ ఆ తర్వాత పరిస్థితులు భిన్నంగా మారాయని బోస్కో చెప్పాడు. ‘నువ్వు ఎందుకు అంత కష్టతరమైన పని చేయమని చెబుతున్నావు? దానికన్నా సులభమైన స్టెప్పులు ఎందుకు చేయించకూడదు‘ అని చాలా మంది తనతో అన్నారని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు.హుక్...హిస్టరీ...దీని గురించి బాలీవుడ్ మరో కొరియోగ్రాఫర్ ముదస్సర్ ఖాన్ మాట్లాడుతూ, హుక్ స్టెప్పు ప్రజాదరణ ‘సల్మాన్ ఖాన్, గోవింద మాధురీ దీక్షిత్ వంటి నటులతో ప్రారంభమైందన్నాడు. వారికి వారికంటూ స్వంత ప్రత్యేకమైన నృత్య శైలులు ఉన్నాయి‘ అని చెప్పారు. వారి నృత్యాలు పాప్యులర్ అవడానికి కారణం గుర్తించిన దగ్గర నుంచీ తాను తన కొరియోగ్రఫీ వర్క్‌లో హుక్ స్టెప్పును కూడా చేర్చుకున్నానని ఖాన్ చెప్పాడు.‘నేను సల్మాన్ ఖాన్‌కు మొదటిసారి కొరియోగ్రఫీ సీక్వెన్స్ చూపించడానికి వెళ్ళినప్పుడు, ఆయన కష్టమైన నృత్యాలను ఇష్టపడతాడని అనుకున్నాను. కానీ ఆయనకు హుక్ స్టెప్పు అన్నింటికంటే నచ్చింది.‘ అంటూ గుర్తు చేసుకున్నారాయన. ఒక సన్నివేశాన్ని కొరియోగ్రఫీ చేయడంతో పాటు వైరల్‌గా మార్చడం కూడా ఇప్పుడు తమ పనిలో ఒక ముఖ్యమైన భాగంగా మారిందని ఖాన్ అన్నారు. హుక్ స్టెప్‌ను రూపొందించడానికి ఏదైనా ఫార్ములా ఉందా అని అడిగితే.... ‘‘ తల గోకడం నుంచీ షూలేసులు కట్టుకోవడం దాకా బెల్ట్ బిగించడం నుంచి కర్టెన్లు సరిచేయడం దాకా...ప్రజలు తమ దైనందిన జీవితంలో చేసే రొటీన్ పనులనే సంగీతంతో కూడిన నృత్యంగా మార్చగలిగితే అదే హుక్ స్టెప్’’ అన్నారాయన. ‘‘సంగీతం కూడా హుక్ స్టెప్ కు థీటుగా ఆకర్షణీయంగా ఉండాలి. సంగీతం యావరేజ్‌గా ఉంటే, ఎంత మంచి హుక్ స్టెప్ వేసినా, అది ఆకర్షణీయంగా మారదు. సంగీతం కొరియోగ్రఫీతో కలిసిపోవడం వల్లనే హుక్ స్టెప్ ప్రజాదరణ పొందుతుంది అని అభిప్రాయపడ్డారు.హుక్ స్టెప్లు దశాబ్దాల క్రితమే ప్రాచుర్యం పొందినప్పటికీ, ఇప్పుడు వాటి శైలి, అవసరం చాలా మారిపోయిందని కొరియోగ్రాఫర్ పునీత్ జె పాఠక్ చెప్పారు. ‘‘గతంలో పెద్దా చిన్నా తేడా లేకుండా వేడుకలలో నృత్యం చేయగలిగే లాంటి హుక్ స్టెప్‌ను తయారు చేయండి’ అని అడిగేవారు అయితే ఇప్పుడు ఇన్ స్ట్రాగామ్‌లో, రీల్స్‌లో ఉంచే హుక్ స్టెప్‌ను తయారు చేసి దానిని వైరల్ చేయడం ముఖ్యంగా మారిందని అన్నారాయన. గతంలో ఇది ప్రేక్షకుల ఇళ్లకు చేరుకోవడం గురించిన ఆలోచన ఉండేది అయితే ఇప్పుడు వారి ఫోన్లను చేరుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది అంటూ పేర్కొన్నారు.అయితే రీల్స్ ఆధారిత హుక్ స్టెప్స్ డ్యాన్స్ సీక్వెన్స్‌ల వైరల్లో ఉన్న సమస్య వైరల్ అనేది స్వల్ప కాలానికే పరిమితం కావడం అని పాథక్ అన్నారు. ‘గతంలో ’తౌబా తౌబా’ వైరల్ అయింది. దానికి వారం క్రితం ఇంకేదో వైరలైంది. అయితే స్టెప్స్ వైరల్ అవుతున్నాయి కానీ ఐకానిక్‌గా ఉండడం లేదు‘ అని ఆయన అభిప్రాయపడ్డారు.‘హుక్ స్టెప్ సవాళ్లలో పాల్గొనడానికి ఇష్టపడతాను అవి సరదాగా ఉంటాయి, అవి నా ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడానికి నాకు సహాయపడతాయి నా డ్యాన్స్ నైపుణ్యాలను ప్రదర్శించడానికి అవకాశం ఇస్తాయి. ‘అంతేకాకుండా, అవి నాకు ట్రెండ్స్ గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ, తాజా సోషల్ మీడియా సందడిలో నన్ను భాగంగా మారుస్తాయి’’ అని కంటెంట్ క్రియేటర్ వృషికా మెహతా చెప్పింది. ఒక ఇన్ ఫ్లుయెన్సర్‌గా, తాను ఈ హుక్ స్టెప్లను ప్రదర్శించడం ద్వారా సినిమాలను ప్రమోట్ చేస్తాననీ వాటిని నా ప్రేక్షకులతో పంచుకుని వారిని కూడా పాల్గొనమని ప్రోత్సహిస్తానని ఆమె వివరించింది.ఇటీవలి కాలంలో కొన్ని హుక్ హిట్స్...ఈ మధ్య కాలంలో వైరల్ అయిన హుక్ స్టెప్స్‌లో జాదు‘ (జ్యుయల్ థీఫ్) పాటలో జైదీప్ అహ్లావత్ చేసిన నృత్యం, అలాగే ‘తౌబా తౌబా‘ (బాడ్ న్యూజ్): విక్కీ కౌశల్ మూవ్ మెంట్స్ , ‘జనాబ్–ఎ–ఆలీ‘ (వార్ 2) చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్‌తో హృతిక్ రోషన్ వేసిన స్టెప్పులు అత్యంత ప్రజాదరణ పొందాయి. అలాగే ‘పెహ్లా తు దుజా తు‘ ( సన్ ఆఫ్ సర్దార్ 2) పాటలో అజయ్ దేవగన్ స్టైల్ వైరల్ కాగా,‘ఝూమ్ షరాబీ‘ (దే దే ప్యార్ దే 2)లో కూడా అజయ్ దేవగన్ మళ్లీ గ్లాస్‌తో వైరల్ స్టెప్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు ఇదే కోవలో ‘హుక్ స్టెప్‘ (మన శంకర వరప్రసాద్ గారు): చిరంజీవి స్టెప్స్ తోడయ్యాయి. -
చిరంజీవి చేతికి ఖరీదైన వాచ్.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!
సెలబ్రిటీలు ఏ పని చేసినా అది వార్తే అవుతుంది. వారు తినే ఇండి మొదలు ధరించే దుస్తుల వరకు ప్రతీది..అభిమానులకు ఆసక్తికర అంశమే. ముఖ్యంగా సినీ నటులు ధరించే నగలు, వాచీలు, డ్రెస్సులపై తరచూ చర్చ జరుగుతూ ఉంటుంది.తాజాగా మెగాస్టార్ చిరంజీవి ధరించే వాచ్‌పై నెట్టింట చర్చ మొదలైంది. నిన్న(జనవరి 7) సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన ‘మనశంకర్ వరప్రసాద్ గారు’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కి చిరంజీవి స్టైలిష్ డ్రెస్‌లో వచ్చారు. చూసేందుకు చాలా సింపుల్‌గా ఉన్నా.. ఆయన ధరించిన డ్రెస్‌తో పాటు చేతికి పెట్టుకున్న వాచ్ కూడా బాగా ఖరీదైనవి.మెగాస్టార్ చిరంజీవికి చేతికి వాచ్ ధరంచడం చాలా ఇష్టం. ఆయన దగ్గర రకరకాల బ్రాండ్లకు సంబంధించిన వాచీలు ఉన్నాయి. ఒక్కో ఈవెంట్‌కి ఒక్కో వాచ్ ధరించి వెళ్తుంటాడు. ఇక 'మన శంకర వరప్రసాద్ గారు' ఈవెంట్‌కు ఆయన రోలెక్స్ బ్రాండ్ వాచ్ ధరించారు. రోలెక్స్లో అది రోలెక్స్ డేటోనా(Rolex Daytona) మోడల్. దాని ధర సుమారు రూ. 1.8 కోట్లు నుంచి రూ. 2.29 కోట్లు వరకు ఉంటుందట. ఇదే కాదు.. గతంలోనూ చిరు ధరించిన వాచీల ధరలన్నీ దాదాపు కోటీ రూపాయలపైనే ఉంటుంది. ఆయన దగ్గర రోలెక్స్ కంపెనీకి చెందిన కాస్మోగ్రఫీ డేటోనా వైట్ టైగర్ వాచ్ కూడా ఉంది. దాని ధర ఒక కోటీ 86 లక్షలు.వాల్తేరు వీరయ్య సినిమా ప్రీరిల్ ఈవెంట్‌కి ఈ వాచ్ ధరించారు. దీంతో పాటు ఎ లాంగే అండ్ సోహ్నే (A. Lange & Söhne)కంపెనీకి చెందిన వాచ్ కూడా చిరు దగ్గర ఉంది. చిరు వాచీల ధరలను చూసి నెటిజన్స్ షాకవుతున్నారు. -
'మన శంకర వరప్రసాద్‌గారు' ప్రీరిలీజ్‌లో చిరంజీవి ,వెంకీ సందడి (ఫొటోలు)
-
ఈ కష్టం తనకు అవసరమే లేదు.. కూతురిపై చిరు ప్రశంసలు
మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్‌చరణ్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా రాణిస్తున్నాడు. పెద్ద కూతురు సుష్మిత చిరంజీవి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా, తండ్రికి స్టైలిస్ట్‌గా పని చేస్తోంది. అలాగే గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థను స్థాపించి నిర్మాతగానూ మారింది. చిరు ప్రధాన పాత్రలో నటించిన 'మన శంకర వరప్రసాద్‌గారు' మూవీని సాహు గారపాటితో పాటు మెగాస్టార్ కూతురు సుష్మిత నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో కూతురిపై ప్రశంసలు కురిపించాడు చిరంజీవి.ఇదంతా అవసరమా?'నా బిడ్డ సుష్మిత సినీ ఇండస్ట్రీలోకి రావాలనుకున్నప్పుడు ఈ పరిశ్రమ కచ్చితంగా ఆదరిస్తుందని చెప్పాను. మీరు కష్టపడి పనిచేస్తే విజయం సాధిస్తారన్నాను. నేనయితే కష్టాలు చిన్నప్పుడే చూశాను. కానీ, నా కూతురు కష్టపడుతుంటే ఒక తండ్రిగా ఇదంతా అవసరమా? అనిపించేది. తను మాత్రం ఒక బిడ్డగా మా నాన్నను ఇంప్రెస్ చేయాలి, నిర్మాతగా హీరోకు ది బెస్ట్ ఇవ్వాలి అని మామూలు టెక్నీషియన్‌లా ప్రయత్నించింది.నన్ను ఆదర్శంగా తీసుకునితనకు అన్నిరకాలుగా కంఫర్ట్స్ ఉన్నాయి. అసలు ఈ సినిమా చేయాల్సిన అవసరమే లేదు. తన కుటుంబాన్ని చూసుకుంటే జీవితం సాఫీగా గడిచిపోతుంది. కానీ తను అలా ఆలోచించలేదు, ఏదో సాధించాలనుకుంది. నువ్వు సాధించి చూపించావ్.. ఎంతోమందికి మార్గదర్శకంగా ఉన్నావు. అలాంటి నిన్ను ఆదర్శంగా తీసుకుని మేము కూడా ఎంతో కొంత కృషి చేస్తాం అని ముందుకొచ్చింది. ఈ సినిమా ఎలాగో హిట్టవుతుంది. ఇలాంటి గర్వకారణమైన సినిమాను నాకు గిఫ్ట్ ఇచ్చినందుకు తనెంతో సంతోషపడుతుందని నాకు తెలుసు.థాంక్యూ పాపఈ పరిశ్రమలో నాకు చేదోడువాదోడుగా ఉంటూ, నాకు భుజం కాస్తూ, అన్ని రకాలుగా అండదండలందిస్తూ.. ఇంటికి పెద్దదైనందుకు పెద్దరికాన్ని సొంతం చేసుకుంటూ తోడుగా ఉన్నందుకు థాంక్యూ పాప.. అన్నాడు. ఆయన స్పీచ్ విని సుష్మిత వెంటనే తండ్రి కాళ్లకు నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకుంది. కాగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన మన శంకర వరప్రసాద్ మూవీ జనవరి 12న విడుదల కానుంది.చదవండి: హుక్ స్టెప్.. వింటేజ్ చిరంజీవి ఈజ్ బ్యాక్ -
శంకర వరప్రసాద్ ఆల్రెడీ సూపర్ హిట్: చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి శంకర వరప్రసాద్ చిత్ర ప్రీరిలీజ్ వేడుకలో పాల్గొని ప్రేక్షకులను ఉద్దేశించి ప్రత్యేకంగా మాట్లాడారు. సంక్రాంతి సందర్భంగా విడుదలవుతున్న అన్ని సినిమాలు సూపర్ హిట్ కావాలని, అందరూ సుభిక్షంగా ఉన్నప్పుడే అసలైన పండుగ అవుతుందని ఆయన ఆకాంక్షించారు. ఈ సినిమాలో తాను గతంలో చేసిన దొంగమొగుడు, ఘరానా మొగుడు, చంటబ్బాయ్ తరహా నటనను ప్రేక్షకులు చూడగలరని చిరంజీవి తెలిపారు. ఈ సినిమా ఇప్పటికే సూపర్ హిట్‌గా నిలిచిందని, బడ్జెట్, టైమ్ పరంగా సమర్థవంతంగా చిత్రీకరణ పూర్తి చేయగలిగామని చెప్పారు. వెంకటేష్‌తో కలిసి నటించడం తనకు చక్కని అనుభవమని, చివరి రోజు షూటింగ్లో తాను ఎమోషనల్ అయ్యానని వెల్లడించారు. వెంకటేష్ పాజిటివ్ మనిషి, తనకు గురువులా అనిపిస్తారని చిరంజీవి అన్నారు. మేము షూటింగ్ లా కాకుండా అల్లరి చేశాం, అదే క్యాప్చర్ చేశాడు అనీల్ అని చిరంజీవి నవ్వుతూ చెప్పారు. ఈ సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లేలా సపోర్ట్ చేసిన వెంకటేష్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దర్శకుడు అనిల్ రవిపూడి ప్రమోషన్స్‌లో నయనతారను కూడా చేర్చారు. వెంకీతో మరిన్ని సినిమాలు చేస్తాను. ఆ బాధ్యత అనీల్దే అని అన్నారు. ప్రేక్షకులు అన్ని సినిమాలను థియేటర్స్‌లోనే చూడాలి. ఇది అందరికీ గుర్తుండిపోయే పండుగ అవుతుంది. ఈ మధ్యకాలంలో నేను చాలా హుషారుగా చేసిన సినిమా ఇదే. ఈ అనుభవం తనకు చాలా ప్రత్యేకమని చిరంజీవి అన్నారు. -
'హుక్ స్టెప్' సాంగ్.. హుషారుగా చిరంజీవి డ్యాన్స్
చిరంజీవి కొత్త సినిమా 'మన శంకర వరప్రసాద్'.. జనవరి 12న థియేటర్లలోకి రానుంది. బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా మూవీలోని మరో పాటని రిలీజ్ చేశారు. 'హుక్ స్టెప్' అనే లిరిక్స్‌తో సాగే ఈ పాటలో చిరు హుషారుగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. బాబా సెహగల్ ఈ గీతాన్ని పాడారు. ఇందులో బంగారు కోడిపెట్టి, ముఠామేస్త్రి, ఖైదీ నం.150 సినిమాల్లోని స్టెప్పులని చూపించారు.(ఇదీ చదవండి: 'భోళా శంకర్' ఫ్లాప్.. సోషల్ మీడియానే కారణం)ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథతో తీశారు. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్. వెంకటేశ్ కీలక పాత్రలో నటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా భీమ్స్ సంగీతమందించారు. సాహు గారపాటి, చిరు కూతురు సుస్మిత నిర్మాతలుగా వ్యవహరించారు. 'భోళా శంకర్' లాంటి ఫ్లాప్ తర్వాత దాదాపు రెండున్నరేళ్లు గ్యాప్ తీసుకుని చిరు.. ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.(ఇదీ చదవండి: చిరంజీవి సినిమాలూ ఆగిపోయాయి.. ఇది ఎంతమందికి తెలుసు) -
చిరంజీవి సినిమాలూ ఆగిపోయాయి.. ఇది ఎంతమందికి తెలుసు
చిరంజీవిది నాలుగు దశాబ్దాల కెరీర్. ఎన్నో హిట్స్, బ్లాక్‌బస్టర్స్ చూశారు. ఫ్లాప్స్, ఘోరమైన డిజాస్టర్స్ కూడా అందుకున్నారు. అయినా సరే నిలబడ్డారు. ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఈయన లేటెస్ట్ మూవీ 'మన శంకర వరప్రసాద్ గారు'.. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి రానుంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం చిరు చాలా ఆశలు పెట్టుకున్నారు.(ఇదీ చదవండి: 'జన నాయగణ్' వాయిదా? 'రాజాసాబ్'కి లైన్ క్లియర్)సరే ఈ సంగతి అలా పక్కనబెడితే చిరంజీవి కెరీర్లోనూ ఆగిపోయిన సినిమాలు చాలానే ఉన్నాయి. కొన్ని ప్రకటించిన తర్వాత రద్దయితే.. మరికొన్ని షూటింగ్ చేసిన తర్వాత ఆగిపోయాయి. కారణాలు ఏమైనా సరే చిరు కెరీర్లో పదికి పైగా మూవీస్ క్యాన్సిల్ అయ్యాయి. ఇంతకీ అవేంటి? ఎందుకు ఆగిపోయాయనేది ఇప్పుడు చూద్దాం.ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. చిరంజీవి హీరోగా 'వినాలని ఉంది' పేరుతో ఓ సినిమా మొదలుపెట్టారు. కొంత షూటింగ్ కూడా చేశారు. కానీ వర్మ.. పలు హిందీ ప్రాజెక్టులతో బిజీగా కావడంతో ఇది ఆగిపోయింది. ఇందులో ఊర్మిళ, టబు హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ చిత్రం కోసం తీసిన పాటలని తర్వాత 'చూడాలని ఉంది' మూవీ కోసం ఉపయోగించుకున్నారు.(ఇదీ చదవండి: 'భోళా శంకర్' ఫ్లాప్.. సోషల్ మీడియానే కారణం)స్టార్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు.. 'భూలోక వీరుడు' పేరుతో ఓ మూవీ ప్లాన్ చేశారు. చిరంజీవి హీరోగా అశ్వనీదత్ నిర్మాతగా ఫిక్స్ అయ్యారు. టైటిల్ కూడా రిజిస్టర్ చేశారు. కానీ షూటింగ్ మొదలుపెట్టకముందే ఇది ఆగిపోయింది. తర్వాత ఈ టైటిల్‌ని కాస్త మార్చి 'జగదేక వీరుడు అతిలోక సుందరి'గా ఉపయోగించుకున్నారనే ఇండస్ట్రీలో టాక్.ఒకానొక టైంలో తెలుగులో దొంగ అనే పేరు టైటిల్లో ఉండేలా చాలా సినిమాలు వచ్చాయి. చిరంజీవివి కూడా వీటిలో చాలానే ఉన్నాయి. అయితే సురేశ్ కృష్ణ దర్శకుడిగా చిరుతో 'బాగ్దాద్ గజదొంగ' అని ఓ ప్రాజెక్ట్ అనుకున్నారు. షూటింగ్‌కి ముందే ఓ వివాదం తలెత్తేసరికి ఆగిపోయింది. అలానే చిరంజీవికి చాలా హిట్స్ ఇచ్చిన కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరు హీరోగా 'వజ్రాల దొంగ' అనే మూవీ అనుకున్నారు. హీరోయిన్గా శ్రీదేవిని తీసుకుని పాట కూడా తీశారు. కానీ తర్వాత ఇది కూడా మధ్యలోనే ఆపేశారు. ఇదే దర్శకుడితో ఇద్దరు పెళ్లాల స్టోరీతో ఓ మూవీ అనుకున్నారు. కానీ స్క్రిప్ట్ టైంలోనే సమస్యలు రావడంతో ప్రారంభానికి ముందే ఈ ప్రాజెక్టు కూడా రద్దయిపోయింది.(ఇదీ చదవండి: ‘రాజాసాబ్’కు రూ.1000 కోట్లు సాధ్యమేనా?)వీటితో పాటు శాంతి నివాసం, వడ్డీ కాసుల వాడు, పెద్దపులి చిన్నపులి తదితర సినిమాలు కూడా చిరంజీవితో అనుకుని రకరకాల కారణాలతో సెట్స్‌పైకి వెళ్లకుండానే ఆగిపోయాయి. దర్శకుడు వీఎన్ ఆదిత్య, ఎస్వీ కృష్ణారెడ్డిలతోనూ చిరు సినిమాలు చేయాలనుకున్నారు. ప్రకటన, పూజా కార్యక్రమాల వరకే ఇవి పరిమితమయ్యాయుచిరంజీవి తన రీఎంట్రీ సినిమాని పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'ఆటో జానీ' అనే స్టోరీతో తీద్దామనుకున్నారు. ఇది మాటల వరకే పరిమితమైపోయింది. రీసెంట్ టైంలో అయితే చిరు హీరోగా దర్శకుడు వెంకీ కుడుముల- నిర్మాత డీవీవీ దానయ్య ఓ ప్రాజెక్టుని ప్రకటించారు. కారణమేంటో తెలీదు గానీ ఇదీ ఆగిపోయింది. 'సోగ్గాడే చిన్ని నాయన' ఫేమ్ కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలోనూ చిరు ఓ మూవీ చేయాల్సింది గానీ దీన్ని పక్కనబెట్టేశారు. చేస్తారో లేదో సందేహమే. ఇలా రకరకాల కారణాలతో ఆగిపోయిన చిరంజీవి సినిమాలు చాలానే ఉన్నాయండోయ్!(ఇదీ చదవండి: చిరంజీవికి సర్జరీ.. కూతురు సుస్మిత ఏమన్నారంటే..?) -
చిరు కోసం బాబీ మాస్టర్ ప్లాన్..! అదే నిజమైతే..
-
'భోళా శంకర్' ఫ్లాప్.. సోషల్ మీడియానే కారణం
చిరంజీవి లేటెస్ట్ సినిమా 'మన శంకరవరప్రసాద్ గారు'.. సంక్రాంతి కానుకగా ఈనెల 12వ తేదీన అంటే సోమవారం నుంచి థియేటర్లలోకి రానుంది. అయితే ఈయన గత చిత్రం 'భోళా శంకర్'.. దాదాపు రెండున్నరేళ్ల క్రితం రిలీజైంది. ఇది చిరు కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. తాజాగా ఈ మూవీ గురించి నిర్మాత అనిల్ సుంకర మాట్లాడారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వల్లే సినిమా ఫ్లాప్ అయిందన్నట్లు చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: ‘రాజాసాబ్’కు రూ.1000 కోట్లు సాధ్యమేనా?)'భోళా శంకర్ విషయంలో నేను బాగా హర్ట్ అయ్యింది ఏంటంటే.. సోషల్ మీడియాలో కొందరు డెకాయిట్లు ఉంటారు కొందరు. వీళ్లు ఏంటంటే టైమ్ చూసి దెబ్బ కొట్టారు. ముందే మీమ్స్ తయారు చేసుకున్నారు. ఈ విషయం నాకు తర్వాత తెలిసింది. చేసినోడే నాకు ఇదంతా చెప్పాడు. చివరకు ఏమైంది ఎవరి కర్మ వాళ్లే అనుభవిస్తున్నారు' అని అనిల్ సుంకర అన్నారు.ఫ్లాప్ అవ్వడానికి ఇతర కారణాలు కూడా చెబుతూ.. 'మొదటగా అది రీమేక్. కొవిడ్ కంటే ముందే మొదలుపెట్టాం. కానీ కొవిడ్ టైంలో ఒరిజినల్ సినిమాని అందరూ చూసేశారు. ఏదైతే బిగ్గెస్ట్ పాయింట్ అనుకున్నామో అది రిలీజ్ టైంకి వచ్చేసరికి మైనస్ అయింది. మాకు బ్యాడ్ లక్ ఏంటంటే చిరంజీవి ఒకేసారి మూడు మూవీస్ మొదలుపెట్టారు. వాటిలో మాది చివరగా రిలీజైంది. లాస్ట్ అయ్యేసరికి ఈలోపు ఒరిజినల్ అందరూ చూసేశారు. ఆ ప్రభావం కూడా ఫలితంపై పడింది. అలానే విడుదలకు ముందే ఫ్లాప్ అనేది ముందే క్రియేట్ చేశారు' అని అనిల్ సుంకర చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ట్రైలర్ రిలీజ్)'భోళా శంకర్' విషయానికొస్తే.. తమిళంలో అజిత్ చేసిన 'వేదాళం' రీమేక్‌గా దీన్ని తీశారు. చిరంజీవి హీరోగా, చెల్లి పాత్రలో కీర్తి సురేశ్ నటించింది. మెహర్ రమేశ్ దర్శకుడు. తమన్నా హీరోయిన్. అయితే తొలిరోజు తొలి ఆటకే ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది. రెండో రోజు నుంచి థియేటర్లలో జనాలు కనిపించలేదు.ఇకపోతే అనిల్ సుంకర్ నిర్మించిన లేటెస్ట్ మూవీ 'నారీ నారీ నడుమ మురారి'. శర్వానంద్ హీరోగా నటించగా సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లు. 'సామజవరగమన' ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకుడు. జనవరి 14న ప్రీమియర్లతో ఇది థియేటర్లలోకి వస్తోంది. దీని ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూల్లోనే 'భోళా శంకర్' ఫ్లాప్ గురించి అనిల్ సుంకర స్పందించారు. (ఇదీ చదవండి: హైకోర్టులో చిరు, ప్రభాస్ నిర్మాతలకు ఊరట) -
చిరంజీవి, విశ్వంభర సినిమాపై నటి మీనాక్షి చౌదరి కామెంట్స్
-
తెలంగాణ హైకోర్టుకు చిరంజీవి, ప్రభాస్
-
చిరంజీవికి సర్జరీ.. కూతురు సుస్మిత ఏమన్నారంటే..?
మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ జరిగిందంటూ గత రెండు రోజులుగా ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. తాజాగా దీనిపై చిరంజీవి కూతురు, ‘మనశంకర్ వరప్రసాద్ గారు’ నిర్మాత సుస్మిత స్పందించారు. ‘దీనిపై ఎలా మాట్లాడాలో తెలియదు. ప్రస్తుతానికి ఎలాంటి కామెంట్ చేయదల్చుకోలేను’ అని అంటూ సమాధానం దాటవేసే ప్రయత్నం చేశారు. మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నేడు(జనవరి 6) చిత్ర నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘చిరంజీవి(Chiranjeevi)కి సర్జరీ జరిగిందట నిజమేనా?’ అని ఓ విలేకరి అడగ్గా.. ఆమె పై విధంగా సమాధానం చెప్పింది. అయితే అదే ప్రశ్నకు కొనసాగింపుగా..‘సర్జరీ కారణంగానే చిరంజీవి ప్రమోషన్స్‌కి దూరంగా ఉన్నారట కదా?’ అని అడగ్గా.. అలాంటిదేమి లేదని.. పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉన్నారని చెప్పింది. అంతేకాదు ఇటీవల ‘ఓవర్సీస్ అభిమానులతోనూ వీడియో కాల్స్‌లో మాట్లాడారని, త్వరలోనే జరగబోయే ప్రీరిలీజ్ ఫంక్షన్‌కి కూడా చిరంజీవి వస్తారని స్పష్టం చేసింది. (చదవండి: ‘మన శంకరవరప్రసాద్ గారు’ సీక్వెల్‌పై క్లారిటీ!)దీంతో మెగా ఫ్యాన్స్ కాస్త ఊపిరిపీల్చుకున్నారు. సర్జరీ జరిగిందనే వార్తలు రాగానే మెగా ఫ్యాన్స్ కాస్త ఆందోళనకు గురయ్యారు. సినిమా ప్రమోషన్స్‌లో ఇక ఆయన పాల్గొనబోరని అంతా అనుకున్నారు. కానీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కి వస్తారని సుస్మిత చెప్పడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.(చదవండి: ‘ది రాజాసాబ్’ నుంచి ఆ రెండు సీన్లు కట్.. రన్‌టైమ్ ఎంతంటే?)మనశంకర్ వరప్రసాద్(Mana Shankara Vara Prasad Garu) విషయానికొస్తే.. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తోంది. విక్టరీ వెంకటేశ్ కీలక పాత్ర పోషించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం విడుదల కాబోతుంది. -
‘మన శంకరవరప్రసాద్’ కి సీక్వెల్ ఉందా?
ఈ మధ్య చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి సినిమా చివరన సీక్వెల్ ప్రకటించడం ట్రెండ్‌గా మారిపోయింది. కొన్ని సినిమాల కథలు ఒకే పార్ట్‌లో చూపించలేక.. రెండో భాగం తెరకెక్కిస్తుంటే..మరికొన్ని సినిమాలు మాత్రం పూర్తిగా ముగిసిన కథకు కూడా సీక్వెల్‌ని ప్రకటిస్తున్నారు. కథ రేడీగా ఉండదు కానీ ముందే సీక్వెల్ ప్రకటిస్తారు. సినిమా హిట్ అయితే..అప్పడు కథని డెవలప్ చేస్తారు. ఒకవేళ ప్లాప్ అయితే.. సీక్వెల్ ప్రకటించినప్పటికీ..మళ్లీ దాని జోలికి వెళ్లరు. అలా ఎన్నో సినిమాల సీక్వెల్స్ ఆగిపోయాయి. అయినా కూడా సీక్వెల్ ప్రకటించడం మాత్రం ఆగడం లేదు. చిరంజీవి కొత్త సినిమా ‘మన శంకర్ వరప్రసాద్ గారు’కి కూడా సీక్వెల్ ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ పుకార్లపై నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల స్పందించారు. ఈ సినిమాకు సీక్వెల్ లేదని స్పష్టం చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాతలు సాహు, సుస్మిత తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘మన శంకర్ వరప్రసాద్’కి సీక్వెల్ ఉంటుందా? అని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘ఇది కంప్లీట్ ఎండింగ్ మూవీ. క్లైమాక్స్‌లో పార్ట్ 2 ప్రకటన ఏమి ఉండదు. అసలు ఆ ఆలోచన కూడా మాకు లేదు’ అని స్పష్టం చేశారు.మనశంకర్ వరప్రసాద్ విషయానికొస్తే.. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తోంది. విక్టరీ వెంకటేశ్ కీలక పాత్ర పోషించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం విడుదల కాబోతుంది. -
చిరంజీవి సినిమాకు టికెట్ రేట్ల పెంపుపై నిర్మాతల క్లారిటీ
సంక్రాంతి రేసులో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీగా సినిమాల సందడి ఉంది. ఈ క్రమంలో మన శంకర వరప్రసాద్ గారు, ది రాజా సాబ్ చిత్రాలు కూడా బరిలో ఉన్నాయి. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ రెండు చిత్రాలకు టికెట్ ధరలు పెంపుతో పాటు ప్రీమియర్ షోలు ఉంటాయా అనే ప్రశ్నలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఒక క్లారిటీ వచ్చింది. మన శంకర వరప్రసాద్ గారు నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ అంశం గురించి ఆ చిత్ర నిర్మాతలు వివరణ ఇచ్చారు.ఆంధ్రప్రదేశ్‌లో ఎటూ ఈ రెండు చిత్రాలకు టికెట్ ధరలు పెంచుకునేందుకు ఛాన్స్ ఇవ్వడమే కాకుండా ప్రీమియర్ షోలకు కూడా అనుమతి ఇచ్చేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరీ తెలంగాణలో పరిస్థితేంటి..? అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో మన శంకర వరప్రసాద్ గారు చిత్ర నిర్మాతలు ఇలా అన్నారు. 'ఈ చిత్ర టికెట్స్ రేట్స్ పెంపుతో పాటు ప్రీమియర్ షోల గురించి రెండు ప్రభుత్వాలతో చర్చలు జరుగుతున్నాయి. మరో రెండురోజుల్లో క్లారిటీ వస్తుంది. ప్రభుత్వం నుంచి ఏదైనా సమాచారం రాగానే ప్లాన్ చేస్తాం. దాదాపు తెలంగాణలో కూడా ప్రీమియర్స్ ఉంటాయి.' అని పేర్కొన్నారు. -
70 ఏళ్ల వయసులో షేక్ చేసిన చిరు
-
'వామ్మో వాయ్యో' సాంగ్.. తెర వెనక ఆషిక ఇలా (ఫొటోలు)
-
చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్‌గారు’ మూవీ HD స్టిల్స్
-
ట్రైలర్ చూసి రామ్ చరణ్ రియాక్షన్ ఏంటంటే..
-
చరణ్‌తో సినిమా.. ‘మన శంకర వరప్రసాద్’ పునాది
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తోన్న లేటేస్ట్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ మనశంకర వరప్రసాద్ గారు. తొలిసారి అనిల్ రావిపూడి- చిరు కాంబోలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాది సంక్రాంతి పోటీలో నిలిచిన ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రిలీజ్‌కు కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండడంతో మేకర్స్ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీ అయిపోయారు.ఈ నేపథ్యంలో దర్శకుడు అనీల్ రావిపూడి తన తదుపరి లక్ష్యాన్ని స్పష్టంగా బయటపెట్టాడు. రామ్ చరణ్‌తో సినిమా చేయాలనే కోరికను ఆయన తాజాగా వెల్లడించారు. మన శంకర వరప్రసాద్ గారు ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో అనీల్ రావిపూడి మాట్లాడుతూ.. చిరంజీవి సినిమా పెద్ద హిట్ కావాలని కోరారు. ఆ సినిమా విజయం సాధిస్తే ఆటోమేటిగ్గా రామ్ చరణ్‌తో సినిమా చేసే అవకాశం వస్తుందని ప్రకటించారు. అదే వేదికపై శంకర వరప్రసాద్ పాట స్టెప్‌ను రావిపూడి రీ క్రియేట్ చేశారు. ట్రయిలర్‌ను మొదటగా రామ్ చరణ్‌కే చూపించిన విషయాన్ని బయటపెట్టారు. మా యూనిట్ కాకుండా ట్రయిలర్ చూసిన తొలి వ్యక్తి రామ్ చరణ్. చిరంజీవి గారి ఇంట్లో చరణ్‌కు చూపించాం. చూసి అద్భుతంగా ఉందన్నారని ఆయన తెలిపారు. రామ్ చరణ్‌తో సినిమా చేయాలంటే అది పాన్ ఇండియా స్థాయిలో ఉండాలని అనీల్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఆయన పాన్ ఇండియా స్థాయిలో ఒక్క సినిమా కూడా చేయకపోయినా హీరో, కథ అన్నీ సెట్ అయితే ఆటోమేటిగ్గా పాన్ ఇండియా అప్పీల్ వస్తుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. తన నుంచి రాబోయే రోజుల్లో కచ్చితంగా పెద్ద స్పాన్ ఉన్న పాన్ ఇండియా సినిమా వస్తుంది. ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు అనీల్ రావిపూడి వెల్లడించారు. రామ్ చరణ్‌తో సినిమా ఓకే చేసుకోవడం ద్వారా తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టడంతో పాటు, పాన్ ఇండియా డైరెక్టర్ హోదాను అందుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నారని సినీ విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి రామ్ చరణ్‌తో అనీల్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటే తెలుగు సినీ పరిశ్రమలో మరో భారీ ప్రాజెక్ట్‌కు నాంది పలికినట్టే. -
'మన శంకర వరప్రసాద్‌గారు' ట్రైలర్ వచ్చేసింది
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్‌గారు' ట్రైలర్ వచ్చేసింది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీలో వెంకటేశ్ ముఖ్యమైన పాత్రలో నటించారు. నయనతార హీరోయిన్. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే వచ్చిన సాంగ్స్, పోస్టర్స్ ప్రేక్షకులను మెప్పించాయి. ఇప్పటివరకూ చూడని సరికొత్త చిరంజీవిని ఈ చిత్రంలో చూడబోతున్నారంటూ అనిల్ రావిపూడి చెప్పడంతో అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి.తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. తనదైన మార్క్‌తో ఈ ట్రైలర్‌ను అనిల్ కట్ చేశారు. కామెడీ పంచ్‌లతో పాటు చిరంజీవి మెరుపులు కూడా చూడొచ్చు. కేవలం కామెడీ మాత్రమే కాకుండా చిరును ఫుల్ యాక్షన్ మోడ్‌లో కూడా చూపించినట్లు తెలుస్తోంది. -
రాజాసాబ్, చిరంజీవి.. తెలంగాణలో జీవో తెచ్చేదెవరు?
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వారంలో సంక్రాంతి సందడి ప్రారంభం కానుంది. రేసులో చాలా సినిమాలు ఉన్నాయి. చిన్న సినిమాలతో పాటు భారీ బడ్జెట్ చిత్రాలు కూడా బరిలో ఉన్నాయి. ఇప్పటికే రాజా సాబ్ ట్రైలర్ రావడంతో ఆ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. జనవరి 4న మన శంకర వరప్రసాద్ గారు ట్రైలర్‌తో వస్తున్నారు. చిరంజీవి సినిమా కావడంతో ఎటూ బజ్ ఉంటుంది. అయితే, ఇప్పుడు ఈ రెండు సినిమాల టికెట్ ధరల గురించి ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది.ఆంధ్రప్రదేశ్‌లో ఎటూ ఈ రెండు చిత్రాలకు టికెట్ ధరలు పెంచుకునేందుకు ఛాన్స్ ఇవ్వడమే కాకుండా ప్రీమియర్ షోలకు కూడా అనుమతి ఇచ్చేందుకు ఛాన్స్ ఉంది. మరీ తెలంగాణలో పరిస్థితేంటి..? అనేది హాట్ టాపిక్‌గా మారింది. చిరంజీవి, ప్రభాస్ సినిమాలకు సంబంధించిన చిత్ర యూనిట్లలో ముందుగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఎవరు కదుపుతారు అనే చర్చ పెద్ద ఎత్తున సాగుతుంది. రీసెంట్గా అఖండ-2 మూవీకి టికెట్ ధరలు పెంచితే తనకు తెలియకుండానే అధికారులు జీవో ఇచ్చారని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్‌లో ఎవరూ టికెట్ రేట్ల పెంపు కోసం తమ ప్రభుత్వం వద్దకు రావద్దని మీడియా ద్వారా సినిమా వాళ్లకు తెలిపారు. అలాంటిది ఇప్పుడు టికెట్ రేట్ల కోసం ప్రభుత్వంతో చర్చలు ఎవరు జరుపుతారు అనేది తేలాల్సి ఉంది. రాజా సాబ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్, చిరంజీవిలలో ఎవరైనా రంగంలోకి దిగుతారా..? మంత్రి తన మనసు మార్చకుని వెసులుబాటు ఇస్తారా..? అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ తెలంగాణలో టికెట్ ధరలు పెంపు అనేది లేకుండా ఈ రెండు సినిమాలను విడుదల చేస్తే.. బ్రేక్ ఈవెన్ దాటడం చాలా కష్టమని చెప్పవచ్చు. అయితే, మిగతా సినిమాలకు ఈ సమస్య లేదని చెప్పాలి. అనగనగా ఒక రాజు, భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాల నిర్మాతలు ఇప్పటికే ఈ విషయంపై ఒక ప్రకటన చేశారు. తమ సినిమాలకు టికెట్ రేట్లు పెంచడం లేదని తెలిపారు. -
ప్రభాస్ పెళ్లి తర్వాతే నేను చేసుకుంటా..: నవీన్ పొలిశెట్టి
నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన చిత్రం 'అనగనగా ఒక రాజు'.. ఈ సంక్రాంతికి కడుపుబ్బా నవ్వించేందుకు జనవరి 14న వస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నూతన దర్శకుడు కల్యాణ్ శంకర్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. తాజాగా జరిగిన ఒక ఈవెంట్లో నవీన్ పొలిశెట్టి పలు వ్యాఖ్యలు చేశారు.. ఒకప్పుడు తాను ఏ హీరోల సినిమాలైతే థియేటర్‌కి వెళ్ళి చూసేవాడినో.. ఇప్పుడు ఆ అభిమాన హీరోల సినిమాలతో పాటు, తన సినిమా విడుదలవుతుండటం సంతోషంగా ఉందన్నారు.ప్రభాస్ పెళ్లి తర్వాతే నేను చేసుకుంటా'అనగనగా ఒక రాజు' సినిమా ప్రమోషన్స్ సందర్భంగా తన పెళ్లి గురించి నవీన్ పొలిశెట్టి ఇలా అన్నారు. 'ప్రభాస్ అన్నయ్య పెళ్లి చేసుకున్న మరుసటి రోజు 12 గంటలకు నా పెళ్లి ఉంటుంది.' అంటూ సరదాగా చెప్పారు. అయితే, ప్రభాస్ అన్నయ్యతో తన స్నేహం చాలా గొప్పదని ఆయన చెప్పుకొచ్చారు. గత మూడు సంవత్సరాల నుంచి ప్రతి సంక్రాంతికి భోగి మంటలు, పతంగ్‌లు, మీనాక్షి చౌదరి కామన్ అయిపోయిందన్నారు. ఏజెంట్ సాయి, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఈ మూడు చిత్రాలు చాలా విభిన్నంగా ఉంటాయని గుర్తుచేశారు. ఇప్పుడు రాబోయే 'అనగనగా ఒక రాజు' కూడా సరికొత్తగా మెప్పిస్తుందని తెలిపారు.ఫస్ట్ ప్రభాస్ సినిమా.. ఆ తర్వాత చిరు మూవీ వెళ్తా..'ఈ సంక్రాంతికి విడుదలవుతున్న చిరంజీవి గారి 'మన శంకర వరప్రసాద్ గారు', ప్రభాస్ గారి 'ది రాజా సాబ్'తో పాటు అన్ని సినిమాలు విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రభాస్ అన్నయ్య నేనూ మంచి స్నేహితులం.. మా మధ్య పోటీ ఉండదు. మెగాస్టార్ చిరంజీవి గారిని చూసి ఎంతో మంది స్ఫూర్తి పొందారు. సగటు మధ్యతరగతి కుటుంబం నుంచి కూడా ఎవరైనా సరే ఇండస్ట్రీలో స్టార్ అవ్వవచ్చని పలువురికి దారి చూపించిన వ్యక్తి ఆయన.. పరిశ్రమలో నాలాంటి వారికి ఎందరికో ఆయన దారిచూపించారు. అలాంటి గురువుగారి సినిమా వస్తుంటే ఎలాంటి ఒత్తిడి ఉండదు.. నేనైతే ఫస్ట్ ప్రభాస్ అన్నయ్య సినిమా చూసి.. ఆ తర్వాత చిరంజీవి గారి సినిమాకు వెళ్తాను. అటునుంచి నా సినిమాకు వెళ్తా.' అని నవీన్ పొలిశెట్టి అన్నారు. -
కొత్త జోష్ అదిరింది
తెలుగు చిత్ర పరిశ్రమలో 2026 ఆరంభం కొత్త జోష్‌ను తీసుకొచ్చింది. నూతన సంవత్సరం సందర్భంగా తమ సినిమాల ప్రకటనలు, కొత్త అప్డేట్స్ను పంచుకున్నారు మేకర్స్. ఆ విశేషాలేంటో ఓ సారి చూద్దాం. ⇒ గన్ పట్టుకుని మాస్ లుక్‌తో కనిపించారు చిరంజీవి. ఆయన నటించిన తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’. నయనతార హీరో యిన్ గా నటించిన ఈ చిత్రంలో వెంకటేశ్ కీలకపాత్ర పోషించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ మూవీ నుంచి కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ⇒ రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న రిలీజ్ కానుంది. ఈ సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది యూనిట్. ⇒ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘స్పిరిట్’. భూషణ్ కుమార్, క్రిషణ్‌కుమార్, ప్రణయ్‌రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. అలాగే ప్రభాస్ హీరోగా నటించిన మరో సినిమా ‘ది రాజాసాబ్’. మారుతి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతీప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 9న రిలీజ్ కానుంది. ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ⇒ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన సినిమా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లు. ఎస్. హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు. ఈ సినిమా కొత్త స్టిల్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. అలాగే పవన్ కల్యాణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మించనున్న మూవీని ప్రకటించారు. ⇒ ‘దసరా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా ‘ది ఫ్యారడైజ్’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 26న రిలీజ్ కానుంది. ఈ చిత్రం నుంచి కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ⇒ శర్వానంద్ హీరోగా, సంయుక్త– సాక్షీ వైద్య హీరోయిన్లుగా నటించిన సినిమా ‘నారీ నారీ నడుమ మురారి’. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సినిమా కొత్త స్టిల్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ⇒ సుమంత్ హీరోగా నటించిన సినిమా ‘మహేంద్రగిరి వారాహి’. రాజ శ్యామల ఎంటర్టైన్మెంట్పై జాగర్లపూడి సంతోష్ దర్శకత్వం వహించారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానున్నట్లు మేకర్స్ తెలిపారు. ⇒ అఖిల్ నటిస్తున్న చిత్రం ‘లెనిన్ ’. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని తొలిపాటని ఈ నెల 5న, మూవీని వేసవిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించి, పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ⇒ నవీన్ పొలిశెట్టి, మీనాక్షీ చౌదరి జంటగా నటించిన సినిమా ‘అనగనగా ఒక రాజు’. మారి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న రిలీజ్ కానుంది. ఈ సినిమా కొత్త స్టిల్‌ను రిలీజ్ చేసింది యూనిట్. ⇒ విశ్వక్సేన్ హీరోగా సాయి కిరణ్ రెడ్డి దైదా దర్శకత్వం వహిస్తున్న పొలిటికల్ డ్రామాకి ‘లెగసీ’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఏక్తా రాథోడ్ హీరోయిన్ . యశ్వంత్ దగ్గుమాటి, సాయి కిరణ్ రెడ్డి దైదా నిర్మిస్తున్న ఈ సినిమా అనౌన్్సమెంట్ టీజర్‌ను గురువారం విడుదల చేశారు. ⇒ కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ జంటగా నటిస్తున్న సినిమా ‘చెన్నై లవ్‌స్టోరీ’. రవి నంబూరి దర్శకత్వంలో సాయి రాజేశ్, ఎస్కేఎన్ నిర్మిస్తున్న ఈ సినిమాని వేసవిలో రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించింది చిత్రయూనిట్. ⇒ నవీన్ చంద్ర, దివ్య పిళ్లై జోడీగా నటిస్తున్న చిత్రం ‘హనీ’. కరుణ కుమార్ దర్శకత్వంలో ఓవీఏ ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించారు. నిజ జీవిత ఘటనల ఆధారంగా మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు, డార్క్ సైకాలజీ వంటి అంశాలతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాని ఫిబ్రవరి 6న రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు మేకర్స్. ⇒ హీరోయిన్ సంయుక్త నటిస్తున్న సినిమా ‘ది బ్లాక్ గోల్డ్’. కేఎమ్‌సీ యోగేష్ దర్శకత్వంలో రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ 75శాతం పూర్తయినట్లు మేకర్స్ ప్రకటించి, సంయుక్త లుక్‌ని విడుదల చేశారు. ⇒ సుహాస్, శివానీ నాగారం జోడీగా నటించిన సినిమా ‘హే భగవాన్ ’. గోపీ అచ్చర దర్శకత్వంలో బి. నరేంద్ర రెడ్డి నిర్మించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు మేకర్స్ తెలిపారు. ⇒ నిరంజన్, గ్రీష్మ నేత్రికా, ప్రియాంక, దీప్తి శ్రీరంగం ముఖ్య తారలుగా సింహాచలం గుడుపూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రుక్ష్మిణి’. నేలబల్లి కుమారి సమర్పణలో జి సినిమా బ్యానర్‌పై నేలబల్లి సుబ్రహ్మణ్యం రెడ్డి, కట్టా గంగాధర రావు నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ని నటుడు రాజేంద్రప్రసాద్ విడుదల చేశారు. ⇒ అంకిత్ కొయ్య, మానసా చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్ జాతర’. ‘సమ్మతమే’ మూవీ ఫేమ్ గోపీనాథ్ రెడ్డి దర్శకుడు. యూజీ క్రియేషన్ ్సపై కంకణాల ప్రవీణ నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి కొత్త పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. పైన పేర్కొన్న చిత్రాలతోపాటుగా మరికొన్ని సినిమాల అప్డేట్స్ని న్యూ ఇయర్ సందర్భంగా ఆయా చిత్రాల మేకర్స్ వెల్లడించారు. -
2025లో ఈ హీరోలు కనిపించలేదు గురూ!
ఒకప్పుడు ఏడాదికి ఏడెనిమిది సినిమాల్లో కనిపించేవారు స్టార్ హీరోలు. ట్రెండ్ మారాక ఏడాదికి ఒక్కసారి కనిపించడమే పెద్ద విషయంగా మారిపోయింది. భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాల నిర్మాణానికి ఎక్కువ రోజులు పట్టడమో, అనుకున్న సమయానికి విడుదల కాకుండా వాయిదా పడటమో వంటి కారణాలతో ఈ ఏడాది కొందరు టాప్ స్టార్స్ వెండితెరపై కనిపించలేదు. కొందరు యువ హీరోలు కూడా వెండితెరకు ఎక్కలేదు. అయితే 2026లో ‘నో గ్యాప్’ అంటూ సిల్వర్ స్క్రీన్ పై కనువిందు చేయనున్నారు. ఆ విశేషాల్లోకి...టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన చిరంజీవి 2024ని మాత్రమే కాదు... 2025ని కూడా మిస్సయ్యారు. అయితే 2026లో మాత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు, విశ్వంభర’ సినిమాలతో ప్రేక్షకులకు డబుల్ ధమాకా ఇవ్వనున్నారు. చిరంజీవి హీరోగా వచ్చిన చివరి చిత్రం ‘భోళా శంకర్’ 2023 ఆగస్టు 11న విడుదలైంది. ఈ చిత్రం తర్వాత ఆయన నటించిన ‘విశ్వంభర’ 2025 జనవరి 10న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. దీంతో చిరంజీవి సినిమా విడుదలై, దాదాపు రెండున్నరేళ్లు అవుతోంది. అయితే 2026లో సంక్రాంతి బరిలో దిగుతున్నారాయన. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ‘మన శంకరవరప్రసాద్‌గారు’ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ఈ ఏడాది వాయిదా పడిన ‘విశ్వంభర’ సినిమా 2026 సమ్మర్లో విడుదల కానుంది. ఆ రకంగా అభిమానులకు డబుల్ ఫీస్ట్ ఇవ్వనున్నారు చిరంజీవి2026లోనూ నో?2024 సంక్రాంతికి ప్రేక్షకులకు ‘గుంటూరు కారం’ ఘాటు చూపించిన మహేశ్‌బాబు 2025ని మిస్ అయ్యారు.‘గుంటూరు కారం’ తర్వాత ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘వారణాసి’. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచరస్‌గా ఈ సినిమాని దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రనిర్మాణానికి ఎక్కువ రోజులు పట్టడం సహజం. సో... ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ మూవీ 2026లోనూ విడుదలయ్యే అవకాశం లేదు. 2027 వేసవిలో ‘వారణాసి’ ప్రేక్షకుల ముందుకు వస్తుందనే అంచనా ఉంది. ఈ లెక్కన మహేశ్‌బాబు 2026లోనూ సిల్వర్ స్క్రీన్ ని మిస్ అవుతున్నట్టే అన్నమాట.వచ్చే ఏడాదీ లేనట్లేనా?‘పుష్ప’ ఫ్రాంచైజీతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సొంతం చేసుకున్నారు హీరో అల్లు అర్జున్ . ఆయన నటించిన ‘పుష్ప 2: ది రూల్’ మూవీ 2024 డిసెంబరు 5న విడుదలై బ్లాక్‌బస్టర్ గా నిలవడంతోపాటు సరికొత్త రికార్డులను నెలకొల్పింది. అయితే 2025 లో అల్లు అర్జున్ సిల్వర్ స్క్రీన్ ని మిస్ అయ్యారు. ప్రస్తుతం ఆయన అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ‘ఏఏ 22 అండ్ ఏ 6’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. సూపర్ హీరో కాన్సెప్ట్‌తో సైన్ప్ ఫిక్షన్‌గా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా 2026లో ప్రేక్షకుల ముందుకు వస్తుందేమో అనుకున్నారు. భారీ కథ, అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతున్న కారణంగా చిత్రీకరణకు ఎక్కువ టైమ్ పడుతోందట. దాంతో 2027లో ఈ చిత్రం విడుదల కానుందని తెలుస్తోంది. అంటే వరుసగా 2025, 2026ని అల్లు అర్జున్ మిస్ అయినట్లే. వచ్చే ఏడాదిపోరాట యోధుడిగా...సీనియర్ హీరోల్లో గోపీచంద్ ఈ ఏడాది తెరపై కనిపించలేదు. ఆయన హీరోగా నటించిన ‘విశ్వం’ సినిమా 2024 అక్టోబరు 11న విడుదలైంది. ఆ తర్వాత ఆయన ప్రేక్షకుల ముందుకు రాలేదు. ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ హిస్టారికల్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు గోపీచంద్. ఏడో శతాబ్దం నేపథ్యంలో ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని ఒక చారిత్రక ఘట్టంతో ఈ చిత్రం రూపొందుతోందట. ఇంకా ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్ ని మిస్ అయిన సీనియర్ హీరోలు మరికొందరు ఉన్నారు. పైన పేర్కొన్నవారే కాదు.. మరికొందరు యువ హీరోలు కూడా 2025ని మిస్ అయిన వారి జాబితాలో ఉన్నారు. వారిలో కొందరయినా 2026లో వెండితెరపై వెలుగుతారని కోరుకుందాం.రెండు భాగాలుగా రూపొందిన ‘బాహుబలి’ సినిమా అప్పుడు ప్రభాస్ వెండితెరపై రెండు మూడేళ్ల గ్యాప్‌లో కనిపించారు. అయితే ఆ గ్యాప్ విలువైనదనే చె΄్పాలి. ప్రభాస్‌ని పాన్ ఇండియన్ స్టార్‌గా నిలబెట్టిన చిత్రం ‘బాహుబలి’. కానీ ఇకపై తమ అభిమాన హీరో సిల్వర్ స్క్రీన్ పై గ్యాప్ లేకుండా కనిపించాలనిఅభిమానులు ఆశించారు. గత ఏడాది ‘కల్కి 2898ఏడీ’లో హీరోగా కనిపించారు ప్రభాస్. అనుకోకుండా 2025లో గ్యాప్ వచ్చింది. కానీ ‘కన్నప్ప’లో చేసిన అతిథి పాత్ర కొంతవరకూ అభిమానులను సంతప్తిపరిచింది. ఇక ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ 2026 జనవరి 9న విడుదలవుతోంది. అలాగే ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ‘ఫౌజీ’ చిత్రం కూడా వచ్చే ఏడాదే విడుదల కానుంది. సో... అభిమానులకు డబుల్ ధమాకా అన్నమాట.2026లో ఫుల్ మాస్2025 లో ఎన్టీఆర్ ఏ తెలుగు సినిమా చేయకపోయినా హిందీ చిత్రం ‘వార్ 2’లో కనిపించి, ఫ్యాన్స్‌ని ఆ విధంగా ఆనందపరిచారు. అయితే ఎంత లేదన్నా మాతృభాషలో కనిపిస్తేనే ఫ్యాన్స్‌కి మజా వస్తుంది. ఆ కొరత ఈ ఏడాది ఉన్నప్పటికీ వచ్చే ఏడాది అసలు సిసలు ఫుల్ మాస్ కమర్షియల్ తెలుగు సినిమాలో కనిపిస్తారు ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ హీరో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘డ్రాగన్ ’ అనే టైటిల్ అనుకుంటున్నారట. థాయ్‌ల్యాండ్, మయన్మార్, లావోస్ సరిహద్దుల్లోని గోల్డెన్ ట్రయాంగిల్ప్రాంతం చుట్టూ ఈ కథ తిరుగుతుందని, అక్కడ జరిగే అక్రమ కార్యకలాపాలను హీరో పాత్ర ఎదుర్కొంటుందనే అంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారనే వార్త ప్రచారంలో ఉంది. ఈ విషయంపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. వచ్చే ఏడాది జూన్ లో ఈ చిత్రం విడుదల కానుంది.యువ హీరోలకు సైతం గ్యాప్కొందరు యువ హీరోలు సైతం 2025ని మిస్సయ్యారు. శర్వానంద్ నటించిన ‘మనమే’ చిత్రం 2024 జూన్ 7న రిలీజైంది. ఆ సినిమా తర్వాత ఆయన నటించిన ‘నారీ నారీ నడుమ మురారి, బైకర్’ చిత్రాలు 2025లో విడుదల కావాల్సి ఉన్నా వాయిదా పడ్డాయి. ఈ రెండు సినిమాలూ 2026లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వాటిలో ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రం జనవరి 14న విడుదలవుతోంది. వరుణ్ తేజ్ కూడా ఆడియన్స్‌ని పలకరించి ఏడాదికి పైనే అయింది. ఆయన హీరోగా నటించిన ‘మట్కా’ మూవీ 2024 నవంబరు 14న రిలీజైంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ చేస్తున్న సినిమా 2026 లో విడుదలకానుంది.అడివి శేష్‌కి కూడా 2025లో గ్యాప్ వచ్చింది. ఆయన నటిస్తున్న ‘డెకాయిట్’, ‘జీ 2’ చిత్రాలు 2026లో రిలీజ్ కానున్నాయి. ఇక అక్కినేని అఖిల్ ఆడియన్స్ ముందుకొచ్చి రెండున్నరేళ్లకు పైనే అయింది. ఆయన నటించిన ‘ఏజెంట్’ మూవీ 2023 ఏప్రిల్ 28న విడుదలైంది. ఆ తర్వాత అఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘లెనిన్ ’. ఈ సినిమా 2026లో రిలీజ్ కానుంది. మరో యువ హీరో సాయిదుర్గా తేజ్ కూడా ఆడియన్స్‌ని పలకరించి రెండున్నరేళ్లకు పైనే అవుతోంది.‘విరూపాక్ష’, ‘బ్రో’ (2023) వంటి సినిమాల తర్వాత ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). ఈ చిత్రం 2026లో విడుదలకానుంది. అదే విధంగా నిఖిల్ సిద్ధార్థ్ సినిమా విడుదలై ఏడాదికి పైనే అయ్యింది. నిఖల్ నటించిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ 2024 నవంబరు 8న రిలీజైంది. ఆయన హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభు’. ఈ సినిమా 2026లో ఆడియన్స్ ముందుకు రానుంది. – డేరంగుల జగన్ మోహన్ -
చిరంజీవి-వెంకటేశ్ మెగా విక్టరీ మాస్ సాంగ్ (ఫొటోలు)
-
చిరు-వెంకటేశ్.. మెగా విక్టరీ మాస్ సాంగ్ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా 'మన శంకరవరప్రసాద్ గారు'. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. కొన్నిరోజుల ముందే ఈ మూవీలోని రెండు పాటల్ని రిలీజ్ చేయగా.. వాటిలో మీసాల పిల్ల బాగా వైరల్ అయింది. మరో సాంగ్ మాత్రం అంతంత మాత్రంగానే బాగుందనిపించింది. ఇప్పుడు మరో గీతాన్ని రిలీజ్ చేశారు. ఇందులో చిరు, వెంకీ కలిసి స్టెప్పులేయడం విశేషం.(ఇదీ చదవండి: ప్రేమలో మోసపోయే అమ్మాయి కథ.. ఓటీటీలోకి కొత్త తెలుగు సినిమా)చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న ఈ సినిమాలో హీరో వెంకటేశ్ కీలక పాత్ర చేశారు. దాదాపు 20 నిమిషాల పాటు కనిపిస్తారని దర్శకుడు అనిల్ రావిపూడి స్వయంగా చెప్పాడు. అలానే చిరు-వెంకీ కలిసి ఓ పాటలో డ్యాన్స్ కూడా చేస్తారని అన్నాడు. ఇప్పుడు దాన్ని 'మెగా విక్టరీ సాంగ్' పేరిట విడుదల చేశారు. పాట విషయానికొస్తే బీట్ బాగుంది కానీ ట్యూన్ మాత్రం ఎక్కడో విన్నామో అనిపించేలా ఉందనిపించింది.ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12న.. 'మన శంకర వరప్రసాద్ గారు' థియేటర్లలోకి వస్తోంది. దీని కంటే ముందు 9వ తేదీన 'రాజాసాబ్'.. తర్వాత 13వ తేదీన రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', 14వ తేదీన నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు', 15వ తేదీన శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' రాబోతున్నాయి. మరి వీటిలో ఈసారి ఏయే చిత్రాలు ప్రేక్షకుల్ని అలరిస్తాయనేది చూడాలి?(ఇదీ చదవండి: మహిళా అభిమాని పెళ్లి.. సర్ప్రైజ్ చేసిన హీరో సూర్య) -
'విశ్వంభర' విడుదల ఎప్పుడంటే..
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ ఫిల్మ్ 'విశ్వంభర'.. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ 2025 సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. ఆ సమయంలో గేమ్ ఛేంజర్ కోసం చిరు వాయిదా వేసుకున్నారు. అపై టీజర్ విషయంలో ఫ్యాన్స్ కూడా చాలా నిరాశ చెందడంతో వాయిదానే బెటర్ అనుకున్నారు. అందులో గ్రాఫిక్స్ వర్క్ చాలా పేలవంగా ఉందని విమర్శలు రావడంతో మార్పులు చేయాలనుకున్నారు. అయితే, ఎప్పుడు రిలీజ్ అనేది ఇప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు. ఇంతలో 'మన శంకర వరప్రసాద్ గారు' లైన్లోకి వచ్చేశాడు. మరో పదిరోజుల్లో విడుదల కూడా కానుంది. కానీ, విశ్వంభర గురించి ఎలాంటి ప్రకటన రాలేదు.'విశ్వంభర' టీజర్ విషయంలో విమర్శలు రావడంతో దర్శకుడు వశిష్ఠ పక్కా ప్లాన్‌తో ఈ ఏడాది మొత్తం విశ్వంభర గ్రాఫిక్స్ వర్క్ కోసం కేటాయించి బలమైన ఔట్‌పుట్‌ను ఇచ్చారని తెలుస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్‌పై విస్తృతంగా పరిశీలించి అనేక మార్పులు చేశారట. అయితే, తాజా నివేదికల ప్రకారం 'విశ్వంభర' జూన్ 2026 విడుదలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. 'మన శంకర వరప్రసాద్ గారు' జనవరి 2026లో వస్తున్నందున, రెండు విడుదలల మధ్య ఆరోగ్యకరమైన అంతరాన్ని కొనసాగించాలని మేకర్స్ ఉన్నారట. విశ్వంభర తుది అవుట్‌పుట్‌ను మెగాస్టార్ ఆమోదించిన తర్వాత మాత్రమే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.ప్రపంచంలోనే టాప్ వీఎఫ్ఎక్స్ కంపెనీలు విశ్వంభర కోసం పనిచేస్తున్నాయి. ప్రపంచస్థాయి విజువల్ ఎఫెక్ట్స్ అందించాలని వశిష్ఠ తన ప్లాన్ మార్చుకున్నారు. పాన్ ఇండియా రేంజ్లో రానున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష, ఆషికా నటిస్తున్న విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. -
చిరు, వెంకీ ఊరమస్ స్టెప్స్..!
-
నీలాంటి స్నేహితుడు దొరకడం అదృష్టం: చిరంజీవి
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నేడు (డిసెంబర్ 27న) 60వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అతడికి పలువురు ప్రముఖులు పర్సనల్‌గా, సోషల్ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన స్నేహితుడికి ఎక్స్ (ట్విటర్) వేదికగా విషెస్ తెలియజేశారు.హ్యాపీ బర్త్‌డేనా ప్రియమైన సోదరుడికి 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ అద్భుతమైన మైలురాయిని చేరుకున్న సల్లూభాయ్‌కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ ఏడాది ఆయురారోగ్యాలతో పాటు అపారమైన సంతోషం, ప్రేమ పొందాలని మనసారా కోరుకుంటున్నాను. నువ్వు లక్షలాదిమందికి ఒక ఇన్స్పిరేషన్.. నిన్ను స్నేహితుడని పిలవడం మాలాంటివారికి దక్కిన అదృష్టం.ఎంజాయ్ చెయ్నువ్వు మరెన్నో విజయాలు అందుకోవాలి, సుఖసంతోషాలతో గడపాలి. ఈ ప్రత్యేకమైన రోజును హ్యాపీగా ఎంజాయ్ చెయ్ అంటూ సల్లూ భాయ్‌తో దిగిన ఫోటో షేర్ చేశారు. కాగా చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' మూవీలో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించాడు. సినిమాల విషయానికి వస్తే చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర', 'మన శంకర వరప్రసాద్‌గారు' మూవీస్ చేస్తున్నారు. సల్మాన్.. 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' మూవీ చేస్తున్నాడు. Happy 60th birthday to my beloved brother @BeingSalmanKhan 🌟Sallu bhai, on this special milestone, I want to share my heartfelt wishes with you. May this year bring you endless joy, good health, and all the love you truly deserve. You have always been an inspiration, not just… pic.twitter.com/4ESoduO2yA— Chiranjeevi Konidela (@KChiruTweets) December 27, 2025 చదవండి: బట్టతలపై జుట్టు.. అడ్వాన్స్ తీసుకుని డ్రామాలు -
మాస్ సాంగ్ కమింగ్
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలైన చిరంజీవి, వెంకటేశ్ కలిసి ఓ మాస్ సాంగ్‌లో చిందేశారు. మరి... వారి డ్యాన్స్‌లు ఏ రేంజ్లో ఉన్నాయో తెలియాలంటే ఈ నెల 30 వరకూ వేచి చూడాల్సిందే. చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’. ‘పండగకి వస్తున్నారు’ అన్నది ట్యాగ్‌లైన్. ఈ ఏడాది సంక్రాంతికి వెంకటేశ్ హీరోగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో బ్లాక్‌బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. నయనతార హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో హీరో వెంకటేశ్ ముఖ్యపాత్ర పోషించారు.అర్చన సమర్పణలో సాహు గార΄ాటి, సుష్మిత కొణిదెల నిర్మించారు. సంక్రాంతి సందర్భంగా ‘మన శంకరవరప్రసాద్‌గారు’ 2026 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ఇప్పటికే ‘మీసాల పిల్ల...’, ‘శశిరేఖ..’పాటలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం చిరంజీవి, వెంకటేశ్ ఓ మాస్ నంబర్‌కి డ్యాన్స్ చేశారు. ఈపాట ప్రోమోని నేడు రిలీజ్ చేసి, పూర్తిపాటని ఈ నెల 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించి, ‘మెగా విక్టరీ మాస్ సాంగ్’ కమింగ్ అంటూ చిరంజీవి, వెంకటేశ్ డ్యాన్స్ చేస్తున్న పోస్టర్ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి కెమెరా: సమీర్ రెడ్డి. -
'మనశంకర వరప్రసాద్ గారు'.. మేకింగ్ వీడియో చూశారా?
మెగాస్టార్- అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ 'మనశంకరవరప్రసాద్ గారు'. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా వచ్చే ఏడాద సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటించారు. కేథరిన్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.మూవీ రిలీజ్‌కు ఇంకా కేవలం 25 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో మేకర్స్ మూవీ ప్రమోషన్స్ జోరు పెంచారు. ఈ నేపథ్యంలోనే మనశంకరవరప్రసాద్ గారు మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. సెట్స్‌లో అంతా నవ్వుల సందడే కనిపిస్తోంది. ఈ వీడియో మెగా అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. చిరంజీవి హవాభావాలు, నయనతార నవ్వులు ఫ్యాన్స్‌ను అలరించేలా ఉన్నాయి.ఈ చిత్రంలో హీరో వెంకటేశ్ కీలక పాత్రలో నటించారు. ఈ ఏడాదికి సంక్రాంతికి వస్తున్నాం మూవీతో హిట్ కొట్టిన అనిల్ రావిపూడి.. మరో సూపర్ హిట్ కోసం రెడీ అవుతున్నారు. -
మొన్న చిరంజీవి.. నేడు బాలయ్య.. అక్కడ అట్టర్ ఫ్లాప్!
పాన్ ఇండియా సినిమాకే కేరాఫ్‌గా మారింది టాలీవుడ్. ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో పాటు తేజ సజ్జ, నిఖిల్ లాంటి కుర్ర హీరోలు కూడా వరుసగా పాన్ ఇండియా సినిమాలను రిలీజ్ చేస్తూ తమ పాపులారిటినీ పెంచుకుంటున్నారు. అదే జోష్‌లో మన సీనియర్ హీరోలు కూడా పాన్ ఇండియా మార్కెట్లో నిలబడాలని ప్రయత్నాలు చేశారు. కానీ అవేవి వర్కౌట్ అవ్వడం లేదు.మెగాస్టార్ చిరంజీవికి తెలుగు రాష్ట్రాలతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కొన్నేళ్ల పాటు సినిమాలను ఆపేసినా కూడా ఆయన మార్కెట్ చెక్కుచెదరలేదు. కానీ పాన్ ఇండియా మార్కెట్లో మాత్రం చిరంజీవి ఫ్లాప్ అవ్వాలి. గాడ్ ఫాదర్ చిత్రంతో పాన్ ఇండియాలో మార్కెట్లోకి అడుగుపెట్టాడు. ఆ చిత్రంలో సల్మాన్ ఖాన్ లాంటి బాలీవుడ్ హీరో నటించినా.. పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద దరుణంగా బోల్తా పడింది. దీంతో చిరు పాన్ ఇండియా ప్రయత్నాలు వదిలేసి.. మళ్లీ లోకల్ చిత్రాలపైనే ఫోకస్ పెట్టాడు. సంక్రాంతికి రాబోతున్న ‘మనశంకర్ వరప్రసాద్ గారు’ పక్కా తెలుగు సినిమా. ఇక్కడ హిట్ అయితే చాలు..పాన్ ఇండియా అవసరం లేదనుకొని, అదే రేంజ్లో ప్రమోషన్స్ చేస్తున్నారు.ఇక బాలయ్య కూడా పాన్ ఇండియాపై ఫోకస్ చేశాడు. అఖండ 2తో పాన్ ఇండియా స్టార్ అయిపోవాలని గట్టి ప్రయత్నమే చేశాడు. కానీ చిరంజీవి కంటే దారుణమే ఎదురుదెబ్బ తగిలింది. అఖండ 2 కోసం ముంబై, చెన్నై లాంటి ప్రాంతాల్లో ప్రమోషన్స్ చేశాడు. హిందీతో డైలాగులు చెప్పి అలరించాడు. కానీ అవేవి థియేటర్స్‌కి రప్పించలేకపోయాయి. బాలీవుడ్లో అఖండ 2 అట్టర్ ఫ్లాప్ అయింది.ఇక వెంకటేశ్ కూడా పాన్ ఇండియా మార్కెట్లో రాణించాలని ‘సైంధవ్’తో ప్రయత్నించాడు. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత ఆయన పూర్తిగా తెలుగు ప్రేక్షకులకు నచ్చే కథలపైనే ఫోకస్ పెట్టాడు.మనో సీనియర్ హీరో నాగార్జున కూడా అంతే. పాన్ ఇండియా పై ఆయనకు మోజే లేదు. సోలోగా రాణించాలనే ఆశే లేదు. కుబేర, కూలి, బ్రహ్మాస్త్ర లాంటి సినిమాలతో పాన్ ఇండియా ప్రేక్షకులను పలకరించాడు కానీ.. హీరోగా మాత్రం అలాంటి ప్రయత్నం చేయలేదు. ఇలా టాలీవుడ్ సీనియర్లంతా పాన్ ఇండియా మార్కెట్ వద్ద ఫ్లాప్ అవుతూనే ఉన్నారు. మరి భవిష్యత్తులో అయినా హిట్ కొడతారో చూడాలి. -
సూపర్ స్టైల్
‘‘మై డియర్ వెంకీ జన్మదిన శుభాకాంక్షలు. నువ్వెక్కడ ఉన్నా నీ చుట్టూ పాజిటివిటీ పంచుతుంటావు. ‘మన శంకర వరప్రసాద్‌గారు’ షూటింగ్లో మనం గడిపిన ప్రతి క్షణాన్ని నేనెంతో మధురంగా గుర్తు చేసుకుంటాను’’ అని సోషల్ మీడియా వేదికగా వెంకటేశ్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు చిరంజీవి. డిసెంబరు 13 వెంకటేశ్ బర్త్ డే. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి, ‘మన శంకరవరప్రసాద్‌గారు’లో ఆయన చేసిన కీ రోల్ లుక్‌ని విడుదల చేసింది యూనిట్. ఈ చిత్రంలో వెంకటేశ్ సూపర్ స్టైలిష్ క్యారెక్టర్ చేశారని లుక్ స్పష్టం చేస్తోంది. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించిన చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్గా నటించారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న రిలీజ్ చేయనున్నామని శనివారం నిర్వహించిన విడుదల తేదీ ప్రకటన వేడుకలో దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు. -
చిరు 'మన శంకర వరప్రసాద్ గారు' విడుదల తేదీ ప్రకటన
చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా 'మన శంకర వరప్రసాద్ గారు'. అనిల్ రావిపూడి దర్శకుడు. సంక్రాంతికి రిలీజ్ అవుతుందని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. అయితే ఏ తేదీన వస్తుందనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. తొలుత విడుదల ఎప్పుడనేది అధికారికంగా అనౌన్స్ చేశారు.(ఇదీ చదవండి: 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలిపాట రిలీజ్)శనివారం రాత్రి హైదరాబాద్‌లో ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జనవరి 12న మూవీ థియేటర్లలోకి రానుందని ప్రకటించారు. అలానే దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. తమ సినిమా షూటింగ్ నిన్నటితో(డిసెంబరు 12) పూర్తయిందని చెప్పాడు. అందుకే ఇవాళ్టి నుంచి ప్రమోషన్స్ మొదలుపెట్టామని అన్నాడు. నిన్న చిరంజీవిగారితో చివరి వర్కింగ్ డే అని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ కాగా వెంకటేశ్ కీలక పాత్ర చేస్తున్నారు. భీమ్స్ సంగీత దర్శకుడు.సంక్రాంతి బరిలో ఉన్నవాటిలో తొలుత ప్రభాస్ 'రాజాసాబ్' జనవరి 9న రానుంది. దీని తర్వాత చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' జనవరి 12న అంటే సోమవారం రిలీజ్ అవుతుంది. తర్వాత నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు' 14వ తేదీన, శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' 14వ తేదీన రిలీజ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' కూడా పోటీలో ఉందని చెప్పారు గానీ డేట్ మాత్రం ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు.(ఇదీ చదవండి: రొమాంటిక్ కామెడీ.. ఫీల్ గుడ్ సినిమా.. ఓటీటీ రివ్యూ) -
2026లో ‘మెగా’ బ్లాస్ట్.. నలుగురు హీరోలు.. ఐదు సినిమాలు!
ఈ ఏడాది మెగా అభిమానులు కాస్త నిరాశలో ఉన్నారు. ఓజీ మినహా.. మెగా హీరోల సినిమాలేవి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయాయి. మరోవైపు చిరంజీవి నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. హిట్,ఫ్లాప్ పక్కన పెడితే..కనీసం సినిమా వచ్చినా చాలు అని మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. వారి ఎదురుచూపులకు వచ్చే ఏడాది ప్రారంభంలో ఫలితం దక్కనుంది. రెండు నెలల గ్యాపులోనే ఒకరు కాదు ఇద్దరు కాదు..ఏకంగా నలుగు మెగా హీరోల సినిమాలు రిలీజ్ కానుంది. వచ్చే ఏడాది సంకాంత్రికి మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ‘మనశంకర వరప్రసాద్ గారు’ ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిల్ రావిపూడి దర్వకత్వం వహించిన ఈ చిత్రంపై మెగా ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాతో మెగాస్టార్‌ని ఏకంగా రూ. 500 కోట్ల క్లబ్లో చేర్చాలని భావిస్తున్నారు. వెంకటేశ్‌తో అనిల్ తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈ ఏడాది సంక్రాంతికి రిలీజై రూ. 300 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ సినిమాకు హిట్ టాక్ వస్తే.. రూ. 500 కోట్ల కలెక్షన్స్ పెద్ద కష్టమేమి కాకపోవచ్చు.ఇక మార్చిలో రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. హిట్ పక్కకు పెడితే.. చరణ్(Ram charan) ఈ సినిమాతో రూ. 1000 కోట్ల క్లబ్లో చేరతాడా లేదా అనేదానిపై మెగా ఫ్యాన్స్ డిబెట్ జరుపుతున్నారు. మార్చి 27న ఈ చిత్రం రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా కంటే ముందుగానే మరో మెగా హీరో సాయిదుర్గ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ రిలీజ్ కానుంది. డేట్ ఫిక్స్ కాలేదు కానీ.. మార్చి రెండో వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఏప్రిల్‌లో మెగాబ్రదర్స్ చిరంజీవి, పవన్ కల్యాణ్(Pawan Kalyan) బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నారు. ఈ నెలలోనే చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్ కానుంది. వాస్తవానికి ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతికే రిలీజ్ కావాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. సమ్మర్లో రాబోతున్నట్లు చాలా రోజుల క్రితమే ప్రకటించారు. మార్చిలోపు సీజీ పనులన్నీ పూర్తి చేసుకొని ఏప్రిల్‌లో రిలీజ్ చేయలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇదే నెలలో పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్ ’కూడా రిలీజ్ కాబోతున్నట్లు టాలీవుడ్లో టాక్ నడుస్తుంది. ఇప్పటికే పవన్ పాత్రకు సంబంధించిన షూటింగ్ అంతా పూర్తి అయింది. మార్చికల్లా అన్ని పనులు పూర్తి చేసుకొని..ఏప్రిల్‌లోనే రిలీజ్ చేయాలని హరీశ్ శంకర్ ప్లాన్ చేస్తున్నాడట. ఒకవేళ అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 2026 ప్రారంభం నుంచే మెగా ఫ్యాన్స్ సెలెబ్రేషన్స్ ప్రారంభం అవుతాయి. -
తెలుగు స్టార్ హీరోలు.. ఢిల్లీ హైకోర్టుకే ఎందుకు?
రీసెంట్ టైంలో సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ కనిపిస్తుంది. ఎంతలా అంటే తెలుగు హీరోలు ఎవరినీ వదట్లేదు. అసభ్యకర కామెంట్స్ కావొచ్చు, దారుణమైన ట్రోల్స్ చేయడం లాంటివి కనిపిస్తూనే ఉన్నాయి. దీంతో చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ తదితరులు తమ వ్యక్తిగత హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. ఆంధ్ర, తెలంగాణలోనూ హైకోర్టులు ఉన్నప్పటికీ ఢిల్లీ ఎందుకు వెళ్లారు? కారణమేంటి?అయితే వ్యక్తిగత హక్కుల రక్షణ కోసం ఢిల్లీ హైకోర్టుని సెలబ్రిటీలు ప్రధానంగా ఎంపిక చేసుకోవడం వెనక పెద్ద కారణమే ఉంది. ఈ విషయంలో ఇక్కడైతే వీలైనంత త్వరగా ఆదేశాలు వస్తాయి. ఇలాంటి చాలా పిటిషన్లని గతంలో ఇక్కడ విచారించడం కూడా కారణమని చెప్పొచ్చు. అలానే అక్కడ తీర్పు వస్తే దేశవ్యాప్తంగా అందరికీ తెలియడానికి అవకాశముంది.(ఇదీ చదవండి: ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించిన పవన్ కల్యాణ్)సోషల్ మీడియాలో ప్రధానంగా ఉపయోగించే ఫ్లాట్‌ఫామ్స్, కంపెనీలు హెడ్ ఆఫీస్‌లు దాదాపుగా ఢిల్లీలోనే ఉన్నాయి. ఒకవేళ తీర్పు వచ్చిన తర్వాత సమాచారం వాళ్లకు తెలియడం కూడా సులభం అవుతుంది. అలానే వ్యక్తిగత హక్కుల్ని డీల్ చేసే చాలా ఏజెన్సీలు అక్కడే ఉండటం కూడా దీనికి ఓ కారణం. ఇందువల్లే సెలబ్రిటీలు ఢిల్లీ హైకోర్టుని ఎంచుకుంటున్నారు.గత కొన్నాళ్లుగా చూసుకుంటే చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్స్.. హైకోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకుంటున్నారు. రాబోయే రోజుల్లో మిగతా పేరున్న నటీనటులు కూడా ఇలానే వ్యక్తిగత హక్కుల రక్షణకు సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటారు. కాబట్టి యువత.. ఇకపై సోషల్ మీడియాలో ఏ నటుడు లేదా నటి గురించి ఏదైనా కామెంట్ చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయండి. లేదంటే కోర్ట్ ఆర్డర్స్ వల్ల కటకటాలపాలయ్యే అవకాశముంది. కాబట్టి బీ కేర్ ఫుల్!(ఇదీ చదవండి: 'అఖండ 2'కి హైదరాబాద్‌లోనే 3 కోట్ల టికెట్స్ సేల్.. ఇదెక్కడి అతి!?) -
Global Summit: నేను చిరంజీవిగా ఇక్కడకు రాలేదు
సాక్షి, ఫ్యూచర్ సిటీ: ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని చిత్రపరిశ్రమలు హైదరాబాద్‌కు వచ్చేలా కృషి చేస్తామని సీఎం రేవంత్ నాతో చెప్పారు.. చెప్పిన కొన్నిరోజులకే ఎందరో ప్రముఖులను ఇక్కడికి తీసుకొచ్చారని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. మంగళవారం సాయంత్రం ఫ్యూచర్ సిటీలో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొని ప్రసంగించారు. వేదిక పై ఒక్కో రంగం నుంచి ఒక్కరు ఉన్నారు. నన్ను వేదికపై ఉంచడం సినిమా పరిశ్రమ కు ఇచ్చిన గౌరవం గా భావిస్తున్నా. సీఎం రేవంత్ రెడ్డికి సినీ పరిశ్రమ అంటే ఎంతో గౌరవం. నేను చిరంజీవిగా రాలేదు. సినిమా ఇండస్ట్రీ తరుపున వచ్చా. సీఎం రేవంత్‌రెడ్డి ‘బ్రెయిన్ చైల్డ్’ చూడాలని సమిట్‌కు వచ్చా. ప్రభుత్వం ఏర్పాటు జరిగిన మొదట్లోనే హైదరాబాద్‌ను ఫిల్మ్ హబ్‌గా చేయాలని ఆయన మాతో అన్నారు. చెప్పినట్లుగానే.. సీఎం ప్రాక్టికల్‌గా ముందుకెళ్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని చిత్రపరిశ్రమలు హైదరాబాద్‌కు వచ్చేలా కృషి చేస్తామని సీఎం రేవంత్ నాతో చెప్పారు. చెప్పిన కొన్ని రోజులకే ఎందరో ప్రముఖులను హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఈ సమిట్ చూసిన తర్వాత.. సీఎం అనుకున్నది సాధిస్తారనే విశ్వాసం వచ్చింది. వినోద రంగం పరంగా ప్రపంచం తెలంగాణ వైపు చూసేలా కృషి చేస్తామని నమ్మకంగా చెప్పారు. మా సలహాలతో ముందుకు వెళ్తాం అన్నారు. అన్నట్లుగానే చేసి చూపిస్తున్నారు. సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్ లాంటి వారు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. వ్యసనాలకు అలవాటు పడ్డ యువతను వినోదం వైపు మల్లించాలి. చదువే ప్రమాణికం కాదు , డిగ్రీ లేని వారు కూడా జాతీయ స్థాయి సినిమా లు తీస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకోవాలంటూ ఇండస్ట్రీ వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఫ్యూచర్ సిటీలో స్టూడియోలకు స్థలాలు ఇస్తామని చెప్తున్నారు.. నేను దీనిపై ఆలోచన చేస్తున్నా... ఇండస్ట్రీ కూడా చేయాలి. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కి నా సపోర్ట్ ఉంటుంది’’ అని చిరంజీవి అన్నారు. -
చిన్నారికి మెగా దంపతుల ఖరీదైన గిఫ్ట్.. గోల్డ్ చైన్‌తో పాటు..!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మనశంకర వరప్రసాద్ గారు మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తోన్న ఈ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో వెంకీమామ కూడా నటించారు. ఇటీవలే తన పాత్రకు సంబంధించిన షెడ్యూల్ పూర్తయిందని సోషల్ మీడియాలో పంచుకున్నారు. మెగాస్టార్‌తో కలిసి నటించాలన్న తన కోరిక ఈ మూవీతో నెరవేరిందన్నారు.అయితే మెగాస్టార్ ఇటీవలే తన మేనేజర్ స్వామినాథ్ కుమార్తె నామకరణ వేడుకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తన సతీమణి సురేఖతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా పాపకు అలేఖ్య అని చిరంజీవి పేరు పెట్టారు. మెగాస్టార్ తమ కూతురికి పేరు పెట్టడంతో మేనేజర్ దంపతులు ఎమోషనలయ్యారు.ఈ సందర్భంగా చిరు దంపతులు తమ ప్రేమను చాటుకున్నారు. ఆ చిన్నారికి ఖరీదైన బహుమానం అందించారు. ఆ చిట్టి తల్లికి మెడకు గోల్డ్ చైన్ బహుకరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతే కాకుండా దాదాపు కోటి రూపాయల విలువైన ల్యాండ్ బహుకరించారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా మెగాస్టార్ దంపతులు తమ మేనేజర్ కుటుంబానికి జీవితంలో మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. Megastar @KChiruTweets Garu and Surekha Garu graced the naming ceremony of Manager Swamynath’s daughter today and blessed the baby girl with their warm wishes✨ pic.twitter.com/Tix55I0Dk1— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) December 5, 2025 -
చిరంజీవితో వెంకటేశ్.. రన్ టైమ్ ఇదే: అనిల్ రావిపూడి
మెగాస్టార్ చిరంజీవి, నయనతార కలిసి నటిస్తున్న సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’.. సంక్రాంతికి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో వెంకటేశ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతానికి ఫ్యాన్స్ ఫీదా అవుతున్నారు. ఇప్పటి వరకు విడుదలైన రెండు పాటలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ వస్తుంది. అయితే, ఈ మూవీలో వెంకటేశ్‌కు ఎంత సమయం పాటు స్క్రీన్ స్పేష్ ఇచ్చారనేది దర్శకుడు క్లారిటీ ఇచ్చారు.దర్శకుడు అనిల్ రావిపూడి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెంకటేష్ క్యామియో రోల్ గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. 'ఈ మూవీలో ఒక ప్రధాన పాత్ర ఉందని చిరంజీవితో నేను చెప్పాను. దీంతో వెంకటేశ్‌ను ఎంపిక చేయాలని ఆయన పట్టుబట్టారు. ఆయన ఇమేజ్‌కు తగ్గకుండా ఆ పాత్ర కోసం మరింత లోతుగా పనిచేశాను. వెంకీ దాదాపు 20 నిమిషాల పాటు తెరపై కనిపిస్తారు. చిరంజీవి, వెంకటేశ్ కలిసి నటించిన క్లైమాక్స్ సీన్స్ అభిమానులను తప్పకుండా అలరిస్తాయి. వారిద్దరూ కలిసి చేసే డ్యాన్స్, పంచే కామెడీకి ఫిదా అవుతారు' అని పంచుకున్నారు.చిరంజీవి అంటే తనకు ఎంతో ఇష్టమని వెంకటేశ్ గతంలో పంచుకున్నారు. తన ఫేవరెట్ నటుడితో కలిసి పని చేయడం ఆనందంగా ఉందన్నారు. చిరంజీవి కూడా వెంకీపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలో కలిసి నటించినందుకు థాంక్స్ అంటూనే.. వెంకీ రాకతో ఈ చిత్రానికి ప్రత్యేకత తీసుకొచ్చారని చిరు పేర్కొన్నారు. వెంకీతో కలిసి వర్క్ చేసిన పది రోజులు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. డిసెంబర్ 15 నుంచి ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రమోషన్స్లలో దూకుడు పెంచనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించారు. -
సంక్రాంతి మూవీ ఫెస్టివల్.. ఈ సారి మాములుగా ఉండదు
-
'శశిరేఖ' పూర్తి సాంగ్.. చిరు, నయన్ మ్యాజిక్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా నుంచి శశిరేఖ అంటూ సాగే పూర్తి సాంగ్‌ను విడుదల చేశారు. భీమ్స్ సిసిరోలియో సంగీతానికి చిరు, నయనతార వేసిన క్లాసిక్ స్టెప్పులకు ఫిదా కావాల్సిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ 2026 సంక్రాంతికి విడుదల కానుంది. చాలా కలర్‌ఫుల్ లోకేషన్స్‌లో ఈ సాంగ్‌ను షూట్ చేశారు. ఈ పాటకు లిరిక్స్ అనంత్ శ్రీరామ్ అందించగా.. భీమ్స్ సిసిరోలియో, మధుప్రియ ఆలపించారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో గోదావరి గట్టు సాంగ్‌కు ఎంత క్రేజ్ వచ్చిందో ఈ పాటకు కూడా అంతే క్రేజ్ రావచ్చు. ఈ మూవీలో చిరంజీవి–నయనతార భార్యాభర్తలుగా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘మీసాల పిల్ల..’పాట ఏ స్థాయిలో శ్రోతలను అలరించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇందులో వెంకటేశ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. -
జోరుగా... హుషారుగా...
ఆడుతుపాడుతూ పని చేస్తుంటే అలుపూ సొలుపేం ఉండదు అంటూ... బిజీ బిజీగా షూటింగ్ చేసేస్తున్నారు స్టార్స్. జోరుగా షూటింగ్స్ జరుగుతుంటే స్టూడియోలు కూడా కళకళలాడుతున్నాయి. కొన్ని స్టూడియోస్‌లో కలర్‌ఫుల్ సెట్స్ కనువిందు చేస్తున్నాయి. సీన్‌కి తగ్గట్టు సహజమైన లొకేషన్స్‌లో మరికొన్ని షూటింగ్స్ జరుగుతున్నాయి. ఇక... ఏ స్టార్ ఎక్కడెక్కడ షూటింగ్ చేస్తున్నారో చూద్దాం...దౌలతాబాద్ టు అన్నపూర్ణ... చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. ‘పండక్కి వస్తున్నారు’ అనేది ఉపశీర్షిక. నయనతార హీరోయిన్ . ఈ సినిమాలో హీరో వెంకటేశ్ ముఖ్యపాత్రపోషిస్తున్నారు. కేథరిన్, సచిన్ ఖేడేకర్ ఇతరపాత్రల్లో నటిస్తున్నారు. వెంకటేశ్ హీరోగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (2025) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రం కీలక షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. హైదరాబాద్‌లోని దౌలతాబాద్ అసెంబ్లీ పబ్‌లో రెండు రోజులపాటు పలు సన్నివేశాల చిత్రీకరణ జరిపారు. ఆ తర్వాత తిరిగి అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ ఆరంభించారు. ఈ సినిమా కోసం వేసిన ప్రత్యేకమైన సెట్లో చిరంజీవితోపాటు చిత్ర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు అనిల్ రావిపూడి. చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి నటిస్తున్న పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం ఇది.ఈ మూవీలో చిరంజీవి–నయనతార భార్యాభర్తలుగా నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘మీసాల పిల్ల..’పాట ఏ స్థాయిలో శ్రోతలను అలరించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ మూవీలో తనపాత్రకు సంబంధించిన చిత్రీకరణ బుధవారంతో పూర్తయినట్లు వెంకటేశ్ పేర్కొన్నారు. ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కోఠిలో... వరుసపాన్ ఇండియా చిత్రాలతో జెట్ స్పీడ్‌లో దూసుకెళుతున్నారు ప్రభాస్. ప్రస్తుతం ఆయన మారుతి దర్శకత్వంలో ‘ది రాజాసాబ్’, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’, హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజి’ వంటి ప్రాజెక్ట్స్‌తో బిజీ బిజీగా ఉన్నారు. ‘అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘స్పిరిట్’. ఈ మూవీలో ‘యానిమల్’ మూవీ ఫేమ్ త్రిప్తీ దిమ్రి హీరోయిన్. సీనియర్ నటి కాంచన, ప్రకాశ్‌రాజ్, బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ ఇతరపాత్రలుపోషిస్తున్నారు.భద్రకాళి పిక్చర్స్ప్రోడక్షన్ ్స, టీ–సిరీస్ బ్యానర్స్‌పై ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్, కృషణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ తొలిసారి ఓపోలీసాఫీసర్గా కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని కోఠిలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో ప్రభాస్పాల్గొనడం లేదు. అయితే ఈ చిత్రంలోని ప్రధాన తారాగణంపై సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు సందీప్ రెడ్డి. నాన్ స్టాప్‌గా జరగనున్న ఈ మూవీ షూటింగ్లో తర్వాతి షెడ్యూల్లో ప్రభాస్ జాయిన్ అవుతారట.ప్రభాస్ మొదటిసారిపోలీసాఫీసర్గా నటిస్తుండటం.. ‘అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్’ వంటి హ్యాట్రిక్ మూవీస్ తర్వాత సందీప్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండటంతో ‘స్పిరిట్’ సినిమాపై ఇటు ఇండస్ట్రీలో ఇటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు డాన్ లీ విలన్‌గా నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ‘స్పిరిట్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తొమ్మిది భాషల్లో విడుదల కానుంది.ఆర్ఎఫ్సీలో... ‘ఆర్ఆర్ఆర్’ (2022) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ (వర్కింగ్ టైటిల్). మహేశ్‌బాబు హీరోగా అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రంలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఈ సినిమా కోసం మహేశ్‌బాబు ΄÷డవాటి హెయిర్ స్టైల్, గెడ్డంతో ప్రత్యేకంగా మేకోవర్ అయిన సంగతి తెలిసిందే.అమేజాన్ అడవుల నేపథ్యంలో భారీ అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ మూవీ కోసం ఆర్ఎఫ్సీలో ప్రత్యేకంగా సెట్ వేశారు మేకర్స్. ప్రస్తుతం అక్కడ మహేశ్‌బాబుతోపాటు ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట రాజమౌళి. మహేశ్‌బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ చిత్రాన్ని 120 దేశాల్లో విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. నవంబరులో నిర్వహించిన ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ గ్లోబల్ ట్రాటర్ ఈవెంట్ తర్వాత ఈ సినిమాపై అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి. దయాదాక్షిణ్యం లేని, కరడుగట్టిన, కమాండింగ్ ప్రతినాయకుడు కుంభపాత్రలో పృథ్విరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు. ఆయన లుక్‌కి మంచి స్పందన వచ్చింది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి ఈ నినిమాకి సంగీతం అందిస్తున్నారు. ముచ్చింతల్‌లో... నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ (2023) వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్లో రూపొందుతోన్న ద్వితీయ చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్ఎల్వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. హిట్ కాంబోలో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలున్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో జరుగుతోంది. ఈ మూవీ కోసం ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో జరుగుతున్న ఈ షెడ్యూల్లో నానితోపాటు చిత్రంలోని ప్రధాన తారాగణంపాల్గొంటోంది. ఈ చిత్రంలో నానిపాత్ర పేరు జడల్. ఇప్పటికే విడుదల చేసిన స్టిల్‌లో నాని రెండు జడలు వేసుకుని, పక్కా మాస్ లుక్‌లో కనిపించగా మంచి స్పందన వచ్చింది. నాని లుక్, స్టోరీ, టేకింగ్... ఇలా ప్రతిదీ వైవిధ్యంగా ఉండేలా తెరకెక్కిస్తున్నారట శ్రీకాంత్ ఓదెల. ఈ సినిమాని తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో 2026 మార్చి 26న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.అయితే ఆ తేదీకి ఈ మూవీ రిలీజ్ ఉండకపోవచ్చనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘పెద్ది’ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రామ్‌చరణ్ పుట్టినరోజు కానుకగా మార్చి 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ‘ది ΄్యారడైజ్’ చిత్రం విడుదల ఉంటుందా? లేదా? లేకుంటే మరో తేదీ ఫిక్స్ అవుతుందా? అన్నది ఆసక్తిగా మారింది. ఈ విషయాలపై స్పష్టత రావాలంటే వేచి చూడాలి. దండు మైలారంలో... విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘వీడీ 14’ (వర్కింగ్ టైటిల్). ‘ది ఎండ్, టాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్’ చిత్రాల ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ దేవరకొండ–రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘టాక్సీవాలా’ 2018 నవంబరు 17న విడుదలై, మంచి హిట్‌గా నిలిచింది. ‘టాక్సీవాలా’ వంటి హిట్ మూవీ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తోన్న ద్వితీయ చిత్రం ‘వీడీ 14’. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని దండు మైలారంలో జరుగుతోంది. 19వ శతాబ్దం నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక ఘటనల ఆధారంగా భారీపాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ఈ సినిమా రూపొందుతోంది. బ్రిటీష్‌పాలన కాలం నేపథ్యంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీని ఇప్పటివరకూ ఎవరూ తెరకెక్కించని కథాంశంతో పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దుతున్నారట రాహుల్ సంకృత్యాన్.దండుమైలారంలో ఈ మూవీ చిత్రీకరణ జరుగుతోంది. పతాక సన్నివేశాల్లో విజయ్ దేవరకొండతోపాటు ఇతర నటీనటులుపాల్గొంటున్నారని సమాచారం. ఈ సినిమాలో హాలీవుడ్ దిగ్గజ నటుడు (‘మమ్మీ’ సినిమా విలన్) ఆర్నాల్డ్ వస్లూ నటిస్తున్నారనే వార్తలు వచ్చాయి. బ్రిటిష్ అధికారిపాత్రలో ఆర్నాల్డ్ వస్లూ నెగటివ్ క్యారెక్టర్లో నటిస్తుండటంతో వీరి మధ్య భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ సినిమా 2026లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో... వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వీటీ 15’ (వర్కింగ్ టైటిల్). ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా, ఏక్ మినీ కథ’ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన మేర్లపాక గాంధీ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రితికా నాయర్ హీరోయిన్గా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్ ్స, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్స్‌పై ‘వీటీ 15’ రూపొందుతోంది. ఇండో కొరియన్ హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి సమీపంలో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుపుకుంటోంది.హీరో హీరోయిన్లతోపాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట దర్శకుడు. వరుణ్ కోసం తనదైన శైలిలో అద్భుతమైన వినోదాత్మక కథను సిద్ధం చేశారు మేర్లపాక గాంధీ. గత కొన్నాళ్లుగా వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తూ వస్తోన్న వరుణ్... జస్ట్ ఫర్ ఛేంజ్ అన్నట్లు ఈసారి ఆడియన్స్‌కి వినోదాలు అందించేందుకు సిద్ధమయ్యారు. ఇదిలా ఉంటే... అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా వేసిన సెట్లో ఇటీవల ఓ ప్రత్యేక సాంగ్‌ని చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ‘జాంబి రెడ్డి, బంగార్రాజు’ చిత్రాల ఫేమ్ దక్షా నగార్కర్, వరుణ్ తేజ్‌లపై ఈపాట తెరకెక్కించారు. ఈ సినిమాకు ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మరి... అదే టైటిల్‌ని ఫిక్స్ చేస్తారా? లేకుంటే మరేదైనా నిర్ణయిస్తారా? అన్నది వేచి చూడాలి. తుక్కుగూడలో... సాయిదుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల కీలకపాత్రలుపోషిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్పై ‘హను–మాన్’ (2024) వంటిపాన్ ఇండియన్ హిట్ అందుకున్న కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోపాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది.ఇదిలా ఉంటే... ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని తుక్కుగూడలో జరుగుతోంది. అక్కడ ప్రత్యేకంగా వేసిన సెట్లో గత కొన్నాళ్లు నుంచి లాంగ్ షెడ్యూల్ జరుపుతున్నారు మేకర్స్. ఈ షెడ్యూల్లో హీరో, హీరోయిన్లతోపాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట రోహిత్. అక్టోబరు 15న సాయి దుర్గాతేజ్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ‘అసుర ఆగమన’ పేరుతో ఈ మూవీ గ్లింప్స్‌ను విడుదల చేయగా, మంచి స్పందన వచ్చింది.భూత్ బంగ్లాలో... అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రదర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ΄÷డవాటి జుట్టు, గెడ్డంతో ఫుల్ మాస్ లుక్‌లోకి మారిపోయారు అఖిల్. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని భూత్ బంగ్లాలో జరుగుతోంది. శరవేగంగా సాగుతోన్న ఈ చిత్రీకరణలో హీరో, హీరోయిన్లతోపాటు చిత్రంలోని ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారని తెలిసింది. రాయలసీమ నేపథ్యంలో సాగే రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ఏప్రిల్ 8న అఖిల్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌కి మంచి స్పందన వచ్చింది. ‘‘గతాన్ని తరమడానికిపోతా... మా నాయన నాకో మాట సెప్పినాడు... పుట్టేటప్పుడు ఊపిరి ఉంటాది రా... పేరు ఉండదు, అట్నేపోయేటప్పుడు ఊపిరుండదు... పేరు మాత్రమే ఉంటాది. ఆ పేరు ఎట్టా నిలబడాలంటే...’’ అంటూ రాయలసీమ యాసలో అఖిల్ చెప్పిన డైలాగ్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. అలాగే ఈ మూవీపై మంచి క్రేజ్ నెలకొంది. రామానాయుడులో క్లైమాక్స్... ‘పెదకాపు’ (2023) చిత్రం ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న రెండో చిత్రం ‘నాగబంధం’. ‘ది సీక్రెట్ ట్రెజర్’ అన్నది ట్యాగ్‌లైన్ . నిర్మాత అభిషేక్ నామా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. నభా నటేశ్ ఐశ్వర్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో జగపతిబాబు, జయప్రకాశ్, మురళీ శర్మ, బీఎస్ అవినాష్ కీలకపాత్రలుపోషిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని కిశోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ రామానాయుడు స్టూడియోలో జరుగుతోంది.పతాక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ‘‘పాన్ ఇండియా ఎపిక్ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘నాగబంధం’. నానక్‌రామ్‌గూడలోని రామానాయుడు స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్లో క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. కేవలం క్లైమాక్స్ సెట్ కోసమే రూ.20 కోట్లు ఖర్చు చేశాం. ఓ మహద్వారం చుట్టూ రూపొందించిన ఈ క్లైమాక్స్‌లోని భావోద్వేగం, డ్రామాను విజువల్‌గా అద్భుతంగా చూపించేలా ఆర్ట్ డైరెక్టర్ అశోక్ కుమార్ ఈ సెట్‌ని డిజైన్ చేశారు.థాయ్ స్టంట్ మాస్టర్ కేచా ఖాంఫాక్‌డీ అద్భుతమైన టేకింగ్ యాక్షన్ కొరియోగ్రఫీతో సీక్వెన్స్‌ని గ్రాండ్‌గా తీర్చిదిద్దితున్నారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఇక ఈ సినిమా కోసంప్రోడక్షన్ డిజైనర్ అశోక్ కుమార్ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన కేరళలోని అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్లో విరాట్ కర్ణతోపాటు 5000 మంది నృత్య కళాకారులతో ఓపాటని చిత్రీకరించడం విశేషం. పై చిత్రాలే కాదు.. మరికొన్ని సినిమాల షూటింగ్స్ కూడా హైదరాబాద్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌లు జరుపుకుంటున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
'శశిరేఖ' కోసం చిరంజీవి స్టెప్పులు
మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈ మూవీ నుంచి కొద్దిరోజుల క్రితం విడుదలైన 'మీసాల పిల్ల' సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే, తాజాగా 'శశిరేఖ..' అంటూ కొనసాగే రెండో పాటకు సంబంధించిన ప్రోమోను షేర్ చేశారు. డిసెంబర్ 8న పూర్తి పాటను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పాటకు లిరిక్స్ అనంత్ శ్రీరామ్ అందించగా.. భీమ్స్ సిసిరోలియో, మధుప్రియ ఆలపించారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో గోదావరి గట్టు సాంగ్‌ను మధుప్రియ ఆలపించిన విషయం తెలిసిందే. -
చిరంజీవి & శ్రీకాంత్ న్యూ మూవీ..ఫ్యాన్స్ కోసం క్రేజీ అప్డేట్!
-
వచ్చే సంక్రాంతికి చిరుతో వెంకటేష్ మల్టీస్టారర్..
-
నామకరణ వేడుకలో చిరంజీవి దంపతులు.. వీడియో వైరల్
మెగాస్టార్ చిరంజీవి తన మేనేజర్ కుమార్తె నామకరణ వేడుకకు హాజరయ్యారు. సతీమణి సురేఖతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మేనేజర్ స్వామినాథ్ కుమార్తెకు మెగాస్టార్ పేరు పెట్టారు. చిన్నారికి అలేఖ్య అని నామకరణం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇక సినిమాల విషయానికొస్తే మెగాస్టార్ ప్రస్తుతం అనిల్ రావిపూడితో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మనశంకర వరప్రసాద్‌గారు వచ్చే ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది. ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటించింది. ఇప్పటికే విడుదలైన మీసాల పిల్ల సాంగ్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో హీరో వెంకటేశ్ సైతం కీలక పాత్రలో నటించారు. దీంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతికి వస్తున్నాం మూవీతో సూపర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి మరో బ్లాక్‌బస్టర్ తన ఖాతాలో వేసుకుంటాడో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. Megastar @KChiruTweets Garu and Surekha Garu graced the naming ceremony of Manager Swamynath’s daughter today and blessed the baby girl with their warm wishes✨ pic.twitter.com/Tix55I0Dk1— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) December 5, 2025 -
శశిరేఖకి వేళాయె
‘ఓయ్ మీసాల పిల్ల... నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలె పిల్ల...’ అంటూ ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం నుంచి విడుదలైన తొలి పాట ఎంత బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందో తెలిసిందే. చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు.నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో హీరో వెంకటేశ్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమా 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘శశిరేఖ...’ అంటూ సాగే ద్వితీయ పాట ప్రోమోను ఈ నెల 6న, పూర్తి వీడియో సాంగ్‌ని 8న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. -
500 మంది డ్యాన్సర్స్‌తో చిరు, వెంకీ డ్యాన్స్
చిరంజీవి, వెంకటేశ్ కలిసి చేస్తున్న సెలబ్రేషన్ సాంగ్ చిత్రీకరణ మొదలైంది. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకరవరప్రసాద్‌గారు’. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా, వెంకటేశ్, క్యాథరిన్, వీటీవీ గణేశ్ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో వేసిన ఓ సెట్లో జరుగుతోంది. చిరంజీవి, వెంకటేశ్‌తోపాటు 500 మందికి పైగా డ్యాన్సర్స్పాల్గొంటుండగా ఓ స్టైలిష్ మాస్ డ్యాన్స్ సాంగ్ షూట్‌ను ఆరంభించారు.సంగీతదర్శకుడు భీమ్స్ సిసిరోలియో స్వరపరచిన ఈపాటకు పొలకి విజయ్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ‘‘చిరంజీవి, వెంకటేశ్ కలిసి చేస్తున్న ఈపాట ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు అసలు సిసలైన విందులా ఉంటుంది. అలాగే చిరంజీవి–నయనతారలపై చిత్రీకరించిన ఓ మెలోడియస్ రొమాంటిక్ సాంగ్‌ను త్వరలోనే రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ తెలిపింది. అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. -
డేట్ ఫిక్స్ చేసుకున్న సినిమాలు
తెలుగు చిత్ర పరిశ్రమకు అతి పెద్ద పండగ ఏది అంటే సగటు సినిమా ప్రేక్షకుడు సైతం టక్కున సంక్రాంతి అని చెబుతాడు. చిత్రపరిశ్రమకే కాదు... తెలుగు ప్రేక్షకులకు కూడా అత్యంత ముఖ్యమైన పండగ అంటే సంక్రాంతి. ఈ పండగ సమయంలో కుటుంబ సమేతంగా సినిమాలకు వెళ్లి సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు ప్రేక్షకులు. ఈ సమయంలో తమ సినిమాలను రిలీజ్ చేస్తే మంచి వసూళ్లు రాబట్టుకోవచ్చన్నది మేకర్స్ ఆలోచన. సంక్రాంతి సమయంలో దాదాపు అన్ని సినిమాలకు ప్రేక్షకాదరణ ఉంటుంది. అయినప్పటికీ ఫలానా సినిమా బాగుందనే టాక్ వచ్చిందంటే ఇక బ్లాక్‌బస్టరే. అందుకే సంక్రాంతికి తమ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు హీరోలు, దర్శకులు, నిర్మాతలుపోటీ పడుతుంటారు. స్టార్ హీరోల దగ్గర నుంచి యువ హీరోల వరకూ సంక్రాంతి బరిలో తమ సినిమాలను నిలిపేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. ఈ కోవలోనే 2026 సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రసవత్తరపోరు నెలకొంది. చిరంజీవి, ప్రభాస్, రవితేజ, శర్వానంద్, నవీన్ పొలిశెట్టి చిత్రాలు పండగకి విడుదల కానున్నాయి. మరోవైపు విజయ్, శివ కార్తికేయన్ వంటి తమిళ హీరోలు సైతం తెలుగు హీరోలతో పాటు సంక్రాంతి బరిలో నిలుస్తున్నారు. ఈ సంక్రాంతి బరిలో నిలిచేదెవరు? ప్రేక్షకుల మనసులు గెలిచేది ఎవరు? బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించే సినిమా ఏది? అనే ఆసక్తి ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో నెలకొంది. ఇక ఈ సంక్రాంతికి సందడి చేయనున్న సినిమాలపై ఓ లుక్కేద్దాం... డబుల్ ఫెస్టివల్ 2026 సంక్రాంతికి అందరి హీరోల కంటే ముందుగా కర్చీఫ్ వేశారు చిరంజీవి. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’. ‘పండగకి వస్తున్నారు’ అన్నది ట్యాగ్‌లైన్. ఈ ఏడాది వెంకటేశ్ హీరోగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో బిగ్టెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి ‘మన శంకర వరప్రసాద్‌గారు’కి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా ఆరంభం నుంచే 2026 సంక్రాంతి లక్ష్యంగా షూటింగ్ ΄్లాన్ చేసి, శరవేగంగా చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా, కేథరిన్ కీలక పాత్రపోషిస్తున్నారు.అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరో వెంకటేశ్ ముఖ్యమైన పాత్రపోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరు స్టార్ హీరోలైన చిరంజీవి, వెంకటేశ్ కలిసి ఒకే సినిమాలో కనిపించనుండటంతో ‘మన శంకర వరప్రసాద్‌గారు’ పై ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. ట్రేడ్ వర్గాల్లోనూ మంచి జోష్ నెలకొంది. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘మీసాల పిల్ల...’ పాట ఏ స్థాయిలో హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.‘‘బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’. వినోదం, భావోద్వేగాలు, మాస్ ఎలిమెంట్స్ కలగలిపిన ఈ సినిమా సంక్రాంతి పండగ సీజన్‌కు పర్ఫెక్ట్ ట్రీట్. పైగా చిరంజీవి–వెంకటేశ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించనుండటం అభిమానులకు డబుల్ ఫెస్టివల్. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో వేసిన భారీ సెట్లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది’’ అని చిత్రబృందం తెలిపింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నప్పటికీ తేదీ మాత్రం ఇంకా ఖరారు కాలేదు. రాజా సాబ్ ఫిక్స్ వరుస పాన్ ఇండియా సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజా సాబ్’. పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఫైనల్‌గా సంక్రాంతి రేసులో నిలిచింది. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 5న విడుదల కావాల్సి ఉండగా సంక్రాంతికి వాయిదా పడింది.భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని సంక్రాంతి సీజన్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది మేకర్స్ ఆలోచన. అందుకే ‘ది రాజా సాబ్’ని జనవరి 9న విడుదల చేయనున్నట్లు టీజీ విశ్వప్రసాద్ ప్రకటించారు. ప్రభాస్‌కి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ప్రత్యేకించి ‘ది రాజా సాబ్’ నుంచి ఇప్పటికే విడుదలైన ప్రభాస్ వింటేజ్ లుక్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ మూవీపోస్టర్స్, టీజర్, గ్లింప్స్‌తో పాటు తాజాగా విడుదలైన పాటకి కూడా అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. జూలై 29న ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన సంజయ్ దత్ ప్రత్యేకపోస్టర్కి కూడా మంచి స్పందన వచ్చింది. పైగా ప్రభాస్ నటిస్తున్న తొలి హారర్, కామెడీ మూవీ కావడంతో ఈ మూవీపై ట్రేడ్ వర్గాల్లో, ఇండస్ట్రీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో ఇప్పటికే ఫుల్ క్రేజ్ నెలకొంది. ‘‘మా పీపుల్స్ మీడియా నుంచి వస్తున్న బిగ్గెస్ట్ ఫిల్మ్ ‘ది రాజా సాబ్’. ప్రభాస్‌గారిని ‘బుజ్జిగాడి’ సినిమా స్టైల్లో వింటేజ్ లుక్‌లో చూపిస్తున్నాం. 40 నిమిషాల క్లైమాక్స్ ఎపిసోడ్ ఈ మూవీకి హైలైట్‌గా నిలుస్తుంది’’ అని చిత్రనిర్మాణ సంస్థ పేర్కొంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి మాస్ మహారాజా రవితేజ మరోసారి తన ఫ్యాన్స్‌కి, ప్రేక్షకులకు సంక్రాంతి కానుకగా తనదైన శైలిలో వినోదం అందించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ‘నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి, ఆడవాళ్ళు మీకు జోహార్లు’ వంటి చిత్రాలను తెరకెక్కించిన కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి ఇటీవల ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే టైటిల్‌ని ఖరారు చేసి, టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. అంతేకాదు... ఈ మూవీని 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందకు తీసుకు రానున్నట్లు తెలిపారు. ‘నా జీవితంలోని ఇద్దరు ఆడవాళ్లు రెండు ప్రశ్నలు అడిగారు... సమాధానం కోసం చాలా ప్రయత్నించాను.గూగుల్, చాట్ జీపీటీ, జెమినీ, ఏఐ... ఇలా అన్నింటినీ అడిగాను.. బహుశా వాటికి పెళ్లి కాకపోవడం వల్ల ఆన్సర్ చెప్పలేకపోయాయేమో. అనుభవం ఉన్న మగాళ్లని ముఖ్యంగా మొగుళ్లను అడిగాను. ఆశ్చర్యపోయారే త΄్పా ఆన్సర్ మాత్రం ఇవ్వలేకపోయారు. అలాంటి ప్రశ్న మిమ్మల్ని ఏ ఆడవాళ్లు అడగకూడదని, పెళ్లయిన వాళ్లకి నాలాంటి పరిస్థితి ఎదురవకూడదని కోరుకుంటూ మీ ఈ రామ సత్యనారాయణ చెప్పేది ఏమిటంటే... భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అంటూ రవితేజ చెప్పిన డైలాగ్స్ గ్లింప్స్‌లో ఆకట్టుకున్నాయి. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ టైటిల్‌ని బట్టి చూస్తే ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉండబోతోందని అర్థమవుతోంది.సున్నితమైన అంశాలను తనదైన భావోద్వేగాలతో తెరకెక్కించే కిశోర్ తిరుమల ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో భార్య, భర్తల మధ్య జరిగే ఫన్నీ ఇన్సిడెంట్స్ను వినోదాత్మకంగా చూపించబోతున్నట్టు తెలుస్తోంది. ‘‘ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిశోర్ తిరుమల టచ్‌తో ఈ చిత్రం ఉంటుంది. రవితేజ చాలా రోజుల తర్వాత ఓ ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎంటర్టైనర్ చేయడం ప్రేక్షకులకు రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. ఇందులో వినోదంతో పాటు మనసుని హత్తుకునే భావోద్వేగాలు కూడా ఉంటాయి. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని హై ్రపొడక్షన్ వాల్యూస్‌తో నిర్మిస్తున్నారు’’ అని చిత్రయూనిట్ తెలిపింది. నారీనారీ నడుమ మురారి హీరో శర్వానంద్ మరోసారి సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 2017లో ‘శతమానం భవతి’ సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచిన ఆయన ఘన విజయం అందుకున్నారు. ఇప్పుడు ‘నారి నారి నడుమ మురారి’ చిత్రంతో మరోసారి సంక్రాంతికి ఆడియన్స్ ముందుకొస్తున్నారు శర్వానంద్. శ్రీవిష్ణుతో ‘సామజవరగమన’ (2023) వంటి విజయవంతమైన సినిమా తెరకెక్కించిన రామ్ అబ్బరాజు ‘నారి నారి నడుమ మురారి’కి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సాక్షీ వైద్య, సంయుక్త హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఏకే ఎంటర్టైన్మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. షూటింగ్ ఆలస్యం వల్ల ఇప్పటికే పలుమార్లు విడుదల వాయిదా పడిన ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘‘శర్వానంద్ నటిస్తున్న ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘నారి నారి నడుమ మురారి’. ఇప్పటికే విడుదలైన మా మూవీ ఫస్ట్ లుక్, ప్రమోషనల్‌పోస్టర్లు బజ్ క్రియేట్ చేశాయి. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ సింగిల్ ‘దర్శనమే...’ కూడా చార్ట్‌బస్టర్‌గా నిలిచింది.దీపావళి సందర్భంగా సంప్రదాయ పంచె కట్టుతో ఉన్న శర్వానంద్ లుక్‌ని విడుదల చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది. గతంలో ‘శతమానం భవతి’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందించిన శర్వానంద్‌కి సంక్రాంతి లక్కీ సీజన్ అని చెపొ్పచ్చు. అందుకే మా ‘నారి నారి నడుమ మురారి’తో కుటుంబ ప్రేక్షకులను అలరించడంతో పాటు మరో హిట్‌ని ఆయన తన ఖాతాలో వేసుకుంటారనే నమ్మకం ఉంది. జ్ఞానశేఖర్, యువరాజ్ విజువల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి’’ అని చిత్రయూనిట్ తెలిపింది. అనగనగా ఒక రాజు... ‘జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ వంటి సినిమాలతో ప్రేక్షకులకు తనదైన శైలిలో వినోదాలు పంచిన నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న మరో కామెడీ చిత్రం ‘అనగనగా ఒక రాజు’. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2026 జనవరి 14న విడుదల కానుంది. ‘అనగనగా ఒక రాజు’ చిత్రం పూర్తి స్థాయి వినోదాత్మకంగా రూపొందుతోంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతోంది. మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ‘భీమవరం బల్మా..’ అంటూ సాగే మొదటి పాట విడుదల వేడుకని భీమవరంలో ఘనంగా నిర్వహించారు.సంక్రాంతి పండగను కాస్త ముందుగానే తీసుకొచ్చినట్టుగా నవీన్ పొలిశెట్టి వేదిక వద్దకు ఎద్దుల బండిపై రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే నవీన్, మీనాక్షి కలిసి ‘భీమవరం బల్మా...’ పాటకు వేదికపై డ్యాన్స్ చేయడం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పైగా ‘భీమవరం బల్మా...’ పాటతో నవీన్ పొలిశెట్టి మొదటిసారి గాయకుడిగా మారడం మరింత విశేషం. ‘‘ఒక బైక్ ప్రమాదంలో గాయాలు కావడం వల్ల నేను కొంతకాలం షూటింగ్‌కి దూరమయ్యాను.ఆ సమయంలో ప్రేక్షకులకు ఎలా వినోదం అందించాలని ఆందోళన చెందాను. మీ అందరి ప్రేమ, అభిమానం వల్ల కోలుకొని ‘అనగనగా ఒక రాజు’ సినిమా షూటింగ్ చేసి, పండగకు మీ ముందుకు రాబోతున్నాను. ఈ సినిమాలో వినోదం, మాస్, కమర్షియల్ సాంగ్స్, అద్భుతమైన ప్రేమకథ వంటి అంశాలన్నీ ఉంటాయి. మీనాక్షి కామెడీ టైమింగ్ చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ‘అనగనగా ఒక రాజు’ సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. జనవరి 14న థియేటర్లలో అందరం హాయిగా నవ్వుకుందాం’’ అని నవీన్ పొలిశెట్టి పేర్కొన్నారు.ఈ సంక్రాంతికి తెలుగు హీరోల మధ్యపోటీ తీవ్రంగా ఉంది. పాంచ్ పటాకా అంటూ ఐదుగురు హీరోలు సంక్రాంతి రేసులో నిలవనుండటం ఒక విశేషం అయితే... మరోవైపు విజయ్, శివ కార్తికేయన్ వంటి తమిళ హీరోలు కూడా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తెలుగులో సంక్రాంతి ఎంత పెద్ద పండగో... తమిళ్లో పొంగల్ కూడా అంత పెద్ద ఫెస్టివల్. అందుకే విజయ్ ‘జన నాయగన్’, శివ కార్తికేయన్ ‘పరాశక్తి’ సినిమాలు పొంగల్ బరిలో నిలుస్తున్నాయి. ఈ సినిమాలు ఎలాగూ తెలుగులోనూ విడుదలవుతాయని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ⇒ తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న చివరి తమిళ చిత్రం ‘జన నాయగన్’ (తెలుగులో జన నాయకుడు). హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా విజయ్ కెరీర్లో 69వ మూవీ. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కేవీఎన్ ్రపొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 9న విడుదల కానుంది. తమిళ రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ ‘జన నాయగన్’ తర్వాత సినిమాల నుంచి విరామం తీసుకుంటుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. ‘‘విజయ్ చివరి చిత్రంగా ‘జన నాయగన్’ రాబోతోంది. విజయ్ చేసిన సేవా కార్యక్రమాలు, సినీ పరిశ్రమలో సాధించిన విజయాలకు చిహ్నంగా ఈ టైటిల్ ఉంటుంది. ఈ మూవీ విజయ్‌కి ఫేర్‌వెల్‌గా ఉండబోతోంది. ఆయన అభిమానులు ఈ సినిమాను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేలా ఉంటుంది. అనిరుధ్ సంగీతం ఈ చిత్రానికి ప్లస్ అవుతుంది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ⇒ శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పరాశక్తి’. ‘గురు, ఆకాశమే నీ హద్దురా’ చిత్రాల ఫేమ్ సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. రవి మోహన్, అథర్వ, శ్రీలీల ఇతర ప్రధాన పాత్రలుపోషిస్తున్నారు. రెడ్ జెయింట్ మూవీస్ ఉదయనిధి సమర్పణలో ఆకాశ్ భాస్కరన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ జనవరి 14న సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు టీజర్‌కి మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘రత్నమాల...’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. శివ కార్తికేయన్, శ్రీలీలపై చిత్రీకరించిన ఈ మెలోడీకి మంచి స్పందన వచ్చింది. జనవరి టు జూన్... ‘ఆర్ఆర్ఆర్’, ‘దేవర’ వంటి వరుస విజయాల తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్). ‘కేజీఎఫ్, సలార్’ చిత్రాల తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. 2024లో పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 2025లో ్రపారంభమైంది.ఈ సినిమా కోసం ఎన్టీఆర్ బాగా బరువు తగ్గడంతో పాటు పూర్తి స్థాయి గడ్డంతో స్టన్నింగ్ లుక్స్‌లో దర్శనమిస్తున్నారు. ఈ చిత్రంలో ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే పవర్ఫుల్ యాక్షన్ సన్నివేశాల కోసమే ఆయన ఈ లుక్‌లోకి మారారనే వార్తలు వినిపించాయి. ఇప్పటివరకు చూడనటువంటి మాస్ లుక్‌లో ఎన్టీఆర్‌ని ప్రెజంట్ చేయనున్నారట ప్రశాంత్ నీల్. ఈ సినిమాకి ‘డ్రాగన్’ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు ఫిల్మ్‌నగర్ టాక్.ఇదిలా ఉంటే... తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమాల్లో తొలుత ప్రకటించిన చిత్రం కూడా ఇదే. అయితే ఆ తర్వాత ఈ చిత్రం సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది. 2026 జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ఈ సినిమా విడుదల కాస్తా జనవరి నుంచి జూన్‌కి మారింది. – డేరంగుల జగన్ మోహన్ -
చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌కు కేంద్రం గుడ్‌న్యూస్
చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ (CCT)కు కేంద్ర హోంశాఖ గుడ్‌న్యూస్ తెలిపింది. సుమారు 27 ఏళ్లుగా ఛారిటబుల్ ట్రస్టు కింద బ్లడ్ బ్యాంక్‌తో పాటు ఐ బ్యాంకు కూడా చిరంజీవి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ (Chiranjeevi Charitable Trust)ను ఎఫ్సీఆర్ఏ కింద నమోదుకు కేంద్ర హోంశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకనుంచి విదేశీ విరాళాలు తీసుకునే వెసులుబాటును ట్రస్టుకు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కొద్దిరోజుల క్రితమే విదేశీ విరాళాల నియంత్రణ చట్టం 2010 ప్రకారం ఎఫ్సీఆర్ఏ అనుమతి తీసుకోవాలని నిబంధనల్లో మార్పు చేశారు. దీంతో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఎఫ్సీఆర్ఏ అనుమతి కోసం కేంద్రాన్ని కోరింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఆమోద ముద్రవేసినట్టు తెలుస్తోంది. -
ఏఐ వీడియో.. ప్రభాస్-అనుష్క పెళ్లి.. చిందులేసిన బన్నీ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)..ఇప్పుడు ప్రపంచాన్ని కింగ్‌లా శాసిస్తుంది. విద్య, వైద్య.. ఇలా అన్ని రంగాల్లోనూ ఇది ప్రవేశించింది. సాధారణ ప్రజలు కూడా వారి దైనందిన జీవితంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఏఐ రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో సాధ్యం కానిది ఏమున్నది అన్నట్లుగా తమ ఆలోచనలకు నెటిజన్లు రూపమిస్తున్నారు. తాము కోరుకున్నది నిజజీవితంలో కాకపోతే.. ఏఐ రూపంలో అది నెరవేర్చుకుంటున్నారు. ముఖ్యంగా తమ అభిమాన నటీనటులు విషయంలో ఈ టెక్నాలజీని బాగా వాడేస్తున్నారు. తమ ఫేవరేట్ హీరోలను ఎలా చూడాలనుకుంటున్నారు..అలా ఫోటోలను ఎడిట్ చేస్తున్నారు. అంతేకాదు తమకు నచ్చిన హీరోహీరోయిన్లకు ఈ టెక్నాలజీతో పెళ్లిళ్లు కూడా చేస్తున్నారు. గతంలో ఈ టెక్నాలజీ ఉపయోగించి ప్రభాస్‌కి పెళ్లి జరిగి..పిల్లలు పుడితే వాళ్లు ఎలా ఉంటారనేది చూపించారు. ఆ ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. తాజాగా ఏఐ టెక్నాలజీతో వెండితెరపై సూపర్ హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న ప్రభాస్-అనుష్కలకు పెళ్లి జరిపించారు. అంతేకాదు ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్ స్టార్ హీరోలంతా తలో ఓ పని చేశారు.ప్రభాస్-అనుష్కల పెళ్లికి నాగార్జున-నాని సన్నాయి వాయించగా.. అల్లు అర్జున్, రవితేజ చిందులేశారు. ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటలు చేయగా..గోపిచంద్ వడ్డించాడు. చిరంజీవి, పవన్ కల్యాణ్ బంతి భోజనం చేశారు. కాజల్, తమన్నా పెళ్లి మండపంలో డ్యాన్స్ చేస్తుండగా.. మహేశ్ బాబు, వెంకటేశ్ పంచ కట్టుతో పెళ్లికి హాజరయ్యారు. ప్రభాస్-అనుష్కల పెళ్లి ..అందరూ ఆహ్వానితులే అంటూ ఓ నెటిజన్ పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఇది వాస్తవం అయితే ఎంత బాగుండేదో.. అని ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. Prabhas weds Anushka🥰అందరు ఆహ్వానితులే 🙏🏻#Prabhas #AnushkaShetty pic.twitter.com/7tsH0vVrRN— 🧚 NIMMI 💫✨🐦 (@AlwaysNirmala_) November 26, 2025 -
పొంగల్ పోరులో ఏడు చిత్రాలు .. లిస్ట్ పెరుగుతుందా? తగ్గుతుందా?
తెలుగులో సంక్రాంతి పండక్కి సినిమాల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు? టాలీవుడ్‌కు సంబంధించి ఇదే అతిపెద్ద సీజన్. ఈ టైంలో టాక్ బాగుంటే మామూలు రోజుల్లో కంటే ఎక్కువ వసూళ్లు వస్తుంటాయి. యావరేజ్ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యే అవకాశాలు ఉండే సీజన్ ఇది. అందుకే స్టార్ హీరోలలో చాలా మంది తమ సినిమా ఒకటి సంక్రాంతి బరిలో ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. ప్రతి సంక్రాంతి మాదిరే ఈ సారి కూడా బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొంది. ఈ పండక్కీ తెలుగులో మొత్తంగా ఆరేడు సినిమాలు బరిలోకి దిగబోతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే వచ్చే సంక్రాంతి సీజన్‌పై కొన్ని సినిమాలు కర్చీఫులు వేశాయి. అయితే వాటిల్లో ఏది రిలీజ్ కానుంది? ఏ సినిమా వెనక్కి తగ్గనుంది అనేది మరో వారం రోజుల్లో క్లారిటీ రానుంది.ప్రస్తుతానికి సంక్రాంతి బరిలో ఉన్న చిత్రాలివే..మన శంకర వర ప్రసాద్ గారురాజాసాబ్భర్త మహాశయులకు విజ్ఞప్తిఅనగనగా ఒక రాజునారీ నారీ నడుమ మురారీజననాయగన్పరాశక్తి‘రాజాసాబ్’పై క్లారిటీ వచ్చేదిఈ సంక్రాంతి(Sankranthi 2026)కి బరిలో ఉన్న సినిమాలో తొలుత రిలీజ్ డేట్ ప్రకటించిన పెద్ద సినిమా ది రాజాసాబ్(The Raja Saab). మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే గతంలో కూడా పలుసార్లు రిలీజ్ డేట్ ప్రకటించి..వాయిదా వేయడంతో మరోసారి కూడా ఈ సినిమా వెనక్కి తగ్గిందనే రూమర్స్ వచ్చాయి. దీంతో పలు చిన్న సినిమాలు సంక్రాంతికి వచ్చేందుకు రెడీ అయ్యాయి. అయితే తాము తప్పుకోవడం లేదని ది రాజాసాబ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చెప్పడమే కాకుండా.. ప్రమోషన్స్ కూడా స్టార్ చేయడంతో కొన్ని సినిమాలు బరి నుంచి తప్పుకోవాలని చూస్తున్నాయి.రాజుగారు రావడం లేదా?సంక్రాంతి పోటీలో ఉన్నామని గట్టిగా చెబుతూ వచ్చిన నవీన్ పొలిశెట్టి..అందరికంటే ముందుగానే తప్పుకునే అవకాశం ఉంది. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం అనగనగా ఒక రాజు(Anaganaga Oka Raju) వచ్చే ఏడాది జనవరి 14న రాబోతున్నట్లు గతంలో ప్రకటించారు. కానీ ప్రస్తుత పరిస్థితి బట్టి చూస్తే.. ఈ చిత్రం వాయిదా పడే అవకాశం ఉంది. బాక్సాఫీస్ బరిలో చాలా చిత్రాలు ఉండడంతో నిర్మాత నాగవంశీ వెనక్కీ తగ్గాడట. అన్ని కుదిరితే రిపబ్లిక్ డేకి రిలీజ్ చేయాలని నిర్మాత నాగవంశీ ఆలోచిస్తున్నాడట.ఇక శర్వానంద్ హీరోగా నటిస్తున్న నారి నారి నడుమ మురారి(Nari Nari Naduma Murari) చిత్రం కూడా ఈ సంక్రాంతికి వచ్చేలా లేదు. డిసెంబర్లో ఆయన బైకర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ చిత్రం కూడా వెనక్కి తగ్గేలా ఉంది. రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’పై కూడా అనుమానాలు పెరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం సమాచారం ప్రకారం.. ఈ చిత్రం కూడా కచ్చితంగా పొంగల్ పోరులోకి రాబోతుంది.చిరు క్లారిటీ ఇస్తే.. డేట్ ప్రకటించలేదు కానీ.. సంక్రాంతి పండగకి పక్కా రాబోతున్న చిత్రం మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’(Mana Shankara Vara Prasad Garu). ‘పండగకి వస్తున్నారు’ అనే ట్యాగ్‌లైన్ పెట్టుకొని మరి ఈ చిత్రం తెరకెక్కుతోంది. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్‌ని షేక్ చేసిన అనిల్ రావిపూడి.. ఈసారి చిరంజీవి మూవీతో రాబోతున్నాడు. మరో వారం రోజుల్లో ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది. చిరంజీవి సినిమా రిలీజ్ డేట్‌పై స్పష్టత వస్తే కానీ సంక్రాంతి రిలీజ్ సినిమాలపై క్లారిటీ రాలేదు. ఒక వేళ చిరు సినిమా వాయిదా పడితే..కచ్చితంగా చిన్న సినిమాలన్నీ బరిలోకి దిగుతాయి. అయితే ఆ అవకాశం అయితే దాదాపు లేనట్లే. వీటితో పాటు ఈ పొంగల్ పోరులో తమిళ్ నుంచి రెండు భారీ చిత్రాలు నిలిచాయి. అందులో ఒకటి..విజయ్ చివరి చిత్రం ‘జననాయగన్’. హెచ్. వినోద్ దర్వకత్వం వహించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ వచ్చే ఏడాది జనవరి 9న విడుదల కానుంది. దీంతో పాటు శివకార్తికేయన్-సుధా కొంగర కాంబినేషన్లో తెరకెక్కిన ‘పరాశక్తి’ కూడా సంక్రాంతి పండక్కే రాబోతుంది. జవవరి 14న ఈ చిత్రం రిలీజ్ కానుంది. మొత్తంగా ఈ పొంగల్ పోరులో ఎన్ని చిత్రాలు ఉంటాయనేది డిసెంబర్ మొదటి వారంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
ప్రకటించిన నాలుగేళ్లకు ప్రభాస్ 'స్పిరిట్' లాంచ్
సాధారణంగా ఓ సినిమా గురించి ప్రకటించిన తర్వాత కొన్నాళ్లకే లాంచింగ్, షూటింగ్ లాంటివి పెట్టుకుంటారు. కానీ ప్రభాస్ 'స్పిరిట్'కి మాత్రం ఏకంగా నాలుగేళ్లు పట్టింది. అవును మీరు విన్నది నిజమే. 2021 అక్టోబరు 7న ఈ ప్రాజెక్ట్ గురించి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అనౌన్స్ చేశాడు. తర్వాత నుంచి అప్పుడు ఇప్పుడు అనుకుంటూ ఆలస్యమైపోయింది. ఇన్నాళ్లకు పూజా కార్యక్రమంతో అధికారికంగా లాంచ్ అయింది.(ఇదీ చదవండి: తెలిసిన విషయాలే కానీ మనసుని మెలిపెట్టేలా.. ఓటీటీ రివ్యూ)హైదరాబాద్ వేదికగా సందీప్ రెడ్డి వంగా ఆఫీస్‌లోనే పూజా కార్యక్రమంతో ఈ సినిమా మొదలైంది. చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రభాస్ కూడా వచ్చాడు గానీ ఆయనకు సంబంధించిన ఒక్క ఫొటో కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. బహుశా లుక్ ఏంటో తెలియకూడదని సందీప్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.స్వయంగా సందీప్.. 'స్పిరిట్' లాంచింగ్ కార్యక్రమానికి ప్రభాస్ వచ్చిన విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ప్రభాస్ అన్న చేతులు మీకు చాలు అనుకుంటా, అంచనాలు పెంచడానికి అని రాసుకొచ్చాడు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ తృప్తి దిమ్రి, నిర్మాత భూషణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచే షూటింగ్ కూడా మొదలైపోయింది. ప్రస్తుతం ఈ లాంచ్ ఈవెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: హ్యాపీ బర్త్‌డే లవర్.. శోభిత లవ్లీ విషెస్) View this post on Instagram A post shared by Sandeep Reddy Vanga (@sandeepreddy.vanga) -
ఎన్నో హిట్ సాంగ్స్ ఇచ్చిన 'రాజ్-కోటి' ఎలా విడిపోయారు..?
మెగాస్టార్ చిరంజీవి నటించిన కొదమసింహం 35 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ అయింది. కౌబాయ్ పాత్రలో చిరు దుమ్మురేపితే.. సంగీతంతో రాజ్- కోటి అదరగొట్టేశారు. కొదమసింహం కోసం ఈ జోడీ ఇచ్చిన పాటలు 'జపం జపం జపం, కొంగ జపం', 'చక్కిలిగింతల రాగం', 'గుం గుమాయించు కొంచెం' ఇప్పటికీ పాపులర్‌గానే ఉన్నాయి. 1990 నాటి సినిమాల్లో రాజ్ - కోటి (Raj - Koti) ద్వయం పేరు పోస్టర్‌పై పడిందంటే.. ఆ సినిమా మ్యూజికల్ హిట్ అయ్యేది. టాలీవుడ్లో విపరీతమైన క్రేజ్ ఉన్న వీరిద్దరూ అనుకోని కారణాలతో సుమారు పదేళ్లకు పైగా దూరంగానే ఉన్నారు. అయితే, కొంత కాలం తర్వాత మళ్లీ కలిసిపోయినప్పటికీ వర్క్ పరంగా ఒక్కప్రాజెక్ట్ కూడా చేయలేదు. ఇంతకూ వీరిద్దరూ ఎందుకు విడిపోయారు.మంచి స్నేహితులుగా గుర్తింపుప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి వద్ద రాజ్, కోటి అసిస్టెంట్స్‌గా పనిచేశారు. వారి స్నేహానికి తొలి అడుగు అక్కడే పడింది. అయితే, ‘ప్రళయగర్జన’ (1982) చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా రాజ్‌కు మొదట ఛాన్స్ దక్కింది. కానీ, తన స్నేహితుడు కోటితో పాటు ఎంట్రీ ఇవ్వాలని ఆయన అనుకున్నారు. వారి స్నేహబంధం బలంగా ఉండటం వల్ల ఆ సినిమాతో పరిశ్రమలోకి ఒకేసారి అడుగుపెట్టారు. అయితే, ఆ సినిమా భారీ విజయం దక్కడంతో ఈ జోడీ వెనుతిరిగి చూడలేదు. ఆ సమయంలో ఉన్న స్టార్ హీరోల సినిమాలకు రాజ్- కోటి సంగీతం ఉండాల్సిందే అనేంతలా ఇమేజ్ పెంచుకున్నారు. యముడికి మొగుడు, లంకేశ్వరుడు, ముఠా మేస్త్రి, బాలగోపాలుడు, కర్తవ్యం, పెద్దరికం, మెకానిక్ అల్లుడు, బంగారు బుల్లోడు, హలో బ్రదర్, అన్న-తమ్ముడు లాంటి విజయవంతమైన చిత్రాలకు వీరే సంగీతాన్ని సమకూర్చారు. సుమారు 200 సినిమాలకు వీళ్లు కలిసే పనిచేశారు. ఏఆర్ రెహమాన్, తమన్, యువన్ శంకర్ రాజా వంటి టాప్ సంగీత దర్శకులు కూడా రాజ్- కోటి దగ్గర వర్క్ చేసినవారే కావడం విశేషం.విడిపోయాక రాజ్ ఒక్కడే..కొన్ని కారణాలతో రాజ్- కోటి విడిపోయారు. ఆ తర్వాత రాజ్ ఎక్కువ చిత్రాలు చేయలేదు. రాజ్ ఒక్కడే చేసిన సినిమాల్లో "సిసింద్రీ" ఒక్కటే చెప్పుకోదగినది. కాకపోతే కొన్ని టీవి షోలకు న్యాయమూర్తిగా వ్యవహరించారు. కోటి మాత్రం ఇంకా చిత్రాలు చేస్తూనే ఉన్నారు. కోటి ఒంటరిగా పనిచేసి పెద్ద హీరోలతో హిట్లు ఇచ్చాడు. చిరంజీవితో హిట్లర్, బాలకృష్ణతో పెద్దన్నయ్య, వెంకటేశ్ తో నువ్వు నాకు నచ్చావ్, ఆరుంధతి,రిక్షావోడు మొదలైనవి ఉన్నాయి.ఎందుకు విడిపోయారంటే..రాజ్‌తో ఎందుకు విడిపోయారో ఓ ఇంటర్వ్యూలో కోటి ఇలా చెప్పారు. కాలమే మమ్మల్ని కలిపింది.. కాల ప్రభావం వల్లనే మేము విడిపోయాం. మంచి స్నేహితులుగా మొదలైన మా ప్రయాణంలో ఎక్కువగా సంగీతం గురించే మాట్లాడుకునేవాళ్లం. ఈ క్రమంలో రాజ్‌కు మొదటిసారి సంగీత దర్శకుడిగా అవకాశం వచ్చింది. అప్పుడు కలిసి చేద్దామని అడగడంతో నేను సరే అని మ్యూజిక్ కంపోజింగ్ చేయడం మొదలుపెట్టాం. మా జోడీ సుమారు పదేళ్ల పాటు ఎన్నో సూపర్‌హిట్ ఆల్బమ్స్ ఇచ్చింది. దీంతో ఇండస్ట్రీలో మాకు మంచి పేరుతో పాటు గౌరవం వచ్చింది. అయితే, కొన్ని కారణాల వల్ల కాలమే మమ్మల్ని విడదీసింది. మా మ్యూజిక్ టీమ్‌లో ఆర్కెస్ట్రాకు సంబంధించిన ట్యూనింగ్ వర్క్‌ను రాజ్ చూసేవారు. చిత్ర యూనిట్‌తో అనుసందానంగా నేను ఉండేవాడిని. ఈ విషయంలో కొంతమంది వ్యక్తులు మా స్నేహంలోకి ఎంట్రీ ఇచ్చారు. వారు చెప్పిన మాటలు విన్న రాజ్ ఓసారి నా వద్దకు వచ్చి విడిపోదామని కోరారు. ఆ సమయంలో నేను వద్దని చెప్పాను. మన మధ్యలో ఎవరో చిచ్చు పెట్టేందుకే ఇలా చెప్పారని సూచించాను. కలిసి పనిచేద్దామని చాలా ప్రయత్నించాను. కానీ, రాజ్ వినకపోవడంతో విడిపోయాం. మేము విడిపోయినప్పటికీ స్నేహితులగానే కొనసాగాము. ఆ సమయంలో బాల సుబ్రహ్మణ్యం చాలా బాధపడ్డారు. మళ్లీ కలిసి వర్క్ చేయమని ఆయన ఎన్నోసార్లు చెప్పారు. ఫైనల్‌గా ఆయనే మమ్మల్ని కలిపారు. కలిసి వర్క్ చేద్దామని అనుకున్నాం. కానీ, మాకు ప్రాజెక్ట్ రాకపోవడంతో కుదరలేదు.' అని కోటి పంచుకున్నారు. 68 ఏళ్ల వయసులో రాజ్ (తోటకూర సోమరాజు) గుండెపోటుతో హైదరాబాద్‌లోని తన నివాసంలో 2023 మే 21న తుదిశ్వాస విడిచారు. -
మంచి క్వాలిటీతో రీ రిలీజ్ చేస్తున్నాం
చిరంజీవి హీరోగా, రాధ, సోనమ్, వాణీ విశ్వనాథ్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కొదమసింహం’. కె. మురళీమోహన రావు దర్శకత్వంలో కైకాల నాగేశ్వర రావు నిర్మించిన ఈ చిత్రం 1990 ఆగస్టు 9న విడుదలై, ఘనవిజయాన్ని సాధించింది. ఈ సినిమాని 4కే కన్వర్షన్, 5.1 డిజిటల్ సౌండింగ్‌తో ఈ నెల 21న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీమియర్ షో ఏర్పాటు చేసి, నిర్వహించిన ప్రెస్ మీట్లో కైకాల నాగేశ్వర రావు మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారు ఒకవైపు ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమా చేస్తూనే మరోవైపు ‘కొదమసింహం’ చేశారు. ఈ సినిమాని మంచి క్వాలిటీతో రీ రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘కొదమసింహం’ అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో మీకు తెలుసు. రీ రిలీజ్‌ను కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను’’ అని మురళీమోహన్ రావు తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ కోటి, రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, సత్యానంద్ మాట్లాడారు. ఆ క్యాసెట్ పెడితేనే చరణ్ భోజనం చేసేవాడు: చిరంజీవి వీడియో ద్వారా చిరంజీవి మాట్లాడుతూ– ‘‘కొదమసింహం’ నా ఫేవరెట్ మూవీ. నాకంటే రామ్‌చరణ్‌కి ఎక్కువ ఇష్టం. చిన్నప్పుడు వాళ్ల అమ్మ ఈ సినిమా క్యాసెట్ పెడితేనే భోజనం చేసేవాడు. కృష్ణగారు చేసిన ‘మోసగాళ్లకు మోసగాడు’ పెద్ద హిట్ అయింది. అలాంటి కౌబాయ్ సినిమా మళ్లీ చేయడం సాహసమే అవుతుంది. అయితే నాగేశ్వరరావు గారు, మురళీమోహన్ రావు వచ్చి నాకు ‘కొదమసింహం’ కథ చెప్పగానే వెంటనే అంగీకారం తెలిపాను. ఈ సినిమాలో నాకు నచ్చిన క్యారెక్టర్ మోహన్‌బాబు గారు చేసిన సుడిగాలి క్యారెక్టర్. ఆయన కాకుండా మరో నటుడైతే ఈ పాత్రను ఇంత బాగా ఒప్పించి, మెప్పించి ఉండేవారు కాదు’’ అని చె΄్పారు. -
కౌబాయ్ సినిమా చేస్తానని అసలు ఊహించలేదు: మెగాస్టార్ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి 35 ఏళ్ల క్రితం నటించిన యాక్షన్, అడ్వెంచర్ చిత్రం ‘కొదమసింహం’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. 1990లో విడుదలైన ఈ సినిమా ఈ నెల 21న రీ–రిలీజ్ కానుండటంతో హైదరాబాద్‌లో ప్రీమియర్ షో ఏర్పాటు చేశారు. షో అనంతరం జరిగిన ప్రెస్మీట్లో దర్శకుడు మురళీ మోహన్ రావు, సంగీత దర్శకుడు కోటి తో పాటు చిత్ర బృందం అందరు పాల్గొన్నారు.కాగా స్పెషల్ వీడియో ద్వారా స్పందించిన చిరంజీవి మాట్లాడుతూ.. "కౌబాయ్ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. కానీ అలాంటి పాత్రలో నేను నటిస్తానని అసలు ఊహించలేదు" అని అన్నారు. ‘కొదమసింహం’ తన సినీ కెరీర్లోనే ఒక ప్రత్యేక చిత్రం అని, ఆ కాలంలో ఒక కొత్త జానర్‌ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన మూవీగా పేర్కొన్నారు. ‘కొదమసింహం’ ఈసారి కూడా థియేటర్లలో ప్రేక్షకుల ఆదరణ పొందాలని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. రీమాస్టర్ చేసిన విజువల్స్, మెరుగైన సౌండ్ క్వాలిటీతో ఈ రీ–రిలీజ్ థియేటర్లలో ప్రత్యేక అనుభూతిని ఇస్తుందని నిర్వాహకులు తెలిపారు. -
రజనీ, చిరంజీవి యాక్టింగ్ గురువు కన్నుమూత
ఎన్నో కోట్లమంది అభిమానం సంపాదించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజాలకు నటనలో ఓనమాలు నేర్పించిన గురువు, డైరెక్టర్ కేఎస్ నారాయణస్వామి (92) మరణించారు. వయసు రీత్యా గత కొన్నాళ్ల నుంచి ఇబ్బంది పడుతున్న ఈయన సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా రజనీకాంత్ స్వయంగా నారాయణస్వామి ఇంటికి వెళ్లి, ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. సంతాపం వ్యక్తం చేశారు.ఈయన పేరు నారాయణ స్వామి అయినప్పటికీ ఇండస్ట్రీలో మాత్రం ఈయన కేఎస్ గోపాల్ అనే పేరుతో ఫేమస్. మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, మద్రాస్ దూరదర్శన్ కేంద్రానికి డైరెక్టర్‌గానూ పనిచేశారు. రజనీకాంత్‌కి యాక్టింగ్ నేర్పడంతో పాటు దిగ్గజ దర్శకుడు బాలచందర్‌కి రజనీని పరిచయం చేసింది ఈయనే. అలా రజనీ-బాలచందర్ కాంబోలో 'అపూర్వ రాగంగళ్' సినిమా వచ్చింది. దీంతో రజనీ కెరీర్ మారిపోయింది. అలాంటి నారాయణస్వామి ఇప్పుడు చనిపోవడంతో ఆయన సేవలు స్మరించుకుంటూ పలువురు ప్రముఖులు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
ఐబొమ్మ నిర్వాహకుడు వందలాది మంది కష్టాన్ని దోచుకున్నాడు
-
'దమ్ము ఉంటే పట్టుకోండి' అన్నాడు.. పైరసీపై చిరంజీవి వ్యాఖ్యలు
ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహుకుడు ఇమ్మడి రవి అరెస్ట్‌పై హైదరాబాద్ సీపీ సజ్జనార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. చిరంజీవితో పాటు నాగార్జున, రాజమౌళి, దిల్‌రాజు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. పైరసీ వల్ల సినీ రంగం చాలా నష్టం పోయిందని సజ్జనార్ తెలిపారు. ఆపై అతను 'దమ్ము ఉంటే పట్టుకోండి చూద్దాం ' అన్నాడు దీంతో అతన్ని అరెస్ట్ చేయాలని గట్టిగానే అనుకున్నట్లు సజ్జనార్ చెప్పారు. ఈ క్రమంలోనే చిరంజీవి, దిల్ రాజు కూడా పైరసీ గురించి పలు వ్యాఖ్యలు చేశారు.దమ్ము ఉంటే పట్టుకోండి అంటూ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి చేసిన సవాల్‌ను ఒక ఛాలెంజ్‌గా స్వీకరించిన తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసి చూపించారని చిరంజీవి కొనియాడారు. ఈ క్రమంలోనే పైరసీ అనేది ఇండస్ట్రీకి పెద్ద సవాల్‌గా మారిందని ఇలా చెప్పారు. 'సినిమాను నమ్మకుని కొన్ని వేల కుటుంబాలు ఇక్కడ బతుకుతున్నాయి. గత సీపీ సీవీ ఆనంద్‌తో పాటు ప్రస్తుత సీపీ సజ్జనార్ కలిసి పైరసీ భూతాన్ని పట్టుకున్నారు. చాలా ఏళ్ల నుంచి చిత్రపరిశ్రమను పైరసీ అనేది పీడిస్తూనే ఉంది. ఎన్నో కష్టాలను తట్టకుని ఇండస్ట్రీలో సినిమాలను నిర్మిస్తున్నారు.' అని చిరు అన్నారు.సినిమా పైరసీకి సంబంధించిన కీలక సూత్రధారి రవిని అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులకు నిర్మాత దిల్ రాజు ధన్యవాదాలు చెబుతూ ఇలా పేర్కొన్నారు. 'మూడు నెలల క్రితమే పైరసీ గురించి అరెస్ట్‌లు మొదలయ్యాయి. ఇలాంటి వెబ్సైట్ల వల్ల మీ వ్యక్తిగత డేటా కూడా చోరి అవుతుంది. మేము చాలా కష్టపడి సినిమాలు తీస్తున్నాం. ప్రేక్షకులు కూడా ఇలాంటి వెబ్సైట్లను ఎంకరేజ్ చేయకండి. మీకు కూడా నష్టం జరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం నెలరోజుల్లోనే ప్రతి సినిమా ఓటీటీలోకి వస్తుంది. సంతోషంగా ఇంట్లోనే చూసేయండి. ఇలాంటి పైరసీ వెబ్‌సైట్స్‌లను ఎంకరేజ్ చేసి పరిశ్రమకు నష్టం చేకూర్చకండి.' అంటూ దిల్ రాజు తెలిపారు. -
ఫ్యామిలీ స్టార్స్!
కుటుంబ కథా చిత్రాలకు ఎప్పుడూ తిరుగు ఉండదు. మంచి కథ, క్యాస్టింగ్, డైరెక్టర్ కుదిరితే ఆ ఫ్యామిలీ మూవీ సూపర్ హిట్ అవుతుంది. ఈ ఏడాది సంక్రాంతికి పండక్కి విడుదలైన ఫ్యామిలీ డ్రామా సినిమా పెద్ద చిత్రాల్లో ‘సంక్రాంతికి వస్తున్నాం’, చిన్న చిత్రాల్లో వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కోర్టు’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఈ తరుణంలో ఫ్యామిలీ డ్రామా సినిమాలపై, కుటుంబ భావోద్వేగాలపై కొందరు స్టార్ హీరోలు ఫోకస్ పెట్టారు. మరి... ప్రస్తుతం కుటుంబ కథా చిత్రాలు చేస్తున్న టాలీవుడ్ ఫ్యామిలీ స్టార్స్‌పై మీరూ ఓ లుక్ వేయండి.రాజీ పడదామే... మాజీ ఇల్లాలా! శంకర వరప్రసాద్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఫుల్లీ వర్క్ మైండెడ్. దీంతో పర్సనల్ లైఫ్‌కి, వర్కింగ్ లైఫ్‌కి మధ్య బ్యాలెన్స్ తప్పిందట. మరి... ఈ రెంటినీ మళ్లీ శంకరవరప్రసాద్ ఎలా బ్యాలెన్స్ చేశాడు? అన్నది ‘మన శంకరవరప్రసాద్’ లో చూడొచ్చట. చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్స్ మిళితమైన సినిమాగా ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమా ఉండబోతోందని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ సినిమాలో చిరంజీవి, నయనతార భార్యా భర్తలుగా నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి ‘మీసాల పిల్ల’ అనే పాట విడుదలైంది. ఇందులో ‘రాజీ పడదామే మాజీ ఇల్లాలా’ అనే లిరిక్స్ ఉన్నాయి.దీన్నిబట్టి, ఈ చిత్రంలో భార్యాభర్తలుగా చిరంజీవి–నయనతారల మధ్య ఫ్యామిలీ గొడవలు, అలకలు ఉంటాయని అర్థం అవుతోంది. ఈ సన్నివేశాలు థియేటర్స్‌లో ఆడియన్స్‌కు వినోదాన్ని పంచుతాయని ఊహించవచ్చు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వెంకటేశ్, క్యాథరీన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తు న్నారు. సాహు గారపాటి, సుస్మితా కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కానుంది. ఈ సినిమా సంగతి ఇలా ఉంచితే... చిరంజీవి హీరోగా నటించిన మరో సినిమా ‘విశ్వంభర’. ఈ సోషియో ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ మోతాదు కాస్త ఎక్కువగానే ఉంటుందని సమాచారం.ఈ సినిమాలో చిరంజీవికి ఐదుగురు సిస్టర్స్ ఉంటారని, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి వంటి హీరోయిన్స్ చిరంజీవికి సిస్టర్స్‌గా నటించారని తెలిసింది. వశిష్ట దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించగా, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం వచ్చే వేసవిలో రిలీజ్ కానున్నట్లుగా చిత్రయూనిట్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.అబ్బాయిగారు 60 ప్లస్ ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’ చిత్రాలు వెంకటేశ్ కెరీర్లో ఎంతటి బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అప్పట్లో ఈ రెండు సినిమాలకు రైటర్‌గా పని చేశారు ఇప్పటి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్. ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్లోనే వెంకటేశ్ హీరోగా ఓ సినిమా రానుంది. ఆల్రెడీ ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. వెంకటేశ్ కెరీర్‌లోని ఈ 77వ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాలో మరో హీరోయిన్‌కు చాన్స్ ఉందని, త్వరలోనే ఈ హీరోయిన్ పేరు కూడా మేకర్స్ రివీల్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు... ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’ చిత్రాల కథలు వైజాగ్ నేపథ్యంలో మొదలై, హైదరాబాద్‌కు షిఫ్ట్ అవుతాయి. వెంకటేశ్–త్రివిక్రమ్ తాజా చిత్రం కూడా వైజాగ్ నేపథ్యంలోనే ఉంటుందనే టాక్ తెరపైకి వచ్చింది.ఇంకా ఈ సినిమాకు ‘వెంకటరమణ, ఆనంద నిలయం, వెంకటరమణ కేరాఫ్ ఆనందనిలయం, అబ్బాయిగారు 60 ప్లస్’ అనే టైటిల్స్ కూడా తెరపైకి వచ్చాయి. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుందని, టైటిల్‌ను కూడా అతి త్వరలోనే రిలీజ్ చేసే ఆలోచనలో చిత్రయూనిట్ ఉందని ఫిల్మ్‌నగర్ సమాచారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మించనున్న ఈ ఫ్యామిలీ డ్రామా వచ్చే వేసవిలో రిలీజ్ కానుంది.మరోవైపు ఇంటెన్స్ క్రైమ్ డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్స్ మిక్స్ అయిన ‘దృశ్యం’ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటికే ‘దృశ్యం, దృశ్యం 2’ చిత్రాలు రాగా, ఈ రెండు చిత్రాల్లోనూ వెంకటేశ్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ‘దృశ్యం’ ఫ్రాంచైజీ నుంచి ముచ్చటగా ‘దృశ్యం 3’ కూడా రానుందని ఇటీవల జరిగిన ఓ వేడుకలో వెంకటేశ్ కన్ఫార్మ్ చేశారు. అలాగే తాను, మీనా హీరో హీరోయిన్లుగా నటించనున్న విషయాన్ని కూడా వెంకటేశ్ చెప్పారు. ఇక ‘దృశ్యం 3’ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ఆరంభం కానున్నట్లుగా తెలిసింది.రామసత్యనారాయణ విజ్ఞప్తి! ‘నా జీవితంలోని ఇద్దరు ఆడాళ్లు నన్ను రెండు ప్రశ్నలు అడిగారు. సమాధానం కోసం చాలా ఆలోచించాను. గూగుల్... ఏఐ... జెమిని..చాట్‌జీపీటీ.. ఇలా అన్నింటినీ అడిగాను. మే బీ వాటికి పెళ్లి కాకపోవడం వల్ల నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేశాయి. అనుభవం ఉన్న మగాళ్ళని.., ముఖ్యంగా మొగుళ్ళని అడిగాను. ఆశ్చర్యపోయారే తప్ప ఆన్సర్ మాత్రం ఇవ్వలేకపోయారు. అలాంటి ప్రశ్న మిమ్మల్ని ఏ ఆడవాళ్లు ఆడగకూడదని, పెళ్లయిన వాళ్ళకి నాలాంటి పరిస్థితి ఎదురవకూడదని కోరుకుంటూ... మీ ఈ రామసత్యనారాయణ చెప్పేది ఏమిటంటే.. భర్త మహాశయులకు విజ్ఞప్తి’ వంటి డైలాగ్స్ రవితేజ కొత్త చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంలోనివి. ఫ్యామిలీ ఎమోషన్స్‌కు పెద్ద పీట వేసే దర్శకుడు కిశోర్ తిరుమల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.రామసత్యనారాయణగా హీరో రవితేజ నటిస్తున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఇటీవల ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ టైటిల్ గ్లింప్స్‌లోనే పైన పేర్కొన్న సంభాషణలు ఉన్నాయి. ఈ డైలాగ్స్‌ని బట్టి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా పూర్తి స్థాయి ఫ్యామిలీ డ్రామాగా ఉండబోతోందని తెలుస్తోంది. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కానుంది. తాత–మనవడి కథ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రాల్లో ‘ది రాజాసాబ్’ సినిమా ఒకటి. సోషియో ఫ్యాంటసీ హారర్ కామెడీ జానర్లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న తొలి చిత్రం ఇది. ఇందులో మాళవికా మోహనన్, నిధీ అగర్వాల్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, సంజయ్‌దత్ తాత–మనవడి పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. అంతేకాదు...ఈ సినిమాలో కామెడీ, హారర్ ఎలిమెంట్స్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ బలంగానే ఉంటాయట.ఈ సినిమాలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో బలమైన ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్‌ను ప్రేక్షకులకు చూపించనున్నారట ఈ చిత్రదర్శకుడు మారుతి. ఇంకా... ఈ సినిమాలో ఓ ఘోస్ట్‌గా సంజయ్ దత్ కనిపిస్తారు. సెకండాఫ్‌లో ప్రభాస్ పాత్రను సంజయ్ దత్ ఆత్మ ఆవహిస్తుందని, ఈ సీన్స్ థియేటర్స్‌లో అదిరిపోతాయని టాక్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ‘ది రాజాసాబ్’ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 9న రిలీజ్ కానుంది.విశ్వనాథన్ అండ్ సన్స్ ‘రంగ్ దే, లక్కీ భాస్కర్’ వంటి సూపర్‌హిట్ కుటుంబ కథా చిత్రాలకు దర్శకత్వం వహించిన వెంకీ అట్లూరి తాజాగా తనదైన మార్క్‌తో ఈ జానర్లోనే మరో మూవీ తీస్తున్నారు. ఈ చిత్రంలో సూర్య హీరోగా నటిస్తున్నారు. పూర్తి స్థాయి ఫ్యామిలీ డ్రామా సినిమా ఇది. మమితా బైజు హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే యూరప్‌లో ఈ సినిమాకు సంబంధించిన ఓ భారీ షూటింగ్ షెడ్యూల్‌ను జరిపారు మేకర్స్. అంతేకాదు... ఈ సినిమాకు ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని, త్వరలోనే ఈ సినిమా టైటిల్ గురించి అధికారిక ప్రకటన రానుందని తెలిసింది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే వేసవిలో విడుదల కానుంది.మూడు తరాల కథ మోటర్ రేసింగ్ స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే మల్టీ జనరేషన్ ఫ్యామిలీ డ్రామా ‘బైకర్’. 1990– 2000 మధ్య కాలంలో సాగే ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో శర్వానంద్ హీరోగా నటించారు. ఈ సినిమా కథకు రేసింగ్ బ్యాక్‌డ్రాప్ ఉన్నప్పటికీ, మూడు తరాల ఫ్యామిలీ కథగా ‘బైకర్’ మూవీ ఉంటుంది. ఈ చిత్రంలో శర్వానంద్ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తారని తెలిసింది. ఇందులో మాళవికా నాయర్ హీరోయిన్గా నటించగా, రాజశేఖర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. విక్రమ్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ ‘బైకర్’ చిత్రం డిసెంబరు 6న రిలీజ్ కానుంది.మరోవైపు ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలోనే శర్వానంద్ హీరోగా రూపోందుతున్న తాజా చిత్రం ‘నారీ నారీ నడము మురారి’. ఈ చిత్రంలో సంయుక్త, సాక్షీ వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. లవ్, ఫ్యామిలీ డ్రామా ప్రధాన అంశాలుగా ఈ చిత్రకథనం సాగుతుంది. వచ్చే సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను థియేటర్స్‌లో రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.లెనిన్ అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘లెనిన్’. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ మురళీ కిశోర్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్కినేని నాగార్జున, నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ కూడా మొదలైంది. సగానికి పైగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లుగా తెలిసింది. రాయలసీమ నేపథ్యంలో సాగే ‘లెనిన్’ సినిమాలో లవ్‌స్టోరీతో పాటు బలమైన ఫ్యామిలీ భావోద్వేగాలు ఉండబోతున్నట్లుగా తెలిసింది. తండ్రీ–కొడుకుల భావోద్వేగంతో కూడిన ఓ ఎపిసోడ్ కూడా ఈ సినిమాలో ఉందని, ఈ సీన్స్ ఈ సినిమాకు హైలైట్‌గా ఉంటాయని టాక్. అయితే ఈ సినిమాలోని తండ్రి పాత్రలో ఎవరు యాక్ట్ చేస్తున్నారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ సినిమాలో తొలుత హీరోయిన్గా శ్రీలీల కన్ఫార్మ్ అయ్యారు. కానీ కాల్షీట్స్ కేటాయింపుల్లో ఇబ్బందులు తలెత్తడం వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి శ్రీలీల తప్పుకున్నారని, ఆమె స్థానంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం.ఫ్యామిలీ కథ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు హీరో కిరణ్ అబ్బవరం. కిరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘చెన్నై లవ్‌స్టోరీ’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. కాగా, కుటుంబ కథా చిత్రాలను చక్కగా తెరకెక్కించే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, ఇటీవల ఓ ఫ్యామిలీ స్టోరీని కిరణ్‌కు వినిపించారని, కథ నచ్చడంతో ఈ యువ హీరో కూడా ఈ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్‌నగర్ సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్‌కు శ్రీను వైట్ల మరిన్ని మెరుగులు దిద్దుతున్నారని, త్వరలోనే ఈ మూవీపై మేకర్స్ నుంచి ఓ ప్రకటన రానుందని తెలిసింది. ఇలా కుటుంబ కథలతో సినిమాలు చేస్తున్న తెలుగు హీరోలు మరి కొంతమంది ఉన్నారు. ఇంకొంతమంది హీరోలు ఈ ఫ్యామిలీ జానర్ సినిమాలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. -
మాస్ డ్యాన్స్‌కి రెడీ
మాస్ డ్యాన్స్ చేయడానికి రెడీ అవుతున్నారట చిరంజీవి, వెంకటేశ్. ఈ స్టార్స్ ఇద్దరితో ఓ సెలబ్రేషన్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట అనిల్ రావిపూడి. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపోందుతున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా, ముఖ్య పాత్రల్లో వెంకటేశ్, క్యాథరీన్, వీటీవీ గణేశ్ నటిస్తున్నారు.ఆల్రెడీ చిరంజీవి, వెంకటేశ్ కాంబినేషన్లో గత నెలాఖర్లో ఈ సినిమాలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. కాగా ఈ చిత్రంలో ఓ సెలబ్రేషన్ సాంగ్ ఉందని, ఈ పాటలో చిరంజీవి, వెంకటేశ్‌తో పాటు నయనతార, క్యాథరీన్ కూడా డ్యాన్స్ చేస్తారని టాక్. ఈ పాటను ఈ నెలాఖరున చిత్రీకరించడానికి ఏర్పాట్లు చేస్తున్నారట. అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. -
టాలీవుడ్లో రాబోతున్న సైన్స్ ఫిక్షన్ సినిమాలివే
సైన్స్ ఫిక్షన్ స్టోరీస్ భలే ఉంటాయి. అందుకే అలాంటి కథలకు చాన్స్ వచ్చినప్పుడు స్టార్ హీరో నుంచి స్మాల్ హీరో వరకూ వెంటనే ‘సై’ అనేస్తారు. ప్రస్తుతం తెలుగులో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ సినిమాలు పది వరకూ ఉన్నాయి. ఆ సైన్స్ ఫిక్షన్స్ గురించి తెలుసుకుందాం.సత్యలోకం నేపథ్యంలో...చిరంజీవి హీరోగా రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్‌పై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాట నిర్మించారు. సోషియో ఫ్యాంటసీ, సైన్స్ ఫిక్షన్ జానర్లో రూపొందిన ‘విశ్వంభర’ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందని ఫిల్మ్‌నగర్ టాక్. ‘‘మనకి తెలిసినవి 14 లోకాలు. కింద 7 లోకాలు, పైన 7 లోకాలు. ఆ 14 లోకాలకు పైన ఉన్న లోకమే సత్యలోకం. యమలోకం, స్వర్గం, పాతాళలోకం.. అన్నీ చూసేశాం. ‘విశ్వంభర’ కోసం వాటన్నింటిని దాటి నేను పైకి వెళ్లాను. బ్రహ్మదేవుడు ఉండే సత్యలోకాన్ని మా సినిమాలో చూపించాం. ఆ లోకంలో ఉండే హీరోయిన్ను వెతుక్కుంటూ హీరో 14 లోకాలు దాటి వెళ్లి తిరిగి భూమి మీదకు ఆమెను ఎలా తీసుకొచ్చాడు? అనేది ఈ చిత్రకథ’’ అంటూ ఓ ఇంటర్వ్యూలో ‘విశ్వంభర’ స్టోరీ లైన్ చెప్పారు డైరెక్టర్ వశిష్ట. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న విడుదల కావాల్సి ఉండగా 2026 వేసవిలో విడుదలకు వాయిదా వేశారు మేకర్స్. ‘‘విశ్వంభర’ ఒక చందమామ కథలా సాగిపోయే అద్భుతమైన కథ. చిన్నపిల్లలకు, పెద్దవాళ్లలో ఉండే చిన్న పిల్లలను సైతం ఇది అలరిస్తుంది.. వినోదపరుస్తుంది. ‘విశ్వంభర’లో సెకండ్ హాఫ్ మొత్తం వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ మీద ఆధారపడి ఉంది. ప్రేక్షకులకు అత్యున్నతమైన ప్రమాణాలతో బెస్ట్ క్వాలిటీ అందివ్వాలని మేం కష్టపడుతున్నాం’’ అని హీరో చిరంజీవి తెలిపిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ’సంక్రాంతికి రాజాసాబ్‘బాహుబలి’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్నారు ప్రభాస్ . ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఆ తర్వాత ‘సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి 2898 ఏడీ..’ ఇలా వరుసగా భారీ పాన్ ఇండియా సినిమాలు చే స్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. పీరియాడికల్ హారర్ కామెడీ, సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ప్రభాస్ స్టైల్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, హారర్, కామెడీ అంశాల సమ్మిళితంగా ఈ మూవీ రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా లుక్స్, టీజర్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇండస్ట్రీలోనూ మంచి బజ్ నడుస్తోంది. పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వస్తుందని చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘‘ప్రభాస్‌గారిని ‘బుజ్జిగాడి’ సినిమా స్టైల్లో ‘ది రాజా సాబ్’ ద్వారా వింటేజ్ లుక్‌లో చూపిస్తున్నాం’’ అంటూ మారుతి తెలిపారు. ‘‘మా సంస్థ నుంచి వస్తున్న బిగ్గెస్ట్ ఫిల్మ్ ‘ది రాజా సాబ్’. ఈ సినిమా కోసం బిగ్గెస్ట్ ఇండోర్ సెట్ వేశాం. 40 నిమిషాల కై్లమాక్స్ ఎపిసోడ్ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది’’ అని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ పేర్కొన్నారు. హాలీవుడ్ స్థాయిలో...‘పుష్ప: ది రైజ్, పుష్ప 2: ది రూల్’ వంటి చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటారు అల్లు అర్జున్. అంతేకాదు... ‘పుష్ప: ది రైజ్’కి గానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కూడా అందుకున్నారాయన. ‘పుష్ప’ ఫ్రాంచైజీ తర్వాత తమిళ దర్శకుడు అట్లీతో సినిమా చేస్తున్నారు అల్లు అర్జున్. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందుతోన్న ‘ఏఏ 22 ఏ 6’(వర్కింగ్ టైటిల్) చిత్రాన్ని కళానిధి మారన్ సమర్పణలో సన్‌పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్గా బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ ఫిక్స్ అయ్యారు. ఈ సినిమా కోసం లాస్ ఏంజిల్స్ వెళ్లి అక్కడ వీఎఫ్ఎక్స్ కంపెనీలతో, వీఎఫ్ఎక్స్ ఆర్టిస్టులతో సమావేశం అయింది చిత్రయూనిట్. సైన్స్ ఫిక్షన్ జానర్లో రూపొందుతోన్న ఈ సినిమా కోసం హాలీవుడ్ సినిమాలకు ధీటుగా ఓ కొత్త ప్రపంచం క్రియేట్ చేస్తోందట యూనిట్. పాన్ ఇండియా కాదు,.. పాన్ వరల్డ్ స్కేల్లో ఈ మూవీ రూపొందనుందనే వార్తలూ వినిపించాయి. ‘‘పుష్ప’ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా ఎలా ఉంటుంది? అనే ఆత్రుత అందరిలోనూ నెలకొంది. కొన్ని రోజులు వెయిట్ చేయండి. మీకు మేం ఓ కొత్త ప్రపంచం చూపించడానికి వర్క్ చేస్తున్నాం. ఇప్పటి వరకు మీరు చూడనిది వెండితెరపై చూపిస్తామని భరోసా ఇవ్వగలను. చాలా మంది హాలీవుడ్ టెక్నీషియన్లతో మేం వర్క్ చేస్తున్నాం. వాళ్లు సైతం తమకు ఈ సినిమా సవాల్‌గా ఉందని చెబుతున్నారు. అంటే మేం ఓ భారీ సినిమా చేస్తున్నామని అర్థం’’ అంటూ అట్లీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ‘‘అల్లు అర్జున్ తిరుగులేని ఎనర్జీ, అట్లీ విజన్, దీపికా పదుకోన్ బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్‌లతో ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులకు ఐకానిక్‌గా ‘ఏఏ 22 ఏ 6’ సినిమాను రూపొందిస్తున్నాం’’ అని సన్ పిక్చర్స్ సంస్థ పేర్కొంది. ఈ మూవీకి సాయి అభ్యంకర్ స్వరక్తర. జనవరిలో ఆరంభంకన్నడలో తెరకెక్కిన ‘కాంతార’ చిత్రంతో నటుడిగా, దర్శకుడిగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు రిషబ్ శెట్టి. ఆ సినిమాకి ప్రీక్వెల్‌గా రూపొందిన ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రం ఈ అక్టోబర్ 2న పలు భాషల్లో రిలీజ్ అయి సూపర్ హిట్‌గా నిలిచింది. ‘కాంతార’కు మించి వసూళ్లు సాధించింది ఈ మూవీ. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్న స్ట్రైట్ తెలుగు చిత్రం ‘జై హనుమాన్’. ‘హను–మాన్’ మూవీతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఆ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో హనుమంతుడి పాత్ర పోషిస్తున్నారు రిషబ్ శెట్టి. ‘‘కాంతార : చాప్టర్ 1’ విడుదలకు ముందే మరో సినిమాకు సైన్ చేయాలనుకోలేదు. కానీ, ప్రశాంత్ వర్మ చెప్పిన ‘జై హనుమాన్’ కథ నన్ను ఎంతలా ఆకట్టుకుందంటే, వెంటనే ఆయనకు ఓకే చెప్పాను. స్క్రిప్ట్ అద్భుతంగా ఉంది, కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పటికే ఫొటోషూట్ పూర్తి చేశాం’’ అంటూ ఇటీవల ఓ సందర్భంలో రిషబ్ శెట్టి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో రానా కూడా నటించనున్నారే వార్తలు వస్తున్నాయి. రిషబ్ శెట్టి, రానాతో కలిసి ఉన్న ఫొటోని ప్రశాంత్ వర్మ గతంలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. హనుమంతుడి పాత్ర పోషిస్తున్న రిషబ్ శెట్టిలాంటి నటుడికి ధీటుగా నిలబడాలంటే ఆ స్థాయి దేహం, ఆహార్యం ఉండాలంటే రానా కరెక్ట్ అని దర్శకుడి ఆలోచన అట. ‘బాహుబలి’లో ప్రభాస్‌కు ధీటుగా భళ్లాలదేవుడి పాత్రలో రానా నటనను ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోలేరు. మరి... ‘జై హనుమాన్’లో రానా పాత్ర ఏంటి? ఎలా ఉంటుంది? అన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.సరికొత్త అనుభూతినాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్?సీ 24’ (వర్కింగ్ టైటిల్). ‘తండేల్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకోవడంతో పాటు తొలిసారి వంద కోట్ల క్లబ్లో చేరారాయన. ‘తండేల్’ వంటి విజయవంతమైన సినిమా తర్వాత ఆయన నటిస్తున్న చిత్రమిది. సాయిదుర్గా తేజ్‌తో ‘విరూపాక్ష’ (2023) వంటి హిట్ మూవీ తర్వాత కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్న చిత్రం కూడా ఇదే. ఇలా... సూపర్ సక్సెస్‌లు అందుకున్న తర్వాత నాగచైతన్య, మీనాక్షీ చౌదరి, కార్తీక్ దండు కాంబినేషన్లో రూ΄÷ందుతోన్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. బాపినీడు సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘తండేల్’లో ఫుల్ మాస్ లుక్‌లో కనిపించిన నాగచైతన్య.. ‘ఎన్సీ 24’లో నాగచైతన్య నెవర్ బిఫోర్ లుక్‌లో కనిపించబోతున్నారు. మిథికల్ థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్‌గా రూ΄÷ందుతోన్న ఈ చిత్రంలో దక్ష అనే ఆర్కియాలజిస్ట్‌గా సరికొత్త ΄ాత్రలో కనిపిస్తారు మీనాక్షీ చౌదరి. ఇటీవల విడుదల చేసిన ఆమె ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ కథలో ఆమె ΄ాత్ర చాలా క్రూషియల్‌గా ఉండబోతోందట. ఎమోషన్స్, పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉండే దక్ష క్యారెక్టర్ ఆమె కెరీర్లో ఓ మైలురాయిగా నిలవనున్నట్లు చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందని మేకర్స్ తెలి΄ారు. ఈ సినిమాకి అజనీష్ బి. లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ అడ్వెంచర్నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ‘కార్తికేయ’ (2014), ‘కార్తికేయ 2’ (2022) చిత్రాలు ఎంత సూపర్ హిట్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఒకదానికి మించి ఒకటి బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. ‘కార్తికేయ 2’తో వందకోట్లకు పైగా వసూళ్లు సాధించారు నిఖిల్. కృష్ణతత్వం నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ , అనుపమ్ ఖేర్, హర్ష, శ్రీనివాసరెడ్డి కీలక పాత్రలు పోషించారు. కృష్ణతత్వాన్ని ఉద్దేశించి అనుపమ్ ఖేర్ చెప్పే డైలాగ్స్ సినిమాకే హైలైట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ సూపర్‌హిట్ అందుకుంది. అంతేకాదు... కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 70వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా ‘కార్తికేయ 2’ నిలిచింది. ఈ సినిమాకి కొనసాగింపుగా ‘కార్తికేయ 3’ చిత్రం ఉంటుందని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘‘సరికొత్త అడ్వెంచర్‌ను సెర్చ్ చేసే పనిలో డాక్టర్ కార్తికేయ నిమగ్నమయ్యారు. త్వరలో రానున్నాం’’ అంటూ నిఖిల్ సిద్ధార్థ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం విదితమే. సైన్స్ ఫిక్షన్‌గా రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ‘కార్తికేయ, కార్తికేయ 2’ చిత్రాలతో పోలిస్తే ‘కార్తికేయ 3’ మరింత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందనుందని ఫిల్మ్‌నగర్ టాక్. ఇదిలా ఉంటే... నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ జానర్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సైన్స్ ఫిక్షన్ని కూడా జోడించారట మేకర్స్. ఈ చిత్రం 2026 వేసవిలో విడుదల కానుందని టాక్. ఏటిగట్టుపై అద్భుతం‘విరూపాక్ష, బ్రో’ వంటి హిట్ సినిమాల తర్వాత సాయిదుర్గా తేజ్ నటించిన తాజా చిత్రం ‘ఎస్వైజీ’(సంబరాల ఏటిగట్టు). నూతన దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వం వహించిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్. ప్రైమ్‌షో ఎంటర్టైన్ మెంట్‌పై ‘హను–మాన్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ నిర్మించిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 25న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళంలో విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. అక్టోబరు 15న సాయిదుర్గా తేజ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ‘అసుర ఆగమన’ పేరుతో విడుదల చేసిన ఈ మూవీ గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ‘‘నా జీవితంలో ‘ఎస్వైజీ’(సంబరాల యేటిగట్టు) చిత్రం చాలా ముఖ్యమైనది. ఈ సినిమా కోసం నా సర్వస్వం ధారపోశాను. అద్భుతమైన క్వాలిటీతో సినిమా ఇవ్వాలని చాలా కష్టపడుతున్నాం. నిరంజన్, చైతన్యగార్లు ఖర్చుకి వెనకాడకుండా సపోర్ట్ చేశారు. డైరెక్టర్ రోహిత్ తీసిన ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది.. అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇది నా ప్రామిస్’’ అంటూ ఇటీవల సాయిదుర్గా తేజ్ పేర్కొన్నారు. ఈ మూవీకి బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీత దర్శకుడు. పైన పేర్కొన్న సినిమాలే కాదు... మరికొన్ని చిత్రాలు కూడా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ప్రేక్షకులను అలరించేందుకు సమాయత్తం అవుతున్నాయి. -
'ఆ దేవుడే దిగి వచ్చినట్లుగా ఉంది'.. ఆట సందీప్ ఎమోషనల్ పోస్ట్!
టాలీవుడ్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆట సందీప్ పేరు తెలియనివారు ఉండరు. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో 'ఆట' ద్వారా ఫేమ్ సంపాదించారు. మొదటి సీజన్లోనే విన్నర్‌గా నిలిచారు. అందువల్లే అతని పేరుతోనే ఆట సందీప్‌గా అభిమానుల్లో ముద్ర వేసుకున్నారు. తెలుగు బిగ్‌బాస్ సీజన్-7లోనూ కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు.తాజాగా సందీప్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. సందీప్ తన సతీమణి జ్యోతిరాజ్తో కలిసి మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఈ సందర్భంగా ఆట సందీప్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. నా జీవితంలో ఇది మరచిపోలేని రోజని పోస్ట్ చేశారు. ఆ దేవుడే దిగి వచ్చి మాకు వరం ఇచ్చినట్లుగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ఆయనే స్వయంగా ఇంటికి పిలిచి కొరియోగ్రఫీ ఛాన్స్ ఇచ్చారని సందీప్ వెల్లడించారు. ఆ క్షణం నాకు సాక్షాత్ పరమశివుడు ఆశీర్వాదం చేసినట్టుగా అనిపించిందని ఎమోషనలయ్యారు. నా హృదయమంతా ఆనందంతో నిండిపోయిందని ఇన్‌స్టాలో పంచుకున్నారు. View this post on Instagram A post shared by 𝐀𝐚𝐭𝐚 𝐒𝐚𝐧𝐝𝐞𝐞𝐩 𝐃𝐚𝐧𝐜𝐞 𝐌𝐚𝐬𝐭𝐞𝐫🇮🇳 (@aata_sandeep) -
'కొదమ సింహం' రీరిలీజ్.. ఈ రికార్డ్ గురించి తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి నటించిన కొదమసింహం రీరిలీజ్ కానుంది. 1990లో విడుదలైన ఈ చిత్రంలో కౌబాయ్‌గా చిరు కనిపించారు. ఈనెల 21న సరికొత్త హంగులతో పాటు 4కే విజువల్స్‌తో రీరిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్‌ను షేర్ చేశారు. దర్శకుడు కె.మురళీమోహనరావు తెరెక్కించిన ఈ చిత్రంలో సోనమ్, వాణీ విశ్వనాథ్,రాధ,సుజాత,అన్నపూర్ణ నటించగా మోహన్‌బాబు ముఖ్యపాత్ర పోషించారు. ఈ మూవీని కైకాల నాగేశ్వరరావు నిర్మించారు. ఇప్పుడు కూడా ఆయనే ఈ చిత్రాన్ని 5.1 డిజిటల్ సౌండింగ్‌తో చేయించి మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం విశేషం. ఇది 'హంటర్స్ ఆఫ్ ది ఇండియన్ ట్రెజరీ' అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించబడిన మొట్టమొదటి దక్షిణభారత చలనచిత్రంగా కొదమసింహం రికార్డ్ క్రియేట్ చేసింది. కౌబాయ్ పాత్రలని అంతకు ముందు ఎక్కువగా ఘట్టమనేని కృష్ణ పోషించేవారు. ఈ చిత్రంతో చిరంజీవి మొట్టమొదటి సారిగా పూర్తి నిడివి కౌబాయ్ పాత్రని పోషించారు. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ 20 కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుంది. ఇందులోని పాటలు 'జపం జపం జపం, కొంగ జపం', 'చక్కిలిగింతల రాగం', 'గుం గుమాయించు కొంచెం' బాగా పాపులర్ అయ్యాయి. -
‘స్పిరిట్’లో చిరు, డాన్ లీ..? క్లారిటీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న చిత్రం ‘స్పిరిట్’. అయితే ఇటీవల స్పిరిట్ గురించి వస్తున్న రూమర్స్‌పై సందీప్ రెడ్డి స్పష్టత ఇచ్చాడు. తాజాగా ‘జిగ్రీస్’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర బృందంతో కలిసి చిట్ చాట్‌లో పాల్గొన్న ఆయన మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.సందీప్ వంగా మాట్లాడుతూ.. “మెగాస్టార్ చిరంజీవి ‘స్పిరిట్’లో నటిస్తున్నారన్న వార్తలు నిజం కాదు. మా ఇద్దరి మద్య అలాంటి చర్చలు జరగలేదు. అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే” అని తెలిపారు. కాగా “ఎప్పుడైనా చిరంజీవితో సినిమా చేసే అవకాశం వస్తే మాత్రం అది తప్పకుండా సోలో ఫిలిం రూపంలో ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. అయితే అది ఏ జానర్లో, ఎప్పుడు అనేది ఇప్పుడే చెప్పలేను” అని అన్నాడు.మరోవైపు సౌత్ కొరియన్ నటుడు డాన్ లీ కూడా ‘స్పిరిట్’ సినిమాలో నటిస్తున్నాడని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై కూడా సందీప్ స్పందించాడు. అది కూడా రూమర్ మాత్రమే అని స్పష్టం చేశాడు. -
చిరంజీవికి క్షమాపణలు చెప్పిన ఆర్జీవీ
నాగార్జునను స్టార్‌గా మార్చిన సినిమా శివ. ఈ చిత్రంతోనే రామ్‌గోపాల్ వర్మ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఫస్ట్ సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ చేశాడు. తర్వాత ఎన్నో సినిమాలు చేసినప్పటికీ శివ మూవీకి ఆయన కెరీర్లోనే ప్రత్యేక స్థానం ఉంది. ఇక ఈ చిత్రం దాదాపు 36 ఏళ్ల తర్వాత రీరిలీజ్ అవుతోంది. నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.చిరంజీవి స్పెషల్ విషెస్ఈ క్రమంలో అల్లు అర్జున్, ప్రభాస్, మహేశ్‌బాబు.. తదితర హీరోలు ఆల్‌ద బెస్ట్ చెప్తూ వీడియోలు చేశారు. తాజాగా చిరంజీవి (Chiranjeevi) సైతం ఓ వీడియో వదిలారు. శివ సినిమా చూసి నేను పూర్తిగా ఆశ్చర్యపోయాను. అది సినిమా కాదు, ఒక విప్లవం, ఒక ట్రెండ్ సెట్టర్.. తెలుగు సినిమాకు కొత్త నిర్వచనం చెప్పడంతో కొత్త ఒరవడికి నాంది పలికిన మూవీ. ఆ సైకిల్ చైన్ సీన్ అయితే ఇప్పటికీ జనాల మనసుల్లో అలాగే నిలిచిపోయింది.ఆర్జీవీపై ప్రశంసలునాగార్జున నటనలోని తీవ్రత, శక్తి ఫెంటాస్టిక్. అమల, రఘువరన్.. ప్రతి ఒక్కరూ ప్రతి ఫ్రేమ్‌కి ప్రాణం పోశారు. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన వ్యక్తి రామ్‌గోపాల్ వర్మ.. ఆయన విజన్, కెమెరా యాంగిల్స్, లైట్స్, సౌండ్ ప్రజెంటేషన్.. అన్నీ కొత్తగా వావ్ అనిపించాయి. ఈ యువ దర్శకుడు తెలుగు సినిమా భవిష్యత్తు అని అప్పుడే అనుకున్నాను. హ్యాట్సాఫ్ రామ్‌గోపాల్ వర్మ.. తెలుగు సినిమా ఉన్నంతకాలం 'శివ' చిరంజీవిలా చిరస్మరణీయం. శివ టీమ్‌కు ఆల్ ద బెస్ట్ అని పేర్కొన్నాడు.బాధపెట్టి ఉంటే క్షమించండిఈ వీడియోను ఆర్జీవీ (Ram Gopal Varma) ఎక్స్ (ట్విటర్)లో షేర్ చేస్తూ.. చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపాడు. అనుకోకుండా బాధపెట్టి ఉంటే క్షమించమని కోరాడు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఆర్జీవీ - చిరంజీవి కాంబినేషన్లో గతంలో వినాలని వుంది అనే సినిమా ప్లాన్ చేశారు. 20% షూటింగ్ కూడా పూర్తి చేశారు. కానీ, సడన్‌గా ఆ సినిమాను అటకెక్కించారు. అప్పటినుంచే వైరం మొదలు?ఆ సమయంలో సంజయ్ దత్ జైలు నుంచి రిలీజవడంతో ఆయనతో ఓ సినిమా చేస్తానని చిరు ప్రాజెక్ట్‌ను వర్మ మధ్యలోనే వదిలేసి వెళ్లినట్లు ప్రచారం జరిగింది. కథలో హీరో జోక్యం చేసుకోవడం వల్లే సినిమా ఆపేశాడన్న ప్రచారమూ ఉంది. అలా ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. అప్పటినుంచే చిరు- వర్మ మధ్య వైరం మొదలైందని అంటుంటారు. సమయం దొరికినప్పుడల్లా వర్మ.. చిరంజీవిపై సెటైర్లు వేస్తుంటాడు. అలాంటిది ఇప్పుడు సడన్‌గా చిరుకు సారీ చెప్పడంతో నెటిజన్లు అవాక్కవుతున్నారు. Thank you @KChiruTweets gaaru, Also on this occasion I want to sincerely apologise to you if I ever unintentionally offended you ..Thank you once again for your large heartedness 🙏🙏🙏 pic.twitter.com/08EaUPVCQT— Ram Gopal Varma (@RGVzoomin) November 9, 2025చదవండి: ఓటీటీలో 'తెలుసు కదా' మూవీ.. అఫీషియల్ ప్రకటన -
సోషల్ మీడియాను రఫ్పాడిస్తున్న మెగాస్టార్.. మెగాపవర్ స్టార్
ఈ ఇద్దరు తండ్రీకొడుకులు తెలుగు సినీ పరిశ్రమను ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. చిరంజీవి తన 46 ఏళ్ల కెరీర్లో ఎన్నో మైలురాళ్లు సాధించగా, రామ్ చరణ్ తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ కొత్త రికార్డులు నెలకొల్పుతున్నారు. తాజాగా 'మీసాల పిల్ల' పాటలో చిరంజీవి డాన్స్ మూవ్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.ఇక ఈ పాట పెద్ద హిట్ అవడంతో అభిమానులు సోషల్ మీడియాలో ఈ పాటపై రీల్స్,ఫ్యాన్ ఎడిట్స్‌తో ఉత్సాహంగా రాణిస్తున్నారు.భీమ్స్ సంగీతం అధించిన ఈ పాట నంబర్ వన్ ట్రెండింగ్‌లో కొనసాగింది. అలా ఈ పాట తాజాగా 50 మిలియన్ వ్యూస్‌తో రికార్డు కొల్లగొట్టింది.ఇక రామ్ చరణ్ 'పెద్ది' నుంచి 'చికిరి చికిరి' పాట తాజాగా విడుదలైంది. అయితే ఈ పాట ఒక్క రోజులోనే 4 భాషల్లో కలిపి 46 మిలియన్ వ్యూస్ సాధించింది. ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ రిలీజైన గంటల వ్యవదిలోనే 30 మిలియన్ వ్యూస్‌తో ఆల్‌టైమ్ రికార్డ్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. చరణ్ డాన్స్ మూవ్స్‌తో అభిమానులు రీల్స్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు. ఇలా తండ్రీకొడుకులు ఇద్దరూ తమ సినిమా పాటలతో సోషల్ మీడియాను రఫ్ ఆడిస్తున్నారు. -
ఫైట్ చేసేద్దాం
నువ్వా... నేనా తేల్చేసుకుందాం... ఫైట్ చేసేద్దాం అనే టైపులో విలన్లకు సవాల్ విసిరి, రంగంలోకి దిగాడు శంకరవరప్రసాద్. అందర్నీ రఫ్ఫాడించడం మొదలుపెట్టాడు. చిరంజీవి హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’కి సంబంధించిన షూటింగ్ అప్డేట్ ఇది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్నారు.ఓ కీలక పాత్రలో హీరో వెంకటేశ్, హీరోయిన్గా నయనతార నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. చిరంజీవి, ఫైటర్స్ పాల్గొనగా ఫైట్ చిత్రీకరిస్తున్నారు. ‘‘ఈ స్టైలిష్ క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ విజువల్‌గా అద్భుతంగా ఉంటుంది. ఫైట్ మాస్టర్ వెంకట్ పర్యవేక్షణలో రూపొందిస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది. -
బాలకృష్ణే చేయిస్తున్నాడా? చిరంజీవిపై DeepFake వెనుక టీడీపీ
-
నెక్లెస్‌రోడ్డులో ఏక్తా రన్.. పాల్గొన్న చిరంజీవి, సజ్జనార్ (ఫొటోలు)
-
నా వీడియోలు ఎడిట్ చేస్తారా.. సజ్జనార్ కి చెప్పా.. ఇక మీ పని అయిపోయింది
-
డీప్ ఫెక్పై స్పందించిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తాజాగా డీప్ ఫేక్ ఫోటోల విషయంపై స్పందించారు. కొద్దిరోజుల క్రితం తన ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలుగా క్రియేట్ చేశారని సీపీ వీసీ సజ్జనార్‌కు ఆయన ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. డీప్ ఫెక్ అనేది పెద్ద గొడ్డలి పెట్టు లాంటిదని ఆయన అన్నారు. ఇప్పటికే ఈ అంశాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లినట్లు మీడియాతో చిరు చెప్పారు. డీజీపీతో పాటు హైదరాబాద్ సీపీ సజ్జనార్ డీప్ ఫేక్ ఫోటోల విషయంలో చాలా సీరియస్‌గా తీసుకున్నారని చిరు ఇలా చెప్పారు. 'ఈ కేసును సజ్జనార్ స్వయంగా పర్యవేక్షస్తున్నారు. పోలీసు వ్యవస్థ చాలా బలంగా ఉంది. ప్రజలకు పోలీసులు అండగా ఉన్నారు. ఎవరూ డీప్ ఫెక్, సైబర్ నేరాలకు భయపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీని అందరం ఆహ్వానించాలి. కానీ, దాని వల్ల ముప్పు కూడా ఉంది. ప్రభుత్వాలు కూడా దీనిపై ప్రత్యేక చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. లేదంటే భవిష్యత్‌లో మరిన్ని ఇబ్బందులు ఎదురుకునే అవకాశం ఉంటుంది.' అని చిరంజీవి అన్నారు. -
‘చిరంజీవి’ కేసులపై ప్రత్యేక దృష్టి
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు, కేంద్ర మాజీమంత్రి కొణిదెల చిరంజీవి ఫిర్యాదు మేరకు సిటీ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో నమోదైన రెండు కేసులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆయన ఫిర్యాదు మేరకు డీప్‌ఫేక్‌పై శనివారం, అభ్యంతరకర వ్యాఖ్యపై మంగళవారం కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లోని నిందితులను గుర్తించడానికి దర్యాప్తు అధికారులు సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నారు. -
నేను కూడా అప్పట్లో అనుకున్నా.. కానీ అది అబద్ధం
చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'మన శంకరవరప్రసాద్ గారు' అనే సినిమా చేస్తున్నారు. ఇది కాకుండా 'విశ్వంభర' కూడా లైన్లో ఉంది. లెక్క ప్రకారం విశ్వంభర ఈ పాటికే థియేటర్లలోకి వచ్చేయాలి. కానీ వీఎఫ్ఎక్స్ పనుల కారణంగా చాలా ఆలస్యం చేసేశారు. వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు కాకుండా మరో రెండు ప్రాజెక్టులు రెడీగా ఉన్నాయి.చిరు.. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నారు. కొన్ని నెలల క్రితం దీని గురించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. వచ్చే ఏడాది ప్రారంభమయ్యే ఈ చిత్రంలో తమిళ హీరో కార్తీ నటించనున్నాడని, ఏకంగా రూ.23 కోట్ల రెమ్యునరేషన్ కూడా డిమాండ్ చేశాడనే రూమర్స్. సరే ఇదంతా పక్కనబెడితే ఈ ప్రాజెక్టులో చిరంజీవి సరసన మాళవిక మోహనన్ నటిస్తుందనే టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు ఈ విషయమై స్వయంగా మాళవికనే స్పందించింది. క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేసింది.(ఇదీ చదవండి: ఎట్టకేలకు రజనీకాంత్ షాకింగ్ నిర్ణయం?)'డైరెక్టర్ బాబీ తీయబోయే 'మెగా 158' ప్రాజెక్టులో నేను ఉన్నానని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు. నేను కూడా చిరంజీవి సర్‌తో నటించాలని ఓ దశలో అనుకున్నా. కానీ ఇప్పుడు క్లారిటీ ఇద్దామనుకుంటున్నాను. ఈ ప్రాజెక్టులో నేను లేను. వినిపిస్తున్న రూమర్స్ నిజం కాదు' అని మాళవిక మోహనన్ ట్వీట్ చేసింది.మాళవిక చెప్పేసింది కాబట్టి ఈ ప్రాజెక్టులో హీరోయిన్ ఎవరనేది తేలాల్సి ఉంది. బాబీ కాకుండా యువదర్శకుడు శ్రీకాంత్ ఓదెల కూడా చిరంజీవితో ఓ మూవీ చేయనున్నాడు. దీని గురించి కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడో వచ్చేసింది. ఇది వచ్చే ఏడాది ద్వితీయార్థంలో మొదలయ్యే అవకాశముంది.(ఇదీ చదవండి: హీరోయిన్గా మహేశ్‌బాబు మేనకోడలు ఎంట్రీ) -
మరోసారి పోలీసులను ఆశ్రయించిన చిరంజీవి
సాక్షి, హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మరోసారి పోలీసులను ఆశ్రయించారు. తనపై ఎక్స్ (ట్విటర్)లో అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారంటూ దయా చౌదరి అనే వ్యక్తిపై ఫిర్యాదు చేశారు. ఇటీవల హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ఇంకా ఇలాంటి పోస్టులు పెడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన ఫిర్యాదు ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.డీప్ ఫేక్ వీడియోలుఇటీవల చిరంజీవి డీప్ ఫేక్ ఫోటోలు, వీడియోలపై పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే! ఏఐ సాయంతో కొందరు ఆయన ఫోటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలు సృష్టించి.. వాటిని పలు వెబ్సైట్లలో వైరల్ చేశారు. దీనిపై ఆగ్రహించిన చిరు.. సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే కోర్టును సైతం ఆశ్రయించారు. చిరంజీవి అనుమతి లేకుండా ఆయన పేరు, ఫోటోలు, వాయిస్‌ను ఎవరూ ఉపయోగించకూడదని సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.చదవండి: టాస్కుల్లో పవన్‌ను కొట్టేవాడే లేడు.. ఆస్పత్రిలో భరణి! -
మీసాల పిల్ల.. 13 రోజులుగా ట్రెండింగ్.. ఏకంగా ఎన్ని వ్యూస్ అంటే?
హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ ఏడాది పొంగల్‌కు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ విజయం అందుకున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి మన శంకరవరప్రసాద్‌గారు మూవీతో బ్లాక్‌బస్టర్ అందుకునేందుకు సిద్ధమవుతున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో గోదారి గట్టు మీద రామచిలకవే.. పాట ఎంత వైరలయిందో ఇప్పుడు చిరంజీవి మూవీ (Mana Shankaravaraprasad Garu Movie)లోని మీసాల పిల్ల కూడా అంతే వైరలవుతోంది.36 మిలియన్ల వ్యూస్(Meesaala Pilla Song) యూట్యూబ్‌లో టాప్‌లో దూసుకుపోతోంది. 13 రోజులుగా ఫస్ట్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. ఇప్పటివరకు 36 మిలియన్ల వ్యూస్ అందుకుంది. ఈ సాంగ్‌లో చిరు వేసే స్టెప్పులు సింపుల్‌గా కనిపిస్తూనే చాలా స్టైలిష్‌గా ఉంటాయి. లిరికల్ సాంగ్‌కే ఈ రేంజ్లో రెస్పాన్స్ వస్తే ఇక వీడియో సాంగ్ రిలీజ్ చేస్తే ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో!సినిమాభీమ్స్ సంగీతం అందించిన మీసాల పిల్ల పాటను ఉదిత్ నారాయణ్, శ్వేత మోహన్ ఆలపించారు. భాస్కరభట్ల రవికుమార్ లిరిక్స్ రాశాడు. పోలకి మాస్టర్ కొరియోగ్రాఫీ చేశాడు. మన శంకరవరప్రసాద్‌గారు సినిమా విషయానికి వస్తే.. చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. The unanimous chartbuster continues to be the audience’s favourite song of the season ❤️🔥#MeesaalaPilla Trending #1 on YouTube for 13 days with 36MILLION + views 🔥🔥🔥-- https://t.co/4dgILT40kG #ManaShankaraVaraPrasadGaru Sankranthi 2026 RELEASE Megastar @KChiruTweets… pic.twitter.com/8sbxhs7BrY— Shine Screens (@Shine_Screens) October 27, 2025 చదవండి: కల్యాణ్‌ను పొడిచేసిన శ్రీజ.. నామినేషన్స్‌లో ఎవరున్నారంటే? -
చిరంజీవి ప్రతిష్ఠ దెబ్బతీసేలా 'డీప్‌ఫేక్' ఫోటోలు.. కేసు నమోదు
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అనుమతి లేకుండా ఆయన పేరు, ఫొటోలు, వాయిస్‌లను ఎవరూ ఉపయోగించకూడదని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొందరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో చిరంజీవి ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలుగా క్రియేట్ చేశారు. వాటిని పలు వెబ్సైట్లు, సోషల్ మీడియాలలో కొందరు వైరల్ చేశారు. ఈ విషయం చిరు దృష్టికి చేరడంతో ఆయన వెంటనే సీపీ వీసీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే సైబర్‌క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. ముఖ్యంగా AI మార్ఫింగ్ ద్వారా డీప్‌ఫేక్ వీడియోలు రూపొందించి తన పేరు, ప్రతిష్ట దెబ్బతీసేలా పనిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని చిరు కోరారు.డీప్ ఫేక్ ఫోటోల వల్ల ఇబ్బంది ఎదుర్కొన్న చిరంజీవి కొద్దిరోజుల క్రితమే సివిల్ కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం కూడా చిరుకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. చిరంజీవి అనుమతి లేకుండా ఆయన ఫోటోలను తమ వాణిజ్య ప్రయోజనాల కోసం ఎవరూ వినియోగించవద్దని హెచ్చరించింది. ఈ క్రమంలోనే AI ద్యారా మార్ఫింగ్ చేసిన డిజిటల్ వేదికలపై ఆంక్షలు విధిస్తూ సైబర్‌క్రైమ్ పోలీసులుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే చిరుపై తప్పుడు పోస్టులు, వీడియోలను క్రియేట్ చేసిన 30 మందికి పైగానే నోటీసులు జారీ చేసింది. కోర్టు సూచనతో పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
అదే ఫార్ములా ఫాలో అవుతున్న చిరు?
రీఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరంజీవి వరస సినిమాలైతే చేస్తున్నారు గానీ ఎందుకో అనుకున్నంతగా వర్కౌట్ కావట్లేదు. చాన్నాళ్ల క్రితం రూట్ మార్చిన చిరు.. వీలైనంత వరకు యువ దర్శకులతోనే కలిసి పనిచేస్తున్నారు. అలా ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు మూవీస్ ఉన్నాయి. సెట్స్ పైన మాత్రం రెండింటి పనినడుస్తోంది. ఇప్పుడు ఓ క్రేజీ రూమర్ బయటకొచ్చింది.(ఇదీ చదవండి: మహాభారతాన్ని అద్భుతంగా చూపించిన సిరీస్.. ఓటీటీ రివ్యూ)ప్రస్తుతం 'విశ్వంభర'తో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'మన శంకరవరప్రసాద్ గారు' అనే మూవీ చేస్తున్నారు. ఇది సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది. ఇందులో చిరుతో పాటు వెంకటేశ్ కూడా స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఈ మేరకు కొన్నిరోజుల క్రితమే వెంకీ షూటింగ్‌లోనూ పాల్గొన్నారు. ఇది పూర్తయిన తర్వాత బాబీ దర్శకత్వంలో చిరు మరో మూవీ చేయబోతున్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఓ రూమర్ వినిపిస్తుంది.చిరు-బాబీ కాంబో ప్రాజెక్ట్ గురించి కొన్నాళ్ల క్రితం అనౌన్స్మెంట్ వచ్చింది. వచ్చే ఏడాది ఇది సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ మూవీలో తమిళ హీరో కార్తీ.. కీలక పాత్రలో నటించబోతున్నాడనే టాక్ వినిపిస్తుంది. ఇది నిజమే కావొచ్చు. ఎందుకంటే గత కొన్నేళ్లుగా చిరు సినిమాల్లో ఎవరో ఓ హీరో అతిథి పాత్రల్లో కనిపిస్తూనే ఉన్నారు. 'ఆచార్య'లో రామ్ చరణ్, 'గాడ్ ఫాదర్'లో సల్మాన్ ఖాన్, 'వాల్తేరు వీరయ్య'లో రవితేజ.. ప్రస్తుతం చేస్తున్న 'మన శంకరవరప్రసాద్ గారు'లో వెంకటేశ్‌తో ఇలా ఫార్ములా ఫాలో అయిపోతున్నట్లు కనిపిస్తుంది. అలా కార్తీతో త్వరలో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారట. మరి ఇది నిజమా కాదా అనేది కొన్నాళ్లు ఆగితే తెలుస్తుంది.(ఇదీ చదవండి: ఈ పాన్ ఇండియా నటుడిని గుర్తుపట్టారా? బయోపిక్ కోసం ఇలా)


