'ఉప్పెన' తర్వాత సరైన హిట్ లేదు.. ఇప్పుడు చిరంజీవితో! | Chiranjeevi Bobby Movie Updates Krithi Shetty Role Details | Sakshi
Sakshi News home page

Chiranjeevi: లక్కీ ఛాన్స్ కొట్టిన బేబమ్మ.. చిరు కొత్త సినిమాలో!

Jan 21 2026 8:30 AM | Updated on Jan 21 2026 8:35 AM

Chiranjeevi Bobby Movie Updates Krithi Shetty Role Details

హిట్ కొట్టడం ఈజీనే. కానీ దాన్ని కొనసాగిస్తూ సినిమాలు చేయడం, అవకాశం దక్కించుకోవడం చాలా కష్టం. చాలా కొద్దిమంది హీరోహీరోయిన్లకు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అవును ఇదంతా హీరోయిన్ కృతిశెట్టి గురించే. 'ఉప్పెన'తో హీరోయిన్‌గా బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ.. తర్వాత చాలానే మూవీస్ చేసింది గానీ సరైన హిట్ కొట్టలేకపోయింది. ఇప్పుడు మెగా ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: మేడారం జాతర మొక్కు.. టాలీవుడ్ హీరోయిన్‌పై విమర్శలు!)

ప్రస్తుతం 'మన శంకరవరప్రసాద్' చిత్ర సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న చిరంజీవి.. త్వరలో కొత్త ప్రాజెక్ట్  మొదలుపెట్టనున్నారు. ఇదివరకే దర్శకుడు బాబీతో చిరు మరోసారి కలిసి పనిచేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఫిబ్రవరిలో లాంచ్ కానుందని, మార్చి నుంచి షూటింగ్ మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది. ఈ మూవీలోనే కృతిశెట్టిని తీసుకున్నారని తెలుస్తోంది. చాలామంది హీరోయినా అని అనుకుంటున్నారు. కానీ చిరు కుమార్తె పాత్రలో కృతి కనిపించనుందని టాక్.

గతంలో 'వాల్తేరు వీరయ్య' సినిమాతో తొలి హిట్ అందుకున్న చిరు-బాబీ.. ఇప్పుడు బెంగాల్ బ్యాక్ డ్రాప్‌లో సాగే కూతురు సెంటిమెంట్ కాన్సెప్ట్‌తో మూవీ చేయనున్నారని టాక్. మలయాళ హీరో మోహన్ లాల్ ఓ కీలక పాత్ర చేయబోతున్నారని టాక్. ఇకపోతే ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా పలువురు పేర్లు అనుకుంటున్నప్పటికీ ప్రియమణిని ఫైనల్ చేశారని అంటున్నారు. అలానే ఏఆర్ రెహమాన్‌ని సంగీత దర్శకుడిగా ఫైనల్ చేసే పనిలో ఉన్నారట. మరి ఈ విషయాల్లో ఎంత నిజముందనేది మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే ఛాన్సుంది.

(ఇదీ చదవండి: గోల్డెన్ ఛాన్స్ వదులుకున్న నాగార్జున?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement