'మన శంకరవరప్రసాద్‌గారు' సినిమా సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఈ మూవీ విజయోత్సవ వేడుకల్లో చిరు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఆయన మాట్లాడుతూ.. ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య.. ఈ రెండు సినిమాల షూటింగ్‌కు ఉత్సాహంగా వెళ్లాను. మళ్లీ మన శంకరవరప్రసాద్‌గారు షూటింగ్ కూడా అంతే ఎంజాయ్ చేశాను.
నేనే బాధ్యత తీసుకుంటా..
ఈ సినిమాలన్నీ సక్సెస్‌ఫుల్ అయ్యాయి. మధ్యలో కొన్ని సినిమాలు ఏదో డౌట్‌గా అనిపించాయి. వాటిని నేను తప్పుపట్టను. తప్పు నా మీద వేసుకుంటాను కానీ ఒకరిపై నెట్టను అన్నాడు. దీంతో ఆచార్య సినిమా విషయంలో వచ్చిన విమర్శలకు చిరు కౌంటరిచ్చాడంటూ నెట్టింట చర్చ మొదలైంది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటించిన మూవీ ఆచార్య (2022).
ఎవరి పని వాళ్లు చేసుకుంటే బెటర్
ఆ సినిమా డిజాస్టర్ కాగా దానికి కొరటాలే కారణమని చిరంజీవి అన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అనంతరం ఓ ఇంటర్వ్యూలో కొరటాల శివ.. ఎవరి పని వాళ్లు చేసుకుంటే ఈ ప్రపంచమంతా హ్యాపీగా ఉంటుంది అని కామెంట్స్ చేశాడు. ఆచార్య స్క్రిప్ట్ విషయంలో చిరంజీవి జోక్యం చేసుకోవడం వల్లే ఫ్లాప్ అయిందన్న ఆరోపణలు వస్తున్న సమయంలో కొరటాల ఇలాంటి కామెంట్స్ చేశాడు. దీంతో ఆయన చిరంజీవిని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశాడని పలువురూ భావించారు.
డైరెక్టర్‌కు కౌంటర్?
అయితే కొరటాల మాత్రం.. సాధారణంగా పని గురించి మాట్లాడాను తప్ప ఆ వ్యాఖ్యల వెనక మరో ఉద్దేశం లేదని వివరణ ఇచ్చాడు. అయినప్పటికీ నెట్టింట చర్చ మాత్రం ఆగలేదు. ఇప్పుడు చిరంజీవి తన కామెంట్స్‌తో.. తాజాగా కొరటాల శివకు పరోక్షంగా కౌంటరిచ్చారని పలువురు భావిస్తున్నారు.
చదవండి: 3 సబ్జెక్టులు ఫెయిల్.. చిరంజీవి పరువు తీయొద్దన్నా.. అనిల్ రావిపూడి తండ్రి


