పెద్దగా బ్రేక్ తీసుకోకుండా షూటింగ్ చేయాలని ఫిక్స్ అయినట్లు ఉన్నారు చిరంజీవి. సంక్రాంతి పండగని కుటుంబ సభ్యులతో కలిసి జోరుగా జరుపుకోవడంతో పాటు ‘మన శంకర వరప్రసాద్‌గారు’ సక్సెస్ సంబరంలో ఉన్న ఆయన మరో వారంలో కొత్త సినిమా సెట్‌లోకి అడుగుపెట్టనున్నారట. బాబీ కొల్లి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే.
ఈ నెల 25న ఈ చిత్రం షూటింగ్‌ని ఆరంభించాలనుకుంటున్నారట. ఈ చిత్రంలో ఫుల్ మాస్ రోల్‌లో చిరంజీవి కనిపించనున్నారని టాక్. ఇదిలా ఉంటే... ఈ నెల 12న రిలీజ్ చేసిన ‘మన శంకర వరప్రసాద్‌గారు’ ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 261 కోట్లు వసూలు సాధించి, రూ. 300 కోట్ల దిశగా దూసుకెళుతోందని చిత్రబృందం పేర్కొంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సుష్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రంలో వెంకటేశ్ కీలక పాత్ర చేసిన విషయం తెలిసిందే.


