మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాకు మంచి స్పందన వస్తుంది. ఈ మూవీని చిత్ర నిర్మాతలు కూడా చాలా దూకుడుగా ప్రమోట్ చేస్తున్నారు. ఫస్ట్ డే రూ. 84 కోట్ల గ్రాస్ వచ్చినట్లు ప్రకటించారు. సినిమా బాగుందని టాక్ రావడంతో కుటుంబంతో కలిసి సినిమాకు వెళ్దామనుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అయితే, రెండు తెలుగురాష్ట్రాల్లో టికెట్ ధరలు అధికంగా ఉండటం వల్ల ప్రేక్షకులు ఫ్యామిలీతో పాటు కలిసి థియేటర్‌కు వెళ్లేందుకు జంకుతున్నారు. దీంతో సినిమా కలెక్షన్స్‌పై ప్రభావం చూపవచ్చని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి.
సంక్రాంతి సందర్భంగా చాలా సినిమాలు విడుదల కానున్నాయి. ఇప్పటికే ది రాజా సాబ్ రీవర్షన్ చేయడంతో బాగుందని టాక్ వచ్చింది. ఆపై రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి థియేటర్‌లోకి వచ్చేసింది. సినిమా బాగుందని టాక్ కనిపిస్తోంది. జనవరి 14న మరో రెండు సినిమాలు విడుదల కానున్నాయి. వీటికి కూడా మంచి టాక్ వస్తే.. టికెట్ ధరలు తక్కువ కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిన్న చిత్రాలవైపే మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. టికెట్ ధరలు తగ్గిన తర్వాత మన శంకర వర ప్రసాద్ గారు చూద్దాంలే అనుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.
ఇంతలో పండగ సందడి ముగుస్తుంది కాబట్టి ఆ తర్వాత ఎవరిపనుల్లో వారు పడిపోవడం సహజం. చిరు సినిమాకు మంచి టాక్ ఉంది కాబట్టి టికెట్ ధరల విషయంలో స్వల్ప సర్దుబాటు చేయడం వల్ల సినిమాకు మరింత ప్రయోజనం చేకూరుతుంది. టికెట్ ధరలను తగ్గించడం వల్ల సినిమాకు నష్టం వాటిల్లడం కంటే ఎక్కువ లాభాలు వచ్చే ఛాన్స్ ఉందని సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.
రెండు రాష్ట్రాల్లో టికెట్ ధరలు ఇలా..
'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రానికి జనవరి 19 వరకు తెలంగాణలో టికెట్ ధరలు ఎక్కువగానే ఉంటాయి. ప్రస్తుతం ఉన్న ధరలకు సింగిల్ స్క్రీన్‌లో రూ.50 (జీఎస్టీతో కలిపి) మల్టీప్లెక్స్‌లలో రూ.100 (జీఎస్టీతో కలిపి) ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా జనవరి 22 వరకు అధిక ధరలు ఉంటాయి. ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలకు అధనంగా సింగిల్ స్క్రీన్‌లో రూ.100 (జీఎస్టీతో కలిపి) మల్టీప్లెక్స్‌లలో రూ.125 (జీఎస్టీతో కలిపి) ఉంటుంది.
మన శంకరవరప్రసాద్ గారు బాక్స్ఆఫీస్ బద్దలుకొట్టేసారు 💥💥💥
₹84 CRORES+ WORLDWIDE GROSS for#ManaShankaraVaraPrasadGaru (Premieres + Day 1) ❤️🔥❤️🔥❤️🔥
ALL TIME RECORD OPENINGS EVERYWHERE 🔥🔥🔥#MegaBlockbusterMSG
Megastar @KChiruTweets
Victory @VenkyMama@AnilRavipudi #Nayanthara… pic.twitter.com/qId5atqw8T— Shine Screens (@Shine_Screens) January 13, 2026


