చిరు, నయన్‌ 'మీసాల పిల్ల' వీడియో సాంగ్‌ రిలీజ్‌ | Meesaala Pilla Full Video song out from Mana ShankaraVaraPrasad Garu | Sakshi
Sakshi News home page

రికార్డ్‌ క్రియేట్‌ చేసిన 'మీసాల పిల్ల' వీడియో సాంగ్‌ వచ్చేసింది

Feb 2 2026 12:00 PM | Updated on Feb 2 2026 12:18 PM

Meesaala Pilla Full Video song out from Mana ShankaraVaraPrasad Garu

చిరంజీవి, అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం మన శంకరవరప్రసాద్‌ గారు.. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన  ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయం అందుకుంది. ఈ చిత్రం నుంచి తాజాగా మీసాల పిల్ల వీడియో వర్షన్‌ సాంగ్‌ వచ్చేసింది. భీమ్స్ సిసిరోలియో  సంగీతంలో ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ పాడిన ఈ పాటను భాస్కరభట్ల రవికుమార్ రచించారు. 

ఇందులో చిరంజీవి డ్యాన్స్‌ మూవ్స్‌తో పాటు నయనతార స్క్రీన్‌ ప్రెజెన్స్‌ బాగుందని రెస్పాన్స్‌ వచ్చింది. రీసెంట్‌గా బాగా పాపులర్‌ అయిన సాంగ్స్‌లో మీసాల పిల్ల చేరిపోయింది. కేవలం ఆడియో వర్షన్‌ సుమారు 15రోజుల పాటు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్న ఈ సాంగ్‌ ఇప్పుడు వీడియో వర్షన్‌ ఎంత రికార్డ్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాల్సి ఉంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement