చిరంజీవి- వెంకటేశ్ ఇద్దరూ కలిసి అదిరిపోయే రేంజ్‌లో తొలిసారి స్టెప్పులు వేశారు. సంక్రాంతి కానుకగా విడుదలైన మన శంకరవరప్రసాద్ గారు మూవీలో వారు నటించిన విషయం తెలిసిందే. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీ నుంచి తాజాగా 'అదిపోద్ది సంక్రాంతి' వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఇందులో చిరు, వెంకీ పోటీపడి స్టెప్పులు వేశారు. భీమ్స్ సంగీతం అందించగా.. కాసర్ల శ్యామ్ పాటను రాశారు. నకాశ్ అజీజ్, విశాల్ దడ్లానీ ఆలపించారు. ఫుల్ జోష్ తెప్పించే సాంగ్‌ను మీరూ చూసేయండి.


