బాక్సాఫీస్‌ను రఫ్పాడిస్తున్న ‘వరప్రసాద్‌ గారు’.. 3 రోజుల కలెక్షన్స్‌ ఎంతంటే.. | Mana Shankara Vara Prasad Garu Box Office Collection Day 3 Details | Sakshi
Sakshi News home page

బాక్సాఫీస్‌ను రఫ్పాడిస్తున్న ‘వరప్రసాద్‌ గారు’.. 3 రోజుల కలెక్షన్స్‌ ఎంతంటే..

Jan 15 2026 10:49 AM | Updated on Jan 15 2026 12:13 PM

Mana Shankara Vara Prasad Garu Box Office Collection Day 3 Details

మెగాస్టార్ చిరంజీవి హిట్ సినిమా పడితే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందేననిమన శంకరవరప్రసాద్ గారు’తో  మరోసారి నిరూపించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం తొలి రోజు నుంచే హిట్ టాక్ సంపాదించుకుంది. ఫస్ట్ డేనే వరల్డ్‌వైడ్ గ్రాస్‌గా రూ.84 కోట్లు రాబట్టిన ఈ సినిమా, రెండు రోజుల్లోనే సెంచరీ (100 కోట్లు) కొట్టేసింది. మూడో రోజు కూడా కలెక్షన్స్ తగ్గకుండా భారీగా సాగింది. పండగ సీజన్ కావడంతో సినీ ప్రేక్షకులు పెద్ద ఎత్తున సినిమాకు తరలివెళ్లారు. దీంతో మూడు రోజుల్లో వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ.152 కోట్లకు చేరుకుందని మేకర్స్ అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు.

(మనశంకర వరప్రసాద్‌ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

ఇటీవల కాలంలో చిరంజీవి సినిమాకు స్థాయిలో కలెక్షన్స్రాలేదు. ఈ సినిమా ద్వారా మెగాస్టార్ తన పాత ఫామ్‌ను తిరిగి తెచ్చుకున్నాడని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడికి ఇది వరుసగా 9వ హిట్. అతని సంక్రాంతి సెంటిమెంట్ మళ్లీ వర్కౌట్ అయింది. గతంలో సంక్రాంతి సమయంలో విడుదలైన అతని చిత్రాలు అన్నీ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో, ఈ సారి కూడా అదే మ్యాజిక్ పనిచేసింది.

చిత్రంలో చిరుకి జోడీగా నయనతార నటించగా..క్యాథరిన్కీలక పాత్రలో పోషించింది. ఇక విక్టరీ వెంకటేశ్క్యామియో.. సినిమాకు మరింత ప్లస్యింది. సినిమాకు హిట్టాక్రావడంతో కలెక్షన్స్భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement