‘మనశంకర వరప్రసాద్’ సినిమా సక్సెస్ మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి హాజరై తన అనుభవాలను పంచుకున్నారు. చిరంజీవి మాట్లాడుతూ అన్నం, అమ్మ, సినిమా సక్సెస్ ఎప్పుడూ బోర్ కొట్టదు. వింటేజ్ చిరంజీవితో పాటు ఆ వింటేజ్ షీల్డ్ లు ఈ సినిమా ద్వారా మళ్లీ చూడటం ఆనందంగా ఉంది. చిత్ర పరిశ్రమలోకి రావాలనుకునే యువతను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మగపిల్లలైనా, ఆడపిల్లలైనా ఎంకరేజ్ చేయాలి. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదు. ఇండస్ట్రీ అద్దం లాంటిది.. మనం ఎలా బిహేవ్ చేస్తామో రిజల్ట్ కూడా అలానే ఉంటుంది.
ప్రతి ఒక్కరి వర్కింగ్ స్టైల్ వేరుగా ఉంటుంది. కొందరు ఔట్‌డోర్ యూనిట్ బిల్లులు ఎక్కువగా వెయ్యడం జరుగుతుంది. ఈ సినిమాను 85 రోజుల్లోనే అనుకున్న బడ్జెట్‌లో పూర్తి చేశాం. సంక్రాంతి సందర్భంగా విడుదలైన అన్ని సినిమాలు విజయవంతం కావడం సంతోషకరం. ఈ సినిమా సక్సెస్ అనంతరం కొందరు చెప్పిన మాటలు నన్ను ఎమోషనల్ ఫీలింగ్ కలిగించాయి. ఈ వయస్సులో కూడా ఎందుకు కష్టం అంటున్నారు.. నాకు కష్టపడటంలోనే ఆనందం. అందుకు తగ్గ ఉత్సాహం అభిమానుల శ్రేయోబిలాషుల ప్రశంసల నుంచే లభిస్తుందని అన్నారు. మెగాస్టార్ మాటలు అక్కడి అభిమానులను, చిత్రబృందాన్ని ఉత్సాహపరిచాయి.


