breaking news
Health
-
హీరో పునీత్ ఆఖరి క్షణాలు..అది గుండెపోటు కాదు..! ఫ్యామిలీ డాక్టర్ వివరణ
సుమారు ఐదేళ్ల క్రితం ఇదే సమయంలో పునీత్ రాజక్ కుమార్ అందర్నీ శోకసంద్రంలోకి నెట్టి వెళ్లిపోయారు. యావత్తు కర్ణాటక రాష్రం తీవ్ర విషాదంలో మునిగిపోయింద. కేవలం 46 ఏళ్ల వయసులో అత్యంత ప్రజాదరణ పొందిన నటుడు జిమ్‌లో వ్యాయామం చేశాక కుప్పకూలిపోవడం దేశవ్యాప్తంగా అందర్నీ తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. సరిగ్గా ఇదే సమయంలో అక్టోబర్ 29, 2021 గుండెపోటుతో మరణించినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే ఆవేళ ఆయనకు చికిత్స అందించిన వైద్యుడు డాక్టర్ రమణ రావు ఆయన మరణించింది గుండెపోటు వల్ల కాదంటూ షాకింగ్ విషయాలు వెల్లడించారు. అంతేగాదు ఆయన కూడా పునీత్‌రాజ్‌కుమార్ హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేకపోయానంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఆవేళ ఆ చివర నిమిషంలో పునీత్‌కి ఏమైందో సవివరంగా తెలిపారు.అసలు ఆవేళ ఏం జరిగిందంటే..ఆయన వైద్యుడి కథనం ప్రకారం..ఆ రోజు పునీత్ చేసిన వ్యాయామం ఆయన రోజు చేసే ఫిట్నెస్ దినచర్యకు భిన్నంగా ఉంది. పునీత్ ఆ రోజు తొలిసారిగా కిక్‌బాక్సింగ్ ప్రయత్నించారని, సుమారు గంటన్నరపాటు దాని కోసం శ్రమించారని అన్నారు. ఆ తదనంతరమే ఆయన అస్వస్థతకు గురై వైద్యుడిని సంప్రదించారని సమాచారం. అయితే ఆయన ఆస్పత్రికి చేరుకోవడానికి సరిగ్గా నిమిషం ముందే ఆయన గుండె కొట్టుకోవడం ఆగిపోయిందని వెల్లడించారు. అలాగే డాక్టర్ రమణరావు తనకు పునీత్‌తో ఉన్న అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. తాను పునీత్‌ని అప్పు అని ప్రేమగా పిలుస్తానని చెప్పారు. అతడు చాలా మంచి వ్యక్తి అని, తన కొడుకు లాంటి వాడని అన్నారు. తన రెండో కుమారుడు, పునీత్ మంచి స్నేహితులని, తరుచుగా కలిసి ఆడుకునేవారని చెప్పారు. తన వృత్తి జీవితంలో ఎన్నో విషాదాలు చూశాను. కొన్ని తన మనసుపై తీవ్రైమన ముద్ర వేసిన ఘటనలు ఉన్నాయని, వాటిని తాను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. అలాంటి వాటిలో అప్పు మరణం కూడా ఒకటని అన్నారు. అలాగే పునీత్ ఆఖరి నిమిషాలను గుర్తు చేసుకుంటూ డాక్టర్ ఇలా చెప్పుకొచ్చారు. తీవ్రమైన వ్యాయామం తర్వాత పునీత్ విపరీతమైన చెమటలతో తన క్లినిక్‌కు వచ్చారు. ఆ చెమట విపరీతంగా ఉండటం గమనించా. అసలేం జరిగిందని పునీత్‌ని అడగగా..తాను జిమ్‌కు వెళ్లానని, అక్కడ గంటన్నర పాటు కిక్‌బాక్సింగ్ చేశానని చెప్పాడు. ఆ వేళే కొత్తగా ఆ వ్యాయామాన్ని ప్రయత్నించాడు, పైగా తీవ్ర అలసటకు లోనయ్యాడు. అదీగాక అతడి చెమటను చూస్తే తీవ్రత అర్థమై తక్షణమే ఈసీజీ తీయించాను. అందులో గుండె తీవ్రమైన ఒత్తిడికి లోనై ఉన్నట్లు తేలింది. "తక్షణమే మందులు ఇచ్చాను, వెంటనే ఆస్పత్రికి తరలించాం. ఆయన తన సొంత కారులోనే వెళ్లాడు. అప్పటికి మాతో మాట్లాడుతున్నాడు. అయితే తాను అతన్ని తన భార్య అశ్విని ఒడిలో తల పెట్టుకుని విశ్రాంతి తీసుకోమని సూచించాను. డ్రైవర్‌ను త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లమని కోరాను. అదే సమయంలో డాక్టర్ రంగ నాయక్ అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ ఆస్పత్రి చేరకు మునుపే ఆయన గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. చెప్పాలంటే ఆస్పత్రిలోకి ప్రవేశించే లోపు కథ అయిపోయింది. అక్కడికి ఆస్పత్రి ప్రోటోకాల్‌ని అనుసరించి చేయాల్సిన ప్రయత్నం అంతా చేశాం, కానీ ఫలితం శూన్యం." అని భావోద్వేగంగా చెప్పుకొచ్చారు డాక్టర్ రమణరావు. ఆ క్షణం తనకు తన సొంత కొడుకునే కోల్పోయినంత బాధ వచ్చిందన్నారు.ఈ ఉదంతం నేర్పే పాఠం..వ్యాయామం ప్రారంభించే ముందు ఎల్లప్పుడూ వార్మ్-అప్, చివర్లో కూల్-డౌన్ తప్పనిసరిగా చేయాలని సూచిస్తున్నారు నిపుణులు. అతిగా లేదా తీవ్రమైన ఒత్తిడికి గురిచేసే వ్యాయామాలు చేసే ముందు ఫిట్నెస్ నిపుణుల సలహాలు సూచనలు తీసుకోవాలి. ఒకవేళ వర్కౌట్ల తర్వాత ఈ కింది లక్షణాలు కనిపిస్తే తక్షనమే వైద్యుడిని సంప్రదించాలి. ఛాతీలో నొప్పి, మంట, లేదా బిగుతుగా అనిపించడం.మెడ, దవడ, వెన్ను లేదా ఎడమ చేతికి నొప్పి పాకడం.విపరీతంగా చెమటలు పట్టడం మరియు ఊపిరి పీల్చుకోవడం కష్టం కావడం.తల తిరగడం, కళ్ళు తిరగడం లేదా వాంతులు వచ్చేలా అనిపించడం.కొత్తగా వ్యాయామాలు ప్రయత్నించే ముందు మీ శారీరక స్థితికి అనుకూలమా కాదో వైద్యులు లేదా ఆరోగ్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వైద్యులు లేదా వ్యక్తిగత నిపుణులను సంప్రదించడం ఉత్తమం. ఇదీ చదవండి: విదేశీ మేయర్.. దేశీ ఆటో! నార్వే మేయర్ భారత్ టూర్‌కి షాకవ్వాల్సిందే -
మానసిక ఆరోగ్యంపై టెక్ నిపుణుడు మోహన్‌దాస్ పాయ్ సలహాలు!
అందరు ఆరోగ్యంగా ఉండటం గురించి మాట్లాడతాం. ఆరోగ్యం కూడా బాగుండాలంటే..ముందుగా మనసు ఆహ్లాదభరితంగా ఉండటం అనేది అత్యంత ప్రధానం. ఆ విషయాన్నే ఆరిన్ క్యాపిటల్ చైర్మన్ మోహన్‌దాస్ ఇటీవల ఒక మీడియాతో అన్నారు. ఉన్నది ఒక్కటే జీవితం అది ఆరోగ్యప్రదంగా ఉండాలంటే మానసిక ఆరోగ్యం అనేది అత్యంత ప్రధానం అని అన్నారు. అయితే ఎవ్వరూ దీన్ని సరిగా అర్థం చేసుకోరు అంటూ చాలా ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. అవేంటో చూద్దామా..!.ఆరిన్ క్యాపిటల్ చైర్మన్, టెక్ నిపుణుడు మోహన్‌దాస్ పాయ్ ఇటీవల ఒక మీడియాతో మాట్లాడతూ..మానసిక ఆరోగ్యంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. మానసిక ఆరోగ్యం అనేది ఎప్పుడూ సరిగా అర్థం చేసుకోని అంశం. జీవితాన్ని ఎదుర్కోవడానికి మానసికంగా దృఢంగా ఉండటమే మానసిక ఆరోగ్యం. మనం బలహీనంగా ఉన్నామని లేదా కుంగుబాటుకు గురయ్యామని గుర్తించం అని అన్నారు. మానసిక ఆరోగ్య సమస్య అనేది పుట్టుకతో వచ్చేది కాదని అన్నారు. మనమందరం సాధారణ జీవితాలు గడుపుతాం. అయితే వాటిని మెరుగ్గా చేయమని సూచించారు. మనకు మనమే స్వీయ ప్రేరణ పొందుతూ మానసికంగా స్ట్రాంగ్‌గా ఉండండని పిలుపునిచ్చారు. తాను రోజులో చివరి వరకు ఉత్సాహంగా పనులు చేయాలని కోరుకుంటానని అన్నారు. అలాగే ఆధునిక కార్పొరేట్ జీవితంలోని ఒత్తిళ్లను ఎదుర్కోవడంపై సలహా ఇస్తూ ..ఇలా అన్నారు. మీ జీవితాన్ని మీరు గడపండి. ఆశావాదంతో ఉండండి. మీ లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లడానికి అహర్నిశలు కష్టపడండి. అంతే అంతకు మించి ఏమిలేదని అన్నారు. జీవితం చాలా సరళమైనది, ఉన్నది ఒక్కటే లైఫ్ అని మర్చిపోకండి మిత్రమా అని అన్నారు. అలాగే ప్రకృతిని గమనించండి. ముఖ్యంగా స్యూర్యుడు తన విధిన ఎంత నిబద్ధతతో నిర్వర్తిస్తాడో అలా మీ లైఫ్‌లో పనులన్నింటిని ఉత్సాహంగా చేసేలా ప్రయత్నించాలి. ముఖ్యంగా ది బెస్ట్‌గా చేయాలని అన్నారు. సూర్యుడు ఉదయించడంలోనూ అస్తమించడంలోనూ ఏమరపాటు గానీ తేడాలు గానీ ఉండవని గుర్తించుకోండని అననారు. అలాగే శారీరక దృఢత్వం గురించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ బరువు పెరగకుండా చూసుకోవాలని అన్నారు. మంచి ఆహారం తీసుకోవాలి, వ్యాయామం చేయాలి, బరువులు ఎత్తాలి, నడవాలి, శారీరకంగా చురుకుగా ఉండాలి అని చెప్పారు. తాను కరోనా మహమ్మారి సమయంలో పాటించిన దినచర్యను గుర్తు చేసుకుంటూ..ఒక ఏడాదిపాటు ఇంట్లోనే ఉండి ఉదయం, సాయంత్రం వ్యాయామాలు చేశానని చెప్పారు. ఇది తనకు అద్భుతమైన అనుభవం అని, ఎందుకంటే అసలు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే గడపడం ఇదే మొదటిసారి అని చెప్పారు. ఇంకో ముఖ్యమైన విషయం మీ శరీరాన్ని, మిమ్మల్ని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. ఉన్నది ఒక్కటే జీవితం మన గురించి మనమే పట్టించుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి..లేదంటే ఎవ్వరూ మనల్ని పట్టించుకోరు. అంటూ తన సంభాషణను ముగించారు టెక్ నిపుణుడు మోహన్‌దాస్ పాయ్.ఇదీ చదవండి: క‘లిపి’ నేర్చుకుందాం..! ఆడుతూ..ఇతిహాసాలు వినేద్దాం ఇలా..! -
ఆడుతూ..ఇతిహాసాలు వినేద్దాం ఇలా..!
‘‘ఒకప్పుడు రామాయణం వినాలంటే అమ్మమ్మ దగ్గర కూర్చునేవారు. మహాభారతం తెలుసుకోవాలంటే తాతయ్య చెప్పే కథలు వింటూ ఊ కొట్టేవారు. ఆ తర్వాత ఎన్నో వేదికలు మారాయి. ఇప్పుడు ఆ కథా గుచ్చాల్ని డిజిటల్ రూపంలో అందిస్తున్నాం’’ అని తెలిపారు ‘లిపి ఎపిక్’ డిజిటల్ నిర్వాహకులు విద్యాసాగర్ అనిసింగరాజు. గతంతో పోల్చితే నేటి తరానిది ఓ కొత్త సమస్య. ఇతిహాసాల మీద తీసిన సీరియళ్లు, సినిమాలు, వచ్చిన అనేకానేక పుస్తకాలు .. కథల కల్పితాలతో ఎన్నో సందేహాలు తలెత్తుతుంటాయి. ‘దీనిని గమనించి ఒక తరం విస్మరించిన వాస్తవాల మూలాలకు వెళ్లి మరీ తీసుకువచ్చే ప్రయత్నం చేశాం’ అని తెలిపారు లిపి డైరెక్టర్ చాగంటి ప్రసాద్. ‘దాదాపు రెండేళ్ల΄పాటు దీనిని వెలుగులోకి తీసుకురావడానికి అనుభవజ్ఞులతో కలిసి కసరత్తు చేశాం. సుమారు 500 మందితో నేరుగా మాట్లాడాం. వారిలో చాలామందికి రామాయణ, భారత, భాగవతాల గురించి తెలుసుకోవాలని ఉంది. కానీ చదవడానికి, నేర్చుకోవడానికి సమయం, ఓపిక ఉండట్లే దు. దాంతో నిమిషంలోనే ఇతిహాసాలతో కనెక్ట్ అయ్యే మార్గం కనుక్కున్నాం. అదే దీనికి మొదటి మెట్టు’ అంటారు వైస్‌ప్రెసిడెంట్ అపర్ణ. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, ఉత్తర భారతదేశంలో మూడు వేల మంది స్కూల్ పిల్లలకు ఉచితంగా డిజిటల్ రూపంలో చేరువయ్యే ప్రయత్నం చేశామని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని స్కూళ్లకు తమ కృషిని అందించనున్నామని, లక్ష యూజర్లకు చేరువవుతున్నామని వివరించారు. చూడచ్చు.. ఆడచ్చు ... డిజిటల్ రూపంలో ఉన్న ఈ కథనాలను ఒకేసారి చదవచ్చు, వినచ్చు, చూడచ్చు. ఆడచ్చు. పాత్రల చుట్టూ ఉన్న బంధాల గురించి, ఆ మేధస్సు గురించి తెలుసుకోవచ్చు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలో రామాయణ మహాభారతాలను దశలవారీగా తెలుసుకునే అవకాశం ఉంది. చిన్న కథలు రోజువారీగా నేర్చుకునేందుకు, వివరణాత్మక కథలు మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు, ఆడియో కథలు వినేందుకు ఉపయోగపడతాయి. క్విజ్‌ల ద్వారా నేర్చుకున్న విషయాలను పరీక్షించుకోవచ్చు. ఒకే వేదిక... పిల్లలు మొబైల్ స్క్రీన్లలో తలలు దూర్చి గంటల తరబడి వీడియో గేమ్స్ ఆడుతుంటారని పేరెంట్స్ కంప్లైంట్. అందువల్లే చదువు మీద ఆసక్తి పోయిందని టీచర్లూ చెబుతుంటారు. అదే వారి మొబైల్లో ఈ గేమ్ డౌన్ లోడ్ చేసుకుంటే రామాయణ, మహాభారతాలను గేమ్స్ ద్వారా తెలుసుకుంటూ మేధోవికాసం దవచ్చు. ఒక విద్యార్థికి క్విజ్గానూ, మరోవ్యక్తికి కథ రూపంలోనూ ఒకే వేదిక ద్వారా భిన్నరూపాలలో ఇతిహాసాల గురించి తెలుసుకునే అవకాశం ఉంది. తల్లిదండ్రులు ఆడియో కథలను పిల్లలకు వినిపించవచ్చు. ఉపాధ్యాయులు సాంస్కృతిక అంశాలను చర్చకు తీసుకురావచ్చు. పెద్దలు తమకు తెలిసిన కథలను గుర్తుచేసుకోవచ్చు. ఈ విధంగా లిపి కుటుంబంలో తరాల మధ్య కథలకు వారధిగా మారుతుంది.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఅనుభవజ్ఞులు, ఇతిహాసాల మూలాలు తెలిసిన పండితుల నుంచి మూలాల్లో ఉన్న వాస్తవ కథనాలను పొందుపరిచాం. జీవితపు విలువలను, మేధోశక్తికి కావల్సిన పరిజ్ఞానపు భాండాగారాన్ని అందిస్తున్నాం.– చాగంటి ప్రసాద్, డైరెక్టర్, లిపి ఎపిక్స్ -
మన గుండెకూ ఓ మెదడు ఉందా?
మన తలలో ఓ మెదడు ఉందని మనకు తెలుసు. గుండెకు ప్రత్యేకంగా మెదడు లేదన్న విషయం మనకు తెలిసిందే. ఇలా చూస్తే ఆలోచనలకు నిలయం మెదడు. ఆ మెదడు సహా దేహంలోని అన్ని అవయవాలకూ రక్తాన్ని పంపేది గుండె. మెదడు ఆదేశాల ప్రకారమే గుండె పనిచేస్తుంది. ఇది నిజం కూడా. కాకపోతే... గుండె పూర్తిగా మెదడు ఆదేశాలు స్వీకరించే ఒక సబార్డినేట్ ఉద్యోగి మాత్రమే కాకపోవచ్చు! ఎందుకంటే గుండెలోనూ నాడీకణాల (న్యూరాన్స్) నెట్వర్క్ ఒకటి ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాదు... గుండెకూ మెదడుకూ మధ్య నిరంతరం సమాచార మార్పిడి జరుగుతుంటుంది. మరి గుండెకు తనదైన నాడీ వ్యవస్థ ఎందుకు? మనం భయపడినా, ఆందోళన చెందినా, ఆనందంతో ఉప్పొంగినా గుండె వేగం ఎందుకు మారుతుంది? నిద్రకూ గుండె ఆరోగ్యానికీ సంబంధం ఏమిటి? ఈ ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.గుండెలో నాడీకణాలుంటాయా?మన మెదడులో కోట్లాది నాడీకణాలు ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇవి ఒకదానితో మరొకటి సంకేతాలను ఇచ్చిపుచ్చుకుంటూ నిరంతరం సమాచారాన్ని ప్రాసెస్ చేస్తాయి. అయితే గుండెలోనూ నాడీకణాల సమూహాలు ఉంటాయన్నవిషయం చాలామందికి తెలియదు. గుండె ఉపరితలానికి సమీపంలో... ముఖ్యంగా దాని చుట్టూ ఉండే కొవ్వు కణజాలంలో... నాడీకణాల సమూహాలు (గ్యాంగ్లియా) ఉంటాయి. ఇవి కలిసి పనిచేసే వ్యవస్థను ఇన్ట్రిన్సిక్ కార్డియాక్ నర్వస్ సిస్టమ్ అంటారు. సరదాగా చెప్పుకోవాలంటే దీన్ని ‘గుండెకు సొంతమైన చిన్న నాడీ నెట్వర్క్’గా అనుకోవచ్చు. ఈ నాడీ వ్యవస్థలోని కణాలు గుండె నుంచి వచ్చే సమాచారాన్ని స్వీకరించడమే కాకుండా, అక్కడికక్కడే (లోకల్‌గా / స్థానికంగా) ఆ సమాచారాన్ని ప్రాసెస్ చేసి గుండె పనితీరును నియంత్రించడంలోనూ సహాయపడతాయి. గుండె కొట్టుకునే వేగం, దాని లయ, ఇతర నాడీ సంకేతాలకు అది స్పందించే తీరు వంటి అంశాల నియంత్రణలో వీటి భూమిక / పాత్ర ఉంటుంది. గుండెలో ఎన్ని నాడీకణాలు ఉంటాయనే విషయం చాలా అంశాల మీద ఆధారపడి వ్యక్తి నుంచి వ్యక్తికి మారవచ్చు. కొన్ని పరిశోధనల్లో పెద్దవారి గుండెలో సుమారు 40,000 వరకు అంతర్గత నాడీకణాలు ఉండవచ్చని ఓ అంచనా. (అయితే ఈ సంఖ్యను ప్రతి గుండెకూ వర్తించే ఖచ్చితమైన లెక్కగా పరిగణించకూడదు). ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. గుండెలో నాడీకణాలు ఉన్నంత మాత్రాన దానికి మెదడులాంటి ఆలోచనా శక్తి ఉందని కాదు. జ్ఞాపకాలు ఏర్పరచుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం, మనుషులను గుర్తుపట్టడం వంటి పనులు గుండె చేయదు. అయితే గుండె పనితీరును నియంత్రించడంలో దాని సొంత నాడీ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది.మరి ఈ మార్పులను ఎవరు నియంత్రిస్తారు?ఇక్కడే మెదడుకూ గుండెకూ మధ్య ఉన్న సంబంధం తెరపైకి వస్తుంది. మన శరీరంలోని గుండె కొట్టుకోవడం, శ్వాస, జీర్ణక్రియ వంటి అనేక పనులు మనం ప్రతిసారీ నిర్దిష్టమైన ఓ స్పృహతో ఆదేశాలు ఇవ్వకుండానే వాటంతట అవే జరిగిపోతుంటాయి. వీటిని నియంత్రించడంలో ‘అటనామిక్ నర్వస్ సిస్టమ్’ అనే నాడీ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది.దీనిలో ప్రధానంగా రెండు విభాగాలుంటాయి.1. సింపాథటిక్ నాడీ వ్యవస్థ ( సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్): ప్రమాదం ఎదురైనప్పుడు, భయపడినప్పుడు, పరుగెత్తినప్పుడు లేదా శారీరక శ్రమ చేసినప్పుడు శరీరాన్ని అప్రమత్తం చేస్తుంది. సాధారణంగా గుండె వేగం పెరగడానికి, గుండె సంకోచించే శక్తి పెరగడానికి తోడ్పడుతుంది.2. పారా సింపాథటిక్ నాడీ వ్యవస్థ (పారా– సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్): మామూలు / విశ్రాంతి సమయంలో గుండె వేగాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ వ్యవస్థలో వేగస్ నర్వ్ కీలకమైన పాత్ర పోషిస్తుంది. అయితే ఇవి రెండూ ఒకదానికొకటి పూర్తిగా వ్యతిరేకంగా పనిచేసే స్విచ్‌ల వంటివి కావు. దేహం ఉన్న పరిస్థితిని బట్టి రెండింటి కార్యకలాపాలు ఓ సమన్వయంతో పనిచేస్తూ అవరసాన్ని బట్టి మారుతుంటాయి. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఉంది. సమాచార ప్రవాహం మెదడు నుంచి గుండెకు మాత్రమే ఉండదు. గుండెలోని సెన్సరీ నాడీకణాలు గుండె పనితీరు, ఒత్తిడి, రసాయన పరిస్థితులకు సంబంధించిన సంకేతాలను మెదడుకు కూడా పంపుతాయి. ఆ సమాచారాన్ని బట్టి కూడా మెదడు తన అటానమస్ నర్వస్ సిస్టమ్ (స్వయంచాలక నాడీ వ్యవస్థ) ద్వారా గుండె పనితీరులో తగిన మార్పులు చేయగలదు. అంటే మెదడు గుండెకు ఆదేశాలు ఇవ్వడమే కాదు; గుండె నుంచి వచ్చే సమాచారాన్ని కూడా స్వీకరిస్తుంది. ఈ పరస్పర సంబంధాన్ని శాస్త్రవేత్తలు ‘బై–డైరెక్షనల్ హార్ట్–బ్రెయిన్ కమ్యూనికేషన్ ’ అని పేర్కొంటారు. 2024లో ప్రచురితమైన ఒక సమీక్షలో గుండెకు చెందిన ఈ అంతర్గత నాడీ వ్యవస్థ నిర్మాణం, దాని పనితీరు, గుండె లయలో మార్పులు సహా వివిధ పరిస్థితుల్లో దాని పాత్రను వివరించారు. ఈ రంగంలో పరిశోధనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.భయపడినప్పుడు గుండె ఎందుకు వేగంగా కొట్టుకుంటుంది?ఒక్కసారి ఈ పరిస్థితిని ఊహించండి. మీరు రాత్రి వేళ చీకట్లో నడుస్తున్నారు. అకస్మాత్తుగా మీ ముందే ఏదో ఆకారం కనిపించింది. అది ఏమిటో అర్థం కాకముందే గుండె వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. చేతులు చెమటలు పట్టవచ్చు. శ్వాస వేగం పెరగవచ్చు.ఇదో సహజమైన ప్రతిస్పందన... ఇది మనల్ని ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి లేదా అక్కడి నుంచి తప్పించుకోవడానికి సిద్ధం చేసే సహజమైన ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్. ఇది మన మనుగడకు ఉపయోగపడే సహజమైన ప్రతిస్పందన. ఎందుకంటే... ఆ ప్రమాదకరమైన అంశంతో వీలైతే పోరాడటం చేయడం (ఫైట్) లేదా ఆ ప్రమాదకరమైన పరిస్థితి నుంచి తప్పించుకోవడం (ఫ్లైట్) ద్వారా మనం బతికిపోవడానికి దేహం కనబరిచే సహజమైన ప్రతిస్పందన ఇది. అలాగే పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్నప్పుడు, ముఖ్యమైన సమావేశానికి ముందు, ఉద్యోగ సంబంధమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా గుండె వేగం పెరగవచ్చు. కొన్ని సందర్భాల్లో ఆనందం, ఉత్సాహం వంటి సానుకూల భావోద్వేగాల (పాజిటివ్ ఎమోషన్స్)లోనూ గుండే వేగంలో మార్పులు రావచ్చు. ఒత్తిడి గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందా?రోజువారీ జీవితంలో కొంత ఒత్తిడి సహజం. అప్పుడప్పుడు ఎదురయ్యే ఒత్తిడికి శరీరం స్పందించడం కూడా సహజమే. అయితే... సమస్య ఎప్పుడు వస్తుందంటే ఆ ఒత్తిడి దీర్ఘకాలం కొనసాగినప్పుడు అది ఓ ముప్పుగా మారే అవకాశముంది. పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, అనారోగ్యం గురించి ఆందోళన వంటి పరిస్థితులు ఎక్కువకాలం కొనసాగితే శరీరం తరచుగా అప్రమత్త స్థితిలోనే ఉండవచ్చు. దీనివల్ల గుండె వేగం, రక్త΄ోటులో మార్పులు రావచ్చు. నిద్రలేమి సమస్యతో నిద్ర దెబ్బతినవచ్చు. కొందరిలో ఆహారపు అలవాట్లు మారవచ్చు, శారీరక శ్రమ తగ్గవచ్చు లేదా పొగతాగడం వంటి అనారోగ్యకరమైన అలవాట్లు పెరగవచ్చు. ఈ అంశాలన్నీ కలిసినప్పుడు గుండె జబ్బుల ముప్పు పెరిగే అవకాశం ఉంది.అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా దీర్ఘకాలిక ఒత్తిడిని గుండె ఆరోగ్యానికి సంబంధించిన ముఖ్యమైన అంశంగా పరిగణిస్తోంది. అయితే ఒత్తిడికీ గుండె జబ్బులకూ మధ్య ఉన్న సంబంధం సంక్లిష్టమైనది. ఒత్తిడి ఉందంటే తప్పనిసరిగా గుండె జబ్బు వస్తుందని కాదు; అలాగే ఒత్తిడిని తగ్గించుకున్నంత మాత్రాన గుండె జబ్బులు రావన్న హామీ కూడా ఉండదు. అందువల్ల ఒత్తిడిని తగ్గించుకోవడం గుండె ఆరోగ్యానికి ఉపయోగకరమైన చర్యే కానీ, రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్ నియంత్రణ, వైద్య పరీక్షలు, అవసరమైన చికిత్సలకు అది ప్రత్యామ్నాయం కాదని గుర్తుంచుకోవాలి.గుండె వేగం పెరగడం / తగ్గడం ఎందుకు జరుగుతుందంటే...మెదడు ఒక పరిస్థితిని ప్రమాదకరమైనదిగా భావించినప్పుడు శరీరాన్ని అప్రమత్తం చేసే ప్రతిస్పందన ప్రారంభమవుతుంది. సింపాథటిక్ నాడీ వ్యవస్థ చురుగ్గా మారుతుంది. అడ్రినలిన్ వంటి హార్మోన్ల ప్రభావంతో గుండె వేగంగా కొట్టుకోవడం, రక్తపోటు (బ్లడ్ ప్రెషర్) పెరగడం, శ్వాస వేగవంతం కావడం వంటి మార్పులు సంభవిస్తాయి.నిద్రకూ గుండె ఆరోగ్యానికీ సంబంధం ఏమిటి?నిద్రపోయినప్పుడు శరీరం పూర్తిగా పనిచేయడం ఆపేస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ నిద్రలోనూ గుండె, మెదడు, ఇతర అవయవాలు తమ పనులను కొనసాగిస్తూనే ఉంటాయి. నిద్ర దశలను బట్టి గుండె వేగం, రక్తపోటు, స్వయంచాలక నాడీ వ్యవస్థ కార్యకలాపాల్లో మార్పులు వస్తాయి. నాణ్యమైన నిద్రలో శరీరానికి మంచి విశ్రాంతి లభిస్తుంది. కానీ తరచూ నిద్ర సరిపోకపోవడం, నిద్ర సమయాలు అస్తవ్యస్తంగా ఉండటం లేదా నిద్రలో శ్వాస ఆగిపోవడం వంటి సమస్యలు ఉంటే ఆరోగ్యంపై ప్రభావం పడవచ్చు.దీర్ఘకాలంగా నిద్రలేమితో బాధపడుతుండటం, అధిక రక్తపోటు (హైబీపీ), ఊబకాయం, మధుమేహం (డయాబెటిస్) వంటివి గుండె జబ్బులకు దారితీసే ముప్పు ఉంది. ముఖ్యంగా అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా ఉన్నవారిలో నిద్రలో పదేపదే శ్వాస ఆగిపోవడం వల్ల రక్తంలోని ఆక్సిజన్ స్థాయులు తగ్గవచ్చు. శరీరంపై అదనపు ఒత్తిడి పడవచ్చు. ఇలాంటి పరిస్థితిలో వైద్య పరీక్షలు, చికిత్స అవసరం కావచ్చు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ పెద్దవారు సాధారణంగా ప్రతి రాత్రీ 7–9 గంటల పాటు కంటినిండా నిద్రపోవాలంటూ సూచిస్తోంది. అయితే ఈ సమయం అన్నది వ్యక్తిగత అవసరాలను బట్టి మారుతుండవచ్చు. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేమిటంటే... నిద్ర సమయంతో పాటు నిద్రలో నాణ్యత (క్వాలిటీ ఆఫ్ స్లీప్) కూడా ముఖ్యం. అందుకే నిద్రను వృథా అవుతున్న సమయంగా చూడకూడదు. ఆరోగ్యకరమైన జీవనశైలిలో దానికీ తగిన స్థానం ఇవ్వాలి.హార్ట్ రేట్ వేరియబిలిటీ (హెచ్ఆర్వీ) అంటే...? మన గుండె నిమిషానికి 70 సార్లు కొట్టుకుంటోందనుకుందాం. అంటే ప్రతి రెండు గుండె చప్పుళ్ల మధ్య సమయం ఎప్పుడూ సరిగ్గా ఒకేలా ఉంటుందా? తప్పనిసరిగా కాదు. ఒక చప్పుడుకూ మరొక చప్పుడుకూ మధ్య ఉండే వ్యవధిలో సహజమైన చిన్నచిన్న మార్పులు ఉంటాయి. వీటిని హార్ట్ రేట్ వెరియబిలిటీ (హెచ్ఆర్వీ) అంటారు.ఈ మార్పులను స్వయంచాలక నాడీ వ్యవస్థ ప్రభావితం చేస్తుంది. శ్వాస, శారీరక శ్రమ, నిద్ర, వయసు, మందులు, అనారోగ్యం వంటి అనేక అంశాలు హెచ్ఆర్వీపై ప్రభావం చూపుతాయి. అయితే హెచ్ఆర్వీ ఎక్కువగా ఉంటే ఆరోగ్యం అంతా బాగున్నట్టేననీ లేదా తక్కువగా ఉంటే గుండె జబ్బు ఏదైనా ఉండవచ్చన్నది అంత తేలిగ్గా నిర్ణయించడం సాధ్యం కాదు. అవి... ఆ వ్యక్తి తాలూకు పరిస్థితి, గుండె తాలూకు వివరాలను కొలిచిన టైమ్, విధానం, అతడి ఇతర ఆరోగ్య వివరాలపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కొన్ని స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్నెస్ పరికరాలు కూడా ‘హెచ్ఆర్వీ’ని కొలుస్తున్నాయి. ఇవి రోజువారీ మార్పులను గమనించడానికి ఉపయోగపడవచ్చు. కానీ వాటి ఆధారంగా గుండె జబ్బులను నిర్ధారణ చేయడం లేదా వైద్య చికిత్సను మార్చుకోవడం సరికాదు.ఇలాంటి సందర్భాల్లో మాత్రం డాక్టర్‌ను సంప్రదించాల్సిందే...ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. భావోద్వేగాల వల్ల గుండె వేగం పెరగడం అన్నది చాలా సాధారణంగా జరిగే ప్రక్రియే. ఇది చాలా సందర్భాల్లో సాధారణ శారీరక ప్రతిస్పందనగానే పరిగణించాలి. కానీ గుండె వేగం తరచుగా అసాధారణంగా పెరగడం, గుండె లయ తప్పినట్లు అనిపించడం లేదా దానితో పాటు ఛాతినొప్పి, తీవ్రమైన శ్వాస ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వాటిని కేవలం ఒత్తిడికి ఆపాదించకుండా వైద్య సహాయం తీసుకోవాలి.గుండెకు తనదైన ఓ సొంత విద్యుత్ వ్యవస్థ కూడా... గుండెలో నాడీకణాలున్నాయనే విషయం ఒక ఆసక్తికరమైన అంశమైతే, గుండె కొట్టుకోవడానికి ప్రతిసారీ మెదడు నుంచి ఆదేశం రావాల్సిన అవసరం లేదనేది మరో అద్భుతమైన విషయం.గుండెలో సైనోఏట్రియల్ నోడ్ (లేదా సంక్షిప్తంగా ఎస్ఏ నోడ్) అనే ప్రత్యేక కణాల సమూహం ఉంటుంది. దీన్ని గుండె తాలూకు సహజమైన పేస్‌మేకర్ అంటారు. ఈ కణాలు స్వయంగా విద్యుత్ సంకేతాలను ఉత్పత్తి చేస్తాయి. ఆ సంకేతాలు గుండెలోని విద్యుత్ ప్రసరణ వ్యవస్థ ద్వారా వ్యాపించి, గుండె గదులు క్రమపద్ధతిలో సంకోచించి రక్తాన్ని పంప్ చేసేలా సహాయపడతాయి. అందుకే గుండె తన సహజమైన లయను తానే స్వయంగా నిర్వహించుకోగలదు. అయితే గుండె వేగం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనం నడిచినా, పరుగెత్తినా, విశ్రాంతి తీసుకున్నా, భయపడినా లేదా నిద్రపోయినా దాని వేగం మారుతుంది. మరి గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి?గుండె–మెదడు సంబంధం గురించి తెలుసుకోవడం ఆసక్తికరమే. కానీ దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం రోజువారీ అలవాట్ల విషయంలో ఉంది. ఒత్తిడిని గుర్తించడం: నిరంతర ఆందోళన, చిరాకు, మానసిక అలసట ఉంటే వాటిని పట్టించుకోకుండా వదిలేయకూడదు. అవసరమైతే గుండె వైద్య నిపుణలను గానీ లేదా అవసరమైతే మానసిక ఆరోగ్య నిపుణుడిని కలిసి వారి సహాయం తీసుకోవాలి.నిద్రకు ప్రాధాన్యం ఇవ్వడం: సాధ్యమైనంతవరకు ఒక నిర్ణీతమైన వేళల్లోనే పడుకోవడం, లేవడం అలవాటు చేసుకోవాలి.. గురకతో పాటు నిద్రలో ఊపిరి ఆగిపోవడం, పగటిపూట విపరీతమైన నిద్రమత్తు ఉంటే డాక్టర్‌ను తప్పక సంప్రదించాలి.క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం: వారి వారి వయసూ, ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా వారికి తగినట్లుగా నడక లేదా ఇతర వ్యాయామాన్ని ఎంచుకోవాలి. ఇప్పటికే గుండె సమస్యలు ఉన్నవారు తాము వ్యాయామం మొదలుపెట్టే ముందర తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించి తాము ఏమేరకు వ్యాయామం చేయవచ్చన్నది వైద్యుడి సలహా మేరకు మాత్రమే నిర్ణయించుకోవాలి.బీపీ, షుగర్, కొలెస్ట్రాల్‌లను నియంత్రించడం: అన్ని పోషకాలూ ఉండే ఆరోగ్యకరమైన సమతులాహారం తీసుకోవడం, అవసరమైన పరీక్షలు చేయించుకోవడం, డాక్టర్ సూచించిన మందులను క్రమంగా వాడటం ముఖ్యం.పొగతాగే అలవాటుకు దూరంగా ఉండటం: పొగాకు గుండె–రక్తనాళాల ఆరోగ్యానికి హానికరం. అలాగే వీలైనంతవరకు మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.ఒత్తిడి తగ్గించుకోవడం: విశ్రాంతి, కుటుంబ సభ్యులతో మాట్లాడటం, సంగీతం వినడం, ఇష్టమైన హాబీల్లో పాల్గొనడం వంటి పద్ధతులు కొందరిలో ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడవచ్చు.ఇదీ చదవండి: జస్ట్ 30 సెకన్ల బ్రేక్‌ఫాస్ట్ ఐడియాతో..నెలకు రూ. 1 కోటి సంపాదన!చివరగా...గుండెకు మెదడులాంటి ఆలోచనా శక్తి లేకపోవచ్చు. కానీ గుండె పూర్తిగా మెదడు ఆదేశాల కోసం ఎదురుచూసే అవయవమూ కాదు. దానికి తనదైన విద్యుత్ వ్యవస్థ ఉంది. గుండెలోనే నాడీకణాల నెట్వర్క్ ఉంది. మెదడుకూ గుండెకూ మధ్య నిరంతరం సమాచార మార్పిడి జరుగుతుంది. మన భావోద్వేగాలూ, ఒత్తిడీ, నిద్ర, శారీరక శ్రమ వంటి అంశాలు ఈ వ్యవస్థల పనితీరును ప్రభావితం చేస్తాయి. అందుకే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే గుండెను మాత్రమే కాకుండా మన మొత్తం ఆరోగ్యాన్ని, జీవన శైలిని కూడా పట్టించుకోవాలి.గుండెకు మెదడు ఉందా? అన్న ప్రశ్నకు నేరుగా ఇచ్చే సమాధానం ‘లేదు’ అనే అయినప్పటికీ... గుండెకు సొంత నాడీ వ్యవస్థ ఉందన్న విషయం మాత్రం నిజం. ఆ వ్యవస్థ గురించి మనకు తెలిసే కొద్దీ, గుండెను అర్థం చేసుకునే తీరు మారుతూ ఉంటుంది... దాంతో మన అవగాహనా మరింతగా విస్తరిస్తుంటుంది. డాక్టర్ ఎం.ఎస్.ఎస్. ముఖర్జీ, సీనియర్ కార్డియాలజిస్ట్. నిర్వహణ యాసీన్ ఇదీ చదవండి: వ్యాయామం చేయకుండానే క్రియాటిన్ కండరాలను పెంచుతుందా? -
పరీక్షల్లో పాసయ్యేదెవరు?
గడిచిన దశాబ్దంలో వైద్య పరీక్షలు తెచ్చిన విప్లవం అంతా ఇంతా కాదు. ఇపుడు చాలా పరీక్షలకు ఆసుపత్రులో, డయాగ్నస్టిక్ సెంటర్లో అవసరం లేదు. ఇంటికే వచ్చి శాంపిల్స్ తీసుకుంటారు. కొన్ని పరీక్షలు అక్కకే చేసేస్తున్నారు!!. అంతేకాదు. అనారోగ్యం వస్తేనే పరీక్షలు చేయించుకునే కాలం పోయింది. ఎలాంటి సమస్యలూ లేకున్నా... ప్రతి ఆరు నెలలకో, ఏడాదికో ప్రివెంటివ్ చెకప్ చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. వీటన్నింటి ఫలితమే... మన డయాగ్నస్టిక్స్ మార్కెట్ ఇపుడు రూ.లక్ష కోట్లు దాటేసింది. మరి ఈ రంగంలో విన్నర్ ఎవరు? చాలా డయాగ్నస్టిక్ సెంటర్లు లిస్టవుతున్న ఈ పరిస్థితుల్లో ఎవరి పనితీరు ఎలా ఉంది? ఇన్వెస్టర్లు ఎలాంటి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయాలి? ఇవన్నీ వివరించేదే ఈ ‘హెల్త్‌కేర్ ఎకానమీ పార్ట్–3’.ఓ రక్తం చుక్క... శరీరంలో ఉన్న చాలా సమస్యల్ని చెబుతుంది. ఓ ఎంఆర్ఐతో... నరాలకు సంబంధించిన సమస్యలుంటే తెలుస్తుంది. ఓ బయాప్సీతో కేన్సర్‌ను కనుక్కోవచ్చు. ఓ మాలిక్యులర్ పరీక్షతో ఇన్ఫెక్షన్ స్థాయిని తెలుసుకోవచ్చు. ఇదీ... ఆరోగ్య రంగంలో డయాగ్నోస్టిక్స్ పోషిస్తున్న పాత్ర. కాకపోతే ఇన్వెస్టర్లు చూడాల్సిన అత్యంత ప్రధానమైన అంశం మరొకటుంది. అది... ఈ రంగం ఏటా 20–24 శాతం పెరుగుతుండటం. మరి ఆ పెరిగే మార్కెట్‌తో లబ్ధి పొందేదెవరు? ఎక్కువ పరీక్షలు చేసేదెవరు? గడిచిన ఐదేళ్లలో డయాగ్నోస్టిక్ రంగంలో పోటీ విపరీతంగా పెరిగింది. ధరలు ఎక్కడ తక్కువుంటే అక్కడికే జనం వెళుతుండటంతో... పెద్దగా ధరలు పెంచే పరిస్థితి లేదు. దీంతో ఎక్కువ పరీక్షలు చేసేవారికే ఎక్కువ రెవెన్యూ... ఎక్కువ లాభాలు అనే పరిస్థితి ఏర్పడింది. అలాగని ఎక్కువ సెంటర్లు పెడితే లాభాలపై ప్రభావం పడుతోంది. కాబట్టి తక్కువ సెంటర్లతోనో, ఇంటిదగ్గరే శాంపిల్స్ తీసుకునే మోడల్‌తోనో ఎక్కువ పరీక్షలు చేసే కంపెనీలే విజేతలుగా నిలవబోతున్నాయి. విజయ డయాగ్నస్టిక్స్... మార్జిన్లలో ఆధిపత్యం ఈ గ్రూపులో ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన కంపెనీ ఇదేనని చెప్పొచ్చు. ఎందుకంటే పాథాలజీపైనే ఫోకస్ పెట్టిన డాక్టర్ లాల్ పాథ్‌ల్యాబ్స్ మాదిరి కాకుండా... హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఈ కంపెనీ పాథాలజీ, రేడియోలజీ రెండింట్లోనూ తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ వస్తోంది. సీటీ, ఎంఆర్ఐ, అ్రల్టాసౌండ్, ఎక్స్‌రే, పాథాలజీ వంటివన్నీ ఉన్న ఆల్‌రౌండర్‌గా ఈ సంస్థను చూడొచ్చు. నిజానికి రేడియోలజీ వల్ల ఆర్థికాంశాలు పూర్తిగా మారిపోతాయి. ఎందుకంటే బ్లడ్ శాంపిల్‌ను ఒకచోట సేకరించి మరోచోటికి పంపించవచ్చు కానీ... ఎంఆర్ఐ కోసం వచ్చిన పేషెంట్‌ను బ్లడ్ శాంపిల్ మాదిరి రవాణా చేయలేం. రేడియోలజీ పరికరాలు పేషెంట్లకు చేరువలో ఉండాల్సిందే. అప్పుడే ఎక్కువ మంది వస్తారు. కానీ దీనికి పెట్టుబడులూ ఎక్కువే కావాలి. కాకపోతే ఎక్కువ పేషెంట్లొచ్చి వాడకం పెరిగే కొద్దీ ఈ రేడియోలజీ తెచ్చే లాభాలు చాలా ఎక్కువ. ఈ విషయాన్ని విజయ డయాగ్నస్టిక్స్ తాజా ఫలితాలు చూసి అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో విజయ రెవెన్యూ ఏకంగా 22.8 శాతం... అంటే రూ.231 కోట్లు పెరిగింది. ఎబిటా ఏకంగా 34 శాతం పెరిగి రూ.99 కోట్లకు చేరింది. నికరలాభం కూడా 37.6 శాతం పెరిగి రూ.53 కోట్లకు చేరింది. అన్నిటికన్నా ముఖ్యం... మార్జిన్ల శాతం. ఎబిటా మార్జిన్ ఏకంగా 42.7 శాతానికి చేరింది. ఇది గతేడాది 39.1 శాతంగా ఉంది. అంటే... ప్రస్తుతం అన్నిచోట్లా కేంద్రాలున్నాయి. పరికరాలున్నాయి. వీటికి మరింత మంది పేషెంట్లు జతవుతున్నారు. ఇప్పటికే యంత్రాలను కొనుగోలు చేసిన నేపథ్యంలో వాటి వాడకం పెరుగుతోంది. అది లాభాల్ని పెంచుతోంది. నిర్వహణ పరంగా మెరుగైన స్థాయిని సాధించటమంటే ఇదే. పరీక్షా కేంద్రాలను పెంచటం కాదు... వాటిని ఏ స్థాయిలో వాడుతున్నామన్నది ముఖ్యం. విజయ విషయంలో కలిసి వస్తున్నది ఇదే.థైరోకేర్... పరీక్షల కర్మాగారం ఈ కంపెనీది వినూత్నమైన మోడల్. ఎక్కడికక్కడ వేలాది ల్యాబొరేటరీలతో విస్తరించిన డయాగ్నస్టిక్స్ కంపెనీ కాదిది. ప్రధానమైన అన్ని ప్రాంతాల్లోనూ శాంపిల్స్‌ను సేకరించే వేలాది మందితో అనుసంధానమై విస్తరించిన పరీక్షల కర్మాగారమిది. ఆటోమేషన్తో పాటు భారీ ఎత్తున ప్రాసెసింగ్ చేయగలిగిన సామర్థ్యం ఈ కంపెనీ సొంతం. దీనివల్ల ప్రతి టెస్ట్‌కూ అయ్యే ఖర్చులు తక్కువ. శాంపిల్ సేకరణను ఎక్కడికక్కడ ఫ్రాంచైజీ తరహాలో వ్యక్తులకు అప్పగించటమనే కొత్త విధానానికీ శ్రీకారం చుట్టిందీ సంస్థ. ఇవన్నీ కలిసి 2026 మూడవ త్రైమాసికంలో కంపెనీ ఆదాయాన్ని 18 శాతం పెంచి రూ.196 కోట్లకు చేర్చాయి. ఎబిటా మార్జిన్ దాదాపుగా 34 శాతం ఉంది. ఆటోమేషన్ కారణంగా సంస్థ ఎక్కువ శాంపిళ్లను ప్రాసెస్ చేయగలుగుతోంది. కాకపోతే దీనికి సవాళ్లూ ఉన్నాయి. అందులో ప్రధానమైంది ధరల్లో పోటీ. ఎక్కువ పరీక్షలు చేయగలుగుతోంది కానీ... పోటీ కారణంగా ఎక్కువ ధరల్ని నిర్ణయించలేకపోతోంది. ఇన్వెస్టర్లు ఈ సంస్థ పరీక్షల సంఖ్యతో పాటు ప్రతి టెస్ట్‌కూ వస్తున్న రెవెన్యూను కూడా గమనించాల్సి ఉంటుంది. 3బి బ్లాక్బయో డీఎక్స్... అన్నీ ఒకలాంటివి కావు... డయాగ్నస్టిక్స్ రంగం ఎలా మారుతోందో తెలియజేయడానికి 3బీ బయో సరైన ఉదాహరణ. ఎందుకంటే ఇది శాంపిళ్లను సేకరించే సంప్రదాయ కంపెనీ కాదు. మాలిక్యులర్ డయాగ్నోస్టిక్స్, డయాగ్నస్టిక్ ఉత్పత్తుల కంపెనీ. కాబట్టి ఎలాంటి ఉత్పత్తులను మార్కెట్లోకి తెస్తోంది? మాలిక్యులర్ టెస్టింగ్ ఏ స్థాయిలో ఉంది? కిట్ల అమ్మకాలు ఎలా ఉన్నాయి? టెక్నాలజీ– ఎగుమతులు– ఉత్పత్తుల అభివృద్ధి ఏ స్థాయిలో ఉన్నాయి? అన్నవే ఈ కంపెనీ పనితీరును ముందుకు తీసుకెళతాయన్నది ఇన్వెస్టర్లు గమనించాలి.క్రిస్నా... ఇదో విభిన్నమైన సంస్థ ఈ సంస్థ ప్రత్యేకత పీపీపీ నమూనాయే. ఎందుకంటే పాథాలజీ, రేడియోలజీ సేవలందించడానికిది ప్రభుత్వాలతోను, ప్రభుత్వ ఆసుపత్రులతోను ఒప్పందాలు చేసుకుంది. ప్రత్యేకించి టైర్–2, టైర్–3 పట్టణాల్లో. దీనివల్ల ఈ సంస్థకు పేషెంట్ల తాకిడి చాలా ఎక్కువ. కానీ ప్రైవేటు మార్కెట్ రేట్లతో పోలిస్తే ఇది వసూలు చేసే రేట్లు చాలా తక్కువ. కాబట్టి క్రిస్నా సంస్థ మిగతా కంపెనీలకన్నా ఎక్కువ పరీక్షలు చేస్తూ ఉండొచ్చు. కానీ ప్రతి పేషెంట్‌పై విజయ డయాగ్నస్టిక్స్ మాదిరి లాభాలను మాత్రం ఆర్జించలేదు. అలాగని ఈ కంపెనీకి ఇదేమీ ప్రతికూలత కాదు. కాకపోతే ఈ తక్కువ ధరల వల్ల పరీక్షలు పెరుగుతున్నాయా? పరికరాలను సమర్థంగా వినియోగించగలుగుతున్నారా? కాంట్రాక్టు వ్యవధి దీర్ఘకాలమేనా? నిర్వహణ సామర్థ్యం ఏ స్థాయిలో ఉంది? వంటివన్నీ చూడాల్సి ఉంటుంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో కంపెనీ రెవెన్యూ 22 శాతం పెరిగి రూ.236 కోట్లకు చేరుకుంది. కాకపోతే ఎబిటా మార్జిన్ 27 నుంచి 25 శాతానికి పడిపోయింది. రాజస్థాన్ ప్రాజెక్టుకు సంబంధించి మానవ వనరులు, లాజిస్టిక్స్ వ్యయాలు పెరిగాయని, దీనివల్ల రెవెన్యూ కూడా మున్ముందు పెరుగుతుందని కంపెనీ చెబుతోంది. ఇన్వెస్టర్లు గమనించాల్సిన మరో విషయమేంటంటే ప్రభుత్వాలు దీర్ఘకాలం కస్టమర్లుగా కొనసాగుతాయి. కానీ బిల్లుల చెల్లింపులు మాత్రం చాలా ఆలస్యంగా ఉంటాయి. తనకు బిల్లులు రావటానికి పడుతున్న కాలం 150 రోజులకు చేరినట్లు క్రిస్నా ఇదివరకు వెల్లడించింది. అంటే చాలా పేమెంట్లు దాదాపు 5 నెలలు ఆలస్యమవుతున్నాయి. డాక్టర్ లాల్ పాథ్‌ల్యాబ్స్... విస్తరణే లక్ష్యం పాథాలజీలో సంప్రదాయ హబ్ అండ్ స్పోక్ మోడల్‌కు స్పష్టమైన ఉదాహరణ ఈ కంపెనీ. ఎందుకంటే ప్రతి కలెక్షన్ పాయింట్లోనూ అత్యాధునిక ల్యా బ్ అవసరం లేదు. స్థానికంగా సేకరించే శాంపిల్‌ను శాటిలైట్ లేదా రిఫరెన్స్ ల్యాబ్‌కు తరలించి... అక్కడి అత్యాధునిక పరికరాలతో పరీక్ష చేయొచ్చు. శాంపిల్ సేకరణ కేంద్రాలను తేలిగ్గా పెంచుకోవచ్చు. 2025 ఆర్థిక సంవత్సరంలో ఈ క ంపెనీ రూ.2,461 కోట్ల ఆదాయాన్ని, దానిపై రూ.696 కోట్ల ఎబిటాను సా« దించింది. అందుకోసం 8.46 కోట్ల శాంపిల్స్‌ను ప్రా సెస్ చేసింది. ఈ వేగం అంతకంతకూ పెరుగుతోంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో కంపెనీ రెవెన్యూ రూ.798 కోట్లకు చేరింది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఏకంగా 20 శాతం పెరిగింది. పేషెంట్ల సంఖ్య 8.2 శాతం, శాంపిల్స్ 10.7 శాతం, ప్రతి పేషెంట్‌పై వచ్చే ఆదాయం 10 శాతం పెరిగాయి. ఎబిటా రూ.247 కోట్లుగా నమోదైంది. ఈ సంస్థ మార్జిన్లు ఏకంగా 31 శాతానికి చేరాయి. ఇన్వెస్టర్లు గమనించాల్సింది ఇలాంటి వృద్ధినే. సెంటర్లు పెంచటం, ఎక్కువ పరీక్షలు చేయటానికే పరిమితం కాకుండా రెవెన్యూ, లాభాలపై దృష్టి పెట్టి ముందుకు వెళుతోంది. ఇందుకోసం బ్రాండ్, డాక్టర్లతో సంబంధాలు, కలెక్షన్ నెట్వర్క్ విస్తరణ, లాజిస్టిక్స్, రిఫరెన్స్ ల్యాబొరేటరీల పెంపు, మరిన్ని పరీక్షలను చేర్చటంపై ఫోకస్ పెట్టింది. వేలకొద్దీ శాంపిళ్లను ప్రాసెస్ చేయటానికి ఒక మార్గమంటూ ఏర్పడ్డాక మరిన్ని శాంపిల్స్‌ను ప్రాసెస్ చేయటానికి పెద్దగా ఖర్చులుండవు. ఇదే ఈ కంపెనీ విజయ రహస్యం. మెట్రోపోలిస్... పరీక్షల్లో ప్రత్యేకత ఇదికూడా పాథాలజీ ఫోకస్‌తో నడుస్తున్నదే. కానీ దీని పెట్టుబడులు మాత్రం ఒకింత ప్రత్యేకం. మెట్రోపాలిటన్ మార్కెట్లలో విస్తరించిన ఈ కంపెనీ కొన్ని ప్రత్యేక పాథాలజీ పరీక్షలకు ప్రాధాన్యమిస్తోంది. ఎందుకంటే సాధారణంగా చేసే బ్లడ్ గ్లూకోజ్ స్థాయిలు, సీబీసీ, థైరాయిడ్ వంటి పరీక్షలకు పోటీ ఎక్కువ. కానీ అంకాలజీ, హిస్టోపాథాలజీ, జెనెటిక్స్, మాలిక్యులర్ డయాగ్నస్టిక్స్ వంటి అధునిక పరీక్షల్లో పోటీ తక్కువ. నిజానికి ఒక కంపెనీని ఎన్ని పరీక్షలు చేస్తోందన్న ఒకే ఒక అంకెంతో అంచనా వేయటం సరికాదు. ఎందుకంటే తాను చేసే పరీక్షల్లో ఆధునికాంశాలను ప్రవేశపెట్టడం వల్ల ఒక కంపెనీ పరీక్షల శాతం 10 పెరిగి... రెవెన్యూ 15 శాతం పెరగొచ్చు. మరో కంపెనీ పరీక్షల సంఖ్య 20 శాతం పెరిగినా... పోటీ కారణంగా రెవెన్యూ 10 శాతమే పెరగొచ్చు. ఇదిగో... మెట్రో పోలిస్ డయాగ్నస్టిక్స్‌ను కూడా రెండో కేటగిరీ సంస్థగానే చూడాలి. ఎందుకంటే ఈ సంస్థ ప్రత్యేక పరీక్షలను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వెళుతోంది. పేషెంట్ల సంఖ్యతో పాటు ప్రత్యేక పరీక్షలను ఎన్నింటిని కొత్తగా తెస్తున్నారు? నెట్వర్క్ ఏ స్థాయిలో విస్తరిస్తోంది? ఖర్చులు అంతకంతకూ తగ్గుతూ ఆపరేషన్స్ సౌలభ్యం ఏ స్థాయిలో పెరుగుతోంది? అనే అంశాలు మెట్రోపోలిస్ విషయంలో మున్ముందు జాగ్రత్తగా గమనించాల్సి ఉంది. ఇవి గనక సరిగా ఉంటే... అప్పుడు దీనిపై దృష్టి పెట్టొచ్చు. చందన్ హెల్త్‌కేర్... దూకుడుగా విస్తరణ పాథాలజీ, రేడియోలజీ రెండింట్లోనూ ఉండి... దూకుడుగా విస్తరిస్తున్న చందన్ హెల్త్‌కేర్‌ను కూడా ఇన్వెస్టర్లు వాచ్‌లిస్ట్‌లో పెట్టుకోవచ్చు. యూపీకి చెందిన ఈ కంపెనీ ఇటీవలే ఇతర నగరాలకూ విస్తరించటం మొదలుపెట్టింది. ఈ ఏడాది సెపె్టంబరు నాటికి సంస్థ ఫ్రాంఛైజీ నెట్వర్క్ 500 కేంద్రాలను దాటింది. ఇందులో కొన్ని ఇతర డయాగ్నస్టిక్ కంపెనీల నుంచి కొన్న సెంటర్లూ ఉన్నాయి. కాకపోతే ఇన్వెస్టర్లు గమనించాల్సిన అంశమేంటంటే విస్తరణ దూకుడుగా ఉన్నంత మాత్రాన రాబడి ఆ స్థాయిలో వస్తుందని కాదు. అక్కడి అద్దెలు, సిబ్బంది ఖర్చులు, యంత్రాల నిర్వహణ, తరుగుదల, మార్కెటింగ్... ఇవన్నీ పోగా లాభాలు ఎంత వస్తాయనేది ప్రధానం. సురక్ష డయాగ్నోస్టిక్స్.. తూర్పున కొత్త స్టోరీ పాథాలజీ పరీక్షలను దేశమంతటా విస్తరించటం హబ్ అండ్ స్పోక్ మోడల్లో మరీ అంత కష్టమేమీ కాదు. కానీ సురక్ష మాత్రం విభిన్న మార్గాన్ని ఎంచుకుంది. మొదట తూర్పు భారతంలో విస్తరించి... ఆ తరవాతే మిగతా ప్రాంతాలకు వెళ్లాలనుకుంది. పాథాలజీతో పాటు రేడియోలజీ, మెడికల్ కన్సల్టేషన్ సేవల్ని అందిస్తున్న ఈ సంస్థ... 2026 ఆర్థిక సంవత్సరంలో రూ.310 కోట్ల రెవెన్యూను, రూ.98.6 కోట్ల ఎబిటాను సాధించింది. అంతకు ముందటేడాది రెవెన్యూ రూ..252 కోట్లే. కాకపోతే ఎబిటా మార్జిన్లు మాత్రం 33.8 శాతం నుంచి 31.8 శాతానికి తగ్గాయి. నికరలాభం కూడా అంతంతమాత్రంగానే పెరిగింది. అంటే రెవెన్యూ 23 శాతం పెరిగినా ఎబిటా మాత్రం 16 శాతమే పెరిగింది. నికరలాభానికొచ్చేసరికి పెరుగుదల కేవలం 1 శాతం. దీన్నిబట్టి పరీక్షల్లో, రెవెన్యూలో వృద్ధి కనిపించినా అది లాభాల్లో ఉండకపోవచ్చన్నది ఇన్వెస్టర్లు అర్థం చేసుకోవాలి. ఈ ఏడాది తొలి త్రైమాసికం ఫలితాల్లో ఊహించని మార్పులొచ్చాయి. రెవెన్యూ 21 శాతం పెరగ్గా... ఎబిటా 28 శాతం... నికరలాభం ఏకంగా 40 శాతం పెరిగాయి. ఎబిటా మార్జిన్ పెరిగి ఏకంగా 36 శాతానికి చేరింది. మరి ఈ పెరుగుదల ఇలాగే కొనసాగుతుందా? అదే ఇన్వెస్టర్లు గమనించాల్సింది.అసలైన రిస్కు ఇదే... కంపెనీలు వేటికవి దూకుడుగా విస్తరించడానికే ప్రయతి్నస్తున్నాయి. కాకకపోతే ఆసుపత్రులు, ఫార్మా కంపెనీలు, డిజిటల్ హెల్త్ కంపెనీలు, ఈ ఫార్మసీలు... ఇవన్నీ డయాగ్నస్టిక్ రంగంపై కన్నేశాయి. తాము కూడా ఇందులో ప్రవేశించటం ద్వారా ఎంతో కొంత సంపాదించవచ్చని గమనించాయి. తమ డయాగ్నస్టిక్స్ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయి. ఇది డయాగ్నస్టిక్ కంపెనీలకు పెద్ద రిస్కే. కాబట్టి ఈ మార్పులతో పాటు ఇన్వెస్టర్లు గమనించాల్సిన అంశాలు ప్రధానంగా ఎవరు ఎక్కువ పరీక్షలు చేస్తున్నారు? ఎవరు ఎక్కువ మార్జిన్లు సాధిస్తున్నారు? పెట్టిన పెట్టుబడిపై ఎవరు ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు? ఈ మూడే అసలైన విజేతను నిర్ణయిస్తాయి. ఎవరి వాటా ఎంత? ఓ డయాగ్నస్టిక్ సెంటర్లో ఒక పేషెంట్ రూ.1000 చెల్లించాడనుకుందాం. మరి అందులో ఎవరి వాటా ఎంత? శాంపిల్ కలెక్షన్ సెంటర్‌కు పోతున్నదెంత? డయాగ్నస్టిక్ సెంటర్‌కు వెళుతున్నదెంత? టెస్టింగ్ కిట్లకెంత? పరీక్షా యంత్రాల వాటా ఎంత? లాజిస్టిక్స్‌కు... డాక్టర్‌కు లేదా టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌కు వెళుతున్నదెంత? అసలు ఈ వెయ్యిలో ఎక్కువ భాగం ఎవరిది? ఇది కదా ఇన్వెస్టర్లు చూడాల్సింది? ఎలా తెలుసుకోవాలి మరి?... తదుపరి భాగంలో...రమణమూర్తి మంథా -
హాబీతో కేన్సర్‌ని జయించింది..! వైద్యానికే అందని మిరాకిల్..
కేన్సర్ మహమ్మారి ఎవ్వరినైనా కుంగదీసి..కన్నీళ్ల కడలిలోకి నెట్టేస్తుంది. దాన్నుంచి ధైర్యంగా నిలబడటానికి ఎంతో గట్స్ ఉండాలి. అయితే అది కూడా అందర్నీ భయపెట్టలేదు అనేదానికి ఈ మహిళే ఉదాహరణ. అలాంటి ధీరురాలే ఈ మహిళ. కనీసం ఈమె చికిత్స తీసుకోకుండానే ఆ వ్యాధిని జయించింది. అది కూడా తనకు నచ్చిన అభిరుచితో. అదెలా సాధ్యం అని ఆశ్చర్యపోకండి. తొందరగా ఆమె కథేంటో చదివేయండి మరి..!.ఆ మహిళే చైనాకు చెందిన 67 ఏళ్ల వాంగ్ యింగ్. ఆమె యునాన్స్ ప్రావిన్స్ రాజధాని కున్మింగ్లో ఒక పాఠశాల నిర్వాహకురాలిగా పనిచేస్తుండేది. ఆ సమయంలోనే తనకు థైరాయిడ్ కేన్సర్ ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. పదవీ విరమణ సిద్దమవుతున్న సమయంలోనే ఆపరేషన్ చేయించుకోవడమే మేలు అని వైద్యులు సూచించారు. ఎవ్వరైనా కేన్సర్ వచ్చింది అని తెలియగానే ఒక్కసారిగా కుప్పకూలిపోతారు. జీవిత గమనమే మారిపోతుంది. కానీ ఈ ఉక్కు మహిళ వైద్యులు ఎంతలా భయపెట్టేలా తగు జాగ్రత్తలు చెప్పినా.. సింపుల్‌గా ఆపరేషన్ చేయించుకోను అని చాలా తేలిగ్గా చెప్పేసేంది. కనీసం తనలో బాధ, వేదన అనే వాటికి చోటు లేదు అన్నట్లుగా కొట్టిపారేసిందామె. ఎలాగో చనిపోతామని తెలిసింది కాబట్టి మిగిలిన ఈ విలువైన సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అని ఆలోచించడం మొదలుపెట్టింది. కొద్ది సమయాన్ని కూడా ఆస్పత్రులు, చికిత్సలతో వృధా చేసుకోకూడదని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయిపోయింది. దాంతో ఏం చేయాలో ప్లాన్ వేసుకుని మరి అంటార్కిటికా టూర్‌కి వెళ్లాలని డిసైడ్ అయ్యింది. అందుకు తన వద్ద డబ్బు ఎంత మాత్రం సరిపోదు. అయినా వెళ్లాలనుకుంది కాబట్టి వెళ్లిపోయింది. వాంగ్ అంచనా వేసినట్లుగానే పెద్ద మొత్తంలోనే ఆ టూర్‌కి ఖర్చు అయ్యింది. సుమారు రూ. 21 లక్షలు పైనే అయ్యింది. అందులో కొంత డబ్బు తల్లి సాయం చేయగా..ఆమె విజయవంతంగా తన యాత్ర పూర్తి చేసింది. ఆ యాత్రలో తనకెంతో ఇష్టమైన ఫోటోగ్రఫిని ఆస్వాదించింది. అక్కడుండే అందమైన పెంగ్విన్లను చిత్రిస్తూ..సుమారు 1200పైదాక ఇతర పక్షి జాతులను ఫోటో తీస్తూ తన చిరకాల కోరికను సాకారం చేసుకుంది. అక్కడ ఆమె పెంగ్విన్ తన పిల్లలకు పాలు పట్టడం తీయాలని అనుకుందట, అందుకోసమే మైనస్ 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, బలమైన గాలులు, భారీ హిమపాతాన్ని కూడా లెక్కచేయకుండా ఆ అందమైన దృశ్యాలను కెమెరాలో బంధించినట్లు పేర్కొంది. కష్టకాలం ఎదురవ్వడంతో చేసిన విహారయాత్ర.. తన చిరకాల కోరిక సాకరాం చేయడమే గాక..ఆమెకు ఓ ఊహించని సర్పైస్ కూడా ఇచ్చింది. అంటార్కిటికా నుంచి తిరిగి రాగానే ఆస్పత్రికి వెళ్లి వైద్యపరీక్షలు చేయించుకోగా..ఓ పెద్ద బాంబే పేలింది. నెలరోజుల క్రితం నాటికి ఇప్పటికీ తన కణితిలో అసాధారణ మార్పులు చోటుచేసుకోవడం విశేషం. రిపోర్ట్‌లో తనకు కేన్సర్ పూర్తిగా క్యూర్ అయ్యిందని, సర్జరీ చేయించుకోనవసరం లేదని వైద్యలు నిర్థారించి చెప్పడంతో సంభ్రమాశ్చర్యాలకు లోనైంది వాంగ్. అయితే వైద్యులు అలా అని నిర్లక్ష్యం వహించొద్దని, శరీరంలో వచ్చే మార్పులని గమనిస్తూ ఉండాలని హెచ్చరించారామెకు. ఇది కాస్తా ఆమెకు తన ఆసక్తులను తిరిగి కొనసాగించేలా స్ఫూర్తిని కలిగించింది. తన అంటార్కిటికా యాత్ర ద్వారా ఆస్వాదించిన బర్డ్ ఫోటోగ్రఫీ హాబీని వదులుకోవాలనుకోలేదామె. అంతేగాదు అందుకోసం సమయం, డబ్బుని కేటాయించడం నేర్చుకుంది. అంతేగాదు 30కి పైగా దేశాలను సందర్శించి తన పెన్షన్ మొత్తాన్ని అధునాత ఫోటోగ్రఫీ పరికరాలపైన ఖర్చే చేసిందామె. అంతేకాదండోయ్ వచ్చే ఏడాది అమెరికా, పెరూ, ఆఫ్రికన్ దేశాలను కూడా సందర్శించాలని యోచిస్తోందట. పైగా ఇలా అనేక ప్రదేశాలకు చుట్టొచ్చిన తర్వాతే జీవితంలో మార్పులను అంగీకరించడం నేర్చుకున్నా అని అంటోంది. తాను ఇదివరకటిలా కొన్ని విషయాల గురించి పెద్దగా ఆందోళన, హైరానా పడిపోవడం లేదని సంతోషంగా చెబుతోంది.వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండిఇదీ చదవండి: 'పర్ఫెక్ట్ డాడీ'! సూర్య పేరెంటింగ్ శైలిపై జ్యోతిక ప్రశంసల జల్లు -
కీళ్లెంచి మేలెంచేలా...!
కీళ్లవాతం (ఆర్థరైటిస్) అన్న మాట వినగానే మోకాళ్ల నొప్పులు, నడవడం కష్టంగా ఉన్న వయసు పైబడిన వ్యక్తి చిత్రం మనసులో మెదులుతుంది. అయితే ఆర్థరైటిస్ అనేది కేవలం వృద్ధాప్యం వల్ల వచ్చే వ్యాధి కాదు. కీళ్లు, ఎముకలు, కండరాలు, లిగమెంట్ల కణజాలాలను ప్రభావితం చేసే ఈ సమస్య పుట్టబోయే శిశువుల నుంచి పెద్దవయసు వారి వరకు ఎవరికైనా రావచ్చు. వ్యాధినిరోధక వ్యవస్థ సొంత కణాలను పరాయివిగా భావించి దాడి చేయడం సహా అనేక కారణాలతో ఇది వస్తుంది. వెద్యవిజ్ఞానం అభివృద్ధి చెందేకొద్దీ ఈ రుమాటిక్ వ్యాధులు కేవలం కీళ్లనే కాకుండా మొత్తం దేహాన్ని ప్రభావితం చేయగలవని తెలిసింది. ఒకప్పుడు నొప్పి నివారణ మందులతో అదుపు చేసేవాటికి ఇప్పుడు అనేక ఆధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. రేపు (అక్టోబరు12న) వరల్డ్ ఆర్థరైటిస్ డే సందర్భంగా ఈ సరికొత్త చికిత్సలపై అవగాహన కోసం ఈ కథనం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రధానంగా కీళ్లకు సంబంధించిన వ్యాధి అయినప్పటికీ గుండె, రక్తనాళాలు, ఊపిరితిత్తులు, కళ్లు, చర్మం వంటి ఇతర అవయవాలనూ ప్రభావితం చేయవచ్చు. సోరియాటిక్ ఆర్థరైటిస్‌లో చర్మంతో పాటు కీళ్లు, వెన్నెముక, పేగులూ ప్రభావితమవుతాయి. స్పాండిలో ఆర్థరైటిస్‌లో వెన్నుముకతో పాటు కళ్లలో వాపు (యువైటిస్), పేగువాపు కనిపించవచ్చు. లూపస్ అనేది కిడ్నీలు, మెదడు, గుండె, ఊపిరితిత్తులు, చర్మం వంటి అనేక అవయవాలను ప్రభావితం చేయగలదు. అందువల్ల ఆర్థరైటిస్‌లో వ్యాధి ఏ రకమో తెలుసుకోవడంతో పాటు అది ఏ అవయవాలను ప్రభావితం చేస్తోందో గుర్తించి నిరంతరం పర్యవేక్షించడం కీలకం. అందుకే ఇప్పుడు రుమటాలజిస్టులు కేవలం కీళ్లనొప్పికి చికిత్స చేయకుండా, అవసరాన్ని బట్టి కార్డియాలజిస్టులు, నెఫ్రాలజిస్టులు, పల్మునాలజిస్టులు, గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులు, డర్మటాలజిస్టులతో కలిసి సంయుక్తంగా చికిత్స అందిస్తున్నారు.వ్యాధి నియంత్రించే దిశగా...ఒకప్పుడు ఆర్థరైటిస్ చికిత్సలో ప్రధాన లక్ష్యం నొప్పి, వాపును తగ్గించి ఉపశమనం కలిగించడమే. వ్యాధి ముదిరి కీళ్లు తీవ్రంగా దెబ్బతిన్నప్పుడు శస్త్రచికిత్స కూడా అవసరమయ్యేది. అయితే లక్షణాలు తగ్గినా వ్యాధి లోపల కొనసాగుతూ కీళ్లకు శాశ్వత నష్టం, కదలికల పరిమితి, చివరకు వైకల్యానికి దారితీసే అవకాశం ఉండేది. ప్రస్తుతం చికిత్స లక్ష్యం కేవలం లక్షణాలను తగ్గించడం నుంచి వ్యాధినే నియంత్రించడం వైపునకు మారింది.వ్యాధి పురోగతిని మార్చే మందుల ఆవిర్భావం...నొప్పి నివారణ మందుల నుంచి వ్యాధిని అదుపు చేసే డిసీజ్ మాడిఫైయింగ్ యాంటీ రుమాటిక్ డ్రగ్స్ (డీఎమ్ఆర్డీఎస్) వరకు వచ్చిన పరిణామం ఆర్థరైటిస్ చికిత్సలో కీలకమైన ముందడుగు. ఇవి కేవలం నొప్పిని తగ్గించడమే కాకుండా వ్యాధికి కారణమయ్యే వ్యాధినిరోధక వ్యవస్థలోని అసాధారణతలను నియంత్రించి కీళ్లవాపు, నొప్పిని తగ్గించడంతో పాటు భవిష్యత్తులో కీళ్లకు జరిగే నష్టాన్ని నివారించడంలో సహాయపడతాయి. మెథోట్రెక్సేట్తో పాటు లెఫ్లునోమైడ్, సల్ఫాసాలజైన్ వంటి డీఎమ్ఆర్డీఎస్లు అందుబాటులోకి వచ్చాయి.అలస్యం చేయకుండా చికిత్స ... రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో చికిత్స ఆలస్యం అయితే కీళ్లలో శాశ్వత మార్పులు, వైకల్యాలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఒకసారి జరిగిన నష్టాన్ని తర్వాత మందులతో పూర్తిగా వెనక్కి తీసుకురావడం చాలా సందర్భాల్లో సాధ్యం కాక΄ోవచ్చు. అందుకే ముందస్తు నిర్ధారణ, ముందస్తు చికిత్సకు ్ర΄ాధాన్యం పెరిగింది. చికిత్స లక్ష్యం కీళ్ల శాశ్వత నష్టాన్ని, వైకల్యాన్ని నివారించడం, బాధితులు తమ రోజువారీ పనులను స్వయంగా చేసుకునేలా చూడడం, కుటుంబ, సామాజిక జీవితంపై వ్యాధి ప్రభావాన్ని తగ్గించడం వైపునకు మారింది. దీనినే ‘ట్రీట్ టు టార్గెట్’ విధానం అంటారు. ఇదే ఆలోచన బయలాజిక్స్ చికిత్సకు దారితీసింది.చికిత్సలో మరో విప్లవం... డీఎమ్ఆర్డీఎస్లతో చికిత్సలో కీలకమైన మార్పు వచ్చినప్పటికీ కొంతమందిలో వ్యాధి పూర్తిగా అదుపులోకి రా(లే)దు. ముఖ్యంగా తీవ్రమైన రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, సిస్టమిక్ లూపస్ అరిథెమటోసస్ (ఎస్‌ఎల్‌ఈ) వంటి వ్యాధుల్లో ఇలా జరగవచ్చు. ఆటోఇమ్యూన్ వ్యాధుల్లో సొంత కణజాలంపై దాడికి కారణమయ్యే ప్రత్యేక కణాలు, రసాయన పదార్థాలు, సంకేత మార్గాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. దాంతో మొత్తం వ్యాధినిరోధక వ్యవస్థను అణచివేయకుండా, వ్యాధికి కారణమయ్యే నిర్దిష్ట మార్గాలను మాత్రమే లక్ష్యంగా చేసుకునే ‘బయలాజిక్స్’ అభివృద్ధి చెందాయి. టీఎన్ఎఫ్, ఐఎల్–6 వంటి ఇన్ఫ్లమేషన్కు కారణమయ్యే మార్గాలను బ్లాక్ చేయడం ద్వారా వ్యాధిని నియంత్రించే ఈ చికిత్సలు కీళ్ల నష్టాన్ని తగ్గించడంతో పాటు శారీరక సామర్థ్యాలను కాపాడుకోవడానికీ సహాయపడుతున్నాయి. చికిత్సలో మరో ముందడుగు బయలాజిక్స్ తర్వాత కణాల్లో వాపును కలిగించే నిర్దిష్ట సంకేత మార్గాలను లక్ష్యంగా చేసుకునే టార్గెటెడ్ థెరపీలు అందుబాటులోకి రావడంతో ఒకప్పుడు వైకల్యం తప్పదనిపించిన రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, ఎస్‌ఎల్‌ఈ వంటి ఆటోఇమ్యూన్ రుమాటిక్ వ్యాధుల్లో వ్యాధిని అదుపులో ఉంచుకుని సాధారణ జీవితం గడపగలిగే అవకాశాలు పెరిగాయి.ఒక్కో బాధితుడికి ఒక్కోరకమైన చికిత్సఆర్థరైటిస్ బాధితులందరికీ ఒకే రకమైన చికిత్స సరిపోదు. ఉదాహరణకు సోరియాటిక్ ఆర్థరైటిస్‌లో ఒకరికి చర్మసమస్య తీవ్రంగా ఉంటే, మరొకరిలో వెన్నెముక లేదా కంటి సమస్య ఎక్కువగా ఉండవచ్చు. అందుకే ఇప్పుడు వ్యాధి పేరును మాత్రమే కాకుండా దాని తీవ్రత, బాధితుడి ఇతర ఆరోగ్య సమస్యలు, గతంలో ఏ మందులకు ఎలా స్పందించారు, భవిష్యత్తులో ఏ రకమైన ముప్పు ఉండవచ్చు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని చికిత్సను నిర్ణయిస్తున్నారు. ఆధునిక రుమటాలజీలో ఇదో కీలక మార్పు.టార్గెటెడ్ చికిత్స నుంచి ‘ఇమ్యూన్ రీసెట్’ వరకువ్యాధినిరోధక వ్యవస్థ పనితీరును మరింత కచ్చితంగా నియంత్రించే చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. అందులో‘ఇమ్యూన్ రీసెట్’ఒకటి.ఇమ్యూన్ రీసెట్ అంటే...కేవలం వ్యాధినిరోధక వ్యవస్థను అణచకుండా, తప్పుదారి పట్టిన కొన్ని రిసె΄్టార్లను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే ‘ఇమ్యూన్ రీసెట్. సాధారణ చికిత్సలకు స్పందించని కొన్ని తీవ్రమైన ఆర్థరైటిస్ రకాలలో కార్ట్–టీ, స్టెమ్‌సెల్స్ వంటి ఆధునిక సెల్ థెరపీలలో బాధితుడి వ్యాధినిరోధక కణాలను బయటకు తీసి, వాటిలో ప్రత్యేక మార్పులు చేసి వ్యాధికి కారణమయ్యే కణాలను లక్ష్యంగా చేసుకునేలా చేసి తిరిగి శరీరంలోకి పంపిస్తారు. అయితే ఇవి సాధారణ ఆర్థరైటిస్‌కు ఇచ్చే చికిత్సలు కావు. అధిక ఖర్చు, ఇన్ఫెక్షన్ల ప్రమాదం, దీర్ఘకాలిక ప్రభావాలు వంటి అంశాల కారణంగా అత్యంత ఎంపిక చేసిన పరిస్థితుల్లో నిపుణుల పర్యవేక్షణలోనే వీటిని ఉపయోగించాలి.అవగాహనే ఒకరకంగా నివారణ కూడా...నొప్పిని, వాపును నిర్లక్ష్యం చేయకండి. లక్షణాలను వయసుకు ఆ΄ాదించడం సరికాదు. ముందుగానే గుర్తించి సరైన సమయంలో చికిత్స పొందడం అవసరం. అవగాహన ఉన్నప్పుడు చికిత్సలో ఆలస్యం తగ్గుతుంది. ఫలితంగా వ్యాధి వల్ల కలిగే నష్టాన్ని నివారించే అవకాశం పెరుగుతుంది. ఇందుకు వీలైనంత త్వరగా వ్యాధిని గుర్తించడమన్నది ఎంతగానో అవసరం. అలా త్వరగా గుర్తించడంతో పాటు ఈ ఆధునిక ఔషధాలూ, సాంకేతికతల పురోగతితో... ఆర్థరైటిస్ వచ్చినప్పటికీ అసలు నొప్పి అన్నదే దాదాపుగా లేనట్టుగా... వ్యాధి లేనప్పటంత సౌకర్యంగా ఉండాలన్న పేషెంట్ల కలా... ఈ ఏడాది థీమ్ ‘అచీవ్ యువర్ డ్రీమ్స్’ సాకారమవుతుందన్న ఆశారేఖ కనిపిస్తోంది. ఎన్ని ఆధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చినా వ్యాధిని వీలైనంత ముందుగా గుర్తించడమే కీలకం...ఆర్థరైటిస్ చికిత్సలో ఎన్నో మార్పులు వచ్చినప్పటికీ తొలిదశలోనే వ్యాధిని గుర్తించడం ఇప్పటికీ అతిపెద్ద సవాళ్లలో ఒకటి. కీళ్లలో పదేపదే వాపు రావడం, ఉదయాన్నే గంటకు పైగా బిగుసుకుపోవడం, నొప్పి మళ్లీ మళ్లీ రావడం, విశ్రాంతితో తగ్గక΄ోవడం, కదలికల తర్వాత కొంత ఉపశమనం కలగడం వంటి లక్షణాలను వయసు పెరగడం వల్ల వచ్చిన సాధారణ సమస్యలుగా భావించకూడదు. వీలైనంత త్వరగా రుమటాలజిస్టును సంప్రదించాలి. అలాగే కీళ్ల సమస్యలతోపాటు కంటిలో వాపు, చర్మ సమస్యలు, పేగులకు సంబంధించిన లక్షణాలు, చిన్న వయసులోనే పక్షవాతం, గుండెనొప్పి, మహిళల్లో తరచూ గర్భస్రావాలు వంటి లక్షణాలనూ నిర్లక్ష్యం చేయకూడదు. ఆటోఇమ్యూన్ రుమాటిక్ డిసీజెస్‌లో ‘విండో ఆఫ్ ఆపర్చునిటీ’ దశలోనే చికిత్స అందిస్తే వ్యాధి వల్ల కలిగే నష్టాన్ని అరికట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.ఏఐ లాంటి సాంకేతికతలూ తోడై చికిత్స మరింత సులభమయ్యేందుకు అవకాశం...కొత్త మందులతోపాటు సాంకేతికత కూడా రుమటాలజీ వైద్యానికి తోడవుతోంది. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), డిజిటల్ హెల్త్, ఆధునిక ఇమేజింగ్ ప్రక్రియలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇవి ఆర్థరైటిస్‌ను ముందుగానే గుర్తించడం, వ్యాధి తీవ్రతను అంచనా వేయడం, చికిత్సకు బాధితులు ఎలా స్పందిస్తారో తెలుసుకోవడం వంటి అనేక అంశాల్లో సహాయపడే అవకాశముంది.డాక్టర్ విజయ ప్రసన్న పరిమి, సీనియర్ రుమటాలజిస్ట్ నిర్వహణ: యాసీన్ -
ఆలింగనంలో అపరిమితమైన ఆరోగ్య శక్తి!
ఆరోగ్యం కోసం మనం అనేక హెల్త్ సప్లిమెంట్లు, వ్యాయామం, వివిధ ఆరోగ్య సలహాలపై ఎంతో శ్రద్ధ పెడుతుంటాం. కానీ మనిషికి అత్యంత ప్రాథమిక అవసరాల్లో ఒకటైన ఆప్యాయత, అనుబంధం గురించి మాత్రం కొన్నిసార్లు మర్చిపోతుంటాం. ఈ ఆప్యాయత అనుబంధాలను వ్యక్తపరిచే ఆలింగనం ఆరోగ్యకర జీవితానికి చాలా కీలకమని కొన్ని అధ్యయనాల్లో తేలింది. మనిషిని మనిషికి దగ్గరగా చేసే భావోద్వేగ వ్యక్తీకరణ అయిన ఆలింగనంలో అపరిమితమైన శక్తి దాగి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. కాసేపు ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం లేదా కౌగిలించుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుందంటున్నారు. ప్రేమపూర్వకంగా తాకడం, ఆప్యాయంగా హత్తుకోవడం అనే ప్రక్రియ శరీరం ఒత్తిడికి స్పందించే తీరును మార్చగలదని పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా తీవ్రమైన ఒత్తిడి కలిగే పరిస్థితి తర్వాత ఓ కౌగిలింత లేదా ఓ ఆత్మీయ స్పర్శ వల్ల దేహంలో విడుదలయ్యే కార్టిసాల్ (స్ట్రెస్ హార్మోన్) మోతాదులు తగ్గుతాయని.. ఫలితంగా ఒత్తిడి కూడా తగ్గుతుందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. గత రెండేళ్లుగా దాదాపు 137 అధ్యయన ఫలితాలను విశ్లేషించిన మెటా–అనాలిసిస్లో ఆప్యాయకర శారీరక స్పర్శ కలిగే ప్రయోజనాలు ఒత్తిడి తగ్గించడమే కాకుండా నొప్పి, ఆందోళన, డిప్రెషన్ లక్షణాల వంటివి కూడా గణనీయంగా తగ్గినట్లు తేలింది. అందుకే మన మనసుకు నచ్చిన వ్యక్తిని కాస్త దగ్గరగా హత్తుకోవడం ద్వారా అతడికీ, మనకూ పైసా ఖర్చులేకుండా ఆరోగ్యం సమకూరితే అంతకంటే కావాల్సిందేముంటుంది అంటున్నారు పరిశోధకులు.స్క్రీన్లకు అతుక్కుపోయే యువతలో డిప్రెషన్ !రోజూ గంటల తరబడి స్క్రీన్లను చూడటం యువత మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఈ దురలవాటు యువతలో డిప్రెషన్, ఆందోళన, ఒంటరితనం వంటి సమస్యల ముప్పును రెట్టింపు చేయవచ్చని ఓ కొత్త పరిశోధన సూచిస్తోంది. దాదాపు 90 లక్షల మందికిపైగా వ్యక్తుల సమాచారాన్ని విశ్లేషించిన ఈ అధ్యయనంలో టీవీ, కంప్యూటర్, మొబైల్ స్క్రీన్లను ఎక్కువ సేపు చూసే వారిలో తమను తాము గాయపరుచుకునే ధోరణి, ప్రవర్తనా సమస్యలు, నిద్ర సమస్యలు కూడా ఎక్కువగా కనిపించినట్లు తేలింది. అయితే కేవలం స్క్రీన్లను ఎక్కువగా ఉపయోగించడమే ఈ సమస్యలకు కారణమని ఈ అధ్యయనం నిరూపించనప్పటికీ స్క్రీన్ టైమ్‌కు, మానసిక సమస్యలకు మధ్య సంబంధం కనిపిస్తుండటంతో ప్రభుత్వాలు దీనిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే యువత మానసిక ఆరోగ్యాన్ని కాపాడేందుకు డిజిటల్ ఉత్పత్తులపై మరింత నియంత్రణపూర్వకమైన ధోరణిని అనుసరించాల్సిన అవసరం ఉందని ఈ అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకులు సూచిస్తున్నారు. యువతను ఈ ముప్పు నుంచి రక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఒక అంతర్జాతీయ ఒప్పందం అవసరమన్నది కూడా వారి అభిప్రాయం.ఇష్టమైన సంగీతంతో నొప్పుల తగ్గుదల?ఎమ్మారై స్కాన్ కోసం సూది గుచ్చినప్పుడు కలిగే నొప్పిని ఇష్టమైన సంగీతం వినడం తగ్గించవచ్చని ఒక అధ్యయనం సూచిస్తోంది. అయితే ఏదైనా ఒక ఆరోగ్య సమస్యకు ఏ రకమైన సంగీతం ఎక్కువగా ఉపయోగపడుతుందనే విషయంలో పరిశోధకుల మధ్య ఇప్పటికీ ఏకాభిప్రాయం లేదు. ఈ నేపథ్యంలో ఎమ్మారై స్కాన్ సమయంలో రక్తనాళంలోకి సూది (ఇంట్రావీనస్ కాన్యులేషన్) గుచ్చేటప్పుడు కలిగే నొప్పిపై సంగీతం ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోడానికి పరిశోధకులు ఓ అధ్యయనం చేశారు. వైద్య ప్రక్రియల సమయంలో నొప్పిని తగ్గించేందుకు రోగికి ఇష్టమైన సంగీతాన్ని వినిపించడం కొంత వరకు ఒక సరళమైన, ఉపయోగకరమైన మార్గం కావచ్చని ఈ అధ్యయనం సూచిస్తోంది. ఈ అధ్యయనంలో భాగంగా వాలంటీర్లను నాలుగు బృందాలుగా విభజించారు. మొదటి బృందానికి మొజార్ట్ సంగీతాన్ని, రెండో టీమ్‌కు వారు ఇష్టపడే సంగీతాన్ని, మూడో బృందానికి వాళ్ల మనసుకు ప్రశాంతత కలిగించే సంగీతాన్ని వినిపించారు. నాలుగో బృందానికి ఎలాంటి సంగీతాన్నీ వినిపించలేదు. సూది గుచ్చాక ఆ నాలుగు బృందాల వారికి ఎంత నొప్పి కలిగిందో నమోదు చేశారు. ఇందుకోసం విజువల్ అనలాగ్ స్కేల్ అనే పద్ధతిని ఉపయోగించారు. ఇందులో వ్యక్తులు తమకు కలిగిన నొప్పి తీవ్రతను ఒక స్కేల్‌పై తెలియజేస్తారు. ఈ అధ్యయనంలో తేలిన విషయం ఏమిటంటే... తాము ఇష్టపడే సంగీతాన్ని విన్నవారిలో సూది గుచ్చిన 30 సెకన్ల నుంచి రెండు నిమిషాల తర్వాత నొప్పి గణనీయంగా తగ్గినట్లు గుర్తించారు. మొజార్ట్ సంగీతం విన్నవారిలోనూ నొప్పి తగ్గుదల కనిపించింది. వైద్య ప్రక్రియల సమయంలో సంగీతం నొప్పిని తగ్గించడంలో కొంత వరకు ఉపయోగపడవచ్చని ఈ అధ్యయనం సూచిస్తోంది. -
మందులకు గడువే కాదు..ప్లేస్ కూడా ముఖ్యమే!
సాధారణంగా మందులను వేసుకునేముందు గడువు తేదీ ఉండటం ఎంత ముఖ్యమో.. వాటిని భద్రపరచడం కూడా అంతే ముఖ్యం. లేదంటే అవి ఉపయోగించే గడువు సమయం దాటక పోయినా వాటి ప్రభావం తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వేడి, తేమ, నేరుగా పడే ఎండ మందుల నాణ్యతను గడువు తేదీకి ముందే దెబ్బతీయవచ్చు. చాలామంది మెడిసిన్‌ని కిచెన్‌లో ఉంచుతుంటారు. అక్కడ ఉండే అధిక వేడి మందుల ప్రభావాన్ని తగ్గించవచ్చు.తేమ ఉండే ప్రాంతాల్లోనూ మందులను ఉంచకూడదు. తేమ కారణంగా మాత్రలు, గుళికలు దెబ్బతినే అవకాశం ఉంది.కారులోనూ మందులను ఉంచకూడదు. ఎండ ఎక్కువగా ఉన్నపుడు కారు లోపల ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా పెరుగుతుంది. ∙కిటికీ అంచుపై, నేరుగా పడే సూర్యకాంతి కొన్ని మందులను ప్రభావితం చేయవచ్చురిఫ్రిజిరేటర్ పైభాగంలో మెడిసిన్ ఉంచడం వల్ల దాని నుంచి వెలువడే వేడి మందులపై ప్రభావం చూపవచ్చు.మందులను ఎప్పుడైనా చల్లగా, పొడిగా, నేరుగా ఎండపడని ప్రదేశంలో భద్రపరచాలి. అయితే కొన్ని మందులకు ప్రత్యేకంగా భద్రపరచాల్సి ఉంటుంది. కాబట్టి ఆయా మందుల షీట్‌పై ఉన్న సూచనలను తప్పక పాటించాలి. మందుల గడువు తేదీని మాత్రమే చూడకండి.. అది ఇంతకాలం ఎక్కడ ఉందో కూడా గమనించండి! -
ఆవేదన విందాం ఆదరణ అవుదాం
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటాం. 1992లో వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్ ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచడం; అపోహలు, వివక్షను తగ్గించడం, మానసిక ఆరోగ్యాన్ని ప్రజారోగ్య ప్రాధాన్యతగా నిలపడం లక్ష్యంగా పెట్టుకున్నారు.2026 సంవత్సరానికి ప్రకటించిన నినాదం ‘జీవన అనుభవాలు వినటం, నిజమైన స్వరాలు, నిజమైన మార్పు’. మానసిక ఆరోగ్య సమస్యలను స్వయంగా అనుభవిస్తున్న వారి మాటలను వినడం, వారి అనుభవాలకు విలువ ఇవ్వడం, ఆ అనుభవాలను నిజమైన మార్పుకు ఉపయోగించడం ఈ నినాదం ప్రధాన సందేశం.చూసే చూపు మారితే కోలుకునే జీవితాలెన్నో!ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 2023లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 97 కోట్ల మంది ఏదో ఒక మానసిక రుగ్మతతో జీవిస్తున్నారు. అవసరమైన చికిత్స అందని వారి సంఖ్య భారీగానే ఉంది. భారతదేశంలో కూడా చికిత్సకు రాకపోవడానికి... అవగాహన లోపం, అపోహలు, సాంస్కృతిక నమ్మకాలు, లభ్యం కాని సేవలు, మానవ వనరుల కొరత, చికిత్స ఖర్చు వంటి అనేక కారణాలు ఉన్నాయి. 147 కోట్ల జనాభా కల మన దేశంలో అర్హులైన మానసిక వైద్యులు కేవలం 9,000 మంది ఉండటం గమనించదగ్గ విషయం. అయితే మానసిక ఆరోగ్య సమస్యలతో జీవిస్తున్న వ్యక్తులను మనం చూసే దృష్టికోణం కూడా ఒక పెద్ద సమస్య. ఒక వ్యక్తికి స్కిజోఫ్రీనియా వంటి ఇతర మానసిక సమస్య ఉందని తెలిసిన తర్వాత, అతని మాటకు, సామర్థ్యానికి, నిర్ణయాలకు విలువ తగ్గిస్తుంటారు. ఉద్యోగం, వివాహం, కుటుంబ బాధ్యతలు లేదా నాయకత్వం వంటి విషయాల్లో అతని ప్రస్తుత సామర్థ్యాన్ని కాకుండా ఆ వ్యక్తికి వచ్చిన జబ్బునే ముందుగా చూడటం పరిపాటి. ఇక్కడే వ్యక్తిగత అనుభవం ప్రాధాన్యత పొందుతుంది.ఆసుపత్రిలో తన అనుభవం, మందుల ప్రభావాలు, సమాజం చూపిన వివక్ష, ఉద్యోగంలో ఎదురైన సమస్యలు, కుటుంబంలో మారిన తన పాత్ర, తిరిగి జీవితాన్ని నిర్మించుకోవడానికి అవసరమైన మద్దతు వంటి విషయాలను ఆ వ్యక్తి మాత్రమే పూర్తిగా వివరించగలడు. పుస్తకాల్లో వ్యాధి లక్షణాలు, పరిశోధనల్లో గణాంకాలు, వైద్యుల అనుభవాలు వంటివి ఉంటాయి. కానీ ఆ అనారోగ్యంతో జీవించడం ఎలా ఉంటుందో చెప్పే జ్ఞానం ఆ వ్యక్తి అనుభవంలోనే ఉంటుంది.నినాదం కాదు... మార్పుకు ముందడుగు2025లో ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన రోడ్‌మ్యాప్‌లో కూడా మానసిక ఆరోగ్య సమస్యలను స్వయంగా అనుభవిస్తున్న వ్యక్తుల ప్రత్యేక అనుభవాల, అవగాహన, నైపుణ్యాన్ని మానసిక ఆరోగ్య విధానాలు, సేవల రూపకల్పన, వాటి అమలులో ఉపయోగించాల్సిన అవసరాన్ని స్పష్టంగా గుర్తించింది. అయితే వారి మాటను వినడం అంటే వారు చెప్పే ప్రతి నిర్ణయాన్నీ ప్రతి పరిస్థితిలోనూ అమలు చేయడం కాదు. ముఖ్యంగా తీవ్రమైన ఉన్మాదం లేదా ఇతర తీవ్రమైన మానసిక జబ్బుల విషయంలో అవగాహన, నిర్ణయాత్మక శక్తి, తాత్కాలికంగా దెబ్బతినవచ్చు. అలాంటి సందర్భాల్లో వ్యక్తి అభిప్రాయాన్ని, వైద్య నిర్ణయంతో పాటు రోగి భద్రత, కుటుంబ పరిస్థితులు, చట్టపరమైన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.మానసిక జబ్బు వారి జీవితంలో ఒక భాగం మాత్రమే. వారే వారి జబ్బు కాదు. వారి అనుభవాలను వినడం జాలి కాదు, ఉపకారం కాదు. అది వారి హక్కు. అయితే ఆ స్వరాన్ని వైద్య విజ్ఞానం, ఆధారపూర్వక చికిత్స, భద్రతతో సమన్వయం చేయడం కూడా అంతే ముఖ్యం. అప్పుడే ‘జీవన అనుభవాలు వినడం, నిజమైన స్వరాలు, నిజమైన మార్పు’ ఒక నినాదంగా మాత్రమే మిగలకుండా నిజమైన సామాజిక మార్పుకు దారితీస్తుంది.- డా. ఇండ్ల రామసుబ్బా రెడ్డి, వ్యాసకర్త ప్రముఖ మానసిక వైద్య నిపుణులు, 93481 14948ఇదీ చదవండి: సవాళ్ల నడుమ భారత వాయుసేన -
నానా పటేకర్ ఒక్క రాత్రిలో ధూమపానం ఎలా మానేశారంటే..!
బాలీవుడ్ సీనియర్ నటుడు, చిత్ర నిర్మాత నానా పటేకర్ గోవాలో తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. తన విలక్షణ నటనతోనే కాకుండా దాతృత్వ సేవలతో అందరి ఆదరాభిమానాలను అందుకున్న రియల్ హీరో. ఏడు పదుల వయసులోనూ చురుగ్గా ఉంటూ వర్కౌట్లతో అభిమానులను ఆశ్చర్యపర్చడమే కాకుండా ఆరోగ్య స్పృహ కలిగించే ప్రయత్నం చేసిన నటుడు. ఈ నేపథ్యంలో ఆయన వ్యక్తిగత అలవాట్లకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందామా..!.ఆయన ఒకప్పుడు చైన్ స్మోకర్ అట. రోజుకు 60 సిగరెట్లుపైగా కాల్చేవారట. అలా 56 ఏళ్ల వయసు వరకు ధూమపానం అలవాటు ఉందట. అలాంటి తాను ఒక్క రాత్రిలో ఆ అలవాటుని దూరం చేసుకున్నానని అన్నారు. ఎలా ధూమపానాన్ని మానేశారో కూడా పంచుకున్నారు. ఎలా అంటే..2007-08లో ధూమపానం మానేశానని అన్నారు. అది చాలా ఆకస్మికంగా వచ్చిన మార్పు అని అన్నారు. ఆ రోజు ఉదయం నిద్రలేచి ఇక సిగరెట్టు వద్దు అని అనుకున్నాను..మళ్లీ ఇప్పటి వరకు ముట్టలేదన్నారు. అదెలా సాధ్యమైందంటే..తాను దర్శకుడు ప్రియదర్శన్‌కు ధూమపానం మానేయమని సలహా ఇచ్చిన సంఘటన గురించి చెబుతూ ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో 'పర్సెప్ట్ పిక్చర్స్' వారి 'కమాల్ ధమాల్ మలమాల్' చిత్రం కోసం ఆయన ప్రియదర్శన్‌తో కలిసి పనిచేస్తున్నారు. నానా పటేకర్ ప్రియదర్శన్‌ను ధూమపానం మానేసేలా ఒప్పించారు. ఆ తర్వాత తాను ఆ అలవాటుకి దూరం అయ్యాను అని చమత్కారంగా చెప్పారు. అలాగే మరొక కారణం వల్ల కూడా ఈ దురఅలవాటుని వదులుకున్నట్లు పేర్కొన్నారు. తన స్నేహితుడి భార్య తనకు సోదరికంటే ఎక్కువని, ఆమె కొడుకుని పొగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉంది. అలాగే ఆ టైంలో తాను దగ్గుతూ తడబడుతూ మాట్లాడుతుండే వాడినని అన్నారు. ఒకరోజు ఆమె తన వద్దకు వచ్చి ఏడుస్తూ ఇంకా ఏం బాధలు చూడాలో చెప్పు అని కోపంగా నిలదీసింది. ఆ రెండు ఘటనలతో రాత్రికే రాత్రి ఆ దురఅలవాటుని మానేయాలని స్ట్రాంగ్‌గా డిసైడయ్యానని ఆయనే స్వయంగా వెల్లడించారు ఒక మీడియా ఇంటర్వ్యూలో. అలాగే తన సహ నటులకు సైతం ఈ దుర అలవాట్లను వదులుకోమని సలహా ఇవ్వడమే కాదు దాన్నుంచి బయటపడేలా కొన్ని సలహాలు సూచనలు సైతం ఇచ్చారు. ముఖ్యంగా బాలీవుడ్ విలక్షణ నటుడు అమీర్ ఖాన్‌కి కూడా నానా సలహా ఇచ్చారు. అమీర్‌కి నానా ఇచ్చిన సలహా..అమీర్ ఖాన్, నానా పటేకర్ మద్యపానం, ధూమపానం గురించి మనసు విప్పి మాట్లాడుకున్నారు. త్రీ ఇడియట్స్ స్టార్ అమీర్ తాను సిగరెట్లు తాగుతానని, అయితే మద్యం మానేశానని అన్నారు. ఒకప్పుడు రాత్రి పగలు తేడా లేకుండా ఫుట్‌గా ఆల్కహాల్ సేవించేవాడినని అన్నారు. ఏ అలవాటైన మితిమీరితే ఆరోగ్యానికి హానికరంగా మారుతుందని నానా రిప్లై ఇవ్వగానే అమీర్ తాను ఆ అలవాట్ల విషయంలో తీవ్రవాదినని నవ్వుతూ అన్నారు. తనకు ఒక అలవాటు అనారోగ్యకరమని తెలిసినప్పటికీ..దాన్ని మానుకోవడం తనకు అత్యంత కష్టంగా ఉంటుందని బదులిచ్చారు. నటులకు సినిమాలే మంచి మెడిసిన్ అని అన్నారు. ఆ చెత్త అలవాట్లకు దూరంగా ఉండాలంటే మీరు సినిమాలు చేస్తూనే ఉండాలని అమీర్‌కి సూచించారు నానా. దాంతో అప్పటి నుంచే ప్రతి ఏడాది కనీసం తనది ఒక్క సినిమా అయినా ఉండేలా చూసుకుంటున్నానని అన్నారు అమీర్ ఖాన్. కాగా, నానా గోవాలోని తని ఇంట్లోనే స్పృహ కోల్పోయి కనిపించడంతో హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. ఆయన్ను బతికించే ప్రయత్నంలో వైద్యులు 45 నిమిషాల పాటు సీపీఆర్ చేశారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఇవాళ అక్టోబర్ 8వ తేదీ ఉదయం 5.20 గంటలకు ఆయన మరణించినట్లు ధృవీకరించారు వైద్యులు. View this post on Instagram A post shared by Nana Patekar (@iamnanapatekar) ఇదీ చదవండి: 'గంఛా' ధరించి వర్కౌట్లు చేస్తున్న నానా పటేకర్..! వీడియో వైరల్ -
నానా పటేకర్ ఫిట్నెస్ డెడీకేషన్కి ఫిదా అవ్వాల్సిందే..!
బాలీవుడ్ సీనియర్ నటుడు, చిత్ర నిర్మాత నానా పటేకర్ గోవాలో తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన నటుడిగా విలక్షణమైన పాత్రలతో మెప్పించి అశేష అభిమానులను సంపాదించుకున్నారు. దాతృత్వంలోనూ రియల్ హీరో అనిపించుకునేలా సేవలందించాడు. చివరికి ఫిట్‌నెస్‌లో సాహో నానా అని అందరిచేత ప్రశంసలందుకున్నారు. హెల్త్ పరంగా ఆయన ఎంత చురుగ్గా ఉంటాడనేందుకు గత నెలలో నెట్టింట వైరల్ అయిన ఈ వీడియోనే ఉదాహరణఆయన తన మరణానికి కొన్ని నెలల ముందు'గంఛా'తో వర్కౌట్లు చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఏడు పదుల వయసులో కూడా ఎంతో సునాయాసంగా వ్యాయామాలు చేస్తూ ఆరోగ్య స్ప్రుహని కలిగించే యత్రం చేశారు. 70 ఏళ్ల వయసులో కూడా చురుకుగా ఉంటూ ఫిట్‌నెస్‌ని కాపాడుకోవడం విశేషం. ఈ వీడియోని ఫోటోగ్రాఫర్ కాస్బేకర్ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో పంచుకున్నారు. ఆ వీడియోలో నానాపటేకర్ చాలా సులభంగా ట్రైసెప్ డిప్స్ చేయడం స్పష్టంగా కనిపిస్తోంది. వ్యాయామం పూర్తయ్యాక కెమెరా వైపు చూస్తూ చిరునవ్వు చిందించారు. తెల్లని బనియన్, టాన్రంగు షార్ట్స్ ధరించి మెడలో ఎరుపు రంగు తువాలు వేసుకుని కనిపించారు. ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకర్షించింది. 75 ఏళ్ల వయసులో కూడా ఫిట్నెస్ పట్ల ఆయనకున్న అమిత అంకితభావం, బలాన్ని చూసి విస్తుపోయారు. ఆ వీడియోకి "అహో నానా సాహెబ్...!!! నా ఫిట్నెస్ లక్ష్యాలను మళ్లీ కొత్తగా నిర్దేశించుకునేలా చేశారు!!!అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశారు ఫోటోగ్రాఫర్ కాస్బేకర్. అంత ఏజ్‌లో కూడా ఎంత సునాయాసంగా నానాజీ బార్లపై సులభంగా ట్రైసెప్ డిప్స్ చేస్తున్నారు అని రాసుకొచ్చారు పోస్ట్‌లో. అంతేగాదు ఆయన రోజుకు దాదాపు 2 గంటల పాటు జిమ్‌లో గడుపుతారు. ఇందులో భాగంగా బెంచ్ ప్రెస్, బైసెప్ కర్ల్స్, స్క్వాట్స్ వంటి వెయిట్ ట్రైనింగ్ వ్యాయామాలు అన్ని చేస్తారు. ఎప్పటికీ చురగ్గా ఉండేలా వర్కౌట్లు చేసేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారట నానా. కాగా, ఆయన ఫిట్నెస్ దినచర్యను చూసి ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీలు శిల్పాశెట్టి, షారుక్ ఖాన్ తదితర దిగ్గజ నటులు ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. అంతేగాదు ఆయన వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే అని తన వర్కౌట్లతో అద్భుతంగా చెప్పారని అన్నారు. View this post on Instagram A post shared by Atul Kasbekar (@atulkasbekar) ఇదీ చదవండి: ‘నానా’ను బలిగొన్న కార్డియాక్ అరెస్ట్.. ఆ కీలక నిమిషాల్లో ఏం చేయాలంటే.. -
ప్రతి 8 కేన్సర్ కేసుల్లో ఒకటి ఇన్ఫెక్షన్లతోనే..
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కేన్సర్ కేసుల్లో ఇన్ఫెక్షన్ల పాత్రపై అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్న అంశాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం నమోదవుతున్న ప్రతి 8 కేన్సర్ కేసుల్లో ఒకటి వివిధ రకాల ఇన్ఫెక్షన్ల వల్లే వస్తోందని తేలింది. కేన్సర్లకు, వివిధ రకాల ఇన్ఫెక్షన్లకు మధ్య అత్యంత బలమైన సంబంధం ఉందని, కొన్ని రకాల బ్యాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్లు శరీరంలో కేన్సర్‌ను ప్రేరేపించగలవని వైద్య పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. 2024లో నమోదైన కొత్త కేన్సర్ కేసుల్లో సుమారు 23 లక్షల కేసులు కేవలం ఇన్ఫెక్షన్ల వల్లే సంభవించాయి. ఇది మొత్తం కేన్సర్ కేసుల్లో 12 శాతం (అంటే ప్రతి 8 కేసులలో ఒకటి). ఇక భారత్ విషయానికొస్తే..మన దేశంలో కూడా పరిస్థితి తీవ్రంగానే ఉంది. ఇండియాలో 2024లో నమోదైన కేన్సర్ కేసుల్లో దాదాపు 1.9 లక్షల కేసులు వివిధ రకాల ఇన్ఫెక్షన్లతోనే ముడిపడి ఉన్నాయి. ఇటీవల ప్రముఖ మెడికల్ జర్నల్ ‘ద లాన్సెట్ ఆంకాలజీ’లో ప్రచురితమైన ఒక అంతర్జాతీయ అధ్యయనం ఈ సరికొత్త విషయాలను వెల్లడించింది. సాధారణంగా కేన్సర్ అంటే కేవలం వంశపారంపర్యంగానో, పొగాకు, మద్యం లేదా కలుషిత ఆహారం వల్లో వస్తుందని అనుకుంటారు. కానీ కంటికి కనిపించని వైరస్లు, బ్యాక్టీరియాలు కూడా కేన్సర్‌కు ప్రధాన కారణాలుగా మారుతున్నాయని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. జీవనశైలి మార్పులతో పాటు ఇన్ఫెక్షన్లపై అవగాహన పెంచుకోవడం, సకాలంలో వ్యాక్సిన్లు వేయించుకోవడం ద్వారా లక్షలాది కేన్సర్ మరణాలను నివారించవచ్చునని వెల్లడించింది. కేన్సర్‌కు కారణమయ్యే 5 ప్రధాన ఇన్ఫెక్షన్లు ఈ అధ్యయనం ప్రకారం..కేన్సర్‌కు దారితీసే 12 రకాల ఇన్ఫెక్షన్ కారకాలను పరిశోధించగా, అందులో 5 ప్రధాన ఇన్ఫెక్షన్లు దాదాపు అత్యధిక శాతం కేసులకు కారణమవుతున్నాయి. –హెలికోబాక్టర్ పైలోరీ: ఇది జీర్ణాశయంలో చేరే బ్యాక్టీరియా. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా 7.6 లక్షల కేసులకు కారణమైంది (ముఖ్యంగా కడుపు/జీర్ణాశయ కేన్సర్) – హ్యూమన్ పాపిల్లోమావైరస్ (హేచ్పీవీ): ఇది ప్రధానంగా మహిళల్లో గర్భాశయ ముఖద్వార కేన్సర్‌కు (సర్వైకల్ కేన్సర్) కారణమవుతోంది. ఇది దాదాపు 7.5 లక్షల కేన్సర్ కేసులకు దారితీసింది – హెపటైటిస్ బి వైరస్ (హేచ్బీవీ),హెపటైటిస్ సి వైరస్ (హేచ్సీవీ): ఈ వైరస్లు కాలేయాన్ని (లివర్) దెబ్బతీసి, దీర్ఘకాలంలో లివర్ కేన్సర్‌కు కారణమవుతాయి. హేచ్బీవీ వల్ల 3.6 లక్షలు, హేచ్సీవీ వల్ల 1.6 లక్షల కేసులు నమోదయ్యాయి. – ఎప్‌స్టెయిన్–బార్ వైరస్ (ఈబీవీ): ఇది కొన్ని రకాల బ్లడ్ కేన్సర్లు (లింఫోమాస్), గొంతు, జీర్ణాశయ కేన్సర్లకు గురి చేస్తుంది. ఇది సుమారు 2.6 లక్షల కేసులకు కారణమైంది. ఇన్ఫెక్షన్ కేన్సర్‌గా ఎలా మారుతుంది? ⇒ ఒక సాధారణ ఇన్ఫెక్షన్ శరీరంలో కేన్సర్‌గా మారడానికి దారితీస్తున్న ప్రక్రియను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ⇒ దీర్ఘకాలిక వాపు (క్రానిక్ ఇన్ఫ్లమేషన్): వైరస్ లేదా బ్యాక్టీరియా శరీరంలో చేరినప్పుడు, రోగనిరోధక వ్యవస్థ వాటితో పోరాడుతుంది. అయితే ఈ ఇన్ఫెక్షన్లు ఏళ్ల తరబడి శరీరంలోనే ఉండిపోతే అక్కడ దీర్ఘకాలిక వాపు లేదా గాయం ఏర్పడుతుంది ⇒ కణాల డీఎన్ఏ దెబ్బతినడం: ఈ నిరంతర వాపు వల్ల స్థానిక కణాలలోని డీఎన్ఏ నిర్మాణం దెబ్బతింటుంది ⇒ నియంత్రణ లేని కణ విభజన: దెబ్బతిన్న డీఎన్ఏ కణాలు అసాధారణంగా, నియంత్రణ లేకుండా విభజన చెందడం ప్రారంభిస్తాయి. ఇవే క్రమంగా కేన్సర్ గడ్డలుగా (ట్యూమర్స్) మారతాయి. ముందే నివారించవచ్చు.. ⇒ ఈ అధ్యయనంలో ఒక సానుకూల అంశం ఏమిటంటే ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే కేన్సర్లను ముందే నివారించవచ్చు. ఇన్ఫెక్షన్లను ముందే గుర్తించడానికి కొన్ని సాధారణ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ⇒ వ్యాక్సినేషన్: హేచ్పీవీకి వ్యతిరేకంగా ఇచ్చే వ్యాక్సిన్ గర్భాశయ కేన్సర్‌ను, హెపటైటిస్–బి వ్యాక్సిన్ లివర్ కేన్సర్‌ను సమర్థవంతంగా అడ్డుకోగలదు. ⇒ స్క్రీనింగ్ పరీక్షలు: మహిళలు క్రమం తప్పకుండా ‘ప్యాప్ స్మియర్’వంటి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా కేన్సర్ ప్రమాదాన్ని ముందే గుర్తించవచ్చు. 21–30 ఏళ్లు దాటిన మహిళలు ప్రతి 3 నుండి 5 ఏళ్లకు ఒకసారి ఈ పరీక్షలు చేయించుకోవడం ద్వారా గర్భాశయ ముఖద్వార కేన్సర్ ముప్పును 100% నివారించవచ్చు. దీర్ఘకాలిక గ్యా్రస్టిక్ సమస్యలున్నవారు హెచ్ పైలోరి పరీక్ష ద్వారా కడుపులో బ్యాక్టీరియా ఉందో లేదో తెలుసుకోవచ్చు. ⇒ యాంటీబయాటిక్స్: కడుపులో హేచ్ పైలోరి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ను సరైన యాంటీబయాటిక్స్ ద్వారా ముందే నయం చేయడం వల్ల జీర్ణాశయ కేన్సర్ రాకుండా చూడొచ్చు -
పది నెలల్లో 45 కిలోలు..! వైరల్‌గా ఆమె డైట్ ప్లాన్..
బరువు తగ్గడానికి కేవలం వ్యాయామం మాత్రమే సరిపోదు అని అంటోంది కంటెంట్ క్రియేటర్ సాక్షి సింగ్. ఆరోగ్యకరమైన బరువులో ప్రధాన పాత్ర పోషించేది ఆహారం మాత్రమేనని అంటోంది సాక్షి. కేలరీల లోటు కొవ్వు కరగడానికి దారితీస్తుందని చెబుతోంది. ఎంత తింటారు, ఏమి తింటారు, అనేదానికి స్ట్రిక్ట్ కట్టుబడి ఉండటంపైనే బరువు తగ్గడం అనేది ఆధారపడి ఉంటుందని చెబుతోంది. అలా చేసే తాను పది నెలల్లో ఏకంగా 45 కిలోలు తగ్గినట్లు వెల్లడించింది. మరి అదెలాగా ఆమె మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!.కంటెంట్ క్రియేటర్ సాక్షి సింగ్ ఇటీవల తన బరువు తగ్గే ప్రయాణాన్ని ఇన్స్టాగ్రామ్ పంచుకున్నారు. తాను సుమారు 115 కేజీల బరువు ఉండేదాన్ని అని, జస్ట్ పదినెల్లో 45 కేజీలకు పైగా బరువు తగ్గి 70 కేజీలకు చేరుకున్నట్లు తెలిపారు. తాను వెయిట్‌లాస్ జర్నీ ప్రారంభించినప్పుడు సుమారు 2800 కేలరీలు తీసుకోవడం తోపాటు ఫైబర్, ప్రోటీన్ తీసుకునేలా కేర్ తీసుకున్నట్లు తెలిపింది. ఇక్కడ కేలరీల లోటు అనేది ప్రతి ఒక్కరికి ఒక్కోలా ఉంటుందని అంటోంది. ఆ రోజు కార్యకలాపాలననుసరించి కేలరీల లోటు మారుతుంటుందని చెబుతోంది. ఒక రోజులో తాను ఏమి తీసుకుంటుందో కూడా వివరించింది ఇలా. తన రోజుని బ్లూటీ, జీలకర్ర, వామునీరు లేదా నిమ్మ -తేనె నీటితో ప్రారంభించి ఉదయం 8 గంటల కల్లా అల్పాహారం తీసుకుంటానని చెప్పింది. ఒకేరకం టిఫిన్ కాకుండా అన్ని సముతుల్యంగా ఉండేలా ఫుడ్‌ని మారుస్తానని చెప్పారు. తక్కువ కొవ్వు ఉన్న పన్నీర్, పెసరపప్పు, శనగపిండి చీలా, పెరుగు వంటివి తప్పనిసరి అని అంటోంది. ముఖ్యంగా బ్రేక్‌ఫాస్ట్‌లో ఒక రోజు పనీర్ లేదా పెసరపప్పు ఉప్మా, పసరపప్పు ఇడ్లీ, మూంగ్లెట్, పనీర్ కూరతో చేసిన రాగి దోస, పనీర్‌తో కూడిన వెజిటబుల్ మసాలా ఓట్స్. అంటే అల్పాహారంలో కేవలం 20 నుంచి 30 గ్రాముల ప్రోటీన్ తోపాటు 300 నుంచి 450 కేలరీలను లక్ష్యంగా పెట్టుకుంటానని అన్నారు. మధ్యాహ్న భోజనానికి పనీర్‌తో బ్రౌన్ రైస్, మూంగ్‌దాల్ ఖిచిడి, గోధుమ ఊక లేదా జొన్న రొట్టెతో సోయా మటర్ సబ్జీ, రొట్టెతో మసూర్ పప్పు, రొట్టెతో పాలకూర పప్పు, వంటివి మార్చి తీసుకుంటుంటానని తెలిపింది. అప్పడప్పుడు నెయ్యి లేదా నూనె లేకుండా తయారు చేసిన పనీర్ లేదా చికెన్ కూడా తీసుకుంటానని చెప్పుకొచ్చింది. ప్రోటీన్ తోపాటు ఫైబర్ తీసుకోవడం కూడా ముఖ్యం కాబట్టి..మధ్యాహ్న భోజనం తోపాటు దోసకాయ, క్యారెట్, ఉల్లిపాయలతో చేసిన సలాడ్ తప్పనిసరి అని చెప్పుకొచ్చింది. ఈ భోజనాల్లో సుమారు 400 నుంచి 650 కేలరీలు, అలాగే 25 నుంచి 50 గ్రాముల ప్రోటీన్ ఉందని చెప్పుకొచ్చింది. స్నాక్‌గా పండు, ఖాక్రా, వేయించిన శనగలు, మఖానా లేదా కొన్ని నట్స్ తీసుకుంటానని, అవి సుమారు 100 నుంచి 200 కేలరీలకు మించకూడదని చెప్పుకొచ్చింది. రాత్రి భోజనానికి వేయించిన కూరగాయలతో పనీర్ లేదా చికెన్ క్లియర్ సూప్, కూరగాయలతో మూంగ్‌దాల్ సూప్, ఒక మైదా లేని బ్రెడ్ ముక్కతో వెజిటబుల్ సూప్ లేదా కూరగాయలతో నిమ్మ కొత్తిమీర సూప్ వంటివి తీసుకుంటానని చెప్పుకొచ్చింది. బాగా ఆకలి వేసిన రోజుల్లో గోధుమ ఊక రొట్టెతో పాలకూర పప్పుని ప్రత్యామ్నాయంగా తీసుకుంటానని అన్నారు. అంటే రోజుకి సుమారు 1400 నుంచి 1700 కేలరీలు దాదాపు 85 నుంచి 120 గ్రాముల ప్రోటీన్‌ను లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. అలా నెమ్మదిగా 500 లేదా అంతకంటే ఎక్కువ కేలరీల లోటుని సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగానని అన్నారు. ఎక్కడ కూడా కఠినమైన భోజన ప్లాన్ జోలికి వెళ్లలేదని, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూనే బరువు తగ్గేలా చూసుకున్నట్లు పేర్కొంది. ఈమె ఆరోగ్యకరమైన నచ్చిన ఆహారం తీసుకుంటూ సమతుల్యతకు పీట వేస్తూ బరువు తగ్గేలా కేర్ తీసుకుంది సాక్షి సింగ్. అంటే మనం తినేదానిపై అదుపు అవగాహన ఉంటే ఎంత కొండలా పేరుకున్న బరువైనా తగ్గుతుందని ఈ కంటెంట్ క్రియేటర్ సాక్షిసింగ్ తన వెయిట్‌లాస్ జర్నీతో నిరూపించింద కదూ..!. View this post on Instagram A post shared by Saakshi Singh (@its_saakshi.singh) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.ఇదీ చదవండి: మీరు రీజనబుల్ ఎకామడేషన్ కోరవచ్చు -
90 గంటల పాటు ఏమి తినకుండా..సీఈవో మైండ్‌బ్లాక్ సవాల్!
పుట్టిన రోజు అనగానే చాలామంది తమకిష్టమైన గుడికి వెళ్లి తనకు నచ్చిన స్నేహితులతో గడపడం వంటివి చేస్తారు. మరికొందరు అన్నదానం వంటి సేవ కార్యక్రమాలు చేస్తుంటారు. కానీ ఈ సీఈవో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాడో తెలిస్తే షాకవ్వడం ఖాయం. ఇలా కూడా పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసుకుంటారా అని విస్తుపోతారు. మరి అతను ఎలా చేసుకున్నాడుంటే..ముంబైకి చెందిన సీఈవో అభిషేక్ అగర్వాల్ తన పుట్టిరోజుని అత్యంత అసాధారణమైన రీతీలో జరుపకున్నాడు. దాని గురించి లింక్డ్ఇన్లో ఇలా పంచుకున్నారు. ఆ బర్డ్‌డే సందర్భంగా ఏకంగా నాలుగురోజుల పాటు ఆహార తీసుకోకుండా..దాదాపు 90 గంటలు ఉపవాసం చేసినట్లు తెలిపారు. తన శారీరక పరిమితులను అధిగమించడానికి ప్రతి ఏడాది ఒక కఠినమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం తనకు అలవాటని, అలానే ఈసారి ఉపవాసాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు అగర్వాల్. ఈ మేరకు పోస్ట్‌లో ఇలా వివరించారు అగర్వాల్. "నా పుట్టినరోజు వేడుకలో కోసం 90 గంటలపాలు ఉపవాసం చేశాను. అంటే నాలుగు రోజుల పాటు ఆహారం తీసుకోలేదు. ఆ క్రమంలో నాకు మొదటిరోజు పెద్దగా ఎలాంటి సమస్యలు రాలేదు, కానీ ఆ తర్వాత రెండోరోజు జోమాటో గుర్తొచ్చింది. మూడవ రోజు నిశబ్దం. నాల్గవరోజు పుట్టిన రోజులు గతంలో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనే దానిపై క్లారిటీ వచ్చింది. "అని అగర్వాల్ రాసుకొచ్చారు పోస్ట్‌లో. ఎందుకిలా అంటే..ఈ పుట్టిన రోజుని ‘ఆకలి వర్సెస్ సంకల్ప బలం’ అనే సవాలుని తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. తన సంకల్పం గెలుస్తుందో ఆకలే ఓడిస్తుందో తెలుసుకోవాలని అనుకున్నారట. ఎందుకంటే ఇప్పుడు మనం క్షణాల్లో పనులు జరిగిపోయే ఇంటర్నెట్ యుగంలో ఉన్నాం. మనకు ఆహారం జస్ట్ పదినిమిషాల్లో మన ఇంటి గుమ్మం ముందు ఉంటుంది. ప్రతీదీ రెప్పపాటులో ముగిసిపోయేలా అయిపోవాలనుకునే కాలంలో ఉన్నాం. కాబట్టి మనకు ఓపిక, ఓర్చుకునే సామర్థం ఎంత వరకు ఉందో అంచనా వేసేందుకని చెబుతున్నారు అగర్వాల్. ఈ 90 గంటల ఉపవాసం తర్వాత మనకు ఆకలిని తట్టుకునే సామర్థ్యం ఉందని తెలిసింది. అలాగే ఈ సవాలు వల్ల తానొక సూపర్ హీరో అనే భావన కలిగిందన్నారు. ఒక్కోసారి మన బ్రెయిన్ ఆలోచన తప్పు అనేలా మన శారీరక పరిమితులు ఉంటాయని, అవి ఇలాంటి సవాళ్లతోనే తెలుస్తుందని అప్పుడు ఏది అసాధ్యంగా అనిపించదంటూ అందుకు సంబంధించిన ఫోటోలను కూడా పంచుకున్నారు. నెటిజన్లు దీన్ని సహనానికి సంబంధించిన అద్భుత కథ అని, ఇలాంటివి శారీరక పరిమితులను అధిగమించడం గురించి చాలానే నేర్పిస్తుందన్నారు.ఇదీ చదవండి: డైట్ క్రమశిక్షణ అంటే ఇదే..వైరల్‌గా వంటల ప్లాన్! -
27 ఏళ్లకే కోటీశ్వరుడై ఆస్పత్రి పాలయ్యాడు..ఆపై అద్బుతం చేశాడు!
వ్యవస్థాపకులుగా మారడం అంటే..మాములు ఒత్తిడిని ఉండదు. పారిశ్రామికవేత్తలుగా మారాలని కలలు కనే యువత అంతా ఈ భయానక ఒత్తిడి, టెన్షన్లను ఎదుర్కొంటుంటారు. ఆ క్రమంలో కొందరు ఆరోగ్యాన్ని మొత్తం నాశనం చేసుకుంటుంటే..ఒక్కరే ఇద్దరే ముందుగా మేల్కోని ఆరోగ్యవంతంగా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కెరీర్లో ఎదుగుదల మాత్రమే కాదు ఆరోగ్యం కూడా ప్రధానమే అంటూ ఈ పారిశ్రామికవేత్త తన అనుభవాన్ని పంచుకున్నారు ఇలా. ఆయనే భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్త రాహుల్ వోహ్రా. ఇంగ్లాండ్‌లో బర్మింగ్‌హామ్‌లో పెరిగిన వోహ్రా 2009లో రాపోర్టివ్ సహ స్థాపించారు. ఈ కంపెనీ ఈమెయిల్ కాంటాక్ట్‌ల గురించి సమాచారాన్ని జోడించి బ్రౌజర్ ప్లగ్ ఇన్ను అభివృద్ది చేసింది. దీన్ని ఫిబ్రవరి 2012లో లింక్డ్ఇన్ కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు నిజంగా అతడి కెరీర్‌కి పెద్ద విజయమే. ఎందుకంటే తీంతో అతడు 27 ఏళ్లకే కోటీశ్వరుడయ్యాడు. కానీ ఆ కొనుగోలు అతడి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. అనారోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ దాదాపు వ్యాయామం చేయకుండా ఒక స్టార్టప్‌ను నడపడంలో మునిగిపోయి..తీవ్రమైన ఒత్తిడిని ఏళ్ల తరబడి ఎదుర్కొన్నారు. అయితే తాను ఒత్తిడికి గురవ్వుతున్నాననే విషయాన్ని గమనించకుండా అలానే వర్క్ చేసుకుంటూ పోవడంతో ఉన్నట్టుండి వికారం, అసౌకర్యానికి గురయ్యాడు. అలా మధ్యాహ్న భోజన సమయానికి ఈ వికారం, అసౌకర్యం మరింత తీవ్రతరం దాల్చి..ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఒక సహ వ్యవస్థాపకుడు సకాలంలో అసౌకర్యాన్ని తగ్గించే మందులు ఇచ్చి సహాయం చేశారు. ఆ తర్వాత అతను యథవిధిగా పనిని కొనసాగించాడు. అయితే ఆ మరుసటి రోజుకి వోహ్రా ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుంటే..దీర్ఘకాలిక ఒత్తిడి బారినపడ్డట్లు నిర్థారించారు. అందుకు తన అస్తవ్యస్థమైన జీవనశైలి అలవాట్లే కారణమని వైద్యులు చెప్పడంతోనే తనకు కనువిప్పు కలిగిందన్నారు. తనలా 20 ఏళ్ల వయసులో ఉన్న వ్యవస్థాపకులంతా ఎక్కువ పనిగంటలతో ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పైగా దాన్ని గౌరవ చిహ్నంగా చూస్తున్నారని అన్నారు. వోహ్రా సుమారు వారం రోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుని, ఆ తర్వాత పూర్తిగా కోలుకునేలా కుటుంబంతోనే గడిపారు. ఆ సమయంలోనే ఆరోగ్యాన్ని పణంగా పెట్టకుండా కంపెనీలను ఎలా నిర్మించాలనే దానిపై ఆలోచంచడం ప్రారంభించారు. ఆ క్రమంలో వచ్చిన ప్రధాన మార్పు ధ్యానం. ఆయన రాజ్ సంప్రదాయం ద్వారా ధ్యానాన్ని అభ్యసించడం ప్రారంభించి, దాన్ని తన దినచర్యలో ఒక భాగం చేసుకున్నారు. ఆయన ఇప్పుడు తన ఉదయాన్ని 30 నిమిషాల ధ్యానంతో ప్రారంభిస్తారు. అలాగే పని సమయంలో విరామం తీసుకుంటుంటారు. అలా చివరకు తన పనిలోకి తిరిగి వచ్చి..తనను ఎంతగానో ఇబ్బందిపెట్టే వెంచర్ క్యాపిటలిస్టుల(వీసీలు)తో చర్చించడం మానుకుని..కొత్తశక్తితో ముందుకు వచ్చినందుకు కృతజ్ఞతగా ఉండటం ప్రారంభించారు. అయితే తనను మళ్లీ వ్యవస్థాపకుడిగా మారకుండా మాత్రం ఈ అనారోగ్య భయం ఆపలేకపోయిందన్నారు. అలా 2014లో కాన్రాడ్ ఇర్విన్, వివేక్ సోడెరాలతో కలిసి 'సూపర్‌హ్యూమన్'ను సహ-స్థాపించి, ఈమెయిల్ సాఫ్ట్వేర్ రంగంలోకి తిరిగి వచ్చారు. సూపర్‌హ్యూమన్ భారీ విజయాన్ని సాధించి, 2021లో ఏకంగా రూ. 8 వేల కోట్లకు అమ్ముడుపోయింది. దీన్ని గ్రామర్లీ ఈ కంపెనీ కొనుగోలు చేసింది. కానీ ఈసారి మాత్రం ఈ కంపెనీ కొనుగోలులో ఒత్తిడి ఎదుర్కొనలేదు, అనారోగ్యం బారినపడలేదు. ఎందుకంటే తన ఆహారపు అలవాట్లను మార్చుకోవడమే కాదు క్రమం తప్పకుండా వ్యాయామం చేశారు. ధ్యానం కోసం సమయం కేటాయించారు. అలాగే పోషకాహార నిపుణులు, కోచ్‌లు ఇతర నిపుణుల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఇక ఆయన స్థాపించి తొలి స్టార్టప్ రాపోర్టివ్తో పోలిస్తే..సూపర్హ్యుమన్కు గణనీయంగా ఎక్కువ ఆర్థిక స్థిరత్వం ఉంది. ఈ కంపెని పెట్టుబడిదారుల నుంచి దాదాపు రూ. 900 కోట్లకు పైగా నిధులను సమీకరించింది. తొలి విజయంలో ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడం అనే మూల్యం చెల్లిస్తే..ఆ తర్వాత అంతే శక్తిమంతంగా తిరిగొచ్చి ఫిట్‌గా ఉంటూనే వ్యవస్థాపకుడి ఎలా పనిచేయొచ్చే చూపించి స్ఫూర్తిగా నిలిచారు పారిశ్రామికవేత్త వోహ్రా.ఇదీ చదవండి: చాయ్ వ్యాపారంతో అన్ని కోట్లా..!ఆ ముగ్గురు కుర్రాళ్ల ఐడియా..) -
మంచి ఫిట్నెస్ అంటే..?
మంచి ఫిట్నెస్ను తేలిగ్గా తెలియజెప్పడానికి ఏ అంశాలు కారణమవుతాయో అమెరికన్ హార్ట్ అసోసియేష (ఏహెచ్ఏ)కు చెందిన అధ్యయనవేత్తలు చెబుతున్నారు. ఈ అధ్యయనంలో 14,345 మంది పాల్గొన్నారు. దాదాపు ఆరేళ్లకు పైగా సాగటంతో పాటు మరో పదకొండేళ్ల ఫాలో అప్ తర్వాత ‘ఫిట్నెస్’ గురించి నిపుణులు చెబుతున్నదేమిటంటే... రోజులోని ఏ సమయంలోనైనా ఆయాసపడకుండా పది నిమిషాలు పరుగెత్తగలగడం తమ రోజువారీ పనులు చురుగ్గా చేసుకోగలగడం అవన్నీ పూర్తి చేశాక... సాయంత్రం ఏవైనా వినోద కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తే అలిసిపోయాననే సాకు చెప్పకుండా వాటిలోనూ హుషారుగా పాల్గొనడం అనుకోని ఘటన (అన్ఫోర్సీన్ ఇన్సిడెంట్) ఏదైనా జరిగితే రోజంతా పనిచేసిన అలసటను సాకుగా తీసుకోకుండా దాన్ని చక్కదిద్దేందుకు ప్రయత్నం చేయడం... ఈ నాలుగు పనులూ సునాయాసంగా చేయగలిగితే వారు మంచి ఫిట్నెస్తో ఉన్నట్టేనన్నది నిపుణులు మాట.ఇదీ చదవండి: హైబీపీని అదుపులో పెట్టే పొటాషియమ్! -
హైబీపీని అదుపులో పెట్టే పొటాషియమ్!
మన దేహంలో అనేక లవణాలు ఒక సమతులస్థాయిలో ఉండి జీవక్రియలకు దోహదపడుతుంటాయి. అందులో సోడియం, పొటాషియమ్ కీలకం. ఇందులో సోడియం ఉప్పు నుంచి వస్తుందన్న విషయం తెలిసిందే. ఈ మోతాదు పెరిగితే అది అధిక రక్తపోటుకు (హైబీపీకి) దారితీస్తుందన్నదీ చాలా మందికి తెలిసిన విషయమే. అయితే ఈ లవణాల్లో సోడియం బీపీని పెంచితే, పొటాషియమ్ దాన్ని తగ్గిస్తుంది. అందుకే ఉప్పు (సోడియం) తక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గడంతో పాటు గుండె, రక్తనాళాల వ్యాధుల ముప్పు కూడా తగ్గుతుంది అన్న విషయం చాలాకాలంగా తెలుసు. అయితే... ఉప్పు తగ్గించడంతో పాటు పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం బీపీని అదుపులో ఉంచడంలో బాగా తోడ్పడతాయిని ఒక అమెరికన్ అధ్యయనంతో తేలింది. ఈ అధ్యయనం ‘ద అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్’లో ప్రచురితమైంది. మన దేహంలో సోడియం, పొటాషియం రెండూ కలిసి పనిచేస్తాయి. అయితే చాలామంది ఉప్పు రూపంలో అవసరానికి మించి సోడియం తీసుకుంటుండగా, పొటాషియం మాత్రం సిఫార్సు చేసిన స్థాయిలో తీసుకోవడం లేదు. పొటాషియం తక్కువగా తీసుకోవడం వల్ల సోడియం చేసే హానికర ప్రభావాలు మరింత పెరిగి, రక్తపోటు పెరగడానికి కారణమవుతుంటాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా 128 కోట్లకు పైగా వ్యక్తులు హైబీపీతో బాధపడుతున్నారు. గుండె జబ్బులు, పక్షవాతం (స్ట్రోక్) రావడానికి ప్రధాన కారణాల్లో హైబీపీ ఒకటి. హైబీపీని అదుపులో ఉంచుకోవడమూ... తద్వారా గుండెజబ్బులూ, పక్షవాతం వంటి వాటిని నివారించుకోడానికి... ఉప్పు తగ్గించడమే కాకుండా, పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని పెంచడంపైనా సమానంగా దృష్టి పెట్టాలంటూ పరిశోధకులు చెబుతున్నారు. పొటాషియం హైబీపీని ఎలా అదుపు చేస్తుందంటే... పొటాషియం అన్నది శరీరంలోని అదనపు సోడియంను మూత్రం ద్వారా బయటకు పంపించడంలో సహాయపడుతుంది. అంతేకాదు, రక్తనాళాలను మరింతగా విప్పిపారేలా చేయడం ద్వారా రక్తపోటును తగ్గించడానికీ తోడ్పడుతుంది. పొటాషియం మోతాదులు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల గుండె, రక్తనాళాల ఆరోగ్యమూ బాగుంటుందని అనేక అధ్యయనాల్లో తెలిసింది. వీటిల్లో పొటాషియం ఎక్కువ... పాలకూర వంటి తాజా ఆకుకూరలూ, టొమాటో, చిక్కుళ్ల వంటి కాయగూరలు, అరటిపండ్లు, ఆరెంజెస్ వంటి తాజాపండ్లు, పప్పులు, చిక్కుడు జాతి గింజలు, చేపలు, పాల ఉత్పత్తుల్లో పొటాషియమ్ ఎక్కువ. మన ఆహారంలో ఇవి తీసుకోవడం వల్ల పొటాషియమ్ మోతాదులు పెరిగి, సోడియమ్ దుష్ప్రభావాన్ని తగ్గిస్తాయి. ఇదీ చదవండి: తరచూ గుండెల్లో మంటా..? జీఈఆర్డీ కావచ్చు! -
తరచూ గుండెల్లో మంటా..? జీఈఆర్డీ కావచ్చు!
తిన్నవెంటనే ఎంతోమంది చేసే ఫిర్యాదు... గుండెల్లో మంటగా ఉంది; ఛాతీ బరువుగా ఉందీ; నోట్లోకి పుల్లతేన్పులూ, చేదురుచీ వస్తున్నాయని. దాంతో చాలామంది నోట తినగానే వినిపించే మాట... ‘ఎసిడిటీ’ అని! అవును... ఈ సమస్య చాలామందిలో తరచూ కనిపించేదే. తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుందో కాదోగానీ... ఎసిడిటీ ముదిరితే జీఈఆర్డీ తప్పక అవుతుంది. ‘గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్’ అనే మాటకు సంక్షిప్తరూపమైన ‘జీఈఆర్డీ’ అంటే ఏమిటి, దానికి కారణాలేమిటి, నివారణ, చికిత్స ఎలా వంటి అనేక అంశాల గురించి తెలుసుకుందాం.ఎసిడిటీ లక్షణాలు కనిపించగానే కొందరు యాంటాసిడ్ పౌడర్ ప్యాక్‌ను చింపి గ్లాస్లో వేసుకుని, నీళ్లు ΄ోసుకుని తాగేస్తుంటారు. ఇది చాలామంది చేసేదే. అయితే ఏదో బాగా మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకున్నప్పుడో, ఎప్పుడో బాగా రుచిగా ఉన్న పదార్థాలు కడుపునిండుగా తిన్నప్పుడో అరుదుగా ఇలా జరిగితే పర్లేదు. కానీ తరచూ ఇదే పరిస్థితి ఎదురవుతుంటే మాత్రం ఆలోచించాలంటున్నారు వైద్యనిపుణులు.ఎసిడిటీకీ... జీఈఆర్డీకీ ఇదీ తేడా! మనం ఆహారం తీసుకోగానే అది ఆహారనాళం (ఈసోఫేగస్) ద్వారా సంచి ఆకృతిలో ఉండే కడుపు (స్టమక్)లోకి వెళ్తుంది. అక్కడ ఆహారాన్ని జీర్ణం చేయడానికి కడుపులో యాసిడ్ స్రవిస్తూ ఉంటుంది. ఆహారనాళం చివరన... అంటే ఆహారనాళమూ, సంచి ఆకృతిలోని స్టమక్ కలిసే చోట ఆహారాన్ని పైకి రానివ్వకుండా చూసే ‘స్ఫింక్టర్’ ఉంటుంది. ఇది ఈసోఫేగస్ చివరన ఉండటంతో దీన్ని ‘లోయర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్’ అంటారు. కడుపులోకి ఆహారం వెళ్లగానే ఇది బిగుసుకుపోయి స్టమక్‌లో స్రవించే యాసిడ్‌ను పైకి రానివ్వదు. కడుపు నిండుగా ఆహారం తీసుకున్నప్పుడు ఈ స్ఫింక్టర్ పూర్తిగా మూసుకుపోకపోవచ్చు. దాంతో అలాంటప్పుడు కడుపులోని యాసిడ్ ఈసోఫేగస్‌లోకి రావడంతో ఆ యాసిడ్ తాలూకు ‘మంట’ గొంతులో తెలుస్తుంది. ఒక్కోసారి ఆ యాసిడ్ గొంతులోకి వచ్చి చేదు రుచి కూడా తెలుస్తుంది. దీన్నే ‘ఎసిడిటీ’గా చెబుతుంటారు. అయితే... ఈ స్ఫింక్టర్ వదులై΄ోవడం వల్ల ఎసిడిటీలో కనిపించే లక్షణాలు దీర్ఘకాలం పాటు కనిపిస్తూ ఉంటే... దాన్ని కేవలం ‘ఎసిడిటీ’ గా తీసుకోకూడదు. ఆ కండిషన్‌ను ‘గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్ డిసీజ్’గా చెబుతారు. ఇక్కడ ‘రిఫ్లక్స్’ అంటే వెనక్కు రావడం. అంటే కడుపులో ఉండాల్సిన యాసిడ్ వెనక్కు గొంతుభాగంలో ఉండే ‘ఈసోఫేగస్’లోకి వస్తుంది కాబట్టే... ఈ సమస్యకు ఆ పేరు.సమస్యకు కారణమయ్యే అంశాలు... చాలామందిలో ఎప్పుడో ఒకసారి కనిపించే ఈ సమస్య కొందరిలో తరచూ కనిపించడానికి కొన్ని అంశాలు కారణమవుతాయి. అవి... అధిక బరువు / ఊబకాయం, మద్యం, పొగతాగే అలవాటు, హయటస్ హెర్నియా, కొన్ని రకాల మందులు, మహిళల్లో అయితే గర్భధారణ వంటి అంశాలు ఈ సమస్యకు కారణమవుతాయి.ముప్పు ఎప్పుడంటే... జీఈఆర్‌డీని ఎసిడిటీగానే పరిగణించి చాలాకాలం నిర్లక్ష్యం చేస్తే ఆహారనాళంలో వాపు, పుండ్లు, ఆహారనాళం ఇరుకుగా మారడం వంటి సమస్యలు రావచ్చు. కొందరిలో బారెట్ ఈసోఫేగస్ అనే సమస్య వచ్చే అవకాశమూ ఉండవచ్చు. అందుకే ఈ సమస్య తరచూ కనిపిస్తుంటే మాత్రం దీన్ని ఎసిడిటీ లేదా గ్యాస్ సమస్యగా పరిగణించి స్వయంగా మందులు వాడటం మంచిది కాదు. ఒకసారి డాక్టర్‌ను సంప్రదించడం అవసరం.నివారణ ఇలా... సాధారణంగా మసాలాలతో కూడిన ఆహారం, నూనెలు ఎక్కువగా ఉండే ఆయిలీఫుడ్ వంటివి ఇందుకు కారణమైనప్పటికీ... వేర్వేరు వ్యక్తుల్లో వేర్వేరు అంశాలూ, ఆహారాలు ఈ సమస్యను ప్రేరేపిస్తూ ఉంటాయి. అందుకే తాము ఏ ఆహారం తీసుకున్న తర్వాత తమకు యాసిడ్ రిఫ్లక్స్ ఎక్కువవుతోందో గమనిస్తూ, ఆ ఆహారాలను తగ్గించుకోవడం లేదా వాటికి దూరంగా ఉండటం అవసరం. అలాగే ఒకేసారి ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం, మసాలాలూ, కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం, కెఫిన్ ఉండే కాఫీ / కోలా డ్రింక్స్ లాంటి పానీయాలు, కార్బొనేటెడ్ డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు చాలావరకు ఉపశమనం కలిగించవచ్చు. అలాగే బరువు తగ్గించుకోవడం కూడా ఈ సమస్యకే కాకుండా... తమ పూర్తి ఆరోగ్యానికీ మేలు చేసే అంశం. ఇక స్ట్రెస్, యాంగై్జటీ వంటి అంశాలు కూడా ఈ సమస్యను పెంచే అవకాశముంది. కాబట్టి వాటిని తగ్గించుకునేలా రిలాక్సేషన్ టెక్నిక్స్ అనుసరించడమూ మేలు చేస్తుంది.చిన్న మార్పులతో ఉపశమనంపొగతాగే అలవాటును పూర్తిగా మానేయడం, భోజనం చేసిన వెంటనే పక్కమీదికి ఒరగకుండా కాసేపు అటు ఇటు నడవడం, రాత్రి భోజనం తర్వాత కనీసం 2–3 గంటల పాటు నిద్రకు ఉపక్రమించకపోవడం వంటి జీవనశైలి (లైఫ్‌స్టైల్) మార్పులు రిఫ్లక్స్‌ను తగ్గించడంలో సహాయపడవచ్చు. రాత్రివేళ సమస్య ఎక్కువగా ఉంటే పడుకునే సమయంలో దేహభాగం కంటే తలభాగం కాస్త ఎత్తుగా ఉంచేలా తలగడ ఉపయోగించడం వంటి చిన్న చిన్న మార్పులు చాలావరకు ఉపయోగపడతాయి.మందులు / చికిత్స... సమస్య / లక్షణాల తీవ్రతను బట్టి డాక్టర్లు యాంటాసిడ్స్, ఏ2 బ్లాకర్స్, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ (పీపీఐ) వంటి మందులను సూచిస్తారు. ఈ సింపుల్ మందులూ, జీవనశైలి మార్పులతోనూ సమస్య అదుపులోకి రాకపోతే అవసరాన్ని బట్టి ఎండోస్కోపీ వంటి పరీక్షలు, సమస్య తీవ్రతను బట్టి కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్స అవసరం కావచ్చు.డాక్టర్లను సంప్రదించాల్సిన లక్షణాలు... మింగడంలో ఇబ్బంది, పదేపదే వాంతులు, కారణం లేకుండా బరువు తగ్గడం, రక్తపు వాంతులు లేదా నల్లగా ఉండే మలం వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. అలాగే ఛాతీ నొప్పి తీవ్రంగా ఉండి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చేతి లేదా దవడ వైపు నొప్పి ఉంటే అది గుండె సంబంధిత అత్యవసర పరిస్థితి కూడా కావచ్చు. లక్షణాలు... తిన్న తర్వాత గుండెల్లో మంటనోట్లోకి పుల్లటి లేదా చేదు ద్రవం రావడంగొంతులో ఏదో ఇరుక్కున్నట్లు అనిపించడంరాత్రివేళ దగ్గు, గొంతు బొంగురు΄ోవడంఛాతి లేదా పై పొట్టలో అసౌకర్యం కడుపు ఉబ్బరంగా అనిపించడంఅదేపనిగా తేన్పులు వస్తుండటం మింగడంలో ఇబ్బంది లేదా నొప్పిఅయితే ఈ సమస్య ఉన్న ప్రతి ఒక్కరికీ ఒకే రకమైన లక్షణాలు ఉండాల్సిన అవసరం లేదు. కొందరిలో కొన్ని లక్షణాలు మాత్రమే కనిపించవచ్చు. ఉదాహరణకు గుండెల్లో మంట లేకుండానే దగ్గు లేదా గొంతుకు సంబంధించిన సమస్యలు కనిపించవచ్చు. డాక్టర్ తరుణ్ గట్టు, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ నిర్వహణ : యాసీన్ఇదీ చదవండి: పెళ్లికి ముందే రెండుసార్లు IVF ఫెయిల్.. పెళ్లైన తొమ్మిది నెలల్లోనే బిడ్డ.. -
కాపర్–టీ పెట్టించుకుంటే.. పీరియడ్స్‌పై ప్రభావమా?
హాయ్ డాక్టర్! నా వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు. నాకు ఒక సంవత్సరం వయసున్న పాప ఉంది. కనీసం మూడేళ్ల పాటు గర్భం రాకుండా ఉండేందుకు ఏం చేయాలి? కాపర్–టీ సురక్షితమేనా? దానివల్ల కొన్ని దుష్ప్రభావాలు వస్తాయని విన్నాను. అందుకే కాపర్–టీ వేయించుకోవడానికి కొంచెం భయంగా ఉంది. నా పరిస్థితికి ఏ గర్భనిరోధక పద్ధతి సరిపోతుంది?– సుశీల, వికారాబాద్.మూడేళ్ల పాటు గర్భధారణను వాయిదా వేయాలనుకుంటే, కాపర్–టీ మీకు ఒక మంచి ఎంపిక. అయితే మీ ఆరోగ్య పరిస్థితి, గత వైద్య చరిత్ర, ప్రస్తుతం ఉన్న సమస్యలు వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే ఇది మీకు సరిపోతుందా లేదా అనేది నిర్ణయించాలి. కాపర్–టీ సాధారణంగా సురక్షితమైన, అత్యంత ప్రభావవంతమైన గర్భనిరోధక పద్ధతుల్లో ఒకటి. ఇది గర్భాశయంలో అమర్చే చిన్న పరికరం. ఇందులో హార్మోన్లు ఉండవు. గర్భధారణను నివారించేందుకు ఇది నిరంతరం పనిచేస్తుంది. అందువల్ల ప్రతిరోజూ మాత్రలు వేసుకోవడం, తరచూ ఏదైనా గుర్తు పెట్టుకోవడం వంటి అవసరం ఉండదు. ముఖ్యంగా మరో బిడ్డకు కొంత విరామం ఇవ్వాలనుకునే మహిళలకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది.తర్వాత కూడా కొనసాగించవచ్చుమళ్లీ గర్భం దాల్చాలని అనుకున్నప్పుడు వైద్యుల ద్వారా కాపర్–టీని తొలగించుకోవచ్చు. తొలగించిన తర్వాత సాధారణంగా సంతానోత్పత్తి సామర్థ్యం తిరిగి వస్తుంది. ఇందులో మరో ప్రయోజనం ఏమిటంటే, కాపర్–టీకి హార్మోన్లు ఉండవు. కాబట్టి హార్మోన్ల ఆధారిత గర్భనిరోధక పద్ధతులను ఉపయోగించరాదని అనుకునేవారికి ఇది ఒక ప్రత్యామ్నాయం. కొన్ని రకాల కాపర్–టీలు మూడు నుంచి పది సంవత్సరాల వరకు పనిచేస్తాయి. అంటే మీరు కోరుకున్న మూడేళ్ల విరామం పూర్తయిన తర్వాత కూడా, అవసరాన్ని బట్టి దాన్ని కొనసాగించవచ్చు.ఎప్పుడు వేయించుకోవాలి?కాపర్–టీని నెలసరి సమయంలోనే తప్పనిసరిగా వేయించుకోవాల్సిన అవసరం లేదు. గర్భం లేదని వైద్యులు నిర్ధారించిన తర్వాత, నెలసరి చక్రంలో తగిన సమయంలో అమర్చవచ్చు. ప్రసవం తర్వాత కూడా కాపర్–టీ వేయించుకోవచ్చు. అయితే ఎప్పుడు అమర్చాలి అనేది ప్రసవం జరిగిన విధానం, ప్రసవం తర్వాత మీ ఆరోగ్య పరిస్థితి వంటి అంశాలను బట్టి వైద్యులు నిర్ణయిస్తారు. అందుకే ముందుగా స్త్రీ వైద్య నిపుణులను సంప్రదించి, మీకు సరైన సమయం ఏదో తెలుసుకోవడం మంచిది.ప్రయోజనాలు..కాపర్–టీ గర్భధారణను నివారించడంలో తొంభై తొమ్మిది శాతానికి పైగా ప్రభావవంతంగా ఉంటుంది. – ఒకసారి అమర్చిన తర్వాత నిరంతరం పనిచేస్తుంది. ప్రతిరోజూ మందులు తీసుకోవాల్సిన అవసరం ఉండదు.హార్మోన్లు ఉండవు కాబట్టి హార్మోన్లను ఉపయోగించకూడదని అనుకునేవారికి ఇది ఉపయోగపడుతుంది.అవసరమైనప్పుడు వైద్యుల ద్వారా ఎప్పుడైనా తొలగించుకోవచ్చు.తొలగించిన తర్వాత సాధారణంగా సంతానోత్పత్తి సామర్థ్యం తిరిగి వస్తుంది.తల్లిపాలు ఇస్తున్న మహిళలు కూడా సాధారణంగా కాపర్–టీని ఉపయోగించవచ్చు.దుష్ప్రభావాలు!కాపర్–టీ వల్ల ఉంటాయి... కానీ ప్రతి ఒక్కరికీ రావాల్సిన అవసరం లేదు.కాపర్–టీ వల్ల ముఖ్యంగా మొదటి మూడు నుంచి ఆరు నెలల్లో నెలసరి రక్తస్రావం ఎక్కువ కావచ్చు.నెలసరి ఎక్కువ రోజులు కొనసాగడం లేదా నెలసరి సమయంలో నొప్పి కొంత ఎక్కువగా అనిపించడం కూడా ఉండవచ్చు. అయితే చాలామంది మహిళల్లో ఈ మార్పులు కాలక్రమేణా తగ్గిపోతాయి.అరుదుగా కాపర్–టీ గర్భాశయం నుంచి బయటకు జారిపోవడం, అమర్చే సమయంలో గర్భాశయానికి గాయం కావడం లేదా ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా చికిత్స చేయని లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.భయపడాల్సిన పనిలేదు..అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. కాపర్–టీ వల్ల సంతానలేమి కలగదు. దాన్ని తొలగించిన తర్వాత సాధారణంగా సంతానోత్పత్తి సామర్థ్యం తిరిగి వస్తుంది. అలాగే తల్లిపాలు ఇస్తున్న మహిళల్లోనూ ఇది సాధారణంగా పాల ఉత్పత్తిని తగ్గించదు. కాబట్టి కాపర్–టీ వల్ల దుష్ప్రభావాలు వస్తాయని విన్నంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు.మీకు ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం కాపర్–టీ వల్ల వచ్చే నెలసరి మార్పులు మీకు ఇబ్బందిగా ఉంటాయా లేదా అన్నదే. అయితే, మీరు మరో మూడేళ్ల వరకు గర్భధారణను వాయిదా వేయాలనుకుంటున్నందున, మీ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన తర్వాత కాపర్–టీతో పాటు ఇతర గర్భనిరోధక పద్ధతుల గురించి కూడా స్త్రీ వైద్య నిపుణులతో చర్చించండి. మీకు సరిపోయే పద్ధతిని కలిసి నిర్ణయించుకోవడం ఉత్తమం.- డా. కడియాల రమ్య, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ఇదీ చదవండి: టీవీకి అతుక్కుపోతే మెదడు ‘చిన్న’బోతుంది!? -
ఆ మందులతో గ్లకోమా ముప్పు!
అంగస్తంభన సమస్య చికిత్సకు వాడే టాడలఫిల్ మందును దీర్ఘకాలం వాడితే కంట్లోని ఆప్టిక్ నరం దెబ్బతిని చూపు కోల్పోయే (గ్లకోమా) ముప్పు పెరిగే అవకాశం ఉందని తైవాన్ పరిశోధకులు గుర్తించారు. అలాగే వృద్ధుల్లో ప్రోస్టేట్ గ్రంథి సమస్యల చికిత్సలో భాగంగా వాడే టాడలఫిల్ మందు వల్ల కొందరిలో మూత్రం తరచుగా రావడం, అకస్మాత్తుగా మూత్ర విసర్జన చేయాలనిపించడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని అధ్యయనంలో తెలుసుకున్నారు. టాడలఫిల్ను దీర్ఘకాలంపాటు వాడటం వల్ల గ్లకోమా ముప్పు పెరుగుతుందా అనే విషయాన్ని తెలుసుకోవడానికి పరిశోధకులు 40 ఏళ్లు పైబడిన 78,364 మంది పురుషుల హెల్త్ రిపోర్టులను విశ్లేషించారు. వారిలో సగం మందికి మూత్ర సంబంధిత సమస్యల చికిత్స కోసం ఐదేళ్ల వరకు టాడలఫిల్ లేదా ఇతర పీడీఈ5 ఇన్హిబిటర్ మందులను వాడాలని వైద్యులు సూచించారు. ఈ మందులు వాడని వారితో పోలిస్తే టాడలఫిల్ వాడిన వారిలో గ్లకోమా ముప్పు 22 శాతం ఎక్కువగా, కంట్లో ఒత్తిడి పెరగడం (ఆక్యులర్ హైపర్‌టెన్షన్) 32 శాతం అధికంగా, ప్రైమరీ ఓపెన్ యాంగిల్ గ్లకోమా 33 శాతం ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నట్లు తైవాన్ పరిశోధకులు గుర్తించారు.అలాగే అంగస్తంభన సమస్యకు మందులు వాడుతున్న వారిలో గ్లకోమా చికిత్స మొదలుపెట్టాల్సిన అవసరం ఏర్పడే అవకాశం కూడా 33 శాతం ఎక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది. అయితే ఇప్పటికే గ్లకోమా లేదా కంట్లోని ద్రవంలో ఒత్తిడి సమస్యలు ఉన్నవారు, కుటుంబంలో ఎవరికైనా గ్లకోమా ఉన్నవారు, మయోపియా (దగ్గరివి స్పష్టంగా కనిపిస్తూ దూరాన ఉన్నవి అంత స్పష్టంగా కనిపించని నియర్సైటెడ్ సమస్య) ఎక్కువగా ఉన్నవారు, దీర్ఘకాలం ఈ మందులు వాడాల్సిన వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పరిశోధకులు సూచించారు. ఈ మందులు వాడేవారు ముందుగానే కంటి పరీక్షలు చేయించుకోవడంతోపాటు వైద్యుల సూచన మేరకు క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవడం అవసరమని కూడా తెలిపారు. ఈ అధ్యయనం బ్రిటిష్ జర్నల్ ఆఫ్ ఫార్మకాలజీలో ప్రచురితమైంది. -
టీవీకి అతుక్కుపోతే మెదడు ‘చిన్న’బోతుంది!?
రోజంతా టీవీ చూసే మధ్య వయస్కుల్లో జ్ఞాపకశక్తి, ఆలోచనలకు కారణమయ్యే మెదడులోని కొన్ని భాగాల పరిమాణం తక్కువగా ఉంటున్నట్లు అమెరికా పరిశోధకులు తాజా అధ్యయనంలో గుర్తించారు. ఈ అధ్యయనంలో భాగంగా సగటున 53 ఏళ్ల వయసున్న 1,712 మందికి చెందిన ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషించారు. ఖాళీ సమయాల్లో వారు ఎంత తరచూ టీవీ చూస్తారో, ఉద్యోగ సమయాల్లో ఎంతసేపు కూర్చుంటారో వారిని అడిగి తెలుసుకున్నారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత వారి మెదడులకు మళ్లీ స్కానింగ్ పరీక్షలు చేయగా ఎప్పుడూ టీవీ చూడని లేదా చాలా అరుదుగా చూసే వారితో పోలిస్తే తరచూ టీవీ చూసే వారి మెదడులోని చాలా భాగాల్లో గణనీయమైన మార్పులు కనిపించాయి.వారి జ్ఞాపకశక్తి, ఆలోచనలు, నిర్ణయాలు తీసుకోవడం, కళ్ల ద్వారా వచ్చే సమాచారాన్ని అర్థం చేసుకోవడం వంటి పనులకు ఉపయోగపడే మెదడులోని కొన్ని భాగాల పరిమాణం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే మెదడులోని వైట్ మ్యాటర్ కొంత దెబ్బతిన్నట్లు తెలిపే సంకేతాలూ ఎక్కువగానే కనిపించాయి. అయితే బద్ధకంగా టీవీ చూస్తూ కూర్చొనేవారితో పోలిస్తే ఉద్యోగాల్లో భాగంగా ఎక్కువసేపు కూర్చొనే వారి మెదడు స్కాన్లలో కొంత మెరుగైన ఫలితాలే కనిపించాయి.వారి మెదడు పరిమాణం ఎక్కువగా ఉండటంతోపాటు వైట్ మ్యాటర్ దెబ్బతిన్న సూచనలూ తక్కువేగానే ఉన్నాయి. ఉద్యోగులు విధి నిర్వహణలో భాగంగా వివిధ సమస్యలకు పరిష్కారాల గురించి ఆలోచించడం, ఏకాగ్రతతో పనిచేయడం వంటి మెదడు సంబంధ కారణాల వల్ల ఆ పనులు మెదడుపై టీవీ చూడటం కంటే భిన్నమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉండవచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. టీవీ చూడటంతో వచ్చే మెదడు మార్పులు పురుషుల్లో మరింత ఎక్కువగా కనిపించినట్లు ఎమ్మారై స్కాన్లలో వెల్లడైంది. -
తరచూ గుండెల్లో మంటా..? జీఈఆర్డీ కావచ్చు!
తిన్నవెంటనే ఎంతోమంది చేసే ఫిర్యాదు... గుండెల్లో మంటగా ఉంది; ఛాతీ బరువుగా ఉందీ; నోట్లోకి పుల్లతేన్పులూ, చేదురుచీ వస్తున్నాయని. దాంతో చాలామంది నోట తినగానే వినిపించే మాట... ‘ఎసిడిటీ’ అని! అవును... ఈ సమస్య చాలామందిలో తరచూ కనిపించేదే. తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుందో కాదోగానీ... ఎసిడిటీ ముదిరితే జీఈఆర్డీ తప్పక అవుతుంది. ‘గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్’ అనే మాటకు సంక్షిప్తరూపమైన ‘జీఈఆర్డీ’ అంటే ఏమిటి, దానికి కారణాలేమిటి, నివారణ, చికిత్స ఎలా వంటి అనేక అంశాల గురించి తెలుసుకుందాం.ఎసిడిటీ లక్షణాలు కనిపించగానే కొందరు యాంటాసిడ్ ΄పౌడర్ ΄్యాక్‌ను చింపి గ్లాస్లో వేసుకుని, నీళ్లుపోసుకుని తాగేస్తుంటారు. ఇది చాలామంది చేసేదే. అయితే ఏదో బాగా మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకున్నప్పుడో, ఎప్పుడో బాగా రుచిగా ఉన్న పదార్థాలు కడుపునిండుగా తిన్నప్పుడో అరుదుగా ఇలా జరిగితే పర్లేదు. కానీ తరచూ ఇదే పరిస్థితి ఎదురవుతుంటే మాత్రం ఆలోచించాలంటున్నారు వైద్యనిపుణులు.ఎసిడిటీకీ... జీఈఆర్డీకీ ఇదీ తేడా! మనం ఆహారం తీసుకోగానే అది ఆహారనాళం (ఈసోఫేగస్) ద్వారా సంచి ఆకృతిలో ఉండే కడుపు (స్టమక్)లోకి వెళ్తుంది. అక్కడ ఆహారాన్ని జీర్ణం చేయడానికి కడుపులో యాసిడ్ స్రవిస్తూ ఉంటుంది. ఆహారనాళం చివరన... అంటే ఆహారనాళమూ, సంచి ఆకృతిలోని స్టమక్ కలిసే చోట ఆహారాన్ని పైకి రానివ్వకుండా చూసే ‘స్ఫింక్టర్’ ఉంటుంది. ఇది ఈసోఫేగస్ చివరన ఉండటంతో దీన్ని ‘లోయర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్’ అంటారు. కడుపులోకి ఆహారం వెళ్లగానే ఇది బిగుసుకు΄ోయి స్టమక్‌లో స్రవించే యాసిడ్‌ను పైకి రానివ్వదు. కడుపు నిండుగా ఆహారం తీసుకున్నప్పుడు ఈ స్ఫింక్టర్ పూర్తిగా మూసుకు΄ోక΄ోవచ్చు. దాంతో అలాంటప్పుడు కడుపులోని యాసిడ్ ఈసోఫేగస్‌లోకి రావడంతో ఆ యాసిడ్ తాలూకు ‘మంట’ గొంతులో తెలుస్తుంది. ఒక్కోసారి ఆ యాసిడ్ గొంతులోకి వచ్చి చేదు రుచి కూడా తెలుస్తుంది. దీన్నే ‘ఎసిడిటీ’గా చెబుతుంటారు. అయితే... ఈ స్ఫింక్టర్ వదులై΄ోవడం వల్ల ఎసిడిటీలో కనిపించే లక్షణాలు దీర్ఘకాలం ΄ాటు కనిపిస్తూ ఉంటే... దాన్ని కేవలం ‘ఎసిడిటీ’ గా తీసుకోకూడదు. ఆ కండిషన్‌ను ‘గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్ డిసీజ్’గా చెబుతారు. ఇక్కడ ‘రిఫ్లక్స్’ అంటే వెనక్కు రావడం. అంటే కడుపులో ఉండాల్సిన యాసిడ్ వెనక్కు గొంతుభాగంలో ఉండే ‘ఈసోఫేగస్’లోకి వస్తుంది కాబట్టే... ఈ సమస్యకు ఆ పేరు.సమస్యకు కారణమయ్యే అంశాలు... చాలామందిలో ఎప్పుడో ఒకసారి కనిపించే ఈ సమస్య కొందరిలో తరచూ కనిపించడానికి కొన్ని అంశాలు కారణమవుతాయి. అవి... అధిక బరువు / ఊబకాయం, మద్యం, ΄÷గతాగే అలవాటు, హయటస్ హెర్నియా, కొన్ని రకాల మందులు, మహిళల్లో అయితే గర్భధారణ వంటి అంశాలు ఈ సమస్యకు కారణమవుతాయి.ముప్పు ఎప్పుడంటే... జీఈఆర్‌డీని ఎసిడిటీగానే పరిగణించి చాలాకాలం నిర్లక్ష్యం చేస్తే ఆహారనాళంలో వాపు, పుండ్లు, ఆహారనాళం ఇరుకుగా మారడం వంటి సమస్యలు రావచ్చు. కొందరిలో బారెట్ ఈసోఫేగస్ అనే సమస్య వచ్చే అవకాశమూ ఉండవచ్చు. అందుకే ఈ సమస్య తరచూ కనిపిస్తుంటే మాత్రం దీన్ని ఎసిడిటీ లేదా గ్యాస్ సమస్యగా పరిగణించి స్వయంగా మందులు వాడటం మంచిది కాదు. ఒకసారి డాక్టర్‌ను సంప్రదించడం అవసరం.నివారణ ఇలా... సాధారణంగా మసాలాలతో కూడిన ఆహారం, నూనెలు ఎక్కువగా ఉండే ఆయిలీఫుడ్ వంటివి ఇందుకు కారణమైనప్పటికీ... వేర్వేరు వ్యక్తుల్లో వేర్వేరు అంశాలూ, ఆహారాలు ఈ సమస్యను ప్రేరేపిస్తూ ఉంటాయి. అందుకే తాము ఏ ఆహారం తీసుకున్న తర్వాత తమకు యాసిడ్ రిఫ్లక్స్ ఎక్కువవుతోందో గమనిస్తూ, ఆ ఆహారాలను తగ్గించుకోవడం లేదా వాటికి దూరంగా ఉండటం అవసరం. అలాగే ఒకేసారి ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం, మసాలాలూ, కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం, కెఫిన్ ఉండే కాఫీ / కోలా డ్రింక్స్ లాంటి ΄ానీయాలు, కార్బొనేటెడ్ డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు చాలావరకు ఉపశమనం కలిగించవచ్చు. అలాగే బరువు తగ్గించుకోవడం కూడా ఈ సమస్యకే కాకుండా... తమ పూర్తి ఆరోగ్యానికీ మేలు చేసే అంశం. ఇక స్ట్రెస్, యాంగై్జటీ వంటి అంశాలు కూడా ఈ సమస్యను పెంచే అవకాశముంది. కాబట్టి వాటిని తగ్గించుకునేలా రిలాక్సేషన్ టెక్నిక్స్ అనుసరించడమూ మేలు చేస్తుంది.చిన్న మార్పులతో ఉపశమనం΄పొగతాగే అలవాటును పూర్తిగా మానేయడం, భోజనం చేసిన వెంటనే పక్కమీదికి ఒరగకుండా కాసేపు అటు ఇటు నడవడం, రాత్రి భోజనం తర్వాత కనీసం 2–3 గంటలటు నిద్రకు ఉపక్రమించక΄ోవడం వంటి జీవనశైలి (లైఫ్‌స్టైల్) మార్పులు రిఫ్లక్స్‌ను తగ్గించడంలో సహాయపడవచ్చు. రాత్రివేళ సమస్య ఎక్కువగా ఉంటే పడుకునే సమయంలో దేహభాగం కంటే తలభాగం కాస్త ఎత్తుగా ఉంచేలా తలగడ ఉపయోగించడం వంటి చిన్న చిన్న మార్పులు చాలావరకు ఉపయోగపడతాయి.మందులు / చికిత్స... సమస్య / లక్షణాల తీవ్రతను బట్టి డాక్టర్లు యాంటాసిడ్స్, ఏ2 బ్లాకర్స్,ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ (పీపీఐ) వంటి మందులను సూచిస్తారు. ఈ సింపుల్ మందులూ, జీవనశైలి మార్పులతోనూ సమస్య అదుపులోకి రాక΄ోతే అవసరాన్ని బట్టి ఎండోస్కోపీ వంటి పరీక్షలు, సమస్య తీవ్రతను బట్టి కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్స అవసరం కావచ్చు.డాక్టర్లను సంప్రదించాల్సిన లక్షణాలు... మింగడంలో ఇబ్బంది, పదేపదే వాంతులు, కారణం లేకుండా బరువు తగ్గడం, రక్తపు వాంతులు లేదా నల్లగా ఉండే మలం వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. అలాగే ఛాతీ నొప్పి తీవ్రంగా ఉండి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చేతి లేదా దవడ వైపు నొప్పి ఉంటే అది గుండె సంబంధిత అత్యవసర పరిస్థితి కూడా కావచ్చు. లక్షణాలు...» తిన్న తర్వాత గుండెల్లో మంట» నోట్లోకి పుల్లటి లేదా చేదు ద్రవం రావడం» గొంతులో ఏదో ఇరుక్కున్నట్లు అనిపించడం» రాత్రివేళ దగ్గు, గొంతు బొంగురు΄ోవడం» ఛాతి లేదా పై ΄÷ట్టలో అసౌకర్యం /» కడుపు ఉబ్బరంగా అనిపించడం» అదేపనిగా తేన్పులు వస్తుండటం » మింగడంలో ఇబ్బంది లేదా నొప్పిఅయితే ఈ సమస్య ఉన్న ప్రతి ఒక్కరికీ ఒకే రకమైన లక్షణాలు ఉండాల్సిన అవసరం లేదు. కొందరిలో కొన్ని లక్షణాలు మాత్రమే కనిపించవచ్చు. ఉదాహరణకు గుండెల్లో మంట లేకుండానే దగ్గు లేదా గొంతుకు సంబంధించిన సమస్యలు కనిపించవచ్చు.-డాక్టర్ తరుణ్ గట్టు , సీనియర్ కన్సల్టెంట్సర్జికల్గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ -
20ల నుంచే గుండె జబ్బుల ముప్పు?
ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు రెండు కోట్ల మంది గుండె, రక్తనాళాల సంబంధిత వ్యాధుల కారణంగా మరణిస్తున్నారు. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం కూడా అందుకు ప్రధాన కారణాల్లో ఒకటి. గుండె జబ్బులు బయటపడటానికి కొన్నేళ్ల ముందు నుంచే దేహంలో వాటికి సంబంధించిన మార్పులు మొదలుకావచ్చని రెండు వేర్వేరు అధ్యయనాలు వెల్లడించాయి. చాలా చిన్నవయసు నుంచే గుండె ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరాన్ని ఈ అధ్యయనాలు నొక్కి చెబుతున్నాయి. ఒక అధ్యయనం ప్రకారం రక్తనాళాల్లో కొవ్వు పేరుకొని గట్టిపడి అథెరోస్క్లెరోసిస్ అనే కండిషన్‌ను గుర్తించడానికి గుండె జబ్బులేవీ లేని 16,808 మంది వ్యక్తులకు స్కానింగ్ పరీక్షలు నిర్వహించారు.ఈ పరీక్షల్లో 57 శాతం మందిలో అప్పటికే ఈ సమస్యకు సంబంధించిన తొలిదశ లక్షణాలు కనిపించాయి. 18 నుంచి 29 ఏళ్ల వయసున్న వారిలో సైతం ప్రతి 13 మందిలో ఒకరికి రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం మొదలైనట్లు గుర్తించారు. ఇక 60 నుంచి 70 ఏళ్ల వారిలో దాదాపు 90 శాతం మందికి ఈ సమస్య ఉన్నట్లు తేలింది. ఈ సమస్య మొదలయ్యే తీరులో పురుషులు, మహిళల్లో తేడాలున్నట్లు పరిశోధకులు గుర్తించారు. పురుషుల్లో రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం చాలా ముందే మొదలవుతుండగా మహిళల్లో మాత్రం రుతుక్రమం ఆగిపోయే దశలో ఈ సమస్య వేగంగా పెరుగుతున్నట్లు గుర్తించారు.ఈ అధ్యయన ఫలితాలు ‘న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’లో ప్రచురితమయ్యాయి. ఇక సర్క్యులేషన్: పాపులేషన్ హెల్త్ అండ్ అవుట్‌కమ్స్ అనే జర్నల్‌లో ప్రచురితమైన మరో అధ్యయనంలో సగటున 23 ఏళ్ల వయసున్న 1,283 మంది యువతీ యువకులను పరిశీలించగా వారిలో దాదాపు 80 శాతం మందిలో గుండె, మూత్రపిండాలు, జీవక్రియలకు సంబంధించిన సమస్యలు తొలిదశలో ఉన్నట్లు బయటపడింది. అలాగే వారిలో దాదాపు మూడు శాతం మందికి అప్పటికే రక్తనాళాలు దెబ్బతిన్నట్లు తెలిపే లక్షణాలు కనిపించాయి. పౌష్టికాహారం, వ్యాయామం, పొగాకు దూరంగా ఉండటం, బరువు నియంత్రణ, తగినంత నిద్ర ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు పేర్కొన్నారు. -
మీరూ ఆవలిస్తున్నారా?
సాధారణంగా మనముందు ఎవరైనా ఆవలిస్తే కొద్దిసేపటికే మనకూ ఆవలింత వస్తుంది. కొన్నిసార్లు ఆవలింత గురించి చదివినా, విన్నా కూడా మనకు ఆవలింత రావచ్చు. దీనినే ‘కాంటేజియస్ యానింగ్’ అంటారు. ఆవలింత రావడానికి అలసట, నిద్ర, విసుగు వంటి కారణాలు ఉండొచ్చు. అయితే ఎదుటివారు ఆవలించినప్పుడు మనకు కూడా ఆవలింత రావడం వెనుక మెదడు పనితీరు, ఇతరులను గమనించే విధానం వంటి అంశాలు ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఎవరైనా ఆవలించడం మనం చూసినప్పుడు మెదడులోని కొన్నిప్రాంతాలు చురుకుగా మారుతాయి. ముఖ్యంగా ఇతరుల చర్యలను గమనించి అనుకరించడంలో సహాయపడే మెదడు వ్యవస్థ ఇందులో పాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే మనకు తెలియకుండానే ఎదుటివారి ఆవలింతను మన మెదడు అనుకరించే అవకాశం ఉంటుంది. దాంతో మనకూ ఆవలింత వచ్చేస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, మనకు బాగా పరిచయం ఉన్న వ్యక్తులు ఆవలిస్తే మనకూ ఆవలింత వచ్చే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు. స్నేహితులు, కుటుంబ సభ్యులు వంటి వారిని మనం ఎక్కువగా గమనించడం దీనికి ఒక కారణంగా భావిస్తున్నారు. మనుషులకే కాదు!ఈ కాంటేజియస్ యానింగ్ కేవలం మనుషుల్లోనే కాదు... కుక్కలు, చింపాంజీలు, కొన్ని ఇతర సామాజిక జంతువుల్లో కూడా ఈ ప్రవర్తనను పరిశోధకులు గమనించారు. అందరికీ ఇలా జరుగుతుందా?లేదు. ప్రతి ఒక్కరికీ ఎదుటివారు ఆవలిస్తే వెంటనే ఆవలింత రావాల్సిన అవసరం లేదు. పరిశోధనల్లో సుమారు 40 నుంచి 60 శాతం మంది వ్యక్తుల్లో కాంటేజియస్ యానింగ్ కనిపించినట్లు నివేదికలు ఉన్నాయి. అందువల్ల ఎవరైనా ఆవలిస్తే మనకూ ఆవలింత రావడం సాధారణ విషయమే. ఇది కేవలం నిద్ర లేదా అలసట వల్ల మాత్రమే కాకుండా, మన మెదడు ఇతరుల చర్యలను గమనించి స్పందించే విధానంతో కూడా సంబంధం కలిగి ఉండవచ్చు. -
గ్రూప్ మీటింగ్స్‌లో ఈ భయం వెంటాడుతుందా? అయితే జాగ్రత్త!
కొత్త వాళ్లను కలవాలంటే భయం.. నలుగురిలో మాట్లాడాలంటే టెన్షన్.. చివరకు ఫోన్ చేతిలో పెట్టుకుని పక్కకు తప్పుకోవడం! ఇలా తెలియకుండానే చేసే కొన్ని అలవాట్లు ఆందోళనను మరింత పెంచుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ఆ భయాన్ని గుర్తించి చిన్నచిన్న మార్పులు చేసుకుంటే.. మరింత ధైర్యంగా మారొచ్చట!కొత్తవాళ్లను కలవడం, నలుగురిలో మాట్లాడటం, గ్రూపుల్లో కలవడం కొందరికి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇతరులు తమ గురించి ఏమనుకుంటారోననే భయం వెంటాడుతుంటుంది. దీంతో మాట్లాడకుండా ఉండటం, చిన్న సమాధానాలకే పరిమితం కావడం, గ్రూపులకు దూరంగా ఉండటం వంటి అలవాట్లు పెరుగుతాయి. అయితే, ఇవి క్రమంగా సామాజిక ఆందోళనను మరింత పెంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా కొత్త పరిస్థితుల్లో కొంత సిగ్గు, ఆందోళన ఉండటం సహజమే. అయితే ఆ భయం కారణంగా చదువు, ఉద్యోగం, స్నేహాలు, రోజువారీ పనులకు దూరమైతే దాన్ని సీరియస్‌గా తీసుకోవాలి.అలాగే, సామాజిక ఆందోళన ఉన్నవారు ఇతరులతో మాట్లాడేటప్పుడు తమ ముఖం ఎర్రబడుతుందా, తాము సరిగ్గా మాట్లాడుతున్నామా, ఎదుటివారు ఏమనుకుంటున్నారో అంటూ తమపైనే ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. దీంతో, ఎదురుగా ఉన్న వ్యక్తి లేదా జరుగుతున్న సంభాషణపై దృష్టి పెట్టలేకపోతారు. ఫోన్ చూస్తూ ఉండటం, గ్రూపులో అంచున నిలబడటం, ఎప్పుడూ తెలిసిన వ్యక్తి పక్కనే ఉండటం, ముందుగానే ప్రతి మాటను సిద్ధం చేసుకోవడం వంటి వాటిని ‘సేఫ్టీ బిహేవియర్స్’గా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతో, ఇవి ఆ క్షణంలో భయాన్ని తగ్గించినట్లు అనిపించినా.. అదొక మానసిక వ్యాధిగా పెరుగుతూనే ఉంటుందంటున్నారు.అయితే, భయపడే పరిస్థితులను పూర్తిగా తప్పించుకోవడం కంటే వాటిని క్రమంగా ఎదుర్కోవడం ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకు.. ఒక గ్రూపులో చిన్న ప్రశ్న అడగడం, సంభాషణలో ఒక మాట చెప్పడం వంటి చిన్న ప్రయత్నాలతో మొదలుపెట్టొచ్చు. మనం ఊహించినంత ప్రతికూలంగా ఎదుటివారు స్పందించకపోవచ్చని స్వయంగా గమనించడంతో భయం తగ్గే అవకాశం ఉంటుంది.ఈ క్రమంలో తనపై తాను ఎక్కువగా దృష్టి పెట్టడం మానేసి.. ఎదుటివారు చెప్పే మాటలు, చుట్టూ ఉన్న పరిస్థితులపై దృష్టి పెట్టాలని నిపుణులు అంటున్నారు. అలాగే, మాట్లాడిన తర్వాత ‘నేను ఏదైనా తప్పుగా చెప్పానా?’ అంటూ పదేపదే ఆలోచిస్తూ బాధపడటం కూడా తగ్గించుకోవాలంటున్నారు.అలాగే, ఆందోళన తీవ్రంగా ఉంటే వైద్యులను సంప్రదించడం ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (CBT) వంటి మాట్లాడే చికిత్సలు సామాజిక ఆందోళనను ఎదుర్కోవడంలో ఉపయోగపడతాయి. అయితే, మార్పు ఒక్కరోజులో రాదు. చిన్నచిన్న సామాజిక సందర్భాల్లో పాల్గొనడం, ఇతరులతో మాట్లాడేందుకు ప్రయత్నించడం, తప్పులు జరిగినా వాటిని పెద్ద విషయంగా భావించకపోవడంలాంటి వాటితో క్రమంగా ధైర్యం పెంచుకోవచ్చు. దీంతో, మనసులోని భయంతో పూర్తిగా తప్పించుకోవడం కంటే.. దాన్ని అర్థం చేసుకుని నెమ్మదిగా ఎదుర్కోవడం దైనందిన జీవితాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని వైద్య నిపుణుల సూచన.ఇదీ చదవండి: మేయర్‌గా ఉంటూనే మెటర్నిటీ లీవ్.. ఏకంగా TIME100లో చోటు! -
40 కిలోల బరువు తగ్గడానికి హెల్ప్ అయిన ట్రిక్ ఇదే..!
కోలివుడ్ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్ (56) ఐదేళ్లలో 40 కిలోలకు పైగా బరువు తగ్గి వార్తల్లో నిలిచింది. అందుకోసం కఠినమైన డైట్లు లేదా జిమ్‌లో గంటల తరబడి నిలబడటం వల్ల ఇంత పెద్ద ఛేంజ్‌ని సాధించలేదు. ఆమె అనుసరించిన ఆరోగ్యకరమైన జీవనశైలినే కారణం. ఆ విషయాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమెనే స్వయంగా వెల్లడించింది. డైటింట్ వల్లనే బరువు తగ్గరని, ఆచరణసాధ్యమైన ఆహార విధానమే కీలకమని పేర్కొంది. అదెలాగో ఆమె మాటల్లోనే తెలుసుకుందామా..!.ఇక్కడ వెయిట్ లాస్ ప్రారంభించి..అదే బరవుని మెయింటైన్ చేయడమే కాకుండా మరింత తగ్గడం విశేషం. అందుకోసం ఆమె జపనీస్ ఆహార విధానాన్ని ఎంచుకున్నట్లు తెలిపింది. మనం పెద్దప్లేట్లలో తింటాం కానీ వాళ్లు చిన్న గిన్నెల్లోలనే ఎక్కువ మొత్తంలో తింటారని..దీనిల్ల కడుపు నిండినంత వరకే ఆటోమేటిగ్గా తింటామని అంటోంది. జపనీస్ ప్రజలు సాధారణంగా 80, 90 ఏళ్ల వయసులో కూడా ఈ విధానాన్ని పాటిస్తారని అన్నారు. అందుకే తాను కూడా ఈ చిన్న ప్లేట్ విధానాన్ని పాటిస్తానని అన్నారామె. తాను ఒకానొక సమయంలో దాదాపు 98 కిలోలు బరువు ఉండేదాన్ని అని పంచుకున్నారు. రజనీకాంత్‌తో కలిసి నటించిన మూవీని చూస్తే..తనను తానే గుర్తుపట్టలేకపోయానని నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అప్పటికే తనకు మోకాళ్ల నొప్పి కూడా మొదలైందని చెప్పారు. ఆ కారణంగానే ఫిట్నెస్ ప్రయాణాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. బరువు తగ్గే జర్నీ..అయితే తాను తనకు నచ్చిన ఆహారాలను వదులుకోలేదని, కేవలం పరిమాణాన్నే తగ్గించుకున్నట్లు తెలిపారు. తనకు మటన్ బిర్యానీ అంటే మహా ఇష్టమని కానీ గిన్నెడం అన్నం ఒక ముక్కు తగ్గించుకున్నట్లు తెలిపారు. అలాగే స్వీట్లు, ఐస్‌క్రీం అన్నింటిని ఆస్వాదిస్తానని, కాకపోతే అతిగా తినని చెప్పారు. అలాగే అప్పుడప్పుడు నచ్చిన డెజర్ట్ తినేటప్పుడూ..స్కిప్ చేయడంలో తప్పులేదని అంటోందామె. అయితే ఎంతమేరకు తినాలో ఎక్కడ ఆపాలో తెలుసుండాలని చెబుతోంది. చివరగా ఆమె బరువు తగ్గడం అనేది శారీరక ఆరోగ్యం తోపాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగ్గా ఉంచుతుందన్నారు. ఇన్నేళ్లు బరువు స్థిరంగా అదుపులో ఉండటానికి దోహదడింది మాత్రం అధిక ప్రోటీన్, ఫైబర్ ఉన్న ఆహారం, మైదా, ఇతర శుద్ధి చేసిన ఆహారాలకు దూరంగా ఉండటంమేనని చెప్పుకొచ్చింది ఈ అందాల నటి ఖుష్బూగమనిక: ఇది కేవలం అవగాహన కోస మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. ఇదీ చదవండి: నటడు రవి కిషన్ డబుల్ చిన్ తగ్గించే చిట్కా..! ఇది నిజంగానే హెల్ప్ అవుతుందా? -
బ్లాక్ కాఫీ వర్సెస్ గ్రీన్ టీ: బరువు తగ్గడానికి ఏది మంచిది?
బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ రెండు ఆరోగ్యానికి మంచివే. ఈ రెండింటిని పాలు, క్రీమ్ లేదా ఫ్లేవర్డ్ సిరప్లు, చక్కెర వంటి కలిపి తాగితే ప్రయోజనాలన్నీ శూన్యం అని చెబుతుంటారు నిపుణులు. ఆరోగ్య ప్రయోజనాలకు సంబంధించి.. ఈ రెండు కీలకపాత్రే పోషించే పానియాలే. అయితే మధుమేహం, బరువు రెండింటిని నియంత్రణలో ఉంచడానికి ఈ రెండిటిలో ఏది బెస్ట్ అని అంటే మాత్రం..!.యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా, కేలరీలు తక్కువగా ఉండే బ్లాక్ కాఫీ ఇన్సులిన్ పనితీరుని మెరుగుపరిచి, టైప్2 మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మరోవైపు గ్రీన్ టీ కాటెచిన్లకు ప్రసిద్ధి చెందింది. ఇది కూడా కొవ్వును తగ్గించి బరువు నిర్వహణకు ఉపయోగపడుతుంది. మరి అలాంటప్పుడు బరువు, షుగర్ రెండింటిని తగ్గించడాని ఏది సహాయపడుతుందంటే..బ్లాక్ కాఫీ వల్ల కలిగే లాభాలు:కాఫీలోని కెఫీన్ డోపమైన్, నోర్పినెఫ్రిన్లను పెంచుతుంది. దీనివల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. మానసికంగా చురుగ్గా ఉంటారు. దీనిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో వాపుని తగ్గించి ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి సహాయపడతాయి.కాఫీలోని కెఫీన్ జీవక్రియ రేటును పెంచుతుంది. దీనివల్ల ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. తద్వారా బరువు తగ్గడానికి లేదా నియంత్రణకు సహాయపడుతుంది.కెఫీన్ అడ్రినలిన్ స్థాయిలను పెంచడం ద్వారా శారీరక పనితీరును, ఓర్పును మెరుగుపరుస్తుంది.అంతేగాదు కొన్ని పరిశోధనల ప్రకారం.. క్రమం తప్పకుండా కాఫీ తాగడం వల్ల టైప్ 2 మధుమేహం, పార్కిన్సన్స్ వ్యాధి, కాలేయ వ్యాధి వంటి వ్యాధుల ప్రమాదం తగ్గే అవకాశం ఉంది.గ్రీన్ టీ వల్ల కలిగే ప్రయోజనాలు:గ్రీన్ టీలో కాటెచిన్స్ అనే ఒక రకమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది వాపు తోపాటు మొత్తం ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.ఇది జీవక్రియను పెంచుతుంది, కొవ్వు ఆక్సీకరణను ప్రోత్సహిస్తుందని పరిశోధనల్లో తేలింది. అంటే బరవు తగ్గేందుకు చక్కగా ఉపకరిస్తుందని అర్థం. గ్రీన్ టీలోని కెఫీన్, ఎల్-థియానైన్ అనే అమైనో ఆమ్లం డిమెన్షియా బారిన పడకుండా చేసి ఏకాగ్రతను పెంచడమే కాకుండా మానసిక స్థితిని ఉత్తేజంగా ఉంచుతాయి.ఇది కూడా కొన్ని పరిశోధనల ప్రకారం, ఇన్సులిన్ పనితీరుని మెరుగుపరిచి, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.గ్రీన్ టీ మొత్తం కొలెస్ట్రాల్ తోపాటు ముఖ్యంగా LDL (చెడు) కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అదే సమయంలో LDL కణాలను ఆక్సీకరణం నుంచి కాపాడుతుంది.రెండిటిలో ఏది మంచిదంటే..మధుమేహం కోసం..షుగర్‌ని తగ్గించడంలో రెండు మంచి పాత్రే పోషిస్తాయని అంటున్నారు నిపుణులు. బ్లాక్ కాఫీ తాగితే టైప్2 మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గితే..గ్రీన్ టీ వల్ల ఇన్సులిన్ పనితీరు మెరుగుపడుతుంది, అలాగే ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది.బరువు తగ్గడం కోసంబ్లాక్ కాఫీ, గ్రీన్ టీ బరువుని తగ్గిచడంలో రెండు సమర్థవంతంగానే ఉంటాయట. బ్లాక్ కాఫీ స్వల్పకాలంలో ఆకలిని అణిచివేసి, కేలరీలను గరిష్టంగా దహించడానికి అద్భుతంగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు నిపుణులు. మరోవైపు గ్రీన్ టీ ఉదరంలోని అంతర్గత కొవ్వుని లక్ష్యంగా చేసుకుని కొవ్వు ఆక్సీకరణను మెరుగుపరుస్తుందట. ఏది తీసుకోవాలంటే..వ్యక్తుల ప్రాధాన్యత అనుసరించి.. తీవ్రమైన వ్యాయామాలు చేసే వాళ్ల అయితే తక్షణ శక్తి పెరుగుదల కోసం బ్లాక్ కాఫీ తీసుకుంటే మేలని అంటున్నారు నిపుణులు.అలాకాదు రోజంత తేలికపాటి కొవ్వుని కరిగించేలా.. రక్తంలోని చక్కెర నిర్వహణకు ప్రభావంతంగా ఉండేది కావాలంటే..గ్రీన్ టీ ఎంచుకుంటే సరి అని చెబుతున్నారు నిపుణులు. చాలామటుకు వ్యక్తిగత ప్రాధాన్యతలు, ఆరోగ్య సమస్యలను అనుసరించి సమతుల్య ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాకలు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. ఇదీ చదవండి: -
గర్భంతో రేస్‌లో పాల్గొనొచ్చా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?
గర్భవతులు వేగంగా నడవకూడదు, పరుగెత్తకూడదు.. ఎక్కువ శ్రమ చేయకూడదు అంటుంటారు. అలాంటి ఆలోచనలను, మాటలను బ్రేక్ చేస్తూ ఏడునెలల గర్భంతో కఠినమైన హైరాక్స్ రేస్‌ను ఛాలెంజింగ్‌గా తీసుకొని పూర్తి చేసింది 37 ఏళ్ల జెన్నీఫర్. గర్భవతులు కూడా కఠినమైన వ్యాయామాలు చేయవచ్చు అని నిరూపించింది. ఆమె ఫిట్నెస్ ప్రెగ్నెన్సీ గురించి కొందరు అభినందించగా, మరికొందరు విమర్శిస్తున్నారు. కొందరు ప్రశ్నలు అడుగుతున్నారు. గర్భధారణ సమయంలో వ్యాయామాలు, రేస్ల్లో పాల్గొనవచ్చా?! నిపుణులు ఏమంటున్నారంటే...పదిహేనేళ్లుగా ఫిట్నెస్ రంగంలో కొనసాగుతున్న జెన్నీఫర్ పుట్టి పెరిగింది కోల్‌కతాలో. ఫిట్నెస్ స్టూడియోని నడుపుతూ కోచ్‌గా కూడా వ్యవహరిస్తోంది. ఇప్పటివరకు కఠినమైన ‘హైరాక్స్’ రేసులో ఐదుసార్లు పాల్గొంది. ఈ రేస్ రన్నింగ్, కఠినమైన జిమ్ వర్కౌట్స్‌తో కలిపి ఉంటుంది.ఇందులో 8 కిలోమీటర్ల రన్నింగ్‌తో పాటు 8 రకాల ఫిట్నెస్ ఛాలెంజ్‌లను పూర్తి చేయాలి. దీనిలో రోయింగ్, స్లైడ్ పుష్‌లు, బర్ఫీ బ్రాడ్ జంప్స్, పెద్ద పెద్ద బరువులు మోసుకుంటూ నడవడం, పరుగెత్తడం, ఆ వెంటనే బరువులతో మళ్లీ వర్కౌట్స్ చేయడం.. ఇలా ఈ రేస్ కొనసాగుతుంది. ఇటీవల ముంబైలో జరిగిన ఈ హైరాక్స్ రేసులో ఏడునెలల గర్భంతో జెన్నీఫర్ పాల్గొనడమే కాకుండా, అనుకున్న టైమ్‌లో సవాల్‌ను పూర్తిచేసి వార్తల్లో నిలిచింది.వ్యక్తిని బట్టి మారుతాయి..''ప్రెగ్నెన్సీ రోజుల్లో చురుగ్గా ఉండటం వల్ల సాధారణ ప్రసవం అయ్యే అవకాశం ఉంది. వారంలో 150 నిమిషాలు ఏరోబిక్ వ్యాయామాలు చేయవచ్చు. వాకింగ్, స్విమ్మింగ్, తక్కువ శ్రమ ఉండే వ్యాయామాలు, యోగా చేయడం మంచిదే. ప్రీ నేటల్ ఎక్సర్సైజులు, అలాగే ప్రసవం జరిగే చివరి వారాల్లో పెల్విక్ ఫ్లోర్ వ్యాయామాలు కూడా చెబుతాం. అయితే, అది కూడా ఆ మహిళ ఆరోగ్యం, గర్భధారణ పరిస్థితి, గతంలో ఆమెకు ఉన్న ఫిట్నెస్ స్థాయి, రక్తస్రావం అవడం, గర్భస్రావాల రిస్క్, ప్లాసెంటా స్థాయి, యుటెరస్ లో లేయరింగ్ ... ఇవన్నీ పరిగణలోకి తీసుకొని సూచనలు చేస్తాం.''– డాక్టర్ శిరీషారెడ్డి, గైనకాలజిస్ట్అవగాహన తప్పనిసరి..''గర్భం దాల్చినా, అనారోగ్యం ఉన్నా... వ్యాయామం లేదా ఇతరత్రా ఫిట్నెస్ కాంటెస్ట్‌లలో పాల్గొనవచ్చు. అయితే ప్రెగ్నెంట్ అవక ముందు కూడా తగినంత ప్రాక్టీస్ ఉండాలి. అలా కాకుండా ఎవరో చేశారు కదా అని తామూ చేయవచ్చునని అనుకోకూడదు. నటి సమంత మయోసైటిస్‌ని ఎదుర్కొన్నారు. ఆ వ్యాధితో పోరాడుతూ కూడా వ్యాయామం మానలేదు.ప్రస్తుతం ప్రెగ్నెంట్ అయ్యారు కూడా. ఆఫీస్ వర్క్ ఎంత రొటీన్‌గా చేస్తామో.. అలాగే ప్రెగ్నెన్సీ తర్వాత కూడా యోగా, మారథాన్ రన్నింగ్, స్విమ్మింగ్, ... వంటివి చేయవచ్చు. దీని వల్ల అదనపు లాభం ఏమిటంటే కడుపులో ఉన్న బిడ్డకు కూడా శిక్షణ ఇవ్వవచ్చు. అయితే గైనకాలజిస్ట్ , ఫిట్నెస్ ట్రై నర్ల పర్యవేక్షణ, సలహా సంప్రదింపులు కూడా అవసరమే.''– సౌమ్య కస్తూరి, ఫిట్నెస్ కన్సల్టెంట్, ఫిజియో థెరపిస్ట్ గర్భవతుల్లో ఎవరు జాగ్రత్తగా ఉండాలంటే... జెన్నీని స్ఫూర్తిగా తీసుకొని ఆరోగ్యంగా, చురుగ్గా ఉండటానికి ప్రయత్నించడం మంచిదే. కానీ, ఆమెలా ప్రతి గర్భిణీకీ అదే తరహా వ్యాయామం సాధ్యమవుతుందని కాదు. గర్భధారణకు ముందు నుంచే ఫిట్నెస్ ట్రైనింగ్ చేస్తున్న మహిళ శరీరం, మొదటిసారి వ్యాయామం మొదలుపెట్టే మహిళ శరీర సామర్థ్యం ఒకేలా ఉండదు.హైరాక్స్ రేస్‌లో జెన్నీఫర్హైరిస్క్ ప్రెగ్నెన్సీ, కొన్ని ప్లాసెంటా సమస్యలు, నిర్దిష్ట రక్తపోటు సమస్యలు, ప్రీ టర్మ్ లేబర్ పెయిన్స్, నిరంతర బ్లీడింగ్.. వంటి పరిస్థితుల్లో వ్యాయామంపై వైద్యుల ప్రత్యేక సూచన తప్పనిసరి.గర్భవతులకు ఓ మోస్తరు శారీరక కదలికలు ఉండాలి. వ్యాయామం, యోగా చేస్తుండగా బ్లీడింగ్, కడుపునొప్పి, ఛాతీనొప్పి, తల తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పిండం కదలికలు తగ్గడం వంటి లక్షణాలు ఏవి కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి.కాపీ క్యాట్ కావద్దు..సెలబ్రిటీలు లేదా ఫిట్నెస్ ఇన్ ఫ్లుయెన్సర్లు గర్భధారణ సమయంలో చేసే వర్కౌట్స్‌ను చూసి వాటిని అనుసరించడం సరికాదు. నిపుణుల సూచన కూడా ఇదే. ప్రెగ్నెన్సీ ఫిట్నెస్ అనేది ఎవరికి వారికి పూర్తిగా వ్యక్తిగతమైనది. ఒకరికి వాకింగ్ సరిపోవచ్చు. మరొకరికి స్విమ్మింగ్ లేదా తేలికపాటి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వ్యాయామాలు సరిపోవచ్చు.ఇప్పటికే ఫిట్‌గా ఉన్న మహిళకు కొన్ని మోడర్న్ వ్యాయామాలను మార్పులతో కొనసాగించే అవకాశం ఉండొచ్చు. కానీ ప్రతి సందర్భంలోనూ తల్లి, బిడ్డ ఆరోగ్య పరిస్థితే ఇందులో ప్రధానమైనది. గర్భంతో ఉన్నప్పుడు కూడా చురుకుగా ఉండటానికి ప్రయత్నించాలి. అంతేకానీ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలనే ఒత్తిడి సరైనది కాదు.గర్భంతో ఉన్నప్పుడు చురుగ్గా ఉండటానికి ఇలాంటి వార్తలను స్ఫూర్తిగా తీసుకోవచ్చు. కానీ, ఎవరో చేశారు కదా అని ప్రతి గర్భిణీ అదే స్థాయిలో వ్యాయామం చేయాలనుకోవడం సరైనది కాదు. ప్రెగ్నెన్సీ ఫిట్‌నెస్‌లో ‘ఎంత ఎక్కువ వ్యాయామాలు చేశాం’ అనేది కాదు.. ‘మన శరీరానికి ఆ వ్యాయామం ఎంత సురక్షితం’ అనేదే గ్రహించాలి.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఇదీ చదవండి: ఐటీ ఉద్యోగం వదలి ఆటో డ్రైవర్‌గా మహిళా టెకీ..! -
గుండెకు ఆరోగ్యం 'అలవాటు' చేద్దామా?
సాక్షి, హైదరాబాద్ : గుండె ఆరోగ్యం కేవలం వ్యాయామశాలలో చేసే కసరత్తులపైనే కాకుండా రోజంతా మనం గడిపే జీవన విధానంపై ఆధారపడి ఉంటుందని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. రోజూవారీ దినచర్యలో చిన్న అలవాట్లను మార్చుకోవడం ద్వారా గుండెను ఆరోగ్యంగా, చురుగ్గా ఉంచుకోవచ్చని.. వారానికి కనీసం 150 నిమిషాల సాధారణ శారీరక శ్రమ చాలా అవసరమని యూరోపియన్ హార్ట్ జర్నల్ స్టడీ పేర్కొంది. ముఖ్యంగా రోజువారీ కూర్చునే సమయంలో కేవలం 4 నుంచి 13 నిమిషాలను చురుకైన నడక లేదా మెట్లు ఎక్కడం వంటి మధ్యస్థ–తీవ్రత కలిగిన పనులతో భర్తీ చేస్తే గుండె ఆరోగ్యంలో (కొలెస్ట్రాల్, బాడీ మాస్ ఇండెక్స్, బ్లడ్ షుగర్ స్థాయిలు తగ్గడం) సానుకూల మార్పులు వస్తాయని తెలిపింది. మరోవైపు రోజుకు 10.6 గంటల కంటే ఎక్కువ సమయం కూర్చొనే వ్యక్తులు రోజూ వ్యాయామం చేస్తున్నప్పటికీ వారిలో గుండె వైఫల్యం, గుండె జబ్బుల వల్ల మరణించే ప్రమాదం పెరుగుతుందని అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ నివేదిక హెచ్చరించింది. నిద్రలేమి, అర్ధరాత్రి భోజనం చేయడం, ఎక్కువ సమయం కదలకుండా కూర్చోవడం వంటి రోజువారీ చిన్న తప్పులు గుండె ధమనుల పనితీరును దెబ్బతీస్తాయని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ పరిశీలనలో వెల్లడైంది.గుండె పనితీరును మెరుగుపరుచుకోవడానికి వైద్య నిపుణులు సూచించిన 6 సులభమైన రోజువారీ మార్గాలు1. ఉదయం నిద్ర లేవగానే 1–2 గ్లాసుల గోరువెచ్చని నీరు తాగాలి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే ఉదయం ఎండలో కాసేపు గడపడం వల్ల లభించే విటమిన్–డీ గుండె పనితీరుకు సహాయపడుతుంది.2 మధ్యాహ్న భోజనం తర్వాత 5–10 నిమిషాలు నెమ్మదిగా వజ్రాసనంలో కూర్చోవాలి లేదా చిన్నగా నడవాలి. ఇది జీర్ణక్రియకు, గుండెకు మంచిది. ఆఫీసులో పనివేళల్లో గంటల తరబడి కూర్చోకుండా ప్రతి 45 నిమిషాలకు ఒకసారి లేచి 2 నిమిషాలు నడవాలి. రోజులో కనీసం 20–30 నిమిషాలపాటు వేగంగా నడవడం వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.3 లిఫ్ట్ బదులుగా మెట్లను ఉపయోగించడం వల్ల కాళ్లలో రక్తప్రసరణ మెరుగుపడటంతోపాటు రక్తపోటు అదుపులో ఉంటుంది.4 ఆహారంలో పండ్లు, కూరగాయ లు, తృణధా న్యాలు, ఆరోగ్యక రమైన కొవ్వులు ఉండేలా చూసుకోవాలి. ప్రాసెస్ చేసిన ఆహారా లు, ఉప్పు పంచదార వినియోగాన్ని తగ్గించాలి.5 రాత్రి నిద్రపోయే 2 గంటల ముందే భోజనం ముగించాలి. కనీసం ఏడు గంటలపాటు నిద్రపోవాలి. సరిగ్గా నిద్రపోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటే గుండెపై అదనపు భారం పడకుండా చూస్తుంది. గుండె కండరాలు రీచార్జ్ కావడానికి దోహదపడుతుంది.6 యోగా, ధ్యానం, ప్రాణాయామం లేదా నచ్చిన పనులు చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవాలి. రోజంతా తగినన్ని నీళ్లు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. దీనివల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదం తగ్గుతుంది.ముఖ్యమైన చిట్కాలు..» ఉప్పు వినియోగం తగ్గించాలి. రోజుకు 5 గ్రాముల (ఒక టీస్పూన్) కంటే తక్కువ ఉప్పు మాత్రమే వాడాలి. ఇది బీపీని అదుపులో ఉంచుతుంది.» పొటాషియం పెంచాలి.. అరటిపండ్లు, కొబ్బరినీళ్లు ఆకుకూరల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది గుండెను రక్షిస్తుంది.» ఫైబర్ (పీచుపదార్థం)... భోజనంలో సలాడ్లు (కీరా, క్యారెట్) ఎక్కువగా ఉంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ చేరుకోకుండా ఉంటుంది.గుండె ఆరోగ్యం కోసం ఆహార నియమాలు.. -
మరీ ఏడు నెలల గర్భంతోనా.. రిస్క్ కాదా?
ఏడు నెలల గర్భం.. కడుపులో బిడ్డ.. అయినా పరుగులు, వెయిట్స్, బర్పీస్, స్లెడ్ పుష్.. చివరకు హైరోక్స్ రేస్‌ను పూర్తి చేసింది ఓ భారతీయ మహిళ. దీంతో ఆమె వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొందరు ప్రశంసలు కురిపిస్తే.. మరికొందరు గర్భంతో ఇంత కఠినమైన వ్యాయామం చేయడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇంతకీ ఆమె ఎవరు? గర్భంతోనే ఈ రేస్‌ను ఎలా పూర్తి చేసింది?ఆమె పేరు జెన్నిఫర్.. ముద్దుగా జెన్నీ. వయసు 37 ఏళ్లు. కోల్‌కతాలో పుట్టి పెరిగిన ఆమె ప్రస్తుతం చైనాలోని షాంఘైలో నివసిస్తున్నారు. గత 15 ఏళ్లుగా ఫిట్నెస్ రంగంలో కొనసాగుతున్న జెన్నీ.. షాంఘైలోని HYROXworldలో పనిచేస్తున్నారు. అంతేకాదు Rises Shanghai అనే ఫిట్నెస్ సెంటర్‌కు ఫౌండర్, కోచ్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు ఐదుసార్లు HYROX రేసుల్లో పాల్గొన్నారు.హైరోక్స్ అంటే.. రన్నింగ్ రేస్ కాదు.. జిమ్ వర్కౌట్ కూడా కాదు. రెండింటినీ కలిపిన ఇండోర్ ఫిట్నెస్ పోటీ. ఇందులో పోటీదారులు 1 కి.మీ. పరుగెత్తి.. వెంటనే ఒక ఫిట్నెస్ వ్యాయామం చేయాలి. ఇలా రన్, వర్కౌట్ చొప్పున మొత్తం 8 రౌండ్లు పూర్తి చేయాలి. అంటే మొత్తం 8 కి.మీ. రన్నింగ్‌తో పాటు 8 రకాల ఫిట్నెస్ ఛాలెంజ్‌లు ఉంటాయి.వాటిలో స్లెడ్‌ను తోసడం, స్లెడ్‌ను లాగడం, రోయింగ్, స్కీ ఎర్గ్, బర్పీ బ్రాడ్ జంప్స్, బరువులు మోసుకుంటూ నడవడం, శాండ్బ్యాగ్తో లంజెస్, వాల్ బాల్స్ వంటి కఠినమైన వ్యాయామాలు ఉంటాయి. సింపుల్‌గా చెప్పాలంటే: “పరుగెత్తాలి.. వెంటనే బరువులతో వ్యాయామం చేయాలి.. మళ్లీ పరుగెత్తాలి.. మళ్లీ వర్కౌట్ చేయాలి” .గర్భంతో రెండోసారి రేస్..గర్భం దాల్చిన తర్వాత కూడా ఫిట్నెస్ను కొనసాగించాలని జెన్నీ నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది ఆరంభంలో గర్భం దాల్చిన ఆమె.. వైద్యుల పర్యవేక్షణలో తన శిక్షణను కొనసాగించారు. గర్భం ఐదో నెలలో జపాన్‌లో జరిగిన HYROX రేసులో పాల్గొన్నారు. ఆ తర్వాత సెప్టెంబర్‌లో ముంబైలో జరిగిన మిక్స్డ్ డబుల్స్ రేసులో ఏడో నెల గర్భంతో బరిలోకి దిగి ఫినిషింగ్ లైన్ చేరుకున్నారు.ఎలా శిక్షణ తీసుకున్నారు?గర్భం తర్వాత తన వ్యాయామ తీవ్రతను తగ్గించినట్లు జెన్నీ తెలిపారు. వారానికి మూడు నుంచి నాలుగు సార్లు తక్కువ నుంచి మోస్తరు తీవ్రతతో రన్నింగ్ చేసేవారు. మరో మూడు, నాలుగు శిక్షణ సెషన్లలో కనీసం రెండు సార్లు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసేవారు. అయితే గర్భం తర్వాత స్ప్రింట్లు, ఇంటర్వెల్ రన్నింగ్‌ను పూర్తిగా ఆపేశారు. వెయిట్ లిఫ్టింగ్‌లోనూ తన గరిష్ఠ సామర్థ్యంలో 70 శాతానికి మించకుండా చూసుకున్నారు. బర్పీస్ను కూడా మోకాళ్లు నేలపై ఉంచి చేసేలా మార్చుకున్నారు.డాక్టర్ పర్యవేక్షణలోనే..ఇక్కడ జెన్నీ గైనకాలజిస్ట్ కూడా ఆమె శిక్షణ గురించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించినట్లు తెలిపారు. రక్త పరీక్షలు, స్కాన్లు దాదాపు ప్రతి వారం చేయించుకున్నానని, తన ఆరోగ్య పరిస్థితి బాగుండటంతో వైద్యురాలు వ్యాయామాన్ని ఆపాలని చెప్పలేదని జెన్నీ వెల్లడించారు. అయితే ప్రతి గర్భధారణ ఒకేలా ఉండదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అదే సమయంలో జెన్నీ రేసు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వెల్లువెత్తాయి.గర్భంతో ఇంత తీవ్రంగా వ్యాయామం చేయడం వల్ల బిడ్డకు ప్రమాదం కలగొచ్చని కొందరు వ్యాఖ్యానించారు. అయితే తాను తన శరీరాన్ని గమనించుకుంటూ, వైద్యుల సలహాతోనే శిక్షణ కొనసాగించానని జెన్నీ పేర్కొంది. అలాగే తల్లి కాబోయే ముందు తన భాగస్వామితో కలిసి ఒక ప్రత్యేక జ్ఞాపకాన్ని సృష్టించుకోవాలన్నదే లక్ష్యమని అందుకోసమే ఈ సాహాసానికి పూనుకున్నట్లు వెల్లడించింది. View this post on Instagram A post shared by Freedom To Feed (@freedomtofeed) ఇదీ చదవండి: చివరి ట్రైమెస్టర్ వరకు వర్కౌట్లు చేయొచ్చా..?! నటి సమంత కూడా..) -
సడన్ హార్ట్ ఎటాక్.. ముందస్తు సంకేతాలివేనా?
మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం హృదయం.. అయితే అవయవ ఆరోగ్యంపై అశ్రద్ధతోనే హృదయం ఒత్తిడి, వేదనకు గురవుతోంది.. అవయవ ఆరోగ్యంపై చాలామంది అశ్రద్ధ వహిస్తుంటారు. ఫలితంగా గుండెపోటు మరణాలు చోటు చేసుకుంటున్నాయి. వయసుతో నిమిత్తం లేకుండా గుండెజబ్బులు చోటు చేసుకుంటున్నాయి.. ఫలితంగా గుండె సంబంధిత రోగుల సంఖ్య పెరుగుతోంది.అయితే ముప్పు ముంచుకొచ్చే వరకూ వేచి ఉండొద్దని కార్డియాలజిస్టులు అంటున్నారు.. గుండె ఆరోగ్యంపై ప్రజలను చైతన్యపరిచేలా ఏటా సెప్టెంబర్ 29న ప్రపంచ హృదయ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు వయస్సు పైబడిన వారిలో మాత్రమే కనిపించే గుండెపోటు... ప్రస్తుతం చిరు ప్రాయంలో ఉన్న వారిలోనూ బహిర్గతమవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మానసిక ఒత్తిడి, మద్యపానం, మారిన ఆహారపు అలవాట్లే ఇందుకు కారణంగా వైద్య నిపుణులు చెప్తున్నారు. అంతేకాక కరోనా విపత్కర పరిస్థితుల తర్వాత ఈ కేసుల సంఖ్య పెరిగినట్లు పేర్కొంటున్నారు.పెరుగుతున్న బాధితులు..గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారి సంఖ్య క్రమేణా పెరుగుతున్నట్లు ఇటీవలి అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలతో పోల్చుకుంటే పట్టణ ప్రాంతాల్లో గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య అధికంగా ఉన్నట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.మారిన అలవాట్లతో ముప్పు..ఆధునిక సాంకేతికత పెరిగిన ప్రస్తుత రోజుల్లో శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోయింది. యాంత్రిక జీవనానికి అలవాటు పడడంతో ప్రతి ఒక్కరిలోనూ మానసిక ఒత్తిళ్లు అధికమయ్యాయి. పట్టుమని 15 ఏళ్లు కూడా దాటకుండానే బీపీ, షుగర్, ఊబకాయం వంటి సమస్యలు చుట్టుముడుతున్నాయి. అయితే శారీరకంగా ఎంతో ఫిట్‌గా ఉన్న వారు కూడా గుండెపోటు బారిన పడుతుండడం మరింత ఆందోళనకరం. గుండె పనితీరు తెలుసుకునేందుకు ఏడాదికి ఒక్కసారైనా వైద్యు లను సంప్రదించాలని నిపుణులు చెప్తున్నారు.ముందుగా గుర్తించడం కష్టం గుండె జబ్బు మన శరీరంలో ఉన్నా.. ముందస్తుగా గుర్తించలేనంత నిశ్శబ్దంగా ఉంటుంది. ధూమపానం, మద్యపానం, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండడం మంచిది. క్రమం తప్పకుండా సరైన వ్యాయామం చేస్తుండాలి. ఛాతీలో బరువు, ఒత్తిడి, నొప్పి, ముఖ్యంగా నడిచేటప్పుడు, పని చేసినప్పుడు గుండెలో మంటగా అనిపిస్తే జాగ్రత్త పడాలి. ఆకస్మాత్తుగా ఆయాసం, విపరీతమైన చెమటలు, వికారం, తల తిరగడం, స్పృహ తప్పడం, తీవ్రమైన నీరసం కూడా గుండెపోటుకు సంకేతాలు కావచ్చు. గుండె సహాయం కోరే వరకూ వేచి ఉండకుండా ఏడాదిలో ఒకట్రెండు సార్లు వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.చిన్నవయసులోనే గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయింది. చలాకీగా తిరుగుతూ.. పైకి బాగా కన్పించేవారు సైతం ఉన్నట్టుండి గుండెపోటుకు గురవుతున్నారు. జీవనశైలి మార్పులు, సరైన అవగాహనతోనే ఇలాంటి పరిస్థితిని అధిగమించవచ్చునని వైద్యనిపుణులు చెబుతున్నారు.– డాక్టర్ జి. ప్రదీప్కృష్ణ, కార్డియాలజిస్ట్, అనంతపురం -
స్మార్ట్‌వాచ్ అసాధారణ గుండె లయను గుర్తించగలదా? వైద్యులు ఏమంటున్నారంటే..
ఇప్పుడు స్మార్ట్‌వాచ్‌లు కేవలం అడుగులను లెక్కించడమే కాదు, నిద్రను సైతం కొలిచేస్తున్నాయి. మరికొన్ని పరికరాలు ఏకంగా నాడిని(పల్స్)ని ట్రాక్ చేయగలవు. మరికొన్ని అడ్వాన్స్డ్ స్మార్ట్‌వాచ్‌లు. సింగిల్-లీడ్ ఎలక్ట్రోకార్డియోగ్రామ్ (ECG)ను కూడా రికార్డ్ చేయగలవు కూడా. ఇవి రోజువారీ జీవితంలో గుండె ఎలా కొట్టుకుంటుంది అనే దానిపై అవగాహన అందిస్తుంది. అంటే ఈ స్మార్ట్‌వాచ్‌కి నిజంగానే గుండె అసాధారణ లయను గుర్తించగలిగే సామర్థ్యం ఉందా..? అంటే..చాలా స్మార్ట్‌వాచ్‌లు మణికట్టు వద్ద రక్త ప్రవాహంలో మార్పులను కొలవడానికి కాంతి ఆధారిత సెన్సార్‌ను ఉపయోగిస్తాయి. ఫోటోప్లెథిస్మోగ్రఫీ లేదా PPGగా పిలిచే ఈ సాంకేతిక గుండె కొట్టుకునే సమయాన్ని ట్రాక్ చేయగలదు, అలాగే క్రమరహితంగే కనిపించే నమునాను కూడా పరిశీలించగలదు. కొన్ని వాచీలు పరికరాన్ని వేలితో తాకడం ద్వారానే ఈసీజీ తీసుకునేలా అనుమతిస్తుంది. అంటే ఇది జస్ట్ గుండె కార్యకలాపాల చిన్న రికార్డింగ్నే ఉత్పత్తి చేయగలవట. అంటే గుండె పైగదులు క్రమరహితంగా కొట్టుకునే పరిస్థితి అయిన ఏట్రియల్ ఫిబ్రిలేషన్(ఏఎఫ్)ను గుర్తించగలదు. అంటే ఈ ఏఎఫ్ వల్ల గుండె దడ, ఆయాసం లేదా తల తిరగడం వంటివి సంభవించవచ్చు. కానీ కొంతమందిలో ఈ లక్షణాలు అస్సలు కనిపించవు. అలాగే ఒక్కోసారి ఒక అసాధారణమైన రీడింగ్‌ని చూపించినా..అందే గుండె లయ లోపంగా నిర్థారించలేం. ఎందుకుంటే వాచ్ మణి కట్టుకు ఉన్న తీరు, రక్త ప్రవాహంలో మార్పులు, అదనపు స్పందనలు వంటివి ఒక్కోసారి గుర్తించలేకపోవచ్చు. ఒక్కోసారి తెల్లవారుజామున 2 గంటలకు క్రమరహిత లయ హెచ్చరికను అందుకుని.. నిద్రలేచాక సాధారణంగా ఉండొచ్చు. ఒకవేళ ఆ వ్యక్తి తెల్లవారుజామున చూసిన రీడింగ్‌కి భయపడి క్లినిక్ చేరుకున్నాక..అక్కడ గుండె సాధారణ స్థితిలో గుండె కొట్టుకుంటూ ఉండొచ్చు. అయితే ఇక్కడ ఆ పేషెంట్‌కి అంతకముందు గుండె ఎలా కొట్టుకుందనే సమాచారం కార్డియాలజిస్టులకు ఉపయుక్తమై..తదుపరి వైద్య చికిత్సపై నిర్ణయం తీసుకునేలా అవగాహన కల్పిస్తుంది. ఇది జస్ట్ సాంప్రదాయ కార్డియాలజీకి పూరకంగానే ఉంటుంది. అంటే ఇలా గుండెలోని మార్పుల రీత్యా ఆ రోగికి పర్యవేక్షణ అవసరమా కాదా అని నిర్థారించేందుకు ఉపయోగపడుతుంది. ఇక్కడ స్మార్ట్ వాచ్ సాంకేతికత జస్ట్ ముందస్తు పరీక్షలు, జాగ్రత్తలు తీసుకోవడానికి ఉపయోగపడుతుందే తప్ప..స్వీయంగా వ్యాధిని నిర్థారించుకోగలమని కాదని అంటున్నారు వైద్యులు. అంటే ఈ స్మార్ట్ వాచ్ ఇచ్చే వేరబుల్ డేటా వైద్యులకు ఎలాంటి చికిత్స అవసరం అనేదానిపై మార్గదర్శకం అందిస్తుంది. అంతేగాదు గుండెకు సంబంధించి..సంప్రదాయ వైద్య పరీక్షలతోనే సమస్యను నిర్థారించగలమని నొక్కి చెబుతున్నారు కార్డియాలజిస్ట్‌లు. ఆ వాచ్ మీ గుండె లయ తప్పుతోంది అప్పడప్పుడూ..జాగ్రత్తపడు అని ఒక హెచ్చరిక పంపుతుందే తప్ప..అదే గుండె జబ్బు అని కచ్చితంగా నిర్థారించదని తేల్చి చెబుతున్నారు. ఒక్కోసారి రక్తప్రవాహంలో మార్పుల వల్ల..రోగికి ఉండే వ్యాధుల వల్లో ఇలా ఒక్కోసారి జరుగుతంది దాన్ని హార్ట్ సమస్యగా నిర్థారించలేమని అంటున్నారు. అందువల్ల ఈ సాంకేతికను ముందస్తు హెచ్చరికగా మాత్రమే చూడాలని సూచిస్తున్నారు వైద్యులు. ఇది ఆ క్షణంలో మన గుండెలో ఏం జరుగుతుందో పట్టుకోవడానికే సహాయపడుతుంది, అలాగే వైద్యులకు ఎలాంటి కార్డియాలజీ చికిత్స అవసరం అనేదానిపై గైడెన్స్ అందిస్తుందని చెబుతున్నారు.ఇదీ చదవండి: గుండెదడ గండమేనా? ఈ విషయాలు గుర్తుంచుకోండి! -
గుండెదడ గండమేనా? ఈ విషయాలు గుర్తుంచుకోండి!
ప్రశాంతంగా కూర్చున్నప్పుడూ ఒక్కసారిగా గుండె దడ దడా కొట్టుకుంటుంది. మరికొందరికి గుండె ఒక బీట్ మానేసి, ఆ తర్వాత బలంగా కొట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఆ క్షణంలో మొదట వచ్చే ఆలోచన ఒక్కటే. ఇది ‘‘గుండెకు ఏదైనా ప్రమాదమా?’’ అని. గుండెదడ అనుభవించినవారికి ఆ భయం సహజం. అయితే దడ వచ్చిన ప్రతిసారీ తీవ్రమైన గుంyð జబ్బు ఉన్నట్టు కాదు.అదే సమయంలో, పదేపదే వచ్చే గుండెదడను ‘టెన్షన్ వల్లే’ అని మనకు మనమే నిర్ధారించుకోవడమూ సరికాదు. దడ ఎలా వస్తోందీ, దానితోపాటు మరేవైనా లక్షణాలున్నాయా, గుండె ఆరోగ్యం ఎలా ఉంది అన్నవి తెలుసుకుని అవగాహన కలిగి ఉండటం ముఖ్యం. గుండె వేగం పెరిగినా, తగ్గినా, లయ తప్పినా తెలుసుకోవాల్సిన విషయాలను ఈరోజు సెప్టెంబరు 29న వరల్డ్ హార్ట్ డే సందర్భంగా తెలుసుకుందాం.దడ అనేది గుండె తాలూకు ఒక లక్షణం. మన గుండె నిరంతరం కొట్టుకుంటున్నా సాధారణంగా ప్రతి స్పందననూ మనం గమనించం. అదే స్పందన వేగంగా, బలంగా, తడబడుతున్నట్టు లేదా మధ్యలో ఒక బీట్ తప్పినట్టు స్పష్టంగా అనిపించడాన్ని ‘పాల్పిటేషన్స్’ అంటారు. దీనినే మనం గుండె దడ అంటుంటాం. కొందరికి ఛాతీలో, మరికొందరికి మెడ దగ్గదా లేదా గొంతులో ఈ అనుభూతి కలుగుతుంది. అది కొన్ని క్షణాలు ఉండవచ్చు. నిమిషాలపాటు లేదా అంతకంటే ఎక్కువసేపూ కొనసాగవచ్చు.నిజానికి ఇదో జబ్బు కాదు గానీ... దడ అనేది ఒక జబ్బు పేరు కాదు. ఒక లక్షణం మాత్రమే. అలా గుండెదడ రావడానికి వెనక కారణాలు వేర్వేరుగా ఉండవచ్చు. ఒత్తిడి, నిద్రలేమి వంటి కారణాలతోనూ రావచ్చు. గుండె లయలో సమస్య వల్లనూ రావచ్చు. అందుకే ‘నాకు దడ వస్తోంది’ అనే ఒక్క విషయంతో కారణాన్ని నిర్ణయించలేం.గుండె నిజంగానే ఒక బీట్ మానేస్తుందా?ఈ అనుభూతికి ఒక సాధారణ కారణం ‘ఎక్టోపిక్ బీట్’. గుండెలో విద్యుత్ సంకేతాలు ఒక క్రమంలో ప్రయాణించి, గుండె కండరాన్ని సంకోచింపజేస్తాయి. కొన్ని సందర్భాల్లో రావాల్సిన సమయానికంటే ముందే ఒక స్పందన వస్తుంది. దాని తర్వాత చిన్న విరామం ఉండి, తదుపరి సాధారణ స్పందన మరింత బలంగా అనిపించవచ్చు. అప్పుడు ‘‘గుండె కాసేపు ఆగి మళ్లీ కొట్టుకుంది’’ అనిపిస్తుంది. ఆ అనుభూతి వచ్చినంత మాత్రాన గుండె ఆగిపోయిందని అర్థం కాదు.ఇలాంటి ముందస్తు స్పందన గుండె పై గదుల నుంచి వస్తే దాన్ని ‘ప్రీమెచ్యూర్ ఏట్రియల్ కాంట్రాక్షన్’ లేదా ‘పీఏవీ’ అంటారు. కింది గదుల నుంచి వస్తే దాన్ని ‘ప్రీమెచ్యూర్ వెంట్రిక్యులర్ కాంట్రాక్షన్’ లేదా ‘పీవీసీ’ అంటారు. ఇవి ఆరోగ్యంగా ఉన్నవారిలోనూ కనిపించవచ్చు. కొందరికి స్పష్టంగా తెలుస్తాయి. మరికొందరికి ఎలాంటి అనుభూతీ ఉండదు. అయితే ప్రతి గుండె దడా ఎక్టోపిక్ బీట్ వల్ల వచ్చేది కాదు.కొన్ని మందుల వల్ల కూడా... మందుల విషయాన్నీ మర్చిపోకూడదు. కొన్ని జలుబు మందులు, కొన్ని ఆస్తమా మందులు, ఉత్తేజపరిచే పదార్థాలు ఉన్న ఉత్పత్తులతోనూ దడ రావచ్చు. వైద్యుడిని కలిసేటప్పుడు వాడుతున్న మందులు, సప్లిమెంట్ల వివరాలు చె΄్పాలి. అనుమానం వచ్చిందని అవసరమైన మందులను సొంతంగా ఆపేయకూడదు.కాఫీ తాగిన ప్రతివారికీ దడ వస్తుందని చెప్పలేం. కానీ కాఫీ లేదా ఇతర కెఫీన్ పానీయాలు తీసుకున్న తర్వాత దడ పెరుగుతున్నట్టు గమనిస్తే వాటిని తగ్గించడం ఉపయోగపడవచ్చు. ఎనర్జీ డ్రింక్స్ కూడా దడను ప్రేరేపించవచ్చు. మనకు ఏ సందర్భంలో దడ వస్తోందో గమనించడం ముఖ్యం.భయం వల్ల కూడా దడ రావచ్చు.... కానీ ప్రతిసారీ భయం వల్లనే కాకపోవచ్చు...ఆందోళన గుండె దడను ప్రేరేపించగలదు. దడ అనిపించడం వల్ల భయమూ కలగవచ్చు. అయితే వ్యక్తి ఆందోళనగా కనిపిస్తున్నారనే కారణంతోనే సమస్యను కొట్టిపారేయకూడదు. లక్షణాల తీరును, వైద్య చరిత్రను పరిశీలించి అవసరమైన పరీక్షలు చేసిన తర్వాతే కారణంపై నిర్ణయానికి రావాలి.వేగం పెరిగినా... తగ్గినా... లయ తప్పినా... గుండె విషయంలో ‘వేగం’, ‘లయ’ రెండూ ఒకటి కావు. నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటోందన్నది వేగం. స్పందనలు ఏ క్రమంలో వస్తున్నాయన్నది లయ. పెద్దవారిలో (అడల్ట్స్‌లో) విశ్రాంతి సమయంలో గుండె సాధారణంగా నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకుంటుంది. అయితే ఈ పరిధికి బయట ఉన్న ప్రతి సంఖ్యా జబ్బుకు సంకేతం కాదు. అప్పుడు మనం ఏం చేస్తున్నాం, వయసెంత, శారీరక దారుఢ్యం ఎలా ఉంది, మందులేమైనా వాడుతున్నామా అనే విషయాలూ చూడాలి.ఇలా పొరబడటం సరికాదు... వ్యాయామం చేస్తున్నప్పుడు, జ్వరంతో ఉన్నప్పుడు, భయపడినప్పుడు గుండె వేగం పెరగవచ్చు. గుండెలోని సహజ పేస్‌మేకర్ నుంచే సంకేతాలు వేగంగా వస్తున్న ఈ ప్రతిస్పందనలను... అసాధారణ విద్యుత్ సంకేతాల వల్ల వచ్చే వేగమైన లయ సమస్యతో కలిపి చూసి పొరబడకూడదు. ముఖ్యంగా జ్వరం, రక్తహీనత వంటి కారణాలతో వేగం పెరిగితే అసలు కారణానికి చికిత్స చేయాలి. కేవలం గుండె వేగాన్ని తగ్గించే మందు వేసుకోవడం పరిష్కారం కాదు.నెమ్మదిగా కొట్టుకుంటే పేస్‌మేకర్ అవసరమా?నిమిషానికి 60 కంటే తక్కువ గా గుండె కొట్టుకోవడాన్ని సాధారణంగా ‘బ్రాడీకార్డియా’ అంటారు. కానీ నిద్రలో, మంచి శారీరక దారుఢ్యం ఉన్నవారిలో ఇది సహజంగానూ ఉండవచ్చు. గుండె వేగం 60 కంటే తక్కువగా ఉందనే ఒక్క కారణంతో పేస్‌మేకర్ అవసరం అనుకోకూడదు.అయితే గుండె విద్యుత్ సంకేతాల సమస్య వల్ల వేగం తగ్గితే కొందరిలో అలసట, తలతిరుగుడు, ఆయాసం, స్పహ తప్పడం (సింకోప్) వంటి లక్షణాలు కనిపించవచ్చు. అయితే మరికొందరిలో మాత్రం స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవచ్చు. మందులు లేదా సరిచేయగల ఇతర కారణాలున్నాయా, ఈసీజీలో ఎలాంటి సమస్య కనిపిస్తోంది అన్న అంశాలు పరిశీలించాలి. కొన్ని తీవ్రమైన గుండె విద్యుత్ సమస్యల్లో లక్షణాలు లేకున్నా పేస్‌మేకర్ అవసరమవుతుంది. అందుకే నిర్ణయం అన్నది ఒక సంఖ్య మీద కాకుండా, సమస్య స్వభావం మీద ఆధారపడ ఉంటుంది.ఇదీ చదవండి: న్యూనత కాదు... న్యూ ట్రెండ్!ఈ లక్షణాలు ఉంటే ఆలస్యం వద్దు... దడతోపాటు ఛాతీలో నొప్పి లేదా మంట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన తలతిరుగుడు, స్పహ తప్పడం లేదా తప్పుతున్నట్టు అనిపించడం ఉంటే వెంటనే అత్యవసర వైద్య సహాయం పొందాలి. స్వయంగా వాహనం నడుపుకుంటూ వెళ్లకూడదు. ఈ లక్షణాలు కొద్దిసేపటి తర్వాత తగ్గిపోయినప్పటికీ అత్యవసరంగా వైద్య సలహా తీసుకోవాలి.దడ పదేపదే వస్తున్నా, మునుపటికంటే ఎక్కువవుతున్నా, ఎక్కువసేపు కొనసాగుతున్నా వైద్యుడిని సంప్రదించాలి. ఇప్పటికే గుండె జబ్బు ఉన్నవారు మరింత శ్రద్ధ చూపాలి. వ్యాయామ సమయంలో అసాధారణంగా దడ రావడం, కుటుంబంలో చిన్న వయసులో కారణం తెలియకుండా ఆకస్మిక మరణాలు సంభవించడం వంటి వివరాలను కూడా వైద్యుడికి తప్పనిసరిగా చె΄్పాలి.ఇలా దడ రావడానికి గుండె అంశాలు మాత్రమే కారణం కాదు...నిద్ర సరిగా లేకపోవడం, మానసిక ఒత్తిడి, ఆందోళన, మద్యం, పొగాకు, కెఫీన్ వంటి పలు అంశాలు కొందరిలో దడను ప్రేరేపించవచ్చు. జ్వరం ఉన్నప్పుడు, రక్తహీనత ఉన్నప్పుడు, థైరాయిడ్ గ్రంథి అతిగా పనిచేస్తున్నప్పుడు కూడా దడ రావచ్చు. మహిళల్లో గర్భధారణ, మెనోపాజ్ సమయంలో వచ్చే హార్మోన్ల మార్పులూ ఒక కారణం కావచ్చు.క్రమం తప్పితే ఏట్రియల్ ఫిబ్రిలేషన్ కూడా కావచ్చు...‘ఏట్రియల్ ఫిబ్రిలేషన్’ (ఏఎఫ్)లో గుండె పై గదుల స్పందనలు అస్తవ్యస్తమవుతాయి. నాడి క్రమం తప్పి కొట్టుకుంటుంది; వేగంగానూ ఉండవచ్చు. కొందరికి దడ, అలసట, ఆయాసం ఉంటాయి. మరికొందరిలో ఎలాంటి లక్షణాలూ ఉండకపోవచ్చు.దీనిని గుర్తించడం ఎందుకంత అవసరమో తెలుసుకునేందుకు ఓ ముఖ్యమైన కారణం ఉంది. ‘ఏట్రియల్ ఫిబ్రిలేషన్’ (ఏఎఫ్) వల్ల కొందరిలో గుండెలో రక్తం గడ్డకట్టి, ఆ గడ్డ మెదడుకు చేరితే పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే చికిత్స దడను తగ్గించడానికే పరిమితం కాదు. ఆ వ్యక్తిలో పక్షవాతం వచ్చే ముప్పును కూడా అంచనా వేసి, అవసరమైనవారికి డాక్టర్లు రక్తం గడ్డకట్టకుండా చేసే ‘యాంటీకోయాగ్యులెంట్’ మందులు సూచిస్తారు. ప్రతి ఎక్టోపిక్ బీట్నూ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ (ఏఎఫ్)గా భావించకూడదు. అలాగే ఏఎఫ్ నిర్ధారణ అయినవారు దడ తగ్గిందికదా అని ఈ మందులను సొంతంగా ఆపకూడదు.దడ వచ్చినప్పుడు ఏం చేయాలి?చేస్తున్న పనిని ఆపి విశ్రాంతిగా, సురక్షితంగా కూర్చోవాలి. దడ మొదలైన సమయం, ఎంతసేపు కొనసాగిందో గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారిగా మొదలైందా, క్రమంగా పెరిగిందా, ఏవైనా మందు(లు) లేదా పానీయం తీసుకున్న తర్వాత వచ్చిందా వంటి వివరాలను నమోదు చేసుకుని చెబితే అవి డాక్టర్లకు ఉపయోగపడతాయి. అయితే ఛాతీనొప్పి, శ్వాస ఇబ్బంది, çస్పృహ తప్పుతున్న భావన వంటి హెచ్చరికలు ఉంటే వివరాలు రాసుకోవడంలోనో, వాచ్‌లో రికార్డు చేయడంలోనో సమయం గడపకుండా వెంటనే వైద్య సహాయం పొందాలి. ఇంటి చిట్కాలతో తగ్గుతుందేమోనని వేచి ఉండకూడదు.సుప్రావెంట్రిక్యులర్ టాకీకార్డియా (ఎస్వీటీ) అంటే...కొందరికి తాము ప్రశాంతంగా ఉన్నప్పుడే గుండె ఒక్కసారిగా చాలా వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. కొంతసేపటికి అంతే హఠాత్తుగా తగ్గిపోవచ్చు. ఇలాంటి అనుభూతికి ‘సుప్రావెంట్రిక్యులర్ టాకీకార్డియా’ లేదా ‘ఎస్వీటీ’ అనే అంశం ఒక కారణం కావచ్చు. గుండెలో విద్యుత్ సంకేతాలు ప్రయాణించే విధానంలో సమస్య దీనికి కారణమవుతుంది. దడ వస్తున్న సమయంలో తీసిన ఈసీజీ... దీని నిర్ధారణకు ఉపయోగపడుతుంది. అయితే లక్షణాలను బట్టి మాత్రమే ‘సుప్రావెంట్రిక్యులర్ టాకీకార్డియా’ లేదా ‘ఎస్వీటీ’ అని నిర్ణయించలేం.స్మార్ట్‌వాచ్ హెచ్చరికను ఎలా చూడాలి?కొందరు తమ గుండె లయను స్మార్ట్‌వాచ్‌లో చూసుకుంటూ ఉంటారు. ఇలా స్మార్ట్‌వాచ్‌లో ‘ఇర్రెగ్యులర్ రిథమ్’ అని కనిపించగానే తీవ్రమైన జబ్బు ఉందని నిర్ణయించుకోవద్దు. అదే సమయంలో ఆ సమాచారాన్ని పూర్తిగా పక్కన పెట్టకూడదు. కొన్ని పరికరాలు ఉపయోగకరమైన ఈసీజీ రికార్డింగులను అందించగలవు. కానీ ఆ పరికరం ఇచ్చే ఆటోమేటిక్ హెచ్చరిక ఒక్కటే పూర్తి వైద్య నిర్ధారణ కానేరదు. ఆ రికార్డింగ్‌ను భద్రపరచి వైద్యుడికి చూపాలి.వాచ్ సాధారణంగా చూపిస్తోందని కదా అని... ఛాతీనొప్పి, ఆయాసం, స్పృహ తప్పడం వంటి లక్షణాలుంటే వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే పదేపదే అంకెలను చూసుకుంటూ ఆందోళన పెంచుకోవడమూ మంచిది కాదు. పరికరం ఇచ్చే సమాచారం వైద్య అంచనాకు తోడ్పడాలి.గుండె దడ వచ్చినప్పుడు చేయాల్సింది దాని కారణాన్ని తెలుసుకోవడం. అవసరమైన పరీక్షలతో ముప్పును అంచనా వేసి, చికిత్స అవసరమైతే తీసుకోవాలి. ప్రమాదకరమైన సమస్య లేదని నిర్ధారణ అయితే ఆ భరోసాతో హాయిగా రోజువారీ జీవితాన్ని కొనసాగించాలి. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇదే: గుండె ఇచ్చే హెచ్చరికలను గుర్తించాలి. అంతేతప్ప... సాధారణ స్పందనల గురించి అనవసరమైన భయాలతో జీవించకూడదు.ఒకసారి ఈసీజీ బాగుంటే సరిపోతుందా?గుండె దడను పరిశీలించడంలో ఈసీజీ ముఖ్యమైన పరీక్ష. అయితే అది తీసిన సమయంలోని గుండె వివరాలను మాత్రమే నమోదు చేస్తుంది. మధ్యమధ్యలో వచ్చే లయ సమస్యా, పరీక్ష చేస్తున్నప్పుడు లేకపోతే ఆ ఈసీజీలో అవి కనిపించకపోవచ్చు. అందుకే ఒకసారి ఈసీజీ నార్మల్‌గా వచ్చిందని, మళ్లీ మళ్లీ వస్తున్న లక్షణాలను పట్టించుకోకుండా ఉండకూడదు.హోల్టర్ మానిటర్ ఎందుకంటే...?అవసరాన్ని బట్టి డాక్టర్లు హోల్టర్ మానిటర్ అనే పరీక్షను సూచించవచ్చు. ఇది సాధారణ రోజువారీ పనులు చేసుకుంటున్నప్పుడు కూడా గుండె లయను ఒక రోజు లేదా అంతకంటే ఎక్కువసేపు నమోదు చేస్తుంది. దడ అరుదుగా వస్తుంటే మరింత ఎక్కువకాలం నమోదు చేసే పరికరం అవసరమవచ్చు. లక్షణాలు ఎంత తరచుగా వస్తున్నాయన్న అంశాన్ని బట్టి పరీక్ష కోసం ఏ పరికరాన్ని వాడాలననది డాక్టర్లు నిర్ణయిస్తారు.గుండె నిర్మాణం, కవాటాలు, పంపింగ్ పనితీరు తెలుసుకోవడానికి ఎకో పరీక్ష ఉపయోగపడుతుంది. పరిస్థితిని బట్టి థైరాయిడ్, పొటాషియం వంటి అంశాలను తెలుసుకోడానికి కొన్ని రక్తపరీక్షలు చేయాల్సి రావచ్చు. అందరికీ అన్ని పరీక్షలూ అవసరం ఉండవు. దడ వచ్చిన సమయం, అది ఎంతసేపు కొనసాగింది, అప్పుడు వారు ఏం చేస్తున్నారు, ఇతర లక్షణాలేమైనా ఉన్నాయా అనే వివరాలు... ఏయే పరీక్షలను ఎంచుకోవాలనే విషయంలో డాక్టర్లకు ఉపయోగపడే అంశాలవుతాయి.బలంగా అనిపిస్తే ఎక్కువ ప్రమాదమా?ఎక్టోపిక్ బీట్స్ విషయంలో చాలామందికి తెలియని విషయం ఇది. దడ ఎంత బలంగా అనిపిస్తోందన్నది ఒక్కటే ప్రమాదానికి కొలమానం కాదు. అప్పుడప్పుడు వచ్చే కొన్ని ‘ప్రీమెచ్యూర్ వెంట్రిక్యులర్ కాంట్రాక్షన్’ (పీవీసీ)లు కొందరికి చాలా ఇబ్బందిగా అనిపించవచ్చు. మరొకరికి ఎక్కువ సంఖ్యలో ఉన్నా పెద్దగా తెలియకపోవచ్చు.వైద్యులు వాటి సంఖ్యను మాత్రమే కాకుండా, అవి వచ్చే తీరును, గుండె నిర్మాణాన్ని, పంపింగ్ పనితీరును, ఇతర లక్షణాలను కలిపి పరిశీలిస్తారు. గుండె ఆరోగ్యంగా ఉండి, అప్పుడప్పుడు మాత్రమే వచ్చే ఎక్టోపిక్ బీట్స్ ఉన్న చాలామందికి ప్రత్యేక చికిత్స అవసరం ఉండదు. అయితే తరచుగా, ఎక్కువ సంఖ్యలో వచ్చే ‘ప్రీమెచ్యూర్ వెంట్రిక్యులర్ కాంట్రాక్షన్’ (పీఏసీ)లు కొందరిలో గుండె కండరాన్ని బలహీనపరచవచ్చు. అందువల్ల ‘ఎక్టోపిక్ బీట్స్ అన్నీ ప్రమాదమే’ అనడమూ సరికాదు; ‘‘వాటిని ఎప్పుడూ పట్టించుకోనక్కర్లేదు’’ అనడమూ సరికాదు.ప్రతి దడకూ మందులు అవసరమా?కారణాన్ని బట్టి చికిత్స ఉంటుంది. దడకు థైరాయిడ్ సమస్య లేదా రక్తహీనత వంటి కారణం ఉంటే దానికి తగిన చికిత్స అందించడం అవసరం. గుండెలో ప్రమాదకరమైన సమస్య లేదని నిర్ధారణ అయిన తర్వాత, కొందరికి కారణాన్ని వివరించడం, నిద్రను మెరుగుపరచడం, దడను ప్రేరేపించే అలవాట్లను తగ్గించడం వంటి జాగ్రత్తలు / సూచనలు సరిపోవచ్చు.లక్షణాలు ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నప్పుడు లేదా లయ సమస్య స్వభావాన్ని బట్టి వైద్యులు మందులు సూచిస్తారు. ఎంపిక చేసిన రోగుల్లో ‘క్యాథెటర్ అబ్లేషన్’ అనే చికిత్స ఉపయోగపడుతుంది. ఇందులో సన్నని క్యాథెటర్ ద్వారా గుండెలో సమస్యకు కారణమవుతున్న విద్యుత్ సంకేతాల ్రపాంతాన్ని గుర్తించి చికిత్స చేస్తారు. ఎవరికి మందులు, ఎవరికి అబ్లేషన్, ఎవరికి పర్యవేక్షణ చాలు అన్న అంశాలు వాళ్ల వాళ్ల వ్యక్తిగత పరిస్థితిని బట్టి డాక్టర్లు నిర్ణయిస్తారు. దడ వచ్చిందని ఇతరులు వాడే గుండె మందులను సొంతంగా తీసుకోవడం ఎంతమాత్రమూ సరికాదు.డా. ఎంఎస్ఎస్ ముఖర్జీ, సీనియర్ కార్డియాలజిస్ట్- నిర్వహణ : యాసీన్ -
ఛాతీ నొప్పా.. నిర్లక్ష్యం వద్దు
సాక్షి, హైదరాబాద్: ఛాతీలో నొప్పి వస్తే చాలా మంది గ్యాస్ లేదా అజీర్తిగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారని.. కానీ కొన్ని సందర్భాల్లో అదే నొప్పి గుండెకు రక్తం సరిగా అందట్లేదనడానికి సంకేతం కావచ్చని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) అప్రమత్తం చేసింది. ఛాతీ నొప్పిని ఎలా గుర్తించాలి? ఎప్పుడు గుండె సమస్యగా అనుమానించాలి? ఎప్పుడు వెంటనే ఆసుపత్రికి వెళ్లాలనే అంశాలపై తాజాగా స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. ఛాతీలో బిగుతుగా అనిపించడం, చేతులు/మెడ/వెన్ను వరకు నొప్పి వ్యాపించడం, ఆయాసం, ఒళ్లంతా చెమటలు పట్టడం, వికారం వంటి లక్షణాలను గుండె సంబంధిత సమస్యలకు హెచ్చరికలుగా పరిగణించాలని తాజా స్టాండర్డ్ ట్రీట్మెంట్ వర్క్ ఫ్లోలో ఐసీఎంఆర్ పేర్కొంది. వాటిలో ఏ లక్షణాన్నీ తేలికగా తీసుకోవద్దని సూచించింది. విశ్రాంతి సమయంలోనే ఛాతీ నొప్పి రావడం లేదా 20 నిమిషాలకు మించి నొప్పి కొనసాగడం అత్యవసర గుండె సమస్యకు సంకేతం కావచ్చని తెలిపింది. గతంలో వచ్చిన ఛాతీ నొప్పి అకస్మాత్తుగా ఎక్కువ కావడం, తక్కువ శ్రమకే నొప్పి రావడం లేదా కొత్తగా ఇలాంటి నొప్పి మొదలవడం కూడా నిర్లక్ష్యం చేయకూడని లక్షణాలేనని వివరించింది. ఒకప్పుడు వృద్ధుల్లోనే ఎక్కువగా కనిపించే గుండె సంబంధిత అత్యవసర పరిస్థితులు ఇప్పుడు మధ్య వయసు్కల్లోనూ పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయని.. రాష్ట్రంలో 2025లో అత్యవసర వైద్య సేవలకు సంబంధించి స్పందించిన కేసుల విశ్లేషణలో 31 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారిలోనే సుమారు 60 శాతం గుండె సంబంధిత కేసులు నమోదయ్యాయని ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో ఈఎంఆర్ఐ–జీహెచ్ఎస్ సేవలకు స్పందించిన మొత్తం 8,08,755 అత్యవసర కేసుల్లో 22,699 కేసులు (3 శాతం) గుండె సంబంధిత సమస్యలకు సంబంధించినవి. వాటిలో ఛాతీ నొప్పికి సంబంధించిన కేసులు నెలకు సగటున 1,892, రోజుకు సుమారు 62 చొప్పున నమోదయ్యాయి. మొత్తం గుండె సంబంధిత కేసుల్లో 13,508 (దాదాపు 60 శాతం) 31–60 ఏళ్ల వయసు వారివే కావడం ఆందోళన కలిగిస్తోంది. గ్రామాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువ గుండె సంబంధమైన అత్యవసర కేసుల్లో 2025లో పురుషుల్లో 12,098 (53 శాతం), మహిళల్లో 10,607 (47 శాతం) కేసులు నమోదయ్యాయి. ధూమపానం, అధిక మద్యపానం, అనారోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం వంటి జీవనశైలి అంశాలతోపాటు అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలు గుండె జబ్బుల ముప్పును పెంచుతున్నాయి. రాష్ట్రంలో ప్రాంతాలవారీగా నమోదైన గుండె సంబంధిత అత్యవసర కేసుల్లో పట్టణ ప్రాంతాలు ముందున్నాయి. పట్టణాల్లో 16,198 (71 శాతం), గ్రామీణ ప్రాంతాల్లో 5,094 (23 శాతం), గిరిజన ప్రాంతాల్లో 1,407 (6 శాతం) కేసులు నమోదయ్యాయి. జనాభా సాంద్రత, జీవనశైలి, వైద్య సేవలను ఆశ్రయించే ధోరణి వంటి అనేక అంశాలు ఈ వ్యత్యాసానికి కారణమయ్యే అవకాశం ఉంది. ‘గోల్డెన్ అవర్’లో స్పందన కీలకం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా సమాచార ప్రకారం గుండెపోటు అత్యవసర వైద్య పరిస్థితుల్లో మొదటిది. గుండెకు రక్తప్రసరణ అకస్మాత్తుగా ఆగిపోవడంతో కొన్ని నిమిషాల్లోనే గుండె కండరానికి నష్టం ప్రారంభమై సమయం గడిచేకొద్దీ పెరుగుతుంది. మహిళలు, వృద్ధులు, మధుమేహం ఉన్నవారిలో సాధారణ ఛాతీ నొప్పి లేకుండానే ఆయాసం, అలసట, అజీర్తి లాంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉందని డబ్లు్యహెచ్‌వో పేర్కొంది. ఛాతీ నొప్పి గుండెపోటు కారణంగానే వచ్చిందా లేదా అన్నది లక్షణాలను బట్టి మాత్రమే నిర్ధారించలేమని.. ఈ విషయంలో ఈసీజీ, కార్డియాక్ ట్రోపోనిన్ పరీక్షలు కీలకంగా ఉంటాయని డబ్లు్యహెచ్‌ఓ, ఐసీఎంఆర్ మార్గదర్శకాలు చెబుతున్నాయి. ‘డోంట్ మిస్ ఎ బీట్’ ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది ప్రపంచ హృదయ సమాఖ్య ‘డోంట్ మిస్ ఎ బీట్’ప్రచారాన్ని నిర్వహిస్తోంది. గుండె ఆరోగ్యంపై అవగాహన పెంచడం, లక్షణాలను ముందే గుర్తించడం, శారీరక చురుకుదనం, ఆరోగ్యకరమైన ఆహారం వంటి చర్యలను ప్రోత్సహిస్తోంది. రోజువారీ శారీరక చురుకుదనం గుండె ఆరోగ్యానికి కీలకమని డబ్లు్యహెచ్‌ఓ పేర్కొంటోంది. ఛాతీలో కొత్తగా నొప్పి లేదా బిగుతు మొదలైతే అది గ్యాస్ అని భావించి ఇంట్లోనే ఉండటం ప్రమాదకరం అని ఐసీఎంఆర్ స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా నొప్పితో పాటు ఆయాసం, చల్లటి చెమటలు, వికారం, తల తిరగడం లేదా చేతి/దవడ/వెన్నుకు నొప్పి వ్యాపిస్తే వెంటనే అత్యవసర వైద్య సహాయం పొందాలి. గుండెపోటు అనుమానం ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి చేరడం, వైద్యుల సూచన మేరకు పరీక్షలు చేయించుకోవడం ప్రాణాలను కాపాడటంలో కీలకమని పేర్కొంటోంది. కాగా గుండె ఆరోగ్యానికి పొగతాగడం మానేయడం, ఉప్పు–కొవ్వు–చక్కెర అధికంగా ఉన్న ఆహారాన్ని తగ్గించడం, క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం, రక్తపోటు–మధుమేహం–కొలె్రస్టాల్‌ను నియంత్రణలో ఉంచడం వంటి చర్యలు సహాయపడతాయని స్పష్టం చేసింది. -
హృదయ సామ్రాజ్ఞి
మహిళలు కాలేజీ మెట్లెక్కడం ఊహకందని రోజుల్లోనే మెడిసిన్ చేశారు ఎస్.ఐ. పద్మావతి. సంప్రదాయవాదుల మూతివిరుపులను పట్టించుకోకుండా కుటుంబం ఆమెకు అండగా నిలిచింది. భారతదేశంలో తొలి మహిళా హృద్రోగ నిపుణురాలిగా చరిత్ర పుటల్లో నిలిచారు శివరామకృష్ణ అయ్యర్ పద్మావతి. మన దేశంలో మొట్టమొదటి కార్డియాలజీ క్లినిక్, కార్డియాక్ కాథెటరైజేషన్ ల్యాబ్ వ్యవస్థాపకురాలిగా తన ప్రత్యేకత నిలుపుకున్న పద్మావతి... గుండె ఆరోగ్యానికి సంబంధించి నిర్మాణాత్మకమైన విధానాలకు దారి వేసి ‘గ్రాండ్ మదర్ ఆఫ్ కార్డియాలజీ’గా పేరు తెచ్చుకున్నారు. పేదప్రజల గుండెచికిత్స కోసం తన సోదరితో కలిసి ట్రస్ట్ ప్రారంభించారు....ఎస్.ఐ. పద్మావతి బర్మాలో జన్మించారు. తండ్రి బారిస్టర్. ఆమెకు ముగ్గురు సోదరులు, ఇద్దరు సోదరీ మణులు. రంగూన్ మెడికల్ కాలేజీలో ఎంబీబీయస్ చేసిన పద్మావతి లండన్‌లోని ‘రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్’ నుంచి ‘ఎఫ్ఆర్సీపీయి’ పూర్తి చేసిన తరువాత మూడు నెలల పాటు స్వీడన్లో ఉన్నారు. అక్కడి సదర్ హాస్పిటల్స్‌లో కార్డియాలజీ కోర్సు చేశాక అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ హాస్పిటల్ ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు. ప్రముఖ కార్డియాలజిస్ట్ హెలెన్ టౌసిగ్తో కలిసి జాన్స్ హాప్కిన్స్లో చదువుకున్న కాలం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. పేదల కోసం... 1952లో హార్వర్డ్ మెడికల్ స్కూల్లో చేరిన పద్మావతి మోడ్రన్ కార్డియాలజీలో మార్గదర్శకుడైన పాల్ డడ్లీ వైట్ దగ్గర చదువుకున్నారు. యూకేలో ఉన్న కాలంలో నేషనల్ హార్ట్ హాస్పిటల్లో పనిచేశారు. ఆమె ముందు ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన వృత్తి అవకాశాలు ఉన్నప్పటికీ ప్రజలకు సేవ చేయడానికి భారతదేశానికి రావాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. మన దేశానికి వచ్చిన తరువాత 1953లో దిల్లీలోని లేడి హార్డింగ్ మెడికల్ కాలేజీలో లెక్చరర్‌గా చేరారు. ఆ తరువాత దేశంలోనే తొలి కార్డియాలజీ క్లినిక్‌ను ప్రారంభించారు. తన నైపుణ్యంతో అసాధారణ వైద్యురాలిగా పేరు తెచ్చుకున్నారు. ఎంతోమంది యువ వైద్యులకు స్ఫూర్తినిచ్చారు. నిరుపేదలకు వైద్యసేవలు అందించడానికి 1962లో వైద్యుల బృందం, పారిశ్రామికవేత్త అశోక్ జైన్‌తో కలిసి ఆల్ ఇండియా హార్డ్ ఫౌండేషన్(ఏఐహెచ్ఎఫ్) స్థాపించారు. గుండె ఆరోగ్యాన్ని జాతీయ ప్రాధాన్యత అంశంగా మార్చాలనే లక్ష్యంతో అడుగులు వేశారు. 1967లో మౌలాన మెడికల్ కాలేజీలో కార్డియాలజీ ప్రొఫెసర్‌గా చేరారు. ఆమె కీర్తి దేశ నలుమూలలా విస్తరించింది. అదే సంవత్సరం ప్రతిష్ఠాత్మకమైన పద్మభూషణ్ అందుకున్నారు.తొంభై ఏళ్ల వయసులోనూ... ఏకకాలంలో మూడు ప్రతిష్ఠాత్మక సంస్థలైన మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ, లోక్ నాయక్ హాస్పిటల్, జీబి పంత్ హాస్పిటల్లకు చీఫ్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేశారు పద్మావతి. మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేసిన తరువాత మరో ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్‌ను చేపట్టారు. 1981లో నేషనల్ హార్ట్ ఇన్స్టిట్యూట్(ఎన్హెచ్ఐ) స్థాపించారు. గుండె జబ్బుల నివారణ, గుండె సంరక్షణకు సంబంధించి ‘ఎన్హెచ్ఐ’ దేశంలో ప్రముఖ కేంద్రంగా ఎదిగింది. తొంభై ఏళ్లు దాటిన తరువాత కూడా ‘ఎన్హెచ్ఐ’లో ఆమె అవిశ్రాంతంగా పనిచేశారు. రోజుకు పన్నెండు గంటలు పనిచేశారు. తొంభై సంవత్సరాల వయసులో యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ (ఇఎస్సీ)లో ఫెలో అయ్యారు. తద్వారా ఆమె ఇఎస్సీలో అత్యంత సీనియర్ ఫెలోగా నిలిచారు.అందుకే... కార్డియాలజీ! ‘నేను కాలేజీలో చదువుతున్న రోజుల్లో మహిళలకు అందుబాటులో ఉన్న కోర్సులు తక్కువగా ఉండేవి. అందుకే నేను కార్డియాలజీని ఎంచుకున్నాను’ అని చెప్పేవారు పద్మావతి. మన దేశంలో గుండెజబ్బుల వ్యాప్తి గురించి ఆమె స్పందన ఇది...‘గతంలో పరిస్థితులు వేరుగా ఉండేవి. ఆరోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ జీవనశైలిలో భాగంగా ఉండేవి. ఇప్పుడు అలా కాదు’ ఏడు దశాబ్దాల వృత్తి జీవితంలో హృద్రోగ రంగంలో గణనీయమైన కృషి చేశారు పద్మావతి. ఇతరులు తన అడుగు జాడల్లో నడవడానికి మార్గం సుగమం చేశారు. వైద్యవిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో, నిరుపేదలకు సేవ చేయడంలో భారతదేశ వైద్యచరిత్రలో తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారు ఎస్.ఐ. పద్మావతి. 103 ఏళ్ల వయసులో... దేశం గర్వించే వైద్యురాలిగా పద్మావతి పేరు తెచ్చుకోవడం ఒక కోణం అయితే, తన జీవితాన్ని నిరుపేదలకు అంకితం చేయడం మరో కోణం. తన సోదరి జానకి (న్యూరాలజిస్ట్)తో కలిసి జానకి–పద్మావతి ట్రస్ట్ స్థాపించారు. దీని ద్వారా తమ సంపాదనను పేదరోగుల గుండె చికిత్సల కోసం విరాళంగా ఇచ్చారు. 95 ఏళ్ల వయసు వచ్చే వరకు చురుకుగా పనిచేశారు. కోవిడ్ బారిన పడిన పద్మావతి 103 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆమె మరణం భారతీయ కార్డియాలజీ రంగంలో ఒక అద్భుతమైన శకానికి ముగింపు పలికింది. అయితే ఆమె వారసత్వం దేశవిదేశాల్లో ఎంతోమంది వైద్యులకు స్ఫూర్తినిస్తూనే ఉంది. -
చివరి ట్రైమెస్టర్ వరకు వర్కౌట్లు చేయొచ్చా..?! నటి సమంత కూడా..
నటి సమంత తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన ప్రతి అప్డేట్ని పంచుకుంటూ..అభిమానులతో చిల్ అవుతోందామె. ప్రస్తుతం తన గర్భధారణ చివరదశలోకి అడుగుపెట్టింది. ఈ విషయాన్నే వెల్లడిస్తూ..ఈ సరికొత్త అనుభవంలో ఇష్టమైన పనులన్నీ చేసేలా శరీరం సహకరించినందుకు ఎంతో కృతజ్ఞతలు అని పేర్కొంది. అంతేగాదు ఈ చివరి ట్రైమెస్టర్‌లో సైతం వర్కౌట్లు చేస్తున్న దృశ్యాలు పంచుకుంటూ..దీన్ని ఘనంగా ముగిద్దాం అని సమంత సోషల్‌మీడియా పోస్ట్‌లో రాసుకొచ్చింది. కాగా, సమంత రూత్ ప్రభు, ఆమె భర్త రాజ్ నిడిమోరు దంపతుల ఈ డిసెంబర్లో తమ తొలి సంతానానికి స్వాగతం పలకనున్నారు. మరి ఇలా గర్భధారణ చివరి స్టేజ్ వరకు వర్కౌట్లు చేయొచ్చా? నిపణులు ఏమంటున్నారు తదితరాల గురించి సవివరంగా చూద్దామా..!.ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని గర్భిణి మహిళలు నిశ్చింతగా చేయొచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే ఈసమయంలో ఎలాంటి వ్యాయామాలు చేయడం మంచిదో గైనకాలజిస్ట్‌లను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు. చివరి త్రైమాసికం అంటే.. శరీరం ప్రసవానికి సిద్ధం అవుతుంది కాబట్టి కష్టతరమైన వ్యాయామాలు చేయకుండా..తేలికపాటి వ్యాయామాలు ఎంచుకోవడం మంచిదని అంటున్నారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) ఈ టైంలో చేయదగినవి..వాకింగ్: ఇది సురక్షితమైన సులవైన వ్యాయామం. రోజుకు 20–30 నిమిషాల పాటు సాధారణ వేగంతో నడవడం వల్ల శరీరం చురుగ్గా ఉంటుంది.స్విమ్మింగ్ (ఈత): నీటిలో శరీరం తేలికగా ఉంటుంది కాబట్టి నడుముపై ఒత్తిడి తగ్గుతుందని, అలాగే గుండె ఆరోగ్యానికి కూడా మంచిదని అంటున్నారు. పెల్విక్ ఫ్లోర్ వ్యాయామాలు (కీగెల్స్): ప్రసవానికి అవసరమైన కండరాలను బలోపేతం చేయడానికి, ప్రసవానంతరం మూత్రవిసర్జన సమస్యలు రాకుండా ఉండటానికి కీగెల్ వ్యాయామాలు సహాయపడతాయి.ప్రీనేటల్ యోగా అండ్ స్ట్రెచింగ్స్: నిపుణుల సమక్షంలో చేసే యోగాసనాలు శ్వాస నియంత్రణకు, నడుము నొప్పి తగ్గడానికి ఉపయోగపడతాయి. భంగిమల కోసం సీతాకోకచిలుక ఆసనం (బటర్‌ఫ్లై పోజ్) వంటివి చేయవచ్చు.కలిగే ప్రయోజనాలునడుము నొప్పి, కాళ్ల వాపులు, మలబద్ధకం తగ్గుతాయి.రక్తప్రసరణ మెరుగవుతుంది.రాత్రి పూట మంచి నిద్ర పడుతుంది.ప్రసవ సమయంలో అవసరమయ్యే శారీరక దృఢత్వం (స్టామినా) లభిస్తుంది.గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహం (జెస్టేషనల్ డయాబెటిస్), బీపీ వంటి సమస్యల ముప్పు తగ్గుతుంది. ఎలాంటివి వద్దు..వెల్లకిలా పడుకుని చేసేవి వద్దు: చివరి నెలల్లో వెల్లకిలా పడుకుని వ్యాయామాలు చేయడం వల్ల గర్భాశయ బరువు ముఖ్యమైన రక్తనాళాలపై పడి, శిశువుకు రక్తప్రసరణ తగ్గే ప్రమాదం ఉంది.బ్యాలెన్స్ తప్పేవి వద్దు: ఈ సమయంలో పొట్ట బరువు పెరగడం వల్ల శరీరం బ్యాలెన్స్ కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పడిపోయే ప్రమాదం ఉన్నవర్కౌట్ల జోలికి వెళ్లొద్దని సూచిస్తున్నారు.దీంతోపాటు ఊపిరి సలపనంత వేగవంతంగా వ్యాయామాలు చేయొద్దని చెబుతున్నారు. అలాగే తగినంత నీరు తాగుతూ ఉండాలని చెబుతున్నారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యలు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.ఇదీ చదవండి: అమ్మాయిలూ.. మిమ్మల్ని మీరు రక్షించుకోవడం నేర్చుకోండి..!ఖుష్బూ పటానీ సందేశం..) -
హెల్త్‌కేర్.. ‘షేర్’ ఎవరిది?
హెల్త్‌కేర్... ఈ మాట వినగానే గుర్తుకొచ్చేది ఆసుపత్రులు... ఫార్మా కంపెనీలే. మరి డయాగ్నస్టిక్స్... వైద్య పరికరాలు... హెల్త్‌టెక్.. ఆరోగ్య బీమా... టెలీ టూరిజం.. టెలీ మెడిసిన్ వీటి సంగతేంటి? వీటి చుట్టూ అల్లుకున్న వందలాది అనుబంధ రంగాల మాటేంటి? గత ఏడాది ఏకంగా 600 బిలియన్ డాలర్లను దాటేయటంతో పాటు ఏటా 22.5 శాతం చొప్పున కాంపౌండెడ్ వృద్ధిని నమోదు చేస్తోందంటే భారత హెల్త్‌కేర్ రంగం ఎంత పెద్దదో తేలిగ్గానే అర్థంచేసుకోవచ్చు. పైపెచ్చు 2023లో దేశ జీడీపీలో 3.3 శాతంగా ఉన్న హె ల్త్‌కేర్ ఖర్చు 2030 నాటికి 5 శాతాన్ని మించిపోతాయనేది ఆర్థిక సంస్థల అంచనా. ఈ నేపథ్యంలో హెల్త్‌కేర్ రంగంలో ఎక్కువ వృద్ధిని నమోదు చేసే పరిశ్రమలేంటి? ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? భవిష్యత్ లీడర్లెవరు? ఏ కంపెనీల పరిస్థితి ఎలా ఉంది? ఎక్కడ ఎక్కువ రాబడులొస్తాయి? దీనిపై ‘సాక్షి వెల్త్’ అందిస్తున్న ప్రత్యేక కథనాల్లో మొదటి కథనమిది. దశాబ్దాలుగా దేశంలో హెల్త్‌కేర్ అంటే ఫార్మా సంస్థలే. హెల్త్‌కేర్ వృద్ధిపై ఇన్వెస్టర్లు ఏం మాట్లాడినా మందుల తయారీ కంపెనీలు... జనరిక్ మందులు... ఏపీఐల గురించే. కానీ పరిస్థితి మారింది. మన హెల్త్‌కేర్ ఎకానమీలో ఇపుడు ఆసుపత్రులు, ఆరోగ్య బీమా, డయాగ్నస్టిక్స్, మెడికల్ డివైజ్‌లు, స్పెషాలిటీ కేర్, హెల్త్‌టెక్, మెడికల్ టూరిజం, హోమ్ హెల్త్‌కేర్ కంపెనీలు కూడా చేరాయి. సమగ్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఆవిష్కృతమయ్యింది. ఇది అంతకంతకూ పెరుగుతోంది. మరి జనం ఖర్చులు పెరగటం వల్లే ఇదంతా సాధ్యమయ్యిందా? కానే కాదు. జనం ఆయుష్షు పెరిగింది. జీవనశైలి మారింది. ఆరోగ్యాన్ని రక్షించుకునే ప్రివెంటివ్ కేర్‌పై శ్రద్ధ... బీమా కవరేజీ పెరిగాయి. స్పెషాలిటీ వైద్య సేవల కోసం ప్రభుత్వ ఆసుపత్రుల బదులు చాలామంది వ్యవస్థీకృత ప్రయివేటు ఆసుపత్రులకు మళ్లారు. ఆసుపత్రుల పడకలు పెరిగాయి. వైద్యపరీక్షల్లో ఆధునికత పెరిగింది. వైద్య పరికరాలకు ప్రాధాన్యం పెరిగింది. ఈ హెల్త్‌కేర్ ప్రతిదశలోకీ డిజిటల్ టెక్నాలజీ చొచ్చుకుపోయింది. వీటన్నిటి ఫలితమే సమగ్ర హెల్త్‌కేర్ ఎకానమీ. హెల్త్ డెలివరీ @ రూ.10 లక్షల కోట్లు! హెల్త్‌కేర్ పరిశ్రమపై తాజాగా సెబీ నిర్వహించిన సమావేశంలో 2025లో హెల్త్‌కేర్ డెలివరీ పరిశ్రమ రూ.7 లక్షల కోట్ల రెవెన్యూను నమోదు చేసినట్లు అంచనా వేశారు. ఇది 2028 ఆర్థిక సంవత్సరానికల్లా 10–12 శాతం వార్షిక వృద్ధితో 9.8 లక్షల కోట్లను చేరుతుందని పేర్కొన్నారు. అదే సమావేశంలో... మెడికల్ డివైజెస్, డయాగ్నస్టిక్స్ మార్కెట్లు గత ఏడాది రూ.లక్ష కోట్ల ఆదాయాన్ని చూశాయని, ఇవి 11–12 శాతం వృద్ధిని నమోదు చేస్తున్నాయని అంచనా వేశారు. ఇక ఫార్మా, హెల్త్ ఇన్సూరెన్స్, మెడికల్ ఎక్విప్మెంట్, సర్జికల్స్, హెల్త్‌టెక్, స్పెషాలిటీ కేర్, రిహాబిలిటేషన్, హోమ్ హెల్త్‌కేర్, మెడికల్ టూరిజంలను కూడా కలిపితే ఎకానమీ ఎంత పెద్దదో తెలుస్తుంది. కాబట్టి ఇన్వెస్టర్లకు ఏదో ఒక రంగంలో కాకుండా మొత్తం వ్యవస్థలో అవకాశాలు ఎక్కువన్నది అర్థమవుతుంది. మందులొక్కటే కాదు... మొత్తం వ్యవస్థపై ఖర్చు మనం ఎక్కువగా ఏ మందులు వాడుతున్నామన్నది గతంలో ఇన్వెస్టర్లు చూసిన కోణం. కానీ ఇపుడు... దేనిపై ఖర్చు చేస్తున్నారన్నదే ముఖ్యం. ఆరోగ్య బీమాతో మొదలుపెడితే... ఒక పేషెంట్ తన వ్యాధి నుంచి బయటపడేందుకు ఆసుపత్రి... డయాగ్నస్టిక్ సెంటర్... సీటీ/ఎంఆర్ఐ/పెట్ స్కాన్... మెడికల్ డివైజ్... సర్జికల్ ఇంప్లాంట్.. కన్సూమబుల్స్... ఫార్మసీ... ఫాలో అప్ పరీక్షలు.. హోమ్ హెల్త్‌కేర్... డిజిటల్ పర్యవేక్షణ .. వీటన్నింటిపై ఖర్చుచేస్తాడు. ఆ పేషెంట్ నుంచి వీటన్నిటికీ ఆదాయం వస్తుంది. కాబట్టి ఇన్వెస్టర్లు ఈ మొత్తం వ్యవస్థను చూడాల్సి ఉంటుంది. హెల్త్‌కేర్ ఎందుకు పెరుగుతోందంటే...ఆరోగ్యంపై పెరుగుతున్న శ్రద్ధ అనారోగ్యం బారిన పడకుండా ప్రివెంటివ్ పరీక్షలు, స్పెషలిస్ట్ కన్సల్టేషన్లు, డయాగ్నస్టిక్ సేవలు, ప్రివెంటివ్ మెడిసిన్ తీసుకోవటంపై మన వాళ్లలో బాగా శ్రద్ధ పెరుగుతోంది. తాజా ఎన్ఎస్ఓ హెల్త్ సర్వేలో... 2017–18తో పోలిస్తే త మకు వ్యాధులున్నాయని చెప్పినవారి సంఖ్య 2025లో బాగా పెరిగింది. అదేసమయంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్య సదుపాయాలను వినియోగించుకున్నవారి సంఖ్య బాగా పెరిగింది. దీనర్థం హెల్త్‌కేర్ మార్కెట్ పెరుగుతోందనే. జీవనశైలి వ్యాధులు దేశంలో డయాబెటిస్, గుండె సంబంధ వ్యాధులు, కేన్సర్, కిడ్నీ వ్యాధులు, ఊబకాయం, హైపర్‌టెన్షన్ వంటి వ్యాధులు పెరుగుతున్నాయి. వీటికి సాధారణంగా ఒకసారి వైద్యం చేస్తే సరిపోదు. ఏళ్ల తరబడి... దశాబ్దాల తరబడి హెల్త్‌కేర్ వినియోగం అవసరం. ఉదాహరణకు మధుమేహంతో ఉన్న వ్యక్తి తరచూ డాక్టర్ని కలవాలి. రక్త పరీక్షలు చేయించాలి. రెగ్యులర్‌గా మందులు తీసుకోవాలి. అవసరమైతే ఆసుపత్రిలో చేరాలి. దీర్ఘకాలం పర్యవే„ý ణ అవసరమైన వ్యాధి ఇది. అందుకే ఇలాంటి వ్యాధులు పెరుగుతున్నకొద్దీ హెల్త్‌కేర్ డిమాండూ పెరుగుతుంది. పెరిగిన ఆయుఃప్రమాణం హెల్త్‌కేర్ ఎకానమీతో జనం ఆయుఃప్రమాణం పెరిగింది. ఆసుపత్రులు, చికిత్సల కోసం యువత ఎక్కువ ఖర్చు చేయకున్నా వయసు మళ్లినవారికి తప్పటం లేదు. గుండె, కేన్సర్, కీళ్లు, కళ్లు, కిడ్నీ, రిహాబిలిటేషన్, దీర్ఘకాల మందులు, హోమ్ హెల్త్‌కేర్, సహాయకులపై వీరు ఎక్కువ ఖర్చుచేస్తున్నారు. దీనివల్ల సంప్రదాయ ఆసుపత్రులను దాటి అవకాశాలు పెరుగుతున్నాయి. మున్ముందు హెల్త్‌కేర్ అనేది పేషెంట్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కావటంతోనే ఆగిపోదు. హోమ్‌కేర్, వృద్ధుల సంరక్షణ, రిమోట్ పర్యవేక్షణ పెరుగుతాయి. ఈ రంగంలో భవిష్యత్తు ఇన్వెస్ట్మెంట్ అవకాశాలను గుర్తించవచ్చు కూడా. బీమా.. సమగ్ర మార్పు ఆసుపత్రి బిల్లు కోసం అప్పులపాలై జీవితాంతం ఇబ్బందులు పడ్డ దృష్టాంతాలు ఇప్పటికీ ఉన్నా... గతంకన్నా తగ్గాయి. కారణం... బీమాపై అవగాహన పెరగటం. ఇపుడు హెల్త్‌కేర్‌పై చేస్తున్న ఖర్చులు అత్యధికం బీమా కంపెనీల నుంచో, ప్రభుత్వ స్కీముల నుంచో చేస్తున్నవే తప్ప వ్యక్తుల నుంచి కాదు. అందుకే 2013–14లో 1.3 లక్షల కోట్లుగా ఉన్న ప్రభుత్వ ఖర్చు 2022–23 నాటికి 3.85 లక్షల కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో మొత్తం ఆరోగ్య రంగంపై పెడుతున్న ఖర్చులో ప్రభుత్వ వాటా 28 శాతం నుంచి 43.7 శాతానికి పెరగ్గా... వ్యక్తులు సొంతంగా చేస్తున్న ఖర్చు 64 శాతం నుంచి 43.4 శాతానికి పడిపోయింది. ఆర్థికంగా ఇది అత్యంత ప్రాధాన్యమున్న పరిణామం. ఎందుకంటే ప్రభుత్వ లేదా బీమా కవరేజీ ఉన్న సందర్భాల్లో జనం చికిత్స విషయంలో పెద్దగా వెనకాడరు. త్వరగా నిర్ణయం తీసుకుంటారు. దీనివల్ల మొత్తం ఆరోగ్య ఎకానమీపై పెట్టే ఖర్చు పెరుగుతుంది. విస్తరణ అవకాశాలెక్కువే... జాతీయ హెల్త్ పాలసీ ప్రకారం ప్రతి వెయ్యి మందికి రెండు ఆసుపత్రి పడకలుండాలి. కానీ ఇపుడున్నది 1.4 మాత్రమే. అందులో ప్రభుత్వానిది 0.6. ఈ గ్యాప్‌తో విస్తరణకు ఎంత అవకాశముందో అర్థమవుతుండగా ప్రయివేటు రంగం దీన్ని అందుకోవటానికి వేగంగా అడుగులేస్తోంది. వచ్చే నాలుగేళ్లలో 18 ప్రముఖ ఆసుపత్రులో మరో 34వేల పడకలు జత చేయనున్నాయనేది తాజా ‘ఇక్రా’ అ«ంచనా. కాకపోతే ఇలా పడకలు పెరుగుతున్న కొద్దీ... ఆరోగ్య రంగంపై పెట్టే ఖర్చు కూడా మరింత పెరుగుతుంది. వీటివల్ల ప్రధానం ఆసుపత్రి భవనం.. మెడికల్, ఐసీయూ, డయాగ్నస్టిక్ పరికరాలు, సర్జికల్ ఉత్పత్తులు, డాక్టర్లు, నర్సులు, ఫార్మసీ, బీమా, హెల్త్‌కేర్ ఐటీ... ఇలా అన్నీ పెరుగుతాయి. అందుకే ఆసుపత్రి ఆదాయం ఒక్కటే కాకుండా ఆసుపత్రి విస్తరణ వల్ల మొత్తం హెల్త్‌కేర్ ఎకానమీపై ప్రభావం ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఆరోగ్య రంగ దిగ్గజాలను ఇలా చూడొచ్చు...ఆసుపత్రులు 2026 హెల్త్‌కేర్ రివ్యూ ప్రకారం ఆసుపత్రుల రెవెన్యూ 15 శాతం వృద్ధి చెందుతోంది. బెడ్ ఆక్యుపెన్సీ 60–75 శాతం వరకూ ఉంది. → అపోలో హాస్పిటల్స్ → మ్యాక్స్ హెల్త్‌కేర్ → ఫోరి్టస్ హెల్త్‌కేర్ → ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్ → మెదాంతా/ గ్లోబల్ హెల్త్ → నారాయణ హృదయాలయ → కిమ్స్ → రెయిన్బో చిల్డ్రన్స్ → యథార్థ్ హాస్పిటల్స్ డయాగ్నస్టిక్స్ కన్సాలిడేషన్, విస్తరణ, హోమ్ కలెక్షన్, డిజిటల్ బుకింగ్, ప్రత్యేక పరీక్షలతో వ్యవస్థీకృత డయాగ్నస్టిక్ కంపెనీలు వేగంగా విస్తరిస్తున్నాయి. 2026 ఆర్థిక సంవత్సరంలో ఇవి 15 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 25 శాతానికిపైగా ఎబిటా మార్జిన్లను సాధించాయి. → డాక్టర్ లాల్ పాత్‌ల్యాబ్స్ → మెట్రోపోలిస్ హెల్త్‌కేర్ → విజయ డయాగ్నస్టిక్స్ → థైరోకేర్ → క్రిస్నా డయాగ్నస్టిక్స్ → సురక్షా డయాగ్నస్టిక్స్ మెడికల్ డివైజెస్, సర్జికల్ ప్రొడక్ట్స్ ఈ రంగంలో చాలా కంపెనీలు ఇప్పటికీ అన్‌లిస్టెడ్‌గానే ఉన్నాయి. కాబట్టి ఇందులో లిస్టయ్యే కంపెనీలను ఇన్వెస్టర్లు జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. → పాలీ మెడిక్యూర్ → ప్రివెస్ట్ డెంట్ప్రో → న్యురెకా → జీకేబీ ఆప్తాల్మిక్స్ → శ్రీ పేస్ట్రానిక్స్ → హేమంత్ సర్జి్కల్ ఆరోగ్య బీమా హెల్త్‌కేర్‌కు ఫైనాన్సింగ్ ఇంజిన్‌గా పనిచేస్తున్న ఈ రంగం... ప్రివెంటివ్ కేర్‌పై పెరుగుతున్న అవగాహన కారణంగా వేగంగా వృద్ధి చెందుతోంది. ఇందులో స్టాండలోన్ కంపెనీలు తక్కువే. → స్టార్ హెల్త్ → నివా బూపా → ఐసీఐసీఐ లాంబార్డ్ (డైవర్సిఫైడ్) సీఆర్ఓ/ సీడీఎంఓ భారత ఫార్మా ఎగుమతులిపుడు జనరిక్ మందులకే పరిమితం కాదు. డ్రగ్ డిస్కవరీ, క్లినికల్ రీసెర్చ్, కాంట్రాక్ట్ డెవలప్మెంట్, తయారీ, స్పెషాలిటీ కెమిస్ట్రీ, బయాలాజిక్స్ వంటి రంగాల్లో అంతర్జాతీయ కంపెనీలు భారత సంస్థలపై ఆధారపడుతున్నాయి. దీంతో సీఆర్ఓ/సీడీఎంఓ అవకాశాలు పెరుగుతున్నాయి. → సింజీన్ ఇంటర్నేషనల్ → అరాజెన్ లైఫ్‌సైన్సెస్ → సాయి లైఫ్ సైన్సెస్ → ఆంథెమ్ బయోసైన్సెస్ → న్యూలాండ్ ల్యా»ొరేటరీస్ → గ్లాండ్ ఫార్మా → పిరమల్ ఫార్మా → లారస్ ల్యాబ్స్ → దివీస్ ల్యాబొరేటరీస్ హెల్త్‌టెక్, డిజిటల్ హెల్త్ పేషెంట్ రికార్డులు, డయాగ్నస్టిక్ చిత్రాలు, ల్యాబ్ రిపోర్ట్లు, బిల్లింగ్, బీమా క్లెయిమ్‌లు, ప్రిస్క్రిప్షన్లు... ఇలా అన్నింటికీ డిజిటల్ సేవలు అవసరమే. → టాటా ఎలక్సీ → పెర్సిస్టెంట్ సిస్టమ్స్ → కొఫోర్జ్ → ఇన్ఫోసిస్ → టీసీఎస్ → విప్రో → ఎంఫసిస్ ఇంకా హోమ్ హెల్త్‌కేర్, వృద్ధుల సంరక్షణ, మెడికల్ టూరిజం వంటి రంగాల్లో విస్తృతమైన అవకాశాలున్నా వీటిలో లిస్టెడ్ కంపెనీలు ప్రత్యేకంగా ఏమీ లేవు. చాలా ఆసుపత్రులు ఈ సేవల్ని అందిస్తుండగా... కొన్ని స్టార్టప్‌లు సైతం వేగంగా ఎదుగుతున్నాయి. కాబట్టి ఈ రంగాల్లో అవకాశాలను, మార్పులను ఇన్వెస్టర్లు గమనిస్తూ ఉండాలి.తదుపరి భాగంలో... ఆసుపత్రుల కేరాఫ్ ఎవరిది? అపోలో.. మాక్స్.. ఫోర్టిస్.. ఆస్టర్.. మెదాంతా.. నారాయణ.. కిమ్స్.. రెయిన్బో.. యథార్థ్ ఇవన్నీ అగ్రశ్రేణి ఆసుపత్రులే. మరి వీరిలో బాగా లబ్ధి పొందేదెవరు? ఎవరి ఆర్థిక పనితీరు అద్భుతంగా ఉండబోతోంది? తదుపరి 50వేల పడకల్లో ఎవరి వాటా ఎంత? ఇన్వెస్టర్లు చూడాల్సిందేంటి?.. వచ్చేవారం ‘సాక్షి వెల్త్’లో తెలుసుకుందాం. రమణమూర్తి మంథా -
118 కేజీల నుంచి 84 కేజీలకు! జస్ట్ ఆరు నెల్లలోనే..
ఎన్నో వెయిట్‌లాస్ జర్నీలు చూశాం. కొందరు బరువుతగ్గే సర్జరీలు చేయించుకుని మరి ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరించారు. మరికొందరు కేవలం డైట్ , వర్కౌట్లతో స్లిమ్‌గా మారారు. కానీ ఇతడి కథే వేరు. భారీకాయంతో వివిధ అనారోగాల బారినపడి ఇబ్బందిపడుతున్నప్పటికీ సర్జరీల జోలికి పోలేదు. పైగా తను బరువు ఎలా తగ్గితే మంచిదో.. లైఫ్‌స్టైల్ ట్రైనర్లను సంప్రదించి మరి ఆరోగ్యదాయకమైన విధానంలోనే అంత బరువుని తగ్గించుకున్నాడు. అది కూడా ఆరు నెల్లలోనే స్లిమ్‌గా మారి చూపించడం విశేషం. మరి అతను అనుసరించి వెయిట్‌లాస్ టెక్నిక్ ఏంటంటే..38 ఏళ్ల వయసులో రాజేష్ అనే వ్యక్తి 118 కేజీల బరువుతో మధుమేహం, ఫ్యాటీలివర్, అధిక కొలెస్ట్రాల్, నీరసం, తీవ్రమైన స్లీప్ అప్నియా వంటి సమస్యలతో బాధపడ్డాడు. అప్పటికే డైట్, వర్కౌట్లతో నిలకడగా చేయడానికి స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు. చివరికి క్రమం తప్పకుండా చేసే స్టేజ్‌కి చేరుకున్నాక..బరువు తగ్గడానికి కాస్తా విభిన్నమైన పద్ధతిని అనురించాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం లైఫ్‌స్టైల్ కోచ్ ల్యూక్ కౌటిన్హోని సంప్రదించాడు. అయితే అతడి వైద్యులు మందుగా ఆప్నియా కోసం, బరువు కోసం సర్జరీ చేయడం గురించి మాట్లాడారు. అవి రెండు అతని అంతగా సరిపడవని తేలింది. దాంతో రాజేష్ సరైన జీవనశైలి వ్యూహంతో బరువు తగ్గాలని డిసైడ్ అయ్యాడు. అలాగని కఠినమై ఆహార నియమం, తీవ్రమైన వర్కౌట్ల జోలికి పోలేదు. ఎలాంటి జీవనశైలిని అనుసరించాడంటే..జీవక్రియ ఆరోగ్యం, ఇన్సులిన్ నియంత్రణకు సంబంధించినవిపోషకాలతో కూడిన ఆహారం, అదికూడా పరిమిత మేర,సంతృప్తిని కలిగించేలాతన సామర్థ్యానికి అనుగుణంగా సాగే కదలికకాలేయ ఆరోగ్యంకి అనుగుణమైన పోషకాహారాలుచిన్నగా బరువు తగ్గిన సెలబ్రేట్ చేసుకోవడం..నిలకడగా అనుసరించడంఇలా ఒక నెల పాటు పాటించిన తర్వాత నిద్ర మెరుగుపడింది. ఆ తర్వాత శక్తి, ఏకాగ్రత, మానసిక స్థితి, మంచి ఆహారం తీసుకోవడం, శారీరక శ్రమ అన్నీ మెరుగుపడ్డాయి. అలాగే ఏదో డైట్ పాటిస్తున్న భావన లేకుండా దాన్ని ఎంజాయ్ చేస్తూ తీసుకోవడం నేర్చుకున్నాడు. అలాగే వర్కౌట్లను కూడా పెంచుకుంటూ ఆరోగ్యంగానూ ఆత్మవిశ్వాసంగానూ ఉండటం ప్రారంభించాడు. అంతేగాదు చాలామంది బరువు తగ్గడం కోసం ఉపక్రమించి మళ్లీ బ్రేక్ చేస్తుంటారు. అందుకే తాను అలా చేయకుండా ఉండాలనే కీలకమైన వాటిపై దృష్టిసారించి భారంగా కాకుండా ఇష్టంగా చేసేలా అలవాటు చేసుకుని బరువు తగ్గినట్లు వివరించారు రాజేష్. View this post on Instagram A post shared by Luke Coutinho - Official (@luke_coutinho)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యలు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.ఇదీ చదవండి: 116 కేజీల నుంచి 60 కేజీలకు..! జస్ట్ రెండేళ్ల వ్యవధిలోనే..) -
కుక్కకాటుకు తగిన చెప్పుదెబ్బ
రేబీస్... నేటికీ నిర్దిష్టమైన చికిత్స విధానం లేని అత్యంత ప్రాణాంతకమైన జూనోటిక్ వ్యాధి. (జంతువుల నుంచి మనుషులకు, అలాగే మనుషుల నుండి జంతువులకు సంక్రమించే వ్యాధులను జూనోటిక్స్ అంటారు). లూయీ పాశ్చర్ 1885లో తొలిసారిగా రేబీస్ నిరోధక టీకాను అభివృద్ధి చేశారు.ఆయన అందించిన ఈ ఆవిష్కరణే నేటికీ మానవాళికి రేబీస్ బారినుంచి రక్షణ కల్పించే ఏకైక ఆయుధంగా ఉపయోగపడుతోంది. లూయీ పాశ్చర్ వర్ధంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 28న ‘ప్రపంచ రేబీస్ దినోత్సవం’ నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం ‘కలిసికట్టుగా... మరింత బలంగా’ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా దాదాపు 59 వేల మంది రేబీస్‌తో మరణి స్తున్నారు. ఇందులో 95 శాతానికి పైగా మరణాలు ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోనే సంభవిస్తున్నాయి. భారత దేశంలో ఏటా సుమారు 5,700 మంది మరణిస్తున్నారని జాతీయ అధ్యయ నాలు స్పష్టం చేస్తున్నాయి. బాధితుల్లో ఎక్కువ శాతం 15 ఏళ్లలోపు పిల్లలే ఉండటం విచారకరం. ఈ నేపథ్యంలో 2030 నాటికి కుక్కల కాటు వల్ల సంభ వించే రేబీస్ మరణాలను పూర్తిగా నిర్మూలించాలనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ జంతు ఆరోగ్య సంస్థలు నిర్దేశించుకున్న ‘జీరో బై 30’ ప్రధాన లక్ష్యం.ఏడాది తర్వాతా బయటపడొచ్చు!రేబీస్ అనేది ‘లైసావైరస్’ అనే వైరస్ ద్వారా వ్యాప్తి చెంది కేంద్ర నాడీ వ్యవస్థపై దాడి చేసే తీవ్రమైన వ్యాధి. మానవుల్లో నమోదయ్యే రేబీస్ కేసుల్లో దాదాపు 99 శాతం కుక కాటు ద్వారానే వస్తున్నాయి. వ్యాధిగ్రస్థ కుక్కలతో పాటు పిల్లులు, నక్కలు, తోడేళ్లు, గబ్బిలాలు వంటి జంతువుల లాలాజలం ద్వారా కూడా ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది.రేబీస్ సంక్రమించినప్పుడు జంతువు విపరీతమైన కోపంతో కనిపిస్తుంది. కనపడిన ప్రతి వస్తువును చివరికి చెక్కముక్కలు, రాళ్లను కూడా కొరుకుతుంది. నోటి నుంచి విపరీతంగా లాలాజలం (సొల్లు) కారుస్తుంది. మొరిగే స్వరం మారుతుంది. తన యజమానిని కూడా గుర్తించ లేని స్థితిలో దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. కొన్ని సంద ర్భాలలో వ్యాధిగ్రస్థ కుక్క లేదా జంతువు నిశ్శబ్దంగా ఉండి, అంటు డొక్కలు పడి, వెలుతురును కూడా చూడలేని స్థితిలో ఆహారం, నీరు తీసుకోకుండా ఏదైనా ఒక చీకటి లేదా మరుగు ప్రదేశంలో ఉండి దాదాపు వారంలో చనిపోతుంది. దీనినే ‘డంబ్ రేబీస్’ అంటారు.అలాగే మనుషులు పిచ్చికుక్క కాటుకు గురైన తర్వాత 2–3 నెలల నుండి ఏడాది లోపు ఎప్పుడైనా రేబీస్ లక్షణాలు కనపడవచ్చు. కొన్ని అరుదైన సందర్భాల్లో సంవత్సరం తర్వాత కూడా ఈ వ్యాధి సంక్ర మిస్తుంది. మనుషులు వ్యాధిగ్రస్థులు అయినపుడు కుక్క కాటు పడిన చోట దురద, మంట, జ్వరం మొదలవుతాయి. వ్యాధి ముదిరిన తర్వాత నీటిని చూస్తే గొంతు కండరాలు బిగుసుకుపోయి భయ పడటం (హైడ్రోఫోబియా), గాలి తగిలినా వణికిపోవడం (ఏరో ఫోబియా), తీవ్రమైన ఆందోళన వంటి నాడీ సంబంధిత సమస్యలు కనిపిస్తాయి. మనిషి గొంతుక మారిపోయి కుక్క వలె అరుస్తూ దాడి చేసేందుకు ప్రయత్నిస్తారు. చివరకు కోమాలోకి వెళ్ళి మరణిస్తారు.నీటుగా కడగటం అతిముఖ్యంజంతువు కరిచిన వెంటనే గాయాన్ని ధారాళమైన నీటిధార (రన్నింగ్ వాటర్) కింద సబ్బుతో కనీసం 10 నుండి 15 నిమిషాల పాటు రుద్ది కడగాలి. సబ్బులోని క్షారగుణం వైరస్ పైపొరను నాశనం చేసి, వైరస్ తీవ్రతను దాదాపు 70–80 శాతం అక్కడే తుడిచి పెట్టేస్తుంది. అలాగే గాయంపై కారం, పసుపు, సున్నం, కాఫీ పొడి, ఆకుల పసర్లు వంటివి ఉపయోగించి తమకు తోచిన నాటువైద్యం చేయకూడదు. గాయంపై గట్టిగా కట్టుకట్టడం గానీ, వైద్యుడి సలహా లేకుండా వెంటనే కుట్లు వేయడం గానీ చేయరాదు. ప్రథమ చికిత్స అనంతరం పోవిడోన్ అయోడిన్ వంటి యాంటీ సెప్టిక్ ద్రావణాన్ని పూసి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి వెళ్లి టీకాలు వేయించుకోవాలి.ఇంట్రామస్కులర్ పద్ధతిలో 0, 3, 7, 14, 28వ రోజుల్లో మొత్తం ఐదు డోసులు ఇస్తారు. అదే విధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందు బాటులో ఉన్న ఇంట్రాడెర్మల్ పద్ధతిలో 0, 3, 7, 28వ రోజుల్లో... మొత్తం నాలుగు మోతాదులుగా టీకాలు వేస్తారు. టీకాలు క్రమం తప్పకుండా వేయించుకోవడం ద్వారా మాత్రమే రేబీస్ నుండి రక్షణ పొందవచ్చు.దీని నిర్మూలన ఒక్క వైద్య, ఆరోగ్య శాఖతోనే సాధ్యం కాదు. పశు సంవర్ధక శాఖ, స్థానిక సంస్థలు, పెంపుడు జంతువుల యజమానులు, బ్లూ క్రాస్ తదితర జంతుసంక్షేమ సంస్థలు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలి. ఇళ్లలో పెంచు కునే కుక్కలు, పిల్లులకు వాటి యజమానులు మూడవ నెల వయసులోనే మొదటి మోతాదు రేబీస్ టీకా వేయించాలి. ఆ తర్వాత ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా బూస్టర్ డోస్ ఇప్పించి రికార్డు లను భద్రపరచాలి.వీధి కుక్కల నియంత్రణలో భాగంగా స్థానిక సంస్థలు గ్రామ, నగర స్థాయిలలో పెద్ద ఎత్తున ‘యానిమల్ బర్త్ కంట్రోల్’ (ఏబీసీ), సామూహిక రేబీస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలి. వీధి కుక్కలను రాయితో కొట్టడం, వాటి ఆహారాన్ని కదిలించడం లేదా నిద్రిస్తున్నప్పుడు వాటిని భయపెట్టడం చేయకూడ దని పిల్లలకు స్పష్టంగా చెప్పాలి. జంతువుల ఆరోగ్యం, మానవ ఆరోగ్యం పరస్పరం ముడిపడి ఉన్నాయనే ‘వన్ హెల్త్’ విధానమే రేబీస్ రహిత సమాజానికి ఏకైక పరిష్కారం.– కె. బాలబ్రహ్మం, వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్ (రిటైర్డ్), ఏపీ పశు సంవర్ధక శాఖ (రేపు ప్రపంచ రేబీస్ దినం) -
Health: ఏనుగమ్మో ఏనుగు!
మానవ శరీర చరిత్రలో మొదట ఈ ‘ఏనుగు’ను ప్రాచీన ఈజిప్టులో (కీ.పూ. 1479–1458) గుర్తించారు. ‘అటి’ అనే పేరు గల ఈజిప్జు రాణి కాలు ఏనుగు కాలుగా మారటాన్ని చూసి రాజ వైద్యులు దిమ్మెర పోయారు.ఆ తర్వాత క్రీ.పూ. 6వ శతాబ్దపు భారతదేశ ప్రసిద్ధ ఆయుర్వేద గ్రంథం ‘సుశ్రుత సంహిత’లో ఈ ఏనుగు కాలుతో పాటుగా ఏనుగు చేయి ప్రస్తావన కూడా ఉన్నట్లు వైద్య ప్రపంచం దృష్టికి వచ్చింది.అనంతరం గ్రీసులో, క్రీ.పూ. 5 వ శతాబ్దపు వైద్యుడు ‘హిపోక్రటీస్’ ఏనుగు కాళ్ల వ్యాధిపై తొలినాళ్ల పరిశోధనలు జరిపారు.17వ శతాబ్దంలో నాటికి అధునికులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో వీటిపై పరిశోధనలు విస్తృతంగా జరిగాయి.తాజాగా సింగపూర్ వైద్య పరిశోధకులు ఏనుగు కాలును లేదా ఏనుగు చేతులను తిరిగి మానవ కాళ్లుగా, చేతులుగా మార్చే నివారణోపాయాన్ని కనిపెట్టే దిశగా కొంత విజయం సాధించారు.సాధారణంగా, కాన్సర్ చికిత్స పొందిన రోగులను కూడా వేధించే ఆ ఏనుగు కాలు వాధ్యే... ‘లింఫడీమా’! చేతులు, కాళ్లలో కూడా తీవ్రమైన వాపును కలిగించే ఈ సమస్యకు ఇప్పటివరకు మందుగానీ, శాశ్వత నివారణ గానీ లేదు. అయితే ఆహార పదార్థాలలో వాడే ఒక చవకైన ప్రత్యామ్నాయం దీనికి పరిష్కారంగా కనిపిస్తున్న విషయాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. కణజాలాలలో పేరుకుపోయే కొలెస్ట్రాల్‌ను తొలగించడం ద్వారా ఈ లింఫడీమా వాపును తగ్గించవచ్చని వారి పరిశోధనలో తేలింది. ఈ కొత్త ఆవిష్కరణ బాధితుల జీవితాల్లో సరికొత్త ఆశలను చిగురింపజేస్తోంది.ఆపిల్ జ్యూస్, పెరుగు, రెడ్ వైన్లలో రుచిని పెంచడానికి వాడే ఫుడ్ ఆడిటివ్స్... లింఫడీమాను – అంటే చేతులు, కాళ్లలో వచ్చే తీవ్రమైన వాపును నయం చేసేందుకు ఉపయోగపడ తాయన్న ఈ పరిశోధ వివరాలు ‘నేచర్’ జర్నల్‌లో ప్రచురితం అయ్యాయి. ఆ వివరాల ప్రకారం, సైక్లోడెక్స్ట్రిన్స్ అని పిలిచే కాంపౌండ్లు (ఆడిటివ్ల రసాయన మూలకాలకు) లింఫడీమా వాపును తగ్గించగల గుణం ఉంది.జంతువులపై జరిపిన అధ్యయనాల ఆధారంగా తేలిన ఈ విషయాలు, ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధితో బాధపడుతున్న 14 కోట్ల నుంచి 25 కోట్ల మంది బాధితుల జీవితాలను మార్చే అవకాశం ఉంది. వీరిలో అధిక శాతం మందికి క్యాన్సర్ చికిత్స కారణంగానే ‘లింఫడీమా’ సమస్యలు వచ్చినట్లు పలు అధ్యయనాలను బట్టి తెలుస్తోంది. దుస్తులు ధరించటమూ కష్టమే!రొమ్ము క్యాన్సర్ చికిత్సలో భాగంగా లింఫ్ నోడ్స్ను తొలగించడానికి సర్జరీ చేసిన, లేదా రేడియోథెరపీ ఇచ్చిన... ప్రతి ఐదుగురిలో ఒకరికి చేతిలో లింఫడీమా వాపు వచ్చే అవకాశం ఉంది. లింఫ్ నోడ్స్ అనేవి శరీరం అంతటా ఉండే చిక్కుడు గింజ ఆకారపు నిర్మాణాలు. కణజాలాల నుండి వచ్చే వ్యర్థ ద్రవాన్ని (లింఫ్ ఫ్లూయిడ్) ఇవి వడకడతాయి. ఈ ద్రవం రక్తంలో కలవడానికి ముందే లింఫ్ నోడ్స్ దానిని శుభ్రపరుస్తాయి. రొమ్ము, తల లేదా మెడ భాగాల్లో క్యాన్సర్ కణాలు ఏర్పడినప్పుడు, అవి ఊపిరితిత్తుల వంటి ఇతర అవయవాలకు వ్యాపించే ముందు మొదట ఈ లింఫ్ నోడ్స్కే చేరుకుంటాయి.క్యాన్సర్ వ్యాపించకుండా ఉండటానికి ఈ లింఫ్ నోడ్స్ను సర్జరీ ద్వారా తొలగించడం లేదా రేడియోథెరపీ ఇవ్వడం వల్ల లింఫ్ వ్యవస్థ దెబ్బతిని మూసుకుపోతుంది. దీనివల్ల లింఫ్ ద్రవం పేరుకుపోయి తీవ్రమైన వాపు వస్తుంది. ఎంతలా అంటే... బట్టలు వేసుకోవడం లేదా బీరువాలోంచి సరిపోయే దుస్తులు వెతుక్కోవడం వంటి చిన్న చిన్న పనులు కూడా చాలా కష్టంగా మారతాయి.లింఫడీమా రోగుల జీవిత నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. అంతేకాదు, దీనికి ప్రస్తుతం ఉన్న చికిత్సా మార్గాలు చాలా పరిమితంగా ఉన్నాయి. వాటిలో కొన్ని:కంప్రెషన్ దుస్తులు: బాధితులు మొదట ఈ ప్రత్యేకమైన బిగుతు దుస్తులను వాడాల్సి ఉంటుంది. కానీ వీటిని ప్రతిరోజూ వేసుకోవడం వల్ల చర్మం దురద, ఇరిటేషన్ వచ్చి కదలడం కూడా కష్టమవుతుంది.మసాజ్: చేతులతో చేసుకునే ఈ మసాజ్‌తో మంచి ఫలితం ఉండాలంటే క్రమం తప్పకుండా చేస్తూనే ఉండాలి.సర్జరీ: దెబ్బతిన్న లింఫ్ నాళాలను సరిచేసే సర్జరీ అందుబాటులో ఉన్నప్పటికీ, దీనికి దాదాపు 12 నుండి 25 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది. అంతేకాకుండా సర్జరీ తర్వాత కూడా ఇతర చికిత్సలు అవసరమవుతాయి.లైపోసక్షన్: కిరణాలు లేదా శబ్ద తరంగాల ద్వారా కొవ్వును, ద్రవాన్ని కరిగించి బయటకు తీసే ఈ పద్ధతి కూడా అత్యంత ఖరీదైనది.చవకైన ప్రత్యామ్నాయంఈ క్రమంలోనే ఇప్పుడు నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ శాస్త్రవేత్తలు లింఫడీమాకు అతి తక్కువ ఖర్చుతో కూడిన ఆచరణాత్మక పరిష్కారాన్ని కనుగొన్నారు. కార్బోహైడ్రేట్స్ నుండి తయారయ్యే సెక్లోడెక్స్ట్రిన్ అనే పదార్థంపై దృష్టి పెట్టారు. ఆహార పదార్థాల్లోని అసహ్యకరమైన వాసనలను తమ కణాల నిర్మాణంలో బంధించే ప్రత్యేక గుణం సెక్లోడెక్స్ట్రిన్కు ఉంది. అందుకే ఆహార, పానీయాల పరిశ్రమలలో రుచిని, వాసనను పెంచడానికి దీనిని ఏళ్లుగా ఉపయోగిస్తున్నారు.లింఫడీమా చరిత్రలింఫడీమా (కాళ్లూ చేతుల వాపు) ఆనవాళ్లు చరిత్రలో వేల సంవత్సరాల క్రితమే కనిపించాయి. శోషరస (లింఫాటిక్) వ్యవస్థ గురించి వైద్యులకు పూర్తిగా తెలియకముందే ఈ వ్యాధి ఆనవాళ్లను గుర్తించారు.పురాతన చిత్రాలు (క్రీ.పూ. 1500 ప్రాంతం)ఈ వ్యాధికి సంబంధించిన తొలి ఆధారాలు ఈజిప్టులోని రాతి చెక్కడాల్లో కనిపించాయి. పుంట్ దేశపు రాణి ‘అటి’ (రాణిగారి పేరు అటి) కాళ్లు విపరీతంగా వాచిపోవడం ఈ చెక్కడాల్లో చూడవచ్చు.పురాతన వైద్య గ్రంథాలు (క్రీ.పూ. 6వ – 5వ శతాబ్దం)భారతదేశం (సుశ్రుత సంహిత): సుశ్రుతుడు ఈ వ్యాధిని ‘శ్లీపద’ (ఏనుగు కాలు) అని పిలిచాడు. శరీరంలోని ద్రవాల అసమతుల్యత వల్లే ఈ వాపు వస్తుందని వివరించాడు. హిపోక్రటీస్ ఈ వాపును ‘ఎలిఫెంటియాసిస్’ అని వర్ణించాడు. కాళ్లలోని గ్రంథులు, నరాల గురించి కూడా రాశాడు.రోమన్, పర్షియన్ వైద్యం (క్రీ.శ. 2వ – 9వ శతాబ్దం)ప్రసిద్ధ వైద్యుడు గాలెన్ (రోమ్): వాపులున్న కాళ్లకు ప్రత్యేకమైన మసాజ్, వ్యాయామాలు అవసరమని చెప్పాడు. పర్షియన్ వైద్యులు ఈ సమస్యను ‘దా అల్–ఫిల్’ (ఏనుగు వ్యాధి) అని పిలిచారు.ఆధునిక వైద్య పరిశోధన (17వ శతాబ్దం)శరీరంలో లింఫ్ ద్రవం ప్రవహించే నరాలు మూసుకుపోవడం వల్లే ఈ నీటి వాపు వస్తుందని 17వ శతాబ్దంలో శాస్త్రవేత్తలు కనిపెట్టారు.శోషరస వ్యవస్థ అంటే?మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి, శరీర ద్రవాల సమతుల్యతను కాపాడటానికి పనిచేసే ఒక ముఖ్యమైన వ్యవస్థ. ఇది రక్త ప్రసరణ వ్యవస్థతో కలిసి పనిచేస్తుంది.ప్రధాన భాగాలుశోషరస ద్రవం: రక్తనాళాల నుండి కణజాలాల్లోకి కారిపోయే ప్రొటీన్లు, నీరు, తెల్ల రక్తకణాలతో కూడిన స్వచ్ఛమైన నీటి వంటి ద్రవం.శోషరస నాళాలు: శరీరం అంతటా విస్తరించి, శోషరస ద్రవాన్ని సేకరించి తిరిగి రక్తంలోకి చేర్చే సన్నని నాళాలు.శోషరస కణుపులు: గొంతు, బాహుమూలాలు, గజ్జల్లో ఉండే చిన్న గింజ వంటి నిర్మాణాలు. ఇవి ద్రవాన్ని వడపోసి హానికరమైన బాక్టీరియా, వైరస్‌లను నిర్మూలిస్తాయి.ముఖ్య అవయవాలు: ప్లీహం, థైమస్ గ్రంథి, టాన్సిల్స్ కూడా ఈ వ్యవస్థలో భాగమే. థైమస్ గ్రంథి మానవ రోగ నిరోధక వ్యవస్థలో అంతి కీలకమైన భాగం. ఇది గుండె, రొమ్ము ఎముక మధ్యలో, ఛాతీ ఎగువ భాగంలో ఉంటుంది.ముఖ్యమైన విధులుశరీర ద్రవాల సమతుల్యత: కణజాలాల్లో అదనంగా ఉన్న నీటిని, ద్రవాలను తొలగించి వాపులు రాకుండా చూస్తుంది.రోగనిరోధక శక్తి: ల్యూకోసైట్స్ (తెల్ల రక్తకణాలు) ద్వారా ఇన్ఫెక్షన్లు, వ్యాధులపై పోరాడుతుంది.కొవ్వుల శోషణం: జీర్ణవ్యవస్థ నుండి కొవ్వులను అనుమతించి రక్తంలోకి చేర్చుతుంది.శోషరస వ్యవస్థలోని నాళాలు దెబ్బతిన్నా లేదా మూసుకుపోయినా, ద్రవం ఒకే చోట నిలిచిపోయి కాళ్లు లేదా చేతులు విపరీతంగా వాచిపోతాయి. ఈ పరిస్థితినే లింఫడీమా అంటారు.సెక్లోడెక్స్ట్రిన్ ఎలా పని చేస్తుంది?చీజ్, బట్టర్ వంటి పాల ఉత్పత్తుల నుండి కొలెస్ట్రాల్‌ను తీసివేసి ‘లో–ఫ్యాట్’గా మార్చడానికి సెక్లోడెక్స్ట్రిన్ను విరివిగా వాడుతారు. ఇది కొలెస్ట్రాల్ స్ఫటికాలను తన గుల్లగా ఉండే నిర్మాణం లోపల బంధించి, నీటి ద్వారా బయటకు పంపివేస్తుంది.రొమ్ము క్యాన్సర్ చికిత్స పొందుతూ లింఫడీమా వచ్చిన మహిళల చర్మ కణజాలాలను శాస్త్రవేత్తలు పరిశీలించినప్పుడు లింఫ్ ప్రవాహం తగ్గడం వల్ల చుట్టూ ఉన్న కణజాలంలో అధిక పరిమాణంలో కొలెస్ట్రాల్ చేరుకోవటాన్ని గమనించారు. సాధారణంగా లింఫ్ నాళాలు కణజాలాల నుండి కొలెస్ట్రాల్‌ను తిరిగి రక్తంలోకి తీసుకెళ్తాయి. కానీ కణజాలంలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్లే లింఫడీమా వస్తుందని వారి పరిశీలనలో తేలింది. ఈ కొలెస్ట్రాల్ వల్ల వాపు, మచ్చలు ఏర్పడి లింఫ్ ప్రవాహానికి అడ్డంకిగా మారాయి.దాంతో, సైక్లోడెక్స్ట్రిన్లలోని ‘కొలెస్ట్రాల్‌ను తగ్గించే శక్తి’ ఈ వాపును నయం చేయగలదా అని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు తదుపరి ప్రయోగం చేశారు. లింఫడీమా ఉన్న ఎలుకల శరీరంలోని ప్రభావిత ప్రాంతంలో 8 వారాల పాటు క్రమంగా సైక్లోడెక్స్ట్రిన్ ఇంజెక్షన్ ఇచ్చారు. అద్భుతమైన ఫలితాలు వచ్చాయి! సైక్లోడెక్స్ట్రిన్... వాపును, ఇన్ఫ్లమేషన్ను (శరీరంలో వచ్చే మంట/వాపు) గణనీయంగా తగ్గించింది. అంతకంటే ముఖ్యంగా, దెబ్బతిన్న లింఫ్ నాళాలను తిరిగి బాగు చేయడానికి ఇది సహాయపడినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనివల్ల వ్యాధి లక్షణాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి.‘‘ఇది నిజంగానే విప్లవాత్మకమైన ఆవిష్కరణ. ఎందుకంటే లింఫడీమాకు ఇప్పటివరకు శాశ్వత నివారణ అనేదే లేదు. ప్రభావిత కణజాలంలో పేరుకుపోయే కొలెస్ట్రాల్‌ను తగ్గించడమే లక్ష్యంగా చికిత్స చేయవచ్చని ఈ అధ్యయనం చూపించింది. అయితే మనుషులపై ఇది ఎంతవరకు సురక్షితం, ప్రభావవంతం అని తెలుసుకోవడానికి మానవులపై ప్రయోగాలు జరగాల్సి ఉంది’’ అని పరిశోధకులు అంటున్నారు. అలాగే రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించే స్టాటిన్ల వంటి సాధారణ మందులు దీనికి పనిచేయకపోవచ్చని వారు భావిస్తున్నారు. ఎందుకంటే ఆ మందులు రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి కానీ, ప్రత్యేకంగా లింఫ్ నాళాల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌పై పనిచేయవు.మొత్తానికైతే లింఫడీమాతో బాధపడుతున్న లక్షలాది మంది రోగులకు గొప్ప ఊరటనిచ్చే పరిశోధనా ఫలితం ఇది. సాధారణంగా ఆహార పరిశ్రమలో వాడే ఒక చవకైన పదార్థం (సైక్లోడెక్స్ట్రిన్), ఇలా ప్రాణాంతకమైన శారీరక సమస్యకు çపరిష్కారం అయ్యే సూచనలు కనిపించటం నిజంగా మంచి విషయమే. త్వరలోనే మనుషులపై జరిపే ప్రయోగాల్లో కూడా ఇవే సానుకూల ఫలితాలు వస్తే, లింఫడీమా బాధితులకు తక్కువ ఖర్చుతోనే మెరుగైన శాశ్వత చికిత్స లభించే అవకాశం ఉంది.- సాక్షి స్పెషల్ డెస్క్ఇదీ చదవండి: ప్రసవ నొప్పులు రాకపోతే? -
ప్రసవ నొప్పులు రాకపోతే?
నాకు డెలివరీ డేట్ వచ్చేసింది. కానీ లేబర్ పెయిన్స్ రావడం లేదు. సిజేరియన్ చేస్తారేమో! అని భయంగా ఉంది.– వాణి, గుంటూరు.ఇలాంటి సందేహాలు చాలామంది గర్భిణులకు ఉంటాయి. అయితే నొప్పులు రాకపోయిన ప్రతిసారీ సిజేరియన్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని పరిస్థితుల్లో మందుల సహాయంతో లేబర్‌ను ప్రారంభించే ఇండక్షన్ ఆఫ్ లేబర్ పద్ధతిని ఉపయోగిస్తారు. అంటే మందుల సహాయంతో లేబర్ పెయిన్స్‌ను ప్రారంభించి, ప్రసవం జరిగేలా చేయడం.ఇది ఎప్పుడు అవసరం అవుతుంది?సాధారణంగా తల్లి లేదా బిడ్డకు సంబంధించిన కారణాలు ఉండొచ్చు. ఉదాహరణకు తల్లికి డయాబెటిస్, అధిక రక్తపోటు లేదా కొన్ని ఇతర వైద్య సమస్యలు ఉన్నప్పుడు, బిడ్డ ఎదుగుదల సరిగా లేకపోవడం, ఉమ్మనీరు తక్కువగా ఉండటం వంటి పరిస్థితుల్లో ఇండక్షన్ ను పరిగణిస్తాం. డెలివరీ తేదీ దాటిపోయినా పెయిన్స్ రాకపోవడం, లేదా ఉమ్మనీరు ముందుగానే పోయి పెయిన్స్ ప్రారంభం కాకపోవడం వంటి సందర్భాల్లోనూ ఇండక్షన్ అవసరం కావచ్చు.వేచి చూడవచ్చా?తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉండి ఎలాంటి సమస్యలు లేకపోతే, సాధారణంగా కొంత సమయం వరకు బిడ్డ కదలికలు, ఫీటల్ మానిటరింగ్, ఇతర పరీక్షలను గమనిస్తూ ఉంటాం. 40 నుంచి 41 వారాల సమయంలో ఇండక్షన్ చేయాలా వద్దా అనేది పరిస్థితిని బట్టి డాక్టర్ నిర్ణయిస్తారు. తల్లికి ఉన్న సమస్యలు, వాటి నియంత్రణ, బిడ్డ పరిస్థితి వంటి అంశాలను బట్టి 37, 38 లేదా 39 వారాల్లోనే ఇండక్షన్ అవసరం కావచ్చు.ప్రతి కేసులోనూ ప్రయత్నిస్తారా?కాదు. బిడ్డ తల కిందకు లేకుండా బ్రీచ్ పొజిషన్ లో ఉండటం, బిడ్డ అడ్డంగా లేదా వేరే తప్పు పొజిషన్ లో ఉండటం, కొన్ని ట్విన్ ప్రెగ్నెన్సీ పరిస్థితులు, ప్లాసెంటా చాలా కిందకు ఉండటం వంటి సందర్భాల్లో ఇండక్షన్ సరైన ఎంపిక కాకపోవచ్చు.తప్పకుండా నార్మల్ డెలివరీనేనా?అలా చెప్పలేం. ముందుగా గర్భాశయ ముఖద్వారం అంటే సర్విక్స్ ప్రసవానికి ఎంతవరకు సిద్ధంగా ఉందో చూస్తాం. దీనినే సర్వికల్ ఫేవరబిలిటీ అంటారు. ఇందుకోసం సాధారణంగా మోడిఫైడ్ బిషప్ స్కోర్ వంటి పద్ధతులను ఉపయోగిస్తారు. సర్విక్స్ మెత్తగా ఉందా, ఎంతవరకు తెరుచుకుంది, బిడ్డ తల ఎంత కిందకు దిగింది వంటి అంశాలను పరిశీలిస్తాం.ఈ ప్రక్రియ ఎలా ఉంటుంది?సాధారణంగా దశలవారీగా చేస్తారు. ముందుగా తల్లి, బిడ్డ పరిస్థితిని పరిశీలిస్తాం. సర్విక్స్ సిద్ధంగా లేకపోతే దాన్ని ప్రసవానికి అనుకూలంగా మార్చేందుకు కొన్ని మందులు ఉపయోగిస్తారు. తర్వాత లేబర్ పెయిన్స్ పెరగడానికి అవసరాన్ని బట్టి మందులు లేదా ఆక్సిటోసిన్ డ్రిప్ ఇస్తారు. సర్విక్స్ కొన్ని సెంటీమీటర్లు తెరుచుకుని, లేబర్ ముందుకు సాగుతున్నప్పుడు అవసరమైతే ఆర్టిఫిషియల్ రప్చర్ ఆఫ్ మెంబ్రేన్స్ చేస్తారు. అంటే ఉమ్మనీటిని కృత్రిమంగా బయటకు వచ్చేలా చేయడం.ఇక్కడ ప్రధానంగా మూడు విషయాలను గమనిస్తాం.1. తల్లి పరిస్థితి, బిడ్డ పరిస్థితి, లేబర్ పురోగతి. 2. తల్లి పల్స్, బీపీ, నీరసం వంటి అంశాలను చూస్తాం. 3. నొప్పి తగ్గించే సహాయం, ధైర్యం చెప్పడం కూడా చాలా ముఖ్యం.వీటితో పాటు బిడ్డకు ఫీటల్ హార్ట్‌రేట్‌ను గమనిస్తూ ఉంటాం. అలాగే లేబర్ పెయిన్స్ ఎంత తరచుగా వస్తున్నాయి, ఎంత బలంగా ఉన్నాయి, బిడ్డ తల కిందికి దిగుతోందా, సర్విక్స్ తెరుచుకుంటోందా వంటి అంశాలను పరిశీలిస్తాం. అలాగే ఉమ్మనీటి రంగు కూడా గమనించవచ్చు. అది క్లియర్‌గా ఉంటే సాధారణంగా బిడ్డ పరిస్థితి అప్పటివరకు బాగుందని అర్థం. గ్రీన్ కలర్లో ఉంటే బిడ్డ మెకోనియం పాస్ చేసిన అవకాశం ఉండటంతో, డెలివరీని మరింత జాగ్రత్తగా, త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉండొచ్చు.సమస్యలు ఉంటాయా?ఇచ్చిన మందులకు ప్రతి ఒక్కరూ ఒకేలా స్పందించరు. కొందరిలో అసలు పెయిన్స్ రాకపోవచ్చు. మరికొందరిలో చాలా ఎక్కువగా రావచ్చు. దాంతో బిడ్డ హార్ట్రేట్పై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఉమ్మనీరు ముందుగానే పోవడం లేదా లేబర్ సరిగా ముందుకు సాగకపోవడం వల్ల చివరికి సిజేరియన్ అవసరం కావచ్చు. అయినప్పటికీ తల్లి, బిడ్డ భద్రత కోసం ఇండక్షన్ అవసరమైతే దాని ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటాం.చివరగా, ఇండక్షన్ అంటే సిజేరియన్ తప్పనిసరి అని కాదు. అలాగే ఇండక్షన్ చేస్తే నార్మల్ డెలివరీ ఖాయం అని కూడా కాదు. తల్లి, బిడ్డ భద్రతే ప్రధానంగా తీసుకుని, ప్రతి కేసుకు అనుగుణంగా డెలివరీ విధానాన్ని డాక్టర్ నిర్ణయిస్తారు.- డా. కప్పగంతుల అపర్ణ, సీనియర్ గైనకాలజిస్ట్, అబ్‌స్టెట్రీషియన్, ల్యాపరోస్కోపిక్ సర్జన్, సికింద్రాబాద్ఇదీ చదవండి: ఆరోగ్యంగా కనిపిస్తున్నా.. ఊపిరితిత్తుల సమస్య! -
పార్కిన్సన్స్ బాధితుల కోసం స్మార్ట్ సాక్స్!
పార్కిన్సన్ వ్యాధి ఉన్నవారు ఒక్కోసారి కాళ్లు కదలక నడవలేకపోతారు. ఇలా జరగడాన్ని ‘ఫ్రీజింగ్ ఆఫ్ గెయిట్’ అంటారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఇటలీలోని మిలాన్ పాలిటెక్నిక్ యూనివర్సిటీకి చెందిన ఆరుగురు విద్యార్థులు ఆర్ఫియస్ అనే స్మార్ట్ సాక్స్‌ను తయారు చేశారు. ఈ సాక్స్‌లో ఉండే చిన్నచిన్న పరికరాలు... బాధితులు కోరిన సంగీతానికి అనుగుణంగా కాళ్లకు స్వల్పమైన కంపనాలు ఇస్తాయి. నడుస్తున్నప్పుడు ఈ కంపనాలు లయబద్ధంగా వెలువడుతూ కాళ్లు కదలడానికి సహాయపడతాయి. ఈ వినూత్న ఆలోచన ‘2026 ఏడాదికి జేమ్స్ డైసన్ అవార్డు’కు ఎంపికైంది.ఇష్టమైన పాటల రిథమ్‌కు అనుగుణంగా కంపనాలిలా... ఆర్ఫియస్ సాక్స్‌లో పాదాలు, కింది కాలి భాగంలో మొత్తం ఎనిమిది చిన్న వైబ్రేషన్స్ ఇచ్చే పరికరాలు ఉంటాయి. అవసరమైన ప్రాంతానికి కంపనాలు అందించడంలో ఇవి సహాయపడతాయి. ఈ సాక్స్‌ను మొబైల్ యాప్‌తో అనుసంధానించడం ద్వారా ‘స్పాటిఫై’లో తమకు ఇష్టమైన పాటలను బాధితులు ఎంపిక చేసుకోవచ్చు. ఆ సంగీతంలోని రిథమ్‌కు తగినట్లుగా సాక్స్‌లోని పరికరాలు కాళ్లకు కంపనాలను అందిస్తాయి. ఇందుకోసం హెడ్‌ఫోన్స్ కూడా అవసరంలేదు. ప్రస్తుతం ఈ ఆర్ఫియస్ ఇంకా ప్రాథమిక నమూనా (ప్రోటోటైప్) దశలోనే ఉంది. దీన్ని మరింత చిన్నదిగా, సౌకర్యవంతంగా తయారు చేయడంతోపాటు నడుస్తున్నప్పుడు కాళ్లు అకస్మాత్తుగా ఆగిపోవడాన్ని గుర్తించే ‘ఫ్రీజ్ డిటెక్షన్ టెక్నాలజీ’ని కూడా ఇందులో చేర్చేందుకు పరిశోధక విద్యార్థులు ప్రయత్నిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇవి వాణిజ్యపరంగా అందుబాటులోకి వచ్చేందుకు మరో మూడేళ్లు పట్టవచ్చని వారు చెబుతున్నారు.యువతలో పెరుగుతున్న పక్షవాతం కేసులు!సాధారణంగా వృద్ధుల్లో ఎక్కువగా కనిపించే పక్షవాతం ఇటీవల యువతలో పెరిగినట్లు ఓ అమెరికన్ అధ్యయనంలో తేలింది. దాదాపు మూడు దశాబ్దాల కాలంలో 20 ఏళ్ల నుంచి 54 ఏళ్ల మధ్య వయసు వారిలో పక్షవాతం కేసులు దాదాపు రెట్టింపయ్యాయని పరిశోధకులు గుర్తించారు. అయితే స్ట్రోక్ వచ్చిన తర్వాత మొదటి 30 రోజుల్లో మరణించే వారి శాతం మాత్రం కొంత తగ్గింది. ఈ అధ్యయనంలో భాగంగా 20 ఏళ్ల నుంచి 54 ఏళ్ల మధ్య వయసున్న వారిలో తొలిసారి పక్షవాతం వచ్చిన 2,076 కేసులను పరిశోధకులు గుర్తించారు. 1993–94లో ప్రతి లక్ష మంది యువతలో ఏడాదికి సుమారు 33.9 స్ట్రోక్ కేసులు నమోదవగా 2020 నాటికి ఈ సంఖ్య 62.2కు పెరిగింది. యువతలోని పక్షవాతం కేసుల్లో ప్రధానంగా ఇస్కీమిక్ స్ట్రోక్స్ ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. మెదడులోని ఏదైనా భాగానికి రక్తాన్ని తీసుకెళ్లే నాళంలో అడ్డంకి ఏర్పడి రక్తప్రసరణ నిలిచిపోవడం వల్ల వచ్చే స్ట్రోక్‌ను ఇస్కీమిక్ స్ట్రోక్‌గా పిలుస్తారు. 1993–94లో ప్రతి లక్ష మందిలో ఏడాదికి 23.8 ఇస్కీమిక్ స్ట్రోక్ కేసులు నమోదైతే 2020 నాటికి ఈ సంఖ్య 47.3కు పెరిగింది. అయితే మెదడులో రక్తనాళం చిట్లడంతో రక్తస్రావం జరగడం వల్ల వచ్చే ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్, మెదడు చుట్టూ రక్తస్రావం వల్ల వచ్చే సబ్అరాక్నాయిడ్ హెమరేజ్ వంటి ఇతర రకాల స్ట్రోక్స్‌లో మాత్రం ఈ పెరుగుదల కనిపించలేదు. పక్షవాతానికి గురైన యువతను పరిశీలించినప్పుడు... గతంతో పోలిస్తే వారిలో హైబీపీ, డయాబెటిస్ వంటి కొన్ని సమస్యలు పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటి పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ అధ్యయన వివరాలు న్యూరాలజీ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.జంక్ ఫుడ్‌తో దీర్ఘకాలిక వ్యాధులుఅల్ట్రా–ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకునే వారిలో గుండె జబ్బులు, కేన్సర్, డయాబెటిస్, ఊబకాయం తదితర దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉండొచ్చని తాజా అధ్యయనంలో తేలింది. ఈ తరహా ఆహారం ఎక్కువగా తీసుకునే వారిలో ఏ కారణంతోనైనా మరణాల ముప్పు కూడా ఎక్కువగానే ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా అల్ట్రా–ప్రాసెస్డ్ ఫుడ్స్ వినియోగం బాగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై పరిశోధకులు ఇప్పటివరకు జరిగిన అధ్యయనాలను సమగ్రంగా విశ్లేషించారు. ఇందులో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ వరకు ప్రచురితమైన పరిశోధనలను పరిశీలించారు. ఈ విశ్లేషణలో మొత్తం 51 అధ్యయనాలున్నాయి.ఆయా అధ్యయనాల్లో పాల్గొన్న వాలంటీర్ల ఆహార అలవాట్లను, వారి ఆహార చరిత్రను విశ్లేషించగా అల్ట్రా–ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడానికి.. కొన్ని ప్రధాన ఆరోగ్య సమస్యలు వచ్చే ముప్పునకు మధ్య సంబంధం ఉంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అల్ట్రా–ప్రాసెస్డ్ ఫుడ్స్ రోజువారీ వినియోగం పెరిగేకొద్దీ అనారోగ్య సమస్యల ముప్పు కూడా పెరుగుతున్నట్లు డోస్ రెస్పాన్స్ అనాలసిస్‌లో కనిపించింది. రోజుకు అదనంగా 100 గ్రాముల అల్ట్రా–ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల హృద్రోగ సమస్యలు, కేన్సర్, ఏ కారణంతోనైనా మరణించే ముప్పు, మెటబాలిక్ సిండ్రోమ్/డయాబెటిస్ ముప్పు పెరగడంతో సంబంధం ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే ఈ పరిశోధనలో లభించిన ఆధారాలు తక్కువ స్థాయి నుంచి మధ్యస్థ స్థాయిలోనే ఉన్నాయని పరిశోధకులు పేర్కొన్నారు.సాక్షి, హెల్త్ డెస్క్ -
మీ గుండె వయసు తెలుసా?
మీ వయసు ఎంత అని అడిగితే టక్కున చెప్పేస్తారు. కానీ మీ గుండె వయసు ఎంతో చెప్పగలరా? మీ మెదడుకు ఎన్నేళ్లో తెలుసా? ఇవేం ప్రశ్నలు అనుకుంటున్నారా? శాస్త్రవేత్తల అధ్యయనాల ప్రకారం.. మన జీవ వయసుకు, శరీరంలోని అంతర్గత అవయవాల వయసుకు మధ్య తేడా ఉంటుంది. ఒక్కో అవయవం తనదైన ప్రత్యేక వేగంతో వృద్ధాప్యానికి గురవుతూ క్షీణిస్తుంటుంది. ఎందుకంటే.. వృద్ధాప్యం శరీరమంతా ఒకే తీరుగా సాగే ప్రక్రియ కాదని పరిశోధనలు చెబుతున్నాయి. శరీరంలోని వివిధ అవయవాలు వేర్వేరు వేగాలతో వృద్ధాప్యానికి లోనవుతాయి. ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన ఆరోగ్యకరమైన ప్రతి ఐదుగురికిగాను ఒకరిలో కనీసం ఏదో ఒక అవయవం మిగతా శరీర అవయవాల కంటే వేగంగా క్షీణిస్తుంది. వృద్ధాప్యం స్థిరమైన వేగంతో కాకుండా ఒక్కో వ్యక్తికి 34, 60, 78 ఏళ్ల వయసులో మారుతుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.రక్తంలోని ప్రొటీన్ల విశ్లేషణతో అవయవాల వయసు లెక్కింపు..అమెరికాలోని ప్రసిద్ధ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు తమ తాజా అధ్యయనంలో కేవలం ఒక రక్త పరీక్ష సాయంతో శరీరంలోని 11 ముఖ్యమైన అవయవాల జీవ సంబంధ వయసును కచ్చితంగా అంచనా వేయవచ్చని నిరూపించారు. రక్తంలోని ప్లాస్మాలో ఉండే వేలాది ప్రొటీన్లను విశ్లేషించడం ద్వారా నిర్దిష్ట అవయవాల నుంచి విడుదలయ్యే ప్రొటీన్ గుర్తులను గుర్తించవచ్చని.. తద్వారా శరీరంలోని ఒక్కో అవయవ వయçÜును కంప్యూటర్ ఆధారిత ఏజింగ్ క్లాక్స్ ద్వారా లెక్కించడం వీలవుతోందని పేర్కొన్నారు. అవయవాల్లోని కణాల పనితీరు తగ్గడం, డీఎన్ఏ దెబ్బతినడం వంటి ప్రక్రియల వల్ల శరీరంలో అవయవాల ఆరోగ్యం వేర్వేరు స్థాయిల్లో ఉంటోందన్నారు. ఈ సాంకేతికత ద్వారా భవిష్యత్తులో రాబోయే తీవ్రమైన అనారోగ్య సమస్యలను 10–15 ఏళ్ల ముందే ఊహించి అందుకు తగ్గ చికిత్సలు చేయడం వీలవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉదాహరణకు ఒకరి మెదడు జీవసంబంధ వయసు వారి అసలు వయసు కంటే ఎక్కువగా ఉంటే వారికి మతిమరుపు వ్యాధి వచ్చే ప్రమాదం మూడు రెట్లు పెరుగుతుందని వివరిస్తున్నారు. అలాగే గుండె జీవవయసు వేగంగా పెరిగితే భవిష్యత్తులో హృదయ స్పందనల్లో హెచ్చుతగ్గులు, గుండెపోట్ల ప్రమాదం ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మూత్రపిండాల వయసు పెరిగిన కొద్దీ రక్తపోటు, మధుమేహం కాంప్లికేషన్లు పెరుగుతాయని వివరిస్తున్నారు.దీర్ఘాయువుకు కీలక సూత్రాలు » రోజూ ఒక గ్రాము ఒమేగా–3, 2000 ఇంటర్నేషనల్ యూనిట్ల విటమిన్–డి తీసుకోవడం, వారానికి మూడుసార్లు బరువులెత్తే వ్యాయామం చేస్తుంటే వృద్ధాప్య వేగం తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.» ఏరోబిక్ వ్యాయామం మెదడుకు రక్తప్రసరణను పెంచి జ్ఞాపకశక్తికి కీలకమైన హిప్పోకాంపస్ పరిమాణాన్ని కాపాడుతుంది. కండరాల దృఢత్వం వృద్ధాప్యంలో వ్యక్తి స్వావలంబనకు తోడ్పడుతుంది. » షింగిల్స్ టీకా తీసుకోవడం వల్ల మతిమరుపు వచ్చే ప్రమాదం 20 శాతం మేర తగ్గుతుందని తేలింది. క్షీణించే అవయవానికి చికిత్సే లక్ష్యం..నిర్దిష్ట శారీరక స్థితి ఆధారంగానే అవయవ గడియారాల రీడింగ్స్‌ను అర్థం చేసుకోవాలి. వేగంగా క్షీణించే అవయవాన్ని ముందే గుర్తించి చికిత్స అందించటమే ప్రస్తుత లక్ష్యం. వయోభారాన్ని తగ్గించే ఔషధాలు వాడితే అవి రోగనిరోధక శక్తిని తగ్గించే అవకాశం ఉన్నందున వయోభారాన్ని తగ్గించే సహజ పద్ధతులను పాటించడమే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. – దీపక్ కుమార్ సైనీ, ఐఐఎస్సీ ప్రొఫెసర్, వృద్ధాప్య ప్రక్రియపై అధ్యయనం చేస్తున్న భారత్ ప్రాజెక్ట్ సమన్వయకర్త -
116 కేజీల నుంచి 60 కేజీలకు..! జస్ట్ రెండేళ్ల వ్యవధిలోనే..
బరువు తగ్గడం ఒక్కోక్కరికి ఒక్కో అనుభవం. కొందరికి ఆహారమే ప్రధానమైతే, మరికొందరికి వర్కౌట్లే కీలకంగా ఉంటాయి. అయితే శరీరానికి అనుగుణమైనది, నిపుణుల సలహాలు సూచనలతో ఆరోగ్యదాయకంగా అనుసరిస్తే సులభంగా బరువు తగ్గడమే కాకుండా అదుపులో ఉంటుందనిచెబుతోంది అనురీత్ కౌర్. తొందరగా ఫలితం కోసం వెంపర్లాడకుండా నిలకడతో చేస్తేనే అన్ని విధాల శ్రేయస్కరమని అంటోంది. మరి ఆమె అనుసరించిన వెయిట్‌లాస్ టెక్నిక్ ఏంటి..?, ఎంత వ్యవధిలో ఎన్ని కిలోలు తగ్గిందో సవివరంగా చూద్దామా..!సహనంతో క్రమశిక్షతో వెయిట్‌లాస్ జర్నీకి సిద్ధమైతే సత్ఫలితాలు అందుకోగలరని అంటోంది అనురీత్ కౌర్. తాను 116 కేజీల పైనే బరువు ఉండేదాన్ని అని, జస్ట్రెండేళ్ల వ్యవధి 56 కేజీలు పైనే తగ్గి 60 కేజీలకు చేరుకున్నట్లు పేర్కొంది. కఠినమైన ఆహార నియమాల జోలికి పోలేకదని, స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌ని తన దినచర్యలో భాగం చేసుకుంటూ..నిలకడగా వర్కౌట్లు చేసినట్లు తెలిపింది. కండరాలను పెంచుకునేలా వ్యాయమాలు చేయడం నేర్చుకున్నట్లు పేర్కొంది. కొవ్వు తగ్గాలంటే కేలరీల లోటు అవసరమని గుర్తించానని, అందుకనే కేలరీల లోటుతో తినేదాన్ని అని వెల్లడించింది. తక్కువ తిని ఎక్కువ బరువు తగ్గడం అనేది ఉండదని, సరైన పద్ధతిలో తింటే బరువు ఆటోమేటిగ్గా తగ్గుతామని అనుభవపూర్వకంగా తెలుసుకున్నానని చెప్పుకొచ్చింది. మన భోజనం ఎలా ఉండాలంటే..పరిమాణం, ఫైబర్, పోషకాలు కీలకం కండరాలు మద్దతు కోసం, సంతృప్తిని కలిగించేలా ప్రోటీన్ ఉండాలి. శరీరానికి శిక్షణ శక్తి కోసం మోతాదులో కార్బోహైడ్రేట్లువీటి తోపాటు అవసరమైన ఫ్యాటీ యాసిడ్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు తగు మోతాదులో తీసుకోవాలి.ముఖ్యంగా కొన్ని ఆహారాలు కేలరీలు తక్కువగా ఉన్నా..ఎక్కువ పరిమాణంలో తినేలా చేసి, సంతృప్తిని అందించేలా ఉంటాయి. అలాగే కొన్ని తక్కువ పరిమాణంలోనే ఎక్కువ కేలరీలు ఉంటాయి. వీటిని బేరీజు చూసుకుని తీసుకుంటే..బరువు తగ్గడం సులభం అని అంటోంది. అలాగే బరువు తగ్గడం అంటే కొవ్వు కరిగించుకోవడం అని తక్కువ భోజనంతో సరిపెట్టుకుంటారు. అది ముమ్మాటికి సరైనది కాదని అంటోంది. ఇలా దీర్ఘకాలం తక్కువగా తింటే మహిళల్లో రుతు సంబంధిత సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తోంది. ఆమె సంతృప్తికరమైన సమతుల్య భోజనానికి ప్రాధాన్యత ఇస్తే..సులభంగా బరువు తగ్గగలరని నమ్మకంగా చెబుతోంది అనురీత్. ఇక్కడ సరైనది తినడమే ప్రధానమని గ్రహించమని కోరుతోంది అనురీత్. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసి చూడండి మరి..!. View this post on Instagram A post shared by Anureet Kaur (@anureetkaur.12)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. అనుసరించే ముందు నిపుణులు లేదా వైద్యుల సలహా మేరకు పాటించడం ఉత్తమం. ఇదీ చదవండి: ఎలక్ట్రీషియన్ నుంచి మాస్టర్ చెఫ్ విజేత, రెస్టారెంట్ యజమాని రేంజ్‌కి..!) -
18 కిలోల బరువు, ప్రతీ చెమట చుక్క, నేషనల్ అవార్డ్ : నటుడు ఏమోషనల్
Kartik Aaryan success బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ 'చందూ చాంపియన్' (Chandhu Champion) చిత్రంలోని నటనకు బెస్ట్ యాక్టర్‌గా ప్రతిష్టాత్మకమైన తొలి జాతీయ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆ పాత్రకోసం తనను తాను మలచుకున్న తీరు గురించి ఆయన సోషల్ మీడియా నెట్టింట విశేషంగా నిలుస్తోంది. ఈ పాత్ర కోసం తాను పడిన కష్టాన్ని ఇన్‌స్టాలో గుర్తు చేసుకున్న కార్తీక్ ఎమోషనల్ అయ్యారు.2024లో పారాలింపిక్స్ గోల్డ్ మెడల్ సాధించిన మురళీకాంత్ పెట్కర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో నటించేందుకు కార్తీక్ ఏకంగా 18 కిలోల బరువు తగ్గారు. ఇందుకోసం భారీ కసరత్తులే చేశారు. కఠినమైన ఫిట్నెస్, జీవనశైలి విధానాలను అనుసరించానన్నారు. సినిమా విడుదలై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా, కార్తీక్ ఆ అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ... ఆ ప్రయాణంలో తాను పొందిన వాటితో పోలిస్తే కోల్పోయిన బరువు చాలా చిన్నదని, అలా ఆ పాత్రలో జీవించానని కార్తీక్ తెలిపారు. ఈ ప్రయాణంలో తాను సంపాదించుకున్న అనుభవమే గొప్పదని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై టీఎంసీ ఎంపీ మహువా ఫిర్యాదు View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) తన జీవితంలోనే అత్యంత ప్రత్యేకమైన చిత్రం 'చందూ ఛాంపియన్' అంటూ ఈ పాత్ర కోసం సిద్ధమయ్యే క్రమంలో ఎదురైన శారీరక , మానసిక సవాళ్లను గుర్తుచేసుకున్నారు. ముర్లికాంత్ పెట్కార్గా నటించడానికి, తాను ఇంతకు ముందెన్నడూ లేని విధంగా మారాల్సి వచ్చిందని తెలిపారు. ప్రతి ఉదయం వేళ, ఒలికిన ప్రతి చెమట చుక్క, సెట్లో కలిగిన ప్రతి సందేహం.. ఇవన్నీ కేవలం నటన కాదు, అది నిజమైన జీవనం," అని ఆయన రాశారు. అంతేకాదు ప్రతికూలతలు, పట్టుదలతో రూపుదిద్దుకున్న ఒక అథ్లెట్ పాత్రను పోషించడానికి అవసరమైన క్రమశిక్షణను, మనస్తత్వాన్ని కూడా అతను అలవర్చుకోవలసి వచ్చింది. గాయాలే పతకాలుగా, ఎదురుదెబ్బలే పునరాగమనాలుగా మారతాయని ఈ మూవీ ద్వారా తెలిసి వచ్చిందన్నారు.ఇదీ చదవండి: జీవిత ఖైదు : కాంబోడియా ప్రియురాలితో గ్యాంగ్‌స్టర్ పెళ్లికి పెరోల్కాగా గుజరాత్‌లోని కేవడియాలో బుధవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కార్తీక్ ఈ జాతీయ అవార్డును అందుకున్నారు. సాంప్రదాయకంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగే ఈ వేడుక, ఈసారి తొలిసారిగా గుజరాత్లో నిర్వహించారు.ఇదీ చదవండి: గ్రానైట్ బారన్, వీరమణి బాగోతం : మీడియా చేతికి షాకింగ్ వీడియోలు -
‘రెండుసార్లు’ జన్మించిన శిశువు! మెడికల్ మిరాకిల్
కొన్ని సంఘటనలు, అరుదైన వ్యాధులు విసిరే సవాళ్లు ఆధునిక వైద్యనికే అంతుచిక్కదు. ఒక్కోసారి ఆ సవాళ్లే కొంగొత్త వైద్య ఆవిష్కరణాలను నాంది పలికి..ఎందరినో ఆ అనారోగ సమస్యల నుంచి బయపడేసేందుకు దారితీస్తుంది. బతికే అవకాశాలు లేనప్పుడూ కూడా వైద్యానికే అందని విధంగా మిరాకిల్ జరిగి మరి జీవిస్తున్న ఎన్నో అద్భుతాలను చూశాం. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే ఘటన అంతకుమించిన మిరాకిల్ ఘటన. ఒక్కసారే ఎవ్వరైన జన్మిస్తాం..కానీ ఈ శిశువు ఏకంగా రెండుసార్లు జన్మించింది. బహుశా ఇదే వైద్యశాస్త్రంలోని అత్యంత అరుదైన ఘటనేమో..!.అసలేం జరిగిందంటే..2016లో ఒక అత్యంత అరుదైన కేసుని ఎదుర్కొన్నారు అమెరికా వైద్యులు. టెక్సాస్‌కి చెందిన మార్గరెట్ బోమర్ సాధారణ ప్రెగ్నెన్సీ చెకప్‌కి వెళ్లింది. ఎప్పటిలానే ఆరోజు పరీక్షలు చేయించుకుంది. స్కానింగ్ ఆమె గర్భంలోని శిశువు వెనుముక చివరలో శాక్రోకాక్సిజియల్ టెరాటోమా అనే అరుదైన కణితి అతుక్కుని ఉన్నట్లు గుర్తించారు వైద్యులు. దీని కారణంగా ఆ శిశువు మనుగడ సాగించడం కష్టమని తేల్చేశారు. ఎందుకంటే ఆ కణితి..పిండానికి అందాల్సిన రక్తాన్ని దారిమళ్లిస్తోంది. ఫలితంగా ఆ ఒత్తిడి గుండెపై పడి గుండె వైఫల్యానికి దారితీసే ప్రమాదిన్ని పెంచుతున్నట్లు తెలిపారు. అంటే ఆ శిశువు 26 వారాల రాక మునుపే గర్భంలో చనిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఆ విషయం తెలిసి ఆ మహిళ తీవ్ర ఆందోళనకు గురైంది. ఆమెకు ఇది అత్యంత భయాన ఉద్విగ్న క్షణం ఎందుకంటే. అసలు నిజానికి ఆమె గర్భంలో కవలలు పెరిగారు. అందులో ఒక శిశువు రెండో నెలలోనే గర్భస్రావం అయ్యింది. పోనీలే మరో శిశువు ఆరోగ్యంగా పెరుగుతోంది కదా అనుకుంటే ..మళ్లీ ఇలాంటి విషయం వినడంతో మరింతగా హడలిపోయింది మార్గరేట్. చాలామంది వైద్యులు గర్భం తొలగించుకోవాల్సిందే సూచించారు. ఎందుకంటే ఆ కణితిని అతి కష్టంపై సర్జరీ ద్వారా తొలగించినా..ఆ చిన్నారి బతికే అవకాశాలు 50% మాత్రమే అని తేల్చేశారు వైద్యలు. అయితే మార్గరేట్ ఆమె భర్త ఆమెను ఎలాగైనా బతికించుకోవాలనే నిర్ణయానికి వచ్చి.. టెక్సాస్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లోని ఒక ప్రత్యేక శస్త్రచికిత్స బృందాన్ని ఆశ్రయించారు. అక్కడ పిండం అభివృద్ధి చెందుతున్నప్పుడే..నేరుగా శస్త్ర చికిత్స చేసి..తిరిగి గర్భం కొనసాగేలా ఆ పిండాన్ని గర్భాశయంలోకి ప్రవేశపెట్టే ప్రమాదకరమైన ప్రక్రియ గురించి వైద్యలు ఆమెకు వివరించారు. 23 వారాల గర్భం నాటికే ప్రమాదం తీవ్రమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో..తక్షణమే గుండె పనితీరుని దెబ్బతీస్తున్న ఆ కణితిని తొలగించే సర్జరీ చేశారు. అరచేతిలో ఇమిడిపోయే అత్యంత చిన్న పిండాన్నే గాల్లో ఉంచే కణితిని తొలగించారు. చెప్పాలంటే..ఆపరేషన్ జరుగుతున్నంత సేపు గుండె ఆగిపోయింది. అయితే హార్ట్ సర్జన్ ఆ శిశువుని బతికించారు. ఆ శస్త్ర చికిత్స సమయంలోనే ఆక్సిజన్ని ప్లాసెంటా ద్వారా తల్లికి అనుసంధానించారు. అలా కణితిని తొలగించి..ఆ ఆడ శిశువుని తిరిగి గర్భంలోని ప్రవేశపెట్టి..శరీరంలో ద్రవాల సమతుల్యత పునరుద్ధరించి..గర్భాశయాన్ని పూర్తిగా కుట్టువేసి మూసివేశారు. అంతేగాదు మార్గరేట్ని కఠినమైన విశ్రాంతిలో ఉంచి ఆ శిశువు గర్భంలో ఆరోగ్యంగా పెరిగేలా చేశారు. అలా 36 వారాల అనంతరం రెండోసారి సీ సెక్షన్ ద్వారా ఆ శిశువుని బయటకు తీశారు. తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు నిర్థారించారు. ఆ చిన్నారి సుమారు 2.41 గ్రాముల ఆరోగ్యకరమైన బరువుతో ఉండటం విశేషం. ఆ చిన్నారి బయటకొచ్చిన ఎనిమిది రోజులకు వెన్నుముక చివరి ఎముక కణజాలన్ని శుభ్రం చేసేందుకు ఒక సాధారణ ఆపరేషన్ చేశారు. ఆ అద్భుత శిశువుకి లిన్లీ హూప్ అని పేరు పెట్టారు. సదరు తల్లి మార్గరేట్ మాత్రం ఇది అద్భుతమైన భయానక క్షణంగా పేర్కొంది. ఎందుకంటే క్షణం, క్షణం ఉత్కంఠ..బతికించుకోగలనా అన్న సందేహాల మధ్య సాగిన గర్భధారణ అని అంటోందామె.ఇదీ చదవండి: Shruti Haasan: ఎప్పటికీ తల్లిని కాలేననుకున్నా..!: శ్రుతి హాసన్ -
ఎప్పటికీ తల్లిని కాలేననుకున్నా..!: శ్రుతి హాసన్
టాలీవుడ్ నటి, విలక్షణ నటుడు కమల్ హాసన్ ముద్దుల తనయ శ్రుతి హాసన్ గర్భధారణ గురించి చాలాచాలా ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను 14 ఏళ్ల వయసు నుంచే పీసీఓఎస్(పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్)ని ఎదర్కొన్నట్లు తెలిపారు. దీని వల్ల భవిష్యత్తులో గర్భం దాల్చడం కష్టమని చాలామంది వెద్యులు హెచ్చరించనట్లు గుర్తుచేసుకుంది. ప్రతి ఒక్కరూ అమ్మా.. ఇది చాలా కష్టం భవిష్యత్తులో తల్లి అయ్యే అవకాశాలు తక్కువ అంటూ చెబుతుండేవారని, దాంతో తాను ఎంతగా ఆందోళన చెందిందో కూడా చెప్పుకొచ్చింది. అంతేగాదు ఒకానొక టైంలో అవసరమైతే పిల్లలను దత్తత తీసుకుందామని ఫిక్స్ అయినట్లు కూడా చెప్పుకొచ్చింది. సోహా అలీఖాన్‌తో జరిగిన పాడ్‌కాస్ట్‌లో ఈ విషయాలను పంచుకుంది శ్రుతి హాసన్. అయితే 53 ఏళ్ల వయసులో కామెరాన్ డయాజ్ బిడ్డకు జన్మనివ్వడంతో తనకు తల్లి అయ్యే అవకాశంపై కొత్త ఆశను రేకెత్తించిందని భావోద్వేగంగా చెప్పుకొచ్చింది. పీసీఓఎస్ అంటే గర్భందాల్చడం లేదా పిల్లలను కనడం గురించి పూర్తిగా మర్చిపోవాలని చెబుతుండే మాటలు వింటూ పెరిగానని తెలిపింది. అయితే డాక్టర్ ధృప్తి దేధియా తన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసిందన్నారు. నువ్వు తల్లివి కావాలనుకుంటే..తనకు చెప్పమని, అప్పుడు తగిన పరిష్కారం చెబుతానని భరోసా ఇచ్చినట్లు తెలిపారు. ఆమె పీసీఓఎస్ వల్ల గర్భందాల్చడం కష్టమైనప్పటికీ..అసాధ్యమైతే కాదని నమ్మకం అందించారని చెప్పుకొచ్చారు శ్రుతి హాసన్. తనకు డాక్టర్ అలా భరోసా ఇవ్వడం తనకు ఎంతో సంతోషాన్నించిందంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. కాగా, సాధారణ నెలలో ఒక ఫొలికల్ పెరిగి పరిపక్వం చెంది అండాన్ని విడుదల చేస్తుంది. అయితే పీసీఓఎస్ ఉంటే..అనేక ఫొలికల్స్ పెరగడం మొదలవుతాయి. అయితే ఏ ఒక్కటి ప్రధానంగా ఎదగదని చెబుతున్నారు వైద్యులు. సాధారణంగా 28 రోజుల రుతుచక్రం ఉంటే..ఏడాదికి దాదాపు 12 లేదా 13 అవకాశాలు లభిస్తాయి. అదే 60 లేదా 90 రోజుల చక్రం ఉన్న మహిళకు 4 లేదా 5 అవకాశాలు మాత్రమే లభిస్తాయి.నిజంగానే పీసీఓఎస్ గర్భధారణను ప్రభావితం చేస్తుందా?సాధారణంగా ప్రతి నెలా అండాశయం నుండి ఒక అండం విడుదలవుతుంది. కానీ పీసీఓఎస్ ఉన్నవారిలో హార్మోన్ల అసమతుల్యత వల్ల అండం సరిగ్గా పెరగక లేదా సకాలంలో విడుదల కాక పీరియడ్స్ క్రమం తప్పుతాయి. అండం విడుదల కానప్పుడు సహజంగానే గర్భం దాల్చడం ఆలస్యమవుతుంది. దీన్ని సరైన జీవనశైలి, చక్కటి ఆహారపు అలవాట్లతో ఈ సమస్యను జయించొచ్చని చెబుతున్నారు వైద్యులు. బరువుని అదుపులో ఉంచుకుంటూ సమతుల్యమైన ఆహారం తీసుకొంటూ ఉంటే..పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావడం అనేది ఉండదని చెబుతున్నారు. అలాగే వైద్యులు పీరియడ్స్ క్రమం తప్పకుండా ఉండేలా కొన్ని ఇంజెక్షన్లు సూచిస్తారని, వాటి సాయంతో ఈ సమస్యలను అధిగమించొచ్చని చెబుతున్నారు వైద్యులు.(చదవండి: Mrunal Thakur: లూసీ చీరలో స్టైలిష్‌గా మృణాల్ ఠాకూర్..!) -
మరచిపోకండి! నలభైల్లోనే సిద్ధం కండి!!
చేతులు కాలాక ఆకులు పట్టుకోకూడదని సామెత. వృద్ధాప్యంలో కాస్త మతిమరుపు రావడం సహజం. అప్పుడు మతిమరపు (డిమెన్షియా) వస్తుంటే బాధపడటం కంటే 40ల నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అన్ని విధాలా మేలన్నది డాక్టర్ల మాట. మెదడు తాలూకు మంచి ఆరోగ్యంతో పాటు భవిష్యత్తులో పెద్దవయసులో మతిమరపు రాకుండా ఉండటం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో చూద్దాం.నిజానికి మెదడుకు కలిగే నష్టాలు చాలాసార్లు బయటకు కనిపించకుండా మధ్య వయసునుంచే అంటే 40ల నుంచే మొదలవుతాయి. కారణం... చాలామందిలో ఆ వయసు నుంచే హైబీపీ, డయాబెటిస్, హై కొలెస్ట్రాల్ వంటి జబ్బులు మొదలవుతాయి. దేహానికి వచ్చే ఈ తరహా జీవక్రియలకు సంబంధించిన జబ్బులను (మెటబాలిక్ డిజార్డర్స్)ను తమ మధ్యవయసులోనే... అంటే తమ నలభైల వయసులోనే అదుపులో ఉంచుకుంటే... భవిష్యత్తులో... అంటే... తమ 60లు, 70లలో వచ్చే మతిమరపు (డిమెన్షియా) ముప్పును తగ్గించుకోవచ్చన్నది వైద్య నిపుణులు అభిప్రాయం.ఒక కేస్ స్టడీ చూద్దాం... 50 ఏళ్ల ఓ వ్యక్తి తాలూకు కుటుంబంలో... అతడి కుటుంబ సభ్యుల్లో కొందరికి వృద్ధాప్యంలో మతిమరపు (డిమెన్షియా) వచ్చిన కుటుంబ చరిత్ర (ఫ్యామిలీ హిస్టరీ) ఉంది. అయితే తన ఈ 50 ఏళ్ల వయసప్పుడు మాత్రం అతడికి జ్ఞాపకశక్తికి సంబంధించిన ఎలాంటి సమస్యా లేదు.అతడు చేయించుకున్న సాధారణ ఆరోగ్య పరీక్షల్లో (యాన్యువల్ రొటీన్ హెల్త్ టెస్టుల్లో) మాత్రం రక్తపోటు కొద్దిగా ఎక్కువగా ఉండటం, చెడు (ఎల్డీఎల్) కొలెస్ట్రాల్ కూడా ఎక్కువగా ఉండటం, ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం... ఇవన్నీ మొదలవుతున్న దశలు కనిపించాయి. ఎక్కువసేపు కదలకుండా కూర్చునే జీవనశైలి కారణంగా ఇలాంటి సమస్యలు కనిపించడం మామూలే.ఆయన ప్రతిరోజూ వేగంగా నడవాలని, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని, తక్కువ కొవ్వు కలిగినప్రోటీన్ ఆహారం తీసుకోవాలని డాక్టర్లు అతడికి సూచించారు. అవసరమైన మందులతో రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను కూడా అదుపులో పెట్టారు.మూడేళ్లలో ఆయన ఆరోగ్య ప్రమాణాలు సాధారణ స్థాయికి వచ్చాయి. అయితే డాక్టర్లు ఇవన్నీ చేసింది కేవలం మధ్యవయసులో అతడి గుండెనూ, ఆరోగ్యాన్ని కాపాడేందుకు మాత్రమే కాదు... భవిష్యత్తులో మెదడు ఆరోగ్యాన్నీ... భవిష్యత్తులో అతడి జ్ఞాపకశక్తినీ, డిమెన్షియా వంటి మతిమరపుతో పాటు అల్జైమర్స్ వంటి తీవ్రమైన మతిమరపు సమస్యలను నివారించేందుకు తోడ్పడేలా కూడా ఆ మందులు ఇచ్చారు. ఎందుకంటే... మధ్యవయసులో ఎన్నో సమస్యలు నివారించేందుకు డాక్టర్లు తీసుకునే ఎన్నో జాగ్రత్తలు... ఒక వ్యక్తి తాలూకు వృద్ధాప్యంలోనూ అతడి మనసూ, మెదడు ఆరోగ్యాలను కాపాడేలా కూడా ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి.మొదలయ్యేది మధ్యవయసులోనే...చాలామందిలో మధ్య వయసులోనే శరీరంలో ఇన్ ఫ్లమేషన్, జీవక్రియలకు సంబంధించిన మార్పులు మొదలవుతాయి. అయితే ఈ దశలో వాటిని నియంత్రించడం సాధ్యమే. 40లు, 50ల్లోనే అధిక రక్తపోటు (హైబీపీ), అధిక ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ వంటి కొవ్వులు (హైపర్ లిపిడేమియా), మధుమేహం (డయాబెటిస్), ఊబకాయం (ఒబేసిటీ) వంటి సమస్యలను అదుపులో పెట్టుకుంటే మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలనూ చాలా కాలం పాటు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. దాంతో భవిష్యత్తులో మతి మరపు (డిమెన్షియా) వంటి సమస్యలనూ నివారించుకోవచ్చు. డిమెన్షియా అంటే వృద్ధాప్యంలో తప్పనిసరిగా వచ్చే సమస్య కాదు. కాబట్టి దాని ముప్పును కొన్ని సందర్భాల్లో కొన్ని ముందుజాగ్రత్తలతో ముందునుంచే నివారించుకోవచ్చు.డిమెన్షియాకు దారితీసే 14 కారణాలు... ‘ద లాన్సెట్’ అనే ప్రముఖ మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైన నిపుణుల కమిషన్ నివేదిక–2024లో వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ కింద పేర్కొన్నవి డిమెన్షియా ముప్పును పెంచేందుకు కారణమయ్యే కొన్ని అంశాలు. జీవనశైలి మార్పుల ద్వారా వాటిని చాలావరకు నియంత్రించవచ్చంటూ కూడా ఆ జర్నల్ పేర్కొంది.వాటిలో ముఖ్యమైనవి:- ఊబకాయం (ఒబేసిటీ)- అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్ / హైబీపీ)- ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ వంటివి ఎక్కువగా ఉండటం (హైపర్ లిపిడేమియా)- మధుమేహం (డయాబెటిస్)- శారీరక శ్రమ లేకపోవడం (సెడెంటరీ లైఫ్‌స్టైల్) - పొగతాగే అలవాటు (స్మోకింగ్) ∙మద్యం ఎక్కువగా తీసుకునే అలవాటు- వినికిడి లోపం ∙చికిత్స చేయించని చూపు సమస్యలు- డిప్రెషన్- సామాజికంగా ఒంటరిగా ఉండటం- వాయు కాలుష్యం - తలకు తీవ్రమైన గాయంజీవితాంతం జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం మెదడు ఆరోగ్యం...మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవడం అనేది రిటైర్మెంట్ తర్వాత ఆలోచించాల్సిన విషయం కాదు. జీవితంలో చాలా ముందుగానే దాని గురించి జాగ్రత్త పడాలి అంటున్నారు వైద్యులు. ఎందుకంటే ముందే జాగ్రత్తపడుతూ తగిన ఆరోగ్య నియమాలు పాటించడం, కాస్తంత చురుకైన జీవితాన్ని గడుపుతుండటం, ఆహ్లాదకరమైన హాబీలతో ఎప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండటం, సమస్యలను తీర్చేలా ఎప్పుడూ మెదడుకు పనిచెబుతూ ఉండటం వంటివి తమ మధ్యవయసులో (అంటే 40లలో) చేస్తుంటే... మున్ముందూ మన శరీర సంపూర్ణ ఆరోగ్యం కూడా అన్ని విధాలా బాగుండటంతో పాటు... మెదడు ఆరోగ్యమూ చక్కగా ఉండటమూ, మతిమరపు, అల్జైమర్స్ వంటివి నివారితం కావడమూ జరుగుతుంది.గుండెను కాపాడుకోవడం అంటే... మెదడుకూ మేలు చేసుకోవడమే!గుండె ఆరోగ్యం అంటే కేవలం అది గుండె సంరక్షణ మాత్రమే కాదు... గుండె ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవడం అంటే మన మెదడు ఆరోగ్యాన్ని కూడా పదికాలాల పాటు జాగ్రత్తగా చూసుకోవడమే. దీనికి అనేక కారణాలున్నాయి. గుండె ఆరోగ్యం మెదడుకు ఎలా తోడ్పడుతుందంటే... మెదడు సరిగ్గా పనిచేయాలంటే దానికి నిరంతరం సరైన రీతిలో రక్తప్రసరణ అవసరం. ఏళ్ల తరబడి అధిక రక్తపోటు ఉంటే మెదడులోని క్యాపిల్లరీస్ అనే అత్యంత చిన్న చిన్న రక్తనాళాలు దెబ్బతినవచ్చు. ఇలా జరగడమన్నది ఒక్కసారిగా పెద్ద సమస్యను కలిగించనప్పటికీ... కాలక్రమంలో జ్ఞాపకశక్తినీ, ఆలోచనా సామర్థ్యాన్ని దెబ్బతీయవచ్చు. దాంతో ఈ సమస్య కారణంగా మతిమరపు వచ్చే అవకాశమూ ఉండవచ్చు.ఈ అధ్యయనాలే తార్కాణాలు... ఒక అధ్యయనంలో దాదాపు 3,000 మంది వృద్ధులను పరిశీలించారు. ఇందులో అధిక రక్తపోటు (హైబీపీ) ఉన్నవారి మెదడులోని 48 వెట్ మ్యాటర్ తాలూకు దారుల్లో 47 చోట్ల మార్పులు ఉన్నట్లు కనిపించాయి.ఈ మార్పులు ‘ఫోర్నిక్స్’ అనే జ్ఞాపకశక్తికి సంబంధించిన దారుల్లో ఎక్కువగా కనిపించినందున అది భవిష్యత్తులో మతిమరపునకు కారణమయ్యే అంశంగా కనిపించింది. ఎందుకంటే... మెదడులోని వైట్మ్యాటర్ అనేది ఒక రకంగా మెదడులోని వివిధ భాగాల మధ్య సమాచారాన్ని తీసుకెళ్లే కమ్యూనికేషన్ నెట్వర్క్లా పనిచేస్తుంది. ఈ అధ్యయన వివరాలు ఈ ఏడాదే అంటే... 2026లోనే ‘అల్జైమర్స్ అండ్ డిమెన్షియా’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. అందుకే మంచి మెదడు ఆరోగ్యం కోసం ముందునుంచే గుండె ఆరోగ్యాన్నీ పదిలంగా కాపాడుకోవాల్సిన అవసరముందని డాక్టర్లు సూచిస్తున్నారు.మధ్య యసులో డిప్రెషన్ ఉన్నవారిలో భవిష్యత్తులో డిమెన్షియా వచ్చే అవకాశం 14 శాతం ఎక్కువగా ఉన్నట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే... ‘ద లాన్సెట్’ అనే ప్రముఖ మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైన నిపుణుల కమిషన్ నివేదిక–2024 అంచనా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా డిమెన్షియా కేసుల్లో తమకు ముప్పు తెచ్చిపెట్టగల అంశాలను గుర్తించి, వాటిని నియంత్రించడం లేదా వాటికి దూరంగా ఉండటం ద్వారా సుమారు 45 శాతం కేసులల్లో మతిమరపు లేదా మెదడు సమస్యలను నివారించడమూ లేదా వీలైనంత ఆలస్యం చేయడం సాధ్యమేనని తేలింది. అందుకే తమ మెదడుకు చేటు తెచ్చిపెట్టగల అంశాలకూ, చెడు జీవనశైలి అలవాట్లుకు మధ్యవయసు నుంచే దూరంగా ఉండటం అన్నది భవిష్యత్తులో మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుందని ‘ద లాన్సెట్’ నివేదిక వల్ల తేటతెల్లమవుతోంది.మెదడు ఆరోగ్యానికి కళ్లూ, చెవులూ కూడా ముఖ్యమే... మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి మెదడుకు సమాచారం అందించే ప్రధాన మార్గాల్లో చూపుజ్ఞానం, వినికిడి జ్ఞానం ఈ రెండూ ప్రధానమైనవి. అందుకే మన జ్ఞానేంద్రియాల్లో దాదాపు 80% సమాచారం కంటి నుంచి వస్తుండగా... మరో 20% వరకు వినికిడితో వస్తుందని చెప్పవచ్చు. మిగతా జ్ఞానేంద్రియాలైన వాసనలు తెలిపే ముక్కు, స్పర్శ తెలిపే చర్మంతో వచ్చే సమాచారం అన్నది కళ్లు, చెవులతో పోలిస్తే చాలా తక్కువ. అందుకే మంచి మెదడు ఆరోగ్యం కోసం కళ్లూ, చెవుల ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమే. అందుకే వయసు పెరుగుతున్నప్పుడు చూపు కొద్దిగా తగ్గినా, వినికిడి కాస్తంతే తగ్గినా కూడా... అది ‘వయసైపోతోంది కాబట్టి ఈ టైములో ఇలాగే ఉంటుంది’’ అని వదిలేయకూడదు. వినికిడి లేదా చూపు సమస్యలను మొదటి దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవడం మంచిదన్నది డాక్టర్ల మాట.షింగిల్స్ వ్యాక్సిన్ తీసుకోవడమూ మంచిదే... కొన్ని అధ్యయనాల ప్రకారం షింగిల్స్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో డిమెన్షియా ముప్పు తక్కువగా కనిపించింది. శరీరంలో నిద్రాణంగా ఉండే వైరస్‌ను నియంత్రించడం వల్ల రోగనిరోధక వ్యవస్థలో వచ్చే మార్పులు మెదడులో వచ్చే ఇన్ఫ్లమేషన్ను తగ్గించవచ్చని ఆ అధ్యయనాల్లో తేలింది. అయితే ఈ సందర్భంగా డాక్టర్లు మరోమాటకూడా చెబుతున్నారు. అంతమాత్రాన కేవలం షింగిల్స్ వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాల్సిందే అంటూ చెప్పలేమనీ, అది తప్పనిసరిగా డిమెన్షియాను నివారిస్తుందని కూడా చెప్పేటంతటి బలమైన ఆధారాలూ ఇప్పటికి కనిపించడం లేదన్నది కూడా డాక్టర్ల మాట. అది కేవలం ఒక పరిశీలన మాత్రమే అంటూ డాక్టర్లు సూచిస్తున్నారు.సామాజికంగా కూడా కొన్ని చర్యలు అవసరం...కేవలం వైద్యపరమైన జాగ్రత్తలూ, ముందస్తు నివారణకు అవసరమైన మందులను వాడటంతో పాటు సామాజికంగా కూడా మార్పు తెచ్చే పనులు చేపట్టడం కూడా మెదడుకు మేలు చేసే అంశమే. నడకకు మంచి దారులూ, సైక్లింగ్‌కు అనువైన రోడ్లు, స్వచ్ఛమైన గాలి కోసం మొక్కల పెంపకం, చెట్లను జాగ్రత్తగా కాపాడుకోవడం, పొగాకు, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండటం అవసరం. నగరాల్లో ఉండే పరిస్థితులను మెరుగుపరచడం, మంచి విద్యావకాశాలూ, మేలైన ప్రజా రవాణా సదుపాయాలూ, క్రీడలూ, వ్యాయామానికి అవకాశాలు, వృద్ధులు ఒంటరిగా ఉండకుండా చూసుకోవడం, వారిని నిత్యం సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేలా జాగ్రత్తపడటం వంటి పనున్నీ వృద్ధాప్యంలో మెదడు ఆరోగ్యాన్ని సానుకూలంగా ప్రభావితం చేయడమే కాకుండా పెద్దవయసులోనూ వారి ఆరోగ్యాన్ని మరింత బాగుండేలా చేస్తాయి.చివరగా... మన 70 ఏళ్ల వయసులో జ్ఞాపకశక్తిని పదిలంగా కాపాడుకోవాలంటే... అవసరమైన చర్యలను 70 ఏళ్లలోనే మొదలుపెట్టాల్సిన అవసరం లేదు. చాలాముందుగానే అంటూ మన మధ్యవయస్సు 40లు, 50ల్లోనే రక్తపోటు, షుగర్, కొలెస్ట్రాల్, బరువు, నిద్ర, వ్యాయామం, ఆహారం, వినికిడి, చూపు, మానసిక ఆరోగ్యం వంటి విషయాలపై శ్రద్ధ పెట్టడం ద్వారా భవిష్యత్తులో మన మెదడుకు మనమే ఓ మంచి ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకున్నట్టేనని గుర్తించడం అవసరమన్నది డాక్టర్ల మాట. మతిమరుపు వచ్చిన తర్వాత మెదడును కాపాడుకోవడం కంటే... మతిమరుపు వచ్చే అవకాశాలను ముందుగానే తగ్గించుకోవడమే తెలివైన పని అంటూ వైద్యులు సూచిస్తున్నారు.40, 50ల్లోనే జాగ్రత్తపడాలిమెదడులోని చిన్న చిన్న రక్తనాళాలు దెబ్బతినడం, మెదడు కణాలకు నష్టం కలగడం వంటి మార్పులు ఒక్కరోజులో జరగవు. అది ఏళ్ల కొద్దీ నెమ్మదిగా జరిగే ప్రక్రియ. దాంతో మతిమరుపు సమస్య కూడా క్రమంగా పెరుగుతూ వస్తుంది. అందుకే జ్ఞాపకశక్తి తగ్గిన తర్వాత చికిత్స మొదలుపెట్టడం కంటే, 40–50 ఏళ్ల వయసులోనే... అందుకు కారణాలను అదుపులో పెట్టుకోవడం చాలా ముఖ్యం.సమస్య బయటపడక ముందే మొదలయ్యే అల్జైమర్స్...డిమెన్షియాకు అత్యంత సాధారణ కారణం అల్జైమర్స్.అల్జీమర్స్ లక్షణాలు బయటకు కనిపించడానికి ఎన్నో సంవత్సరాల ముందునుంచే మెదడులో వచ్చే కొన్ని మార్పుల కారణంగా / పేరుకుపోయే ప్లాక్ కారణంగా ఇది మొదలయ్యే అవకాశం ఉంది. మెదడులో అమైలాయిడ్–బీటా, టీఏయూ అనే రెండు రకాలప్రోటీన్లు ప్లాక్లాగా పేరుకుపోతాయి.దాంతో మెదడులోని నాడీకణాల మధ్య సమాచార మార్పిడి దెబ్బతింటుంది. దాంతో క్రమంగా ఆ నాడీకణాలు దెబ్బతిని నశించిపోవచ్చు. ఇందులో ముఖ్యంగా హిప్పోక్యాంపస్ అనే మెదడులోని భాగం ప్రభావితమవుతుంది. ఇది కొత్త విషయాలను జ్ఞాపకంలో నిలుపుకోవడంలో చాలా ముఖ్యమైనది. అందుకే ఇటీవల జరిగిన విషయాలు గుర్తుండకపోవడం వంటి స్వల్పకాలిక జ్ఞాపకాల ప్రక్రియ (షార్ట్ టర్మ్ మెమరీ) రావచ్చు. ఇది భవిష్యత్తులో రాబోయే మతిమరపునకూ, అల్జైమర్స్ వంటి సమస్యలకూ ఓ మొదటి హెచ్చరిక లాంటి సూచన కావచ్చు.మెదడు ఆరోగ్యానికి ఉపయోగపడే మంచి నిద్రమనం గాఢంగా నిద్రపోతున్నప్పుడు మెదడులోని ఒక ప్రత్యేకమైన ద్రవ వ్యవస్థ పనిచేసి, పగటిపూట మనలో పేరుకుపోయే కొన్ని వ్యర్థ పదార్థాలూ, హానికరమైనప్రోటీన్లు, రసాయనాలను తొలగించడంలో బాగా సహాయపడుతుంది. అందుకే తమ తమ దేహ అవసరాలకు తగినట్లుగా ప్రతి ఒక్కరూ రోజూ రాత్రివేళల్లో కంటినిండా నిద్రపోవడం అన్న అంశం కూడా మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.నిద్రలేమితో బాధపడే చాలామందిలో పెద్దవయసు వచ్చాక మతిమరపు రావడం చాలా అధ్యయనాల్లో నిరూపితమైంది. అందుకే నిద్రలేమి (ఇన్సామ్నియా), నిద్రలో శ్వాస ఆగిపోవడం వంటి స్లీప్ ఆప్నియా సమస్యలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. అలాంటి సమస్యలు కనిపించినప్పుడు తప్పనిసరిగా చికిత్స తీసుకోవడమే మంచిదన్నది వైద్యనిపుణుల సూచన.చురుకైన మెదడు కోసం...- రక్తపోటు (హైబీపీ), రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ మోతాదులను క్రమం తప్పకుండా పరీక్షించుకోవడం. - వారానికి కనీసం 150 నిమిషాలు తగ్గకుండా మైల్డ్ నుంచి ఓ మోస్తరు (మాడరేట్) వ్యాయామాలు చేయడం. - తమ బరువు ఆరోగ్యకరమైన బీఎమ్ఐతో ఉండేలా చూసుకోవడం. - బేకరీ ఐటమ్స్ వంటి బాగా ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించడం.-కూరగాయలు, పండ్లు, నట్స్, కొవ్వులు తక్కువగా ఉండేప్రోటీన్లతో కూడిన ఆహారం ఎక్కువగా తీసుకోవడం. - మద్యం, పొగాకు పూర్తిగా మానేయడం.- వినికిడి లేదా చూపు సమస్యలను నిర్లక్ష్యం చేయకపోవడం.- డిప్రెషన్, ఒంటరితనం లేదా ఇతరులతో కలవాలనే ఆసక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు కనిపిస్తుంటే తొలిదశల్లోనే కుటుంబ సభ్యుల లేదా మిత్రుల సహాయం తీసుకుని వైద్య నిపుణులను సంప్రదించడం.- స్నేహితులను తరచూ కలుస్తూ ఉండటంతో పాటు సామాజిక కార్యకలాపాలూ, కమ్యూనిటీ కార్యక్రమాల్లో పాల్గొనడం. - తమ మనసును ఆహ్లాదపరిచే అభిరుచుల మేరకు మంచి హాబీలను అలవరచుకొని వాటిని నిత్యం ప్రాక్టీస్ చేయడం. - నిద్రలేమి, గురక (ఆప్నియా) వంటి సమస్యలకు తగన చికిత్స తీసుకోవడం. - కొత్త భాషలూ, కొత్త విషయాలను నేర్చుకోవడంతో పాటు ప్రతిరోజూ పజిల్స్ పూర్తి చేయడం...మన దేశవాసులకు మరింత ముందస్తు జాగ్రత్త అవసరం...పాశ్చాత్య దేశాల వారితో పోలిస్తే మన దేశవాసుల్లో అధిక రక్తపోటు (హైబీపీ), మధుమేహం (డయాబెటిస్) చాలా ముందుగానే మొదలయ్యే అవకాశాలెక్కువ. అంతేకాదు... యూరోపియన్ దేశవాసులతో పోల్చినప్పుడు మన దేశవాసుల రక్తనాళాల అంత వెడల్పుగా ఉండక ఒకింత సన్నగా ఉంటాయి. అందుకే మన దేశవాసుల్లో రక్తనాళాలు సన్నబడటం వల్ల వచ్చే కరొనరీ ఆర్టరీ డిసీజెస్ (సీఏడీ వంటి గుండెజబ్బులు) చాలా త్వరగా వస్తుంటాయన్నది అనేక అధ్యయనాల్లో తేలిన ఒక పరిశీలన.ఈ నేపథ్యంలో ఈ తరహా సమస్యలు ఎక్కువ ఏళ్ల పాటు మన శరీరంలో కొనసాగుతూ ఉన్నప్పుడు వాటి సమగ్ర ప్రభావం అన్నది మెదడుపైనా ఎక్కువ కాలంపాటు కొనసాగవచ్చు. దాంతో పాశ్చాత్యదేశాలవారితో పోలిస్తే మన భారతీయుల్లో భవిష్యత్తులో జ్ఞాపకశక్తి తగ్గేలాంటి అవకాశాలు ఎక్కువ. అంతేకాదు... ఇటీవల మారుతున్న దేశకాలమాన పరిస్థితుల నేపథ్యంలో మన వృత్తుల్లో సైతం శారీరక శ్రమ లేకపోవడం, దాంతో ఊబకాయం పెరగడం, వాయు కాలుష్యం కూడా పెరగడం జరుగుతున్నాయి.ఇవన్నీ మనదేశవాసుల్లో మెదడు ఆరోగ్యానికి ముప్పు కలిగించే అంశాలే అన్నది పలువురు వైద్యనిపుణుల అభిప్రాయం. అందుకే మనదేశవాసులు తమ మధ్యవయసు నుంచే మధుమేహం, అధిక రక్తపోటు వంటి జబ్బులపై చిన్నవయసునుంచే అవగాహన పెంచుకోవడమే కాకుండా... వీలైతే తమ 40ల నుంచే తరచూ షుగర్ పరీక్షలూ, బీపీని కొలవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటం, కుటుంబ చరిత్రలో రిస్క్‌ఫ్యాక్టర్లు ఉన్నవారు డాక్టర్లు సూచించినట్లుగా ప్రతి ఏడాదిగానీ... లేదా డాక్టర్ల సూచించిన వ్యవధుల్లో తగిన పరీక్షలు చేయించుకుంటూ ఉండటం మేలు.- డా. విక్రమ్ కిషోర్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్.నిర్వహణ : యాసీన్ఇదీ చదవండి: వ్యాయామం తర్వాత కంప్రెషన్ దుస్తులు ఎందుకు ధరిస్తారు? -
ఏఐతో వైద్యరంగం గందరగోళం.. సమస్య ఎక్కడుంది?
వైద్య రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం రోజురోజుకూ విస్తరిస్తోంది. ముఖ్యంగా స్కాన్లను విశ్లేషించడం, అసాధారణ పరిస్థితులను గుర్తించడంలో ఏఐ ఇప్పటికే స్థానం సంపాదించింది. అయితే చికిత్సలను సూచించడం, క్లినికల్ నిర్ణయాలకు సహకరించడం వంటి స్కాన్లకు మించిన వినియోగాల విషయంలో వైద్యులు మాత్రం వెనకడుగు వేస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఏఐ సామర్థ్యంపై వాస్తవ ప్రపంచంలో సరిపడా ఆధారాలు లేకపోవడమేనని వారు చెబుతున్నారు.స్కాన్లలో ఏఐకి స్పష్టమైన ఆధారం ఎక్కడ?ఇమేజింగ్ రంగంలో ఏఐకి ఆదరణ లభించడానికి ఒక ముఖ్య కారణం దాని పనితీరును సులభంగా గుర్తించే అవకాశం ఉండటం. ఒక స్కాన్‌ను ఏఐ సరిగ్గా చదివిందా? అందులోని అసాధారణ పరిస్థితిని గుర్తించిందా? అనే విషయాలను స్పష్టమైన ఫలితాలతో పోల్చుకోవచ్చు. దీంతో ఏఐ పనితీరును నిర్ధారించడం కొంత సులభమైంది. అయితే చికిత్స సూచనలు లేదా క్లినికల్ నిర్ణయాలకు సంబంధించిన ఏఐ సాధనాల పనితీరును అంచనా వేయడం అంత సులభం కాదు.‘ఎవిడెన్స్ గ్యాప్’పై వైద్యుల అనుమానాలురేడియాలజీ, డయాగ్నస్టిక్స్ పరిధిని దాటి ఆసుపత్రుల్లోకి ఏఐ సాధనాలను తీసుకెళ్లేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. అయితే వైద్యులు మాత్రం ముందుగా వాటి వాస్తవ పనితీరుకు సంబంధించిన ఆధారాలను చూపించాలని కోరుతున్నారు. కొత్త ఔషధం లేదా వైద్య పరికరాన్ని ఉపయోగించే ముందు దాని ప్రభావం, భద్రతపై ఆధారాలు కోరినట్లుగానే ఏఐ విషయంలోనూ అదే ప్రమాణాలను పాటించాలని వారు భావిస్తున్నారు. ఈ కారణంగా కొన్ని ఏఐ ప్రాజెక్టులు ఆసుపత్రుల్లో వినియోగ దశకు చేరకముందే కొనుగోలు ప్రక్రియలోనే నిలిచిపోతున్నాయి.74 శాతం మందిని వేధిస్తున్న ‘డెస్కిల్లింగ్’ భయం?2026లో అమెరికాకు చెందిన వైద్యులు, నర్సులపై నిర్వహించిన ఓ సర్వేలో రెండు అంశాలు ప్రత్యేకంగా ఆందోళన కలిగిస్తున్నట్లు వెల్లడైంది. 74 శాతం మంది ఏఐపై అధికంగా ఆధారపడటం వల్ల వైద్య నిపుణుల స్వంత నైపుణ్యాలు క్రమంగా తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఏఐ తప్పు చేసినప్పుడు దాన్ని గుర్తించే మానవ సామర్థ్యం కూడా తగ్గిపోవచ్చని వారు భావిస్తున్నారు. దీనినే ‘డెస్కిల్లింగ్’గా పేర్కొంటున్నారు. అదే సర్వేలో మరో 74 శాతం మంది ఏఐ తప్పుడు సమాచారాన్ని నమ్మకంగా అందించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఉదాహరణకు లేని వైద్య అధ్యయనాలను ఉన్నట్లుగా పేర్కొనడం లేదా తప్పు సమాచారాన్ని వాస్తవంలా చూపించడం వంటి సమస్యలు వైద్య రంగంలో తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు. ఏఐపై ఆధారపడే కొద్దీ దాని తప్పులను గుర్తించే మానవ పరిశీలనా సామర్థ్యం తగ్గితే ఈ రెండు ప్రమాదాలు పరస్పరం మరింత ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది.మార్పును వ్యతిరేకిస్తున్నారా?వైద్యులు ఏఐని వ్యతిరేకిస్తున్నారని చెప్పడం కంటే, ఆధారాల కోసం వారు పట్టుబడుతున్నారని చెప్పవచ్చు. వైద్య నిర్ణయాల్లో పొరపాట్ల ప్రభావం నేరుగా రోగులపై పడే అవకాశం ఉండటంతో కొత్త సాంకేతికతను స్వీకరించే ముందు దాని ప్రభావానికి ఆధారాలు ఉండాలని వైద్య రంగం కోరుతోంది. ఏఐ సాధనం పనిచేస్తున్నదని నిరూపించాల్సిన బాధ్యత దాన్ని అభివృద్ధి చేసి విక్రయించే సంస్థలపైనే ఉండాలని వైద్యులు భావిస్తున్నారు.ఉపయోగకరమైన ఏఐని స్వాగతించాలిఅయితే అతిగా జాగ్రత్త వహించడం వల్ల ఉపయోగకరమైన సాంకేతికతలను కూడా దూరం చేసే ప్రమాదం ఉంది. పత్రాల నిర్వహణను తగ్గించడం, ఔషధాల మధ్య ప్రమాదకర పరస్పర చర్యలను గుర్తించడం, వైద్యులకు రోగులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం కల్పించడం వంటి ప్రయోజనాలను కొన్ని ఏఐ సాధనాలు అందించే అవకాశం ఉంది. అందువల్ల పూర్తిగా అవును లేదా కాదు అనే విధానం కంటే, వాస్తవ ప్రపంచ అధ్యయనాలు, పనితీరు నిర్ధారణ, స్పష్టమైన పర్యవేక్షణ వ్యవస్థలతో దశలవారీగా ఏఐని అమలు చేయడం కీలకంగా మారుతోంది. వైద్యుల నైపుణ్యాలను తగ్గించకుండా వాటిని మరింత బలోపేతం చేసే విధంగా ఏఐని రూపొందించడం భవిష్యత్తులో ముఖ్యమైన అంశంగా మారనుంది. ఇదీ చదవండి: ఐదు నిమిషాల టెస్ట్‌తో అల్జీమర్స్ బయటపడుతుందా? -
ఐదు నిమిషాల టెస్ట్‌తో అల్జీమర్స్ బయటపడుతుందా?
వయసు పెరుగుతున్న కొద్దీ జ్ఞాపకశక్తి తగ్గుతున్నట్లు అనిపిస్తే.. అది అల్జీమర్స్ వ్యాధికి సంకేతమేనా? ఇంటర్నెట్లో కనిపించే ఐదు నిమిషాల మెమరీ టెస్టులు ఈ ప్రశ్నకు సమాధానం చెబుతాయా? నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇలాంటి పరీక్షలు మెదడు పనితీరులో సమస్య ఉందేమో గుర్తించడంలో ఉపయోగపడతాయి కానీ, అల్జీమర్స్‌ను నిర్ధారించేంత శక్తి వాటికి లేదు. జ్ఞాపకశక్తి తగ్గడానికి చికిత్స చేయగల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా కారణం కావచ్చని గురుగ్రామ్‌కు చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ అభిషేక్ దీక్షిత్ తెలిపారు.ఐదు నిమిషాల టెస్ట్ ఏం చెబుతుంది?అల్జీమర్స్ వ్యాధి జ్ఞాపకశక్తితో పాటు ఇతర కీలకమైన జ్ఞాన సంబంధిత సామర్థ్యాలపై ప్రభావం చూపుతుంది. అందుకే వైద్యులు కొన్నిసార్లు త్వరిత మెమరీ పరీక్షలను స్క్రీనింగ్ కోసం ఉపయోగిస్తారు. మినీ-మెంటల్ స్టేట్ ఎగ్జామినేషన్ (ఎంఎంఎస్ఈ), ఫైవ్-మినిట్ కాగ్నిటివ్ టెస్ట్ వంటి పరీక్షలు స్వల్పకాలిక జ్ఞాపకశక్తి, వ్యక్తికి ఉన్న స్థల-కాల అవగాహన, ప్రాథమిక సమస్య పరిష్కార సామర్థ్యాలను పరిశీలిస్తాయి. ఇవి జ్ఞాన సామర్థ్యంలో లోపం ఉండే అవకాశాన్ని గుర్తించడంలో సహాయపడతాయి. అయితే ఇవి తుది నిర్ధారణ పరీక్షలు కావు. డాక్టర్ దీక్షిత్ వీటిని కారులోని ‘వార్నింగ్ లైట్’తో పోల్చారు. సమస్యపై వైద్యుడిని అప్రమత్తం చేస్తాయి కానీ అసలు కారణాన్ని స్వయంగా చెప్పలేవని వివరించారు.టెస్ట్‌లో తక్కువ స్కోర్ అంటే అల్జీమర్స్ కాదుమెమరీ టెస్ట్‌లో పనితీరు సరిగా లేకపోయిందని వెంటనే అల్జీమర్స్ ఉందని భావించకూడదు. తీవ్రమైన విటమిన్ బి12 లోపం, నియంత్రణలో లేని హైపోథైరాయిడిజం, దీర్ఘకాలిక డిప్రెషన్, చికిత్స పొందని మధుమేహం వల్ల కలిగే రక్తనాళాల నష్టం వంటి సమస్యలు కూడా జ్ఞాపకశక్తి తగ్గడానికి కారణం కావచ్చు. వృద్ధుల్లో మూత్రనాళ ఇన్ఫెక్షన్లు కూడా అకస్మాత్తుగా జ్ఞాపకశక్తి లేదా జ్ఞాన సామర్థ్యంలో మార్పులకు దారితీయవచ్చని నిపుణుడు పేర్కొన్నారు. అంటే టెస్ట్ ఒక సమస్యను గుర్తించినా.. దాని వెనుక ఉన్న అసలు కారణాన్ని గుర్తించడానికి మరిన్ని పరీక్షలు అవసరం.అల్జీమర్స్‌ను టెస్ట్ ఎందుకు నిర్ధారించదు?అల్జీమర్స్‌కు సంబంధించిన మార్పులు మెదడులో జీవశాస్త్రపరమైన స్థాయిలో జరుగుతాయి. ముఖ్యంగా అమైలాయిడ్ ప్లాక్‌లు, టావ్ ట్యాంగిల్స్ పేరుకుపోవడం వంటి మార్పులు ఇందులో భాగంగా ఉంటాయి. కాగితంపై ప్రశ్నలకు సమాధానాలు చెప్పే చిన్న మెమరీ పరీక్షలు మెదడులో జరుగుతున్న ఈ భౌతిక మార్పులను గుర్తించలేవు. అంతేకాకుండా పరీక్ష సమయంలో వ్యక్తి ఆందోళన, అలసట లేదా నిద్రలేమితో ఉంటే కూడా జ్ఞాపకశక్తి పరీక్షలో పనితీరు ప్రభావితమవుతుంది. దీనివల్ల తప్పుడు పాజిటివ్ ఫలితం రావచ్చని డాక్టర్ దీక్షిత్ హెచ్చరించారు.అసలు నిర్ధారణకు ఏం చేస్తారు?అల్జీమర్స్ నిర్ధారణ కోసం వైద్యులు ఒక్క మెమరీ టెస్ట్‌పైనే ఆధారపడరు. రోగి ఆరోగ్య చరిత్రను వివరంగా తెలుసుకోవడంతో పాటు, కుటుంబ సభ్యులతో మాట్లాడి రోజువారీ పనితీరులో వచ్చిన మార్పులను అంచనా వేస్తారు. వివిధ రకాల జ్ఞాన సామర్థ్యాలను పరిశీలించే సమగ్ర న్యూరోసైకాలజికల్ పరీక్షలు కూడా నిర్వహిస్తారు. ఈ ప్రక్రియలో రోగి సమస్య ఎప్పుడు ప్రారంభమైంది, కాలక్రమంలో ఎలా మారింది, రోజువారీ కార్యకలాపాలపై ఎంత ప్రభావం చూపుతోంది వంటి అంశాలను పరిశీలించడం కీలకం.ఎంఆర్ఐ నుంచి రక్త పరీక్షల వరకు..అల్జీమర్స్‌ను ఇతర కారణాల వల్ల కలిగే జ్ఞాపకశక్తి సమస్యల నుంచి వేరు చేయడానికి వైద్యులు మెదడు ఇమేజింగ్ పరీక్షలను కూడా చేస్తారు. ఇందులో ఎంఆర్ఐ లేదా సీటీ స్కాన్లు ఉంటాయి. అవసరాన్ని బట్టి నిర్దిష్ట రక్త బయోమార్కర్లు, సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ (సీఎస్ఎఫ్)పరీక్షలు కూడా నిర్వహించవచ్చు. అందువల్ల ఐదు నిమిషాల మెమరీ టెస్ట్‌ను అల్జీమర్స్ నిర్ధారణగా భావించకుండా, వైద్యుడితో తదుపరి పరిశీలనకు ప్రారంభ సంకేతంగా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. జ్ఞాపకశక్తిలో మార్పులు కనిపిస్తే స్వయంగా వ్యాధి నిర్ధారణ చేసుకోకుండా వైద్యుడిని సంప్రదించడం ముఖ్యమని చెబుతున్నారు.ఇదీ చదవండి: Uttarakhand: నకిలీ పత్రాలతో ఎంబీబీఎస్ అడ్మిషన్లు? -
బాబు తినడం లేదా? అసలు కారణం ఇదే!
మా బాబు వయసు మూడున్నరేళ్లు. సరిగ్గా తినడం లేదు. కొంచెం తిన్న వెంటనే ఇక చాలు అంటున్నాడు. అందుకే, వయసుకు తగ్గట్టు ఎత్తు, బరువు పెరగడం లేదు అనుకుంటున్నాను. మా అబ్బాయి బాగా తినాలంటే ఏం చేయాలి?– రమణి, హైదరాబాద్.పిల్లల విషయంలో అసలు ప్రశ్న ‘ఎంత తిన్నాడు?’ అనేది కాదు ‘ఏం తిన్నాడు?’ అనేదే. పిల్లల కడుపు నిండితే సరిపోదు. మెదడు ఎదగాలి, ఎముకలు బలపడాలి, కండరాలు పెరగాలి, రోగనిరోధక శక్తి మెరుగవ్వాలి! పిల్లల పెరుగుదలకు క్యాలరీల కంటే క్వాలిటీ న్యూట్రిషన్ ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహారం గురించి ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు..మెదడుకు ‘ఫ్యూయల్’ కావాలి!పిల్లల జీవితంలోని తొలి సంవత్సరాలు మెదడు అభివృద్ధికి ఎంతో కీలకం. ఈ సమయంలో ప్రొటీన్ , ఐరన్ , జింక్, అయోడిన్ , ఒమేగా–3 ఫ్యాటీ ఆసిడ్స్, విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు అందేలా చూడాలి.ఐరన్ ఎంతో ముఖ్యమైనది! ఐరన్ తక్కువైతే రక్తహీనత మాత్రమే కాదు, ఏకాగ్రత, చురుకుదనం తగ్గి, నేర్చుకునే సామర్థ్యం ప్రభావితం కావచ్చు. అందుకే పప్పులు, ఆకుకూరలు, గుడ్డు, మాంసాహారం, రాగి వంటివి పిల్లల భోజనంలో చేర్చాలి. ఐరన్ ఉన్న ఆహారంతో పాటు నిమ్మ, జామ, ఉసిరి వంటి విటమిన్ –సి ఉన్న పదార్థాలు ఇస్తే ఐరన్ శరీరంలోకి బాగా చేరుతుంది.ప్రొటీన్ ఎదుగుదలకు బిల్డింగ్ బ్లాక్స్!‘బాబు బాగా తింటున్నాడు’ అనడం కంటే ‘బాబుకు రోజూ మంచి ప్రొటీన్ అందుతోందా?’ అని ఆలోచించండి. గుడ్డు, పాలు, పెరుగు, పప్పులు, శనగలు, పెసలు, చేపలు, మాంసం వంటివన్నీ పిల్లల ఎదుగుదలకు మంచి ప్రొటీన్ వనరులు.బలమైన ఎముకలకు పాలు!పాలు మంచివే. కానీ ఎముకల బలానికి పాలు ఒక్కటే సరిపోవు. కాల్షియం, విటమిన్ –డి, శారీరక చలనం కూడా అవసరం. పాలు, పెరుగు, రాగి, నువ్వులు, పనీర్ వంటి వాటి ద్వారా కాల్షియం అందుతుంది. వైద్యుల సూచన మేరకు అవసరమైతే మందుల ద్వారా కూడా తీసుకోవటం ఉత్తమం.జింక్ కొంచెమే... ఫలితమే ఘనంజింక్ పిల్లల ఎదుగుదలకు, కణాల అభివృద్ధికి, రోగనిరోధకతకు సహాయపడుతుంది. పప్పులు, గింజలు, నువ్వులు, గుడ్లు, చేపలు, మాంసాహారం వంటి వాటిలో జింక్ లభిస్తుంది.విటమిన్ –ఏ అంటే క్యారెట్ మాత్రమేనా?కాదు. విటమిన్ –ఏ కళ్ల ఆరోగ్యంతో పాటు రోగనిరోధక శక్తికి కూడా ముఖ్యమైనది. క్యారెట్‌తో పాటు గుమ్మడికాయ, ఆకుకూరలు, మామిడి, బొప్పాయి వంటి రంగురంగుల పండ్లు, కూరగాయలను పిల్లల ఆహారంలో చేర్చాలి. పిల్లల ప్లేట్లో రంగులు పెరిగితే, పోషకాల్లో కూడా వైవిధ్యం పెరుగుతుంది.ఒమేగా–3 ఎందుకు అవసరం?ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడు, కళ్ల అభివృద్ధికి ఉపయోగపడతాయి. చేపలు దీనికి మంచి వనరులు. శాకాహారంలో అవిసె గింజలు, చియా గింజలు, వాల్నట్స్ వంటి వాటి ద్వారా కూడా ఇవి లభిస్తాయి. అయితే చిన్నపిల్లలకు గింజలు, నట్స్ ఇస్తున్నప్పుడు వయసుకు తగినట్లు సురక్షిత రూపంలోనే ఇవ్వాలి.పిల్లల ప్లేట్‌కి ‘5 కలర్స్’ చాలెంజ్!పిల్లల ప్లేట్లో పసుపు రంగులో ధాన్యం అన్నం, రొట్టె, రాగి, జొన్న; ఆకుపచ్చ రంగులో కూరగాయలు, ఆకుకూరలు; ఎరుపు రంగులో పప్పు, గుడ్డు, చేప, మాంసం; నారింజ రంగులో పండు; తెలుపు రంగులో పాలు, పెరుగు ఉండేలా ప్రయత్నించండి. వివిధ రకాల ఆహారాలను కలిపి ఇవ్వడం వల్ల పిల్లలకు అనేక రకాల పోషకాలు అందుతాయి.చిరుతిండ్లు పూర్తిగా మానేయాలా?పూర్తిగా నిషేధించడం కంటే వాటిని అలవాటుగా మారకుండా చూడటం ముఖ్యం. రోజూ కాకుండా అప్పుడప్పుడు మాత్రమే ఇవ్వడం మంచిది. తరచుగా ప్యాకెట్ ఆహారం, తీపి పానీయాలు అధికంగా ఇవ్వడం వల్ల పిల్లల ఆహార నాణ్యత తగ్గుతుంది.మొబైల్ చూపిస్తూ తినిపించడం తప్పా?తినేటప్పుడు మొబైల్ చూపించడం అలవాటుగా మారితే పిల్లలు ఆకలి, తృప్తి సంకేతాలను గమనించకుండా తినే అవకాశం ఉంటుంది. భోజనం చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు మొబైల్‌ను పక్కన పెట్టి, పిల్లలతో మాట్లాడటం, వాళ్లు తినే ఆహారంపై దృష్టి పెట్టేలా చేయడం మంచిది.బొద్దుగా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టేనా?అసలు కాదు. పిల్లల ఆరోగ్యాన్ని కేవలం బరువుతో నిర్ణయించలేం. ఎత్తు, బరువు, వయసుకు తగిన శరీర బరువు సూచిక, ఎదుగుదల పట్టికలను కలిపి చూడాలి. బరువు తక్కువగా ఉండటమే ఆందోళనకరం కాదు, అధిక బరువు కూడా అంతే శ్రద్ధ పెట్టాల్సిన విషయమే.ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి?పిల్లల బరువు సరిగ్గా పెరగకపోతే, ఎత్తు పెరుగుదల మందగిస్తే, తరచు అనారోగ్యానికి గురైతే, చాలాకాలంగా ఆకలి తగ్గిపోయి ఉంటే లేదా ఎప్పుడూ నీరసంగా కనిపిస్తే దాన్ని కుటుంబంలో అందరికీ ఇలాగే ఉంటుంది అని వదిలేయకండి. పిల్లల వైద్య నిపుణుడిని సంప్రదించడం మంచిది.చివరగా ఒక మాట– పిల్లల ప్లేట్ నిండితే సరిపోదు, అది పోషకాలతో నిండాలి.- డా‘‘ కె. పవన్ కుమార్, సీనియర్ పీడియాట్రిషియన్, పీడియాట్రిక్ అలర్జిస్ట్, ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్ఇదీ చదవండి: Health: నో ఆపరేషన్, నో చిప్స్... కేవలం ఐ డ్రాప్స్‌తో మళ్లీ చూపు! -
Health: నో ఆపరేషన్, నో చిప్స్... కేవలం ఐ డ్రాప్స్‌తో మళ్లీ చూపు!
కంటి చూపుతో చంపేస్తానంటాడు ఒక తెలుగు సినిమాలో హీరో. అవును! కంటికి అంత పవర్ ఉంది. ఆ పవర్ అంతా ఆ కన్ను చూసే చూపులో ఉంది. అంతటి శక్తిమంతమైన చూపు... క్షీణిస్తే?! జీవితం అనుక్షణ దుర్భరం అవుతుంది. ఆ దుర్భర త్వాన్ని తొలగించి తిరిగి చూపును రప్పించే ‘చుక్కల మందు’ను శాస్త్ర పరిశోధకులు తాజాగా కనిపెట్టారు. ఎలుకలు, జెబ్రాఫిష్పై ఫలించిన ఆ ప్రయోగాలు ఇప్పుడు మానవుల మీద మొదలవుతున్న దశలో ఉన్నాయి.చూపు కోల్పోయిన ఎలుకలపై శాస్త్రవేత్తలు చేసిన ఈ ప్రయోగం నిజంగా అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. కాంతికి స్పందించే ఒక ప్రత్యేకమైన రసాయనాన్ని తయారుచేసి, దానిని కంటి చుక్కల మందు రూపంలో అందించినప్పుడు, చూపు లేని ఆ ఎలుకలు మళ్లీ వెలుగును గుర్తించటమే కాకుండా వెలుగుకు అనుగుణంగా స్పందించడం ప్రారంభించాయి!సాధారణంగా చూపు పునరుద్ధరణ కోసం సంక్లిష్టమైన జన్యు చికిత్సలు (జీన్ థెరపీ), కంటిలో ఆపరేషన్ చేసి ఇంప్లాంట్లు అమర్చడం లేదా ప్రత్యేకమైన లైటింగ్‌ను వాడటం వంటివి చేస్తుంటారు. కానీ ఎలాంటి సర్జరీలు లేదా చిప్‌ల అవసరం లేకుండా, కేవలం కంటి చుక్కల మందుతోనే చూపును తిరిగి తీసుకురావటం ఇది! రెండు రకాల మందుల మిశ్రమంతో శాస్త్రవేత్తలు కనిపెట్టిన దివ్యౌషధం వంటి ఈ చుక్కల మందు ఎలుకల్లో, జెబ్రాఫిష్లో చాలా బాగా పనిచేసింది. భవిష్యత్తులో దృష్టి లోపాలు, పూర్తి అంధత్వంతో బాధపడే మానవులకు కూడా చూపు తెప్పించే చికిత్సను అందించవచ్చనే ఆశను ఈ ప్రయోగం శాస్త్రవేత్తల్లో కలిగిస్తోంది.వెలుగును గుర్తించే శక్తి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 కోట్ల మంది ప్రజలు వయసు పైబడటం వల్ల వచ్చే ‘మాక్యులర్ డిజెనరేషన్’ (ఎ.ఎం.డి.), ‘రెటినైటిస్ పిగ్మెంటోసా’ (ఆర్.పి.) వంటి వ్యాధుల వల్ల చూపు కోల్పోతున్నారు. ఈ అంధత్వం కారణంగా వ్యక్తుల రోజువారీ జీవితం, స్వేచ్ఛ దెబ్బతినడమే కాకుండా, వైద్య ఖర్చులు, ఉత్పాదకత తగ్గడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఏటా రూ. 33,40,000 కోట్లకు పైగా భారం పడుతోంది.మన కంటిలోని రెటీనాలో ఉండే ‘ఫొటోరిసెప్టర్’ కణాలు కాంతిని గుర్తుపట్టి దాన్ని సంకేతాలుగా మారుస్తాయన్నది తెలిసిందే. అయితే ఎ.ఎం.డి., ఆర్.పి. వ్యాధులలో ఈ ఫొటోరిసెప్టర్ కణాలు నెమ్మదిగా క్షీణించి చనిపోతాయి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ ఫొటోరిసెప్టర్లు చనిపోయినప్పటికీ, కంటి లోపల ఉండే మిగిలిన నరాల వ్యవస్థ మాత్రం చాలా వరకు ఆరోగ్యంగానే పనిచేస్తూ ఉంటుంది! కానీ కాంతిని గ్రహించే ఫొటోరిసెప్టర్లు లేకపోవడం వల్ల, ఈ నరాలకు వెలుగు సంకేతాలు అందక మెదడుకు సమాచారం వెళ్లదు.అందుకే శాస్త్రవేత్తలు కంటిలో సజీవంగా ఉన్న ఈ మిగిలిన నరాల వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని, వాటికి మళ్లీ కాంతిని గుర్తించే శక్తిని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న జన్యు చికిత్సలు కేవలం కొద్దిమంది రోగులకు మాత్రమే ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఎలక్ట్రానిక్ రెటీనా పరికరాలు చాలా ఖరీదైనవి, సర్జరీ అవసరమైనవి. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తల ఈ చుక్కల మందు మంచి ఫలితాలు సాధించినప్పటికీ, అంధులకు సాధారణ కాంతిలో కూడా స్పష్టమైన దృష్టిని అందించడం ఇప్పటికీ ఒక పెద్ద సవాలుగానే మిగిలింది.చికిత్స సరళం.. సురక్షితంఇన్స్టిట్యూట్ ఫర్ బయోఇంజినీరింగ్ ఆఫ్ కెటలోనియా ఆధ్వర్యంలోని పరిశోధకుల బృందం కాంతి ఆధారంగా స్విచ్‌లా పనిచేసే ఈ కొత్త రకం చుక్కల మందు అణువులను తయారుచేసింది. ఈ పరిశోధన ఫలితాలు ‘జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కెమికల్ సొసైటీ’ లో ప్రచురితమయ్యాయి.చనిపోయిన ఫొటోరిసెప్టర్లు చేసే పనిని తమపైన వేసుకునే విధంగా ఈ రసాయన సమ్మేళనాలను పరిశోధకులు రూపొందించారు. వీటిని కంటికి ఇంజెక్షన్ ద్వారా లేదా కంటి చుక్కల మందు రూపంలో నేరుగా వేయవచ్చు. దీనికోసం ఎలాంటి జన్యు మార్పులు, లేదా కంటిలో పరికరాలు అమర్చడం వంటివి చేయాల్సిన అవసరం లేదు. అలాగే, ఇవి సురక్షితమైనవని కూడా రుజువైంది.‘‘ఈ అణువులు అంధత్వాన్ని శాశ్వతంగా నయం చేయలేవు, ఎందుకంటే ఇవి ఫొటోరిసెప్టర్ కణాలు చనిపోవడాన్ని నిలిపివేయలేవు. కానీ, ఇవి చూపును తిరిగి తెప్పించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. అంధులకు అత్యంత తేలికైన, సులువైన పద్ధతిలో చూపును అందించడం వీటి ప్రధాన విశేషం’’ అని కెటలోనియా ప్రొఫెసర్ పావ్ గోరోస్టిజా అంటున్నారు. ఈ అధ్యయన సహ రచయిత్రి రోసల్బా సోర్టినో మాట్లాడుతూ.. ‘‘ఆరోగ్యవంతమైన కంటి రెటీనా ఏ విధంగా పనిచేస్తుందో, సరిగ్గా అదే రకమైన అణు ప్రక్రియ ద్వారా చూపును పునరుద్ధరించడమే మా లక్ష్యం. కంటి నరాల వ్యవస్థను దాటి పోకుండా, చనిపోయిన ఫొటోరిసెప్టర్ల స్థాయిలోనే రెటీనాను మళ్లీ క్రియాశీలం చేయడానికి మేము ప్రయత్నించాం’’ అని తెలిపారు.సుమారు 10 ఏళ్లకు పైగా సాగిన సుదీర్ఘ పరిశోధనల ఫలితంగా ఈ విజయం సాధ్యమైంది. ఆల్కాలా విశ్వవిద్యాలయం, స్పెయిన్ జాతీయ పరిశోధనా మండలి, బార్సిలోనా విశ్వవిద్యాలయం, ఇంకా పలు ప్రముఖ పరిశోధన సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు కలిసి ఈ అద్భుతాన్ని సాధించారు.మందు పని చేసే విధానంమన కంటిలో కాంతిని గుర్తించే ‘ఫొటోరిసెప్టర్లు’ సాధారణంగా సమాచారాన్ని ‘ఆన్ బైపోలార్’ అనే కంటి నరాల కణాలకు అందిస్తాయి. ‘‘ఆరోగ్యవంతమైన కంటిలో వెలుగు పడినప్పుడు ఆ సమాచారాన్ని మెదడుకు పంపడంలో ఈ ఆన్ బైపోలార్ కణాలు కీలక పాత్ర పోషిస్తాయి. కంటి వ్యాధుల వల్ల ఫొటోరిసెప్టర్లు చనిపోయినప్పటికీ, వాటి కింద ఉన్న ఈ నరాల వ్యవస్థ సజీవంగానే ఉంటుంది కానీ నిద్రావస్థలో ఉండిపోతుంది. సరిగ్గా ఇక్కడే వైద్య చికిత్సకు ఒక గొప్ప అవకాశం లభించింది’’ అని ఈ పరిశోధనకు సహ నేతృత్వం వహించిన దే లా విల్లా వివరించారు.ప్రోతే6 మందు కంటి సజీవ నరాల వ్యవస్థలోని ఎంగ్లూ6 అనే ప్రోటీన్‌ను టార్గెట్ చేస్తుంది. ఇలా చేయడం ద్వారా చనిపోయిన ఫొటోరిసెప్టర్లు చేయాల్సిన పనిని ప్రోతే6 తనే స్వయంగా పూర్తి చేస్తుంది. కంటిపై వెలుగు పడగానే ఈ మందు అణువులు తమ ఆకారాన్ని మార్చుకుంటాయి. ఈ ఆకార మార్పు వల్ల కంటిలో సహజంగా జరిగే చూపు ప్రక్రియ లాగానే విద్యుత్ సంకేతాలు మొదలవుతాయి. ఎటువంటి ఆపరేషన్లు, ఇంప్లాంట్లు లేదా జన్యు మార్పులు లేకుండానే రెటీనా మళ్లీ వెలుగును గుర్తించేలా చేస్తున్నందున శాస్త్రవేత్తలు వీటిని ‘మాలిక్యులర్ ప్రోస్థెసిస్’ (అణు పరికరాలు) అని పిలుస్తున్నారు.ఈ విధానంలో ఉన్న మరో గొప్ప విశేషం ఏంటంటే... ఇది సాధారణ వెలుతురులో కూడా అద్భుతంగా పనిచేస్తుంది. కొన్ని ఇతర పద్ధతుల్లో లాగా కంటికి ప్రత్యేకమైన బ్రైట్ లైట్లు లేదా కాంతిని పెంచే పరికరాలు అమర్చే అవసరం ఇందులో అవసరం లేదు. ఈ అణువులు చాలా చిన్నవి, నీటిలో కరిగే గుణం ఉన్నవి. ఇవి మనం ఇంట్లో వాడే సాధారణ లైటింగ్ లేదా బయట ఉండే పగటి వెలుతురుకి కూడా స్పందించి చూపును పునరుద్ధరిస్తాయి.అంధులకు వరంఒకవేళ ఈ కంటి చుక్కల ప్రయోగం మానవులపై కూడా అనుకున్నట్లుగా విజయవంతమైతే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఖరీదైన చూపు–పునరుద్ధరణ సాంకేతికతలకు ఇది ఒక సులువైన, అందుబాటు ధరలోని ప్రత్యామ్నాయం అవనుంది.. ముఖ్యంగా తీవ్రమైన అంధత్వంతో బాధపడుతూ, ఇప్పటివరకు ఎలాంటి చికిత్సా మార్గం లేని లక్షలాది మందికి ఇది ఒక గొప్ప వరంగా మారుతుంది.దారి చూపిన జెబ్రాఫిష్, ఎలుకలు ఈ చుక్కల ముందు చికిత్స ‘ఫొటోఫార్మకాలజీ’ అనే విధానంపై ఆధారపడి పనిచేస్తుంది. అంటే, మందు పనితీరును కాంతి సహాయంతో నియంత్రించటం జరుగుతుంది. శాస్త్రవేత్తలు ఏం చేశారంటే, మందు రసాయన నిర్మాణంలో కాంతికి స్పందించే ఒక చిన్న ‘లైట్ స్విచ్’ను అమర్చారు. కంటిపై వెలుగు పడగానే ఈ స్విచ్ ఆన్ అయ్యి మందు తన పని ప్రారంభిస్తుంది.ఈ పద్ధతిని ఉపయోగించి పరిశోధకులు ‘ప్రోతే6’ అని పిలిచే రసాయన సమ్మేళనాల సమూహాన్ని తయారుచేశారు. ఇవి కంటిలోని ‘ఆన్ బైపోలార్’ నరాలపై పనిచేస్తాయి. మన కంటిపై వెలుగు పడినప్పుడు, ఆ వెలుగు/కాంతి సంకేతాలను గుర్తించి, వాటిని విద్యుత్ తరంగాలుగా మార్చి మెదడుకు పంపడంలో ఈ ఆన్ బైపోలార్ నరాలు కీలక పాత్ర పోషిస్తాయి. (కంటిపై వెలుతురు పడగానే ఈ నరాలు ఉత్తేజితమై పనిచేయడం ప్రారంభిస్తాయి కనుకనే వీటిని ‘ఆన్’ బైపోలార్ కణాలు అంటారు. చీకటి పడినప్పుడు పనిచేసేవాటిని ‘ఆఫ్’ బైపోలార్ కణాలు అంటారు). దృష్టి స్పష్టతను పరీక్షించడానికి ఉపయోగించే ‘జెబ్రాఫిష్’ లార్వాలలో ఈ మందు వేయగానే, అవి తమ చూపు శక్తితో కంటి గుడ్లను తిప్పడం ప్రారంభించాయి. జెబ్రాఫిష్ లార్వాలే ఎందుకంటే, వాటి కంటి నిర్మాణం, నాడీ వ్యవస్థ.. మానవుల కంటిని పోలి ఉంటాయి.అంతేకాకుండా, మాక్యులర్ డీజెనరేషన్, రెటినైటిస్ పిగ్మెంటోసా వల్ల అంధత్వం వచ్చిన ఎలుకల్లో కూడా ఈ మందుతో వెలుగును గుర్తించే సహజ ప్రవర్తన తిరిగొచ్చింది. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న ఎలుకలు ఎక్కువ వెలుగు ఉన్న ప్రాంతాల కంటే చీకటి ప్రాంతాల్లోనే ఉండటానికి ఇష్టపడతాయి. కానీ చూపు కోల్పోయిన ఎలుకలు వెలుగు–చీకటి తేడా తెలియక అన్ని చోట్లా తిరుగుతాయి. అయితే, ఈ ఎలుకలకు ‘ప్రోతే6’ మందు ఇవ్వగానే, అవి మళ్లీ స్వచ్ఛందంగా చీకటి ప్రాంతాల వైపు వెళ్లడం ప్రారంభించాయి. అంటే ఎలాంటి శిక్షణ లేకుండానే ఇవి కాంతిని గుర్తించి, దానికి అనుగుణంగా ప్రవర్తించగలుగుతున్నాయని స్పష్టం అయింది. మన ఇంట్లో ఉండే సాధారణ వెలుతురు లేదా మేఘావృతమైన రోజున బయట ఉండే వెలుతురులో కూడా ఈ మందు చాలా బాగా పనిచేసింది.ముఖ్యంగా ‘ప్రోతే6–12’, ‘ప్రోతే6–15’ అనే రెండు రకాల సమ్మేళనాలు అద్భుతమైన ఫలితాలను ఇచ్చాయి. ఇవి కంటిలోకి ఇంజెక్షన్ ద్వారా ఇచ్చినప్పుడు మాత్రమే కాకుండా, కేవలం కంటి చుక్కల మందు రూపంలో వేసినప్పుడు కూడా ఎలుకలకు చూపు తిరిగొచ్చింది!మానవుల్లో మొదలైన టెస్ట్ డోస్లుఅంధత్వ నివారణ కోసం ఈ ‘ఫొటోఫార్మాకోలాజికల్’ చుక్కల మందు మానవులపై క్లినికల్ ట్రయల్స్ దశకు చేరుకుంది. ఫొటోఫార్మాకాలజీ అనేది కేవలం ఒక ప్రయోగశాల పరిశోధనగానే మిగిలిపోకుండా, నిజమైన వైద్య చికిత్సగా మారుతోందని ఇది నిరూపిస్తోంది.ప్రోతే6 సాంకేతికత ఇప్పటికే పేటెంట్ హక్కులను పొందింది. పరిశోధకులు ప్రస్తుతం దీని సురక్షితత్వాన్ని పరీక్షించడంతో పాటు, ఒక్కసారి చుక్కల మందు వేస్తే ఆ చూపు ఎంత ఎక్కువ సమయం నిలిచి ఉంటుందో పరిశీలించేందుకు, అలాగే చూపు సమయాన్ని పెంచేందుకు రసాయన సమ్మేళనాన్ని మెరుగుపరుస్తున్నారు. ఈ సాంకేతికతను మానవ ప్రయోగాలకు, క్లినికల్ ట్రయల్స్‌కు తీసుకువెళ్లడానికి అవసరమైన పెట్టుబడులను సమకూర్చుకోవడానికి శాస్త్రవేత్తల బృందం ‘ఐల్యూమినియా’ అనే స్టార్టప్ కంపెనీతో కలిసి పనిచేస్తోంది.‘‘ఈ పరిశోధనను ఒక పరిపూర్ణ వైద్య చికిత్సగా మార్చడం సుదీర్ఘమైన, కష్టమైన ప్రక్రియ. కానీ, ఎలాంటి ఆపరేషన్లు లేకుండా, అత్యంత సురక్షితమైన రీతిలో మందుల ద్వారానే మెరుగైన చూపును తిరిగి తెప్పించవచ్చని ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయి. రోగికి ఎలాంటి జన్యు లోపం లేదా ఎలాంటి కంటి వ్యాధి ఉన్నప్పటికీ, దాదాపు అందరికీ ఇది పనిచేస్తుంది’’ అని పరిశోధక ప్రొఫెసర్ గోరోస్టిజా నమ్మకంగా చెబుతున్నారు.చీకటిని తరిమికొట్టి కొత్త ఆశల కాంతులు నింపడమే శాస్త్రసాంకేతికత సాధించే అసలైన విజయం. చూపు లేని జీవుల్లో వెలుగులు నింపిన ఈ కంటి చుక్కల మందు ప్రయోగం, రేపటి రోజున లక్షలాది మంది అంధుల జీవితాల్లో సరికొత్త రంగులను నింపుతుందని శాస్త్రవేత్తలు నమ్మకంతో ఉన్నారు. నల్లని చీకటి తెరల వెనుక వెలుగుల కోసం ఎదురుచూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఈ పరిశోధన ఒక వెలుగు దివ్వెగా మారి, వాళ్లు మళ్లీ ఈ అందమైన ప్రపంచాన్ని చూసేలా చేయాలి.- సాక్షి స్పెషల్ డెస్క్ఇదీ చదవండి: అల్జీమర్స్ నివారణకు... -
అల్జీమర్స్ నివారణకు...
పెద్దవయసులో మతిమరపు మాత్రమే కాకుండా... అసలు తామెవరో, తమ ఉనికి ఏమిటో తెలినంతంగా మరపు రావడం పెద్ద దురవస్థ. అనేక రకాల మతిమరపుల్లో చాలా ముఖ్యం. అన్ని రకాల మతిమరపు కేసుల్లో అల్జీమర్స్ కారణంగా మరపు రావడం దాదాపు 60 శాతం నుంచి 80 శాతం వరకు ఉంటుంది. ఈ నెల (సెప్టెంబరు) 21న ప్రపంచ అలై్జమర్స్ డే సందర్భంగా ఈ సమస్య నివారణకు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలేమిటో చూద్దాం...→ పెద్దవయసువారు తరచూ రక్తపాటు (బీపీ) చెక్ చేయించుకుంటూ ఉండాలి. చాలాకాలం పాటు హైబీపీ ఉండటం మతిమరపు (డిమెన్షియా)ను ఎక్కువ చేస్తుంది. అది పరోక్షంగా అల్జీమర్స్‌కూ దారితీయవచ్చు → ఆహారంలో ఉప్పు తగ్గించడం మంచిది. ఇది బీపీని నియంత్రణలో ఉంచడమే కాకుండా... పరోక్షంగా అల్జీమర్స్ నివారణకూ కొంతవరకు తోడ్పడుతుంది → నిత్యం చురుగ్గా ఉండేవారితో పాలిస్తే... మందకొడి కదలికలు ఉన్నవారిలో అల్జీమర్స్ వచ్చేందుకు 60 శాతం వరకు ఎక్కువగా అవకాశాలుంటాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. రోజూ 30 – 45 నిమిషాల పాటు నడక అల్జీమర్స్ నివారణకే కాదు... పూర్తి ఆరోగ్యానికీ దోహదపడుతుంది → నడక లాంటి వ్యాయామాలతో దేహానికే కాకుండా... మనసుకూ, మెదడుకూ వ్యాయామం ఇవ్వడం మంచిది. రోజూ పత్రికల్లో లేదా సోషల్ మీడియాలో కనిపించే పజిల్స్, సుడోకూ, గళ్లనుడికట్టు వంటి ‘మెదడుకు మేత’ అంశాల్ని ప్రాక్టీస్ చేయడం అల్జీమర్స్ నివారణకు చాలావరకు ఉపకరిస్తుంది → సృజనాత్మకంగా ఆలోచించేవారిలో అల్జీమర్స్ అవకాశాలు తక్కువని అధ్యయనాల్లో తేలింది. మంచి ఊహాశక్తితో సృజనాత్మకంగా ఆలోచిస్తూ ఉండటంతో పాటు తమ అభిరుచి మేరకు తమకు ఆసక్తి ఉన్న కళలను ప్రాక్టీస్ చేస్తుండటం కూడా దాన్ని నివారించవచ్చు.డాక్టర్ శైలేష్ మోదీసీనియర్ న్యూరాలజిస్ట్ -
నాలుగేళ్లకే షుగరొచ్చినా ఇప్పుడాయన ఛాంపియన్..!
మూడు నెలల కిందట ఇదే ఏడాది 2026 ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫ్లావియో కొబొల్లీని ఓడించి తన మొదటి గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచాడు అలెగ్జాండర్ జ్వెరెవ్. కానీ అతడు తేల్చుకోవాల్సిన పాత లెక్క ఒకటుంది. అదీ... ఆరేళ్ల కింద 2020 నాటి ఓ పాత కథ ఇది...అది 2020 నాటి యూఎస్ ఓపెన్. ఆరోజు 23 ఏళ్ల జ్వెరెవ్‌కి ప్రత్యర్థిగా ఆస్ట్రియాకు చెందిన డొమినిక్ థీమ్ ఆడుతున్నాడు. జ్వెరెవ్ మొదటి రెండు సెట్లూ గెలిచాడు. దాదాపుగా చేతికి అందేంత దగ్గర్లో ఒక గ్రాండ్‌స్లామ్ ట్రోఫీ!! ఇక కావాల్సింది కేవలం రెండంటే రెండు పాయింట్లే!! కానీ... జ్వెరెవ్ ఆ తర్వాత మూడు సెట్లు కోల్పోయి ఓటమి పాలయ్యాడు. మళ్లీ ఆరేళ్ల తర్వాత... తేదీ 2026 సెప్టెంబర్ 13... న్యూయార్క్‌లోని ఆర్థర్ యాష్ స్టేడియం... పాతికవేల మంది ప్రేక్షకులతో కిక్కిరిసిపాయిన స్టేడియం. ఒకవైపు అమెరికా యువ ఆటగాడు బెన్ షెల్టన్. ఆట జరుగుతున్నది న్యూయార్క్‌లోనే కావడంతో తమ దేశపు ఆటగాడే గెలవాలన్న కోరిక చాలామందిలో ఉండటం మామూలే. అందుకే... ‘దాదాపు 99.9% మంది ప్రేక్షకులు బెన్ షెల్టన్ గెలవాలని కోరుకుంటున్నారేమో’ అంటూ జ్వెరెవ్ సరదాగా ఓ కామెంట్ కూడా చేశాడు. చివరికి... తన ప్రత్యర్థి బెన్ షెల్టన్‌ను జర్మనీకి చెందిన 29 ఏళ్ల అలెగ్జాండర్ జ్వెరెవ్ ఓడించాడు. ఇప్పుడు జ్వెరెవ్ చేతిలో ట్రోఫీ! ఆరేళ్ల కిందట అతడు రన్నరప్. కానీ ఇప్పుడు చాంపియన్!! చుట్టూ ఎందరో ఫ్యాన్స్ ఉండవచ్చు. కానీ జ్వెరెవ్ మనసులో ఒకరున్నారు. ఒకరే ఉన్నారు. ఆ ఒకే ఒక వ్యక్తి ఆమె తల్లి ఇరీనా! అతడి మనసులో ఆ తల్లి అన్న మాటలూ ఉన్నాయి. అవేమిటో తెలుసుకోవాలనుకుంటే జ్వెరెవ్‌కు నాలుగేళ్ల వయసప్పటి కాలానికి వెళ్లాలి. జ్వెరెవ్‌కు నాలుగేళ్ల వయసున్నప్పటి కథ ఇది... డాక్టర్ చెప్పాడు... ‘‘ఈ నాలుగేళ్ల చిన్నారికి టైప్–1 డయాబెటిస్’’ అని! అప్పుడు అతడి కుటుంబ సభ్యులు అడిగారు ‘‘ఇక ఈ పిల్లవాడి జీవితం ఎలా ఉంటుంది?’’ అని. ‘‘స్పోర్ట్స్ పర్సన్ కావాలనుకుంటే అది కష్టం కావచ్చు’’ అన్నాడు డాక్టర్. ఆయన ఈ మాట ఎందుకు అన్నాడంటే... జ్వెరెవ్ తల్లి ఇరీనా కూడా మాజీ టెన్నిస్ ప్లేయరే. ఇలాంటి మాటలు విన్నప్పుడు చాలామంది పేరెంట్స్ సాధారణంగా ఏమంటారు? ‘‘సరే.... ముందు హెల్త్. ఆ తర్వాతే స్పోర్ట్స్...’’ అని. కానీ జ్వెరెవ్ తల్లి... ఇరీనా అలా అనుకోలేదు. ఆమె తన నాలుగేళ్ల కొడుకును చూసి...‘‘నా కొడుకు భవిష్యత్తులో ఏమవ్వాలి అనేది టైప్–1 డయాబెటిస్ నిర్ణయించదు. అతడు టెన్నిస్ ప్లేయర్ కావాలంటే టెన్నిస్ ప్లేయర్. లేదా ఇంకేదైనా... మరేదైనా కావాలంటే అదీ’’.టైప్–1 డయాబెటిస్ కొనసాగింది... ప్రతిరోజూ గుచ్చే సూదులూ... రోజూ తాను కళ్లజూసే రక్తపుబొట్లు... రోజు వాడాల్సిన మందులతో! కానీ జీవితమూ కొనసాగింది. అదీ అతడి ఇష్టప్రకారమే... ప్రాక్టీస్... ఫిట్నెస్... మ్యాచులు. ప్రయాణాలూ... విజయాలతో! తన చిన్నప్పటి నుంచీ టైప్–1 డయాబెటిస్ కండిషన్‌తోనే.. ఎన్నో కండిషన్ల మధ్యన అతడు జీవిస్తున్నాడు. టెప్–1 డయాబెటిస్ అంటే ఏమిటో, దానితో జీవితమెలా ఉంటుందో చూద్దాం...టైప్–1 డయాబెటిస్ అంటే...?పిల్లల్లో వచ్చే డయాబెటిస్‌ను టైప్–1 డయాబెటిస్ అంటారు. చిన్నారుల్లో వస్తుంది కాబట్టి దీన్ని ‘జువెనైల్ డయాబెటిస్’ అని కూడా అంటారు. ఎందుకు వస్తుందంటే...టైప్–1 డయాబెటిస్ ఎందుకొస్తుందనే కారణం నిర్దిష్టంగా తెలియదుగానీ... సాధారణంగా పిల్లలకు సోకే వైరస్లు, రకరకాల పర్యావరణ అంశాల వంటి చాలా కారణాలతో ఇది రావచ్చన్నది వైద్య నిపుణుల అభిప్రాయం.గుర్తించడమెలా? టైప్–1 డయాబెటిస్ లక్షణాలు పిల్లలందరిలోనూ ఒకేలా ఉండకపావచ్చు. ఈ కింది లక్షణాల్లో ఏవైనా కనిపించినప్పుడు పేరెంట్స్ వాటిని డాక్టర్ దృష్టికి తీసుకెళ్లాలి. అవి... → నీళ్లు ఎక్కువగా తాగుతుండటం; పదేపదే మూత్ర విసర్జనకు వెళ్తుండటం ∙రాత్రిళ్లు నిద్రలో పక్క తడిపే అలవాటు మానేసిన పిల్లలూ మళ్లీ్ల పక్క తడపటం మొదలుపెట్టడం ఆహారం బాగానే తీసుకుంటున్నప్పటికీ బరువు తగ్గుతుండటం → వెంటవెంటనే అలసిపాతుండటం, నీరసంగా ఉండటం → వారి జననేంద్రియాల దగ్గర మాటిమాటికీ ఫంగల్ ఇన్ఫెక్షన్లు కనిపిస్తుండటం. ఈ లక్షణాలు కనిపించినప్పుడు పిల్లల్లో డయాబెటిస్‌ను వెంటనే గుర్తించి, వెంటనే ఇన్సులిన్‌తో వైద్యం మొదలుపెట్టకపాతే కొన్ని ప్రమాదకరమైన పరిణామాలు సంభవించవచ్చు. అదేపనిగా పేరుకుపాయిన అధిక గ్లూకోజ్ వల్ల కీటోన్స్ అనే విష పదార్థాలు రక్తంలో పేరుకుపాతాయి. దాంతో ఈ కింది లక్షణాలు కనిపించవచ్చు. → తీవ్రమైన కడుపునొప్పి ∙వాంతులు ∙మత్తుగా ఉండటం (చురుకుదనం లోపించడం) ∙శ్వాసతీసుకోవడం కష్టం కావడం ∙స్పృహతప్పిపడిపావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలా స్పృహతప్పిపడిపాయే కండిషన్‌ను ‘కీటో అసిడోసిస్’ అంటారు. ఇది చాలా ప్రమాదకరం. పిల్లలను తప్పనిసరిగా హాస్పిటల్‌కు తరలించి తక్షణ వైద్య సహాయం అందించాల్సిన ‘మెడికల్ ఎమర్జెన్సీ’ ఇది. టైప్–1 డయాబెటిస్ (మేనేజ్మెంట్) పిల్లల్లో టైప్–1 డయాబెటిస్‌ను నాలుగు అంశాల నిర్వహణ ద్వారా సమర్థంగా మేనేజ్ చేయవచ్చు. అవి.. 1. ఇన్సులిన్ : ఈ పిల్లల విషయంలో ఇన్సులిన్ ఇవ్వడం రక్తంలో పెరిగే చక్కెరను అదుపు చేస్తుంది. ఇప్పటికైతే ఇది మాత్రమే అందుబాటులో ఉన్న చికిత్స ప్రక్రియ. ఇలా ఇన్సులిన్ ఇవ్వడం అన్నది ఇంజెక్షన్ ద్వారానే జరగాలి. అందునా ఈ ఇంజెక్షన్‌ను కండలోకి కాకుండా చర్మం కింది ‘సబ్‌క్యుటేనియస్ పొర’లో ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఇన్సులిన్‌ను ఒంట్లోకి పంపేందుకు సిరంజీలు, పెన్ వంటి ఉపకరణాలు, ఇన్సులిన్ పంప్స్ వంటి ఉపకరణాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. 2. గ్లూకోజ్ మానిటరింగ్ : పిల్లలకు కేవలం ఇన్సులిన్ ఇస్తుండటం మాత్రమే సరిపాదు. వారు తిన్న మోతాదును బట్టి ఎంత ఇన్సులిన్ ఇస్తుండాలన్న అంశాన్నీ నిత్యం పర్యవేక్షిస్తూ ఉండాలి. పిల్లల రక్తంలోని చక్కెర పాళ్లను ప్రతిరోజూ ఎప్పటికప్పుడు తెలుసుకోడానికి ‘గ్లూకోమీటర్’ ఉపయోగపడుతుంది. పిల్లల రక్తంలో గ్లూకోజ్ పాళ్లు తగ్గితే గ్లూకోజ్గానీ లేదా చక్కెరగానీ తినిపించాలి. రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటే... ఇన్సులిన్ ఇవ్వాలి. 3. ఆహారం : చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అనుగుణంగా వారి ఆహారం ఉండటం అవసరం. ఈ క్రమంలో ఎక్కువ చక్కెరలూ లేదా తీపి పదార్థాలు లేని మంచి సమతులాహారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఆహారంలో తగిన పాళ్లలో కార్బోహైడ్రేట్స్ సమకూర్చే కాయధాన్యాలు (హోల్‌గ్రెయిన్స్), మాంసకృత్తులు (్రపాటీన్లు... ఇవి పప్పు, కోడి మాసం, చేపలు, చీజ్, పనీర్, చిక్కుళ్లు...మొ.) ఇవ్వాలి. ఆరోగ్యకరమైన కొవ్వుపదార్థాల కోసం పొద్దుతిరుగుడుపువ్వునూనె, బాదం, వాల్నట్ ఇవ్వవచ్చు. వీటితో పాటు అన్ని రకాల పండ్లు, తాజా కూరగాయలు, ఆకుకూరలు తీసుకుంటూ ఉండాలి. 4. శారీరక శ్రమ : పిల్లలు ఒళ్లు అలిసేలా ఆడుకోవడం వల్ల వారి ఒంట్లోని చక్కెర స్వాభావికంగానే నియంత్రితమయ్యే అవకాశం ఎక్కువ. పిల్లలందరూ బాగా ఆడుకోవడం అవసరమే అయినా ఇలాంటి పిల్లలు ఆరుబయట ఒళ్లు అలిసేలా ఆడుకోవడం మరింత ఎక్కువగా అవసరం. చివరిగా... మరోసారి జ్వెరెవ్ విషయానికి వస్తే... ఈ సమస్య ఉన్న పిల్లలూ, వాళ్ల తల్లిదండ్రుల జీవితాల్లో ఆర్థిక పరిమితులు ఎక్కువగా ఉంటాయనే అంశాన్ని గమనించినందుకో ఏమోగానీ... ‘జ్వెరెవ్ ఫౌండేషన్’ డయాబెటిస్తో జీవిస్తున్న పిల్లలకు... ముఖ్యంగా ఇన్సులిన్ అందని ప్రాంతాల్లో ఉన్నవారికి మద్దతు ఇవ్వడమే లక్ష్యంగా పని చేస్తోంది. బహుశా... తన నాలుగేళ్ల వయసులో ఎదురైన సమస్యను గుర్తించి ఇప్పుడతడు చాలామంది జీవితాలకు ఉపయోగపడేలా తన ఫౌండేషన్‌ను ఉపయోగిస్తున్నాడని భావించవచ్చు. అతడి ఆర్థికస్థితి అందుకు అనుమతిస్తోంది. కానీ... మన దేశంలోనూ ఇలాంటి చిన్నారుల పరిస్థితి గురించి ఆలోచించాల్సిన అవసరమూ మనందరికీ ఉంది. రక్తంలోని చక్కెరను ఇంత జాగ్రత్తగా నియంత్రించాల్సిన అవసరమేమిటంటే? పిల్లల రక్తంలో చక్కెర మోతాదులు చాలాకాలం పాటు నియంత్రణలో లేకపాతే భవిష్యత్తులో వాళ్లలో చాలా రకాల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. నియంత్రణలోని లేని చక్కెర వల్ల పిల్లల కిడ్నీలు, గుండె, రక్తనాళాలు, కళ్లు వంటి కీలకమైన అవయవాలకు హాని జరగవచ్చు. నాడీవ్యవస్థపై దుష్ప్రభావాలు పడవచ్చు. ఇవన్నీ బాల్యంలో కనిపించకపావచ్చు. వారు పెరిగి పెద్దయ్యే క్రమంలో ఆ దుష్ప్రభావాలు కనిపించవచ్చు. దాంతో భవిష్యత్తులో అది వారి జీవన నాణ్యతను దెబ్బతీయవచ్చు. అందుకే రక్తంలో చక్కెర పాళ్లను నియంత్రణలో ఉంచుకోవడం అవసరం.ఇటీవలి పురోగతి... టైప్–1 డయాబెటిస్ ఉన్న పిల్లల్లో ఆ వ్యాధిని నయం చేసేలా ఇప్పటికిప్పుడు చికిత్స ఏదీ అందుబాటులో లేదు. కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికతతో వారి రక్తంలోని చక్కెరపాళ్లను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుంది. అలాగే సెన్సర్ ఆగ్యుమెంటెడ్ పంపులు, క్లోజ్డ్ లూప్ సిస్టమ్ వంటి కొన్ని ఆధునిక పద్ధతులతో కొన్ని దేశాల్లో పిల్లల్లో చక్కెరపాళ్లను ఎప్పడూ ఒకేలా ఉండేలా నియంత్రణలో ఉంచడమూ సాధ్యమవుతోంది. అయితే ఈ పురోగతి ప్రస్తుతం ఈ బాధిత కుటుంబాలపై చాలా ఆర్థికభారాన్నే మోపుతోంది. భవిష్యత్తులో ఈ వ్యయం తగ్గేందుకు అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతం ఇన్సులిన్ అందేలా చూసేందుకు – ఇన్సులిన్ జీన్ థెరపీ, స్టెమ్‌సెల్ థెరపీ కంప్లీట్ క్లోజ్డ్ లూప్ సిస్టమ్స్ వంటి ప్రక్రియలను అందుబాటులోకి తెచ్చేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి.డాక్టర్ బి. శిరీష కుసుమసీనియర్ పీడియాట్రిక్ఎండోక్రైనాలజిస్ట్ యాసీన్ -
ఏకపాద సేతుబంధాసనం, లాభాలు, జాగ్రత్తలు
Eka Pada Setu Bandhasana / One-Legged Bridge Pose ఒక కాలును పైకి లేపి సాధన చేసే భంగిమనే ఏకపాద సేతుబంధాసనం అంటారు. ఇది వెన్నెముక, నడుము, తొడలు, పొట్ట కండరాల బలాన్ని పెంచడంలో సహాయపడే యోగాసనం.చేసే విధానం.. ముందుగా యోగా మ్యాట్‌పై వెల్లకిలా (వెనుక భాగం నేలకు ఆనేలా) పడుకోవాలి. చేతులను ఇరుపక్కలా ఉంచాలి. రెండు మోకాళ్లను పైకి మడిచి,పాదాలను నడుముకు వీలైనంత దగ్గరగా, నేలపై బలంగా ఉంచాలి. రెండుపాదాల మధ్య కొద్దిగా దూరం ఉండాలి. నడుము పైకి లేపుతూ గాలి పీలుస్తూ నడుము, తుంటి, వెన్నుభాగాన్ని పైకి లేపాలి. మీ చేతులు నేలపైనే ఉండాలి. లేదా రెండు చేతుల వేళ్లను ఒకదానితో ఒకటి కలిపి శరీరం కింద లాకప్ చేయవచ్చు.ఇప్పుడు శరీరాన్ని స్థిరంగా ఉంచి, శ్వాస వదులుతూ కుడి కాలును నిటారుగా పైకి (ఆకాశం వైపు చూసేలా) లేపాలి. మీ బరువంతా ఎడమపాదం, భుజాలు, తలపై సమానంగా బ్యాలెన్స్ అవ్వాలి. ఈ స్థితిలో సాధారణ శ్వాస తీసుకుంటూ 15 నుంచి 30 సెకన్లు ఉండాలి. గాలి వదులుతూ మెల్లగా కుడి కాలును కిందకు దించి, ఆపై నడుమును నేలకు ఆనించాలి. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత, ఇదే ప్రక్రియను ఎడమ కాలును పైకి లేపి తిరిగి చేయాలి. ఇదీ చదవండి : గంటలో 106 పుల్-అప్స్ : చీరకట్టుతో నటి ఫిట్నెస్ ఫీట్ప్రయోజనాలు ఈ ఆసనం వెన్నుముకను, నడుము కండరాలను, పిరుదులను బలపరుస్తుంది.మెడ భాగంపై ఒత్తిడి పడటం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగవుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.పొట్ట భాగం సాగడం వల్ల జీర్ణవ్యవస్థ చురుగ్గా మారి, మలబద్ధకం తగ్గుతుంది. ∙మెదడుకు రక్తప్రసరణ బాగా జరిగి ఒత్తిడి,ఆందోళన, అలసట తగ్గుతాయి. ఒక కాలిపై శరీరాన్ని బ్యాలెన్స్ చేయడం వల్ల ఏకాగ్రత, శారీరక సమతుల్యత పెరుగుతాయి.జాగ్రత్తలు తీవ్రమైన మెడ నొప్పి, వెన్నుముక సమస్యలు లేదా డిస్క్ సమస్యలు ఉన్నవారు ఈ ఆసనాన్ని అస్సలు చేయకూడదు.మోకాళ్ల నొప్పులు తీవ్రంగా ఉంటే కాలుపై బరువు పెట్టడం మంచిది కాదు. గర్భిణులు గర్భధారణ సమయంలో ఈ ఆసనాన్ని నిపుణుల పర్యవేక్షణ లేకుండా చేయకూడదు. ఇదీ చదవండి: పాత చేనేతలకు కొత్త కళ..ఇలా ట్రై చేశారా? అనితపాతర్ల, యోగా ట్రైనర్ -
గంటలో 106 పుల్-అప్స్ : చీరకట్టుతో నటి ఫిట్నెస్ ఫీట్
ప్రముఖ నటి సంయుక్త హెగ్డే (Samyuktha Hegde) తన ఫిట్నెస్తో మరోసారి అభిమానులకు ఆకట్టుకున్నారు. సాంప్రదాయ కేరళ కసవు చీరకట్టులో కేవలం ఒక గంటలోనే 106 పుల్-అప్స్ తీసి ఇంటర్నెట్లో సంచలనం సృష్టించారు. 'వరల్డ్ పుల్ అప్ డే' (World Pull Up Day) సందర్భంగా ఆమె ఈ అద్భుతమైన ఫీట్‌ను చేసి ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేశారు.జిమ్‌లోని పుల్-అప్ బార్ కింద చీరలో కసరత్తులు చేయడం సంయుక్తకు కొత్తేమీ కాదు. కానీ చీరకట్టులో గంటలో ఏకంగా 106 పుల్-అప్స్ తీయడం విశేషం. ఫిట్నెస్ , జిమ్ కేవలం పురుషులు మాత్రమే కాదు, మహిళలు కూడా తమ శారీరక సామర్థ్యాన్ని నిరూపించుకోగలరని చాటిచెప్పడమే తన ఉద్దేశమని సంయుక్త పేర్కొన్నారు.తొలి పుల్-అప్ నేర్చుకోవడానికే తనకు దాదాపు రెండేళ్ల సమయం పట్టిందని, నిరంతర పట్టుదల ఉంటే మహిళలు ఏదైనా సాధించగలరనే ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. View this post on Instagram A post shared by Samyuktha Hegde (@samyuktha_hegde) అంతేకాదు ‘‘మహిళలు పురుషులను అధిగమించాలనో, ఓడించాలనో జిమ్‌కు వెళ్లరు; తమ సొంత భయాలను జయించడానికే వెళ్తారు. అందుకే, ఒక మహిళ 'పుల్-అప్' (pull-up) చేయడం చూసినప్పుడు, నాకది కేవలం ఒక వ్యాయామంలా మాత్రమే కనిపించదు. దాన్ని చూస్తూ, 'బహుశా నేను కూడా అలా చేయగలనేమో' అని ఆలోచిస్తున్న వేలాది మంది మహిళలు నాకు కనిపిస్తారు." అంటూ మహిళలకు స్ఫూర్తినివ్వడం విశేషం. ఈ వీడియోపై నెటిజన్లు ఆమెను "విమెన్ - జిమ్ ఎడిషన్" అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.పుల్-అప్స్ అత్యంత కష్టమైన బాడీవెయిట్ వ్యాయామాలలో ఒకటి అంటారు నిపుణులు. ఇది భుజాలు, వెన్నెముక, చేతులు, కోర్, గ్రిప్ స్ట్రెంత్ వంటి అనేక భాగాలపై ఒకేసారి పనిచేస్తుంది. అయితే సోషల్ మీడియా ట్రెండ్స్ చూసిన బిగినర్స్ సరైన బలం పెంచుకోకుండా నేరుగా ఫుల్ పుల్-అప్స్ ప్రయత్నిస్తే టెండాన్ స్ట్రెయిన్, భుజాల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల రెసిస్టెన్స్ బ్యాండ్స్, అసిస్టెడ్ పుల్-అప్స్ లేదా ఇన్‌క్లైన్ పుల్-అప్స్‌తో క్రమంగా ప్రాక్టీస్ మొదలుపెట్టాల్సి ఉంటుందని గమనించాలి. ఇదీ చదవండి: ప్రాణం తీసిన చాట్‌జీపీటీ : ఐఐటీ బొంబాయి బెదిరింపులు? -
వ్యాయామం చేస్తే డబ్బులు.. ఉద్యోగులకు కంపెనీ అదిరే ఆఫర్!
జీతం కోసం ఉద్యోగం.. ఆరోగ్యం కోసం వ్యాయామం.. రెండింటికీ ఒకేసారి ప్రోత్సాహం లభిస్తే? ఇదే ఇప్పుడు ఆఫీస్ వెల్నెస్ ట్రెండ్‌గా మారుతోంది. ఆఫీసుకు వెళ్లడం.. పని చేయడం.. ఇంటికి రావడం.. ఇదే ఉద్యోగుల రోజువారీ రొటీన్.కానీ ఈ రొటీన్ లో వ్యాయామానికీ చోటు కల్పిస్తే? పైగా అందుకు కంపెనీనే రివార్డ్ ఇస్తే? దక్షిణ కొరియాలో ఓ కంపెనీ ఉద్యోగుల ఆరోగ్యాన్ని ప్రోత్సహించేందుకు అలాంటి కార్యక్రమాన్నే చేపట్టడంతో ఆసక్తికరంగా మారింది. రెండు నెలల పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేసే ఉద్యోగులను ప్రోత్సహించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. ఇందులో ఉద్యోగులు నిర్దిష్ట కాలం పాటు వ్యాయామం చేయాల్సి ఉంటుంది.అంటే రెండు నెలల పాటు క్రమశిక్షణగా కొనసాగించిన వారికి రివార్డ్ అందించడం ద్వారా ఆరోగ్యకరమైన అలవాటును కొనసాగించేలా ప్రోత్సహిస్తున్నారు. ఈ విషయాన్ని ఓ భారతీయ ఉద్యోగి సోషల్ మీడియాలో పంచుకోవడంతో సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారింది.ఇదీ చదవండి: కేరళలో వృద్ధులే అధికం.. కుటుంబాలకు కొత్త సవాల్! -
రాత్రి 10 తర్వాతే డిన్నర్
సాక్షి, హైదరాబాద్: మారిన జీవనశైలి, సుదీర్ఘమైన ప్రయాణాలు, ఆలస్యంగా తినే భోజనం నగర వాసుల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. హైదరాబాద్ ఉద్యోగుల్లో ఏకంగా 64 శాతం మంది రాత్రి 10 గంటలు దాటిన తర్వాతే భోజనం (డిన్నర్) చేస్తున్నారని ఈవా ఇండియా వెల్నెస్ ఇండెక్స్ 2026 నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచంలోనే మొదటి టచ్ బేస్డ్ మెటబాలిక్ వెల్నెస్ ట్రాకర్ రూపొందించిన ఈ నివేదిక దేశవ్యాప్తంగా 30,000 మందికి పైగా వినియోగదారుల నుంచి సేకరించిన 35 లక్షలకు పైగా రీడింగ్‌ల ఆధారంగా రూపొందింది. శరీర విశ్రాంతికి విఘాతం.. రాత్రిపూట ఆలస్యంగా, అతిగా భోజనం చేయడం, ఒత్తిడి, నిద్రకు ముందు కాఫీ తాగడం వల్ల శరీరం విశ్రాంతి తీసుకోలేకపోతోంది. మరుసటి రోజు ఉదయానికి శరీరం అలసటగా ఉండే ‘మెటబాలిక్ హ్యాంగోవర్’ ఎదురవుతోందని నివేదికలో వెల్లడించింది. ఉదయం పూట మధుమేహం స్థాయుల్లో హెచ్చుతగ్గులతో పాటు నిద్ర నాణ్యత పడిపోతోందని అధ్యయనం పేర్కొంది. దాదాపు 40 శాతం మంది నిద్రపోయే ముందు కాఫీ తీసుకోవడంతో గుండె స్పందన రేటు పెరుగుతోందని వెల్లడించింది. ఇతర నగరాల్లోనూ.. ముంబైలో 64 శాతం మంది రాత్రి 9.30 గంటల తర్వాతే తింటున్నారు. లోకల్ రైళ్ల ప్రయాణాలు వారిలో ఒత్తిడిని తీవ్రతరం చేస్తున్నాయి. బెంగళూరులో 44 శాతం మందికి సుదీర్ఘమైన ట్రాఫిక్ ప్రయాణాలతో రోజువారీ శారీరక కదలికలు తగ్గిపోతున్నాయి. ఢిల్లీ– ఎన్సీఆర్లో చలికాలపు పొగమంచుతో 30 శాతం మంది బయటకు రాకపోవడంతో వెల్నెస్ స్కోర్లు తగ్గుముఖం పట్టాయి.ఇలా చేస్తే మేలు.. చిన్న చిన్న అలవాట్లను మార్చుకోవడం ద్వారా ఆరోగ్య స్కోర్‌ను 8 శాతం నుంచి 12 శాతం వరకు పెంచుకోవచ్చని ఈ అధ్యయనం సూచించింది. భోజనం చేసిన తర్వాత కాసేపు నడిచే వారిలో షుగర్ లెవల్స్ 12–16 శాతం వరకు నియంత్రణలోకి వస్తున్నాయి. రాత్రి డిన్నర్‌ను వీలైనంత త్వరగా ముగించడం, కేఫిన్ (కాఫీ) తగ్గించడం ద్వారా నిద్ర నాణ్యత, జీవక్రియను మెరుగుపరుచుకోవచ్చు. -
నొప్పి తగ్గేదిలా...
రుతుక్రమ సమయంలో టీనేజ్ బాలికల నుంచి యువతుల వరకు తీవ్రమైన పొత్తి కడుపునొప్పి, వెన్నునొప్పిని అనుభవించేవారి శాతం 80 నుంచి 85 వరకు ఉంటుందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చేసిన అధ్యయనాలలో స్పష్టమైంది. ఈ సమస్యకు పరిష్కారంగా చాలామంది పెయిన్‌కిల్లర్స్ వాడుతుంటారు, రోజువారీ పనుల నుండి దూరంగా ఉంటూ ఇబ్బందులు పడుతుంటారు. రుతుక్రమ నొప్పి నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చో నిపుణుల ద్వారా తెలుసుకుందాం...రుతుక్రమం మొదలయ్యే 90 శాతం మంది మహిళల మాదిరిగానే మీకూ నెలసరి సమయంలో కడుపునొప్పి, చిరాకు, అలసట, తల తిరగడం, వికారం వంటి లక్షణాలు కనిపించవచ్చు... ఇలాంటప్పుడు..సహజ పద్ధతుల్లో ... నెలసరి ప్రారంభం కావడానికి కొన్నిరోజులముందు కడుపు లేదా శరీరంలోని ఇతర భాగాలు ఉబ్బినట్లుగా లేదా బరువు పెరిగినట్లుగా అనిపించవచ్చు. ఇది నెలసరి సమయంలో సాధారణంగా కనిపించే లక్షణమే, కానీ ఇది అసౌకర్యాన్ని కలిగించి, నెలసరి నొప్పులను మరింత తీవ్రతరం చేస్తుంది. దీనికి విరుగుడుగా రోజుకు 8–10 గ్లాసుల నీళ్లు తాగాలి. కడుపు ఉబ్బరాన్ని పెంచే కెఫీన్, చక్కెరతో కూడిన పానీయాలు, ఉప్పుతో కూడిన స్నాక్స్‌ను తగ్గించాలి. వేడినీళ్లు తాగడం వల్ల శరీరమంతటా రక్తప్రసరణ పెరిగి, కండరాలు రిలాక్స్ అవుతాయి. గర్భాశయ సంకోచాల వల్ల కలిగే తిమ్మిర్లూ తగ్గుతాయి.హెర్బల్ టీలు మేలు... కండరాలు రిలాక్స్ అయ్యి, నొప్పులు తగ్గడానికి గోరువెచ్చని టీ లేదా అల్లం కషాయం తాగచ్చు. కొన్ని రకాల హెర్బల్ టీ లలో ఉబ్బరం, వాపును తగ్గించగల యాంటీ–ఇన్స్ ఫ్లమేటరీ గుణాలు, గర్భాశయంలో కండరాల నొప్పులను తగ్గించగల ఔషధ గుణాలుంటాయి. వేడినీటి కాపడం... గర్భాశయ కండరాలను సడలించి, రక్తప్రసరణను మెరుగుపరచడానికి పొత్తికడుపుపై వేడినీటి కాపడం పెట్టాలి. ఇది కండరాలకు విశ్రాంతినిచ్చి, రక్తప్రసరణను మెరుగుపరిచి, ఒత్తిడిని తగ్గించడంలో తోడ్పడుతుంది. తేలికపాటి వ్యాయామం... శరీరాన్ని స్ట్రెచింగ్ చేయడం, కొద్దిపాటి నడక... వల్ల కండరాల ఒత్తిడి తగ్గుతుంది. నొప్పితో బాధపడుతున్నప్పుడు వ్యాయామం గురించిన ఆలోచన రాకపోవచ్చు. కానీ తేలికపాటి వ్యాయామం కూడా ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది. దీంతో నొప్పి తగ్గి, కండరాలకు విశ్రాంతి లభిస్తుంది. మసాజ్ థెరపీ రుతుస్రావ నొప్పిని తగ్గిస్తుందని వివిధ అధ్యయనాలలో తేలింది. శారీరక ఒత్తిడిని తగ్గించే మసాజ్ గర్భాశయాన్ని రిలాక్స్ చేయడం ద్వారా గర్భాశయ సంకోచాలు తగ్గి, నొప్పినుంచి ఉపశమనం లభిస్తుంది.ఉపశమనం కోసం... ఒత్తిడి వల్ల కండరాల నొప్పులు మరింత తీవ్రం కావచ్చు. ధ్యానం, దీర్ఘ శ్వాస, యోగా వంటి పద్ధతులు ఎంతో మేలు చేస్తాయి. విశ్రాంతిగా కూర్చొని, కళ్ళుమూసుకుని, దీర్ఘ శ్వాస తీసుకుంటూ, వదులుతూ ఉండాలి. కొన్ని నిమిషాల వ్యవధిలో నొప్పినివారణ తెలుస్తుంది. రుతుస్రావ నొప్పికి సహాయపడే ఇంటిచిట్కాలతో పాటు, వైద్యుల సూచనలు సహాయపడతాయి. అందుబాటులో మరికొన్ని ... రుతుక్రమ నొప్పులను తగ్గించేందుకు కార్డ్‌లెస్ హీటింగ్ బెల్ట్‌లు, మసాజ్ ΄్యాడ్లు, పీరియడ్ క్రాంప్ డివైజ్‌లు, జెల్లు.. అందుబాటులోకి వచ్చాయి. ఇవి గర్భాశయ కండరాలను రిలాక్స్ చేయడానికి, సర్దుబాటు చేయడానికి నొప్పి నుంచి ఉపశమనం కలిగించే వైబ్రేషన్లను కలిగిస్తాయి.నివారణకు ఓ పరికరంమహిళల్లో పీరియడ్స్ సమయంలో ఎదురయ్యే నొప్పికి డ్రగ్–ఫ్రీ పరిష్కారాన్ని అందించే లక్ష్యంతో ‘క్యురపాడ్ ఎమ్’ అనే వైద్యపరికరాన్ని రూపొందించారు తెలంగాణ వాసి డాక్టర్ సూర్యప్రకాశ్, బెంగళూర్‌కు చెందిన శ్రీరామ్. ‘‘నాలుగేళ్ల క్రితం బాడీ పెయిన్ రిలీఫ్ డివైజ్‌ను రూపొందించాం. దానిని వాడిన వారి దగ్గర నుంచి అనేక అభ్యర్థనలు వస్తున్నాయి. మా ఇంట్లో చెల్లెలు రుతుక్రమ నొప్పిని అనుభవించడం చూసి, మహిళల కోసం మరో పరికరాన్ని తయారు చేయాలని రెండేళ్లు గా కృషి చేశాం. ఎలాంటి మందులూ అవసరం లేకుండా మహిళలు సులువుగా ఉపయోగించేలా ఈ పరికరాన్ని తీసుకువచ్చాం. మహిళలు రుతుక్రమం సమయంలో వచ్చే నొప్పి నివారణకు తమ పొత్తికడుపు భాగంలో ఈ పరికరాన్ని ధరించడం వల్ల 30 నిమిషాలలో రెడ్‌లైట్, నియర్–ఇన్ఫ్రారెడ్ లైట్ ఆధారంగా ఫొటో బయోమాడ్యులేషన్ సాంకేతికతతో పీరియడ్ నొప్పికి సంబంధించిన వాపు, రక్తప్రసరణ వంటి అంశాలపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. వారి రోజువారి పనులకు ఎలాంటి ఆటంకం కలగదు. ఈ పరికరానికి సీడిఎస్సీవో అనుమతితోపాటు ఎఫ్‌డిఎ రిజిష్ట్రేన్ కూడా ఉంది.’’– డాక్టర్ సూర్యప్రకాశ్, శ్రీరామ్– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
11 ఏళ్ల పాటు కీమోథెరపీ : షాకింగ్ నిజం చెప్పిన వైద్యులు
క్యాన్సర్ అనగానే ప్రాణ భయంతో వణికిపోతారు. ఎందుకంటే ఏళ్ల తరబడబి కీమో థెరపీలు, సర్జరీలు అంటూ ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. పైగా కీమో థెరపీ సైడ్ ఎఫెక్ట్స్ తీవ్రంగా బాధిస్తాయి. అయినా కూడా కొన్ని రకాల క్యాన్సర్లు పూర్తిగా తగ్గుతాయన్న నమ్మకం ఉండదు. నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ పరీక్షలు చేయించుకుంటూ, అవసరమైతే చికిత్స తీసుకుంటూ ఉండాలి. అలా బ్రెయిన్ క్యాన్సర్ ఉందని ఒక మహిళ సుదీర్ఘ కాలంపాటు కీమోథెరపీ తీసుకుంది. ఇలా ఒకటీ రెండేళ్లు కాదు ఏకంగా 11 ఏళ్ల పాటు కీమోథెరపీ చేయించుకుంది. తీరా చూస్తే వైద్యులు భయంకరమైన విషయాన్ని వెల్లడించారు.బీబీసీ కథనం ప్రకారం, బెక్ కీ జోన్స్ (Becky Jones) అనే మహిళ 2012లో తీవ్రమైన మైగ్రేన్ తలనొప్పితో బాధపడింది. ఆమెకు తీసిన బ్రెయిన్ స్కానింగ్‌లో ఒక కణితి (Lesion) కనిపించింది. వైద్యులు దానిని ట్యూమర్‌గా భావించి క్యాన్సర్‌గా చికిత్స ప్రారంభించారు. చికిత్స ఆపితే ప్రాణాలకే ముప్పు అని వైద్యులు పదేపదే చెప్పడంతో ఆమె దాన్ని విశ్వసించి, చాలా పట్టుదలగా చికిత్సతీసుకుంది. కానీ 2025లో ఆమె వైద్య రికార్డులను పరిశీలించిన స్వతంత్ర న్యూరో సర్జన్లు, రేడియాలజిస్టులు ఆమెకు అసలు బ్రెయిన్ క్యాన్సరే లేదన్న దిగ్భ్రాంతికరమైన నిజాన్ని వెల్లడించారు. ఇదీ చదవండి: ఫ్రిజ్ పేలి ఒకే కుటుంబంలో నలుగురు సజీవ దహనంనిజం బయటపడిందిలా ఇటీవల ఆమె కేసును స్వతంత్ర నిపుణులు మళ్లీ పరిశీలించడంతో అసలు విషయం బయటపడింది. ఆ స్కానింగ్‌లలో కనిపించింది ట్యూమర్ కాదని, నాడీ వ్యవస్థకు సంబంధించిన వాపు వల్ల ఏర్పడే 'ట్యుమేఫాటివ్ డిమైలినేషన్' (Tumefactive Demyelination) అని తేలింది. ఇది చూడటానికి ట్యూమర్లా కనిపిస్తుంది కానీ క్యాన్సర్ కాదు.ఇదీ చదవండి: ముగ్గురు బిడ్డల హత్య : ఆ తల్లిని బహిరంగ ఉరితీయాలంటూ సంచలన వ్యాఖ్యలుకన్నీటి పర్యవంతమైన బాధితురాలుఆమె తన భాగస్వామిని కలిసిన కొద్ది కాలానికే, పోలీసు వృత్తిలో చేరాలని కలలు కనేది, కానీ అకస్మాత్తుగా ఆమె భవిష్యత్తు అంధకారంగా మారింది. అనుభవజ్ఞుడైన క్యాన్సర్ నిపుణుడు చేసిన ఈ నిర్ధారణ, ఆమె జీవితాన్ని మార్చేసింది. 11 ఏళ్ల కీమోథెరపీ చికిత్సకు దారితీసింది. ఆమె తరచుగా అనారోగ్యానికి గురయ్యేది, కుటుంబ కార్యక్రమాలలో పాల్గొనలేకపోయింది, ఆమె వృత్తికి ఆటంకం కలిగింది మరియు నిరంతరం ఆందోళనతో కుంగిపోయింది. తీరా 34 ఏళ్ల వయసులో, ఆమెకు అసలు క్యాన్సర్ లేదని, స్టెరాయిడ్లతో చికిత్స చేయగలిగే మెదడు వాపు మాత్రమే ఉందని ఇటీవల తెలుసుకుంది. ఇంగ్లండ్‌లోని వెస్ట్ మిడ్లాండ్స్లోని కోవెంట్రీలోని కన్సల్టెంట్ ప్రొఫెసర్ ఇయాన్ బ్రౌన్ తన జీవితాన్ని నాశనం చేశారని జోన్స్ అన్నారు. ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆమె, ఈ అనవసరమైన క్యాన్సర్ చికిత్స కారణంగా యూనివర్సిటీ హాస్పిటల్స్ కోవెంట్రీ అండ్ వార్విక్షైర్ (UHCW) NHS ట్రస్ట్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్న 40 మందికి పైగా రోగులలో ఒకరు."నాకు అసలు బ్రెయిన్ ట్యూమరే లేదు. తప్పుడు రోగ నిర్ధారణ (Misdiagnosis) వల్ల నా యువ జీవితంలో ఎక్కువ భాగం ఎలాంటి కారణం లేకుండానే నూనెలో కాలుతున్నట్లు నరకం అనుభవించాను" అని జోన్స్ కన్నీటి పర్యంతమయ్యారు. ఇంగ్లండ్‌లోని వెస్ట్ మిడ్లాండ్స్లోని కోవెంట్రీలోని కన్సల్టెంట్ ప్రొఫెసర్ ఇయాన్ బ్రౌన్ తన జీవితాన్ని నాశనం చేశారని జోన్స్ అన్నారు. ఈ నిజం తెలిసినప్పుడు కుటుంబ సభ్యులందరూ కంటతడి పెట్టుకున్నట్లు ఆమె తరఫు న్యాయవాది టిన్సే తెలిపారు. ఇదీ చదవండి: బిర్యానీ గణేశుడు : షాపు యజమానికి భారీ షాక్Second Opinion ప్రాముఖ్యతఒక తీవ్రమైన వ్యాధి నిర్ధారణ జరిగినప్పుడు, అది అరుదైనదైనప్పుడు లేదా సంక్లిష్టమైనదైనప్పుడు మరో వైద్య నిపుణుడిని సంప్రదించడం ఎంత ముఖ్యమో ఈ ఘటన తెలియజేస్తోంది.క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధి సోకిందంటే ఒక వ్యక్తి కుటుంబ నిర్ణయాలు, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి, మానసిక ఆరోగ్యం అన్నీ పూర్తిగా మారిపోతాయి. ఏళ్ల తరబడి కీమోథెరపీ చేయించుకోవడం వల్ల శారీరకంగా, మానసికంగా ఎంతో క్షోభను అనుభవించాల్సి వస్తుంది. ఎవరికైనా క్లిష్టమైన సమస్యలు ఎదురైనప్పుడు 'ఫ్రెష్ ఐస్'తో (కొత్త కోణంలో) పరీక్షించడం ఎంత అవసరమో ఈ ఉదంతం నిరూపిస్తోంది. -
మీ డాక్టర్ 4-5 ట్యాబ్లెట్లు రాసిస్తున్నారా? WHO ప్రమాణాలు ఎలా ఉన్నాయ్?
ఒకే ప్రిస్క్రిప్షన్‌లో ఎక్కువ మందులు రాయడం ఆరోగ్యపరంగా ఎలాంటి ప్రభావం చూపుతుందనే చర్చ మరోసారి మొదలైంది. తాజా అధ్యయనం ప్రకారం పాకిస్థాన్‌లో ఆసుపత్రుల్లో ఒక్కో ప్రిస్క్రిప్షన్కు సగటున 4.2 మందులు సూచిస్తున్నట్లు తేలింది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించే సగటు 1.6 నుంచి 1.8 మందులతో పోలిస్తే చాలా ఎక్కువ.ఇస్లామాబాద్‌లోని హెల్త్ సర్వీసెస్ అకాడమీ పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనం ‘డిస్కవర్ పబ్లిక్ హెల్త్’ పత్రికలో ప్రచురితమైంది. పేషావర్‌లోని ఒక పెద్ద ఆసుపత్రిలో ఒక్కో ప్రిస్క్రిప్షన్కు సగటున 10.56 మందులు సూచించినట్లు అధ్యయనంలో వెల్లడైంది. అదే సమయంలో ప్రతి 4 మందుల్లో కేవలం ఒక మందును మాత్రమే జనరిక్ పేరుతో సూచించినట్లు తేలింది.భారత్‌లో.. భారత్‌లోనూ పరిస్థితి పూర్తిగా భిన్నంగా లేదని అందుబాటులో ఉన్న అధ్యయనాలు సూచిస్తున్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం, భారతదేశంలో ఔట్‌పేషెంట్ ప్రిస్క్రిప్షన్లపై జరిగిన వివిధ అధ్యయనాల్లో ఒక్కో ప్రిస్క్రిప్షన్కు సగటున 2.2 నుంచి 3.9 మందులు సూచించినట్లు నమోదైంది. ఇది కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించే పరిధి కంటే ఎక్కువ.ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ఒక్కో ప్రిస్క్రిప్షన్‌లో సగటున 1.6 నుంచి 1.8 మందులు ఉండటం, సాధ్యమైనంత వరకు జనరిక్ పేర్లతో మందులు సూచించడం, అవసరమైనప్పుడే యాంటీబయాటిక్స్, ఇంజెక్షన్లు ఉపయోగించడం వంటి అంశాలు ముఖ్యమైనవి.అయితే ప్రతి సందర్భంలో రెండు కంటే ఎక్కువ మందులు రాయడం తప్పు కాదు. మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు వంటి పలు సమస్యలు ఒకేసారి ఉన్నప్పుడు, అలాగే క్షయ, క్యాన్సర్, హెచ్ఐవీ వంటి కొన్ని వ్యాధుల్లో ఒకటి కంటే ఎక్కువ మందులు అవసరం కావచ్చు.అవసరం లేకుండా ఎక్కువ మందులు తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలు, ఒక మందు మరో మందుతో ప్రతిక్రియ చెందే ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా వృద్ధులు, ఇప్పటికే పలు వ్యాధులతో బాధపడుతున్నవారిలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉండొచ్చు. కాలేయం, మూత్రపిండాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. వైద్యులు ఎక్కువ మందులు సూచించినప్పుడు వాటి అవసరం, వాడాల్సిన కాలం గురించి వారిని అడగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. -
అది మన డీఎన్ఏలోనే ఉంది ..! మాధవన్ కుమారుడు వేదాంత్
కోలీవుడ్ నటుడు మాధవన్ కుమారుడు వేదాంత్ ఆసియా క్రీడల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. అతను ఈ ఏడాది సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు ఐచి ప్రిఫెక్చర్, జపాన్‌లోని నగోయాలో జరగనున్న ఖండాంతర బహుళ క్రీడా పోటీల కోసం సన్నద్ధమవుతున్నాడు. ఈనేపథ్యంలో ఒక మీడియా ఇంటర్వ్యూలో తను ఎదుర్కొంటున్న ఒత్తిడి గురించి, మన భారతీయ అథ్లెట్లకు ప్రతిభ ఎలా ఉంటుంది తదితరాల గురించి చాలా ఆసక్తికరంగా మాట్లాడారు. మన భారతీయుల్లో చాలా ప్రతిభ ఉందని చెబుతున్నాడు. నిజం చెప్పాలంటే జన్యపరంగా మనం చాలా అదృష్టవంతులమని అంటున్నాడు. మన ఆహారపు అలవాట్లను, క్రమశిక్షణను, ప్రేరణను సరిదిద్దుకోగలిగినట్లయితే మనం నిజంగా మంచి క్రీడాకారులుగా రాణించగలమని అన్నాడు. అయితే మనల్ని వెనక్కి లాగేస్తున్న అంశం మన ఆహారపు అలవాట్లేనని చెబుతున్నాడు. భారతీయ శరీరాలకు ఎక్కువ కొవ్వుని నిల్వ చేసుకోగల సామర్థ్యం ఉందని తెలిపాడు. అందువల్లే మనవి సన్నగా ఉండి కొవ్వు ఎక్కువగా ఉండే శరీర రకంగా అభివర్ణించాడు. వేల ఏళ్ల క్రితం వేట జీవనశైలి నుంచి పరిణామ క్రమం చెందుతూ వచ్చిందన్నారు. ఫలితంగా మనశరీరాలు చెప్పుకోదగిన కండ ద్రవ్యరాశిని నిర్మించకుండా అంతర్గత అవయవాల చుట్టూ ఉండే కొవ్వుని నిల్వగా ఉంచుకోవడం నేర్చుకున్నాయని చెప్పారు. ఈ తత్వమే మన ప్రజలను తీవ్ర కరువుని తట్టుకుని బయటపడటానికి సహాయపడిందని చెబుతున్నాడు. కాబట్టి మనం మరింత ప్రోటీన్ తీసుకోవడం మొదలుపెట్టి మన ఆహారపు అలవాట్ల పట్ల శ్రద్ధ వహిస్తే..మన జన్యవుల నుంచి ఇంకా ఎంతో సాధించగలమని సూచిస్తున్నాడు. రాబోయే ఆసియా క్రీడలకు సిద్ధమవుతున్న తరుణంలో తాను ఒక డైటీషియన్తో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపాడు. అది తన ఫామ్ వేగాన్ని మెరుగుపరుచుకోవడంలో సహాయపడిందని చెబుతున్నాడు ఈ స్విమ్మర్. అలాగే తాను గత కొన్ని నెలలుగా వెయిట్ ట్రైనింగ్, స్ట్రెంత్ కండిషనింగ్‌పై దృష్టి పెట్టిమరి శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిపాడు. ఈ ఆసియా క్రీడల్లో అతడు 200 మీటర్ల ఫ్రీస్టైల్ ఈత కొట్టబోతున్నట్లు తెలిపాడు. అయితే ఇది అంత సులభం కాదని తెలుసని, అందుకే తన సామర్థ్యాన్ని మరింతగా మెరుగుపరుచుకుంటున్నట్లు తెలిపారు. కోట్లాదిమంది కళ్లు ఒక ఆటగాడిపైనే ఉంటాయి, అందువల్ల ప్రపంచ స్థాయిలో పోటీపడటానికి సిద్ధమవుతున్నప్పుడు శక్తిమంతమైన ఆత్మవిశ్వాసంతో ఉండాలని అంటున్నాడు. తాను గెలవగలననే గట్టి నమ్మకం అతడికి ఉండాలంటున్నాడు. అలాగే మన లక్ష్యం ఎల్లప్పుడూ నక్షత్రాలపై ఉంటేనే చంద్రుడిపై దిగగలమంటూ తన సంభాషణను ముగించాడు వేదాంత్.ఇదీ చదవండి: చిన్నారులు జంక్ ఫుడ్ తినకుండా..ఆ టీచర్ ట్రిక్ మాములుగా లేదు! -
7 ‘అడుగుల’తో దాంపత్య బలం
విడివిడిగా వ్యాయామం చేసే యువ దంపతులతో పోలిస్తే కలిసి వ్యాయామం చేసే దంపతుల్లో దాంపత్య బంధం బలోపేతం అవుతోందని అమెరికాలో జరిగిన తాజా అధ్యయనంలో తేలిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దంపతులు మాట్లాడుకొనే తీరు, వారి మధ్య తలెత్తే గొడవలు, వాటిని పరిష్కరించుకునే విధానంపై చేపట్టిన సర్వేలో ఈ విషయం వెల్లడైందన్నారు. పరిశోధకులు పరిశీలించిన దంపతుల్లో దాదాపు 60 శాతం మంది తాము క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నామని చెప్పగా... వారిలో మూడింట ఒక వంతు మంది మాత్రమే కలిసి వ్యాయామం చేస్తున్నారని తేలింది. కలిసి వ్యాయామం చేసే దంపతులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, సమస్యలను సులభంగా పరిష్కరించుకోవడంతో వారి మధ్య మనస్పర్థలు తక్కువగా ఉంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనంలో దంపతులు కలిసి చేసిన వ్యాయామాల్లో నడక అన్నింటికంటే ఎక్కువగా కనిపించింది. దంపతులు కలిసి చురుగ్గా ఉండేందుకు నడక వ్యాయామం చాలా సులువైన, ఉపయుక్తమైన ఎక్సర్సైజ్ అని... ఇలా కలసి నడవడం వారి బంధాన్ని మరింత బలోపేతం చేస్తోందని వెల్లడైంది. ఈ క్రమంలో దంపతులు తమ జీవిత భాగస్వామి తమ మాటలను ఎక్కువగా వింటున్నారని, తమకు అండగా నిలుస్తున్నారన్న భావన కలుగుతోందనీ పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధన వివరాలు ఫ్యామిలీ రిలేషన్స్ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. స్ట్రెంత్ ట్రైనింగ్‌తో అతివల గుండె పదిలంవారంలో కనీసం 2 గంటలపాటు బరువులు ఎత్తడం, తాళ్లను లాగడం వంటి స్ట్రెంత్ ట్రైనింగ్/రెసిస్టెన్స్ ట్రైనింగ్ ఎక్సర్‌సైజులతో మహిళల్లో గుండె, రక్తనాళాల వ్యాధుల ముప్పు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అమెరికాలో జరిగిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా ఈ వ్యాయామాలన్నీ గుండెపోటు వచ్చే ముప్పును గణనీయంగా తగ్గించగలవని ఈ పరిశోధనలో తేలింది. æఎలాంటి వ్యాయామాలు చేయని మహిళలతో పోలిస్తే వారానికి కనీసం రెండు గంటలపాటు స్ట్రెంతెనింగ్/రెసిస్టెన్స్ ట్రైనింగ్ వ్యాయామాలు చేసే మహిళల్లో గుండె, రక్తనాళాల వ్యాధుల ముప్పు 20 శాతం తక్కువగా, గుండెపోటు ముప్పు 44 శాతం తక్కువగా కనిపించిందని పరిశోధకులు గుర్తించారు. అలాగే రెండు గంటలకు మించి వ్యాయామాలు చేసే మహిళల్లో ప్రతి అదనపు గంట వ్యాయామం వల్ల గుండె, రక్తనాళాల వ్యాధుల ముప్పు మరో 5 శాతం, గుండెపోటు ముప్పు 14 శాతం మేర తగ్గుతోందని కనుగొన్నారు. అయితే రెసిస్టెన్స్ ట్రైనింగ్ వ్యాయామాలు మాత్రమే చేసే వారిలో పక్షవాతం వచ్చే ముప్పు తగ్గినట్లు కనిపించలేదు. రెసిస్టెన్స్ ఎక్సర్సైజులతోపాటు ఏరోబిక్ వ్యాయామాలు కూడా కలిపి చేస్తే మాత్రం మరింత ప్రయోజనం కనిపించినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయన ఫలితాలను జర్నల్ ఆఫ్ ద అమెరిన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ అనే జర్నల్ ప్రచురించింది. 6 సూత్రాలతో మానసిక ఆరోగ్యం మనిషి మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఆరు అంశాలు ఎంతో కీలకమని ఓ అంతర్జాతీయ అధ్యయనం పేర్కొంది. వాస్తవానికి మానసిక ఆరోగ్యానికి 19 ప్రధాన అంశాలను పరిశోధణనాలు గుర్తించగా వాటిలో ఆరు అంశాలకు 90 శాతానికిపైగా నిపుణుల నుంచి ఏకాభిప్రాయం వ్యక్తమైంది. నేచర్ మెంటల్ హెల్త్ అనే జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం కోసం 26 దేశాలకు చెందిన 11 విభాగాల్లోని 122 మంది ప్రముఖ నిపుణులతో సర్వేలు నిర్వహించారు. అయితే ఆదాయం, శారీరక ఆరోగ్యం వంటి అంశాలు కూడా మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపొచ్చని అధ్యయనంలో వెల్లడైంది. 1 జీవితానికి అర్థం–పరమార్థం, లక్ష్యం ఉండటం: మన జీవితం విలువైనది. దానికో అర్థం, పరమార్థం ఉన్నాయి. మనం ఏదో ఒక లక్ష్యం వైపు ముందుకు వెళ్తున్నామనే భావన ఉండటం అవసరం. 2 జీవితంపై సంతృప్తి: జీవితాన్ని మొత్తంగా చూసుకున్నప్పుడు ఒక రకమైన సంతప్త భావన కలిగి ఉండటం ముఖ్యం. 3 స్వీయ అంగీకారం: తనలోని మంచిని, లోపాలను అర్థం చేసుకొని, తనను తాను తప్పుబట్టుకోకుండా సానుకూలంగా చూసుకోవడం. 4 ఇతరులతో సత్సంబంధాలు: మనకు బాగా దగ్గరి వారితో శ్రద్ధ, ప్రేమ, సహకారం, పరస్పర అవగాహనతో కూడిన అర్థవంతమైన సానుకూల సంబంధాలను కొనసాగించడం.5 స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం: జీవితానికి సంబంధించిన నిర్ణయాలను స్వయంగా తీసుకొనే స్వేచ్ఛ ఉండటం, తన భావాలను నిజాయితీగా వ్యక్తపరచగలగడం.6 ఆనందం: రోజువారీ జీవితంలో సానుకూల భావోద్వేగాలను సంతోషంగా, ఆనందంగా, హాయిగా అనుభవించడం. -
బ్రష్ చేసినా నోటి దుర్వాసనా?
నోటి దుర్వాసనకు.. చాలామంది సరిగ్గా బ్రష్ చేయకపోవడమే కారణమని అనుకుంటుంటారు. కానీ క్రమం తప్పకుండా రోజుకు రెండుసార్లు బ్రష్ చేస్తున్నా సమస్య ఉన్నట్లయితే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. బ్రష్ చేసుకోవడంతో పాటు నాలుకను కూడా టంగ్ క్లీనర్‌తో సున్నితంగా శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా నాలుకపై పేరుకుపోయిన ఆహార కణాలు, బ్యాక్టీరియా కూడా నోటి దుర్వాసనకు కారణమవుతుంది. టూత్‌బ్రష్ చేరుకోలేని ప్రదేశాల్లో ఆహార పదార్థాలు, ప్లాక్ పేరుకుపోవచ్చు. అందుకే రోజుకు కనీసం ఒక్కసారైనా ఇంటర్డెంటల్ బ్రష్‌తో పళ్లను శుభ్రం చేసుకోవాలి. నోటిలో లాలాజలం సహజంగా నోటిని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. శరీరంలో నీరు తగ్గడం, కొన్ని మందుల వల్ల నోరు పోడిబారితే దుర్వాసన పెరగవచ్చు. వెల్లుల్లి, ఉల్లిపాయ, కారంగా ఉండే ఆహారం, కొన్ని పానీయాలు తాత్కాలికంగా నోటి వాసనను మార్చవచ్చు. కానీ తిన్న చాలా సేపటి తర్వాత కూడా దుర్వాసన కొనసాగితే.. జాగ్రత్తలు తీసుకోవాలి. -
నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా? ఈ అలవాటు ప్రమాదమే!
ఉదయం నిద్ర లేవగానే తెలియకుండానే ఫోన్ వైపు చెయ్యి చాచడం ఈ రోజుల్లో అందరికీ ఒక అలవాటుగా మారిపోయింది. కేవలం అలారమ్ ఆపడం కోసమే ఫోన్ చేతిలోకి తీసుకున్నప్పటికీ! ఆ తర్వాత తెలియకుండానే సోషల్ మీడియా స్క్రోలింగ్‌లో మునిగిపోతున్నాం. దీనివల్ల అసలు రోజేప్రారంభం కాకముందే, మనస్సు రకరకాల ఆలోచనలతో నిండిపోయి తీవ్రమైన ఒత్తిడికి గురవుతోందని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే ఫోన్‌కే మొదటిప్రాధాన్యత ఇవ్వడం వల్ల, మన రోజు ఒక నెగెటివ్ ఆలోచనలు, బలహీనమైన మానసిక స్థితితోప్రారంభమవుతోందట.మంచం దిగకముందే ఫోన్ చూడటం వల్ల మన మానసిక శక్తి తగ్గిపోతుందట. అంతేకాదు, ఆ రోజంతా మనం ఏ పని సరిగ్గా చేయలేమని పరిశోధకులు చెబుతున్నారు. మనం నిద్రలేవగానే ఒక్కసారిగా వచ్చే సందేశాలు, ఈ మెయిల్లు, సోషల్ మీడియా అప్డేట్లను చూడటం వల్ల శరీరంలో ‘కార్టిసాల్’ స్థాయిలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.ఫోన్ చూసే ముందు నీళ్లు తాగడం, బాడీ స్ట్రెచింగ్, ఆ రోజు పనులను ప్రణాళిక బద్ధంగా చేసుకోవడం వంటి వాటి కోసం ప్రతిరోజూ ఉదయం కేవలం 20 నిమిషాలు కేటాయిస్తే సరిపోతుందని పేర్కొంటున్నారు. ఫోన్‌కి బదులు అలారం ఉపయోగిస్తే క్రమంగా మొబైల్ మీద ఆధారపడే అలవాటు తగ్గుతుందని చెబుతున్నారు.ఇవీ చదవండి: ‘నీకు ఓ విషయం చెప్పాలి.. మళ్లీ ఎవరికీ చెప్పొద్దు!’ -
‘నీకు ఓ విషయం చెప్పాలి.. మళ్లీ ఎవరికీ చెప్పొద్దు!’
‘‘నీకో విషయం చెప్పాలి.. కానీ ఎవరికీ చెప్పకూడదు!’’ ఇలాంటి మాట వినగానే చాలామందికి ఆసక్తి పెరిగిపోతుంది. స్నేహితుల మధ్యైనా, ఆఫీసులోనైనా, కుటుంబంలోనైనా.. మన మధ్య లేని వ్యక్తి గురించి మాట్లాడటం రోజువారీ మాటల్లో ఒక భాగమైపోయింది. అయితే దానిని వెంటనే ‘గాసిప్’ అంటూ చెడ్డ అలవాటుగా ముద్ర వేస్తాం. కానీ శాస్త్రవేత్తలు మాత్రం గాసిప్‌ను అంత సులభంగా చెడ్డదిగా చూడటం లేదు. గాసిప్ అనేది మనుషుల సామాజిక జీవితంలో ఒక ముఖ్యమైన ΄ాత్ర పోషించే సాధనం కూడా కావచ్చని అంటున్నారు.గాసిప్ అంటే సాధారణంగా మనం మన దగ్గర లేని వ్యక్తి గురించి చెడుగా మాట్లాడటం అని అనుకుంటాం.. కానీ ఇతరుల వ్యక్తిగత విషయాలు, నిర్ధారణ లేని వార్తలు, ఇతరుల గురించి నిజానిజాలు తెలుసుకోకుండా వ్యాప్తి చేసే సంభాషణలను కూడా గాసిప్ అంటారు.ఎందుకంత కుతూహలం!చాడీలు, రూమర్లు అనేవి కొత్తగా వచ్చిన అలవాటేమీ కాదు. ఎప్పటి నుంచో ఉన్నదే. ఇతరుల గురించి తెలుసుకోవడం, ఎవరు నమ్మదగినవారు? ఎవరి ప్రవర్తన ఎలా ఉంటుంది? ఎవరి మాట నమ్మాలి? వంటి విషయాలు తెలుసుకోవడం సహజంగానే సాగుతుంటుంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఒకరి గురించి సమాచారాన్ని పంచుకుని, ఇతరులను జాగ్రత్తగా ఉండమని హెచ్చరించడం ఒక రకమైన ఉపయోగం కావచ్చు. అదే సమయంలో, ఎలాంటి ప్రయోజనం లేకుండా ఒకరిని బ్లేమ్ చేసేందుకు అబద్ధాలు ప్రచారం చేయడం మాత్రం హానికరమైన గాసిప్‌గా మారుతుంది.ఆఫీసుల్లోనూ గాసిప్స్‘ఆఫీసులో గాసిప్ చేయకూడదు’ అని ఎన్ని నియమాలు పెట్టినా.. ఉద్యోగుల మధ్య అనధికారిక చర్చలు ఉండటం సహజం. ఎవరు బాగా పనిచేస్తున్నారు? ఎవరి మీద నమ్మకం పెట్టుకోవచ్చు? ఎవరు బాధ్యత తీసుకుంటారు? వంటి సమాచారాన్ని ఉద్యోగులు పరస్పరం పంచుకుంటుంటారు. ఇలాంటి సమాచారం కొన్నిసార్లు సహకారాన్ని పెంచవచ్చు. మరికొన్ని సందర్భాల్లో ఇబ్బందుల్లోనూ పడేయవచ్చు. అనుమానాలు సృష్టించడం, నమ్మకాన్ని కోల్పోయేలా చేయడం, సంబంధాలను దెబ్బతీయడం మాత్రమే ఉద్దేశమైతే.. అది హానికరమైనదే.గాసిప్ అనేది జీవితంలో ఒక భాగమే అయినప్పటికీ.. పరిశోధనలు సూచించేది ఏమిటంటే.. గాసిప్ ఉందా లేదా అన్నది కంటే, దాన్ని మనం ఎలా ఉపయోగిస్తున్నామన్నదే ముఖ్యం. మంచి గాసిప్ సమాచారం ఇవ్వొచ్చు.. స్నేహాన్ని బలపరచొచ్చు.. అవసరమైనప్పుడు ఇతరులను జాగ్రత్తపరచొచ్చు. కానీ అవే గాసిప్స్ ఒక్కోసారి సంబంధాలను దెబ్బతీయొచ్చు.. నమ్మకాన్ని కోల్పోయేలా చేయొచ్చు.. నష్టం కలిగించవచ్చు.– నిర్వహణ: రమా జంబులఇవి కూడా చదవండి: ప్రాథమిక చికిత్సలో ప్రథములమవుదాం -
ప్రాథమిక చికిత్సలో ప్రథములమవుదాం
అక్షర జ్ఞానం లేని వారి నుంచి పెద్ద చదువులు చదువుకున్న వారి వరకు... మనలో చాలామందికి అత్యవసర సమయంలో ప్రథమ చికిత్స గురించి అవగాహన అంతంత మాత్రమే! పూర్తిగా వైద్యులపైనే ఆధారపడే పరిస్థితి ఇప్పటికీ ఉంది. ఈ నేపథ్యంలో ప్రాథమిక వైద్యజ్ఞానం ఎప్పటికీ అవసరమే’ అని నాటినుంచి నేటి వరకు ఎన్నో తరాలకు గుర్తు చేస్తోంది ‘వేర్ దేర్ ఈజ్ నో డాక్టర్’ పుస్తకం.‘వైద్యుడు లేని చోట’ (హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణ) పేరుతో తెలుగు పాఠకులను కూడా పలకరించింది. వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే సందర్భంగా ఆ పుస్తకం గురించి మరోసారి. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు ప్రథమ చికిత్స గురించి శిక్షణ తరగతులు నిర్వహిస్తూ, కిట్స్ ఇస్తున్న ‘ఎమర్ రెడీ’ స్వచ్ఛంద సంస్థ గురించి ఒకసారి...‘వేర్ దేర్ ఈజ్ నో డాక్టర్’ అనేది ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ మాన్యువల్. మెక్సికోలో తనకు ఎదురైన అనుభవాల ఆధారంగా డేవిడ్ వెర్నర్ 1970లో స్పానిష్ భాషలో రాసిన పుస్తకం... డోండే నో హే డాక్టర్. ఈ పుస్తకం వందకు పైగా భాషల్లోనికి అనువాదం అయింది. జీవశాస్త్రవేత్త అయిన వెర్నర్, మెక్సికోలోని గ్రామీణ ప్రాంతాలలో పేద ప్రజల ఆరోగ్యం గురించి చాలా కాలం పనిచేశారు. ఎన్నో దేశాలలో ‘మార్పు కోసం ఆరోగ్య విద్య’ అనే అంశంపై వర్క్‌షాప్‌లు నిర్వహించారు. కాలిఫోర్నియాలో ‘హెల్త్ రైట్స్’ సంస్థ కో–ఫౌండర్‌గా, బోస్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ హెల్త్‌లో అసోసియెట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు వెర్నర్.ఎన్నో చిట్కాలు!‘వేర్ దేర్ ఈజ్ నో డాక్టర్’ పుస్తకం అతిసారం నుంచి మలేరియా వరకు ఎన్నో విషయాలను ప్రస్తావించింది. పరిశుభ్రత ప్రాముఖ్యత, ఆరోగ్యకరమైన ఆహారం, ఇంటి చిట్కాలు, ఇంటి చిట్కాలు పనిచేస్తాయో లేదో తెలుసుకునే మార్గాలు, టీకాల ప్రాధాన్యత, అనారోగ్యానికి కారణమయ్యే నమ్మకాలు, ఆరోగ్యాన్ని మెరుగుపరిచే నమ్మకాలు, మేలు చేసే ఔషధ మొక్కలు, తరచుగా గందరగోళానికి గురిచేసే అనారోగ్య సమస్యలు, అంటువ్యాధి కాని వ్యాధులు, థర్మామీటర్‌ను ఎలా ఉపయోగించాలి? అనారోగ్యంతో ఉన్నవారిని ఎలా చూసుకోవాలి, ప్రమాదకరమైన అనారోగ్య లక్షణాలు, వైద్యసహాయం ఎప్పుడు, ఎలా పొందాలి, మందులు లేకుండా చికిత్స చేసుకోవడం, నీటితో చికిత్స, మందుల వాడకానికి మార్గదర్శకాలు... ఇలా ఎన్నో విషయాలు ఈ పుస్తకంలో కనిపిస్తాయి.స్పష్టంగా, సంక్షిప్తంగా, సులభంగా...స్పష్టమైన, సంక్షిప్త సమాచారం ఈ పుస్తకం బలం. కామిక్ పుస్తకంలా చదవడానికి సులభంగా ఉంటుంది. ప్రాథమిక వైద్యానికి సంబంధించి మీ నైపుణ్యం తక్కువగా లేదా ఎక్కువగా ఉన్నప్పటికీ మీ పరిమితులకు లోబడి పనిచేస్తే మంచి ఫలితాలు అందుతాయి. ఏం చేయలి, ఏం చేయకూడదు, అనేదానిపై స్పష్టమైన అవగాహన ఉండాలి. అనవసరమైన రిస్క్ తీసుకోకండి. ఏమీ చేయకపోతే ప్రమాదం ఉందని అనిపించినప్పుడు మాత్రం మీకు గట్టిగా నమ్మకం ఉన్న పద్ధతిని అనుసరించడానికి వెనకాడకండి’ అంటుంది ఈ పుస్తకం.ఎమర్జెన్సీలో ఎమర్ రెడీమూడు సంవత్సరాల క్రితం... ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళుతున్న ఒక వృద్ధుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇది చూసిన ప్రచేతస్ యెరి అనే యువకుడు సహాయం కోసం కేకలు వేశాడు. 30 నిమిషాలకుగానీ అంబులెన్స్ రాలేదు. ఈ సంఘటన అతడిని ఒక వాస్తవాన్ని అర్థం చేసుకునేలా చేసింది. చాలామందికి అత్యవసర పరిస్థితులలో ఏంచేయాలో, ఏం చే యకూడదో తెలియదు. చాటా టెన్షన్ పడుతుంటారు. స్పృహ కోల్పోయిన వారికి చికిత్స చేయడం, సీపీఆర్, ఊపిరాడనప్పుడు సహాయం చేయడంలాంటి ప్రాథమిక చికిత్స పరిజ్ఞానం చాలామందిలో ఉండడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పాఠశాల విద్యార్థులకు ప్రాథమిక చికిత్స పరిజ్ఞానాన్ని అందించే ‘ఎమర్ రెడీ’ అనే స్వచ్ఛంద సంస్థకు శ్రీకారం చుట్టాడు ప్రచేతస్. ఈ సంస్థ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తోంది.శిక్షణ తరగతులలో...‘పేద పిల్లలు అత్యవసర పరిస్థితులలో భయాందోళనలకు గురి కాకుండా ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉండేలా చేయడమే ఎమర్‌రెడీ లక్ష్యం’ అంటున్నాడు ప్రచేతస్. ప్రభుత్వ పాఠశాలలు, స్థానిక స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తోంది ఎమర్‌రెడీ. కథలు చెప్పడం నుంచి వీడియోలు ప్రదర్శించడం వరకు ఆసక్తికరమైన పద్దతులలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఎమర్‌రెడీ ఇంటరాక్టివ్ లెర్నింగ్ విధానానికి మంచి స్పందన వచ్చింది. గాయాలు, ఎముకలు విరగడం, స్పృహ కోల్పోవడం, పాము, తేలు కాటు... మొదలైన సందర్భాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్స గురించి శిక్షణ తరగతులలో వివరిస్తారు. భాషా అవరోధాలను అధిగమించడానికి ప్రాంతీయ భాషలలో శిక్షణ ఇస్తున్నారు.పాఠ్యాంశాలలో ప్రథమ చికిత్సబ్యాక్΄్యాక్లలో ఇమిడిపోయేంత చిన్నగా ఉండే, పదునైన వస్తువులు లేని, సురక్షితమైన కాంపాక్ట్ ప్రథమ చికిత్స కిట్లను పిల్లలకు ఇస్తారు. వీటిని పిల్లలు ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ఈ కిట్లు ఇప్పటికే ఎంతోమందికి ఎన్నో రకాలుగా ఉపయోగపడాయని ఉపాధ్యాయులు తెలియజేశారు. చిన్న అడుగులతో మొదలైన ‘ఎమర్‌రెడీ’ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం విశేషం. ఐక్యరాజ్య సమితి ‘యూత్ యాక్టివేట్ ఇంపాక్ట్ సమ్మిట్‌లో మన దేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన ప్రచేతస్ పాఠశాలల పాఠ్యాంశాలలో ప్రథమచికిత్సను తప్పనిసరి పాఠంగా చేర్చాలనే సూచించాడు.భవిష్యత్ ప్రణాళికస్పృహ కోల్పోవడం, ఊపిరాడక పోవడం...ఇలాంటి పరిస్థితిలో సరైన సమయంలో ప్రాథమిక చికిత్స అందకపోవడం వల్ల ప్రాణహాని జరుగుతుంది. ‘అత్యవసర పరిస్థితులలో పిల్లలే ఆపద్భాందవులు. వైద్యుల సహాయం అందేలోపు బాధితులకు ప్రాణహాని తలెత్తకుండా చూడగలరు’ అంటుంది ఎమర్‌రెడీ.‘ఎమర్ రెడీ’కి స్పష్టమైన భవిష్యత్ ప్రణాళిక ఉంది. దీని ప్రకారం... దేశవ్యాప్తంగా పాఠశాలలో ‘ఎమర్‌రెడీ’ కార్యక్రమాలను విస్తరించడం ఆన్లైన్లో సెల్ఫ్–గైడెడ్ వీడియో ట్రైనింగ్ మాడ్యూల్స్ ప్రారంభించడం సెల్ఫ్–సస్టెయినింగ్ వాలంటీర్ నెట్‌వర్క్‌ను నిర్మించడం వంటివి ఇందులోని అంశాలు. -
తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న సీజనల్ ఫ్లూ జ్వరాలు
ఇటీవల తెలుగురాష్ట్రాల్లో ఇన్ఫ్లుయెంజా (ఫ్లూ) జ్వరం స్వైరవిహారం చేస్తోంది. పెద్దఎత్తున ప్రజలు దీని బారిన పడుతున్నారు. అయితే ఇవేమీ కొత్త జ్వరాలు కావు. దాదాపు ప్రతి ఏడాదీ వస్తూ ఉండే సీజనల్ జ్వరాలుగానే చెప్పవచ్చు. కాకపోతే ఇవి వైరస్ వల్ల వచ్చే జ్వరాలు కావడంతో ప్రతి ఏడాదీ... ఇన్ఫ్లుయెంజా వైరస్ తన జన్యుస్వరూపం మార్చుకుంటూ వచ్చిన... ప్రజలను బాధిస్తూ ఉంటుంది. మొట్టమొదట తెలుసుకోవాల్సింది ఏమిటంటే... ఇన్ఫ్లుయెంజా అనేది వైరస్‌తో వచ్చే జ్వరం కావడం వల్ల దీనికి యాంటీబయాటిక్స్ పనిచేయవు. దీనికి యాంటీవైరల్ మెడిసిన్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వైరస్ సోకిన 48 గంటలలోపు ఇవ్వకపోతే ఆ వైరస్ నశించదు. అటు తర్వాత వైరస్ తీవ్రత దానంతట అదే నెమ్మదిస్తుంది. కాకపోతే ఈలోపు మనిషిని తీవ్రమైన నీరసానికి, నిస్సత్తువకూ గురిచేసి బాధిస్తాయి. ముప్పు ఎవరెవరిలోనంటే... ఆస్తమా, ఎంఫసిమా, సీవోపీడీ వంటి దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారు.డయాబెటిస్ బాధితులు వృద్ధులు, చిన్నపిల్లల వంటి రోగనిరోధక శక్తి తక్కువగా ఉండేవారు, గర్భిణులూ, గుండెజబ్బు బాధితుల వంటి వారిలో ఫ్లూ జ్వరం ప్రమాదకరం కావచ్చు. లక్షణాలు ఇలా... హెచ్1ఎన్1లో కనిపించే తొలి లక్షణాలు సాధారణ ఫ్లూ లేదా వైరల్ జ్వరం లాగానే ఉంటాయి. అకస్మాత్తుగా తీవ్రమైన జ్వరం రావడం (హై ఫీవర్... ఇది ఒక్కోసారి 103 ఫారెన్‌హీట్ వరకూ పెరగవచ్చు) ,పొడి దగ్గు, గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ, ముక్కు ఎర్రబారడం, తీవ్రమైన ఒళ్లునొప్పులు ,బాగా నీరసంగా అనిపించడం, కొందరిలో కడుపునొప్పి కూడా రావచ్చు. వ్యాధినిరోధక శక్తి బలంగా ఉన్నవారిలో రెండు మూడు రోజుల్లోనే లక్షణాలు వాటంతట అవే తగ్గిపోవచ్చు. అయితే కొంతమందిలో నీరసం, నిస్సత్తువ, ఒళ్లునొప్పుల వంటివి రెండు వారాల వరకు తగ్గకపోవచ్చు. జ్వరం అనంతర దుష్ప్రభావాలుచాలామందిలో లక్షణాలు తగ్గిపోయినప్పటికీ కొందరిలో మాత్రం వైరస్ ఊపిరితిత్తుల వరకు చేరి వైరల్ న్యూమోనియాకూ, ఇంకొందరిలో వైరల్ న్యూమనైటిస్కూ, ఇది మరికొందరిలో మరింత తీవ్రమైతే ఏఆర్డీఎస్ (అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రేస్ సిండ్రోమ్) అనే తీవ్రమైన శ్వాస సమస్యలకూ దారితీయవచ్చు. అరుదుగా ఇంకా మరికొందరిలో గుండె కండరం కాస్తంత దెబ్బతిని గుండె కండరాల వాపు (మయోకార్డిటిస్) సమస్య రావచ్చు. ఇక ఈ ఫ్లూ ప్రభావం కారణంగా వ్యాధినిరోధక శక్తి కొద్దిగా తగ్గడం వల్ల మరికొందరిలో ఫ్లూ తర్వాత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ముప్పు కూడా ఉంటుంది. ఎప్పుడెప్పుడు కనిపిస్తుందంటే... మన దేశంలో హెచ్1ఎన్1 కేసులు సాధారణంగా రెండు సీజన్లలో ప్రధానంగా కనిపిస్తుంటాయి. మొదటిదశల్లో వర్షాకాలంలో అంటే... జూలై నుంచి అక్టోబర్ వరకు (ప్రస్తుతం ఈ స్పెల్ నడుస్తోంది) ఇక రెండో దశ చలికాలంలో అంటే... ప్రధానంగా డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు. ఆ టైమ్‌లో కూడా అప్రమత్తంగా ఉండటం అవసరం. సాధారణంగా సీజనల్ ఫీవర్లా వచ్చే ఈ ఫ్లూ పెద్దగా ప్రమాదకరం కాదుగానీ... మొదటి 48 గంటల పాటు చాలా అప్రమత్తంగా ఉండాలి. దాదాపు తేలిగ్గానే తగ్గిపోయే ఈ ఫ్లూ జ్వరం మాత్రం కొన్నిసార్లు ప్రాణాపాయ స్థితికి దారితీయవచ్చు. అందుకే మొదటి 48 గంటల సమయం కూడా కీలకమని గుర్తించాలి. ఫ్లూ వ్యాప్తి ఇలా... ఈ ఫ్లూ జ్వరం తాలూకు వైరస్ గాలి ద్వారానే ఒకరి నుంచి మరో వ్యక్తికి వ్యాపిస్తుంటుంది. ప్రధానంగా వ్యాధి సోకిన బాధితుడు మాట్లాడుతున్నప్పుడు, దగ్గుతున్నప్పడు లేదా తుమ్మినప్పుడు బయటకు వచ్చే తుంపర్ల ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది.పరోక్ష పద్ధతుల్లోనైతే... బాధితుడి తుంపర్లు డోర్ నాబ్స్ మీద లేదా వారు వాడిన ఫోన్ మీదగానీ లేదా వారు ముట్టుకున్న మెట్ల రెయిలింగ్స్ మీద పడ్డ తర్వాత, వేరొకరు వాటిని ముట్టుకున్నప్పుడు కూడా వైరస్ వ్యాపిస్తుంది. ఈ తరహా వ్యాప్తిని ‘ఫోమైట్’వ్యాప్తిగా చెబుతారు. వైరస్ సోకగానే లక్షణాలు బయటకు కనిపించకపోయినప్పటికీ... అప్పట్నుంచే వైరస్ అతడి నుంచి మరొకరికి వ్యాపించవచ్చు. అలాగే జ్వరం మొదలయ్యాక దాదాపు వారం రోజుల వరకు వైరస్ ఇతరులకు సోకే అవకాశం ఉంటుంది.నివారణ మార్గాలు ఇలా.. కోవిడ్ సమయంలో పాటించిన జాగ్రత్తల వంటివి అంటే మాస్క్ పెట్టుకోవడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, శానిటైజర్స్ వాడటం వంటి జాగ్రత్తలు పాటించాలి. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచడం, ఇంటి కిటికీలు తెరిచి గాలి సరిగా తిరిగేలా చేయడం ద్వారా మూసిన గదుల్లో వైరస్ వ్యాప్తి అవకాశాన్ని తగ్గించాలి. నీళ్లు, గోరు వెచ్చని సూప్, ఓఆర్ఎస్ వంటి ద్రవాలు / ద్రవాహారాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. ఊపిరితిత్తుల వ్యాధులు, గుండెజబ్బులు, డయాబెటిస్ బాధితుల వంటి వారు మరింత అప్రమత్తంగా ఉండటంతో పాటు ఫ్లూ నివారణ కోసం ప్రతి ఏడాదీ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలి.జలుబుతో ఇవీ పోలికలు... ఈ ఫ్లూ జ్వరానికి సాధారణ జలుబుతోనూ కొన్ని పోలికలు కనిపిస్తుంటాయి. సాధారణ జలుబులోలాగే ఒళ్లునొప్పులూ కనిపించవచ్చు. అయితే మొదట్లో పొడి దగ్గు వస్తూ ఉన్నప్పటికీ క్రమంగా తర్వాత్తర్వాత కళ్లె పడటం, ముక్కునుంచి స్రావాలు రావడమూ కనిపిస్తుంది. దగ్గు కూడా వస్తుంటుంది. వీటితో పాటు మెడికల్ ఎమర్జెన్సీని సూచించే లక్షణాలు కూడా కనిపిస్తాయి. ప్రధానంగా శ్వాస వేగంగా తీసుకుంటూ ఉండడం, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది, ఛాతీ లోపలికి లాగినట్లు అనిపించడం వంటి లక్షణాలుంటాయి. పెదవులు లేదా చర్మం నీలంగా మారడం, అయోమయం, తీవ్రమైన నీరసం/నిస్సత్తువ ఉంటాయి. జ్వరం తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరగడం, పల్స్ ఆక్సిమీటర్‌లో ఆక్సిజన్ మోతాదులు వేగంగా తగ్గుతూ పోవడం ఆక్సిజన్ తగ్గిన లక్షణాలు, రక్తపోటు (బీపీ) అకస్మాత్తుగా పడిపోవడం కళ్లె / తెమడలో రక్తపు చారిక కనిపించడం వంటివి కనిపిస్తాయి.చికిత్స తీసుకోవడం తప్పనిసరి.. సాధారణంగా బాధితులు తీవ్రమైన జ్వరం, పొడి దగ్గు, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలుంటే డాక్టర్లను సంప్రదించాలి. ఇది వైరల్ ఫీవర్ కావడంతో దీనికి యాంటీబయాటిక్స్ పనిచేయవు. అందుకే ఈ సమస్యకు ‘ఒసెల్టామివిర్’(టామీ ఫ్లూ) అనే యాంటీ వైరల్ మందును ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని మొదటి 48 గంటలలోపు ఇవ్వడం వల్ల మంచి ప్రభావం ఉంటుంది. లక్షణాలు బలంగా కనిపిస్తూ సమస్యలు తీవ్రమైనప్పుడు ల్యాబ్ రిపోర్టు కోసం ఎదురుచూస్తూ చికిత్స ఆలస్యం చేయకూడదనే వైద్య మార్గదర్శకాలు ఉన్నందున తమ అనుభవంతో ఫ్లూను అనుమానించినప్పుడు డాక్టరు యాంటీ వైరల్ మందు ‘ఒసెల్టామివిర్’ను ఇస్తారు.ఇదీ చదవండి: శానిటైజర్ మితిమీరి వాడడం.. చర్మానికి హానికరంఅయితే కొన్నిసార్లు అవసరాన్ని బట్టి డాక్టర్లు యాంటీబయాటిక్స్‌ను సూచిస్తారు. ఈ ఫ్లూ ప్రభావంతో వ్యాధినిరోధక శక్తి తగ్గడంతో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ సోకి వాటి లక్షణాలూ కనిపిస్తున్నప్పుడు యాంటీబయాటిక్స్‌ను సూచిస్తారు. జ్వరం, ఒళ్లునొప్పులు తగ్గడానికి పారాసిటమాల్ ఇస్తారు. దగ్గు తగ్గడానికి కాఫ్ సిరప్‌లను సూచిస్తారు. కొందరిలో ఫ్లూ తీవ్రంగా మారి, ఊపిరితిత్తులను ప్రభావితం చేయడం వల్ల శ్వాస తీసుకోవడం కష్టమై, రక్తంలో ఆక్సిజన్ తగ్గి, ఐసీయూలో చేర్చాల్సిన పరిస్థితీ రావచ్చు. బాధితుల్లో ఆక్సిజన్ సాచ్యురేషన్ తగ్గినప్పుడు ఐసీయూలో చేర్చి ఆక్సిజన్ ఇవ్వాల్సిరావచ్చు. అందుకే పల్స్ ఆక్సిమీటర్‌లో ఆక్సిజన్ మోతాదు 94 శాతం కంటే తక్కువగా ఉంటే తక్షణం వైద్యులను సంప్రదించాలి. – సాక్షి హెల్త్ డెస్క్ -
గుండెజబ్బులను గుర్తించేందుకు మరో ఆయుధం
న్యూఢిల్లీ: ఢిల్లీకి చెందిన CSIR-ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (IGIB) పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో, కోరోనరీ ఆర్టరీ డిసీజ్ (CAD)ని ముందస్తుగా గుర్తించడంలో సెరోట్రాన్స్‌ఫెరిన్ (Serotransferrin - TF) అనే ప్రొటీన్ కీలక పాత్ర పోషిస్తుందని తేలింది. శరీరం మొత్తానికి ఐరన్ సరఫరా చేసేందుకు ఉపయోగపడే సెరోట్రాన్స్‌ఫెరిన్ అనే ప్రొటీన్ తక్కువగా ఉంటే కరోనా ఆర్టరీ డిసీజ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఐజీఐబీ శాస్త్రవేత్తలు గుర్తించారు. రక్తనాళాల్లో గార లాంటి పదార్థం పేరుకుపోవడం వల్ల గుండెకు రక్త ప్రసారం తగ్గడాన్నే కరోనా ఆర్టరీ డిసీజ్ అంటారు. అయితే ఈ సమస్యకు గురైన వారిలో ఐరన్ తక్కువగా ఉంటుంది. సాధారణంగా ఈ జబ్బును ముందుగానే గుర్తించడం కష్టం. ఈ నేపథ్యంలో సెరోట్రాన్స్‌ఫెరిన్ మోతాదులను పరిశీలించడం ద్వారా ఒక వ్యక్తి కరోనా ఆర్టరీ డిసీజ్‌కు గురయ్యే అవకాశం ఎంత ఉందో ముందుగానే తెలుసుకోవచ్చు నని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త సాగరికా బిశ్వాస్ తెలిపారు. సెరోట్రాన్స్‌ఫెరిన్ పనితీరును క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం ద్వారా గుండెజబ్బులకు కొత్త చికిత్సలు అభివృద్ధి చేసేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. ఆరోగ్యంగా ఉన్న వారితో పోలిస్తే గుండెజబ్బు ఉన్న వారిలో మొత్తం 197 ప్రొటీన్లలో ఒక్క సెరోట్రాన్స్‌ఫెరిన్ మాత్రమే తక్కువగా ఉన్నట్లు తమ పరిశీలనలో తెలిసిందని ‘ఆక్టా కార్డియోలాజికా’జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన వ్యాసం తెలిపింది. గుండెజబ్బులున్న వారు యాభై మందిని, ఆరోగ్యంగా ఉన్న 40 మందిని పరిశీలించినప్పుడు జబ్బులున్న వారిలో ‘ట్రోపోనిన్–1’ఎక్కువగా ఉన్నట్లు కూడా ఈ పరిశోధన ద్వారా తెలిసిందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇదీ చదవండి: ప్రారంభోత్సవానికి రాను, సిగ్గుపడుతున్నా : కేంద్రమంత్రి గడ్కరీ ధ్వజంరాబోయే రోజుల్లో సెరోట్రాన్స్ఫెరిన్పై మరిన్ని మాలిక్యులర్, క్లినికల్ పరిశోధనలు జరిగితే, ఇది గుండె జబ్బుల నివారణ మరియు చికిత్సలో ఒక కొత్త మార్గాన్ని సుగమం చేస్తుందని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేశారు. గుండె కండరాల్లో ఉండే ఈ ప్రత్యేక ప్రొటీన్ ఏదైనా నష్టం, గాయమైనప్పుడు రక్తంలోకి చేరుతూంటుంది. ఇది ఎక్కువగా ఉంటే గుండెజబ్బు ఉన్నట్లు లెక్క. అలాగే సెరోట్రాన్స్‌ఫెరిన్ తక్కువగా ఉన్నా జబ్బు ఉన్నట్లుగా అర్థం చేసుకోవచ్చునని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇదీ చదవండి: మిన్ను విరిగి మీద పడినా : పెళ్లి ఆగేదే లేదు! -
ఇప్పటికీ ఆశ్చర్యమే..! తన ప్రెగ్నెన్సీపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు
‘మా ఇంటి బంగారం’ సక్సెస్ మీట్లో తన ప్రగ్నెన్సీ గురించి ప్రకటించారు సమంత రాజ్ నిడిమోరులు. తాము మొదటి బిడ్డకు స్వాగతం పలకనున్నట్లు తెలిపారు. ప్రసూతి శెలవులు అనంతరం మరిన్ని హిట్లతో మళ్లీ మీ ముందుకు వస్తానని తన అభిమానులకు హామీ ఇచ్చింది నటి సమంత. ఆ తర్వాత నుంచి తన ప్రగ్నెన్సీకి సంబంధించి ప్రతీ అప్డేట్ ఇన్‌స్టాలో షేర్ చేస్తూ చిల్ అవుతోంది సమంత. ఈ జర్నీలో ప్రతి నెల ఓ అద్భుతం..అలాగే ఈ ప్రెగ్నెన్సీ తనకు ఎప్పటీ ఆశ్చర్యమే ఎందుకంటే..అంటూ తన మాతృత్వపు మధురిమకు సంబంధించిన కొన్ని విషయాలు పంచుకుంది. తను ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలు రీత్యా పిల్లలు కలిగే అవకాశం లేదనుకున్నాని, అందుకు తామిద్దరం సిద్ధపడిపోయామని చెప్పుకొచ్చింది. అసలు ఏం జరిగినా ఇద్దరం కలిసి ముందుకు సాగుదాం అని అనుకున్నాం. అలా నిర్ణయించుకున్న తరుణంలో ప్రెగ్నెంట్ అని నిర్థారణ కావడం తనని చాలా ఆశ్చర్యంలో ముంచెత్తిందని సంబరంగా చెబుతోంది సమంత. సరిగ్గా తాను ప్రెగ్నెంట్ అని తెలిసింది మా ఇంటి బంగారం మూవీ షూటింగ్‌ల ‘త త తతస్సాదియ్యా పాట’ షూట చేస్తున్నప్పుడే తెలిసిందని, దాంతో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని డ్యాన్స్ చేయాల్సి వచ్చిందని నాటి పరిస్థితిని వివరించింది. తనకి 2022లో ఆటోఇమ్యూన్ వ్యాధి అయిన మయోసైటిస్ ఉన్నట్లు నిర్థారణ అయినప్పుడు అవేళ తాను పడ్డా నరకం ఎన్నటికీ మర్చిపోలేనని చెప్పుకొచ్చింది. అసలు ఆ టైంలో జీవితమే అయిపోయిందనిపించింది, పైగా లేని ఆత్మవిశ్వాసాన్ని కొని తెచ్చుకున్నట్లుగా నటిస్తున్నట్లుగా అనిపించిందంటూ నాటి చేదు అనుభవాన్ని గుర్తుచేసుకుంది. అంతేగాదు ఆ తర్వాత ఎదురయ్యే పరిస్థితులకు ఎలా స్పందిస్తాననేది కూడా తన నియంత్రణలో లేనట్లుగా, చాలా బలహీనంగా అయిపోయినట్లు అనిపించిందంటూ కన్నీటిపర్యంతమైంది. కానీ ఆ వ్యాధి నుంచి బయటపడేలా వర్కౌట్లు చేస్తూ..మెరుగ్గా మారి, తిరిగి తన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోగలిగానని చెప్పుకొచ్చింది. ఒక రకంగా ఈ వ్యాధి తనకు జీవితంలో దృఢచిత్తం, ఆశ, విశ్వాసం వంటి విలువల గురించి గొప్ప పాఠాన్ని నేర్పిందని పేర్కొంది. ఆ తర్వాతే తన నటన, జీవితం మరింత వాస్తవికంగా మారినట్లు అనిపించిందంటూ భావోద్వేగంగా మాట్లాడింది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) (చదవండి: జీర్ణించుకోలేకపోయా అందుకే..!నికితా పోర్వాల్ భావోద్వేగభరిత లేఖ) -
జీర్ణించుకోలేకపోయా అందుకే..!నికితా పోర్వాల్ భావోద్వేగభరిత లేఖ
ఇటీవల ముగిసిన మిస్ వరల్డ్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన నికితా పోరాల్ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగభరితమైన లేఖ రాశారు. కిరీటాన్ని అందుకోలేకపోయినా..ఆ విస్ వరల్డ్ తనకు అందించి అనుభవం, ఆ ప్రయాణంలో తనకు లభించిన ప్రేమ, నేర్చుకున్న పాఠాలను గురించి లేఖలో పంచుకుంది. తన మిస్‌వరల్డ్ జర్నీకి సంబంధించిన ఫోటోల తోపాటు ఈపోస్ట్ని కూడా జోడించి షేర్ చేసింది. ఆ లేఖలో నికితా ఇలా రాసుకొచ్చింది. "మిస్ వరల్డ్ ఫైనల్ తర్వాత కిరీటం లేకుండా ఇంటికి రావడం అత్యంత కష్టమైన విషయం, అయినా అక్కడ పొందిన ప్రేమను వర్ణించడానికి మాటలు చాలవు. అక్కడ తనకు లభించిన ప్రేమ, మద్దతు..ఇలా ప్రతీదాన్ని జీర్ణించుకోవడానికి చాలా సమయం పట్టింది. మీరంతా నేను కిరీటాన్ని గెలుచుకోవాలని కొండంత ఆశతో ఎదురుచూశారు. అలా ఇంతకుమందెన్నడూ చూడని ఎన్నో కుటుంబాల ప్రేమను సంపాదించుకున్నాను. అందాల పోటీల ప్రపంచంలో అత్యంత విచిత్రమైన మరియు అందమైన విషయం ఏమిటంటే, కొన్నిసార్లు మీకు మద్దతు ఇచ్చే అకౌంట్ల వెనుక ఉన్న ముఖాలు మనకు తెలియవు. తెల్లవారుజామున 2 గంటలకు ఆ ఎడిట్ ఎవరు చేస్తున్నారో, ఆ సుదీర్ఘ సందేశం ఎవరు రాస్తున్నారో, కామెంట్ సెక్షన్లో నాకోసం ఎవరు పోరాడుతున్నారో, అప్డేట్ కోసం పేజీని ఎవరు రిఫ్రెష్ చేస్తున్నారో కూడా తెలియదు... కానీ ఎలాగోలా వారి ప్రేమ మనకు తెలుస్తుంది అంటూ అభిమానులను ఉద్దేశించి రాసింది.". ఆ తర్వాత తన ఓటమి గురించి ఇలా పేర్కొంది. " ‘ఇండియా' అని పిలిచే అదృష్టం దక్కించుకున్నా. అసలు ఆ వారాల పాటు, నా పేరు దాదాపు కనుమరుగైపోయింది, మర్చిపోయా. ఎవరైనా 'ఇండియా!' అని పిలవగానే ఏదో తెలియని పులకింత, ఒక అటెన్షన్ వచ్చేసేవి. నిజానికి నేను కిరీటాన్ని దక్కించుకోవాలని అనుకున్నా..బలంగా కోరుకున్నా..అందుకోసం ఎంతో కష్టపడ్డా. కానీ ఓటమిని ఎదుర్కొన్నా..అయినప్పటికీ ఈ జర్నీలో ఎన్నో జ్ఞాపకాలు, స్నేహాలు, ప్రేమలు సంపాదించుకుని సరికొత్త నికితాగా ఇంటికి తిరిగి వచ్చా. కొన్ని విజయాలు వరించలేకపోయినా..హృదయంలో ఎన్నో జ్ఞాపకాలను పదిలంగా ఉంచుతాయి. ప్రేమతో మీ నికితా అంటూ తన పోస్ట్‌ని ముగించింది నికితా పోర్వాల్. View this post on Instagram A post shared by Nikita Porwal (@nikitaporwal_) (చదవండి: అమ్మాయి నిజంగా బంగారం! ఆ డ్రెస్ అక్షరాల రూ. 4 కోట్లుపైనే..) -
క్యాన్సర్‌పై ఢీకి.. ‘రెడీ’యేషన్
రేడియేషన్ చికిత్సలకు ఉన్న చరిత్ర దాదాపు 130 ఏళ్లు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా రేడియో యాక్టివ్ మెటీరియల్‌ను కనుగొన్నది 1986లో హెన్రీ బెకరెల్ అనే శాస్త్రవేత్త. అంటే... ఈ ఏడాదికి 2026 ఏడాదికి ఖచ్చితంగా 130 ఏళ్లు నిండుతాయి. ఇక నోబెల్ బహుమతి గ్రహీత మేరీక్యూరీ – పోలోనియం, రేడియమ్ వంటి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ కనుగొన్నాక ఈ చికిత్స ప్రాధాన్యం మరింత పెరిగింది. దాదాపు ఈ దశాబ్దకాలంలో రేడియో యాక్టివ్ మెటీరియల్‌తో క్యాన్సర్‌కు చికిత్సలు చేయడంలో అనేక రకాల పురోగతి చోటు చేసుకుంది. 1970లకు ముందున్న కాలంలో ఎక్స్–రేల రూపంలో వైద్యరంగానికి సేవలందించిన రేడియేషన్ 1970ల తర్వాత సీటీ, ఎమ్మారై లుగా... ఆ తర్వాత 1980లలో పెట్ స్కాన్ వంటి రూపాలలో వైద్యచికిత్సలకు తోడ్పడుతూ వచ్చింది. అటు తర్వాత ఇమేజ్ గైడెడ్ రేడియేషన్ థెరపీ, బ్రాకీథెరపీ, స్టీరియో టాక్టిక్ రేడియేషన్, రేడియో ఐసోటోప్ థెరపీ, ఇమేజ్ గైడెడ్ రేడియేషన్ (ఐజీఆర్టీ) వంటి ఎన్నో కొత్త పద్ధతుల్లో ఈ రేడియేషన్ వైవిధ్య భరితమైన చికిత్సలు అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఆధునిక రేడియేషన్చికిత్సల్లోని అనేక అంశాలను పరిశీలిద్దాం.క్యాన్సర్ రంగంలో అత్యంత పురోగతి తర్వాత ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ వంటి అత్యాధునికమైన చికిత్స ప్రక్రియలు రాకముందే దాదాపుగా ప్రజలందరికీ తెలిసిన చికిత్స ప్రక్రియలు శస్త్రచికిత్సలూ, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీలు. ఇందులో రేడియేషన్ థెరపీలో అనేక రకాల అడ్వాన్స్మెంట్లు చోటు చేసుకున్నాయి. ఆ పురోగతులూ, వాటి ఫలితాలేమిటో చూద్దాం.రేడియేషన్ థెరపీ అంటే ఏమిటి?శక్తిమంతమైన ఎక్స్–రే వంటి రేడియేషన్స్‌ను ఖచ్చితంగా క్యాన్సర్ కణాలపై నిశితంగా ప్రసరించేలా చూసి, ఆ కణాన్ని పూర్తిగా తుదముట్టించే చికిత్స ప్రక్రియను ‘రేడియేషన్ థెరపీ’గా చెబుతారు. ఈ కిరణాలు కణాల్లోని డీఎన్ఏ లేదా కణాల్లోని మౌలికాంశాలను దెబ్బతీసి వాటిని నిర్వీర్యం చేస్తాయి. దాంతో ఆ క్యాన్సర్ కణాలు చనిపోవడం వల్ల క్యాన్సర్ కూడా తొలగిపోతుంది.తొలి నాళ్లలో రేడియేషన్ అనేది అది క్యాన్సర్ కణమా లేదా ఆరోగ్యకరమైన కణమా అన్న విచక్షణ లేకుండా తాను ప్రసరించిన చోట ఉన్న కణాలను నాశనం చేయగలిగే సామర్థ్యం ఉండటంతో చుట్టూ ఉన్న ఆరోగ్యకరమైన కణాలను సంరక్షిస్తూ, వాటికి వీలైనంత తక్కువ నష్టం కలిగేలా ఇచ్చేవారు. ఇప్పుడు ఈ రంగంలో వచ్చిన ఆధునిక పురోగతితో కేవలం క్యాన్సర్ కణాలపైనే గురిపెట్టగలిగేంత నిశితంగా రేడియేషన్ ఇవ్వడం సాధ్యమవుతోంది.రేడియేషన్ థెరపీలో కొన్ని ముఖ్యమైన రకాలివి... క్యాన్సర్ కణాలు / క్యాన్సర్ గడ్డ (ట్యూమర్) అనేది గుండె, మెదడు, వెన్నుపాము వంటి అత్యంత సున్నితమైన అవయవాలకు చాలా దగ్గరగా ఉన్నప్పుడు రేడియేషన్‌ను మరింత జాగ్రత్తగా, ఖచ్చితంగా ఇవ్వాలి. ఉదాహరణకు మెదడులోని అనేక ప్రాంతాలు దేహంలోని అనేక అవయవాలను నియంత్రిస్తుంటాయి. శస్త్రచికిత్స చేసే సమయంలో మెదడులోని ఏదైనా కీలకమైన అవయవాన్ని నియంత్రించే భాగం దెబ్బతింటే... ఆ అవయవం అచేతనమయ్యే అవకాశముంటుంది. రేడియేషన్ ప్రసరించినప్పుడు కూడా అలాంటి అవకాశం ఉన్నప్పటికీ... అత్యంత నిశితంగా కేవలం క్యాన్సర్ కణాన్నే గురిపెట్టి దెబ్బతీసే సాంకేతికతా ఇప్పుడు అందుబాటులో ఉంది. ప్రధానంగా చెప్పాలంటే రేడియేషన్‌లో బయటి నుంచి ఇచ్చే ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ థెరపీ (ఈబీఆర్టీ), లోపలి నుంచి ఇచ్చే ఇంటర్నల్ రేడియేషన్ థెరపీతో పాటు సిస్టమిక్ రేడియేçషన్ థెరపీ (ఎస్ఆర్టీ) అనే మరో రకమైన రేడియేషన్ ప్రక్రియలను చెప్పవచ్చు. ఈ రేడియేషన్ థెరపీలో అందుబాటులో ఉన్న వివిధ ప్రక్రియల్లో ఈ కింద పేర్కొన్నవి కొన్ని... ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ థెరపీ (ఈబీఆర్టీ)త్రీడీ కన్ఫార్మల్ రేడియేషన థెరపీ – (3 డీసీఆర్టీ): ఇందులో ముందుగా సీటీ వంటి స్కాన్ల సహాయంతో క్యాన్సర్ కణితి (ట్యూమర్) ఎంత పెద్దది, దాని ఆకృతి ఎలా ఉంది, అది దేహంలోని ఏ ప్రాంతంలో ఉంది అని తెలుసుకుంటారు. ఆ కణితి ఆకృతికి తగ్గట్టుగా కేవలం దానికే తాకేలా రేడియేషన్ కిరణాలను పంపిస్తారు. మనకు కావాల్సిన మేరకే కాంతి ప్రసరించే ఒక పెన్టార్చ్ లాంటి దాన్ని ఊహిస్తే... ఈ పద్ధతిలో కేవలం మనకు కావాల్సిన చిన్న ప్రాంతంపైనే కాంతి పడినట్టే రేడియేషన్ కూడా పడుతుందని అనుకోవచ్చు. దాంతో రేడియేషన్ అన్నది క్యాన్సర్ గడ్డపైనే పడుతూ... పక్కనున్న ఆరోగ్యకరమైన కణజాలానికి వీలైనంత తక్కువ నష్టం కలిగేలా చూస్తారు. మెదడు, తల–మెడ (హెడ్ అండ్ నెక్), కాలేయం, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్ వంటి అనేక క్యాన్సర్లలో ఉపయోగించవచ్చు.ఇమేజ్ గైడెడ్ రేడియేషన్ థెరపీ (ఐజీఆర్టీ) ఇందులో రేడియేషన్ ఇచ్చే సమయంలో క్యాన్సర్ ఉన్న ప్రదేశాన్ని ఇమేజింగ్ ప్రక్రియ ద్వారా జాగ్రత్తగా చూస్తూ ఇస్తారు. దేహంలో ఊపిరితిత్తులూ, డయాఫ్రమ్ లాంటివి నిత్యం కదులుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా అలాంటి కదిలే అవయవాలకు రేడియేషన్ ఇవ్వడానికి ఈ ‘ఇమేజ్ గైడెడ్ రేడియేషన్ థెరపీ’ ఉపయోగడుతుంది. ఉదాహరణకు ఊపిరితీసుకునే సమయంలో ఊపిరితిత్తులు ఉబ్బుతూ, ముడుచుకుంటూ... కదలికలతో ఉంటాయి. ఇలా కదిలే సమయంలో రేడియేషన్ అన్నది క్యాన్సర్ లేని మరో ఆరోగ్యకరమైన ప్రాంతాన్ని తాకకుండా... అవయవం కదులుతున్నప్పటికీ... ఆ కదలికలకు అనుగుణంగా తన ప్రసరణను తానే నియంత్రించుకుంటూ కేవలం క్యాన్సర్ ఉన్న ప్రదేశానికే రేడియేషన్ తాకేలా చూస్తుంది.ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియేషన్ థెరపీ (ఐఎమ్ఆర్టీ) ఇందులో వివిధ దిశల నుంచి అంటే రకరకాల కోణాలనుంచి రేడియేషన్ కిరణాలను క్యాన్సర్ కణితిపైకి పంపుతారు. ఒక ప్రత్యేకమైన కంప్యూటర్ సాఫ్ట్వేర్ సహాయంతో ప్రత్యేక కంప్యూటర్ సాఫ్ట్వేర్ సహాయంతో క్యాన్సర్ ఉన్నచోట తీవ్రమైన రేడియేషన్ తాకేలా, క్యాన్సర్ లేని చోట వీలైనంత తక్కువ రేడియేషన్ ప్రసరించేలా చూసే ఈ పద్ధతినే ‘ఇంటెన్సిటీ మాడ్యులేటర్ రేడియేషన్ థెరపీ’గా చెబుతారు. ముఖ్యంగా క్యాన్సర్ గడ్డ మరో కీలకమైన ఆరోగ్యకరమైన అవయవానికి చాలా దగ్గరగా ఉన్నప్పుడు... ఆ ఆరోగ్యకరమైన అవయవానికి వీలైనంత తక్కువ నష్టం జరిగేలా చూసేందుకు ఈ పద్ధతి ఉపయోగపడుతుంది.వాల్యుమెట్రిక్ మాడ్యులేటెడ్ ఆర్క్ థెరపీ (వీఎమ్‌ఏటీ) అత్యంత ఖచ్చితమైన రీతిలో రేడియేషన్ ఇచ్చే ఈ ప్రక్రియలో రేడియేషన్ ఇచ్చే మెషిన్ క్యాన్సర్ బాధితుడి చుట్టూ తిరుగుతూ వివిధ కోణాల నుంచి రేడియేషన్‌ను ప్రసరింపజేస్తుంది. దాంతో క్యాన్సర్ ఉన్న భాగానికి వీలైనంత ఎక్కువగానూ, చుట్టుపక్కల ఆరోగ్యకరమైన అవయవాలకు వీలైనంత తక్కువ రేడియేషన్ తాకేలా చూస్తారు. ప్రోస్టేట్, కాలేయం, ప్రాంక్రియాస్ వంటి అనేక రకాల క్యాన్సర్లలో ఈ ప్రక్రియను ఉపయోగిస్తారు.శరీరం లోపల నుంచే రేడియేషన్ ఇచ్చే పద్ధతులుఇప్పటివరకూ చెప్పిన పద్ధతులు కాకుండా... రేడియేషన్ వెలువడే పదార్థాన్ని శరీరంలోనే ఉంచి కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ గడ్డ దేహంలో ఉన్న ప్రాంతానికి చేరి అక్కడ నుంచి రేడియేషన్‌ను ప్రసరింపజేస్తుంది. ఇలా రేడియేషన్ ఇవ్వడాన్ని ‘ఇంటర్నల్ రేడియేషన్ థెరపీ’ అంటారు. ఇందులోని కొన్ని ముఖ్యమైన ప్రక్రియలు.బ్రాకీథెరపీ : ఈ ప్రక్రియలో రేడియోధార్మిక పదార్థాలను అతి చిన్న మోతాదులో దేహంలోని క్యాన్సర్ ఉన్న ప్రాంతానికి పంపి క్యాన్సర్ గడ్డకు అతి దగ్గరగా ఉండేలా చూస్తారు. ఈ అత్యంత చిన్న మోతాదులో ఉండే రేడియో యాక్టివ్ పదార్థాలు సాధారణంగా చిన్న ‘సీడ్స్’ (విత్తనాల్లాంటి చిన్న పదార్థాలు) రూపంలో ఉంటాయి. అవి అవి క్యాన్సర్గడ్డకు అతి దగ్గరగా ఉండటంతో ఆ రేడియేషన్ ప్రధానంగా క్యాన్సర్ ఉన్న ప్రాంతంలో ప్రభావవంతంగా ప్రసరిస్తూ, గడ్డను దెబ్బతీస్తుంది. ఉదాహరణకు ప్రోస్టేట్, గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్), ఎండోమెట్రియంతో పాటు కొన్ని రకాల బ్రెస్ట్ క్యాన్సర్లలో దీనిని ఉపయోగిస్తారు.ఇంట్రా ఆపరేటివ్ రేడియోథెరపీ (ఐఓఆర్టీ) ఇది కొంచెం ప్రత్యేకమైన పద్ధతి. క్యాన్సర్గడ్డకు శస్త్ర చికిత్స చేస్తున్న సమయంలోనే రేడియేషన్ కూడా ఇస్తారు. శస్త్రచికిత్స ద్వారా క్యాన్సర్ ఉన్న ప్రదేశాన్ని బయటకు కనిపించేలా చేశాక... ఆ ప్రాంతానికి ఎక్కువ మోతాదులో రేడియేషన్ ఇస్తారు. అదే సమయంలో పక్కనున్న ఆరోగ్యకరమైన అవయవాలను రక్షించడానికి ప్రత్యేక రక్షణాత్మకమైన ప్రక్రియలను అనుసరిస్తారు. జీర్ణవ్యవస్థలోని కొన్ని క్యాన్సర్లతోపాటు శస్త్రచికిత్స చేయడం కష్టమైన కొన్ని ఇతర రకాల క్యాన్సర్లలో ఈ ప్రక్రియ ఉపయోగకరంగా ఉంటుంది.స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ (ఎస్ఆర్ఎస్) పేరుకు ఇందులో రేడియోసర్జరీ అని ఉన్నప్పటికీ ఇది శస్త్రచికిత్స కానే కాదు. ఇందులో కత్తితో కోయడం ఉండదు. కాకపోతే ఇందులో చిన్న చిన్న రేడియేషన్ కిరణాలను ఒకేచోట కేంద్రీకృతంగా పడేలా ప్రయోగిస్తారు. దాంతో చాలా ఎక్కువ మోతాదులో తీక్షణంగా పడేలా చేయడంతో క్యాన్సర్ ప్రాంతంపై అత్యంత ఖచ్చితంగా / నిశితంగా కేంద్రీకరించేలా కిరణాలు ప్రసరిస్తాయి. కీలకమైన మెదడు, తల, మెడ ప్రాంతాల్లోని కొన్ని కణుతులకు ఇది ఉపయోగపడుతుంది. మెదడులోని గడ్డలు (బ్రెయిన్ ట్యూమర్స్), పిట్యుటరీ ట్యూమర్స్, మెనింజియోమాస్, అకాస్టిక్ న్యూరోమాస్ వంటి కణుతుల్లో ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది.బయటే ఉండే మెషిన్ నుంచి రేడియేషన్ ఇవ్వగల మరికొన్ని ఆధునిక ప్రక్రియలివి... ప్రోటాన్ థెరపీ : ఇందులోని సాంకేతికత సాధారణ రేడియేషన్ ప్రక్రియ కంటే కాస్తంత వేరుగా ఉంటుంది. ఇందులో ఎక్స్–రేస్ కాకుండాప్రోటాన్లతో రేడియేషన్ ఇస్తూ... ఈ ప్రోటీన్ బీమ్‌ను క్యాన్సర్ గడ్డ తాలూకు ఆకృతికీ, అది లోపల ఎంత లోతు ఉందో అంతే లోతు వరకు ప్రసరించేలా చేయడం సాధ్యమవుతుంది. దాంతో క్యాన్సర్ గడ్డ కంటే లోతులో ఉన్న ఆరోగ్యకరమైన కణజాలానికి రేడియేషన్ ప్రసరించకుండా జాగ్రత్త తీసుకోడానికి వీలవుతుంది. ప్రోస్టేట్, ఊపిరితిత్తులు, తల–మెడ (హెడ్ అండ్ నెక్), కాలేయం, అన్నవాహిక, మెదడు వంటి క్యాన్సర్లలో దీన్ని ఉపయోగిస్తారు.అయితే ప్రోటాన్ థెరపీ అన్నది ప్రతి క్యాన్సర్ బాధితులకూ తప్పనిసరిగా ఉపయోగపడుతుందని చెప్పడానికి కుదరదు. ఏ క్యాన్సర్ గడ్డకు ఏ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుందన్న అంశాన్ని డాక్టర్లు క్యాన్సర్ గడ్డ తాలూకు రకం, ఆ గడ్డ పరిమాణం, దాని ఆకృతి వంటి అనేక అంశాలపై ఆధారంగా నిర్ణయిస్తారు.ఎమ్మారై లీనియర్ యాక్సిలరేటర్ : ఇది మరింత ఆధునిక సాంకేతికతతో రూపుదిద్దుకున్న ప్రక్రియ. ఇందులో రేడియేషన్ ఇచ్చే సమయంలోనే ఎమ్మారై ద్వారా కణితిని నిరంతరం గమనిస్తూ ఉంటారు. అంటే... ఇందులో... ఎమ్మారై సహాయంతో గడ్డను చూస్తూ ఉంటూనే అవసరాన్నిబట్టి రేడియేషన్ ఇస్తున్న తీరును మార్చుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మృదువైన కణజాలంలో (సాఫ్ట్ టిష్యూ)లలో ఉండే క్యాన్సర్లకు ఈ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది.స్టీరియోటాక్టిక్ బాడీ రేడియేషన్ థెరపీ (ఎస్‌బీఆర్‌టీ) : ఇది కూడా చాలా ఖచ్చితమైన రీతిలో / చాలా నిశితంగా రేడియేషన్ ఇవ్వగల ప్రక్రియ. దాంతో ఇందులో రేడియేషన్‌ను చాలా ఖచ్చితంగా క్యాన్సర్ గడ్డపైనే కేంద్రీకృతమయ్యేలా చేయవచ్చు. శస్త్రచికిత్స చేయడం కుదరని పేషెంట్లకూ లేదా శస్త్రచికిత్సకు అనువుగా ఉండని బాధితులకు ఇదో మంచి ప్రత్యామ్నాయం. ఊపిరితిత్తులు, కాలేయం, ప్రాంక్రియాస్ క్యాన్సర్లతోపాటు ఎముకలకు వ్యాపించిన మరికొన్ని క్యాన్సర్లలో దీన్ని ఉపయోగించవచ్చు.హైపర్ ఆర్క్‌తో అనేక క్యాన్సర్ కణుతులకు చికిత్స: స్టీరియోటాక్టిక్ రేడియేషన్ విధానాల్లో హైపర్ ఆర్క్ రేడియోథెరపీ వంటి అత్యాధునికమైన ప్రక్రియలో ఇప్పుడు మంచి ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. ఇందులో... మెదడులోని పలు కణుతులను లక్ష్యంగా చేసుకుని రేడియేషన్ కిరణాలను అత్యంత కచ్చితత్వంతో ప్రసరింపజేయడం సాధ్యమవుతుంది. మొత్తం మెదడుకు కాకుండా... ఒక్కో కణితిని లక్ష్యంగా చేసుకుని అవసరమైన మోతాదులో రేడియేషన్ ఇవ్వడమే ఇందులోని ప్రధాన ఉద్దేశం. ఎమ్మారై, సీటీ స్కాన్ వంటి స్కాన్ల ఆధారంగా ఈ చికిత్స ప్రణాళికను రూపొందించాక... ప్రత్యేక సాఫ్ట్వేర్ సహాయంతో వివిధ దిశల నుంచి రేడియేషన కిరణాలు కణితిపై కేంద్రీకృతమయ్యేలా చికిత్స ప్రణాళికను రూపొందిస్తారు. చదవండి: ఆ గాయం రూపాన్ని మార్చిందే తప్ప..ఆమె గెలుపుని కాదు!కణితిపై అవసరమైన రేడియేషన్ మోతాదు ప్రసరించాక... ఇక దాని బయట ఉండే చోట్ల రేడియేషన్ కిరణాల వేగం తగ్గేలా ఇందులో చికిత్స ప్రణాళికను రూపొందిస్తారు. ఫలితంగా మెదడులోని ఆరోగ్యకరమైన కణజాలంపై రేడియేషన్ దుష్ప్రభావాలను గణనీయంగా తగ్గించేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రక్రియ అందరికీ అవసరం ఉండకపోవచ్చు. ఇవీ రేడియేషన్ థెరపీలోని కొన్నిప్రాథమికమైన అంశాలలో కొన్ని ముఖ్యమైనవి. వీటి పట్ల అవగాహన పెంచుకోవడం వల్ల తమ కుటుంబంలోని క్యాన్సర్ పేషెంట్ల విషయంలో వారి బంధుమిత్రులకూ, పేషెంట్ తాలూకు అటెండెంట్లకూ ఉండే చాలా అపోహాలూ, సందేహాలూ తొలగిపోయే అవకాశాలెక్కువ.రేడియేషన్‌పై ఆధాపడాల్సిన అవసరమేమిటి? క్యాన్సర్ కణం తన ఉనికి, మనుగడ కోసం ఎంతకైనా తెగిస్తుంటుంది. పైగా ఆ కణం చాలా చిన్నదిగా ఉంటుంది. శస్త్రచికిత్స ద్వారా క్యాన్సర్ గడ్డను తొలగించేటప్పుడు కేవలం ఒక చిన్న కణం మిగిలిపోయినా... అది మళ్లీ పెరిగిపోయే ముప్పు ఉండనే ఉంటుంది. అందుకే రేడియేషన్ ద్వారా కొంత ఆరోగ్యకరమైన కణజాలం దెబ్బతిన్నప్పటికీ, ఏ చిన్నకణమూ మిగిలిపోకుండా సమూలంగా నిర్మూలించడానికి రేడియేషన్‌ను ఉపయోగిస్తుంటారు. ఇక కొన్ని సందర్భాల్లో... శస్త్రచికిత్సకు ముందుగా కూడా రేడియేషన్ / కీమో ఉపయోగించి ఆ గడ్డను శస్త్రచికిత్స ద్వారా తొలగించడానికి అనువుగా ఉండేంత చిన్నదయ్యేలా చేశాకే సర్జరీ చేస్తుంటారు. ఇలా కూడా రేడియేషన్ ఉపయోగపడుతుంది.ఎవరికీ ఏ రేడియేషన్, ఎంత ఇవ్వాలో నిర్ణయించడమెలా... క్యాన్సర్ బాధితుల్లో రేడియేషన్ థెరపీ ఇవ్వాల్సిన వారిలో ఇది చాలా కీలకమైన అంశం. క్యాన్సర్ బాధితులందరికీ ఒకే రకమైన రేడియేషన్ థెరపీ ఇవ్వడం కుదరదు. అనేక అంశాల ఆధారంగా ఏ తరహా క్యాన్సర్ గడ్డకూ లేదా ఏ బాధితుడికి ఏ తరహా రేడియేషన్ ఇవ్వాలనేది అనేక అంశాల ఆధారంగా డాక్టర్లు (రేడియేషన్ ఆంకాలజిస్టులు) నిర్ణయిస్తారు. వారు చూసే అంశాలివి... అది ఏరకమైన క్యాన్సర్ గడ్డ దాని పరిమాణం ఎంత (ఎంత పెద్దది) దేహంలోని ఏ ప్రాంతంలో ఉంది చుట్టుపక్కల ఉన్న అవయవాలేమిటి గడ్డ ఎంతవరకు వ్యాపించి ఉంది బయాప్సీ రిపోర్టులో ఏముంది సీటీ, ఎమ్మారై, పెట్ స్కాన్లలో ఉన్న సమాచారమేమిటి క్యాన్సర్ బాధితుడి ఆరోగ్య పరిస్థితి ఏమిటి... వంటి అనేక అంశాలను పరిశీలించి ఇవ్వాల్సిన రేడియేషన్‌ను నిర్ణయిస్తారు. డాక్టర్ వినితా రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్ నిర్వహణ: యాసీన్ -
ఏఐ టూత్ బ్రెష్..దెబ్బకు నోటి సమస్యలకు చెక్!
ఎటు చూసినా ఏఐ సాంకేతికత హవానే. ప్రతిదానిలో ఏఐ ఫీచర్లతో మోత మోగించేస్తూ..పనులన్నీ చిటికెలో అయిపోయేలా వస్తున్నాయి అన్ని గాడ్జెట్లు. తాజాగా రోజువారీ దినచర్యలో నిత్యకృత్యమైన బ్రెషింగ్లో కూడా ఈ ఫీచర్ వచ్చేసింది. దంతాల క్లీనింగ్ కోసం డెంటిస్ట్ దగ్గరకు వెళ్లక్కర్లేకుండా చక్కగా పళ్లు తళతళ మెరిసేలా స్వయంగా క్లీన్ చేసుకునే ఏఐ టూల్ బ్రెష్ వచ్చేసింది. దీని పనితీరు చూస్తే మైండ్‌బ్లాక్ అయిపోవడం ఖాయం. ఇంతలా క్లీన్ చేస్తుందా అని కచ్చితంగా నోరెళ్లబెడతారు. అందుకు సంబంధించిన వీడియోని ఓ జంట నెట్టింట పంచుకుంది. మరి ఆ ఏఐ టూత్ బ్రెష్ విశేషాలేంటో సవివరంగా చూద్దామా మరి..!.కంటెంట్ క్రియేటర్లైన ఓ జంట "దిఆలివ్ట్రీఫ్యామిలీ" అనే పేరుతో ఓ వీడియోని నెట్టింట షేర్ చేశారు. ఆ వీడియోలో అంతర్నిర్మిత కెమెరా, టార్చ్‌తో కూడిన ఏఐ ఫాసింగ్ క్లీనింగ్‌తో కూడిన టూత్ బ్రెష్ పని తీరు గురించి పంచుకున్నాడు. డైసన్ అనే కంపెనీ ఏఐ సాంకేతికతో కూడిన ఈ ఆధునిక బ్రష్‌ని రూపొందించింది. వాళ్లు ఆ బ్రెష్‌ని ఎలా ఉపయోగించుకోవాలో ఎలా ఛార్జ్ చేయాలి వంటి వాటితో సహా..ఉపయోగించే విధానం కూడా పంచుకున్నారు. టూత్ పేస్ట్‌ని బ్రెష్‌పై పెట్టి నోటిలో పెట్టగానే ప్రతిదీ వీడియో తీస్తూ..పళ్ల సందుల్లో ఇరుక్కుపోయిన ఆహారాన్ని క్లీన్ చేస్తుంది. ఎక్కడ చిన్న మెతుకు ఇరుక్కుపోయినా వదలదు. అది కూడా తక్కువ టైంలోనే సమర్థవంతంగ పంటి సమస్యల బారిన పడకుండా అద్భుతంగా క్లీన్ చేయడం స్పష్టంగా వీడియోలో చూడొచ్చు. అలాగే ఈ బ్రష్‌ని డిజైన్ చేసిన సంస్థ సైతం ఇది దంతాల మధ్య ఉన్న ఖాళీలను లక్ష్యంగా చేసుకుని పాచిని తొలగించే ఏకైక బ్రెష్గా అభివర్ణించింది. ఇది జెట్ వాషింగ్, లిక్విడ్ వాషింగ్, మౌత్ వాష్ వంటి క్లీనింగ్ పద్ధతులను అందిస్తుంది. సాధారణంగా ఫాసింగ్ అనేది కాస్త సమయం ఎక్కువ తీసుకునే పద్ధతి. అందరూ దీన్నిచేయలేరు కూడా. అదే సాంకేతికతో కూడిన అత్యాధునిక ఈ టూత్‌బ్రెష్‌తో జస్ట్ ఓ మూడు నిమిషాల్లో పళ్లన్నీ శుభ్రపడాయి. పాచి, పసుపు గార వంటి ఇబ్బంది లేకుండా తళతళ మెరిసిపోయేలా చేస్తుంది. దీని ఫీచర్స్ చూస్తుంటే..నోటి ఆరోగ్యానికి బెస్ట్ టూత్ బ్రెస్ట్గా తెలుస్తోంది. అదీగాక నోటి సంరక్షణ పద్ధతులపై జరుగుతున్న పరిశోధనల్లో నోటిలో మలినాలు ఎలా పేరుకుపోతాయో, అలాగే పళ్ల మధ్య ఉండే ఖాళీల్లో మలినాలు ఎలా చేరుకుంటాయో వెల్లడించింది. వీటిని క్లీన్ చేయడం చాలా మంది ప్రజలు మర్చిపోతున్నట్లు సర్వేలో తేలింది కూడా. అలాంటి తరుణంలో ఈ సరికొత్త ఫీచర్లున్న టూత్ బెస్ట్ అందరికీ ఆమోదయోగ్యకరమైనదని అంగీకరించవచ్చు. పైగా దీని ధర కూడా కేవలం రూ. 47 వేలు. అందరు కొనలేకపోయినా..సామాన్యుడు కూడా కొనేలా త్వరలో తక్కవ ధరలో లభించేవి కూడా పెద్ద మొత్తంలో వచ్చే అవకాశం లేకపోలేదనే చెప్పొచ్చు. View this post on Instagram A post shared by W Ken | Lynsay | Chung Family (@theolivetreefamily)(చదవండి: మెహిందీ పెడుతూ.. లక్షదాక సంపాదిస్తున్న టెకీ!) -
75 ఏళ్ల వయసులోనూ యంగ్‌గా మమ్ముట్టి..!ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం..
మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో అశేష అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ నటుడు. ఆయన ఏడుపదుల వయసులోనూ యువ హీరోలకు తీసిపోని గ్లామరస్తో మంచి దృఢంగా ఉంటారు. అంతలా యంగ్‌గా హెల్దీగా ఉండటం కోసం మమ్ముట్టి ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు, ఎలాంటి ఆహార నియమాలను పాటిస్తారు వంటి వాటి గురించి సవివరంగా చూద్దామా.!.మమ్ముట్టి ఫిట్నెస్ ఇప్పటికీ అందరి దృష్టిని అమితంగా ఆకర్షిస్తుంటుంది. కండరబలం, చురుకుదనం, ఆరోగ్యకరమైన శరీరం సౌష్టవం తదితరాలను మెయింటైన్ చేస్తూ యంగ్ లుక్‌లో కనిపిస్తుంటారు. ఆయన క్రమశిక్షణయుతమైన జీవనశైలికి ప్రసిద్ధి చెందినవారు. తమిళ హీరో సూర్య సైతం ఆహారం విషయంలో మమ్ముట్టి నాకు స్పూర్తి అని చెబుతుంటారు. ఆయన ఇచ్చిన సలహాను ఇప్పటికీ తూచా తప్పకుండా పాటిస్తున్నట్లు తెలిపారు. ఆయన ఎప్పుడూ నీకు నచ్చింది తినమనే చెబుతుంటారని..కానీ నచ్చినంతగా కాకుండా మితంగా తీసుకోమని సూచిస్తుంటారు. అది ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి దోహదపడుతుందని ఆయన చెబుతుంటారని సూర్య ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పుకొచ్చాడు. అందులో నిజమెంత అంటే..ఇష్టమైన ఆహారంపై నియంత్రణ ముఖ్యంమమ్ముట్టి చెబుతున్నట్లుగా నచ్చిన ఫుడ్ హాయిగా తినాలి, కానీ తీసుకునే పరిమాణంపై నియంత్రణ మస్ట్ అనేది సరైదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఎంత తింటున్నారో అనేదానిపై నియంత్రణ మనకు సరైన కేలరీల మోతాదు తీసుకునేందుకు హెల్ప్ అవుతుందట. ఇక్కడ కేవలం తక్కువ తినడం మాత్రమే కాదు ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్లు, ఖనిజాలు ఉండే పోషకవంతమైన ఆహార తీసుకోవడం అత్యంత కీలకం అని చెబుతున్నారు నిపుణుల. ఆరోగ్యకరంగా ఉండేలా..అలాగే మమ్ముట్టి వేయించిన ఆహారాలు, చక్కెర పదార్థాలు, అధిక నూనెకు దూరంగా ఉంటూ..ఆరోగ్యకరమైన ఆహార పద్ధతినే పాటిస్తారట. ఈ ఆహారాలను తగ్గించడం వల్ల కేలరీలు పరిమితంగా ఉంటాయి. అలాగే కూరగాయాలు, పండ్లు, తృణధాన్యాలు, నట్స్, గుడ్లు, చేపలు వంటి ప్రోటీన్ వనరులు అధికంగా ఉండేవి తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఫుడ్ప్లాన్..ఏదీ తీసుకున్న నియంత్రిత పరిమాణంలో తీసుకునేలా ప్రాధాన్యత ఇస్తారట. అల్పాహారంలో ఓట్స్ గంజి, గుడ్డులో తెల్లసొన, బొప్పాయి, నానబెట్టిన బాదం పప్పులు ఉంటాయట. మధ్యాహ్న భోజనానికి తక్కువ మసాలాలతో తయారు చేసిన చేపల కూరను అన్నానికి బదులుగా ఓట్స్ పుట్టుతో కలిపి తీసుకుంటానని చెప్పారు. ఇక రాత్రి భోజనంగా గోధుమ లేదా ఓట్స్ దోసెల తోపాటు చికెన్ లేదా చేపల కూర తీసుకుంటానని చెప్పారు. భోజనం చివర్లో మష్రూమ్ సూప్ తీసుకుంటారట. ఇలా కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లను మిళితం చేయడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు, అలాగే బరువు నియంత్రణలో ఉంటుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.వ్యాయామం, తగిన విశ్రాంతి..అలాగే క్రమంతప్పకుండా వర్కౌట్లు చేస్తుంటారు. వయసు పెరిగే కొద్ది రెసిస్టెన్స్ వ్యాయామం ప్రత్యేకంగా చేయాలని చెబుతున్నారు వైద్యులు. ఎందుకుంటే కండరాలు క్షీణించే అవకాశం ఉంటుంది కాబట్టి..కార్డియో వ్యాయామాలు వంటివి చేయాలని చెబుతున్నారు. ఇక నిద్రపై కూడా మంచి శ్రద్ధపెడతానని చెప్పారు. శారీరక ఒత్తిడి నుంచి కోలుకునేందుకు సరైన నిద్ర నాణ్యత ఉండాలని అంటున్నారు. రోజువారీ పనితీరుకు నిద్ర ఎంతో కీలకం అని అంటున్నారు నిపుణులు. ఈ విధంగా ఆరోగ్యకరమైన జీవనశైలిని నిలకడగా పాటిస్తే..ఆరోగ్యకరమైన వృద్ధాప్యాన్ని ఆస్వాదించగలగడమే కాకుండా ఎప్పటికీ యంగ్ లుక్‌లోనే చురుకుగా కనిపించే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: రూ. 90 లక్షల జీతం వదులుకుని ఇండోర్ వ్యవసాయం..! కట్‌చేస్తే ఏకంగా రూ. 1.44 కోట్లు..) -
మతిమరుపు నివారణ ఇలా..!
రక్తపోటు పూర్తిగా అదుపులో ఉండి, మధుమేహం (డయాబెటిస్) లేకుండా, పొగతాగకుండా ఉండేవారు... పై రెండు సమస్యలతోపాటు పొగతాగే అలవాటు ఉన్నవారితో పోలిస్తే మతిమరపు (డిమెన్షియా) సమస్య లేకుండా దాదాపు 13 ఏళ్లు ఎక్కువకాలం జీవించినట్లు పరిశోధకులు గుర్తించారు. సగటున చూసిననప్పుడు పై మూడు అంశాలూ లేనివారు 30.1 ఏళ్ల పాటు డిమెన్షియా లేకుండా ఉంటే... డిమెన్షియాకు కారణమయ్యే ఆ మూడు రిస్క్ఫ్యాక్టర్లూ ఉన్నవారు 17.5 ఏళ్ల పాటే డిమెన్షియాను నివారించగలిగారు. ‘న్యూరాలజీ ఓపెన్ యాక్సెస్’ అనే జర్నల్‌లో ప్రచురితమైన అమెరికాకు చెందిన ఓ అధ్యయనంలో సగటున 56 ఏళ్ల వయసున్న 12,409 మంది అడల్ట్స్‌ను సుమారు 28 ఏళ్ల పాటు పరిశోధకులు పరిశీలించారు. ఈ పరిశోధన కాలంలో వాళ్లలో 3,008 మందికి డిమెన్షియా వచ్చింది. డిమెన్షియా ముప్పు తెచ్చిపెట్టే పై మూడు అంశాలు ఉన్నప్పటికీ... సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళల్లో డిమెన్షియా తక్కువ. మతిమరపు లేకుండా మహిళలు ఎక్కువకాలం జీవించినట్లు కూడా ఈ అధ్యయనం తెలిపింది.‘‘హైబీపీ, డయాబెటిస్, పొగతాగే అలవాటు ఉన్నవాళ్లలో డిమెన్షియా వచ్చే అవకాశం ఎక్కువ. అంతేకాదు... ఇతర కారణాలతో చిన్న వయసులోనే చనిపోయే అవకాశమూ ఎక్కువే. అంతేకాదు... ఈ అలవాట్లు ఉన్నవాళ్లలో ఆయు ప్రమాణమే కాదు... దాంతోపాటు జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యాలు పదిలంగా ఉండే సమయమూ తగ్గుతాయం’టూ ఈ అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకుడు తెలిపారు.మరో అధ్యయనంలో సైతం ఇలాంటి ఫలితాలే... సరిగ్గా ఇదే అంశంపై స్వీడన్లో జరిగిన మరో అధ్యయనం కూడా ఇలాంటి ఫలితాలే వచ్చాయి. ఈ అధ్యయన ఫలితాలు ‘ది జర్నల్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ అల్జీమర్స్ డిసీజ్’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. దాదాపు 500 మంది ఆరోగ్యవంతులైన పెద్దలు పాల్గొన్న ఈ అధ్యయనంలో నాలుగేళ్ల పాటు వారిని పరిశీలించారు. ఈ అధ్యయనం చెబుతున్నదాని ప్రకారం... పొగతాగడం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం వంటి అంశాలకూ మెదడులోని చిన్న రక్తనాళాలు, వైట్ మ్యాటర్ దెబ్బతినడంతో సంబంధం ఉన్నట్లు తేలింది. ఇలాంటి మార్పులు చివరకు రక్తనాళాలకు సంబంధించిన డిమెన్షియా (వాస్క్యులర్ డిమెన్షియా)కు దారితీయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. డయాబెటిస్ ఉన్నవారిలో అమైలాయిడ్ బీటా అనే ప్రోటీన్ ఎక్కువగా పేరుకుపోయే అవకాశం కూడా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ ప్రోటీన్‌కు కూడా అల్జీమర్స్ వ్యాధితో సంబంధం ఉంటుంది. వయసు, జెండర్, జన్యుపరమైన అంశాలను మనం మార్చలేం. అయితే పొగతాగే అలవాటును మానేయడం లేదా ఆ అలవాటుకు పూర్తిగా దూరంగా ఉండటం, హైబీపీనీ, డయాబెటిస్‌నూ అదుపులో పెట్టుకోవడం వంటి అంశాలు పూర్తిగా మన చేతుల్లో ఉన్నవే. కాబట్టి కనీసం మధ్య వయసు నుంచైనా రక్తపోటు, మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడం, పొగతాగడం మానేయడం, ఆరోగ్యకరమైన సమతులాహారం తీసుకోవడం, శారీరకంగా చురుగ్గా ఉండటం వంటివి అలవాటు చేసుకుంటే... వృద్ధాప్యంలో మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవెంతో కొంత తోడ్పడవచ్చన్నది నిపుణులు చెబుతున్న మాట.మతిమరపు లేకుండా అంటే... డిమెన్షియాను రానివ్వకుండా చాలాకాలం నిరోధించాలంటే కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లు పాటిస్తే చాలు. పైగా అవి చాలా సులభం కూడా. రక్తపోటును అదుపులో ఉంచుకోవడం, పొగతాగకపోవడం, మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవడం వంటి చాలా సులభమైన జీవనశైలి అలవాట్లతో దీర్ఘకాలం పాటు డిమెన్షియా బారిన పడకుండా ఉండటంట తోపాటు చాలాకాలం పాటు ఆరోగ్యంగా కూడా ఉండవచ్చంటూ రెండు తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఆ జీవనశైలి అలవాట్లేమిటో చూద్దాం... (చదవండి: తలగడలోని డస్ట్‌మైట్స్‌తో అలర్జీలు!) -
ఏమిటీ టెక్ నెక్!
ఈ రోజుల్లో కంప్యూటర్‌పై పని లేకపోవడాన్ని లేదా గంటల తరబడి మొబైల్ లేని జీవితాన్ని ఊహించడం కష్టం. టెకీలు సరే సరి. ఇంట్లో ఉండే మహిళలూ, పెద్దగా టెక్నాలజీతో టచ్ లేనివారు సైతం అదేపనిగా రీల్స్ చూడటమో లేదా యూట్యూబ్‌లో వీడియోలు చూడటమో చేస్తున్నారు. దాంతో పాటు ఇటీవలి జీవనశైలి కారణంగా శారీరక శ్రమ తగ్గిపోవడం దాంతో ఎప్పుడూ ఒకే చోట కూర్చుని ఉండటం లేదా వృత్తి ఉద్యోగాల్లో సైతం కదలకుండా ఒకేచోట కూర్చుని పనిచేయడం బరువు పెరగడం (ఊబకాయం రావడం) వంటి సమస్యలు పెరుగుతున్నాయి. అంతేకాదు... అలాంటి స్థిరంగా ఒకే చోట ఉండిపోవడంతో (సెడెంటరీ లైఫ్‌స్టైల్) వల్ల ఎముకలూ, కీళ్ల ఆరోగ్యంపై కూడా దుష్ప్రభావం పడుతోంది. మరీ ముఖ్యంగా యువత అదేపనిగా మెడవంచి, దాన్ని కాస్తంత ముందుకు సాచి మొబైల్ చూస్తుండటం వల్ల వస్తున్న ఆరోగ్య సమస్య పేరే... ‘టెక్ నెక్’. అసలు ‘టెక్ నెక్’ అంటే ఏమిటి, ఎముకలూ, కీళ్లూ (ముఖ్యంగా మెడ ఎముకలైన వెన్నుపూసలపై) దాని ప్రభావాలేమిటి; నివారణకు ఏం చేయాలనే అంశాలను తెలుసుకోవడం కోసం ఉపయోగపడేదే ఈ కథనం...ఇటీవల మొబైల్ కారణంగా మెడ నుంచి మోకాళ్ల వరకు ఉన్న ఎముకలపై ప్రభావం పడుతోంది. ఎప్పుడో బాగా వయసు పెరిగాక రావాల్సిన ఎముకల అరుగుదల, మెడ ఎముకల్లో డిస్క్ సమస్యల వంటివి ఇప్పుడు చాలా యుక్తవయసువారిలోనూ, ఇప్పుడిప్పుడే కౌమార వయసు వీడుతున్నవారిలోనూ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోజువారీ అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేయకపోతే భవిష్యత్తులో పెద్ద కీళ్ల సమస్యలకు దారితీయవచ్చనీ, అందునా మరీ ముఖ్యంగా మొబైల్‌ను ఎక్కువసేపు తల వంచి చూడటం వల్ల మెడపై నిరంతర ఒత్తిడి పడుతోందనీ,. దీనినే సాధారణంగా ‘టెక్ నెక్’ సమస్యగా ఆర్థోపెడిక్ నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘టెక్ నెక్’ సమస్య ఏమిటో చూద్దాం.ఏమిటీ ‘టెక్ నెక్’ సమస్య...?మెడను ఎక్కువసేపు ముందుకు వంచి అదేపనిగా అదే భంగిమలో చాలాసేపు ఉంచడం వల్ల మెడ కండరాలపై ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుంటుంది. దాంతో మెడ నొప్పి, భుజాలు బిగుతు ఉన్నట్లు అనిపించడం, తల ముందుకు వంగి అసహజ భంగిమలో చాలాసేపు ఉండిపోవడంతో తలనొప్పి వంటి సమస్యలు కనిపించవచ్చు. ఇలా ఈ లక్షణాలతో వ్యక్తమయ్యే సమస్యనే డాక్టర్లు ‘టెక్ నెక్’గా చెబుతున్నారు.మరి కంప్యూటర్ / మొబైల్స్ మానేయాల్సిందేనా?ఈరోజు కంప్యూటర్ మీద పనిచేయడమనేది జీవన విధానంలో ఒక భాగం మాత్రమే కాదు. అదే జీవనోపాధికి ప్రధాన మార్గం కూడా. అంతేకాదు... మొబైల్ వాడకం కూడా జీవితం నుంచి విడదీయలేని అంశమై పోయింది. ప్రతిపనికీ ఓటీపీలూ, బ్యాంకు నుంచి మనకు వచ్చే సమాచారాలు, డబ్బు ట్రాన్స్ఫర్లు వంటి అనేక పనులకోసం మొబైల్ వాడకం అన్నది జీవితంలో ఒక అవిభాజ్యమైన అంశంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో వాటిని ఉపయోగించకుండా ఉండటమన్నది అసాధ్యం. అందుకే మొబైల్ లేదా కంప్యూటర్ వాడకాన్ని పూర్తిగా మానేయడం అవసరం లేదు. కాకపోతే వాటిని సరైన భంగిమలో ఉపయోగించడం, తరచూ విరామాలు తీసుకోవడం, మెడను ఒకే స్థితిలో ఎక్కువసేపు ఉంచకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.నివారణ ఇలా... టెక్ నెక్‌తో మెడ దగ్గరి ఎముకల్లో నొప్పి లేదా మెడ కండరాల దగ్గర ఇబ్బంది వంటివి ఉన్నవారు అదేపనిగా మెడను ముందుకు సాచి ఉంచడానికి బదులుగా తలను నిటారుగా ఉంచి మాత్రమే కంప్యూటర్‌గానీ, మొబైల్గానీ చూడటం అలవాటు చేసుకోవాలి. మెడను ఎంతగా వంచితే అంతగా మెడ ఎముకలపైనా, మెడ కండరాలపైనా ఒత్తిడి పెరిగి మున్ముందు అది సర్వైకల్ స్పాండిలోసిస్ వంటి సమస్యలకు దారితీస్తుందని గుర్తించాలి. ఇక దీనితో పాటు అదేపనిగా కూర్చుని ఉండటంతో బరువు పెరిగి, అది మోకాళ్లపై ఒత్తిడిని పెంచి మోకాళ్ల నొప్పులు వస్తున్నవారు, మోకాళ్ల వాపు, కీళ్లలో బిగుతు, కూర్చున్నవాళ్లు వెంటనే లేకలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే తక్షణం ఆర్థోపెడిక్ నిపుణులను సంప్రదించడం అవసరం. అయితే ఈ సమస్యలకు తక్షణం మందులు వాడటం, శస్త్రచికిత్స చేయించడం అవసరం ఉండకపోవచ్చు. అదేపనిగా కూర్చుని ఉండటానికి బదులుగా పనిలో తరచూ బ్రేక్ ఇస్తూ అటు ఇటు కదలడం, పొద్దున్నే వాకింగ్ వంటి వ్యాయామాలు చేయడం, జీవనశైలిలో మార్పులు చేసుకుని బరువు తగ్గించుకోవడంతో పాటు అవసరమైతే ఫిజియోథెరపీ వంటి ప్రక్రియలను డాక్టర్లు సూచిస్తారు. ఒకవేళ కొందరిలో ఇప్పటికే కీళ్లనొప్పులు లేదా కీళ్ల సమస్య ఉన్నవారికి వైద్య నిపుణులు వారికి సరిపోయే వ్యాయామాన్ని సూచిస్తారు. దీనికి తోడు ఆరోగ్యకరమై సమతులాహారం, అందులో తగినంత ప్రోటీన్, కాల్షియం, విటమిన్ల వంటివి తీసుకోవాలంటూ ఆ మేరకు దేహానికి అన్ని పోషకాలు అందే ఆహారంపై కూడా దృష్టిపెట్టేలా సలహాలు అందిస్తారు.నేటి వృత్తుల్లో వచ్చిన మార్పులతో ఇవీ అనర్థాలు...కదలకుండా ఒకేచోట కూర్చుని అదేపనిగా తల ముందుకు ఒంచి కంప్యూటర్ చూడటంతో పాటు అదేపనిగా కూర్చుని చేసే వృత్తుల కారణంగా చాలామందిలో బరువు పెరిగి ఊబకాయం వస్తోంది. దాంతో ఆ బరువు కారణంగా కొద్దిగా నడవడం గానీ, మెట్లు ఎక్కడం గానీ లేదా ఎక్కువ సేపు నిలబడటం, మామూలు రోజువారీ పనులుచేయడంలో వాళ్ల మోకాళ్లపైన భారమూ, ఒత్తిడీ పెరుగుతున్నాయి. దాంతో గతంలో చాలాకాలం తర్వాత వచ్చే మోకాళ్ల కీళ్ల అరుగుదల వంటి ముప్పు ఇప్పుడు చాలా త్వరితంగానే వచ్చే ప్రమాదం పెరుగుతోంది. ఇక దేహం బరువు పెరగడం వంటి అంశాలు హైబీపీ, డయాబెటిస్‌కూ దారితీస్తాయన్న విషయం చాలామందికి తెలిసిందే. వీటితో పాటు కనిపిస్తున్న కాస్తంత పాత సమస్యకే సరికొత్త పేరు ‘టెక్ నెక్’! కూడా.చికిత్స... తొలిదశల్లో కొన్ని మందులతో ఉపశమనం కలిగేలా డాక్టర్లు తాత్కాలికమైన చికిత్సలు అందిస్తారు. ఒకవేళ దేహం బరువు ప్రమాదకరంగా మారినవాళ్లకూ, మెడ ఎముకలూ, మోకాళ్లు బాగా అరిగిపోయిన వాళ్లకు తగిన చికిత్సలతో పాటు బాగా అవసరమైన వాళ్లకు చివరి ప్రత్యామ్నాయంగా (గ్రేడ్ – 4 దశలో) మాత్రమే శస్త్రచికిత్సలను డాక్టర్లు సూచిస్తారు. -
భుజాల నొప్పికి యోగా.. కానీ ఈ తప్పు మాత్రం చేయకండి!
రోజంతా కూర్చుని పనిచేయడం, మొబైల్ చూడటం వల్ల మెడ, భుజాలు, వెన్నుపై ఒత్తిడి పెరుగుతోంది. ఇలాంటి సమయంలో శరీరాన్ని సున్నితంగా వెనుకకు సాగదీసే కొన్ని యోగా భంగిమలు ఉపశమనానికి తోడ్పడవచ్చు. అయితే ఈ భంగిమను ఎలా చేయాలి? ఎవరెవరు చేయకూడదు? ప్రయోజనాలు ఏమిటి? ఇప్పుడు చూద్దామా?ఇలా చేయాలి..నిటారుగా నిలబడి, చేతులను నెమ్మదిగా పైకి ఎత్తాలి.చేతులను నడుముపై ఉంచుకోవాలి.మెడను వెనుకకు ఎక్కువగా వేలాడదీయకూడదు.నడుమును ఎక్కువగా వెనుకకు వంచకూడదు.అవసరమైతే ఊర్ధ్వ తాడాసనం రూపంలో చేయవచ్చు.సుమారు 30 సెకన్ల పాటు భంగిమను నిలుపుకోవడంజాగ్రత్తలు...భుజాల నొప్పి, స్పాండిలైటిస్, వెన్నునొప్పి, వెన్నెముక లేదా వెన్నుకు గాయం ఉన్నప్పుడు చెయ్యకూడదు.ప్రయోజనాలు...మెడ, భుజాలు, పై వెన్నుభాగంలో ఉన్న ఒత్తిడిని తగ్గిస్తుంది.వెన్నెముకపై ఉన్న కంప్రెషన్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.పొత్తికడుపు కండరాలను స్ట్రెచ్ చేస్తుంది.ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరచి, లోతైన శ్వాసకు సహాయపడుతుంది.చేతులు, భుజాలు, పై వెన్నుభాగంలోని కండరాలను బలోపేతం/స్ట్రెచ్ చేయడంలో సహాయపడుతుంది.– అనిత పాతర్ల, యోగా ట్రైనర్ఇవీ చదవండి: మన కుల్ఫీకి ప్రపంచమే ఫిదా.. టాప్-10లో చోటు! -
మీ మెదడుకు బాస్ మీరే అనుకుంటున్నారా? నిజాలు తెలిస్తే షాకే!
మీరు మీ మెదడుకు బాస్ అనుకుంటున్నారా? ΄÷ర΄ాటే! మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మీకు తెలియకుండానే మీ మెదడు బోలెడన్ని పనులు చేసేస్తుంటుంది. మీరు ‘‘నేను ఆలోచించి చేశాను’’ అనుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో అసలు ఆలోచించింది మీరు కానే కాదు మీ మెదడే!మన కళ్ల ముందు కనిపించేది, మనం గుర్తుంచుకునేది, మనకు నచ్చేది, భయపడేది..ఇలా చాలా విషయాల్లో మెదడు తనదైన గేమ్ ఆడుతుంది. అందులో కొన్ని సరదాగా ఉంటే.. మరికొన్ని ‘‘అరే! ఇలానా?’’ అనిపిస్తాయి. ఇంకా మనకు తెలియకుండా మన మెదడు చేసే పనులేంటో చూసేద్దామా?1. మల్టీటాస్కింగ్మీరు ఫోన్ లో మెసేజ్ టైప్ చేస్తూనే టీవీ చూస్తూ, పక్కన ఎవరో మాట్లాడుతుంటే సమాధానం ఇస్తున్నారా? అది మీ గొప్పేం కాదు. ‘నా మల్టీటాస్కింగ్ సూపర్’ అని ఫీలవ్వకండి. చాలా సందర్భాల్లో రెండు క్లిష్టమైన పనులను ఒకేసారి చేయడం మెదడుకి వెన్నతో పెట్టిన విద్య.2. కనిపించని విషయాలను ఊహిస్తూ..మన కళ్లకు ప్రపంచం మొత్తం స్పష్టంగా కనిపిస్తుందని అనుకుంటాం. నిజానికి మన దృష్టిలో చిన్న ప్రాంతం కూడా స్పష్టంగా కనిపించదు. దానిని మెదడు చుట్టుపక్కల సమాచారంతో అంచనా వేసి నింపేస్తుంది. దీనినే ఇమేజ్గ్రాస్పింగ్లో మెదడు చేసే ‘‘ఫిల్లింగ్–ఇన్’’గా భావిస్తారు.3. జ్ఞాపకాలను నిర్మిస్తుంది!‘‘ఆ రోజు జరిగిన ప్రతి విషయం నాకు అచ్చంగా గుర్తుంది’’ అని చెప్పేవాళ్లను కాస్త అనుమానంతో చూడొచ్చు. మన జ్ఞాపకాలు సాధారణంగా వీడియో రికార్డింగ్లా స్టోర్ అవ్వవు/. గుర్తు చేసుకునే సమయంలో మెదడు అందుబాటులో ఉన్న సమాచారంతో ఆ సంఘటనను మళ్లీ సృష్టిస్తుంది.4. కాలింగ్..కాలింగ్ఒక ΄ార్టీకి వెళ్లారు. చుట్టూ పెద్ద శబ్దం. అందరూ మాట్లాడుతున్నారు. ఒక్కసారిగా ఎవరో మీ పేరు పిలిచారు. వెంటనే మీ చెవులు అటువైపు తిరుగుతాయి. దీనిని సాధారణంగా‘ కాక్టెయిల్ ΄ార్టీ ఎఫెక్ట్’ అంటారు. 5. బోర్ కొట్టినా...మీరు ఏ పని చేయకుండా కూర్చున్నారు. బయటకు చూస్తున్నారు. కానీ మెదడు మాత్రం షిఫ్ట్ ముగించదు. మనం విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా మెదడులోని కొన్ని నెట్‌వర్క్‌లు చురుకుగా ఉంటాయి. 6. భయపెడుతుంది!రాత్రి ఒంటరిగా గదిలో కూర్చున్నారు. చిన్న శబ్దం వచ్చింది. వెంటనే గుండె వేగం పెరుగుతుంది. ‘‘ఎవరు?’’ అని చూస్తే.. కిటికీకి తగిలిన కొమ్మ! మెదడు ప్రమాదాన్ని గుర్తించే విషయంలో జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నిస్తుంది. 7. ముందే అర్థం చేసుకుంటుంది!మన కళ్లకు వచ్చే సమాచారాన్ని మెదడు కేవలం రిసీవ్ చేయదు. గత అనుభవాలు, సందర్భం, అంచనాలను కూడా ఉపయోగించి మనం ఏం చూస్తున్నామో అర్థం చేసుకుంటుంది. ఒకే చిత్రం లేదా ఒకే వాక్యాన్ని ఇద్దరు వ్యక్తులు కొంచెం భిన్నంగా అర్థం చేసుకునే అవకాశం ఎక్కువ.8. అలవాట్లకు ఆటోపైలట్రోజూ ఒకే మార్గంలో ఆఫీసుకు వెళ్లే వ్యక్తికి మధ్యలో ఎన్నో విషయాలు గుర్తుండక΄ోవచ్చు. ఎందుకంటే పదేపదే చేసే పనుల్లో కొన్నింటిని మెదడు అలవాటుగా మార్చుకుంటుంది. దాంతో ప్రతి చిన్న చర్యను మొదటి రోజు లాగా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు.9. ఫోర్కాస్ట్‘‘రేపు ఇలా చేస్తే ఎలా ఉంటుంది?’’ అని ఊహించేటప్పుడు మెదడు ఖాళీ తెరపై సినిమా తీయదు. గత అనుభవాలు, జ్ఞాపకాలు, తెలిసిన సమాచారాన్ని ఉపయోగించి ఊహించడంలో సహాయపడుతుంది.10. మీకంటే ముందే నిర్ణయంఒక విషయం గురించి మనం ‘‘నేను ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను’’ అనుకుంటాం. కానీ నిర్ణయ ప్రక్రియలో మనకు పూర్తిగా స్పష్టంగా తెలియనివి అనేకం పనిచేస్తుంటాయి. మన మెదడు మనకు కనిపించకుండా పనిచేసే ఒక భారీ నియంత్రణ కేంద్రం. మనం చూస్తున్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం నుంచి జ్ఞాపకాలు, దృష్టి, భయం, అలవాట్లు, నిర్ణయాల వరకు.. ప్రతిచోటా దాని ΄ాత్ర ఉంటుంది. మరి మెదడు ఇంత పని చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ‘అదొక అర్థం కాని ప్రశ్నలా ఉందే’ అని మళ్లీ మన మెదడే సర్దిచెప్పుకుంటుంది.- శ్రావణ్ జయఇవి కూడా చదవండి: మన దేహం విలువ కోట్లకంటే ఎక్కువ.. ఈ కథతో అర్థమవుతుంది! -
వాకింగ్‌లో ఇలా అనిపిస్తుందా?.. అయితే జాగ్రత్త
ఉదయం లేవగానే లేదంటో సాయంత్రం పూటో షూస్ వేసుకుని వాకింగ్‌కు వెళ్లడం చాలామందికి రోజువారీ అలవాటు. నడక గుండె, ఊపిరితిత్తులు, కండరాల ఆరోగ్యానికి మేలు చేయడంతోపాటు ఒత్తిడిని తగ్గించడంలోనూ సహాయపడుతుంది. అయితే వాక్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా కొన్ని లక్షణాలు కనిపిస్తే మాత్రం ‘కాస్త అలసటే’ అనుకుని ముందుకు సాగుతుంటారు చాలామంది. అయితే అది ఎంతో ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యం కోసం వేసే అడుగులే.. ఒక్కోసారి ప్రమాదాన్ని సూచించొచ్చు. నడుస్తున్నప్పుడు శరీరం ఇచ్చే ఈ హెచ్చరికలను గుర్తించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా గుండె లేదంటే ఊపిరితిత్తుల సమస్యలు, రక్తప్రసరణలో ఇబ్బందులు వంటి పరిస్థితుల్లో శరీరం ముందుగానే కొన్ని సంకేతాలు ఇచ్చే అవకాశం ఉంటుంది.ఛాతీలో బిగుతు.. నొప్పినడుస్తున్నప్పుడు ఛాతీలో ఒత్తిడి, బరువు లేదా బిగుతుగా అనిపించడం.. ముఖ్యంగా నొప్పి ఎడమ చేయి, భుజం, మెడ లేదా దవడ వైపు వ్యాపిస్తే వెంటనే నడక ఆపాలి. ఇది గుండెకు రక్తప్రసరణ తగ్గుతున్న సంకేతం కావచ్చు. నొప్పి తగ్గకపోతే ఆలస్యం చేయకుండా అత్యవసర వైద్య సహాయం తీసుకోవాలి.సాధారణ నడకకే ఊపిరి అందకపోతే..రోజూ నడిచే వేగంలోనే నడుస్తున్నప్పటికీ తీవ్రంగా ఊపిరి ఆడకపోవడం, మాట్లాడటానికే ఇబ్బంది పడేంత శ్వాస తీసుకోవాల్సి రావడం సాధారణం కాదు. ఇలాంటి లక్షణాలు గుండె లేదా ఊపిరితిత్తుల సమస్యలకు సంకేతం కావచ్చు. వెంటనే విశ్రాంతి తీసుకుని పరిస్థితి తీవ్రంగా ఉంటే వైద్య సహాయం పొందాలి.తల తిరుగుతోందా?వాక్ మధ్యలో ఒక్కసారిగా తల తిరగడం, కళ్ల ముందు చీకట్లు కమ్ముకోవడం, తూలుతున్నట్లు అనిపించడం లేదా స్పృహ కోల్పోయే భావన రావడం కూడా నిర్లక్ష్యం చేయకూడని లక్షణాలే. డీహైడ్రేషన్, రక్తపోటు మార్పులు లేదా గుండె స్పందనలో సమస్యలు ఇందుకు కారణం కావచ్చు.కాలు నొప్పి.. వాపు కనిపిస్తేనడిచిన తర్వాత ఒక కాలిలో మాత్రమే అసాధారణమైన నొప్పి, వాపు, ఎర్రదనం లేదా వేడి కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఇది రక్తనాళంలో రక్తం గడ్డకట్టడానికి సంబంధించిన సమస్యకు సంకేతం కావచ్చు. ముఖ్యంగా అకస్మాత్తుగా వచ్చిన ఇలాంటి లక్షణాలను స్వయంగా మసాజ్ చేసుకోవడం లేదంటే నొప్పి తగ్గే వరకు నడవడం మంచిది కాదు.చల్లటి చెమటలు.. వికారంవాతావరణం చల్లగా లేకపోయినా అకస్మాత్తుగా చల్లటి చెమటలు పట్టడం, వికారం లేదంటే వాంతి వచ్చినట్లు అనిపించడం, బలహీనంగా అనిపించడం కూడా గుండె సంబంధిత అత్యవసర పరిస్థితుల్లో కనిపించొచ్చు. కొందరిలో ముఖ్యంగా ఛాతీ నొప్పి స్పష్టంగా లేకుండానే ఇతర లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుంది.ఎవరు మరింత అప్రమత్తంగా ఉండాలి?40 ఏళ్లు దాటినవారు, మధుమేహం, అధిక రక్తపోటు లేదా కొలెస్ట్రాల్ ఉన్నవారు, ధూమపానం చేసేవారు, కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉన్నవారు వాకింగ్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా వాకింగ్ ప్రారంభించేవారు లేదా చాలాకాలం తర్వాత వ్యాయామం మొదలుపెట్టేవారు తమ ఆరోగ్య పరిస్థితికి తగిన వ్యాయామ తీవ్రతపై వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.వాక్ ఇలా మొదలుపెట్టండి..ఒక్కసారిగా వేగంగా నడవకుండా మొదటి 5–10 నిమిషాలు నెమ్మదిగా నడవాలి. శరీరం అలవాటు పడిన తర్వాత వేగాన్ని క్రమంగా పెంచాలి. తగినంత నీరు తీసుకోవడం, వాతావరణానికి అనుగుణంగా దుస్తులు, షూస్ ధరించడం కూడా ముఖ్యం.అన్నింటికంటే ముఖ్యంగా.. వాకింగ్ చేస్తూ ఛాతీలో నొప్పి, తీవ్రమైన శ్వాస ఇబ్బంది, మూర్ఛ భావన వంటి లక్షణాలు వస్తే ‘ఇంకొంచెం నడిస్తే తగ్గిపోతుంది’ అని అనుకోవద్దు. వెంటనే ఆపి అవసరమైన వైద్య సహాయం తీసుకోవాలి. ఆరోగ్యం కోసం వేసే ప్రతి అడుగు మంచిదే.. కానీ శరీరం ఇచ్చే హెచ్చరికను వినడం అంతకంటే ముఖ్యం.ఇదీ చదవండి: అవకాడోకు మోదీ ప్రమోషన్.. నిజంగానే మంచిదా? -
ఎంపీ సుప్రియా సూలే ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..! 50 ఏళ్ల వయసులోనూ..
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుప్రియా సూలే రాజకీయంగా సభలు,సమావేశాతో ఎంత బిజీగా ఉన్నా..తన పిట్‌నెస్‌కి సమయం కేటాయిస్తానని ఆమెనే స్వయంగా చెప్పారు. ఒక్కోసారి తన ఫిట్నెస్ మంత్రాని బ్రేక్ చేస్తానని కూడా నవ్వుతూ చెప్పారు. తను ఒక నాయకురాలిగా ఇంతలా బిజీగా ఉన్న అలసట అన్నది తన దరి చేరదని, ఎల్లప్పుడూ చురుకుగా ఉంటానని అన్నారామె. మరి అంతలా ఫిట్‌గా ఉండే ఆమె ఆరోగ్య రహస్యం ఏంటో ఆమె మాటల్లోనే తెలుసుకుందామాతాను బయటకు వెళ్లేటప్పుడు హాయిగా నడిచేలా షూ ధరిస్తానని చెప్పారామె. అలాగే బయటకు వెళ్లేటప్పుడు మరిగించిన వేడి నీళ్లు రెండు లీటర్లు తప్పనిసరి అని అంటున్నారామె. తనకు వీలు కుదిరితే సైక్లింగ్, యోగా తప్పనిసరి అని అన్నారామె. ఇవేమి కుదరదు అనుకుంటే వేగంగా నడుస్తానని చెప్పారామె. 50 ఏళ్ల వయసులోనూ ఆమె తరుచుగా చీరలోనే సైకిల్ తొక్కుతానని అన్నారామె. ఐదేళ్లక్రితం వరకు జిమ్‌కి వెళ్తుండేదాన్ని అన్నారు. కానీ ఇప్పుడు బయట ప్రదేశాల్లో వాకింగ్, జాగింక్కి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే తనకొక చెడ్డఅలవాటు కూడా ఉందన్నారు. సదా ప్రచారాలు, బహిరంగ సమావేశాల కారణంగా తన పిట్నెస్ లక్ష్యం దెబ్బతింటుంటుందని అన్నారామె. ఆ ఒత్తిడిలో ఎక్కువగా తినేస్తుంటానని అన్నారామె. డైట్ కోక్ తాగనిదే రోజు గడవదని అన్నారు. అది తన బలహీనతగా పేర్కోన్నారు. అలాగే తాను ఇంటి నుంచి తీసుకెళ్లిన భోజనం తినని, సాధ్యమైనంత వరకు కార్యకర్తల ఇళ్లల్లోలేదా ధాబాలో భోజనం చేస్తుంటానని అన్నారు. తన భోజనంలో ఎక్కువుగా కూరగాయలు, మటన్ లేదా చికెన్, జోన్న భక్రీలు తీసుకుంటానని చెప్పారు. అల్పాహరంగా పళ్లు, బాదం పప్పులు, చిరుతిండిగా రెండు రకాల బిస్కెట్లు తింటుంటానని అన్నారు. అలాగే తనకు వేయించిన ఆహారాలు మహా ఇష్టమని అన్నారు. అయితే టీ,కాఫీలకు మాత్రం బానిస కాలేదన్నారు. అలాగే తాను మంచి ఆహార ప్రియురాలినని, ఎంతలా అంటే మహారాష్ట్రలో ఎక్కడెక్కడ అద్బుతమైన ఫుడ్ దొరకుతుందో ఈజీగా చెప్పేయగలను, ఆ ప్రాంతాల్లో ఏం దొరుకుతుందో ఠక్కున చెప్పేస్తానని ధీమాగా చెబుతున్నారామె. అయితే తన దినచర్యలో నాణ్యమైన నిద్ర లేకపోవడం పెద్ద లోపమని అన్నారామె. ఎందుకంటే ఇద్దరు పిల్లల తల్లిగా ఎప్పుడు ఎక్కువసేపు హాయిగా నిద్రపోయిన రోజు లేనే లేదని అన్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సిఫార్సు చేసిన ఆరోగ్య సూత్రాల ప్రకారం కూడా పెద్దలకు కనీసం ఏడు నుంచి 9 గంటలు నిద్ర ఉండాలని సూచించింది. ఇది నిజంగానే ఆమె ఎదుర్కొంటున్న కీలక లోపంగా పేర్కొన్నారు ఆరోగ్య నిపుణులు. ఫిట్నెస్ పరంగా మిగతావన్నీ సవ్యంగా ఉన్నా..నిద్ర అత్యంత కీలకమైనదని, దీనిపై మొత్తం ఆరోగ్యం ఆధారపడి ఉందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. View this post on Instagram A post shared by Supriya Sule (@supriyasule) (చదవండి: ఆ కారణంతో బారత్‌లో జరగాల్సిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ రద్దు..! వెల్లువెత్తున్న విమర్శలు) -
ప్రశ్నిస్తేనే సమాధానం.. లైంగిక ఆరోగ్యంపై యువత మాట్లాడాలి!
ప్రశ్నించినప్పుడే ఏ సమస్య అయినా వెలుగులోకి వస్తుంది. చర్చించినప్పుడే ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. సమాజంలో జరిగే ప్రతి తప్పిదాన్ని ప్రశ్నించే యువత లైంగిక విషయాలపై చర్చించడానికి మొహమాటపడుతోంది. నేడు ప్రపంచ లైంగిక ఆరోగ్య దినోత్సవం. ఈ సందర్భంగా యువతలో లైంగిక ఆరోగ్యంపై అవగాహన పెంచాల్సిన అవసరాన్ని ఎయిడ్స్ హెల్త్‌కేర్ ఫౌండేషన్ (ఏహెచ్ఎఫ్) – ఇండియా కేర్స్ గుర్తుచేస్తోంది.అనుకోని సంఘటనలు జరిగినప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ నచ్చిన స్లోగన్లు, పోస్టర్లు పెట్టి రోడ్డు మీదకి వచ్చే యువత... కండోమ్, హెచ్ఐవీ, లైంగికంగా సంక్రమించే వ్యాధులు (ఎస్టీఐ), వంటి అంశాలపై మాట్లాడటానికి సంకోచిస్తోంది. అవగాహన లేకపోవడం వల్లే అపోహలు బలపడతాయి. సెప్టెంబర్ 4న ప్రపంచ లైంగిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా యువతలో లైంగిక ఆరోగ్యంపై అవగాహన పెంచాల్సిన అవసరాన్ని ఎయిడ్స్ హెల్త్‌కేర్ ఫౌండేషన్ (ఏహెచ్ఎఫ్)–ఇండియా కేర్స్ గుర్తుచేస్తోంది.ఈ ఏడాది ప్రపంచ లైంగిక ఆరోగ్య దినోత్సవం థీమ్ ‘ఎవ్రీ బాడీ’. లైంగిక ఆరోగ్యం అంటే వ్యాధులు లేకపోవడం మాత్రమే కాదని వ్యక్తి ఆరోగ్యం, గౌరవం, హక్కులు, సమ్మతి, సంబంధాలు, మానసిక శ్రేయస్సుతో ముడిపడిన అంశమని ప్రపంచ లైంగిక ఆరోగ్య సంఘం తెలిపింది.స్మార్ట్‌ఫోన్‌తో...యువతను చేరుకోవడానికి భారత్‌కు ఉన్న అతిపెద్ద అవకాశాల్లో డిజిటల్ ప్రపంచం ఒకటి. యువతలో 97.1 శాతం మంది మొబైల్ ఫోన్లు వినియోగిస్తున్నారు. 94.3 శాతం మంది ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు. హెఐవీ పరీక్షలు, ఎస్టీఐలు, కండోమ్ వినియోగం, గర్భనిరోధక పద్ధతులపై శాస్త్రీయమైన, సులభమైన, సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా యువతకు చేరవేయాల్సిన అవసరం ఉందని ఏహెచ్ఎఫ్–ఇండియా కేర్స్ సూచిస్తోంది.యువత ఆరోగ్యమే కీలకంభారత్లో సుమారు 65 శాతం జనాభా 35 ఏళ్లలోపు వారే. 15–29 ఏళ్ల వారు దాదాపు 27 శాతం ఉన్నారు. ఇంత పెద్ద యువ జనాభా ఉన్న దేశంలో లైంగికత, పునరుత్పత్తి ఆరోగ్యంపై వారికి సరైన అవగాహన కల్పించడం అత్యంత కీలకం. లైంగిక ఆరోగ్యం కేవలం వైద్య అంశం కాదని.. దేశ భవిష్యత్తుతో ముడిపడిన ప్రజారోగ్య అంశమని ఏహెచ్ఎఫ్–ఇండియా కేర్స్ చెబుతోంది.పీర్ ఎడ్యుకేషన్‌తో...ఆరోగ్య సమస్యలపై యువత తమ వయసువారితో మాట్లాడేందుకు ఎక్కువగా సౌకర్యంగా ఉంటారు. అందుకే పీర్ ఆధారిత అవగాహన కార్యక్రమాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ‘ఎక్కడ పరీక్ష చేయించుకోవాలి?’ అనే ప్రశ్నను ఒక యువకుడు వైద్యుడిని అడగడానికి సంకోచించినా, తనలాంటి మరో యువకుడిని అడగడానికి అంతగా వెనుకాడకపోవచ్చు. అందుకే పీర్ ఎడ్యుకేటర్లు ఆరోగ్య వ్యవస్థకు, యువతకు మధ్య వారధులుగా నిలవగలరని ఏహెచ్ఎఫ్–ఇండియా కేర్స్ భావిస్తోంది.– చైతన్య వంపుగాని, సాక్షి, న్యూదిల్లీ.ఇవి కూడా చదవండి: సీరియల్‌గా వద్దు రియల్‌గా ఉందాం -
పదకొండేళ్లుగా ఆ అలవాటు ఎంత పనిచేసిందంటే..! చివరికి కడుపులో..
కొన్ని అలవాట్లను చుట్టూ ఉన్న సన్నిహితులు, స్నేహితులు గమనించకపోతే..ఎంతటి ప్రమాదం కొనితెచ్చుకుంటారో చెబుతోంది ఈ ఉదంతం. ఆమెకు తొమ్మిదేళ్లుగా ఉన్న అలవాటు గురించి 20 ఏళ్ల తర్వాత అనారోగ్యం కారణంగా బయటపడి ఆస్పత్రిపాలుజేసింది. ఈ విచిత్ర ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంంది. ఢిల్లీకి చెందిన 20 ఏళ్ల యువతికి తీవ్రమైన కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరింది. వికారం, పదే పదే వాంతులు అవ్వడంతో హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమె కడుపు పైభాగం ఉబ్బి ఉండటంతో పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ రిపోర్ట్‌లో ఆమె కడుపులో భారీ పరిమాణంలో హెయిర్‌బాల్ ఉన్నట్లు గుర్తించారు. ఇది ఆహారనాళం, కడుపు కలిసే చోట చిన్న ప్రేగులకు వెళ్లే ద్వారం వరకు విస్తరించి ఉండటంతో ఎండోస్కోపీతో తొలగించడం సాధ్యం కాలేదు. దాంతో ఆమెకు సర్జరీ చేయక తప్పలేదు. ఇది సుమారు 1.16 కిలోల పరిమాణంలో ఆంగ్ల అక్షరం ‘జే’ ఆకారంలో ఉంది. ఆమె కడుపు దాదాపు జుట్టుతో నిండిపోయి ఉందని, ఎండోస్కోప్ చేస్తే కడుపు పైపొర దెబ్బతినే అవకాశ ఉన్నందున శస్త్ర చికిత్స చేసి ఆ హెయిర్ బాల్ని తొలగించినట్లు తెలిపారు వైద్యులు.హెయిర్‌బాల్ ఏర్పడటానికి కారణం..ఆహారంలా కాకుండా, మానవ వెంట్రుకలు జీర్ణం కావు. వెంట్రుకలను పదేపదే మింగినప్పుడు, అవి క్రమంగా కడుపులో పేరుకుపోతాయి. కాలక్రమేణా, ఆ పదార్థం గట్టిగా అతుక్కుపోయి, ఆహారాన్ని, ఇతర పదార్థాలని గట్టిగా బంధించి ఒక దట్టమైన బెజోర్గా ఏర్పడుతుంది. చిన్న బెజోర్లను కొన్నిసార్లు ఎండోస్కోపీ ద్వారా తొలగించవచ్చు, కానీ చాలా పెద్దవి లేదా గట్టిగా అతుక్కుపోయిన ఉండలకు శస్త్రచికిత్స అవసరం.ప్రస్తుతం ఆ యవతి ఆరోగ్యం మెరుగుపడినట్లు అధికారులు తెలిపారు. ఇంతకుముందులా ఆకలి లేకపోవడం, అరగకపోవడం వంటి సమస్యలు ఆమెకు లేవన్నారు. అయితే ఆమె ఏళ్ల తరబడి వెంట్రుకలు తినే అలవాటు ఉందని, ఎవ్వరికీ ఇది తెలియలేదని చెబుతున్నారు వైద్యులు. కాగా, ఇలా వెంట్రుకలు తినే అలవాటుని ట్రైకోఫాగియా అంటారు. ఈ అలవాటుని నుంచి బయపటడకుండా వెంట్రుకల ఉండను తొలగిస్తే సమస్య శాశ్వతంగా పరిష్కారం కాదంటున్నారు. అలాంటి అలవాటు ఉన్నవారిని సైక్రియాట్రిస్టుల వద్దకు తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించి ఆ అలవాటు నుంచి బయటపడేలా చేయాలని చెబుతున్నారు వైద్యులు.(చదవండి: సాధువుగా మారి..54 ఏళ్ల వయసులో సీఆర్పీఎఫ్ పోలీస్‌గా!) -
అవకాడోకి పెరుగుతున్న క్రేజ్..ఆరోగ్యానికి మంచిదేనా? ప్రధాని మోదీ ఏమన్నారంటే..
అవకాడో ఒకప్పుడు అంతగా పరిచయం లేని పండుగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి భోజనాల్లో ప్రముఖంగా మారింది. దాన్ని వివిధ స్మూతీలు, సలాడ్ల వరకు విరివిగా ఉయోగిస్తూ..ఆధునిక ఆహారంలో అత్యంత ముఖ్యమైనవిగా మారిపోయాయి. దీని గురించి సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ కూడా మాట్లాడారు. మరి ఆయన ఏం అన్నారంటే..భారత్‌లో ఈ పండు పట్ల పెరుగుతున్న ఆదరణ, ఆరోగ్య ప్రయోజనల గురించి చెప్పారు. ఇంతకుముందుక అంతగా ఎవ్వరికీ తెలియని ఈ పండుకి ప్రస్తుతం డిమాండ్, క్రేజ్ ఎక్కువయ్యాయి. ప్రతి డైనింగ్ టేబుల్‌పై తప్పనిసరిగా ఇది కనిపిస్తోంది. అంతేగదు మన అన్నదాత రైతన్నకి కూడా ఇష్టమైన పండుగా మారింది అంటూ ఆంధ్రప్రదేశ్ రైదు కర్ప వరదరాజు గురించి ప్రస్తావించారు. వరదరాజ్ తన స్నేహితుడు పొలంలో అవకాడో పండుని చూసి యూట్యూబ్ ద్వారా ఆ పంట పెంపకం గురించి నేర్చుకుని మరి పండించడం ప్రారంభించాడు. మోదీ ప్రకారం..వరదరాజ్ ఇప్పుడు సుమారు నాలుగు టన్నుల అవకాడోలను ఉత్పత్తి చేసి, వాటిని నేరుగా దుకాణాల్లో విక్రయిస్తున్నాడు. నగరాల్లోని తీని గురించి ఎక్కువగా వింటుంటాం. అలాంటి దాంతో రైతులు వినూత్నంగా సంపాదించే మార్గాన్ని కనుగొన్నారు. మన దేశపు అవకాడోల రుచి పెరగడమే కాదు, రైతుల ఆదాయం కూడా పెరిగింది అంటూ తన సంభాషణను ముగించారు. అవకాడోల వల్ల కలిగే లాభాలు..వీటిలో ఆరోగ్యకరమైన మోనోఅన్‌శాచురేటెడ్ ఒలిక్ యాసిడ్, అధిక డైటరీ ఫైబర్‌తో నిండిన పోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. కొవ్వులో కగిగే విటమిన్లు శోషణను పెంచడంలో సమర్థవంతంగా ఉంటాయి.వయసు సంబంధిత కీళ్ల సమస్యలు, దృష్టిని మెరుగుపరిచేలా ల్యూటిన్, జీక్సాంథిన్ వంటి యాక్సిడెంట్లు ఉంటాయి. అలాగే ఎముకల సాంద్రతను బలోపేతం చేసే విటమిన్ కె కూడా ఉంటుంది. View this post on Instagram A post shared by Narendra Modi (@narendramodi) (చదవండి: మీనాక్షి దేవతను తలపించేలా నికితా పోర్వాల్ అద్భుత నృత్యం..!) -
కండరాలు, గుండె పనితీరుకు ఆ విటమిన్ అత్యంత కీలకం..!
ఎముకల ఆరోగ్యానికి మాత్రమే కాకుండా శరీరంలోని కండరాలు, గుండె పనితీరును మెరుగుపరచడంలో విటమిన్–డీ2 కంటే విటమిన్–డీ3 అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని హైదరాబాద్‌లోని ఐసీఎమ్ఆర్– జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) పరిశోధనలో తేలింది. ముఖ్యంగా శరీరంలో విటమిన్ లోపం ఉన్నప్పుడు, దాని నుంచి కోలుకునే ప్రక్రియలో విటమిన్–డీ3 కీలక పాత్ర పోషిస్తుందని మగ ఎలుకలపై జరిపిన ప్రయోగం ద్వారా స్పష్టమైంది. ఈ పరిశోధన వివరాలు ప్రముఖ అంతర్జాతీయ సైన్స్ పత్రిక ‘మాలిక్యులర్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ రీసెర్చ్’లో ప్రచురితమయ్యాయి.పరిశోధనలో ఏం తేలిందంటే.. కండరాల పుష్టి: విటమిన్–డీ2తో పోలిస్తే విటమిన్–డీ3 తీసుకున్న ఎలుకలలో కండరాల పరిమాణం, కండరాల పీచు పరిమాణం, పట్టుకునే బలం గణనీయంగా పెరిగాయి.గుండె ఆరోగ్యం: గుండె కండరాల సంకోచవ్యాకోచాలు, గుండెకు సంబంధించిన జీవక్రియలలో విటమిన్–డీ3 అద్భుతమైన ఫలితాలను చూపించింది.శక్తి జీవక్రియలు: కండరాలవృద్ధికి, శరీరంలో శక్తి ఉత్పత్తికి సంబంధించిన రసాయన ప్రక్రియలను విటమిన్–డీ3 వేగవంతం చేసింది.పరిశోధన ఇలాగవిటమిన్–డీ సాధారణంగా డీ–2, డీ–3 గా రెండు రూపాల్లో లభిస్తుంది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాల కోసం ప్రయోగశాలలో పెరుగుతున్న మగ ఎలుకల మీద ప్రయోగం చేశారు. ఒక సమూహానికి విటమిన్–డీ2, మరొక సమూహానికి విటమిన్–డీ3, ఇంకొక సమూహానికి రెండింటి మిశ్రమాన్ని, చివరి సమూహానికి విటమిన్–డీ లేని ఆహారాన్ని ఇచ్చారు.గుండె నిర్మాణాన్ని రక్షించడంలో..శరీరంలో కాల్షియం స్థాయిలను క్రమబద్ధీకరించడంలో ఈ రెండు విటమిన్లు సమానంగా పనిచేసినప్పటికీ, కండరాలు, గుండె నిర్మాణాన్ని రక్షించడంలో విటమిన్–డీ3 ఎంతో శక్తివంతమైనదని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఆయేషాఇస్మాయిల్ వివరించారు. భవిష్యత్తులో ప్రజలకు అందించే విటమిన్ అనుబంధ ఆహారాలు (సప్లిమెంట్లు), పౌష్టికాహార పెంపుదల (ఫోర్టిఫికేషన్) కార్యక్రమాలలో కీలక మార్పులకు ఈ ఫలితాలు ఉపయోగపడతాయని ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ భారతి కులకర్ణి పేర్కొన్నారు. మానవులపై దీని ప్రభావాలను మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మరిన్ని విస్తృత పరిశోధనలు అవసరమని తెలిపారు. (చదవండి: ఆటిజం పిల్లలకు ప్రత్యేక చట్టాలున్నాయి!) -
ఆటిజం పిల్లలకు ప్రత్యేక చట్టాలున్నాయి!
మా అక్క–బావ రెండేళ్ళ క్రితం ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. వాళ్లకి పదహారేళ్ళ పాప వుంది. తనకి ఆటిజం. మాటలు కూడా సరిగా రావు. మనం చెప్పేది కూడా ఏమీ అర్థం కాదు. అక్కాబావా చనిపోయాక పాప తన నానమ్మ గారింటిలోనో ఉంటోంది. అప్పట్లో ఒక స్పెషల్ స్కూల్‌కి వెళ్ళేది. ఇప్పుడు అది కూడా మాన్పించారు. ఇటీవల అమ్మాయి వంటి మీద గాయాలు కనిపించాయి. ‘ఆస్తికోసమే పాపని వుంచుకున్నాము, లేకపోతే ఎప్పుడో రోడ్డుమీద వదిలేసేవాళ్ళం’ అని మా బావగారి తమ్ముడు ఎవరితోనో అనటం విన్నాను. నాకు అమ్మ–నాన్న, తోబుట్టువులూ ఎవరూ లేరు. నా భర్తని అడిగితే పాపపై మనకు హక్కులు లేవు – మనం ఏమీ చేయలేము అంటున్నారు. పాపను కాపాడుకోవటం ఎలాగో సలహా ఇవ్వగలరు. – సరోజ, మల్కాజిగిరి, హైదరాబాద్ఆటిజం కల్గినవారు జీవితాంతం దాదాపు పిల్లలే! మానసిక ఎదుగుదల లేకపోవటం వలన ఆటిజం బారిన పడిన పిల్లల గాధలు – ముఖ్యంగా వారి తల్లిదండ్రులు/బాగోగులు చూసుకునే వారు లేనప్పుడు పడే కష్టాలు వర్ణనాతీతం. ఆటిజం వున్న వారి హక్కులు – బాగోగులు – ఆస్తులు – పెంపకం – కస్టడీకి సంబంధించిన అంశాలకు గాను ‘ఆటిజం, సెరిబ్రల్సాల్సీ, మానసిక వెనుకబాటు, బహుళ వైకల్యాల వ్యక్తుల సంక్షేమం కోసం జాతీయ ట్రస్ట్, 1999 అనే చట్టం వుంది. ఈ చట్టం ప్రకారం, 18 యేళ్ళ లోపు వయసుగల ఆటిజం వున్న పిల్లల కస్టడీ తల్లిదండ్రులకి ఉన్నప్పటికీ – వారి వయసు 18 యేళ్ళు దాటిన తర్వాత ఎవరైనా గార్డియన్‌గా ఉండటానికి దరఖాస్తు చేసుకోవాలి. తల్లి–తండ్రులు లేదా కుటుంబ సభ్యుల దరఖాస్తు మేరకు ఏ వ్యక్తినైనా, రిజిస్టర్ చేయబడిన స్వచ్ఛంద సంస్థను అయినా: ఆటిజం, సెరిబ్రల్‌పాల్సీ వంటి సమస్యలు కల్గిన వారికి గార్డియన్‌గా నియమించ వచ్చు. అంతే కాక ది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016 కూడా ఇలాంటి అంశాలలో పాత్ర పోషిస్తుంది.మీ విషయానికి వస్తే...నేషనల్ ట్రస్ట్ యాక్ట్ 1999 లోని సెక్షన్ 17 ప్రకారం ఎవరైనా ఆటిజం, సెరిబ్రల్‌పాల్సీ వంటి సమస్యలు కల్గిన వారి తల్లిదండ్రులు లేదా బంధువు లేదా నమోదిత సంస్థ దృష్టికి ఎవరైనా గార్డియన్ (సంరక్షులు) (1) దివ్యాంగులను వేధిస్తున్నారని లేదా నిర్లక్ష్యం చేస్తున్నారని; లేదా (2) దివ్యాంగులకి సంబంధించిన ఆస్తిని దుర్వినియోగం చేస్తున్నారని లేదా నిర్లక్ష్యం చేస్తున్నారని – తెలిస్తే చట్టంలో నిర్దేశించిన విధంగా అటువంటి సంరక్షకుడిని తొలగించవలసిందిగా కమిటీకి దరఖాస్తు చేసుకోవచ్చు. అందుకుగాను లోకల్ లెవల్ కమిటీ (LCC) ని సంప్రదించవలసి ఉంటుంది. కొన్ని సందర్భాలలో, 2016 చట్టం ప్రకారం కోర్టును కూడా ఆశ్రయించవచ్చు. కాబట్టి మీ అక్క కూతురి భద్రతకు – తన ఆస్తికి సైతం ఎటువంటి భంగం కల్గుతున్నది అని మీకు అనుమానం వున్నా, LCC ముందు దరఖాస్తు చేసుకోండి. ఈ చట్టం క్రింద LCCకి అధికారాలు ఉంటాయి కనుక మీ అక్క కూతురిని సురక్షితంగా మీ వద్దకు చేర్చే అవకాశం లేకపోలేదు. లేకుంటే ఏదైనా నిర్దిష్ట సంస్థ పర్యవేక్షణలో కూడా ఉంచగలరు. ఆటిజం వంటి పరిస్థితిని ఎదుర్కొనే వారు వున్న తల్లిదండ్రులు/కుటుంబ సభ్యులు అందరూ కూడా వారికి వర్తించే చట్టాలు – హక్కులపై కనీస అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. ) (చదవండి: మిస్ వరల్డ్ ఉగాండా గౌనులో ఇంత గొప్ప సందేశమా..!) -
ఏడు రోజుల్లో ఐదు కిలోలు .? నో జిమ్..జస్ట్ ఇలా చేస్తే చాలు..
ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవన విధానంలో వ్యాయామలు, స్ట్రిక్ట్ డైట్‌ని అనుసరించడం అతి పెద్ద సవాలు చాలామందికి. పైగా కొన్ని రోజులు చేసి, ఆ తర్వాత స్కిప్ చేసేస్తుంటారు. నిలకడగా చేయాలంటే సమయం ఉండక ఇబ్బంది పడుతుంటారు. అదీగాక ప్రస్తుతం చాలామటుకు ఉద్యోగాలు గంటలు గంటలు పనిచేసే డెస్క్ ఉద్యోగాలే. బాగా తినకపోయినా..లావుగానే ఉండటం, పోనీ వర్కౌట్లు చేద్దామా అంటే సమయం కుదరక చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ల కోసం సులభంగా ఎంజాయ్ చేస్తూ చేసే వ్యాయామాలు నెట్టింట ట్రెండ్‌గా మారాయి. వాటిని వర్కౌట్లు అనేకంటే అందమైన డ్యాన్స్ అనొచ్చు. చూడటానికే కాదు, చేయడానికి కూడా చాలా అనువైనవి, సులువైనవి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీటికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఏంటా వర్కౌట్లు అంటే..జస్ట్ నాలుగు నిమిషాల నిడివి గల ఈ వీడియోలో కనిపిస్తున్న వర్కౌట్లు చేస్తే ఒక్క వారంలో ఐదు కిలోలు తగ్గడం ఖాయం అట. ప్రస్తుతం ఈ వ్యాయామాలు జపాన్‌లో బాగా ట్రెండ్‌గా మారింది. డంబెల్క్ కూడ పక్కనే పడేసి ఇవి ప్రయత్నించండి అని పిలుపునిస్తున్నారు. పైగా ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. అలాగే శరీరానికి మంచి కదలిక, కొలస్ట్రాల్‌ని కరిగించి ఫిట్‌గా ఉండేందుకు బెస్ట్ వర్కౌట్లు కూడా అని అంటున్నారు. చాలామంది నెటిజన్లు దీన్ని కొట్టిపారేస్తున్నా..జస్ట్ నాలుగు నిమిషాలు ఎంజాయ్‌చేస్తూ వేగంగా చేసేవి ప్రయత్నిస్తే నష్టమేమి ఉండదు కదా అని అడుగుతున్నారు. పైగా ఏ వ్యాయామమైనా..ఆరోగ్యకరమైనదే తప్ప హానికరం అంటూ ఉండదు. పైగా ఇవి కష్టతరమైనవి కాదు ఎవ్వరైనా సులభంగా ఆడుతూ పాడుతూ చేసేవే కదా ట్రై చేస్తే పోలే అని సపోర్టు చేస్తూ మాట్లాడటం విశేషం. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోని చూసి..చకచక నాలుగే నాలుగు నిమిషాల్లో చేసి స్లిమ్‌గా మారిపోండి మరి..!.영상은 길이는 고작 4분.일주일동안 매일 루틴으로 하면 -5kg이 빠진다는 일본 다이어트 영상.지금 일본에서 엄청난 유행임.마운자로 집어 던지고 이거하자.부작용 따위 없다. pic.twitter.com/J5ewOHbnui— rrace🇰🇷 (@junssi1982) August 31, 2026 (చదవండి: శ్వాసకోశ ఆరోగ్యం కోసం ఆయుర్వేద ధూమపానం..!) -
శ్వాసకోశ ఆరోగ్యం కోసం ఆయుర్వేద ధూమపానం..!
పూర్వకాలం నాటి ఆరోగ్యకరమైన పద్ధతులు సదా ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. అవి సాధారణ మందులు, ఆధునిక చికిత్సలకు మించి ప్రభావవంతంగా ఉంటాయి. అందుకు నిదర్శనమే ఈ ఆయుర్వేద ధూమపానం. ఇది సాధరణ స్మోకింగ్ లాంటిది కాదు. ఆరోగ్యాన్ని చేకూర్చే మూలికల ధూమపానం. దీన్ని నటి, కంటెంట్ క్రియేటర్ షెనాజ్ ట్రెజరీ ప్రయత్నించి మరి ఆ అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో రూపంలో షేర్ చేసుకున్నారు. ఇలాంటి ఆయుర్వేద చికిత్స ఒకటి ఉందని తనకు తెలియదని చాలా అద్భుతంగా ఉందంటూ నాటి చికిత్స విధానంపై ప్రశంసల జల్లు కురిపించింది. వైద్యపరమైన ధూమపానానికి స్వాగతం అంటూ..ఇది మన ఇంద్రియాలను, ముఖ్యంగా నాసికా మార్గాల్లోని అడ్డంకులను తొలగించి మనస్సుని ప్రశాంతంగా ఉంచుతుందని అంటోంది. ఇది నిర్థిష్ట ఔషధ మూలికల నుంచి వచ్చే పొగను పీల్చే పద్ధతి, చూడటానికి అచ్చం ధూమపానం మాదిరిగా ఉంటుంది. దెబ్బతో తల, ముక్కు, గొంతు సమస్యలు దెబ్బకు పరార్ అని అంటోంది షెనాజ్ . పూర్వకాలంలో శ్వాసకోశ ఆరోగ్యాన్ని కాపాడేందుకు, వాత, కఫ దోషాలను సమతుల్యం చేయడానికి ఔషధ గుణాలున్న మూలికల పొగలను పీల్చే ఒక ప్రాచీన పద్ధతిని ఉపయోగించేవారట. ఈ విధానంలో పసుపు, గుగ్గులు, వేప, నెయ్యి వంటి స్వస్థత చేకూర్చే పదార్థాలతో నింపిన ప్రత్యేకంగా తయారు చేసిన మూలికల వత్తిని కాలుస్తారు. దాన్ని ముక్కు రంధ్రాల ద్వారా పీల్చి, నోటి ద్వారా మాత్రమే బయటకు వదులుతారు. దీని వల్ల శ్లేష్మం తొలిగి ముక్కు, గొంతులోని చికాకు తగ్గి అత్యంత రిలీఫ్‌గా ఉంటుందట. ముఖ్యంగా జ్ఞానేంద్రియాలు చురుగ్గా ఉండేందుకు ఉపకరిస్తుందట. View this post on Instagram A post shared by Travel, Romance, Smiles (@shenaztreasury) (చదవండి: ఆ చీరే మా ప్రాణాలను రక్షించింది..! నేపాల్ జలప్రళయంలో ఓ అద్భుతం..) -
అల్పాహారం, మధ్యాహ్న భోజనం మానేస్తే..బరువు తగ్గగలమా? నటుడు రాజ్‌కుమార్..
బరువు తగ్గడం కోసం ఒక్కోక్కరూ ఒక్కో విధానాన్ని అనుసరిస్తూ ఉంటారు. వాళ్ల శారీరక ఆరోగ్యం, వ్యాధి నిరోధక శక్తి అనుగుణంగా డైట్, వ్యాయామాలు ఉంటాయి. అయితే బాలీవుడ్ ప్రముఖ నటుడు రాజ్‌కుమార్ రావు మాత్రం కావాలనుకుంటే బరువు పెరగగలడు, స్లిమ్‌గా మారిపోగలడు. ఒక పాత్ర కోసం శారీరక మార్పులతో సహా తనను తాను పూర్తిగా మార్చుకోగల నటుడు. ఆయన సుభాష్చద్రబోస్ జీవితం ఆధారంగా తెరకెక్కిన 2017 నాటి వెబ్ సిరీస్ 'బోస్: డెడ్/అలైవ్' (Bose: Dead/Alive) కోసం ఈ నటుడు 13 కిలోల బరువు పెరిగాడు, ఆ తర్వాత ఏడాదే 2018లో విడుదలైన 'ఫన్నీ ఖాన్' (Fanney Khan) చిత్రం కోసం ఒక్కనెలలో ఏకంగా పది కిలోల బరువు తగ్గారు. తాను బోస్ వెబ్ సిరీస్ తర్వాత బరువు తగ్గించుకోవాల్సి ఉంటుందని తనకు ముందే తెలుసని, అందుకేనే అల్పాహార, మధ్యాహ్న భోజనం మానేశానని అన్నారు. ఇలా చేస్తే బరువు తగ్గగలమా అంటే..ఇది అత్యంత కష్టమైన విధానం. ఎందుకంటే ఉదయాన్నే అల్పాహారం, మధ్యాహ్న భోజనం మానేసి, ఉండటం అంటే..శరీరాన్ని చాలా కష్టబెట్టడమే కాకుండా బలహీన పడే అవకాశాలు ఎక్కువ. కానీ రాజ్ కుమార్ మాత్రం తాను నేరుగా రాత్రి భోజనం మాత్రమే చేస్తానని, అది కూడా ప్రోటీన్ కలిగిన ఆహారం తీసుకుంటానని అన్నారు. మరి ఉదయం ఎలాంటి ఆహారం లేకుండా ఎలా ఉండగలరంటే..నిరంతరం పనిలో ఉంటాను కాబట్టి ఆకలి బాధ అంతగా అనిపించదని చెబుతున్నారు. అలాగే వ్యాయామాలు విషయానికొస్తే..ప్రతిరోజూ కనీసం మూడు గంటల పాటు కార్డియో, స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తానని అన్నారు. దీపావలి వంటి పండుగ సమయాల్లో నోరు చాలా కట్టడి చేసుకుంటానని, ఎందుకంటే ఫిట్‌గా ఉండటమే తన ప్రధాన లక్ష్యం కాబట్టి అని చెబుతున్నారు రాజ్‌కుమార్. ప్రస్తుతం భారత మాజీ క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న 'దాదా' (Dada) మూవీలో కనిపించనున్నారు రాజ్‌కుమార్. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ని గంగూలీ 54వ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు.మైదానంలోకి పరిగెత్తే ముందు షర్ట్ లేకుండా తన ఇండియా జెర్సీని ఊపుతూ గంగూలీ కనిపించడం క్రికెట్ చరిత్రలోనే అత్యంత చిరస్మరణీయమైన క్షణాలలో ఒకటి. అలాంటి క్షణాన్ని పోస్టర్ ఫస్ట్‌లుక్‌గా విడుదల చేసింది చిత్ర బృందం. కాగా, రాజ్ కుమార్ అనుసరించే డైట్ విధానం సరైనదేనా అంటే..అల్పాహార, మధ్యాహ్న భోజనం మానేస్తే..దీర్ఘకాలంలో ఇది శరీరంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. పైగా, బరువు తగ్గడానికి బదులు మరింత బరువు పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే భోజనం అన్నేసి గంటలు తీసుకోకపోతే శరీరం "సర్వైవల్ మోడ్" (ఆకలి మోడ్) లోకి వెళ్తుంది. శక్తిని ఆదా చేయడానికి శరీరం కేలరీలను ఖర్చు చేయడం తగ్గించి, ఫ్యాట్‌ను ఎక్కువగా నిల్వ ఉంచుకుంటుంది. దీనివల్ల మెటబాలిజం రేటు దారుణంగా పడిపోతుందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. పైగా ఆకలి ఎక్కువ వేసి..నియంత్రణ కోల్పోయేలా ఎక్కువగా తినేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దీని వల్ల బరువు పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. అలాగే శరీరం ఆహారం లభించనప్పుడు కొవ్వుని మాత్రమే గాక శక్తి కోసం కండరాలను కూడా కరిగించేలా చేస్తుంది. కండరాలు తగ్గితే శరీరం బలహీనపడి ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు వైద్యులు. అదీగాక రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం వల్ల నీరసం, తలతిరగడం, మూడ్ స్వింగ్స్, ఏకాగ్రత లోపించడం వంటివి జరుగుతాయి. ఒక్కోసారి పోషకాహార లోపం, గ్యాస్ట్రిక్ సమస్యలకు దారితీసే ప్రమాదం కూడా లేకపోలేదని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. దానికి బదులుగా కేలరీలు తక్కువగా ఉండే పోషకాహారం, ఫైబర్ ఉండే పదార్థాలు తీసుకునేలా కేర్ తీసుకుంటే ఆకలిని నియంత్రించ గలుగుతాం. ఆ తర్వాత ఫైబర్ అధికంగా ఉండే ఫుడ్‌కి ప్రాధాన్యతి స్తే కడుపునిండిన అనుభూతిని పొందడమే కాకుండా ఇతర ఆహారాల జోలికి వెళ్లరని చెబుతున్నారు. దీంతోపాటు వ్యాయామాలు, వాకింగ్ వంటివి క్రమం తప్పకుండా చేస్తే ఆరోగ్యకరంగా బరువు తగ్గడమే కాకుండా మళ్లీ యథావిధిగా పెరిగే అవకాశాలు తగ్గుతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: 67 నుంచి 57 కిలోలకు..! ఆ అలవాట్లకు గుడ్‌బై..) -
67 నుంచి 57 కిలోలకు..! ఆ అలవాట్లకు గుడ్‌బై..
బరువు తగ్గడం అనేది ఎల్లప్పుడు కాస్త క్లిష్టమైనదే. కాకపోతే దాన్ని ఆస్వాదించేలా ఎంజాయ్ చేసేలా ప్లానే చేసుకుంటేనే తేలికగా బరువు తగ్గగలుగుతారనేది నిపుణుల మాట. ఎప్పుడు కఠికన ఆహార నియమాలు, వర్కౌట్లు మాత్రమే కాదు. సాధారణ అలవాట్లతో కూడా బరువు తగ్గడం సులభమే అని అంటోంది ఈ డైటీషియన్. తన బరువు తగ్గేందుకు ఆ అలవాట్లను దరిచేరనీయకపోవడం వల్లే సాధ్యమైందంటూ..అవేంటో సవివరంగా సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.వార్దా అనే డైటీషియన్ తన వెయిట్‌లాస్ జర్నీని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. తాను 67 కిలోల నుంచి 57 కిలోలకు తగ్గినట్లు వెల్లడించారు. అందుకోసం ఎనిమి అలవాట్లకు దూరంగా ఉన్నట్లు తెలిపారు. దూరంగా ఉన్న ఆ అలవాట్లు..చాలా వేగంగా తినడంతాను ఐదు నిమిషాల్లో భోజనం ముగించడం మానేసి, తినడానికి సుమారు 15-20 నిమిషాలు తీసుకోవడం ప్రారంభించానని వార్దా చెప్పారు. దీనివల్ల తక్కువ ఆహారంతోనే కడుపు నిండిన అనుభూతి కలిగిందన్నారు.రోటీ, అన్నం మానేయడంకార్బోహైడ్రేట్లను తొలగించడానికి బదులుగా, ఆమె ఆహార పరిమాణాన్ని నియంత్రించడంపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. కొవ్వు తగ్గడం అంటే కేలరీల లోటు, అంతేగానీ కార్బోహైడ్రేట్లను పూర్తిగా తొలగించడం కాదని అంటోంది“పరిపూర్ణమైన ఆరోగ్యకరమైన ఆహారం” పాటించడంతాను ఎల్లప్పుడూ పరిపూర్ణంగా తినడానికి ప్రయత్నించలేదని అంటున్నారు. అతిగా తినడానికి దారితీసే స్టిక్ట్‌గా అనుసరించే డైట్‌ని ఫాలో అవ్వలేదని అన్నారు.ప్రతిరోజూ బరువును తనిఖీ చేసుకోవడంశరీర బరువులో నీరు, సోడియం, హార్మోన్ల కారణంగా మార్పులు రావచ్చని వార్దా పేర్కొన్నారు. రోజువారీ బరువు సంఖ్యలపై దృష్టి పెట్టడానికి బదులుగా, వారంతమే చెక్చేసేదాన్ని అని చెప్పారు.అంతులేని కార్డియో వ్యాయామాలు చేయడంఆమె ఎక్కువసేపు చేసే కార్డియో వ్యాయామాలపై ఆధారపడలేదు. దానికి బదులుగా,నడవడం, ఎక్కువ అడుగులు వేయడం, చురుకుగా ఉండటంతో సహా రోజువారీ కదలికలపై ఫోకస్ పెట్టినట్లు తెలిపారు.ఫ్యాట్ బర్నర్లు, డిటాక్స్ డ్రింక్స్ వాడటం..అలాంటి వాటికి దూరంగా ఉంటూ..ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉండటానికి అవసరమైన ప్రోటీన్, సంపూర్ణ ఆహారాలపై దృష్టి పెట్టినట్లు తెలిపారు.అపరాధ భావంకి చోటు ఇవ్వకుండా..ఒకసారి అనారోగ్యకరమైన ఆహారం తీసుకున్నంత మాత్రాన మొత్తం వెయిట్‌లాస్ జర్నీ వేస్ట్ అయిందని భావించాల్సిన అవసరం లేదని అంటోంది. ఒక పూట తీసుకునే జంక్‌ఫుడ్ మీ ఆరోగ్య పురోగతికి అంతరాయం కాదని అంటున్నారామె.ఆకలి వేసేంత వరకు ఉండకుండా..రోజులో ముందుగా ఆకలితో ఉండటం కంటే..ముందుగానే కొద్దిగా కొద్దిగా తినేలా కేర్ తీసుకున్నట్లు తెలిపింది. ఎందుకుంటే విపరీతమైన ఆకలిలో తినే పరిమాణంపై నియంత్రణ ఉండదని అంటోంది. అలాగే సమతుల్య ఆహారమే తీసుకుంటానని పేర్కొంది. ఇంకెందుకు ఆలస్యం బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నట్లయితే, ఈ సాధారణ చిట్కాలను పాటించి చూడండి మరి..గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యలు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: బరువు తగ్గడం ఇంత కష్టమా? నటి నిమిష సజయన్ వెయిట్‌లాస్ జర్నీ) -
బరువు తగ్గడం ఇంత కష్టమా? నటి నిమిష సజయన్ వెయిట్‌లాస్ జర్నీ
కిలోల కొద్దీ బరువు తగ్గి స్లిమ్‌గా మారిన వారిని చూసి..వాళ్లలా తగ్గిపోదాం అనుకుంటాం. కానీ ఆ క్రమంలో వాళ్లు ఎదుర్కొన్న ఇబ్బందులు చాలానే ఉంటాయి. ముఖ్యంగా నిలకడ అనేది మాటల్లో చెప్పినంత ఈజీ కాదు ఆచరణలో పెట్టడం. ఇక్కడ అలాంటి సమస్యలే ఎదుర్కొని, ఎంతో నిజాయితీగా తన వెయిట్‌లాస్ జర్నీ గురించి చెప్పి..ఆలోచింప చేసింది మళయాళం నటి నిమిషా సజయన్. తను ఒక పాత్ర కోసం బరువు పెరిగి మళ్లీ తగ్గాడానికి ఎంతలా కష్టపడాల్సి వచ్చింది, అలాగే ఆ క్రమంలో కన్నీళ్లు కూడా వచ్చేశాయంటూ తన వెయిట్‌లాస్ జర్నీ గురించి చెప్పుకొచ్చారు. మరి అవేంటో చూద్దామా..!.నటి నిమిషా సజయన్ సోషల్ మీడియా వేదికగా 'బబితా సింగ్ రిపోర్టింగ్' అఏ మూవీ కోసం ఏకంగా 14 కిలోలు బరు పెరిగానని తెలిపారు. అయితే ఆ తర్వాత తగ్గడానికి చేసిన ప్రయత్నాలు, ఆ క్రమంలో ఎదుర్కొన్న స్ట్రగుల్స్ గురించి సవివరంగా వెల్లడించారు. అంతేగాదు బరువు తగ్గక ముందు, ఆ తర్వాత పోటోలను పంచుకుంటూ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. తాను బబితా సింగ్ రిపోర్టింగ్ మూవీలో బబితా పాత్ర కోస ఏకంగా 58 నుంచి 72 కిలోలు పెరిగినట్లు తెలిపారు. ఆ తర్వాత బరువు తగ్గడానికి ఎన్ని తంటాలు పడాల్సి వచ్చిందో చెప్పుకొచ్చారు. తొలి పది రోజులు సైన నిద్ర లేక తీవ్రమైన మానసిక సమస్యలు, అలసట, అసహనం వంటి సమస్యలు ఎదుర్కొన్నానని అన్నారు. ఒకానొక సమయంలో ఇక తన వల్ల కాదు అని చేతులెత్తేశానని కూడా అన్నారు. బరువు తగ్గడం కోసం చేస్తున్న వర్కౌట్లు, డైటింగ్ విషయంలో కళ్లల్లో నీళ్లు తిరిగేవని చాలా నిజాయితీగా చెప్పుకొచ్చారు. అయితే దీన్ని ట్రైనర్ సాయంతో జయించి ముందుకు సాగానని, అందుకు అతనికి చాలా కృతజ్ఞతలు అని కూడా చెప్పారామె. నిజంగానే వెయిట్‌లాస్ జర్నీలో ఒక్కోసారి పూర్తి స్థాయిలో అనుకున్నట్లుగా చేయలేకపోయినా.. తర్వాత నుంచి కొనసాగి ముందుకుపోవాలని అంటున్నారామె. ఒక్కోసారి స్కిప్ అయితే లైట్ తీసుకుంటూ పోవాలే గానీ, ఆపేద్దాం అనుకున్నారో అధిక బరువుని తగ్గించుకోవడంలో ఢమాల్ అని పడిపోయినట్లే లెక్క అని అంటోంది. అపరాధ భావనకు తావు లేకుండా మధ్య మధ్యలో తప్పడం అనేది సహజం అని సానుకూలంగా తీసుకుంటూ సాగితే ఆటోమేటిగ్గా బరువు తగ్గడమే కాకుండా మీరు ఏర్పరుచుకున్న వెయిట్ లాస్ నియమాలు దైనందిన జీవితంలో తెలియకుండా భాగమవుతాయని అంటోంది. అలాగే మంచి నిపుణులు లేదా వైద్యుల పర్యవేక్షణలో, వారి సూచనలు సలహాలతో బరువు తగ్గే యత్నం చేస్తే..ఎలాంటి మానసిక, అనారోగ్య సమస్యలనైనా తట్టుకుని బరువు తగ్గగలమని నమ్మకంగా చెబుతోందామె. View this post on Instagram A post shared by NIMISHA BINDU SAJAYAN (@nimisha_sajayan) (చదవండి: ఒక్కసారి సిజేరియన్..మళ్లీ అదేనా?) -
కిడ్నీలపై దాడి చేసే తోడేలు వ్యాధి
తన సొంత కణాలను తానే దెబ్బతీసే ఆటోఇమ్యూన్ వ్యాధుల్లో లూపస్ అనేది కూడా ఒకటి. నిజానికి లాటిన్ భాషలో లూపస్ అంటే తోడేలు అని అర్థం. ఈ వ్యాధి వచ్చిన వాళ్లలో ముక్కు చుట్టూ సీతాకోకచిలుక ఆకృతిలో కనిపించే ర్యాష్ వల్ల ముఖం తోడేలులా కనిపించడం ఒక అంశమైతే... చాలా క్రూరంగా తన ఎరను వేటాడి ఆకలిగా తినేసే జంతువుల్లో తోడేలు ఒకటి. ఈ రెండు కారణాలతో ఈ జబ్బుకు ‘లూపస్’ అని పేరొచ్చింది. సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్ అనే జబ్బు పేరుకు సంక్షిప్త రూపమే ఈ ‘లూపస్’. ముందుగా చెప్పినట్టుగా... ఈ జబ్బు తన సొంత కణాలను దెబ్బతీసే క్రమంలో కీళ్లూ, చర్మం ఇతరత్రా అవయవాల లాగానే మూత్రపిండాల (కిడ్నీల) పైనా తన దుష్ప్రభావం చూపవచ్చు. అదెలా జరుగుతుంది, ఆ జబ్బును ఏమంటారు, వాటి లక్షణాలూ, అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలూ, చికిత్సలపై అవగాహన కోసం ఈ కథనం. లూపస్ కారణంగా కిడ్నీపై దుష్ప్రభావం పడి అవి దెబ్బతినే కండిషన్‌కు ‘లూపస్ నెఫ్రైటిస్’ అని పేరు. తొలిదశలోనే గుర్తించకపోతే ‘లూపస్ నెఫ్రైటిస్’... మూత్రపిండాల (కిడ్నీల) వైఫల్యానికి దారితీసే ముప్పు ఉంటుంది. లూపస్ కారణంగా కిడ్నీల్లో వాపు, వడపోత (ఫిల్టరింగ్) వ్యవస్థ దెబ్బతినడాన్ని లూపస్ నెఫ్రైటిస్ అంటారు. సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే ఇది... దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి (క్రానిక్ కిడ్నీ డిజీస్ –సీకేడీ) మొదలుకొని... చివరకు కిడ్నీ వైఫల్యానికి (కిడ్నీ ఫెయిల్యూర్‌కు) దారితీసే ప్రమాదం ఉంది.కిడ్నీని ఎలా దెబ్బతీస్తుందంటే...తొలుత చెప్పుకున్నట్లుగానే... ఆటో ఇమ్యూన్ వ్యాధుల్లో... తమ సొంత వ్యాధినిరోధక వ్యవస్ధ అనేది... తన సొంత కణాలనూ, కణజాలాన్ని పరాయివి భావించి... వాటిని దెబ్బతీసినట్టే... లూపస్ అనే ఆటోఇమ్యూన్ వ్యాధిలోనూ అదే జరుగుతుంది. లూపస్ వ్యాధిగ్రస్తుల్లోని ఇమ్యూన్ వ్యవస్థ తాను ఉత్పత్తి చేసే యాంటీబాడీస్, ఇమ్యూన్ కాంప్లెక్స్లన్నవి కిడ్నీలోని అత్యంత సూక్ష్మమైన, సంక్లిష్టమైన వడపోత కేంద్రాలైన గ్లోమెరూలైపై దాడి చేసి, వాటిని దెబ్బతీస్తాయి. అలా గ్లోమెరూలై దెబ్బతినడంతో కిడ్నీలు తమ ‘వడపోత’ సామర్థ్యాన్ని క్రమంగా కోల్పోతుంటాయి. వ్యాధి తీవ్రత పెరుగుతున్న కొద్దీ కిడ్నీ పనితీరు క్రమంగా తగ్గుతూ పోతుంది. ఇలా క్రమక్రమంగా తొలుత దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి మొదలుకొని, చివరకు కిడ్నీ ఫెయిల్యూర్‌కు అది దారితీయవచ్చు. ఇవీ లక్షణాలు... మన దేహంలో కాలేయం, కిడ్నీ వంటి అవయవాలకు అద్భుతమైన సామర్థ్యం ఉంటుంది. దాదాపు 90 శాతం చెడిపోయేవరకూ అవి తమ జీవక్రియలను చాలా సమర్థంగా నిర్వహిస్తూ ఉంటాయి. ఈ అంశమే లక్షణాలను చాలా ఆలస్యంగా బయటపడేలా చేస్తుంది. అందుకే లూపస్ నెఫ్రైటిస్ మొదటి దశలో చాలాసార్లు స్పష్టమైన లక్షణాలేవీ కనిపించకపోవచ్చు. అయితే లూపస్ ఉన్నవారు క్రమం తప్పకుండా కిడ్నీ పరీక్షలు చేయించుకోవడం కీలకం. ఫలితంగా మూత్రంలో ప్రోటీన్ , రక్తం కనిపించి వ్యాధి బయటపడే అవకాశాలెక్కువ. సాధారణంగా లూపస్ నెఫ్రైటిస్‌లో కనిపించే లక్షణాలివి... → మూత్రంలో నురుగు లేదా ఎక్కువగా బుడగలు రావడం→ మూత్రంలో రక్తం కనిపించడం లేదా మూత్రం గోధుమరంగులోకి మారడం. → కాళ్లు, పాదాలు, ముఖం లేదా కళ్ల చుట్టూ వాపు. → అకస్మాత్తుగా బరువు పెరగడం. → మూత్రం పరిమాణం తగ్గడం. → అధిక రక్తపోటు → తీవ్రమైన అలసట... ఇలాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించాలి.నిర్ధారణ ఇలా... లూపస్ నెఫ్రైటిస్ను గుర్తించడానికి బాధితుల లక్షణాలు, వైద్య చరిత్రను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు వైద్యులు మరికొన్ని పరీక్షలనూ సూచిస్తారు. ఉదాహరణకు మూత్ర పరీక్ష ద్వారా ప్రోటీన్ , రక్తం వంటివి గుర్తిస్తారు. మరికొన్నిæ రక్తపరీక్షల ద్వారా కిడ్నీ పనితీరుతోపాటు లూపస్‌కు సంబంధించిన కొన్ని ఇమ్యూన్ సూచికలను పరిశీలిస్తారు. అవసరాన్ని బట్టి కిడ్నీ బయాప్సీ చేసి వ్యాధి ఏ స్థాయిలో ఉందో, కిడ్నీకి ఏ మేరకు ఏ రకం నష్టం జరిగిందో నిర్ధారణ చేస్తారు. పూర్తి నివారణ సాధ్యమేనా? లూపస్ అనేది ఆటో ఇమ్యూన్ వ్యాధి కారణంతో దీని నివారణ పూర్తిగా సాధ్యం కాదు. అంతేకాదు... చికిత్సతో ఇది పూర్తిగా తగ్గుతుందని చెప్పడానికీ లేదు. అయితే వ్యాధిని నియంత్రణలో ఉంచడం ద్వారా కిడ్నీపై పడే దుష్ప్రభావాన్నీ, కిడ్నీకి జరిగే నష్టాన్ని నివారించడం సాధ్యమే. వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా తీసుకోవడం, మెడికల్‌షాపు నుంచి తామే స్వయంగా తీసుకునే మందుల్ని (ఆన్ కౌంటర్ మెడిసిన్‌ను) తీసుకోకపోవడం, రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వంటి మంచి జీవనశైలి (లైఫ్‌స్టైల్) పాటించడం, అవసరమైన ఫాలోఅప్ పరీక్షలు చేయించుకోవడం వంటి చర్యలతో దీన్ని అదుపులో పెట్టడం చాలావరకు సాధ్యమే. చివరగా... లూపస్ ఉన్న ప్రతి ఒక్కరిలోనూ కిడ్నీ వ్యాధి లక్షణాలు స్పష్టంగా కనిపించకపోవచ్చు. అందువల్ల పైకి లక్షణాలు కనిపించకపోయినప్పటికీ వైద్యుల సూచన మేరకు క్రమం తప్పకుండా తగిన పరీక్షలు చేయించుకోవాలి. కిడ్నీ పనితీరు, మూత్రంలో ప్రోటీన్ పోవడం వంటి వాటిని చూసుకుంటూ ఉండాలి. తాజా మార్గదర్శకాల ప్రకారం లూపస్‌తో బాధపడేవారు క్రమం తప్పకుండా మూత్ర పరీక్షలు చేయించుకోవాలి. ఒకవేళ లూపస్ నెఫ్రైౖ టిస్ నిర్ధారణ అయితే మాత్రం ఈ తరహా పరీక్షలూ, పర్యవేక్షణ మరింత తరచూ అవసరం కావచ్చు. మరీ ముఖ్యంగా లూపస్ ఉన్న బాధితుల్లో... మూత్రంలో నురుగు, రక్తం, దేహంలో వాపు లేదా రక్తపోటు పెరగడం వంటివి కనిపిస్తే వెంటనే నెఫ్రాలజిస్ట్ లేదా రుమటాలజిస్ట్ను సంప్రదించడం అవసరం. ఈ వ్యాధిలో సమస్యను ఎంత త్వరగా గుర్తించి, సరైన చికిత్స తీసుకుంటే... కిడ్నీపై దుష్ప్రభావాన్ని అంతగా తగ్గించే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి.చికిత్సఈ వ్యాధికి చికిత్స అన్నది వ్యాధి తీవ్రత, కిడ్నీ బయాప్సీ ఫలితాలు, ఇతర ఆరోగ్య పరిస్థితులు లాంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. వ్యాధినిరోధక వ్యవస్థ తాలూకు ‘అతి చురుకుదనా’న్ని తగ్గించేందుకు ఇమ్యూనోసప్రెసివ్ మందులు, స్టెరాయిడ్లు వాడటం వంటి చికిత్స ప్రక్రియలను వైద్యులు అనుసరిస్తారు. కొన్ని సందర్భాల్లో మైకోఫెనోలేట్, సైక్లోఫాస్ఫమైడ్, బయోలాజిక్స్ లేదా ఈవ్యాధి తీవ్రతను తగ్గించడానికి ఉపయోగపడే ఇతరత్రా మందులనూ డాక్టర్లు సూచించవచ్చు. లూపస్ చికిత్సలో ‘హైడ్రాక్సీక్లోరోక్విన్ ’ను కూడా ఓ ముఖ్యమైన మందుగా చెప్పవచ్చు. అధిక రక్తపోటు, మూత్రంలో అధిక ప్రోటీన్ వంటి సమస్యలను నియంత్రించేందుకు ప్రత్యేకమైన మందుల్నీ ఇవ్వవచ్చు. కిడ్నీలు తీవ్రంగా దెబ్బతిని వైఫల్యానికి చేరితే డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి చికిత్స అవసరం కావచ్చు.డాక్టర్ సీరపాణి గోపాలుని సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్ -
ఆహారం తీసుకోగానే గర్భిణులకు కడుపులో ఇబ్బందా?
కొందరు గర్భవతుల్లో ఆహారం తీసుకోగానే కడుపులో ఇబ్బందిగా ఉండవచ్చు. మరీ ముఖ్యంగా 28 వారాల ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఇది కాస్త ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలిపే కథనమిది. కొందరు గర్భిణుల్లో తినగానే ఛాతీలో ఇబ్బంది, ఆహారం గొంతుకు అంటుకుపోయినట్టుగా ఉండటం, ఛాతీలో / గుండెల్లో మంట, కడుపులోని ఆహారం పైకి ఎగజిమ్ముతున్న భావన, అజీర్తి, తేన్పులు వంటి బాధలు కనిపిస్తుంటాయి.ఇదీ కారణం... ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడే గ్యాస్ట్రిక్ జ్యూస్... జీర్ణాశయం నుంచి పై వైపునకు అంటే గొంతువైపు ఎగజిమ్మడమే ఇలా జరగడానికి కారణం. ఇక గర్భవతుల్లో కండరాలు వదులుగా అయ్యేలా చేసేందుకు ప్రోజెస్టెరాన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంటుంది. గర్భసంచిలోని పిండం పెరుగుతున్న కొద్దీ దానికి చోటు కల్పించడం కోసం... గర్భసంచి కండరాలు వదులయ్యేలా చేసేందుకు ఇలా జరుగుతుంటుంది. అయితే ఈ హార్మోన్ కేవలం గర్భసంచిని మాత్రమే వదులు చేయకుండా ఇతర కండరాలు అంటే... పక్కనే ఉన్న జీర్ణాశయం–అన్నవాహిక మధ్యన ఉండే స్ఫింక్టర్ (లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ – లెస్ అనే కవాటం వంటిది) మీద కూడా తన ప్రభావం చూపడంతో అది కాస్త వదులైపోవడమన్నది సాధారణంగా జరుగుతుంది. దాని ఫలితంగా ఈ గ్యాస్ట్రిక్ జూసెస్ జీర్ణాశయం నుంచి అన్నవాహిక వైపునకు పైకి ఎగజిమ్ముతాయి.నివారణ ఇలా..: అందుకే గర్భవతులు ఒకేసారి పెద్దమొత్తంలో కాకుండా ఎక్కువసార్లు చిన్న చిన్న మోతాదుల్లో తినడం, తినగానే పక్కకు ఒరగకుండా కాస్త వాకింగ్ చేయడం, పడుకున్నప్పుడు తలగడ పెట్టుకోవడం, తినే ఆహారంలో కారం, వేపుళ్లు, మసాలాలు చాలా పరిమితంగా తీసుకుంటూ మజ్జిగలాంటివి తాగుతూ ఉండటం వల్ల ఈ సమస్యను చాలావరకు నివారించవచ్చు. అప్పటికీ సమస్య తగ్గకపోతే ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వారు సూచించిన యాంటాసిడ్స్ వాడాల్సి ఉంటుంది. ఇది మినహా గర్భవతులు డాక్టర్ల సూచన లేకుండా తమంతట తాము ఎలాంటి ట్యాబ్లెట్స్ వేసుకోకపోవడమే మంచిది. -
సంకేతం అందిందా?
మెదడులోని ‘సప్లిమెంటరీ మోటార్ ఏరియా’ అనే భాగం ఉంటుంది. ఇది మెదడులోని ఫ్రంటల్ లోబ్ లోపలి ఉపరితలంలో ఉండే చిన్న ప్రాంతం. దీని గురించి చాలామందికి పెద్దగా తెలియదుగానీ... మానవ దేహంలో మాత్రం ఓ అద్భుతమైన పని చేస్తుంది. అదేమిటంటే... ‘‘ఏదైనా పని చేయాలన్న ఆ ఉద్దేశాన్ని... చేతల్లోకి తీసుకురావడంలో ఈ సప్లిమెంటరీ మోటార్ ఏరియా (ఎస్ఎమ్ఏ)ది కీలక భూమిక పోషిస్తుంది. అంటే... మెదడు విషయానికి వస్తే... ‘చేయాలనుకోవడాన్ని’ ‘చేయడంగా’ మార్చే ప్రాంతాల్లో ఎస్ఎమ్ఏ ఒకటి.ఎస్ఎమ్ఏ ఏం చేస్తుందంటే...కదలికలు జరగాల్సిన తీరుతెన్నుల్ని ముందుగానే సిద్ధం చేస్తుంది. కదలాలనుకున్న ఆ సంకల్పం మెదడులోకి రాగానే... ‘ఎస్ఎమ్ఏ’ ఆ పనిని మొదలుపెట్టేస్తుంది. దీనికి ఓ తార్కాణమే కీబోర్డు వైపు చూడకుండానే మనం టైప్ చేయగలగడం. మన వేళ్లు కదిలేలోపే అవి కదలాల్సిన క్రమాన్ని ‘ఎస్ఎమ్ఏ’ సిద్ధం చేసేస్తుంది. అందుకే మనం టకటకా టైప్ చేసేయగలుగుతాం. రెండు చేతుల కదలికల సమన్వయానికీ...చప్పట్లు కొట్టేటప్పుడూ, షూలేసులు కట్టుకునేటప్పుడూ మన చెతులు రెండూ ఒక సమన్వయంతో, ఒకే లయలో పనిచేయాలి. ఆ సమన్వయానికి ‘ఎస్ఎమ్ఏ’ది కీలక భూమిక. మధ్యలోనే పని ఆపేయడానికి కూడా... అంతేకాదు... ఒక క్రమబద్ధమైన కదలికను మధ్యలో ఆపేయడమూ ‘ఎస్ఎమ్ఏ’ పనే. రోడ్డు దాటుతూ ఉంటాం. అకస్మాత్తుగా ఓ కారు వేగంగా వస్తూ కనిపించగానే... అప్పటివరకూ కొనసాగుతున్న నడక అకస్మాత్తుగా ఆగిపోతుంది. ఇందుకు దోహదపడేదీ ‘ఎస్ఎమ్ఏ’నే. అలవాటైన కదలికల్లో ఆటోపైలట్లాగా... రోజూ వెళ్లే దారిలో కారు నడుపుతున్నప్పుడు... ఎక్కడ ఎప్పుడు ఎలా మలుపులు తి΄్పాలో మనకు పెద్దగా గుర్తుండకపోయినప్పటికీ... ఆ కదలికలను గుర్తుంచుకొని స్వతహాగా అవి జరిగిలే ఎస్ఎమ్ఏ చూస్తుంది. ఎస్ఎమ్ఏ కండరాలకు బలం ఇవ్వదు. ఆ పని ప్రధాన మోటార్ కార్టెక్స్ది. ఎస్ఎమ్ఏ మనకు కావాలనుకున్న కదలికను ప్లాన్ చేయడం. దాని వరసను సిద్ధం చేయడం, దాన్ని మొదలుపెట్టడం. శస్త్రచికిత్స తర్వాత కొంతకాలం ఎస్ఎమ్ఏ తాత్కాలికంగా స్తబ్ధంగా మారితే ఆ కండిషన్‌ను ఎస్ఎమ్ఏ సిండ్రోమ్ అంటారు. దీని బాధితులు పూర్తిగా స్పృహలోనే ఉంటారు. అన్నీ అర్థం చేసుకుంటారు. కదలాలనే బలమైన కోరికా ఉంటుంది. అయినా... కదలిక ప్రక్రియను తాము మొదలుపెట్టలేరు. ఎందుకంటే... మెదడు ‘సరే... మొదలుపెట్టు’ అనే ఆదేశాన్ని ఎక్కడో పోగొట్టుకున్నట్టుంటుంది.వైద్య శిక్షణలో ఉన్న డాక్టర్లు తొలిసారి ఎస్ఎమ్ఏ సిండ్రోమ్‌ను చూసినప్పుడు వారికి అదో మాయలా అనిపించవచ్చు. బాధితులు తమ ఆలోచనకూ, చేతలకూ మధ్యన ఎక్కడో చిక్కుకుపోయినట్టు ఉంటారు. నిన్న చేయలేని పనిని ఈ రోజు మెదడు మళ్లీ ప్రయత్నిస్తుంది.ప్రతిరోజూ... మెదడులో కనిపించని నాడీ మార్గాలు కాస్త మరింత సమర్థంగా పనిచేయడం నేర్చుకుంటాయి. దాంతో సప్లిమెంటరీ మోటార్ ఏరియా మళ్లీ క్రియాశీలమవుతుంది.ఓ పనిలో ఉండగానే మరో పనిలోనూ... ఫ్రెండ్స్‌తో మాటల్లో ఉంటూనే టేబుల్‌పై ఉన్న నీళ్ల గ్లాసు అందుకోవడం; కారు హారన్ వినగానే ఉలిక్కిపడి వెనక్కి జరగడం, చాలాసేపు కూర్చున్న తర్వాత కొంత సంభాషణ చివరి దశలో ఉండగానే కూర్చీ చేతులు పట్టుకుని పాక్షికంగా లేవడానికి సిద్ధం కావడం... ఇలాంటి పనులన్నీ ‘ఎస్ఎమ్ఏ’ వల్లనే. -
వెన్నెముకకు మేలు చేసే ఈ ఆసనం గురించి తెలుసా?
శరీరాన్ని నిటారుగా, సమతుల్యంగా ఉంచేందుకు యోగా ఆసనాలు ఎంతో ఉపయోగపడతాయి. అందులో సులభంగా చేయగల ఆసనాల్లో తాడాసనం ఒకటి. క్రమం తప్పకుండా సాధన చేస్తే శరీర భంగిమ, బ్యాలెన్స్‌తో పాటు కండరాల టోన్‌ను మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది.ఎలా చేయాలి?రెండు పాదాలను కలిపి లేదా కొద్దిగా దూరంగా ఉంచి నిటారుగా నిలబడాలి.చేతులను శరీరం పక్కన ఉంచాలి.శ్వాస తీసుకుంటూ రెండు చేతులను ముందుకు, పైకి తీసుకెళ్లి తలపైకి పెట్టాలి.అరచేతులను కలిపి లేదా ఒకదానికొకటి ఎదురుగా ఉంచి, కాళ్లపై సమంగా బరువు ఉంచి, వెన్నెముకను పైకి పొడిగించాలి.సౌకర్యంగా ఉంటే మడమలను పైకి లేపి పాదాల వేళ్లపై నిలబడాలి.చూపును ఒక స్థిరమైన బిందువుపై ఉంచి, సాధారణంగా శ్వాస తీసుకుంటూ 10–20 సెకండ్లు ఉంచాలి.శ్వాస వదులుతూ మడమలను దించి, చేతులను కిందకు తీసుకురావాలి.ప్రయోజనాలు...శరీర భంగిమను (Post-ure) సరిచేయడంలో సహాయపడుతుంది.బ్యాలెన్స్‌ను మెరుగుపరుస్తుంది.మొత్తం శరీరంలోని కండరాల టోన్‌ను మెరుగుపరుస్తుంది.వెన్నెముకను పొడవుగా చేసి, దానిపై ఉన్న ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.ముందు మూడు లైన్ల స్టార్టింగ్ కథనంతో పాటు అన్నీ ఇవ్వండి– అనిత పాతర్ల, యోగా ట్రైనర్ఇవి చదవండి: పైసా ఖర్చు లేకుండా చర్మానికి మెరుపు.. ఈ 3 అలవాట్లు చాలు! -
చక్కెర ధరలు పెరిగినా.. తీపి తగ్గొద్దు!
పండుగ సీజన్ వచ్చిందంటే ఇంట్లో స్వీట్లు, పాయసం, పిండి వంటలు తప్పనిసరి. కానీ చక్కెర సంక్షోభం.. ధరలు పెరగడంతో సామాన్యులకు వంటింటి బడ్జెట్ కాస్త భారమవుతోంది. పండుగ వేళ తీపి తగ్గించుకోవాల్సిన అవసరం లేకుండా.. వంటల్లో చక్కెరకు బదులుగా కొన్ని సహజ తీపి పదార్థాలను ఉపయోగించుకోవచ్చు. అయితే ప్రతి ప్రత్యామ్నాయం ప్రతి వంటకానికి సరిపోదు. ఏ వంటలో దేనిని ఉపయోగిస్తే రుచి బాగుంటుందో తెలుసుకుంటే ఖర్చును కొంత తగ్గించుకోవచ్చు.చక్కెరకు సులభమైన ప్రత్యామ్నాయాల్లో బెల్లం ముందుంటుంది. పాయసం, పరమాన్నం, పొంగలి, కొన్ని రకాల లడ్డూలు, హల్వా వంటి వంటకాల్లో చక్కెరకు బదులుగా బెల్లం ఉపయోగించవచ్చు. అయితే బెల్లం రంగు, రుచి వంటకంపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా తెల్లగా ఉండే స్వీట్లకు బెల్లం వాడితే రంగు మారే అవకాశం ఉంటుంది.ఖర్జూరంతో సహజ తీపిఖర్జూరాలు కూడా మంచి ప్రత్యామ్నాయం. గింజలు తీసి కొద్దిసేపు నీటిలో నానబెట్టి మెత్తగా చేసి పేస్ట్‌గా ఉపయోగించవచ్చు. షేక్స్, స్మూతీలు, ఓట్స్, హల్వా, కొన్ని డెజర్ట్‌లలో ఇది బాగా సరిపోతుంది. ఖర్జూరాల్లో సహజంగా చక్కెరలు ఉంటాయి కాబట్టి పరిమాణాన్ని కూడా గమనించాలి.అరటిపండుతో స్వీటెనర్బాగా పండిన అరటిపండు సహజంగా తీపిగా ఉంటుంది. కేకులు, పాన్కేక్లు, స్మూతీలు వంటి వాటిలో చక్కెర పరిమాణాన్ని తగ్గించేందుకు మెదిపిన అరటిపండును ఉపయోగించవచ్చు. అయితే అరటి రుచి కూడా వంటకంలో కనిపిస్తుంది. అందువల్ల ప్రతి వంటకానికి ఇది సరైన ఎంపిక కాకపోవచ్చు.ఎండు ద్రాక్షతో తీపిఎండు ద్రాక్షను నానబెట్టి పేస్ట్ చేసి పాయసం, హల్వా, కొన్ని స్వీట్లలో కలపవచ్చు. లేదా తరిగి నేరుగా వంటకాల్లో వేసినా సహజమైన తీపి వస్తుంది. దీంతో అదనంగా చక్కెర వేసే పరిమాణాన్ని కొంత తగ్గించవచ్చు.కొబ్బరి బెల్లం కూడా..మార్కెట్లో లభించే కొబ్బరి బెల్లం కూడా కొన్ని పండుగ వంటకాల్లో ఉపయోగించవచ్చు. ముఖ్యంగా పాయసం, స్వీట్లు, కొన్ని పిండి వంటల్లో ఇది మంచి రుచిని ఇస్తుంది. అయితే దీనిని కూడా చక్కెరకు పూర్తిగా ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం అని భావించకుండా.. తీపి పదార్థంగానే పరిమితంగా తీసుకోవాలి.తేనె ఎప్పుడు?టీ, నిమ్మరసం, పెరుగు, స్మూతీలు, కొన్ని చల్లటి డెజర్ట్‌లలో తేనెను చక్కెరకు బదులుగా ఉపయోగించవచ్చు. తేనె కూడా ప్రధానంగా చక్కెరలనే కలిగి ఉంటుంది కాబట్టి ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా చిన్నపిల్లలకు తేనె ఇచ్చే విషయంలో వయసుకు సంబంధించిన జాగ్రత్తలు పాటించాలి.ఏ వంటకు ఏది?పాయసం, పరమాన్నం: బెల్లంహల్వా: బెల్లం, ఖర్జూర పేస్ట్షేక్స్, స్మూతీలు: ఖర్జూరం, అరటిపండుకేకులు, పాన్కేక్లు: పండిన అరటిపండుడెజర్ట్లు: ఖర్జూరం, ఎండు ద్రాక్షటీ, నిమ్మరసం: తేనెమన దేశంలో టీ, కాఫీల్లోనూ చక్కెర వినియోగం ఎక్కువగా ఉంటుంది. అందుకే రోజువారీగా తాగే టీకి స్టీవియా వంటి తక్కువ క్యాలరీ స్వీటెనర్లను ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. బెల్లం, తేనెతోనూ టీకి తీపి తెచ్చుకోవచ్చు కానీ అవి కూడా చక్కెరలనే కలిగి ఉంటాయి కాబట్టి పరిమితంగా వాడాలి. అలాగే ఏలకులు, అల్లం, దాల్చిన చెక్క వంటి వాటిని కలపడం ద్వారా చక్కెరను తగ్గించినా టీ రుచిగా ఉండేలా చేసుకోవచ్చు. అయితే క్రమంగా చక్కెర లేని టీకి అలవాటు పడటమే ఆరోగ్యపరంగా మెరుగైన ఎంపిక.షుగర్ పూర్తిగా తగ్గించొద్దు.. ఎందుకంటే?చక్కెరను పూర్తిగా మానేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ ఉండదు. శరీరానికి శక్తి కోసం కార్బోహైడ్రేట్లు అవసరం.. అయితే అదనంగా కలిపే చక్కెరను పరిమితంగా తీసుకోవడం ముఖ్యం. చక్కెర ఎక్కువగా తీసుకుంటే బరువు పెరగడం, దంత సమస్యలు, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వంటి సమస్యలకు దారితీయొచ్చు. అందుకే చక్కెరను పూర్తిగా తొలగించడం కంటే.. టీ, కాఫీ, స్వీట్లు వంటి వాటిలో మోతాదును క్రమంగా తగ్గించడం ఆరోగ్యకరమైన మార్గం.అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. బెల్లం, తేనె, ఖర్జూరం, ఎండు ద్రాక్ష వంటి వాటిలోనూ సహజ చక్కెరలు ఉంటాయి. కాబట్టి ఇవి చక్కెరకు ‘షుగర్-ఫ్రీ’ ప్రత్యామ్నాయాలు కావు. కేవలం రుచి, వంట విధానం లేదా తక్కువగా ప్రాసెస్ చేసిన పదార్థాల ఎంపిక కోసమే వీటిని ఉపయోగించాలి. పండుగ వేళ తీపి వంటకాలు చేసుకునేటప్పుడు పరిమాణాన్ని నియంత్రించడం కూడా అంతే ముఖ్యం. చక్కెర ధరలు పెరిగినా.. పండుగ తీపిని మాత్రం తగ్గించాల్సిన అవసరం లేదు. వంటకానికి సరిపోయే ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుని, తీపిని పరిమితంగా ఆస్వాదిస్తే సరిపోతుంది. -
ఒంటరిగా భోజనం చేస్తున్నారా?
కుటుంబంతో కలిసి రాత్రి భోజనం చేయడం, సహోద్యోగులతో మధ్యాహ్న భోజనం చేయడం, స్నేహితులతో కలిసి తినడం.. భోజనం పంచుకోవడం సాధారణ సామాజిక కార్యకలాపంగా కనిపిస్తుంది. అయితే కలిసి భోజనం చేయడం వల్ల సామాజిక అనుబంధానికి మించిన ప్రయోజనాలు ఉంటాయా అనే అంశంపై పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు. తరచుగా కలిసి భోజనం చేయడం మెరుగైన భావోద్వేగ శ్రేయస్సుతో సంబంధం కలిగి ఉండొచ్చని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. తరచూ ఒంటరిగా భోజనం చేయడం డిప్రెషన్, మెదడు ఆరోగ్యంలో మార్పులతో సంబంధం కలిగి ఉన్నట్లు గుర్తించారు.ఈ భావనను కమెన్సాలిటీ అంటారు. అంటే ఇతరులతో కలిసి ఆహారం తింటూ పంచుకోవడం. ఇతరులతో కలిసి కూర్చొని భోజనం చేస్తూ మాట్లాడటం, సంబంధాలను పెంపొందించుకోవడం, ఒంటరితనాన్ని తగ్గించుకోవడం. పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం.. భోజనం చేసే టేబుల్ చుట్టూ కూర్చోవడం వల్ల మాట్లాడుకోవడానికి, పరస్పరం అనుబంధం పెంచుకోవడానికి, సంబంధాలను బలపరచుకోవడానికి, ఒంటరితనం తగ్గించుకోవడానికి అవకాశం లభిస్తుంది. అయితే ఇప్పటివరకు ఉన్న చాలా ఆధారాలు కేవలం సంబంధాన్ని మాత్రమే చూపిస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంటే ఒంటరిగా భోజనం చేయడం వల్లే డిప్రెషన్, డిమెన్షియా లేదా మెదడులో మార్పులు నేరుగా వస్తాయని నిరూపించలేదు.కలిసి భోజనం చేస్తే మానసిక ఆరోగ్యం కలిసి భోజనం చేయడం మానసిక ఆరోగ్యానికి తోడ్పడవచ్చు. ముఖ్యంగా వృద్ధుల్లో కలిసి భోజనం చేయడం, భావోద్వేగ శ్రేయస్సు మధ్య సంబంధం ఉన్నట్లు పరిశోధనలు గుర్తించాయి. 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న 9,361 మంది మహిళలపై జరిగిన ఒక అధ్యయనంలో, భోజనం సమయంలో టేబుల్ చుట్టూ కూర్చునే వ్యక్తుల సంఖ్యకు డిప్రెషన్ వచ్చే ప్రమాదానికి మధ్య సంబంధం ఉన్నట్లు గుర్తించారు. ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, వారు ఒంటరిగా నివసిస్తున్నారా అనే అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత కూడా పరిశోధకులు ఈ సంబంధాన్ని గుర్తించారు.జపాన్‌లో జరిగిన మరో అధ్యయనం 65 నుంచి 74 ఏళ్ల వయసున్న వ్యక్తులను పరిశీలించింది. కుటుంబంతో కలిసి నివసిస్తున్నా తరచూ ఒంటరిగా భోజనం చేసే వృద్ధుల్లో, ఇతరులతో కలిసి భోజనం చేసే వారితో పోలిస్తే డిప్రెషన్ లక్షణాలు కనిపించే అవకాశం గణనీయంగా ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. కేవలం ఒకరితో కలిసి నివసించడం వల్ల లభించే సామాజిక ప్రయోజనం, నిజంగా కలిసి సమయం గడపడం వల్ల లభించే ప్రయోజనంతో సమానం కాకపోవచ్చని ఈ ఫలితాలు సూచిస్తున్నాయి.మెదడులో ఏం జరుగుతుంది?ఒంటరిగా భోజనం చేయడం దీర్ఘకాలిక మెదడు ఆరోగ్యంతో సంబంధం కలిగి ఉందా అనే అంశాన్ని కూడా శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. 2025లో జపాన్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో, తరచూ ఒంటరిగా భోజనం చేసే వ్యక్తుల్లో జ్ఞానపరమైన విధులకు సంబంధించిన కొన్ని మెదడు ప్రాంతాల్లో తక్కువ మెదడు పరిమాణం ఉన్నట్లు గుర్తించారు. ఇందులో హిప్పోకాంపస్, మధ్య టెంపోరల్ లోబ్ ఉన్నాయి. హిప్పోకాంపస్ అంటే జ్ఞాపకశక్తి, నేర్చుకోవడం వంటి విధుల్లో ముఖ్యమైన మెదడు భాగం.మధ్య టెంపోరల్ లోబ్ అంటే జ్ఞాపకశక్తి, సమాచారాన్ని అర్థం చేసుకోవడం వంటి మెదడు విధుల్లో కీలకంగా పనిచేసే ప్రాంతం.ఆహారం కారణంగా ఈ తేడాల్లో కొంత భాగం వివరించవచ్చని పరిశోధకులు తెలిపారు. ఎందుకంటే ఒంటరిగా భోజనం చేసే వ్యక్తులు తక్కువ పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకునే అవకాశం ఎక్కువగా ఉండవచ్చు. అయితే ఆహారం ఈ మొత్తం సంబంధాన్ని వివరించలేకపోయింది.ఇదీ చదవండి: జెన్ ఆల్ఫాతో మోదీ రాఖీ వేడుక.. హై-ఫైవ్‌లు ఇస్తూ -
నటి సమంత స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వర్కౌట్లు..! ఆ టైంలో చేయొచ్చా?
మా ఇంటి బంగారం మూవీతో మంచి హిట్ అందుకున్న నటి సమంత ప్రెగ్నెన్సీ సమయంలో కూడా క్రమం తప్పకుండా జిమ్‌కి వెళ్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అలాగే అనేకమంది సెలబ్రిటీలు గర్భధారణ అనేది రెస్ట్ తీసుకునే అనారోగ్యం లాంటిది కాదని, ఈ దశలో కూడా చురుగ్గా ఉండొచ్చని నిరూపిస్తున్నారు. ఆ కోవలోకి తాజాగా సమంత కూడా చేరిపోయారు. ఆమె జిమ్‌కి వెళ్లడం వరకు మాత్రమే కాదు, వెయిట్‌లిఫ్టింగ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వంటి వర్కౌట్లు చేసేస్తోంది. పైగా అందుకు సంబంధించిన వీడియోలు కూడా అభిమానులతో పంచుకున్నారామె. మొదటి వీడియోలో కేబుల్ రో వ్యాయామం చేసింది సమంత. దానికి క్యాప్షన్‌గా ఈ రోజు భిన్నమైన వర్కౌట్ చేశా. అయితే ఎక్కువగా కష్టపడకుండా, శ్రద్ధగా వినడం నేర్చుకున్నా అంటూ రాసింది. రెండొవ వీడియోలు బరువులు ఎత్తుతూ కనపించింది సమంత. ఈ సమయంలో ఎంత మేర ఎంతగలరో అంతే పైకి ఎత్తండి అని క్యాప్షన్ పెట్టింది. అలాగే తదుపరి పోస్ట్‌ల్లో కొన్ని రోజులు బలంగా ఉన్నట్లు భావిస్తా, అందుకే వ్యాయామాలు సవరించుకుంటానని పేర్కొంది. పైగా యోగా మ్యాట్‌పై పడుకుని చేసే వర్కౌట్లే కొన్ని రోజులు హాయిగా అనిపిస్తాయని సరదాగా వ్యాఖ్యానించింది. తన జీవితాంతం జిమ్‌లో మరింతగా చేయడానికి తన పరిమితులను అధిగమించడానికి శిక్షణ తీసుకున్నానని చెప్పుకొచ్చింది వీడియోలో. అయితే ప్రెగ్నెన్సీ దశలో శరీరాన్ని గౌరవించడం. శరీరం మాట వినడం వంటివి నేర్చుకున్నానని పోస్ట్‌లో వెల్లడించింది. అలాగే ఈ సమయంలో లక్ష్యాలు భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పటి వరకు చేసే అత్యంత బలమైన పని అమ్మ అవ్వడమేనని భావిస్తున్నానంటూ పోస్ట్‌ని ముంగించింది. అలాగే తన శక్తి శిక్షణా వ్యాయామాలు గురించి మాట్లాడుతూ..ఇవన్నీ తాను చాలా ఏళ్లుగా నిపుణుల పర్యవేక్షణలో శిక్షణ తీసుకుని మరి చేస్తున్నవని, అలాగే గర్భధారణకు అనుగుణంగా సవరించినవేనని కూడా ఆమె వెల్లడించింది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) అలాగే తన ట్రైనర్స్ ప్రతిష్టాత్మక సంస్థల్లో సర్టిఫికేట్ పొందినవారని, పైగా తన ఆరోగ్యానికి, గర్భధారణకు అనుగుణంగా నిర్ణయించిన వ్యాయామాలని కూడా పేర్కోంది. ఈ క్రమంలో అందరూ తప్పక తెలుసుకోవాల్సింది ఏంటంటే.. ప్రతి గర్భం భిన్నంగా ఉంటుందని, అందువల్ల ఇతర ప్రెగ్నెంట్ మహిళలెవ్వరూ తన వర్కౌట్లను అనుకరించొద్దని హెచ్చరించింది సమంత. తనలా వ్యాయామాలు చేయాలనుకుంటే వైద్యుడి సలహా సూచనల మేరకు చేయాలని విజ్ఞప్తి చేసిందామె. కాగా, సమంత రూత్ ప్రభు ఈ ఏడాది జూన్ మా ఇంటి బంగారం సక్సెస్ మీట్లో తన గర్భధారణ విషయాన్ని ప్రకటించారు. అందుకోసమే కొంతకాలం షూటింగ్‌లకు విరామం ఇస్తున్నానని కూడా పేర్కొంది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) (చదవండి: ఒకప్పుడు బాలీవుడ్ పనిచేసేదామె..సడెన్‌గా 29 ఏళ్లకే రిటైర్మెంట్! ఎందుకో తెలుసా..) -
63 కేజీల నుంచి 55 కేజీల బరువుకు..!నిలకడగా ఆ ఎనిమిది అలవాట్లు..
బరువు తగ్గాలంటే స్ట్రిక్ట్ డైట్, కఠినమైన వర్కౌట్లుతోనే సాధ్యం అనే అభిప్రాయాన్ని తుడిచిపెట్టేయండని అంటోంది ఈ కంటెంట్ క్రియేటర్ శివాని అగర్వాల్. రోజువారి అలవాటల్లో జస్ట్ చిన్న చిన్ని స్థిరమైన మార్పులతో ఈజీగా బరువు తగ్గొచ్చని నమ్మకంగా చెబుతోంది. తాను ఎనిమిది కేజీల బరువుని ఎనిమిది అలవాట్లతో తగ్గించానంటూ తన అనుభవాన్ని పంచుకున్నారామె. అదేంటో చూద్దామా..!.కంటెంట్ క్రియేటర్ శివాని అగర్వాల్ తన జీవనశైలిని పూర్తిగా మార్చుకోకుండానే బరువు తగ్గేందుకు ఉపయోగపడిన ఎనిమిది అవాట్ల గురించి మాట్లాడారు. తాను కేవలం ఆహారం, వ్యాయామాల పట్ల ఉన్న దృక్పథాన్నే మార్చుకున్నట్లు వెల్లడించారు. అయితే మార్పులు చేసిన వాటిని నిలకడగా అనుసరించానని అన్నారు. మరి ఆమె వెయిట్‌లాస్ జర్నీలో ఎనిమిది కేజీల బరువుకి చెక్‌పెట్టేందుకు హెల్ప్ అయిన ఎనిమిది అలవాట్లు లేక మార్పులు ఏంటో చూద్దామా..!జంక్ ఫుడ్‌ను పూర్తిగా మానేయవద్దుఏదైనా సరే పూర్తిగా మానేయొద్దని అంటోంది. నియంత్రించడం వల్ల తెలియకుండానే ఎక్కువ తినేస్తామని అన్నారు. తినాలి అనిపించినప్పుడూ జాగురకతతో హాయిగా ఆస్వాదించేదాన్ని అని అంటోంది. వాస్తవికంగా సాధ్యమయ్యే అవాట్లతోనే బరువు తగ్గడం అనేది జరగుతుందని చెబుతోంది ఈ ఇన్ఫ్లుయెన్సర్.ప్రతిరోజూ వాకింగ్..ఎల్లప్పుడూ పదివేల అడుగులు నడవాలనే ఒత్తిడి పెట్టుకోకూడదని, ప్రతి రోజు నడిచేలా చూస్తే చాలని అంటోంది. ఎందుకంటే తాను కొన్ని రోజులు తక్కువగానూ మరికొన్ని రోజులు మెరుగ్గా నడిచినట్లు వెల్లడించింది. అది క్రమంగా కొవ్వు తగ్గడానికి ఉపకరించిందని అంటోంది.రాత్రి భోజనంలో కార్బోహైడ్రేట్లు తగ్గించడంరాత్రిపూట అన్నం, రోటీ తీసుకోవడం తగ్గించి..గుడ్లు, పనీర్, పప్పు, చికెన్ వంటి ఆహారాల ద్వారా ప్రోటీన్ చేర్చుకున్నట్లు తెలిపింది.నెమ్మదిగా తినడం ప్రారంభించానుగతంలో తాను నిమిషాల్లోనే ఆహారం ముగించేసేదాన్ని అని చెప్పింది. అయితే నిధానంగా నెమ్మదిగా తినడం వల్ల కడుపు నిండిన అనుభూతిని ఆస్వాదించొచ్చని అంటోంది. ఎందుకంటే..కడుపు నిండిన సంకేతాలను మెదడుకు పంపడానికి సుమారు 20 నిమిషాలపైనే పడుతుంది.ప్రతి భోజనానికి ముందు నీళ్ళుఆమె భోజనానికి ముందు ఒక గ్లాసు నీళ్ళు తాగడాన్ని అలవాటు చేసుకుంది. ఈ చిన్న మార్పు, తినే ఆహార పరిమాణాన్ని సమర్థవంతంగా నియంత్రించుకోవడానికి సహాయపడుతుందని చెబుతోంది. ప్రతిరోజూ బరువు చూడొద్దు..శివాని ప్రతిరోజూ బరువు చూసుకోవడం మానేసినట్లు తెలిపింది. ఎందుకంటే అది మన మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అంటోంది.నిద్రవేళలను సరిచేసుకోవడంబరువు తగ్గాలనుకునే వారికి తగిన నిద్ర అత్యంత ముఖ్యమని నొక్కి చెబుతోంది. సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల మన జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపి ఆకలి కోరికలపై నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉందని అంటోందివాయిదాకు అవకాశం ఇవ్వకుండా..అయితే తినాలనిపించిన వాటిని దూరం పెట్టేలా వాయిదా వేయకుండా..ఒకవేళ్ల స్వీట్స్, లేదా జంక్‌ఫుడ్ లాంటి అనారోగ్యకరమైన అలవాట్లపై మనసు లాగితే..అయ్యే దూరం చేసుకున్నాననే భావం మనుసులో రాకుండా..ధైర్యంగా తినేసి..ముందుకు సాగిపోవడం నేర్చుకోవడం మంచిదని చెబుతోంది. ఎందుకంటే అది బాధకరమైన వెయిట్‌లాస్ జర్నీగా మారదని అంటోంది. ఇక్కడ శివాని చెప్పేది ఆరోగ్యకరమైన అలవాట్లనే హాయిగా తెలివిగా చేస్తే.. బరువు తగ్గడం కూడా ఒక ఎంజాయ్‌మెంట్‌గా మారుతుందని చెబుతోందామె. ఇంకెందుకు ఆలస్యం ప్రయత్నించి చూడండి మరి..!.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: Weight Loss Tips: జస్ట్ మూడు నెలల్లో 20 కేజీల బరువు..! ఐతే ఆహారంలో..) -
ఆస్బెస్టాస్తో ఇంత ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ఆస్బెస్టాస్.. ఒకప్పుడు నిర్మాణ రంగంలో విస్తృతంగా ఉపయోగించిన పదార్థం. అయితే దీని సూక్ష్మ నారకణాలను పీల్చడం ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ఆస్బెస్టాస్ అంటే ఏమిటి? అది మన శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? తెలుసుకుందాం..ఆస్బెస్టాస్ అనేది సహజంగా లభించే ఖనిజ సన్నని నారల సమూహం. ఇవి బలంగా ఉండటంతో పాటు వేడిని, మంటను తట్టుకోగలవు. అందుకే గతంలో సిమెంట్ షీట్లు, పైకప్పులు, సీలింగ్ టైల్స్, గోడలు, పైపులు, ఇన్సులేషన్ వంటి నిర్మాణాల్లో వీటిని విస్తృతంగా ఉపయోగించారు.అయితే భవనాలు, కట్టడాలు నిర్మించే లేదా కూల్చివేసే సమయంలో ఆస్బెస్టాస్ పదార్థాలు పగిలినా, రాపిడికి గురైనా.. వాటిలోని సూక్ష్మ నారకణాలు గాలిలో కలిసే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో మనుషులు వాటిని పీల్చితే అవి ఊపిరితిత్తుల్లోకి చేరి అక్కడే ఉండిపోవచ్చు. దీంతో దీర్ఘకాలంలో ఆస్బెస్టోసిస్, ఊపిరితిత్తుల క్యాన్సర్, మెసోథెలియోమా వంటి తీవ్రమైన వ్యాధుల ముప్పు పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.మెసోథెలియోమా అనేది ఆస్బెస్టాస్తో ముడిపడి ఉన్న అరుదైన క్యాన్సర్. ముఖ్యంగా ఊపిరితిత్తులను కప్పి ఉండే సన్నని పొరల్లో ఇది ఏర్పడుతుంది. దీని ప్రమాదం ఏమిటంటే.. ఒక వ్యక్తి ఆస్బెస్టాస్‌కు గురైన వెంటనే ఈ వ్యాధి లక్షణాలు బయటపడకపోవచ్చు. అయితే సంవత్సరాలు గడుస్తున్నాకొద్ది ఈ వ్యాధి తీవ్రత పెరిగి, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలు ఏర్పడవచ్చు. ఆస్బెస్టాస్ను గతంలో సిమెంట్ నిర్మాణ సామగ్రి, రూఫింగ్ షీట్లు వంటి వాటిలో విస్తృతంగా ఉపయోగించేవారు. ప్రస్తుతం అనేక దేశాల్లో దీని వినియోగంపై నిషేధాలు, కఠినమైన ఆంక్షలు ఉన్నాయి. అన్ని రకాల ఆస్బెస్టాస్లు క్యాన్సర్‌కు కారణమయ్యే పదార్థాలేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరిస్తోంది.అయితే ఆస్బెస్టాస్ ఖనిజ సూక్ష్మకణాలు ఎక్కువగా పాత పాఠశాలలు, పాడుబడ్డ ఇళ్లు, కార్యాలయాలు, ఫ్యాక్టరీలు వంటి పాత నిర్మాణాల్లో ఉండే అవకాశం ఉంది. ఆస్బెస్టాస్ పదార్థాలు దెబ్బతినకుండా ఉన్నంతవరకు వెంటనే ప్రమాదం ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే పాడుబడ్డ పాత నిర్మాణాల్లోని అనుమానాస్పద పదార్థాలను స్వయంగా పగలగొట్టడం, డ్రిల్ చేయడం లేదా తొలగించడం చేయకూడదు.ముఖ్యంగా ఆస్బెస్టాస్ ఉందని చూసి గుర్తించడం సాధ్యం కాకపోవచ్చు. అయితే అలాంటి పదార్థాలు కనిపిస్తే వాటిని తాకకుండా సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. -
జస్ట్ మూడు నెలల్లో 20 కేజీల బరువు..! ఐతే ఆహారంలో..
బరువు తగ్గడం అంటే అత్యంత కష్టమైన పని కాదని..సునాయాసం ఎంజాయ్ చేస్తే తగ్గొచ్చని చూపిస్తున్నారు పలువురు. అందుకు క్రమశిక్షణ, నిలకడ తోపాటు ఆహారంపై మంచి స్పృహ కూడా కలిగి ఉండటం అత్యంత ప్రధానం. అచ్చం అలానే తూచా తప్పకుండా అనుసరించి జస్ట్ మూడు నెలల్లో కిలోలు కొద్దీ బరువు తగ్గి అందర్నీ ఆశ్చర్యపర్చింది ఈ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్. ఆమె బరువుని తగ్గించుకోవడంలో హెల్ప్ అయిన ఫిట్నెస్ మంత్ర ఏంటో సవివరంగా చూద్దామా..!.ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ జ్యోతి ఉపాధ్యాయ్ ఒక సాధారణ ఫిట్నెస్ మంత్రాని అనుసరించినట్లు వెల్లడించింది. అదే ఆమెకు మూడు నెలల్లో 20 కిలోలు పైనే తగ్గడానికి సహాయపడినట్లు పేర్కొంది. తాను క్రమం తప్పని వ్యాయామం, ఇంట్లో చేసిన సాధారణ భోజనం తదితరాలన్నింటిని నిలకడగా చేయడం వంటి వాటిపై దృష్టిపెట్టినట్లు తెలిపింది. అంతేగాదు భారతీయ ఆహారంలో సులభంగా లభించే, అత్యంత సుపరిచితమైన పదార్థాలనే తన డైట్లో చేర్చుకున్నట్లు వెల్లడించింది. అలాగే తాను వ్యాయామం చేసేముందు తప్పనిసరిగా స్వెట్ బెల్ట్ ధరిస్తానని తెలిపింది. అలాగే తన తాజా వర్కౌట్లలో 95 కేజీల డెడ్‌లిఫ్ట్‌ను కూడా పూర్తి చేసినట్లు పేర్కొంది. క్రమం తప్పని శిక్షణతో తన బలం నెమ్మదిగా మెరుగుపడుతోందని అంటోంది. ఇక ఆహారం విషయానికొస్తే..ఎండుద్రాక్ష, ఓట్స్, ఇంట్లోనే తయారుచేసే పనీర్ తీసుకుంటానని చెప్పుకొచ్చింది. అలాగే మధ్యాహ్న భోజనంలో రోటీలు, పెరుగు, కూరగాయలు, సలాడ్, పనీర్ కూర, రాత్రి భోజనంలో తేలికగా ఉండేలా బొప్పాయి మాత్రమే తీసుకుంటానని పేర్కొంది.ఇక్కడ తనకు 20 కేజీల బరువు తగ్గడం అనేది క్రమం తప్పని వ్యాయామాలు, నియంత్రిత ఆహారం, నిలకడగా పాటించే దినచర్యల వల్లే సాధ్యమైందని అంటోంది. తక్కువ కేలరీలు తీసుకుంటూ..శారీరకంగా చురుకుగా ఉన్నప్పుడే బరువు తగ్గడం సులభమవుతుందని నొక్కి చెబుతోంది. ముఖ్యంగా తగినంత నీరు తాగడం, పీచుపదార్థాలు అధికంగా ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వంటివి బరువు తగ్గడానికి ఎంతగానో ఉపకరిస్తాయని చెబుతోందామె. చివరగా వెయిట్‌లాస్ జర్నీలో సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామాలు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లే సరైనవని నొక్కి చెప్పింది ఇన్ఫ్లుయెన్సర్ జ్యోతి. View this post on Instagram A post shared by ज्योति🖤 (@jyotii_upadhyay9)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: తొలి అడుగుల నుంచి.. ఫస్ట్ ఫ్లైట్ జర్నీ వరకు..! కుమార్తె భావోద్వేగ పోస్ట్ -
కళ్లలోంచి తొంగిచూస్తే గుండె కనిపిస్తుందా?
గుండెల్లో ఏముందో కళ్లలో తెలుస్తుంది.... అంటూ ఏదో తెలుగు సినిమా పాట ఉంది. కవుల ఊహలు ఎలా నిజమవుతాయో ఈ పాట పల్లవితో తెలుస్తుంది. ఎందుకంటే... కళ్లతో అన్నీ చూడవచ్చు. అంతేకాదు... కళ్ల సహాయంతో గుండెనీ చూడవచ్చని కొన్ని తాజా పరిశోధన ఫలితాలూ చెబుతున్నాయి.అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్)కు చెందిన నేషనల్ హార్ట్, లంగ్ అండ్ బ్లడ్ ఇన్స్టిట్యూట్ (ఎన్హెచ్ఎల్బీఐ) వర్క్‌షాప్‌కు చెందిన ‘నేచర్ రివ్యూస్ కార్డియాలజీ రోడ్‌మ్యాప్’ ప్రకారం రెటీనాలో కనిపించే బయోమార్కర్స్ సహాయంతో కరోనరీ హార్ట్ డిసీజ్, హార్ట్ ఫెయిల్యూర్స్ వంటి పరిస్థితులు, స్ట్రోక్ వంటి వాటి విషయంలో ఒక అంచనాకు రావడం సాధ్యమని తెలుస్తోంది. కానీ ఈ ప్రక్రియ ఇంకా పూర్తిగా గుండె పరీక్షలకు ఓ రొటీన్ ప్రత్యామ్నాయంగా మాత్రం లేదు. అయితే భవిష్యత్తులో కంటి సహాయంతో గుండె ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి కన్ను ఓ గవాక్షంగా మరే అవకాశం ఉంటుందంటున్నారు పరిశోధకులు.ఒక్కసారి ఓ సీన్ ఊహిద్దాం. ఒక వ్యక్తి తన గుండె పరీక్ష కోసం గుండె వైద్య నిపుణుడి (కార్డియాలజిస్ట్) దగ్గరికి వెళ్తాడు. ఆ కార్డియాలజిస్ట్ మాత్రం ముందుగా ఒకసారి కంటివైద్య నిపుణుడి (ఆఫ్తాల్మాలజిస్ట్) దగ్గరికి వెళ్లి సంప్రదించమని అంటాడు. అలాగే ఒక వ్యక్తి కంటి పరీక్ష కోసం ఆఫ్తాల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్లినప్పుడు... రెటీనాలోని రక్తనాళాల్లో కొన్ని మార్పులు చూసి ఆ కంటి వైద్యనిపుణుడు కూడా ఒకసారి కార్డియాలజిస్ట్‌ను కలవమంటూ సూచించవచ్చు కూడా. ఊహకు అందే విషయమేనా? ఎందుకంటే... కంటి పరీక్ష కూడా గుండె ఆరోగ్య అంచనాల్లో ఒక భాగమయ్యే రోజు రావచ్చంటూ చెబుతున్నాయి వైద్య వర్గాలు. అది ఎందుకు, ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.కంటి వెనుక భాగంలో ఉండే రెటీనా మన శరీరంలోని అత్యంత సూక్ష్మమైన రక్తనాళాలను ప్రత్యక్షంగా చూడగలిగే కీలకమైన ప్రదేశం. అదీ పెద్ద కోత లేకుండా, ఇంజెక్షన్ వంటి పరికరాలతో రక్తాన్ని లాగకుండా, దేహంలోకి ఎలాంటి పరికరాన్నీ పంపకుండానే ఈ పరీక్షలు సాధ్యం. అందుకే రెటీనాను కొందరు పరిశోధకులు ‘గుండె తాలూకు కిటికీ’గా చూస్తున్నారు. ఇంగ్లిష్‌లో చె΄్పాలంటే ‘ఎ విండో టు ద బాడీస్ వాస్క్యులార్ హెల్త్’ అంటూ చెబుతున్నారు.కంట్లో డాక్టర్ ఏం చూస్తారంటే...రెటీనాను పరిశీలించే డాక్టర్లు కేవలం ‘చూపు బాగుందా?’ అని మాత్రమే కాకుండా చాలా అంశాలు పరిశీలిస్తారు. ఉదాహరణకు... రక్తనాళాలకు సంబంధించి...- వాటి వెడల్పు / వ్యాసం- ఏ మేరకు సన్నబడ్డాయి- మెలికలు- శాఖలుగా విడిపోయిన తీరు (బ్రాచింగ్ ప్యాటర్న్)- ధమని – సిరల (ఆర్టరీ వీన్) సంబంధం- కనీకనిపంచకుండా సూక్ష్మస్థాయిలో అయ్యే రక్తస్రావాలు- రెటీనాకు సంబంధించిన ఇతర మార్పులేవైనా ఉన్నాయా... లాంటి అనేక విషయాలను పరిశీలిస్తారు. ప్రస్తుతం జరిగిన పరిశోధనల్లో బాధితుల్లో అంటే... డయాబెటిస్, హైబీపీ, కరొనరీ ఆర్టరీ డిసీజ్, హార్ట్ ఫెయిల్యూర్, పక్షవాతం వంటి జబ్బులు వచ్చినవారిలో రెటినాకు సంబంధించిన రక్తనాళాల్లోనూ మార్పులు కనిపించాయి. అంటే... దీన్ని బట్టి తెలిసేదేమిటంటే... కంటి వెనకాల ఉండే అతి చిన్న రక్తనాళాలు దేహంలో ఉన్న గుండె తదితర రక్తనాళాల్లో వచ్చిన మార్పులను సూచిస్తూ ఒక ‘రివ్యూ’ లాంటివి ఇవ్వగలవని తెలుస్తోంది.అసలు కంటికీ గుండెకీ సంబంధం ఏమిటి?గుండె రక్తాన్ని పంపుతుంది. ఆ రక్తం శరీరమంతా ప్రయాణిస్తుంది. మెదడు, మూత్రపిండాలు, గుండె, కాళ్లు... ఇలా దేహంలోని అన్ని చోట్లా రక్తనాళాలు ఓ నెట్వర్క్లా అల్లుకుపోయి ఉంటాయి. అలాగే కంటి వెనుక ఉండే రెటీనాలోనూ కూడా అతి సూక్ష్మమైన ధమనులూ, సిరలూ, వెంట్రుకలంత సన్నగా ఉండే క్యాపిల్లరీస్ ఉంటాయి. దేహంలోని రక్తనాళ వ్యవస్థలో జరిగే కొన్ని మార్పుల ప్రభావం రెటీనాలోని అతి సన్నటి రక్తనాళాల్లో ప్రతిబింబించే అవకాశముందన్నది పరిశీలకుల భావన.అంటే... బ్రాడ్‌గా చె΄్పాలంటే... గుండెలోని పెద్ద రక్తనాళాల్లో ఏం జరుగుతుందనేది... రెటీనాలో ఉండే అతి సన్నటి ధమనులూ, సిరలూ, క్యాపిల్లరీలలో తెలియవచ్చన్నది వైద్యపరిశోధకుల మాట. గుండె పెద్ద రక్తనాళాల్లో ఏం జరుగుతుందన్న విషయాలు కంట్లోని చిన్న రక్తనాళాల్లో ఓ మినియేచర్‌లా కనిపించే అవకాశముంటుందన్నమాట. మరీ ముఖ్యంగా డయాబెటిస్, హైపర్‌టెన్షన్ లాంటి వ్యాధులున్నవాళ్లలో గుండెకు జరిగే నష్టాలూ, ఒనగూరే అనర్థాలను వైద్యపరిశోధకులు చాలాకాలంగానే గమనిస్తున్నారు.మరి... అధిక రక్తపోటు కంట్లో ఎలా కనిపిస్తుంది?ఓ వ్యక్తిలో రక్తపోటు (బీపీ) చాలా ఎక్కువగా ఉందని అనుకుందాం. దాంతో అతడి రక్తనాళాల గోడలపై నిరంతరం ఎక్కువ ఒత్తిడి పడుతుంటుంది. ఫలితంగా అతడి రెటీనాకు సంబంధించిన రక్తనాళాల్లో (రెటినల్ వెసెల్స్‌లో) మార్పులు రావచ్చు. ఇలా జరగడంతో వచ్చిన మార్పుల తాలూకు దుష్ప్రభావాలను ‘హైపర్టెన్సివ్ రెటినోపతి’ అంటారు. అందుకే కొన్నిసార్లు కంటి పరీక్షలో కనిపించే రెటినల్ మార్పుల ద్వారా ఒక వ్యక్తికి హైబీపీ ఉండవచ్చనే ఆధారం దొరకవచ్చు.ఇక్కడ బాగా నైపుణ్యం ఉన్న ఓ కంటి డాక్టర్... తన పేషెంట్‌కు హైబీపీ ఉందనే విషయాన్ని కంట్లోకి చూసి చెప్పగలడు. అంటే... ‘బీపీ మెషిన్‌ను చేతికి కడితేగానీ బీపీ తెలియదు... కానీ... ఏ మెషిన్‌నూ కట్టకుండానే... కంట్లోకి తొంగిచూసేసి డాక్టర్లు బీపీని కనిపెట్టవచ్చు’. కాకపోతే... ఇలా చూసినంతమాత్రానే ఓ పేషెంట్‌కు హైబీపీ ఉందని కంటి డాక్టర్ నిర్ధారణ చేయడు. ఆ అంశాన్ని ఒక క్లూ గా పరిగణించి, మళ్లీ తగిన పరీక్షలు చేశాకే పేషెంట్‌కు హైబీపీ ఉందని డాక్టర్లు నిర్ధారణ చేస్తారు.గుండె జబ్బు ఉన్నవాళ్ల కంట్లో ఏమి కనిపించవచ్చు?ఇప్పటికి కంట్లోకి చూడటం ద్వారా...- రెటినల్ వాస్క్యులార్ మార్పులతో – హైబీపీ నీ - డయాబెటిక్ రెటినల్ మార్పులతో – డయాబెటిస్‌నూ - కొన్ని రెటినల్ మైక్రో వ్యాస్క్యులార్ ప్యాటర్న్స్‌తో – కరోనరీ ఆర్టరీ డిసీజ్నూ- రెటినల్ వాస్క్యులార్ మార్పులతో – హార్ట్ ఫెయిల్యూర్‌నూ- రెటినల్ మైక్రో వాస్క్యులార్ అబ్నార్మాలిటీస్తో – పక్షవాతం (స్ట్రోక్)... వంటి అంశాలను గుర్తుపట్టినంత మాత్రాన ‘మీ కంట్లో ఈ తరహా మార్పు ఉంటే మీకు గుండెజబ్బు ఉన్నట్టే’ అని చెప్పడం మాత్రం సరికాదు. కాకపోతే ‘కొన్ని రకాల రెటినల్ మార్పులు కొన్ని అంశాలను సూచిస్తాయి’ అనే క్లూస్ ఆధారంగా భవిష్యత్తులో రాబోయే అనేక గుండె తాలూకు ముప్పులను ముందుగానే పసిగట్టడానికీ లేదా అంచనా వేయడానికి కన్ను ఓ హై–వే అవుతుందని మాత్రం చెప్పవచ్చు.మరి డయాబెటిస్ విషయమో...?మధుమేహం (డయాబెటిస్) విషయంలో కన్ను చెప్పే కథ ఇంకా ఆసక్తికరంగా, బలంగానూ ఉంటుంది. మధుమేహం వల్ల రెటీనాలోని అతి సూక్ష్మమైన రక్తనాళాలు దెబ్బతినడం వల్ల ‘డయాబెటిక్ రెటినోపతి’ అనే వైద్యసమస్య వస్తుందన్న విషయం కొంతమందికి తెలిసినప్పటికీ... చాలామందికి... ముఖ్యంగా పెద్దగా చదువుకోని పల్లెవాసులకూ, అంతగా వైద్యపరిజ్ఞానం లేనివారికి తెలియదు. కాబట్టి ఇలాంటి డయాబెటిస్ బాధితులకు చేసే కంటి పరీక్షల్లో కేవలం ‘కంటి చూపు ఎంత ఉంది?’ అని కాకుండా రక్తనాళాల్లో దీర్ఘకాలంగా ఉన్న అధిక చక్కెర స్థాయులు... కంటిలోని అతి చిన్న సూక్ష్మమైన రక్తనాళాలపై ఏ మేరకు దుష్ప్రభావం చూపాయి అన్న పరీక్ష కూడా! అలా డయాబెటిస్ ప్రభావాన్నీ కంటిలోకి చూసి అంచనా వేస్తారు.శరీరంలో ఎక్కువకాలంగా ఉన్న అధిక రక్తచక్కెర చిన్న రక్తనాళాలను ఎంత ప్రభావితం చేసిందో తెలుసుకునే ఒక ముఖ్యమైన మార్గం కూడా. డయాబెటిస్ అన్నది అతి చిన్న రక్తనాళాలపై ఎలాంటి ప్రభావం చూపిందో తెలుసుకోవడం ద్వారా దేహంలోని పెద్ద రక్తనాళాల ఆరోగ్యం గురించి కూడా మనకు కొన్ని సంకేతాలు ఇస్తుందంటూ గ్రహించగలరు. అందుకే ‘డయాబెటిక్ రెటినోపతీ తాలూకు తీవ్రతకూ... కార్డియోవాస్క్యులార్ సమస్యల తీవ్రతకూ ఉన్న సంబంధంపై కూడా కొందరు అధ్యయనవేత్తలు సునిశితంగా పరిశోధనలు చేస్తున్నారు.ఇప్పుడు... కృత్రిమ మేధ తోడ్పాటు కూడా... ఇప్పటివరకూ రెటీనా తాలూకు రక్తనాళాల చిత్రాలను చూసి డాక్టర్లు విశ్లేషిస్తూ వచ్చారు. అయితే ఇటీవల కృత్రిమ మేధ (ఏఐ) రంగంలోకి వచ్చాక.. అవే ఫోటోలను ఏఐ చేత కూడా విశ్లేషణ చేయిస్తున్నారు. సాధారణ మనుషులుగా డాక్టర్లు కొంత ఓ మేరకు విశ్లేషించగలిగితే... ఏఐకి అప్పటికే లక్షల సంఖ్యలో ఇచ్చిన డేటా అధారంగా అది... వేలాది అతి చిన్న ప్యాటర్న్‌లను కూడా విశ్లేషించగలదు. ఉదాహరణకు ఏఐ ఆధారంగా...రక్తనాళాలు ఏ మేరకు వెడల్పు అయ్యాయి.అవి ఎంతగా శాఖోపశాఖలుగా విస్తరించాయి (బ్రాంచింగ్ జరిగింది)ఎంతగా మెలికలు /ముడతలు/ఒంపులు తిరిగాయి (టార్టస్ అయ్యాయి)రక్తనాళాల్లోని ఏ ్రపాంతంలో వాటి మందం బాగా పలుచబడింది (వెసెల్ డెన్సిటీ తగ్గింది)... ఇలాంటి అనేక ఫీచర్లను ఏఐ తాలూకు మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ద్వారా అవి విశ్లేషించడం మొదలు పెట్టేలా అనేక ఏఐ మోడల్స్‌ను అభివృద్ధిపరచే పనుల్లో ఇప్పుడు పరిశోధకులు ఉన్నారు.అబ్బురపరిచే విషయాలు అనేకం...2025లో ప్రచురితమైన ఒక వైద్యపరమైన సమీక్ష (స్కోపింగ్ రివ్యూ)లో 21 రెటినల్ అధ్యయనాలను పరిశోధకులు పరిశీలించారు. ఆ పరిశోధనల్లో కొన్ని ఏఐ తాలూకు అధ్యయనాలు చెప్పిన అంశాలివి...పదేళ్లలో ‘అథెరో స్కి›్లరోటిక్ కార్డియోవాస్క్యులార్ డిసీజ్’ అనే గుండెజబ్బు ముప్పు ఎంత ఉండవచ్చో తెలుసుకోవడం.కరొనరీ ఆర్టరీ డిసీజ్ (సీఏడీ) అనే గుండెజబ్బును కనిపెట్టడంభవిష్యత్తులో రాబోయే పెద్ద పెద్ద గుండెజబ్బులను (మేజర్ కార్డియోవాస్క్యులార్)ను ముందుగానే పసిగట్టడం వంటి అంశాలు చాలా ఆశాజనకమైన ఫలితాలు ఇచ్చాయి.ఈ పనిలో చాలా మెరుగైన ఖచ్చితత్వాన్ని చూపించాయి. దాంతో మున్ముందు గుండెజబ్బులను ఇంకా త్వరగా, ఇంకా సమర్థంగా, చాలా ముందుగానే పసిగట్టవచ్చనే ఆశాభావం పెరుగుతోంది. ఈ మేరకు ఇంకా క్లినికల్ ట్రయల్స్, ప్రమాణికాల రూపకల్పన అవసరం. అయితే ఇప్పటికి మాత్రం డాక్టర్లు.. ఆ ఏఐ విశ్లేషణను పూర్తిగా నమ్మకుండా, వాటిపైనే పూర్తిగా ఆధారపడకుండా... మళ్లీ తమవైన పరీక్షలూ, విశ్లేషణల ఆధారంగా అప్పుడు మాత్రమే తుది నిర్ధారణకు వస్తారు/వస్తున్నారు. ఓసీటీఏ అనేది మరో అద్భుతమైన సాంకేతికత...ఓసీటీఏ అనేది... ‘ఆప్టికల్ కొహెరెన్స్ టోమోగ్రఫీ యాంజియోగ్రపీ’ అనే ఇంగ్లిష్ పదాల తాలూకు సంక్షిప్త రూపం. సాధారణంగా ఫండస్ అనే కంటి పరీక్షలో వచ్చే ఫండస్ ఫొటోగ్రాఫ్‌లో రెటీనా కనిపిస్తుంది. ‘ఆప్టికల కొహెరెన్స్ టోమోగ్రఫీ’లో రెటీనా తాలూకు ΄÷రలను చాలా సూక్ష్మస్థాయిలో చూడటం సాధ్యమవుతుంది. అయితే ‘ఓసీటీఏ’లో రెటీనాలోని అత్యంత సన్నటి రక్తనాళాల్లో జరిగే రక్తప్రసరణ గురించి చాలా సునిశితమైన వివరాలు ఉంటాయి. 2025లోని ఓ అధ్యయనంలో రెటీనాలోని అత్యంత సూక్ష్మ రక్తనాళాలకూ, గుండెజబ్బులకూ (కార్డియో వాస్క్యులార్ డిసీజ్)కూ ఉన్న సంబంధాలను విశ్లేషించడం, సమీక్షించడం చేశారు. ఆ సమీక్షలో తెలిసినదేమిటంటే... భవిష్యత్తులో కంట్లోని అతి సూక్ష్మ రక్తనాళాల మ్యాపింగ్‌ను బట్టి అవి దేహంలోని గుండె ఆరోగ్యానికి క్లూస్ ఇస్తాయనే కాన్సెప్ట్‌కు మరింత బలం చేకూరుతుందని అధ్యయనవేత్తలు అంచనా వేస్తున్నారు.గుండె పరీక్షలు వర్సెస్ కంటి సూక్ష్మరక్తనాళాల పరిశీలన...- ఈసీజీ - ఎకో కార్డియోగ్రామ్ - టీఎమ్‌టీ - సీటీ కరోనరీ యాంజియోగ్రఫీ - కార్డియాక్ ఎమ్మారై - కొన్ని రకాల రక్త పరీక్షలు...ఇలాంటి గుండె తాలూకు వైద్యపరీక్షలన్నీ గుండెను లేదా కార్డియోవాస్క్యులార్ సిస్టమ్‌ను వేర్వేరు కోణాల్లో పరిశీలించి వేర్వేరు అంశాలను తెలుసుకుంటాయి లేదా గుండె ఆరోగ్యాన్ని అంచనా వేస్తాయి. అయితే రెటీనా మాత్రం తనలోని అత్యంత సూక్ష్మమైన రక్తనాళాల్లో జరిగే రక్తప్రసరణ (మైక్రోసర్క్యులేషన్) ఆధారంగా గుండె తాలూకు అనేక అంశాలను డాక్టర్లకు తెలియపరుస్తుందని చెప్పవచ్చు.దీన్ని బట్టి తెలిసేదేమిటంటే... భవిష్యత్తులో ఎవరైనా ఓ పేషెంట్ తన కళ్లను పరీక్షించుకోడానికి ఓ కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే... ఆయన కంటిని పరీక్షించి, దానికి తగిన చికిత్స ఇవ్వడంతో పాటు... ఆ డాక్టర్ మరో అదనపు సేవనూ అందించడానికి అవకాశముంది. అదేమిటంటే... ‘మీరొకసారి కార్డియాలజిస్ట్‌ను కలిసి... ఆయన సూచనల మేరకు కొన్ని గుండె పరీక్షలూ చేయించుకొని కార్డియాక్ ఎవాల్యూయేషన్ చేయించుకోండి’’ అని సూచించవచ్చు.చివరగా... ఇప్పటికి ఈ కంటి పరీక్షలన్నవి గుండె పరీక్షకు ప్రత్యామ్నాయం కాదు గానీ... మన కన్ను అనేది గుండె–రక్తనాళా వ్యవస్థలో దాగి ఉన్న కొన్ని సంకేతాలను ముందుగానే చూపించే ‘కిటికీ’ అని మాత్రం చెప్పవచ్చు. అంటే ఒకనాటికి కంటి పరీక్ష అంటే కేవలం చూపును పరీక్షించడం మాత్రమే కాకుండా... మన మొత్తం రక్తనాళాలతో పాటు గుండెనూ, దాన్ని ఆరోగ్యాన్ని అంచనా వేసేందుకూ ఉపయోగపడే అంశమని మాత్రం చెప్పవచ్చు.- డాక్టర్ ఎం.ఎస్.ఎస్. ముఖర్జీ, సీనియర్ కార్డియాలజిస్ట్నిర్వహణ: యాసీన్ -
అది మలబద్ధకమేనా? పిల్లలు ఎందుకు ఆపుకుంటారు ?
మా ఐదేళ్ల బాబుకు రోజూ మలవిసర్జన కావడం లేదు. రెండు మూడు రోజులకు ఒకసారి వెళతాడు. మలవిసర్జనకి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ, నొప్పిగా ఉందని ఏడుస్తాడు. ఇంట్లో వాళ్లు పిల్లాడు మొండిగా చేస్తున్నాడంటున్నారు. ఇంకొందరు ఇది మలబద్ధకమే అంటున్నారు. ఏం చేయాలి? – లక్ష్మి, గుంటూరుమీ సందేహం చాలా సహజం. పిల్లలకు మలవిసర్జన సరిగ్గా రాకపోతే తల్లిదండ్రులు ముందుగా ఆందోళన పడేది ఇదే. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. రోజూ మలవిసర్జన రాకపోవడం ఒక్కటే మలబద్ధకం కాదు. కొంతమంది పిల్లలకు రోజూ రావచ్చు; మరికొందరికి రెండు రోజులకు ఒకసారి రావచ్చు. మలం మెత్తగా ఉండి, పిల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తుంటే పెద్దగా ఆందోళన అవసరం లేదు. కానీ మలం చాలా గట్టిగా ఉండటం, మలవిసర్జన చేసేటప్పుడు నొప్పి రావడం, బాగా ఒత్తిడి చేయాల్సి రావడం, మలం పూర్తిగా బయటకు రాకపోవడం, పిల్లలు కావాలనే మలవిసర్జన ఆపుకోవడం వంటి లక్షణాలు ఉంటే మాత్రం మలబద్ధకం గురించి ఆలోచించాలి.పిల్లలుఎందుకు ఆపుకుంటారు?ఇక్కడే చాలామంది తల్లిదండ్రులు పిల్లలను తప్పుగా అర్థం చేసుకుంటారు. పిల్లాడు కావాలనే మలవిసర్జన ఆపుకుంటున్నాడని, మొండితనం చేస్తున్నాడని అనుకుంటారు. కానీ చాలా సందర్భాల్లో అసలు కారణం నొప్పి భయం. ఒకసారి మలం చాలా గట్టిగా వచ్చి నొప్పి కలిగితే, మళ్లీ విసర్జన చేస్తే అదే నొప్పి వస్తుందని పిల్లలు భయపడతారు. అందుకే మలవిసర్జన వచ్చినా ఆపుకుంటాడు. అలా ఆపుకోవడంతో మలం మరింత గట్టిగా మారుతుంది. తర్వాత విసర్జన చేసేటప్పుడు ఇంకా ఎక్కువ నొప్పి వస్తుంది. దీంతో మళ్లీ ఆపుకుంటాడు. ఇలా నొప్పి, భయం, విసర్జన ఆపుకోవడం ఒక చక్రంలా మారుతుంది. అందుకే పిల్లలను తిట్టడం లేదా బలవంతంగా మరుగుదొడ్డిపై కూర్చోబెట్టడం సమస్యను మరింత పెంచవచ్చు. ముందుగా పిల్లవాడు ఎందుకు మలవిసర్జన ఆపుకుంటున్నాడో అర్థం చేసుకోవాలి.పండ్లు పెడితే తగ్గిపోతుందా?పండ్లు, కూరగాయలు, పీచు ఎక్కువగా ఉండే ఆహారం మలబద్ధకం తగ్గడానికి సహాయపడుతుంది. కానీ కేవలం పండ్లు పెట్టడంతోనే సమస్య వెంటనే పూర్తిగా తగ్గిపోతుందని అనుకోకండి. పిల్లల ఆహారంలో పండ్లు, కూరగాయలు, పప్పులు, సంపూర్ణ ధాన్యాలు వంటి పీచు పదార్థాలు ఉండేలా చూడాలి. అలాగే పిల్లలకు సరిపడా నీరు అందాలి. రోజూ కొంతసేపు ఆడుకోవడం, నడవడం వంటి శారీరక కదలికలు కూడా అవసరం.పాలు ఇస్తే బలంగా పెరుగుతారా?పాలు పిల్లల ఎదుగుదలకు అవసరమే. కానీ అవసరానికి మించి పాలు మాత్రమే ఇస్తూ, ఇతర ఆహారాన్ని తగ్గించడం మంచిది కాదు. అలా చేస్తే పీచు పదార్థాలు తక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే పాలు మాత్రమే కాకుండా పండ్లు, కూరగాయలు, పప్పులు, ధాన్యాలతో కూడిన సమతుల ఆహారం ఇవ్వాలి.అలవాటు కూడా ముఖ్యమే?ముఖ్యంగా ఉదయం అల్పాహారం తర్వాత పిల్లలను కొంతసేపు ప్రశాంతంగా మరుగుదొడ్డిపై కూర్చోబెట్టే అలవాటు చేయవచ్చు. తొందరపెట్టకుండా, భయపెట్టకుండా ప్రశాంతంగా ఉండేలా చూడాలి. మరుగుదొడ్డిపై కూర్చున్నప్పుడు పిల్లల కాళ్లు వేలాడకుండా కింద చిన్న పీట ఉంచితే మంచిది. కాళ్లకు సరైన ఆధారం ఉండటం వల్ల మలం సులభంగా బయటకు రావడానికి సహాయపడుతుంది.మలవిసర్జన చేయకపోతే తిట్టాలా? అసలు వద్దు. మలబద్ధకంలో పిల్లలను తిట్టడం, అవమానించడం, బలవంతం చేయడం వల్ల వాళ్లలో మలవిసర్జన చేయడంపై భయం మరింత పెరగవచ్చు. బదులుగా పిల్లలను ప్రోత్సహించాలి. విసర్జన చేయడానికి ప్రయత్నించినా ప్రశంసించాలి. సమస్య గురించి పిల్లలతో ఓపికగా మాట్లాడాలి.మందులు ఇవ్వొచ్చా?అవసర మైనప్పుడు వైద్యుల సూచనతో మందులు ఇవ్వవచ్చు. ముఖ్యంగా మలం చాలా గట్టిగా ఉండి పిల్లలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నప్పుడు లేదా సమస్య పదేపదే వస్తున్నప్పుడు వైద్యుడు తగిన చికిత్స సూచించవచ్చు. అయితే ఇంట్లో పెద్దలకు ఉపయోగించిన మందులను పిల్లలకు స్వయంగా ఇవ్వకండి. అలాగే ఎవరో చెప్పారని మలబద్ధకం మందులు మొదలుపెట్టి, సమస్య తగ్గగానే మీకు మీరే ఆపేయడం కూడా మంచిది కాదు. పిల్లల వయసు, బరువు, సమస్య తీవ్రతను బట్టి చికిత్స మారుతుంది.వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?పుట్టినప్పటి నుంచే తీవ్రమైన మలబద్ధకం ఉండటం, పుట్టిన తర్వాత మొదటి రెండు రోజుల్లో మలం రాకపోవడం, పొట్ట ఎక్కువగా ఉబ్బడం, తీవ్రమైన పొట్ట నొప్పి, పదేపదే వాంతులు, మలంలో రక్తం కనిపించడం, బరువు సరిగా పెరగకపోవడం, జ్వరం, పిల్ల చాలా నీరసంగా కనిపించడం లేదా ఇంట్లో తీసుకున్న జాగ్రత్తలతో సమస్య తగ్గకుండా పదేపదే వస్తుండటం వంటి లక్షణాలు ఉంటే పిల్లల వైద్యుడిని సంప్రదించాలి.చివరగా ఒక మాట... పిల్లవాడు విసర్జన ఆపుకుంటున్నాడంటే ముందుగా అతను ఎందుకు అలా చేస్తున్నాడో తెలుసుకోండి. చాలాసార్లు దాని వెనుక మొండితనం కాదు. నొప్పి, ఆ నొప్పిపై భయం ఉంటాయి. ఆ భయాన్ని అర్థం చేసుకోండి. మలబద్ధకాన్ని చిన్న సమస్యగా కాకుండా.. పిల్లల మాట వినండి, కారణాన్ని అర్థం చేసుకోండి, సరైన సమయంలో పరిష్కరించండి.- డా. కె. పవన్ కుమార్, సీనియర్, పీడియాట్రిషియన్, పీడియాట్రిక్ అలర్జిస్ట్, ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్ -
ఆమె అందరిలాంటి బామ్మ కాదు..! 44 ఏళ్ల వయసులో ఎంటెక్, పీహెచ్డీ..
కొందరు వృద్ధాప్యానికి వ్యతిరేకంగా చురుకుగా యువతలా ఉండేలా ప్రయత్నం చేయడం కాదు..ఆ వయసులో చేసే సాహాసాలను చేస్తుంటారు. యువతలా యాక్టివ్‌గా ఉంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటారు. పైగా భావితరాలకు ఓ గొప్ప స్ఫూర్తిగా నిలుస్తారు. అలాంటి కోవకు చెందిందే ఈ బామ్మ. ఈమె అలాంటి ఇలాంటి బామ్మ కాదు.!.ఆషు జైన్ అనే బామ్మ అందరిలాంటి బామ్మ కాదామె. డెహ్రాడూన్‌కు చెందిన ముగ్గురు పిల్లల తల్లి. ఆమె ఒకప్పుడు అల్లికలు అల్లుతూ మనవళ్లను చూసుకుంటూ గడిపింది. కానీ ఇప్పుడామె జిమ్‌లో డెడ్‌లిఫ్ట్, జుంబా, హైరాక్స్ రేసుల వంటివి సునాయాసంగా చేస్తుంటుందామె. జీవిత చరమాంకంలో ఎలా ఫిట్నెస్తో ఉండొచ్చో చూపిస్తూ..తనలాంటి వాళ్లకు ఆదర్శంగా నిలుస్తోందామె.సాధారణ బామ్మలా కాదు..ఆమె పిల్లలు చదువుకోమని ప్రోత్సహించడంతో 44 ఏళ్ల వయసులో తిరిగి చదువుని ప్రారంబించింది. అలా ఆమె ఎంటెక్, ఐఐటీ ఢిల్లీ నుంచి పీహెచ్డీ పూర్తి చేసింది. అదే క్రమశిక్షణ ఫిట్‌నెస్‌లో కూడా సాగింది. ఫిట్నెస్ అంటే కేవలం అందంగా కనిపించడం మాత్రమే కాదు, నొప్పి లేకుండా ట్రెక్కింగ్, నృత్యం చేయడం, మనవరాలిని ఎత్తుకోగలగడం తదితరాలని అంటోంది ఈ బామ్మ. ఇది కేవలం స్వేచ్ఛకు సంబంధించినది కాదని అంటోంది. అంతేగాదు తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో తన నాలుగేళ్ల జిమ్ అలవాట్లను కూడా ఆమె షేర్ చేసుకున్నారు. అందుకు తనకు ఉపకరించిన టిప్స్‌ను కూడా పంచుకున్నారు. అవేంటంటే..కొత్తగా ఫిట్నెస్ మొదలుపెడితో చిన్నగా ప్రారంభించమని అంటోంది. చిన్నపాటి లక్ష్యాలతో సాగితే..ఆ తర్వాత పునరావృతం చేసే సంఖ్య పెంచుకుంటూ పోవచ్చని అంటోంది. ఇప్పటికే ఉన్న అలవాట్లకు రోజువారీ అలవాట్లను అనుసంధానించండి. ముందుగా ఏ రోజుకారోజు సన్నద్ధమవ్వడం వంటివి చేయాలి. రేపుచేసే వ్యాయామాలకు కావాల్సిన విధంగా రెడీ అయ్యి ఉండటం. నిలకడగా చేసేలా చూసుకోండి ఒక్కోసారి ఆటంకాలు రావడం, క్రమశిక్షణాయుతంగా చేయలేకపోవడం జరిగినా..నిలకడగా కొనసాగేలా కేర్ తీసుకోవాలిపరిపూర్ణంగా చేయడం కంటే నిలకడగా..సాగిపోవడమే అసలైన ఫిట్నెస్ మంత్ర.అలాగే ఆమె హైరాక్స్ కోసం ఎలా సన్నహామవుతుందో కూడా ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ఓర్పుతో కూడిన ఫంక్షనల్ వ్యాయామాలతో కూడిన గ్లోబల్ ఫిట్నెస్ రేస్. ఈ ఏడాది ప్రారంభంలోనే రెండో హైరాక్స్ను పూర్తి చేశారామె. ఆమె రోజు ఉదయం నాలుగు గంటలకు నీరు, ప్రార్థన, నానబెట్టిన నట్స్‌తో ప్రారంభమవుతుంది. ఆమె శిక్షణలో ప్రత్యేకమైన స్ట్రెంగ్త్, డెడ్‌లిఫ్ట్, రన్నింగ్, జుంబా, బాల్కనీ వాక్‌లు ఉంటాయి. కాగా డబ్ల్యూహెచ్ఓ కూడా 18 నుంచి 64 ఏళ్ల వయసుల పెద్దలు 150–300 నిమిషాల మధ్యస్థ-తీవ్రతతో కూడిన ఏరోబిక్ కార్యకలాపాలు లేదా 75–150 నిమిషాల అధిక-తీవ్రతతో కూడిన ఏరోబిక్ కార్యకలాపాలు చేయాలని సూచిస్తోంది. అలాగే వారానికి కనీసం రెండు రోజులు కండరాలను బలోపేతం చేసే ప్రధాన కార్యకలాపాలు చేయాలని సిఫార్సు చేస్తోంది. ఇక్కడ ఆషు బామ్మ దినచర్య కనీస ప్రమాణాలకు మించి పోయింది. నిజంగా ఆమె ‘హైబ్రిడ్ అథ్లెట్ బామ్మ’. View this post on Instagram A post shared by Ashu Jain (@not.just.a.grandma) (చదవండి: మూడుగంటల ట్యాక్సీ ప్రయాణం..ప్రేమకథగా ఎలా మారిందంటే..!) -
విటమిన్ డి సీక్రెట్ బయటపెట్టిన న్యూరాలజిస్ట్
న్యూఢిల్లీ: ఎముకల దృఢత్వానికి, కాల్షియం శోషణకు(గ్రహించే ప్రక్రియకు), రోగనిరోధక శక్తిని పెంచడానికి శరీరానికి విటమిన్-డి ఎంతో అవసరం. శరీరానికి సూర్యరశ్మి తగిలినప్పుడు ఇది సహజంగా ఉత్పత్తి అయినప్పటికీ, ప్రస్తుత రోజుల్లో చాలామందిలో విటమిన్-డి లోపం కనిపిస్తున్నది. దీంతో వైద్యులు సప్లిమెంట్లను సూచిస్తున్నారు.అయితే కేవలం విటమిన్-డి తీసుకోవడమే కాకుండా, శరీరం దానిని సమర్థవంతంగా గ్రహించేలా సరైన సమయంలో తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఢిల్లీ ఎయిమ్స్ పూర్వ విద్యార్థిని గురుగ్రామ్‌లోని ‘ది న్యూరోమెడ్ క్లినిక్’ న్యూరాలజిస్ట్ డాక్టర్ ప్రియాంక సెహ్రావత్ విటమిన్-డి సప్లిమెంట్ల శోషణపై కీలక సూచనలు చేశారు. విటమిన్-డి కొవ్వులో కరిగే (ఫ్యాట్-సాల్యుబుల్) విటమిన్ అని డాక్టర్ ప్రియాంక వివరించారు. మన పేగుల్లో కొవ్వు ఉన్నప్పుడే ఇది శరీరానికి గరిష్ఠ స్థాయిలో అందుతుంది. మార్కెట్లో ఇవి క్యాప్సూల్స్, సిరప్స్, డ్రాప్స్, పౌడర్ రూపంలో (సాచెట్స్) లభిస్తాయి.తీసుకోవాల్సిన సరైన సమయంరోజులో ఎక్కువ ఆహారం తీసుకునే సమయంలోనే విటమిన్-డి సప్లిమెంట్లను తీసుకోవాలని డాక్టర్ సూచిస్తున్నారు. అది ఉదయం అల్పాహారం కావొచ్చు లేదా మధ్యాహ్న భోజనం కావొచ్చు. భోజనంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, పిండిపదార్థాలు, ప్రోటీన్లు పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి.నీళ్లతో కాకుండా పాలతో..పౌడర్ రూపంలో ఉండే విటమిన్-డి సాచెట్లను నీటిలో కలుపుకొని తాగడం మంచిది కాదని ఆమె స్పష్టం చేశారు. పౌడర్‌ను ఒక గ్లాసు పాలతో కలిపి తీసుకోవాలని సూచించారు. పాలలో ఆరోగ్యకరమైన కొవ్వుతో పాటు కాల్షియం కూడా ఉంటుంది. శరీరంలో తగినంత విటమిన్-డి ఉంటే ఎముకలు కాల్షియాన్ని గ్రహిస్తాయి. అదేవిధంగా కాల్షియం సమృద్ధిగా ఉంటే విటమిన్-డి శోషణ కూడా మెరుగవుతుంది. అందుకే సాచెట్లను పాలతో తీసుకోవడం, భోజనం తర్వాత సప్లిమెంట్లను వేసుకోవడం అత్యుత్తమమని డాక్టర్ వెల్లడించారు.ఇది కూడా చదవండి: కష్టాల్లో కుంభమేళా మోనాలిసా.. ఇప్పుడు ఏం చేస్తున్నదంటే.. -
గర్భిణులూ.. గంటల తరబడి కూర్చోవద్దు! ఎందుకంటే?
గర్భవతులు తాము కూర్చుని ఉండే సమయాన్ని తగ్గించుకుని, శారీరకంగా చురుగ్గా ఉండటం వాళ్ల ఆరోగ్యకరమైన గర్భధారణకు (హెల్దీ ప్రెగ్నెన్సీకి) తోడ్పడుతుందని ఒక అమెరికన్ అధ్యయనంలో తేలింది. ప్రముఖ మెడికల్ జర్నల్ ‘జామా’లో ఈ పరిశోధనల వివరాలు ప్రచురితమయ్యాయి.రోజులో 10 గంటలకు పైగా కూర్చునే గర్భిణులను... అంతకంటే తక్కువగా కూర్చునే గర్భవతులతో పోల్చినప్పుడు.. ఎక్కువ సేపు కూర్చుండేవాళ్లలో ప్రతికూలతలూ, అనర్థాలూ దాదాపు రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అవేమిటంటే... గర్భధారణ సమయంలో వచ్చే హైబీపీ, గర్భవతుల్లో వచ్చే మధుమేహం (జెస్టేషనల్ డయాబెటిస్), అధిక రక్తపోటుతో కిడ్నీలు, కాలేయం వంటి కీలక అవయవాలపై ప్రభావం చూపే ప్రీ–ఎక్లాంప్సియా అనే కండిషన్, నెలలు నిండకుండానే ప్రసవం జరిగే ముప్పుతో పాటు తక్కువ బరువుతో బిడ్డ పుట్టడం వంటి ప్రతికూలతలు కనిపించే అవకాశాలున్నట్టు తేలింది.ఇలా చాలాసేపు మందకొడిగా ఉండటం అన్నది తల్లీబిడ్డల ఆరోగ్యానికి ప్రమాదం. అంతేకాదు... భవిష్యత్తులో తల్లీబిడ్డలకు గుండెజబ్బులూ, మధుమేహం, ఊబకాయం వచ్చే ముప్పూ ఎక్కువే. ‘‘గర్భధారణలో ఎక్కువసేపు కూర్చోవడం అంత ఆరోగ్యకరం కాకపోవచ్చని మేం ముందుగానే ఊహించాం. అయితే ఆ ప్రమాదం మేము అనుకున్నదానికంటే ఎక్కువగా ఉండటం ఆశ్చర్యకరం’’ అంటూ ఈ అధ్యయనంలో పాల్గొన్న ప్రధాన పరిశోధకుడొకరు తెలిపారు.శారీరకంగా చురుగ్గా ఉండటానికీ, గర్భధారణ ఫలితాలకూ ఉన్న సంబంధాన్ని తెలుసుకునేందుకు నిర్వహించిన ఈ అధ్యయనం కోసం గర్భం... మొదటి మూడు నెలల్లో ఉన్న 470 మంది మహిళలను పరిశోధకులు ఎంపిక చేశారు. వారి సగటు వయసు 30.7 ఏళ్లు. ఈ అధ్యయనంలో భాగంగా ప్రతి త్రైమాసికంలోనూ మహిళలకు ప్రత్యేక యాక్టివిటీ మానిటర్లను అమర్చారు. అవి... వారు ఎంతసేపు కూర్చుంటున్నారు, ఏ మేరకు చురుగ్గా ఉంటున్నారనే వివరాలను నమోదు చేశాయి.మొత్తమ్మీద వీళ్లలో 174 మంది మహిళలు (37 శాతం) గర్భధారణలో ప్రతికూల ఫలితాలను ఎదుర్కొన్నారు. వీరిలో 86 మందికి (18.3 శాతం) గర్భధారణకు సంబంధించిన అధిక రక్తపోటు సమస్యలు తలెత్తాయి.రోజుకు 10 గంటలు లేదా అంతకంటే ఎక్కువసేపు కూర్చున్న ప్రతి ఐదుగురు మహిళల్లో ఇద్దరికి గర్భధారణలో ప్రతికూల ఫలితాలు కనిపించాయి. అదే రోజుకు సుమారు ఏడు గంటలు కూర్చున్న మహిళల్లో మాత్రం... ప్రతి ఐదుగురిలో ఒకరికే ఇలాంటి సమస్యలు కనిపించాయి.గర్భధారణలో ప్రతికూల ఫలితాల ముప్పును బాగా తగ్గించేందుకు మితంగా వ్యాయామం చేయాలంటూ సాధారణంగా చెబుతున్నప్పటికీ చాలామంది గర్భిణులకు ఇలా వ్యాయామం చేయడం సాధ్యపడకపోవచ్చు.‘‘మా పరిశోధన సూచిస్తున్న విషయం ఏమిటంటే... తప్పనిసరిగా వ్యాయామం చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. కానీ... తరచూ లేచి, కాసేపు అటూ ఇటూ తిరగడం, కాస్తంత చురుగ్గా కదులుతూ ఉండటమూ గర్భధారణ సమస్యలను నివారించడంలో సహాయపడవచ్చు’’ అంటూ ఓ పరిశోధకుడు తెలిపారు.నిర్వహణ: యాసీన్ -
చేతికి గాయం.. అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు! లేదంటే?
మానవ నాగరికతా వికాసంలో చేతిది చాలా కీలక భూమిక. చెయ్యి, కన్ను ఈ రెండింటి సమన్వయంతోనే అద్భుతాలన్నీ సాకాఅవుతున్నాయి. ఇంతటి కీలకమైన చెయ్యి గురించి అవగాహన అవసరం. నేడు (ఆగష్టు 23న) ‘నేషనల్ హ్యాండ్ సర్జరీ డే’ సందర్భంగా చేతికి అయ్యే గాయాలూ, తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో చూద్దాం...చేతికి అయ్యే గాయాల్లో... కోసుకుపోవడం, విరగడం (ఫ్రాక్చర్స్), డిస్లొకేషన్స్, సాఫ్ట్ టిష్యూ ఇంజరీస్, తెగిపోవడం, ఇన్ఫెక్షన్స్, కాలడం, పడిపోవడం వల్ల చేతిపై తీవ్ర ఒత్తిడి పడి అయ్యే హై–ప్రెజర్ ఇంజరీస్ ప్రధానమైనవి.చేయి కోసుకుపోయినప్పుడు...పదునైన వస్తువులతో చెయ్యి లోతుగా కోసుకోవడం వల్ల చర్మంతో ΄ాటు టెండన్లు, నరాలు, ధమనులు, సిరలు దెబ్బతినవచ్చు. నొప్పి, రక్తస్రావం, తిమ్మిరి, స్పర్శ తగ్గడం, వేళ్ల కదలిక తగ్గడం, చేతి బలం తగ్గడం, చర్మం ΄ాలిపోయినట్లు కనిపించడం వంటి లక్షణాలు ఉంటే గాయం లోతుగా అయినట్లు భావించాలి. పైపైన కోసుకుపోయినప్పుడు ఆ గాయానికి కుట్లు వేయడం సరిపోవచ్చు. అయితే.. నర్వ్ ఇంజరీ, రక్తనాళం ఇంజరీ లేదా టెండన్ ప్రభావితమైనప్పుడు ప్రత్యేక శస్త్రచికిత్స అవసరం.ఫ్రాక్చర్.. డిస్లొకేషన్లో... చేతి ఎముకలు విరగడం లేదా చేతి ఎముకలూ, జాయింట్స్ డిస్లోకేషన్స్ వల్ల తీవ్రమైన నొప్పి, వాపు, రంగు మారడం, చేతి ఆకృతిలో మార్పు, కదలిక తగ్గడం, తిమ్మిరి ఏర్పడవచ్చు. ఎక్స్‌రే ద్వారా ఫ్రాక్చర్, డిస్లోకేష¯Œ ను నిర్ధారణ చేస్తారు. గాయాన్ని బట్టి ΄్లాస్టర్ వేయడం, కట్టు కట్టడం స్పి›్లంటింగ్, ఇంటర్నల్ ఫిక్సేషన్ వంటి చికిత్సలు అవసరమవుతాయి.వేళ్లు తెగిపోతే... ఏవైనా ప్రమాదాల్లో చేతివేళ్లు పూర్తిగా తెగిపోవడాన్ని యాంప్యుటేషన్ అంటారు. కొన్ని కేసుల్లో రీ΄్లాంటేషన్ మైక్రోసర్జరీ ద్వారా తెగిపోయిన భాగాన్ని తిరిగి అతికించే అవకాశముంటుంది. ఇలా తెగినప్పుడు పూర్తిగా విడివడిన ఆ భాగాన్ని నేరుగా మంచు (ఐస్)పై ఉంచకూడదు. ఆ భాగాన్ని శుభ్రమైన గాజుగుడ్డలో చుట్టి, నీరుగానీ, మంచుగానీ లేదా తడిగానీ నేరుగా తగలకుండా ΄్లాస్టిక్ కవర్లో ఉంచి, దాన్ని ఆసుపత్రికి తరలించాలి.ఇన్ఫెక్షన్.. చిన్న గాయంతోనూ ముప్పేచిన్న కోత లేదా గాయం ద్వారా బ్యాక్టీరియా ప్రవేశించి చేతిలో ఇన్ఫెక్షన్ ఏర్పడవచ్చు. నొప్పి, గాయం చుట్టూ వేడి, ఎర్రదనం, వాపు, చీము, చేతి కదలిక తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.తీవ్రతను బట్టి చికిత్సవేడిపదార్థాలూ, ఏవైనా రసాయనాలు లేదా విద్యుదాఘాతం వల్ల చేతికి కాలిన గాయాలు (బర్న్స్) కావచ్చు. కాలిన గాయాన్ని చల్లటి నీటితో కలగాలి. నేరుగా ఐస్ పెట్టకూడదు. రసాయనాలతో కాలిన గాయాల్లో ఎక్కువ నీటితో కడగాలి.ముఖ్యంగా ఐదు పరీక్షలు... చేతికైన గాయాన్ని ఐదు అంశాల్లో పరీక్ష చేస్తారు. అవి... 1. బటయకు కనిపించే గాయం పరీక్ష2. నరాల పరీక్ష3. వాస్క్యులర్ పరీక్ష4. కండరాలు–టెండన్ల పరీక్ష5. ఎముకలు–జాయింట్ల పరీక్ష. ఈ అంశాల్లోతేడాలేమైనా ఉన్నాయేమో చూస్తారు.ఎక్స్‌రే... ఇతర పరీక్షలుముందుగా గాయాన్నినేరుగా పరిశీలించాక అవసరాన్ని బట్టి ఎక్స్‌రే తీస్తారు. రక్తనాళాలకు గాయాలయ్యాయా వాటి పరిస్థితి ఏమిటన్నది తెలుసుకోడానికి డాప్లర్ లేదా ఇతర వాస్క్యులర్ ఇమేజింగ్ పరీక్షలు అవసరం కావచ్చు.ప్రథమ చికిత్సలో ఇవీ జాగ్రత్తలు...చేతికి గాయమైనప్పుడు శుభ్రమైన గాజుగుడ్డ లేదా మెత్తటి బట్టతో మెల్లగా కొద్ది΄ాటి ఒత్తిడి పెడుతూ రక్తస్రావాన్ని అరికట్టాలి. లోపలికి చొచ్చుకుపోయిన పెద్ద వస్తువులను ఎవరికి వారు తొలగించకూడదు. ఎముక విరగడం లేదా ఎముక /కీలు పక్కకు తొలగడం వంటి కేసుల్లో చేతిని కదలకుండా గుడ్డతోగానీ లేదా స్క్రేప్బ్యాండ్తో చుట్టాలి.ఎముక బయటకు కనిపించే ఓపెన్ ఫ్రాక్చర్లో ఇలా బయటకు కనిపించే ఎముకను తిరిగి లోపలికి నెట్టకుండా శుభ్రమైన గాజుగుడ్డను కప్పి బాధితుడిని ఆసుపత్రికి తరలించాలి. చెయ్యి తాలూకు అవయవమేదైనా పూర్తిగా తెగిపోయినప్పుడు రక్తస్రావాన్ని ఆపేందుకు చేతిని పైకి తిప్పి ఉంచాలి. తెగిపోయిన భాగాన్ని శుభ్రమైన గాజుగుడ్డలో చుట్టి చల్లని పరిస్థితుల్లో భద్రపరచాలి. నేరుగా మంచు తగలకుండా జాగ్రత్త తీసుకోవాలి.చివరగా...తీవ్రమైన రక్తస్రావం, తిమ్మిరి లేదా స్పర్శ కోల్పోవడం, వేళ్లు కదలకపోవడం, బలం తగ్గడం, నొప్పి, వేళ్లు లేదా చేతి భాగం తెగిపోవడం, ఇన్ఫెక్షన్ లక్షణాలు ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా అత్యవసరంగా డాక్టర్ లేదా హ్యాండ్ సర్జన్‌కు చూపించి తక్షణం వైద్యచికిత్స తీసుకోవడం ముఖ్యం.- డాక్టర్ గోపీనాథ్ భండారి, సీనియర్ కన్సల్టెంట్, మైక్రో హ్యాండ్ సర్జన్నిర్వహణ: యాసీన్ -
మూడేళ్ల నుంచే వేధింపులు, చివరికి 70 కిలోలు తగ్గింది, కానీ నరకం!
అధిక బరువుతో ఆరోగ్య కష్టాలు మాత్రమే కాదు, సామాజికంగా నిందలు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక అమ్మాయిలైతే ఇక చెప్పేదేముంది. సన్నబడితే జీవితం అన్నంతగా పరిస్థితి మారిపోతుంది. ఇవి చాలదన్నట్టు ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో తెలియక, అనేక మానసిక ఆరోగ్య సమస్యలు కూడా చేరతాయి. అవమానాలు, శారీరక, మానసిక సంఘర్షణను తట్టుకోలేక బేరియాట్రిక్ శస్త్రచికిత్స (Bariatric Surgery) తో శారీరకంగా ఎంతో చిత్రవధ అనుభవించినప్పటికీ, అంత తీవ్ర ఒత్తిడి నుంచి బయట పడి ఒక యువతి ఆసక్తికరమైన వెయిట్ లాస్ జర్నీ గురించి తెలుసుకుందాం.1996లో పుట్టిన నిధి చిన్నతనం నుంబే బొద్దుగా ఉండటంతో మూడేళ్ల వయసు నుంచే వేధింపులు, హింస మొదలయ్యాయి. ఆమెను బాడీనే మొదటగా అందరూ గమనించి కామెంట్స్ చేసేవారు. గేలి చేసేవారు. చివరికి ఆమె ఆత్మవిశ్వాసం దెబ్బతింది. టీనేజ్‌లో ఎంతో ఉత్సాహంగా ధృడంగా, కల్చరల్‌గా యాక్టివ్‌గా ఉండే అమ్మాయి కాస్తా, మౌనంగా, బేలగా మారిపోయింది. 2018లో ఒక క్లినికల్ న్యూట్రిషనిస్ట్ సహాయంతో, సుమారు 35 కిలోల బరువు తగ్గినా, మళ్లీ పాత అలవాట్లతో తగ్గిన బరువంతా మళ్లీ వచ్చేసింది. 2019లో కాలేజీ తరువాత వ్యాపారాన్ని ప్రారంభించినా అది సక్సెస్ కాకపోవడంతో తీవ్రమైన డిప్రెషన్, ఆందోళన చుట్టుముట్టింది. చివరికి ఊరిలోని ఒక సైకియాట్రిస్ట్‌ను కలిసినపుడు ఆమెకు బోర్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అటు ఉద్యోగం లేక, ఇటు అనారోగ్యంతో తీవ్రమైన భావోద్వేగాల మధ్య రెండేళ్ల పాటు చికిత్స తీసుకుంది.2022 నాటి, 26 ఏళ్లకే, బరువు 120 కిలోలకు చేరింది. అందరూ సోమరి అని గేలి చేసేవారు తప్పితే ఆ బరువు వెనుకున్న విషయం గురించి ఆలోంచేవారు కాదు. ఇలా ఏళ్ల తరబడి శారీరక, మానసిక వేధింపులు, తీవ్రమైన డిప్రెషన్, ఆందోళన, చికిత్స చేయని మానసిక ఆరోగ్య సమస్యతో జీవిస్తూ, వీటిన నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియని అనేక అస్తవ్యస్తమైన ఆహారపు అలవాట్లతో జీవితం దుర్భరంగా మారింది. మానసిక అనారోగ్యం, ఈటింగ్ డిజార్డర్స్‌తో తిండే ఒక ఆసరాగా (Coping mechanism) మారి పోయింది.ఇదీ చదవండి: 16 ఏళ్లకే 275 కిలోలు బరువు : రెండు నెలల్లో 50 కిలోలు తగ్గాడుబేరియాట్రిక్ సర్జరీ- నరకంసాంప్రదాయ మార్వాడీ కుటుంబానికి చెందిన ఆమె, సన్నబడితేనే వివాహం, ఉద్యోగం, సమాజంలో గుర్తింపు లభిస్తాయని నమ్మింది. బంధువుల్లో ఒకరు సర్జరీ చేయించుకుని పెళ్లి చేసుకోవడం చూసి ఆమె కూడా ఆ దారి ఎంచుకోవాల్సి వచ్చింది. పెళ్లి అవ్వాలంటే బరువు తగ్గాలనే ఒత్తిడి మధ్య బేరియాటిక్ సర్జరీ ద్వారా బరువు తగ్గాలని నిర్ణయించుకుంది.ఎందుకుంటే కఠినమైన డైట్ చేసి, పోషకాహార సహాయంతో అప్పటికే 35 కిలోలు తగ్గినా మళ్లీ 120 కిలోలకు చేరింది. ఇక డైట్లతో పనికాదని అర్థం చేసుకుంది. సర్జరీ తరువాత బరువు తగ్గినప్పటికీ నరకం చూసింది.బేరియాట్రిక్ శస్త్రచికిత్స తర్వాత నిధి అగర్వాల్ ఎదుర్కొన్న తీవ్రమైన శారీరక, మానసిక సవాళ్లు ఎదుర్కొంది. అలాగే సర్జరీకి ముందు తాను వాడుతున్న మానసిక ఆరోగ్య మందులను ఒక్కసారిగా ఆపేయడంతో ఆమె తీవ్ర ఆందోళన, భయానికి గురయ్యారు. సర్జరీ గురించి ఎవరికీ చెప్పకూడదని, వ్యాయామం, ఆహార నియమాల వల్లే బరువు తగ్గినట్లు చెప్పాలని కుటుంబం ఒత్తిడి తీసుకొచ్చింది. 120 కిలోల నుండి 50 కిలోలకు తగ్గిన క్రమంలో ముప్పావు వంతు జుట్టు రాలిపోయింది. నీరసం, కండరాల క్షీణత, ఎసిడిటీ, అల్సర్లు, డంపింగ్ సిండ్రోమ్ లాంటి సమస్యలు. 2025లో గాల్ బ్లాడర్ తొలగింపు సర్జరీ కూడా చేయించు కోవాల్సి వచ్చింది.ఇదీ చదవండి: పెళ్లై మూడేళ్లు, ముత్యాల్లాంటి కవలలు : అల్లుడ్ని కొట్టి చంపేశారుఎట్టకేలకు సానుకూల మార్పులు:120 కిలోల బరువు ఉన్నప్పుడు ఆయాసపడే ఆమె, ఇప్పుడు ఆయాసం లేకుండా సులభంగా మూడు అంతస్తులు ఎక్క కలుగుతోంది. ఆహారంపై నియంత్రణ సాధించి, ఆరోగ్యకర ఆహార అలవాట్లను పెంపొందించు కుంది. 2023లో థెరపిస్ట్ సహాయంతో, 2026 నాటికి న్యూట్రిషనిస్ట్ మార్గదర్శకత్వంలో శారీరక దృఢత్వాన్ని తిరిగి నిర్మించుకుంటూ, తనను తాను ప్రేమించుకుంటూ తన జీవితాన్ని తన చేతుల్లోకి తెచ్చుకుంది.నోట్: మనిషి విలువ, లభించే గౌరవం అనేది శరీరం బరువుపై ఆధారపడి ఉండదు. అయితే అధిక బరువును తగ్గించుకోవడం అనేది నిపుణుల సాయంతో, ఆరోగ్య అంచనాలతో స్థిరంగా సాగాల్సిన ప్రక్రియ. కానీ విపరీతంగా పెరిగిన శారీరక బరువు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి బారియాట్రిక్ సర్జరీ జీవితాన్ని మారుస్తుంది, కానీ అది మానసిక ఆరోగ్య సమస్యలను లేదా ఆలోచనా విధానాన్ని దానంతట అదే మార్చలేదు. దీనికి ఎంతో నిబ్బరం, సహనం, కుటుంబ సభ్యులు తోడ్పాటు ఎంతో అవసరం. సర్జరీ అనేది నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చివరి మార్గం మాత్రమే అనేది గమనించాలి. -
16 ఏళ్లకే 275 కిలోలు బరువు : రెండు నెలల్లో 50 కిలోలు తగ్గాడు
సాక్షి, న్యూఢిల్లీ: న్యూఢిల్లీకి చెందిన బాలుడు 16 ఏళ్లకే సుమారు 275 కిలోల తీవ్రమైన బరువు పెరిగాడు. అతడి బాడీ మాస్ ఇండెక్ (BMI) దాదాపు 100. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. దీంతో ఢిల్లీలోని 'సర్ గంగారామ్ ఆస్పత్రి' వైద్యులు ఆయనకు విజయవంతంగా బేరియాట్రిక్ శస్త్రచికిత్స (ల్యాప్రోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రెక్టోమీ) నిర్వహించి ప్రాణం పోశారు.సాధారణ పిల్లలు అటూ ఇటూ పరుగెత్తుతూ, నవ్వుతూ, చదువుకోవాల్సిన వయసులో, ఈ పదహారేళ్ల బాలుడు తన సొంత ఇంటి నాలుగు గోడలకే పరిమితమయ్యాడు. అధిక బరువు కారణంగా అతను తన కదలికలన్నింటినీ కోల్పోయాడు. తీవ్రమైన ఆయాసం ,చర్మ ఇన్ఫెక్షన్ కారణంగా చివరకు అతడిని ఆసుపత్రికి తరలించడం ఒక సవాలుగా మారింది. సాధారణ కారులో గానీ, అంబులెన్స్‌లో గానీ తరలించడం సాధ్యపడలేదు. చివరకు, అతడిని ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రికి 'మెటాడోర్' అనే సరుకు రవాణా వాహనంలో తీసుకువెళ్లారంటేనే అతని పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.దీనికి తోడు బాలుడు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు, నిద్రలో శ్వాస ఆడకపోవడం (స్లీప్ ఆప్నియా), తీవ్రమైన చర్మ ఇన్ఫెక్షన్లతో అతని ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. అతడిని వెంటనే పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించారు.రెండు వారాల కఠోర శ్రమ తర్వాత, అనేక పరీక్షలు 20 మంది వైద్య నిపుణులు తర్జన భర్జనలు సిబ్బంది అతడిని శస్త్రచికిత్సకు రెడీ అయ్యారు.50 కిలోలు తగ్గాడు బాలుడి వయస్సు, విపరీతమైన బరువును దృష్టిలో ఉంచుకుని వివిధ విభాగాలకు చెందిన 20 మంది వైద్య నిపుణులు కేసును పరిశీలించారు. ప్రాణాపాయం నుంచి కాపాడేందుకు బారియాట్రిక్ సర్జరీ ఒక్కటే మార్గమని తేల్చారు. డాక్టర్ దక్ష్ సేథీ, డాక్టర్ సుధీర్ కలహన్ బృందం ఈ అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించింది. ఈ ప్రక్రియలో కడుపులో ఎక్కువ భాగాన్ని తొలగించి, దాని పరిమాణాన్ని తగ్గిస్తారు. దీనివల్ల అతను తినే ఆహారంపై నియంత్రణ సాధ్యమవుతుంది. సర్జరీ అనంతరం బాలుడు రెండు వారాల పాటు పీడియాట్రిక్ ఐసియు (PICU)లో చికిత్స పొందాడు. ఆశ్చర్యకరంగా, ఈ క్లిష్టమైన శస్త్రచికిత్స జరిగిన కేవలం మూడు రోజుల తర్వాత అతన్ని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. ఆ తర్వాతి రెండు నెలల్లో అతను సాధించిన పురోగతి వైద్యులను, కుటుంబాన్ని ఎంతగానో సంతోషపరిచింది. కేవలం 60 రోజుల్లో, అతని బరువు 275 కేజీల నుండి 223 కేజీలకు తగ్గింది! అంటే దాదాపు 50 కేజీల బరువు తగ్గింది. కేవలం బరువు తగ్గించడమే కాకుండా, బాలుడికి మెరుగైన జీవన నాణ్యతను అందించడమే ఈ శస్త్రచికిత్స ప్రధాన లక్ష్యమని వైద్యులు తెలిపారు.ఇదీ చదవండి: కొడుకు ఎంత చెప్పినా వినలేదు, చివరికి తల్లి కూడా !మంచి డైట్, వ్యాయామంతో కూడిన నిరంతర వైద్య పర్యవేక్షణలో ఒకపుడు నిస్సహాయంగా , సొంతంగా నడవలేని స్థితి నుంచి నెమ్మదిగా కోలుకున్నాడు. అతని వెయిల్‌లాస్, ఆరోగ్య ప్రయాణం వైద్య ప్రపంచానికి ఒక గొప్ప విజయ గాథ ఇలా అనూహ్యమైన బరువుతో పోరాడుతున్న వేలాది మందికి ఒక గొప్ప ఆశాకిరణం.ఇదీ చదవండి: పెళ్లై మూడేళ్లు, ముత్యాల్లాంటి కవలలు : అల్లుడ్ని కొట్టి చంపేశారు -
హైదరాబాద్ వాసులకు నిద్ర కరువు.. కారణం ఇవే!
కునుకుపడితే మనసు కాస్త కుదుటపడతది. కుదుటపడ్డ మనసు తీపి కలలు కంటది.. అన్నచందంగా మనిషి జీవితంలో నిద్రకు ఎంతో ప్రాముఖ్యముంది. వ్యక్తిగత సమస్యలు.. మానసిక రుగ్మతలు.. అనారోగ్యం.. సాధారణంగా ఇలాంటి వాటితో నిద్ర కోల్పోవడం చూస్తూనే ఉంటాం. కానీ.. ప్రస్తుతం మెట్రో నగరవాసుల్ని పట్టిపీడిస్తూ నిద్రను దూరం చేస్తున్న సమస్యలు మరో రెండు ఉన్నాయి. అవేమిటంటే.. పీక్ అవర్స్‌లో ట్రాఫిక్, రాత్రి వేళల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. హైదరాబాద్ విషయాన్నే తీసుకుంటే ఈ రెండు కారణాలతో ఏటా 198 గంటల నిద్రను నగరజీవులు కోల్పోతున్నారు. తాజాగా విడుదలైన టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్, అమెరికాకు చెందిన క్లైమేట్ సెంట్రల్ సంస్థల సర్వేలు ఈ విషయాలను వెల్లడించాయి. హైదరాబాద్: నగరంలోని రహదారులపై మిగిలిన సమయాల్లో కంటే ఉదయం, సాయంత్రం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని పీక్ అవర్స్ అని పిలుస్తుంటారు. ఉదయం కంటే సాయంత్రం వేళ రద్దీ ఎక్కువగా ఉంటోందని టామ్‌టామ్ నివేదిక తేల్చింది. ఆ సమయంలో ఉండే ట్రాఫిక్ రద్దీ కారణంగా నగర వాసి ఏటా సుమారు 123 గంటలు కోల్పోతున్నాడు. అంటే.. దాదాపు ఐదు రోజులు అదనంగా ట్రాఫిక్‌లోనే గడిపేస్తున్నాడు. టామ్‌టామ్ నివేదిక ప్రకారం నగరంలో ట్రాఫిక్ రద్దీ స్థాయి 55.5 శాతంగా తేలింది. నెదర్లాండ్స్‌కు చెందిన ఈ టెక్నాలజీ సంస్థ స్లో మూవింగ్ ట్రాఫిక్ ఇండెక్స్ పేరుతో ప్రతి ఏడాదీ నివేదిక విడుదల చేస్తోంది. ఆసియా, యూరప్, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, ఆ్రస్టేలియా ఖండాల్లోని 62 దేశాల్లో 500 నగరాల్లో టామ్ టామ్ సంస్థ సర్వే చేసింది.సాయంత్రం దయనీయం.. సాధారణ సమయంలో 10 కి.మీ దూరం ప్రయాణించడానికి సగటున 32.37 నిమిషాలు పడుతోంది. అదే సాయంత్రం రద్దీ వేళల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. ఈ సమయంలో వాహనాల సగటు వేగం గణనీయంగా తగ్గిపోయి 10 కిమీ దూరం ప్రయాణించడానికి సగటున 39.5 నిమిషాలు పడుతోంది. హైదరాబాద్‌లో వాహనాల సంఖ్య 80 లక్షలు దాటింది. అదే సమయంలో ప్రజా రవాణాకు ప్రాధాన్యం లభించట్లేదు. నగరంలో వాహనాల సగటు వేగం గంటకు 25–30 కిమీ ఉండాలి. కానీ.. సగటు వేగం కేవలం 15 కి.మీ పరిమితమవుతోంది. సాయంత్రం రద్దీ వేళల్లో ఇది గంటకు 10 కి.మీలకు పడిపోతోంది. ఇలా ప్రయాణ సమయం పెరిగి... సగటు జీవి రాత్రి వేళల్లో నిద్రపోయే సమయం తగ్గిపోతోంది. ఇంటికి చేరాకా నరకమే.. ట్రాఫిక్ సుడిగుండాన్ని దాటుకుని ఇంటికి చేరిన నగరవాసికీ నిద్ర పట్టట్లేదు. వాతావరణ మార్పుల కారణంగా వేడెక్కుతున్న రాత్రులతో ఏటా 75 గంటల నిద్రకు దూరం అవ్వాల్సి వస్తోంది. అమెరికాకు చెందిన క్లైమేట్ సెంట్రల్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 1,338 నగరాల్లో నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. ముఖ్యంగా కాంక్రీట్ నిర్మాణాలు, తారు రోడ్లు పగటిపూట వేడిని నిల్వ చేసుకుని.. సూర్యాస్తమయం తర్వాత కూడా ఆ వేడి త్వరగా తగ్గకుండా చేస్తున్నాయని స్పష్టం చేసింది. ఈ అంశంలో హైదరాబాద్ కంటే ఎక్కువగా వరంగల్‌లో 82 గంటల నిద్రను కోల్పోతుండటం గమనార్హం. -
తల్లిపాలు బిడ్డ ఎదుగుదలకు ఎంత ముఖ్యమో తెలుసా?
బిడ్డ పుట్టిన తర్వాత తల్లి ఇచ్చే తొలి కానుక తల్లిపాలే. శిశువు ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు, రక్షణను అందించే తల్లిపాలు ఎంతో విలువైనవి.పసిపాప ఆరోగ్యానికి అమృతంతల్లిపాలలోని యాంటీబాడీలు చిన్నతనంలో వచ్చే సాధారణ వ్యాధుల నుంచి బిడ్డను రక్షిస్తాయి.పుట్టిన మొదటి గంటలోనే శిశువుకు తల్లిపాలు పట్టడం ఎంతో శ్రేయస్కరం.బిడ్డ పుట్టిన మొదటి ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టాలి.తల్లి సరైన పోషకాహారం, సహజమైన ఆహారాన్ని తీసుకోవడం ఎంతో అవసరం.అవసరమైనప్పుడు ప్రత్యేక పంప్ సహాయంతో పాలను తీసి భద్రపరచుకోవచ్చు.పాలు ఇచ్చే సమయంలో తల్లి, బిడ్డ మధ్యఉండే స్పర్శ వల్ల మానసిక బంధం మరింత బలపడుతుంది.వీలైనంత వరకు పాలు తాగించే సీసాలు, పాసిఫైయర్స్ వాడకపోవడమే మంచిది.ప్రతి మూడు గంటలకు ఒకసారి సీసాలోకి పాలు పోసి పాలు ఇవ్వవచ్చు. -
దోమా! ఇది నీకు తగునా!!
‘సాయంత్రానికి ఇంటిలోకి చేరతావు, ఏదో ఒక మూలనుంటావు. నేను ప్రేమించే వెలుతురుని ద్వేషిస్తావు, నేను ద్వేషించే చీకటిని ప్రేమిస్తావు. రాత్రంతా నాకోసం మేల్కొని ఉంటావు, టైము దొరికితే కాటేస్తావు. మనది మనది ఒకటే రక్తం అంటావు, నా రక్తాన్నే తాగుతావు. కొన్ని రోజులే బతుకుతావు, కానీ నన్ను రోజూ చంపుతావు. రోగక్రిమి లేకపోతే మిత్రుడు, ఉంటే శత్రువు.’సంవత్సరానికి పదిలక్షల పైచిలుకు మరణాలతో, మానవ మరణాలకు కారణమయ్యే జీవుల్లో దోమ మొదటిస్థానం ఆక్రమిస్తుంది. 1897 ఆగస్టు 20న సర్ రోనాల్డ్ రాస్ మలేరియా క్రిముల్ని దోమలో చూసి, మలే రియా వ్యాధి వ్యాప్తికి కారణం దోమ అని నిర్ధారించారు. అందుకే ప్రతి సంవత్సరం ఆగస్టు 20న ‘ప్రపంచ దోమ రోజు’ జరుపుతున్నారు. ఈ సందర్భంగా దోమల గురించిన కొన్ని వాస్తవాలు:దోమలు 112 జాతులతో 3,541 తెగలతో భూగోళమంతా వ్యాపించి ఉన్నాయి. వాటిలో 50 జాతులు, 404 తెగలు భారతదేశంలో ఉన్నాయి. 4 జాతులకు చెందిన దోమలు మాత్రమే మన దేశంలో మనుషులకు వ్యాధులను కలిగిస్తాయి. అనాఫిలస్ జాతి మలేరియా వ్యాధిని; క్యూలెక్స్ జాతి ఫైలేరియా, మెదడువాపు వ్యాధులను; ఏడిస్ జాతి డెంగీ, చికున్ గన్యా, జికా వ్యాధులను; మాన్సోనియా జాతి బోదకాలు వ్యాధిని వ్యాప్తిచేస్తాయి.దోమ జీవితంలోని 4 దశల్లో, 3 దశలు (గుడ్డు, లార్వా, ప్యూపా) నీటిలోనూ, ఒక దశ (పెద్ద దోమ) భూమిమీద నివసిస్తాయి. సాధారణంగా మగదోమలు వారం రోజులు, ఆడదోమలు నెల రోజులు మాత్రమే జీవిస్తాయి. జీవించడానికి ఆడ, మగ దోమలు మొక్కల రసాలు తాగుతాయి, గుడ్లుపెట్టడానికి మాత్రమే ఆడదోమలు రక్తం తాగుతాయి. దోమకాటు దగ్గర ఏర్పడే ఎర్రని బొబ్బ దోమకాటు వల్ల కాకుండా, మనిషి వ్యాధినిరోధక వ్యవస్థ స్పందన వలన ఏర్పడుతుంది.దోమలు భూమికి 25 మీటర్లకంటే తక్కువ ఎత్తులో ఎగరడానికి ఇష్టపడతాయి. అవి మనుషులు, జంతువులు విడిచే వాయువులను 75 మీటర్ల దూరంనుండి కూడా గుర్తించ గలవు. గర్భిణీ స్త్రీలను, ‘ఓ’ రక్తగ్రూపు వాళ్లను, శరీరం వేడిగా ఉండేవాళ్ళను దోమలు సులభంగా గుర్తించగలవు. కదిలేవాటిని, తెలుపు, నలుపు రంగులను, ఉష్ణోగ్రతలను, గాలిలోని తేమను పసిగట్టగలవు.దోమ రెక్కల ద్వారా చేసే శబ్దాలు వాటి తెగకు చెందిన, ఇతర దోమలు గుర్తించడానికి చేసేవే. పెద్ద దోమలను తినేవాటిలో తూనీగలు, దోమ పిల్లలను తినేవాటిలో చేపలు ముందుంటాయి. దోమ కిలోమీటరు దూరం మాత్రమే వ్యాధిని వ్యాప్తిచేయగలదు. అయితే వ్యాధికారకం కలిగిన మనుషులు మాత్రం వేలకిలో మీటర్ల మేరకు వ్యాధిని వ్యాప్తిచేయగలరు. అందుకే దోమలు పుట్టకుండా, కుట్టకుండా చూసుకోండి – దోమకాటు వ్యాధులనుండి రక్షణ పొందండి.– తలతోటి రత్న జోసఫ్, రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్, ఏపీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ -
Health: దోమ చిన్నదే..! కుట్టిందో ఖతమ్..!
మనుషులపై మలేరియా ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈ వ్యాధికి దోమలే కారణం. దోమలు వృద్ధి చెందడం వల్ల మలేరియా వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఈ అనారోగ్య పరిస్థితులకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో డంపింగ్ యార్డులు లేకపోవడం, తగినంత మంది పారిశుధ్య కారి్మకులు లేకపోవడంతో చెత్త, మురుగు ఎక్కడికక్కడే పెరిగిపోయి దోమలు ప్రభావం తీవ్రంగా ఉంది. ‘వరల్డ్ మస్కిటో డే’ సందర్భంగా ఈ కథనం..దోమలు కలిగించే వ్యాధులివీఅనాఫెలస్ దోమ: ఈ దోమ వల్ల మలేరియా వ్యాధి సోకుతుంది. ఇది శుభ్రమైన నీటిలో సంచరిస్తుంది. ఇది వంద మీటర్లు మేర మాత్రమే సంచరించగలవు. క్యూలెక్స్: ఈ దోమ వల్ల ఫైలేరియా, మెదడుకు సంబంధించిన వ్యాధి సోకుతుంది. ఇది మురుగు నీటిలో మసులుతుంది. ఇది 11 కిలోమీటర్లు మేర సంచరిస్తూ ఉంటుంది. ఏడిస్: ఈ దోమ వల్ల డెంగీ, చికెన్‌గున్యా వ్యాధులు సోకుతాయి. ఇది చెట్టు తొర్రలు, నివాస ప్రాంతాల్లోని వస్తువుల్లో నిల్వ ఉంచిన నీటిలోనూ, కొబ్బరి డిప్పలు, పశువల పాకలవు వద్ద అపరిశుభ్రత పరిస్థితులమధ్య సంచరిస్తుంది.ఇది వంద మీటర్లు మేర మాత్రమే సంచరించగలవు. మేన్సోనియా: ఈ దోమ వల్ల ఫైలేరియా, చికెన్‌గున్యా వ్యా«ధులు సోకుతాయి. దీని ప్రభావం ఇండియాలో తక్కువగా ఉంది. ఇది చెరువులు, కాల్వల్లో ఉండే గుర్రపుడెక్క, మొక్కలో ఉంటుంది. ఇది వంద మీటర్లు మేర మాత్రమే సంచరించగలవు.వ్యాధుల లక్షణాలు ఇలా..మలేరియా: వణుకుతో కూడిన చలి జ్వరం వస్తుంది. రెండు రోజులకోసారి జ్వరం కనిపిస్తుంది. ప్రాథమిక దశలోనే చికిత్సను ప్రారంభించాలి. తీవ్రత పెరిగతే మెదడు ప్రభావితమై రోగి చనిపోయే పరిస్థితులుంటాయి.ఫైలేరియా: సాధారణంగా కాలు వాస్తుంది. గజ్జలో బిల్లలు వేస్తాయి. సాయంత్రం వేళ తక్కువ స్థాయిలో జ్వరం కనిపిస్తుంది.డెంగీ జ్వరం: జ్వరం తీవ్ర స్థాయిలో ఉంటుంది. తలనొప్పి, రొంప, కీళ్ల నొప్పులు, గొంతునొప్పి, కళ్ళు ఎర్రబారడం జరుగుతుంది. ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోకుండా జాగ్రత్తపడాలి. శరీలంలో మచ్చలు వస్తే ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోయినట్టుగా భావించవచ్చు. చికెన్‌గున్యా: ఈ వ్యాధి దీర్ఘకాలంపాటు ఉండొచ్చు. కీళ్ల నొప్పులు అధికంగా ఉంటాయి. రెండు నెలలు నుంచి ఏడాది పాటు ఈ నొప్పులు బాధించవచ్చు.వరల్డ్ మస్కిటో డే ప్రాధాన్యం ఇదీ..బ్రిటీషు దేశానికి చెందిన రొనాల్డ్ రాస్ అనే సైంటిస్ట్ ప్రజలను పట్టిపీడిస్తున్న జ్వరాలపై పరిశోధన చేశాడు. అనాఫెలస్ అనే ఆడ దోమ వల్ల మలేరియా అనే వ్యాధి సోకుతుందన్న విషయాన్ని 1897 ఆగస్టు 20న ప్రపంచానికి తన పరిశోధన ద్వారా తెలియపర్చాడు. ఆయన సేవలకు గుర్తింపుగా ఆగస్టు 20ను అంతర్జాతీయ దోమల నివారణ దినంగా ప్రకటించారు.- రొనాల్డ్ రాస్, సైంటిస్ట్ -
దోమ దండుపై డ్రోనాస్త్రం!
ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ప్రతి సంవత్సరం ఏడు నుంచి పది లక్షల మంది దోమల కారణంగా చనిపోతున్నారు. మనల్ని ముప్పు తిప్పలు పెట్టి, మూడు చెరువుల నీళ్లు తాగించి, రోగాల బారిన పడేలా చేసే దోమలను గాలిలోనే ఎన్కౌంటర్ చేయడానికి ‘కిల్లర్ డ్రోన్స్’ రాబోతున్నాయి!దోమల నివారణ పద్దతులో ప్రధానమైనవి దోమ తెరలు, కీటకనాశినులు. అయితే వీటిలో ప్రతిదానికి ఏదో ఒక పరిమితి ఉంది. ఉదాహరణకు, పురుగు మందుల వలన పర్యావరణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో దోమలను నిర్మూలించడానికి పరిశోధకులు అత్యాధునికమైన పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నారు.సోనార్–గైడెడ్ డ్రోన్ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రియల్ టైమ్ ఫ్లైట్ కంట్రోల్ సాంకేతికతను ఉపయోగించి దోమల పనిపట్టే అత్యాధునిక యంత్రం... సోనార్–గైడెడ్ డ్రోన్. పురుగు మందులు, లేజర్లు, విద్యుత్ గ్రిడ్లను ఉపయోగించడానికి బదులుగా వేగంగా తిరిగే ప్రొఫెల్లర్లను ఉపయోగించి దోమలను నిర్మూలిస్తుంది సోనార్–గైడెడ్ డ్రోన్. గాలిలో ఎగురుతున్న దోమలను ఒక్కటొక్కటిగా గుర్తించి వాటిని నిర్మూలిస్తుంది. ఆప్టికల్ కెమెరాలపై ఆధారపడే సంప్రదాయ డ్రోన్లలా కాకుండా డ్రోన్ అల్ట్రా సోనిక్ ఫేజ్డ్–సోనార్ సాంకేతికత (ఒకే పరికరంలో అనేక చిన్న సౌండ్–వేవ్ పార్ట్స్ ఉపయోగించడం) ఆధారంగా ఈ దోమ నిర్మూలన డ్రోన్‌ను నిర్మించారు. తక్కువ కాంతిలో, చీకటిలో కూడా దోమలను గుర్తించే డ్రోన్ ఇది. కీటకాలను వాటి రూపాన్ని బట్టి ఈ డ్రోన్ గుర్తించదు. ప్రతి దోమ జాతికి ఉండే ప్రత్యేకమైన వింగ్బీట్ ‘ఫింగర్ ప్రింట్’ ద్వారా గుర్తిస్తుంది. ఇతర కీటకాలకు ముప్పు వాటిల్లకుండా కేవలం దోమలనే లక్ష్యంగా చేసుకునేలా ఈ డ్రోన్‌ను డిజైన్ చేశారు.లెసోనార్ 2దోమల సమస్యకు పరిష్కార మార్గంగా ఫ్రెంచ్ స్టార్టప్ టోర్నియోల్ 40 గ్రాముల బరువు ఉన్న ఒక డ్రోన్‌ను రూపొందించింది. ఈ డ్రోన్ నిర్దిష్ట ప్రాంతంలో గస్తీ కాస్తూ, అవసరమైనప్పుడు ఛార్జింగ్ కోసం తిరిగి వస్తుంది. గాలిలో దోమలను గుర్తించిన వెంటనే వాటిపై దూసుకెళ్లి తన ప్రొపెల్లర్స్‌తో వాటిని గాలిలోనే నిర్మూలిస్తుంది. టోర్నియోల్ తాజా మోడల్ లెసోనార్ 2. ఇందులో 32 అల్ట్రా సోనిక్ ఎమిటర్స్ ఉంటాయి. ఈ ఎమిటర్స్ మనుషులకు వినబడని అల్ట్రాసోనిక్ పల్స్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇవి సమీపంలోని వస్తువులు లేదా కీటకాలపై పరావర్తనం చెందుతాయి. పరావర్తనం చెందిన పల్స్‌ను గ్రహించే 380 మైక్రోఫోన్లు సౌండ్‌ను ప్రాసెస్ చేసి, పరిసరాల రియల్– టైమ్ 3డీ మ్యాప్‌ను రూపొందిస్తాయి. కెమెరాకు బదులుగా సోనార్ ను ఉపయోగించడం వల్ల డ్రోన్ కాంపాక్ట్ (చిన్నగా)గా ఉండగలుగుతుంది. రాత్రిపూట కూడా చూడగలుగుతుంది.సెక్యూరిటీ ఫీచర్స్‌తో...కవరేజ్ ప్రాంతాన్ని గుర్తించడం, ఫర్మ్‌వేర్‌ను అప్డేట్ చేయడం, ఫైట్ షెడ్యూల్స్ రూపొందించడం.. మొదలైన పనుల కోసం ఈ డ్రోన్‌కు ప్రత్యేక యాప్, వెబ్ ఇంటర్‌ఫేస్‌లు ఉంటాయి.‘భద్రతా ఫీచర్స్ ఉండేలా మా డ్రోన్‌ను రూపొందించాం. మనుషులు, పెంపుడు జంతువులకు సురక్షిత దూరాలను పాటిస్తుంది. చిన్న పరిమాణం, తక్కువ బరువు వలన అనుకోకుండా తాకినా ఎలాంటి ప్రమాదం ఉండదు’ అని తెలియజేస్తుంది కంపెనీ వెబ్సైట్. సబ్స్క్రిప్షన్ ఆప్షన్‌తో ఈ కిల్లర్ డ్రోన్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.‘ఫోటాన్ మ్యాట్రిక్స్ ల్యాబ్’ అనే సంస్థ దోమల పని పట్టడానికి ఒక కొత్తరకం పరికరాన్ని రూపొందించింది. ఈ పరికరం నుంచి వచ్చే నీలం, ఊదారంగు కాంతి దోమ కనిపించగానే ఎటాక్ చేస్తుంది. తొలి అడుగులలో ఏ పరికరానికైనా పరిమితులు ఉంటాయి. ఈ కిల్లర్ డ్రోన్లకు కూడా అలాంటి పరిమితులు ఉండి ఉండవచ్చు. అయితే కాలక్రమంలో ఆ పరిమితులకు పరిష్కారాలు తప్పకుండా వస్తాయి అంటున్నారు నిపుణులు.అందుకే... దోమల దినోత్సవంఆడ అనోఫెలెస్ దోమలు మలేరియాను వ్యాపింపజేస్తాయని సర్ రోనాల్డ్ రాస్ 1897లో చేసిన చారిత్రక ఆవిష్కరణకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఆగస్ట్ 20న ‘దోమల దినోత్సవం’ జరుపుతారు. ఈ ఆవిష్కరణ వైద్యశాస్త్రంలో పెద్ద ముందడుగు.దోమలపై మైక్రోసాఫ్ట్ గురి!దోమల నివారణకు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించడంపై టెక్ కంపెనీలు ఆటోమేషన్, రోబోటిక్స్‌పై దృష్టి పెట్టాయి. మైక్రోసాఫ్ట్‌తో సహా పలు సంస్థలు దోమల నిర్మూలన కోసం కొత్త హైటెక్ సాధనాలను పరీక్షిస్తున్నాయి. జికా వ్యాధిని వ్యాప్తి చేసేవిగా పేరుగాంచిన ఈడిస్ ఈజిప్టి దోమలను పట్టుకోవడానికి మైక్రోసాఫ్ట్ సంస్థ ఒక స్మార్ట్ట్రాప్ను పరీక్షిస్తోంది. కాలిఫోర్నియాలో ‘అల్ఫాబెట్’కు చెందిన లైఫ్ సైన్సెస్ విభాగం దోమల జనన నియంత్రణకు సాంకేతిక పరిష్కారాలు అన్వేషిస్తోంది. -
‘నేచర్స్ ఓజెంపిక్’ అంటే..?నిజంగానే బరువు తగ్గిస్తుందా?
ప్రాచీన ఆయుర్వేద మూలిక నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. ఆయుర్వేదంలో దారుహరిద్ర అని పిలిచే బెర్బెరిన్ బరువు నిర్వహణ, రక్తంలోని చక్కెర నియంత్రణకు సంబంధించిన ప్రయోజనాల కారణంగా ఒక్కసారిగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దీని గురించి వైద్యులు ఏమంటున్నారంటే..బెర్బెరిన్ అనేది బెర్బెరిస్ కుటుంబానికి చెందిన మొక్కలలో సహజంగా లభించే ఒక సమ్మేళనం. దీన్ని ఇండియన్ బార్బెర్రీ, దారుహరిద్ర లేదా ట్రీ టర్మరిక్ అని పిలుస్తారు. ఈ మొక్క భారతదేశం పాకిస్తాన్, నేపాల్‌లోని హిమాలయాలకు చెందినది. ఇది దక్షిణ భారతదేశం, శ్రీలంకలోని కొన్ని ప్రాంతాలలో సహజంగా కనిపిస్తుంది. బెర్బెరిన్ ఒక కొత్త ఆరోగ్య ఆవిష్కరణలా అనిపించినప్పటికీ, దాని చరిత్ర శతాబ్దాల నాటిది. మూడువేల ఏళ్ల క్రితం నుంచి చైనీస్ వైద్యలో దీన్ని ఉపయోగిస్తున్నారు. అలాగే భారత ఆయుర్వేదంలో కూడా దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా బరువు నిర్వహణపై ఆసక్తి ఉన్నవారిలో బెర్బెరిన్కు ఆదరణ పెరుగుతోందని చెబుతున్నారు వైద్యులు. ఇది బరువు నిర్వహణ, కొలెస్ట్రాల్, చక్కెర నియంత్రణ వంటి వాటిలో దీని పాత్ర రీత్యా క్రేజ్ పెరిగిందని అంటున్నారు. ఇది జీర్ణవ్యవస్థ ఆరోగ్యం నుంచి గుండె సంబంధిత సమస్యలకు సైతం మద్దతిస్తుందట. ముఖ్యంగా ఆడవాళ్లలో వచ్చే పీసీఓఎస్ సమస్యలకు కూడా చెక్పెట్టగలదట. అందువల్లే దీన్ని నేచర్స్ ఓజెంపిక్ అని పిలుస్తారట. దీన్ని సాంప్రదాయకంగా జ్వరాలు, విరేచనాలు, చర్మవ్యాధులు, కంటివ్యాధుల కోసం కూడా ఉపయోగిస్తారని చెబుతున్నారు వైద్యులు. ఆ ప్రయోజనాల రీత్యా ఇటీవలకాలంలో దీన్ని క్యాప్సూలస్, టాబ్లెట్లు, సప్లిమెంట్లు రూపాల్లో విరివిగా ఉపయోగించడంతో.. ఈ పురాతన ఆయుర్వేద మూలిక నెట్టింట ట్రెండీగా మారింది. View this post on Instagram A post shared by Sarthak Ahuja (@casarthakahuja) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: మేయర్-రోకిటాన్స్కీ-కస్టర్-హౌజర్ సిండ్రోమ్ అంటే..! పాపం ఆ మహిళ 20 ఏళ్లుగా..) -
మేయర్-రోకిటాన్స్కీ-కస్టర్-హౌజర్ సిండ్రోమ్ అంటే..! పాపం ఆ మహిళ 20 ఏళ్లుగా..
కొన్ని అరుదైన వ్యాధులు శాపంగా మారతాయి. వైవాహిక జీవితాన్ని ఇబ్బందుల్లో పెట్టి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మార్చేస్తాయి. అలాంటి వాటిని కూడా ఆధునిక వైద్యం సరికొత్త ఆశను అందించి ఊపిరిపోస్తున్నాయి. ప్రస్తుతం అలాంటి సమస్యనే ఎదుర్కొంటున్న మహిళకు అక్క ఉదారత, ఆధునిక వైద్య ఆమె జీవితంలో నవ్వులు విరబూసేలా చేశాయి. అసలేం జరిగిందంటే..యూకేకు చెందిన 36 ఏళ్ల లారెన్ ఫౌలర్ అనే మహిళ 20 ఏళ్లుగా మాతృత్వం కోసం ఎదురుచూస్తోంది. ఎందుకంటే ఆమెకు 'మేయర్-రోకిటాన్స్కీ-కస్టర్-హౌజర్ సిండ్రోమ్' అనే అరుదైన జన్యుపరమైన వ్యాధి కారణంగా గర్భశయమే లేకుండా పుట్టింది. ఆ కారణంగా ఆమెకు పీరియడ్స్ లాంటివి ఉండవు. అందువల్ల సహజపద్ధతిలో పిల్లల్లను కనే సామర్థ్యం ఉండదామెకు. నిజానికి ఆ అరుదైన జన్యుపరమైన వ్యాధిలో గర్భాశయం అభివృద్ధి చెందదు కానీ ఆరోగ్యకరమైన అండాశయాలు ఉంటాయి. అలాగే అందరి అమ్మాయిల్లా..మిగతా అవయవాలన్నీ అభివృద్ధి చెందుతాయి తప్ప రుతక్రమం అనేది ఉండదు. అనేపథ్యంలోనే లారెన్‌కు గర్భం దాల్చే అవకాశం లేకుండా పోయింది. అలాగే ఆమెకు టైప్1 డయాబెటిస్ పేషెంట్ కూడా. దాంతో ఆమె 40 ఏళ్ల అక్క కెల్లీ తన సోదరి లారెన్‌కి గర్భశయాన్ని దానం చేసేందుకు ముందుకు వచ్చింది. ఎందుకంటే అప్పటికే ఆమెకు ముగ్గురుపిల్లలకు కూడా ఉండటంతో సోదరి కోసం ఈ త్యాగం చేసేందుకు ముందుకొచ్చిందామె. ఇక లారెన్ తన ఆరోగ్య పరిస్థితి గురించి సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ పోస్ట్‌లో గర్భశయ మార్పిడకి సంబంధించిన శస్త్ర చికిత్స గురించి కూడా ఇలా రాసుకొచ్చింది లారెన్. ఇది తన జీవితంలో ఎదుర్కోబోయే అతిపెద్ద అత్యంత కఠినమైన కోలుకునే ప్రక్రియగా పేర్కొంది. దీనికోసం శారీరకంగా మానసికంగా భావోద్వేగపరంగా సిద్ధంగా ఉండాలనే ముందే నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఈ శస్త్ర చికిత్స ఎలం క్లిష్టమైనదో అందరూ ముందుగానే హెచ్చరించారని, వాళ్లు అన్నట్లుగానే ఇది తనకు చాలా ఛాలెంజ్‌లు విసిరిందని చెప్పుకొచ్చింది. తన ప్రతి భావోద్వేగాన్ని, తన శరీరంలోని ప్రతి అణువు బలాన్ని గట్టిగానే పరీక్షించిందని ఆవేదనగా రాసుకొచ్చింది పోస్ట్‌లో. నిజంగానే ఇది తనను పరీక్షించి, ప్రతి కణాన్ని హరించేసి, తనలో ఎంత బలం ఉందో పరీక్ష పెట్టిందని అంటోంది. అయితే తాను 20 ఏళ్లుగా మాతృత్వం కోస పడుతున్న తపన ముందు ఈ బాధ ఎంత అని వెనక్కి తగ్గకుండా ముందుక సాగానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తల్లిబిడ్డ ఇద్దరు వైద్య పర్యవేక్షణలో ఉన్నారని, అక్టోబర్‌లో సిజేరియన్‌చేసి బిడ్డను బయటకు తీయాలని వైద్యులు ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడిస్తూ పోస్ట్‌ని ముగించింది. ఇక ఆమె సోదరి కూడా తన పిల్లలు కూడా తన చెల్లెలు కనబోయే బిడ్డ కోసం ఆత్రుతుగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. ఒకే గర్భం నుంచి పుట్టిన పిల్లలు కాబట్టి వీరందరి మధ్య విడదీయరాని బంధమే ఉంటుందని ఆశిస్తున్నానని పేర్కొంది ఆమె అక్క కెల్లీ. Source: పీపుల్స్ డాట్ కామ్ ఆంగ్ల వెబ్సైట్ ఆధారంగా ఇచ్చిన కథనం ఇది. (చదవండి: ఆ బుడ్డోడు పాటపాడిన తీరుకి..పర్యాటక ప్రేమికులంతా..!) -
ఏ రకమైన దోమ కుడితే ఎలాంటి వ్యాధి వస్తుందో తెలుసా?
World Mosquito Day 2026 అసలే వర్షాకాలం సీజన్.. సరైన పారిశుధ్య చర్యలు చేపట్టక దోమలు విజృంభిస్తున్నాయి. దీంతో అంటువ్యాధుల వ్యాప్తి పెరుగుతోంది. దోమల ద్వారా సంభవించే వ్యాధులపై నిర్లక్ష్యం వహిస్తే ప్రాణానికే ప్రమాదంగా మారుతుంది. జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో నిధుల లేమి, ఇతరత్రా కారణాల వల్ల పారిశుధ్య చర్యలు చేపట్టడం లేదు. దీనివల్ల దోమల వ్యాప్తి విపరీతంగా పెరిగిపోతోంది. దోమలు కుట్టడం ద్వారా మలేరియా, డెంగీ, చికున్‌గున్యా, జికా వైరస్ వంటి ప్రమాదకర వ్యాధులు సంభవించే అవకాశం ఉంది. దీంతో పాటు కొన్ని ఏరియాల్లో ఎల్లో ఫీవర్, ఎలిఫెంటియాసిస్, వెస్ట్ నైల్ వైరస్ వ్యాధులు కూడా అరుదుగా సంభవిస్తున్నాయి. ఈ వ్యాధుల నివారణకు తీసుకోవలసిన చర్యలను వివరిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఏటా ఆగస్టు 20న ప్రపంచ దోమల దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఆడ ఎనాఫిలిస్ దోమ కుట్టడం వల్ల మలేరియా వ్యాధి సంభవిస్తుందనే విషయాన్ని బ్రిటన్ వైద్యుడు సర్ రోనాల్డ్ రాస్ 1897 ఆగస్టు 20న కనుగొనడంతో అప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రపంచ వ్యాప్తంగా దోమల దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని 56 ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. దోమకాటుపై అలసత్వం వద్దు చిన్న దోమ కుట్టడం వల్ల పెద్ద వ్యాధి సోకే అవకాశముంది. దోమల ద్వారా వ్యాధి సోకిన వ్యక్తి సకాలంలో చికిత్స తీసుకోకుండా అలసత్వం వహిస్తే ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతుంది. దోమల నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య ఆరోగ్యశాఖ ద్వారా ప్రతి శుక్రవారం డ్రైడేను పాటిస్తున్నా దోమల ఉధృతి మాత్రం తగ్గడం లేదు. అయితే వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా దోమలను సులభంగా నియంత్రించే అవకాశ«ం ఉంది. సంపూర్ణ పారిశుధ్య చర్యలు పాటించడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టి అంటువ్యాధులను నివారించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 2500 రకాల దోమలు ఉండగా అందులో ఏడు జాతులు ఎక్కువ వ్యాధులను వ్యాప్తి చేస్తాయి. అయితే దేశంలో ప్రధానంగా అనాఫిలిస్, ఏడీఎస్, క్యూలెక్స్ దోమల వల్ల దేశంలో విస్తృతంగా వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. మిగతా రకాలైన కులిసేట, మాన్సోనియా, సోరోఫోరా, టోక్సోరిన్కైట్స్ జాతి దోమలు స్థానిక వాతావరణ పరిస్థితుల వల్ల అంతగా ప్రభావం చూపలేవు.దోమల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు ఇంటి పరిసరాల్లో అపరిశుభ్రత ఉండకూడదు ఇంటిచుట్టూ మురుగునీరు నిల్వ ఉండకూడదు సాయంకాలం తరువాత ఇంటి కిటీకీలు, తలుపులు మూసి ఉంచాలి నిద్రించే సమయంలో దోమలు తెరలు ఏర్పాటు చేసుకోవాలి. శరీరం పూర్తిగా కప్పి ఉంచేలా పొడవైన దుస్తులు ధరించాలి. తగినంత నీరు తాగాలి. ఆహార సమతుల్యతను పాటించాలి. కూలర్లు, కుండీల్లో వారినికోసారి నీటిని మార్చాలి.ఏ రకమైన దోమ కుడితే ఏం వస్తుందంటే.. ఆడ అనాఫిలిస్ దోమ కుట్టడం ద్వారా మలేరియా సోకుతుంది సూక్ష్మజీవి ద్వారా డెంగీ వ్యాప్తి చెందుతుంది. చికున్‌గున్యా ఏడీఎస్ దోమ కుట్టడం వల్ల చికున్‌గున్యా వస్తుంది. ఏడీఎస్ ఈజిప్టు దోమ కుడితే జికా వైరస్ సోకుతుంది. ఇది లైంగిక సంపర్కం ద్వారా మరొకరికి కూడా సోకుతుంది. క్యూలెక్స్ దోమ రాత్రి వేళల్లో కుడుతుంది. దీని వలన బోదకాలు వ్యాధి సంభవిస్తుంది.ఇదీ చదవండి: త్విషా శర్మ : నన్ను ప్రశాంతంగా చావనివ్వండి : ఆ 90నిమిషాల్లో ఏం జరిగింది? -
గుండె ఆరోగ్యం కోసం... ఈ రంగులోని పండ్లు భేష్..
ఎరుపు, నీలం, ఊదా రంగుల్లో ఉండే పండ్లు, కూరగాయల్లో సహజంగా లభించే ‘ఆంథోసయానిన్’ అనే జీవక్రియాత్మక సమ్మేళనాలు గుండె ఆరోగ్యానికి, జీవక్రియల మెరుగుదలకు తోడ్పడతాయని తాజా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా బ్లూబెర్రీలు వంటి పండ్లలో ఈ సమ్మేళనాలు సమృద్ధిగా ఉండటంతో, అవి గుండె ఆరోగ్యానికి తొడ్పడతాయని పరిశోధకులు పేర్కొన్నారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లో ప్రచురితమైన ఈ సమగ్ర విశ్లేషణలో 27 ప్రచురణల్లో వెల్లడైన 18 దీర్ఘకాలిక అధ్యయనాలు, అలాగే ఎలాంటి వ్యాధులు లేని పెద్దలపై నిర్వహించిన 65 ర్యాండమైజ్డ్ కంట్రోల్డ్ ట్రయల్స్‌ను పరిశీలించారు. తక్కువ స్థాయిలో ఆంథోసయానిన్లు తీసుకునే వారితో పోలిస్తే, ఎక్కువగా తీసుకునే వారిలో పలు ఆరోగ్య ప్రయోజనాలు కనిపించినట్లు అధ్యయనం తెలిపింది. కలిగే ప్రయోజనాలు..గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం 26 శాతం తగ్గింది.గుండెపోటు (మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్) ప్రమాదం 18 శాతం తగ్గింది.టైప్-2 మధుమేహం వచ్చే అవకాశం 11 శాతం తగ్గింది.గుండె సంబంధిత కారణాలతో మరణాల ప్రమాదం 9 శాతం తగ్గింది.అధిక రక్తపోటు ప్రమాదం 8 శాతం తగ్గింది.రోజుకు కనీసం 50 మిల్లీగ్రాముల ఆంథోసయానిన్లు తీసుకున్న వారిలో రక్తనాళాల పనితీరు మెరుగుపడటంతో పాటు, ఇన్సులిన్ స్థాయిల్లో సానుకూల మార్పులు కనిపించినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ స్థాయిని సహజంగా రంగులున్న పండ్లు, కూరగాయలు తీసుకోవడం ద్వారా పొందవచ్చని వారు పేర్కొన్నారు.భారతదేశంలో గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి జీవనశైలి సంబంధిత సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిశోధన ఫలితాలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రతిరోజూ ఆహారంలో వివిధ రంగుల పండ్లు, కూరగాయలను చేర్చడం వంటి సమతుల ఆహారపు అలవాట్లు పెంపొందించుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.ఈ సందర్బంగా అమెరికా హైబుష్ బ్లూబెర్రీ కౌన్సిల్ భారత ప్రతినిధి రాజ్ కపూర్ మాట్లాడుతూ, “సహజ రంగులతో కూడిన ఆహార పదార్థాలను రోజువారీ భోజనంలో భాగం చేసుకోవడం ఎంతో ముఖ్యమని ఈ అధ్యయనం మరోసారి నిరూపించింది. ఆంథోసయానిన్లు సమృద్ధిగా ఉండే అమెరికన్ బ్లూబెర్రీల వంటివి కూడా భారతీయ ఆహార అలవాట్లలో సులభంగా చేర్చుకోవచ్చు” అని తెలిపారు.అయితే ఒక్క ఆహార పదార్థం మాత్రమే వ్యాధులను నివారిస్తుందని లేదా చికిత్స చేస్తుందని ఈ పరిశోధన చెప్పడం లేదని పరిశోధకులు స్పష్టం చేశారు. సమతుల ఆహారం, క్రమమైన శారీరక వ్యాయామం, సరిపడ నిద్ర, వైద్యుల సూచనలు పాటించడం వంటి ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా ఆంథోసయానిన్ అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని పేర్కొన్నారు. ఈ అధ్యయన ప్రధాన పరిశోధకురాలు ప్రొఫెసర్ ఏడిన్ క్యాసిడీ మాట్లాడుతూ, చిన్న చిన్న ఆహారపు మార్పులు కూడా గుండె జబ్బులు, అధిక రక్తపోటు, టైప్-2 మధుమేహం ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని అధ్యయనం తేల్చిందన్నారు.(చదవండి: ఆంథోసయనిన్ గుండె, జీవక్రియ ఆరోగ్యానికి ఎలా తోడ్పడుతుందంటే..!) -
Health: నిమోనియా హానియా? ఎవరికి ఎక్కువ ముప్పు?
మన ఊపిరితిత్తులు అనునిత్యం శ్వాస తీసుకుంటూ నిరంతరాయం పనిచేస్తూనే ఉంటాయి. అలా అవి ఏమాత్రం విశ్రాంతి లేకుండా శ్వాస తీసుకుంటూనే ఉండాలి. అప్పుడే ్రపాణాలు నిలుస్తాయి. ఈ ప్రక్రియలో ముక్కు నుంచి తీసుకున్న గాలి... ఊపిరితిత్తుల్లోని అతి చివరి అంచె అయిన ‘ఆల్వియోలై’ అనే గాలి గది (ఎయిర్ శ్యాక్)ని చేరాలి. ఈ ఆల్వియోలై నుంచే బయటి నుంచి మనం తీసుకున్న ఆక్సిజన్ మన దేహంలోని అన్ని అవయవాల్లోని కణాలకు అందడమూ, అలాగే లోపలి కలుషితమైన గాలి అక్కడి నుంచే బయటికి రావడం వంటి ‘గ్యాసెస్ ఎక్స్ఛేంజ్’ ప్రక్రియ చోటుచేసుకుంటుంది. ఏదైనా కారణం వల్ల ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ రావడం వంటి కారణాలతో... గాలి గదిలో (ఆల్వియోలైలో) ఇన్ఫ్లమేషన్ కారణంగా అందులోకి చీము లేదా తెమడ / ఫ్లెమ్ వంటి ద్రవాలు నిండటంతో శ్వాసకు అంతరాయం కలిగితే అది నిమోనియా సమస్యకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో నిమోనియా అంటే ఏమిటో చూద్దాం.నిమోనియా సమస్య ప్రధానంగా బ్యాక్టీరియా (ఉదా: స్ట్రెప్టోకోకస్), వైరస్‌లూ (ఉదా: ఫ్లూ అలాగే రెస్పిరేటరీ సిన్సీషియల్ వైరస్), ఫంగైలతో పాటు ఏవైనా ఆహార పదార్థాలూ, ద్రవాలు (ఉదా: ఆహారం, నీళ్లు వంటివి) ఊపిరితిత్తులోకి చేరడం వల్ల వచ్చే అవకాశాలెక్కువ.కారణాలు..బాక్టీరియా వల్ల – స్టెఫలోకాకస్ బ్యాక్టీరియా (ఇది పెద్దల్లో సాధారణంగా వచ్చేందుకు కారణమవుతుంది), హీమోఫీలస్ (పిల్లల్లో సాధారణంగా దీనివల్ల వస్తుంది), గ్రామ్‌నెగెటివ్, అనరోబిక్, టీబీ బ్యాక్టీరియా మొదలైన బ్యాక్టీరియాల వల్ల.వైరస్ వల్ల – ఇన్ఫ్లుయెంజా, రెస్పిరేటరీ సిన్సీషియల్ వైరస్... వంటి వైరస్‌లతో పాటు తరచూ వచ్చే కొత్త వైరస్ల వల్ల కూడా నిమోనియా రావచ్చు. ఏదైనా వైరస్ విజృంభించి ఒక చోట ఎపిడమిక్‌లా వచ్చి, తన ప్రభావం చూపిన తర్వాత నిమోనియాకు దారితీసే అవకాశాలు ఎక్కువ. ఆ వైరస్ సోకిన తర్వాత బాధితుల్లో రోగనిరోధక శక్తిని బట్టి నిమోనియా వచ్చే అవకాశాలు ఆధారపడి ఉంటాయి.ఫంగస్ వల్ల కూడా.కొద్ది ప్రదేశంలోనే ఎక్కువమంది ఉండటం (ఓవర్ క్రౌడింగ్)ఆల్కహాల్ అలవాటుతో– (దీని వల్ల వ్యక్తుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగానూ రోగనిరోధక శక్తి (డిఫెన్స్ మెకానిజం) తగ్గుతుంది. మత్తులో దగ్గడం కూడా తక్కువే. దాంతో లోన ఉన్న పడని పదార్థాలు అక్కడే ఉండిపోవడంతో నిమోనియా రావచ్చు.మైక్రో యాస్పిరేషన్ – మనకు తెలియకుండానే ద్రవాలు గొంతునుంచి శ్వాసనాళంలోకి జారిపోతుంటాయి. ఆ ప్రక్రియనే మైక్రోయాస్పిరేషన్ అంటారు. ప్రతివ్యక్తి గొంతులో బ్యాక్టీరియా ఉంటుంది. దీన్నే ఓరోఫ్యారింజియల్ ఫ్లోరా అంటారు. ఆ బ్యాక్టీరియా గొంతు నుంచి శ్వాసనాళాల ద్వారా గాలిగదుల వరకు పోవడం వల్ల కూడా నిమోనియా రావచ్చు.లక్షణాలివే...నిమోనియాలో...జ్వరం, దగ్గు, ఒళ్లునొప్పులు, చలిగా ఉండటం, ఒక్కోసారి ఆకలి లేకపోవడంతెమడ / కఫం (ఫ్లెమ్) ఉండవచ్చు లేదా లేకపోవచ్చు. ఉంటే తెల్లగా / పసుపురంగులో ఒక్కోసారి రక్తపు చారికతోనూ కనిపించవచ్చు.నిమోనియా ఇన్ఫ్లమేషన్ ఊపిరితిత్తి తాలూకు పొర (ప్లూరా)కు చేరినప్పుడు ఛాతినొప్పి కూడా రావచ్చు.నిమోనియా మరీ తీవ్రంగా ఉంటే ఆయాసం కూగా రావచ్చు. ఇక ఇంటస్టిషియల్ నిమోనియాలో దగ్గు ఉండదు. కాని ఆయాసం మాత్రం ఉంటుంది. ఇది ఎంతటి విషమ పరిస్థితికి దారితీస్తుందంటే... ఒక్కోసారి శ్వాసప్రక్రియ ఆగిపోవచ్చు కూడా.ఆస్తమాలో పిల్లికూతలు ఉంటాయి. గాని నిమోనియాలో ఉండవు. గాలి పీలుస్తున్నా అది లోపలికి వెళ్లదు. కారణం... గాలి చేరాల్సిన ప్రదేశమైన గాలిసంచిలోని చీము వంటి ద్రవాలు లేదా తెమడ (ఫ్లెమ్) వంటివి అడ్డంకిగా ఉండవచ్చు. ఇలా గాలిగదిలో పేరుకునే పదార్థాన్ని ‘ఎగ్జుడస్’ అంటారు. ఈ ఎగ్జుడస్ కారణంగా గాలిగదిలోకి ఆక్సిజన్ చేరదు. దాంతో దేహానికీ / దేహంలోని కణాలకూ అవసరమైనంత ఆక్సిజన్ అందదు. ఫలితంగా ఊపిరితిత్తులు పని చేయలేని పరిస్థితి వస్తుంది. దీన్నే ‘హైపాక్సిక్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్’ అంటారు.ఊపిరి అందకపోవడంతో నుదుటిపై చెమటలు పట్టడం, కంగారుగా ఉండటం, గుండె స్పందన వేగం పెరగడం, అయోమయం కారణంగా డీలా పడిపోవడం, బీపీ పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని ‘సివియర్ నిమోనియా’ అంటారు.కొందరు బాధితుల్లో ఛాతీలో తీక్షణమైన / తీవ్రమైన నొప్పి (షార్ప్ పెయిన్) కూడా రావచ్చు.సమయానికి చికిత్స తీసుకోకపోతే ప్రమాదమే...నిమోనియాకు సమయానికి తగిన చికిత్స తీసుకోకపోతే జబ్బు మరిన్ని కాంప్లికేషన్లకు దారితీయవచ్చు. అంటే... సెప్టిసీమియా (రక్తానికంతా ఇన్ఫెక్షన్ సోకడం, దీన్నే మామూలు భాషలో రక్తం విషపూరితంగా మారడం), రక్తపోటు పడిపోవడం, పక్షవాతం, మూత్రపిండాలు దెబ్బతినడం, మెదడుపై దుష్ప్రభావం పడటం కాంప్లికేషన్లు రావచ్చు. కొందరిలో మరణం కూడా సంభవించవచ్చు.నిమోనియా ఎవరెవరిలో... నిమోనియా ఏ వయసు వారిలోనైనా రావచ్చు. చాలా చిన్న పిల్లలు మొదలుకొని, అరవై ఏళ్లు దాటిన వృద్ధుల వరకు అందరిలోనూ కనిపించవచ్చు. సాధారణంగా ఈ వయసు వారిలో వ్యాధి నిరోధకశక్తి / వ్యాధి నిరోధక వ్యవస్థ పనితీరు తక్కువ కాబట్టి నిమోనియా చిన్నపిల్లల్లోనూ, వయస్సు పైబడ్డవారిలోనూ చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది.ఆహారంలో తగినన్ని పోషకాలు తీసుకోని వాళ్లలో రోగనిరోధక శక్తి తగ్గడంతో.సీఓపీడీ (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ – బ్రాంకైటిస్, ఎంఫసీమా) వంటి వ్యాధులు ఉన్నవాళ్లలోగుండె సమస్యలు ఉన్నవారిలోస్పీ›్లనెక్టమీ అనే ప్రక్రియ ద్వారా స్పీ›్లన్ తొలగించిన వాళ్లలోపొగతాగేవారిలో... వీళ్లందరిలోనూ నిమోనియా వచ్చే అవకాశాలెక్కువ.మరికొన్ని జబ్బులతో కలసి...మరికొన్ని ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడేవారిలో నిమోనియా సోకడం మామూలే. ఉదాహరణకు... సాధారణంగా డయాబెటిస్ ఉన్న వారు, క్యాన్సర్ కారణంగా కీమోథెరపీ తీసుకుంటున్నావారు, ఎయిడ్స్ బాధితులు, ఆస్తమా ఉన్నవారు, ఆల్కహాల్ ఎక్కువగా తాగేవారిలో నిమోనియా రావడం చాలా సాధారణం. ఇక గర్భవతుల్లో నిమోనియాను గుర్తించి, సరిగా వైద్య చికిత్స ఇవ్వకపోవడం వల్ల అదెన్నో కాంప్లికేషన్లకు దారితీసే ముప్పు ఉంటుంది.వ్యాధి నిర్ధారణబాధితుల్లో కనిపించే లక్షణాలను బట్టి క్లినికల్‌గా.సీబీపీ, సీఎక్స్ఆర్ వంటి చాలా సాధారణ పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు.ఒక్కోసారి అవసరాన్ని బట్టి ఛాతీ సీటీ స్కాన్, కళ్లె పరీక్ష వంటి ఇతర పరీక్షలు కూడా చేయాల్సి రావచ్చు.వీరిలో మరింత జాగ్రత్త అవసరం...బాధితుల్లో రెండు మూడు రోజుల నుంచి జ్వరం, దగ్గు, ఊపిరి అందకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే నిమోనియా ఉందేమోనని పరీక్షించాలి. డయాబెటిస్, పక్షవాతం, ఆస్తమా, గర్భిణుల్లో వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువ కాబట్టి వారిని చాలా జాగ్రత్తగా పరీక్షించాలి. ఇక ఆసుపత్రుల్లో నిమోనియా సోకే అవకాశాలు ఎక్కువ.నివారణ...పొగతాగే అలవాటు ఉంటే జ్వరం, దగ్గు, ఊపిరి అందకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే తక్షణం ఆ అలవాటును ఆపేయాలి.బయటి వాతావారణంలో పొగ ఉంటే దానికి ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్త పడాలి.ఆస్తమా రోగులు, బ్రాంకైటిస్ ఉన్నవారు తప్పనసరిగా అది నియంత్రణలోకి వచ్చేలా చికిత్స తీసుకోవాలి.క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. ఫలితంగా నిమోనియా వంటి ఇన్ఫెక్షన్లు తేలిగ్గా సంక్రమించవు.అన్ని పోషకాలూ ఉండే సమతులాహారం తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి పెరిగి, నిమోనియాతో పాటు అనేక ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కలుగుతుంది.చికిత్సనిమోనియాకు తగిన యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేయాల్సి ఉంటుంది. బాధితులను చాలా నిశితంగా పరిశీలించి యాంటీబయాటిక్స్ మోతాదును డాక్టర్లు చాలా జాగ్రత్తగా నిర్ణయిస్తారు. అందుకే నిమోనియాకు చికిత్స తప్పనిసరిగా డాక్టర్ల పర్యవేక్షణలోనే జరగాలి. సొంతవైద్యం ఎట్టిపరిస్థితుల్లోనూ పనికిరాదు.ఎవరికైనా మూడు రోజులకు పైబడి జ్వరం, ఛాతీనొప్పి, ఊపిరి సరిగా తీసుకోకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి.చిన్నాపిల్లల్లో నిమోనియా!చిన్నపిల్లలందరిలోనూ కనిపించినప్పటికీ... మరీ ముఖ్యంగా ఐదేళ్ల కంటే ఇంకా చిన్నారుల్లో ఇది చాలా ఎక్కువ. పెద్దల్లో వ్యాధి నిరోధక వ్యవస్థ బాగా పనిచేస్తుంటుంది కాబట్టి కాస్త తట్టుకుంటారు. కానీ చిన్నారుల్లో ఇమ్యూనిటీ అంతే బలంగా ఉండకపోవడం వల్ల ఒక్కోసారి ఇది ్రపాణాంతకమూ అయ్యే అవకాశముంది. అయితే ఇప్పుడున్న వైద్యపరిజ్ఞానంతో దీన్ని చాలావరకు సమర్థంగా తగ్గించవచ్చు.స్ట్రెప్టోకాకస్ నిమోనే, గ్రూప్–బి స్ట్రెప్టోకాకస్, స్టెఫలోకాకస్ ఆరియస్ వంటి బ్యాక్టీరియాతో పాటు ఐదేళ్ల కంటే మరీ చిన్న పిల్లల్లో ఇది రెస్పిరేటరీ సిన్సీషియల్ వైరస్, పారా ఇన్ఫ్లుయెంజా వైరస్, అడినోవైరస్ వంటి వైరస్లతోనూ వచ్చే అవకాశం ఉంది. పెద్దల్లోలాగే కొన్ని సందర్భాల్లో ఫంగైలతోనూ నిమోనియా రావచ్చు.లక్షణాలునిమోనియా వల్ల పిల్లలందరిలోనూ ఒకేలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. ఏ కారణంగా నిమోనియా వచ్చిందనే అంశాన్ని బట్టి లక్షణాలు మారుతుంటాయి. అయితే సాధారణంగా కనిపించే లక్షణాలివి...దగ్గు వస్తుంటుంది. ఇది తెమడ/ఫ్లెమ్ను ఉత్పత్తి చేస్తుండటం వల్ల తడిదగ్గు.తీవ్రమైన జ్వరం.ఆకలి తగ్గడం.తీవ్రమైన అలసట, నీరసం, నిస్సత్తువ.కొందరు పిల్లల్లో వాంతులు, విరేచనాలూ కావచ్చు.వైరస్ లేదా బ్యాక్టీరియా కారణంగా నిమోనియా వచ్చినా మొదట్లో లక్షణాలన్నీ దాదాపు ఒకేలా ఉంటాయి. అయితే వైరల్ నిమోనియాలో ఊపిరి తీసుకోవడం కష్టం కావడం, ఆయాసం, ఊపిరి తీసుకుంటున్నప్పుడు శబ్దం రావడం (వీజింగ్) వంటివీ కనిపించవచ్చు. బ్యాక్టీరియా కారణంగా వచ్చే నిమోనియా కంటే వైరల్ నిమోనియా కాస్త ప్రమాదకరం. పిల్లల్లో వణుకు, ఆయాసం, తలనొప్పి, అయోమయం వంటివి కనిపిస్తే అది ఒకింత ప్రమాదకరమని గుర్తించి వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.నిర్ధారణఛాతీ ఎక్స్‌రే.కొన్ని రక్తపరీక్షలు (రక్తంలో ఆక్సిజన్ మోతాదును తెలుసుకునే ఆర్టీరియల్ బ్లడ్‌గ్యాస్ వంటివి)కళ్లె పరీక్ష (స్ఫుటమ్ కల్చర్) : ఈ పరీక్ష వల్లనే నిమోనియాకు అసలు కారణం తెలుస్తుంది.సీటీ స్కాన్ (ఛాతీది)అవసరాన్ని బట్టి అరుదుగా బ్రాంకోస్కోపీ, ఊపిరితిత్తుల్లో నీరు చేరితే దాని పరీక్ష వంటివి చేస్తారు.చికిత్స బ్యాక్టీరియా వల్ల వచ్చే నిమోనియా మంచి యాంటీబయాటిక్స్‌తో తేలిగ్గా తగ్గిపోతుంది. అయితే వైరల్ ఇన్ఫెక్షన్తో నిమోనియా వస్తే దానికి నిర్దిష్టంగా మందులు లేకపోయినా కొన్నిసార్లు యాంటీవైరల్ మందులు ఇస్తారు. ఇలాంటి పిల్లలకు తగినన్ని నీళ్లు తాగించడం, గది బాగా సౌకర్యంగా ఉండటంతో పాటు అందులో తగినంత తేమ ఉండేలా చూడటం, జ్వరం, దగ్గు వంటివి తగ్గడానికి లక్షణాలను బట్టి (సింప్టమాటిక్) చికిత్స ఇవ్వడం వంటివి చేస్తారు.సెకండరీ నిమోనియాపిల్లల్లో ఇంకేదైనా వ్యాధి (ముఖ్యంగా వైరల్ జ్వరాలు) వచ్చాక, అది నిమోనియాకు దారితీస్తే దాన్ని సెకండరీ నిమోనియాగా పరిగణిస్తారు. దీనికి కాస్తంత ప్రమాదకరమైన కండిషన్. అందుకే హాస్పిటల్లో ఉంచి చికిత్స అందించాలి. ఇందులో తీవ్రతను బట్టి రక్తనాళం ద్వారా లేదా నోటి ద్వారా యాంటీబయాటిక్స్ ఇవ్వడం, వాళ్లలో నీరు, లవణాల మోతాదుల నిర్వహణ కోసం సెలైన్ వంటి ఫ్లుయిడ్స్ ఎక్కించడం, ఆక్సిజన్ ఇవ్వడం, పిల్లలు తమంతట తాము కళ్లె / గల్ల / ఫ్లెమ్ తీయలేరు కాబట్టి వారు దాన్ని ఊసేలా వివరించి చెప్పడం, బాగా ఊపిరితీసుకోగలుగుతున్నారా అని చూడాలి. అందుకే చిన్నారుల్లో సెకండరీ నిమోనియా కనిపిప్తే వారిని తప్పనిసరిగా హాస్పిటల్లో ఉంచే చికిత్స అందించడం మంచిది. నివారణపిల్లలకు చిన్నతనంలో ఇచ్చే బీసీజీ, పెర్టుసస్‌లతో పాటు నిమోకోకల్ వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా దీన్ని నివారించవచ్చు. ఇప్పుడు 13 రకాల నిమోనియాలకు తగిన వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. పిల్లలకు రెండు నెలల వయసప్పుడు నిమోనియా వ్యాక్సిన్స్ మొదటి డోసు, రెండేళ్ల పైబడ్డ పిల్లలకు సైతం వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి.అందరు పిల్లలకు ప్రతి ఏడాదీ ఫ్లూ వ్యాక్సిన్ వేయించాలి. వర్షాకాలానికి ముందు (ప్రీ–మాన్సూన్ పీరియడ్‌లో) ప్రతి ఏడాదీ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇలా తీసుకుంటే వైరల్ ఫ్లూని నియంత్రించవచ్చు.వ్యక్తిగత పరిశుభ్రత పాటించడాన్ని పిల్లలకు నేర్పడం, బాగా దగ్గుతున్న పెద్దలు, వ్యాధిగ్రస్తుల దగ్గరికి వెళ్లకుండా చూస్తూ... పిల్లలను అలాంటివారి నుంచి దూరంగా ఉంచడం, చాలాకాలం పాటు ధాన్యం నిల్వ ఉంచే గరిసెలు, అలాగే కోళ్ల వంటి పెంపుడు పక్షులకు పిల్లలను దూరంగా వంటి కొద్దిపాటి జాగ్రత్తలతో నిమోనియాను చాలావరకు నివారించవచ్చు.చివరిగా... నిమోనియాను యాంటీబయాటిక్స్‌తో చాలావరకు నయం చేయడం సాధ్యమే అయినప్పటికీ... పెద్దల్లోనైనా, పిల్లల్లో జ్వరం, ఆగకుండా దగ్గు వస్తూ, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు అంత తేలిగ్గా తీసుకోకుండా ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవడమే మంచిదని గుర్తుంచుకోవాలి.- డా. రమణ ప్రసాద్, సీనియర్ పల్మునాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్నిర్వహణ : యాసీన్ -
విటమిన్లు తగ్గితే మతిమరుపే?
వయసు పైబడు తున్న కొద్దీ వచ్చే జ్ఞాపకశక్తి సమస్యలకు, శరీరంలో ఉండే కొన్ని ముఖ్యమైన విటమిన్ల స్థాయిలకు మధ్య అత్యంత బలమైన లంకె ఉందా? అవుననే చెబుతోంది ఐసీఎంఆర్–జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) తాజా అధ్యయనం. వృద్ధుల్లో రక్తంలోని విటమిన్ స్థాయిలు తగ్గడం వల్ల మెదడు పని తీరు మందగించి మతిమరుపు లేదా జ్ఞాపకశక్తి తగ్గే తొలి దశ వచ్చే ప్రమాదం ఉందని తేలింది.అంత ర్జాతీయ మెడికల్ జర్నల్ ’న్యూట్రియెంట్స్’లో ప్రచురితమైన ఈ ప్రత్యేక అధ్యయనంలో భాగంగా హైదరాబాద్‌కు చెందిన 55–85సంవత్సరాల మధ్య వయసు గల 184 మంది వృద్ధులపై క్షేత్ర స్థాయిలో పరిశోధనలు జరిపారు. ఇందులో తేలిన షాకింగ్ నిజం ఏమిటంటే.. వీరిలో 36.4% మంది అప్పటికే జ్ఞాపకశక్తి తగ్గే ఈ తొలి దశ బారిన పడినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.విటమిన్ల లోపమే శాపమా?జ్ఞాపకశక్తి సమస్యలతో బాధపడుతున్న వృద్ధుల రక్త నమూనాలను పరీక్షించినప్పుడు వారిలో డీ, బీ1, బీ2, బీ6, బీ9, బీ12 విటమిన్ స్థాయిలు చాలా తక్కువగా ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా డీ, బీ2, బీ9 విటమిన్లలో లోపాలు వీరిలో అత్యధికంగా కనిపించాయి. శరీరంలో విటమిన్–డీ, బీ6 స్థాయిలు సమృద్ధిగా ఉన్నవారిలో ఆలోచనా శక్తి, మానసిక పనితీరు, మెదడు చురుకుదనం చాలా మెరుగ్గా ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. అలాగే, జ్ఞాపకశక్తి సమస్యలు ఉన్న వృద్ధుల్లో కేవలం విటమిన్ల లోపమే కాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలు, బీపీ కూడా చాలా ఎక్కువగా ఉన్నట్లు గమనించారు. అందువల్ల మధుమేహం, రక్తపోటు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని ఈ అధ్యయనం సూచిస్తోంది.ముందస్తు జాగ్రత్తలువృద్ధాప్యంలో కేవలం వ్యాధుల నియంత్రణపైనే కాకుండా పోషకాహార భద్రతపై కూడా సమానంగా దృష్టి పెట్టాలని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. శరీరంలో తగినంత మొత్తంలో సూక్ష్మపోషకాలు ఉండేలా చూసుకోవడం, వయసు పైబడుతున్న వారిలో ప్రారంభ దశలోనే పోషకాహార లోపాలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఎన్ఐఎన్ బయోకెమిస్ట్రీ విభాగం అధిపతి, పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ జి.భానుప్రకాశ్ రెడ్డి తెలిపారు. మెదడు చురుకుదనాన్ని నిలుపుకుంటూ ఆరోగ్యకర వృద్ధాప్యాన్ని ఆస్వాదించడానికి ముందస్తు పోషకాహార పరీక్షలు, సకాలంలో తీసుకునే సమతుల్య ఆహారం ఎంతగానో దోహదపడతాయని చెప్పారు. -
147 కేజీల నుంచి 109 కేజీలకు..! ఆ డైట్‌తో 38 కేజీలు..
బరువు తగ్గడానికి ఆహారం, వ్యాయామం పట్ల క్రమశిక్షణతో కూడిన విధానం అవసరం. కేలరీల లెక్కింపు వ్యాయామం వంటివి బరువు తగ్గేందుకు ఉపకరించేవే. అయితే ఈ కంటెంట్ క్రియేటర్ బరువు తగ్గడానికి ఒక వెరైట్ డైట్ విధానం అనుసరించి ఏకంగా 38 కేజీల బరవు తగ్గాడు. అందుకు సంబంధించిన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నాడు. తాను భవిష్యత్తులో పుట్టబోయే బిడ్డ కోసం ఆరోగ్యకరమైన తండ్రిగా ఉండాలనే ఉద్దేశ్యంతో బరువు తగ్గానని వెల్లడించారు. మరి ఆయన అనుసరించిన డైట్ విధానం గురించి సవివరంగా తెలుసుకుందామా..!.కంటెంట్ క్రియేటర్ జెఫిన్ స్వతహాగా పెద్ద ఫుడ్డీనని అన్నారు. అనారోగ్యకరమైన స్నాక్స్ పట్ల ఉన్న ఇష్టం గురించి కూడా మాట్లాడారు. అలాగు తాను ఏళ్ల తరబడి అధిక బరువుతో పోరాడినట్లు తెలిపారు. తాను 2018లో 35 కిలోలు తగ్గానని, కానీ ప్రతి గ్రాము తిరిగి పెరిగిపోవడాన్ని చూశానని అన్నారు. అయితే 2022లో పెళ్లి కోసం మళ్లా బరువు తగ్గానని చెప్పారు. కానీ హైదరాబాద్‌కు మారిన తర్వాత ఒత్తిడి పెరిగి మళ్లీ యథావిధిగా బరువు పెరిగిపోయానని పోస్ట్‌లో రాసుకుకొచ్చారు. తన అధిక బరువు తనకు బాధకరమైన అంశంగా మారిందని అన్నారు. ఇతరులకు ఇచ్చే స్నేహపూర్వక సలహాలు కూడా ఒత్తిడిని పెంచాయని చెప్పారు. గతేడాది ఏకంగా 147 కిలోల అధిక బరువుకి చేరిపోయానని అన్నారు. పైగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నట్లు నిర్థారణ అయ్యిందని చెప్పుకొచ్చారు. ఎప్పటికైనా.. తన జీవనశైలి కారణంగా తక్షణ స్ట్రోక్ ప్రమాదం వచ్చే అవకాశం ఉందని అన్నారు. పైగా తన భార్య రిన్సీ తను కలిసి ఒక బిడ్డను కనాలనే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. ఆ నేపథ్యంలోనే తాము ఆరోగ్యంగా ఉండాలని నిర్ణయించుకుని..ఇలా వెయిట్‌లాస్ జర్నీకి ఉపక్రమించామని అన్నారు. అయితే తమ ఫిట్నెస్ ప్రయాణం ఎలా ప్రారంభమైందో ఇలా పంచుకుంది ఆ జంట. తాము ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్(అడపాదడపా ఉపవాసం)ని ఉపయోగించనట్లు తెలిపారు. ఆ నేపథ్యంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు చిరుతిళ్లకు దూరంగా ఉండాలనే నియమం పెట్టుకున్నామని అన్నారు. అలాగే డైట్లో తన భార్య రోజుకు రెండు పూటల భోజనానికి మారగా, తాను ఒక్క పూట భోజనానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. అలా ఇప్పుడు తాను 109కిలోలకు చేరానని, ఇప్పటికీ ఆ ఆహార నియమాన్ని, వ్యాయామాలను అనుసరిస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడిక మరింతగా ఆరోగ్యకరమైన బరువు చేరుకోవడమే లక్ష్యంగా తామిద్దరం కలిసి పనిచేస్తున్నామని అన్నారు. ఒమాడ్ డైట్..ఒమాడ్ అంటే ఒకరకమైన ఇంటర్మిటెంట్ పాస్టింగ్. ఇది ఒక వ్యక్తి తీసుకునే కేలరీలను ఒకే భోజనానికి లేదా ఒక గంట వంటి తక్కువ సమయానికి పరిమితం చేస్తారు. అంటే రోజంతా ఒక భోజనం చేసి, ఇతర ఆహార పదార్థాలను తీసుకోకపోవడం లేదా ఒకే భోజనం చేసి, ఉపవాస సమయంలో పరిమిత పరిమాణాంలో ఆహారం తీసుకోవడం వంటివి ఉంటాయి. ఈ ఆహార పద్ధతి కేలరీల లోటుకి దారితీస్తుంది. అంటే శరీరం ఖర్చు చేసే కేలరీల కంటే తక్కువ కేలరీలను తీసుకుంటుంది. దీనివల్ల సునాయాసంగా బరువు తగ్గొచ్చు అని చెప్పారు. ఈ విధానం వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటంటే.. రక్తంలో చక్కెర, వాపు స్థాయిలు తగ్గడం తోపాటు గుండె జబ్బుల ప్రమాద కారకాలు తగ్గుతాయని అన్నారు. కానీ ఈ ఆహార పద్ధతి పిల్లలు కౌమారదశలో ఉన్నవారికి, వృద్ధులకు, ఆహార సంబంధిత రుగ్మతలు ఉన్నవారికి, గర్భిణీ లేదా పాలిచ్చే మహిళలకు తగినది కాదని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: అంట్లు తోమే స్థాయి నుంచి..రూ. 160 కోట్ల కంపెనీ నిర్మించే రేంజ్‌కు..!) -
దంపతులు అలా నిద్రిస్తేనే మంచిది..!: బ్రయాన్ జాన్సన్
టెక్ వ్యవస్థాపకుడు, దీర్ఘాయువు నిపుణుడు బ్రయాన్ జాన్సన్ ఆరోగ్యకరమైన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటుంటారు. ఈసారి మాత్రం ఆయన చెప్పిన విషయం అందర్నీ విస్తుపోయేలా చేసింది. పైగా అవి కాస్త సర్వత్రా వివాదాస్పదంగా, చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ ఆయన ఏం అన్నారంటే..బ్రయాన్ జాన్సన్ మంచి నిద్ర కోసం దంపతులకు కొన్ని ఆసక్తికరమైన సూచనలు, సలహాలు ఇచ్చారు. అయితే ఇక్కడ దంపతులు ఎలా బెడ్ షేర్ చేసుకుంటే మంచిదో చెప్పడమే కాస్త చర్చలకు దారితీసింది. వేర్వేరు పడకలు అనేవి భార్యభర్త మధ్య దూరానికి సంకేతంగా చెబుతారు పెద్దలు. కానీ బ్రయాన్ మాత్రం ఆరోగ్యకరమైన నిద్ర కోసం భాగస్వామ్యులు వేర్వేరుగా పడుకుంటేనే మంచిదని బాంబు పేల్చాడు. అంతేగాదు తాను సైతం తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి నిద్రించనని తేల్చి చెప్పేశాడు. అది నిద్రనాణ్యతను ప్రభావితం చేస్తుందని చెబుతున్నాడు. నిజంగా జంటలు కలిసి నిద్రిస్తే..నిద్ర నాణ్యతపై ఎలాంటి ప్రభావవం చూపుతుంది అనే పరిశోధనను కూడా పంచుకున్నారు. మొత్తం 52 జంటలపై జరిపిన అధ్యయనంలో భాగస్వామి ప్రేరేపితంగా ఒక రాత్రికి సుమారు ఆరుసార్లుకు పైగా పలువురు మెలుకువగా ఉన్నట్ల జాన్సన్ చెబుతున్నారు. అయితే ఈ విషయంపై శాస్త్రవేత్తల మధ్య భిన్నాబిప్రాయాలు ఉన్నట్లు కూడా వెల్లడించారు. పరిశోధన ప్రకారం..కలిసి నిద్రపోవడం వల్ల సుమారు 10% ఎక్కువ REM (ర్యాపిడ్ ఐ మూవ్మెంట్) నిద్ర సరిగా లేదని తేలింది. ముఖ్యంగా భాగస్వామితో కలిసి పడుకుంటే మహిళల నిద్ర గణనీయంగా క్షీణిస్తున్నట్లు గమనించారు. అయితే పురుషులు బాగా నిద్రపోతున్నట్లు తెలిపారు జాన్సన్. అదే సమయంలో కలిసి నిద్రపోతున్న వెయ్యి వయోజన జంటలపై జరిపిన సర్వేలో చాలామంది బాగా నిద్రపోవడమే గాక, వారి మానసిక ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉన్నట్లు తెలిపారు. ఈ నివేదిక ఆధారంగా సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్న జంటలు బెడ్ షేర్ చేసుకోవడంలో సమస్య ఉండదని వెల్లడైందని అన్నారు. చివరగా ఆయన జంటలు కలిసి నిద్రపోవాలా లేక వేర్వేరుగా నిద్రపోవాలా అనేది ఆయా జంటల వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు. అయితే ఆయన వివరణ సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారితీసింది. కొందరు ఆయన మాటలకు మద్దతించగా, మరికొందరు మంచి నిద్ర మిమ్మల్ని మంచి భాగస్వాములుగా చేస్తుందని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు.(చదవండి: ఆంథోసయనిన్ గుండె, జీవక్రియ ఆరోగ్యానికి ఎలా తోడ్పడుతుందంటే..!) -
ఆంథోసయనిన్ గుండె, జీవక్రియ ఆరోగ్యానికి ఎలా తోడ్పడుతుందంటే..!
ఎరుపు, నీలం, ఊదా రంగు ఆహారాలలో లభించే సహజ జీవక్రియాశీల సమ్మేళనాలైన ఆంథోసయనిన్లను అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉన్న పెద్దలలో గుండె, జీవక్రియల ఆరోగ్యానికి మద్దతు ఇస్తుందని పరిశోధకులు చేసిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. అందుకు సంబంధించిన కొత్త అధ్యయనం 'ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్'లో ప్రచురితమైంది.ఆంథోసయనిన్లు అనేవి మొక్కలలో సహజంగా లభించే సమ్మేళనాలు. ఇవి అనేక పండ్లు, కూరగాయలకు ఎరుపు, ఊదా, నీలం రంగులను అందిస్తాయి. బెర్రీలలో ఇది అత్యధికంగా ఉంటుంది. అమెరికా బ్లూబెర్రీలు గుండె ఆరోగ్యానికి తోడ్పడే ఆంథోసయనిన్లను అందిస్తాయి.కలిగే లాభాలు..సాధారణంగా తక్కువ ఆంథోసయనిన్ తీసుకునేవారితో పోలిస్తే, దానిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ క్రింది ప్రయోజనాలు కనిపించాయి:గుండె జబ్బుల ప్రమాదం 26% తగ్గింది.సాధారణంగా గుండెపోటు అని పిలిచే మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ ప్రమాదం 18% తక్కువగా వుంది.టైప్ 2 మధుమేహం ప్రమాదం 11% తక్కువగా కనిపించింది.గుండె సంబంధిత మరణాల ప్రమాదం 9% తక్కువఅధిక రక్తపోటు ప్రమాదం 8% తక్కువరోజుకు 50 మిల్లీగ్రాముల నుంచి ఆహారంలో ఆంథోసయనిన్ తీసుకోవడం ప్రారంభించినప్పుడు, రక్తనాళాల పనితీరు, ఇన్సులిన్ సాంద్రతలలో మెరుగుదలలు కనిపించాయని యాదృచ్ఛిక నియంత్రిత పరీక్షలు నివేదించాయి. ఆంథోసయనిన్ అధికంగా ఉండే ఆహారాల ద్వారా ఈ స్థాయిని సాధించవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు.రోజువారీ భోజనంలో సహజంగా రంగురంగుల పండ్లు , కూరగాయలను విస్తృత శ్రేణిలో చేర్చడం మొత్తం ఆహార నాణ్యతకు మద్దతు ఇస్తుంది. అమెరికా బ్లూబెర్రీలను తాజాగా, గడ్డకట్టించి లేదా ఎండబెట్టి ఆస్వాదించవచ్చు. వాటిని పెరుగు, ఓట్స్, స్మూతీలు, అల్పాహార వంటకాలు, సలాడ్లు, డెజర్ట్‌లు వంటి వంటకాల్లో సులభంగా చేర్చుకోవచ్చు.అంతేగాదు సులభమైన, ఆచరణీయమైన ఆహారపు మార్పులు గుండె జబ్బులు, అధిక రక్తపోటు మరియు టైప్ 2 మధుమేహం వంటి వాటి దీర్ఘకాలిక ప్రమాదాన్ని తగ్గించడానికి దోహదపడతాయని ఈ కొత్త పరిశోధన ఫలితాలు సూచిస్తున్నాయి. -
తల్లిపాలే.. తొలి పెట్టుబడి!
నాకు బిడ్డ పుట్టి, పది రోజులు అవుతుంది. బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వాలని, మొదట వచ్చే పసుపురంగు పాలను కొందరు పారేయమంటున్నారు. ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలా? తల్లిపాలు బిడ్డ ఆకలి తీర్చడంతో పాటు మెదడు ఎదుగుదలకు కూడా నిజంగా అంత ఉపయోగపడతాయా?– సరస్వతి, నెల్లూరు. తల్లిపాలు కేవలం బిడ్డ ఆకలి తీర్చే ఆహారం మాత్రమే కాదు. బిడ్డ జీవితంలో ఆరోగ్యానికి వేసే తొలి అడుగు. ముఖ్యంగా మెదడు వికాసానికి అవసరమైన ఎన్నో పోషకాలను అందించే సహజ సంపద. అందుకే తల్లిపాలను వీలైనంత త్వరగా ప్రారంభించడం ఎంతో ముఖ్యం. ఈ రోజుల్లో పిల్లల మెదడు వికాసం, జ్ఞాపకశక్తి, నేర్చుకునే సామర్థ్యం, సృజనాత్మకత గురించి ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. నిజానికి వీటికి పునాది పడేది బిడ్డ జీవితంలోని తొలి వెయ్యి రోజుల్లోనే. అందుకే ఆ సమయంలో సరైన పోషణ ఎంతో కీలకం. అందులో తల్లిపాలదే మొదటి స్థానం. అందుకే, తల్లిపాల గురించి, ప్రతి తల్లి గుర్తుంచుకోవాల్సిన ఐదు విషయాలు ఇవే.. పుట్టిన వెంటనే... మెదడు నిర్మాణం మొదలు!శిశువు పుట్టినప్పుడు మెదడు పూర్తిగా అభివృద్ధి చెందదు. తొలి రెండు సంవత్సరాల్లోనే మెదడు దాదాపు 80 శాతం వరకు ఎదుగుతుంది. ప్రతి సెకనుకు లక్షలాది నాడీ సంబంధాలు ఏర్పడతాయి. ఈ అద్భుతమైన ప్రక్రియకు అవసరమైన పోషకాలు, జీవకణాలు, హార్మోన్లు, ఎదుగుదల కారకాలు... అన్నీ తల్లిపాలలో సహజంగానే లభిస్తాయి.సహజమైన మెదడు బూస్టర్!తల్లిపాలలో ఉండే డీహెచ్ఏ, ఏఆర్ఏ, కోలిన్, టారిన్, లాక్టోజ్, వివిధ ఎదుగుదల కారకాలు శిశువు మెదడు కణాల నిర్మాణానికి, నాడీ సంబంధాల ఏర్పాటుకు, జ్ఞాపకశక్తి పెరుగుదలకు దోహదపడతాయి. అనేక అంతర్జాతీయ అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి. తల్లిపాలు తాగిన పిల్లల్లో సగటు మేధస్సు మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. భాషా నైపుణ్యాలు, సమస్య పరిష్కార సామర్థ్యం కూడా మెరుగవుతుంది. పాఠశాలలో విద్యా ప్రదర్శనపైనా ప్రభావం ఉండొచ్చు. కొన్ని నాడీ వికాస సంబంధిత సమస్యల ప్రమాదం కూడా తగ్గే అవకాశం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి.ప్రేమతో పాలు... మెదడుకు శక్తి!తల్లిపాలు ఇస్తున్నప్పుడు తల్లి బిడ్డను హత్తుకోవడం, కళ్లల్లోకి చూస్తూ మాట్లాడటం, చిరునవ్వులు పంచుకోవడం... ఇవన్నీ తల్లి– శిశువు బంధాన్ని మరింత బలపరుస్తాయి. ఈ సమయంలో విడుదలయ్యే ఆక్సిటోసిన్ వంటి హార్మోన్లు తల్లి– బిడ్డ అనుబంధాన్ని బలపరచడమే కాకుండా, శిశువు భావోద్వేగ, సామాజిక అభివృద్ధికి కూడా పునాది వేస్తాయి. అందుకే తల్లిపాలు కేవలం పోషకాహారం కాదు... ప్రేమ, భద్రత, మెదడు వికాసం అనే మూడు వరాల కలయిక.తొలి బంగారు చుక్కలు!పుట్టిన తర్వాత వచ్చే పసుపు రంగు గాఢమైన పాలను చాలామంది పారేస్తారు. కానీ అది పెద్ద తప్పు. ఈ కోలస్ట్రం శిశువుకు తొలి టీకా లాంటిది. ఇందులో రోగనిరోధక శక్తిని పెంచే యాంటీబాడీలు, శిశువు ఎదుగుదలకు అవసరమైన అనేక జీవపదార్థాలు ఉంటాయి. అందుకే మొదట వచ్చే ఆ కొద్దిపాటి పాలను కూడా వృథా చేయకండి.ఆరు నెలలు... తల్లిపాలు మాత్రమే!ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన ప్రకారం పుట్టిన ఒక గంటలోపు తల్లిపాలు ప్రారంభించడం మంచిది. మొదటి ఆరు నెలలు పూర్తిగా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఆ తరువాత సరైన అనుబంధ ఆహారంతో పాటు కనీసం రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం తల్లిపాలను కొనసాగించడం మంచిది. తల్లికి అండగా... సమాజం కూడా!పని చేసే తల్లులకు పాలివ్వడానికి అనుకూలమైన వాతావరణం కల్పించడం కుటుంబం, కార్యాలయాలు, సమాజం అందరి బాధ్యత. తల్లిపాలను ప్రోత్సహించడం అంటే కేవలం ఒక బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడటం కాదు... భవిష్యత్ తరాల ఆరోగ్యానికి, ఎదుగుదలకు బలమైన పునాది వేయడం. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు మంచి పాఠశాల, మంచి కోచింగ్, మంచి గాడ్జెట్లు ఇవ్వాలని ఎంతో ఆలోచిస్తారు. అవన్నీ వాటి స్థానంలో ముఖ్యమే. కానీ బిడ్డ జీవితంలో తొలి పెట్టుబడి మాత్రం పుట్టిన రోజునే మొదలవుతుంది. అది తల్లిపాలు. ప్రతి చుక్క తల్లిపాలు... ప్రతి బిడ్డ మెదడులో ఒక కొత్త భవిష్యత్తుకు పునాది!డా. కె.పవన్ కుమార్, సీనియర్ పీడియాట్రిషియన్, పీడియాట్రిక్ అలర్జిస్ట్, ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్ -
93 ఏళ్ల వయసులో అథ్లెటిక్‌గా బామ్మ..!
చాలామంది వృద్ధాప్యం అంటే రెస్ట్ తీసుకునే వయసుగా భావిస్తారు. వాస్తవంగా ఆ వయసులో ఏదో దేవుడి నామ జపం చేసుకుంటూ కాలం వెళ్లదీస్తుంటారు. కానీ ఈ బామ్మ మాత్రం తొమ్మిది పదుల వయసులో అథ్లెట్‌గా మారింది. పైగా ఎన్నో రికార్డులు పతకాలు గెలుచుకుని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుని తెచ్చుకోవడమే కాదు..సాధించాలనే కోరిక ఉంటే వయసు పెద్ద అడ్డంకి కాదని నిరూపించింది. పైగా పట్టుదల, శక్తి వయసుతోపాటు సన్నగిల్వవు అని చాటిచెప్పి..యువతకు స్ఫూర్తిగా నిలిచింది ఈ సూపర్ బామ్మ.ఆ బామ్మే చండీగఢ్‌కి చెందిన మన్‌కౌర్. ఆమె 1916లో పంజాబ్‌లో జన్మించారు. ఆమె తన జీవితంలో ఎక్కువ భాగం క్రీడలకు దూరంగానే పెరిగారు. ఆమె కుమారుడు గుర్దేవ్సింగ్ మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో పాల్గొనడం చూసి 93 ఏళ్ల వయసులో అథ్లెటిక్స్‌లోకి ప్రవేశించారు. కేవలం అతను పోటీపడటాన్ని చూసి ఈ బామ్ తాను కూడా పరుగును ప్రయత్నించాలని నిర్ణయించుకుంది. ఆ నిర్ణయం ఆమె జీవితాన్నే మార్చేసింది. అలా ఆమె 93వ ఏట అథ్లెటిక్ కెరీర్‌ని ప్రారంభించి ఎన్నో పతకాలు కైవసం చేసుకుంది. ఆమె విజయాలు భారతదేశం దాటి విస్తరించాయి. పోలాండ్‌లో జరిగిన వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో నాలుగు బంగారు పతకాలను గెలుచుకున్నారు. దాంతో ఆమెను అంతా చండీగఢ్ అద్భుతంగా పిలుచుకునేవారు. ఆ తర్వాత 2013లో అమెరికాలో జరిగిన వరల్డ్ మాస్టర్స్ ఛాంపియన్‌షిప్‌లో 100మీ, 200మీ ఈవెంట్లలో బంగారు పతకాలను గెలుచుకున్నారు. అవేగాక జాతీయ, అంతర్జాతీయ మాస్టర్స్ పోటీలలో కూడా పతకాలను సాధించారు. 2016లో, అమెరికన్ మాస్టర్స్ గేమ్స్‌లో, ఆమె ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన శతాధిక వయస్కురాలిగా గుర్తింపు పొందారు. విచిత్రం ఏంటంటే.. 100 ఏళ్లు దాటిన తర్వాత కూడా ఆమె ప్రదర్శనలు కొనసాగాయి. 2017లో న్యూజిలాండ్‌లో జరిగిన వరల్డ్ మాస్టర్స్ గేమ్స్‌లో, 100మీ ఈవెంట్లో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. అలాగే అలాగే వరల్డ్ మాస్టర్స్, అమెరికన్ మాస్టర్స్ గేమ్స్‌లో 20కి పైగా పతకాలు సాధించింది. వీటితోపాటు ఆ బామ్మకు మార్చి 08, 2020లో రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా నారీశక్తి పూరస్కారాన్ని అందుకుంది. ఇక్కడ కౌర్ కథ ఒక ప్రొఫెషనల్ కెరీర్‌ను నిర్మించుకోవాలనే ఆశతో యువ అథ్లెట్‌గా పరుగు ప్రారంభించలేదు. కొత్తగా ఏదైనా ప్రయత్నించడం ఇకపై సాధ్యం కాదని చాలా మంది నమ్మే వయస్సులో, అథ్లెటిక్‌గా ట్రాక్‌పై అడుగుపెట్టి పోటీలలో పాల్గొని సరికొత్త రికార్డుని రాసి స్ఫూర్తిగా నిలిచించారామె. నిజానికి ఆ వయసులో ఆ ప్రయత్నం చేయడానికి ఎంతో ధైర్యం కావాలి. అది కౌర్ బామ్మ సొంతం. చెప్పాలంటే పట్టుదల, అపారమైన శక్తి, స్థైర్యానికి ప్రతీకగా నిలిచింది. కాగా, జూలై 31, 2021న 105 ఏళ్ల వయసులో మరణించారామె.(చదవండి: వాటితో ఫేషియల్..'గ్లో' మాములుగా లేదు..! వీడియో వైరల్) -
నొప్పి లేకున్నా... నిర్లక్ష్యం వద్దు!!
కొందరిలో ఒక్కోసారి తమ కాళ్లలో లేదా చేతుల్లో గడ్డ కనిపించవచ్చు. అది నొప్పి లేని గడ్డ కావడంతో పాటు క్రమంగా పెరుగుతూపోవచ్చు. కారణం లేకుండా ఎముకల్లో నొప్పి కనిపించడంతో రాత్రివేళల్లో ఆ నొప్పి పెరుగుతూ పోవచ్చు. ఆటల్లో గాయపడటమో లేదా తమకు తెలియకుండా ఏదైనా చిన్నపాటి దెబ్బతగలడం వల్లనో ఇలా జరుగుతుండవచ్చని చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ఈ లక్షణాలు కొన్నిసార్లు ‘సార్కోమా’ అనే క్యాన్సర్‌కు సూచనలు కావచ్చు. ఈ సార్కోమా తరహా క్యాన్సర్‌పై అవగాహన కోసం ఈ కథనం.సార్కోమా అనేది అరుదైన క్యాన్సర్లలో ఒకటి. సార్కోమా అంటే ఏమిటో చూద్దాం...మన దేశంలో సార్కోమా విస్తృతి... భారతదేశంలో ప్రతి ఏడాది సుమారు 20 వేల కొత్త సార్కోమా కేసులు నమోదవుతున్నట్లు అంచనా. అయితే అవగాహన లోపం, లక్షణాలను నిర్లక్ష్యం చేయడం వల్ల చాలామంది వ్యాధి ముదిరిన తర్వాతే ఆసుపత్రికి వస్తున్నారు. తొలిదశలోనే గుర్తించి తగిన చికిత్స అందిస్తే మంచి ఫలితాలు కనిపించడంతో పాటు బాధితుల్లో మంచి మెరుగుదల కనిపిస్తుందని గుర్తుంచుకోవడం ముఖ్యం. సార్కోమా అంటే..? సార్కోమా అనేది దేహంలోని ఎముకలు, కండరాలు, కొవ్వు, రక్తనాళాలు, నరాలు, కార్టిలేజ్, టెండన్లు వంటి మృదుకణజాలా (సాఫ్ట్ టిష్యూస్)లో వచ్చే అరుదైన క్యాన్సర్. సాధారంగా కనిపించే మిగతా క్యాన్సర్లతో పోలిస్తే ఇది కాస్త అరుదుగా కనిపించినప్పటికీ, చిన్నపిల్లలు, యువత, మధ్యవయస్కుల్లోనూ ఇటీవల కొంత ఎక్కువగానే కనిపిస్తోంది. ఇది శరీరంలో ఎక్కడైనా రావచ్చు. ముఖ్యంగా చేతులు, కాళ్లు, తొడలు, భుజాలు, పొత్తికడుపు ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది.లక్షణాలు... తొలి దశల్లో ‘సార్కోమా’లో పెద్దగా నొప్పి ఉండకపోవడంతో చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. సార్కోమాలో కనిపించే సాధారణ లక్షణాలవి... ∙నొప్పి లేకుండా క్రమంగా పెరుగుతున్న గడ్డ ∙చేతులు లేదా కాళ్లలో అసాధారణ వాపు ∙రాత్రివేళల్లో ఎక్కువయ్యే ఎముకల నొప్పి ∙కారణం లేకుండా నెలల తరబడి నొప్పి కొనసాగడం ∙గడ్డ పరిమాణం వేగంగా పెరుగుతుండటం ∙కదలికల్లో ఇబ్బంది లేదా గడ్డ వచ్చిన అవయవం పనితీరు తగ్గడం ∙ఐదు సెంటీమీటర్లకు మించిన గడ్డలు రావడం, కొన్ని వారాలుగా ఆ గడ్డల్లో వాపు తగ్గకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయడం సరికాదు. పైన పేర్కొన్న లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్లను సంప్రదించడం మంచిది.నిర్ధారణ ఇలా... సార్కోమా నిర్ధారణ కోసం చేసే పరీక్షల్లో కొన్ని... ∙ఎంఆర్ఐ స్కాన్ ∙పీఈటీ–సీటీ స్కాన్ ∙బయాప్సీ. ఈ పరీక్షలతో కణితి రకం, సైజు, వ్యాప్తితో పాటు అది ఏ దశలో ఉందన్న విషయాలను నిర్ధారణ చేశాక... దాన్ని బట్టి చికిత్సను ΄్లాన్ చేస్తారు. చికిత్స ... బాధితుల పరిస్థితిని బట్టి శస్త్రచికిత్సతో పాటు కీమోథెరపీ, రేడియేషన్ థెరపీనిలలో పేషెంట్‌కు అవసరమైనదాన్ని నిర్ణయిస్తారు. ఒక్కోసారి ఈ చికిత్సలన్నింటినీ సమన్వయంతో అందించాల్సి రావచ్చు. అయితే తొలిదశల్లోనే చికిత్స మొదలుపెట్టడం వల్ల చాలా మంది జీవితం తిరిగి సాధారణంగా అయ్యేందకు అవకాశాలెక్కువ.ఆధునిక చికిత్సలతో అవయవాన్ని కాపాడే అవకాశం... గతంలో సార్కోమా చికిత్సలో చాలాసార్లు చెయ్యి లేదా కాలిని తొలగించాల్సి వచ్చేది. కానీ ఇటీవల వైద్యరంగంలోని అధునాత సాంకేతిక పురోగతితో లింబ్ సాల్వేజ్ సర్జరీలు, అత్యాధునిక ఇం΄్లాంట్లు, రీకన్ స్ట్రక్షన్ పద్ధతుల ద్వారా గడ్డను పూర్తిగా తొలగించడంతో పాటు అవయవాన్ని కాపాడే అవకాశాలూ గణనీయంగా పెరిగాయి.చికిత్స తర్వాత కూడా జాగ్రత్తలు అవసరం... శస్త్రచికిత్సతో లేదా ఇతరత్రా అవసరమైన చికిత్సల తర్వాత పరిస్థితి అంతా తిరిగి సాధారణ స్థితి చేరుకుందని అనుకోవడం సరికాదు. నిజానికి పేషెంట్లు తమ చికిత్స తర్వాత కూడా ఫిజియోథెరపీ, పునరావాస చికిత్స (రీ–హ్యాబిలిటేషన్ థెరపీ) వంటివి చేస్తూ ఉండటంతో పాటు క్రమం తప్పకుండా ఫాలోఅప్‌కు రావడమూ తప్పనిసరి. అలాగే కుటుంబ సభ్యుల సహకారమూ పేషెంట్లు పూర్తిగా కోలుకోవడంలో కీలక భూమిక పోషిస్తుందని గుర్తుంచుకోవాలి. డాక్టర్ రాజీవ్ రెడ్డిఆర్థోపెడిక్ ఆంకోసర్జన్– సార్కోమా స్పెషలిస్ట్ -
పిల్లలు ఫిట్స్ (మూర్ఛ)తో బాధపడుతుంటే డాక్టర్‌ను అడగాల్సిన మూడు ప్రశ్నలు!
భారతదేశంలో లక్షలాది మంది పిల్లలు ఫిట్స్ / ఎపిలెప్సీతో బాధపడుతున్నారు. 2025లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఏఐఐఎమ్ఎస్) నిర్వహించిన ఒక సర్వే ప్రకారం... చిన్నారుల్లో ఈ ఎపిలెప్సీ వ్యాధి విస్తృతి 0.8% ఉంది. నిజానికి ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండవచ్చు. ఎందుకంటే పిల్లల్లో ఎక్కడ వివక్షకు గురవుతారో అనే ఆందోళనతో ఈ వ్యాధి ఉందని తెలపడానికి తల్లిదండ్రులు ఇష్టపడరు. అందుకే పిల్లలు ఫిట్స్ / మూర్ఛ (ఎపిలెప్సీ)తో బాధపడుతూ... రెండు రకాల మందులు వాడుతున్నప్పటికీ ఫిట్స్ ఆగకుండా వస్తూనే ఉంటే... డాక్టర్‌ను మూడు ప్రశ్నలు అడగటం మంచిది. ఈ మూడు ప్రశ్నలూ పిల్లల జీవితాన్నే మార్చేయవచ్చు. ఇంతకీ ఆ మూడు ప్రశ్నలేమిటో చూద్దాం...→ మొదటి ప్రశ్న: రెండు మందులు వాడుతున్నప్పటికీ పిల్లలకు ఫిట్స్ వస్తూనే ఉన్నాయి. అవి ఆగడానికి శస్త్రచికిత్స (సర్జికల్) అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలా? డాక్టర్ జవాబు : ఫిట్స్‌తో బాధపడే చిన్నారుల్లో మూడింట ఒక వంతు మందికి మందులతో తగ్గని ఎపిలెప్సీ (డ్రగ్–రెసిస్టెంట్ ఎపిలెప్సీ) వచ్చే అవకాశం ఉంటుంది. ఈ అంశంపై చాలామంది తల్లిదండ్రులకు పెద్దగా అవగాహన ఉండదు. అంటే... ఈ పిల్లల్లో ఎలాంటి మందులు వాడినా దాదాపుగా ఫిట్స్ అదుపులోకి రాకపోవచ్చు. అప్పుడు ఆ పిల్లలకు శస్త్రచికిత్స చివరి ప్రయత్నం మాత్రమే కాదు... వైద్యపరంగా అది ఆ తర్వాతి చికిత్సాప్రక్రియను తెలుసుకునే అంశం కూడా. శస్త్రచికిత్స ద్వారా 50 నుంచి 86 శాతం కేసుల్లో ఫిట్స్ పూర్తిగా ఆగిపోయే అవకాశం ఉంది. అందుకే ఎంతకీ ఫిట్స్ తగ్గని కేసుల్లో ఒకసారి ఈ ప్రశ్న డాక్టర్‌ను అడగటం మంచిది. → రెండో ప్రశ్న: సాధారణ బ్రెయిన్ స్కాన్ మాత్రమే కాకుండా, ఎపిలెప్సీ-ప్రోటోకాల్ ఎమ్మారై చేయించారా?డాక్టర్ జవాబు : మందులకు లొంగని ఫిట్స్‌కు కారణమయ్యే కొన్ని లోపాలు సాధారణ మెదడు స్కాన్లలో తరచుగా కనిపించకపోవచ్చు. ఇలాంటి పిల్లలకు ఎపిలెప్సీ-ప్రోటోకాల్ అనేది ఓ ప్రత్యేకమైన ఎమ్మారై పరీక్ష. అంతేకాదు... దీని రెజల్యూషన్ కూడా చాలా ఎక్కువ. ఇది మెదడులోని ఫిట్స్ ఆవిర్భవిస్తున్న ప్రాంతాన్ని (సీజర్ ఫోకస్‌ను) గుర్తిస్తుంది. ఈ పరీక్ష లేకుండా శస్త్రచికిత్సకు సంబంధించిన చికిత్స ప్రణాళికను మొదలుపెట్టడం సాధ్యం కాదు. అందుకే ఇలాంటి చిన్నారులు చాలామందికి చేసిన ఎమ్మారై నార్మల్‌గానే ఉందంటూ డాక్టర్లు ఆ పిల్లల పేరెంట్స్‌కు చెప్పవచ్చుగానీ... నిజానికి అది ఎపిలెప్సీ-ప్రోటోకాల్ ఎమ్మారై కాకపోవచ్చు.→ మూడో ప్రశ్న: వీడియో–ఈఈజీ మానిటరింగ్ గురించి మీ డాక్టర్‌ను అడిగారా? డాక్టర్ జవాబు : ఫిట్స్ వచ్చినప్పుడు పిల్లల మెదడులోని విద్యుత్ తరంగాలను ‘వీడియో ఈఈజీ’ (వీడియో ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్) పరీక్ష గుర్తిస్తుంది. ఆటైమ్‌లో వారి ప్రవర్తనలో కనిపించే మార్పులనూ ఇది రికార్డు చేస్తుంది. ఫలితంగా మెదడులోని ఏ ప్రాంతం నుంచి ఫిట్స్ వస్తున్నాయో మరింత కచ్చితంగా / నిశితంగా గుర్తించవచ్చు. శస్త్రచికిత్స అవసరమా లేదా అని అంచనా వేయడానికి ఇది అత్యంత కీలకమైన పరీక్ష. పిల్లలకు మందులతో అదుపులోకి రాని ఎపిలెప్సీ ఉంటే, వీడియో–ఈఈజీ గురించి తల్లిదండ్రులే ఒకసారి అడగవచ్చు. చాలా కుటుంబాలు ఫిట్స్ వ్యాధిని మౌనంగా భరిస్తుంటాయి. సమాజంలో ఎదురయ్యే వివక్ష నుంచి పిల్లలను కాపాడటానికి సమస్యను దాచిపెడుతుంటారు. కానీ అలా చేయడం వైద్యపరీక్షలూ, చికిత్సలూ ఆలస్యం అవడం వల్ల ఫిట్స్‌ను పూర్తిగా తగ్గించే అవకాశాలు సన్నగిల్లే ముప్పు ఎక్కువ. అందుకే పిల్లల చికిత్స మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు ఈ మూడు ప్రశ్నలను పేరెంట్లే అడగవచ్చు. ఒకవేళ తమ డాక్టర్‌ను అడగటం మొహమాటంగా ఉంటే సెకండ్ ఒపీనియన్ అయినా తీసుకోవచ్చు. ఆ సమాధానాలు చిన్నారిని ఫిట్స్ నుంచి పూర్తిగా విముక్తులను చేసే అవకాశాలెక్కువ. డాక్టర్ రమేష్ శిఘకొల్లిసీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ -
పైల్స్ నివారణకు అశ్విని ముద్ర
అశ్విని ముద్ర అనేది యోగాలో పెల్విక్ ఫ్లోర్/మలద్వార ప్రాంతంలోని కండరాలను సంకోచించి–వదిలే సాధన. ‘‘అశ్విని’’ అంటే గుర్రం. గుర్రం మలవిసర్జన తర్వాత ఆ ప్రాంతాన్ని సంకోచించి, సడలించే కదలికను పోలి ఉండటం వల్ల ఈ పేరు వచ్చింది.చేసే విధానంముందుగా మలాసనంలో కూర్చోవాలి.కళ్లను మూసుకుని శ్వాసను సహజంగా తీసుకోవాలి.మలవిసర్జన ఆపుతున్నట్లుగా మలద్వార/పెల్విక్ ఫ్లోర్ కండరాలను మెల్లగా బిగించండి.2–3 సెకన్లు హోల్డ్ చేసి, పూర్తిగా రిలాక్స్ చేయండి.ఇలా 15–20 సార్లు చేయవచ్చు.చివర్లో కొన్ని క్షణాలు పూర్తిగా రిలాక్స్ అవ్వండి.ముఖ్యంగా: పొట్ట, తొడలు, పిరుదులు బిగించకుండా పెల్విక్ ఫ్లోర్ కండరాలనే కదిలించేలా ప్రయత్నించాలి. శ్వాసను బిగపట్టకండి.ప్రయోజనాలుకటి ప్రాంతంలోని కండరాలను దృఢంగా మారుస్తుంది.మలబద్ధకం, అజీర్ణం వంటి పొట్ట సమస్యలను తగ్గిస్తుంది.ఆసన ప్రాంతంలో రక్త ప్రసరణను పెంచి మొలలు తగ్గడానికి సహాయపడుతుంది.మూత్రం లీకయ్యే సమస్యను అరికట్టి బ్లాడర్ నియంత్రణను మెరుగుపరుస్తుంది.జాగ్రత్తలునొప్పి వస్తే వెంటనే ఆపాలి.పైల్స్, ఆనల్ ఫిషర్, రీసెంట్ రెక్టల్ సర్జరీ, తీవ్రమైన పెల్విక్ పెయిన్ ఉన్నవారు వైద్యుడి సలహాతోనే చేయాలి.మలవిసర్జన సమయంలో బలవంతంగా ఈ ముద్ర చేయకండి.ఎక్కువసేపు కండరాలను బిగించి ఉంచొద్దు.గర్భిణీలు లేదా ప్రసవం తర్వాత ఉన్నవారు వ్యక్తిగత పరిస్థితిని బట్టి యోగా ప్రొఫెషనల్ /డాక్టర్ గైడెన్స్ తో చేయాలి.– అనిత పాతర్ల, యోగా ట్రైనర్ మరిన్ని వివరాలకు ఈ వీడియోపై క్లిక్ చేయండి (చదవండి: వర్షాకాలంలోనే పంటి సమస్యలు ఎందుకంటే..?) -
వర్షాకాలంలోనే పంటి సమస్యలు ఎందుకంటే..?
వర్షాకాలం రాగానే చల్లటి వాతావరణం వల్ల వేడివేడి టీలు తాగాలని, పకోడీలు, సమోసాలు తినాలని మన మనస్సు లాగేస్తుంటుంది. అయితే, ఇవన్నీ మన దంతాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని చాలా మందికి తెలియదు.. చిగుళ్లవాపు, పంటినొప్పి, నోటి దుర్వాసన వంటివి వేధిస్తుంటాయి. అందువల్ల చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు.రాత్రివేళల్లో బ్రషింగ్‌ను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. చల్లటి వాతావరణంలో బద్ధకం వల్ల బ్రష్ చేయడం మానేయడమో, హడావిడిగా ముగించడమో చేస్తుంటారు. దీనివల్ల దంతాల మధ్య మిగిలి΄ోయిన ఆహార వ్యర్థాలపై బాక్టీరియా చేరి యాసిడ్లను విడుదల చేస్తుంది. ఇది ఎనామిల్‌ను దెబ్బతీసి కేవిటీలకు దారితీస్తుంది.సాయంత్రం వేళల్లో టీ, కాఫీలతోపాటు తియ్యటి బిస్కెట్లు, వేపుళ్లు, స్వీట్లు తినడం సహజం. అయితే జిగటగా ఉండే తీపి పదార్థాలు దంతాల సందుల్లో పేరుకుపోయి బాక్టీరియాకు ప్రధాన ఆహారంగా మారతాయి. అందువల్ల ఆహారం, స్నాక్స్ తిన్న వెంటనే స్వచ్ఛమైన నీటితో నోటిని బాగా పుక్కిలించాలి. దాహం వేయకపోవడం వల్ల వర్షాకాలంలో చాలామంది నీళ్లు తక్కువగా తాగుతుంటారు. దీనివల్ల నోటిలో లాలాజలం ఊరడం తగ్గుతుంది. లాలాజలం నోటిని సహజ సిద్ధంగా శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. లాలాజలం తగ్గితే నోటి దుర్వాసన, పంటి సమస్యలు పెరుగుతాయి. అందువల్ల దాహం వేయక΄ోయినా రోజంతా తగినంత కాచి చల్లార్చిన నీటిని తాగుతూ శరీరాన్ని, నోటిని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి.వర్షాకాలంలో ఇమ్యూనిటీ కాస్త తగ్గడం వల్ల చిగుళ్ల ఇన్ఫెక్షన్లు ఎక్కువవుతాయి. బ్రష్ చేస్తున్నప్పుడు చిగుళ్ల నుంచి రక్తం రావడం లేదా వాపు రావడం గమనిస్తే చాలామంది దాన్ని సాధారణ విషయంగా వదిలేస్తారు. చిగుళ్ల రక్తస్రావం అనేది ఇన్ఫెక్షన్కు ప్రారంభ సంకేతం. అందువల్ల నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డెంటిస్ట్‌ను సంప్రదించాలి.వర్షాకాలంలో బాత్రూమ్లలో తేమ ఎక్కువగా ఉంటుంది. బ్రషింగ్ పూర్తయ్యాక టూత్‌బ్రష్‌ను బాత్రూమ్లోనే వదిలేస్తే, దానిపై బాక్టీరియా చేరే ప్రమాదం ఉంది. అందువల్ల బ్రష్ చేసిన తర్వాత దాన్ని శుభ్రంగా కడిగి, గాలి తగిలే పొడి ప్రదేశంలో నిలువుగా ఉంచాలి. (చదవండి: ముప్పైల్లో మెదడుకు మోయలేని ఒత్తిడి! ఎందుకంటే?) -
విపరీతంగా భయపడితే పొట్ట గందరగోళం! ఎందుకంటే?
మనం ఏదైనా ఎగ్జామ్‌కి వెళ్లేముందు గానీ, లేదా ఇంటర్వ్యూకి అటెండ్ అయేపుడు గానీ మనసులోనే కాకుండా పొట్టలోనూ గాబరాగా అనిపిస్తుంటుంది. అయితే ఇది వట్టి ముచ్చట కాదని.. మన జీర్ణవ్యవస్థ, మెదడు నిరంతరం ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మన పొట్టలో ఉండే బాక్టీరియా ఇచ్చే సంకేతాలే మన భావోద్వేగాలను, ఒత్తిడిని, మూడ్‌ను ప్రభావితం చేస్తాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకుల ప్రకారం, మన జీర్ణ వ్యవస్థకు, మెదడుకు మధ్య నిరంతరం సమాచార మార్పిడి జరుగుతుంది. దీనినే ‘గట్–బ్రెయిన్ ఆక్సిస్’ అని పిలుస్తారు. బ్రెయిన్‌ను, జీర్ణ వ్యవస్థను కలిపే వేగస్ అనే ఒక ముఖ్యమైన నరాల వ్యవస్థ ద్వారా సంకేతాలు మార్పిడి చెందుతుంటాయి. అలాగే మన మనసును సంతోషంగా ఉంచే ‘సెరోటోనిన్’ అనే రసాయనం మెదడులో కాకుండా ఎక్కువగా జీర్ణ వ్యవస్థలోనే తయారుకావడం విశేషం.మనసు ఎందుకు మారుతుంది?మన జీర్ణవ్యవస్థలో ట్రిలియన్ల కొద్దీ సూక్ష్మజీవులు ఉంటాయి. ఆహారం, ఒత్తిడి, ఆల్కహాల్, లేదా ఇతర వ్యాధుల వల్ల పొట్టలో వాపు లేదా సూక్ష్మజీవుల సమతుల్యత దెబ్బతిన్నప్పుడు, జీర్ణవ్యవస్థ నుంచి మెదడుకు వెళ్లే సంకేతాలలో మార్పులు వస్తాయి.ఇది ఆందోళన, ఒత్తిడి, నీరసానికి కారణమవుతుంది. అందుకే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు కడుపులో అసౌకర్యంగా అనిపిస్తుంది. మన శారీరక, మానసిక ఆరోగ్యం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని ఈ పరిశోధనలు నిరూపిస్తున్నాయి. సరైన ఆహారం తీసుకుంటూ పొట్ట ఆరోగ్యాన్ని కా΄ాడుకుంటే మానసిక ప్రశాంతతను కూడా కా΄ాడుకోవచ్చునని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. -
బంధం బలపడాలంటే.. ఆధిపత్యం కాదు అనురాగం ముఖ్యం!
భార్యాభర్తల మధ్య అనుబంధం అనేది రెండు విభిన్న మనస్తత్వాల కలయిక. ఇద్దరి మధ్య ప్రేమతో పాటు చిన్నపాటి విభేదాలు ఉంటుంటాయి. ఇలాంటివి ఎన్ని ఉన్నా.. అవతలి వ్యక్తి ఆలోచనలను, అభిప్రాయాలను తక్కువ చేసి చూడటం మొదలుపెడితే మాత్రం బంధంలో చీలికలు రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. అలా కాకూడదంటే.. ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం!కొంతమంది ’నేను నీ కంటే ఎక్కువ సంపాదిస్తున్నాను’, ’అన్ని విషయాల్లోనూ నీకన్నా నాకే ఎక్కువ తెలుసు’ అనే భావనతో భాగస్వామిని చిన్నచూపు చూస్తుంటారు. ఇలాంటప్పుడు ఎదుటి వారు చెప్పేది ఎంత ముఖ్యమైనదైనా, అది వినడానికి మనసు అంగీకరించదు. ఈ క్రమంలో ఒక బంధం బలంగా ఉండాలంటే, ఆధిపత్యం చూపించడానికన్నా అనురాగంతో ఉండడం అవసరం. ఒకరి విషయాల్లో మరొకరు అనవసరంగా జోక్యం చేసుకోకూడదనే ఉద్దేశంతోనో లేదా ఎదుటివారికి అవగాహన లేదన్న భ్రమతోనో ‘నీకేం తెలియదు’ అని అంటుంటారు. అయితే, ఇది తరచూ సాగుతుంటే మాత్రం భాగస్వామి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు.సున్నితంగా చెప్పడంఒక సమస్య వచ్చినప్పుడు లేదా ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ’నేను చూసుకుంటాను’ అని చెప్పడం కంటే, దీని గురించి నీ అభిప్రాయం ఏంటి? అని అడగడం మంచిది. దీనివల్ల భాగస్వామికి తాము కూడా ఈ బంధంలో ఒక ముఖ్యమైన భాగమనే నమ్మకం కలుగుతుంది. ఒకవేళ వారికి ఆ విషయంపై అవగాహన లేకపోతే, విసుక్కోకుండా సున్నితంగా వివరించాలని తెలియజేస్తున్నారు.దంపతులిద్దరూ చర్చించుకోవడంభార్యాభర్తల అనుబంధం అంటే ఒకరి భావాలను మరొకరు పంచుకోవడం. ఒకరికి తెలిసిన విద్య మరొకరికి తెలియకపోవచ్చు. అంతమాత్రాన అవతలి వారిని తక్కువ అంచనా వేయకూడదు. ఇంట్లో పనులైనా, ఆర్థిక నిర్ణయాలైనా ఇద్దరూ కలిసి చర్చించు కున్నప్పుడే కదా వారి మధ్య సామరస్యత ఏర్పడేది!బంధం బలపడడానికి...భాగస్వామి ఏదైనా తప్పు చేసినప్పుడు అందరి ముందూ లేదా కఠినంగా విమర్శించడానికి బదులుగా.. వారు చేసే చిన్న పనులను కూడా అభినందించడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అంటున్నారు. ప్రతి విషయంలోనూ మీదే పై చేయి కావాలని అనుకోవద్దని సలహా ఇస్తున్నారు. ఒక్కోసారి వెనక్కి తగ్గడం వల్ల బంధం మరింత బలపడుతుందని తెలియజేస్తున్నారు. ఏబంధమైనా నిలబడాలంటే ఒకరిపై ఒకరికి గౌరవం, అర్థం చేసుకునే స్వభావం, నమ్మకం ఉండాలి. అప్పుడే వైవాహిక జీవితం హ్యాపీగా సాగుతుంది. హ్యాపీ మ్యారీడ్ లైఫ్! -
ముప్పైల్లో మెదడుకు మోయలేని ఒత్తిడి! ఎందుకంటే?
ఇరవైల్లో వచ్చే ఒత్తిడికి, ముప్పైల్లో అనుభవించే ‘బర్నౌట్’కు చాలా తేడా ఉంటుంది. 20 ఏళ్ల వయసులో వచ్చే అలసట, నిస్సత్తువ కాస్త నిద్రపోతేనో లేదా ఒక వీకెండ్ ట్రిప్ వెళ్తేనో తగ్గిపోతుంది. 30 ఏళ్ల వయసు వచ్చేసరికి ఇదే లక్షణం తీవ్రమైన, దీర్ఘకాలిక మానసిక సమస్యగా మారుతోంది. అసలు ఈ బర్నౌట్‌కు కారణాలేంటి?బాధ్యతల ఒత్తిడి30 ఏళ్ల వయసులో జీవితంలో ఒకేసారి అనేక బాధ్యతలు వచ్చిపడతాయి. కెరీర్ కోసం పాకులాట, కుటుంబ బాధ్యతలు, సామాజిక సంబంధాలు, ఆరోగ్యం కాపాడుకోవడం వంటి వాటితో మనుషులు నలిగిపోతుంటారు. దీనివల్ల ఒత్తిడికి గురవుతుంటారు. అందువల్ల ప్రతిరోజూ కాసేపు నడక, ధ్యానం లేదా నచ్చిన పని చేస్తూ శరీరానికి, మెదడుకు కాస్త సమయం ఇవ్వాలి.దొరకని విశ్రాంతి..20ల్లో ఏదైనాప్రాజెక్ట్ కోసం రాత్రుళ్లు జాగారం చేసినా శరీరం త్వరగా కోలుకుంటుంది. కానీ ముప్పైల్లోకి అడుగుపెట్టాక దశాబ్ద కాలంగా పడుతున్న కష్టం, ఒత్తిడి ఒకేసారి బయటపడతాయి. తగినంత విశ్రాంతి దొరక్కపోవడం వల్ల శరీరం, మనస్సు నిరంతరం నిస్సత్తువలోనే ఉండిపోతాయి.ఆర్థిక ఆందోళనలు‘30 ఏళ్లు వచ్చాయంటే జీవితంలో సెటిల్ అయిపోవాలి’ అనే సామాజిక ఆలోచన పెద్ద భారంగా మారుతోంది. సొంత ఇల్లు కొన్నానా? రిటైర్మెంట్ సేవింగ్స్ ఉన్నాయా? పిల్లల చదువుల సంగతి ఏంటి? అనే ప్రశ్నలు వెంటాడుతుంటాయి. సోషల్ మీడియాలో తోటి వారి ప్రగతిని చూసి ‘నేను ఇంకా వెనుకబడే ఉన్నానా?’ అనే అభద్రతా భావం మానసిక ప్రశాంతతను దూరం చేస్తోంది. అందువల్ల సమాజం నిర్ణయించిన మైలురాళ్లతో మిమ్మల్ని మీరు పోల్చుకోవద్దు.జీవక్రియల్లో మార్పులువయసు పెరుగుతున్న కొద్దీ శారీరక శక్తి, కోలుకునే సామర్థ్యం తగ్గుతాయి. ఇరవైల్లో లాగా తక్కువ నిద్రతో సరిపెట్టుకోవడం లేదా ఆహారం సరిగా తీసుకోకపోవడం వంటివి శరీరానికి తీవ్ర నష్టం కలిగిస్తాయి. అందువల్ల ఆరోగ్యానికిప్రాధాన్యతనివ్వాలి.విశ్రాంతి తీసుకున్నా తగ్గని విపరీతమైన అలసట... ఏ పనిపైనా ఆసక్తి లేకపోవడం... నలుగురిలో ఉన్నా ఏదో తెలియని నిరాశ, ఒంటరితనం... ఈ లక్షణాలు ఈ మధ్య మీలో ఎక్కువగా కనిపిస్తున్నాయా? మీరు ముప్పైలో ఉన్నారా? అయితే మీరు ‘బర్నౌట్’బారిన పడి ఉండవచ్చు.విరామం లేని ‘వర్క్ కల్చర్’స్మార్ట్ఫోన్లు, మెయిల్స్, వర్క్–ఫ్రమ్–హోమ్ సంస్కృతి వల్ల ఆఫీసు పనికి, వ్యక్తిగత జీవితానికి మధ్య సరిహద్దులు చెరిగిపోయాయి. పని వేళలు ముగిసిన తర్వాత కూడా మెయిల్స్‌కు, మెసేజ్‌లకు అందుబాటులో ఉండాల్సి రావడం వల్ల మెదడు ఎప్పుడూ విశ్రాంతి పొందే స్థితిలోకి వెళ్లలేకపోతోంది. అందువల్ల పని వేళలు ముగిశాక వర్క్ మెయిల్స్, మెసేజ్‌లకు దూరంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. -
135 రోజుల్లో 45 కేజీలు: నో స్ట్రిక్ట్ డైట్, జస్ట్ నడకతో..
బరువు తగ్గడం అనేది చాలామందికి ఒక అసాధారణమైన లక్ష్యంగా ఉండిపోతుంటుంది. తీవ్రమైన డైట్లు, డిటాక్స్ క్లెన్సింగ్లు, అధిక తీవ్రత గల వర్కౌట్లు వంటి ఎన్నో ట్రెండ్లతో చాలామంది బరువు తగ్గొచ్చని నిరూపిస్తుంటారు. కానీ అవి కూడా మళ్లీ యథావిధికి వచ్చేలా అమాంతం బరువుని పెంచేస్తాయి. దాంతో స్థిరమైన ఆరోగ్యకరమైన బరువుని మెయింటైన్ చేయలేక చతికిలపడుతుంటారు. కానీ ఈ వ్యక్తి అలాంటి ట్రెండ్లు ఏం పాటించకుండా కేవలం వాకింగ్‌తోనే ప్రభావవంతంగా బరువు తగ్గొచ్చని నిరూపించి అందర్నీ ఆశ్చర్యపరిచేలా ఏకంగా 45 కేజీలు తగ్గాడు. మరి అతడికి ఇదెలా సాధ్యమైందంటే.. వివేక్ సిద్ధా అనే ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ కేవలం వాకింగ్‌తో జస్ట్ 135 రోజుల్లో 45 కేజీలు తగ్గినట్లు పేర్కొన్నాడు. ప్రత్యేకమైన డైట్లు, ఖరీదైన సప్లిమెంట్లు గానీ, షార్ట్కట్లు లేవు అంటూ సోషల్ మీడియా వేదికగా తన వెయిట్‌లాస్ జర్నీ గురించి షేర్ చేసుకున్నాడు. గురుగావ్‌లో పనిచేసే సిద్ధా, ప్రతిరోజూ ఢిల్లీలోని తన ఇంటికి నడిచి వెళ్తానని చెబుతున్నాడు. అతడు పదివేల అడుగులతో ప్రారంభించి..క్రమంగా 20 వేల దాక అడుగులు పెంచుకుంటూ వాక్ చేశానని తెలిపాడు.ఆహారం కూడా అంతే ముఖ్యంఒకప్పుడు సిద్దా 128 కేజీల బరువుతో ఉండేవాడు. అలాంటి ఆయన నడకతో కిలోల కొద్దీ బరువు తగ్గడం విశేషం. ఆయన వాకింగ్ తోపాటు అధిక ప్రోటీన్ కలిగిన ఆహారంపై దృష్టి పెట్టానని చెప్పారు. అందుకోసమే రెండుపూటల భోజనంతో ప్రారంభించి..ఓమాడ్ శైలి దినచర్యకు మారినట్లు తెలిపారు.బరువు తగ్గడానికి నడక ఎంత ప్రభావవంతమైనదంటే..బరువు తగ్గడానికి నడక చాలా ప్రభావవంతమైనది, ఇది అందుబాటులో ఉంటుంది, నిలకడగా చేస్తే..కొవ్వును కరిగించి, లీన్ కండరాలను కాపాడటంలో శక్తిమంతంగా ఉంటుంది. రోజువారీ దినచర్యలో కేవలం 30 నిమిషాల వేగవంతమైన నడకను జోడించడం ద్వారా రోజుకు సుమారుగా 150 అదనపు కేలరీలను కరిగించవచ్చు. అయితే, దీని నిజమైన ప్రభావం వేగం, నిలకడ, మొత్తం ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నాడు వివేక్.నడక నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది.నడక కోరికలను విపరీతంగా పెంచకుండా కేలరీలను దహిస్తుంది.ఇది సురక్షితమేనా?135 రోజుల్లో 45 కిలోలు తగ్గాలంటే, మీరు ప్రతిరోజూ సుమారు 2,567 కేలరీల శక్తి లోటును కొనసాగించాల్సి ఉంటుంది. చాలా మందికి, వారి మొత్తం జీవక్రియ ఒక రోజులో అన్ని కేలరీలను దహించదు. దీనిని సాధించడానికి దాదాపు పూర్తి ఉపవాసంతో పాటు గంటల తరబడి తీవ్రమైన రోజువారీ వ్యాయామం చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే..వేగంగా బరువు తగ్గడం వల్ల... పిత్తాశయ రాళ్లు, కండరాల క్షీణత, జీవక్రియ పతనం, జుట్టు రాలడం, ఎలక్ట్రోలైట్ అసమతుల్యతలతో సహా అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.సురక్షితమైన 45 కిలోల బరువు తగ్గాలంటే,వాస్తవికంగా 11 నుంచి 22 నెలల సమయాన్ని కేటాయించుకోవాలి. ఈ నెమ్మదైన కాలవ్యవధికి సహనం అవసరమైనప్పటికీ, ఇది కండరాలకు బదులుగా స్వచ్ఛమైన కొవ్వును కోల్పోవడానికి, చర్మం వదులుగా మారడాన్ని నివారించడానికి, అలాగే జీవితాంతం పాటించగలిగే ఆహారపు అలవాట్లను పెంపొందించుకోవడానికి వీలు కల్పిస్తుంది. View this post on Instagram A post shared by Vivek siddhaa (@the_vivek_siddhaa)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వైద్యులు లేదా వ్యక్తిగత నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: తండ్రి చెంత జైలులోనే ఆ చిన్నారి..!ఆ ఐఏఎస్ అధికారి అడిగిన ప్రశ్న..) -
ప్రోస్టేట్ కేన్సర్ ఎముకలకు వ్యాపిస్తుందా..? అమెరికా మాజీ అధ్యక్షుడు జోబైడెన్ కూడా..
అమెరికా మాజీ అధ్యక్షుడు జోబైడెన్‌కి గతేడాది మే నెలలో తీవ్రమైన ప్రోస్టేట్ కేన్సర్ ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. ఆ కేనర్స్కు గ్లీసన్ స్కోర్ 9 (గ్రేడ్ గ్రూప్ 5)" ఉన్నట్లు వెల్లడిచారు అమెరికా వైద్యులు. అమెరికన్ కేన్సర్ సొసైటీ ప్రకారం..కేన్సర్ చాలా అసాధారణంగా కనిపిస్తే..గ్రేడ్ 5 కేటాయిస్తారు. ఇక్కడ గ్లీసన్ స్కోర్, గ్రేడ్ గ్రూప్ అనేవి కేన్సర్ ఎంత వేగంగా పెరుగుతుందో తెలియజేసే సంఖ్యలు. గ్లీసన్ స్కోర్ 8-10 ఉంటే..కేన్సర్ ప్రోస్టేట్ నుంచి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించే అవకాశాలు అధికం. ప్రస్తుతం జోబైడెన్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఆయనకు కూడా కేన్సర్ మరింత విస్తరించిందని, చికిత్సలో తీవ్ర నొప్పితో బాధపడుతున్నారని ఆయన కుమారుడు హంటర్ బైడెన్ స్వయంగా వెల్లడించారు. అది ఎముకలను దాటి ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించిందని ఆయన తెలిపారు.ప్రోస్టేట్‌కు ఆ స్వభావం ఉంది..ఈ కేన్సర్ వెన్నుముక, కటి, తుంటి, పక్కటెముకలను ప్రభావితం చేస్తంఉది. దాదాపు అన్ని రకాల కేన్సర్లు ఎముకలకు వ్యాపించగలవు. కానీ కొన్ని రకాల కేన్సరలు ఎముకలకు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాటిలో రొమ్ము కేన్సర్, ప్రోస్టేట్ కేన్సర్ ఉన్నాయి. ప్రోస్టేట్ కేన్సర్ కణాలు ప్రాథమిక కణితి నుంచి విడిపోయి, రక్తప్రవాహం లేదా శోషరస వ్యవస్థ ద్వారా ప్రయాణించి..ఎముకల లోపల చేరి పెరుగుతాయి. ఫలితంగా కలిగే పరిణామాలు..ఎముకలకు కేన్సర్ వ్యాప్తి చెందడంతో అనేక తీవ్రమైన సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. వాటిలో కొన్ని..1. తీవ్రమైన ఎముక నొప్పిరాత్రిపూట లేదా కదలికల సమయంలో తీవ్రమయ్యే నిరంతర, మందమైన లేదా కొట్టుకుంటున్నట్లు ఉండే నొప్పి అత్యంత సాధారణ లక్షణాలలో ఒకటి. ఎందుకంటే కేన్సర్ సాధారణ ఎముక నిర్మాణాన్ని దెబ్బతీసి, గణనీయమైన అసౌకర్యాన్ని కలిగిస్తుంది.2. ఎముకలు విరగడంఅత్యంత బలహీనమైన నిర్మాణం కారణంగా, చిన్నపాటి కదలికలు లేదా జస్ట్ కిందపడటంతోనే ఎముకలు విరిగిపోతాయి.3. హైపర్కాల్షిమియాఎముకలకు కేన్సర్ వ్యాపించడం వల్ల రక్తంలో కాల్షియం స్థాయిలు పెరిగి, వికారం, డీహైడ్రేషన్, గందరగోళం, ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కలుగుతాయి.4. వెన్నుపాముపై ఒత్తిడివెన్నుపూసకు సమీపంలో మెటాస్టేసిస్ సంభవిస్తే, అవి వెన్నుపామును ఒత్తిడికి గురిచేసి, బలహీనత, స్పర్శజ్ఞానం కోల్పోవడం లేదా పక్షవాతానికి దారితీయవచ్చు.5. కదలిక తగ్గడంనొప్పి, ఎముకలు విరగడం వల్ల రోగి కదలడం పరిమితం కావచ్చు, ఇది వారి జీవన నాణ్యత, స్వాతంత్ర్యంపై ప్రభావం చూపుతుంది.6. ఎముక మజ్జపై ప్రభావంఎముక మజ్జలో చేరిన కేన్సర్, శరీరం ఎర్ర, తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది, దీనివల్ల అలసట తోపాటు తరచుగా ఇన్ఫెక్షన్లు వస్తాయి.చికిత్సా పద్ధతులుసాధారణంగా ఎముకలకు వ్యాపించిన కేన్సర్‌ను నయం చేయలేనప్పటికీ, ఈ వ్యాధిని నియంత్రించడానికి, లక్షణాలను తగ్గించడానికి అనేక చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో హార్మోన్ థెరపీ, రేడియేషన్ థెరపీ, బిస్ఫాస్ఫోనేట్లు, కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీలు, శస్త్రచికిత్స వంటి ఉపశమన చికిత్సలు ఉన్నాయి.ఎముకలకు వ్యాపించిన కేన్సర్ అనేది ముదిరిన దశకు ఒక సంకేతం. దీనిని అధికారికంగా స్టేజ్ IV ముదిరిన వ్యాధిగా వర్గీకరించారు. అంటే కేన్సర్ ఇకపై ప్రోస్టేట్ గ్రంథికి మాత్రమే పరిమితం కాకుండా, శరీరమంతటా వ్యాపించి వ్యాధిగా మారిందని అన్నారు. దీనికి కేవలం ఒక నిర్దిష్ట ప్రదేశంలోనే చికిత్స కాకుండా, పూర్తి శరీర చికిత్స అవసరం అని వైద్యులు చెబుతున్నారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాకలు వ్యక్తిగత వైద్యలు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: నో జిమ్, నో సప్లిమెంట్లు..! 75 ఏళ్ల వయసులోనూ ఆ అమ్మమ్మ..) -
స్టెమ్‌సెల్స్ మిరాకిల్స్.. ఇకపై బట్టతల ఉండకపోవచ్చు!
ఒక కొత్తజీవి పుడుతున్నప్పుడు ఏర్పడే మొదటి కణంలాగే మూలకణాలూ తొలుత ఒకటిలాగే కనిపిస్తాయి. కానీ అవి భవిష్యత్తులో ఏర్పడబోయే దేహ భాగాలను బట్టి, దేహంలోని వ్యవస్థలను బట్టి వివిధ రకాల కణాలుగా రూపుదిద్దుకుంటాయి. ఆ కణాలు మరింత విభజన చెందాక టిష్యూస్‌గా ఏర్పడతాయి. అలా చర్మం, రక్తకణాలు, కడుపులోని లోపలి పొరల తాలూకు కణాలు, కాలేయం, మెదడు, వెంట్రుకలు వంటి రకరకాల శరీర భాగాలు ఏర్పడతాయి. మౌలికంగా అవన్నీ కణాలే అయినా అవి చేసే పనిని బట్టి కొద్ది వైవిధ్యంతో ఉంటాయి. అయితే ఇలాంటి వేర్వేరు కణాల్లో ఏ భాగానికి చెందిన లేదా ఏ వ్యవస్థకు చెందిన కణంగానైనా రూపొందే శక్తి ఒక్క మూలకణాలకు మాత్రమే ఉంటుంది.అలా మారగలిగే మౌలిక కణాన్నే మూలకణం (ఇంగ్లిష్‌లో స్టెమ్‌సెల్) అంటారు. ఈ స్టెమ్‌సెల్స్ సహాయంతో ఎన్నో అద్భుతాలు చేయవచ్చని ఆధునిక వైద్యశాస్త్ర పరిశోధనల ఫలితాలు చెబుతున్నాయి. ఇప్పటికే కొన్ని వ్యాధులకు చికిత్సలూ జరుగుతున్నాయి. స్టెమ్సెల్స్పై అవగాహనతో పాటు వేర్వేరు కణాలుగా రూపొందడం ద్వారా అవి ఇచ్చే ప్రయోజనాలను తెలుసుకుందాం.మూలకణం అంటేనే ఏ రకమైన కణంగానైనా మారిపోగల మౌలిక కణం కదా! మరి అలాంటి ఆ మూలకణాల్లోనూ రకాలుంటాయి. పురుషుడి వీర్యకణం... మహిళలోని అండంతో ఫలదీకరణం చెందిన తర్వాత తొలుత ఏర్పడేదే... పిండం. తొలుత ఇది ఒకే కణంగా ఉంటుంది. దీన్నే ‘ఎంబ్రియోనిక్ సెల్’ (ఫెర్టిలైజ్డ్ ఓవమ్) అంటారు. ఆ తర్వాత భవిష్యత్తులో ఏర్పడాల్సిన వేర్వేరు కణజాలాలకు అనుగుణంగా ఈ కణం (ఫెర్టిలైజ్డ్ ఓవమ్) విభజన చెందుతూ రకరకాల మూలకణాలు ఏర్పడుతాయి. అటు తర్వాత అవి విభజితమవుతూ తాము భవిష్యత్తులో నిర్వహించాల్సిన వేర్వేరు అవయవాలూ, వ్యవస్థలకు అనుగుణంగా వేర్వేరు కణాలుగా రూపొందుతాయి. వీటి తొలిదశ కణాలనే మూలకణాలుగా పేర్కొనవచ్చు.ఇది శాస్త్రవేత్తల ప్రతిభ... ఈ నేపథ్యంలో ప్రతి సందర్భంలోనూ ప్రతివారికీ అవసరమైన మూలకణాలు దొరకకపోవడంతో శాస్త్రజ్ఞులు ప్రత్యామ్నాయ మార్గాలను శోధించి, కొంతమేరకు విజయం సాధించారు. పరిశోధనశాలల్లో మూలకణాలను రూపొందించారు. వీటినే ‘ఇండ్యూస్డ్ ప్లూరిపొటెంట్ స్టెమ్‌సెల్స్’ (ఐపీఎస్) అని చెబుతారు. నిజానికి ఇవి మూలకణాల్లాగే పనిచేసినా... పుట్టినప్పుడుగానీ లేదా జీవితకాలంలో గానీ దేహంలో ఎక్కడా ఉండవు. శాస్త్రజ్ఞులు చర్మం కణాల నుంచి కొన్నింటిని సేకరించి అచ్చం పిండం ఏర్పడినప్పుడు కనిపించే తొలి కణం (ఎంబ్రియోనిక్ స్టెమ్‌సెల్స్) లాంటివాటిని సృష్టించగలిగారు.మూలకణాలను కనుగొన్న తీరిది... దాదాపు మూడు దశాబ్దాల కిందట... అంటే 1998 ప్రాంతాల్లో... తమ పరిశోధనల్లో శాస్త్రజ్ఞులకు ఎలుకల పిండాలలో తొలిసారిగా మూలకణాలన గుర్తించారు. దాదాపు అదే టైములోనే తమ పరిశోధనల ద్వారా మానవ మూలకణాలను ల్యాబ్‌లో వేరు చేయడంలోనూ శాస్త్రజ్ఞులు విజయం సాధించారు. తొలిదశలో ఈ కణాలను ఉపయోగించి ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ వంటి ప్రక్రియల ద్వారా సంతానం లేనివారికి పిల్లలు కలిగేలా చేయడం వరకే వారి కృషి పరిమితమైంది. ఆ తర్వాత వాటిని ఉపయోగించడంపై అనేక నైతికపరమైన అభ్యంతరాలు, ప్రశ్నలు వెలువడ్డాయి.ఇండ్యూస్డ్ ప్లూరిపొటెంట్ స్టెమ్స్టెల్స్వైద్యరంగంలో ప్రయోజనాలు అటు తర్వాత జరిగిన పరిశోధనల్లో మానవ చర్మం నుంచి కొన్ని కణాలను సేకరించి వాటిని అచ్చం మూలకణాల్లాగే ఉండే కణాలను ఇండ్యూస్డ్ ప్లూరిపొటెంట్ స్టెమ్‌సెల్స్ (ఐపీఎస్)గా రూపొందించడంలో కృతకృత్యులయ్యారు. ఈ ప్రక్రియపైనా కొన్ని అభ్యంతరాలు వెలువడ్డాయి. అయినప్పటికీ వీటితో రకరకాల చికిత్స చేయడం ద్వారా ఒనగూరుతున్న ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని... వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు వాటిని చికిత్సల్లో ఉపయోగిస్తున్నారు. ఎముక మజ్జ (బోన్ మ్యారో) నుంచి సేకరించిన కణాలతో కూడా మూలకణాలను రూపొందించి వివిధ రకాల వ్యాధులకు చికిత్స చేస్తున్నారు. అలా చికిత్స చేయడాన్ని మూలకణం చికిత్స లేదా స్టెమ్‌సెల్ థెరపీగా పేర్కొంటున్నారు.మూలకణ చికిత్స (స్టెమ్‌సెల్ థెరపీ) అంటే...? శరీరంలోని కొన్ని కణాలు పూర్తిగా దెబ్బతింటే అవి మళ్లీ పుట్టవు. దాంతో ఆ దెబ్బతిన్న అవయవంలో గానీ, ఆ వ్యవస్థలో గానీ శాశ్వత లోపం ఏర్పడుతుంది. అయితే స్టెమ్‌సెల్స్ థెరపీ ద్వారా ఆ దెబ్బతిన్న / చనిపోయిన కణాల స్థానాన్ని ఈ మూలకణాలు భర్తీ చేయవచ్చు. అప్పుడవి అచ్చం ఆ అవయవానికి సంబంధించిన మునపటి కణాల్లాగే మారిపోతాయి. దాంతో ఆ అవయవం కూడా మునుపటిలాగే పని చేయడం ్రపారంభిస్తుంది. ఫలితంగా ఆ వ్యవస్థ (సిస్టమ్) కూడా ఎలాంటి లోపం లేకుండా తన పనితీరును కొనసాగిస్తుంది.స్టెమ్‌సెల్ థెరపీ ఎప్పుడంటే...? సాధారణంగా ఇతర సంప్రదాయ వైద్య చికిత్సలైన మందులు ఇవ్వడం లేదా శస్త్రచికిత్స వంటివి ఫలితాలివ్వని సందర్భాల్లో మూలకణాలను సేకరించి ఒక అవయవానికి అందేలా చేస్తారు. అందుకే మూలకణాలతో చేసే చికిత్స ప్రక్రియను ‘రీజెనరేటివ్ మెడిసిన్’ అని కూడా అంటారు. మూలకణ చికిత్సకు ప్రత్యేకమైన చికిత్స ప్రక్రియలుంటాయి. ఈ చికిత్సకులకు జాతీయ ఆరోగ్య అధికారుల నుంచి ప్రత్యేకమైన అనుమతి ఉంటుంది. ఆ చికిత్స విధానంలో నైపుణ్యం పొందిన చికిత్సకులే ఈ తరహా చికిత్సలు చేయాల్సి ఉంటుంది.మూలకణ చికిత్సలో ఆధునిక ప్రక్రియలు... మూలకణాలతో చేసే చికిత్స తొలి దశల్లో అంత వేగంగా సాగకపోయినప్పటికీ... ఇటీవల ఈ ప్రక్రియలో మంచి పురోగతి ఉంది. గత పదేళ్ల వ్యవధిలో ఈ అభివృద్ధి... పరిశోధనశాలల నుంచి ఆసుపత్రులకూ చేరింది. అయినా ఇప్పటికీ దీన్ని ఇంకా ఆవిర్భావ దశలో ఉన్న తొలిదశగానే చెప్పవచ్చు. అంటే ఇంకా ఈ రంగంలో అభివృద్ధి సాధించాల్సింది ఎంతో ఉందని అర్థం.మూలకణ చికిత్సల్లో ఆశారేఖ ఏమిటంటే... తొలిదశల్లోనూ, పరిశోధనాత్మకదశల్లో చేసిన పరీశీలనల్లో అత్యంత సునిశితమైన ఈప్రక్రియ చాలా సురక్షితమైనదని తెలియడంతో పాటు ఇందులో పూర్తిగా నమ్మదగిన ఫలితాలే వచ్చాయి. గతంలో ఏదైనా అవయవం దెబ్బతింటే దాన్ని పూర్తిగా మార్చాల్సిన అవసరం వచ్చేది. అయితే ఇప్పుడీ ఈ మూల కణాల ద్వారా అవయవంలో దెబ్బతిన్న మేరకు మూలకణాలను ప్రవేశపెట్టి, కొత్త కణాలను సృష్టించి అదే దెబ్బతిన్నదాన్ని పూర్తి ఆరోగ్యవంతమైన అవయవంగా మార్చగలిగే అవకాశాలున్నట్లుగా తేలింది. అందుకే దీన్ని ‘రీజనరేటివ్ మెడిసిన్’గా పేర్కొంటున్నారు. ప్రస్తుతం మనం ఈ రీజనరేటివ్ మెడిసిన్‌లోని తొలిగడప మీద ఉన్నామని చెప్పవచ్చు.మూలకణాలతో ఏయే వ్యాధులకు చికిత్స అంటే? ప్రస్తుతానికి మనకు మూలకణ చికిత్సలో ఉన్న పరిజ్ఞానంతో క్యాన్సర్లలోని కొన్ని రకాలైన లుకేమియా (బ్లడ్‌క్యాన్సర్), లింఫోమా, అ΄్లాస్టిక్ అనీమియా, థలసీమియా, సికిల్‌సెల్ అనీమియా వంటి వ్యాధులకు చికిత్స చేయడం సాధ్యమవుతోంది. సాధారణ చికిత్సకు లొంగని క్రిటికల్ లింబ్ ఇస్కిమియా, డయాబెటిక్ ఫుట్ (మధుమేహం వల్ల కాలికి పుండుపడి కుళ్లిపోవడం), డయాబెటిక్ న్యూరోపతి (మధుమేహం వల్ల కాలి లేదా చేతి వేళ్ల చివరలలో మంటలు, తిమ్మిర్లు రావడం, స్పర్శ తగ్గడం), స్కీ›్లరోడెర్మా, సిస్టమిక్ ల్యూపస్ ఎరిథమెటోసిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, స్ట్రోక్ (పక్షవాతం), హార్ట్‌ఫెయిల్యూర్ (గుండెజబ్బులు), కాలేయ వ్యాధులు, డయాబెటిస్ (మధుమేహం), ఆర్థోపెడిక్ కాంప్లికేషన్స్ (ఎముక సంబంధమైన వ్యాధులు), ఫ్రాక్చర్లు, కార్నియల్ డ్యామేజ్ (కంటిలోని నల్లగుడ్డు దెబ్బతినడం), బట్టతల, బొల్లి (విటిలిగో) వంటి వ్యాధులకు మూలకణాలతో చికిత్స చేయవచ్చు.సైంటిస్టులు రూపొందించిన మూలకణాలు!మూలకణాలు శరీరమంతా అక్కడో ఇక్కడో ఉన్నప్పటికీ పెద్దసంఖ్యలో దొరకాలంటే మాత్రం అవి బొడ్డు తాడులోని రక్తంలోనే ఎక్కువగా ఉంటాయి. అయితే... ఇప్పటి తరాలతో పోలిస్తే... ఇంతకు ముందున్న తరాల వారిలో బొడ్డు తాడు నుంచి మూలకణాలను వేరు చేసి భద్రపరచడం అనే అంశంపై పెద్దగాఆసక్తి లేదు. ఎందుకంటే... అప్పట్లో మూలకణాలతో రకరకాల చికిత్సలు సాధ్యమవుతాయనే విషయమే పెద్దగా తెలియదు.క్రిటికల్ లింబ్ ఇస్కిమియా ఈ వ్యాధి ఉన్నవారిలో కాళ్లలోని కింది భాగాలు గుండె నుంచి చాలాదూరంగా ఉన్నందువల్ల, అలాగే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడటం వల్ల చివరి భాగాలకు తగిన మోతాదులో రక్తం అందదు. ఫలితంగా కాలిలోని ఒక ప్రాంతం మొత్తం పనికిరాకుండా పోతుంది. ఇలాంటప్పుడు శస్త్రచికిత్స చేసి, ఆ అడ్డంకులు తొలగించలేని పరిస్థితి ఏర్పడితే... బాధితుడు తన కాలిని కోల్పోవాల్సి వస్తుంది. ఇక ఎలాంటి ప్రత్యామ్నాయమూ లేని పరిస్థితుల్లో రోగికి మూలకణాలతో చికిత్స చేస్తారు. ఇలాంటి రోగులకు ప్రయోగాత్మకంగా చికిత్స చేసిన చాలా సందర్భాల్లో రోగి కాలును తొలగించకుండానే, దాన్ని ఆరోగ్యవంతంగా చేయడంలో పరిశోధకులు, డాక్టర్లు విజయం సాధించారు.స్క్లీ రోడెర్మా, ల్యూపస్ అండ్ రుమాటాయిడ్ ఆర్థరైటిస్ మన సొంత వ్యాధి నిరోధక కణాలు సొంత వ్యవస్థలను పరాయివారిగా గుర్తించి దాడి చేయడం వల్ల వచ్చే వ్యాధుల్ని ‘ఆటో ఇమ్యూన్ వ్యాధులు’గా పేర్కొంటారు. ఈ వ్యాధుల్లో మన సొంత వ్యాధి నిరోధక శక్తిని కావాలనే తగ్గించాల్సి వస్తుంది. ఇలా చేయడం వల్ల శరీరం తేలిగ్గా ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశాలు పెరుగుతాయి. ఒక్కోసారి ఇది ్రపాణాలకే ముప్పుగా మారవచ్చు. అయితే... మూలకణ చికిత్సతో ఇలా ఆరోగ్యకరమైన కణాలపై దాడి చేసే వ్యాధినిరోధక కణాల ఆగడాలను అరికట్టవచ్చు. వ్యాధి నిరోధక శక్తిని సాధారణంగా పనిచేసేలాగానూ చేయవచ్చు.బొల్లి (విటిలిగో)కి చికిత్స... చర్మానికి రంగునిచ్చే మెలనోసైట్స్ అనే కణాలు దెబ్బతినడం వల్ల చర్మం తన స్వాభావికమైన రంగును కోల్పోయి తెల్లగా మారుతుంది. దీని వల్ల చర్మంపై తెల్లటి మచ్చలు, పొడలు కనిపిస్తూ... కాస్మెటిక్‌గా ఇబ్బంది పెడుతుంటాయి. అయితే స్టెమ్‌సెల్స్‌ను ఆ ప్రాంతంలో ప్రవేశపెట్టి... ఆ ప్రదేశంలో మామూలు రంగునిచ్చే (పిగ్మెంట్ ఉన్న) కణాల్ని పెరిగేలా చేయడంతో కొద్దిరోజుల్లోనే చర్మమంతా ఒకే రంగు ఉన్నట్లుగా మారిపోతుంది. ఇలా విటిలిగోకు చికిత్స చేయవచ్చని స్టెమ్‌సెల్ బయాలజిస్టుల అభి్రపాయం.ఇకపై బట్టతల ఉండకపోవచ్చు!వెంట్రుక పుట్టే రోమమూలంలోకి ఈ స్టెమ్‌సెల్స్ ప్రవేశపెట్టడం వల్ల హెయిర్ ఫాలికిల్ పునరుజ్జీవమవుతుంది. ఫలితంగా హెయిర్ ఫాలికిల్ నుంచి వెంట్రుక మొలిచి, అది మామూలుగా పెరగడం మొదలవుతుంది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో జరిగిన పరిశోధనల వల్ల ఈ విషయంలో మంచి ఫలితాలే కనిపించాయి. దీంతో మున్ముందు బట్టతల అనే సమస్య పూర్తిగా పరిష్కృతమవుతుందన్నది వైద్యవర్గాల ఆశాభావం.బ్లడ్ క్యాన్సర్లు, రక్తసంబంధమైన వ్యాధులకు చికిత్స ఇలా... రక్తసంబంధమైన క్యాన్సర్లు, రక్తానికి సంబంధించిన ఇతర వ్యాధులలో రక్తకణాలు పుట్టే మూల కేంద్రమైన ఎముక మజ్జను (బోన్ మ్యారో)ను బాధితుల నుంచి పూర్తిగా తొలగించి... అక్కడ మరో దాత నుంచి స్వీకరించిన ఆరోగ్యవంతమైన మూలకణాలను ప్రవేశపెడతారు. దాంతో ఈ కొత్త ఆరోగ్యకరమైన మజ్జ కారణంగా... ఇకపై పుట్టే కణాలన్నీ ఆరోగ్యకరమైనవిగా ఉంటాయి. ఇలా చేసే ఈ చికిత్సతో బ్లడ్క్యాన్సర్లూ, రక్తసంబంధమైన వ్యాధులలోనూ చికిత్స సాధ్యమవుతోంది. ఈ రకమైన చికిత్స అనేది ఇప్పటికి... లుకేమియా, మల్టిపుల్ మైలోమా, లింఫోమా, రక్తసంబంధమైన ఇతర వ్యాధులైన అ΄్లాస్టిక్ అనీమియా, థలసీమియా, సికిల్‌సెల్ అనీమియాలో సాధ్యమవుతుంది.వ్యాధిగ్రస్తుల దగ్గరి సంబంధీకుల నుంచి కొన్ని మూలకణాలను సేకరించి... వాటిని రక్తమార్పిడి తరహాలోనే వ్యాధిగ్రస్తులలో ప్రవేశపెట్టి చికిత్స చేస్తారు. అప్పటికే వ్యాధిగ్రస్తమై ఉన్న కణాలను నిర్మూలించడానికి కీమోథెరపీ లేదా రేడియేషన్ థెరపీ ఇస్తారు. ఒకసారి వ్యాధిగ్రస్త కణాలన్నీ శరీరం నుంచి తొలగిపోయాక... మూలకణాలతో మార్పిడి చేసిన మజ్జ నుంచి ఇకపై పూర్తిగా ఆరోగ్యకరమైన రక్తకణాలే పుడుతుంటాయి. అయితే సంప్రదాయ చికిత్స ద్వారా సదరు వ్యాధి లొంగని సందర్భాల్లో మాత్రమే ఈ చికిత్సను ఆశ్రయిస్తారు. ఎందుకంటే ఈ చికిత్సలో కీమోథెరపీ మోతాదు ఎక్కువైతే ఒక్కోసారి అది ఇన్ఫెక్షన్లకో లేదా కొన్నిసార్లు రక్తస్రావానికో దారితీసే ముప్పు (రిస్క్) ఉంటుంది. ప్రస్తుతం ఈ రిస్క్ తగ్గించేందుకు అవసరమైన పరిశోధనలు జరుగుతున్నాయి.డయాబెటిక్ ఫుట్ అండ్ డయాబెటిక్ న్యూరోపతి మధుమేహం ఉన్నవారిలో ఈ దుష్ప్రభావం చాలా సాధారణం. చాలా సందర్భాల్లో మధుమేహం ఉన్న వ్యక్తుల కాళ్లకు పుండ్లు పడతాయి. అవి ఎప్పటికీ మానని దశకు చేరుకుని కుళ్లడం మొదలవుతుంది. గ్యాంగ్రీన్గా పేర్కొనే ఈ దశకు చేరుకున్న కాలిని తొలగించడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేని దశకు బాధితులు చేరుకుంటారు. అయితే ఇటీవలి పరిశోధనల వల్ల ఈ తరహా సమస్యలను ఎదుర్కొనే వారిలో స్టెమ్‌సెల్స్ వల్ల డయాబెటిక్ ఫుట్నూ, డయాబెటిక్ న్యూరోపతిని తగ్గించే అవకాశాలు ఎక్కువేనని తెలిసింది.ఎముక సంబంధ వ్యాధులు (ఆర్థోపెడిక్ కాంప్లికేషన్స్) ఎముక సంబంధ వ్యాధుల్లోనూ అనేక రకాలు ఉంటాయి. ఉదాహరణకు పాదం, చీలమండ, తుంటిభాగం, మోకాలు నుంచి మొదలుకొని కీలకమైన వెన్నెముక వరకూ అనేక రకాల ఎముకలు ఉంటాయి. ఇవి రకరకాల సమస్యలకు గురవుతుంటాయి. విరిగిన ఎముకలు సరిగా అతుక్కోకపోవడం, వీటిపై ఉండే చిగురు ఎముక (కార్టిలేజ్) దెబ్బతినడం, ఎముకకు రక్తప్రసరణ లేక ఎముకలోని కొంతభాగం మృతిచెందడం (ఎవాస్క్యులార్ నెక్రోసిస్) వంటివి ఇందులో కొన్ని. ఇలాంటి ఎన్నో వ్యాధులకు గతంలో అంతగా ఫలితాలివ్వని వాటిల్లో కూడా... ఇప్పుడు మూలకణ చికిత్సలతో మంచి ఫలితాలే వస్తున్నాయి. ఎముకలోని కొంత భాగం పూర్తిగా మృతిచెందిన 3–4 ఏళ్ల తర్వాత కూడా ఆ భాగం మళ్లీ పునరుజ్జీవంతో మామూలుగానే పనిచేసిన దాఖలాలు ఉన్నాయి.గుండె, కాలేయ సంబంధ వ్యాధుల్లో... ఇప్పటికే గుండె, కాలేయ సంబంధిత వ్యాధుల్లో స్టెమ్‌సెల్ థెరపీ ద్వారా అనేక ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. మున్ముందు మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చన్నది వైద్య వర్గాల మాట. గుండె కండరాలు దెబ్బతిన్న ప్రాంతంలో... చనిపోయిన ఆ కణాలను పునరుజ్జీవించేలా చేసి, హార్ట్ ఫెయిల్యూర్‌ను రివర్స్ చేయవచ్చన్నది పరిశోధనలతో తెలిసివస్తున్న మాట.అలాగే కాలేయం విషయానికి వస్తే... మద్యం తాగడం వల్ల కాలేయం దెబ్బతిని, అది పూర్తిగా చెడిపోయిన వారికి, స్టెమ్‌సెల్స్‌ను ఆ ప్రాంతంలో ప్రవేశపెట్టి... దెబ్బతిన్న భాగాన్ని మళ్లీ పునరుజ్జీవింపజేయవచ్చని తేలింది. అయితే ఈ పరిశోధనలు ఇంకా ్రపాథమిక పరిశోధన దశల్లో ఉన్నప్పటికీ... కొన్నాళ్లలోనే ఆ చికిత్స ప్రక్రియలుగా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.కార్నియా, రెటీనా సమస్యలకు... గతంలో కంటి నల్లగుడ్డు కార్నియాలోని కణాలు దెబ్బతిన్నప్పుడు గానీ... లేదా దృశ్యాన్ని తన తెరపై పట్టివేసే... రెటీనా కణాలు గాని దెబ్బతిన్నప్పుడు అవి మళ్లీ పునరుజ్జీవించేందుకు ఆస్కారమే ఉండేది కాదు. అయితే స్టెమ్‌సెల్స్ వల్ల ఇలా క్రమంగా క్షీణిస్తూ మృతిచెందిన కార్నియా, రెటీనా కణాలను పునరుజ్జీవింపజేసేందుకు మూలకణాలు తోడ్పడతాయని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. వాటి ఆధారంగా కొద్దిరోజుల్లోనే ఈ మూలకణాలతో కార్నియా, రెటీనా భాగాలను పునరుజ్జీవింపజేసి... అనేక మంది అంధులకు మళ్లీ కంటివెలుగు తెప్పించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నది సైంటిస్టులు, డాక్టర్లకు కనిపిస్తున్న ఆశారేఖ.చివరగా... మూలకణ పరిశోధకులు (స్టెమ్‌సెల్ స్పెషలిస్ట్స్), క్లినీషియన్స్ (డాక్టర్లు), కొన్ని సందర్భాల్లో సర్జన్లు (శస్త్రచికిత్సకులు) కలిసి సంయుక్తంగా ఒక బృందంగా ఏర్పడి ఈ చికిత్సలను నిర్వహిస్తుంటారు. మున్ముందు ఈ రంగంలో కనుగొనబోయే చికిత్సలతో వైద్యరంగంలోనే విప్లవాత్మకమైన మార్పులు రావచ్చన్నది పలువురు పరిశోధకులు, వైద్యవర్గాల భావన.- డాక్టర్ సాదత్ అల్ అలీ, ప్రొఫెసర్ ఆఫ్ రీ జెనరేటివ్ మెడిసిన్ అండ్ ఆర్థోపెడిక్ సర్జరీనిర్వహణ: యాసీన్ -
పెళ్లైన మహిళల్లో ఆ సమస్య ఎందుకు వస్తుంది?
నా వయసు ఇరవై ఆరు సంవత్సరాలు. పెళ్లై మూడేళ్లు అయింది. నాకు ప్రతి నెలా యోనిలో దురద వస్తోంది. కొన్నిసార్లు ఆ భాగం ఎర్రగా కూడా మారుతోంది. మందులు వాడినా మళ్లీ మళ్లీ వస్తోంది. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది?– రాజేశ్వరి, నంద్యాలమీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే, మీకు యోని ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉంది. ఇది మహిళల్లో చాలా సాధారణంగా కనిపించే సమస్య. ముఖ్యంగా పెళ్లైన మహిళల్లో, ప్రసవ వయసులో ఉన్నవారిలో ఈ సమస్య అప్పుడప్పుడు లేదా తరచుగా మళ్లీ మళ్లీ రావచ్చు. సాధారణంగా యోనిలో కొన్ని మేలు చేసే సూక్ష్మజీవులు సహజంగానే ఉంటాయి. ఇవి ఆ ప్రాంతాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే కొన్ని కారణాల వల్ల శిలీంద్రాల పెరుగుదల అధికమైతే ఈ సమతుల్యత దెబ్బతిని ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ సమస్య ఉన్నప్పుడు యోని లోపల, బయట తీవ్రమైన దురద ఉంటుంది. ఆ భాగం ఎర్రగా మారుతుంది. మంటగా అనిపిస్తుంది. మూత్రం విసర్జించే సమయంలో మంట కలగవచ్చు. ఎక్కువగా గోకడం వల్ల గీతలు పడే అవకాశం ఉంటుంది. అలాగే చిక్కగా, తెల్లగా ఉండే స్రావం కూడా రావచ్చు.ఈ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే...బిగుతుగా ఉండే దుస్తులు ధరించకండి.గాలి సులభంగా ఆడే కాటన్ లోదుస్తులు వాడండి. ∙లోదుస్తులు ఉతికేటప్పుడు బలమైన సువాసన కలిగిన ద్రావకాలు ఉపయోగించకండి.యోని భాగంలో సువాసన క్రీములు, సుగంధ ద్రవ్యాలు, స్నాన ద్రావకాలు వాడకండి.మృదువైన సబ్బులు మాత్రమే ఉపయోగించండి.వైద్యుల సలహా లేకుండా యాంటీబయోటిక్ మందులు తీసుకోవద్దు.ఆ భాగాన్ని ఎప్పుడూ శుభ్రంగా, పొడిగా ఉంచుకోండి.కొంతమందిలో ఈ ఇన్ఫెక్షన్ దానంతట అదే తగ్గిపోవచ్చు. అయితే చాలామందికి మాత్రం సరైన చికిత్స అవసరమవుతుంది. తరచుగా మళ్లీ మళ్లీ వస్తుంటే దానిని నిర్లక్ష్యం చేయకూడదు. అలాంటి సందర్భాల్లో కారణాన్ని తెలుసుకోవడానికి కొన్ని పరీక్షలు అవసరమవుతాయి. యోని నుంచి నమూనా తీసి పరీక్ష చేయడం ద్వారా ఏ రకమైన ఇన్ఫెక్షన్ ఉందో, ఏ శిలీంద్రం కారణమైందో, దానికి ఏ మందు ప్రభావవంతంగా పనిచేస్తుందో తెలుసుకోవచ్చు. అలాగే మూత్ర పరీక్షలు, రక్తంలో చక్కెర స్థాయులు, శరీర రోగనిరోధక శక్తికి సంబంధించిన పరీక్షలు కూడా అవసరమవుతాయి. మధుమేహం ఉన్నవారిలో లేదా రక్తంలో చక్కెర స్థాయులు అధికంగా ఉన్నవారిలో ఇలాంటి ఇన్ఫెక్షన్లు తరచు కనిపిస్తాయి.కొన్నిసార్లు ఇతర వైరస్ ఇన్ఫెక్షన్లు లేదా రోగనిరోధక శక్తి తగ్గడం కూడా దీనికి కారణం కావచ్చు. అందుకే, తరచుగా వచ్చే యోని ఈస్ట్ ఇన్ఫెక్షన్ చికిత్సను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. సాధారణంగా ఫ్లుకోనాజోల్ 150 మిల్లీగ్రాముల మాత్రను మూడు రోజులకోసారి చొప్పున మొత్తం మూడు మోతాదులు ఇవ్వవచ్చు. ఆ తర్వాత ఇన్ఫెక్షన్ మళ్లీ రాకుండా ఉండేందుకు నిర్వహణ చికిత్సలో భాగంగా వారానికి ఒక మాత్ర చొప్పున ఆరు నెలల పాటు వాడాలని వైద్యులు సూచిస్తారు. లేదా క్లోట్రిమాజోల్ 500 మిల్లీగ్రాముల మాత్రలను రెండు వారాల పాటు వాడమని చెప్తారు. అనంతరం ఆరు నెలల పాటు వారానికి ఒకసారి చొప్పున వాటిని ఉపయోగించాల్సి ఉంటుంది. అలాగే యోని నుంచి నమూనా సేకరించి పరీక్ష చేయించడం ద్వారా ఏ రకమైన శిలీంద్రం కారణమైందో గుర్తించి, దానికి తగిన చికిత్స అందిస్తారు. ఇలా పూర్తి చికిత్స తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గడమే కాకుండా, మళ్లీ మళ్లీ వచ్చే అవకాశాన్ని కూడా గణనీయంగా తగ్గించవచ్చు.మేనిమాట! మెదడులో చెత్తబండి!మనం దుప్పటి కప్పుకుని రాత్రిళ్లు ‘ఆఫ్’లో ఉంటే.. మెదడు మాత్రం ‘క్లీనింగ్ మోడ్ ఆన్ !’ చేసి, వ్యర్థాలను బయటకు పంపే పనిలో బిజీగా ఉంటుంది. అవును.. నిద్రలో ‘గ్లింపాటిక్ సిస్టమ్’ చురుగ్గా పనిచేసి, మెదడులో పేరుకునే కొన్ని వ్యర్థ పదార్థాలను ‘సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ’ ప్రవాహం ద్వారా తొలగించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా స్లో వేవ్ స్లీప్ సమయంలో ఈ ప్రక్రియ మరింత చురుగ్గా సాగుతుంది.- డా, భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
లెమనేడింగ్ ఏడో రుచి.. కష్టాలను తట్టుకునే శక్తి!
మానవాళికి ప్రకృతి షడ్రుచులను ప్రసాదించింది. శాస్త్రవేత్తలు ఇప్పుడు ఏడో రుచిని కనిపెట్టారు. ఆ ఏడో రుచి పేరే... ‘లెమనేడింగ్’! నిజానికి ఇది రుచి కాదు. కష్టాలు వచ్చినప్పుడు వాటిని సరదాగా తీసుకుని... చేదు అనుభవాల నుండి తీపి అనుభూతులను పొందే జీవన విధానం. ఈ స్వభావం మానవుల్లో మునుపు లేదని కాదు. దాన్నిప్పుడు పరిశోధకులు ఉందని రూఢీగా వెల్లడించారు. చెడు కాలంలోనూ చెదరని గుండెతో ఉండటమే లెమనేడింగ్.‘‘జీవితం మీకు నిమ్మకాయలను ప్రసాదిస్తే, నిమ్మరసమే చేసుకుని తాగండి’’ : 20వ శతాబ్దపు ప్రముఖ అమెరికన్ రచయిత, తత్త్వవేత్త, వ్యాపారవేత్త ఎల్బర్ట్ హబ్బర్డ్ చెప్పిన మాట ఇది. 1909లో ‘లిటరరీ డైజెస్ట్’ అనే పత్రికలో ఎల్బర్ట్ ఇలా రాశారు : ‘విధి తనకిచ్చిన నిమ్మకాయలను తీసుకుని, వాటితో నిమ్మరసం వ్యాపారం మొదలుపెట్టేవాడే అసలైన మేధావి’ – అని. అప్పట్నుంచీ ఈ మాట పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులలో వాడుకగా వినిపిస్తోంది. నిమ్మరసాన్ని ‘లెమనేడ్’ అంటారు. కనుక ఇది ‘లెమనేడ్ ఫిలాసఫీ’ అయింది. తాజాగా అమెరికన్ శాస్త్రవేత్తలు జరిపిన పరిశీలనలో లెమనేడ్ ఫిలాసఫీ మానవ జీవితానికి ప్రశాంతతను చేకూర్చే మాట నిజమే అని నిర్థారణ అవటం విశేషం!నవ్వుతూ బతకాలిరా..!జీవితాన్ని సరదాగా తీసుకునే అలవాటు వల్ల కష్టాలను తట్టుకునే శక్తి పెరుగుతుందట! కష్టాలు, అడ్డంకులు ఎదురైనప్పుడు మనుషులు ఆ పరిస్థితులకు ఎలా స్పందిస్తారో తెలుసుకోవడానికి ఇటీవల శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. అధ్యయనం కోసం వారు కోవిడ్–19 సమయంలోని 503 మంది అమెరికన్ల ప్రవర్తన, వారి భావోద్వేగాలను పరిశీలించారు.ఈ పరిశీలనలో శాస్త్రవేత్తలు ఒక ఆసక్తికరమైన విషయాన్ని గమనించారు. జీవితాన్ని కాస్త సరదాగా, ప్రశాంతంగా తీసుకునే మనస్తత్వం ఉన్నవారు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను నిజాయితీగా అంగీకరిస్తూనే, భవిష్యత్తు పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారని తేలింది. వీరు తమకు ఎదురయ్యే సవాళ్లకు త్వరగా అలవాటు పడటమే కాకుండా, రోజువారీ పనులను ఆనందంగా, ఆ పనుల్లో లీనమై మరీ చేయగలిగారు. ఎలాంటి కష్టాలనైనా తట్టుకునే శక్తిని (రెజిలియన్స్) కనబరచారు.ఆలోచనా విధానాన్ని, ప్రవర్తనను మార్చుకుంటూ, సృజనాత్మకంగా ఆలోచిస్తూ, అనుకూలమైన ఫలితాల కోసం ప్రయత్నించే ఈ అలవాటుకు శాస్త్రవేత్తలు ‘లెమనేడింగ్’ అని పేరు పెట్టారు. అంటే ‘చేదు’ లాంటి కష్టాలను కూడా నిమ్మరసంలా తీపిగా/సానుకూలంగా మార్చుకోవడం. దీనినే ఇంకోలా చెప్పాలంటే – జీవితంలో మనకు ఏది ఎదురైతే దానినే, దాని కోసమే ఎదురు చూస్తున్నట్లుగా స్వీకరించటం.చేదులోనే తియ్యని రుచి!జీవితాన్ని కాస్త సరదాగా తీసుకోవడం అంటే, మనం ఉన్న పరిస్థితిని తేలికగా తీసుకుంటున్నామని కాదు, ఆ పరిస్థితిని ఎదుర్కొనే శక్తి మనలో పెరుగుతోందని అర్థం అని పరిశోధకులు చెబుతున్నారు. కోవిడ్–19 లాక్డౌన్ సమయంలో ప్రజల అనుభవాలను వీరు అధ్యయనం చేసినప్పుడు ఓ నిజం వెల్లడైంది. సరదా మనస్తత్వం ఉన్నవారు భవిష్యత్తు పట్ల సానుకూలంగా ఉంటూ, సమస్యలను చాలా చురుగ్గా, సృజనాత్మకంగా ఎదుర్కొన్నారు. అంటే, జీవితం వారికి చేదు వాస్తవాలను (నిమ్మకాయలు) ఇచ్చినప్పుడు, వారు వాటిని తీపి అనుభవాలుగా (నిమ్మరసం) మార్చుకున్నారు!దీనికి సంబంధించిన పరిశోధనా వ్యాసం ‘ఫ్రంటియర్స్ ఇన్ సైకాలజీ’ పత్రిక తాజా సంచికలో అచ్చయింది. ‘‘మా పరిశోధనలో తేలిందేమిటంటే సరదా మనస్తత్త్వం, మానసిక స్థైర్యం అనేవి ‘లెమనేడింగ్’ అనే భావన ద్వారా ఒకదానికొకటి చాలా బలంగా ముడిపడి ఉన్నాయి. కష్ట సమయాల్లో కూడా సానుకూల అనుభవాలను సృష్టించుకునే సామర్థ్యమే ఈ లెమనేడింగ్’’ అని వ్యాసకర్త, ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ షియాంగ్యూ ‘షారన్’ షెన్ అంటున్నారు.‘‘పాండమిక్ (మహమ్మారి) సమయంలో సరదా మనస్తత్వం ఉన్నవారు, లేనివారు ఇద్దరూ ఒకే రకమైన భయాన్ని, ఒంటరితనాన్ని అనుభవించారు. కానీ సరదాగా ఉండే వ్యక్తులు ఆ కష్టతరమైన పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. పోగొట్టుకున్న వాటికి ప్రత్యామ్నాయాలను వెతుక్కున్నారు, అడ్డంకులను ఎదిగే అవకాశాలుగా చూశారు. అన్నిటికంటే ముఖ్యంగా, ఆ పరిస్థితికి ఎలా స్పందించాలన్న విషయాన్ని తమ నియంత్రణలోనే ఉంచుకున్నారు’’ అని షెన్ తెలిపారు.‘లెమనేడింగ్’ పరిశోధన వెనుకడాక్టర్ షెన్, ఆమె సహచర శాస్త్రవేత్తలు మనుషుల సరదా మనస్తత్త్వం (ప్లేఫుల్నెస్) అనేది కష్ట సమయాల్లో జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి చాలా కాలంగా ఆసక్తితో చూస్తున్నారు. కోవిడ్ మహమ్మారి వారికి ఆ విషయాన్ని పెద్ద ఎత్తున పరిశోధించడానికి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చింది. ఇందుకోసం వారు అమెరికాలో నివసిస్తున్న 503 మంది వయోజనులను ఎంచుకుని, 2021 ఫిబ్రవరి (కోవిడ్ రెండవ వేవ్, వ్యాక్సిన్ ప్రారంభ సమయం) ఒక సర్వే నిర్వహించారు.ఈ సర్వేలో పాల్గొన్నవారిని – కరోనా సోకుతుందేమో అనే భయం ఎంతవరకు ఉంది? పరిస్థితులు బాగుపడతాయని నమ్ముతున్నారా? వారికి ఇతరుల మద్దతు ఉందా? వారి భావోద్వేగాలు ఎలా ఉన్నాయి? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. దాంతో పాటు, వారు ఎంత సరదాగా ఉంటారు? ఎంత స్పాంటేనియస్‌గా (సహజంగా / వెంటనే) స్పందిస్తారు? ఆనందంగా ఉండటానికి ఎంతవరకు ప్రయత్నిస్తారు? అనే అంశాల ఆధారంగా వారి సరదా మనస్తత్వాన్ని కొలిచారు.ఈ వివరాల ఆధారంగా శాస్త్రవేత్తలు, సర్వేలో పాల్గొన్న వారిని వారి సరదా మనస్తత్వ స్థాయిని బట్టి నాలుగు భాగాలుగా విభజించారు. సరదా మనస్తత్వం అనేది మనుషుల ఆలోచనలను, ప్రవర్తనను ఎలా మారుస్తుందో స్పష్టంగా అర్థం చేసుకోవడానికి అత్యంత సరదాగా ఉండే మొదటి 126 మందిని, అసలు సరదా లేని చివరి 126 మందితో పోల్చి చూశారు.సానుకూల అవకాశాలపై దృష్టిఅత్యంత సరదాగా ఉండే వ్యక్తులు భవిష్యత్తు పట్ల చాలా ఆశావాదంతో ఉన్నారని, వ్యాక్సిన్ విజయవంతంగా అందుబాటులోకి వస్తుందని; జీవితం మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటుందని నమ్మారని ఈ పరిశోధన వివరాలు స్పష్టం చేశాయి. అయితే దీని అర్థం వారు అప్పటి పరిస్థితిని పట్టించుకోకుండా, ఊహల్లో బతికారనడం కాదు!‘‘అతిగా ఆశావాదంతో ఉన్నవారు వాస్తవాలను గుర్తించకుండా ప్రతిదీ బాగుందని భ్రమిస్తుంటారు. కానీ మేము గమనించిన ‘స్పాట్లైట్’ (దృష్టి) ప్రభావం అలా కాకుండా చాలా స్పష్టంగా ఉంది’’ అని డాక్టర్ షెన్ వివరించారు. ‘‘సరదా మనస్తత్వం ఉన్నవారు కోవిడ్–19 ప్రమాదాలను తేలికగా తీసుకోలేదు, అలాగని రక్షణ చర్యల ప్రభావంపై అతిగా అంచనాలూ వేసుకోలేదు. వారు తమ ‘స్పాట్లైట్’ ని కేవలం సానుకూల మార్పులు, మెరుగవటానికి ఉండే అవకాశాలపైకి మళ్లించారు. చీకటి లాంటి కష్టసమయాల్లో కూడా ముందుకు సాగే మార్గాలను వెలుగులోకి తెచ్చుకున్నారు’’ అంటారు షెన్.అధిక సరదా మనస్తత్త్వం కలిగినవారు ఆనందాన్ని వెతుక్కోవడానికి ఎక్కువ ఉత్సాహపడ్డారు, సంకోచించకుండా ఆలోచించారు. ఇది అనిశ్చిత పరిస్థితుల్లో కూడా అనేక సానుకూల అవకాశాలను ఊహించడానికి వారికి సహాయపడింది. దీనికి తోడు వారి ప్రవర్తనలో ఉన్న సరళత, పనుల్లో వారు చూపించే శ్రద్ధ.. కష్టాలను తట్టుకునే మానసిక స్థైర్యాన్ని అందించాయి.చిన్న చిన్న మార్పులు చేసుకున్నారుపాండమిక్ సమయంలో ఇరు వర్గాల వ్యక్తులూ సమానంగానే ఒంటరితనాన్ని, భయాన్ని అనుభవించారు. కానీ సరదాగా ఉన్నవారు ఆ పరిస్థితులను తట్టుకోవడానికి సృజనాత్మక, క్రియాశీలక అడుగులు వేశారు. వారు వేరే ఏవో కొత్త వినోద కార్యక్రమాలలో పాల్గొనలేదు, కానీ తాము చేసే పనుల్లోనే సమయాలను మార్చుకోవడం, కొత్త ప్రదేశాలను అన్వేషించడం లేదా చురుగ్గా ఉండటానికి కొత్త మార్గాలు వెతకడం ద్వారా పరిస్థితులకు అనుగుణంగా మారారు. వారు తమ రోజువారీ జీవితంలో మరింత చురుగ్గా, ఆనందంగా, లీనమై గడిపారు.‘‘మా పరిశోధన సరదా మనస్తత్త్వాన్ని కొలవడంపైనే దృష్టి పెట్టినప్పటికీ, ఈ గుణాన్ని పెంపొందించుకోవడానికి కొన్ని మార్గాలను పరిశోధనలు సూచిస్తున్నాయి. ఉదాహరణకు, మీకు ఆనందాన్నిచ్చే పనుల్లో పాల్గొనండి, కొత్త అనుభవాలకు సిద్ధంగా ఉండండి, మిమ్మల్ని నవ్వించే వ్యక్తులతో సమయం గడపండి. సరదాగా ఉండటానికి ఆటలే ఆడాల్సిన పనిలేదు. మన రోజువారీ క్షణాల్లో కాస్త ఆనందం, స్వేచ్ఛ, అనుకూలమైన ఆలోచనా విధానాన్ని తెచ్చుకుంటే చాలు’’ అని షెన్ చెబుతున్నారు. జీవితంలో సరదాలు ఉండాలి‘‘ముఖ్యంగా కష్టకాలంలో మన మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరదా మనస్తత్వం అనేది చాలా కీలకమైనది. కానీ చాలామంది దీని ప్రాముఖ్యతను గుర్తించరు’’ అని అంటారు షెన్. ‘‘సరదాగా ఉండే వ్యక్తులు.. కష్టాలను ఎంత సమర్థవంతంగా ఎదుర్కొంటారో అర్థం చేసుకోవడం వల్ల, ఇతరులు కూడా ఒత్తిడిని, అనిశ్చితిని జయించే వ్యూహాలను రూపొందించవచ్చు. మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రపంచ స్థాయి సవాళ్లకు వాస్తవిక అంచనా, సృజనాత్మకమైన సర్దుబాటు రెండూ అవసరం కాబట్టి, ఈ విషయం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది’’ అని ఆమె అభిప్రాయపడ్డారు.అయితే, ఈ పరిశోధన ఫలితాలను ప్రతి పరిస్థితికీ లేదా అందరికీ ఒకేలా వర్తింపజేయలేమని షెన్, ఆమె సహచరులు హెచ్చరిస్తున్నారు. వేర్వేరు పరిస్థితుల్లో ఈ సరదా మనస్తత్త్వం వేర్వేరు వ్యక్తులపై భిన్నమైన ప్రభావం చూపవచ్చు. అలాగే, అత్యంత సరదాగా ఉండేవారికి, లేనివారికి మధ్య ఉన్న తేడాలన్నీ కేవలం ఈ ఒక్క గుణం వల్లే వచ్చాయని చెప్పలేము. ‘‘మనుషుల మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలను మేము గుర్తించినప్పటికీ, రోజువారీ సంఘటనలకు వారు ఎలా స్పందిస్తారనే దానిపై ప్రభావం చూపే ఈ సరదా మనస్తత్త్వం ఇతర పరిస్థితులకు కూడా (రోజువారీ కానివీ, వివిధ రంగాలకు చెందినవీ) వర్తిస్తుందని చెప్పలేం అని షెన్ పేర్కొన్నారు. ‘‘ఈ ‘సరదా ఆలోచనా విధానం’ ఎలాంటి మార్పులు తీసుకువస్తుందో మరింత పూర్తిగా అర్థం చేసుకోవడానికి, భవిష్యత్తులో జీవితంలోని ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని పరిశోధనలు జరపవలసి ఉంది’’ అని షెన్ అంటున్నారు. – సాక్షి స్పెషల్ డెస్క్- షియాంగ్యూ ‘షారన్’ షెన్, ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ -
మధుమేహం వల్ల వినికిడి శక్తి తగ్గుతుందా?
ప్రపంచం లో అత్యంత వేగంగా పెరుగుతున్న వ్యాధుల్లో మధుమేహం (డయాబెటిస్) ఒకటి. ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లమందికిపైగా ఈ వ్యాధితో బాధపడుతున్నారని అంచనా. డయాబెటిస్తో బాధపడేవారిలో వినికిడి శక్తి కూడా తగ్గుతుందా అనే అంశంపై జరిగిన కొన్ని పరిశోధనల్లో ఆసక్తికరమైన ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో... డయాబెటిస్ లేని వారితో పోలిస్తే ఆ సమస్య ఉన్నవారికి వినికిడి లో΄ాలు వచ్చే అవకాశం రెండు రెట్లకు పైనే ఉన్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్తో బాధపడుతున్న యుక్తవయస్కుల్లో (అడల్ట్స్)లో నాలుగోవంతు మంది (అంటే దాదాపు 25% మంది)లో వినికిడి లోపాలు ఉన్నట్లు గుర్తించారు. ‘డయాబెటిస్ మెటబాలిజమ్ రీసెర్చ్ రివ్యూ’ అనే జర్నల్‌లో ప్రచురితమైన అంశాలను బట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న డయాబెటిస్ బాధితుల్లో దాదాపు 13 కోట్ల మందిలో తీవ్రమైన వినికిడి సమస్యలున్నాయని తేలింది. సాధారణంగా డయాబెటిస్తో బాధపడే వ్యక్తుల్లో వారికి ఉన్న ఆ సమస్య కళ్లు, మూత్రపిండాలు, నరాలకు ఏదైనా నష్టం చేసిందా అన్నకోణంలో ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఈ పరిశోధనల నేపథ్యం లో ఇకపైపై పరీక్షల్లాగే వినికిడి పరీక్షలూ చేయాలంటూ పరిశోధకులు వైద్యవర్గాలకు ఓ సూచన చేస్తున్నారు. ‘‘ఈ వినికిడి సమస్యను తేలిగ్గా తీసుకోకూడదు. డయాబెటిస్తో వచ్చే వినికిడి లోపం చాలాసార్లు 40–50 ఏళ్ల మధ్య వయసులోనే మొదలువుతుంది. దాంతో సంభాషణలు వినడం, ఎదుటివారితో కమ్యూనికేషన్ నెరపడం కష్టమై క్రమంగా ఒంటరితనం పెరుగుతుంది. జ్ఞాపకశక్తి తగ్గడమూ వేగవంతమవుతుంది. అందుకే డయాబెటిస్ అన్నది నెమ్మదిగా దెబ్బతీసే పెద్దసమస్య. అందుకే ఇకపై డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు చేసే పరీక్షల్లో వినికిడి పరీక్షనూ చేర్చాల్సిన సమయం వచ్చింద’’నేది ఈ అధ్యయనం తాలూకు ప్రధాన పరిశోధకుల మాట. తక్కువ ఖర్చుతో చేసే వినికిడి పరీక్షల ద్వారా సమస్యను మొదటే గుర్తిస్తే సత్వర చికిత్స సాధ్యమని పరిశోధకులు తెలిపారు. అవసరమైనప్పుడు హియరింగ్ ఎయిడ్స్ ఉపయోగించడం లాంటి సకాలంలో చేసే చికిత్సతో సంభాషణ సామర్థ్యం, జీవననాణ్యత మెరుగుపడే అవకాశం ఉందనీ, అలాగే రక్తంలో చక్కెర మోతాదులను నియంత్రించడం ద్వారా వినికిడి మరింత దెబ్బతినకుండా కొంతవరకు నిరోధించవచ్చనీ పేర్కొన్నారు. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు అన్ని పరీక్షల్లాగే వినికిడి పరీక్షలూ చేయడం మంచిదని వారి సూచన. (చదవండి: -
అలర్జీస్... అలెర్ట్ ప్లీజ్!
ఇవి వానల కాలం. వాతావరణంలో కాస్త తేమ ఎక్కువగా ఉండే సమయం. అందుకే మామూలుగా వచ్చే అలర్జీలతో పోలిస్తే ఈ సీజన్లో అవి మరింత ఎక్కువ. వర్షాకాలం మొదలు కాగానే సీజనల్ సైనసైటిస్, అలర్జీ వంటి ఆరోగ్య సమస్యలు బాగా పెరిగిపోతాయి. ఈ సీజన్లో గాలిలో దుమ్ము, పుప్పొడి కణాలు, ఫంగస్ (బూజు) ఎక్కువగా వ్యాపించడం వల్ల ముక్కు, సైనస్లలో వాపు, ఇన్ ఫెక్షన్లు, అలర్జీలు వస్తుంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, ఆస్తమా లేదా అలర్జీ వంటి ఆరోగ్య చరిత్ర ఉన్నవాళ్లలోనూ, వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయన్నది వైద్యవర్గాల మాట. ఈ నేపథ్యంలో ఈ సీజన్లో కనిపించే సాధారణ అలర్జీలపై అవగాహన కోసం ఈ కథనం...ఈ సీజన్లో ఉండే కాస్తంత తేమ వాతావరణంలో గాలిలోని కాలుష్యం త్వరగా చెదిరిపోకుండా చాలాసేపు ఉండటం, పరాగరేణువుల (పోలెన్) వ్యాప్తి, దుమ్ము, ఫంగస్ స్పోరుల కారణంగా సీజనల్ అలర్జీలు పెరుగుతాయి. దాంతో ముఖ్యంగా వర్షాకాలం మొదలు కాగానే ముక్కు, చెవి, గొంతుకు సంబంధించిన (ఈఎన్ టీ) సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. సాధారణంగా అలర్జీలను కూడా మామూలు జలుబుగా భావించి నిర్లక్ష్యం చేస్తే సైనసైటిస్, చెవిలో ఇన్ ఫెక్షన్లు, దీర్ఘకాలిక ముక్కుదిబ్బడ వంటి సమస్యలకు దారితీయవచ్చన్నది నిపుణుల మాట. అందుకే ఈ సీజన్లో అప్రమత్తంగా ఉండాలి. ఏయే రకాల ఆరోగ్య సమస్యలు ఎలా వస్తాయంటే... మానవుల స్కల్ భాగంలో ముక్కు చుట్టూ గాలి నిండిన చిన్న గదులుంటాయి. వీటిని సైనస్‌లు అంటారు. వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు లేదా అలర్జీల కారణంగా వీటిలో వాపు ఏర్పడి శ్లేష్మం (మ్యూకస్) బయటకు వెళ్లకుండా పేరుకుపోయి బాధించే సమస్యను సైనసైటిస్‌గా పిలుస్తారు. మరోవైపు దుమ్ము, పుప్పొడి, ఫంగస్, పెంపుడు జంతువుల వెంట్రుకలు (డాండర్) వంటి అలర్జీ కారకాల ప్రభావంతో ముక్కు లోపలి పొరల్లో వాపు రావడాన్ని అలర్జిక్ రైనైటిస్‌గా పేర్కొంటారు.లక్షణాలు సైనసైటిస్ ఉన్నవారిలో సాధారణం గా... ∙దగ్గు, ∙జ్వరం ∙అలసట ∙ముక్కు బిగుసుకుపోవడం, ∙పసుపు లేదా ఆకుపచ్చ రంగులో శ్లేష్మం / తెమడ (మ్యూకస్) వస్తుండటం, ∙నుదురు, చెంపలు, కళ్ల చుట్టూ నొప్పి లేదా ఒత్తిడి ఉన్నట్లు అనిపిస్తుండటం,∙తీవ్రమైన తలనొప్పి, ∙గొంతులోకి కఫం దిగుతుండటం, రుచి–వాసనలు గుర్తించే శక్తి తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలర్జీతో బాధపడుతున్నవారిలో సాధారణంగా...∙వరుసగా తుమ్ములు రావడం, ∙ముక్కు నుంచి నీరు కారడం, ∙ముక్కు, కళ్లలో దురద, ∙కళ్లు ఎర్రబడి నీరు కారడం, ∙గొంతులో దురద, ∙ముక్కు మూసుకుపోవడం వంటివి ప్రధాన లక్షణాలుగా ఉంటాయి. కొందరిలో∙శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ∙పిల్లికూతలు (వీజింగ్) కూడా కనిపించవచ్చు.మామూలు జలుబుకూ సైనసైటిస్‌కు తేడా... సాధారణ జలుబుతో పోలిస్తే సైనసైటిస్ లక్షణాలు పది రోజులకుపైగా కొనసాగడం, ముఖంలో ఒత్తిడి, తలనొప్పి ఎక్కువగా ఉండడం, దట్టమైన కఫం రావడం వంటి లక్షణాలు ప్రత్యేకంగా కనిపిస్తుంటాయి. సైనసైటిస్‌ను, అలర్జీలను నిర్లక్ష్యం చేస్తే చెవి ఇన్ఫెక్షన్లు, ఆస్తమా తీవ్రత పెరగడం, దీర్ఘకాలిక సైనసైటిస్ వంటి సమస్యలు వచ్చే ముప్పు ఉంటుంది. అందుకే పై లక్షణాలు కనిపిస్తున్నప్పుడు మామూలు జలుబుగా భావించి వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. నిర్ధారణ పరీక్షలు .. బాధితుల వైద్య చరిత్రను పరిశీలించాక డాక్టర్లు అవసరాన్ని బట్టి... ∙కొన్ని రకాల రక్త పరీక్షలు ∙నాసల్ ఎండోస్కోపీ ∙సీటీ స్కాన్ ∙అలర్జీ స్కిన్ ప్రిక్ టెస్ట్ వంటి వైద్యపరీక్షలను సూచిస్తారు. సమస్య తీవ్రతను బట్టి చికిత్స అందిస్తారు.నివారణ ఇలా... బయట నుంచి ఇంట్లోకి రాగానే ∙ముఖం, చేతులు కడుక్కోవడం, ∙అవసరమైతే స్నానం చేయడం, ∙దుమ్ము ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో మాస్క్ ధరించడం, ∙ఇండ్లలో, పరిసరాల్లో దుమ్ము, బూజు పేరుకుపోకుండా చూడడం, ∙ఇంటినీ, పరిసరాలనూ పరిశుభ్రంగా ఉంచడం, ∙బెడ్షీట్లు, ∙దిండ్ల కవర్లును తరచూ ఉతకడం, ∙తగినంత నీరు తాగడం, ∙వర్షంలో తడిస్తే వెంటనే పొడి దుస్తులు ధరించడం, ∙పొగతాగడం వంటి దురలవాట్లకు దూరంగా ఉండటం ∙వైద్యుల సూచన లేకుండా మందులు వాడకపోవడం వంటి సాధారణ అలవాట్లు సీజనల్ అలర్జీలనూ, సైనసైటిస్ వంటి సమస్యలను నివారిస్తాయి. చికిత్స ఇలా... చికిత్సలో అలర్జీని కలిగించే కారకాలకు వీలైనంత దూరంగా ఉండటం మొట్టమొదటి జాగ్రత్తగా / చికిత్సగా పరిగణించవచ్చు. డాక్టర్లు అవసరాన్ని బట్టి యాంటీహిస్టమిన్ మందులు, స్టెరాయిడ్ నాసల్ స్ప్రేలు, సెలైన్ నాసల్ వాష్‌లు, డీకంజెస్టెంట్ల వంటి మందులను సూచిస్తారు. తరచూ తీవ్రమైన అలర్జీలతో బాధపడుతుండేవారికి ఏయే అంశాల కారణంగా వారికి ఆ అలర్జీ ఏర్పడుతుందో తెలుసుకునే పరీక్షల తర్వాత ఇమ్యునోథెరపీ (అలర్జీ షాట్స్) కూడా వాడుతుంటారు. అయితే గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే... యాంటీబయాటిక్స్‌నూ, స్టెరాయిడ్ మందులను ఎవరికి వారు ఆన్ కౌంటర్ మెడిసిన్‌గా వాడటం సరికాదు. చివరగా... బాధితుల్లో అధిక జ్వరం (హై ఫీవర్), ∙ముక్కు బిగుసుకుపోవడం, ∙ముఖంలో తీవ్రమైన నొప్పి, ∙కళ్ల చుట్టూ వాపు... ఈ లక్షణాలు పది రోజులకుపైగా కొనసాగితే దాన్ని మామూలు జలుబుగా భావించి నిర్లక్ష్యం వహించకుండా, ఆలస్యం చేయకుండా డాక్టర్లు / ఈఎన్ టీ నిపుణులను తప్పక సంప్రదించాలి. డాక్టర్ మహమ్మద్ నసీరుద్దీన్సీనియర్ కన్సల్టెంట్ ఈ ఎన్ టీ – హెడ్ – నెక్ సర్జన్ -
ప్రాణాయామంతో... ఆస్తమాకు చెక్
1 అనులోమ–విలోమ (నాడీ శోధన్రపాణాయామం)చేసే విధానం...పద్మాసనం లేదా సుఖాసనంలో నిటారుగా కూర్చోండి. ∙ఎడమ చేతిని మోకాలిపై ఉంచండి. కుడి చేతి బొటనవేలితో కుడి ముక్కు రంధ్రం మూసి, ఎడమ ముక్కు ద్వారా నెమ్మదిగా శ్వాస పీల్చండి. ఇప్పుడు ఉంగరం వేలితో ఎడమ రంధ్రం మూసి, కుడి రంధ్రం ద్వారా శ్వాసను నెమ్మదిగా వదలాలి. అదే కుడి రంధ్రం ద్వారా శ్వాస పీల్చి, ఎడమ రంధ్రం ద్వారా వదలాలి. ఇలా 5–10 నిమిషాలు చేయాలి.ప్రయోజనాలు...ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడటానికి తోడ్పడుతుంది. ∙ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. ∙శ్వాసపై నియంత్రణ పెరుగుతుంది.2. భ్రమరిప్రాణాయామం... చేసే విధానం...సుఖంగా కూర్చోండి. కళ్లు మూసుకుని లోతుగా శ్వాస పీల్చండి. ∙శ్వాసను నెమ్మదిగా వదులుతూ ‘మ్...మ్... అనే తుమ్మెద శబ్దంలా చేయాలి. ∙5–10 సార్లు చేయాలి.ప్రయోజనాలు... ∙మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ∙ఒత్తిడి తగ్గి శ్వాస సులభంగా అనిపిస్తుంది.నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది.3. దీర్ఘ శ్వాస... చేసే విధానం..ముక్కు ద్వారా నెమ్మదిగా లోతుగా శ్వాస పీల్చండి. ∙΄÷ట్ట స్వల్పంగా బయటకు రావాలి. ∙నెమ్మదిగా శ్వాసను పూర్తిగా వదలండి. ∙5–10 నిమిషాలు చేయండి.ప్రయోజనాలు...ఊపిరితిత్తులకు గాలి బాగా చేరడంలో సహాయపడుతుంది. ∙శ్వాసకోశ కండరాలకు విశ్రాంతి లభిస్తుంది.జాగ్రత్తలు...ఆస్తమా అటాక్ వచ్చినప్పుడుప్రాణాయామం చేయవద్దు. శ్వాసను బలవంతంగా ఆపడం (కుంభకం) చేయకండి. కపాలభాతి, భస్త్రిక వంటి వేగంగా చేసేప్రాణాయామాలను వైద్యుడు లేదా అనుభవజ్ఞుడైన యోగా గురువు ఆధ్వర్యంలోనే చేయాలి. ఖాళీ కడుపుతో లేదా భోజనం చేసిన 3 గంటల తర్వాత చేయడం మంచిది. తల తిరగడం, ఛాతీ బిగుసుకు΄ోవడం, శ్వాస ఇబ్బంది పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆపి వైద్యుడిని సంప్రదించండి.అనిత పాతర్ల, యోగా ట్రైనర్ -
12 గంటల ప్రసవ వేదన..చివరకు స్వీయంగా సీ సెక్షన్! ఐతే..
ప్రసవ వేదన అంటేనే భరించలేని నరకం అంటారు. ఇంకో జన్మఎత్తడం లాంటిది అని అంటుంటారు పెద్దలు. అలాంటిది అంతటి ఉద్విగ్న స్థితిలో ఓ తల్లి తన బిడ్డ ప్రాణాలను రక్షించడం కోసం తనకు తానుగా సిజేరియన్ చేసుకుని ప్రసవించింది. వైద్యలు సైతం విస్తుపోయారు. ఒకవేళ అలా చేసినా తల్లీబిడ్డ బతకడం అసాధ్యమని అన్నారు.ఈ మిరాకిల్ ఘటన మెక్సికోలో చోటు చేసుకుంది. మెక్సికోలోని ఓక్సాకాలో ఒక మారుమూల పర్వత గ్రామంలో ఇనెస్ రామిరేజ్ పెరెజ్ అనే మహిళ ఈ సాహసానికి ఒడిగట్టింది. అందుకు కారణం ఆమె ఉన్న పరిస్థితులనే చెప్పాలి. నిజానికి ఆమె నిండు గర్భిణీ. ప్రసవించే సమయం దగ్గరపడుతున్న తరుణం. కానీ ఇంట్లో కనీసం కరెంట్ లేదు, ఫోన్ లేదు, నీటి సరఫరా కూడా లేదు. సమీపంలోని ఆస్పత్రికి వెళ్లడానికి కనీసం రోడ్డు సదుపాయం లేని ఓ మారమూల పర్వత గ్రామంలో ఉంటుందామె. ఆ టైంలో ఇంట్లో ఆమె భర్త కూడా లేడు. సరిగ్గా ఆ సమయంలోనే ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యాయి. అలా ఆమె మొత్తం 12 గంటలు నొప్పులతో నరకం చూసింది. ఇక చూస్తుండగానే తనకు, తన బిడ్డకు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని గ్రహించి తనకు తానుగా సీజేరియన్ చేసుకునేందుకు సిద్దమైంది. ఎందుకంటే అంతకుమునుపు కూడా ఇలానే ప్రసవవేదన పడి పురిటిలోనే బిడ్డను కోల్పోయింది. ఆ వేదన ఆమెకు తెలుసు ఆ నేపథ్యంలోనే ఇలాంటి సాహసానికి పూనుకుందామె. అందుకోసం ముందుగా తనకు ఎలాంటి నొప్పి తెలియకుండా ఉండేలా కాస్త మద్యం సేవించింది. ఆ తర్వాత తన గర్భాశయం వద్ద ఇంట్లో ఉండే కత్తితో కోసి బిడ్డను బయటకు తీసింది. బొడ్డు తాడుని కత్తెరతో కట్‌చేసి స్పృహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత కొద్దిసేపటికే మెలుకువ వచ్చాక..తనకు అందుబాటులో ఉన్న వాటితో గాయానికి చక్కగా కట్టు కట్టుకుంది. ఆ తర్వాత తన కొడుకుని పిలిచి గ్రామంలోని డాక్టర్‌కి విషయం చెప్పమని పంపింది. ఆ తర్వాత ఆ గ్రామ వైద్యుడు వచ్చి ఆమెను హుటాహుటినా క్లినిక్‌కి తీసుకువెళ్లి..కట్లు వేశాడు. అలాగే తల్లీబిడ్డలకు ఎలాంటి ఇన్ఫెక్షన్ కలగకుండా తగిన చికిత్స కూడా అందించాడు. అయితే ఇక్కడ వైద్యులు ఆమెకు ఇదంతా ఎలా సాధ్యమైందని విస్తుపోయారు. అసలు స్వీయంగా సీజేరియన్ అంటే మాటలు కాదు..ఒకవేళ అలా చేసినా, బతికే అవకాశాలు చాలా తక్కువని అన్నారు. ఇది వైద్య చరిత్రలోనే అత్యంత అరుదైన కేసుగా అభివర్ణించారు. ఎందుకంటే తగిన పనిముట్లు, అనుభవం గానీ లేని మహిళ తనకు అందుబాటులో ఉన్నవాటితో ప్రసవం చేసుకోవడం, బతికి బట్టగట్టగలగడం అంటే ఇదోక మిరాకిల్ అని అన్నారు వైద్యులు. ఈ అద్భుతమైన ఘటన మార్చి 05, 2000లలో చోటు చేసుకుంది. అలాగే ఇలాంటి దాన్ని ఎవ్వరు ప్రయత్నించే సాహసం చేయొద్దని హెచ్చరించారు వైద్యులు . ఇక్కడ ఆ మహిళకు మరో గత్యంతర లేక, బిడ్డను కాపాడుకోవడానికి మాతృమూర్తి చేసిన సాహస కృత్యంగా పరిగణించాలని అన్నారు గైనకాలజిస్ట్లు. అయినా ఇంకా కరెంట్ రోడ్డు సదుపాయం లేని ప్రాంతాలు ఉన్నాయా అనే అంశాన్ని లేవనెత్తడమే గాక, అలాంటి చోట్ల ఉండే గర్భిణుల సంరక్షణ ప్రాముఖ్యతను హైలెట్ చేసింది. అలాగే వ్యవస్థలోనే లోపాలను ఎత్తి చూపిన ఘటనగా అభివర్ణిస్తున్నారు విశ్లేషకులు.(చదవండి: బీఎండబ్ల్యూ బైక్‌పై వచ్చిన రైడర్ని చూసి విస్తుపోయిన వ్యాపారవేత్త..!) -
92 కేజీల నుంచి 60 కేజీలకు..!ఆ ఆహారాలకు 'నో' చెప్పాల్సిందే..
బరువు తగ్గడం అనేది రోజువారీ తీసుకునే ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ స్లిమ్ అవుతారు చాలామంది. అంతేగాదు కేవలం తీసుకునే ఆహారాన్ని చాలా తెలివిగా, ఆరోగ్యకరమైన పౌష్టికాహారం తీసుకుంటే..బరువు తగ్గడం అసాధ్యమైంది కాదు అని నిరూపించారు పలువురు. చక్కెర, ఉప్పు, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తగ్గించడం వల్ల బరువుని అదుపులో ఉంచుకోవడం తోపాటు ఉబ్బరాన్ని కూడా తగ్గించుకోవచ్చు అని అంటోంది కంటెంట్ క్రియేటర్ దీప్తి. ఈ మార్పుల తోపాటు క్రమం తప్పని వ్యాయామం, మంచి నిద్ర, కేలరీల లోటుని పాటిస్తే..అద్భతమైన ఫలితాలు సాధించొచ్చని అంటోంది. అదెలాగో సవివరంగా తెలుసుకుందామా..!.కంటెంట్ క్రియేటర్ దీప్తి ఒకప్పుడు 92 కేజీల దాక అధిక బరువుతో ఉండేది. అలాంటి ఆమె అద్భతంగా సుమారు 32 కేజీల బరువు తగ్గారు. తాను ఆ ఐదు ఆహారాలకు దూరంగా ఉండటంతోనే ఇంతలా స్లిమ్‌గా మారినట్లు ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో వెల్లడించింది. కేలరీలు లోటు ఉండాలనేది గుర్తించుకుంటే బరవు తగ్గడం ఏమంత కష్టం కాదని చెబుతోంది. చక్కెర పానీయాలుదీప్తి మొదటగా మానేసింది చక్కెర పానీయాలనే. ఇవి కొవ్వు పేరుకుపోవడానికి, నీరు నిలిచిపోవడానికి దారితీసి, ముఖం ఉబ్బినట్లుగా కనిపించేలా చేస్తాయి. వాటికి ప్రత్యామ్నాయంగా నిమ్మరసం, కొబ్బరి నీరు, గ్రీన్ టీ వంటి తీసుకోవాలని సూచించింది.వైట్ బ్రెడ్తాను వైట్ బ్రెడ్‌కి దూరంగా ఉన్నట్లు తెలిపింది. ఎందుకంటే శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు ఇన్సులిన్ స్థాయిలను పెంచుతాయి. పైగా ఇది కొవ్వు సులభంగా పేరుకుపోవడానికి కారణమవుతుందని అన్నారు. వాటికి బదులుగా మల్టీగ్రెయిన్ బ్రెడ్, హోల్ వీట్ బ్రెడ్, సోర్‌డౌ, ఓట్స్‌ను ఎంచుకుంది.ప్యాక్ చేసిన స్నాక్స్చిప్స్, ఇతర ప్యాక్ చేసిన స్నాక్స్‌ను కూడా ఆమె మానుకుంది. వాటిలో తరచుగా ఉప్పు ఎక్కువగా ఉంటుందని, ఇది కడుపు ఉబ్బరాన్ని పెంచి, అనవసరమైన ఆకలి కోరికలను ప్రేరేపిస్తుందని అన్నారు. బదులుగా వేయించిన శనగలు, నట్స్, మఖానా వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్‌గా తీసుకోవాలని అన్నారువేయించిన ఫాస్ట్ ఫుడ్వేయించిన బర్గర్లు, ఫ్రైస్, ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ కూడా మానుకున్న జాబితాలో ఉన్నాయి. ఈ ఆహారాలలో సాధారణంగా కొవ్వు, ఉప్పు ఎక్కువగా ఉంటాయని, ఇవి అదనపు కేలరీలను జోడించడంతో పాటు మిమ్మల్ని నీరసంగా ఉంచుతాయని అంటోంది. ఆమె బదులుగా ఇంట్లో తయారు చేసిన ర్యాప్‌లు, పనీర్ లేదా చికెన్ టిక్కా, సాధారణ ఇంట్లో వండిన భోజనాన్ని ఇష్టపడింది.అర్ధరాత్రి పూట చిరుతిండిచివరగా కంటెంట్ క్రియేటర్ అర్ధరాత్రి పూట అడ్డదిడ్డంగా చిరుతిండి తినడం వంటి అలవాట్లకు దూరంగా ఉన్నట్లు తెలిపింది. పడుకునే ముందు అనాలోచితంగా తినడం వల్ల, తెలియకుండానే రోజువారీ క్యాలరీల వినియోగం వేగంగా పెరిగిపోతుందని అన్నారు. అంతగా ఆకలిగా అనిపిస్తే హెర్బల్ టీ తాగి, నిద్రపోండని అన్నారు.అదనంగా, ప్రతిరోజూ 2-3 లీటర్ల నీరు తాగడం, కనీసం ఏడు గంటల పాటు నిద్రపోవడం, ప్రతిరోజూ నడవడం వంటి అలవాట్లను కూడా దీప్తి సూచించింది. ఆమె ప్రకారం, కేలరీల వినియోగాన్ని తగ్గించి తినడంతో పాటు ఈ చిన్న చిన్న అలవాట్లను పాటించడం వల్ల, కాలక్రమేణా ముఖం, శరీరంలో స్పష్టమైన మార్పు కనిపించడమే గాక చూక్కని ఆకృతిలో స్లిమ్‌గా కనిపిస్తారని చెబుతోంది.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Deepti | Mom • Fitness • Lifestyle (@deepti_harshana) (చదవండి: మాంసాన్ని తినే వ్యాధి'..! ఎందువల్ల వస్తుందంటే..) -
కేకేఆర్ చేతికి మెడికవర్ ఇండియా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత హెల్త్‌కేర్ విభాగంలో అవకాశాలను మరింతగా అందిపుచ్చుకునే దిశగా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం కేకేఆర్ తాజాగా భారీ డీల్‌కి తెరతీసింది. అంతర్జాతీయ వైద్యసేవల దిగ్గజం మెడికవర్ ఏబీకి చెందిన భారత విభాగం మెడికవర్ ఇండియాను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ డీల్ విలువ ఎంతనేది కేకేఆర్ నిర్దిష్టంగా వెల్లడించకపోయినప్పటికీ.. సంస్థ విలువను 1.2 బిలియన్ యూరోలుగా (దాదాపు రూ. 13,200 కోట్లు) లెక్కగట్టినట్లు న్యాయ సలహాలందిస్తున్న ట్రైలీగల్ వివరించింది. కేకేఆర్‌కి చెందిన ఫండ్స్‌కి 100 శాతం వాటాలను విక్రయించేందుకు తమతో పాటు మైనారిటీ వాటాదారులు ఒప్పందం కుదుర్చుకున్నట్లు మెడికవర్ తెలిపింది. దీనితో స్థూలంగా 740 మిలియన్ యూరోలు లభిస్తాయని, ఆ మొత్తంతో పోలాండ్ తదితర దేశాల్లో కార్యకలాపాలు విస్తరించనున్నట్లు పేర్కొంది. ఈ డీల్‌కి ఇదే సరైన సమయమని భావిస్తున్నట్లు కంపెనీ సీఈవో జాన్ స్టబింగ్టన్ చెప్పారు. మరోవైపు ప్రస్తుత మేనేజ్మెంటే మరో మూడేళ్ల పాటు కొనసాగుతుందని మెడికవర్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణ వెల్లడించారు. సంస్థలో 14 వేల మంది ఉద్యోగులు, 1,900 మంది పైగా డాక్టర్లు ఉన్నారని, వారు కూడా యథాప్రకారంగానే కొనసాగుతారని పేర్కొన్నారు. సంస్థను మరింతగా విస్తరించే ప్రణాళికలు ఉన్నట్లు వివరించారు. నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి ఈ ఏడాది ఆఖరు నాటికి ఇది పూర్తి కావొచ్చని భావిస్తున్నట్లు వివరించారు. ప్రస్తు తం ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలో మొత్తం నాలుగు రాష్ట్రాల్లో సుమారు 11–12 లక్షల మంది పేషంట్లకు చికిత్సలు అందిస్తున్నట్లు చెప్పారు. అటు, ‘మరింత నాణ్యమైన వైద్య సేవలందించడంలో మెడికవర్ ఇండియా డాక్టర్లు, ఉద్యోగులకు మద్దతుగా నిలుస్తూ, దేశవ్యాప్తంగా అధునాతన హెల్త్‌కేర్ సరీ్వసులను విస్తరించేందుకు ఈ పెట్టుబడులు దోహదపడతాయి‘ అని కేకేఆర్ పార్ట్నర్ అక్షయ్ తనా తెలిపారు. నాలుగు రాష్ట్రాల్లో 24 ఆస్పత్రుల నెట్వర్క్.. మ్యాక్స్‌క్యూర్ హాస్పిటల్ చెయిన్ ఆపరేటర్, హైదరాబాద్‌కి చెందిన సహృదయ హెల్త్‌కేర్‌లో నియంత్రణాధికారాలుండే వాటాలను కొనుగోలు చేయడం ద్వారా స్వీడన్‌కి చెందిన మెడికవర్ 2017లో భారత హెల్త్‌కేర్ మార్కెట్లోకి ప్రవేశించింది. మెడికవర్ ఇండియాలో మెడికవర్ హోల్డింగ్స్ బీవీకి 67 శాతం ఉండగా, మైనారిటీ షేర్‌హోల్డర్లయిన ప్రస్తుత సీఎండీ జి. అనిల్ కృష్ణ తదితరుల వద్ద సుమారు 33 శాతం వాటాలు ఉన్నాయి. సంస్థలో పి. హరికృష్ణ, ఎ. శరత్ రెడ్డి ఈడీలుగా, ఏఆర్ కృష్ణప్రసాద్ డైరెక్టరుగా ఉన్నారు. సుమారు 4,800 పడకలతో 24 ఆస్పత్రుల నెట్వర్క్ ఉంది. 80 పైచిలుకు స్పెషాలిటీల్లో సేవలు అందిస్తోంది. భారీ విస్తరణ బాటలో కేకేఆర్ కేకేఆర్ 2004 నుంచి అంతర్జాతీయంగా హెల్త్‌కేర్ విభాగంలో సుమారు 20 బిలియన్ డాలర్ల పైగా ఇన్వెస్ట్ చేసింది. గత కొన్నాళ్లుగా భారత్‌లోనూ విస్తరించింది. మ్యాక్స్ హెల్త్‌కేర్‌లో భారీ లాభాలకు నిష్క్రమించిన దాదాపు నాలుగేళ్ల తర్వాత 2025లో కేరళకు చెందిన బేబీ మెమోరియల్ హాస్పిటల్ (బీఎంహెచ్)లో దాదాపు రూ. 2,500 కోట్లకు సుమారు 70 శాతం వాటాలను కొనుగోలు చేయడం ద్వారా మళ్లీ హెల్త్‌కేర్ విభాగంలోకి ప్రవేశించింది. అప్పటి నుంచి దక్షిణాది మరింతగా కార్యకలాపాలు విస్తరించింది. మైత్రా హాస్పిటల్, చళికట్టు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను కొనుగోలు చేసింది. అలాగే హెల్త్‌కేర్ గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్‌లో నియంత్రణాధికారాలున్న వాటాలను దక్కించుకుంది. ఈ విభాగంలో ఫైనాన్సింగ్ కార్యకలాపాలు కూడా నిర్వహిస్తోంది. -
బాలింతలు ఎంత తినాలి? ఏం తినాలి?!
‘మేం మా పెద్దలు ఎలా చెబితే అలా విన్నాం’ అనే మాటలు బాలింత ఉన్న ఇంట్లో తరచూ వినపడుతుంటుంది. పథ్యం నియమాలు పాటించాలంటూ ‘ఈ రకం భోజనం వద్దు’ అనేవారుంటారు. ‘పోషకాలు ఉండే భోజనం తింటేనే బిడ్డకు సరిపడా పాలు లభిస్తాయి’ అని కొందరంటారు. ఏది తింటే బిడ్డకు మంచిదో అర్థం కాక, ఆందోళనకు లోనయ్యే బాలింతలూ ఉంటారు. ఈ తరహా సమస్యలకు పరిష్కారం.. పోషకాహార నిపుణులిచ్చే సూచనలు...ఆరోగ్యకరమైన తల్లులు ఉంటేనే ముందు తరాలు ఆరోగ్యంగా వర్ధిల్లుతాయి. భారతీయ మహిళకు రోజుకు దాదాపు 1,800 నుండి 2,200 కేలరీలు అవసరం. పాలిచ్చే తల్లులుకు వీటికన్నా రోజుకు 450 నుండి 500 అదనపు కేలరీలు అవసరం. శరీర పరిమాణం, శారీరక శ్రమ, ఎన్నిసార్లు పాలిస్తున్నారు .. అనేదానిని బట్టి ఆహారం తీసుకునే వ్యక్తిగత అవసరాలు మారుతూ ఉంటాయి. అయితే, ఇది కేలరీలను తగ్గించుకునే సమయం కాదు. పాల ఉత్పత్తికి, ప్రసవానంతరం తల్లి కోలుకోవడానికి కూడా తగినంత ఆహారం అవసరం.ఉదయం వేళలో... → ఉదయం నిద్రలేచిన గంటలోపు వేడి వేడి రాగిజావ లేదా సాంబార్, కొబ్బరి చట్నీతో రెండు ఇడ్లీలు తీసుకోవాలి. అరగంట తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగితే జీర్ణక్రియకు మేలు చేస్తుంది → అల్పాహారంగా నానబెట్టిన ఐదారు బాదం పప్పులు, రెండు ఖర్జూరాలు, ఒక అంజీర్, చిటికెడు జీలకర్ర వేసిన ఒక చిన్న కప్పు మజ్జిగ తీసుకోవాలి.మధ్యాహ్నం... → అన్నం లేదా రెండు రోటీలు, పప్పు, ఆకుకూరలతో కూర, కప్పు పెరుగు, కొద్దిగా నెయ్యి. మాంసాహారులైతే చేపలు లేదా చికెన్ తీసుకోవచ్చు. వీటి నుంచి ప్రోటీన్ అందుతుంది → మధ్యాహ్నపు చిరుతిండికి అరటిపండు, గుప్పెడు వాల్నట్లు లేదా పెరుగుతో మెంతి పరాఠా లేదా ఒక కప్పు రాగి మాల్ట్ తీసుకోవాలి.రాత్రి సమయంలో... → కూరగాయలతో చేసిన కిచిడీ లేదా పనీర్ కూర లేదా ఏదైనా ఆకుకూరతో రోటీ తినవచ్చు. → పడుకునే ముందు చిన్న కప్పు గోరువెచ్చని పాలు. దీనిలో చిటికెడు నల్ల మిరియాల పొడి కలిపి తాగడం వల్ల శరీర వాపు తగ్గుతుంది. కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. క్రమం తప్పని ఈ తరహా భోజనం, పోషకాలు గల చిరుతిళ్లతో రోజంతా మీ రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా, శక్తిని మరింత నిలకడగా ఉంచి పాల సమృద్ధికి తోడ్పడుతుంది.మరికొన్ని జాగ్రత్తలు... → తల్లిపాలలో అధికభాగం నీరే ఉంటుంది. అందుకని శరీరంలో నీటి శాతం తగ్గకూడదు → రోజుకు 8 నుండి 10 గ్లాసుల నీళ్లు తాగలి. వేడిగా ఉన్నప్పుడు లేదా రాత్రిపూట చెమట పడుతుంటే ఇంకా ఎక్కువ నీళ్లు తాగాలి. బిడ్డకు పాలు పట్టడానికి కూర్చున్న ప్రతీసారి చిన్న కప్పు నీళ్లు తాగడం మంచిది → రసం, సాంబార్, పప్పు సూప్, రాగిజావ, తాజా కొబ్బరి నీళ్లు, హెర్బల్ టీలు పాలిచ్చే తల్లులకు మేలు చేస్తాయి. ఇవి శరీరానికి తేమను అందించడంతో పాటు, జీర్ణక్రియకు సహాయపడే ఐరన్, తగు మసాలాలను కూడా అందిస్తాయి. → యూరిన్ లేత పసుపు రంగులో ఉండేలా చూసుకోవాలి. ముదురు పసుపు రంగులో ఉంటే నీళ్లు మరిన్ని అవసరమని చెప్పే సంకేతం అని గ్రహించాలి.తగ్గించాల్సినవి...→ కాఫీ, టీలు తాగడం మానుకోవాలి. వీటిని సేవించే తల్లుల పాలు తాగిన పిల్లలు నిద్రపోవడంలో సమస్యలు ఎదుర్కొంటారు. → పథ్యం భోజనం అని కొంతమంది తల్లులకు నెలల పాటు కారం భోజనం మాత్రమే పెడుతుంటారు. దీని వల్ల తల్లులకే కాదు, బిడ్డకూ తరచూ కడుపు ఉబ్బరం, అసౌకర్యంగా ఉంటుంది → అధికంగాప్రాసెస్ చేసిన, ప్యాక్ చేసిన స్నాక్స్ తీసుకోవద్దు. వీటిలో సోడియం, మైదా ఎక్కువ ఉంటాయి. వీటి ద్వారా శరీరానికి ఎలాంటి పోషకాలు లభించవు. పాలు తక్కువగా వస్తుంటే.. అనేక కారణాలు ఉండవచ్చు, వాటిలో ఆహారం ఒకటి మాత్రమే. బిడ్డ అడిగినప్పుడల్లా, సరిగ్గా పాలు పట్టేలా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. పాలు సరిగా అందడం లేదని ఆందోళనగా ఉంటే, లాక్టేషన్ కన్సల్టెంట్‌తో మాట్లాడవచ్చు. తల్లిపాలకు ప్రోత్సాహం తప్పనిసరి...గర్భంతో ఉన్నప్పుడు, ప్రసవానంతరం పాలిచ్చే తల్లులు పోషకాహారం పట్ల తప్పక జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబాలు తల్లికి మంచి పోషకాహారాన్ని ఇస్తే, వారి పిల్లలు కూడా ఆరోగ్యంగా ఎదుగుతారు. ప్రసవం అయిన వారం రోజుల నుంచి పాలు, గుడ్లు, చేపలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు.. ఇలా ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలి. ఐరన్, ప్రోటీన్, విటమిన్ సి ఫుడ్తీసుకుంటే బిడ్డకు పాలు సమృద్ధిగా లభిస్తాయి. పని ప్రదేశాలలో ఉన్నా బిడ్డ పాలు తాగేలా తల్లులు అందుబాటులో ఉండాలి. మొదటి ఆరు నెలల పాటు పూర్తిగా, నిరంతరాయంగా తల్లిపాలు ఇస్తూ ఉండాలి. బిడ్డకు ఐదవ నెల చివరి వారం నుంచి ఉగ్గు లాంటి ఘనాహారం కూడా కొద్ది కొద్దిగా ఇవ్వవచ్చు. బిడ్డకు రెండేళ్లు వచ్చేవరకు తల్లిపాలు ఇవ్వచ్చు. పాలు ఇచ్చే తల్లులు రసాయనాలు, రంగులు కలిపినవీ ప్యాకేజ్ చేసిన జంక్‌ఫుడ్ తినకూడదు.డా. సుజాతా స్టీఫెన్న్యూట్రిషినిస్ట్ -
'మాంసాన్ని తినే వ్యాధి'..! ఎందువల్ల వస్తుందంటే..
'మాంసాన్ని తినే వ్యాధి' అనే పేరు వినగానే ఎవరికైనా భయం, ఆందోళన కలగడం సహజం. ఈ వ్యాధి శాస్త్రీయ నామం 'నెక్రోటైజింగ్ ఫాసిటిస్' అని చెబుతున్నారు వైద్యులు. దీనికి చికిత్స సైతం అందుబాటులో ఉందట. వినడానికే భయం కలిగిస్తున్న ఈ వ్యాధి ఏంటో, ఎందువల్ల వస్తుంది వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!.నెక్రోటైజింగ్ ఫాసిటిస్‌గా వ్యవహరించి మాంసాన్ని తినే వ్యాధి చర్మం క్రింద ఉండే మృదు కణజాలాన్ని ప్రభావితం చేసే ఒక అరుదైన ఇన్ఫెక్షన్గా పేర్కొంటారు. ఇది శరీరంలో ఎక్కడైనా రావొచ్చు. అత్యంత అరుదైన సందర్భాలలో కళ్ల చుట్టూ కూడా రావొచ్చు. చిన్న కోత, శస్త్రచికిత్స గాయం లేదా కీటకం కాటు వంటి వాటి ద్వారా చర్మంలో ఏర్పడిన గాయం గుండా కొన్ని రకాల బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించడం వల్ల ఈ వ్యాధి వస్తుందని చెబుతున్నారు వైద్యులు. ఈ వ్యాధి బారిన పడే వారిలో చాలామందికి బలహీనమైన రోగనిరోధక శక్తి వంటి ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటాయని చెబుతున్నారు.లక్షణాలు..చికిత్స..ఈ వ్యాధి లక్షణాలు చాలా వేగంగా తీవ్రతరమవుతాయి. సులభంగా గుర్తించగలిగే మార్పులు ఇవి:వాపు, ఎర్రబడటంఒక నిర్దిష్ట ప్రాంతంలో నొప్పి లేదా సున్నితత్వం (స్పర్శకు నొప్పిగా అనిపించడం)అయితే, బయటకు కనిపించే దానికంటే ఆ అసౌకర్యం లేదా నొప్పి చాలా తీవ్రంగా ఉండవచ్చని వైద్యులు తెలిపారు. దీనికి యాంటీబయాటిక్స్ ద్వారా చికిత్స చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్ సోకిన కణజాలాన్ని తొలగించే ప్రక్రియ అవసరం కావచ్చు అని చెబుతున్నారు వైద్యులు.నివారించడం ఎలా అంటే..నెక్రోటైజింగ్ ఫాసిటిస్ను పూర్తిగా నివారించడం ఎప్పుడూ సాధ్యం కాకపోవచ్చు. అయితే, దీని ముప్పును తగ్గించడానికి ఇలా చేయండని చెబుతున్నారు వైద్యులు. అవేంటంటే..గాయాలను సబ్బు నీటితో శుభ్రం చేయండి. అవి నయమయ్యే వరకు శుభ్రమైన కట్టుతో (bandage) కప్పి ఉంచండి.ఏదైనా లోతైన కోత లేదా గుచ్చుకున్న గాయం అయినట్లయితే వైద్యుడిని సంప్రదించండి.చర్మంపై గాయం లేదా కోత ఉన్నప్పుడు స్విమ్మింగ్ పూల్స్, హాట్ టబ్స్ లేదా బయట ఉండే నీటి వనరులలోకి వెళ్లకండి. View this post on Instagram A post shared by Kunal Sood, MD (@doctorsoood) (చదవండి: షాంపూ బదులు.. ప్రకృతి సిద్ధమైన ప్రత్యామ్నాయం ఇదే! వైద్యులు సైతం..) -
తల్లిపాల నిర్వహణలో... స్మార్ట్ పరికరాలు
బిడ్డ పుట్టడానికి ముందే తల్లిపాలు పట్టే పరికరాలను సిద్ధం చేసుకోవడం వల్ల ప్రసవానంతర ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చుకోవచ్చు అనేది నిపుణుల సూచన. ఫలితంగా తల్లి ప్రసవానంతరం కలిగే వివిధ రకాల ఒత్తిడులను తగ్గించుకునే వీలుంది.తల్లిపాల పరికరాలు రోజువారీ సవాళ్లలో కొన్నింటిని సులభతరం చేసినా, సరైన సహకారం అందినప్పుడే వాటిని బాగా వినియోగించుకోగలరు. చనుబాలు పట్టించే నిపుణుల గైడెన్స్‌తో పాటు బాధ్యతలను పంచుకునే భాగస్వామి మద్దతు అవసరం. ‘బిడ్డలకు పాలిచ్చే పనులను సులువు చేయడానికి తల్లులు బ్రెస్ట్ పంపులు (51 శాతం), నర్సింగ్ బ్రాలు (37 శాతం), నర్సింగ్ దిండ్లు (31శాతం) వంటి సాధనాలను ఉపయోగిస్తున్నారని నివేదికలు చూపుతున్నాయి. నవతరం అమ్మలకు వచ్చిన అనుకూల ఉత్పత్తుల గురించి...ఫీడింగ్ మానిటర్స్: శిశువు పాలు మింగే శబ్దాలను గుర్తించడానికి, ఎన్ని పాలు తాగిందో లెక్కించడానికి, ఏఐ–ఆధారిత సెన్సార్లు కూడా వచ్చాయి.రియల్–టైమ్ బ్రెస్ట్ ఫీడింగ్ వేరబుల్: ఇది రొమ్ము చుట్టూ చుట్టుకునే ఒక మృదువైన, అనువైన పరికరం. ఇది బయోఇంపిడెన్ ్సను ఉపయోగించి, శిశువు ఎన్ని పాలు తాగిందో అనే దానిపై క్లినికల్–గ్రేడ్, లైవ్ డేటాను మొబైల్ స్క్రీన్ లపై అందిస్తుంది. లాక్టేషన్ ప్యాడ్ డ్రగ్ ట్రాకర్లు: ఇవి మైక్రోఫ్లూయిడిక్ ఛానెల్స్, లేజర్–ప్రేరిత గ్రాఫేన్ సెన్సార్లతో పొందుపరిచిన మోడర్న్ వేరబుల్ ప్యాడ్స్. తల్లి తీసుకునే మందులు (ఎసిటమినోఫెన్ వంటివి) నేరుగా తల్లిపాలలోకి చేరే రేటును ట్రాక్ చేసి, కొలుస్తాయి.ఇన్ఫాంట్ స్మార్ట్ బాటిల్స్: ఆహారపు అలవాట్లను మెరుగుపరచడానికి, సింక్రొనైజ్డ్ యాప్‌ల ద్వారా శిశువు బరువు పెరుగుదలను ట్రాక్ చేయడానికి బయోఫీడ్‌బ్యాక్ డేటాను అందిస్తాయి.ఇతర అనుకూలమైన పరికరాలు...ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్స్: వీటిని నర్సింగ్ బ్రా లోపల సెట్ చేసుకోవచ్చు. పాలు ఎక్కువైనప్పుడు ఈ పరికరం ద్వారా పాలు తీసి, స్టోరేజ్ చేయవచ్చు.నర్సింగ్ కవర్స్: తల్లిపాలు పట్టే సమయంలో మెడ భాగం నుంచి నడుము కిందవరకు ఆ్రపాన్ తరహాలో ఉండే కాటన్ కవర్ పూర్తిగా కప్పి ఉంచుతుంది. బిడ్డ పాలు తాగుతుండగా తల్లి నేరుగా చూసే అవకాశమూ ఉంటుంది. బయట పాలు పట్టడం అనే ఇబ్బందిని ఈ కవర్ దూరం చేస్తుంది.బ్రెస్ట్ ఫీడింగ్ పిల్లోస్: పాలిచ్చే సమయంలో బిడ్డను పిల్లోపైన పడుకోబెట్టడానికి., కదలకుండా ఉండటానికి.. వీటిని ఉపయోగిస్తుంటారు. పాలు తాగే సమయంలో తల్లికి–బిడ్డకు ఈ పిల్లో అనువుగా ఉంటుంది.నర్సింగ్ ప్యాడ్స్: లీక్ ప్రూఫ్స్, స్కిన్ ఫ్రెండ్లీవి లభిస్తున్నాయి. వాపు, నొప్పి ఉన్న రొమ్ము చర్మానికి తక్షణ ఉపశమనాన్ని ఇచ్చే చల్లని జెల్ ప్యాడ్స్ అందుబాటులో ఉన్నాయి.బ్రెస్ట్ మిల్క్ కంటెయినర్స్, స్టోరేజీ కప్స్: రొమ్ము నుంచి తీసిన పాలను కంటెయినర్లలో భద్రపరచేవి. సెన్సార్ స్టోరేజీ బ్యాగ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి బిడ్డకు తగినంత ఉష్ణోగ్రతలలో పాలు ఉండేలా నిల్వ చేస్తాయి. ఓవెన్ లేదా స్టవ్ ఉపయోగించకుండా ఫ్రీజర్‌లో భద్రపరిచిన పాలను కరిగించే స్మార్ట్ బాటిల్ వార్మర్స్ అందుబాటులో ఉన్నాయి.సిలికాన్ నిపుల్ ప్రొటెక్టర్: మొదటిసారి బిడ్డకు పాలు పట్టే సమయంలో, ఆ తర్వాత చనుమొనలు చిట్లడం, నొప్పి సమస్యలు ఉంటాయి. ఇలాంటప్పుడు సిలికాన్ నిపుల్ ప్రొటెక్టర్స్ బాగా ఉపయోగపడతాయి.బ్రెస్ట్ నిపుల్ క్రీమ్: ప్రసవం తర్వాత ΄÷డిబారిన, చిట్లిన, నొప్పిగా ఉన్న చనుమొనల సమస్యను నయం చేయడానికి ఉపయోగపడుతుంది. -
'మెకియా వెల్లియనిజం'.. ఈ జీవితం ఎంత నరకమంటే?
డాక్టర్ గారు... మా అమ్మనాన్నలు చనిపోతే అమ్మమ్మ దగ్గర పెరిగాను. పదహారేళ్లకే పెళ్లి చేశారు. నా భర్త కాంట్రాక్టరు. మాకు ఇద్దరు పిల్లలు. కుటుంబం బాగుకోసం అని చెప్పి, నన్ను పై అధికారుల దగ్గరకు పంపేవాడు. ఆ బాధను మర్చిపోవడానికి మద్యం అలవాటు చేశాడు. అలా ఏళ్లు గడిచిపోయాయి. ఈరోజు.. పిల్లలు పెద్దయ్యాక, వాళ్లముందే చెడ్డదానిగా నిలబెట్టాడు. కుటుంబం బాగు కోసమే అన్నీ సహించాను. ఇప్పుడు ఒంటరిదానిని అయ్యాను. చనిపోవాలని ఉన్నా నిస్సహాయతలో బతుకుతున్నాను. – ఓ అభాగ్యురాలుమీరు అనుభవించిన నరకం, ఎదుర్కొన్న మోసం, పడిన మానసిక సంఘర్షణ మాటల్లో వ్యక్తపరచలేనివి. ‘కుటుంబం, బతుకుతెరువు’ అనే భావోద్వేగాలను ఆసరాగా చేసుకుని మీ భర్త మిమ్మల్ని ఊబిలోకి నెట్టాడు. ఇది సైకాలజీలో ‘మెకియావెల్లియనిజం’ అని పిలిచే అత్యంత స్వార్థంతో కూడిన క్రూరమైన మనస్తత్వం.మీ డిప్రెషన్‌ను అణచివేయడానికి అతనే మిమ్మల్ని మద్యానికి కూడా అలవాటు చేశాడు. తన పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి తనలోని నేర భావనను మీపైకి నెట్టేశాడు. సైకాలజీలో దీనినే ప్రొజెక్షన్’ అంటారు. మీరు ధైర్యంగా బతికి చూపించడమే అతనికి సరైన సమాధానం. ప్రస్తుతం మీ భర్త పిల్లల దగ్గర నిజాలు దాచి మిమ్మల్ని చెడుగా చూపిస్తున్నా, కాలం మారినప్పుడు నిజం కచ్చితంగా బయట పడుతుంది.ఆవేశపడి ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోకండి. ముందుగా ఒక మానసిక నిపుణుడిని కలిసి కౌన్సెలింగ్ తీసుకోండి. అవసరమైతే మహిళా హెల్ప్ లైన్ లేదా చట్టపరమైన రక్షణ పొందండి. మనం చేసే పనుల వెనుక ఉన్న ‘ఉద్దేశమే’ మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది తప్ప, బలవంతంగా మన చేతచేయించిన పనులు కాదు. ‘నేను బ్రతికి చూపిస్తాను’ అనే ఆత్మ విశ్వాసంతో ధైర్యంగా ముందడుగు వేయండి.- డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
గుజరాత్లో ‘చండీపుర’ వైరస్ కలకలం..!
అహ్మదాబాద్: గుజరాత్లో అరుదైన 'చండీపుర వైరస్' ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరల్ వ్యాధి బారిన పడి ఇప్పటివరకు 22 మంది చిన్నారులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మరో ఏడుగురు పిల్లలు వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.రాష్ట్రంలో 184 మంది అనుమానితులకు పరీక్షలు నిర్వహించగా, వారిలో 35 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని వైద్యులు వెల్లడించారు. అయితే, వైరస్ బారిన పడిన వారంతా 15 ఏళ్లలోపు చిన్నారులేనని మంత్రి ప్రఫుల్ పన్సేరియా తెలిపారు. ఇప్పటివరకు ఆరుగురు పిల్లలు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు చెప్పారు.దీంతో గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో చండీపుర వైరస్ కేసులు నమోదవుతుండటంతో ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వ్యాధి వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రత్యేక పర్యవేక్షణ, పరీక్షలు, వైద్య చర్యలు చేపడుతున్నట్లుగా తెలుస్తోంది.అధికారుల ప్రకారం, 'చండీపుర ఎన్సెఫలైటిస్' అనేది అరుదైన వైరల్ వ్యాధి. ఇది ఇసుక ఈగల ద్వారా వ్యాపించి మెదడు వాపునకు దారితీస్తుంది. ఈ వ్యాధి ప్రధానంగా 15 ఏళ్లలోపు పిల్లలపై ప్రభావం చూపుతోందని, అయితే, ఈ వ్యాధికి ప్రస్తుతం నిర్దిష్టమైన టీకా లేదా యాంటీవైరల్ చికిత్స అందుబాటులో లేనట్లుగా వైద్యలు తెలిపారు. అలాగే, సకాలంలో చికిత్స అందకపోతే వాంతులు, మూర్ఛ వంటి తీవ్రమైన లక్షణాలు కనిపించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. -
‘ఏడు’ ఏడుపు కాదు.. అదృష్టం తెచ్చిపెట్టింది
కొంతమందికి కొన్ని సంఖ్యలపై ప్రత్యేకమైన నమ్మకం ఉంటుంది. అవి తమ జీవితంలో అదృష్టాన్ని తీసుకొస్తాయని భావిస్తుంటారు. ఏడు అనేది అపశకునం అని ప్రపంచవ్యాప్తంగా చాలామంది నమ్మకం. అయితే.. ఇక్కడో వ్యక్తి లక్కీ నంబర్ ‘7’. చిన్నప్పటి నుంచి తనకు అదృష్ట సంఖ్యగా భావిస్తూ వచ్చాడు. అదే అతన్ని..చివరకు కోటీశ్వరుడిని కూడా చేసింది.అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం బిస్కో పట్టణానికి చెందిన టోమస్ మునోజ్‌కు లాటరీలో ఏకంగా 10 లక్షల డాలర్లు (సుమారు రూ.9.5 కోట్లు) జాక్‌పాట్‌గా తగిలింది. నార్త్ కరోలినా ఎడ్యుకేషన్ లాటరీ కొత్తగా ప్రారంభించిన ట్రిపుల్ రెడ్ 777 జాక్‌పాట్ స్క్రాచ్-ఆఫ్ గేమ్‌లో ఆయన ఈ భారీ బహుమతిని గెలుచుకున్నారు. కాండర్లోని ఓ దుకాణంలో 10 డాలర్ల విలువైన ట్రిపుల్ రెడ్ 777 జాక్‌పాట్ టికెట్ కనిపించగానే దాన్ని కొనాలని మునోజ్ నిర్ణయించుకున్నారు. కారణం.. ఆ టికెట్‌పై ఉన్న మూడు ‘7’లే.“ఏడు నా అదృష్ట సంఖ్య. నేను 1977లో 7వ తేదీన పుట్టాను” అని మునోజ్ తెలిపారు. తన జీవితంలో 7 నంబర్‌కు ఎప్పటి నుంచో ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. టికెట్‌ను దుకాణంలోనే స్క్రాచ్ చేసిన మునోజ్.. భారీ బహుమతి గెలిచిన విషయం తెలుసుకుని భావోద్వేగానికి గురయ్యారు. “నా శరీరం మొత్తం రకరకాల భావోద్వేగాలతో నిండిపోయింది” అని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.లాటరీ సంస్థ నుంచి బహుమతి తీసుకునే సమయంలో మునోజ్‌కు రెండు అవకాశాలు ఇచ్చారు. 20 ఏళ్ల పాటు ఏడాదికి 50 వేల డాలర్ల చొప్పున తీసుకోవడం లేదా ఒకేసారి నగదు తీసుకోవడం. ఆయన రెండో ఎంపికను ఎంచుకున్నారు. ఒకేసారి 6 లక్షల డాలర్లు తీసుకున్నారు. పన్నులు మినహాయించిన తర్వాత ఆయనకు 3,96,060 డాలర్లు (సుమారు రూ.3.5 కోట్లకు పైగా) అందాయి.ఈ డబ్బును పెట్టుబడులు పెట్టడంతో పాటు, తనకు ఇష్టమైన పాతకాలపు కార్ల పునరుద్ధరణ (క్లాసిక్ కార్ రీస్టోరేషన్) పనులకు ఉపయోగించనున్నట్లు మునోజ్ తెలిపారు.ఇక ట్రిపుల్ రెడ్ 777 జాక్‌పాట్ గేమ్‌లో మొత్తం మూడు మిలియన్ డాలర్ల బహుమతులు ఉండగా.. అందులో మరో రెండు మిలియన్ డాలర్ల బహుమతులు ఇంకా గెలుచుకోవాల్సి ఉంది. అదృష్ట సంఖ్యలపై నమ్మకం ఉండటం ఒకవైపు అయితే.. అదే సంఖ్యతో జీవితాన్ని మార్చే అవకాశం రావడం మాత్రం మునోజ్ విషయంలో అరుదైన యాదృచ్ఛికంగా మారింది. ‘7’ అతడికి కేవలం సంఖ్య కాదు.. అదృష్టాన్ని తెచ్చిన గుర్తుగా నిలిచిపోయింది.(చదవండి: థాంక్యూ అమ్మ..! భావోద్వేగంలో మైక్రోసాఫ్ట్ ఏఐ డైరెక్టర్ ..) -
99 కేజీల నుంచి 59 కేజీలకు..! ఆ ఐదు ఫుడ్స్‌తోనే..
బరువు తగ్గడం అనేది తెలివిగా డైట్ లేదా వ్యాయామాలు చేస్తూ.. సునాయాసంగా తగ్గే ప్రక్రియని పలువురు నిరూపిస్తున్నారు. అందుకు ఫ్యాన్సీ డైట్లు, ఖరీదైన సప్లిమెంట్లు అవసరం లేదని ఇష్టమైన ఆహారాలకు దూరంగా ఉంటే చాలని అంటున్నారు. మంచి పలితాలు అనేవి ప్రతిరోజు పాటించగల సాధారణ అలవాట్లుగా మంచి ఆహారపు అలవాట్లను భాగం చేసుకోవడంపైనే ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. ఇక్కడ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ సాచీ కూడా అలానే అనుసరించి జస్ట్ మూడేళ్లలో అమాంతం 40 కేజీలు తగ్గింది. అంతేగాదు అంతలా బరువు తగ్గడానికి ఉపకరించిన ఆహారాలను కూడా ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ఇంతకీ అవేంటో చూద్దామా..!.నిజానికి సాచీ 99 కేజీల పైనే బరువు ఉండేది. జస్ట్ ఆ ఐదు భోజనాలతో ఏకంగా 40 కేజీలపైనే బరువు తగ్గింది. తనకు వెయిట్‌లాస్ జర్నీలో ఉపకరించిన ఆ ఐదు ఆహారాల వివరాలు..వాటిని నిలకడగా అనుసరిస్తే కలిగే లాభాలు గురించి షేర్ చేసుకున్నారామె.అవేంటంటే..పాలక్ పనీర్ బౌల్ఈ భోజనంలో 200 గ్రాముల పాలక్ పనీర్, 150 గ్రాముల వండిన అన్నం, 100 గ్రాముల గ్రీక్ యోగర్ట్, ఒక ఉడికించిన బీట్రూట్ ఉంటాయి. ఇది ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు ఫైబర్ల సమతుల్య కలయిక. పెరుగు అదనపు ప్రోటీన్‌ను అందిస్తుంది, బీట్రూట్ ఫైబర్,సహజమైన తీపిని ఇస్తుంది.గుడ్లతో రొయ్యల ఫ్రైడ్ రైస్సాచి 200 గ్రాముల రొయ్యల ఫ్రైడ్ రైస్‌ను, ఉల్లిపాయ,క్యాప్సికమ్‌తో వండిన ఒక పూర్తి గుడ్డు, రెండు గుడ్డు తెల్లసొనలు, తరిగిన దోసకాయతో కలిపి తీసుకుంది. ఈ భోజనంలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. పైగా ఇందులో కడుపు నిండినట్లు అనిపించడానికి ఇందులో కూరగాయలు కూడా ఉంటాయి.గుడ్లు, పుట్టగొడుగులు, క్రాకర్లుఈ ప్లేట్లో రెండు గుడ్లు, పుట్టగొడుగుల వేపుడు, 100 గ్రాముల గ్రీక్ పెరుగు, ఉడికించిన ఒక బీట్రూట్, మూడు వాసా క్రాకర్లు ఉంటాయి. ఇది ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండిన ఒక సాధారణ భోజనం. ఇది కూడా ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని అందిస్తుంది.ఎయిర్-ఫ్రైడ్ చికెన్ ప్లేట్ఆమె ప్లాన్‌లోని మరొక ఇష్టమైన వంటకంలో 100 గ్రాముల ఎయిర్-ఫ్రైడ్ మసాలా చికెన్, 150 గ్రాముల అన్నం, 100 గ్రాముల గ్రీక్ పెరుగు, సైడ్‌గా తాజా క్యారెట్, దోసకాయ సలాడ్ ఉంటాయి. ఇది లీన్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, తాజా కూరగాయల మిశ్రమం.గ్రీన్ చట్నీ చికెన్ మీల్ఈ చివరి ప్లేట్లో ఎయిర్-ఫ్రైడ్ చేసిన రెండు గ్రీన్ చట్నీ చికెన్ లెగ్స్, 150 గ్రాముల పాలక్ పనీర్, 120 గ్రాముల అన్నం, ఒక ఉడికించిన బీట్రూట్ ఉంటాయి. ఇది ప్రోటీన్‌ను ఆకుకూరలతో నియంత్రిత పరిమాణంలో అన్నంతో మిళితం చేస్తుంది.సాచీ డైట్ విధానాన్ని చూస్తే..ఆమె ఎక్కడా..అన్నం తినడం మానలేదు లేదా తనకు ఇష్టమైన ఆహారాలను పూర్తిగా వదిలేయలేదు. దానికి బదులుగా, ఆమె తగినంత ప్రోటీన్, కూరగాయలు, నియంత్రిత పరిమాణాలతో కూడిన సమతుల్య ఆహారంపై దృష్టి పెట్టింది. అలాగే ఆమెలో ఈ మార్పు రాత్రికి రాత్రే జరగలేదు. అందుకోసం ఆమెకి మూడేళ్లు పట్టింది. తక్షణ ఫలితాలనిచ్చే డైట్ల కంటే చిన్నగా, నిలకడైన అలవాట్లు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని సాచీ వెయిట్‌లాస్ జర్నీ నిరూపించింది. View this post on Instagram A post shared by Saachi | Fat Loss. Real Talk. Pilates. (@saachi.pai)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: Weight Loss: జస్ట్ మూడేళ్లలో 47 కేజీలు..! ఆ ఐదింటితోనే బరువు మాయం..)


