జుట్టు, చర్మం రంగును మార్చే గుణం హెన్నాకు (Henna dye) ఉంది. అయితే ఇది అందాన్ని పెంచడమే కాదు.. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని చెప్తున్నారు నిపుణులు. తాజాగా జరిగిన అధ్యయనం ప్రకారం సహజమైన హెన్నా లివర్ సమస్యలను దూరం చేస్తుందని గుర్తించారు. ఇంతకీ ఇది ఎంతవరకు నిజం. హెన్నా ప్రభావం కాలేయంపై ఎలా ఉంటుందో చూద్దాం.
ఒసాకా మెట్రోపాలిటన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల ప్రకారం.. హెన్నాలోని లాసోనియా ఇనర్మిస్ అనే రంగు.. లివర్ ఫైబ్రోసిస్‌కు చికిత్స చేయగలదని గుర్తించారు. అధిక మద్యపానం వల్ల, జీవనశైలి వల్ల వచ్చే దీర్ఘకాలిక కాలేయ సమస్యలను తగ్గించడంలో హెన్నా మంచి ఫలితాలు ఇస్తుందని అంటున్నారు శాస్త్రవేత్తలు.
అధ్యయన ఫలితాలు ఇవే..
ఒసాకా మెట్రోపాలిటన్ విశ్వవిద్యాలయం ఒక రసాయన స్క్రీనింగ్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. కాలేయ సమతుల్యతను కాపాడే యాక్టివేటెడ్ హెపాటిక్ స్టెలేట్ కణాలపై నేరుగా పనిచేసే పదార్థాలను గుర్తించడంలో ఇది సహాయపడుతుంది. ఈ వ్యవస్థను ఉపయోగించి.. లాసోన్‌ను హెపాటిక్ స్టెలేట్ కణాల యాక్టివేషన్‌ను ఇది నిరోధిస్తున్నట్లు గుర్తించారు. ఎలుకలపై చేసిన అధ్యయనంలో లివర్ ఫైబ్రోసిస్ తగ్గినట్లు తెలుసు కున్నారు.
చదవండి: Happy Birthday to Nita Ambani దాతగా, వ్యాపారవేత్తగా ఆమెకు ఆమే సాటి!
అధ్యయనంలో హెపాటిక్ స్టెలేట్ కణాల్లోని యాంటీ ఆక్సిడెంట్ ఫంక్షన్లతో సంబంధం ఉన్న అప్ రెగ్యులేటెడ్ సైటోగ్లోబిన్‌ను గుర్తించారు. అంటే ఈ కణాలు సాధారణ కణాలుగా మారుతున్నాయన్నమాట. హెన్నాలోని లాసోన్ ద్వారా ఔషధాలు తయారు చేస్తే.. లివర్ ఫైబ్రోసిస్‌ను నియంత్రించవచ్చని శాస్త్రవేత్తలు నమ్ము తున్నారు. హెపాటిక్ స్టెలేట్ కణాలను యాక్టివేట్ చేసి.. ఔషధాలను రవాణా చేయగల డ్రగ్ డెలివరీ సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దానిని లివర్ ఫైబ్రోసిస్ ఉన్న రోగులకు అందుబాటులో ఉంచేలా ప్లాన్ చేస్తున్నామని ఒసాకా మెట్రోపాలిటన్ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ మెడిసన్ డాక్టర్ అట్సుకో డైకోకు తెలిపారు.
చదవండి: Karthika masam 2025 దర్శించుకోవాల్సిన పవిత్ర శివాలయాలు


