
వృత్తి జీవితంలో ఆందోళన, ఒత్తిడి మానసిక ఆరోగ్యాన్ని (Mental Health) ప్రభావితం చేస్తుంది. ఇది మొత్తం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకే మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి గతంలో అనేకసార్లు చెప్పిన బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ ( Sara Ali Khan) మరోసారి మానసిక ఆరోగ్య సమస్యల గురించి, ఒత్తిడి, చికిత్స లాంటి విషయాలను గురించి మాట్లాడింది.
మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా సులభం. అని చెప్పిన సారా మానసికంగా ఒత్తిడిలో ఉన్నపుడు సాయం అడగడంలో తప్పు లేదనీ, అది బలహీనతగా భావించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అంతేకాదు ఆ సమయంలో మీరు చేయాల్సిందల్లా ఒక క్షణం ఊపిరి పీల్చుకుని, మీకు మీరే భారం తీరే దాకా ఏడ్చేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
ట్రోలింగ్, మానసిక ఆరోగ్యంపై దాని ప్రభావంపై గతంలో తన అభిప్రాయాన్ని వెల్లడించిన సారా అలీ ఖాన్ వృత్తి జీవితంలో ఒత్తిళ్లపై తాజాగా మరో ఇంటర్వ్యూలోతన అభిప్రాయాలను అనుభవాన్ని షేర్ చేసింది. మానసిక ఒత్తిడికి లేదా చికిత్స తీసుకోవడం అంటే బలహీనత కాదు, అది వికాసానికి, స్వీయ అవగాహనకు దోహదపడుతుందని చెప్పింది. బలం అంటే భావోద్వేగాలను అణిచివేయడం కాదు, వాటిని అంగీకరించే ధైర్యం కలిగి ఉండటం అని తాను నమ్ముతానని తెలిపింది. తన కరియర్‌లో ఒత్తిళ్లు తీవ్రంగా ఉంటాయి బలంగా ఉండటానికి ప్రతీదాన్ని మేనేజ్ చేసుకోవాలని తెలిపింది. అంతేకాదు మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతపై మాట్లాడుతూ మనస్సును జాగ్రత్తగా చూసుకోవడం ఎంత ముఖ్యమో శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అంతే ముఖ్యమని తనకు అర్థమైందని తెలిపింది.
కొన్నిసార్లు ఊపిరి పీల్చుకోవడానికి, మీ శరీరాన్ని కదిలించడానికి, అవసరమైతే ఏడవడానికి లేదా అపరాధ భావన లేకుండా విశ్రాంతి తీసుకోవడానికి సమయం కేటాయించడం అవసరమని సారా పేర్కొంది. నిజంగా ఆ క్షణాలు తన ఫీలింగ్ ఏంటో గ్రహించడంలో సాయపడ్డాయనీ, అనుకున్న దానికంటే బలంగా ఉన్నానని గుర్తు చేశాయని తెలిపింది. వేగాన్ని తగ్గించి, కాస్త నిదానించడం, సహాయం అడగడం అవసరం.. అన్నిసార్లు అన్నీ చేసేయ్యాలని ఏమీ లేదు.. మీరు మీరుగా ఉంటే సరిపోతుందని చెప్పుకొచ్చింది సారా.
అలాగే నేటి తరం మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ, దాని చుట్టూ ఇప్పటికీ కొన్ని అపోహలున్నాయనీ. మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడటం, చికిత్స తీసుకోవడం చాలా సాధారణంగా జరగాలని ఆమె అభిలషించారు.
మరోవైపు సారా ఒత్తిడికి గురైనప్పుడు తక్షణమే తన ఉత్సాహాన్ని పెంచే మార్గం వైపు మొగ్గు చూపుతుంది. తన మూడ్-లిఫ్టర్లలో డ్యాన్సింగ్ ఒకటని చెప్పింది. అలాగే యోగా పైలేట్స్ కు ప్రాధాన్యత ఇస్తుంది. మరో విధంగా చెప్పాలంటే ఆమెకు నృత్యం కేవలం ఫిట్‌నెస్ కాదు, అదొక చికిత్స.
2018లో కేదార్‌నాథ్‌తో తన కెరీర్‌ను ప్రారంభించిన సారాఅలీ ఖాన్, నట జీవితంలో తానేంటే నిరూపించు కుంటూ ముందుకు సాగుతోంది. బాలీవుడ్ నటులు సైఫ్ అలీ ఖాన్ , అమృతా సింగ్‌ల కుమార్తె సారా.