
ఆహారపు అలవాట్లతో నొప్పి పదింతలు...
ఇప్పుడు అత్యధికులను వేధిస్తున్న నొప్పుల్లో బ్యాక్ పెయిన్ ఒకటి. ఎక్కువ సేపు కూర్చుని చేసే పనుల వల్ల కావచ్చు వాహనాల డ్రైవింగ్ వల్ల కావచ్చు అనేక మంది బ్యాక్ పెయిన్‌తో బాధపడుతున్నారు. మాత్రలు, ఫిజియోథెరపీలతో కూడా ఫలితం కనిపించక ఆవేదన చెందుతున్నారు. ఈ నేపధ్యంలో ... తీసుకునే ఆహారం కూడా ఈ సమస్య ఎదుర్కుంటున్న వారి వెన్ను నొప్పిపై ప్రభావం చూపిస్తుంది అనే విషయం తెలుసుకోవాలి అంటున్నారు వైద్యులు. వారు చెబుతున్న ప్రకారం.. డిస్క్ అనే పదం ’ఇంటర్ వెర్టెబ్రే’ కు సంక్షిప్త రూపం. , ఈ డిస్క్‌లు వెన్నెముక (వెన్నుపూస) ఎముకలను వేరు చేసే స్పాంజి కుషన్లు అని చెప్పొచ్చు. ఈ డిస్క్‌లు షాక్, శోషణను అందిస్తాయి, వెన్నెముకను స్థిరంగా ఉంచుతాయి వెన్నుపూస కదలికను అనుమతించడానికి ’పివోట్ పాయింట్లు’ ఇస్తాయి. వీటిలో ఏర్పడే ఇబ్బందులే వెన్నునొప్పికి దారి తీస్తాయి. అయితే చక్కెరతో పాటు అసమతుల్య ఆహారం డిస్క్ రికవరీకి ఆటంకం కలిగిస్తాయి, వెన్నునొప్పిని మరింత తీవ్రతరం చేస్తాయి కాబట్టి పోషకాహారం తప్పనిసరి అంటున్నారు హైదరాబాద్‌కి చెంఇన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఒబైదుర్ రెహమాన్, ఈ సందర్భంగా ఆహారం లో మార్పు చేర్పులు చేసుకోకపోతే వెన్నునొప్పి నుంచి కోలుకోవడం కష్టమని ఈ ఆర్థోపెడిక్ సర్జన్ విడుదల చేసిన ఓ వీడియోలో స్పష్టం చేశారు. ఈ అలవాట్లు వెన్నునొప్పిని ఎలా ప్రభావితం చేస్తాయో డిస్క్ సమస్య నయం కాకుండా చేసే ఆ 4 ఆహారపు అలవాట్లు... ఏమిటంటే...
చక్కెర లేదా చక్కెరతో టీ
చక్కెర కలిపిన స్వీట్లు అధికంగా తీసుకోవడం బ్యాక్ పెయిన్ ఉన్నవారికి చేటు చేస్తుంది. అంతేకాదు చక్కెర కలిపిన టీ, కాఫీలు సైతం రోజువారీ పలు దఫాలుగా తాగడం వల్ల నడుము ప్రాంతం, శరీరంలో మంట వస్తుంది డిస్క్ సమస్య నయం కాకుండా నిరోధిస్తుంది.
వేయించిన, ప్రాసెస్ చేసిన ఆహారాలు
వేపుళ్లు చాలా రకాలుగా ఆరోగ్యానికి హానికరం అని తెలిసిందే. అదే విధంగా వేయించిన లేదా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకున్నప్పుడు, అది కూడా నడుముకి దిగువ భాగంలో మంటను కలిగిస్తుంది, డిస్క్ సమస్య నయం కాకుండా నిరోధిస్తుంది,
తక్కువ ప్రోటీన్ ఆహారం
తక్కువ ప్రోటీన్ ఆహారం లేదా అధిక కార్బ్ లేదా అధిక కొవ్వులు ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు, డిస్క్ కోలుకునే సమయంలో తగినంత పోషకాహారాన్ని పొందదు. అధిక ప్రోటీన్ ఆహారం డిస్క్ సమస్యల పరిష్కారంలో చికిత్సకు మేలు చేస్తుంది.
అధిక బెడ్ రెస్ట్
చివరగా, ఎక్కువ సేపు పడుకోవడం కూడా మంచిది కాదు. అధిక బెడ్ రెస్ట్‌లో ఉంటూ, రోజువారీ నడకలకు సమయం కేటాయించకపోతే కూడా, డిస్క్ కోలుకునేందుకు అవసరమైన పోషకాహారాన్ని పొందలేదు.
నేషనల్ స్పైన్ హెల్త్ ఫౌండేషన్ ప్రకారం, కాల్షియం విటమిన్ డి వంటి ముఖ్యమైన పోషకాలతో కూడిన సమతుల్య ఆహారం వెన్నెముక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పోషకాలు ఎముక సాంద్రత, కండరాల పనితీరు మొత్తం కణజాల ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి బోలు ఎముకల వ్యాధి, క్షీణించిన డిస్క్ వ్యాధి దీర్ఘకాలిక వెన్నునొప్పి ప్రమాదాన్ని తగ్గిస్తాయి.