
బ్రెయిన్ ట్యూమర్ బారిన పడిన యూకే అథ్లెట్ జాక్ ఫెంట్‌కు ప్రతికూల ఆలోచనలు వస్తుండేవి. ఆ సమయంలోనే తనకు ఇష్టమైన ఇండియా గుర్తుకు వచ్చింది. వెంటనే రంగంలో దిగాడు. ‘ఇండియా–80 రోజులు–4,000 కిలోమీటర్‌లు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు.
ఇండియాలోకి అడుగు పెట్టిన క్షణం నుంచి అతడిలో ఉత్సాహం మొదలైంది. ఇండియాలో తన ‘80–డే రన్’ తాలూకు వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు. ‘ప్రొటెక్టర్’ కాప్షన్‌తో పోస్ట్ చేసిన వీడియోలో తనను ప్రమాదం నుంచి రక్షించిన వీధి శునకం గురించి చెప్పాడు.
ఆ శునకంతో తనతో పాటు పదమూడు కిలోమీటర్‌లు నడిచింది. దానికి ‘మనాలి’ అని పేరు పెట్టాడు జాక్.
‘80 రోజులలో రోజుకు 50 కిలోమీటర్‌ల దూరం పరుగెత్తడానికి ఇండియాకు ప్రయాణమవుతున్నాను. మంచుతో కప్పబడిన కొండల నుంచి కేరళ ప్రకృతి అందాల వరకు ఎన్నో చూడబోతున్నాను. బ్రెయిన్ ట్యూమర్ అని నాకు నిర్దారణ అయిన తరువాత నా మనసు భయం, గందరగోళం, దుఃఖంతో నిండిపోయింది.
నాకే కాదు భూమి మీద ప్రతి ఒక్కరికీ కష్టాలు కూడా ఉంటాయి. దీంతో పాటు ఒక ఆప్షన్ కూడా ఉంటుంది. ఇండియాకు వెళ్లాలను కోవడం అనేది నా ఎంపిక. మళ్లీ పూర్వంలా ఉత్సాహంగా ఉండాలనుకుంటున్నాను’’ అని తన యాత్ర ప్రారంభానికి ముందు షేర్ చేసిన పోస్ట్‌లో రాశాడు జాక్ పెయింట్.
(చదవండి: వెయిట్ లిఫ్టింగ్‌తో ఇంత మార్పు..? ఏకంగా 93 కిలోలు నుంచి 50కిలోలు తగ్గిన మహిళ..)