
పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పులు బాధలు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇదొక హార్మోన్ల ఆట. హార్మోన్ల సునామీని తట్టుకోవడం చాలా కష్టం ఈ సమయంలో జరిగే రక్తస్రావం, వచ్చే కడుపునొప్పి, మానసిక ఆందోళన, మూడ్ స్వింగ్స్, అలసట ఒక్కో మహిళను ఒక్కో రీతిలో బాధిస్తుంటాయి. కొంతమంdray ఈ పీరియడ్స్ మేనేజ్‌మెంట్ చాలా బాధాకరంగా ఉంటుంది. అందుకే ఈసమయంలో కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుందంటున్నారు టాలీవుడ్ హీరోయిన్ తమన్నా భాటియా ట్రైనర్, సెలబ్రిటీ ఫిట్‌నెస్ ట్రైనర్ సిద్ధార్థ సింగ్
తాజాగా ఆయన ఋతుస్రావం సమయంలో ప్రయోజనకరంగా ఉండే మూడు ఆహారాలను గురించి తెలియజేశారు. వాటి ప్రయోజనాల గురించి వెల్లడించారు. పీరియడ్స్‌కు ముందు వచ్చే నీరసాన్ని, మానసిక భావోద్వేగాలను తట్టుకోవాలంటే మూడు రకాల ఆహారాలను చేర్చుకోవాలన్నారు. పీరియడ్స్ తరచుగా స్త్రీలలో అలసట, అసౌకర్యాన్ని కలగజేస్తాయి. ఇందుకోసం ముదురు ఆకుకూరలు, గ్రీక్ యోగర్ట్, డార్క్ చాక్లెట్ తీసుకోవాలన్నారు.
ఆకుకూరలు
ఆకుకూరలు బాడీలో ఐరన్ స్థాయిలను ప్రభావితం చేస్తాయి. శరీరంలో ఐరన్ లేకపోవడం వల్ల అలసట, తలతిరగడం లాంటి లక్షణాలు కన్పిస్తాయి. అందుకే పాలకూర, కాలే వంటి ఆకుకూరలు తీసుకోవాలి. వీటిల్లో ఐరన్, మెగ్నీషియం కాల్షియం సమృద్ధిగ ఉంటాయి.. ఈ పోషకాలు తిమ్మిరిని తగ్గించడంలో సహాయపడతాయి. శక్తిని పెంచుతాయి.
చదవండి: వెయిట్ లాస్‌లో ఈ మూడింటిని నమ్మకండి : రణబీర్ ఫిట్నెస్ కోచ్ వార్నింగ్
గ్రీకు యోగర్ట్
పెరుగులో ప్రోబయోటిక్స్, కాల్షియం ఉంటాయి. ఇవి PMS లక్షణాలను( పీరియడ్స్‌కి ముందు బాధలను) తగ్గిస్తాయి. జీర్ణక్రియకు సహాయ పడతాయని సిద్ధార్థ సింగ్ చెప్పారు. వీటిని భోజనంలో చేర్చుకోవడం వల్ల పేగు ఆరోగ్యం,హార్మోన్ల సమతుల్యత రెండింటికీ ప్రయోజనకరంగా ఉంటుంది.
డార్క్ చాక్లెట్
పీరియడ్స్ సమయంలో డార్క్ చాక్లెట్ తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. డార్క్ చాక్లెట్‌లో మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాలను సడలించి మానసిక స్థితిని మెరుగు పరచడానికి సహాయపడుతుంది. ఇది భోజనం తర్వాత గొప్ప డెజర్ట్ కూడా అయితే అతిగా తినకుండా కంట్రోల్‌లో ఉండాలని సిద్ధార్థ సింగ్ హెచ్చరించారు.
ఇదీ చదవండి: 7 సీక్రెట్స్ : ప్రేమించే భార్య, కొంచెం లక్‌తో సెంచరీ కొట్టేశా!