
ఎడమ వైపు తిరిగి నిద్రపోయే అలవాటు కొందరికి ఉంటుంది. అయితే..ఇప్పటికే గుండె జబ్బులు ఉన్న వారు ఎడమ వైపు తిరిగి అసలు నిద్రపోకూడదు.ఇలా నిద్రపోవడం వల్ల అసిడిటీ రిఫ్లక్స్ తగ్గిపోతుందని కొందరు చెబుతుంటారు. అయితే..హార్ట్ పేషెంట్స్ మాత్రం ఇలా పడుకోవడం మంచిది కాదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎటువైపు తిరిగి పడుకుంటే మంచిదో తెలుసుకుందాం...
ఎప్పుడైతే ఎడమ వైపు తిరిగి నిద్రపోతారో అప్పుడు గుండెపైన ఒత్తిడిపడుతుంది. ఈ ఒత్తిడి కారణంగా గుండె కాస్తంత పక్కకు జరిగినట్టుగా అవుతుంది. అదే సమయంలో గ్రావిటీ కారణంగా కిందకు లాగినట్టుగా అవుతుంది. ఈ రెండింటి మధ్య రాపిడి కారణంగా హృదయ స్పందనలో మార్పు వస్తుంది. అందుకే..గుండె జబ్బులు ఉన్న వారు వీలైనంత వరకూ ఎడమ వైపు తిరిగి నిద్రపోవడాన్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే గుండె జబ్బు లక్షణాలు ఇంకా తీవ్రమవుతాయి.
ఇక కుడి వైపునకు తిరిగి నిద్రపోవడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో కూడా తెలుసుకుందాం. ఎప్పుడైతే కుడి వైపు తిరిగి పడుకుంటారో అప్పుడు గుండెపైన ప్రెజర్ ఎక్కువగా పడదు. ఈసీజీలోనూ ఎలాంటి మార్పులు కనిపించవు. అంటే..హార్ట్ రేట్ నార్మల్ గానే ఉన్నట్టు లెక్క. అందుకే హార్ట్ పేషెంట్స్ కుడి వైపునకు తిరిగి నిద్రపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
చదవండి: Shoaib Malik సానియా మాజీ భర్త మూడో పెళ్లి పెటాకులే..?! వీడియో వైరల్
మీరు ఏ పొజిషన్ లో నిద్రపోతున్నారనే విషయంతో పాటు ఎన్ని గంటల పాటు క్వాలిటీ స్లీప్ ఉంటోందన్నదీ ముఖ్యమే. కుడి వైపు తిరిగి పడుకున్నంత మాత్రాన స్లీప్ క్వాలిటీ ఉన్నట్టే అని అనుకోడానికి వీలులేదు. చాలా మంది 5 గంటల పాటు మాత్రమే నిద్రపోతున్నారు. రాత్రంతా మొబైల్ చూసుకుంటూ కూర్చుంటున్నారు. ఉదమయే ఆఫీస్ హడావుడి కారణంగా త్వరగా నిద్రలేవాల్సి వస్తోంది. ఇలా చేయడం వల్ల మెటబాలిజం దెబ్బ తింటుంది. అప్పటి నుంచి సమస్యలన్నీ మొదలవుతాయి. అందుకే..సరైన విధంగా నిద్ర పట్టేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: Nita Amabni క్వీన్ ఆఫ్ దాండియాతో గార్బా స్టెప్పులు : ఉర్రూతలూగిన వేదిక