గుండెజబ్బుల నుంచి క్యాన్సర్ దాకా ఇన్వైట్ చేస్తున్నట్టే...
చాలా మంది టీ తాగేటప్పుడు దానికి కాంబినేషన్‌గా పొగ త్రాగడానికి ఇష్టపడతారు, ముఖ్యంగా పని విరామ సమయంలో. కానీ చాలా మందిలో కనిపించే ఈ సాధారణ అలవాటు వారికి ఏ మాత్రం గమనించని విధంగా వారి శరీరానికి హాని కలిగించవచ్చు. ‘‘నికోటిన్ కెఫిన్ కలిసి మెదడులో తాత్కాలికంగా చురుకుదనాన్ని పెంచుతాయి,దాంతో ఆ డబుల్ స్టిమ్యులేషన్ కూడా ఈ కాంబోను మరింతగా అలవాటు చేసి వ్యసనంగా మారుస్తుంది అని ఫరీదాబాద్‌లోని మెట్రో హాస్పిటల్‌లోని గ్యాస్ట్రోఎంటరాలజీ డైరెక్టర్ డాక్టర్ విశాల్ ఖురానా తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన చెబుతున్న ప్రకారం...
వ్యసన ఫలం...నిద్రలేమి...
నికోటిన్ డోపమైన్ రష్‌ను ప్రేరేపిస్తుంది, ఇది మెదడు కు ‘మంచి అనుభూతిని కలిగించే’ రసాయనం, అయితే కెఫిన్ నిద్రను ప్రేరేపించే రసాయనమైన అడెనోసి¯Œ ను అడ్డుకుంటుంది. ఈ రెండూ కలిసి పనిచేసినప్పుడు, అవి రెండూ స్వయంగా ఉద్దీపనను పెంచుతాయి అలా రెండింటినీ కలిపి తాగినప్పుడు ఆ కాసేపు మరింత చురుకుదనాన్ని అనుభవించవచ్చు, కానీ మనకు తెలీకుండా మన మెదడుకు ఆ రెండింటినీ కలిపి కోరుకునేలా శిక్షణ ఇస్తున్నామని అర్ధం.
గ్రీన్ టీ తో ప్రభావం తగ్గించవచ్చు...
టీలో కూడా నికోటిన్ ఉన్నప్పటికీ చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది, అయితే అది ధూమపానంతో పోలిస్తే దాదాపు లేనట్టే. అంతేకాకుండా సిగరెట్‌తో జత చేసే టీ రకం ఏమిటి అనేది కూడా ముఖ్యమైనదే. గ్రీన్ టీలో బ్లాక్ టీ కంటే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, తద్వారా ఇది కొంత నికోటిన్ వల్ల కలిగే నష్టాన్ని ఎదుర్కోవడంలో శరీరానికి సహాయపడుతుంది కానీ ఒకటి మాత్రం నిజం ఏ రకమైన: టీ అయినా సిగరెట్ పొగ ప్రభావాలను పూర్తిగా దూరం చేయదు.
సిగిరెట్టు మానే ఆలోచన వెనక్కి...
ధూమపానం మానాలనుకునేవాళ్లని కూడా ఈ అలవాటు నిరుత్సాహపరుస్తుంది. టీ తాగితే ధూమపానం మానేయడం కష్టం. ‘‘ మెదడు టీ ఆనందాన్ని నికోటిన్ నుంచి వచ్చే కిక్‌తో అనుసంధానించడం ప్రారంభిస్తుంది. ఒకటి మరొకదానికి ట్రిగ్గర్ అవుతుంది, అందుకే టీ తాగిన ప్రతిసారీ సిగరెట్ తాగాలని కోరుకోవడం ఎక్కువ అవుతుంది.
జీర్ణక్రియపై తీవ్ర ప్రభావం...
కెఫిన్ నికోటిన్ రెండూ హృదయ స్పందన రేటు అలాగే రక్తపోటును కూడా పెంచుతాయి. రక్త నాళాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తాయి, కాబట్టి ఈ రెండింటినీ కలపడం గుండె జబ్బులు ఉన్నవారికి మరింత ప్రమాదకరంగా మారుతుంది. టీ కడుపు లో ఆమ్లాన్ని పెంచుతుంది మరోవైపు నికోటిన్ జీర్ణక్రియను నెమ్మదించేలా చేస్తుంది ఇవి రెండూ కలిసిన తర్వాత కడుపు ఉబ్బరం, ఆమ్లత్వం దీర్ఘకాలిక జీర్ణ సమస్యలను కూడా కలిగిస్తాయి, ముఖ్యంగా ఖాళీ కడుపుతో తీసుకోవడం పేగుల మీద కూడా ప్రభావం చూపిస్తుంది.
గొంతుకీ ప్రమాదమే...
అలాగే గొంతుపై కూడా దీని ప్రభావం పడుతుంది ‘ధూమపానం గొంతు పొరను చికాకుపెడుతుంది. దానికి వేడి టీ జోడిం^è డం అంటే వేడి మంటను మరింత తీవ్రతరం చేయడమే. కాలక్రమేణా, ఇది దీర్ఘకాలిక గొంతు సమస్యలతో పాటు అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
టీ , సిగరెట్ల మేళశింపు నాడీ వ్యవస్థను అతిగా ప్రేరేపించే, గుండెను శ్రమపెట్టే ప్రేగులను కలవరపరిచే హానికరమైన జంట అనేది నిస్సందేహం కాబట్టి వీలైనంత వరకూ పొగతాగడాన్ని పూర్తిగా మానేయాలి, టీని పరిమితంగా తీసుకోవాలి రెండింటినీ మాత్రం కలిపి తీసుకోవడం మాత్రం పొరపాటున కూడా చేయవద్దు అని వైద్యులు సూచిస్తున్నారు.


