
బిడ్డ పుట్టిన తర్వాత తల్లిదండ్రులు తీసుకుంటున్న జాగ్రత్తలలో చిన్నారికి ఎలాంటి ఆహారం ఇవ్వాలి, ఎలాంటి బట్టలు కొనాలి, వాళ్లని ఎలా చూసుకోవాలి.. వంటి వాటితోపాటు వారికి వాడవలసిన డైపర్ల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం వచ్చిందిప్పుడు. ఎందుకంటే పిల్లల సంరక్షణలో డైపర్ల సైజు కూడా చాలా ముఖ్యం.
తల్లిదండ్రుల తమ పిల్లలకు వేసే డైపర్లను చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. టేప్–స్టైల్ లేదా ప్యాంట్–స్టైల్‌లో తమ బిడ్డకు ఏ స్టైల్ డైపర్ సరైనదో అని తెలుసుకోవాలి. ఎందుకంటే, పిల్లలకు సరైన డైపర్ వేయక΄ోతే.. అది వారి కోమలమైన చర్మంపై ప్రభావం చూపిస్తుంది. డైపర్లలోనూ ఎన్నో రసాయనాలుంటాయి. ఇవి ఎక్కువ సేపు చర్మాన్ని అంటిపెట్టుకుని ఉండటం వల్ల బిడ్డకు హాని కలిగే ప్రమాదం ఉంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని.. డైపర్ ఎంపికలో జాగ్రత్త వహించాలి.
క్లాత్ న్యాపీలు పిల్లలకు చాలా సౌకర్యంగా ఉంటాయి, కానీ వాటిని పదే పదే ఉతకడం తల్లిదండ్రులకు లేదా వారి సంరక్షకులకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అంతే కాకుండా క్లాత్ న్యాపీలను తyì సిన వెంటనే మార్చక΄ోతే పిల్లలకు అసౌకర్యంగా ఉంటుంది.
సరైన డైపర్ ఎంపిక
అన్ని విషయాల కంటే వారికి వేసే డైపర్ బ్రాండ్ ముఖ్యమైనది. సాధ్యమైనంత వరకు డైపర్ తయారీలో లోకల్ గా దొరికేవి, తెలియని బ్రాండ్
డైపర్లకు బదులు మెరుగైన ఫీచర్లతో తయారు చేసిన బ్రాండెడ్ డైపర్లు వాడటం చిన్నారికి కంఫర్ట్‌నిస్తుంది.
తడి పీల్చుకునేలా... ఎక్కువ సేపుపొడిగా ఉండేలా...
పిల్లల మూత్రం, మలం త్వరగా... ఎక్కువ శాతం పీల్చుకునే డైపర్లు ఎంచుకోవాలి. లీక్ అయ్యే డైపర్లకు దూరంగా ఉండండి. లీక్ అయ్యే డైపర్ల వల్ల.. పిల్లల శరీరానికి తేమ అంటుతుంది. పిల్లల చర్మానికి తడి అంటితే వారికి చికాకుగా ఉంటుంది. అంతేకాదు చిన్నారుల చర్మం సున్నితంగా ఉంటుంది. తడి కారణంగా త్వరగా దద్దుర్లు వచ్చే ప్రమాదం ఉంది. పిల్లలకు రాత్రి సమయంలోనూ ఎక్కువ సేపు పొడిగా ఉండే డైపర్లు వేస్తే.. హాయిగా నిద్రపోతారు. వారి చర్మానికి తడి తగిలితే మధ్య రాత్రి ఏడవటం ్ర΄ారంభిస్తారు. దీని దృష్టిలో ఉంచుకుని పొడిగా ఉండే డైపర్లు వేయండి.
(Shoaib Malik సానియా మాజీ భర్త మూడో పెళ్లి పెటాకులే..?! వీడియో వైరల్)
సరైన సైజ్
పిల్లల బరువును బట్టి డైపర్ సైజులు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి డైపర్ కొనడానికి ముందు మీ బిడ్డ బరువు, సైజ్ ను చూసి కొనండి. వారి డైపర్ సైజ్ ప్రతి నెల మారుతుందని గుర్తు పెట్టుకోవడం అవసరం. అందుకే ఒకే సైజ్ డైపర్లు ఇంట్లో నిల్వ ఉంచుకోకండి. డైపర్ లూజ్‌గా ఉన్నా, బిగువుగా ఉన్న చిన్నారి ఇబ్బంది పడుతుంది. అవి వేసుకోవడానికి ఇష్టపడరు. పిల్లల కోమలమైన చర్మానికి సరిపోయేలా ఉండే సున్నితమైన ఉండే డైపర్లు మాత్రమే ఎంచుకోవాలి