సాక్షి, గుంటూరు: చిన్నారులంటే వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి అపారమైన మమకారం. ప్రజల మధ్యకి వెళ్లినప్పుడు వాళ్లూ ఆయన పట్ల ఎంతో భావోద్వేగానికి లోనవుతుంటారు. దీంతో స్వయంగా వాళ్లను దగ్గరకు తీసుకుని బుజ్జగించడం తరచూ చూసేదే. అలా ఓ చిన్నారికి మావయ్యగా ఆయన నామకరణం చేశారు కూడా.
మంగళగిరి నియోజకవర్గం నూతక్కికి చెందిన బోళ్ళ వెంకటరెడ్డి, చందనాదేవి దంపతులు బుధవారం తమ అభిమాన నేత వైఎస్ జగన్‌ను తాడేపల్లికి వెళ్లి కలిశారు. తమ కుమార్తెకు నామకరణం చేయాలని ఆయన్ని కోరారు. దంపతుల కోరిక మేరకు వారిని అడిగి తెలుసుకుని మోక్షితా రెడ్డిగా పేరు పెట్టి లాలించారు. తమ కుమార్తెకు జగన్ చేతుల మీదుగా నామకరణం జరిగినందుకు ఆ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు.



