Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan Tweet Against Chandrababu Scams In AP1
‘స్కాంస్టార్ బాబు’.. హ్యాష్ ట్యాగ్‌ రిలీజ్‌ చేసిన వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి: ఏపీలో చంద్రబాబు సర్కార్‌ పాలనలో జరుగుతున్న కుంభకోణాలను, కుట్రలను వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆధారాలతో సహా బయటపెట్టారు. వైఎస్‌ జగన్‌ గురువారం మీడియా సమావేశంలో అన్ని విషయాలను వివరించారు. అనంతరం, ‘స్కాంస్టార్ బాబు’(#ScamsterBabu) అంటూ హ్యాష్ ట్యాగ్‌తో చంద్రబాబు అక్రమాలు, అవినీతి, స్కాంల ఆధారాలను వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌లో పోస్టు చేశారు.వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తాజాగా ట్విట్టర్‌ వేదికగా చంద్రబాబు అక్రమాలను మరోసారి వివరించారు. ఈ సందర్భంగా.. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఆధారాలతో సహా వివరాలను ట్యాగ్ చేశారు. మద్యం స్కాంలోని వాస్తవాలతోపాటు పూర్తి సమాచారాన్ని తెలిపారు. కేసులోని అబద్ధాలు, కట్టు కథలను ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో అమలవుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం తీరు, ప్రజా వ్యతిరేకతపై ప్రశ్నించే గొంతులను నులుమేస్తున్న తీరుపై మాట్లాడారు. యథేచ్ఛగా సాగుతున్న రాజకీయ వేధింపులు, అధికార దుర్వినియోగంపై ఆధారాలను బహిర్గతం చేశారు. ప్రభుత్వ అధికారులు, జర్నలిస్టులు, ప్రజా సంఘాలపై పెరిగిన కక్షసాధింపుల గురించి చర్చించారు. వీటికి సంబంధించిన వివరణాత్మక ఆధారాలను ట్వీట్‌లో జత చేసినట్టు తెలిపారు.In today’s press meet, I addressed key issues impacting our state and people:Facts on Liquor Case – Uncovered a deep web of lies and cooked-up stories with complete factual data.Red Book Files – Exposed vendetta politics and misuse of power to silence opposition.Targeted… pic.twitter.com/b0cXzjvc7w— YS Jagan Mohan Reddy (@ysjagan) May 22, 2025

KSR Comment: Eenadu magazine has gone down a notch for Jagan 2
వామ్మో ఈనాడు.. పైత్యం పరాకాష్టకు!

ఈనాడుకు పచ్చపైత్యం పెరిగిపోతోంది!. నిస్సిగ్గుగా పాఠకులను మోసం చేసేందుకు, ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ఈనాడు కథనాలు వండి వారుస్తోంది. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌పై విపరీతమైన ద్వేషం పెంచుకున్న ఈ పత్రిక యాజమాన్యం విచక్షణ కూడా కోల్పోయిందని స్పష్టమవుతోంది. జగన్‌ టిష్యూ పేపర్‌తో పోల్చినప్పటికీ ఈ పత్రిక తీరు మార్చుకోకపోగా మరింత దిగజారిపోతోంది. సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ) మేనేజింగ్ డైరెక్టర్ రామేశ్వర ప్రసాద్ గుప్తాను కేంద్రం పదవి నుంచి తొలగించడానికీ.. ఆయన నియామకానికి ముందే ఆంధ్రప్రదేశ్‌, సెకీల మధ్య కుదిరిన ఒప్పందాలకు ముడిపెట్టే ప్రయత్నం చేసింది ఈనాడు. యాజమాన్యాన్ని సంతోషపెట్టడానికి ఈనాడు జర్నలిస్టు బృందం రాసిన దరిద్రపు గొట్టు వార్తపై వైఎస్సార్‌సీపీ తీవ్రంగా స్పందించింది. ఈనాడు(Eenadu)ది జర్నలిజమా? బ్రోకరిజమా అని ప్రశ్నించింది. జవాబు ఇవ్వలేని ఈనాడు తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకో దిక్కుమాలిన కథనాన్ని రాయడం ఆ పత్రిక దివాళాకోరుతనానికి నిదర్శనం. ప్రస్తుతం ఈనాడు పత్రిక రాసే అబద్దాల మధ్యలో ఎక్కడైనా నిజాలేమైనా ఉన్నాయా అని వెతుక్కోవలసిన పరిస్థితి. ఏపీ ఎడిషన్‌లో రాసే, ప్రసారం చేసే కథనాలలో అత్యధికం ఈ బాపతే. చంద్రబాబు సర్కార్‌కు భజన , వైఎస్సార్‌సీపీ, జగన్‌పై వ్యతిరేక కథనాలు, అసత్యాలు!. ‘‘సెకీ(SECI) ఒప్పందానికి సన్మానం జరిగింది’’..అంటూ హెడింగ్ పెట్టి ఒక వార్తను ప్రముఖంగా అచ్చేసింది. ఆ సంస్థ సీఎండీని తొలగిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం తీసుకుందని, జగన్ ప్రభుత్వంతో ఒప్పందంపై వచ్చిన ఆరోపణలే పరోక్ష కారణం అని ఈ మీడియా తేల్చింది. అందులో తన ఇష్టానుసారం జగన్ పై ఆరోపణలు గుప్పించింది. 👉వైఎస్‌ జగన్‌(YS Jgan)తో బంధం ఏర్పరచుకున్న ఎవరికైనా జైలు.. పదవీ గండం తప్పదని మరోసారి నిరూపితమైనట్లు ఈనాడు ఎంతో ఘోరంగా రాసింది. తెలుగుదేశం కరపత్రిక కన్నా హీనంగా రాయడానికి ఈనాడు సిగ్గుపడలేదు. కాంగ్రెస్, తెలుగుదేశం లు కలిసి జగన్ పై తప్పుడు కేసులు పెట్టిన వైనం, వారికి మద్దతుగా ఈనాడు, తదితర ఎల్లో మీడియా దుష్ప్రచారం 15 ఏళ్లుగా సాగుతూనే ఉంది. ఇదే టైమ్ లో చంద్రబాబు పై వచ్చిన కేసులు, ఆ కేసుల్లో అధికారులు సస్పెండ్ అవడమో, లేదంటే విదేశాలకు పారిపోవడమో జరిగిన ఘటనలు ఈనాడు మీడియా మర్చిపోయినా ప్రజలు మర్చిపోలేదు. 👉స్కిల్ స్కామ్ లో అరెస్టు అయిన వారిలో చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న సంస్థల ప్రతినిధులు, కొందరు ప్రభుత్వ అధికారులు ఉన్న సంగతిని కప్పిపుచ్చితే సరిపోతుందా?. చం‍ద్రబాబు పలు కేసుల్లో స్టేలు తెచ్చుకున్న విషయం ప్రజలకు తెలియదా?. ఆయన పీఎస్‌ శ్రీనివాస్ ఇంటిలో కేంద్ర ప్రభుత్వ ఐటీ శాఖ రైడ్‌ చేసి.. రూ.రెండు వేల కోట్ల అక్రమాలు గుర్తించినట్లు ప్రకటించిన సంగతి ఎవరికి తెలియదు!. ఆ తర్వాత స్కిల్ స్కామ్ కేసులో విచారణకు రాకుండా తప్పించుకునేందుకు ఆ పీఏని హుటాహుటిన అమెరికాకు పంపించడాన్ని ఏమంటారో ఈనాడు మీడియానే చెప్పాలి. ఈ సంగతి ఇలా ఉంచితే.. సెకీ సీఎండీ గుప్తాని తొలగించడానికి కారణం ఒక టెండర్‌లో అనిల్ అంబానీ సంస్థ సమర్పించినవి నకిలీ డాక్యుమెంట్లు అని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. దానిని విస్మరించి గతంలో సెకీతో జగన్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం అని రాసిపడేసి ఈనాడు తన పాఠకులను మోసం చేసింది. విశేషం ఏమిటంటే.. జగన్ ప్రభుత్వం సెకీతో ఒప్పందం చేసుకున్నప్పుడు గుప్తా ఆ సంస్థకు ఎండీనే కాదు. సెకీతో ఒప్పందం 2021 డిసెంబర్ లో కుదిరితే గుప్తా పదవిలోకి వచ్చింది 2023 జూన్‌లో. అలాంటప్పుడు ఇందులో ఆయన ప్రమేయం ఏమి ఉంటుంది?. అమెరికాలో దాఖలైన ఒక కేసులో గౌతమ్‌ అదానీ రూ.1,750 కోట్ల లంచం ఇచ్చినట్లు పేర్కొన్న తీరుపై అమెరికాలోనే విమర్శలు వస్తే.. దానిని ఈనాడు భుజాన వేసుకుని జగన్ పై తప్పుడు ప్రచారానికి దిగింది. అసలు సెకీతో అదానీ సంస్థ ఒప్పందం చేసుకుంటే దానికి జగన్ ప్రభుత్వానికి ఏమి సంబంధం అంటే జవాబు చెప్పదు!. పైగా అదానీ సరఫరా చేస్తున్నట్లు.. ‘జగన్ ప్రభుత్వానికి తెలుసు’ అంటూ అడ్డగోలు వాదన. అదానీ తక్కువ ధరకు సెకీ ద్వారా విద్యుత్ ఇస్తే ఏపీ తీసుకోరాదని ఈనాడు అసలు ఎలా చెబుతుంది?. నిజంగానే ఈ విద్యుత్‌ను తీసుకోకపోతే అప్పుడు ఏమని రాసేవారు?. లంచాలు రావడం లేదని, తక్కువ ధరకు కరెంటు వస్తుంటే తీసుకోలేదని ఇదే మీడియా తప్పుడు రాతలు రాసేదా? లేదా?. యూనిట్ విద్యుత్ రూ.2.49లకు కొంటే లంచాలు వచ్చేటట్లయితే.. ఈనాడు రాసినట్లు లక్ష కోట్ల భారం అయితే.. మరి చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా 4.60 పైసలకు యూనిట్ విద్యుత్ కొనుగోలు చేయడానికి ఒక ప్రైవేటు కంపెనీతో తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది కదా!. దానికి ఎంత లంచం తీసుకుని ఉండాలి? ఇప్పుడు రాష్ట్రంపై ఎన్ని లక్షల కోట్ల భారం పడి ఉండాలి?. దానిపై ఈనాడు మీడియా ఎందుకు నోరు మెదపదు. పోనీ నిజంగానే సెకీ సంస్థ అదాని నుంచి విద్యుత్ సరఫరా చేయడం వల్ల ఏపీకి నష్టం జరుగుతుంటే చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు రద్దు చేయడం లేదో కూడా ఈనాడు మీడియానే చెప్పాలి కదా. కేంద్ర ప్రభుత్వం అదానీ కంపెనీపై చర్య తీసుకుని ఉండాలి కదా. అంటే చంద్రబాబు, మోదీ, అదానీ అంతా మంచివాళ్లే. జగన్ మాత్రమే కాదా?. 👉ఇలాంటి పిచ్చి రాతలు రాసే ఈనాడు మీడియా పరువు పోగొట్టుకుంటోంది. నిజంగానే జగన్ అప్పట్లో చెప్పినట్లు యూనిట్ రూ.2.49లకే ఏపీకి విద్యుత్ వచ్చేలా చేసినందుకు, లక్షకోట్ల రూపాయల మేర ఆదా చేసినందుకు ఆయనకు సన్మానం చేసినా తప్పేమీ లేదు. కానీ ఈనాడు సిద్దాంతం ప్రకారం ఆయనకు కాకుండా యూనిట్ విద్యుత్ రూ.4.60లకు కొనుగోలు చేస్తున్నందుకు చంద్రబాబుకు సన్మానం చేయాలన్న మాట. జగన్ అప్పట్లో ఎల్లో మీడియా చేసిన దుష్ప్రచారంపై ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు. ఈనాడు కథనంపై సాక్షి ‘‘బాబుకు ఈనాడు నిత్య సన్మానం, పాత్రికేయానికే తీరని అవమానం’’ శీర్షికన కథనాన్ని ఇచ్చింది. అలాగే వైఎస్సార్‌సీపీ నేతలు అంబటి రాంబాబు తదితరులు ఈనాడు మీడియా తీరుపై విరుచుకుపడ్డారు. దాంతో ఈనాడు మీడియా మరుసటి రోజు గుప్తా హయాంలోనే ఆదానీ గుట్టు వీడిందని మరో పిచ్చి వార్తను ఇచ్చింది. అందులో మాటమార్చేసి.. గుప్తా వచ్చాక అనుబంధ ఒప్పందాలు కుదిరాయంటూ ఏదేదో రాసింది. గుప్తా తొలగింపునకు ఈ అంశంతోపాటు ఇతర కారణాలు ఉన్నాయని ఇప్పుడు చెబుతోంది. సెకీ సంస్థ అదానీ ప్లాంట్ల నుంచి సరఫరా చేస్తారని తెలిపిందట. అది తప్పట. అసలు ఏపీ ప్రభుత్వానికి తక్కువ ధరకు విద్యుత్ రావడం ముఖ్యమా? కాదా?. ఏపీలో జగన్ టైమ్‌లో గ్రీన్ కో, తదితర సంస్థలతో పాటు అదానీ గ్రూప్ కూడా రెన్యుబుల్ విద్యుత్ ఉత్పత్తికి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మరి ఇప్పుడు అదానీ సంస్థను చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు కొనసాగిస్తోంది?. అదంతా ఎందుకు.. ఈనాడు మీడియాకు దమ్ముంటే, ఏ మాత్రం నీతి, నిజాయితీ ఉంటే చంద్రబాబు ప్రభుత్వంతో సెకీ ఒప్పందాన్ని రద్దు చేయించమనండి.. తక్కువ ధరకు అదానీ ఇచ్చినా అక్కర్లేదు.. మేము రూ.2.49కి కాకుండా రూ.4.60లకే విద్యుత్ కొంటామని, అదే రైట్ అని చంద్రబాబు ప్రభుత్వంతో చెప్పించమనండి!!. రామోజీరావు జీవిత చరమాంకంలో అబద్దపు తప్పుడు వార్తలతో అప్రతిష్ట పాలైతే.. ఆయన కుమారుడు కిరణ్(Eenadu MD Kiran) ఇప్పుడే ఇలాంటి తప్పుడు వార్తలతో పరువు పోగొట్టుకుంటున్నారు. వేరేవారి మీద కోపం, ద్వేషంతో ఎవరైనా తమ బట్టలూడదీసుకుని నడి బజారులో తిరుగుతారా! మా ఇష్టం! మేం తిరుగుతాం అన్నట్లుగా ఈనాడు మీడియా పిచ్చి పరాకాష్టకు చేరుతోందా?. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

A person Namaz at Tirumala Kalyana Vedika3
తిరుమలలో ఘోర అపచారం, ఇంకెన్ని దారుణాలు చూడాలో?

తిరుమల: తిరుమలలో మరో అపచారం చోటుచేసుకుంది. తిరుమల పాపవినాశనం రోడ్డులోని కల్యాణ వేదికలో ఓ వ్యక్తి నమాజ్‌ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో గురువారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఆ దృశ్యాలు చూసిన భక్తులు షాక్‌కు గురయ్యారు. సీసీ కెమెరా ఉన్న ప్రాంతంలో ఓ వ్యక్తి నమాజ్‌(Namaz) చేస్తుంటే టీటీడీ అధికారులు, సిబ్బంది ఏం చేస్తున్నారని మండిపడుతున్నారు. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమలలో కొత్త పాలక మండలి ఏర్పాటైన తర్వాత వరుసగా అపచారాలు జరుగుతున్నాయని దుయ్యబట్టారు.మద్యం సేవించడం, ఎగ్‌ బిర్యానీ తినడం, ఆలయంపై డ్రోన్లు తిరగడం వంటి ఘటనలను మర్చిపోకముందే.. ఇప్పుడు ఏకంగా కల్యాణ వేదిక వద్ద ఓ వ్యక్తి నమాజ్‌ చేశాడని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీటన్నింటికీ కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కాగా, నమాజ్‌ చేసిన వ్యక్తి తమిళనాడుకు చెందిన వాహనంలో తిరుమలకు వచ్చినట్లు టీటీడీ సిబ్బంది గుర్తించారు.

Pakistan Army Ahmed Sharif Chaudhry Over Action Comments4
మాకు నీళ్లు ఆపితే.. భారతీయుల ఊపిరి ఆపేస్తా: పాక్‌ ఆర్మీ అధికారి

ఇస్లామాబాద్‌: ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత తోక ముడిచిన పాకిస్తాన్‌ మరోసారి భారత్‌ను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించింది. పాకిస్తాన్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి.. భారతీయుల విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాక్‌కు సింధూ జలాలను ఆపితే.. భారత ప్రజల ఊపిరి ఆపేస్తామంటూ హెచ్చరించారు. అయితే, గతంలో ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది హఫీజ్ సయీద్ సైతం ఇవే వ్యాఖ్యలు చేయడం గమనార్హం.పాకిస్తాన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అహ్మద్ షరీఫ్ చౌదరి మాట్లాడుతూ..‘భారత్‌ మాకు వచ్చే నీటిని అడ్డుకుంటే.. మేము వారి ఊపిరిని అడ్డుకుంటాం’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక, ఉగ్రవాదాన్ని ఆపేంత వరకు సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారత్ తీసుకున్న నిర్ణయంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, గతంలో 2008 ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కూడా ఇదే తరహా బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇలా ఇద్దరూ ఒకే విధంగా మాట్లాడటం వెనుక కారణమేంటి? అనేది తెలియాల్సి ఉంది. పాక్‌ ఆర్మీకి చెందిన అధికారి ఇలా.. ఉగ్రవాది తరహాలో మాట్లాడటమేంటని పలువురు సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు.ఇదిలా ఉండగా.. రాజస్తాన్‌లోని బికనీర్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఉగ్రవాదానికి మద్దతు కొనసాగిస్తే పాకిస్తాన్‌కు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ప్రతి పైసా కోసం కష్టపడాల్సి వస్తుందన్నారు. భారతీయుల రక్తంతో ఆడుకోవడం ఇప్పుడు పాక్‌కు చాలా ఖరీదైన వ్యవహారంగా మారుతుంది అంటూ వార్నింగ్‌ ఇచ్చారు.A spokesperson for the Pakistani military issued a warning to India regarding the suspension of the Indus Water Treaty, quoting terrorist Hafiz Saeed with the statement: ‘If you cut off our water, we will cut off your breath.’pic.twitter.com/hl45IPfLVM— Harsh Patel (@Harshpatel1408) May 23, 2025మరోవైపు.. భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ విదేశాల్లో పాక్‌ చర్యలను ఎండగడుతున్నారు. తాజాగా జైశంకర్‌.. తన గడ్డపై జరుగుతోన్న ఉగ్రవాద కార్యకలాపాల గురించి పాక్‌కు తెలియదనే భావనను ఖండించారు. ఐక్యరాజ్య సమితి ఆంక్షల జాబితాలోని కరడుకట్టిన ఉగ్రవాదులంతా పాకిస్తాన్‌లోనే ఉన్నారు. పట్టపగలే ఆ దేశంలోని పెద్దపెద్ద నగరాల నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వారు ఎక్కడ ఉంటారో తెలుసు. వారు ఏ చర్యలకు ఒడిగడుతున్నారో తెలుసు. వారి మధ్యలో ఉన్న సంబంధాలు తెలుసు. పహల్గాం ఉగ్రదాడిలో పాక్‌కు‌ తన ప్రమేయం లేదని నటించకూడదు. పాక్‌ ప్రభుత్వం ఉగ్రసంస్థలకు సహకారం అందిస్తోంది. పాక్‌ ఆర్మీ సరిహద్దు ఉగ్రవాదంలో పీకల్లోతు కూరుకుపోయింది అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక, అంతకుముందు.. జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి కారణంగా 26 మంది పర్యాటకులు మృతి చెందిన విషయం తెలిసిందే. అనంతరం, పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పే విధంగా భారత్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏప్రిల్ 23న భారత్ సింధూ జలాల ఒప్పందంలోని కొన్ని భాగాలను నిలిపివేసింది. 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ ఒప్పందం, సింధు నది మరియు దాని ఉపనదుల నీటి పంపకాలకు సంబంధించినది.

Dachepalli CI anarchy against YSRCP activist Harikrishna5
వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై దాచేపల్లి సీఐ దాష్టీకం

సాక్షి,నరసరావుపేట/దాచేపల్లి: పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత ఉప్పుతల యల్లయ్య కుమారుడు హరికృష్ణని ఆయన ఇంట్లో ఉండగా పోలీసులు అక్రమంగా బుధవారం అదుపులోకి తీసుకున్నారు. హరికృష్ణ, ఆయన తండ్రి ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ నేతల దౌర్జన్యాలను భరించలేక తెలంగాణకు వలస వెళ్లి డ్రైవర్‌లుగా పనిచేస్తున్నారు. గురువారం స్వగ్రామంలో హనుమాన్‌ జయంతి సందర్భంగా జరిగే వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఎటువంటి నోటీసులు హరికృష్ణ, కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా దురుసుగా ఆయనను తీసుకెళ్లిపోయారు. పోలీసు వాహనంలో కాకుండా స్థానిక టీడీపీ నేతకు చెందిన ప్రైవేట్‌ కారులో దాచేపల్లి సీఐ పి.భాస్కర్‌ బలవంతంగా అదుపులోకి తీసుకుని దాచేపల్లి పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. తమ కుమారుడు ఏ తప్పు చేస్తే తీసుకెళుతున్నారని, కారణం చెప్పాలని తల్లిదండ్రులు కోరితే పోలీసులు వారిని భయభ్రాంతులకు గురి చేశారు. దాచేపల్లి పోలీస్‌స్టేషన్‌ ప్రాంగణంలో హరికృష్ణని అక్రమంగా నిర్భంధించి చిత్రహింసలకు గురి చేసి చితకబాదుతున్నారన్న విషయం తెలుసుకున్న హరికృష్ణ కుటుంబ సభ్యులు, వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు భారీగా పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. సీఐ భాస్కర్‌ తీరుకు నిరసనగా స్టేషన్‌ వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. అక్రమంగా నిర్భందించిన తమ కుమారుడు హరికృష్ణని చూపించాలని తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు. హరికృష్ణ తల్లి పురుగుల మందు డబ్బా తీసుకొని మా బిడ్డను చూపకపోతే చనిపోతామని కన్నీరుమున్నీరయ్యారు. సీఐ క్వార్టర్‌లో హరికృష్ణ ఉన్నట్లు తెలుసుకున్న తల్లిదండ్రులు అతన్ని చూసేందుకు వెళ్లారు. సీఐ క్వార్టర్‌లో హరికృష్ణ నడవలేని స్థితిలో బోరున విలపిస్తూ తల్లిదండ్రులకు కనిపించాడు. దీంతో తల్లిదండ్రులు సీఐ భాస్కర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసి ఆందోళన చేశారు. వైఎస్సార్‌సీపీ వైద్య విభాగం అధికార ప్రతినిధి డాక్టర్‌ చింతలపూడి ఆశోక్‌కుమార్, స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలు స్టేషన్‌ వద్దకు చేరుకుని పోలీసుల తీరుని ఆక్షేపించారు. మాట్లాడేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ నేతలపై పిడుగురాళ్ల సీఐ వెంకట్రావ్‌ దురుసుగా ప్రవర్తించారు. హరికృష్ణను చావబాదిన సీఐ భాస్కర్‌ను పిలిపించాలని డిమాండ్‌ చేయగా, సీఐ అందుబాటులోకి రాలేదు. విదేశీ పర్యటనలో ఉన్న మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి కి ఈ విషయం తెలియడంతో వెంటనే వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ టీం సభ్యులను దాచేపల్లి పోలీసుస్టేషన్‌కు పంపారు. ఫోన్‌ ద్వారా పరిస్థితిని సమీక్షించారు. సీఐ భాస్కర్‌ వ్యవహరిస్తున్న తీరు చట్టానికి, రాజ్యాంగానికి విరుద్ధమని కాసు మహేష్‌రెడ్డి మండిపడ్డారు. ఆయనను చట్టం ముందు నిలబెట్టి తగిన శిక్ష పడేలా చూస్తామని హెచ్చరించారు.పోలీసులు చిత్రహింసలు పెట్టారుదాచేపల్లి పోలీసులు తనను చిత్రహింసలకు గురి చేసినట్లు జడ్జి ముందు ఉప్పుతోళ్ల హరికృష్ణ వాంగ్మూలం ఇచ్చారని ఆయన తరఫు న్యాయవాది కిరణ్‌ దాసు తెలిపారు. గురువారం రాత్రి హరికృష్ణను జడ్జి ముందు పోలీసులు హాజరుపరిచారు. హరికృష్ణ మా­ట్లా­డుతూ పోలీసులు తన కాళ్లు, చేతులపై కర్రలతో కొట్టారని, సీఐ భాస్కరరావు చిత్రహింసలకు గురిచేశారని న్యాయమూర్తి ముందు వాపోయాడు. దాన్ని రికార్డు చేసిన న్యాయమూర్తి వైద్య పరీక్షల నిమిత్తం హరికృష్ణను గుంటూరు జీజీహెచ్‌కు రిఫర్‌ చేసి 14 రోజుల పాటు రిమాండ్‌ విధించారు.

LSG Captain Rishabh Pant Comments Over Win6
వారి ఆట అద్భుతం.. మేం కూడా నిరూపించుకున్నాం: పంత్‌

ఐపీఎల్‌-2025లో ల‌క్నోసూప‌ర్ జెయింట్స్ ఎట్ట‌కేల‌కు మ‌రో విజ‌యాన్ని న‌మోదు చేసింది. ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన లక్నో.. టేబుల్‌ టాపర్‌ గుజరాత్‌ టైటాన్స్‌కు చెక్‌ పెట్టింది. గుజరాత్‌ జట్టును 33 పరుగుల తేడాతో మట్టికరిపించింది. 236 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన గుజ‌రాత్.. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 202 ప‌రుగుల‌కు ప‌రిమితమైంది. లక్నో విజయంపై కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ ఆనందం వ్యక్తం చేశాడు.మ్యాచ్‌ ముగిసిన అనంతరం, లక్నో కెప్టెన్‌ రిషబ్ పంత్ మాట్లాడుతూ.. విజయం పట్ల కచ్చితంగా సంతోషంగా ఉంది. ఓ జ‌ట్టుగా మేము మంచి క్రికెట్ ఆడ‌గ‌ల‌మ‌ని నిరూపించాం. టోర్నమెంట్‌లో మాకు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించే అవకాశాలు ఒకప్పుడు ఉన్నాయి. ఇప్పుడు గెలిచినా రేసులో లేము. కానీ అది ఆటలో భాగం. ఎల్ల‌ప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి. టాప్ త్రీలో చోటు సంపాదించడం ఎప్పుడూ సులభం కాదు. మిచెల్ మార్ష్‌, నికోల‌స్ పూర‌న్‌లు అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారు. ఫీల్డింగ్‌లో కొన్ని తప్పిదాలు చేశాం. మ‌రికొంత మెరుగు కావాల్సి అవసరం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.గుజరాత్‌ కెప్టెన్‌ శుభమన్‌ గిల్‌ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌ ఓటమి ద్వారా జట్టులో కొన్ని లోపాలు, సానుకూల అంశాలను తెలుసుకున్నాం. పవర్‌ప్లేలో మేము బాగా బౌలింగ్ చేశాం. కానీ, అనుకున్న ప్రకారం వికెట్టు సాధించలేకపోయాం. మా బౌలర్లు భారీగా పరుగులిచ్చారు. 15-20 పరుగులు అదనంగా ఇచ్చాం. వారిని 210 దగ్గర ఆపాలనుకున్నాము. 210కి 230 మధ్య భారీ తేడా ఉంటుంది. 240 పరుగులను ఛేదించడం ఎప్పుడూ సులభం కాదు. రూథర్‌ఫోర్డ్, షారుఖ్ బ్యాటింగ్ మాకు పెద్ద పాజిటివ్‌ అంశం. ప్లేఆఫ్‌లోకి వెళ్లే క్రమంలో మళ్లీ పుంజుకుని విజయం సాధిస్తామని తెలిపాడు.ఈ మ్యాచ్‌లో లక్నో జట్టు మొదట బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌ (117; 64 బంతుల్లో 10×4, 8×6) మెరుపు శతకం సాధించడంతో ఎల్‌ఎస్‌జీ 2 వికెట్లకు 235 పరుగుల భారీ స్కోరు సాధించింది. నికోలస్‌ పూరన్‌ (56 నాటౌట్‌; 27 బంతుల్లో 4×4, 5×6), మార్‌క్రమ్‌ (36; 24 బంతుల్లో 3×4, 2×6) కూడా రాణించారు. అనంతరం ఛేదనలో గుజరాత్‌ 9 వికెట్లకు 202 పరుగులే చేయగలిగింది. షారుఖ్‌ ఖాన్‌ (57; 29 బంతుల్లో 5×4, 3×6) టాప్‌స్కోరర్‌. ఎల్‌ఎస్‌జీ బౌలర్లలో ఒరూర్క్‌ (3/27), ఆయుష్‌ బదోని (2/4) రాణించారు. 13 మ్యాచ్‌ల్లో గుజరాత్‌కిది 4వ ఓటమి కాగా.. లక్నో ఆరో విజయం నమోదు చేసింది. ఈ సీజన్లో నిలకడకు మారుపేరుగా నిలిచిన సాయి సుదర్శన్‌ (21) ఇన్నింగ్స్‌ను మెరుగ్గానే ఆరంభించినా ఎక్కువసేపు నిలవలేకపోయాడు.

BRS KTR SAtirical Comments On CM Revanth Reddy7
ఈడీ కేసులో రేవంత్‌.. పొంగులేటి రూటేనా?: కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: వందల కోట్లతో మొదలైన రేవంత్ అవినీతి బాగోతం గత ఏడాదిన్నరలో సీఎం పదవిని అడ్డం పెట్టుకుని ఏకంగా వేల కోట్లకు చేరిందని ఆరోపించారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. నాలుగు కోట్ల ప్రజల ముందు ముఖ్యమంత్రి అవినీతి బాగోతం బట్టబయలు కావడంతో కుడితిలో పడిన ఎలుకలా కాంగ్రెస్ పార్టీ కొట్టుకుంటోంది అని ఎద్దేవా చేశారు.మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా..‘నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు పెట్టడంతో.. సీఎం అవినీతి బండారం మొత్తం బయటపడింది. యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తానని రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టాడని ఈడీ నమోదు చేసిన చార్జిషీట్ తో సీఎం అవినీతి సామ్రాజ్యం బట్టబయలైంది. అధికారం కోసం ముఖ్యమంత్రి కాకముందే కాంగ్రెస్ పార్టీ పెద్దలకు వందల కోట్లు కట్టబెట్టిన వ్యవహారం కుండబద్దలు కొట్టినట్టయింది.వందల కోట్లతో మొదలైన రేవంత్ అవినీతి బాగోతం గత ఏడాదిన్నరలో సీఎం పదవిని అడ్డం పెట్టుకుని ఏకంగా వేల కోట్లకు చేరింది. దివ్యమైన తెలంగాణని దివాళా తీసి వేల కోట్లు కొల్లగొట్టడం వల్లే ఈడీ కేసులో రేవంత్ రెడ్డి అడ్డంగా ఇరుక్కుపోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి – పొంగులేటి తరహాలో చీకట్లో బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకుంటాడా ?. ఈడీ, కేవలం చార్జిషీటులో పేరు పెట్టడం వరకే పరిమితం అవుతుందా?. లేక రేవంత్ రెడ్డిని విచారణను పిలిచి మొత్తం అవినీతి కుంభకోణాలను కక్కిస్తుందా?.నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు పెట్టడంతో.. సీఎం అవినీతి బండారం మొత్తం బయటపడింది. యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తానని రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టాడని ఈడీ నమోదు చేసిన చార్జిషీట్ తో సీఎం అవినీతి సామ్రాజ్యం బట్టబయలైంది. అధికారం కోసం ముఖ్యమంత్రి… pic.twitter.com/fsb8uT8Sc9— KTR (@KTRBRS) May 23, 2025రాష్ట్ర కాంగ్రెస్‌లో రోజురోజుకూ పేట్రేగిపోతున్న అంతర్గత కుమ్ములాటలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కకావికలమైంది. పెరిగిపోతున్న తిరుగుబాట్లతో సీఎం కుర్చీ ఎప్పుడూ కూలిపోతుందో అనే భయం రేవంత్ రెడ్డిని అడుగడుగునా వెంటాడుతోంది. ఏం చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్న కాంగ్రెస్, ముఖ్యమంత్రి.. అటెన్షన్ డైవర్షన్ కోసం రోజురోజుకూ చేస్తున్న చిల్లర చేష్టలు, కొత్త కుట్రలకు తెరపడినట్టే.సీఎం రేవంత్ కు పిల్లనిచ్చిన మామ సూదిని పద్మారెడ్డియే స్వయంగా కాళేశ్వరంలో అవినీతి జరగలేదనడంతో ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు ఒక్కసారిగా ఎగిరిపోయినై.. కమీషన్లు లేనిదే ప్రభుత్వంలో ఒక్కటంటే ఒక్క ఫైలు కదలడం లేదని స్వయంగా కేబినెట్ మంత్రి కొండా సురేఖ కుండబద్దలు కొట్టడంతో కాంగ్రెస్ నిర్వాకాలన్నీ వరుసగా వెలుగుచూస్తున్నాయి.30 శాతం పర్సెంటేజీలు ఇవ్వనిదే సొంత ప్రభుత్వంలో పనులు కావడం లేదని సాక్షాత్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆ పార్టీ బట్టలిప్పడంతో కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడింది. నాలుగు కోట్ల ప్రజల ముందు ముఖ్యమంత్రి అవినీతి బాగోతం బట్టబయలు కావడంతో కుడితిలో పడిన ఎలుకలా కాంగ్రెస్ పార్టీ కొట్టుకుంటోంది. పచ్చని రాష్ట్రంలో చిచ్చుపెట్టడమే కాకుండా వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీచేస్తూ, పేదల జీవితాలతో చెలగాటమాడుతున్న ముఖ్యమంత్రి పాపం పండింది. చివరికి ధర్మం గెలుస్తుంది. జై తెలంగాణ.. జై కేసీఆర్ అంటూ కామెంట్స్‌ చేశారు.

Mega Fans Calls Boycotting Bhairavam Movie8
డైరెక్టర్‌ నోటి దురుసు.. ట్రెండింగ్‌లో ‘బాయ్‌కాట్‌ భైరవం’

‘సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు. రెండిటిని మిక్స్‌ చేయడం కరెక్ట్‌ కాదు. కానీ కొంతమంది సినిమా స్టేజ్‌పై రాజకీయాలు మాట్లాడి..కాంట్రవర్సీ క్రియేట్‌ చేస్తున్నారు. వారి సొంత అభిప్రాయాన్ని స్టేజ్‌పై వెల్లడించి.. చేజేతులా సినిమాను చంపేసుకుంటున్నారు. తాజాగా బైరవం(Bhairavam Movie) సినిమా దర్శకుడు విజయ్‌ కనకమేడల కూడా అదే చేశాడు. ఆయన నోటి దురుసు కారణంగా ఇప్పుడు బాయ్‌కాట్‌ భైరవం(#BoycottBhairavam) అనే హ్యాష్‌ట్యాగ్‌ నెట్టింట ట్రెండింగ్‌గా మారింది. ఒకవైపు వైఎస్సార్‌సీసీ ఫ్యాన్స్‌..మరోవైపు మెగా అభిమానులు భైరవం సినిమా చూడొద్దని సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున్న ప్రచారం చేస్తున్నారు. అసలేం జరిగింది?ఆ డైలాగ్‌ అవసరమా?మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'భైరవం'. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్‌ కావాల్సింది. కారణాలేంటో తెలీదు గానీ పలుమార్లు వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎ‍ట్టకేలకు ఈనెల 30న మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యం చిత్రబృందం వరుస ప్రమోషన్స్‌ కార్యక్రమాలు చేపట్టింది. ఇటీవల ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ని ఏపీలో పెద్ద ఎత్తున​ నిర్వహించింది. అయితే ఆ స్టేజ్‌పై దర్శకుడు విజయ్‌ కనకమేడల చేసిన కామెంట్స్‌ కాంట్రవర్సీకి దారి తీశాయి.‘ధర్మాన్ని కాపాడడం కోసం ఎప్పుడు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. కరెక్టుగా సంవత్సరం క్రితం మన రాష్ట్రంలో ధర్మాన్ని కాపాడడం కోసం ఒకరు వచ్చారు’అని సినిమా ఈవెంట్‌లో పొలిటికల్‌ కామెంట్స్‌ చేశాడు. దీంతో వైఎస్సార్‌సీసీ శ్రేణులు విజయ్‌ కామెంట్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సందర్భం లేకపోయినా..ఎందుకు రాజకీయాలు మాట్లాడుతున్నారంటూ మండిపడుతున్నారు. భైరవం సినిమాను బహిష్కరించాలంటూ ‘బాయ్‌కాట్‌ భైరవం’ అనే హ్యాష్‌ట్యాగ్‌ని ట్విటర్‌లో వైరల్‌ చేస్తున్నారు. విజయ్‌ నోటి దురుసు కారణంగానే ఈ వివాదం చెలరేగింది. ఇదిలా ఉంటే మరోవైపు మెగా ఫ్యాన్స్‌ కూడా విజయ్‌పై మండిపడుతున్నారు. దానికి కారణం కొన్నేళ్ల క్రితం ఫేస్‌బుక్‌లో విజయ్‌ పెట్టిన ఒక పోస్టే.No apology will make up for these filthy acts. Unanimously #BoycottBhairavam and TFI should call for a ban on this director, #VijayKanakamedala. Anyone who books a ticket for this film isn’t just insulting the stars, they’re disrespecting the entire art of cinema. pic.twitter.com/ynpUYmF9Gd— At Theatres (@attheatres) May 22, 2025కొంపముంచిన ‘ఛా’విజయ్‌ కనకమేడల ఫేస్‌బుక్‌లో 2011లో చిరంజీవి, రామ్‌ చరణ్‌లపై ఒక పోస్ట్‌ పెట్టాడు. హిందీలో అమితాబ్‌, అభిషేక్‌ కలిసి నటించిన ‘పా’ సినిమా పోస్టర్‌ని మార్పింగ్‌ చేసి చిరంజీవి, రామ్‌ చరణ్‌ ముఖాలను వాటిపై అతికించారు. ఆ పోస్టర్‌కి ‘ఛా’ అనే టైటిల్‌ పెట్టి.. ‘సామాజిక న్యాయం సమర్పించు ‘ఛా’ అని వ్యంగ్యంగా రాసుకొచ్చాడు. ఇప్పుడిదే మెగాఫ్యాన్స్‌ ఫైర్‌ అవ్వడానికి కారణం అయింది. చిరంజీవి, రామ్‌ చరణ్‌లను ఇంత దారుణంగా అవమానిస్తావా అంటూ మెగా ఫ్యాన్స్‌ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయ్‌ దర్శకత్వం వహించిన భైరవం సినిమాను బహిష్కరించాలని మెగా ఫ్యాన్స్‌ పిలుపునిచ్చారు.హ్యాక్‌ అయిందా? అదేలా?సోషల్‌ మీడియాలో బాయికాట్‌ భైరవం ట్యాగ్‌ ట్రెండ్‌ కావడంలో విజయ్‌ కనకమేడల దీనిపై రియాక్ట్‌ అయ్యాడు. ఆ పోస్ట్‌ తాను పెట్టింది కాదని, హ్యాక్‌ అయిందని తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు. కానీ మెగాఫ్యాన్స్‌ మాత్రం హ్యాకింగ్‌ అనేది పచ్చి అబద్దం అని, 2011లో నువ్వ ఎవరో కూడా తెలియదు.. నీ అకౌంట్‌ని ఎలా హ్యాక్‌ చేస్తారు? ఒకవేళ చేసినా 14 ఏళ్లుగా నీ ఫేస్‌బుక్‌ని చెక్‌ చేసుకోలేదా? అని మెగా ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. మొత్తానికి దర్శకుడి నోటి దురుసు కారణంగా సినిమాకు ఎంతోకొంత నష్టం అయితే జరిగినట్లే.Mr. అతి @DirVijayK మాట పొదుపు గా ఉండాలి , చేతలకి అదుపు ఉండాలి 🤬🤬#BoycottBHAIRAVAM pic.twitter.com/1YFBJmPBQv— Aravind Reddy (@AravindOnAir) May 23, 2025 నమస్కారం అందరికీ గుడ్ ఈవెనింగ్ అండీ..మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులకి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి అభిమానులకు అందరికీ గుడ్ ఈవెనింగ్. మేము మే 18న భైరవం ట్రైలర్ రిలీజ్ చేసాం. అప్పటి నుంచి నా మీద సోషల్ మీడియాలో కొంచెం ట్రోలింగ్…— Vijay Kanakamedala (@DirVijayK) May 22, 2025#Hacked #Tollywood #director #BoycottBHAIRAVAM #dengey #megadogs #mogga pic.twitter.com/NPM4jtyhQl— 𝔾𝕙𝕠𝕤𝕥ℝ𝕚𝕕𝕖𝕣🐉 (@yashwanthpotter) May 23, 2025

NMACC India Weekend Bringing India to New York City9
భారతీయ సంస్కృతికి అద్దం పట్టేలా యూఎస్‌లో వేడుకలు

న్యూయార్క్ నగరంలోని లింకన్ సెంటర్‌లో భారతీయ కళలు ఉట్టిపడేలా నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్ఎంఎసీసీ) ఇండియా వీకెండ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ వేడుక 2025 సెప్టెంబర్ 12 నుంచి 14 వరకు జరగనుంది. భారతీయ కళల వారసత్వం, సంప్రదాయ నృత్యాలు, సంగీతం, ఫ్యాషన్, వంటకాలు..వంటి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు ఇందులో ఉండనున్నాయని నిర్వాహకులు తెలిపారు.ఈ వేడుకల నిర్వాహకుల వివరాల ప్రకారం.. ఈ ఉత్సవాలు ‘గ్రాండ్‌ స్వాగత్‌’ పేరుతో సెలబ్రిటీల ప్రత్యేక కార్యక్రమాలతో ప్రారంభమవుతాయి. ఈ హైప్రొఫైల్ ఈవెంట్‌లో మనీష్ మల్హోత్రా రూపొందించిన ఫ్యాషన్ షో ఉంటుంది. ఇది భారతదేశం హస్తకళలు, సమకాలీన డిజైన్లకు వేదికగా నిలుస్తుంది. విజువల్ ఫీస్ట్‌కు అనుబంధంగా వికాస్ ఖన్నా తయారు చేసిన స్టార్ మెనూతో వంటకాలు ఉంటాయి. ఈ వేడుకల్లో భాగంగా ఫిరోజ్ అబ్బాస్ ఖాన్ ఆధ్వర్యంలో ‘ది గ్రేట్ ఇండియన్ మ్యూజికల్: సివిలైజేషన్ టు నేషన్’తో ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. క్రీస్తుపూర్వం 5000 నుంచి 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకు దేశీయ పరిణామాలను తెలియజేసేలా నాటకాలుంటాయి. ప్రదర్శనలు, దృశ్యాలు, కథల ద్వారా ఈ ఈవెంట్‌ చరిత్రకు జీవం పోస్తుందని నిర్వాహకులు తెలిపారు.ఇదీ చదవండి: బంగారం, స్టాక్‌ మార్కెట్‌, కరెన్సీ లేటెస్ట్‌ అప్‌డేట్స్‌అతిథులు బాలీవుడ్ నృత్య వర్క్‌షాప్‌ల్లో పాల్గొనవచ్చు. గార్బా, దాండియా రాస్‌ను ఆస్వాదించవచ్చు. ‘ది గ్రేట్ ఇండియన్ బజార్’లో భాగంగా భారతీయ వస్త్రాలు, హస్తకళలు, ప్రాంతీయ వంటకాలను రుచి చూడవచ్చు. ఎస్‌ఎంఏసీసీ ఇండియా వీకెండ్ యూఎస్‌లో నిర్వహించే అతిపెద్ద భారతీయ సాంస్కృతిక ఉత్సవాల్లో ఒకటిగా ఉండనుంది.ఈ కార్యక్రమంలో శంకర్ మహదేవన్, శ్రేయా ఘోషల్, శాస్త్రీయ సంగీతకారుడు రిషబ్ శర్మ ప్రదర్శనలు ఉండనున్నాయి. ఎడ్డీ స్టెర్నోతో మార్నింగ్ యోగా, క్రికెట్ థీమ్ ప్యానెల్స్, షియామక్ దావర్ నేతృత్వంలో బాలీవుడ్ డ్యాన్స్ వర్క్‌షాప్‌లు ఉంటాయి. ‘సంస్కృతి మనుషులను కలుపుతుంది. సహానుభూతిని పెంపొందిస్తుంది. 5,000 ఏళ్లకు సంబంధించిన భారతదేశ చరిత్రను ప్రపంచానికి తెలియజేసేందుకు ఎదురుచూస్తున్నాను’ అని ఈ సందర్భంగా నీతా అంబానీ అన్నారు.

National Commission for Women Launches YASHODA AI to Empower Women10
YASHODA AI జై.. యశోద ఏఐ

అంతంత మాత్రమే చదువుకున్న మహిళలను టెక్‌–సావీలుగా తీర్చిదిద్దవచ్చా? ‘అవును’ అని చెప్పడానికి దేశవ్యాప్తంగా ఎంతోమంది మహిళల విజయాలే సాక్ష్యం.తాజాగా... దేశవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలను టెక్‌–సావీలుగా తీర్చిదిద్దడానికి నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ఉమెన్‌(ఎన్‌సీడబ్ల్యూ) ఆధ్వర్యంలో ‘యశోద ఏఐ క్యాంపెయిన్‌’ మొదలైంది...నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ వుమెన్‌ (ఎన్‌సీడబ్ల్యూ) ఆధ్వర్యంలో ప్రత్యేకమైన క్యాంపెయిన్‌ ప్రారంభమైంది. ఈ క్యాంపెయిన్‌ ద్వారా లక్షలాది మహిళలకు డిజిటల్‌ లిటరసీప్రాముఖ్యత గురించి తెలియజేస్తారు. సైబర్‌ నేరాల బారిన పడకుండా మహిళలకు అవసరమైన శిక్షణ ఇస్తారు. రాబోయే రోజుల్లో మహిళలను టెక్‌–సావీగా మార్చడానికి రకరకాల కార్యక్రమాలకు రూపకల్పన చేశారు.ఉత్తర్‌ప్రదేశ్‌ బరేలీలోని మహాత్మా జ్యోతిబా ఫులే యూనివర్శిటీలోప్రారంభమయ్యే ‘యశోద ఏఐ క్యాంపెయిన్‌’ (యువర్‌ ఏఐ సాక్షి ఫర్‌ షేపింగ్‌ హరైజన్స్‌ విత్‌ డిజిటల్‌ అవేర్‌నెస్‌) ద్వారా రాబోయే నెలల్లో దేశవ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), సైబర్‌ సెక్యూరిటీ, డిజిటల్‌ లిటరసీలో శిక్షణ ఇస్తారు.ఇదీ చదవండి: నా బరువుతో నేను హ్యాపీగానే ఉన్నా : ఐశ్వర్య ఘాటు రిప్లై వైరల్‌‘యశోద ఏఐ’ లక్ష్యం దేశంలోని ప్రతి మూలలో మహిళలకు సాంకేతిక విషయాల్లోప్రావీణ్యం కల్పించడం. తొలిదశలో రెండు లక్షల కంటే ఎక్కువమంది మహిళలకు సాంకేతిక విషయాల్లో శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. స్కూల్, కాలేజి, స్వయంసహాయక బృందాలు, ఆశా వర్కర్స్, టీచర్స్, ప్రభుత్వ ఉద్యోగులు... ఇలా వివిధ వర్గాల మహిళలకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణలో పాల్గొనేవారికి స్థానిక భాషల్లో కోర్సు మెటీరియల్‌ అందిస్తారు. వర్క్‌షాప్‌లు నిర్వహించి డిజిటల్‌ టూల్స్‌ వాడకంపై అవగాహన కలిగిస్తారు.చదవండి: వారానికి 52 గంటలకు మించి పని చేస్తే.. మెదడు మటాషే! చేంజ్‌ మేకర్స్‌గ్రామీణ, పట్టణప్రాంతం అని తేడా లేకుండా అంతంత మాత్రం చదువుకున్న అమ్మాయిలు కూడా సాంకేతిక విషయాల్లో ప్రావీణ్యం సాధించేలా చేయవచ్చని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. వాటిలో కొన్ని...ఒడిషాలోని రఘురాజ్‌పూర్‌ గ్రామానికి చెందిన పద్దెనిమిది సంవత్సరాల చంద్రమాకు నెలకు వెయ్యి రూపాయల ఆదాయం అనేది కష్టంగా ఉండేది. తన మాతృభాషలో మాట్లాడిన మాటలను సెల్‌ఫోన్‌లో రికార్డ్‌ చేయడం ద్వారా ఇప్పుడు నెలకు అయిదువేలు సంపాదిస్తోంది. బెంగళూరుకు చెందిన స్వచ్ఛంద సంస్థ ‘కార్య’ కోసం పనిచేస్తోంది చంద్రమా. స్థానికభాషల్లో డేటాసెట్స్‌ను రూపొందించడంపై ‘కార్య’ దృష్టి పెట్టింది.కోల్‌కత్తాలోని గ్రామీణప్రాంతానికి చెందిన మౌమితా షా దాస్‌ రోజూ ఉదయాన్నే తన ఫోన్‌లో డిజిటైజింగ్‌ వర్క్‌ మొదలుపెడుతుంది. స్కూలుకు వెళ్లి వచ్చిన తరువాత మళ్లీ డిజిటైజింగ్‌ వర్క్‌లోకి వెళుతుంది. ‘తక్కువ టైమ్‌ పని చేసినా మంచి ఆదాయం సంపాదిస్తున్నాను. ఈ డిజిటల్‌ టాస్క్‌ల ద్వారా నేను ఏ పని అయినా చేయగలను అనే నమ్మకం వచ్చింది’ అంటుంది మౌమిత.స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలు...ఏఐ మోడల్స్‌ని ట్రైన్‌ చేయడంపై ఫోకస్‌ చేసే జాబ్స్‌లో హైరింగ్‌ పెరగడంతో గ్రామీణప్రాంతాలకు చెందిన చంద్రమా, మౌమితలాంటి ఎంతోమంది అమ్మాయిలకు ఉపాధి లభిస్తోంది. వారు చేసే పనికి సాంకేతిక విద్యలో పట్టా అవసరం లేదు. స్మార్ట్‌ఫోన్, డిజిటల్‌ స్కిల్స్‌ ఉంటే సరిపోతుంది.‘గ్రామీణప్రాంతాలలోని మహిళలు సబ్జెక్ట్‌ మ్యాటర్‌ ఎక్స్‌పర్ట్‌గా మారేలా శిక్షణ ఇస్తాం. మన దేశానికి సంబంధించిప్రాంతీయ భాషలలో ఏఐ మోడల్స్‌ అభివృద్ధిపై దృష్టి పెట్టాం’ అంటున్నారు ‘కార్య’ సీయివో మనూ చోప్రా ఒకప్పుడు కన్‌స్ట్రక్షన్‌ వర్కర్‌గా పనిచేసిన రాజస్థాన్‌కు చెందిన రోమల దీదీ ఇలా అంటోంది. ‘కార్య ద్వారా నాకు వచ్చే డబ్బుతో పిల్లల బడిఫీజులు చెల్లిస్తున్నాను. ఇతర ఖర్చులకు కూడా ఈ డబ్బు ఉపయోగపడుతోంది’.ఐ–సాక్ష్యమ్‌బిహార్‌కు చెందిన ‘ఐ–సాక్ష్యమ్‌’ సంస్థ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఉపయోగించి రూపొందించిన ఫెలోషిప్‌ ప్రోగ్రామ్స్‌ ద్వారా ఎంతో మంది యువతులను చేంజ్‌మేకర్స్‌గా మారుస్తోంది. నిజానికి వీరిలో చాలామందికి స్మార్ట్‌ఫోన్‌ గురించి తెలియదు. అలాంటి వారిని కూడా సాంకేతిక అంశాలలో పట్టు సాధించేలా, ఉపాధి పొందేలా చేస్తున్నారు. సాంకేతిక విషయాల్లో పురుషులతో సమానంగా మహిళలు ముందుండే లక్ష్యంతో ఐ–సాక్ష్యమ్‌ కృషి చేస్తోంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement