
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో ఇటీవల పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో మృతిచెందిన, గాయపడిన బాధిత కుటుంబాలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Congress leader Rahul Gandhi) పరామర్శించనున్నారు. ఇందుకోసం ఆయన శనివారం(మే 24) జమ్ములోని పూంచ్ చేరుకోనున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ మీడియాకు తెలిపారు.
పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్ర దాడిలో 25 మంది పర్యాటకులతోపాటు స్థానికుడొకరు మృతిచెందిన తరువాత లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జమ్ము కశ్మీర్‌ను సందర్శించడం ఇది రెండవసారి. రాహుల్ గాంధీ మే 24న పూంచ్‌ను సందర్శిస్తారని సోషల్ మీడియా ప్లాట్‌ఫారం ఎక్స్‌లో పేర్కొన్న రమేష్.. ఏప్రిల్ 25న రాహుల్ గాంధీ పహల్గామ్ ఉగ్ర దాడిలో గాయపడిన వారిని శ్రీనగర్(Srinagar)లో పరామర్శించారని తెలిపారు. అప్పుడు ఆయన ఎల్‌జీ, సీఎంలతో కూడా సమావేశమయ్యారన్నారు.
గత నెలలో జమ్ముకశ్మీర్(Jammu and Kashmir)లో పర్యంచిన రాహుల్ మాట్లాడుతూ దేశ ప్రజలను విభజించడమే లక్ష్యంగా ఉగ్రదాడి జరిగిందని, ఉగ్రవాదాన్ని శాశ్వతంగా ఓడించడానికి భారతదేశం ఐక్యంగా నిలబడటం తప్పనిసరని పేర్కొన్నారు. మే 7న పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులు చేసిన తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. ఈ నేపధ్యంలో పూంచ్ సెక్టార్‌లో రెండు వారాల క్రితం ఫిరంగి దాడులు చోటుచేసుకున్నాయి. ఈ దాడులలో 27 మంది మృతిచెందగా, 70 మందికి పైగా జనం గాయపడ్డారు.
ఇది కూడా చదవండి: Coronavirus: ముంబైలో కేసుల పెరుగుదల.. అదే బాటలో తమిళనాడు, గుజరాత్