
ఆపరేషన్ సిందూర్‌లో మహిళా సైనికుల పాత్రపై బీఎస్‌ఎఫ్ డీఐజీ ప్రశంసలు
అఖూ్నర్ (జమ్మూ కశ్మీర్): ఆపరేషన్ సిందూర్‌లో మహిళా దళాల పాత్రను బీఎస్‌ఎఫ్ డీఐజీ వరీందర్ దత్తా కొనియాడారు. మహిళలు తాము శక్తికి ప్రతిరూపమని నిరూపించుకున్నారని ఆయన ప్రశంసించారు. పాక్‌లో ఉగ్రవాద స్థావరాలపై దాడుల సందర్భంగా అఖూ్నర్‌లోని సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్)లోని మహిళా సైనికులు పురుష సైనికులతో భుజం భుజం కలిపి నిలిచారన్నారు.
‘‘మేం అన్నింటికీ సిద్ధంగా ఉన్నాం. శత్రువు మా పోస్టులపై దాడి చేయడం ప్రారంభించిన వెంటనే, మేం కాల్పులు జరిపాం. వారి ఎనిమిది ఫార్వర్డ్ పోస్టులను ధ్వంసం చేశాం. ఒక లాంచింగ్ ప్యాడ్‌తో పాటు వారి వైమానిక నిఘా వ్యవస్థను కూడా ధ్వంసం చేశాం. మా మహిళా కంపెనీ కమాండర్ ఒక శత్రు పోస్టును పూర్తిగా ధ్వంసం చేశారు’అని వరీందర్ దత్తా చెప్పారు. మహిళా సైనికులు అనే పదాన్ని తొలగించాల్సిన అవసరం ఉందని సాంబాలో ఓ బీఎస్‌ఎఫ్ అధికారి అన్నారు. యూనిఫాంలో ఉన్న పురుషుల కంటే మహిళలు తక్కువ కాదని నిరూపించారన్నారు.
స రిహద్దు కాల్పులు పెరిగినప్పుడు, మహిళా అధికారులను బెటాలియన్ ప్రధాన కార్యాలయానికి వెళ్లాలనుకుంటే వెళ్లొచ్చని అవకాశం ఇచి్చనా.. వారు సరిహద్దుల్లోనే విధులు కొనసాగించారని వెల్లడించారు. అంతేకాదు.. పా కిస్తాన్ కాల్పుల విరమణ ముసుగులో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి.. మే 8న జమ్మూ కశ్మీర్‌లోని సాంబా జిల్లాలో 45–50 మంది ఉగ్రవాదులు చొరబాటుకు దోహదపడేందు కు ప్రయతి్నంచిందని, బీఎస్‌ఎఫ్ భారీ మో రా్టర్ కాల్పులను ఉపయోగించి శత్రు పోస్టులను ధ్వంసం చేసి, చొరబాటు ప్రయత్నాన్ని భగ్నం చేసిందని బీఎస్‌ఎఫ్ అధికారులు తెలిపారు. షెల్లింగ్‌ను సైతం బీఎస్‌ఎఫ్ సమర్థవంతంగా ఎదుర్కొందని డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఎస్‌ఎస్ మాండ్ తెలిపారు.