
సాక్షి, విశాఖపట్నం: వైజాగ్ స్టీల్ ప్లాంట్(Vizag Steel Plant)లో శుక్రవారం వేకువ జామున భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్టీల్ మెల్టింగ్ స్టేషన్(SMS)-2 మిషన్‌లో షార్ట్ సర్క్యూట్‌తో హైడ్రాలిక్ ఆయిల్ లీక్ అయ్యి మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్ టీం అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. దీంతో పెను ప్రమాదం తప్పింది. అయితే నష్టం తాలుకా వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

