నల్ల చొక్కాలతో ఉక్కు నిర్వాసిత రైతుల ఉద్యమం
గాజువాక: విశాఖ స్టీల్‌ప్లాంట్ కోసం భూములిచ్చిన నిర్వాసితులు తమ హక్కుల సాధన కోసం తమిళనాడు ‘పెరియార్ ’ తరహాలో నల్లచొక్కాలు ధరించి నిరసన తెలపాలని రిటైర్డ్ డీజీపీ, ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయకర్త జె.పూర్ణచంద్రరావు పిలుపునిచ్చారు. ఆదివారం లంకా మైదానంలో ఉక్కు నిర్వాసితుల ఐక్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన ప్రజాగర్జన సభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. వేల ఎకరాల భూములిచ్చిన రైతులు 35 ఏళ్లుగా న్యాయం కోసం ఎదురుచూస్తున్నా ప్రభుత్వాల్లో చలనం లేదని ఆయన విమర్శించారు. ధర్నాలు, రాస్తారోకోల కంటే వినూత్నంగా నల్లచొక్కాల ఉద్యమం ద్వారా పాలకులను నిలదీయాలని కోరారు.
తమిళనాడులో సేలం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకున్న స్ఫూర్తితో ఇక్కడి నిర్వాసితులు, కార్మికులు ఉద్యమించాలన్నారు. అమరావతి రైతులకు ఇచ్చిన తరహాలోనే స్టీల్‌ప్లాంట్ నిర్వాసితులకు ఎకరానికి 1250 గజాల పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు, నాయకులు వై.మహాదేవ్, పరంధామయ్య తదితరులు పాల్గొన్నారు.
రిటైర్డ్ డీఎస్పీ పూర్ణచంద్రరావు పిలుపు
నల్ల చొక్కాలతో ఉక్కు నిర్వాసిత రైతుల ఉద్యమం


