భక్తులకు మెరుగైన సేవలే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

భక్తులకు మెరుగైన సేవలే లక్ష్యం

Feb 9 2026 8:19 AM | Updated on Feb 9 2026 8:19 AM

భక్తులకు మెరుగైన సేవలే లక్ష్యం

భక్తులకు మెరుగైన సేవలే లక్ష్యం

సింహాచలం : వరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యం లేకుండా తృప్తిగా దర్శనం చేసుకునేలా చూడడమే ప్రథమ ప్రాధాన్యత అని సింహాచలం దేవస్థానం నూతన ఈవో జె.వెంకటరావు తెలిపారు. ఆదివారం బాధ్యతలు స్వీకరించిన ఆయన తొలుత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కప్పస్తంభాన్ని ఆలింగనం చేసి బేడామండపంలో ప్రదక్షిణ చేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారి చిత్రపటం, శేషవస్త్రం, ప్రసాదాన్ని ఏఈవో తిరుమలేశ్వరరావు అందజేశారు. ఇన్‌ఛార్జ్‌ ఈవోగా పనిచేసిన ఎన్‌.సుజాత నుంచి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆలయ పవిత్రత, ఆస్తుల పరిరక్షణను రెండవ ప్రాధాన్యతగా తీసుకుంటానన్నారు. కలెక్టర్‌, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని ఆలయ ఆస్తులను కాపాడుతామని తెలిపారు. ఏప్రిల్‌ 20న జరిగే చందనోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించడం అత్యవసర ప్రాధాన్యతగా తీసుకుంటామని, రానున్న 50 రోజులు ఆ ఏర్పాట్లపైనే దృష్టి పెడతానన్నారు. దేవస్థానంలో లోపాలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు.

సింహాచలం దేవస్థానం ఈవోగా

వెంకటరావు బాధ్యతల స్వీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement