శిక్ష!
కక్ష..
స్టీల్‌ప్లాంట్ బకాయిలతో డిస్కమ్‌కు దెబ్బ
ఏడాది కాలంలో రూ.550 కోట్ల విద్యుత్ బిల్లులు బకాయిల చెల్లింపులో ప్లాంట్‌కు సహకరించని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫలితంగా యూనిట్ సగటు వ్యయం–రాబడి మధ్య భారీ వ్యత్యాసం డిస్కమ్ పనితీరు సరిగా లేదంటూ తప్పుపట్టిన కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కును నిర్వీర్యం చేసే కుట్రలో బలవుతున్న ఈపీడీసీఎల్ పలుమార్లు నివేదించినా పట్టించుకోని ప్రభుత్వం
ఉక్కుపై
ఈపీడీసీఎల్‌కు
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రుల హకై ్కన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా కేంద్రం కొనసాగిస్తున్న ప్రైవేటీకరణ విధానాలకు రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా సహకరిస్తోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఒకవైపు స్టీల్ ప్లాంట్‌ను ఆర్థికంగా దెబ్బతీస్తూ, మరోవైపు ఉద్యోగుల తగ్గింపుతో ఉత్పత్తిపై ప్రభావం చూపుతున్నా చంద్రబాబు ప్రభుత్వం స్పందించకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్లాంట్ నిలదొక్కుకునేలా సాయం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర నిర్ణయాలకు తానా–తందానా అంటూ వ్యవహరించడంతో విశాఖ స్టీల్ ప్లాంట్‌కు విద్యుత్ సరఫరా చేసే ఏపీఈపీడీసీఎల్‌పై భారం పడింది. ప్లాంట్ నుంచి వందల కోట్ల రూపాయల బకాయిలు మొండిబకాయిలుగా మారడంతో కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 13వ వార్షిక గ్రేడింగ్‌లో ఎప్పుడూ ‘ఏ’ గ్రేడ్‌లో ఉండే ఈపీడీసీఎల్ తొలిసారిగా ‘బీ’ గ్రేడ్‌కు పడిపోయింది. బకాయిల వసూలులో వెనుకబాటే కారణంగా యూనిట్ సగటు వ్యయం–రాబడి మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడిందని కేంద్రం స్పష్టం చేయగా, ఇందులో ఈపీడీసీఎల్ తప్పేమీ లేకపోయినా శిక్ష మాత్రం అనుభవించాల్సి వచ్చిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
చెల్లింపులు జరుగుతాయా.. లేదా..?
బిల్లు బకాయిల కోసం పలుమార్లు స్టీల్ ప్లాంట్‌తో, ప్రభుత్వంతో ఈపీడీసీఎల్ చర్చలు జరిపినా ఫలితం మాత్రం శూన్యంగానే మిగిలింది. డిస్కమ్ పనితీరు అద్భుతంగా ఉన్నా.. ప్లాంట్‌కు కనీసం విద్యుత్ బిల్లులు కట్టే స్తోమత లేకుండా చేసి, ఆ నెపాన్ని డిస్కమ్‌పై నెట్టి మొత్తానికి విశాఖ ఉక్కు ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా పాలన సాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విశాఖ ఉక్కుకు గనుల కేటాయింపు చేయకపోవడం, వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వకపోవడం ద్వారా ప్లాంట్‌ను ఎండగడుతున్న కేంద్ర తీరుపై రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహించడం వెనుక మర్మం ప్రజలకు అర్థమవుతోందనే వ్యాఖ్యలు ఉన్నాయి. బకాయిల వల్ల ఏపీ ఈపీడీసీఎల్‌కు వార్షిక నష్టం రూ.7,155 కోట్లకు చేరుకున్నా ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల కంటే కేంద్రంలోని పెద్దల మెప్పుకోసమే చంద్రబాబు ప్రభుత్వం తాపత్రయపడుతోందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్లాంట్ నుంచి చెల్లింపులు జరుగుతాయా లేదా అన్న మీమాంశలో ఈపీడీసీఎల్ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. సమగ్ర కారణాలు వివరించి గ్రేడ్ మార్పు కోసం మరోసారి కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసినట్లు ఈపీడీసీఎల్ అధికార వర్గాలు తెలిపాయి. మొత్తంగా ప్లాంట్‌పై ప్రభుత్వ వైఖరి ఈపీడీసీఎల్ ప్రతిష్టను దెబ్బతీసిందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
ప్లాంట్ బకాయిలే
ప్రధాన కారణం..!
విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి ఈపీడీసీఎల్‌కు రావాల్సిన విద్యుత్ బిల్లుల బకాయిలు కొండలా పేరుకుపోతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లాంట్ విషయాన్ని పూర్తిగా విస్మరించిందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేటీకరణ కోసం కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు వంతపాడుతూ విశాఖ ఉక్కును నిర్వీర్యం చేసే పనిలోనే ప్రభుత్వం నిమగ్నమైందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ బకాయిలపై గతంలో స్టీల్ ప్లాంట్‌కు ఈపీడీసీఎల్ నోటీసులు జారీ చేసింది. అయితే నోటీసులు వెనక్కి తీసుకోవాలని, బకాయిలపై దృష్టిసారిస్తామని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో ఈపీడీసీఎల్ అధికారులు మౌనం వహించారు. ఫలితంగా 2024 అక్టోబర్ నుంచి ఏడాది కాలంలోనే సుమారు రూ.550.40 కోట్ల మేర విద్యుత్ బిల్లులు బకాయిలుగా మారి డిస్కమ్ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీశాయి.
సహకారమెక్కడ చంద్రబాబూ..?
స్టీల్ ప్లాంట్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బిల్లుల చెల్లింపునకు ఎలాంటి సహకారం అందించకపోవడంతో ఈ భారం ఈపీడీసీఎల్ మెడకు చుట్టుకుంది. డిస్కమ్ పరిధిలో యూనిట్ సగటు వ్యయం–రాబడి మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడింది. ఒక యూనిట్ సగటు వ్యయం, సగటు రాబడి మధ్య వ్యత్యాసాన్ని విద్యుత్ శాఖ పరిభాషలో ఏసీఎస్–ఏఆర్‌ఆర్ గ్యాప్‌గా పేర్కొంటారు. ఇది 2023–24లో 0.36 శాతంతో అద్భుతంగా ఉండేది. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ బకాయిల కారణంగా ఈ వ్యత్యాసం ప్లస్ నుంచి మైనస్‌లోకి వెళ్లిపోయింది. 2024–25లో –0.09 శాతానికి పడిపోయింది. ఈ కారణంగా ఈపీడీసీఎల్ గ్రేడ్ మార్కులను భారీగా కోల్పోయింది. ఏపీ ఈపీడీసీఎల్ కేంద్రం విడుదల చేసిన 13వ వార్షిక గ్రేడింగ్ నివేదికలో ‘ఏ’ గ్రేడ్ నుంచి ‘బీ’ గ్రేడ్‌కు పడిపోయింది. గతంలో 65.12 మార్కులు సాధించిన డిస్కమ్, తాజాగా 50.46 మార్కులకు పరిమితమైంది. స్టీల్ ప్లాంట్ బకాయిలు సకాలంలో చెల్లించి ఉంటే ఈపీడీసీఎల్ 71.34 మార్కులు సాధించి ‘ఏ’ గ్రేడ్‌లోనే కొనసాగేది.
శిక్ష!
శిక్ష!


