
సాక్షి, తాడేపల్లి: ఏపీలో చంద్రబాబు సర్కార్ పాలనలో జరుగుతున్న కుంభకోణాలను, కుట్రలను వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ఆధారాలతో సహా బయటపెట్టారు. వైఎస్ జగన్ గురువారం మీడియా సమావేశంలో అన్ని విషయాలను వివరించారు. ఆపై స్కామ్ స్టర్ బాబు’(#ScamsterBabu) అంటూ హ్యాష్ ట్యాగ్‌తో చంద్రబాబు అక్రమాలు, అవినీతి, స్కాంల ఆధారాలను వైఎస్ జగన్ ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా ట్విట్టర్ వేదికగా చంద్రబాబు అక్రమాలను మరోసారి వివరించారు. ఈ సందర్భంగా.. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఆధారాలతో సహా వివరాలను ట్యాగ్ చేశారు. మద్యం స్కాంలోని వాస్తవాలతోపాటు పూర్తి సమాచారాన్ని తెలిపారు. కేసులోని అబద్ధాలు, కట్టు కథలను ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో అమలవుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం తీరు, ప్రజా వ్యతిరేకతపై ప్రశ్నించే గొంతులను నులుమేస్తున్న తీరుపై మాట్లాడారు. యథేచ్ఛగా సాగుతున్న రాజకీయ వేధింపులు, అధికార దుర్వినియోగంపై ఆధారాలను బహిర్గతం చేశారు. ప్రభుత్వ అధికారులు, జర్నలిస్టులు, ప్రజా సంఘాలపై పెరిగిన కక్షసాధింపుల గురించి చర్చించారు. వీటికి సంబంధించిన వివరణాత్మక ఆధారాలను ట్వీట్‌లో జత చేసినట్టు తెలిపారు.
In today’s press meet, I addressed key issues impacting our state and people:
Facts on Liquor Case – Uncovered a deep web of lies and cooked-up stories with complete factual data.
Red Book Files – Exposed vendetta politics and misuse of power to silence opposition.
Targeted… pic.twitter.com/b0cXzjvc7w— YS Jagan Mohan Reddy (@ysjagan) May 22, 2025
