
సాక్షి, తాడేపల్లి: ఏడాది పాలనలో అన్ని రంగాల్లో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ, ప్రశ్నించే గొంతులు నొక్కుతూ, యథేచ్ఛగా రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తోందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కూటమి ప్రభుత్వ అనైతిక పర్వాన్ని నిలదీశారు.
‘‘రాష్ట్రంలో చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక జరిగిన హత్యలు 390. హత్యలు, హత్యాయత్నాలు, దాడులకు గురైన వైఎస్సార్‌సీపీ, నాయకులు, కార్యకర్తలు 766 మంది. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు 2,466. జైలుకు వెళ్లిన వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు 500 మంది. అక్రమ కేసులు నమోదైన సోషల్ మీడియా యాక్టివిస్టులు 440 మంది.
..కేసులు నమోదై జైలుకు వెళ్లిన సోషల్ మీడియా యాక్టివిస్టులు 79 మంది. దాడులకు గురైన జర్నలిస్టులు 11 మంది. జర్నలిస్టులపై అక్రమ కేసులు 63. మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు 198. ప్రజాసంఘాల నాయకులపై అక్రమ కేసులు 73. జైలుకు వెళ్లిన ప్రజాసంఘాల నాయకులు 2. జైళ్లకు వెళ్లిన జర్నలిస్టులు 8 మంది’’ అని మీడియాకు వివరించారు.
‘‘టీడీపీ పాలనలో వేధింపులకు గురైన అధికారులు 199 మంది. వారిలో ఏఎస్పీలు 27, డీఎస్పీలు 42, సీఐలు 119 మంది. ఐపీఎస్‌లు డీజే ర్యాంకు అధికారి. పీఎస్‌ఆర్ అంజనేయులు, డీజే ర్యాంక్ దళిత అధికారి సునీల్ కుమార్, అడిషనల్ డీజీ ర్యాంకు అధికారి సంజయ్ ఐపీఎస్, సీనియర్ ఆఫీసర్, ఐజీ ర్యాంక్ కాంతిలాల్ రాణా, ఐజీ ర్యాంక్ ఆఫీసర్ విశాల్ గున్నీ, ఐజీ ర్యాంకు అధికారి రఘురామిరెడ్డి, రవిశంకర్ రెడ్డి, నిశాంత్ రెడ్డి ఐపీఎస్ లు, ఐపీఎస్ అధికారి పి.జాషువా, వేధింపులకు గురయ్యారు. మరో రిటైర్డ్ అధికారి విజయ్‌పాల్‌ను అక్రమంగా అరెస్టు చేశారు. పార్టీ ట్విట్టర్ హ్యాండిల్, నా వ్యక్తిగత ట్విట్టర్ హ్యాండిల్‌లో కూడా ఈ సమాచారాన్ని అప్ లోడ్ చేస్తాం’’ అని వైఎస్ జగన్ తెలిపారు.