
ఢిల్లీ: వక్ఫ్ చట్ట సవరణపై స్టే విధించాలన్న అంశంపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. గురువారం (మే22) ఈ పిటిషన్లపై బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది.
మూడు రోజుల పాటు జరిగిన ఈ వాదనలు ఆసక్తికరంగా సాగాయి. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, రాజీవ్ ధావన్, అభిషేక్ మను సింఘ్వి వాదించారు.
ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం వక్ఫ్ బిల్లు సవరణ చట్టాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలన్న విజ్ఞప్తిపై ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం తన ఉత్తర్వులను రిజర్వ్ చేసింది.
#BreakingNews | Supreme Court reserves its order for interim relief on a batch of pleas challenging the Constitutional validity of the Waqf (Amendment) Act, 2025.#WaqfAct #WaqfBoard #Waqf #SupremeCourt pic.twitter.com/icvCz361gx
— DD News (@DDNewslive) May 22, 2025