పహల్గాం ఉగ్రదాడిపై విచారణ.. పిటిషనర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం | Supreme Court Raps Pahalgam Petitioner | Sakshi
Sakshi News home page

పహల్గాం ఉగ్రదాడిపై విచారణ.. పిటిషనర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం

May 1 2025 1:36 PM | Updated on May 1 2025 3:39 PM

Supreme Court Raps Pahalgam Petitioner

ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడిపై న్యాయ విచారణ చేపట్టాలన్నా ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (PIL) సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్‌పై  ప్రతీకార చర్యలకు భారత సైనికులు సన్నద్ధమవుతున్నారు. ఈ సమయంలో భద్రతా బలగాల నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీయొద్దని సూచించింది. 

 

ఈ సందర్భంగా ఆ పిటిషన్‌ దాఖలు చేసిన పిటిషనర్‌పై సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు జస్టిస్‌ సూర్యకాంత్‌,జస్టిస్‌ కోటీశ్వర్‌ సింగ్‌ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఇది చాలా సున్నితమైన అంశం. ఈ సమయంలో భద్రతా బలగాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయొద్దు. దేశం పట్ల బాధ్యతాయుతమైన విధిని నిర్వహించండి. మేము దర్యాప్తు చేసే నిపుణులం కాదు. దేశంలో ప్రతి ఒక్కరు  చేయి చేయి కలిపి నడవాల్సిన తరుణమిది’ అంటూ పిటీషనర్‌పై అసహనం వ్యక్తం చేసింది.

అదే సమయంలో సొలిసిటర్ జనరల్ తుషార్‌ మెహతా సైతం పిటిషనర్‌ను హైకోర్టుకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వద్దని కోరారు. అనంతరం, సుప్రీంకోర్టు ఆదేశాలతో పిటిషనర్‌ తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.  

దేశం పట్ల మీకు బాధ్యత లేదా?
సుప్రీంకోర్టు జస్టిస్‌ సూర్యకాంత్‌,జస్టిస్‌ కోటీశ్వర్‌ సింగ్‌ ధర్మాసనం పిటిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి పిల్ దాఖలు చేసే ముందు బాధ్యతతో వ్యవహరించండి. మీకు దేశం పట్ల బాధ్యత ఉందా? అని ప్రశ్నించారు. అందుకు పిటిషనర్‌ మాట్లాడుతూ.. దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న కాశ్మీరీ విద్యార్థుల భద్రతపై ఆందోళనతో ఈ పిల్ దాఖలు చేసినట్లు తెలిపారు.  పహల్గాం దాడి తర్వాత కాశ్మీరీ విద్యార్థులపై దాడులు పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

కాశ్మీరీ విద్యార్థుల కోసం
అదే సమయంలో విద్యార్థులకు అండగా జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని ప్రస్తావించారు. పహల్గాం దాడి తర్వాత సీఎం ఒమర్ అబ్దుల్లా ఇతర రాష్ట్రాల్లో ఉన్న కాశ్మీరీ విద్యార్థుల రక్షణ దిశగా చర్యలు తీసుకున్నారని, జమ్మూ కశ్మీర్ మంత్రులను ఇతర రాష్ట్రాల మంత్రులతో సంప్రదింపులు జరపాలని ఆదేశించారనే విషయాన్ని గుర్తు చేశారు.

అయితే ఆ పిల్‌పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు విముఖత వ్యక్తం చేసింది. ఇది సరైన సమయం కాదు. ప్రతి పౌరుడు దేశానికి అండగా నిలుస్తున్న వేళలో ఇలాంటి పిల్‌లు దాఖలు చేయడం సరైన చర్య కాదు’ అని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.  

Advertisement
 
Advertisement
Advertisement