AI
-
ల్యాప్‌టాప్, ఏఐ.. వ్యాపారంలో విజయం: కియోసాకి
పెట్టుబడుల గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించే రాబర్ట్ కియోసాకి.. తాజాగా పెద్ద కంపెనీలు మాత్రమే విజయం సాధిస్తాయనే విషయంపై స్పందించారు. AI సహాయంతో ప్రపంచ స్థాయి వ్యాపారాన్ని ఎవరైనా నిర్మించగలరు అని పేర్కొన్నారు.ఈ కాలంలో పెద్ద కంపెనీలకు మాత్రమే విజయావకాశాలు ఉన్నాయనే భావన పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఒక సాధారణ వ్యక్తి కూడా తన ఇంటి వంటగదిలో కూర్చొని, కేవలం ల్యాప్‌టాప్, ఏఐ సహాయంతో ప్రపంచ స్థాయి వ్యాపారాన్ని నిర్మించగలడని కియోసాకి పేర్కొన్నారు.ఒకప్పుడు పెద్ద వ్యాపారం ప్రారంభించాలంటే భారీ పెట్టుబడి, ఉద్యోగులు, ఆఫీస్, మార్కెటింగ్ టీమ్, మౌలిక సదుపాయాలు అవసరమయ్యేవి. కాబట్టి వ్యాపారం అనేది ధనికులకు మాత్రమే లేదా పెద్ద సంస్థలకు మాత్రమే సాధ్యమని భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏఐ సాయంతో ఒక వ్యక్తి ఒంటరిగా.. చాలామంది చేసే పనులు చేసేస్తున్నాడు. పెద్ద పెద్ద ఆఫీసులు లేకపోయినా, ఇంట్లో నుంచే వ్యాపార నిర్ణయాలు తీసుకొని విజయాన్ని సాధించవచ్చు. AI సహాయంతో ఒక వ్యక్తి పెద్ద కంపెనీల మార్కెటింగ్ విభాగం కంటే ఎక్కువ కంటెంట్‌ను తయారు చేయగలడు. అలాగే తక్కువ సమయంలో ఎక్కువ మంది కస్టమర్లను చేరుకోగలడు. కస్టమర్లకు త్వరగా స్పందించగలడు. మార్కెట్లో వచ్చే మార్పులకు పెద్ద కంపెనీల కంటే వేగంగా.. అనుగుణంగా మారగలడని కియోసాకి అన్నారు.ఇదీ చదవండి: డబ్బును ఎలా కాపాడుకోవాలి?: కియోసాకి సలహాపెద్ద కంపెనీలకు డబ్బు, వనరులు ఎక్కువగా ఉంటాయి. కానీ చిన్న వ్యాపారులకు వేగం గొప్ప ఆయుధం ఉంది. ఈ రోజుల్లో వేగంగా ఆలోచించి, వేగంగా అమలు చేసే వారే గెలుస్తున్నారు. పెద్ద సంస్థలు ఒక నిర్ణయం తీసుకునేలోపు.. చిన్న వ్యాపారులు కొత్త అవకాశాలను కూడా అందిపుచ్చుకుంటున్నారు. ఇది కేవలం ఒక రంగానికి మాత్రమే పరిమితం కాదు. ఏ రంగంలో అయినా.. తెలివిగా ఆలోచిస్తే తప్పకుండా విజయం సొంతం అవుతుందని కియోసాకి చెబుతున్నారు. -
మేక్మైట్రిప్ కొత్త అప్డేట్.. వాయిస్‌తోనే బుకింగ్!
భారతదేశంలోని ప్రముఖ ఆన్లైన్ ట్రావెల్ సంస్థ మేక్మైట్రిప్ తన ఏఐ బేస్డ్ ట్రావెల్ అసిస్టెంట్ ‘మైరా’లో కొత్త అప్‌గ్రేడ్‌ను ప్రవేశపెట్టింది. ఈ అప్డేట్ ముఖ్య ఉద్దేశ్యం.. వినియోగదారుల బుకింగ్ ప్రక్రియను పూర్తిగా సులభతరం చేసి, సెర్చింగ్ నుంచి చెల్లింపు వరకు మొత్తం ఒకే ఇంటర్ఫేస్లో పూర్తి చేయగలిగేలా చేయడం. అవసరమైతే వాయిస్ ఆధారిత విధానంలో కూడా ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు.'మైరా 2.0' ఇప్పుడు సాధారణ సెర్చ్‌లను మాత్రమే కాకుండా, చాలా అవసరాలకు ఉపయోగపడుతుంది. క్లిష్టమైన ప్రయాణ అభ్యర్థనలను కూడా అర్థం చేసుకుని పరిష్కారం చూపుతుంది. ఉదాహరణకు.. కుటుంబ ప్రయాణాల కోసం ప్రత్యేక అవసరాలు ఉన్న హోటల్స్, వృద్ధుల కోసం సౌకర్యాలు లేదా వీసా సంబంధిత సమాచారం వంటి అంశాలను ఒకే చోట అందిస్తుంది. దీంతో వినియోగదారులు అనేక వెబ్సైట్లను పరిశీలించాల్సిన అవసరం లేకుండా, ఒకే వేదికపై పూర్తి సమాచారం పొందగలుగుతారు.ఈ కొత్త వెర్షన్లో.. వాయిస్ సపోర్ట్ కూడా ఉంది. తెలుగు సహా ఎనిమిది భాషల్లో.. వాయిస్ ద్వారా సెర్చ్, ఎంపికలు, బుకింగ్ వంటివి పూర్తి చేయవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వాయిస్ వినియోగం ఎక్కువగా ఉండటం వల్ల, ఈ ఫీచర్ మరింత ఉపయోగకరంగా ఉంటుంది. అంతే కాకుండా.. వినియోగదారులు తమ పాస్‌పోర్ట్ లేదా ఇతర డాక్యుమెంట్లను అప్లోడ్ చేస్తే, వాటి వివరాలను ఆటోమేటిక్‌గా గుర్తించి బుకింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తుంది.మరో ముఖ్యమైన డెవలప్మెంట్ ఏమిటంటే.. చెల్లింపు ప్రక్రియను కూడా సంభాషణలోనే పూర్తి చేయగలగడం. వినియోగదారులు సెర్చ్ చేయడం, ఎంపిక చేయడం, కన్ఫర్మ్ చేయడం,పేమెంట్ చేయడం వరకు అన్ని దశలను ఒకే ఇంటర్ఫేస్లో పూర్తి చేయవచ్చు. అదేవిధంగా, బుకింగ్ మధ్యలో కూడా వినియోగదారులు ప్రశ్నలు అడిగి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు, దీంతో ప్రక్రియ మధ్యలో ఆగిపోకుండా కొనసాగుతుంది. -
2030 నాటికి భారత ఆర్థిక వ్యవస్థకు ఏఐ జోష్
భారతదేశం మరో పారిశ్రామిక విప్లవానికి వేదిక కాబోతోంది. 2030 నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత దేశ ఆర్థిక వ్యవస్థకు ఏకంగా 500 బిలియన్ డాలర్లకు పైగా అదనపు విలువను జోడించనుందని తాజా నివేదిక వెల్లడించింది. ఐబీఎం ఇన్స్టిట్యూట్ ఫర్ బిజినెస్ వాల్యూ, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన ‘ఇండియాఏఐ’ సంయుక్తంగా రూపొందించిన ‘ప్రామిస్ టు పవర్: హౌ ఏఐ ఈజ్ రిడిఫైనింగ్ ఇండియా ఎకనామిక్ ఫ్యూచర్’ అనే నివేదికలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.ఆశయం గొప్పదే.. కానీ..భారతదేశం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఏఐ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని నివేదిక ఆశాభావం వ్యక్తం చేసింది. సర్వేలో పాల్గొన్న 73% మంది వ్యాపార దిగ్గజాలు 2030 నాటికి భారత్ ప్రపంచ ఏఐ లీడర్‌గా అవతరిస్తుందని నమ్ముతున్నారు. ఐదుగురు వ్యాపారవేత్తలలో నలుగురు ఏఐ పెట్టుబడులు నేరుగా దేశ జీడీపీ వృద్ధిని ప్రభావితం చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు.అయితే, వాస్తవ పరిస్థితులు కొంత ఆందోళనకరంగా ఉన్నాయి. సర్వే చేసిన సంస్థల్లో 72% సంస్థలు అంతర్జాతీయ పోటీతో పోలిస్తే తాము ఏఐ అమలులో వెనుకబడి ఉన్నామని అంగీకరించాయి. ఆశయానికి, ఆచరణకు మధ్య ఉన్న ఈ అంతరాన్ని తగ్గించడమే ఇప్పుడు దేశం ముందున్న ప్రధాన సవాలు.35 కోట్ల మంది నిపుణులు అవసరంఈ నివేదిక ప్రధానంగా నైపుణ్యాల కొరతను ఎత్తిచూపింది. ‘ప్రస్తుతం కేవలం 30% మంది ఉద్యోగులకు మాత్రమే ఏఐ పరిజ్ఞానం ఉంది. 2030 నాటికి ఈ అవసరాలు తీరాలంటే దేశవ్యాప్తంగా 350 మిలియన్ల (35 కోట్లు) ఏఐ నిపుణులు అవసరమవుతారు’ అని అంచనా వేసింది. కేవలం సాంకేతికత ఉండటం ముఖ్యం కాదు. ఆ సాంకేతికతను నడిపించే నైపుణ్యం గల మానవ వనరులు ఉండటమే అసలైన విజయమని నివేదిక పేర్కొంది.డేటా సార్వభౌమాధికారండేటా భద్రత, నియంత్రణ విషయంలో భారతీయ కంపెనీలు కఠినంగా ఉన్నాయి. 74% మంది ఎగ్జిక్యూటివ్‌లు డేటాపై పూర్తి నియంత్రణ ఉండాలని కోరుకుంటున్నారు. ఖర్చును తగ్గించుకుంటూనే పనితీరును మెరుగుపరచుకోవడానికి 10 మందిలో ఏడుగురు హైబ్రిడ్ క్లౌడ్ నమూనా వైపు మొగ్గు చూపుతున్నారు. స్వదేశీ క్లౌడ్ మౌలిక సదుపాయాలు లేకపోవడం (77%), డేటా నాణ్యత సరిగ్గా లేకపోవడం (57%) ఏఐ విస్తరణకు ప్రధాన అడ్డంకులుగా మారాయి.భారతదేశం కేవలం ఏఐ వినియోగదారుగా మాత్రమే కాకుండా సృష్టికర్తగా ఎదగాలంటే ‘ఇండియాఏఐ ఫ్యూచర్ స్కిల్స్’ వంటి కార్యక్రమాలు క్షేత్రస్థాయికి వెళ్లాలి. ముఖ్యంగా టైర్ 2, టైర్ 3 నగరాల్లో ఏఐ ల్యాబ్‌ల ఏర్పాటు ద్వారా మారుమూల ప్రాంతాల్లోని ప్రతిభను ఒడిసిపట్టాలి. అప్పుడే 500 బిలియన్ డాలర్ల కల సాకారమవుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు సమన్వయంతో పనిచేసి విప్లవాత్మక మార్పులు తెస్తేనే ఈ ఏఐ స్వప్నం సాకారం అవుతుందంటున్నారు.ఇదీ చదవండి: బంగారం షాక్.. దిమ్మతిరిగేలా రేట్లు పెంపు -
ఇరాన్‌కు ట్రంప్ ‘ఏఐ వార్నింగ్’..
వాషింగ్టన్: మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు మరోసారి యుద్ధ మేఘాలను కమ్ముకొనేలా చేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఇరాన్‌ను ఉద్దేశిస్తూ పోస్ట్ చేసిన ఏఐ (కృత్రిమ మేధ) చిత్రాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఇరాన్ యుద్ధ విమానాలపై అమెరికా దళాలు విరుచుకుపడుతున్నట్లు ఉన్న ఈ కాల్పనిక చిత్రాలు మళ్లీ యుద్ధం తప్పదా? అన్న సంకేతాలను పంపుతున్నాయి.‘బింగ్.. బింగ్.. గాన్!’ట్రంప్ షేర్ చేసిన ఒక చిత్రంలో.. అమెరికా యుద్ధనౌక హై-పవర్ లేజర్ ఆయుధంతో ఇరాన్ జెండా ఉన్న విమానాన్ని గాలిలోనే పేల్చివేస్తున్నట్లు ఉంది. దీనికి "లేజర్స్: బింగ్, బింగ్, గాన్!!" అనే శీర్షికను ఆయన జోడించారు. మరో చిత్రంలో ఇరాన్‌కు చెందిన 'ఫాస్ట్ బోట్ల' సమూహంపై అమెరికా డ్రోన్లు బాంబుల వర్షం కురిపిస్తున్నట్లు చిత్రీకరించారు. దీనికి "బై బై, ఫాస్ట్ బోట్స్" అని క్యాప్షన్ ఇచ్చారు.‘లైఫ్ సపోర్ట్’పై కాల్పుల విరమణ!గల్ఫ్ రీజియన్‌లో గత నెల రోజులుగా కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందం ఇక ఎంతో కాలం నిలవదని ట్రంప్ పరోక్షంగా హెచ్చరించారు. చర్చల పునరుద్ధరణ కోసం ఇరాన్ పంపిన తాజా ప్రతిపాదనలను ఆయన పూర్తిగా తిరస్కరించారు. "ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం ‘లైఫ్ సపోర్ట్’ మీద ఉంది. తన ప్రియమైన వారు బతికే అవకాశం కేవలం ఒక శాతమే ఉందని డాక్టర్ చెప్పే పరిస్థితిలో ఆ ఒప్పందం ఉంది" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.యుద్ధానికే మొగ్గు?హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మాటిమాటికీ మూసివేయడం, చర్చల పట్ల టెహ్రాన్ మొండి వైఖరితో ట్రంప్ అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌పై అమెరికా 'పూర్తి విజయం' సాధిస్తుందని ఆయన నొక్కి చెప్పారు. ఇరాన్‌పై తిరిగి యుద్ధాన్ని ప్రారంభించే అంశాన్ని ట్రంప్ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ సీఎన్ఎన్ (CNN) కథనాలు పేర్కొంటున్నాయి. అమెరికా శాంతి ప్రతిపాదనలను ఇరాన్ తోసిపుచ్చిన మరుసటి రోజే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. -
ఇక మూడింది మిడిల్ మేనేజర్లకే.. సీఈఓ వార్నింగ్
కృత్రిమ మేధస్సు (AI) విప్లవం కార్పొరేట్ ప్రపంచంలో పెను మార్పులకు నాంది పలుకుతోంది. ముఖ్యంగా కేవలం పర్యవేక్షణకే పరిమితమయ్యే "ప్యూర్ పీపుల్ మేనేజర్ల" మనుగడ ఇకపై కష్టమేనని ఎయిర్బీఎన్బీబి (Airbnb) సీఈఓ బ్రియాన్ చెస్కీ హెచ్చరించారు. పనిలో ప్రత్యక్షంగా భాగస్వాములు కాకుండా, కేవలం సిబ్బందిని మేనేజ్ చేసే పాత పద్ధతులకు కాలం చెల్లిందని ఆయన అభిప్రాయపడ్డారు.పని చేయని వారికి చోటు లేదు!ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన చెస్కీ, ఏఐ యుగంలో నెట్టుకురావాలంటే మేనేజర్లు తమ పనితీరును మార్చుకోవాలని సూచించారు. ఇకపై మేనేజర్లు కేవలం మీటింగ్‌లు, పర్ఫార్మెన్స్ రివ్యూలకే పరిమితం కాకూడదు. ప్రాజెక్టుల లోతుపాతులను అర్థం చేసుకుంటూ టీమ్‌తో కలిసి పని చేయాలి. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా అప్డేట్ అవ్వని వారు, ఏఐ వినియోగాన్ని వ్యతిరేకించే వారు కెరీర్ రేసులో వెనుకబడిపోతారని ఆయన స్పష్టం చేశారు.ఎయిర్‌బీఎన్‌బీలో 60% కోడింగ్ ‘ఏఐ’తోనే..ఎయిర్‌బీఎన్‌బీ ఇప్పటికే ఏఐ వినియోగంలో ముందుంది. కంపెనీలో దాదాపు 60% కోడింగ్ ఇప్పుడు ఏఐ ద్వారానే జరుగుతోందని, దీనివల్ల ఉత్పత్తులను వేగంగా మార్కెట్లోకి తీసుకురావడమే కాకుండా, తక్కువ మందితో సమర్థవంతంగా పనిచేయడం సాధ్యమవుతోందని కంపెనీ వెల్లడించింది.తగ్గుతున్న ‘మేనేజ్మెంట్’ పొరలుఒక్క ఎయిర్‌బీఎన్‌బీ మాత్రమే కాదు, అనేక దిగ్గజ టెక్ సంస్థలు ఇప్పుడు "ఫ్లాటర్ స్ట్రక్చర్" (తక్కువ మేనేజ్మెంట్ స్థాయిలు) వైపు మొగ్గు చూపుతున్నాయి.మెటా ఇప్పటికే మేనేజ్మెంట్ పొరలను తొలగించి నిర్ణయ ప్రక్రియను వేగవంతం చేసింది. బ్లాక్ సీఈఓ జాక్ డోర్సే కూడా శాశ్వత మిడిల్ మేనేజ్మెంట్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. కాయిన్‌బేస్ సీఈఓ బ్రియాన్ ఆర్మ్‌స్ట్రాంగ్ సైతం "ప్యూర్ మేనేజర్" పాత్రలను తొలగిస్తున్నట్లు ప్రకటించారు.వస్తున్నది ‘ప్లేయర్-కోచ్’ల కాలంనివేదికలు, షెడ్యూలింగ్, పనితీరును ట్రాక్ చేయడం వంటి పనులను ఏఐ సులభంగా చేసేస్తోంది. కాబట్టి, కేవలం ఆర్డర్లు వేసే మేనేజర్ల కంటే, సాంకేతిక పరిజ్ఞానం ఉండి ప్రాజెక్టులో నేరుగా పాల్గొనే "ప్లేయర్-కోచ్" తరహా నాయకులకే భవిష్యత్తులో డిమాండ్ ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.జూనియర్ల విషయంలో జాగ్రత్త!అయితే, ఏఐ మోజులో పడి కొత్త గ్రాడ్యుయేట్లు, ఇంటర్న్‌ల నియామకాలను ఆపవద్దని చెస్కీ హెచ్చరించారు. ఎంట్రీ లెవల్ ఉద్యోగాలను పూర్తిగా తొలగిస్తే, భవిష్యత్తులో కంపెనీలను నడిపించే నాయకులు తయారుకారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐని ఉత్పాదకత పెంచుకోవడానికి వాడుకోవాలి తప్ప, నైపుణ్యం కలిగిన మానవ వనరుల పైప్‌లైన్‌ను దెబ్బతీసేలా ఉండకూడదని ఆయన సూచించారు. -
ఆ అబద్ధమే ఇంకా చెబుతున్నారు.. కియోసాకి ఆందోళన
ఇన్వెస్టర్ గురూ, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) తాజాగా చేసిన ఫేస్బుక్ పోస్టులో ఉద్యోగ భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. “స్కూల్‌కి వెళ్లి, ఉద్యోగం సంపాదిస్తే భద్రత ఉంటుంది” అనే అత్యంత ఖరీదైన అబద్ధాన్ని ఇప్పటికీ 2026లోనూ తల్లిదండ్రులు తమ పిల్లలకు చెబుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.కియోసాకి పేర్కొన్న వివరాల ప్రకారం, 2025 సంవత్సరం ఉద్యోగుల పాలిట అత్యంత కఠినమైన కాలంగా మారింది. ఆ ఒక్క సంవత్సరంలోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు 12 లక్షల ఉద్యోగాల కోతలు నమోదయ్యాయని, ఇది 2020 తర్వాత అత్యధికమని ఆయన తెలిపారు. అలాగే 2026 జనవరిలోనే 1,08,435 ఉద్యోగాలు ఊడిపోయాయనిఇ చెప్పారు.టెక్నాలజీ రంగంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందని కియోసాకి పేర్కొన్నారు. 2026లో ప్రతిరోజూ సగటున 1,003 మంది టెక్ ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోతున్నారన్నారు. అమెజాన్ జనవరిలో 16 వేల ఉద్యోగాలను తొలగించగా, మెటా మే నెలలో మరో 8 వేల ఉద్యోగాల కోతకు సిద్ధమవుతోందని చెప్పారు. చెవ్రాన్ 8 వేల మందిని, డెల్ 11 వేల మందిని, సిటీగ్రూప్ 20 వేల మందిని తొలగించిందని, స్పిరిట్ ఎయిర్‌లైన్స్ మూతపడటంతో 17 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారని ఆయన వివరించారు.ఈ పరిస్థితులకు కృత్రిమ మేధస్సు (AI) ప్రధాన కారణంగా మారుతోందని కియోసాకి అభిప్రాయపడ్డారు. ఒక్క 2025లోనే ఏఐ కారణంగా అమెరికాలో 55 వేల ఉద్యోగాలు పోయాయని, 2026 ఏప్రిల్‌లో జరిగిన ఉద్యోగ కోతల్లో 26 శాతం ఏఐ కారణంగానే జరిగాయని ఆయన పేర్కొన్నారు.“ఇవేవీ విఫలమైన కంపెనీలు కావు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సంస్థలు. అయినా అత్యంత చదువుకున్న, నైపుణ్యం కలిగిన ఉద్యోగులే తొలగింపులకు గురవుతున్నారు” అని కియోసాకి వ్యాఖ్యానించారు. ఉద్యోగ భద్రత అనేది అసలు ఎప్పుడూ నిజం కాదని, ఉద్యోగంపై మాత్రమే ఆధారపడటం ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు.తన తండ్రి ఉదాహరణను ప్రస్తావిస్తూ, “నా తండ్రి పీహెచ్డీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగి. ఒక్కరోజు కూడా పని మానలేదు. అయినా చివరికి అప్పులతోనే మరణించారు” అని ఆయన అన్నారు. విద్యాసంస్థలు మంచి ఉద్యోగులుగా తయారు చేస్తాయని, కానీ డబ్బు ఎలా పనిచేస్తుందో మాత్రం నేర్పవని విమర్శించారు. డబ్బు వ్యవస్థపై మాట్లాడుతూ, “సేవింగ్స్‌లో డబ్బు ఉంచడం వల్ల ద్రవ్యోల్బణం నెమ్మదిగా దాన్ని తినేస్తుంది. ఉద్యోగుల ఆదాయం ఆగిపోయినప్పుడు వారికి ఆదాయం ఇచ్చే ఆస్తులు లేకపోవడమే అసలు సమస్య” అని ఆయన తెలిపారు.తన చిన్నప్పుడే “రేపు ఉద్యోగం పోతే నీ ఆస్తుల ద్వారా ఎంతకాలం జీవించగలవు?” అని తన ‘రిచ్ డ్యాడ్’ అడిగిన ప్రశ్నను గుర్తుచేసుకున్న కియోసాకి, ఉద్యోగ భద్రత గురించి ఆలోచించే వారికంటే, “నేను ఏ ఆస్తిని నిర్మిస్తున్నాను?” అని ఆలోచించే వారే భవిష్యత్తులో నిలబడతారని పేర్కొన్నారు.“ప్రపంచం మారిపోయింది. కానీ పాత సలహాలు మాత్రం మారలేదు. ఏఐ విప్లవం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది” అని కియోసాకి తన పోస్టులో హెచ్చరించారు. -
'మెట్ గాలా'కి ఒకవేళ తెలుగు హీరోలు వెళ్తే? (ఫొటోలు)
-
బెల్స్ పాల్సీ వ్యాధి బారిన టెకీ..! కట్‌చేస్తే..
ఒక్కోసారి ప్రమాదవశాత్తు అనారోగ్యం బారిన పడుతుంటాం. అయితే ఆ సయమంలో మనం సానుకూల దృక్పథంతో స్పందిస్తే అద్భుతాలు చేయొచ్చని ఈ టెకీ నిరూపించాడు. కొందరు ఏ వ్యాధి అయినా వచ్చింది అనగానే దబాలున కుంగిపోతుంటారు. అలా కాకుండా నాకే ఈ వ్యాధి ఎందుకు వచ్చింది అనే నైరాశ్యం కంటే..తనలాంటి వాళ్లుకు ఉపశమనం ఏంటి అనే ఆలోచన తళుక్కుమంటే..కచ్చితంగా హీరోగా, ప్రత్యేకమైన వ్యక్తిగా నిలుస్తాం అనేందుకు ఈ యువ టెకీనే ఉదాహరణ. అసలేం జరిగిందంటే..పీసెస్ AIలో సీనియర్ డెవలపర్ అడ్వకేట్‌గా పనిచేస్తున్న అలీ ముస్తఫా సింగపూర్ ఎంతో ఆనందంగా లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. ఆ క్రమంలో అనుకోకుండా ముఖ పక్షవాతానికి కారణమయ్యే బెల్స్ పాల్సీ అనే వ్యాధి బారినపడ్డారు. దాంతో అతడు ముఖం కుడివైపు మొత్తం కదపలేని పరిస్థితి ఎదురైంది. బొంబాయికి తిరిగి వచ్చిన వెంటనే ఈ పరిస్థితి ఎదుర్కొంది. దాంతో హుటాహుటినా ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ముఖంలోని ఒక వైపు కండరాలలో అకస్మాత్తుగా బలహీనతను కలిగించే బెల్స్ పాల్సీ అనే వ్యాధి బారినపడ్డట్లు వైద్యులు గుర్తించారు. ఈ పరిస్థితి కొన్ని నెలల్లోనే మెరుగుపడుతుందని చెప్పారు వైద్యులు. అందుకోసం కండరాల బలం కోసం ముఖ వ్యాయామాలు, ఫిజికల్ థెరపీ అవసరం అని సూచించారు కూడా. అయితే అక్కడితో ఆగిపోలేదు అలీ. ఈ సమస్యకు తన సాంకేతిక సామర్థ్యాన్ని జోడించి ఏఐ ఫేస్ ట్రాకింగ్ మిర్రర్ యాప్‌ను రూపొందించారు. ఇది ముఖ వ్యాయామాల మార్గనిర్దేశం తోపాటు పరిస్థితి ఎంతవరకు మెరుగ్గా ఉందనేది ట్రాక్ చేస్తుంది. తాను ఈ యాప్‌ను OpenAI ఏజెంట్ కోడెక్స్ తోపాటు ఆంత్రోపిక్ క్లాడ్ని ఉపయోగించినట్లు తెలిపారు. యాప్ ఎలా పనిచేస్తుందో వివరిస్తూ..ఒక వీడియోని కూడా పంచుకున్నారు. ఆ వీడియోలో అతని ముఖ వ్యాయామాలను విశ్లేషించి ఫిజియోథెరపిస్ట్‌కు పంపుతుంది. అంతేగాదు ప్రతి వ్యాయామాన్ని రికార్డ్ చేయడానికి, అలాగే ఫిజియో వ్యాయామాలను సమీక్షించి ఫీడ్‌బ్యాక్ అందించడానికి వీలుగా ఒక సమగ్ర నివేదికను కూడా అందిస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే..వ్యాయామం చేసిన ప్రతిసారీ, యాప్ సెషన్ వ్యవధిని రికార్డ్ చేస్తుంది, అలాగే ముఖ కదలికలు ఎంత వరకు మెరుగ్గా మారిందో అంచనా వేస్తుంది. నెటిజన్లు అతని చొరవును ప్రశంసించడమే గాక, కొన్ని ఆఫర్లు కూడా అందించారు. ఇక ఓపెన్ఏఐ ఎగ్జిక్యూటివ్ వైభవ్ శ్రీవాస్తవ్ ఆలీని మరిన్ని ప్రయోగాలు చేయడానికి వీలుగా ChatGPT సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తానని ఆఫర్ చేశారు. అలాగే ఇలాంటి మరెన్నో వినూత్న ఆవిష్కరణలు చేయాలంటూ ప్రోత్సహించారు కూడా. Last week, I hit rock bottom. I was diagnosed with Bell’s Palsy, and my right face got paralysed;I honestly wondered how I was going to get through it!I vibe-coded my way out and built an AI face tracking app that guides my facial exercises, measures facial symmetry in real… pic.twitter.com/oFN8wJ8vTR— Ali Mustufa (@ialimustufa) May 6, 2026 (చదవండి: పెళ్లికి ముందు ఆ వైద్య పరీక్ష తప్పనిసరి..! లేదంటే..) -
500 మందిని తొలగించిన టెక్ కంపెనీ
సాంకేతిక ప్రపంచంలో కృత్రిమ మేధ (ఏఐ) సృష్టిస్తున్న ప్రకంపనలు మరోసారి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రముఖ బిజినెస్ సాఫ్ట్వేర్ సంస్థ ‘ఫ్రెష్‌వర్క్స్’ తాజాగా తన ఉద్యోగుల్లో 11 శాతం మందిని, అంటే దాదాపు 500 మందిని తొలగిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో ఉద్యోగాల కోత కొనసాగుతున్న తరుణంలో తాజా నిర్ణయం పరిశ్రమలో చర్చనీయాంశమైంది.ఎందుకు ఈ నిర్ణయం?ఏఐ రంగంలో చోటుచేసుకుంటున్న వేగవంతమైన మార్పులకు అనుగుణంగా తమ వ్యూహాలను మార్చుకునే క్రమంలోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. దీనిపై ఫ్రెష్‌వర్క్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) డెన్నిస్ వుడ్‌సైడ్ స్పష్టతనిచ్చారు. ‘మా కోడింగ్ ప్రక్రియలో ఇప్పటికే సగానికి పైగా ఏఐ ద్వారానే జరుగుతోంది. ఆటోమేషన్ వల్ల సాంకేతిక విభాగాల్లోని సాధారణ పనులు గణనీయంగా తగ్గాయి. ఈ మార్పులను సమర్థవంతంగా నిర్వహించడానికి లేఆఫ్స్ అవసరం ఏర్పడింది’ అని ఆయన వివరించారు.పునర్నిర్మాణ వ్యూహంఈ తొలగింపుల వల్ల కంపెనీపై సుమారు 8 మిలియన్ డాలర్ల భారం పడనుందని అంచనా. అయితే, ఈ పొదుపు ద్వారా వచ్చిన నిధులను కంపెనీ తన ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అయిన ‘ఫ్రెష్సర్వీస్’ వంటి వ్యాపార విభాగాల్లో తిరిగి పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించింది. ఆటోమేషన్ ద్వారా కార్యకలాపాలను మరింత వేగవంతం చేయడం దీని ముఖ్య ఉద్దేశం.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన -
ఉద్యోగాలను మింగేస్తుందా? సృష్టిస్తుందా?
ప్రస్తుత డిజిటల్ యుగంలో కృత్రిమ మేధ(ఏఐ)పై జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. ఒకవైపు టెక్నాలజీ వేగంగా విస్తరిస్తుంటే, మరోవైపు సామాన్యుల నుంచి నిపుణుల వరకు అందరిలోనూ ఒకటే ఆందోళన... ‘ఏఐ వల్ల మన ఉద్యోగాలు పోతాయా?’. ఈ సందేహాలకు చెక్ పెడుతూ ప్రపంచ అగ్రగామి టెక్ దిగ్గజం ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. ‘ఏఐ ఉద్యోగాలను తొలగించదు, బదులుగా కొత్త ఉపాధి మార్గాలను సృష్టిస్తుంది’ అని ఆయన స్పష్టం చేశారు.ఉద్యోగాల భయంపై హువాంగ్ స్పందనమిల్కెన్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న హువాంగ్ ఏఐ వల్ల భారీగా ఉద్యోగ నష్టాలు సంభవిస్తాయనే వాదనలను కొట్టిపారేశారు. ఈ తరహా భయాందోళనలు కేవలం అపోహలని, ఇవి ప్రజలను సాంకేతికతకు దూరంగా ఉంచుతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.‘ఏఐ కేవలం సాఫ్ట్వేర్ మాత్రమే కాదు, అదొక పారిశ్రామిక విప్లవానికి నాంది. డేటా సెంటర్లు, అధునాతన హార్డ్‌వేర్, సహాయక ఎకోసిస్టమ్‌ల నిర్మాణం కోసం వేల సంఖ్యలో మానవ వనరుల అవసరం ఉంది. ఆటోమేషన్ అనేది మొత్తం ఉద్యోగాలను తుడిచిపెట్టదు. కేవలం పనితీరులోని నిర్దిష్టమైన, పునరావృతమయ్యే పనులను మాత్రమే మారుస్తుంది. అంటే, మనిషి చేసే మొత్తం పనిలో కొంత భాగాన్ని ఏఐ సాయంతో సులభతరం చేసుకునే అవకాశం ఉంటుందే తప్ప, మనిషి స్థానాన్ని పూర్తిగా భర్తీ చేయదు’ అని చెప్పారు.ఆందోళనలు ఎందుకు? వాస్తవాలేంటి?హువాంగ్ ఆశావాద దృక్పథాన్ని వ్యక్తపరిచినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక వేత్తలు మాత్రం హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. వివిధ కన్సల్టింగ్ సంస్థల అంచనాల ప్రకారం, రాబోయే ఐదేళ్లలో దాదాపు 15 శాతం ఉద్యోగ బాధ్యతల్లో మార్పులు లేదా కొన్ని పాత తరహా పాత్రలు కనుమరుగయ్యే అవకాశం ఉందని గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. వేగవంతమైన ఏఐ స్వీకరణ వల్ల ఆర్థిక అసమానతలు పెరిగే ప్రమాదం ఉందని, సరైన శిక్షణ లేని వారు ఉపాధి కోల్పోయే అవకాశం ఉందనేది నిపుణుల ప్రధాన ఆందోళన.భయం వద్దు.. నైపుణ్యం ముద్దు!ప్రతి సాంకేతిక మార్పు వెనుక కొంత అనిశ్చితి ఉండటం సహజం. అయితే, టెక్ పరిశ్రమ సృష్టిస్తున్న హైప్‌కు భయపడి పురోగతిని ఆపడం సరికాదని హువాంగ్ సూచిస్తున్నారు. ఏఐని ఒక ముప్పుగా చూడటం కంటే.. మన సామర్థ్యాన్ని పెంచే సాధనంగా చూడాలి అనేది ఆయన మాటల సారాంశం. మొత్తానికి ఏఐ ప్రభావం వల్ల ఉద్యోగ స్వరూపం మారుతుందనేది వాస్తవం. అయితే, కాలంతో పాటు కొత్త నైపుణ్యాలను సంతరించుకునే వారికి ఏఐ ఒక వరం కానుంది. సాంకేతికత పట్ల భయాన్ని వీడి దానిని వాడుకోవడంలోనే భవిష్యత్తు ఉందనేది స్పష్టమవుతోంది.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన -
సెల్ఫీ విత్ సీఎం విజయ్.. సోషల్ మీడియా షేక్ (ఫొటోలు)
-
డిగ్రీ ఉంటే సరిపోదు.. స్కిల్ ఉంటేనే జాబ్
ముంబై: నేటి తరం విద్యార్థుల వేతన అంచనాలకు, మార్కెట్లోని వాస్తవ పరిస్థితులకు మధ్య భారీ వ్యత్యాసం నెలకొంది. పట్టభద్రులవుతున్న విద్యార్థుల్లో దాదాపు 73 శాతం మంది రూ.5 లక్షలకు మించి వార్షిక వేతనాన్ని (ఎల్పీఐ) ఆశిస్తుండగా.. కేవలం 40 శాతం మంది మాత్రమే ఆ లక్ష్యాన్ని సాధిస్తున్నారని ‘అన్‌స్టాప్ టాలెంట్ రిపోర్ట్ 2026’ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 37 వేలకు పైగా విద్యార్థులు, 500 మందికి పైగా హెచ్ఆర్ ప్రతినిధుల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.డిగ్రీ ‘ప్రీమియం’ కనుమరుగు: ఒకప్పుడు పెద్ద కోర్సులు చదివిన వారికి మాత్రమే దక్కే ‘అదనపు వేతన ప్రాధాన్యం’ క్రమంగా తగ్గుతోంది. ఎంబీఏ పూర్తి చేసిన వారిలో 30 శాతం మంది రూ. 10 లక్షల కంటే తక్కువ వార్షిక వేతనం పొందుతుండగా, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లలో 39 శాతం మంది రూ. 7 లక్షల లోపు వేతనాలకే పరిమితమవుతున్నారు. దీనిని బట్టి వివిధ కోర్సుల మధ్య ఉన్న ‘వేతన అంతరం’ తగ్గుముఖం పడుతోందని స్పష్టమవుతోంది.విద్యార్థుల ఆలోచనా ధోరణిలో మార్పు: పెరుగుతున్న పోటీ, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు సైతం వాస్తవిక దృక్పథంతో ఆలోచిస్తున్నారు. మెరుగైన అభ్యాస అవకాశాలు, కెరీర్ వృద్ధి ఉంటే 90 శాతం మందికి పైగా విద్యార్థులు తక్కువ జీతానికైనా పనిచేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అలాగే 82 శాతం మంది విద్యార్థులు తక్షణ ఆర్థిక స్థిరత్వం కోసం అదనపు ప్రయోజనాల (పెర్క్స్) కంటే చేతికి వచ్చే జీతానికే (ఇన్–హ్యాండ్ శాలరీ) ప్రాధాన్యత ఇస్తున్నారు.నైపుణ్యమే అసలైన ‘గేట్‌కీపర్’: ప్రస్తుత పోటీ ప్రపంచంలో నియామక ప్రమాణాలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు కేవలం డిగ్రీ సర్టిఫికేట్లు చూసి ఉద్యోగాలిచ్చిన కంపెనీలు, ఇప్పుడు అభ్యర్థుల్లోని నైపుణ్యాలు (స్కిల్స్), కృత్రిమ మేధ (ఏఐ) సామర్థ్యాన్నే ప్రాతిపదికగా తీసుకుంటున్నాయి. సుమారు 64 శాతం మంది హెచ్ఆర్ ప్రతినిధులు ఏఐ/ఎంఎల్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి సాంకేతికతలపై పట్టున్న వారినే ‘ప్రీమియం టాలెంట్’గా గుర్తిస్తున్నారు. భవిష్యత్తులో ప్రాబ్లమ్ సాల్వింగ్ (49%), ఏఐ పరిజ్ఞానం (39%), ఎమోషనల్ ఇంటెలిజెన్స్ (30%) వంటి సామర్థ్యాలు ఉన్నవారికే అత్యధిక డిమాండ్ ఉంటుందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.ఎంపిక ప్రమాణాలు మారాయి: భారత ఉద్యోగ విపణిలో అవకాశాలు తగ్గలేదు, కానీ ఒక నిర్మాణాత్మక మార్పు జరుగుతోంది. నైపుణ్యం, ఏఐ పరిజ్ఞానం ఉన్నవారికి మాత్రమే అవకాశాలు దక్కుతున్నాయి. బలమైన పునాదులతో పాటు ప్రాక్టికల్ నైపుణ్యాలు, ఏఐ ప్రావీణ్యం కలిగిన అభ్యర్థులే ఈ పోటీలో నిలబడతారు’’ అని అన్‌స్టాప్ వ్యవస్థాపకుడు, సీఈఓ అంకిత్ అగర్వాల్ విశ్లేషించారు. -
4 వేలకు పైగా టెకీలను తొలగించనున్న కాగ్నిజెంట్
ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ కార్మికుల దినోత్సవం రోజు చేదు వార్త తెలిపింది. తన ఉద్యోగులలో సుమారు 1శాతం మందిని తొలగించాలని యోచిస్తోంది. దీనివల్ల 4,000కు పైగా ఉద్యోగాలపై ప్రభావం పడుతుంది. AI , డిజిటల్ ఆఫరింగ్‌లపై ఖర్చును పెంచుతూనే, కంపెనీ తన శ్రామిక శక్తిని పునర్నిర్మించాలని చూస్తున్న తరుణంలో ప్రాజెక్ట్ లీప్ ద్వారా ప్రస్తుత పునర్నిర్మాణం జరుగుతోంది.లైవ్ మింట్ నివేదిక ప్రకారం, తగ్గుతున్న డిమాండ్, ఆటోమేషన్ వైపు మొగ్గు చూపడం వృద్ధిపై భారం మోపుతున్న తరుణంలో ఈ నిర్ణయం వెలుడుతుంది. ముఖ్యంగా కంపెనీ తన పూర్తి-సంవత్సర అంచనాలను తగ్గించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది.కంపెనీ ప్రకటించిన 'ప్రాజెక్ట్ లీప్'లో భాగంగా ఏఐ (AI), సమీకృత డిజిటల్ సేవలు మరియు ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధిపై అధిక పెట్టుబడి పెట్టనున్నారు. ఈ కార్యక్రమానికి 230 మిలియన్ల డాలర్లనుంచి 320 మిలియన్ల డాలర్ల వరకు ఖర్చు అవుతుందని, ఇందులో ఉద్యోగుల తొలగింపు , ఇతర సిబ్బంది సంబంధిత ఖర్చుల కోసం200 మిలియన్ల డాలర్లనుంచి 270 మిలియన్ల డాలర్ల వరకు ఉంటాయని, అదే సమయంలో ఈ ఏడాది 300 మిలియన్ల డాలర్ల వరకు ఆదా అవుతుందని కాగ్నిజెంట్ తెలిపింది.ఈ పునర్వ్యవస్థీకరణ వల్ల ఎంత మంది ఉద్యోగులు ప్రభావితమవుతారో కాగ్నిజెంట్ స్పష్టంగా చెప్పలేదు. అయితే, ఆదాయాల ప్రకటన తర్వాత జరిగిన విశ్లేషకుల సమావేశంలో యాజమాన్యం మాట్లాడుతూ, ఈ ఏడాది 20,000 మందికి పైగా ఫ్రెషర్లు చేరతారని, దీనిని బట్టి ఈ కోతలు మధ్య-స్థాయి ఉద్యోగాలపై కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని సూచించింది.ఇదీ చదవండి: 76 ఏళ్ల వయసులో జోరుగా ట్రైసెప్ డిప్స్ : ఈ యాక్టర్‌కి ఫ్యాన్స్ ఫిదా!ఉద్యోగాల కోత ఉన్నప్పటికీ, మార్చి 2026 చివరి నాటికి కంపెనీ ఉద్యోగుల సంఖ్య 6,000 పెరిగి 357,600కు చేరుకుంది. 2023 జనవరిలో బాధ్యతలు స్వీకరించిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎస్. రవి కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యోగాల కోతలలో ఇది రెండవ విడత. ఆయన బాధ్యతలు స్వీకరించిన నాలుగు నెలల తర్వాత, మే 2023లో కాగ్నిజెంట్ నాన్-బిల్లబుల్ పాత్రలలో సుమారు 3,500 మంది ఉద్యోగులను తొలగించింది. ఇదీ చదవండి : నో లైఫ్ జాకెట్స్, పట్టించుకోలేదు : బోట్ విషాదంలో సంచలన ఆరోపణలు -
ఐటీ రంగాన్ని మార్చనున్న ఏఐ: ఇన్ఫోసిస్ సీఈఓ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)పై పలువురు ప్రముఖులు స్పందిస్తూనే ఉన్నారు. తాజాగా ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ తన అభిప్రాయం వెల్లడించారు. కృత్రిమ మేధస్సు.. భారతదేశ ఐటీ రంగంలో చాలా పెద్ద మార్పులను తీసుకురానుంది. అయితే, ఈ మార్పులు ఉద్యోగాలను తగ్గించవని, ప్రతిగా మరిన్ని అవకాశాలను సృష్టిస్తాయని ఆయన స్పష్టం చేశారు.భారతీయ ఐటీ కంపెనీలు ఇప్పటివరకు.. ఎక్కువగా కొత్తగా కాలేజీ నుంచి వచ్చిన యువతను పెద్ద సంఖ్యలో నియమించుకొని, అనుభవజ్ఞులను తక్కువగా ఉంచే పిరమిడ్ నిర్మాణాన్ని అనుసరించాయి. కానీ AI ప్రభావంతో ఈ నిర్మాణం “డైమండ్” ఆకారంగా మారవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే.. మధ్యస్థ, ఉన్నత నైపుణ్యాలు కలిగిన నిపుణుల అవసరం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.ఈ పరిణామం ఒక్కసారిగా జరిగేది కాదు. ఉదాహరణకు.. గత ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ 20,000 మంది కొత్త గ్రాడ్యుయేట్లను నియమించగా, ఈ సంవత్సరం కూడా దాదాపు అదే స్థాయిలో నియామకాలు కొనసాగనున్నాయి. దీన్నిబట్టి చూస్తే.. ఇన్ఫోసిస్ కంపెనీ ఇప్పటికే AI ఆధారిత భవిష్యత్తుకు తగిన విధంగా తన వ్యూహాలను మార్చుకుంటోందని తెలుస్తోంది.కొత్తగా చేరే ఉద్యోగులకు కంపెనీ సాధారణ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్తో పాటు, ఫౌండేషన్ మోడల్ టూల్స్‌పై కూడా శిక్షణ ఇస్తోంది. సీఈఓ సలీల్ పరేఖ్ ప్రకారం.. ఏఐ సేవలలో సుమారు 300 బిలియన్ డాలర్ల మార్కెట్ అవకాశం ఉంది. ఇన్ఫోసిస్ తన సేవలను విస్తరించడమే కాకుండా, ఇప్పటికే ఉన్న సేవల్లో AIని సమీకరిస్తోంది. దీనివల్ల కస్టమర్లు తమ వ్యాపారాన్ని మరింత విస్తరించుకునే అవకాశాలు పొందుతున్నారు.ఇదీ చదవండి: "దయచేసి రండి.. భరతమాతకు మీ ప్రతిభ అవసరం'' -
కాగ్నిజెంట్ కొత్త ప్రాజెక్ట్.. టెకీల గుండెల్లో గుబులు!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాకతో ఐటీ రంగంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ప్రముఖ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ తాజాగా ప్రకటించిన ‘ప్రాజెక్ట్ లీప్’ (Project Leap) ఆ సంస్థ ఉద్యోగుల్లో గుబులు రేపుతోంది. సాంప్రదాయ ఐటీ సేవల స్థానంలో ఏఐ ఆధారిత సేవలను ప్రవేశపెట్టేందుకు కంపెనీ సిద్ధమవుతుండటంతో, భారీ సంఖ్యలో ఉద్యోగ కోతలు తప్పవనే సంకేతాలు వెలువడుతున్నాయి.రూ. 2000 కోట్లకు పైగా ఖర్చు..ప్రాజెక్ట్ లీప్‌ను ఒక పరివర్తన కార్యక్రమంగా కాగ్నిజెంట్ అభివర్ణిస్తోంది. దీనికోసం 2026 నాటికి 230 నుంచి 320 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1,900 - రూ.2,600 కోట్లు) ఖర్చు చేయాలని కంపెనీ నిర్ణయించింది. ఇందులో సింహభాగం అంటే 200 నుంచి 270 మిలియన్ డాలర్లు కేవలం ఉద్యోగుల విడదీత (Severance pay), సిబ్బందికి సంబంధించిన ఇతర ఖర్చులకే కేటాయించడం గమనార్హం.ఈ భారీ మొత్తాన్ని విశ్లేషిస్తే.. తొలగింపుల ప్రభావం కొన్ని వేల మందిపై ఉండబోతోందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ఎంతమంది ఉద్యోగులను తొలగిస్తారనే దానిపై కంపెనీ ఇంకా స్పష్టమైన గణాంకాలను వెల్లడించలేదు.‘పిరమిడ్’ రివర్స్.. జూనియర్లకే ప్రాధాన్యం!కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్ ఎస్ ఈ మార్పులపై స్పందిస్తూ.. సంస్థను ‘విస్తృత, చిన్న’ (Broad and Small) పిరమిడ్ ఆకృతిలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అంటే నిర్వహణ విభాగంలో (Management layers) ఉన్న సీనియర్ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం.. ఎక్కువ మంది ఫ్రెషర్లు, జూనియర్ ఉద్యోగులను చేర్చుకోవడం ద్వారా సంస్థ అట్టడుగు భాగాన్ని బలోపేతం చేయడం.. క్లిష్టమైన ఏఐ నైపుణ్యాలను యువ శ్రామిక శక్తి ద్వారా వేగంగా నిర్మించడం చేస్తారు.భారీ పొదుపు.. ఏఐపై పెట్టుబడిఈ ప్రాజెక్ట్ ద్వారా 2026 నాటికి 200 నుంచి 300 మిలియన్ డాలర్ల వ్యయాన్ని ఆదా చేయాలని కాగ్నిజెంట్ భావిస్తోంది. ఈ ఆదా చేసిన మొత్తాన్ని తిరిగి ఏఐ సామర్థ్యాల పెంపుదల, ఉద్యోగుల రీస్కిల్లింగ్, మార్జిన్లను పెంచడం కోసం వినియోగించనున్నారు.కాగ్నిజెంట్‌కు ఇటువంటి పునర్నిర్మాణ కార్యక్రమాలు కొత్తేమీ కాదు. 2023లో సుమారు 300 మిలియన్ డాలర్ల ఖర్చుతో అమలు చేసిన 'నెక్స్ట్ జెన్' ప్రోగ్రామ్ 3,500 మంది ఉద్యోగులపై ప్రభావం చూపింది. అంతకు ముందు 2020లో 'ఫిట్ ఫర్ గ్రోత్' దాదాపు 7,000 మంది మిడ్, సీనియర్ స్థాయి ఉద్యోగులను ఇంటికి పంపింది.ప్రస్తుతం (మార్చి 2026 నాటికి) కాగ్నిజెంట్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,36,300. ఒకవైపు వేల సంఖ్యలో నియామకాలు జరుగుతాయని చెప్తూనే, మరోవైపు వ్యయ నియంత్రణ పేరుతో సీనియర్లపై వేటు వేస్తుండటం ఐటీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
విష్ణుప్రియ, అనన్య కాదు ఈమె సబ్ స్క్రిప్షన్ సంగతి తెలిస్తే..
-
సంప్రదాయ మోడల్లో ఏఐ పెను మార్పులు
భారతీయ ఐటీ రంగం గత నాలుగు దశాబ్దాలుగా అనుసరిస్తున్న సంప్రదాయ ‘పిరమిడ్’ టాలెంట్ మోడల్లో కృత్రిమ మేధ పెను మార్పులు తీసుకురాబోతోంది. అట్టడుగున భారీ సంఖ్యలో ఫ్రెషర్లు, పైకి వెళ్లే కొద్దీ తగ్గే సీనియర్ల సంఖ్యతో కూడిన ఈ పిరమిడ్ మోడల్ నిర్మాణం రాబోయే రోజుల్లో ‘వజ్రం’ (Diamond) ఆకృతిని(అడుగున ఏఐ టూల్స్ ఎంట్రీ లెవల్ పనులను వేగంగా చేస్తాయి. దీనివల్ల ఫ్రెషర్ల అవసరం తగ్గుతుంది. మధ్య భాగంలో డైమండ్ వెడల్పుగా ఉంటుంది. అంటే, ఏఐని సమర్థవంతంగా వాడుకోగలిగే నిపుణులు ఎక్కువవుతారు) సంతరించుకోనుందని ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ విశ్లేషించారు.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఐటీ కంపెనీల నియామక ప్రక్రియలో ఇప్పటికే మార్పులు మొదలయ్యాయన్నారు. అయితే క్షేత్రస్థాయిలో ఈ నిర్మాణాత్మక మార్పులు పూర్తిస్థాయిలో ప్రతిబింబించడానికి కొంత సమయం పడుతుందని స్పష్టం చేశారు.ఏఐ సేవలే వృద్ధికి చోదక శక్తులుప్రస్తుత ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ఒడిదుడుకులతో ఉన్నప్పటికీ ఏఐ సేవల వ్యూహం తమకు అద్భుతంగా పనిచేస్తోందని పరేఖ్ ధీమా వ్యక్తం చేశారు. ‘సుమారు 300 బిలియన్ డాలర్ల మార్కెట్ అవకాశాన్ని కంపెనీ గుర్తించింది. ఇన్ఫోసిస్ ఆరు ప్రధాన విభాగాలపై దృష్టి సారించింది. పాత సేవలను ఏఐ ఆగ్మెంటెడ్ సర్వీసులుగా మారుస్తూ క్లయింట్లకు మరింత విలువను చేకూరుస్తోంది. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు వంటి స్థూల ఆర్థిక సవాళ్లు తగ్గుముఖం పడుతున్నాయి. రాబోయే ఏడాదిలో వృద్ధి మెరుగ్గా ఉంటుంది’ అని అంచనా వేశారు.20,000 మంది ఫ్రెషర్లకు చోటునియామకాలపై నెలకొన్న ఆందోళనలను తొలగిస్తూ గతేడాది తరహాలోనే ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా సుమారు 20,000 మంది కాలేజీ గ్రాడ్యుయేట్లను నియమించుకోనున్నట్లు సలీల్ పరేఖ్ వెల్లడించారు. అయితే, వారి శిక్షణా విధానంలో భారీ మార్పులు చేశారు. ‘కేవలం కోడింగ్ మాత్రమే కాకుండా ఫౌండేషన్ మోడల్స్ ఉపయోగించడంలో వారికి ప్రత్యేక శిక్షణ అవసరం. పిరమిడ్ ఆకారం మారినప్పటికీ నిపుణులైన వ్యక్తులతో పాటు ఏఐ ఏజెంట్లు కలిసి పనిచేసే కొత్త వాతావరణం ఏర్పడుతుంది. భవిష్యత్తులో నైపుణ్యం కలిగిన వారికే అత్యధిక ప్రాధాన్యత లభిస్తుంది’ అన్నారు.ఇదీ చదవండి: ఆంత్రోపిక్ బంపర్ ఆఫర్ -
బ్యాంకింగ్ రంగంలో ఏఐ: 3000 ఉద్యోగాల కోత!
యాక్సిస్ బ్యాంక్ ఇటీవల తన 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను ప్రకటించింది. ఈ ప్రకటనలో బ్యాంక్ ఉద్యోగుల సంఖ్య స్వల్పంగా తగ్గినట్లు వెల్లడించింది. గత సంవత్సరం 1.04 లక్షల మంది ఉద్యోగులు ఉండగా.. ఈ ఏడాది ఆ సంఖ్య సుమారు 1.01 లక్షలకు తగ్గింది. అంటే సుమారు 3,000 మంది ఉద్యోగులు తగ్గారు.బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ అమితాభ్ చౌదరీ తెలిపిన ప్రకారం.. ఈ తగ్గింపు ప్రత్యేకంగా ఏ విభాగాన్ని లక్ష్యంగా చేసుకొని జరగలేదు. ఇది మొత్తం సంస్థలో సాధారణంగా జరిగిన మార్పు మాత్రమే. ముఖ్యంగా.. డిజిటల్ టెక్నాలజీపై చేసిన దీర్ఘకాలిక పెట్టుబడుల ఫలితంగా ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన చెప్పారు.గత మూడు, నాలుగు సంవత్సరాలుగా యాక్సిస్ బ్యాంక్ తన ఆపరేటింగ్ ఖర్చులలో 9% నుంచి 10% వరకు టెక్నాలజీ కోసం ఖర్చు చేస్తోంది. ఈ పెట్టుబడుల వల్ల ఇప్పుడు పనితీరు మెరుగుపడి, ఉత్పాదకత కూడా పెరిగింది. కొంతమంది ఉద్యోగులు తమ పనులను ఆటోమేషన్, టెక్నాలజీ ద్వారా వేగంగా చేయగలుగుతున్నారు.ఇదీ చదవండి: వేకువజామునే ఈమెయిల్స్.. 30వేల మందికి లేఆఫ్స్!పెద్ద స్థాయిలో ఉద్యోగాల తొలగింపు జరగలేదని బ్యాంక్ స్పష్టం చేసింది. కృత్రిమ మేధస్సు (AI) కూడా ఇంకా ఉద్యోగాలను భర్తీ చేయడం ప్రారంభించలేదని, అది కేవలం ప్రక్రియలను వేగవంతం చేయడానికి మాత్రమే ప్రస్తుతం ఉపయోగపడుతోందని తెలిపింది. ఇదే సమయంలో, యాక్సిస్ బ్యాంక్ తన భౌతిక విస్తరణను కూడా కొనసాగిస్తోంది. గత సంవత్సరంలోనే దేశవ్యాప్తంగా సుమారు 400 కొత్త శాఖలను ప్రారంభించింది. అంటే ఒకవైపు టెక్నాలజీ ద్వారా సామర్థ్యం పెంచుకుంటూ, మరోవైపు కస్టమర్ల కోసం శాఖలను కూడా పెంచుతోంది. -
ప్రతి మూడు ఉద్యోగాల్లో ఒకదానిపై ఏఐ ప్రభావం
కృత్రిమ మేధస్సు(AI)తో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ వ్యవస్థలో పెనుమార్పులు సంభవించబోతున్నాయని తాజా అంతర్జాతీయ అధ్యయనం హెచ్చరించింది. సుమారు ప్రతి మూడు ఉద్యోగాల్లో ఒకదానిలో 50 శాతం కంటే ఎక్కువ పనులు జనరేటివ్ ఏఐ (GenAI) ద్వారా అభివృద్ధి (ఆగ్మెంటేషన్) చెందే అవకాశం ఉందని ఈ పరిశోధన వెల్లడించింది. అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్ర ఉద్యోగ ధోరణులపై చేసిన ఈ అధ్యయనం.. వేగంగా మారుతున్న భారతీయ జాబ్ మార్కెట్‌కు కూడా వర్తిస్తుంది. రాబోయే కాలంలో పని విధానంలో రాబోయే నిర్మాణాత్మక మార్పులకు సిద్ధంగా ఉండాలని పరిశ్రమలను ఈ నివేదిక హెచ్చరిస్తోంది.భారతీయ వర్సిటీ భాగస్వామ్యంమిన్నెసోటాలోని యూనివర్సిటీ ఆఫ్ సెయింట్ థామస్, నార్త్ స్టార్ పాలసీ యాక్షన్ సంస్థలతో కలిసి భారత్‌కు చెందిన వోక్సెన్ విశ్వవిద్యాలయం ఏఐ రీసెర్చ్ సెంటర్ (AIRC) ఈ పరిశోధనలో కీలక పాత్ర పోషించింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా రూపొందించిన 'GenAI Job Intelligence Dashboard' విధాన నిర్ణేతలకు, పరిశ్రమలకు దిక్సూచిలా మారనుంది. వోక్సెన్ ఎంబీఏ విద్యార్థులు సాక్షి పాఠక్, హేమాంగ్ జోషి ఈ డ్యాష్‌బోర్డ్ రూపకల్పనలో డా. అమిత్ కుమార్ బాల్, డా. పూజిత కొండపాకల మార్గదర్శకత్వంలో పాలుపంచుకున్నారు. సంక్లిష్టమైన ఉద్యోగ డేటాను సులభంగా అర్థమయ్యేలా విశ్లేషించే ఈ ప్లాట్‌ఫామ్, ఏఐ ప్రభావం చూపే ఉద్యోగాలను గుర్తించడంలోనూ, మారుతున్న నైపుణ్య అవసరాలను ట్రాక్ చేయడంలోనూ సహాయపడనుంది.ఈ అధ్యయనం ప్రకారం, ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోతారనే ఆందోళన కంటే, పనుల స్వరూపం మారుతుందనే అంశాన్ని గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు. ‘ఏఐ అంటే ఉద్యోగ నష్టం కాదు, పనుల పునర్నిర్వచనం, కొత్త అవకాశాల సృష్టి’ అని వోక్సెన్ ఏఐ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ డా. హేమచంద్రన్.కె పేర్కొన్నారు. ఏఐ సాంకేతికతకు అనుగుణంగా తమ నైపుణ్యాలను మార్చుకోలేని సంస్థలు భవిష్యత్తులో వెనుకబడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా వర్క్‌ఫ్లో మార్పులు, డేటా ఆధారిత నిర్ణయాలు, ప్రతిభా వ్యూహాల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.రీ-స్కిల్లింగ్ అనివార్యం!వ్యాపార సంస్థలు ఏఐని విస్తృతంగా అవలంబిస్తున్న తరుణంలో రీ-స్కిల్లింగ్ (మళ్లీ నైపుణ్యం పొందడం), మానవ వనరుల ప్రణాళిక, విద్యా విధానాల సమన్వయం అత్యవసరంగా మారాయి. విద్యాసంస్థలు కేవలం సిద్ధాంతాలకే పరిమితం కాకుండా, వోక్సెన్ విద్యార్థుల మాదిరిగా నిజజీవిత డేటాతో పని చేస్తూ భవిష్యత్ సవాళ్లకు సిద్ధం కావాలని ఈ ప్రాజెక్టు స్పష్టం చేస్తోంది. అదే సమయంలో, ఆవిష్కరణలకు, ఉద్యోగుల సంక్షేమానికి మధ్య సమతుల్యత పాటిస్తూ, బాధ్యతాయుతమైన ఏఐ వినియోగాన్ని ప్రోత్సహించాలని ఈ అధ్యయనం ప్రభుత్వాలను, సంస్థలను కోరుతోంది. -
ఉద్యోగాలే కాదు AI దెబ్బకు రియల్ ఎస్టేట్ డౌన్
-
అమెజాన్‌లో మామిడి జాతర.. ఏఐతో నచ్చిన పండు
వేసవి కాలం రాగానే అందరికీ గుర్తుకు వచ్చేది మామిడి పండ్ల మధురమైన రుచి. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా అమెజాన్ ఇండియా 'ఆమ్-ఎజింగ్' పేరిట ప్రత్యేక మామిడి పండ్ల విక్రయాలను ప్రారంభించింది. పొలాల నుండి నేరుగా సేకరించిన అల్ఫోన్సో, కేసర్, సఫేదా, తోతాపురి వంటి మేలైన రకాలను అమెజాన్ నౌ, అమెజాన్ ఫ్రెష్ ద్వారా అందిస్తోంది. పండ్లతో పాటు మామిడి ఐస్ క్రీములు, ఆమ్రస్, ఊరగాయలు, పానీయాలపై 30% నుండి 70% వరకు భారీ తగ్గింపులను ప్రకటించింది. బెంగళూరు, ముంబై, ఢిల్లీ-ఎన్‌సిఆర్ వంటి ప్రధాన నగరాల్లో ఎంపిక చేసిన ప్రాంతాలకు నిమిషాల వ్యవధిలోనే లేదా గరిష్టంగా 2 గంటల్లోపు డెలివరీ చేసే సదుపాయాన్ని కల్పించింది.ఈ సీజన్ షాపింగ్‌లో ప్రధాన ఆకర్షణ అమెజాన్ వారి ఏఐ-ఆధారిత షాపింగ్ అసిస్టెంట్ 'రూఫస్' (Rufus). వినియోగదారులు తమ మూడ్‌కు తగిన మామిడి పండును ఎంచుకోవడానికి రూఫస్ సహాయపడుతుంది. "రూ. 500 లోపు అల్ఫోన్సో చూపించు" లేదా "స్మూతీకి ఏ రకం బాగుంటుంది?" వంటి ప్రశ్నలకు ఇది తక్షణమే సమాధానాలిస్తుంది. అంతేకాకుండా, గత 30 నుండి 90 రోజుల ధరల చరిత్రను విశ్లేషించి, వినియోగదారులు సరైన డీల్ పొందుతున్నారో లేదో తెలియజేస్తుంది. ధర తగ్గినప్పుడు అలర్ట్‌లు పంపడం, వ్యక్తిగతీకరించిన సిఫార్సులు చేయడం ద్వారా ఈ ఏఐ అసిస్టెంట్ షాపింగ్ అనుభవాన్ని మరింత స్మార్ట్‌గా మారుస్తోంది.ప్రతి వినియోగదారుని అవసరానికి తగినట్లుగా ఐదు రకాల కేటగిరీలను అమెజాన్ రూపొందించింది. తీపి కోరికలను తీర్చుకోవడానికి అల్ఫోన్సో రకాలు, వంటల కోసం తోతాపురి, పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడానికి ఆమ్రస్, క్యాండీలు, ఆరోగ్య స్పృహ ఉన్నవారి కోసం ఫ్రీజ్ డ్రైడ్ చిప్స్, ప్రోటీన్ షేక్ వంటి ఉత్పత్తులను అందుబాటులో ఉంచింది. -
భారత్‌లో ఏఐ జాబ్స్ బూమ్: 59.5% పెరిగిన నియామకాలు
భారతదేశంలో ఏఐ ఇంజనీరింగ్ ఉద్యోగ నియామకాలు వైఓవై +59.5% వృద్ధిని సాధించాయి. యూఎస్, యూకే, ఫ్రాన్స్, జర్మనీలతో సహా అధ్యయనం చేసిన మార్కెట్‌లలోకెల్లా ఇది అత్యధికం.ప్రముఖ మెట్రో నగరాలుగా బెంగళూరు ,హైదరాబాద్ నియామకాల వేగాన్ని కొనసాగిస్తున్నప్పటికీ, ఈ వృద్ధి క్రమంగా వాటిని దాటి విజయవాడ వంటి వర్ధమాన నగరాలకు కూడా విస్తరిస్తోంది.భారతదేశంలో ఎస్ఎంబిల నడుమ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ నైపుణ్యాలలో ఏఐ ఏజెంట్లు, ఏఐ ప్రొడక్టివిటీ, అజూర్ ఏఐ స్టూడియో ఉన్నాయి. ఇవి ఆచరణాత్మక, అమలు-కేంద్రీకృత సామర్థ్యాలకు పెరుగుతున్న డిమాండ్‌ను ప్రతిబింబిస్తున్నాయి.ఇండియా, ఏప్రిల్ 25, 2026: లింక్డ్ఇన్ యొక్క నూతన ఏఐ లేబర్ మార్కెట్ రిపోర్ట్ 2026 ప్రకారం, భారతదేశంలో ఏఐ ప్రతిభ నియామకాలు ఇయర్ ఆన్ ఇయర్ (వైఓవై) 59.5% పెరిగాయి. ప్రపంచ ఏఐ కేంద్రంగా బెంగళూరు అగ్రస్థానంలో కొనసాగుతున్నప్పటికీ, ఏఐ ప్రతిభ నియామకాల వేగంలో మార్పును ఈ నివేదిక వెల్లడిస్తుంది. హైదరాబాద్ (+51%) మరియు విజయవాడ (+45.5%) వంటి నగరాల్లో ఏఐ ఇంజనీరింగ్ నియామకాలలో బలమైన వృద్ధి కనిపిస్తోంది. ఇది టైర్-2 మరియు టైర్-3 మార్కెట్లలో అవకాశాలు విస్తృతంగా వ్యాపిస్తున్నాయని సూచిస్తోంది.వివిధ పరిశ్రమలు, కంపెనీలలో ఏఐ వినియోగం పెరగడం, ఏఐ నిపుణుల కోసం డిమాండ్‌ను వేగవంతం చేస్తోంది.అన్ని స్థాయిల సంస్థలలోనూ ఏఐని వేగంగా స్వీకరించడం వల్ల ఏఐ ఇంజనీరింగ్ నియామకాలలో వృద్ధి చోటుచేసుకుంటోంది. మౌలిక సదుపాయాలు, పాలనా విధానాలు మరియు భారీ స్థాయి నిర్వహణ కోసం పెట్టుబడులు పెడుతూ, ఏఐ నిపుణులలో అత్యధిక వాటాను నియమించుకుంటూ భారీ సంస్థలు తమ అగ్రస్థానాన్ని కొనసాగిస్తున్నాయి. అదే సమయంలో, చిన్న మరియు మధ్య తరహా వ్యాపారాలు వేగంగా పుంజుకుంటున్నాయి; ఇవి ప్రాథమిక స్థాయి ప్రయోగాత్మకత మరియు సంస్థాగత స్థాయి స్వీకరణ మధ్య వారధిగా నిలుస్తున్నాయి. ఏఐ వినియోగం విస్తరిస్తున్న కొద్దీ, వివిధ పరిశ్రమల అంతటా ఏఐ నిపుణుల లభ్యత కూడా పెరుగుతోంది. తయారీ రంగంలో, భారతదేశంలో ఏఐ ఇంజనీరింగ్ నిపుణుల సంఖ్య నాలుగు రెట్లు వృద్ధి చెందింది, ఇది 2025 నాటికి 2.0 శాతానికి చేరుకుంటుందని అంచనా.లింక్డ్ఇన్ ఇండియా ఇంజనీరింగ్ హెడ్ మలై లక్ష్మణన్ మాట్లాడుతూ “వాస్తవ ప్రపంచ వినియోగానికి నేరుగా ముడిపడి ఉన్న ఏఐ ఏజెంట్లు మరియు ఉత్పాదకత సాధనాల వంటి అనువర్తిత ఏఐ నైపుణ్యాలలో మేము బలమైన వృద్ధిని చూస్తున్నాము. ఇంజనీర్లకు, ఆచరణాత్మకమైన, ప్రత్యక్ష నైపుణ్యాలను పెంపొందించుకోవడంపై దృష్టి పెట్టడానికి మరియు ఏఐని రోజువారీ పనివిధానాలలో ఏకీకృతం చేయడానికి ఇది ఒక స్పష్టమైన సంకేతం. అన్ని పరిమాణాల పరిశ్రమలు, సంస్థలలో దీని స్వీకరణ వేగవంతం అవుతున్నందున, ప్రయోగాల దశ నుండి ఆచరణ దశకు మారగలిగే వారే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ఉత్తమ స్థితిలో ఉంటారు” అని అన్నారు.అప్ప్లైడ్ ఏఐ నైపుణ్యాల వైపు మళ్లడం అన్ని రంగాలలోనూ నియామకాలను పునర్నిర్మిస్తోందిఏఐ ఏజెంట్లు, ఏఐ ప్రొడక్టివిటీ, అజూర్ ఏఐ స్టూడియో, ఇంటిలిజెంట్ ఏజెంట్స్ ,ఆటోమేటెడ్ ఫీచర్ ఇంజనీరింగ్ వంటి నైపుణ్యాలకు ఎస్ఎంబి రంగంలో డిమాండ్ బలంగా వుంది . ఇది నిపుణులు తమ కెరీర్లను భవిష్యత్తుకు సిద్ధం చేసుకోవడానికి తప్పనిసరిగా పెట్టుబడి పెట్టాల్సిన సామర్థ్యాలను సూచిస్తుంది. తయారీ వంటి పరిశ్రమలలో, ఉపాధి అవకాశాలను బలోపేతం చేయడానికి ఏఐ ఏజెంట్లు మరియు ఏఐ ప్రాంప్టింగ్ కీలక నైపుణ్యాలుగా ఉద్భవిస్తున్నాయి.లింక్డ్ఇన్ ఇండియా ఇంజనీరింగ్ హెడ్, మలై లక్ష్మణన్, పెరుగుతున్న ఏఐ అవకాశాలను ఇంజనీర్లు అందిపుచ్చుకోవడంలో సహాయపడే చిట్కాలను పంచుకున్నారు:డిమాండ్‌లో ఉన్న ఏఐ సామర్థ్యాలను పెంపొందించుకోండి: మీ పరిశ్రమలోని యజమానులు ఎక్కువగా కోరుకుంటున్న ఏఐ సాధనాలు, డేటా, మరియు అనువర్తిత సమస్య-పరిష్కారం వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలలో నైపుణ్యాలను పెంపొందించుకోవడంపై దృష్టి పెట్టండి.మీ ఏఐ -ఆధారిత ఉద్యోగ అన్వేషణలో లక్ష్యంగా ఉండండి: మీ నైపుణ్యాలు ఉద్యోగ అవసరాలకు దగ్గరగా సరిపోయే విధులకు ప్రాధాన్యత ఇవ్వండి మరియు మీరు ఆ ఉద్యోగానికి సరిపోతారో లేదో ముందుగానే అంచనా వేయడానికి ఏఐ సాధనాలను ఉపయోగించండి. లింక్డ్ఇన్ జాబ్ మ్యాచ్ వంటి ఫీచర్లు, మీ ప్రొఫైల్ ఒక ఉద్యోగానికి ఎంతవరకు సరిపోతుందో చూపిస్తాయి. దీనివల్ల మీరు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్న అవకాశాలపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది.వాస్తవ ప్రపంచ అప్లికేషన్ ను ప్రదర్శించండి: సమస్యలను పరిష్కరించడానికి , ఫలితాలను అందించడానికి మీరు ఏఐ పద్ధతులను ఎలా ఉపయోగించారో చూపించే ప్రాజెక్ట్‌లు, సాధనాలు మరియు ఉదాహరణలను హైలైట్ చేయండి. Loveable లేదా Replit వంటి మీరు ఉపయోగించే ఏఐ సాధనాల ద్వారా మీ నైపుణ్యాలను ధృవీకరించడం కూడా, యజమానులు మీ సామర్థ్యాలను త్వరగా చూడటానికి సహాయపడుతుంది. -
ప్రభుత్వ ఉద్యోగాల్లో సగం AIతోనే.. యూఏఈ సంచలనం!
సాంకేతిక రంగంలో ప్రపంచ దేశాలకు మార్గదర్శిగా నిలుస్తున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) మరో ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 2028 నాటికి ప్రభుత్వ సేవల్లో కనీసం 50 శాతాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా నిర్వహించాలని నిర్ణయించింది. (UAE AI Government Services) ఈ ఘనత సాధించనున్న ప్రపంచంలోని మొట్టమొదటి దేశంగా యూఏఈ రికార్డు సృష్టించనుంది.ఈ వినూత్న విధానం ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో పనితీరును వేగవంతం చేయడమే కాకుండా, పౌరులకు అందించే సేవల్లో జాప్యాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏఐ వినియోగం వల్ల కేవలం సమయం ఆదా అవ్వడమే కాకుండా, ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుందని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. వివిధ శాఖల సమన్వయం, డేటా విశ్లేషణలో కృత్రిమ మేధ కీలక పాత్ర పోషించనుంది.ఇప్పటికే పలు కీలక సంస్కరణలుయూఏఈ ప్రభుత్వం ఇప్పటికే 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్ట్రాటజీ 2031'లో భాగంగా పలు కీలక సంస్కరణలను చేపట్టింది. అందులో భాగంగానే ఈ సరికొత్త 2028 గడువును ఖరారు చేసింది. రవాణా, ఆరోగ్యం, విద్య, భద్రత వంటి కీలక రంగాలలో ఏఐ అల్గారిథమ్స్‌ను అనుసంధానించడం ద్వారా డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో అగ్రగామిగా నిలవాలని యూఏఈ లక్ష్యంగా పెట్టుకుంది.ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగంపై చర్చలు జరుగుతున్న తరుణంలో, యూఏఈ తీసుకున్న ఈ నిర్ణయం టెక్నాలజీ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ పాలనను ఆధునీకరించడంలో ఈ ప్రాజెక్టు ఒక మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.Under the directives of the President of the UAE, we launch a new government model. Within two years, 50% of government sectors, services, and operations will run on Agentic AI, making the UAE the first government globally to operate at this scale through autonomous systems.AI… pic.twitter.com/53OQLe7RXl— HH Sheikh Mohammed (@HHShkMohd) April 23, 2026 -
ఏఐ యుగంలో భారత్: నాస్కామ్ చైర్మన్ కీలక వ్యాఖ్యలు!
ఐటీ సంస్థల ఆదాయ వృద్ధి మెరుగుపడేలా చూడటం, అలాగే కంపెనీల్లో కృత్రిమ మేథ, సాంకేతికతల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రాధాన్యతనివ్వనున్నట్లు నాస్కామ్ కొత్త చైర్మన్‌గా నియమితులైన శ్రీకాంత్ వెలమకన్ని తెలిపారు. ఏఐ యుగంలో భారత్ మరింత మెరుగ్గా, దూకుడుగా పోటీపడేలా చూసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.టెక్నాలజీపై కంపెనీలు ప్రస్తుత స్థాయికి మించి వెచ్చించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. టెక్నాలజీ పురోగతి వల్ల మనుషుల కన్నా మెషిన్లు మెరుగ్గా పనులు పూర్తి చేయగలిగినా, మనుషులు పోషించాల్సిన పాత్ర ప్రాధాన్యత తగ్గిపోదని తెలిపారు.ఏఐ ఆధిపత్యం కనిపిస్తున్న తరుణంలో కూడా గత ఏడాది నికరంగా ఉద్యోగుల సంఖ్య పెరగడం సానుకూలాంశమని ఆయన పేర్కొన్నారు. ఏఐ పురోగతితో చిన్నా, పెద్ద కంపెనీలు తమ వ్యాపారాలను సరికొత్తగా తీర్చిదిద్దుకునేందుకు అసాధారణ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని శ్రీకాంత్ వివరించారు. -
ఏఐ డేంజర్.. బ్యాంకులకు ఆర్థిక మంత్రి కీలక సూచన
కృత్రిమ మేథ (ఏఐ) సరికొత్త నమూనాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రభుత్వరంగ బ్యాంక్‌ల ముఖ్య అధికారులతో భేటీ అయ్యారు. ఫైనాన్షియల్ సిస్టమ్‌లలో లోపాలను ఆంథ్రోపిక్ మైథోస్ ఏఐ మోడల్ సులభంగా గుర్తించగలదన్న ఆందోళనల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.ఎన్నో ఆపరేటింగ్ సిస్టమ్‌లలో లోపాలను గుర్తించినట్టు ఆంథ్రోపిక్ ఇటీవలే ప్రకటించడం గమనార్హం. ఏఐ రూపంలో ఆర్థిక వ్యవస్థకు వచ్చే రిస్క్‌లను ఎదుర్కొనే చర్యలు, సైబర్ భద్రతపై ఈ సమావేశంలో లోతుగా చర్చించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తమ సిస్టమ్‌లను మరింత పటిష్టంగా మార్చుకునే చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి సీతారామన్ సూచించినట్టు చెప్పాయి.ఆర్బీఐ, కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ, బ్యాంక్‌ల ముఖ్య అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఉల్లంఘనల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థకు ఎదురయ్యే రిస్క్‌లపై ఆర్థిక శాఖ, ఆర్బీఐ అధ్యయనం చేస్తున్నట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు.ప్రధాన ఆపరేటింగ్ సిస్టమ్‌లు, వెబ్ బ్రౌజర్లలో 27 ఏళ్ల నాటి లోపాలతో సహా వేలాది బగ్స్‌ను గుర్తించి, వాటిని వినియోగించుకునే విషయంలో మనుషుల కంటే మెరుగ్గా ‘మైథోస్’ ఏఐ మోడల్ రాణించగలదని ఆంథ్రోపిక్ పేర్కొనడం గమనార్హం. దీంతో యూఎస్ ఫెడ్ సహా పలు కేంద్ర బ్యాంక్‌లు ఏఐ ముప్పులను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై సమాలోచనలు చేస్తుండడం తెలిసిందే. -
AI పోటీలో చైనా.. హువాంగ్ హెచ్చరిక!
చైనాకు ఏఐ చిప్‌లను అమ్మడం అంటే.. ఉత్తర కొరియాకు అణ్వాయుధాలను అమ్మడం లాంటిదని ఆంత్రోపిక్ అధిపతి డారియో అమోడె వ్యాఖ్యానించారు. దీనిని ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ తీవ్రంగా వ్యతిరేకించారు. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ప్రస్తుతం ప్రపంచంలో కృత్రిమ మేధస్సు (AI) రంగంలో భారీ పోటీ కొనసాగుతోంది. ఈ పోటీలో అమెరికా, చైనా ప్రధాన పాత్రలు పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ యూఎస్ కంపెనీ ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్, చైనాకు AI చిప్‌లను విక్రయించడంపై తన అభిప్రాయాలను వెల్లడించారు.The Jensen Huang episode.0:00:00 – Is Nvidia’s biggest moat its grip on scarce supply chains?0:16:25 – Will TPUs break Nvidia’s hold on AI compute?0:41:06 – Why doesn’t Nvidia become a hyperscaler?0:57:36 – Should we be selling AI chips to China?1:35:06 – Why doesn’t Nvidia… pic.twitter.com/ezDkUmoFWM— Dwarkesh Patel (@dwarkesh_sp) April 15, 2026హువాంగ్ చెప్పిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. చైనాకు ఇప్పటికే పెద్ద ఎత్తున కంప్యూటింగ్ సామర్థ్యం, సాంకేతిక పరిజ్ఞానం ఉందని. అంటే, చైనా ఇప్పటికే AI రంగంలో ముందంజలో ఉంది. కాబట్టి, చిప్‌లను అమ్మకుండా నిరోధించడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని ఆయన భావిస్తున్నారు.ఇదీ చదవండి: TCS నాసిక్ కేసు: వెలుగులోకి సంచలన విషయాలు!చర్చలో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, చైనా చిప్‌లను ఉపయోగించి అత్యాధునిక AI మోడళ్లను అభివృద్ధి చేస్తే ఏమవుతుందన్న ప్రశ్నకు, ఇప్పటికే చైనాలో అలాంటి సామర్థ్యం ఉందని ఆయన స్పష్టం చేశాడు. అంటే, ఈ టెక్నాలజీని పూర్తిగా ఆపడం అసాధ్యమని ఆయన అభిప్రాయం. -
ఐటీ ఉద్యోగులకు.. AI టెన్షన్..
-
సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు.. ప్రమాదానికి బాధ్యులెవరు?
సాంకేతిక విప్లవం ఆటోమొబైల్ రంగాన్ని ఊహించని మలుపు తిప్పుతోంది. కొంతకాలం క్రితం సైన్స్ ఫిక్షన్ సినిమాలకే పరిమితమైన సెల్ఫ్ డ్రైవింగ్ (స్వయం చాలిత) కార్లు ఇప్పుడు రోడ్లపైకి వస్తున్నాయి. టెస్లా, వేమో, క్రూయిజ్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలతో పాటు పలు భారతీయ స్టార్టప్‌లు కూడా ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి. అయితే, స్టీరింగ్ డ్రైవర్ చేతిలో లేకుండా కార్లు ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది? ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రక్రియ ఎలా ఉంటుంది? అన్న ప్రశ్నలు ఇప్పుడు వాహనదారుల్లో మెదులుతున్నాయి.బాధ్యత ఎవరిది? డ్రైవర్‌దా లేక సాఫ్ట్వేర్దా?సాధారణ కార్ల ప్రమాదాల్లో మానవ తప్పిదం (హ్యుమన్ ఎర్రర్) ప్రధాన కారణం కాబట్టి డ్రైవర్‌పై బాధ్యత ఉంటుంది. కానీ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలో విషయం వేరు. ఇక్కడ ప్రమాద బాధ్యతను ప్రధానంగా రెండు రకాలుగా విభజిస్తారు.1. లెవల్ 2, 3 (సెమీ-అటానమస్): ఇక్కడ డ్రైవర్ అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ సాఫ్ట్వేర్ హెచ్చరించినా డ్రైవర్ స్పందించకుంటే బాధ్యత డ్రైవర్‌దే అవుతుంది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ పాత పద్ధతిలోనే జరుగుతుంది.2. లెవల్ 4, 5 (ఫుల్లీ-అటానమస్): ఇక్కడ కారు పూర్తిగా సాఫ్ట్వేర్ నియంత్రణలో ఉంటుంది. ఇలాంటి సమయంలో ప్రమాదం జరిగితే అది ‘ప్రొడక్ట్ లయబిలిటీ’ కిందకు వస్తుంది. అంటే తయారీ కంపెనీ లేదా సాఫ్ట్వేర్ డెవలపర్ బాధ్యత వహించాల్సి ఉంటుంది.ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే విధానంసెల్ఫ్ డ్రైవింగ్ కారు ప్రమాదానికి గురైనప్పుడు క్లెయిమ్ ప్రక్రియలో డేటా కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి అటానమస్ కారులో సెన్సార్లు, కెమెరాల డేటా రికార్డ్ అవుతుంది. ప్రమాదం జరిగిన సమయంలో కారు మాన్యువల్ మోడ్‌లో ఉందా లేక అటానమస్ మోడ్‌లో ఉందా అన్నది ఇన్సూరెన్స్ కంపెనీలు ముందుగా తనిఖీ చేస్తాయి.ఒకవేళ కారు సెన్సార్లు పనిచేయకపోవడం వల్ల లేదా అల్గారిథమ్ లోపం వల్ల ప్రమాదం జరిగిందని తేలితే ఇన్సూరెన్స్ కంపెనీ సదరు కార్ల తయారీ సంస్థ నుంచి నష్టపరిహారాన్ని రికవరీ చేస్తుంది. దీనినే ‘సబ్రోగేషన్’ అంటారు.బాధితులకు తక్షణ ఉపశమనం కలిగించేందుకు ప్రస్తుతం ఉన్న ‘థర్డ్ పార్టీ లయబిలిటీ’ నిబంధనలే వర్తిస్తాయి. అయితే, పరిహారం చెల్లించిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ తయారీదారుడిపై కేసు వేసే అవకాశం ఉంటుంది.ప్రస్తుత కంపెనీల విధానాలుసైబర్ ఇన్సూరెన్స్.. కారు హ్యాకింగ్‌కు గురై ప్రమాదం జరిగితే ఈ ఇన్సూరెన్స్ రక్షణ కల్పిస్తుంది.అల్గారిథమ్ లయబిలిటీ.. సాఫ్ట్వేర్ కోడింగ్‌లో లోపాల వల్ల జరిగే నష్టాలకు కంపెనీలే బాధ్యత వహించేలా కొత్త క్లాజులు వస్తున్నాయి.టెస్లా ఇన్సూరెన్స్.. టెస్లా వంటి కంపెనీలు స్వయంగా ఇన్సూరెన్స్‌ను అందిస్తున్నాయి. డ్రైవర్ ‘సేఫ్టీ స్కోర్’ ఆధారంగా ప్రీమియంను నిర్ణయిస్తున్నాయి.భారత్‌లో పరిస్థితి ఏమిటి?భారతదేశంలో మోటార్ వాహనాల చట్టం (ఎంవీఏ) ప్రకారం, వాహనానికి డ్రైవర్ ఉండటం తప్పనిసరి. ప్రస్తుతానికి పూర్తిస్థాయి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు మన రోడ్లపై అనుమతి లేదు. అయితే, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్) ఉన్న కార్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. వీటికి సంబంధించి ప్రమాదాలు జరిగితే ప్రస్తుతానికి డ్రైవర్‌నే బాధ్యుడిని చేస్తూ క్లెయిమ్‌లు సెటిల్ అవుతున్నాయి.ఇదీ చదవండి: లాభాలు ఎలా రాబట్టుకుంటారో ఏమో! -
లాభాలు ఎలా రాబట్టుకుంటారో ఏమో!
గడిచిన రెండేళ్లుగా ప్రపంచ పారిశ్రామిక, సాంకేతిక రంగాలను సునామీలా చుట్టుముట్టేసిన పదం ‘కృత్రిమ మేధ’ (ఏఐ). డేటా సెంటర్లు, అధునాతన చిప్స్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎం) అభివృద్ధి కోసం కంపెనీలు బిలియన్ల కొద్దీ డాలర్లను వరదలా పారించాయి. అయితే, ఈ ఏఐ విప్లవం ఇప్పుడు ఒక కీలక మలుపు వద్ద నిలిచింది. గతంలో ఉత్సాహంగా పెట్టిన పెట్టుబడులపై ఇన్వెస్టర్లు, కంపెనీల యాజమాన్యాలు ఆలోచనలో పడ్డాయి. అసలు ఇంతటి భారీ పెట్టుబడులకు తగిన ప్రతిఫలం లభిస్తుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రపంచ మార్కెట్లను వేధిస్తున్నాయి.పెరుగుతున్న ఉత్కంఠఏఐ రంగంలో మైలురాయిగా భావించే మైక్రోసాఫ్ట్-ఓపెన్ఏఐ భాగస్వామ్యం ఇప్పుడు అంతర్గత సవాళ్లను ఎదుర్కొంటోంది. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రీసెర్చ్ కలయికగా మొదలైన ఈ బంధం వ్యయ నియంత్రణ వద్దకు వచ్చేసరికి అనిశ్చితి ఎదుర్కొంటోంది. అత్యున్నత స్థాయి ఏఐ వ్యవస్థలను నిర్మించడానికి, శిక్షణ ఇవ్వడానికి అయ్యే ఖర్చు అసాధారణంగా ఉంటోంది. ఒకే మోడల్‌ను ఒక్కసారి ట్రైన్ చేయడానికి వందల మిలియన్ల డాలర్లు ఖర్చవుతుండగా రోజువారీ మిలియన్ల కొద్దీ యూజర్ల ప్రశ్నలకు సమాధానమివ్వడం కంపెనీలకు సవాలుగా మారుతుంది. టెక్ దిగ్గజాల వద్ద నిధులు పుష్కలంగా ఉన్నప్పటికీ ఈ వ్యయం దీర్ఘకాలంలో భారంగా మారుతుందన్న ఆందోళన మొదలైంది.మౌలిక సదుపాయాలు..ఏఐ రంగంలో మౌలిక సదుపాయాల కల్పన ఒక పెద్ద చిక్కుముడిగా మారింది. ఎన్విడియా, ఏఎండీ వంటి కంపెనీలు ఏటా మరింత శక్తివంతమైన చిప్స్‌ను విడుదల చేస్తున్నాయి. ఇది సాంకేతిక పురోగతికి శుభసూచకమే అయినా, పెట్టుబడి కోణంలో ఒక విచిత్రమైన పరిస్థితిని సృష్టిస్తోంది. రెండేళ్ల క్రితం వందల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన డేటా సెంటర్లు నేటి ఏఐ అవసరాలకు (విద్యుత్, కూలింగ్ వ్యవస్థ) సరిపోవడం లేదు. మౌలిక సదుపాయాలు అనేవి దీర్ఘకాలిక ఆస్తులు. కానీ ఏఐ హార్డ్‌వేర్ సాఫ్ట్వేర్ వేగంతో మారిపోతోంది. దీనివల్ల భారీ పెట్టుబడులు పెట్టిన ఆస్తులు త్వరగా వాడుకలో లేకుండా పోతున్నాయి.స్కేలింగ్ లాస్ Vs ఎకనామిక్ లాస్ఏఐ అభివృద్ధిలో ఒక ప్రాథమిక సూత్రం ఉంది. అది ‘ఎక్కువ డేటా + ఎక్కువ గణన సామర్థ్యం = మెరుగైన ఫలితం’. దీనినే స్కేలింగ్ లాస్ అంటారు. కానీ, ఇప్పుడు ఆర్థిక పరిమితులు ఈ సూత్రాన్ని అడ్డుకుంటున్నాయి. నమూనాలు పెద్దవి అయ్యే కొద్దీ, వాటి పనితీరులో వచ్చే మెరుగుదల తగ్గుతూ ఖర్చు మాత్రం విపరీతంగా పెరుగుతోంది. దీంతో కంపెనీలు మోడల్ కంప్రెషన్, ప్రత్యేక అప్లికేషన్లపై దృష్టి సారిస్తున్నాయి.పెట్టుబడిపై రాబడి ఎప్పుడు?సాంప్రదాయ సాఫ్ట్వేర్ రంగంలో ఒకసారి ప్రోగ్రామ్ రాస్తే ఎంతమంది వాడుకున్నా అదనపు ఖర్చు నామమాత్రంగానే ఉంటుంది. కానీ ఏఐ అలా కాదు. ప్రతి సెర్చ్, ప్రతి ఇంటరాక్షన్ వెనుక భారీ ఖర్చు ఉంటుంది. దీనిని మానిటైజ్ చేయడం (డబ్బుగా మార్చుకోవడం) ఇంకా ఒక సవాలుగానే ఉంది. సంస్థలకు ఏఐ వల్ల కలిగే ప్రయోజనాలు దీర్ఘకాలికంగా కనిపిస్తుండగా ఖర్చులు మాత్రం తక్షణమే చెల్లించాల్సి వస్తోంది.ఆగిపోని విప్లవంఏఐ విప్లవం ఆగిపోతుందని దీని అర్థం కాదు. కానీ, ఇది ‘అపరిమిత అవకాశాల’ దశ నుంచి ‘పరిమిత ఆప్టిమైజేషన్’ దశకు చేరుకుంటుంది. పెట్టుబడిదారులు ఇప్పుడు కేవలం సాంకేతిక సామర్థ్యాన్ని మాత్రమే చూడటం లేదు, లాభదాయకత కూడా లెక్కిస్తున్నారు.ఇదీ చదవండి: ‘మధ్య తరగతి’ బండి సాగేదెలా? -
మృణాల్ కొత్త సినిమా.. 'ఏఐ'తో ఫస్ట్ లుక్ టీజర్
రీసెంట్ టైంలో భారీ బడ్జెట్ విజువల్ ఎఫెక్ట్స్ సినిమాల నుంచి ప్రమోషనల్ కంటెంట్ ఏమైనా రిలీజ్ అయిందంటే చాలు.. తమ చిత్రంలో ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ)ని ఉపయోగించలేదని హీరోలు చెప్పుకోవాల్సిన పరిస్థితి. అయితే అవసరాన్ని బట్టి ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో తప్పులేదు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ తన కొత్త మూవీ కోసం ఏఐని అధికారికంగా వాడేశాడు. తాజాగా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేయగా అందులో ఈ టెక్నాలజీతో చేసిన ఔట్పుట్ దర్శనమిచ్చింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)వరుణ్ ధావన్, పూజా హెగ్డే, మృణాల్ ఠాకుర్ జంటగా నటించిన లేటెస్ట్ హిందీ సినిమా 'హే జవానీ తో ఇష్క్ హోనా హై'. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లని ప్రేమించే వ్యక్తిగా హీరో కనిపిస్తాడు. సదరు హీరోయిన్లకు పుట్టిన పిల్లలిద్దరూ మాట్లాడుకునే సీన్స్ అన్ని ఏఐలో సృష్టించారు. వాటినే తాజాగా వదిలిన ఫస్ట్ లుక్ టీజర్ వీడియోలో చూపించారు. ఇది ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో మరిన్ని హిందీ, తెలుగు, పాన్ ఇండియా చిత్రాల్లో ఈ టెక్నాలజీని అధికారికంగానే ఉపయోగించేయనున్నారు.(ఇదీ చదవండి: కుమారస్వామి కథతో ఎన్టీఆర్ సినిమా.. టైటిల్ ఫిక్సయిందా?) -
లండన్‌లో ఓపెన్ఏఐ శాశ్వత కార్యాలయం
ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) దిగ్గజం చాట్‌జీపీటీ సృష్టికర్త ఓపెన్ఏఐ బ్రిటన్ రాజధాని లండన్‌లో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకుంటోంది. యూకేలో తన మొట్టమొదటి శాశ్వత కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. సుమారు 500 మంది సభ్యుల సామర్థ్యంతో కూడిన ఈ కార్యాలయం కోసం సోమవారం లీజు ఒప్పందాలపై సంతకాలు పూర్తయ్యాయి.కీలక కేంద్రంగా లండన్..లండన్‌లోని ప్రముఖ ‘కింగ్స్ క్రాస్’ ప్రాంతంలో సుమారు 88,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ నూతన కార్యాలయం ఏర్పాటు కానుంది. గూగుల్ డీప్‌మైండ్, మెటా, సింథెసియా, వేవ్ వంటి అగ్రశ్రేణి ఏఐ కంపెనీలకు ఈ ప్రాంతం ఇప్పటికే నిలయంగా ఉంది. ‘యూకేలో అద్భుతమైన ప్రతిభ ఉంది. ఏఐ రంగంలో బ్రిటన్‌కు బలమైన చరిత్ర ఉంది’ అని ఓపెన్ఏఐ లండన్ సైట్ లీడ్ ఫోబ్ థాకర్ పేర్కొన్నారు. ప్రస్తుతం లండన్‌లో 200 మంది ఉద్యోగులు ఉండగా, అమెరికా వెలుపల తమ అతిపెద్ద పరిశోధనా కేంద్రంగా లండన్‌ను తీర్చిదిద్దుతామని కంపెనీ గతంలోనే వెల్లడించింది.స్టార్ గేట్ ప్రాజెక్ట్‌కు బ్రేక్.. కారణం అదేనా?ఒకవైపు కార్యాలయ విస్తరణ జరుగుతున్నప్పటికీ మరోవైపు మౌలిక సదుపాయాల విషయంలో యూకేకు కొంత నిరాశ ఎదురైంది. భారీ డేటా సెంటర్ ప్రాజెక్ట్ అయిన ‘స్టార్ గేట్’ను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు ఓపెన్ఏఐ ధ్రువీకరించింది. ప్రపంచంలోనే పారిశ్రామిక ఇంధన ధరలు యూకేలో అత్యధికంగా ఉండటం, విద్యుత్ గ్రిడ్‌ను యాక్సెస్ చేయడంలో జరుగుతున్న జాప్యం, లండన్‌లోని కఠినమైన నిబంధనలు కూడా ప్రాజెక్ట్ పురోగతికి అడ్డంకిగా మారాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఈ ప్రాజెక్ట్ భాగస్వామి అయిన ‘ఎన్ స్కేల్’తో చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని సమాచారం.ఇదీ చదవండి: రూ.30 లక్షలలోపు ఈవీలపై పన్ను రాయితీ! -
టీసీఎస్‌లో కొత్త ఉద్యోగాలు: ఈ ఏడాది ఎన్నంటే?
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరంలో ఫ్రెషర్స్ నియామకాలపై స్పష్టత ఇచ్చింది. FY27లో ఇప్పటికే 25,000 ఫ్రెషర్స్‌కు ఆఫర్లు ఇచ్చామని, మార్కెట్ డిమాండ్ పరిస్థితిని బట్టి మరిన్ని నియామకాలు చేపట్టే అవకాశముందని సంస్థ సీఈఓ కే కృతివాసన్ తెలిపారు.2026 ఆర్ధిక సంవత్సరంలో 44,000 మంది ఫ్రెషర్స్‌ను నియమించి, ప్రైవేట్ రంగంలో అత్యధిక నియామకాలు చేపట్టిన కంపెనీల జాబితాలో ఒకటిగా నిలిచిన టీసీఎస్.. ఈ ఏడాది నియామకాలను తగ్గించే అవకాశం ఉందని సమాచారం.FY26లో సంస్థ 12,000 మంది ఉద్యోగులను తొలగించినప్పటికీ, అది ఏఐ ప్రభావం వల్ల కాదని, ప్రాజెక్టుల అమలు విధానంలో మార్పులు రావడం వల్ల ముఖ్యంగా సీనియర్ స్థాయి ఉద్యోగుల అవసరం తగ్గినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కృతి వాసన్ తెలిపారు. అయితే.. సంస్థ భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టడం కొనసాగిస్తుందని, ప్రస్తుత వ్యాపార పరిస్థితి స్థిరంగా ఉందని, కొత్త ప్రాజెక్టులు విభిన్న రంగాలు, ప్రాంతాల్లో పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: వెండి రేటు జోరు: కేజీ రూ.2.65 లక్షలు! -
ఇంటర్ అయిపోయింది... నెక్స్ట్ ఏంటి?
పరీక్షలు ముగిశాయి. అసలైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇది . మీకు వచ్చిన మార్కులు, ర్యాంకు కంటే మీరు తీసుకోబోయే ఈ నిర్ణయమే చాలా ముఖ్యం.- రాహుల్ అత్తులూరి (సిఈఓ & కో-ఫౌండర్, నెక్స్ట్ వేవ్)ఇంటర్ పూర్తయిన సందర్భంగా ఆ సంతోషాన్ని ఎంజాయ్ చేయండి. ఈ రెండేళ్లు మీరు పడ్డ కష్టం, నిద్రలేని రాత్రులు, ఒత్తిడి.. వీటన్నిటికీ తగిన ఫలితం మీరు పొందారు.కానీ, రిజల్ట్స్ వచ్చిన మరుక్షణమే సెలబ్రేషన్స్‌తో పాటు ఒక కొత్త రకమైన టెన్షన్ మొదలవుతుంది. చుట్టాల ప్రశ్నలు, పక్కింటోళ్ల పోలికలు, పేరెంట్స్ ఆందోళన.. ఈ గందరగోళం మధ్యలో మీ లైఫ్ మొత్తాన్ని ప్రభావితం చేసే ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది.ఒక విషయం క్లియర్‌గా చెప్తాను వినండి. మీ ఇంటర్ మార్కులు గానీ, పర్సంటేజీ గానీ, జేఈఈ ర్యాంకు గానీ.. ఇవేవి కూడా మీరేంటో నిర్ణయించలేవు. ఉదాహరణకి ప్రతి ఏటా సుమారు 14.5 లక్షల మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ రాస్తారు, కానీ అందులో కేవలం 18 వేలు మాత్రమే ఐఐటీ సీట్లు పొందుతున్నారు. అంటే ప్రతి వంద మందిలో 99 మందికి ఐఐటీ సీటు రాట్లేదు. దానికి కారణం వాళ్లకు టాలెంట్ లేకపోవడం కాదు, అక్కడ సీట్లు లేకపోవడమే. జేఈఈ అనేది సీట్ల కోసం పెట్టే ఒక ఫిల్టర్ మాత్రమే, అంతే తప్ప అది మీ టాలెంట్నో లేదా మీ ఫ్యూచర్ సక్సెస్నో నిర్ణయించేది కాదు.ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ లో మంచి మార్కులు రాకపోయినా, ఐఐటీ లేదా ఎన్ఐటీల్లో సీటు రాకపోయినప్పటికీ, లైఫ్ లో అద్భుతంగా రాణిస్తున్న వాళ్లు వేలల్లో ఉన్నారు. వాళ్లు పెద్ద పెద్ద కంపెనీలకు సీటీఓ లుగా, స్టార్టప్ ఫౌండర్లుగా, గ్లోబల్ టెక్ కంపెనీల్లో ఏఐ టీమ్స్ లీడర్లుగా ఉంటూ.. ఏటా 30 నుంచి 40 లక్షల ప్యాకేజీలు సంపాదిస్తున్నారు. వాళ్లు సక్సెస్ అవ్వడానికి కారణం 18 ఏళ్ల వయసులో వాళ్లకు వచ్చిన ర్యాంకు కాదు, ఆ తర్వాత నాలుగేళ్ల వాళ్లు గడిపిన విధానం.మీ జీవితంలో ఒక కొత్త మలుపు చాలామంది స్టూడెంట్స్ ఏదో హడావిడిగా, పక్కవాళ్లను చూసి తమ కెరీర్ నిర్ణయాన్ని తీసుకుంటారు. సరిగ్గా అక్కడే సరిదిద్దుకోలేని పొరపాటు జరుగుతుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు తీసుకోబోయే నిర్ణయమే మీ జీవితం ఎలా ఉండాలో నిర్ణయిస్తుంది.ఇక నుంచి కేవలం మీ చదువులోనే కాదు, మీ సక్సెస్‌ను కొలిచే పద్ధతిలో కూడా ఒక పెద్ద మార్పు మొదలవుతుంది. గత 18 ఏళ్లుగా, టెన్త్ క్లాస్ పర్సంటేజీ, ఇంటర్ పర్సంటేజీ, జేఈఈ ర్యాంకు ఇలా అంతా అంకెల చుట్టూనే తిరిగింది…ఒకటే ఎగ్జామ్, ఒకటే రోజు, ఒక్కటే ఛాన్స్. కానీ, ఆ ఆట ఇక్కడితో అయిపోయింది.ఇప్పుడు మొదలయ్యే కొత్త ఆటలో నియమాలు పూర్తిగా వేరుగా ఉంటాయి. మీరు ఏం తయారు చేయగలరు? ఎలాంటి సమస్యలను పరిష్కరించగలరు? మీరు ఎంత విలువను సృష్టించగలరు? అనేదే ఇక్కడ ముఖ్యం. నిజానికి ఇది మీకు ఎంతో స్వేచ్ఛను ఇచ్చే విషయం. ఎందుకంటే, ఇప్పటి వరకు మీకు ఒక్కటే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు, ప్రతి రోజూ మీకు ఒక కొత్త అవకాశమే. ఏదో ఒకటి నేర్చుకోవడానికి, ఏదైనా నిర్మించడానికి, మీ సత్తా ఏంటో నిరూపించుకోవడానికి ప్రతి రోజూ ఛాన్స్ ఉంటుంది. ఈ మార్పును ఎవరైతే ముందుగా గుర్తిస్తారో, వాళ్లు రాబోయే నాలుగేళ్లు కేవలం అందరిలా గడపడమే కాదు, ఆ కాలాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని చరిత్ర సృష్టిస్తారు.రాబోయే నాలుగేళ్లు అసలు ఏం నిర్ణయిస్తాయి?ఈ ఏడాది మొదట్లో దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు వెళ్ళినప్పుడు… అక్కడ ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన ఎడ్యుకేషన్ మినిస్టర్లు, పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలు, ప్రపంచ స్థాయి ఏఐ రీసెర్చర్లతో కలిసి చర్చిస్తుంటే, వాళ్లందరూ ఒకే మాట చెప్పారు. ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థలు విద్యార్థులను భవిష్యత్తు కోసం సిద్ధం చేయడం లేదు. యూనివర్సిటీల్లో ఇంకా 15-20 ఏళ్ల క్రితం నాటి టెక్నాలజీలనే బోధిస్తున్నారు. కేవలం డిగ్రీ ఉంటే సరిపోదని రిక్రూటర్లు స్పష్టంగా చెప్తున్నారు. అభ్యర్థులు సొంతంగా ఏం బిల్డ్ చేయగలరో చూడాలనుకుంటున్నారు.అన్‌స్టాప్ టాలెంట్ రిపోర్ట్ 2025 ప్రకారం ఈ రోజుల్లో 73 శాతం మంది రిక్రూటర్లు కాలేజీ పేరు కంటే, మీకు ఉన్న స్కిల్స్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. మీ గిట్‌హబ్ ప్రొఫైల్, మీరు చేసిన ప్రాజెక్టులే మీ కాలేజీ పేరు కంటే ముఖ్యం కాబోతున్నాయి. రాబోయే నాలుగేళ్లు కేవలం డిగ్రీ అనే ఓక పేపర్ సంపాదించడం గురించి మాత్రమే కాదు, భవిష్యత్ కి తగిన స్కిల్ బిల్డ్ చేసుకోవడం గురించి. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న విద్యార్థులు 2030 నాటికి అందరికంటే ముందుంటారు.మరి మీరు ఏం చేయాలి?మీరు ఏదైనా కాలేజీని లేదా ప్రోగ్రామ్‌ను ఎంచుకునేటప్పుడు కేవలం బ్రోచర్లు, క్యాంపస్ ఫోటోలు చూసి నిర్ణయం తీసుకోకండి. వాటికి బదులు ఈ మూడు ప్రశ్నలు అడగండి:1. పదేళ్ల క్రితం నాటిది కాకుండా, ప్రస్తుతం ఇండస్ట్రీకి ఏం కావాలో దానికి తగ్గట్టుగా సిలబస్ ఎప్పటికప్పుడు మారుస్తున్నారా? లేదా?2. నేర్చుకునే టైమ్ లో 60 నుంచి 70 శాతం కేవలం థియరీ చదవడం మాత్రమే కాకుండా, ప్రాజెక్టులు చేయడానికి కేటాయిస్తున్నారా? లేదా?3. లాస్ట్ ఇయర్ వరకు ఆగకుండా, ఫస్ట్ ఇయర్ నుంచే ఇంటర్న్షిప్స్ చేసేలా ప్రోత్సహిస్తున్నారా? లేదా?ఆ తర్వాత, ప్రపంచం ఏ దిశగా వెళ్తుందో గమనించండి. ఏజెంటిక్ ఏఐ వచ్చేసింది. ఫిజికల్ ఏఐ ప్రపంచాన్ని మార్చేస్తోంది. క్వాంటం కంప్యూటింగ్ మన కళ్లముందే ఉంది. వ్యవసాయం, ఆరోగ్యం, మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఇలా ప్రతి రంగం ఐదేళ్లలో ఈ టెక్నాలజీల వల్ల పూర్తిగా మారిపోబోతున్నాయి. ఎవరైతే విద్యార్థులు ఇప్పుడే ఈ కొత్త టెక్నాలజీలతో ప్రాజెక్టులు చేయడం మొదలుపెడతారో, వాళ్లకు 2030 నాటికి అసలు పోటీ అనేదే ఉండదు.మార్పు ఎంత వేగంగా ఉందో చూడండి. ఇప్పుడు థర్డ్ ఇయర్ లో ఉన్న స్టూడెంట్స్ 2022లో కాలేజీలో చేరినప్పుడు అసలు చాట్ జీపీటీ, క్లాడ్, లేదా జెమిని లేనే లేవు. ఈ నాలుగేళ్లలోనే ప్రపంచం మొత్తం మారిపోయింది. రాబోయే నాలుగేళ్లలో ఇది ఇంకా వేగంగా మారుతుంది. మీ బాధ్యత ఏంటంటే.. రాబోయే మార్పుకు సిద్ధంగా ఉండటం, అంతే తప్ప జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం కాదు.సరైన మార్గాన్ని ఎంచుకోవడంసరైన కాలేజీ లేదా ప్రోగ్రామ్ ఏది అంటే.. స్కిల్స్ బిల్డింగ్ కి పెద్దపీట వేసేవే. అంతే తప్ప అది ఎప్పుడో ఫైనల్ ఇయర్ లో చూసుకోవచ్చులే అనేలా ఉండకూడదు. మొదటి సెమిస్టర్ నుంచే స్టూడెంట్స్ రియల్ ఏఐ ప్రాజెక్టులు, రోబోటిక్స్ మరియు కొత్త టెక్నాలజీలపై పనిచేసేలా వీలు కల్పిస్తున్న చోట చేరండి. ఎక్కడైతే ఇండస్ట్రీ నిపుణులు నేరుగా క్లాస్‌రూమ్‌లోకి వచ్చి, వాస్తవ ప్రపంచంలోని సమస్యలను, టూల్స్‌ను మరియు వారి అనుభవాన్ని పంచుకుంటారో అలాంటి వాటిని వెతకండి.ఇప్పుడు మీతో కొంత మంది మీలాంటి స్టూడెంట్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను, వాళ్లు ఇంటర్ అయిపోయిన తర్వాత వాళ్ళ మార్కుల గురించి గానీ, ర్యాంకుల గురించి గానీ దిగులుపడలేదు. స్కిల్స్ బిల్డ్ చేసుకోవడమే ముఖ్యం అని తెలుసుకొని దానికి అనుగుణంగా దారిని ఎంచుకున్నారు.ఉదాహరణకు విశ్వకసేన అనే ఒక స్టూడెంట్ ఇంటర్ తరువాత స్కిల్స్ ముఖ్యమని గ్రహించి ఎన్ఐఏటి అప్‌స్కిల్లింగ్ ప్రోగ్రామ్ లో చేరి జెనెరేటివ్ ఏఐ పై పట్టు సాధించాడు. తన ఫస్ట్ ఇయర్ లోనే ఏఐ ని వాడుతు ఇన్ఫిల్ అనే ఒక స్టార్టప్ స్టార్ట్ చేశాడు.అలానే సాయి నవతేజ్ అనే స్టూడెంట్ సరిగ్గా కంపెనీలకు ఏ స్కిల్స్ కావాలో అవి నేర్చుకుంటూ ఫస్ట్ ఇయర్ లోనే స్టైపెండ్ తో కూడిన ఇంటర్న్‌షిప్ సాధించాడు. ఇలా సాధించడం చాలా అరుదు. అది స్కిల్స్ కి ఉన్న పవర్.ముంబైలోని 'లెన్‌డెన్‌క్లబ్' కార్పొరేట్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ‘ది మేట్రిక్స్ ప్రోటోకాల్ ఏఐ హ్యాకథాన్'లో కొందరు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ తాము నేర్చుకున్న స్కిల్స్ ద్వారా ఎంతో అనుభవం ఉన్న సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్‌తో, దేశంలోని టాప్ యూనివర్సిటీల విద్యార్థులతో పోటీపడి మరీ తమ సత్తా చాటారు.అంతే కాదు అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్స్ ఇండియా లో తక్కువగా జరుగుతాయి అదీ ఐఐటీల వంటి టాప్ ఇన్స్టిట్యూట్ లలో ఉన్న లాబ్ లలో మాత్రమే జరుగుతాయి అని చాలా మంది అనుకుంటారు. కానీ… పురుజిత్, నయీమ్, అఖిల మరియు కౌశిక్ కలిసి ‘ఎన్ఐఏటి 5.0 లాబ్స్’ ని ఉపయోగించుకొని ఏఐ ద్వారా కోమా పేషెంట్స్ మనసులోని భావాలను తెలియజేసే గొప్ప ఏఐ ఇన్నోవేషన్ తయారు చేశారు. అంతే కాదు…ఇంకొంత మంది స్టూడెంట్స్ మనుషులు వెళ్లలేని ప్రమాదకరమైన ప్రదేశాల్లోకి వెళ్లగలిగేలా హ్యూమనాయిడ్ రోబోట్ ని ప్రోగ్రామ్ చేశారు, ఏఐ డ్రోన్స్ నిర్మిస్తున్నారు.ఇలా రాస్తూ వెళ్తే సక్సెస్ స్టోరీస్ వందల్లో ఉంటాయి. వీళ్ళందరిలో కామన్ పాయింట్ ఒకటే... స్కిల్స్ ముఖ్యం అని గ్రహించారు. ఇంటర్ తర్వాత ఎన్ఐఏటి ని ఎంచుకున్నారు.ఎన్ఐఏటి వంటి అప్‌స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రీకి అవసరమైన స్కిల్స్ నేర్చుకునేలా డిజైన్ చేయబడ్డాయి. ఇవి విద్యార్థులకు కావాల్సిన ప్లాట్‌ఫామ్స్ మరియు వాతావరణాన్ని అందిస్తూ, మొదటి రోజు నుండే వారిని 'టెక్ బిల్డర్స్'గా మారుస్తున్నాయి.చివరగా ఒక మాటమీ ఇంటర్ రిజల్ట్ అనేది ఒక మైలురాయి మాత్రమే, అది మీ జీవితానికి ఇచ్చే తీర్పు కాదు. ఇది మీ లైఫ్ లో ఎంతో ఉత్సాహంగా ఉండాల్సిన సమయం. దీన్ని ఒత్తిడిగా మార్చుకోవద్దు. మీ ముందు ఎన్నో దారులు ఉన్నాయి. మీరు ఎంచుకునే వాతావరణం, మీరు నేర్చుకునే స్కిల్స్, మీరు పరిష్కరించే సమస్యలే మీ కెరీర్‌ను నిర్ణయిస్తాయి.భారతదేశపు తర్వాతి తరం 'టెక్ బిల్డర్స్' ఇప్పుడే మొదలవుతున్నారు. ఆ లిస్టులో మీరు కూడా ఒకరు. అల్ ది బెస్ట్!For more details: https://rebrand.ly/be7c36 -
''ఒరాకిల్ ఉద్యోగం పోయింది.. మేకలు పెంచాలనుకుంటున్నా''
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లోనూ విస్తరిస్తున్న తరుణంలో.. టెక్ రంగంలో ఉద్యోగాల కోతలు పెరుగుతున్నాయి. ఈ తరుణంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ తన భవిష్యత్ గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో సలహాలు కోరాడు.''ఒరాకిల్‌లో సీనియర్ SDEగా ఉద్యోగం కోల్పోయాను. మా సొంత ఊరిలో ఏదైనా జాబ్ చేద్దామంటే? వచ్చే జీతం నేను ఇంతకుముందు పొందుతున్న దానికి ఏమాత్రం సరిపోదు, ఆ డబ్బుతో ప్రతి నెలా నా కార్ లోన్ కూడా కట్టలేను. నేను సుమారు 15 లక్షల రూపాయలు పొదుపు చేశాను. నేను భారతదేశంలో ఏ వ్యాపారం చేయగలను? నేను మేకల పెంపకం చేయవచ్చా? నేను కష్టపడి పనిచేసే వ్యక్తిని, ఒక చిన్న చవకైన భూమి కొని ఒక చిన్న ఆఫీసు పెట్టుకుని, ఫ్రీలాన్స్‌గా పని వెతుక్కుంటూ, మేకలను పెంచుకుంటూ జీవించగలను. నాకు ఏం చేయాలో పాలుపోవడం లేదు, దయచేసి సహాయం చేయండి'' అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.దీనిపై స్పందించిన కొందరు నెటిజన్లు, అతను టెక్నాలజీ రంగంలోనే కొనసాగాలని సూచించారు. ముఖ్యంగా AIపై నైపుణ్యాలు పెంచుకుని, కొత్త అవకాశాలను వెతకాలని సూచించారు. మరికొందరు గోట్ ఫార్మింగ్ మంచి వ్యాపారమని చెప్పినప్పటికీ, అందులో స్థిరపడడానికి ఒకటి.. రెండు సంవత్సరాలు పట్టవచ్చని హెచ్చరించారు.ఇంకొంత మంది మరింత జాగ్రత్తగా ఆలోచించాలని సూచిస్తూ, ముందుగా ఒక స్థిరమైన ఉద్యోగం సంపాదించి, ఆ తర్వాత మీ పొదుపును అదనంగా ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టండి. మీ అనుభవంతో, దాన్ని నడపడానికి మీరు వ్యక్తులను నియమించుకోవచ్చు. ఆ వ్యాపారం మీ జీతం కంటే ఎక్కువ స్థిరమైన ఆదాయాన్ని సంపాదించడం ప్రారంభించిన తర్వాత, మీరు దానిని పూర్తికాల ఉద్యోగంగా పరిగణించవచ్చు'' అని సూచించారు.ఇదీ చదవండి: బంగారం ధరల్లో భారీ మార్పు: ఏడు రోజుల్లో ఇంతలా.. -
'యాప్‌లు మాయం.. ఏఐ చేతికి జీవితం': నథింగ్ సీఈఓ
టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతూ.. దాదాపు అన్ని రంగాల్లోనూ ఎప్పటికప్పుడు కొత్త మార్పులు తీసుకొస్తోంది. 2007లో యాపిల్ కంపెనీ ఐఫోన్ లాంచ్ చేసినప్పుడు.. ఫోన్ పరిశ్రమలో ఒక మహత్తర మార్పు చోటుచేసుకుంది. అప్పటివరకు మనం ఉపయోగించిన కీప్యాడ్ ఫోన్లు నెమ్మదిగా అంతరించిపోయి, టచ్‌స్క్రీన్ ఫోన్లు వచ్చేశాయి. ఇప్పడూ స్మార్ట్ఫోన్లను మన దైనందిన జీవితంలో ఒక భాగమైపోయాయి.నథింగ్ సీఈఓ 'కార్ల్ పీ' అభిప్రాయం ప్రకారం.. గత ఇరవై సంవత్సరాలుగా స్మార్ట్ఫోన్ల వినియోగంలో పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు. మనం ఇంకా లాక్ స్క్రీన్, హోమ్ స్క్రీన్, యాప్‌లు, యాప్ స్టోర్లకు పరిమితమై ఉన్నాం. ఏ చిన్న పని చేయాలన్నా మనం అనేక యాప్‌లను ఉపయోగిస్తూ.. సమయం వృధా చేస్తున్నాం. ఇది కొంత క్లిష్టంగా మారింది.ప్రస్తుతం ఏఐ ఒక కొత్త విప్లవానికి దారితీయనుంది. భవిష్యత్తులో యాప్‌లు పూర్తిగా మాయమైపోయి.. వాటి స్థానంలో ఏఐ ఏజెంట్స్ రానున్నాయి. అలవాట్లు, ఇష్టాలు, అవసరాలను అర్థం చేసుకుని మన తరఫున పనులను స్వయంగా నిర్వహిస్తాయి. ఉదాహరణకు, ఒక స్నేహితుడితో కాఫీకి వెళ్లాలని అనుకుంటే, మనం వేర్వేరు యాప్‌లను ఉపయోగించకుండా, ఏఐ మన కోసం సమయం నిర్ణయించి, స్థలం ఎంపిక చేస్తుందన్నమాట.ప్రస్తుతం ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం ఇచ్చే ఆదేశాలపై ఆధారపడి పనిచేస్తుంది. కానీ భవిష్యత్తులో రానున్న ఏఐ మన ఆలోచనలను కూడా ముందుగానే అర్థం చేసుకుని సూచనలు ఇవ్వగలదు. ఇది మన జీవితాన్ని మరింత సులభతరం చేయడమే కాకుండా, టెక్నాలజీపై మన ఆధారాన్ని కూడా పెంచుతుంది.ఈ మార్పు స్టార్టప్ కంపెనీలకు ఒక సవాలుగా మారవచ్చు. ఇప్పటివరకు యాప్‌లపై ఆధారపడిన వ్యాపార నమూనాలు భవిష్యత్తులో పనిచేయకపోవచ్చు. అందువల్ల.. కంపెనీలు తమ వ్యూహాలను మార్చుకుని, ఏఐ ఆధారిత పరిష్కారాలపై దృష్టి పెట్టాలి. లేకుంటే.. వారు ఇతర సంస్థలతో వెనుకబడే అవకాశం ఉంది.ఇప్పటికే కొన్ని కంపెనీలు ఏఐను తమ ఉత్పత్తుల్లో అమలు చేయడం ప్రారంభించాయి. నథింగ్ వంటి సంస్థలు వినియోగదారులకు ఏఐ ఆధారిత ఫీచర్లను అందిస్తూ, కొత్త అనుభవాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయి. దీన్నిబట్టి చూస్తే.. రాబోయే రోజుల్లో ఏఐ ఎంతగా పనిచేస్తుందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. -
ఏఐ స్కిల్స్‌పై స్కాలర్షిప్ టెస్ట్
తెలంగాణకు చెందిన స్టార్టప్ 'కాగ్నిటివ్‌స్కోర్.ఏఐ' విద్యను మార్కుల ఆధారిత మూల్యాంకనం నుండి మేధోశక్తి వైపు మళ్లించే లక్ష్యంతో 'కాగ్నిచాంప్ ఇండియా స్కాలర్షిప్ — తెలంగాణ ఎడిషన్' అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. కీర్తి కుమార్ జైన్, విక్రమ్ సింగ్ నేగి స్థాపించిన ఈ కార్యక్రమం, ఏఐ-ఆధారిత ప్రపంచంలో అవసరమైన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే నైపుణ్యాలను గుర్తించి, పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.3 నుండి 18 సంవత్సరాల వయస్సు గల విద్యార్థుల కోసం ఉద్దేశించిన ఈ స్కాలర్షిప్లో, 20 నిమిషాల ఆన్లైన్, గేమిఫైడ్, అడాప్టివ్ అసెస్మెంట్ ఉంటుంది. ఇది మే 2 లేదా 3, 2026న జరగనుంది. దీనికి రిజిస్ట్రేషన్లు ఏప్రిల్ 26న ముగుస్తాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇందులో పాల్గొనడం ఉచితం కాగా, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు రూ.499 చెల్లించి నమోదు చేసుకోవచ్చు.సాంప్రదాయ పరీక్షలకు భిన్నంగా, కాగ్నిచాంప్ మేధోశక్తి, ఉన్నత స్థాయి ఆలోచనా సామర్థ్యం, ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రం, ఇంకా సృజనాత్మకత, సమస్య పరిష్కారం వంటి 21వ శతాబ్దపు కీలక నైపుణ్యాలను మూల్యాంకనం చేస్తుంది. దీని ద్వారా విద్యార్థులు గుర్తింపు, 12వ తరగతి వరకు 100% ట్యూషన్ ఫీజు మద్దతుతో కూడిన స్కాలర్షిప్లు, వారి బలాబలాలపై వ్యక్తిగత అంతర్దృష్టుల వంటి అవకాశాలను పొందుతారు.ఈ కార్యక్రమం, జాతీయ విద్యా విధాన చట్రానికి అనుగుణంగా, విద్యార్థుల అభ్యసనం, అభివృద్ధిపై పాఠశాలలకు, తల్లిదండ్రులకు ఆచరణాత్మకమైన అంతర్దృష్టులను కూడా అందిస్తుంది. ఈ ప్రారంభంతో, భారతదేశంలో భవిష్యత్తుకు సిద్ధమైన, జ్ఞానాత్మక ఆధారిత విద్యలో అగ్రగామిగా నిలవాలని తెలంగాణ లక్ష్యంగా పెట్టుకుంది. -
టెక్ ఇండస్ట్రీలో ఏఐ ప్రకంపనలు
గ్లోబల్ టెక్నాలజీ రంగంలో కొలువుల కోత కొనసాగుతోంది. 2026 ప్రారంభం నుంచే టెక్ దిగ్గజాలు లేఆఫ్స్ మంత్రాన్ని జపిస్తుండటంతో సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలోకి మళ్లుతున్న పెట్టుబడులు, కంపెనీల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 51,000 మంది నిపుణులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. నియామకాలు మందగించడం, కేవలం నైపుణ్యం కలిగిన స్వల్ప శ్రామిక శక్తితోనే గరిష్ట ఉత్పాదకత సాధించాలనే లక్ష్యంతో కంపెనీలు అడుగులు వేస్తున్నాయి.రంగంలోకి ఏఐప్రస్తుత సంక్షోభంలో క్లౌడ్ కంప్యూటింగ్, హార్డ్‌వేర్, గేమింగ్ రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా ఈ ఏడాది చోటుచేసుకున్న ప్రధాన తొలగింపులు కింది విధంగా ఉన్నాయి.ఒరాకిల్.. టెక్ చరిత్రలోనే అతిపెద్ద సింగిల్ డే లేఆఫ్స్‌లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 30,000 మందిని తొలగించింది. ఇందులో భారత్‌కు చెందిన 12,000 మంది ఉండటం గమనార్హం. ఏఐ మౌలిక సదుపాయాల పటిష్టతకే తమ ప్రాధాన్యమని సంస్థ స్పష్టం చేసింది.అమెజాన్.. కొవిడ్ సమయంలో పెరిగిన అదనపు సిబ్బందిని తగ్గించుకునే క్రమంలో సుమారు 16,000 మందికి ఉద్వాసన పలికింది. రోబోటిక్స్ విభాగంలోనూ కోతలు విధించడం ద్వారా కార్యకలాపాల క్రమబద్ధీకరణపై దృష్టి పెట్టింది.డెల్.. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా 11,000 ఉద్యోగాలను తొలగించడంతోపాటు కొత్త నియామకాలపై కఠిన ఆంక్షలు విధించింది.బ్లాక్(Block).. జాక్ డోర్సే నేతృత్వంలోని ఈ సంస్థ 4,000 మందిని తొలగిస్తూ ఇంటెలిజెన్స్ టూల్స్ వినియోగం పెరగడమే ఇందుకు కారణమని బహిరంగంగా ప్రకటించింది.మెటా, అట్లాసియన్.. మెటా తన రియాలిటీ ల్యాబ్స్‌లో 10 శాతం సిబ్బందిని తగ్గించగా, అట్లాసియన్ 1,600 మందిని ఇంటికి పంపింది. మారుతున్న ఏఐ నైపుణ్య అవసరాలే ఇందుకు కారణమని అట్లాసియన్ పేర్కొంది.కారణాలేంటి?కంపెనీలు తమ మూలధనాన్ని సాధారణ నిర్వహణ నుంచి ఏఐ, ఆటోమేషన్ వైపు మళ్లిస్తున్నాయి. అధిక వడ్డీ రేట్లు, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో ఎఫిషియన్సీ (సామర్థ్యం) పేరుతో ఖర్చులను తగ్గిస్తున్నాయి. సంప్రదాయ కోడింగ్, సపోర్ట్ ఉద్యోగాల కంటే ఏఐ డెవలప్మెంట్, డేటా సైన్స్ తెలిసిన వారి కోసమే కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి.మానవ మేధ vs కృత్రిమ మేధఈ లేఆఫ్స్ పరంపర ఉద్యోగ భద్రతపై పెద్ద చర్చకు దారితీసింది. ఏఐ వల్ల సాధారణ ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఇదే సమయంలో ఏఐ నైపుణ్యం కలిగిన వారికి కొత్త అవకాశాలు వస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ‘టెక్ రంగం ఇప్పుడు ఉద్యోగుల సంఖ్య కంటే సాంకేతిక సామర్థ్యానికే పెద్దపీట వేస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న తొలగింపులు కేవలం ఖర్చు తగ్గింపు మాత్రమే కాదు, అది పరిశ్రమ నిర్మాణంలో వస్తున్న పెను మార్పు. ఉద్యోగులు తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేసుకోకపోతే ఈ డిజిటల్ రేసులో వెనుకబడే ప్రమాదం ఉంది’ అని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: చల్లారిన పసిడి వేడి! తులం ఎంతంటే.. -
ఏఐతో హైరింగ్ ధోరణుల్లో మార్పులు
కృత్రిమ మేథ (ఏఐ)తో నియామకాల ధోరణుల్లో గణనీయంగా మార్పులు వస్తున్నాయని టీమ్‌లీజ్ డిజిటల్ సీఈవో నీతి శర్మ తెలిపారు. దీని వల్ల ఉద్యోగుల తొలగింపు అనేది ఆర్థికాంశాలతో కన్నా ఎక్కువగా టెక్నాలజీతో ముడిపడి ఉన్న వ్యవహారమని పేర్కొన్నారు. ఏఐతో ఉత్పాదకత పెరుగుతుండటంతో కంపెనీలకు పెద్ద సంఖ్యలో ఉద్యోగుల అవసరం తగ్గుతోందన్నారు. తక్కువ మంది సిబ్బందితోనే విస్తృతంగా కార్యకలాపాలని నిర్వహించుకోవడంపై అవి దృష్టి పెడుతున్నాయని శర్మ వివరించారు.అంతేగాకుండా కోవిడ్ సమయంలో భారీ స్థాయిలో నియమించుకున్న ఉద్యోగులను కంపెనీలు ప్రస్తుతం వ్యాపార అవసరాలకు అనుగుణంగా తగ్గించుకుంటూ ఉండటం కూడా ఉద్వాసనలకు కారణమవుతోందని తెలిపారు. ఈ అంశాలన్నీ కలిసి ఉద్యోగుల్లో అభద్రత భావన పెరుగుతోందని, 60 శాతం మంది పైగా టెక్ వర్కర్లలో స్థిరత్వంపై ఆందోళన నెలకొందని తెలిపారు. గత కొన్నాళ్లుగా టెక్నాలజీ రంగంలో నిర్దాక్షిణ్యంగా కోతలు అమలవుతున్న నేపథ్యంలో శర్మ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ట్రాకింగ్ సైట్ లేఆఫ్స్.ఎఫ్‌వైఐ ప్రకారం ఈ ఏడాది ఇప్పటివరకు అంతర్జాతీయంగా 70 పైగా టెక్ కంపెనీలు ఏకంగా 40,480 మంది ఉద్యోగులను తొలగించాయి. ఉత్పాదకత 30 శాతం వరకు అప్..ఏఐతో కోడింగ్, సపోర్ట్‌లాంటి కార్యకలాపాల్లో ఉత్పాదకత 10–30 శాతం వరకు పెరిగిందని నీతి శర్మ చెప్పారు. ప్రొడక్టివిటీ కస్టమర్ సపోర్ట్‌లో 14–15 శాతం, కోడింగ్, టాస్క్‌ల రైటింగ్‌లాంటి కొన్ని విధుల్లో 40 శాతం మేర పెరిగినట్లు పేర్కొన్నారు. దీనితో ఇలాంటి పనుల కోసం పెద్ద ఎత్తున సిబ్బంది అవసరం ఉండటం లేదని, తక్కువ మంది ఉద్యోగులు సరిపోతున్నారని వివరించారు. లేఆఫ్‌లతో మిగిలే నిధులను సంస్థలు టెక్నాలజీపై ఇన్వెస్ట్ చేస్తున్నాయని చెప్పారు. స్వల్పకాలికంగా రాబడులపై అనిశ్చితి నెలకొన్నా దీర్ఘకాలికంగా ఉపయోగపడే సామర్థ్యాలను పెంచుకోవడం వైపు మళ్లే విధంగా వ్యవస్థాగతంగా వస్తున్న మార్పులను ఇది సూచిస్తోందన్నారు. బడా టెక్ కంపెనీలు సైతం బ్యాలెన్స్ షీట్స్ పటిష్టంగా ఉన్నప్పటికీ ఏఐపై బిలియన్ల కొద్దీ డాలర్లను ఇన్వెస్ట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, చాలా కంపెనీలు ఏఐని వినియోగించుకోవడంలో ఇంకా ప్రాథమిక స్థాయిలో ఉన్నాయని వివరించారు. నిపుణులకే డిమాండ్..ఏఐ వల్ల రొటీన్ ఉద్యోగాలకు ప్రాధాన్యత తగ్గుతోందని, విశిష్ట నైపుణ్యాలున్న వారికి డిమాండ్ పెరుగుతోందని శర్మ చెప్పారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీ)లో ఏఐ, డేటా, సైబర్ సెక్యూరిటీ నియామకాలు వార్షికంగా 18–27 శాతం పెరుగుతుండగా, ఐటీ సరీ్వసుల విభాగంలో 4–6 శాతం వృద్ధి ఉంటోందని తెలిపారు. అదే సమయంలో నిపుణుల కొరత 25–60 శాతం మేర ఉంటోందన్నారు. దీని వల్ల వేతన వృద్ధి 10–12 శాతం ఉంటోందని శర్మ వివరించారు. సీనియర్ హోదాలకు రూ. 60 లక్షల వరకు ప్రీమియం స్థాయిలో వేతనాలు ఉంటున్నాయన్నారు. అత్యధిక నైపుణ్యాలు, ఏఐ ఆధారిత ఉద్యోగాల వైపు పరిశ్రమ మళ్లుతుండటాన్ని ఇది సూచిస్తోందని శర్మ తెలిపారు.ఏఐ వల్ల ఉద్యోగ విధుల స్వరూపం మారుతోందని, ఇందుకోసం కంపెనీలు తమ ఉద్యోగులకు కొత్త నైపుణ్యాల్లో శిక్షణనివ్వడంపై మరింతగా దృష్టి పెట్టడం కీలకమని ఆమె చెప్పారు. అధికారికంగా శిక్షణ పొందుతున్న ఉద్యోగుల సంఖ్య పాతిక శాతం లోపే ఉంటోందన్నారు. కాబట్టి ఉద్యోగులకు ఎప్పటికప్పుడు శిక్షణనివ్వడం, అంతర్గతంగా వేరే వేరే విభాగాల్లోకి మారే వెసులుబాట్లు కల్పించడంపై కంపెనీలు ఇన్వెస్ట్ చేయాలని, విధాన నిర్ణేతలు కూడా భారీ స్థాయి శిక్షణ కార్యక్రమాలకు ప్రోత్సాహకాలిచ్చేలా చర్యలు తీసుకోవాలని శర్మ చెప్పారు. ఇక ఉద్యోగులు కూడా కొత్త నైపుణ్యాలను సంతరించుకోవడానికి ప్రాధాన్యమిచ్చే ఆలోచనా ధోరణితో ముందుకెళ్లాలని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఇరాన్‌తో భారత్ సహా పలు దేశాల ఒప్పందాలు -
డిగ్రీ మీ ఉద్యోగాన్ని కాపాడదు!.. ఏం చేయాలో తెలుసా?
ప్రపంచం వేగంగా మారుతోంది. గతంలో మాంద్యం, కరోనా మహమ్మారి వంటి పరిస్థితులు అన్ని రంగాలపై ఒకేలా ప్రభావం చూపలేదు. అదే విధంగా.. ప్రస్తుతం జరుగుతున్న AI కూడా ప్రతి ఉద్యోగాన్ని సమానంగా ప్రభావితం చేయదు. ఈ పరిస్థితుల్లో నిలబడే వారు ఎవరు అంటే?.. తమ ఉద్యోగాలను జాగ్రత్తగా ఎంపిక చేసుకున్నవారు. ముఖ్యంగా.. యంత్రాలు పూర్తిగా భర్తీ చేయలేని పనులను చేసే వారు భవిష్యత్తులో విజయవంతంగా ముందుకు సాగుతారు.AI సులభంగా చేసే పనులు➤డేటా ప్రాసెసింగ్➤ప్యాటర్న్ గుర్తింపు➤కంటెంట్ తయారీ➤నియమాల ప్రకారం పనిచేయడంవీటన్నింటిని ఏఐ సులభంగా చేయగలదు. అంటే.. ఇలాంటి ఉద్యోగాల్లో ఉన్నవారు ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం ఉత్తమం. లేదా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడం మంచిది. లేకుంటే ఏ సమయంలో అయినా ఉద్యోగం కోల్పోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే.AI చేయలేని పనులుAI ఎంత అభివృద్ధి చెందినా.. అన్ని రంగాల్లో, అన్ని పనులను చేస్తుందని అనుకోవడం పొరపాటు. కాబట్టి ఏఐ సమర్థవంతంగా చేయలేని పనులు కూడా ఉన్నాయి. ఈ జాబితాలో..భావోద్వేగ నైపుణ్యం: మనుషుల భావాలు అర్థం చేసుకోవడం, అనుభూతి చెందడం AIకు కష్టం.నిర్ణయాలు: నైతికత, అనుభవం, పరిస్థితుల ఆధారంగా తీసుకునే నిర్ణయాలు AIకి సవాలు.ఉన్నత స్థాయి క్రియేటివిటీ: “ఏం చేయాలి?” అనే ఆలోచన మనిషి దగ్గరే ఉంటుంది. కాబట్టి ఏఐ సొంతంగా ఆలోచించలేదు.అనూహ్య పరిస్థితుల్లో నైపుణ్యం: ఉదాహరణకు.. ఒక ప్లంబర్ పని. ప్రతిసారీ ఒకే సమస్య తలెత్తదు. ప్రతిసారీ కొత్త సమస్య పుడుతుంది.సురక్షితమైన ఉద్యోగాలు / AI ప్రభావం తక్కువగా ఉండే రంగాలు➜హెల్త్‌కేర్: డాక్టర్లు, నర్సులు, థెరపిస్టులు➜ట్రేడ్స్: ఎలక్ట్రిషియన్, ప్లంబర్, మెకానిక్➜మెంటల్ హెల్త్: కౌన్సిలర్, సైకాలజిస్టు➜AI రంగం: AI ఇంజనీర్, ప్రాంప్ట్ ఇంజనీర్, సైబర్ సెక్యూరిటీ➜కాంప్లెక్స్ సర్వీసెస్: లాయర్లు, స్ట్రాటజిస్టులు➜క్రియేటివ్ రంగం: బ్రాండ్ స్ట్రాటజీ, కంటెంట్ డైరెక్షన్ఏఐ అధికంగా విజృంభిస్తున్న కాలంలో.. ఏ మాత్రం భయపడకుండా ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఈ రోజుల్లో కేవలం డిగ్రీ ఉంటే.. ఉద్యోగం సురక్షితంగా ఉంటుందనుకోవడం పొరపాటు. ఏఐ కూడా ఎదుర్కోలేని రంగాన్ని మీరు ఎంచుకోవాలి. అప్పుడే ముందుకు వెళ్లగలరు. -
AI రాకతో IT ఉద్యోగుల్లో వణుకు
-
నమ్మితే నెట్టేట మునిగినట్టే..
సాక్షి, హైదరాబాద్: ఇప్పుడు సర్వం చాట్‌బాట్ మయమైపోతోంది. వంట మొదలు ఆదాయపు పన్ను మదింపు వరకు... సాధారణ అనారోగ్య సమస్యలు మొదలు వివిధ స్పెషలైజ్డ్ రంగాల్లోనూ దీనిపై ఆధారపడుతున్నారు. రోజువారీ పనుల కోసం ఏఐ చాట్బాట్లను ఉపయోగిస్తున్నా... అది ఇచ్చే సమాచారం కచి్చతత్వం, డేటా గోప్యత, జవాబుదారీతనం విషయంలో ప్రమాదాలు పొంచి ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘వంటకాల విషయంలో చాట్బాట్లు భోజన ప్రణాళికలను రూపొందించగలవు, తగిన వంటకాలను సూచించగలవు. అయితే రుచిని లేదా ఆకృతిని అంచనా వేయలేదు.వంటల్లో కొలతలు తప్పుగా ఉండొచ్చు, ఆహార సంప్రదాయాలను విస్మరించవచ్చు. ఆలోచనల రూపకల్పనకు ఇది సురక్షితమే కానీ సమస్యల నివారణకు ఇచ్చే సూచనలను తరచుగా సమీక్షించాల్సి ఉంటుంది’అని నిపుణులు సూచిస్తున్నారు. పన్ను మదింపు, హెల్త్ ఇష్యూస్ వంటి వాటిలో దీనిపై అతిగా లేదా పూర్తిగా ఆధారపడటం ప్రమాదకరమని చెబుతున్నారు. ప్రతి 8 మంది టీనేజర్లు/యువకుల్లో ఒకరు సలహా కోసం వీటిని ఉపయోగిస్తున్నారు. ఓపెన్ ఏఐ, హార్వర్డ్ అధ్యయనం ప్రకారం... అన్ని రంగాల్లో చాట్బాట్లపై ఆధారపడటం పెరిగింది.ఆరోగ్య విషయంలో... చాట్బాట్లు తప్పుడు లేదా హానికరమైన వైద్య సలహాలను ఇవ్వగలవని వివిధ అధ్యయనాలు వెల్లడించాయి. కొన్నిసార్లు ఆత్మహత్య ఆలోచనల వంటి సంక్షోభాలకు సరైన ప్రతిస్పందనలను అందించడంలో విఫలమౌతాయని చెప్పాయి. ⇒ వైద్య సంబంధిత ప్రశ్నలకు అనేక చాట్‌బాట్ ప్రతిస్పందనల్లో తప్పుడు సమాచారం ఉంటోంది. ⇒ ఆరోగ్య సలహాల కోసం ఏఐని ఉపయోగించడం ప్రమాదకరం. ⇒ తీవ్రమైన అనారోగ్య సమస్యలకు వైద్య సహాయం పొందడంలో ఆలస్యం జరగవచ్చు. ⇒ వైద్యుల మాదిరిగా ఏఐ శారీరక పరీక్షలు చేయలేదు. అలాగే వినియోగదారుడి పూర్తి వైద్య చరిత్రను అర్థం చేసుకోలేదు. సందర్భం తెలియకపోవడం వల్ల తప్పుడు రోగ నిర్ధారణలు జరుగుతాయి. ⇒ మానసిక ఆరోగ్యం కోసం చాట్బాట్లపై ఆధారపడితే వృత్తిపరమైన సంరక్షణ విషయంలో చిక్కులు ఎదుర్కునే ప్రమాదముంది. ⇒ హానికరమైన సలహాలను ఇచి్చన తర్వాత, యూఎస్ నేషనల్ ఈటింగ్ డిజార్డర్స్ అసోసియేషన్ (నెడా) తమ చాట్‌బాట్ ’టెస్సా’ను తొలగించింది. పన్ను మదింపు విషయంలో.. ⇒ ఏఐ పాత పన్ను చట్టాలనుఉపయోగించవచ్చు. వ్యూహాత్మక ప్రణాళికను అందించలేకపోవచ్చు. కచ్చితత్వ సమస్యలెదురుకావొచ్చు. ⇒ పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నులకు బాధ్యత వహించాలి. ఏఐ ప్లాట్‌ఫారమ్‌లు తరచుగా తమ సమాధానాలు అధికారిక సలహా కాదని పేర్కొంటాయి. ⇒ డేటా గోప్యతకు భంగం వాటిల్లుతుంది. వివిధ అధ్యయనాల్లో సిఫార్సులు ⇒ అత్యంత కీలకమైన సమాచారం కోసం ఎల్లప్పుడూ మానవ నిపుణులను సంప్రదించాలి. ⇒ వ్యక్తిగతంగా గుర్తించదగిన సమాచారాన్ని చాట్బాట్లతో పంచుకోవద్దు. వ్యక్తిగత డేటాను సంరక్షించుకోవాలి. ⇒ సాధారణ మేధోమథనం కోసం ఏఐని ఉపయోగించుకోవచ్చు. ఏదైనా అంశానికి సంబంధించి ప్రాథమిక, ప్రారంభ సమాచారంగా మాత్రమే ఉపయోగించుకోవచ్చు. -
తెలుగులో తొలి ఏఐ సినిమా.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్
ఏఐ వచ్చాక అన్ని రంగాల్లో సరికొత్త సాంకేతికతను అందిపుచ్చకుంటున్నాయి. సినీ ఇండస్ట్రీలో సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతున్నారు. తాజాగా పూర్తిస్థాయి కృత్రిమ మేధ (ఏఐ)తో రూపొందుతున్న తొలి తెలుగు ఫీచర్ ఫిల్మ్‌గా “అంబ’s రివెంజ్” ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు జయవర్ధన్ మాడి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లలితకళా చిత్రాలు, నక్క తోక ఫిల్మ్స్ బ్యానర్లపై సంయుక్తంగా శ్రీకాంత్ రెడ్డి కుందూరు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మహాభారతంలోని శక్తివంతమైన పాత్ర అంబ కథను ఆధారంగా తీసుకుని వినూత్నంగా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ.. 'తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాం. “అంబs రివెంజ్” ప్రాజెక్టు కోసం అత్యాధునిక ఏఐ టూల్స్‌ను వినియోగింతాం. విజువల్స్, పాత్రల రూపకల్పన, కథన నిర్మాణం వంటి అంశాలను కొత్త శైలిలో ఆవిష్కరిస్తున్నాం. హనుమాన్ విజయోత్సవం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను విడుదల చేస్తున్నాం. ఈ ప్రాజెక్టుకు సంభందించి పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తాం " అని తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమలో ఏఐ ఆధారిత కథాచిత్రాల దిశగా ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు. ఈ పౌరాణిక ప్రయోగాత్మక చిత్రం తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. -
Bangalore : తెలంగాణ టెకీ దంపతుల ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్
బెంగళూరులో తెలంగాణ దంపతులు కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా ఉద్యోగం కోల్పోవడం, వరుస ఆర్థిక ఇబ్బందుల వల్ల దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్లు బెంగళూరు పోలీసులు నిర్ధారించారు. తెలంగాణకు చెందిన టెకీ బాను చందర్‌రెడ్డి (32) బెంగళూరులో తన అపార్ట్మెంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కొద్ది సేపటికే ఆయన భార్య, ఐబీఎంలో పనిచేస్తున్న బిబి షాజియా సిరాజ్ 17వ అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటనపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.సిద్దిపేట జిల్లాకు చెందిన బాను చందర్‌రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా అమెరికాలో పనిచేసేవారు. అయితే గతేడాది ఏఐ ప్రభావంతో ఉద్యోగం కోల్పోయారు. దీంతో భార్య షాజియాతో కలిసి భారత్‌కు తిరిగి వచ్చి బెంగళూరులో స్థిరపడ్డారు. దాదాపు ఏడాది కాలంగా ప్రయత్నాలు చేసినా స్థిరమైన ఉద్యోగం దొరకక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జాబ్ మార్కెట్లో ఏఐ ఆధారిత మార్పులు, ఉద్యోగాల కోతల కారణంగా అవకాశాలు తగ్గిపోవడంతో ఆయన ఆర్థిక సమస్యలు మరింత తీవ్రమయ్యాయి.మరోవైపు, షాజియాతో మతాంతర వివాహం జరగడం వల్ల బాను చందర్‌రెడ్డిని అతని కుటుంబ సభ్యులు దూరం పెట్టారు. ముఖ్యంగా తండ్రి వ్యతిరేకత వ్యక్తం చేయడంతో బాను చందర్ కుంగిపోయాడు. ఓ వైపు కుటుంబసభ్యులు దూరం పెట్టడం, ఆర్ధిక ఇబ్బందులతో ఒత్తిడికి గురైన బాను చందర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. భర్త మరణాన్ని తట్టుకోలేని షాజియా తీవ్ర షాక్‌కు గురై 17వ అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న లేఖలో, తన మరణానికి భార్యను ఎట్టి పరిస్థితుల్లోనూ నిందించవద్దని బాను చందర్‌రెడ్డి పేర్కొన్నారు.ఈ ఘటన టెక్ రంగంలో ఏఐ ప్రభావం, ఉద్యోగ భద్రతపై కొత్త ప్రశ్నలను లేవనెత్తింది. నిరుద్యోగం, కుటుంబ విభేదాలు, మానసిక ఒత్తిడి కలిసినప్పుడు ఎంతటి విషాద పరిణామాలు చోటు చేసుకోవచ్చో మరోసారి స్పష్టమైంది. -
ప్రయోగాల నుంచి ప్రయోజనాల దిశగా..
కృత్రిమ మేధ (ఏఐ) ఇప్పుడు కేవలం ప్రయోగశాలలకో, మొబైల్ యాప్‌లకో పరిమితమైన సాంకేతికత కాదు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంస్థలు తమ రోజువారీ కార్యకలాపాల్లో ఏఐని అంతర్భాగం చేసుకుంటున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ‘మోడల్ సామర్థ్యం’ కంటే ఇప్పుడు దాని ‘నిర్వహణా సామర్థ్యం’ పైనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎంటర్ప్రైజ్ ఏఐ మనుగడకు నియంత్రణ, సమన్వయం కీలకంగా మారుతున్నాయిని ప్రముఖ సంస్థ గార్ట్నర్ అంచనా వేసింది.2027 నాటికి 40 శాతం ప్రాజెక్టులు రద్దు?గార్ట్నర్ అంచనా ప్రకారం, 2027 చివరి నాటికి సుమారు 40 శాతం ఏజెంటిక్ ఏఐ ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం ఉంది. ఇందుకు కారణం.. అంచనాలకు మించి నిర్వహణ ఖర్చులు పెరగడం, వ్యాపార పరంగా స్పష్టమైన విలువ జోడింపు కనిపించకపోవడం వంటివి ఆందోళన కలిగిస్తున్నాయి. ఇదిలాఉండగా, కేవలం ఏఐ మోడల్స్‌ను కొనుగోలు చేయడం వల్ల లాభం లేదని, పని విధానాన్ని పునర్నిర్మించడం, పటిష్టమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారానే ఫలితాలు వస్తాయని మెకిన్సే పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.అడ్డంకిగా అవాస్తవ సమాచారంఏఐ వ్యవస్థలు ఇచ్చే సమాచారం ఎంతవరకు నమ్మదగినది? అనే ప్రశ్న ఇప్పుడు పెద్ద కంపెనీలను వేధిస్తోంది. కేపీఎంజీ 2025 నివేదిక ప్రకారం.. 54 శాతం మంది ప్రతినిధులు డేటాలో ఉన్న అశాస్త్రీయతను ప్రధాన రిస్క్‌గా భావిస్తున్నారు. 45 శాతం మంది ఏఐ సృష్టించే తప్పుడు సమాచారం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యల వల్ల పైలట్ ప్రాజెక్టులు క్షేత్రస్థాయిలోకి రావడానికి జాప్యం జరుగుతోంది. ఇక్కడే గవర్నెన్స్(నియంత్రణ) ప్రాముఖ్యత సంతరించుకుంటోంది. ఏఐ తీసుకునే నిర్ణయాలకు ఎవరు బాధ్యత వహించాలి? ఆ నిర్ణయం వెనుక ఉన్న లాజిక్ ఏమిటి? అనే అంశాలపై స్పష్టత లేకపోతే సంస్థలు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది.సమీకృత పరిష్కారంప్రముఖ టెక్ నిపుణుడు, ఎవాల్యుయేట్‌ఐక్యూ సహ వ్యవస్థాపకుడు సంజయ్ కొప్పికర్ అభిప్రాయం ప్రకారం.. ఎంటర్ప్రైజ్ ఏఐలో గవర్నెన్స్, సమన్వయం అనేవి విడివిడి అంశాలు కావు. ఇవి ఒకే నాణేనికి ఉన్న రెండు పార్శ్వాలు. ‘ఏఐని కేవలం అమలు చేయడం ముఖ్యం కాదు, దానిని నియంత్రించగలగడం, వివరించగలగడం, నమ్మదగినదిగా మార్చడం తక్షణ అవసరం’ అని చెప్పారు.భారీ పెట్టుబడులు - రాబడిపై ఆందోళనలుటెక్ దిగ్గజాలు జనరేటివ్ ఏఐ మౌలిక సదుపాయాల కోసం బిలియన్ల డాలర్లు కుమ్మరిస్తున్నాయి. నిత్యం కొత్త వెర్షన్లు, కొత్త మోడల్స్ మార్కెట్లోకి వస్తుండటంతో పాత టెక్నాలజీ త్వరగా కాలం చెల్లిపోతోంది. దీంతో పెట్టుబడిని ఎలా వెనక్కి తీసుకోవాలనే దానిపై కంపెనీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి.దాంతో కంపెనీలు క్లౌడ్ కంప్యూటింగ్ ఖర్చులను తగ్గించుకోవడానికి చిన్న, ప్రత్యేకమైన మోడల్స్ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఏఐ ఇచ్చే అవుట్‌పుట్ నమ్మదగ్గదిగా ఉంటేనే క్లయింట్లు డబ్బు చెల్లించడానికి సిద్ధంగా ఉంటారు. అందుకే ట్రస్ట్‌ను ఒక ఫీచర్‌గా కంపెనీలు అమ్ముతున్నాయి. పూర్తిగా ఏఐపై ఆధారపడకుండా మానవ పర్యవేక్షణ ఉండేలా హైబ్రిడ్ వర్క్ ఫ్లోలను డిజైన్ చేస్తున్నాయి.ఇదీ చదవండి: దక్షిణాదిలో ఆరోగ్యం భేష్.. ఆర్థిక ప్రణాళికలే వీక్! -
'ఏఐ ఎంత ఎదిగినా.. వీళ్ల ఉద్యోగానికి డోకా లేదు'
అన్ని రంగాల్లోనూ ఏఐ వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో.. చాలామంది ఉద్యోగాలు పోతాయేమో అనే భయం గుప్పెట్లో చిక్కుకున్నారు. దీనిపై కొందరు నిపుణులు మిశ్రమంగా స్పందించారు. ఇప్పుడు తాజాగా అమెరికాకు చెందిన రక్షణ సాంకేతిక సంస్థ పలాంటిర్ టెక్నాలజీస్.. సీఈఓ 'అలెక్స్ కార్ప్' ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో కృత్రిమ మేధస్సు (AI) యుగంలో కూడా ఎవరు ఎదుగుతారు? అనే విషయంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఏఐ వల్ల ఎంతమంది ఉద్యోగాలు కోల్పోయినా.. రెండు రకాల వ్యక్తులు మాత్రం భవిష్యత్తులో ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. మొదటివారు 'వృత్తి ఆధారిత నైపుణ్యాలు' కలిగిన వారు. ఉదాహరణకు మెకానిక్‌లు, ఎలక్ట్రిషన్లు, టెక్నీషియన్లు వంటి ప్రాక్టికల్ పనులు చేసే వ్యక్తులు. ఈ పనులను పూర్తిగా AI చేత భర్తీ చేయడం కష్టం.రెండవ వర్గం 'న్యూరోడైవర్జెంట్' వ్యక్తులు. అంటే న్యూరోడైవర్సిటీ అనే భావనకు చెందిన వారు. సాధారణంగా కాకుండా.. భిన్నంగా ఆలోచించే వారు, కొత్త మార్గాలను అనుసరించే వారు, సృజనాత్మకంగా సమస్యలను పరిష్కరించే వారు వీరందరూ ఈ వర్గంలోకి వస్తారని అలెక్స్ కార్ప్ పేర్కొన్నారు.సంప్రదాయ ఉద్యోగాలైన.. సాధారణ కోడింగ్, లా వర్క్, లేదా రీడింగ్, రైటింగ్ వంటి పనులను ఏఐ సులభంగా చేస్తుంది. అంటే ఈ రకమైన ఉద్యోగాలు చేసేవారు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అంటే ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రంగాల్లో పనిచేసేవారు.. తప్పకుండా నైపుణ్యాలను పెంచుకోవాల్సి ఉంటుంది.భవిష్యత్తులో ఎక్కువ ప్రాముఖ్యత పొందేది సృజనాత్మకత, ఒరిజినల్ ఆలోచన, కొత్తదనం సృష్టించే సామర్థ్యం మాత్రమే అని అలెక్స్ కార్ప్ పేర్కొన్నారు. మనం ఒక ఆర్టిస్ట్ మాదిరిగా ఆలోచించడం నేర్చుకోవాలి. విషయాలను భిన్న కోణాల్లో చూడగలగడం, కొత్త పరిష్కారాలను కనుగొనడం చాలా ముఖ్యం అవుతుంది. ఇలాంటి వాళ్లను ఏఐ కూడా ఏమీ చేయలేదు. కాబట్టి వృత్తి నైపుణ్యాలు కలిగిన వారు, భిన్నంగా ఆలోచించే వ్యక్తులు ఏఐ ప్రపంచంలో కూడా ముందంజలో ఉండే అవకాశముందని ఆయన స్పష్టం చేశారు.ఇదీ చదవండి: వారంలో తారుమారు.. బంగారం ధరల్లో ఇంత మార్పా! -
‘అందరి కోసం ఓ ప్రతీకారం’: ఇరాన్
టెహ్రాన్: పశ్చిమ ఆసియాలో యుద్ధ పరిస్థితులు త్వరలో చల్లబడేలా కనిపించడం లేదు. యుద్ధాన్ని ఆపేందుకు తాను సిద్ధమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ను రెచ్చగొట్టేలా ఇరాన్ ఒక ఏఐ జనరేటెడ్ వీడియోను విడుదల చేసింది. ‘అందరి కోసం ఓ ప్రతీకారం’ అంటూ అమెరికా, ఇజ్రాయెల్‌కు హెచ్చరిక జారీ చేసింది.ఈ వీడియోలో అమెరికా చరిత్రలో జరిగిన యుద్ధాలు, అణు దాడులు, ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఘర్షణలను చూపిస్తూ చివర్లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని రాక్షస రూపంలో చిత్రీకరించారు. స్టాచ్యూని క్షిపణితో ధ్వంసం చేస్తామని హెచ్చరించేలా వీడియోని క్రియేట్ చేయడం గమనార్హం.అమెరికా గత చర్యలపై విమర్శవీడియోలో అమెరికా స్థానిక ప్రజల భూ స్వాధీనం, హిరోషిమాపై అణు బాంబు దాడి, వియత్నాం యుద్ధం, అలాగే యెమెన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, గాజా, పాలస్తీనా ఘర్షణలను ప్రస్తావించారు. ఈ సంఘటనలన్నింటినీ అమెరికా కారణమని చూపిస్తూ, బాధితుల తరఫున ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సందేశం ఇచ్చింది.స్టాచ్యూ ఆఫ్ లిబర్టీపై దాడి వీడియో చివర్లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని రాక్షసుడిగా చూపించి, దానిపై క్షిపణి దాడి చేసిన దృశ్యం ఉంది. ‘అందరి కోసం ఓ ప్రతీకారం’ అనే నినాదంతో అమెరికాకు స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది. ఈ వీడియో ఇజ్రాయెల్–అమెరికా దాడుల తర్వాత విడుదల కావడం గమనార్హం. ఇరాన్ ఇటీవల అమెరికాను పశ్చిమ ఆసియాలో అస్థిరతకు కారణమని ఆరోపిస్తూ, ప్రతీకారం తప్పదని హెచ్చరిస్తోంది. మరోవైపు అమెరికా అదనపు సైనిక దళాలు, యుద్ధ నౌకలు, విమాన దళాలను ఇరాన్ ప్రాంతంలో మోహరించింది.విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఈ వీడియో కేవలం ప్రచార సాధనం మాత్రమే కాదు. ఇరాన్ తన ప్రతీకారాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించబోతున్నట్లు చూపించడానికి ఉద్దేశించబడింది. ఇది ప్రాంతీయ శాంతి, భద్రతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. -
ఏఐతో... ఆటలొద్దు!
పిల్లలు ఏడుస్తారు, నవ్వుతారు, బుంగమూతి పెట్టి అలుగుతారు... వారికంటూ స్నేహితులు ఉంటారు. వారితో తమదైన భాషలో మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఆ పిల్లల ప్రపంచంలోకి ఏఐ టాయ్స్ వచ్చాయి. ఫ్రెండ్‌తో మాట్లాడినట్లే పిల్లలు వాటితో మాట్లాడుతున్నారు. నవ్వుతున్నారు. తమకు ఏమనిపిస్తుందో చెబుతున్నారు... వినడానికి ఇది బాగానే ఉంది కానీ... ఏ.ఐ. బొమ్మల ప్రభావం పిల్లలపై మంచిది కాదని చెబుతున్నారు పరిశోధకులు. సహజమైన బాల్యాన్ని, భావోద్వేగాలను ‘ఏఐ బొమ్మలు’ హరించకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు...ఫ్రెండ్‌లాగా సంభాషించడం నుంచి భావోద్వేగాలు గ్రహించడం వరకు ఏఐ బొమ్మలు పిల్లలకు చేరువ అవుతున్నాయి. ఏఐ–ఆధారిత బొమ్మలు వినగలవు. అర్థం చేసుకోగలవు. ఏదైనా అడిగితే సమాధానాలు ఇవ్వగలవు. దీంతో అవి అపురూపంగా అనిపిస్తాయి.అయితే పిల్లలపై ఏఐ బొమ్మల ప్రభావం ఏ రకంగా ఉంటుంది అనే దానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ప్రతికూలతల గురించి చెప్పుకోవాలంటే....పిల్లల భావోద్వేగాలకు సంబంధించి ఏఐ బొమ్మలు అతిగా స్పందిస్తుంటాయి. మితిమీరిన సానుభూతి చూపుతుంటాయి. ఒక నిమిషం విచారంగా, మరు నిమిషం సంతోషంగా ఉండగలిగే పిల్లలకు ఇది అవసరం లేదు అంటున్నారు నిపుణులు.సహజత్వం లేకుండా....‘పిల్లలకు ఏఐ బొమ్మలు తోడుగా ఉండే మాట వాస్తవమే అయినా, వివిధ సందర్భాలలో స్పందించడానికి సంబంధించి వాటి ఉద్దేశాలను అర్థం చేసుకోవడం కష్టం’ అంటున్నారు నిపుణులు.‘ఏఐ ఆధారిత బొమ్మల కొత్త ట్రెండ్ ఆందోళన కలిగిస్తోంది’ అంటుంది లండన్‌లోని డిజైన్ కంపెనీ ‘మోరమా’ వ్యవస్థాపకురాలు, యూకే డిజైన్ కౌన్సిల్ సభ్యురాలు జో బర్నార్డ్.మానవ సంబంధాలకు భిన్నంగా ఏఐ బొమ్మ ఫ్రెండ్స్ ఎప్పుడూ సహనంగా, స్నేహంగా ఉండేలా డిజైన్ చేశారు.‘ఏఐ బొమ్మలలో సహజ స్పందన లేక΄ోవడం వల్ల, వాస్తవ ప్రపంచాన్ని పిల్లలు అర్థం చేసుకోలేరు. మీరు ఒక చాట్‌బాట్‌తో ఎంత దారుణంగా ప్రవర్తించినా, అది మిమ్మల్ని అభిమానిస్తుంది. కాని వాస్తవ ప్రపంచంలో అలా ఉండదు కదా!’ అంటుంది జో బర్నార్డ్.ఇలా అయితే... చాలా కష్టంసహజత్వం లోపించిన సంభాషణల వల్ల పిల్లలకు భావోద్వేగపరమైన నష్టాలతో΄ాటు, మేధోవికాసం (కాగ్నెటివ్ ఎఫర్ట్)పై కూడా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. నిరంతరం పిల్లలతో సంభాషించేలా ఏఐ టాయ్స్‌ను రూ΄÷ందించారు. దీనివల్ల పిల్లలలో ఆధారపడే తత్త్వం పెరిగే ప్రమాదం ఉంది. దాని బారి నుండి వారిని బయటికి తీసుకురావడం చాలా కష్టం అవుతుంది.వికటిస్తుందా?ఒక వస్తువును ఎలా డిజైన్ చేస్తారనే దానిపైనే మనం దానితో ఎలా వ్యవహరిస్తామనేది ఆధారపడి ఉంటుంది. ఈ తరానికి సంబంధించి ఏఐ బొమ్మల కంపెనీలు ‘ఆకర్షణీయత’కే పెద్ద పీట వేశాయి. అయితే ఆ ఆకర్షణీయ విధానం పిల్లల అవసరాలకు విరుద్ధంగా ఉంటుంది.ఏఐ బొమ్మల మార్కెట్ వేగంగా విస్తరిస్తున్నప్పటికీ, కంపెనీలు మరిన్ని ఫీచర్లు, సామర్థ్యాలను జోడించడానికి ΄ోటీ పడుతున్నప్పటికీ, అది వికటించే ప్రమాదం ఉందని చెబుతున్నారు నిపుణులు.గాబో గందరగోళం!మూడేళ్ల పిల్లల కోసం ఎన్నో ఏఐ బొమ్మలు మార్కెట్లో ఉన్నాయి. అయితే ప్రీ–స్కూల్ పిల్లలపై ఏఐ సాంకేతిక ప్రభావం గురించి చాలా తక్కువ పరిశోధన జరిగింది. తాజా విషయానికి వస్తే...అయిదేళ్ల లోపు పిల్లలపై ఏఐ బొమ్మల ప్రభావం ఎంత ఉంటుంది అనే దానిపై తొలిసారిగా ఒక అధ్యయనం నిర్వహించింది కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ బృందం. ఈ నేపథ్యంలో పిల్లల కోసం రూ΄÷ందించిన ఏఐ–ఆధారిత బొమ్మలకు సంబంధించి కఠినమైన నియంత్రణ అవసరం అని చెబుతున్నారు పరిశోధకులు.తమ అధ్యయనంలో భాగంగా మూడు నుండి అయిదు సంవత్సరాల వయస్సు గల కొద్దిమంది పిల్లలు ‘గాబో’ అనే ఏఐ బొమ్మతో ఎలా వ్యవహరిస్తారో పరిశీలించారు. ‘గాబో’ అనేది వాయిస్–యాక్టివేటెడ్ ఏఐ చాట్‌బాట్. ప్రీ–స్కూలు పిల్లలు దానితో మాట్లాడేలా, ఆటలు ఆడే విధంగా రూ΄÷ందించారు. తమ అధ్యయనంలో భాగంగా ‘గాబో’ భాష, సంభాషణలకు సంబంధించిన నైపుణ్యాలను పరీక్షించారు. పిల్లలు ‘గాబో’తో మాట్లాడడానికి తరచుగా ఇబ్బందిపడడాన్ని గమనించారు. పిల్లలు, పెద్దవారి గొంతుల మధ్య తేడాని ‘గాబో’ గుర్తించలేక΄ోయింది. ఒక పిల్లవాడు బొమ్మతో ‘నువ్వంటే నాకు ఇష్టం’ అని చెప్పినప్పుడు అది అర్థం లేని సమాధానం ఇచ్చింది.పిల్లవాడి మాటకు ‘థ్యాంక్యూ’ లేదా ‘నాకు కూడా నువ్వంటే ఇష్టం’లాంటి మాటలేవో వాడాలి. అలా కాకుండా...‘మీరు ఎలా ముందుకు వెళ్లాలనుకుంటున్నారో నాకు తెలియజేయండి’ అని స్పందించింది ఆ ఏఐ బొమ్మ. మూడేళ్ల చిన్నారి ‘నాకు బాధగా ఉంది’ అనే భావం వ్యక్తీకరించే మాట మాట్లాడినప్పుడు...‘నేను సంతోషంగా ఉండే చిన్న రోబోట్‌ని. ఈ సరదాను కొనసాగిద్దాం. మనం తర్వాత దేని గురించి మాట్లాడుకుందాం?’ అని ఆ చిన్నారిని అడిగింది బొమ్మ.ఈ సమయంలో కరెక్ట్ కాదు‘పిల్లలు సామాజిక విషయాలను తెలుసుకునే అభివృద్ధి దశలో జనరేటివ్ ఏఐ అవుట్‌పుట్ గందరగోళంగా ఉంటోంది’ అంటున్నారు పరిశోధకులు. ‘గాబో వంటి బొమ్మలు పిల్లల మాటలు, భావాలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు’ అంటున్నారు అధ్యయన సహ రచయిత డాక్టర్ ఎమిలీ.సంవత్సర కాలం ΄ాటు ఏఐ బొమ్మల పనితీరును, పిల్లలపై వాటి ప్రభావాన్ని అధ్యయనం చేసిన తరువాత...‘అయిదేళ్ల లోపు పిల్లల కోసం విక్రయించే ఏఐ బొమ్మలు సైకలాజికల్ సేఫ్టీని అందిస్తున్నాయని నిర్ధారించడానికి నియంత్రణ సంస్థలు వెంటనే చర్యలు తీసుకోవాలి’ అని కోరుతున్నారు పరిశోధకులు.‘ఏఐ బొమ్మలను తల్లిదండ్రులు పర్యవేక్షించడానికి వీలుగా, అందరికీ కనిపించే ప్రదేశాలలో ఉంచాలి. గోప్యతా విధానాలను (ప్రైవసీ ΄ాలసీ) జాగ్రత్తగా చదవాలి’ అని స్టడీ రి΄ోర్ట్ తల్లిదండ్రులకు సూచించింది. నిజ ప్రపంచం వర్సెస్ సాంకేతిక ప్రపంచంపిల్లల ఆలోచన విధానంపై ఏఐ ప్రభావం ఆందోళన కలిగిస్తుంది. ఏఐ సాధనాలపై అతిగా ఆధారపడడం వల్ల మేధోపరమైన కృషి తగ్గుతుంది అంటున్నారు విశ్లేషకులు.‘ఏఐ బొమ్మలపై అతిగా ఆధారపడితే పిల్లల మెదడులోని భాగాలు అభివృద్ధి చెందడం ఆగి΄ోతాయి’ అని హెచ్చరిస్తున్నారు.నిజ ప్రపంచం సంక్లిష్టమైనది, అనూహ్యమైనది. మనుషులు తమ జీవితానుభవాల ద్వారా ఎలా మసలుకోవాలో నేర్చుకుంటారు. దీనికి విరుద్ధంగా ఏఐ పరిమితమైన సమాచారంతో పనిచేస్తుంది.‘ఒక పిల్లవాడి చుట్టూ ఉన్న అన్ని రకాల భావోద్వేగాలను ఏఐ బొమ్మలు అందుకోలేవు. దాని ప్రతిస్పందనలు అసంపూర్ణంగా, అనుచితంగా ఉంటాయి. ఇది తప్పుడు మార్గదర్శకత్వానికి దారి తీయడమే కాకుండా సృజనాత్మకంగా ఆలోచించడాన్ని తగ్గించవచ్చు, స్వతంత్రంగా సమస్య పరిష్కారానికి ఆలోచించే అవకాశాలను తగ్గించవచ్చు’ అంటుంది జో బర్నార్డ్. -
తికమకపెట్టే ప్రశ్నలకు ఏఐ స్కోర్ ఎంతంటే..
కృత్రిమ మేధ (ఏఐ) అసాధ్యాలను సుసాధ్యం చేస్తోంది. ఒకప్పుడు క్లిష్టంగా భావించిన మ్యాసివ్ మల్టీ టాస్కింగ్ ల్యాంగ్వేజ్ అండర్స్టాండింగ్(ఎంఎంఎల్యూ) వంటి పరీక్షల్లో 90 శాతానికి పైగా స్కోరు సాధించి మనుషుల మేధస్సును సవాలు చేస్తోంది. అయితే, ఏఐ సామర్థ్యాన్ని కొలిచే పాత కొలమానాలు సరిపోవని భావించిన శాస్త్రవేత్తలు దానికి అత్యంత కఠినమైన పరీక్షలు సిద్ధం చేశారు. అదే ‘హ్యూమనిటీస్ లాస్ట్ ఎగ్జామ్(హెచ్ఎల్ఈ). ఎంఎంఎల్యూ అనేది ఏఐ మోడల్స్ తెలివితేటలను, విజ్ఞానాన్ని, సమస్య పరిష్కార సామర్థ్యాన్ని కొలవడానికి ఉపయోగించే ఒక అత్యంత ప్రజాదరణ పొందిన బెంచ్‌మార్క్ పరీక్ష. ప్రస్తుతం టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారిన హెచ్ఎల్ఈ పరీక్ష వివరాలు, ఏఐ మోడల్స్ పనితీరుపై కథనం.ఏమిటీ హెచ్ఎల్ఈ? ఎందుకంత కఠినం?ప్రపంచవ్యాప్తంగా 50 దేశాలకు చెందిన 500 సంస్థల నుంచి దాదాపు 1,000 మంది నిపుణులు సిద్ధం చేసిన 2,500 ప్రశ్నల సమాహారమే ఈ హెచ్ఎల్ఈ. సెంటర్ ఫర్ ఏఐ సేఫ్టీ, స్కేల్ ఏఐ పరిశోధకులు దీన్ని రూపొందించారు. ఏఐ మోడల్స్‌లోని లోపాలను ఎత్తిచూపడం, వాటి అసలు సామర్థ్యాన్ని పరీక్షించడం దీని లక్ష్యం. 100కు పైగా విభాగాల్లోని నిపుణులు పంపిన ప్రతి ప్రశ్న ప్రస్తుత ఏఐ మోడల్స్‌ను ఓడించడమే కాకుండా ఇద్దరు నిపుణుల సమీక్షను దాటాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నలు ఎంత కఠినంగా ఉన్నాయంటే ఆయా రంగాల్లోని నిపుణుల మధ్యే 15.4% నుంచి 18% వరకు భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అంటే, ఏ ఒక్క మనిషి కూడా అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం అసాధ్యం.గెలుపు ఎవరిది?ఈ పరీక్ష ప్రారంభమైనప్పుడు (జనవరిలో ‘నేచర్’ పత్రికలో ప్రచురితమైన సమయానికి) అత్యుత్తమ ఏఐ మోడల్స్ కూడా 10 శాతం కంటే తక్కువ స్కోరుకే పరిమితమయ్యాయి. కానీ, గత కొద్ది నెలల్లోనే ఈ పరిస్థితి వేగంగా మారుతోంది.ఏఐ మోడల్ప్రారంభ స్కోరు (%)ప్రస్తుత స్కోరు (%)GPT-4o2.7%-OpenAI o18.0%-DeepSeek-R18.5%-GPT-5-25.3%Gemini 2.5 Pro-21.6%Gemini 3 Pro (Live)-38.3% ఆందోళన కలిగిస్తున్న అంశాలుఈ పరీక్షలో బయటపడిన ప్రధాన లోపం ‘కాలిబ్రేషన్ ఎర్రర్’. సమాధానం తప్పు అని తెలిసినా ఏఐ మోడల్స్ అది 100% సరైనదని మొండిగా వాదిస్తున్నాయి. ఇది భవిష్యత్తులో వైద్య రంగం లేదా ఆర్థిక రంగంలో ఏఐని వాడేటప్పుడు తీవ్రమైన ప్రమాదాలకు దారితీయవచ్చు. ‘ఒక తప్పు సమాధానాన్ని తప్పు అని ఏఐ గుర్తించలేకపోవడం అనేది సాంకేతిక లోపం కాదు, ప్రస్తుత ఏఐ డిజైన్ లోనే ఉన్న ఒక నిర్మాణాత్మక సమస్య’ అని నిపుణులు చెబుతున్నారు.కొలమానమే కరిగిపోతోందా?ఏఐ సామర్థ్యం ఎంత వేగంగా పెరుగుతుందంటే దాన్ని కొలిచే ‘యార్డ్‌స్టిక్’ కూడా సరిపోవడం లేదు. అందుకే పరిశోధకులు ‘హెచ్ఎల్ఈ రోలింగ్’ పేరుతో నిరంతరం అప్డేట్ అయ్యే డైనమిక్ టెస్టింగ్ విధానాన్ని ప్రకటించారు. ఇందులో అత్యుత్తమ స్కోరు సాధించినంత మాత్రాన దానికి జనరల్ ఇంటెలిజెన్స్ వచ్చినట్లు కాదని, కేవలం అకడమిక్ ప్రశ్నల్లో నిపుణత సాధించినట్లేనని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైనా మనిషి సృష్టించిన పరీక్షను మనిషి కంటే వేగంగా ఏఐ ఛేదిస్తుండటం విశేషం.ఇదీ చదవండి: మీ డబ్బు మీ కోసం పనిచేస్తుందా? -
ఉద్యోగులకు ఏఐ ట్రైనింగ్.. పియర్సన్తో టీసీఎస్ జట్టు
ముంబై: గ్లోబల్ లెర్నింగ్ సర్వీసుల సంస్థ పియర్సన్తో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) జట్టు కట్టింది. కృత్రిమ మేథతో సిబ్బందికి శిక్షణనిచ్చి, వారిని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవడంలో కంపెనీలకు తోడ్పాటు అందించేందుకు ఈ భాగస్వామ్యం ఉపయోగపడనుంది. ఇందుకోసం ఇరు సంస్థలు ఏఐ ఆధారిత లెర్నింగ్ ప్రోడక్టులు, సర్వీసులను రూపొందిస్తాయి.నియామకాల్లో, సిబ్బంది అభివృద్ధి ప్రోగ్రాంలలో అభ్యర్ధుల సామర్థ్యాలను మదింపు చేసే ప్రక్రియలో పియర్సన్‌కి చెందిన వెర్సాంట్ ఇంగ్లీష్ ప్రొఫీషియెన్సీ విధానాన్ని టీసీఎస్ ఉపయోగించనుంది. మరోవైపు అంతర్జాతీయ ట్రావెల్ సర్వీసులను డిజిటలీకరించే దిశగా ప్రముఖ ట్రావెల్ టెక్నాలజీ సంస్థ అమెడ్యూస్తో టీసీఎస్ చేతులు కలిపింది.మరోవైపు, ఐటీ ఇన్ఫ్రా, డేటా సెంటర్లు, ఇతరత్రా టెక్నాలజీల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకునే దిశగా ఆటోమేషన్ దిగ్గజం ఏబీబీ, టీసీఎస్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. -
క్లౌడ్‌ఫ్లేర్ సీఈఓ హెచ్చరిక!.. 2027 నాటికి..
ఆటోమేటెడ్ ఆన్లైన్ కార్యకలాపాలలో జనరేటివ్ ఏఐ వేగవంతమైన వృద్ధిని కొనసాగిస్తున్నందున, 2027 నాటికి ఏఐ-ఆధారిత బాట్ ట్రాఫిక్.. మానవ ఇంటర్నెట్ వినియోగాన్ని మించిపోయే అవకాశం ఉందని క్లౌడ్‌ఫ్లేర్ సీఈఓ మాథ్యూ ప్రిన్స్ హెచ్చరించారు. ఆస్టిన్లోని SXSW సదస్సులో మాట్లాడుతూ.. ఈ విషయం వెల్లడించారు.AI-ఆధారిత ఏజెంట్లు మనుషుల కంటే చాలా ఎక్కువ వెబ్సైట్లను సందర్శించగలవని మాథ్యూ వివరించారు. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఒక ఉత్పత్తిని కొనుగోలు చేసే ముందు కొన్ని వెబ్సైట్లను తనిఖీ చేస్తారు. కానీ ఒక AI వ్యవస్థ సమాచారాన్ని సేకరించడానికి వేలాది పేజీలను స్కాన్ చేయగలదు. ఇది వెబ్ ట్రాఫిక్‌లో తీవ్రమైన పెరుగుదలకు దారితీస్తుంది. అంతే కాకుండా.. ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది.బాట్స్ అంటేబాట్స్ అనేవి స్వయంచాలకంగా పనిచేసే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్. ఇవి మనుషుల సహాయం లేకుండా వెబ్సైట్లు సందర్శించడం, డేటాను సేకరించడం వంటి పనులు చేస్తాయి. గతంలో కూడా బాట్స్ ఉండేవి, కానీ వాటిలో చాలా భాగం గూగుల్ వంటి సెర్చ్ ఇంజిన్లకు సంబంధించినవి. ఉదాహరణకు గూగుల్ ఉపయోగించే క్రాలర్లు వెబ్సైట్లను స్కాన్ చేసి సమాచారం సేకరించేవి. అలాగే కొన్ని బాట్స్ దుష్ట కార్యకలాపాలకు కూడా ఉపయోగించేవారు.కానీ.. ఇప్పుడు పరిస్థితి మారింది. జనరేటివ్ AI రాకతో, బాట్స్ సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒక సాధారణ వ్యక్తి ఏదైనా వస్తువు కొనుగోలు చేసే ముందు కొన్ని వెబ్సైట్లను మాత్రమే చూస్తాడు. అయితే AI ఆధారిత బాట్ మాత్రం వేలాది వెబ్సైట్లను స్కాన్ చేసి, పూర్తి సమాచారం సేకరిస్తుంది. దీనివల్ల ఇంటర్నెట్ ట్రాఫిక్ అనూహ్యంగా పెరుగుతోంది.ఇదీ చదవండి: కియోసాకి హెచ్చరిక.. చరిత్రలో అతిపెద్ద బబుల్ బస్ట్!ఈ పెరుగుతున్న ట్రాఫిక్ ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలపై ఒత్తిడిని పెంచుతోంది. మరిన్ని డేటా సెంటర్లు, శక్తివంతమైన సర్వర్లు అవసరం అవుతున్నాయి. గతంలో COVID-19 సమయంలో కూడా ఇంటర్నెట్ వినియోగం పెరిగింది. అప్పుడు యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ వంటి ప్లాట్ఫార్మ్లను ఎక్కువగా ఉపయోగించారు. అయితే ఆ పెరుగుదల తాత్కాలికం. కానీ.. ఇప్పుడు జరుగుతున్న పెరుగుదల మాత్రం నిరంతరంగా కొనసాగుతుందని మాథ్యూ చెప్పారు. -
ఏఐలో భారత్‌కి ప్రత్యేక స్థానం: కాగ్నిజెంట్ చీఫ్ ఏఐ ఆఫీసర్
న్యూఢిల్లీ: కృత్రిమ మేథ (ఏఐ) వినియోగంలో భారత్‌కి విశిష్ట స్థానం ఉందని టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ చీఫ్ ఏఐ ఆఫీసర్ బాబక్ హోద్జాత్ తెలిపారు. డిజిటల్ సిస్టమ్‌లు, ప్రక్రియల గురించి అపార అవగాహన ఉన్న ప్రతిభావంతులు పెద్ద సంఖ్యలో ఉండటం ఇందుకు దోహదపడుతోందని పేర్కొన్నారు.ఏఐ సిస్టమ్‌లను రూపొందించడంలో, వివిధ పరిశ్రమలవ్యాప్తంగా వినియోగాన్ని వేగవంతం చేయడంలో ఈ నిపుణులు కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు. ఏఐ సాధనాలతో కోడింగ్ సులభతరమవుతున్నప్పటికీ, ఔట్పుట్ నాణ్యతను మదింపు చేయడానికి డెవలపర్లు ఇప్పటికీ అవసరమేనని ఆయన చెప్పారు.వివిధ రంగాలవ్యాప్తంగా మరింత మంది ప్రొఫెషనల్స్‌కి ఏఐ సాధికారత కల్పిస్తోందని వివరించారు. కంపెనీలు కృత్రిమ మేథ టెక్నాలజీలను వినియోగించుకోవడంలో సహకరించే దిశగా కాగ్నిజెంట్ ఇప్పుడు ఏఐ బిల్డర్ కంపెనీగా రూపాంతరం చెందిందని బాబక్ చెప్పారు.ఉద్యోగులకు కొత్త నైపుణ్యాల్లో శిక్షణనివ్వడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు వివరించారు. కంపెనీలో అంతర్గతంగా కోడ్ జనరేషన్లో ఏఐ వాటా సుమారు 30 శాతంగా ఉండగా, ఇది గణనీయంగా పెరుగుతోందని పేర్కొన్నారు. -
‘నేను బ్రతికే ఉన్నాను మైక్’ : ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ
జెరూసలేం: ఇరాన్ జరిపిన దాడిలో తాను మరణించాడని సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఖండిస్తూ వస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆయన ఆరోగ్యం, ఉనికి గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నెతన్యాహు స్వయంగా ఒక వీడియోను షేర్ చేశారు.ఆ వీడియోలో ఆయన అమెరికా రాయబారి మైక్ హకబీతో కలిసి నడుస్తూ మాట్లాడుతున్నారు. ‘నేను బతికే ఉన్నాను మైక్’ అంటూ నెతన్యాహూ చమత్కరించారు. హకబీ కూడా సరదాగా స్పందిస్తూ, ‘మీ ఆరోగ్యం గురించి డొనాల్డ్ ట్రంప్ నన్ను పంపించారు. మీ క్షేమసమాచారం తెలుసుకోమన్నారు’ అని వ్యాఖ్యానించారు.నెతన్యాహూ స్వయంగా వీడియో విడుదల చేసి తన ఆరోగ్యం బాగానే ఉందని, తాను బతికే ఉన్నానని స్పష్టం చేశారు. హకబీతో సరదా సంభాషణలో ఆయన ‘అవును, మైక్. నేను బతికే ఉన్నాను’ అని సమాధానం ఇచ్చారు.వీడియోలో సరదా మాటల మధ్య ఇరాన్ నాయకత్వంపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల ప్రస్తావన కూడా వచ్చింది. ఈ రోజు, నేను పంచ్ కార్డ్‌పై ఉన్న రెండు పేర్లను చెరిపేశాను అని నెతన్యాహూ వ్యాఖ్యానించారు. మొత్తం మీద, ఈ వీడియోతో నెతన్యాహూ మరణం పుకార్లకు ముగింపు పలికారు. అయితే సోషల్ మీడియాలో ఆయనపై వస్తున్న అసత్య కథనాలు ఇంకా చర్చనీయాంశంగానే ఉన్నాయి.నెతన్యాహూ మరణంపై సోషల్ మీడియాలో పుకార్లు మాత్రం ఆగలేదు. కేఫ్‌లో కాఫీ తాగుతున్న వీడియోలు, ప్రజలతో మాట్లాడుతున్న క్లిప్‌లు, చేతులు ఊపుతూ అభివాదం చేస్తున్న దృశ్యాలు ‘పాతవి. ఇదంతా ఏఐ సృష్టి ’అంటూ ప్రచారం చేస్తున్నారు. ‘ఆయన చేతిలో ఐదు వేళ్లు కాదు, ఆరు వేళ్లు ఉన్నాయి’ అంటూ వింత వాదనలు కూడా వైరల్ అవుతున్నాయి. Crossing names off the list is good - doing it shoulder to shoulder with our American friends is even better.Good to see Ambassador @GovMikeHuckabee. Always a pleasure.🇮🇱🇺🇸 pic.twitter.com/FZrZN03IZI— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) March 17, 2026 -
3 రోజుల్లోనే ఉద్యోగం పోతే.. ఈ ఏఐ ఇంజనీర్ ఏం చేసిందంటే..
ఎన్నో ఆశలతో కొత్త ఉద్యోగంలో చేరతాం.. అలా చేరిన మూడు రోజుల్లోనే ఆ ఉద్యోగం ఊడిపోతే.. రీతూ మౌర్య అనే ఏఐ (AI) ఆటోమేషన్ ఇంజనీర్ తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఇలాంటి కఠిన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఉద్యోగంలో చేరిన కేవలం మూడు రోజుల్లోనే క్లయింట్ ముందు ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారని ఆమె తెలిపారు. అయితే ఏడాది తరువాత అదే రంగంలో మొదట ఆఫర్ చేసిన జీతానికి ఎనిమిది రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నానని పేర్కొంది. ఈ విజయానికి స్వీయ అభ్యాసం, సరైన మార్గదర్శకత్వం కారణమని ఆమె చెప్పింది.ప్రారంభంలోనే ఎదురైన చేదు అనుభవంఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియోలో రీతూ మౌర్య తన అనుభవాన్ని పంచుకుంది. తనను ఉద్యోగంలోకి తీసుకున్నప్పుడు ప్రారంభంలో సంస్థ ఫౌండర్ తనకు కావాల్సిన సహాయం, మార్గదర్శకత్వం ఇస్తానని హామీ ఇచ్చాడని ఆమె తెలిపింది. కానీ వాస్తవానికి ఆమె సందేశాలకు గంటల తరువాత కానీ సమాధానం ఇచ్చేవాడు కాదని, సమస్యలు అర్థం చేసుకునేందుకు కాల్ చేయడానికీ ముందుకు రాలేదని చెప్పింది. “ఉద్యోగంలో రెండో రోజుకే నాకు చాలా విషయాలు తెలియకపోయాయి. మార్గదర్శనం చేస్తానని చెప్పినా, అతను ఎక్కడా కనిపించలేదు” అని మౌర్య తెలిపింది.క్లయింట్ ముందు విమర్శలు… వెంటనే తొలగింపుమూడో రోజు అసైన్మెంట్ సమయంలో వ్యవస్థాపకుడు క్లయింట్ ముందే ఆమె పనితీరును తీవ్రంగా విమర్శించాడని మౌర్య తెలిపింది. “మీరు పనిని సరిగ్గా చేయడం లేదు. నేను ఇదే పని ఒక గంటలో పూర్తి చేసేవాడిని. ఇకపై మనం కలిసి పనిచేయలేము” అని అతను చెప్పాడని ఆమె గుర్తుచేసుకుంది. ఆశ్చర్యకరంగా, అదే క్లయింట్ ఆమెను ఫుల్ టైమ్‌గా చేరగలరా అని అడిగిన మరుసటి రోజే ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారని ఆమె వెల్లడించింది.మానసికంగా తీవ్ర ప్రభావంఈ ఘటన తనపై తీవ్ర ప్రభావం చూపిందని మౌర్య తెలిపింది. “అంతా శూన్యంగా అనిపించింది. చాలా రోజులు ఏడ్చాను. నేను ఏమీ చేయలేనన్న భావన కలిగింది” అని ఆమె చెప్పింది. ఈ అనుభవం చాలా కాలం పాటు తనను వెంటాడిందని కూడా పేర్కొంది.మళ్లీ ప్రయాణం ప్రారంభంఅయితే తర్వాత ఆమె తనను తాను తిరిగి నిర్మించుకోవాలని నిర్ణయించుకుంది. ఆన్లైన్ ట్యుటోరియల్స్ చూడడం, సహచరుల సహాయం కోరడం, అలాగే “తెలివితక్కువ ప్రశ్నలు అయినా అడగడం” ద్వారా తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంది. తన అభ్యాస ప్రయాణాన్ని లింక్డ్ఇన్లో పంచుకోవడం ప్రారంభించడంతో, చివరికి తనకు మరో సంస్థ అధినేత అవకాశం ఇచ్చారు.ఏడాదిలో భారీ మార్పుఉద్యోగం కోల్పోయిన ఏడాది తరువాత ప్రస్తుతం తాను మొదట ఇచ్చిన ఆఫర్ కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నానని మౌర్య తెలిపింది. “ఇప్పుడు అన్నీ చాలా బాగున్నాయి. అప్పటి విషపూరితమైన కార్యాలయం నుంచి బయటపడటం మంచిదే అనిపిస్తోంది” అని ఆమె పేర్కొంది.నెటిజన్ల స్పందనలుమౌర్య కథకు అనేక మంది టెక్ ప్రొఫెనల్స్ స్పందించారు. తమ కెరీర్ ప్రారంభంలో కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని చెప్పారు. కొంతమంది అనుభవం లేని వ్యవస్థాపకులు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారని వ్యాఖ్యానించగా, మరికొందరు స్పష్టత కోసం ప్రశ్నలు అడిగినందుకు విమర్శలు ఎదుర్కొన్నట్లు తెలిపారు. “అది ఐదేళ్ల క్రితం జరిగింది. ఇప్పటికీ కొన్నిసార్లు ఆ సంఘటన పీడకలలా అనిపిస్తుంది. కానీ చివరకు నేను తిరిగి లేచి నిలబడ్డాను” అని మరో టెక్ ఉద్యోగి కూడా తనకు జరిగిన అనుభవాన్ని పంచుకున్నారు. -
ఏఐ, ఆటోమేషన్‌పై పట్టు పెంచుకోవాలి
న్యూఢిల్లీ: దేశ విద్యా రంగాన్ని వాస్తవిక ప్రపంచ ఆర్థికవ్యవస్థతో అనుసంధానించే ప్రక్రియను మరింత వేగవంతంచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కృత్రిమ మేధ(ఏఐ), ఆటోమేషన్, డిజిటల్ ఎకానమీ వంటి సబ్జెక్టులపై మరింత దృష్టిపెట్టడం ద్వారా అనుసంధానం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం ఢిల్లీలో జరిగిన పోస్ట్–బడ్జెట్ వెబినార్‌లో మోదీ మాట్లాడారు. ‘‘విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్యం, పర్యాటకం, క్రీడలు, సాంస్కృతిక రంగాలు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే మాధ్యమాలు. సంస్థలు, పరిశ్రమల అవసరాలు తీర్చేలా విద్యారంగం మారాలి.అందుకే మార్కెట్ అవసరాలు, వాస్తవిక ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తగ్గట్లుగా నూతన జాతీయ విద్యావిధానం తీసుకొచ్చాం’’ అని అన్నారు. ‘‘యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (ఏవీజీసీ) రంగం మరింత అభివృద్ధి పథంలో దూసుకుపోవాలి. ఆవిష్కరణల ఆధారిత ఆర్థికవ్యవస్థకు అనుగుణంగా పరిశ్రమలు, పరిశోధనశాలలతో విద్యాలయాలు అనుసంధానం కావాలి. పారిశ్రామిక సౌజన్యం, పరిశోధనల ఆధారిత అభ్యసనలకు కేంద్రాలుగా రూపాంతరం చెందాలి.అప్పుడు విద్యార్థులు విద్యాలయాల్లో పారిశ్రామికావసరాలకు తగ్గ పరిశోధనలు చేసి సఫలీకృతులవుతారు’’ అని మోదీ అన్నారు. ‘‘స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమేటిక్స్) కోర్సులపై అమ్మాయిలు ఆసక్తిచూపడం శుభసూచకం. భావి సాంకేతికతల గురించి మాట్లాడుకునే వేళ దేశంలో ఏ అమ్మాయీ అవకాశాల కొరతతో వెనుకబడొద్దు’’ అన్నారు. పలు కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల అధికారులు, నిపుణులు, ప్రైవేట్ రంగ భాగస్వాములతో పాటు పలువురు ప్రముఖులు వెబినార్‌లో పాల్గొన్నారు. -
ఓపెన్ఏఐ రోబోటిక్స్ హెడ్ రాజీనామా: కారణం ఇదే!
ప్రముఖ ఏఐ దిగ్గజం ఓపెన్ఏఐలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కంపెనీలో రోబోటిక్స్ విభాగానికి నాయకత్వం వహిస్తున్న కైట్లిన్ కలినోవ్స్కీ (Caitlin Kalinowski) తన పదవికి రాజీనామా చేసారు.కైట్లిన్ కలినోవ్స్కీ కంపెనీ నుంచి వైదొలగడానికి ప్రధాన కారణం ఓపెన్ఏఐ అమెరికా రక్షణ శాఖతో చేసుకున్న కొత్త ఒప్పందం అని తెలుస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం సంస్థ రూపొందించిన ఏఐ మోడళ్లను అమెరికా సైన్యానికి చెందిన రహస్య నెట్‌వర్క్‌లలో ఉపయోగించడానికి అనుమతిస్తారు.కైలిన్ కలినోవ్స్కీ తన సోషల్ మీడియా పోస్టులో ఈ నిర్ణయం తేలికగా తీసుకోలేదని పేర్కొన్నారు. తన అభిప్రాయం ప్రకారం జాతీయ భద్రతలో AIకి ముఖ్యమైన పాత్ర ఉన్నప్పటికీ, కొన్ని అంశాలు చాలా జాగ్రత్తగా చర్చించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అమెరికా ప్రజలపై న్యాయపరమైన అనుమతి లేకుండా నిఘా పెట్టడం లేదా మానవ నియంత్రణ లేకుండా స్వతంత్రంగా పనిచేసే ప్రాణాంతక ఆయుధాల అభివృద్ధి వంటి అంశాలు తగిన చర్చ లేకుండా ముందుకు వెళ్లడం సరైంది కాదని వెల్లడించారు.ఇదీ చదవండి: మహిళల నుంచే అన్నీ.. గౌతమ్ అదానీ భావోద్వేగం!కలినోవ్స్కీ రాజీనామాను ఓపెన్ఏఐ కంపెనీ కూడా ధృవీకరించింది. అంతే కాకుండా కొత్త ఒప్పందం ప్రకారం.. జాతీయ భద్రత కోసం బాధ్యతాయుతంగా AIని ఉపయోగించే మార్గం ఏర్పడుతుందని, సంస్థకు కొన్ని స్పష్టమైన పరిమితులు ఉన్నాయని కూడా వెల్లడించింది. -
ఏఐ వాడకం.. అప్పుడొచ్చింది ఒక సందేహం!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అన్ని రంగాల్లోనూ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే ఈ టెక్నాలజీపై ఎక్కువగా ఆధారపడటం వల్ల తన వ్యక్తిగత నైపుణ్యాలు తగ్గుతున్నాయేమో అనే అనుమానం కలుగుతోందని ఒక యంగ్ బ్యాక్ఎండ్ ఇంజనీర్ ఆందోళనల వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.టెక్ ప్రొఫెషనల్ 11 నెలలుగా బ్యాక్ఎండ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. తాను రోజువారీ ఆఫీస్ పనుల్లో ఎక్కువ భాగం ఏఐ టూల్స్ సహాయంతోనే పూర్తిచేస్తున్నాడు. ముఖ్యంగా కర్సర్ ఏఐ కోడ్ ఎడిటర్ & క్లౌడ్ ఏఐ అసిస్టెంట్ వంటివి కోడ్ రాయడంలో, APIలు రూపొందించడంలో మాత్రమే కాకుండా.. ఇతర సాంకేతిక పనులను పూర్తి చేయడంలో సహాయం చేస్తున్నాయి. ఈ టూల్స్ ఇచ్చిన సూచనల ప్రకారం పనులు పూర్తి చేస్తున్నానని అతను తెలిపాడు.ఇలాంటి సమయంలో అతనిలో ఒక సందేహం కలిగింది. సుమారు ఏడాదిగా పనిచేస్తున్నప్పటికీ.. నేను నిజంగా ఏమి నేర్చుకున్నాను. నేను ఇప్పటికే కొత్తగా ఉద్యోగంలో చేరిన వ్యక్తి మాదిరిగానే ఉన్నానని తన పోస్టులో పేర్కొన్నాడు. ఒకరోజు కర్సర్ ఏఐ సాంకేతిక సమస్య వల్ల పనిచేయకుండా పోయింది. అప్పుడు నేనే ఆ పనిని పూర్తి చేయాల్సి వచ్చింది. కానీ నేను ఏఐ సహాయం లేకుండా స్వతంత్రంగా పనిచేయలేకుండా పోతున్నానని, పని కష్టమవుతోందని వాపోయాడు.టెక్ రంగంలోకి ప్రవేశించడం తనకు అంత సులభం కాదని కూడా సోషల్ మీడియా పోస్టులో వివరించాడు. 2023లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి.. అనేక ఇంటర్వ్యూలు విఫలమైన తర్వాత 2025లో ఉద్యోగం సంపాదించాడు. ఇప్పుడు ఏఐ ఉపయోగించకుండా.. చేయాల్సిన పని కష్టం అయితే.. ఉద్యోగం బహుశా పోవచ్చు కూడా.ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కర్సర్ లేకుండా పని చేయడం కష్టమే అని కొందరు సీనియర్లు సరదాగా కామెంట్ చేశారు. ప్రస్తుతం ఏఐ ఉపయోగిస్తూ.. పని సులభంగా ఉందని సంబరపడిపోయే వారికి ఇదొక హెచ్చరిక అని ఇంకొందరు చెబుతున్నారు. -
ప్రకటనల రంగంలో ఏఐ విప్లవం
సాంకేతిక మార్పులను అందిపుచ్చుకోవడంలో భారత్ ఎప్పుడూ ముందే ఉంటుంది. ఇప్పుడు ప్రకటనల రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకంలో భారత్ ప్రపంచ దేశాల కంటే వేగంగా దూసుకుపోతోందని ప్రముఖ గ్లోబల్ యాడ్టెక్ సంస్థ తబూలా (Taboola) వ్యవస్థాపకుడు, సీఈఓ ఆడమ్ సింగోల్డా స్పష్టం చేశారు.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. భారతీయ ప్రకటనకర్తలు, పబ్లిషర్లు కొత్త ప్రయోగాలకు ఏమాత్రం వెనుకాడటం లేదన్నారు. వైఫల్యాలు ఎదుర్కోవడానికైనా సిద్ధపడుతూ ఏఐ స్వీకరణలో దూకుడు ప్రదర్శిస్తున్నారని ప్రశంసించారు. సింగోల్డా తన 15 ఏళ్ల కెరీర్లో ఎప్పుడూ చూడనంత గణాంకాలను భారత్‌లో చూస్తున్నట్లు వెల్లడించారు. ‘కంపెనీ ప్రవేశపెట్టిన డీపర్ డైవ్ ప్రొడక్ట్ ద్వారా వినియోగదారులు పబ్లిషర్ సైట్లలో ఎక్కువ సమయం గడుపుతున్నారు. దీని ‘క్లిక్-త్రూ రేట్’ డబుల్ డిజిట్లో ఉంది. ఏఐ ఆధారిత ఈ యాడ్ ప్లాట్‌ఫామ్ కోసం ఏటా రూ.80 లక్షలకు పైగా ఖర్చు చేసే ప్రకటనకర్తల సంఖ్య గతేడాది భారీగా పెరిగింది’ అని అన్నారు.డిజిటల్ డిమాండ్ప్రముఖ అడ్వర్టైజింగ్ సంస్థ మెడిసన్ వరల్డ్ తన తాజా వ్యయ నివేదికలో 2026 నాటికి భారతీయ మార్కెట్ పూర్తిగా డిజిటల్ డిమాండ్‌తో నడుస్తుందని విశ్లేషించింది. ఏఐ టూల్స్ వాడటం వల్ల క్యాంపెయిన్ మేనేజ్మెంట్లో వారానికి సగటున 5.2 గంటలు (ఏడాదికి దాదాపు 30 పనిదినాలు) ఆదా అవుతున్నట్లు పేర్కొంది. ఏఐ ద్వారా విజువల్స్, కంటెంట్ రూపొందించడం సులభతరం కావడంతో చిన్న సంస్థలు కూడా పెద్ద కార్పొరేట్ కంపెనీల స్థాయిలో నాణ్యమైన ప్రకటనలు ఇవ్వగలుగుతున్నాయని తెలిపింది.2027 నాటికి ఏజెన్సీల విభజనభవిష్యత్తులో అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు రెండు విభాగాలుగా విడిపోయే అవకాశం ఉందని మెడిసన్ వరల్డ్ అంచనా వేసింది. అందులో సిస్టమ్స్ ఏజెన్సీలు సొంతంగా ఏఐ ఫ్రేమ్‌వర్క్‌లు, మేధో సంపత్తిని కలిగి ఉండి ఫలితాల ఆధారంగా పని చేస్తాయి. సర్వీస్ ఏజెన్సీలు కేవలం ప్లాట్‌ఫామ్ టూల్స్‌ను ఉపయోగించి క్లయింట్లకు సేవలను అందిస్తాయని చెప్పింది.వినియోగదారుల అలవాట్లుభారత్లో వినియోగదారులు కూడా టెక్నాలజీని వేగంగా స్వీకరిస్తున్నారు. గణాంకాల ప్రకారం, 65 శాతం మంది భారతీయులు రోజూ ఏదో ఒక రూపంలో ఏఐని ఉపయోగిస్తున్నారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఈ-కామర్స్ మార్కెట్‌గా ఉన్న భారత్ ఏఐ అడ్వర్టైజింగ్కు అడ్డాగా మారబోతోందని సింగోల్డా ధీమా వ్యక్తం చేశారు. అయితే త్వరలోనే ఏఐని ప్రాథమిక దశలో కాకుండా పూర్తిస్థాయిలో వినియోగించే సంస్థలకు, వెనుకబడిన సంస్థలకు మధ్య వ్యత్యాసం భారీగా పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: ఆర్థిక నిర్ణయాల్లో మహిళా గళం -
‘ఆస్పత్రి మాఫియా’ ఇక లగెత్తాల్సిందే!
ప్రభుత్వ ఖజానాకు కన్నం వేసే అక్రమార్కుల ఆటలకు ఇక కాలం చెల్లింది! పేదల ఆరోగ్యం కోసం కేటాయించిన ఒక్క రూపాయి కూడా పక్కదారి పట్టకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత శక్తివంతమైన ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (AI) అస్త్రాన్ని ప్రయోగించింది. ఆయుష్మాన్ భారత్‌లో చోటుచేసుకుంటున్న కోట్లాది రూపాయల క్లెయిమ్‌ల మోసాలను ‘ఏఐ టెక్నాలజీ’ చిటికెలో కనిపెట్టేస్తోంది. ఆస్పత్రుల అక్రమాలకు అడ్డుకట్ట వేయడమే కాకుండా, డాక్టర్లు ప్రిస్క్రిప్షన్లు టైప్ చేసే శ్రమ లేకుండా.. వారు మాట్లాడితే చాలు డిజిటల్ రిపోర్టులు తయారయ్యే విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టింది. సామాన్యుడికి అందాల్సిన వైద్యం మరింత వేగంగా, నిజాయితీగా అందేందుకు ఈ డిజిటల్ మేధస్సు తోడ్పాటునందిస్తోంది.నకిలీ క్లెయిమ్‌లపై ఏఐ ‘సర్జరీ’దేశవ్యాప్తంగా అమలవుతున్న ఆయుష్మాన్ భారత్ పథకంలో పారదర్శకతను పెంచేందుకు నేషనల్ హెల్త్ అథారిటీ (NHA) నడుం బిగించింది. ‘నేషనల్ యాంటీ ఫ్రాడ్ యూనిట్’ (NAFU) ద్వారా రంగంలోకి దిగిన ఏఐ ఇంజిన్లు.. ఆస్పత్రులు పంపే ప్రతి క్లెయిమ్‌ను క్షుణ్ణంగా స్కాన్ చేస్తున్నాయి. అనవసరంగా రోగులను ఆస్పత్రులలో ఉంచుకోవడం, చికిత్స చేయకుండానే బిల్లులు వేయడం లాంటి మోసాలను ఈ వ్యవస్థ ఇట్టే పసిగడుతోంది. ఫలితంగా ప్రభుత్వం కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాపాడగలిగింది.గంటల్లోనే క్లెయిమ్ సెటిల్మెంట్గతంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ పరిష్కారానికి 15 నుండి 20 రోజుల సుదీర్ఘ సమయం పట్టేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ పుణ్యమా అని కేవలం రెండు గంటల్లోనే క్లెయిమ్ ప్రక్రియ పూర్తవుతోంది. క్లౌడ్ డేటాను సెకన్లలో విశ్లేషించే ఏఐ, నిబంధనల ప్రకారం ఉన్న బిల్లులను వెంటనే ఆమోదిస్తుంది. అనుమానాస్పదంగా ఉన్న కేసులను మాత్రమే మానవ పర్యవేక్షణకు పంపి తనిఖీ చేయిస్తారు. దీనివల్ల ఆసుపత్రులకు చెల్లింపులు వేగంగా అందుతున్నాయి.డాక్టర్ల మాటతో ప్రిస్క్రిప్షన్లు రెడీ!ప్రభుత్వ ఆస్పత్రులలో ఉండే రద్దీ వల్ల డాక్టర్లు కంప్యూటర్ ముందు కూర్చుని ప్రిస్క్రిప్షన్లు టైప్ చేయడం ఒక పెద్ద సవాలుగా మారింది. దీనికి పరిష్కారంగా ‘వాయిస్-టు-టెక్స్ట్’ (VTT) సాంకేతికతను ప్రవేశపెట్టారు. డాక్టర్ పేషెంట్‌ను పరీక్షిస్తూ, ఏవైతే సూచనలు చేస్తారో, ఆ మాటలను ఏఐ నేరుగా డిజిటల్ టెక్స్ట్‌గా మారుస్తుంది. డాక్టర్లు టైప్ చేయాల్సిన అవసరం లేకుండానే, ప్రిస్క్రిప్షన్ ఆటోమేటిక్‌గా తయారై, హెల్త్ రికార్డుల్లో నిక్షిప్తమవుతుంది.మెరుగైన చికిత్సకు మార్గంఈ ఏఐ టూల్స్ వల్ల వైద్యులకు డాక్యుమెంటేషన్ భారం గణనీయంగా తగ్గనుంది. సాధారణంగా ఒక డాక్టర్ తన సమయాన్ని రిపోర్టులు రాయడానికే ఎక్కువ కేటాయించాల్సి వచ్చేది. అయితే వాయిస్-టు-టెక్స్ట్ విధానం వల్ల ఆ సమయం ఆదా అవుతుంది. ఫలితంగా డాక్టర్లు రోగుల సమస్యలను మరింత ఓపిగ్గా వినేందుకు, మెరుగైన చికిత్స అందించేందుకు అవకాశం కలుగుతుందని వైద్యశాఖ అధికారులు భావిస్తున్నారు.డేటా భద్రతతో కూడిన ప్లాట్ఫామ్ఈ వినూత్న మార్పులను నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (NIC) అభివృద్ధి చేసిన ‘ఈ-హాస్పిటల్’ ప్లాట్ఫామ్లో అనుసంధానించారు. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సమాచారం అంతా భద్రంగా ఉండటమే కాకుండా, ఏ రాష్ట్రం నుంచైనా డేటాను విశ్లేషించే వీలుంటుంది. ఈ ఏడాది జనవరి 19 నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన ఈ వ్యవస్థను ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తున్నారు.వైద్య రంగంలో డిజిటల్ భవిష్యత్తుఇటీవలి ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’లో ప్రదర్శించిన ఈ సాంకేతికతలు ఆరోగ్య రంగంలో ఒక కొత్త శకానికి నాంది పలికాయి. టెక్నాలజీ సాయంతో అక్రమాలను అరికట్టడమే కాకుండా, సామాన్యుడికి వేగవంతమైన వైద్య సేవలు అందించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం. మానవ తప్పిదాలకు తావులేకుండా, యంత్రాల సాయంతో సాగుతున్న ఈ డిజిటల్ హెల్త్ విప్లవం భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు సృష్టించనున్నదనడంలో సందేహం లేదు.ఇది కూడా చదవండి: రాజ్యసభ బరిలో నితీష్ తనయుడు నిశాంత్? -
ఏఐతో విద్య.. ప్రీమియా అకాడమీ కొత్త ఆలోచన!
అన్నిరంగాల్లో నేనున్నానంటున్న ఏఐ.. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చే ప్రధాన శక్తిగా మారింది. ట్యూటరింగ్ సిస్టమ్స్, ఆడాప్టివ్ లెర్నింగ్ ఫ్రేమ్‌వర్క్స్, తక్షణ ఫీడ్‌బ్యాక్ వ్యవస్థలు, విభిన్న విజువలైజేషన్ సాంకేతికతల ద్వారా కృత్రిమ మేధస్సు విద్యార్ధుల కోసం జ్ఞానాన్ని పంచుకునే, అర్థం చేసుకునే, అన్వయించే విధానాలను పునఃరూపకల్పన చేస్తోంది. వీటన్నింటిని గమనించి ప్రీమియా అకాడమీ తన విద్యా వ్యవస్థలో కృత్రిమ మేధను ప్రవేశపెట్టడానికి సంకల్పించింది.ప్రతి విద్యార్థికి నేర్చుకునే వేగం, జిజ్ఞాస, అర్థం చేసుకునే శైలి వంటివన్నీ వేరువేరుగా ఉంటాయి. సాధారణ తరగతులు లేదా పద్ధతులు ఈ సమస్యను పరిష్కరించలేవు. దీనిని ఏఐ తప్పకుండా భర్తీ చేయగలదు. అంటే దీని అర్థం.. ఉపాధ్యాయుల స్థానంలో ఏఐను తీసుకురావడం కాదు. వారి సామర్థ్యాలను పెంచడం.కొత్త విధానాల ద్వారా.. ఉపాధ్యాయులు బాధ్యతలు కొన్ని తగ్గుతాయి. అదే సమయంలో మరింతమంది విద్యార్థులకు మెంటార్‌గా ఉంటారు. ఇది విద్యార్థుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ద వహించడానికి ఉపయోగపడుతుంది. కాగా విద్యార్థులు వారి స్వంత వేగానికి తగిన పాఠాలను నేర్చుకోగలుగుతారు. తరగతులు మరింత ఇంటరాక్టివ్ అవుతాయి. ఇది ఒక సమర్థవంతమైన, ప్రేరణ కలిగించే విద్యా అనుభవాన్ని తెస్తుంది. -
ఏఐపై అత్యంత భారీ పెట్టుబడులు
ఇటీవల నిర్వహించిన 2026 ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో భారీ పెట్టుబడులకు తెరలేచినట్లు ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. ఏఐపై కార్పొరేట్ దిగ్గజాలు రిలయన్స్ ఇండస్ట్రీస్‌సహా అదానీ గ్రూప్, గూగుల్, టాటా, లైట్‌స్పీడ్ వెంచర్స్ తదితరాలు ఉమ్మడిగా 240 బిలియన్ డాలర్లు(రూ. 21.84 లక్షల కోట్లు) ఇన్వెస్ట్ చేసేందుకు కట్టుబాటును ప్రదర్శించాయి. గత నెల 16–21 మధ్య నిర్వహించిన ఏఐ సదస్సు సుమారు 6 లక్షల మంది హాజరైన అతిపెద్ద ఈవెంట్‌గా నిలుస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 100 దేశాల నుంచి ప్రతినిధులు, 20 అంతర్జాతీయ సంస్థలు వీటిలో పాలుపంచుకున్నట్లు వెల్లడించింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫౌండేషన్ మోడళ్లు, హార్డ్‌వేర్, అప్లికేషన్లు తదితర విభాగాలలో 200 బిలియన్ డాలర్లకుపైగా ఏఐ సంబంధిత పెట్టుబడులకు కట్టుబాటు కనిపించినట్లు తెలియజేసింది. దిగ్గజాలు ఇలా..ఏఐ సదస్సులో డైవర్సిఫైడ్ దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏఐ ఆధారిత ఇన్ఫ్రాస్ట్రక్చర్పై 110 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసేందుకు ప్రణాళికలు ప్రకటించింది. ఏడేళ్లలో వీటిని వెచి్చంచనున్నట్లు తెలియజేసింది. అదానీ ఎంటర్ప్రైజెస్ 2035కల్లా 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రణాళికలు వెల్లడించింది. జనరల్ కేటలిస్ట్ ఐదేళ్లలో 5 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్‌కు కమిట్మెంట్ను ప్రకటించింది. ఈ బాటలో లైట్‌స్పీడ్ వెంచర్ పార్ట్నర్స్ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు సిద్ధమని తెలియజేసింది.గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కొత్తగా ఇండియా– యూఎస్ సబ్‌సీ కేబుల్ మార్గంసహా.. 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రణాళికలు వెల్లడించారు. వీటిలో విశాఖపట్టణంలోని ఏఐ హబ్ సైతం కలసి ఉంది. ఇక టాటా గ్రూప్ ఏఐ రెడీ డేటా సెంటర్ల ఏర్పాటుకు ఓపెన్ఏఐతో భాగస్వామ్యాన్ని ప్రకటించడం గమనార్హం! ఈ సదస్సులో దేశ సావరిన్ కంప్యూట్ సామర్థ్యాన్ని విస్తరించనున్నట్లు కీలక ప్రకటన వెలువడింది. ఇండియా ఏఐ మిషన్‌లో భాగంగా ఇప్పటికే ఏర్పాటు చేసిన 38,000 జీపీయూలకు జతగా కొద్ది వారాలలో మరో 20,000 జీపీయూలకు తెరతీయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. దీంతో నేషనల్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరింత పటిష్టంకానుంది. 850 ఎగ్జిబిటర్లతో 10 థిమాటిక్ పెవిలియన్లతో ఏర్పాటైన ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఏఐ ఎగ్జిబిషన్లలో ఒకటిగా నిలిచినట్లు ప్రస్తావించింది.ఇదీ చదవండి: విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు -
2033 నాటికి 9 కీలక ఉద్యోగాలకు ఎసరు!
ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా సాంకేతిక విప్లవంలో కృత్రిమ మేధ కీలకంగా వ్యవహరిస్తోంది. అది కొన్ని కంపెనీలు, ఉద్యోగులకు వరంగా మారితే ఇంకొందరికి శాపంగా మారుతోంది. ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ఇటీవల ఎక్స్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నారు. ఏఐ కార్పొరేట్, సామాన్య వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. 2028 నుంచి 2033 మధ్య కాలంలో కృత్రిమ మేధ ఏయే వృత్తులను కబళించబోతుందో ఆయన విశ్లేషించిన తీరు, ఉపాధి భవిష్యత్తుపై చర్చకు దారితీసింది. గోయెంకా అంచనా ప్రకారం వివరాలు కింది విధంగా ఉన్నాయి.తొలి దశ: 2028 - 2029 (సాంకేతిక, సేవా రంగాల్లో మార్పులు)ఈ రెండేళ్ల కాలంలో ఏఐ కేవలం ఉద్యోగులకు సహాయకారిగా మాత్రమే కాకుండా నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతుందని గోయెంకా పేర్కొన్నారు. అందులో..సాఫ్ట్వేర్ కోడర్లు (2028): ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్ల బృందాలు చేసే పనిని ఏఐ స్వతంత్రంగా చేయనుంది. కోడ్ రాయడం, బగ్స్ ఫిక్స్ చేయడం, సిస్టమ్ ఆప్టిమైజేషన్ వంటి పనులను ఏఐ స్వతంత్రంగా నిర్వహించడంతో డెవలపర్ల అవసరం గణనీయంగా తగ్గుతుంది.డ్రైవింగ్, లాజిస్టిక్స్ (2029): సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ విస్తరిస్తుంది. దీనివల్ల టాక్సీ డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లు, డెలివరీ ఏజెంట్ల ఉపాధికి గండం పొంచి ఉంది.బోధన రంగం (2029): క్లాస్రూమ్ బోధన స్థానంలో పర్సనలైజ్డ్ ఏఐ ట్యూటర్స్ వస్తారు. విద్యార్థి సామర్థ్యాన్ని బట్టి 24/7 అందుబాటులో ఉండే ఈ వ్యవస్థలు సంప్రదాయ ఉపాధ్యాయ వృత్తికి సవాలుగా మారుతాయి.రెండో దశ: 2030 - 2032 (వృత్తి నిపుణులపై ప్రభావం)వైద్యులు, రోగ నిర్ధారణ (2030): రోగ నిర్ధారణ విషయంలో ఏఐ మానవ వైద్యుల కంటే వేగంగా, కచ్చితంగా ఫలితాలను ఇస్తుంది. మెడికల్ ఇమేజింగ్, హిస్టరీ అనాలిసిస్ వంటివి పూర్తిగా ఏఐ మయం అవుతాయి.కళాకారులు, సృజనాత్మకత (2030): సంగీతం, పెయింటింగ్, రైటింగ్, డిజైనింగ్ వంటి రంగాల్లో ఏఐ సృష్టించే కంటెంట్ ఆధిపత్యం చెలాయిస్తుంది. సృజనాత్మకత అనేది కేవలం మానవుల సొత్తు అనే భావన చెరిగిపోనుంది.న్యాయవాదులు (2031): లీగల్ రీసెర్చ్, ఒప్పంద పత్రాల తయారీ వంటి పనులను ఏఐ సెకన్లలో పూర్తి చేస్తుంది. దీనివల్ల జూనియర్ న్యాయవాదుల డిమాండ్ పడిపోతుంది.మాన్యుఫాక్చరింగ్ (2031): ఫ్యాక్టరీలు పూర్తిస్థాయి ఆటోమేషన్‌కు చేరుకుంటాయి. విశ్రాంతి అవసరం లేని రోబోలు ఉత్పత్తి రంగంలో మానవ శ్రమను పూర్తిగా భర్తీ చేస్తాయి.సర్జన్లు (2032): శస్త్రచికిత్సల్లో రోబోటిక్ కచ్చితత్వం పెరుగుతుంది. సర్జన్ల పాత్ర కేవలం పర్యవేక్షణకు మాత్రమే పరిమితం కావచ్చు.2033 (రక్షణ రంగం)గోయెంకా అంచనాల ప్రకారం 2033 నాటికి యుద్ధ తంత్రం కూడా మారిపోతుంది. మానవ సైనికుల కంటే ఏఐ ఆధారిత స్వయంప్రతిపత్త ఆయుధ వ్యవస్థలు నిఘా, వ్యూహాత్మక దాడులను నిర్వహిస్తాయి. ఇది అంతర్జాతీయ రక్షణ వ్యవస్థలను మార్చేయనుంది.భవిష్యత్తు మంత్రంమారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి. మార్పును ఆహ్వానిస్తూ ఏఐని ఒక పనిముట్టుగా వాడుకోవడం నేర్చుకోవాలి. యంత్రాలు చేయలేని సృజనాత్మక, వ్యూహాత్మక నిర్ణయాల్లో రాణించాలి. ఉద్యోగాలు పోతాయనే భయం కంటే ఏఐ సృష్టించే కొత్త అవకాశాలను ఎలా అందిపుచ్చుకోవాలనేదే నేటి యువత ముందున్న అసలు సవాలు.ఇదీ చదవండి: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య వార్‌కు కారణం ఇదే.. -
ఏఐ ఎంత ఎదిగినా.. భర్తీ చేయలేని పనులు ఇవే!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల ఇప్పటికే చాలా కంపెనీల్లో ఉద్యోగులు జాబ్స్ కోల్పోయారు. రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని నిపుణులు సైతం అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏఐ కొన్ని వృత్తులను, ఉద్యోగాలను భర్తీ చేయలేదని స్పష్టం చేశారు.శ్రీధర్ వెంబు ప్రకారం.. పిల్లలను చూసుకోవడం, వృద్ధులను సంరక్షించడం, బోధన చేయడం, ప్రకృతిపట్ల ప్రేమతో.. అటవీ రక్షకులుగా పనిచేయడం, దేవాలయంలో భక్తితో నిత్యకార్యాలు నిర్వహించడం వంటివి ఏఐ చేయలేదు. ఇవన్నీ కేవలం డబ్బు సంపాదన కోసం చేసేవి కాదు. ఇవి బాధ్యత, ప్రేమ, నిబద్దత, ఆత్మసంతృప్తి కోసం చేస్తారు.నిజానికి ఏఐ ఎంత అభివృద్ధి చెందినా.. మనిషి విలువను, విలువలను తగ్గిచలేదు. కొన్ని రంగాల్లో మనిషికంటే గొప్పగా ముందుకు సాగినప్పటికీ, మనిషి ఆలోచనలను అందుకోవడం కష్టం అనే చెప్పాలి. అంతే కాకుండా.. భవిష్యత్తులో సమాజం కూడా ఆర్థిక ప్రమాణాలకన్నా, మనసుకు దగ్గరైన విలువల చుట్టూ తిరిగే విధంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.If our notion of self-worth comes from the economic value we add, or if it comes our intellectual pretense (*cough*), AI may pose a serious challenge to our self-worth.On the other hand no one takes up activities like taking care of children, teaching children, taking care of…— Sridhar Vembu (@svembu) February 27, 2026 -
అలా ఆలోచిస్తేనే ‘రిచ్’ అవుతారు.. కియోసాకీ హెచ్చరిక!
అమెరికా ఫిన్‌టెక్ దిగ్గజం .. స్క్వేర్, క్యాష్ యాప్‌లకు చెందిన బ్లాక్ (Block Inc.) కంపెనీ ఊహించని నిర్ణయం తీసుకుంది. కంపెనీలోని సుమారు 10 వేల మంది ఉద్యోగుల్లో 40 శాతం.. అంటే 4,000 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోతున్నారని స్వయంగా కంపెనీ సీఈఓ జాక్ డార్సీ (ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు) ఇటీవల ప్రకటన చేశారు. ఇది ఆర్థిక సంక్షోభం వల్ల కాదు, కంపెనీ లాభాలు బాగున్నాయి.. షేర్లు 20-25 శాతం పెరిగాయి. కారణం ఒక్కటే.. కృత్రిమ మేధస్సు (AI)!"ఇంటెలిజెన్స్ టూల్స్ (AI) వాడితే చిన్న టీమ్‌తోనే ఎక్కువ పని, మెరుగైన ఫలితాలు సాధ్యమవుతున్నాయి. ఇది కంపెనీల నడిపించే విధానాన్నే మార్చేసింది" అని డార్సీ స్పష్టంగా చెప్పారు. గతంలో ప్రతి ఉద్యోగి కంపెనీకి కోట్ల రూపాయల ఆదాయం తెచ్చినా, ఇప్పుడు వాళ్ల పనిని ఏఐ చేస్తోందని అంగీకరించారు. దీంతో ఉద్యోగుల సంఖ్య 6 వేల దాటకుండా తగ్గించాలని నిర్ణయించారు.ఈ పరిణామంపై ప్రసిద్ధ ఆర్థిక గురూ, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకీ (Robert Kiyosak) ‘ఎక్స్’ (ట్విట్టర్)లో ఓ శక్తివంతమైన పోస్ట్ చేశారు. "ఏఐ ధనవంతుల్ని మరింత ధనవంతుల్ని చేస్తోంది" అంటూ ఆయన హెచ్చరించారు. "ఉద్యోగిలా ఆలోచిస్తే ఏఐ మిమ్మల్ని భర్తీ చేస్తుంది. అదే వ్యాపారవేత్తలా ఆలోచిస్తే, డార్సీలా ఏఐని 'హైర్' చేసుకుని మీరు ధనికులవుతారు" అని స్పష్టంగా చెప్పారు.AI MAKES the RICH RICHER:Jack Dorsey just fired 4400 hundred employees. Not because the company needed the money.Dorsey admitted each employee made his company millions of dollars.Dorsey fired 4400 employee because AI could do their jobs.RICH DAD LESSON:Think like an…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 27, 2026 -
చేయాల్సింది చాలా ఉంది!
ప్రపంచ ఏఐ యవనికపై శక్తిమంత మైన పాత్ర వహించగల దేశంగా భారతదేశాన్ని రూపు కట్టించడంలో ఏఐ ఇంప్యాక్ట్ సమ్మిట్, దానికి సంబంధించి న్యూఢిల్లీలో ఏర్పాటైన ఎగ్జిబిషన్ సఫలమై ఉండాల్సింది. కానీ, దేశంలో పరిశోధన–అభివృద్ధి (ఆర్–డి), నవీ కరణలో వైఫల్యాలకు అది అద్దం పట్టింది. గల్గోటియాస్ అనే ప్రైవేటు విశ్వవిద్యాలయం చైనా నుంచి రోబో డాగ్‌ను దిగుమతి చేసుకుని, ఏఐ నవీకరణ కేంద్రంగా తనను తాను చాటుకోవాలని ఉబలాటపడటం ఒక ప్రహసనంగా మారింది. దేశ విదేశాల్లో పత్రికలకెక్కి అపఖ్యాతిని తెచ్చిపెట్టింది. ఈ ఉదంతం గత కొన్నేళ్లుగా పరిశోధన రంగాల్లో క్షీణిస్తున్న ప్రమాణాలకు పరాకాష్ఠగా నిలిచింది.నిధుల లేమి‘ఆర్–డి’పై భారతదేశ స్థూల వ్యయం, స్థూల జాతీయో త్పత్తి (జీడీపీ)లో కనాకష్టంగా 0.64 శాతంగా ఉంది. అమెరికా (3.48), చైనా(2.43)లతో పోల్చితే ఇది చాలా తక్కువ. పరిశోధ నకు ప్రస్తుతం తరలిస్తున్న నిధులలో చాలా భాగం జాతీయ లాబొరేటరీలు, ఐఐటీల వంటి అగ్రశ్రేణి సంస్థలకు వెళుతు న్నాయి. ఈ విషయంలో విశ్వవిద్యాలయాలు చాలా వెనుకబడి పోయాయి. ‘అనుసంధాన్ నేషనల్ రిసెర్చ్ ఫౌండేషన్’, ‘రిసెర్చ్, డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఫండ్’ వంటి నూతన పథకాల ప్రభావం ఇంకా కనపడవలసి ఉంది. ఏఐ, దాని అనుబంధ రంగాలకు చెందిన పేటెంట్లకు దరఖాస్తు చేయడంలో, పరిశోధన పత్రాల సమర్పణలో చైనా చాలా ముందుంది. బోధనా ప్రమాణాలు, పరిశోధనల ఫలితా లపై భారత్ దృష్టి పెట్టడం లేదు. యూనివర్సిటీలు, పరిశ్రమల మధ్య పొత్తును కూడా సరిగ్గా ఏర్పరచలేకపోతున్నాం. ఫలితంగా, విషయ చౌర్యం, నకిలీ పరిశోధనలు, కుహనా సైన్స్‌ను ప్రోత్సహించడం, సమర్పించిన పత్రాలను వెనక్కి తీసుకోవడం తదితర సమస్యలు తలెత్తుతున్నాయి. ఆహా ఓహో అంటూ ఆకా శానికెత్తేయడం, స్టార్టప్‌లకు మితిమీరిన ప్రాధాన్యం ఇవ్వడం వల్ల మన సంస్థలు గొప్ప వాగ్దానాలు చేస్తున్నాయి; లేదా గల్గోటియాస్లాగా నకిలీ గొప్పలకు పోతున్నాయి.సోషలిస్టు ఏఐ పంథాశాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా ఉన్న ఆంత్రోపిక్ సంస్థ ఏఐ టూల్స్‌కు సంబంధించి ఇటీవల క్లాడ్ ఓపస్ సిరీస్ విడుదల చేయడం ద్వారా టెక్నాలజీ మార్కెట్లలో కలకలం సృష్టించింది. దాని ప్రకంపనలు స్టాక్ మార్కెట్లలోనూ నమోదయ్యాయి. ఆ టూల్స్ జటిలమైన ఆర్థిక విశ్లేషణకు, లాంగ్–ఫారమ్ కోడింగ్‌కు ఉపయోగపడతాయి. ఈ ఆటోమేషన్ టూల్స్ ఆవిష్కరణకు భయపడి సంప్రదాయ సిద్ధమైన సాఫ్ట్వేర్, లీగల్–టెక్ కంపెనీల షేర్లను ఇన్వెస్టర్లు అయినకాడికి అమ్మేశారు. అనేక మందికి ఉపాధి కల్పిస్తున్న ఐటీ సేవల రంగాన్ని కూడా ఏఐ ఏజెంట్లు అతలాకుతలం చేస్తాయే మోనని ఆందోళన వ్యక్తమవుతోంది. మన దేశంలోని అతి పెద్ద ఔట్ సోర్సింగ్ సంస్థలకు కూడాఆంత్రోపిక్ ఏఐ ఏజెంట్లను విక్రయిస్తోంది. అవి పెద్ద సంఖ్యలో సిబ్బందికి ఉద్వాసన చెప్పేందుకు దారితీయవచ్చు. కొన్ని భౌగోళిక ప్రాంతాలు, కొద్ది సంస్థల చేతుల్లోనే ఏఐకేంద్రీకృతమవుతోందని పసిగట్టిన భారత్ ‘ఏఐ ప్రజాస్వామికీక రణ’కు శ్రీకారం చుట్టింది. ఈ రంగంలో సాగుతున్న అంతర్జా తీయ పోటీలో తన స్థానాన్ని చాటుకునేందుకు ఢిల్లీ సదస్సు ద్వారా భారత్ ఒక ప్రయత్నం చేసింది. విద్య, ఆరోగ్యం, పరిపా లన, వస్తూత్పత్తి, వ్యవసాయం వంటి భిన్నమైన రంగాలలో కూడా ఏఐ సేవలను వినియోగించుకునేటట్లు చేయాలన్నది ఈ సమ్మిట్ వెనుక ఉన్న భావన. పాశ్చాత్య దేశాల్లో ఏఐలో ప్రైవేటు పెట్టుబడులు ముందున్నాయి. కానీ, భారత్ సోషలిస్టు పంథాను ఎంచుకుంది. మన దేశంలో ఏఐ అభివృద్ధికి ఏఐ మిషన్ ద్వారా ప్రభుత్వమే నిధులు సమకూరుస్తోంది. భారత్ జెన్ వంటి వాటిలోనూ ప్రభుత్వ పెట్టుబడులున్నాయి. చాట్ జీపీటీ వంటి కమర్షియల్ మోడళ్లను కాకుండా ‘సావరిన్’ ఏఐ మోడళ్ళను భారత్ అభివృద్ధి చేస్తోంది. బహుళ భాషా, బహుళ సాంస్కృతిక పర్యావరణాలకు అనువైన కొత్త మోడళ్ళను అభివృద్ధి చేస్తోంది. వాటిని ప్రజా శ్రేయస్సుకు వినియోగించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఎన్నో రకాల సవాళ్లుఅయితే, దార్శనికతను వాస్తవికతగా మార్చడం పైకి కనిపి స్తున్న దానికన్నా ఎక్కువ సవాళ్లతో కూడుకున్న వ్యవహారం. అవసరమైన నిపుణులైన సిబ్బంది కొరత అన్నింటి కన్నా పెద్ద సవాల్. దేశంలో ఐటీ సేవల రంగంలో సుమారు 60 లక్షలమంది పనిచేస్తున్నారు. క్లాడ్ వంటి ఏఐ టూల్స్‌తో చాలా మంది ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడింది. మిగిలినవారికి మళ్ళీ తర్ఫీదు నివ్వడం, కొత్త నైపుణ్యాలను నేర్పించడం చేయాలి. అయితే, లార్జ్ లాంగ్వేజ్ మోడళ్ళు, అప్లికేషన్లు, భద్రత, నియంత్రణ పార్శా్వలకు సంబంధించి చాలా మంది ఉద్యోగులు కూడా అవసరమవుతారు. వాస్తవిక పరిస్థితులు ఇలా ఉంటే, గ్లోబల్ టెక్నాలజీ సంస్థలకు ఏఐ ఇంజినీర్లను సరఫరా చేసే దేశంగా భారత్ అవతరిస్తుందని విధాన నిర్ణేతలు అత్యుత్సాహం ప్రదర్శించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఐటీ సేవల విషయంలో కూడా 1990లలో మనం ఇదే రకమైన తప్పు చేశాం. ఫలితంగా, ప్రొడక్ట్ డెవలప్మెంట్లో భారత్ వెనుకబడింది. ఏఐ విషయంలో మనం అదే బాట పట్టకూడదు. లార్జ్ లాంగ్వేజ్ మోడళ్లను డెవలప్ చేసి, తర్ఫీదు నిచ్చేందుకు అత్యుత్తమ శ్రేణి హార్డ్‌వేర్ అవసరం. ఆ కొరత మరో సవాల్. సావరిన్ ఏఐ మోడల్‌ను అభివృద్ధి చేసేందుకు ఏఐ మిషన్ జీపీయు క్లస్టర్ ఏర్పాటుపై అహరహం శ్రమిస్తోంది.కానీ, హార్డ్‌వేర్ వెల అధికంగా ఉండటం, గ్లోబల్ సప్లై చైన్‌లో జాప్యాలు గణనీయమైన ప్రతిబంధకాలుగా ఉన్నాయి. వాటిపై చైనా దాదాపు 98 బిలియన్ డాలర్లను వెచ్చిస్తోంది. అలాంటిది మనం 2029 వరకు ఐదేళ్ళ కాలంలో 1.25 బిలియన్ డాలర్లను మాత్రమే వెచ్చించాలని నిర్ణయించుకున్నాం. బలమైన, సుస్థిరమైన ఏఐ మౌలిక వసతులను సృష్టించుకోవడంపై దృష్టి పెట్టాలి. కొత్త విధులకు తగ్గట్లుగా ఇపుడున్న సిబ్బందికి కొత్త నైపుణ్యాలను నేర్పించాలి. భారత విధాన నిర్ణేతలు దానికి బదులు, ప్రైవేట్ క్లౌడ్ల రూపంలో క్యాప్టివ్ జీపీయు మౌలిక వసతులను ప్రోత్సహిస్తున్నారు. ఆ ప్రైవేటు క్లౌడ్లు మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్ వంటి గ్లోబల్ దిగ్గజాల చేతుల్లో ఉన్నాయి. ఇది మరో రకమైన ఔట్ సోర్సింగ్ కిందకు వస్తుంది. ఇది మరింత హానికరమైనది. భారీ డేటా సంస్థలు విద్యుత్తును, నీటిని పెద్ద మొత్తాలలో మింగేస్తాయి. పర్యావర ణాన్ని కూడా పణంగా పెట్టి ట్యాక్స్ హాలిడేల రూపంలో వాటిని ప్రోత్సహించడం ఎంతవరకు సబబో ఆలోచించాలి. పరిశోధన, నవీకరణను ప్రోత్సహించడంపై ప్రభుత్వానికి నిజంగా ఆసక్తి ఉంటే, అది ప్రాథమికాంశాలను విస్మరించ కూడదు. మౌలిక, అనువర్తిత ఆర్–డి రెండింటికీ మద్దతు ఇవ్వాలి. విద్యా, నాణ్యతా పరామితులను అమలుపరచాలి. మన విధాన నిర్ణేతలు, మంత్రులు డంబాలకు స్వస్తి చెప్పాలి. ఏఐవంటి నూతన రంగాలు సామాజికంగా కూడా తీవ్ర పర్యవసా నాలకు దారితీసేవిగా ఉన్నాయి కనుక కూలంకషమైన చర్చ అవసరం. పరిశోధన, నవీకరణపై గొప్పలు చెప్పుకోవడం ఆపా లని గాల్గోటియాస్ ఉదంతం గుర్తు చేస్తోంది. -వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత-దినేశ్ సి. శర్మసదస్సుతో ఏం సాధించామంటే...20 దేశాల అధినేతలు, 59 మంది మంత్రులు, అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు, దాదాపు 2.5 లక్షల మంది అతిథులతో ఢిల్లీలో ఐదు రోజులపాటు నిర్వహించిన ఏఐ సదస్సు కీలకమైనముందడుగుగా చెప్పాలి. ఫ్యాక్టరీలు, హెల్త్ కేర్ రంగంలో ఉన్న రోబోలు, వ్యాపార రంగంలో ఉన్న డ్రోన్లు, ప్రజలకు ఉపయోగించుకోవటానికి వీలుగా ఉండే వేరబుల్ డివైసెస్‌ను ఇక్కడ ప్రద ర్శించారు. 300కు పైగా ఎంపిక చేసిన పెవిలియన్లు, 600 స్టార్టప్‌లు ఇందులో భాగస్వామ్యం వహించాయి.బెంగళూరు ఆధారిత స్టార్టప్ ‘సర్వం’ ఏఐ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. విదేశీ టెక్ కంపెనీలకు సవాలు విసిరేలా తన ప్రత్యే కతను చాటుకుంది. విప్రో సంస్థ ఏఐ ఆధారిత మెడికల్ రోబోను ప్రదర్శించింది. క్వాల్కం ఓపెన్ ఏఐ రోబో పారిశ్రామిక రక్షణ సామర్థ్యాన్ని చాటింది.ఏఐ ఎకో సిస్టంలో చిప్పులు, డేటా సెంటర్లు, సర్వర్లు, ఎనర్జీ మోడళ్ళు, అప్లికే షన్లు అత్యంత ప్రధానమైనవి. ఈ రంగంలో స్వయం సమృద్ధిని సాధించాలంటే మనం వాటిని సొంతంగా నిర్వహించు కునే శక్తిని సంపాదించుకోవలసి ఉంటుంది. ఇందుకు చాలా దూరం ప్రయాణించాలి. ఇప్పుడు అమెరికా నేతృత్వంలోని పార్క్ సిలికా టెక్ కూటమిలో భారత్ చేరింది. దీనివల్ల సెమీ కండక్టర్లు, ఏఐ టెక్నాలజీ, కీలక ఖనిజాల సప్లై చైన్లు, భారత్‌కు రక్షణ ప్రాధా న్యం లభిస్తాయి.వివిధ దేశాలతో జట్టు కట్టి...ఆఫ్రికాలో ఏఐ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయ డానికి భారత్, ఇటలీ, కెన్యా మధ్య త్రైపాక్షిక కూటమి ఏర్పడింది. ఐరోపా, ఇండో– పసిఫిక్ దేశాల మధ్య భారత్‌ను ఒక సాంకేతిక వారధిగా నిలపటం ఇటలీ లక్ష్యం. అలాగే ఏఐ భద్రత, ఆన్లైన్ సేఫ్టీ అంశాల పైన భారత్, బ్రిటన్ దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరగనున్న సైన్స్ అండ్ ఇన్నొవేషన్ కౌన్సిల్ సమావేశం ద్వారా ఈ సహకారం మరింత బలపడుతుంది. పాలన, రక్షణ రంగాల్లో ఏఐ వినియోగంపై భారత్‌తో కలిసి ఫ్రాన్స్ పనిచేస్తోంది. ఈ ఏడాది సదస్సులో ఫ్రాన్స్ క్రియాశీలక పాత్ర పోషించింది. ప్రభుత్వ సేవలో ఏఐ వినియోగం, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విస్తరణపై భారత్‌తో బ్రెజిల్ తన అనుభవాలను పంచుకుంది. ఇలా వివిధ దేశాలు భారత్‌తో తమ సంబంధాలను మెరుగు పరచుకోవ డానికి ముందుకు రావడం శుభ పరిణామం. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ ఏఐ మౌలిక సదుపాయాలు, క్లౌడ్ కంప్యూటింగ్,స్కిల్లింగ్ కోసం ఇండియాలో 17.5 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి ప్రకటించింది. ఇది ఆసియాలోనే ఆ సంస్థకు అతి పెద్ద పెట్టుబడి. ఏఐ రంగంలో స్వయంసమృద్ధిని సాధించే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ‘భారత్ జెన్’ పేరుతో మల్టీ మోడల్ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టును ప్రారంభించింది. భార తీయ భాషలు, సంస్కృతికి అనుగుణంగా కృత్రిమ మేధను అభివృద్ధి చేయటం ప్రధాన ఉద్దేశం. దేశంలోని 22 అధికార భాషల్లో ఏఐ మోడల్స్ రూపొందించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నారు. భారత్... గ్లోబల్ సౌత్‌లో మొట్టమొదటి సారిగా, అంతర్జా తీయంగా 4వ సదస్సు నిర్వహణ ద్వారా కొంత ప్రగతిని సాధించింది. రాబోయే రోజుల్లో మరిన్ని మైలురాళ్లు సాధిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు.– డా‘‘ పార్థసారథి చిరువోలు ‘ సీనియర్ జర్నలిస్ట్ -
ట్రంప్ vs ఒబామా: AI చెప్పిన జాతకం.. అమెరికాకి పట్టిన గ్రహణం!
హాయ్ ఫ్రెండ్స్... లోకంలో వింతలు విశేషాలు అయిపోయాయి, ఇప్పుడు విడ్డూరాలు మొదలయ్యాయి. అసలే అమెరికా ఎన్నికలు అంటేనే ఒక పెద్ద జాతర. అక్కడ ఎవరు గెలిచినా మనకేంటి అనుకుంటాం కానీ, అక్కడ తుమ్మితే ఇక్కడ మన స్టాక్ మార్కెట్ ముక్కు తుడుచుకోవాలి. అయితే తాజాగా మన 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI) గారికి ఒక వెర్రి ఆలోచన వచ్చింది. "ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ బరాక్ ఒబామా తలపడితే ఎవరు గెలుస్తారు?" అని ఎవరో అడిగితే, మన AI గారు కూర్చుని లెక్కలు కట్టేసి ఒక రిజల్ట్ ఇచ్చేసారు. అంటే.. ప్రస్తుతం ఉన్న బైడెన్ గారిని సైడ్ చేసేసి, రిటైర్ అయిపోయిన ఒబామా గారిని మళ్ళీ గోదాలోకి లాగారన్నమాట. ఇది ఎలా ఉందంటే.. రిటైర్ అయిపోయిన సచిన్ టెండూల్కర్ ని పిలిచి, ఇప్పుడున్న బుమ్రా బౌలింగ్‌లో సిక్సర్లు కొట్టమన్నట్టు ఉంది!సరే AI విశ్లేషణ ప్రకారం.. ట్రంప్ గారి బలం ఆయన 'బేస్'. అంటే ఆయన ఏం మాట్లాడినా, అది అబద్ధమా, నిజమా అని చూడకుండా జేజేలు కొట్టే ఒక బ్యాచ్. ట్రంప్ మామ స్టైలే వేరు.. "అమెరికా ఫస్ట్" అంటారు, కానీ ఆయన కోపం వస్తే "ట్విట్టర్ ఫస్ట్" అంటారు .ఇక ఒబామా గారి విషయానికి వస్తే.. ఆయన స్పీచ్ ఇస్తుంటే అమెరికా కాదు కదా, పక్కన ఉన్న కెనడా వాళ్ళు కూడా మైమరచిపోతారు. ఆయనకి 'యూత్' లో క్రేజ్ ఎక్కువని AI చెబుతోంది. కానీ పాపం AI కి ఒక విషయం తెలియదు.. ఒబామా గారు ఇప్పుడు పెన్షన్ తీసుకుంటూ, నెట్‌ఫ్లిక్స్‌లో డాక్యుమెంటరీలు తీసుకుంటూ చిల్ అవుతున్నారు. ఆయన్ని మళ్ళీ వైట్ హౌస్ పిలిచి.. ఆ ఫైళ్లు, ఆ గొడవలు చూడమంటే ఆయన ఒప్పుకుంటారా? ఇంకా AI ఏం చెబుతుందంటే, "ఎకానమీ" విషయంలో ట్రంప్ వైపు మొగ్గు ఉందట. అంటే వ్యాపారవేత్త కదా, పైసల లెక్కలు బాగా తెలుసని AI ఫీలింగ్. కానీ అదే AI "సోషల్ హార్మనీ" (సామాజిక సామరస్యం) విషయంలో ఒబామాకి ఓటు వేసింది. అంటే దాని అర్థం ఏంటి? డబ్బులు కావాలంటే ట్రంప్ ని నమ్ముకోండి, ప్రశాంతత కావాలంటే ఒబామాని నమ్ముకోండి అని! కానీ అమెరికా జనాలకి రెండు కావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాలు "మాకు ఆ ఇద్దరూ వద్దు.. మాకు కనీసం సరిగ్గా నడవగలిగే, పేర్లు గుర్తుపెట్టుకునే అభ్యర్థి ఉంటే చాలు" అని మొత్తుకుంటున్నారు.ఒకవేళ నిజంగానే వీళ్ళిద్దరూ పోటీ పడితే సోషల్ మీడియా ఎలా ఉంటుందో ఊహించండి! ట్రంప్ గారు ఒబామాని "స్లీపీ బరాక్" అనో లేక ఇంకేదో వింత పేరు పెట్టి పిలుస్తారు. ఒబామా గారు తనదైన శైలిలో ఒక పెద్ద ఇంగ్లీష్ డిక్షనరీ తిరగేసి కౌంటర్లు ఇస్తారు.మధ్యలో ఎలాన్ మస్క్ వచ్చి.. "నేను ఎవరికీ ఓటు వేయను, నేను అంగారక గ్రహానికి వెళ్ళిపోతున్నా" అని ట్వీట్ చేస్తారు. AI కి ఉన్న ఒకే ఒక సౌలభ్యం ఏంటంటే.. అది మనుషుల ఎమోషన్స్ ని లెక్కించదు. కేవలం డేటా చూస్తుంది. కానీ అమెరికా ఎన్నికల్లో డేటా కంటే 'డ్రామా' ఎక్కువ పని చేస్తుంది. ఆ విషయం పాపం ఆ AI కి ఎవరు చెప్తారు?ఈ కథనంలో అందరూ మర్చిపోయిన ఒక వ్యక్తి ఉన్నారు.. ఆయనే జో బైడెన్! పాపం, ఆయన మాజీ ప్రెసిడెంట్. కానీ AI మాత్రం ఆయన పేరు కూడా ఎత్తకుండా ఒబామాని తెచ్చి కూర్చోబెట్టింది. ఇది ఎలా ఉందంటే.. ఇంట్లో పెళ్లి కొడుకు రెడీగా ఉంటే, పాత పెళ్లి కొడుకు ఫోటో చూసి "ఈయనైతే బాగుండు" అని మురిసిపోయినట్టు ఉంది.AI ప్రిడిక్షన్ ప్రకారం.. ఈ ఊహాజనిత పోరులో ఒబామాకి కొంచెం ఎడ్జ్ ఉందట. ఎందుకంటే ఆయనకి నెగటివ్ రేటింగ్ తక్కువంట. ట్రంప్ గారికి అభిమానులు ఎంత మంది ఉన్నారో, "ఈయన వద్దు బాబోయ్" అనే వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు. సో, ఫైనల్ గా తేలిందేంటంటే.. AI దృష్టిలో పాత కాలపు యుద్ధాలే బాగున్నాయి. ఉన్న వాళ్ళతో ఎలాగో వేగలేకపోతున్నాం, పోనీ లేని వాళ్ళని తెచ్చుకుందాం అనే రేంజ్ కి అమెరికా పాలిటిక్స్ వెళ్ళిపోయాయి. అసలు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేది పక్కన పెడితే.. ఈ AI చేసే విశ్లేషణలు మాత్రం మనకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాయి. మరి మీరేమంటారు? ట్రంప్ కావాలా? ఒబామా కావాలా? లేక మన ఊరి సర్పంచ్ నయమా? కామెంట్ చేయండి! -
ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కొత్త వార్నింగ్!
యువత వారానికి 70 గంటలు పని చేయాలన్న వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచిన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్.నారాయణ మూర్తి (N.R. Narayana Murthy) మరోసారి దేశ యువతకు కీలక సందేశం ఇచ్చారు. ఈసారి ఆయన దృష్టి కృత్రిమ మేధస్సు (AI)పై ఉంది. వైట్-కాలర్ ఉద్యోగాలను ఏఐ, యంత్రాలు భర్తీ చేస్తాయనే భయాలు పెరుగుతున్న వేళ, యువత ఆందోళన చెందకుండా సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.“ఏఐ శత్రువు కాదు… అవకాశాల ద్వారం”జనరేటివ్ ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ భద్రతపై చర్చలు ముదురుతున్నాయి. అయితే ఈ భయాలను తప్పుబట్టిన మూర్తి, ఏఐ ఆటోమేటిక్‌గా అందరికీ సమాన అవకాశాలు కల్పించదని స్పష్టం చేశారు.“జనరేటివ్ ఏఐని ఉత్పాదకత కోసం నేను స్వయంగా ఉపయోగించిన అనుభవం చెబుతోంది. దీన్ని తెలివిగా వినియోగించినవారికి మెరుగైన నాణ్యత, అధిక ఉత్పాదకత లభిస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.యువత ఏఐని ప్రమాదంగా కాకుండా, సమర్థంగా వినియోగించాల్సిన సాధనంగా చూడాలని ఆయన పిలుపునిచ్చారు. క్రమశిక్షణ, కృషి, నిరంతర అభ్యాసంతో ఏఐ నైపుణ్యాలను మిళితం చేస్తే భవిష్యత్తులో విజయం సాధ్యమని మూర్తి అన్నారు.ఉద్యోగాలపై ఏఐ ప్రభావం… తీవ్రమౌతున్న చర్చఇటీవల అమెరికాకు చెందిన ఆంథ్రోపిక్ (Anthropic) సంస్థ పలు అధునాతన ఏఐ సాధనాలను విడుదల చేయడంతో ఏఐ ఆధారిత ఉద్యోగ నష్టాలపై చర్చ మళ్లీ జోరందుకుంది. ముఖ్యంగా ఈ కంపెనీ అభివృద్ధి చేసిన క్లాడ్ (Claude) ప్లాట్‌ఫామ్ ఆఫీస్ పనులను స్వయంచాలకంగా నిర్వహించే సామర్థ్యంతో ముందుకు వచ్చింది.లీగల్ సర్వీసులు, ఫైనాన్స్, మానవ వనరులు, ఇంజినీరింగ్, ఆపరేషన్స్ వంటి రంగాల్లో పత్రాల విశ్లేషణ, డేటా ప్రాసెసింగ్, వర్క్‌ఫ్లో మేనేజ్మెంట్ వంటి పనులను ఈ సాధనాలు సులభతరం చేస్తున్నాయి. సాధారణంగా పెద్ద మొత్తంలో సిబ్బంది అవసరమయ్యే క్లిష్ట ప్రక్రియలను కూడా ఇవి సమర్థంగా నిర్వహించగలవని నిపుణులు చెబుతున్నారు.“భయపడకండి… సిద్ధం అవ్వండి”ఏఐ వల్ల ఉద్యోగాలు మార్పు చెందవచ్చు కానీ పూర్తిగా అంతరించిపోవని మూర్తి అభిప్రాయపడ్డారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అర్థం చేసుకుని, దానిపై ప్రావీణ్యం సాధించినవారికే భవిష్యత్తు అనుకూలంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సారాంశంగా “ఏఐపై పట్టు సాధించండి.. లేదంటే అవకాశాలు కోల్పోతారు” అంటూ యువతకు నారాయణ మూర్తి హితవు పలికారు. -
‘అది ఇన్వెస్టర్ల ఓవర్ రియాక్షన్’
ముంబై: కృత్రిమ మేథ (ఏఐ) భయాలతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టాక్స్‌లో అమ్మకాలు వెల్లువెత్తడమనేది ఇన్వెస్టర్ల ’ఓవర్‌రియాక్షన్’ అని డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ సీఎండీ సంజీవ్ పురి వ్యాఖ్యానించారు. తమ సంస్థ విషయానికొస్తే ఉత్పాదకత, సామర్థ్యాలను పెంచుకునేందుకు ఏఐని వినియోగించుకుంటున్నట్లు చెప్పారు.గతంలో ఉన్న సాధనాలతో తయారీ, సరఫరా వ్యవస్థ మొదలైన విభాగాల్లో పరిష్కరించలేకపోయిన సమస్యలను కూడా ప్రస్తుత సాంకేతికతతో పరిష్కరించగలుగుతున్నామని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయోత్పత్తుల విభాగానికి సంబంధించి పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావాలను మదింపు చేసేందుకు గత కొన్నేళ్లుగా వాతావరణ మార్పులను టెక్నాలజీతో అధ్యయనం చేస్తున్నట్లు పురి చెప్పారు.వ్యాపార ప్రణాళికల విషయానికొస్తే మధ్యకాలికంగా రూ. 20,000 కోట్ల పెట్టుబడి ప్రణాళికలు ఉన్నట్లు తెలిపారు. గతంలోలాగానే ఇతర సంస్థల కొనుగోలు అవకాశాలను కూడా పరిశీలిస్తుందని వివరించారు. -
ఏఐ మార్కెటింగ్ గిమ్మిక్స్‌తో జాగ్రత్త!
ఏఐ వినియోగించడం ద్వారా అనూహ్య లాభాలు పేరిట తెరతీసే మార్కెటింగ్ గిమ్మిక్స్‌పట్ల జాగ్రత్త వహించవలసిందిగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ హోల్‌టైమ్ డైరెక్టర్ అమర్జీత్ సింగ్ తాజాగా పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు స్టాక్ మార్కెట్లపట్ల ప్రజలలో విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని వ్యాఖ్యానించారు. ఏఐ వినియోగం ద్వారా అత్యుత్తమ రిటర్నులు ఆర్జించవచ్చంటూ మార్కెట్ పార్టిసిపెంట్లు కొంతమంది అతిచేయడాన్ని ఈ సందర్భంగా సింగ్ ప్రస్తావించారు. స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ, ఐఐఎంకే సంయుక్తంగా నిర్వహించిన ఈవెంట్లో సింగ్ పలు విషయాలను పేర్కొన్నారు.ఏఐ వినియోగించడం ద్వారా సాధించిన అంశాలను కంపెనీలు అర్ధవంత విధానంలో తెలియజేయవలసి ఉంటుందని సూచించారు. అతిగా ఆర్జించినట్లు లేదా కొన్ని రకాల క్లెయిముల ప్రకటనలు ఇన్వెస్టర్లను మార్కెట్లపట్ల తప్పుదోవపట్టించడంతోపాటు.. విశ్వాసాన్ని దెబ్బతీసే అవకాశమున్నట్లు హెచ్చరించారు. నిజానికి విద్య, పరిశోధన, సమాచారం తదితరాలకు ఏఐ శక్తివంతమైన టూల్ అని పేర్కొన్నారు. అయితే ఏఐతో తప్పుడు సమాచార వ్యాప్తికీ వీలున్నదని, వీటిపట్ల అప్రమత్తత అవసరమని తెలియజేశారు. -
ఐటీ ఉద్యోగులకు బిగ్ షాక్.. కోడింగ్ రాసేది, ఎగ్జిక్యూట్ చేసేది అంతా AI
-
ఏఐ యుగం.. సముద్రంలో కేబుళ్లు కాపాడుకోవడమే కీలకం
న్యూఢిల్లీ: ఏఐ యుగంలో డిజిటల్ లక్ష్యాల సాధనకు సముద్ర అంతర్భాగంలో (సబ్ సీ) వేసే కేబుల్ నెట్వర్క్ కీలకమైందని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చైర్మన్ అనిల్ కుమార్ లాహోటి తెలిపారు. అయితే, ప్రకృతి విపత్తులు, భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు, డేటాకి డిమాండ్ మొదలైన వాటి వల్ల తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న సబ్‌మెరైన్ కేబుల్ వ్యవస్థల భద్రతకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు.ఇందుకు సంబంధించిన సవాళ్లను పరిష్కరించేందుకు సాంకేతిక ఆవిష్కరణలు, నిర్వహణపరమైన సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడం, విధానాలపరమైన చర్యల్లాంటి బహుముఖ వ్యూహం అవసరమని పేర్కొన్నారు. కేబుల్స్ వేసే మార్గాల ప్లానింగ్, రిస్కులు తక్కువగా ఉండే ప్రాంతాలను ఎంచుకోవడం, రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్‌లను వినియోగించడంలాంటి అంశాలతో నష్టాలను నివారించవచ్చని బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరం నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా లాహోటి చెప్పారు.సబ్మెరీన్ కేబుల్ వ్యవస్థ భద్రతను బలోపేతం చేసేందుకు అంతర్జాతీయ సహకారం, పటిష్టమైన నియంత్రణ విధానాలు అవసరమన్నారు. సబ్ సీ కేబుల్, డిజిటల్ క్లౌడ్ మౌలిక సదుపాయాలు డిజిటల్ ప్రపంచానికి, ఏఐ యుగానికి కీలకమైన ఇన్‌ఫ్రాగా మారాయని చెప్పారు. ఈ నేపథ్యంలో క్లౌడ్ మౌలిక సదుపాయాలకు సంబంధించి పటిష్టమైన సైబర్ సెక్యూరిటీ చర్యలు, నిరంతరం పొంచి ఉన్న ముప్పులను పర్యవేక్షించడం కీలకమని ఆయన పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో డేటా వినియోగం.. దేశీయంగా డిజిటల్ వినియోగం చాలా వేగంగా వృద్ధి చెందుతోందని, గత దశాబ్దకాలంలో బ్రాడ్‌బ్యాండ్ యూజర్ల సంఖ్య ఆరు రెట్లు ఎగిసిందని లాహోటి చెప్పారు. 2025 నవంబర్ నాటికి ఇది 100 కోట్ల మైలురాయిని అధిగమించిందని వివరించారు. కనెక్టివిటీ వల్ల డేటా వినియోగం రికార్డు స్థాయిలో పెరిగిందని, ప్రపంచంలోనే అత్యధికంగా మొబైల్ యూజర్లు నెలకు సగటున 27 జీబీ మేర వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ‘డేటా వినియోగం, డిజిటలీకరణ, ఏఐ వృద్ధి మొదలైన వాటి వల్ల గ్లోబల్ డేటా సెంటర్ల మౌలిక సదుపాయాలకు, సబ్‌మెరైన్ కేబుల్ వ్యవస్థలకు డిమాండ్ పెరుగుతోంది’ అని లాహోటి చెప్పారు. -
ఇకపై రూ. 1000 కోట్లు అక్కర్లేదు.. రాజమౌళితో పోలుస్తూ ఆర్జీవీ షాకింగ్ ట్వీట్
రామ్‌గోపాల్ వర్మ.. సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ . తాజాగా ఆయన 'సీడెన్స్ 2.0'( Seedance 2.0) అనే ఏఐ(AI) టూల్ గురించి చేసిన ట్వీట్ ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సినిమా రంగాన్ని ఏఐ ఏ విధంగా 'ఖూనీ' చేయబోతోందో, అదే సమయంలో సామాన్యుడికి ఏ విధంగా ముక్తి ప్రసాదించబోతోందో ఆయన తనదైన శైలిలో విశ్లేషించారు.టెక్నాలజీ మారుతున్న కొద్దీ సినిమా మేకింగ్ విధానం మారుతుందని అందరికీ తెలుసు, కానీ రామ్ గోపాల్ వర్మ మాత్రం ఏకంగా సినిమా ఇండస్ట్రీ మరణం గురించి జోస్యం చెప్పారు. 'సీడెన్స్ 2.0' వంటి అడ్వాన్స్డ్ ఏఐ టూల్స్ రాకతో, కోట్లాది రూపాయల బడ్జెట్లు, వేలమంది టెక్నీషియన్లతో కూడిన ప్రస్తుత సినిమా ఎకోసిస్టమ్ 'బ్రూటల్ మర్డర్' కాబోతోందని ఆయన ట్వీట్ చేశాడు.అత్యంత ఖరీదైన సినిమాలు తీసి, అత్యంత విజయవంతమై సినిమాలు తీయడం వల్ల రాజమౌళి నెంబర్ వన్ డైరెక్టర్ అయ్యాడు. రూ. 1000 కోట్లు కాదు అంతకంటే ఎక్కువ రాబట్టగలడనే ట్రాక్ రికార్డు ఆయనకు ఉంది. ఇదంతా ఆయనకు ఉన్న అసమానమైన క్రియేటివ్ ఊహాశక్తి వల్లే సాధ్యం అయింది. కానీ ఇప్పుడు 120 కోట్ల జనాభా ఉన్న దేశంలో, ఎంతమంది రాజమౌళిలు లేదా ఆయన కంటే మెరుగైనవాళ్లు చిన్న పట్టణాల్లో, గ్రామాల్లో, ఇంజనీరింగ్ కాలేజీల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండొచ్చు? క్రియేటివ్ విజన్ ఉన్నవాళ్లు, కానీ ఫిల్మ్ ఇండస్ట్రీకి యాక్సెస్ లేనివాళ్లు, డబ్బులు లేనివాళ్లు... వాళ్లకు అవకాశం తలుపు మూసేసి, కీలు కొందరి దగ్గరే ఉంది. కానీ సీడెన్స్ 2.O ఆ తలుపులను తన్ని పారేసింది. ఇక టాలెంట్ ఉంటే చాలు, అవకాశం కోసం ముంబై రానక్కర్లేదు. ఇది కేవలం వాళ్ల డిస్క్రిప్టివ్ ప్రాంప్ట్‌లు తీసుకొని, సినిమాటిక్‌గా, మల్టీ-షాట్లతో, సౌండ్ డిజైన్‌తో, వందల కోట్ల ఖర్చుతో, నెలలు పట్టే సీన్లను క్రియేట్ చేస్తుంది. ఇకపై నటులు, కెమెరామెన్లు, ఎడిటర్లు, ఫైట్ మాస్టర్లు, లైట్ బాయ్స్.. ఇలా భారీ సైన్యం అవసరం లేకుండానే థియేట్రికల్ క్వాలిటీ సినిమాలు వస్తాయి.స్టార్ ఇష్యూస్ లేవు . బడ్జెట్ గురించి ప్రొడ్యూసర్లు భయపడాల్సిన అవసరం లేదు ."పోస్ట్‌లో ఫిక్స్ చేద్దాం" అనే పని లేదు. ఒక షాట్ కోసం 300 మంది వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఒకరు. ఒక ప్రాంప్ట్. ఒక మైండ్. అడ్వాన్స్డ్ AIలు ఫుల్ లెంగ్త్ థియేట్రికల్ క్వాలిటీ సినిమాలు తయారు చేయగలిగినప్పుడు... యూనియన్లు, కోట్ల ఓవర్‌హెడ్స్, "మాకే సినిమాలు తీయడం తెలుసు" అనే అహంకారం ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీ మరణిస్తుంది. నెమ్మదిగా కాదు. శాంతియుతంగా కాదు. బ్రూటల్‌గా మర్డర్ అవుతుంది. కానీ దాని హార్ట్‌లో... ఇది సినిమాకు నిజమైన లిబరేషన్. డైనోసార్లు 100 ఏళ్లు రాజ్యం చేశాయి. ఇప్పుడు ఆస్టరాయిడ్ వచ్చేసింది. దాని పేరు AI. కొత్త ఎరాకు స్వాగతం. ఇక్కడ టాలెంట్ మాత్రమే ముఖ్యం, యాక్సెస్ కాదు. అదే చంపేస్తుంది. అదే రక్షిస్తుంది. ఇక వెనక్కి తిరిగి రానిది. కాబట్టి ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ మరణమా? లేక ఫిల్మ్ ఇండస్ట్రీ యొక్క అల్టిమేట్ డెమోక్రటైజేషనా?’ అని ఆర్జీవీ ప్రశ్నించారు. SEEDANCE 2.0 , the MURDERER of FILM INDUSTRY Leaving aside its copyright infringements etc which is another matter , here’s my take on Seedance 2.0 @ssrajsmouli is the no. 1 director because he makes the most expensive films and the most successful ..People fund him a 1000…— Ram Gopal Varma (@RGVzoomin) February 25, 2026 -
ఏఐతో ముప్పేమీ లేదు
కృత్రిమ మేథ (ఏఐ)తో టెక్ పరిశ్రమ ఉద్యోగాల్లో భారీగా కోత పడుతుందన్న ఆందోళనలను మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్ తోసిపుచ్చారు. దీనివల్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ఐటీ ప్రొఫెషనల్స్‌కి ముప్పేమీ లేదని, ఇది వారి స్థానాన్ని భర్తీ చేయదని చెప్పారు. వారు తమ నైపుణ్యాలను, సృజనాత్మకతను మెరుగుపర్చుకునేందుకు ఏఐ సహాయకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు మరింత స్మార్ట్‌గా పని చేసుకునేందుకు తోడ్పడే టెక్నాలజీని రూపొందించడం మైక్రోసాఫ్ట్ లక్ష్యమని ఆయన చెప్పారు.పదే పదే పునరావృతమయ్యే కోడింగ్ పనులను మాత్రమే ఏఐ టేకోవర్ చేయొచ్చని, దీనితో ప్రోడక్ట్ డిజైన్, ఆర్కిటెక్చర్, టెస్టింగ్, భద్రత మొదలైన వాటిపై ఫోకస్ చేసేందుకు డెవలపర్లకు వీలు చిక్కుతుందని స్మిత్ తెలిపారు. ఉద్యోగాలను తగ్గించడం కాకుండా వాటిని మరింత ఆసక్తికరంగా మార్చేందుకు ఏఐ సహాయపడుతుందని చెప్పారు. దీనితో నిపుణులకు డిమాండ్ పెరుగుతుందని, వేతనాలు కూడా పెరుగుతాయని స్మిత్ వివరించారు.ప్రజల సామర్థ్యాలు మెరుగుపర్చేందుకు ఉపయోగపడే టెక్నాలజీని, మెషిన్లను తయారు చేయడమే మైక్రోసాఫ్ట్ ప్రాథమిక లక్ష్యమని ఆయన చెప్పారు. సాంకేతికత అనేది ఉత్పాదకత, ఆర్థిక వృద్ధికి చోదకంగా ఉంటూనే అత్యంత నాణ్యమైన ఉద్యోగాల కల్పనకు దోహదపడే విధంగా ఉండాలని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ప్రైవేటు రంగానికి నిధుల లభ్యత -
ముత్యాలూ సజ్జలూ
అమ్మ పాలేరుకు అన్నం పెడుతుంది. కూర పెడుతుంది. అంత పచ్చడి కూడా! తిన్నంత తింటే విసుక్కోకుండా పెడుతుంది. కాని మజ్జిగ మాత్రం పోయదు. అప్పుడే హైస్కూ లుకు వచ్చిన కొడుకు ‘ఎందుకమ్మా మజ్జిగ పోయవు’ అంటే జవాబు చెప్పదు. పాలేరు ఇంట్లోకి రాకూడదు. బయటే కూచోవాలి. తినాలి. వెళ్లిపోవాలి – మజ్జిగ ముఖం చూడకుండా! ఇంట్లో కుండ నిండా మజ్జిగే! అమ్మ ఇరుగూ పొరుగుకు ఇస్తుంది. ఎండనబడి వచ్చిన వాళ్లకు ఇస్తుంది. పాలేరుకు తప్ప. అప్పటికి పాలేరు కులం ఏమిటో మూలం ఏమిటో కొడుకుకు తెలియదు. ‘ఎందుకమ్మా మజ్జిగ పోయవు?’... ‘పోయకూడదు నాయనా... పోస్తే వెన్నలో పురుగులు పడతాయి’. పాలేరుకు మజ్జిగ పోస్తే వెన్నలో పురుగులు పడతాయా? చూద్దాం అని అమ్మ లేనప్పుడు పాలేరు బెదిరిపోతున్నా కొడుకు అతని కంచెంలో మజ్జిగ వొంపేశాడు. మరికొన్ని రోజులకు అమ్మ వెన్న కాచి నెయ్యి చేస్తోంది. కొడుకు తొంగి తొంగి చూస్తున్నాడు. ’ఏమిట్రా?’... ‘పురుగులేమైనా పట్టా యేమోనని’... పకపకా నవ్వాడు.ఒక పిల్లాడిది అడవి దాపు పల్లె. స్కూలుకు చాలా దూరం నుంచి నడుచుకుంటూ వస్తాడు. రెండు చేతులు, రెండు కాళ్లు... పుస్తకాలున్నాయా... లేవు... నోట్‌బుక్కులు... అయ్యబాబోయ్. అయ్యవారు దయదలిచి పాతవేవో సంపాదించి ఇస్తారు. నోట్ బుక్కులు మాత్రం కొనుక్కోవాల్సిందే! పిల్లాడి దగ్గర అడవి ఉంది తప్ప డబ్బులు లేవు. ప్రతి సంవత్సరం బడి తెరిచాక నోటు బుక్కుల కోసం ఆ పిల్లాడు ఒకటే పని చేస్తాడు. రోజూ అడవికి వెళ్లి రేగుపండ్లు కోసి సంచీ నిండా వేసుకొని వస్తాడు. స్కూల్లో ఆ రేగు పండ్లకు మారుబేరం పెడతాడు. గుప్పెడు రేగుపండ్లు ఇస్తే పిల్లలు తమ నోటు బుక్కులో సెంటర్ పిన్ను దగ్గర ఒక టావు తీసి ఇవ్వాలి. రేగుపండ్లు ఖాళీ అయ్యే కొద్దీ టావులు పోగవుతాయి. ఇంకేమిటి? రేగుపండ్ల నోట్‌బుక్ తయార్!కానుకలు అందరూ ఇస్తారు. పుచ్చుకుంటారు. కాని కొన్ని కానుకలు జీవితాంతం వెంటాడుతాయి. ఆ టీచరు పాఠాలు చెప్తుంటే ఒక ముసలామె మనవణ్ణి చేత్తో పట్టుకుని వచ్చి బడిలో వదిలింది. ‘ఈ ముసలి ప్రాణం తప్ప వీడికి ఎవరూ లేరు టీచరమ్మా! నాలుగు అక్షరాలు నేర్పించు’... ఆ టీచరు పిల్లాడిని దగ్గరగా పొదువుకుంది. తల నిమిరింది. పాఠాలు ఏం చెప్పిందో కాని తన బాక్స్‌లోని నాలుగు మెతుకులు పెట్టింది. ఆకు కూరలమ్మే ముసలామె తన మనవడికి టీచరమ్మ దొరికినందుకు ఎంతో సంతోషపడింది. మనవడు మాత్రం సిగ్గుతో ఎక్కువ మాట్లాడేవాడు కాదు. అప్పుడు ‘టీచర్స్ డే’ వచ్చింది. స్కూల్లో అందరూ టీచరమ్మకు గ్రీటింగ్ కార్డులు, ఆపిల్స్, గులాబీ పూలు ఇస్తున్నారు. అందరూ వెళ్లిపోయాక ఆ పిల్లాడు ఒక్కడే మిగిలాడు. ఏదో కానుక తెచ్చినట్టే ఉన్నాడు. ‘ఏంట్రా అది?.. ఇవ్వు’... చాలా బిడియపడుతూ వీపు వెనుక ఉన్న చేతిని ముందుకు సాచాడు. ఆకుకూర! వాడి చిట్టిచేతిలో జీవస్పందన వంటి పచ్చటి ఆకుకూర గుచ్ఛం!జీవితాల్లో గాలికిపోయే ఊకలాంటి ఘటనలు ఎన్నో జరుగుతాయి. కొన్ని ఇలా స్వాతిచినుకుల్లా రాలి, కుదురును కదిలించి, ముత్యాలుగా మారతాయి. వాటిని సాహిత్యంగా చేసినప్పుడు మిలమిలమని మెరుస్తూ వేల చేతులు మారి అదే అనుభూతితో తాకుతాయి. ‘నేను రాసింది ఏ.ఐ.కి ఫీడ్ చేస్తాను. అది వెంటనే అర్థం చేసుకొని విడమ ర్చిందంటే రాసింది సాహిత్యం కాదని చించేస్తాను’ అన్నాడు రచయిత గురుచరణ్‌దాస్. సరళరేఖలు, తెలిసిన గీతలు టక్కున తెలిసిపోతాయి. ఏ.ఐ.కి చిటికెలో పని. కాని సాహిత్యం సరళం కాదు... ఉపరితలమూ కాదు. అది స్పందనల పరావర్తనలు పడే పెరడు. భావోద్వేగాలు నర్తించే ఎరీనా. తుది ఘట్టాన సాక్షాత్కారాలను ఒసగే యుద్ధ క్షేత్రం. సాహిత్యం మనిషికొక అర్థం... మనసుకొక తాత్పర్యం. అంతేతప్ప ఏ.ఐ. చెప్పే మూసకట్టు చిలకజోస్యం కాదు.రాసినదంతా ఏ.ఐ. దగ్గర ఉంది! రాయవలసినదంతా మనిషి వద్ద ఉంది!! మనిషి రాయకపోతే ఏం చేసినాగాని ఏ.ఐ. పైన చెప్పిన మూడు ఘటనలను సృష్టించలేదు. అవి మనిషికే తెలుసు. మనిషి చెయ్యే వాటిని రాయాలి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ.ఐ. మీద చర్చ జరుగుతోంది. రచన, ప్రచురణల్లో ఏ.ఐ. పాత్ర ఏమిటనేది శోధనగా ఉంది. ఏ సాంకేతికతైనా సృజనకు సాయం మాత్రమే! అదే సృజన కాబోదు. రచయితలు జీవన పేటికల మీటలు నొక్కినంత కాలం ముత్యాలకు కొదవలేదు. సజ్జలతో సరిపెడదామను కుంటే ఏ.ఐ. ఉంది పదండి!! -
నాన్న అదే రాత్రి పోర్టుకు పంపారు.. నాకు ఆఫీస్ కూడా లేదు: కరణ్ ఆదానీ
దేశ రాజధానిలో ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్.. ప్లాటినం జూబ్లీ (70వ) వ్యవస్థాపక దినోత్సవం & 20వ జాతీయ మేనేజ్మెంట్ దినోత్సవ కార్యక్రమం నిర్వహించింది. ఈ సమావేశంలో అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజెడ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ కీలక వ్యాఖ్యలు చేశారు.కృత్రిమ మేధస్సు మానవులను పూర్తిగా భర్తీ చేయలేదు. కానీ సామర్థ్యాన్ని పెంచేదిగా పనిచేస్తుందని కరణ్ అదానీ పేర్కొన్నారు. ఉత్పాదకతను మెరుగుపరిచే & సంస్థలు వేగంగా అభివృద్ధి చెందడానికి సహాయపడే శక్తివంతమైన సాధనంగా AIని చూడాలని అన్నారు. అయితే.. ఒక టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో కొంతమంది ఉద్యోగం కోల్పోవడం సర్వ సాధారణమే అని కరణ్ అదానీ పేర్కొన్నారు.ఇప్పటికే కొన్ని పెద్ద సంస్థలు తమ ఉద్యోగులకు ఏఐ వంటి వాటిలో ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. ఇది ఉద్యోగ భద్రతను అందిస్తుంది. కంపెనీలు మాత్రమే కాకుండా.. ఉద్యోగులు కూడా తమకు తాము కొత్త నైపుణ్యాలను పెంచుకోవాలి. అప్పుడే పోటీ ప్రపంచంలో మనగలుగుతాము.ఈ సందర్భంగా.. తన బాల్యం గురించి మాట్లాడుతూ నేను మూడేళ్లు మిషనరీ పాఠశాలలో చదువుకున్నాను అని కరణ్ అదానీ చెప్పారు. అక్కడే నేను క్రమశిక్షణ, స్వతంత్రత & భిన్న నేపథ్యాల నుంచి వచ్చిన పిల్లలతో కలసి మెలసి ఉండటం వంటి విలువలను నేర్చుకున్నారని చెప్పారు. ఈ అనుభవాలు తన వ్యక్తిత్వ వికాసానికి ఎంతో దోహదపడ్డాయని పేర్కొన్నారు.సింగపూర్‌లోని స్నేహితులు తనకు పరిచయం చేసిన ఫార్ములా 1 పట్ల తనకున్న మక్కువ గురించి కూడా ఆయన మాట్లాడారు. ఇందులో ప్రతి మిల్లీ సెకన్ ఎంత ముఖ్యమైనదో మైఖేల్ షూమేకర్ వంటి వాళ్లను చూసి నేర్చుకున్నాను అని అన్నారు. ఫార్ములా 1 భారతదేశానికి తిరిగి వచ్చే అవకాశం గురించి మాట్లాడుతూ, ప్రపంచ క్రీడా కార్యక్రమాలను నిర్వహించడం వల్ల అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని కరణ్ అదానీ అన్నారు.ఇదీ చదవండి: 'భారీ క్రాష్ మొదలైంది'.. కియోసాకి హెచ్చరిక!కరణ్ ఆదానీ తన వృత్తి ప్రయాణం గురించి మాట్లాడుతూ.. కాలేజీలో చదువు పూర్తయిపోయిన తరువాత.. పోర్టుల వ్యాపారంపై తనకు ఆసక్తి ఉందని తన తండ్రికి చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు. అదే రాత్రి, నన్ను ముంద్రా పోర్టుకు పంపారు. నా మొదటి సంవత్సరం స్పెషల్ ఆఫీస్ & డెస్క్ లేకుండా నేలపై పని చేస్తూ గడిపాను. ఆ సమయంలోనే అనేక విభాగాలను సందర్శిస్తూ, అక్కడి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, అనుభవం ద్వారా నేర్చుకున్నాను అని వెల్లడించారు. -
వెరీ షేమ్.. కాంగ్రెస్ నేతలపై జగన్ ఫైర్
-
ఏఐ సమ్మిట్: దుమారం రేపుతున్న అర్ధనగ్న ప్రదర్శన
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని భారత్ మండపంలో జరిగిన ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇంపాక్ట్ సమ్మిట్’ వద్ద ఇండియన్ యూత్ కాంగ్రెస్ (ఐవైసీ) కార్యకర్తలు చేపట్టిన అర్ధనగ్న ప్రదర్శన ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఢిల్లీ పోలీసులు శనివారం పటియాలా హౌస్ కోర్టులో తమ వాదనలు వినిపించారు. ఈ నిరసనల వెనుక అంతర్జాతీయ స్థాయిలో దేశ పరువు తీసేందుకు భారీ కుట్ర ఉందని పోలీసులు ఆరోపించారు.శుక్రవారం ఏఐ సమ్మిట్ వద్ద యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు తమ చొక్కాలు విప్పి, ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలు ఉన్న టీ-షర్టులను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ కేసులో అరెస్ట్ అయిన నలుగురు ఐవైసీ (ఐవైసీ) నేతలను పోలీసులు శనివారం కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ నిరసన కార్యక్రమం నేపాల్‌లో గతంలో జరిగిన ఒక భారీ ఆందోళనను పోలి ఉందని, ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన కుట్ర అని పోలీసులు కోర్టుకు వివరించారు. భారత్ మండపంలో అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొన్న సమయంలో ఇటువంటి నిరసన చేపట్టడం ద్వారా దేశ ప్రతిష్టను ప్రపంచ వేదికపై మసకబార్చేందుకు ప్రయత్నించారని పోలీసులు ఆరోపించారు.ఈ నిరసనల వెనుక ఉన్న కారణాలను వెలికితీసేందుకు తమకు ఐదు రోజుల రిమాండ్ కావాలని పోలీసులు కోర్టును కోరారు. నిందితుల తరపు న్యాయవాది పోలీసుల వాదనలను తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కేసు అని ఆయన కోర్టులో వాదించారు. ‘ప్రతిపక్ష పార్టీగా నిరసన తెలిపే హక్కు నిందితులకు ఉంది. ఈ ఆందోళన శాంతియుతంగా జరిగింది. ఎక్కడా ఎటువంటి హింస జరిగినట్లు వీడియో ఆధారాలు లేవని న్యాయవాది పేర్కొన్నారు. నిందితులను పోలీసులు అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారని న్యాయవాది వాదించారు.ఇది కూడా చదవండి: కెనడా కాల్పులు: పసిగట్టిన ఏఐ.. ఆగని మారణకాండ -
ఏఐ సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ వ్యవహార శైలి.. వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: ఏఐ సమ్మిట్‌లో నిన్న(శుక్రవారం, ఫిబ్రవరి 20) యూత్ కాంగ్రెస్ వ్యవహార శైలిపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. యూత్ కాంగ్రెస్ కార్యకర్తల తీరు మనందరినీ సిగ్గుపడేలా చేసిందంటూ ట్వీట్ చేశారు. ‘‘అసలు మన రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నాయి?. ఎవరూ మన దేశాన్ని ఎప్పుడూ కించపరచకూడదు. మన మధ్య రాజకీయ విభేదాలు ఎన్ని ఉన్నా.. ప్రపంచం ముందు అందరం ఐక్యంగా ఉండాలి’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.కాగా, ఇండియా కృత్రిమ మేధ(ఏఐ) ఇంపాక్ట్ సదస్సులో ఎగ్జిబిషన్ హాల్ నంబర్–5 వద్ద యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలపడం కలకలం సృష్టించింది. శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో పదుల సంఖ్యలో కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నారు. హఠాత్తుగా టీ–షర్టులు విప్పేసి తమదైన శైలిలో నిరసన వ్యక్తం చేశారు. భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందానికి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఆయా టీ–షర్టులపై ముద్రించి ఉన్నాయి.Yesterday at the AI Summit, the Youth Congress made us all feel ashamed. Where is our politics heading! No one should ever demean our country. Whatever our political differences may be, we should always present a united face to the world.— YS Jagan Mohan Reddy (@ysjagan) February 21, 2026అంతేకాకుండా భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫొటోలు కూడా ఉన్నాయి. ‘ఎప్‌స్టీన్స్ ఫైల్స్’, ‘మోదీ రాజీపడ్డారు’అనే వాక్యాలు కూడా ముద్రించారు. నిరసన తెలియజేస్తున్న యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను సదస్సుకు హాజరైన కొందరు ప్రతినిధులు ప్రశ్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. -
ఆకతాయిల చేష్టలు.. భయాందోళనలో ప్రజలు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): గుర్తుతెలియని ఆకతాయి చేష్టలకు జిల్లా ప్రజలు శుక్రవారం భయాందోళనకు గురయ్యారు. టెక్నాలజీని వినియోగించుకొని పెట్రోల్‌బంక్‌లోకి పులి వచ్చినట్లు ఏఐ ఫొటో క్రియేట్ చేసి సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. శుక్రవారం జిల్లాలో ఇద్దరు కలిస్తే చాలు ఈ విషయాన్ని చర్చించుకోవడం కనిపించింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) ద్వారా రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం పద్మనగర్‌లోని భారత్ పెట్రోల్ బంకులోకి పులి వచ్చినట్లు ఫొటో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీన్ని చూసిన జనం భయాందోళనకు గురయ్యారు. దీనిపై ఎస్సై ఉపేంద్రచారి మాట్లాడుతూ పద్మనగర్‌కు చెందిన కొందరు యువకులు ఈ తుంటరి పనిచేసినట్లు గుర్తించామన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఏఐ గ్లోబల్ గవర్నెన్స్‌కు అమెరికా పూర్తి వ్యతిరేకం
కృత్రిమ మేధపై ప్రపంచవ్యాప్త నియంత్రణ లేదా ‘గ్లోబల్ గవర్నెన్స్’ను అమెరికా పూర్తిగా వ్యతిరేకిస్తోందని వైట్ హౌస్ టెక్నాలజీ సలహాదారు మైఖేల్ క్రాట్సియోస్ స్పష్టం చేశారు. ఇటీవల న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’లో పాల్గొన్న ఆయన ఈ సాంకేతికతపై అంతర్జాతీయ బ్యూరోక్రసీల నియంత్రణను ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అంగీకరించబోదని తేల్చి చెప్పారు.కేంద్రీకృత నియంత్రణతో ప్రమాదంప్రపంచ నాయకుల ఉమ్మడి ప్రకటనకు ముందు క్రాట్సియోస్ తన అభిప్రాయాలను పంచుకుంటూ.. ఏఐను కేంద్ర అధికారులు లేదా బ్యూరోక్రాట్లు నియంత్రిస్తే అది సాంకేతికత ఉజ్వల భవిష్యత్తుకు ఆటంకంగా మారుతుందని హెచ్చరించారు. ‘ఏఐ గ్లోబర్ గవర్నెన్స్‌లను అమెరికా పూర్తిగా తిరస్కరిస్తోంది. భద్రత, ఊహాజనిత ప్రమాదాలపైనే దృష్టి కేంద్రీకరించడం వల్ల పోటీతత్వ పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటుంది. ఇది కేవలం కొందరి చేతుల్లో అధికారాన్ని పెంచి అభివృద్ధి చెందుతున్న దేశాలను ఏఐ ఆర్థిక వ్యవస్థకు దూరం చేస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు.మరోవైపు, ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్ ఏఐ నియంత్రణ కోసం ఒక అంతర్జాతీయ సంస్థను, నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వాతావరణ మార్పులపై పని చేసే ఐపీసీసీ తరహాలోనే ఏఐ కోసం ఒక ప్రత్యేక ప్యానెల్‌ను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సలహా బృందంలో మొత్తం 40 మంది సభ్యులను ధ్రువీకరించారు. అయితే, అమెరికా ఈ ధోరణిని తప్పుబడుతోంది. ఐక్యరాజ్యసమితి వంటి వేదికలు ఏఐ పట్ల అనవసరమైన భయాన్ని కలిగిస్తున్నాయని తెలిపింది.ఇదీ చదవండి: అమెరికా డ్రీమ్ Vs రియాలిటీ -
ఏఐ మంత్రిత్వ శాఖ!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో భారత్ ముందంజలో నిలవాలంటే కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక ఏఐ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. కృత్రిమ మేధ వినియోగం, నియంత్రణ, చట్టపరమైన మార్గదర్శకాలు, జాతీయ భద్రత వంటి అంశాలను సమగ్రంగా నిర్వహించేందుకు ప్రత్యేక వ్యవస్థ అవసరమని అన్నారు. శుక్రవారం ఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ఆయన ప్రసంగించారు.మానవ చరిత్రలో అగ్ని, చక్రం, వ్యవసాయం, విద్యుత్, ఇంటర్నెట్ వంటి ఆవిష్కరణలు ప్రపంచాన్ని ఎలా మార్చాయో గుర్తుచేశారు. ఏఐ కూడా అలాంటి విప్లవాత్మక సాంకేతికతేనని, ఇది కేవలం ఇంకొక టెక్నాలజీ కాదని, మానవ పరిణామ క్రమంలో అత్యంత శక్తివంతమైన మలుపని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మునుపటి యంత్రాల మాదిరిగా కాకుండా ఏఐ స్వయంగా నేర్చుకోగలదని, విశ్లేషించగలదని, నిర్ణయాలు తీసుకోగలదని అన్నారు. రోబోటిక్స్‌తో కలిసినప్పుడు యంత్రాలు మానవ మేధస్సుతో పాటు శారీరక సామర్థ్యాన్ని కూడా పొందుతున్నాయని చెప్పారు. హైదరాబాద్‌లో వార్ రూమ్ నిర్వహిస్తాం.. ప్రపంచ ఏఐ పోటీ ఇప్పటికే ప్రారంభమైందని, కొన్ని దేశాలు, కంపెనీలు ముందంజలో ఉన్నాయని సీఎం చెప్పారు. గత పారిశ్రామిక విప్లవాల సమయంలో జరిగిన అవకాశ నష్టాలను గుర్తు చేస్తూ, ఈసారి భారత్ అలాంటి తప్పిదం చేయకూడదని హెచ్చరించారు. సేవలు, సాఫ్ట్వేర్ రంగాల్లో విజయం సాధించిన భారత్, ప్రపంచ స్థాయి కోర్ టెక్నాలజీ ఉత్పత్తుల్లో కూడా నాయకత్వం వహించాలని సూచించారు.దేశానికి తక్షణ జాతీయ ఏఐ రోడ్‌మ్యాప్ అవసరమని నొక్కిచెప్పారు. ఏఐ అభివృద్ధి ప్రతి దశలో భారత్ స్పష్టమైన వ్యూహంతో ముందుకు సాగాలని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ పరిణామాలను నిశితంగా పర్యవేక్షించేందుకు కేంద్రం, రాష్ట్రాల సమన్వయంతో జాతీయ ‘ఏఐ వార్ రూమ్’ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కేంద్రం అనుమతిస్తే హైదరాబాద్‌లో అలాంటి వార్ రూమ్ నిర్వహించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని తెలిపారు. ఏఐ యూనివర్సిటీ స్థాపించాలి ప్రపంచ స్థాయి పరిశోధనలకు ఊతమిచ్చే ఏఐ యూనివర్సిటీని దేశంలో స్థాపించాలని సీఎం కోరారు. ఏఐ విస్తరణ నేపథ్యంలో ఉపాధిపై ఉద్భవిస్తున్న ఆందోళనలను ప్రస్తావిస్తూ, కొన్ని రంగాల్లో ఉద్యోగ నష్టాలు సంభవించవచ్చని, అయితే సరైన రీ స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ చర్యల ద్వారా ఏఐ సృష్టించే కొత్త అవకాశాలు మరింత విస్తృతంగా ఉంటాయని రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. యువతను ఏఐ ఆధారిత భవిష్యత్తుకు సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. స్టార్టప్‌ల కోసం జాతీయ ఏఐ నిధి స్టార్టప్‌లకు మద్దతు కల్పించేందుకు జాతీయ ఏఐ నిధి ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దేశవ్యాప్తంగా ఏఐ ఆవిష్కరణలకు కేంద్రంగా నిలిచే ‘ఏఐ స్టార్టప్ విలేజ్’ను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని సీఎం ప్రకటించారు. ఏఐ రంగంలో విధానాలు, చట్టాలు, నైతిక ప్రమాణాలకు మార్గనిర్దేశం చేసే అత్యున్నత సంస్థగా ఇండియా ఏఐ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రిని కోరారు. ఏఐ అభివృద్ధి, సామాజిక న్యాయం, పేదరిక నిర్మూలన, ప్రజా సేవల మెరుగుదల, జాతీయ భద్రతకు తోడ్పడేలా ఉండాలని సూచించారు. బాధ్యతాయుతమైన, సమ్మిళిత, భవిష్యత్ దృష్టితో కూడిన ఏఐ వ్యవస్థను నిర్మించేందుకు ప్రపంచ నిపుణులు, సంస్థలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. -
ప్రమోషన్ కావాలంటే.. ఐటీ కంపెనీ సంచలన నిర్ణయం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్నవేళ.. యాక్సెంచర్ కంపెనీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీలో ఉన్న సీనియర్ ఉద్యోగులకు.. ముఖ్యంగా అసోసియేట్ డైరెక్టర్లు & సీనియర్ మేనేజర్లు, పదోన్నతులు పొందాలంటే కంపెనీ రూపొందించిన ఏఐ టూల్స్ క్రమం తప్పకుండా ఉపయోగించాల్సి ఉంటుందని వెల్లడించింది.ఏఐ ఎనేబుల్డ్ కంపెనీగా మారాలనే లక్ష్యంతో యాక్సెంచర్ సరికొత్త వ్యూహం రచించింది. కేవలం కస్టమర్లు మాత్రమే కాకుండా.. ఉద్యోగులకు కూడా ఏఐ టెక్నాలజీని అందుబాటులో ఉంచి, దానిద్వారా.. పనితీరును & ఉత్పాదకతను పెంచడానికి సంస్థ సిద్ధమైంది. పోటీ ప్రపంచంలో మనం నిలబడాలంటే.. ప్రతి ఉద్యోగి ఏఐలో నైపుణ్యం పెంచుకోవాలని సీఈఓ జూలీ స్వీట్ పేర్కొన్నారు.యాక్సెంచర్ ప్రకటించిన ఈ కొత్త విధానం.. యూరప్‌లోని 12 దేశాలలో ఉన్న సిబ్బందికి & అమెరికా ప్రభుత్వ ఒప్పందాల విభాగంలో పనిచేసే ఉద్యోగులకు మినహాయింపు. మిగిలిన అందరూ తప్పకుండా పాటించాల్సిందే. ఏఐ ఉపయోగించాల్సిందే. కంపెనీ 11,000 మంది ఉద్యోగులను తొలగించిన తరువాత ఈ నిర్ణయం తీసుకుంది.మూడు నెలల్లో 11000 మంది!యాక్సెంచర్ కంపెనీ గత మూడు నెలల్లో 11,000 మందికిపైగా ఉద్యోగులను తగ్గించింది. ఏఐ కార్యాచరణకు సరిపోయేలా ఉద్యోగులకు నైపుణ్యాలు పెంచుకోకపోతే.. మరింతమంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సంస్థ వెల్లడించింది. కాగా కంపెనీ ఏఐలో స్థిరంగా నిలబడటానికి ప్రముఖ టెక్నాలజీ సంస్థలతో భాగస్వామ్యం కూడా ఏర్పాటు చేసుకుంది.ఇదీ చదవండి: ఏమిటీ MANAV Vision: ప్రపంచానికి దిక్సూచిగా భారత్! -
నిజంగా భారత్ ఏఐని నిర్మిస్తుందా? అనుసరిస్తుందా?
న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన ఏఐ సమ్మిట్ భారతీయ స్టార్టప్‌లైన సర్వం (Sarvam), జ్ఞాని (Gnani), భారత్‌జెన్ (BharatGen) స్వదేశీ ఏఐ మోడల్స్‌ను ప్రదర్శించి కొత్త ఆశలు రేకెత్తించాయి. ప్రపంచ టెక్ దిగ్గజాలు భారత్ పాత్రను కొనియాడుతూ భారీ పెట్టుబడుల ప్రకటనలు గుప్పించినప్పటికీ అసలు ప్రశ్న అలాగే ఉంది.. ప్రపంచ ఏఐ పరిణామ క్రమంలో భారత్ స్థానం ఎక్కడ? ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ ప్రతిపాదించిన ‘ఐదు అంచెల ఏఐ స్టాక్’ ప్రాతిపదికన భారత్ స్థితిగతులను విశ్లేషిస్తే వాస్తవాలు కింది విధంగా ఉన్నాయి.ఏఐ ఐదు అంచెల్లో భారత్ స్థానం ఇదేనా?ఇంధనం.. ఏఐ డేటా సెంటర్లకు నిరంతర నాణ్యమైన విద్యుత్ అవసరం. భారత్‌లో విద్యుత్ ధరలు తక్కువే అయినప్పటికీ గ్రిడ్ విశ్వసనీయత, పంపిణీ లోపాలు సవాలుగా మారాయి.కంప్యూటింగ్ సదుపాయాలు.. ప్రస్తుతం భారత్ పూర్తిగా దిగుమతి చేసుకున్న చిప్స్, జీపీయూలపైనే ఆధారపడుతోంది.ఫౌండేషన్ మోడల్స్.. అమెరికా (ఓపెన్ఏఐ, జెమిని, మైక్రోసాఫ్ట్ కోపైలట్..), చైనా (డీప్‌సీక్) ఈ రంగంలో దూసుకుపోతున్నాయి. భారత్ వద్ద మల్డీమోడల్ డేటా ఉన్నప్పటికీ ప్రపంచ స్థాయి మోడల్స్ ఇంకా రూపుదిద్దుకోవాల్సి ఉంది.ప్లాట్‌ఫారమ్స్.. మన దగ్గర భారీ డెవలపర్ బేస్ ఉన్నప్పటికీ ప్రపంచాన్ని శాసించే ఏఐ ప్లాట్‌ఫారమ్స్ లేవు.అప్లికేషన్ లేయర్.. ఇందులో భారత్‌కు మంచి పట్టు ఉంది. తక్కువ ఖర్చుతో ఏఐ పరిష్కారాలను అందించగల సామర్థ్యం మనకుంది. అయితే మేధో సంపత్తిని కాపాడుకోవడమే అసలు సవాలు.గ్లోబల్ టెక్ దిగ్గజాలకు భారత్ ఎందుకు అవసరం?అమెరికా కంపెనీలు భారత్‌పై ఇంతలా దృష్టి సారించడానికి ప్రధాన కారణాలు ఉన్నాయి. చైనా తన డేటాను బయట ప్రపంచానికి ఇవ్వదు. కానీ భారత్ వద్ద చెల్లింపులు, ఈ-కామర్స్, వ్యవసాయం వంటి రంగాల నుంచి అపారమైన డేటా ఉంది. భారత్ ఒక ఉచిత డేటా పూల్‌గా మారింది. విదేశీ సంస్థలు ఇక్కడి డేటాతో తమ మోడల్స్‌ను తయారు చేసి తిరిగి మనకే అధిక ధరలకు అమ్ముతాయి. చాట్‌జీపీటీకి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మార్కెట్ భారత్. రాబోయే రోజుల్లో 50 కోట్ల ఏఐ వినియోగదారులు భారత్ నుంచే వస్తారని అంచనా. అమెరికా వైట్ హౌస్ సలహాదారులు సైతం ప్రపంచం అమెరికన్ ఏఐ మోడల్స్‌నే వాడాలని కోరుకుంటున్నారు.భారత ఏఐ భవిష్యత్తు ఎలా ఉండాలంటే..భారత్ కేవలం ఒక ఏఐ వినియోగదారు దేశంగా మిగిలిపోకుండా ఉండాలంటే తక్షణమే కొన్ని చర్యలు చేపట్టాలి.డేటాపై పూర్తి అధికారంభారతీయ డేటా స్థానిక అవసరాలకే ప్రాధాన్యతనివ్వాలి. ఫిబ్రవరి 6 నాటి భారత్-అమెరికా సంయుక్త ప్రకటనలోని ‘డిజిటల్ ట్రేడ్ రూల్స్’ భారత్ తన డేటాను నియంత్రించే శక్తిని తగ్గించే ప్రమాదం ఉంది. గతంలో ఆటోమొబైల్ రంగాన్ని రక్షించుకున్నట్టే ఏఐ రంగంలోనూ డేటా ప్రవాహంపై స్పష్టమైన నిబంధనలు ఉండాలి.స్వదేశీ మౌలిక సదుపాయాల కల్పనచైనా, ఫ్రాన్స్, దక్షిణ కొరియా వంటి దేశాలు సొంత జాతీయ ఏఐ వ్యవస్థలను నిర్మిస్తున్నాయి. భారత్ ఇండియా ఏఐ మిషన్ ద్వారా ఈ మేరకు చర్యలు చేపడుతున్నప్పటికీ మన స్టార్టప్‌లకు నిధుల కొరత ఉంది. ఐటీ దిగ్గజ కంపెనీలు అమెరికా క్లయింట్ల కోసం కాకుండా సొంతంగా ఏఐ మోడల్స్ నిర్మించే దిశగా అడుగులు వేయాలి.నైపుణ్యం కలిగిన మానవ వనరులుఏఐ వల్ల సంప్రదాయ కోడింగ్, టెస్టింగ్ ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉంది. కానీ, క్లౌడ్ ఆధునికీకరణ, ఏఐ గవర్నెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి విభాగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. మన ఇంజినీరింగ్ విద్యావ్యవస్థను ఏఐకి అనుగుణంగా మార్చడం అత్యవసరం.ఇదీ చదవండి: బంగారం ధరలు యూటర్న్! తులం ఎంతంటే.. -
అదానీ గ్రూప్ అతి భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: పునరుత్పాదక ఇంధన ఆధారిత హైపర్‌స్కేల్ ఏఐ రెడీ డేటా సెంటర్ల ఏర్పాటుకు 2035కల్లా 100 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు అదానీ గ్రూప్ తాజాగా వెల్లడించింది. దీంతో సర్వర్ల తయారీ, క్లౌడ్ ప్లాట్‌ఫామ్స్, సపోర్టింగ్ పరిశ్రమల ద్వారా మరో 150 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు వీలున్నట్లు అంచనా వేసింది. తద్వారా దేశీయంగా 250 బిలియన్ డాలర్ల విలువైన ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎకోసిస్టమ్ ఏర్పాటుకు వీలు కలగనున్నట్లు అదానీ ఎంటర్ప్రైజెస్ తెలియజేసింది. అదానీ గ్రూప్ (Adani Group) ఈ ప్రాజెక్ట్‌ను దశలవారీగా అమలు చేయాలని యోచిస్తోంది. దేశవ్యాప్తంగా అధిక విద్యుత్ వినియోగ సామర్థ్యం, ఫైబర్ కనెక్టివిటీ, భూసౌకర్యాలు అందుబాటులో ఉన్న ప్రాంతాలను గుర్తించి హైపర్‌స్కేల్ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. పునరుత్పాదక ఇంధన వనరులైన సౌర, వాయు విద్యుత్ ప్లాంట్లతో నేరుగా అనుసంధానం చేసి గ్రీన్ ఎనర్జీ ఆధారిత డేటా సెంటర్లుగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని ద్వారా కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, అంతర్జాతీయ స్థాయిలో పోటీ చేయగల డిజిటల్ మౌలిక సదుపాయాలను దేశంలోనే సృష్టించడం సాధ్యమవుతుందని సంస్థ పేర్కొంది.ఈ విస్తరణ ప్రణాళికలో భాగంగా అదానీ ఎంటర్ప్రైజెస్ (Adani Enterprises) ఆధ్వర్యంలో సర్వర్ తయారీ యూనిట్లు, క్లౌడ్ సర్వీసులు, డేటా స్టోరేజ్ సొల్యూషన్స్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో భాగస్వామ్యాలను ఏర్పరచే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పెట్టుబడులు అమల్లోకి వస్తే ఐటీ, ఎలక్ట్రానిక్స్, నిర్మాణ, ఇంజినీరింగ్ రంగాల్లో భారీ ఉపాధి అవకాశాలు సృష్టించబడటంతో పాటు, భారత్‌ను గ్లోబల్ ఏఐ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ఇది కీలక అడుగుగా మారనుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
ఏమిటీ MANAV Vision: ప్రపంచానికి దిక్సూచిగా భారత్!
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మానవ్ విజన్ (MANAV Vision) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏఐ రంగంలో భారత్ ప్రపంచానికి దిక్సూచిగా మారబోతోందని అన్నారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మానవులను శాసించకూడదు, మానవులే ఏఐను శాసించే స్థాయికి ఎదగాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఏఐ యుగంలో మానవులు ఏఐను సాధనంగా మార్చుకోవాలని అన్నారు. సాంకేతికత మానవాళి అభివృద్ధికి దోహదపడాలి. దానికి తగినవిధంగా మానవుడు ఎదగాలని పేర్కొన్నారు.MANAV అంటే మనిషి అని ఆయన వివరించారు. సాంకేతికత ఎంత వేగంగా ఎదిగినా, అది మానవ విలువలు, నైతికత & సమాజ శ్రేయస్సుకు అనుగుణంగా ఉండాలి అని అన్నారు.MANAV అంటే?M - Moral and Ethical Systems (నైతిక వ్యవస్థలు): ఏఐ వ్యవస్థలు నైతిక మార్గదర్శకాలపై ఆధారపడాలి. అవి మానవ హక్కులను గౌరవించాలి, వివక్షను పెంచకూడదు, సమాజంలో న్యాయం, సమానత్వాన్ని కాపాడాలి. సాంకేతికతకు విలువలు తోడై ఉండాలి.A - Accountable Governance (జవాబుదారిత్వ పాలన): ఏఐ పారదర్శక నియమాలను కలిగి ఉండాలి. ఎవరు ఏ విధంగా ఏఐను ఉపయోగిస్తున్నారు అనే విషయంపై స్పష్టమైన పర్యవేక్షణ అవసరం. తప్పులు జరిగితే బాధ్యత ఎవరికి? అనే ప్రశ్నకు సమాధానం ఉండాలి.N - National Sovereignty (జాతీయ స్వావలంబన): ఎవరి డేటా వారి హక్కు. అంటే.. డేటా ఎవరిదైతే, ఆ వ్యక్తికే దాని మీద హక్కు ఉండాలి. దేశాల డేటా భద్రత, డిజిటల్ స్వతంత్రత ముఖ్యం.A - Accessible and Inclusive Systems (అందరికీ అందుబాటు): ఏఐ కొన్ని కంపెనీలకే పరిమితం కాకూడదు. అది సమాజంలోని అన్ని వర్గాలకు ఉపయోగపడాలి. అది అవకాశాలను పెంచాలి కానీ ఏకాధిపత్యాన్ని సృష్టించకూడదు.V - Valid and Legitimate (చట్టబద్ధత & ధృవీకరణ): ఏఐ వ్యవస్థలు చట్టబద్ధంగా ఉండాలి. అవి విశ్వసనీయంగా, ధృవీకరించదగినవిగా ఉండాలి. సమాజానికి హానికరం కాకుండా నియంత్రణలో ఉండాలి.The M.A.N.A.V. vision for AI. pic.twitter.com/NVmxQ8bXq6— PMO India (@PMOIndia) February 19, 2026మానవ్ విజన్ అనేది కేవలం భారతదేశానికి మాత్రమే కాకుండా.. ప్రపంచ ఏఐ అవసరాలకు మార్గదర్శకంగా ఉండాలని మోదీ ఆకాంక్షించారు. పిల్లల భద్రతపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. AI వేదికలు పిల్లలకు సురక్షితంగా ఉండాలి. ప్రస్తుతం అమెరికాలో సోషల్ మీడియా సంస్థలపై పిల్లలపై ప్రభావం గురించి కేసులు నడుస్తున్న సందర్భంలో, AI వినియోగంలో జాగ్రత్త అవసరమని ఆయన సూచించారు. ఏఐ అనేది ఒక పరివర్తన శక్తి. దీనిని దిశానిర్దేశం లేకుండా వదిలేస్తే.. అవరోధాలు ఏర్పడతాయని అన్నారు.ఇదీ చదవండి: బ్యాంక్ లాకర్లోని బంగారం పోతే.. పరిహారం ఎంత? -
కృత్రిమ మేధ భవిష్యత్తుకు భారత్ దిక్సూచి
ప్రపంచ కృత్రిమ మేధ (ఏఐ) ముఖచిత్రంలో భారత్ కేవలం వినియోగదారు మాత్రమే కాదని, రాబోయే కాలంలో ఏఐ భవిష్యత్తును శాసించే ప్రధాన శక్తిగా అవతరించబోతోందని ఆంత్రోపిక్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ డారియో అమోదే ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో జరిగిన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’లో పాల్గొన్న ఆయన భారత్‌లోని సాంకేతిక నైపుణ్యం, ఏఐ రంగంలో దేశం చూపిస్తున్న వేగాన్ని ప్రశంసించారు. అమెరికా వెలుపల ఆంత్రోపిక్ తన ఉనికిని వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.భారత్ - ఆంత్రోపిక్.. వ్యూహాత్మక భాగస్వామ్యంటోక్యో తర్వాత ఆసియాలోనే రెండో కార్యాలయాన్ని బెంగళూరులో ప్రారంభించిన కొద్ది రోజులకే అమోదే ఈ సదస్సులో ప్రసంగించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆంత్రోపిక్ క్లాడ్ ఏఐ వినియోగంలో 5.8% వాటాతో భారత్ రెండో అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. టెక్ రంగ నిపుణురాలు ఇరినా ఘోష్‌ను ఆంత్రోపిక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది. ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఎక్స్-స్టెప్ ఫౌండేషన్, ప్రథమ్, సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్ వంటి స్వచ్ఛంద సంస్థలతో కలిసి విద్య, వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో ఏఐ వినియోగంపై దృష్టి సారించింది.అపార అవకాశాలు2023 బ్లెచ్లీ పార్క్ సమ్మిట్ నుంచి ఏఐ సాధించిన పురోగతి అద్భుతమని అమోదే అన్నారు. ఏఐ సామర్థ్యం గురించి వివరిస్తూ ‘మనం డేటా సెంటర్లను ఏర్పాటు చేసే దిశగా ఉన్నాం. ఇవి మానవాతీత వేగంతో పనిచేయగల ఏఐ ఏజెంట్లు. వేల ఏళ్లుగా పీడిస్తున్న వ్యాధులను నయం చేయగలవు. కోట్ల మందిని పేదరికం నుంచి విముక్తులను చేయగలవు. ఎన్నో అవకాశాలు సృష్టించగలవు’ అన్నారు.సామర్థ్యంతో పాటు ఏఐ వల్ల కలిగే ప్రమాదాలను కూడా అమోదే స్పష్టం చేశారు. స్వయంప్రతిపత్తిలోని పరివర్తన, ఉద్యోగాల కోత, సాంకేతిక దుర్వినియోగం వంటి సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్ నాయకత్వం వహించాలని ఆయన కోరారు.అమోదే ప్రసంగంలోని ముఖ్యాంశాలుభారత్లో అభివృద్ధి చేసే ఏఐ నమూనాలు ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆదర్శంగా నిలుస్తాయి.భారతీయ భాషల్లో ఏఐ మోడళ్లను పరీక్షించేందుకు స్థానిక సంస్థలతో ఆంత్రోపిక్ సహకరిస్తోంది.ప్రపంచ ఏఐ భద్రతా ప్రమాణాలను రూపొందించడంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ పాత్ర కీలకం.ఏఐ వల్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుంది. అయితే ఆటోమేషన్ వల్ల కలిగే సామాజిక మార్పులను ప్రభుత్వం, కంపెనీలు కలిసి సమన్వయం చేసుకోవాలి.ఇదీ చదవండి: ‘భారత్‌లో ఏఐ స్పీడ్ చూస్తే విస్మయం కలుగుతుంది’ -
‘భారత్‌లో ఏఐ స్పీడ్ చూస్తే విస్మయం కలుగుతుంది’
భారతదేశంలో ఏఐ వేగం పరంగా కనిపిస్తున్న మార్పు తనను విస్మయానికి గురిచేస్తున్నట్లు ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. ఒకప్పుడు సాధారణ తీరప్రాంత నగరంగా ఉన్న విశాఖపట్నం నేడు గ్లోబల్ ఏఐ హబ్‌గా రూపాంతరం చెందడం అద్భుతమని చెప్పారు. గురువారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో జరిగిన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’లో పిచాయ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రపంచ ఏఐ పర్యావరణ వ్యవస్థలో భారత్ పోషిస్తున్న కీలక పాత్రను ఆయన విశ్లేషించారు.కార్యక్రమంలో భాగంగా తన బాల్యాన్ని, విద్యాభ్యాసాన్ని గుర్తు చేసుకుంటూ పిచాయ్ భావోద్వేగానికి లోనయ్యారు. ‘నేను విద్యార్థిగా ఉన్నప్పుడు చెన్నై నుంచి ఐఐటీ ఖరగ్‌పూర్ వెళ్లేందుకు కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించేవాడిని. ఆ ప్రయాణంలో విశాఖపట్నం ఒక నిరాడంబరమైన తీరప్రాంత నగరంగా కనిపించేది. కానీ ప్రస్తుతం అదే నగరంలో గూగుల్ 15 బిలియన్ డాలర్ల మౌలిక సదుపాయాల పెట్టుబడిలో భాగంగా ఏఐ హబ్‌ను ఏర్పాటు చేస్తోంది. ఆనాడు రైలులో కూర్చున్న ఏ విద్యార్థి కూడా వైజాగ్ ఒక గ్లోబల్ టెక్ హబ్‌గా మారుతుందని ఊహించి ఉండరు’ అని ఆయన పేర్కొన్నారు.డ్రైవర్‌లెస్ కార్లపై పని..టెక్నాలజీ రంగంలో గూగుల్ సాధిస్తున్న పురోగతిని వివరిస్తూ తన తండ్రి రేగునాథ పిచాయ్‌తో జరిగిన సరదా సంభాషణను ఆయన పంచుకున్నారు. ‘శాన్ ఫ్రాన్సిస్కోలో మా ‘వేమో’ డ్రైవర్‌లెస్ టాక్సీలో నా తల్లిదండ్రులను తీసుకెళ్లాను. అయితే, భారతదేశంలోని రద్దీగా ఉండే రోడ్లపై ఈ కారు విజయవంతంగా నడిస్తే అప్పుడు నిన్ను మెచ్చుకుంటాను అని నాన్న అన్నారు. దానిపై ఇంకా పని చేస్తూనే ఉన్నాను నాన్న!’ అని చెప్పారు.భారత ప్రభుత్వ కృషికీ ప్రశంసలుగత వేసవిలో లక్షలాది మంది రైతులకు ఏఐ ఆధారిత వాతావరణ అంచనాలను పంపడంలో భారత ప్రభుత్వం చూపిన చొరవను పిచాయ్ అభినందించారు. గూగుల్ ‘న్యూరల్ జీసీఎం’ మోడల్ ద్వారా కచ్చితమైన సమాచారాన్ని అందించడం సాధ్యమైందని ఆయన వెల్లడించారు.యూఎస్-ఇండియా కనెక్ట్ఈ సదస్సులో పిచాయ్ కొన్ని కీలక అంశాలను వెల్లడించారు.అమెరికా-ఇండియా కనెక్ట్ చొరవలో భాగంగా రెండు దేశాల మధ్య నాలుగు కొత్త వ్యవస్థలతో కూడిన భారీ నెట్‌వర్క్‌ను నిర్మిస్తున్నట్లు చెప్పారు.ఏఐ వల్ల కొన్ని ఉద్యోగాలు ఆటోమేట్ అయినప్పటికీ సరికొత్త ఉపాధి మార్గాలు పుట్టుకొస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.‘20 ఏళ్ల క్రితం యూట్యూబ్ క్రియేటర్ అనే వృత్తి లేదు, కానీ నేడు లక్షలాది మంది అందులో రాణిస్తున్నారు’ అని ఉదాహరించారు.‘భారతదేశం కేవలం ఏఐని ఉపయోగించుకోవడమే కాదు, ప్రపంచానికి ఏఐ పరిష్కారాలను చూపే స్థాయికి చేరుకుంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: అభిషేక్ బచ్చన్ సక్సెస్ మంత్రం ఇదే.. -
చేతులు కలపని సంచలన సీఈవోలు.. వైరల్ సంఘటన
దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో (#IndiaAIImpactSummit2026) ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ప్రపంచ టాప్ టెక్ సీఈవోలతో భారత ప్రధాని నరేంద్ర మోదీ గ్రూప్ ఫోటో సందర్భంగా చోటుచేసుకున్న ఇద్దరు సంచలన సీఈవోల మధ్య జరిగిన ఒక చిన్న సంఘటన టెక్ ప్రపంచంలో చర్చనీయాంశమైంది.ఏఐ అభివృద్ధిపై ఐక్యతకు సంకేతంగా వేదికపై భారత ప్రధాని మోదీ, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సహా అందరూ చేతులు కలిపగా ఓపెన్ఏఐ (OpenAI) సీఈవో సామ్ ఆల్ట్‌మన్ (Sam Altman), ఆంథ్రోపిక్ (Anthropic) సీఈవో డారియో అమొడెయి (Dario Amodei) మాత్రం చేతులు కలపకుండా పిడికిలి బిగించి పలకరించుకోవడం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది.ఈ చిన్న సంఘటన సైతం ఏఐ రంగంలోని పోటీ వాతావరణాన్ని మరోసారి గుర్తు చేసింది. తీవ్రంగా పోటీ పడుతున్న రెండు ప్రముఖ ఏఐ సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఇద్దరు నేతలు వేదికపై మొదట క్షణకాలం సంకోచంగా కనిపించినా, అనంతరం పిడికిలితో పరస్పరం అభివాదం చేసుకున్నారు. ఈ దృశ్యం ఆన్లైన్లో హాస్యభరితమైన వ్యాఖ్యలకు దారితీసింది. పుచ్ ఏఐ కో ఫౌండర్ సిద్ధార్థ్ భాటియా తన సోషల్ మీడియా ఖాతాలో “ఏజీఐ ఎప్పుడు? డారియో, సామ్ చేతులు కలిపిన రోజు!” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.కాగా డారియో అమొడెయి ఓపెన్ఏఐలో రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 2021 ప్రారంభంలో ఆ పదవి నుంచి వైదొలిగి, పలువురు సీనియర్ పరిశోధకులతో కలిసి ఆంథ్రోపిక్ సంస్థను స్థాపించారు. అప్పటి నుంచి ఈ రెండు సంస్థలు జనరేటివ్ ఏఐ రంగంలో తీవ్రంగా పోటీ పడుతున్నాయి.When AGI?The day Dario and Sam hold hands. pic.twitter.com/bfmqgnTV89— Siddharth Bhatia (@siddharthb_) February 19, 2026 -
ఏఐ సదస్సు లంచ్ మెనూ ఇదే..!
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు ప్రారంభమైన సంగతి తెలిసింది. ఈ ఏఐ సదస్సుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్‌లు పాల్గొన్నారు. ఉదయం 9:40 గంటలకు ఈ శిఖరాగ్ర సమావేశం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఓపెన్ ఐఏ సీఈవో సామ్ ఆల్ట్మాన్ వంటి టాప్ టెక్ సీఈవోలు ప్రసంగిస్తారు. వీళ్లతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సీనియర్ పరిశ్రమ నాయకులు, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ తదితరులు కూడా ప్రసగించనున్నారు. మరి ఈ అతిరథమహారథుల కోసం విందు భారత్ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మరి ఆ నాయకుల లంచ్ మెనూలో ఏయే వంటకాలు సిద్ధంగా ఉన్నాయంటే..లంచ్‌లో అలెర్జీ రహిత వంటకాలను సర్వ్ చేయనున్నారు. ముఖ్యంగా పాలు, గోధుమ, నట్స్ లేకుండా రెసీపీలు సిద్ధం చేశారు. ఈమెనూలో వందగ్రాముల కేలరీలు,పోషక విలువలు ఉండేలా కేర్ తీసుకున్నారు పాకనిపుణులు. ఇంతకీ ఏమేమి వంటకాలు ఉన్నాయంటే..స్టార్టర్స్ నిమోనా కబాబ్జీలకర్ర, ఆసాఫోటిడాతో టెంపర్ చేసిన పాన్-గ్రిల్డ్ గ్రీన్ బఠానీ కబాబ్. ఇవి బీహార్, ఉత్తరప్రదేశ్‌లలో ప్రసిద్ధి చెందిన తాజా పచ్చి బఠానీల చేసే శీతాకాలపు వంటకం. వంద గ్రాముల కబాబ్‌లకు 113 కిలో కేలరీలుఖమ్ ఖతైసున్నితమైన ఆకుపచ్చ మూంగ్ పప్పు ప్యాటీలను తీపి మామిడి చట్నీతో నింపి పాన్-గ్రిల్డ్ చేస్తారు. ఈ శాఖాహార కబాబ్‌లు నోటిలో ఇట్టే కరిగిపోతాయి. ప్రతి వందగ్రాములకు 116 కిలో కేలరీలుకాశ్మీరీ నద్రు కుర్కురిసుగంధ ద్రవ్యాలతో చల్లిన క్రిస్పీ ఫ్రైడ్ లోటస్ స్టెమ్ చిప్స్. ఇది కాశ్మీర్ లోయ నుంచి వచ్చిన ప్రసిద్ధ, క్రంచీ స్నాక్. ఇందులో కూడా ప్రతి వంద గ్రాములకు 143 కిలో కేలరీలుప్రధాన కోర్సుజాఫ్రానీ సబ్జ్ పులావ్కాలానుగుణ కూరగాయలు, కుంకుమపువ్వుతో సువాసనగల బాస్మతి బియ్యం. ఇది కుంకుమపువ్వు (జాఫ్రాన్), నట్స్, నెయ్యితో తయారు చేసిన గొప్ప, సుగంధ పులావ్ వంటకం. దీనిని తరచుగా హైదరాబాద్‌లో విలాసవంతమైన, వేడుక లేదా "నవాబీ" భోజనంలో భాగంగా వడ్డిస్తారు. వందగ్రాములకు 152 కిలో కేలరీలుతందూరీ సలాడ్టమోటాలు, బెల్ పెప్పర్స్, పైనాపిల్‌లను తందూర్‌లో మ్యారినేట్ చేసి గ్రిల్ చేస్తారు.వంద గ్రాములకు 78 కిలో కేలరీలుథెప్లామెంతులతో రుచిగల గ్రామ్ పిండి ఫ్లాట్‌బ్రెడ్, మామిడి రుచిగల క్రీమ్ చీజ్‌తో సర్వ్ చేస్తారు. థెప్లా అనేది గుజరాతీ గృహాల్లో ప్రధానమైన, ప్రసిద్ధమైన, మృదువైన సన్నని ఫ్లాట్‌బ్రెడ్.వంద గ్రాములకు 138 కిలో కేలరీలుడెజర్ట్లుగులాబీ అండ్ కొబ్బరి పుడ్డింగ్ఫింగర్ మిల్లెట్ క్రంబుల్తో గులాబీ, కొబ్బరి పాలు పుడ్డింగ్ (ఖీర్). శక్తివంతమైన గులాబీ రంగును కలిగి ఉన్న క్రీమీ డెజర్ట్.వంద గ్రాములకు 167 కిలో కేలరీలురామదాన అంజీర్ లడూపఫ్డ్ మిల్లెట్, ఎండిన అంజూరతో చేసే లడ్డూ. ప్రతి వంద గ్రాములకు 172 కిలో కేలరీలుకాగా ఈ ఐఏ ఇంపాక్ట్ సదస్సు సుమారు 20కి పైగా రాష్ట్రాల అధిపతులు, దాదాపు వంద మందికి పైగా సీఈవోలు, వ్యవస్థాపకులతో సహా 500 మంది అగ్ర నాయకులను ఒక చోటకు చేర్చింది.ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 20 కంటే ఎక్కువ రాష్ట్రాల అధిపతులను మరియు 100 మంది CEOలు మరియు వ్యవస్థాపకులతో సహా 500 కంటే ఎక్కువ ప్రపంచ AI నాయకులను ఒకచోట చేర్చింది.(చదవండి: ఆ తాతగారి లైఫ్‌స్టైల్‌కి ఫిదా అవ్వాల్సిందే..! జిమ్ లేదు, కనీసం..) -
కోట్లాది ఉద్యోగాలు.. అమెరికా పారిశ్రామికవేత్త ఆందోళన
అమెరికాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాబోయే 12 నుండి 18 నెలల్లో మిలియన్ల సంఖ్యలో వైట్-కాలర్ ఉద్యోగాలు ప్రమాదంలో పడవచ్చని అమెరికన్ పారిశ్రామికవేత్త, మాజీ డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి ఆండ్రూ యాంగ్ (Andrew Yang) హెచ్చరించారు.ఏఐ సామర్థ్యం రోజురోజుకు పెరుగుతోందని పేర్కొన్న ఆయన, తన కుటుంబ సభ్యుల్లో ఒకరు ఉపయోగించిన ఏఐ ప్రోగ్రామ్ కొన్ని నిమిషాల్లోనే ఒక వెబ్సైట్ రూపకల్పన పూర్తి చేసిందని ఉదాహరణగా చెప్పారు. సాధారణంగా డిజైనర్‌కు లేదా నిపుణుడికి రోజులు పట్టే పనిని ఏఐ కేవలం నిమిషాల్లో ముగించగలగడం ఉద్యోగాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ప్రస్తుతం మిడ్-కెరీర్ కార్యాలయ ఉద్యోగులు, కాల్ సెంటర్ సిబ్బంది, సేల్స్ సిబ్బంది, కోడర్లు వంటి వారు నిర్వహిస్తున్న పనుల్లో చాలా భాగాన్ని ఏఐ ఆటోమేట్ చేసే అవకాశం ఉందని యాంగ్ అభిప్రాయపడ్డారు. డేటా ప్రాసెస్ చేయడం, నివేదికలు తయారు చేయడం మాత్రమే కాకుండా నిర్ణయ ప్రక్రియ కూడా ఆటోమేషన్ వైపు మళ్లవచ్చని ఆయన తెలిపారు.ఈ పరిణామం వైట్-కాలర్ ఉద్యోగాల్లో “గొప్ప విచ్ఛిన్నత”కు దారితీయవచ్చని హెచ్చరించిన ఆయన, ఒక కంపెనీ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం ప్రారంభిస్తే, పోటీ కారణంగా ఇతర సంస్థలు కూడా అదే మార్గాన్ని అనుసరించే అవకాశముందని అన్నారు. హెడ్‌కౌంట్ తగ్గిస్తే స్టాక్ మార్కెట్ ప్రతిఫలం ఇస్తుందనే భావన ఈ ధోరణిని మరింత వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు.అమెరికాలో సుమారు 70 మిలియన్ల వైట్-కాలర్ కార్మికుల్లో 20 నుండి 50 శాతం మంది రాబోయే రోజుల్లో ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన అంచనా వేశారు. డేటా విశ్లేషణ, రిపోర్ట్ తయారీ, కోడింగ్, కస్టమర్ సర్వీస్ వంటి రంగాల్లో ఏఐ సాధనాలు వేగంగా విస్తరిస్తుండటం ఈ పరిస్థితికి కారణమవుతుందని వివరించారు.ఉద్యోగ నష్టాల ప్రభావం వినియోగదారుల ఖర్చులు, గృహ మార్కెట్, పన్ను ఆదాయాలపై పడే అవకాశం ఉందని, దీని వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినవచ్చని యాంగ్ హెచ్చరించారు. ఈ ప్రభావాన్ని తగ్గించేందుకు సార్వత్రిక ప్రాథమిక ఆదాయం (UBI), పునఃశిక్షణ కార్యక్రమాలు, అలాగే ఏఐ కంపెనీలపై పన్నులు విధించడం వంటి విధానాలను పరిశీలించాలని ఆయన సూచించారు. -
చైనా రోబో డాగ్ వివాదం.. ప్రొఫెసర్ నేహా సింగ్ ఉద్యోగానికి ఎసరు!
ఢిల్లీ: ఏఐ ఇంపాక్ట్ సదస్సులో చైనా రోబోడాగ్ వివాదంలో అబాసుపాలైన ప్రైవేట్ యూనివర్సిటీ గల్గోటియాస్ యూనివర్సిటీ వివాదంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. చైనా రోబో డాగ్ తామే తయారు చేశామని ప్రచారం చేసుకున్న యూనివర్సిటీ ప్రొఫెసర్ నేహాసింగ్‌ను విధుల నుంచి తొలగించినట్లు సమాచారం. భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏఐ ఇపాక్ట్ సదస్సును నిర్వహిస్తోంది. అయితే, ఈసదస్సులో గ్రేటర్ నోయిడాకు చెందిన ప్రైవేట్ యూనివర్సిటీ గల్గోటియాస్ ప్రతినిధులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అదికాస్తా వివాదం కావడంతో సదస్సు నుంచి గెంటివేయాల్సిన పరిస్థితి తలెత్తింది.చైనా రోబోటిక్ కంపెనీ యూనిట్రీ తయారు చేసింది. యూనిట్రీ జీవో2 పేరిట విక్రయిస్తోంది. ఆ రోబోట్‌ను తామే తయారు చేశామని గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ నేహాసింగ్ డీడీ న్యూస్‌తో మాట్లాడారు. యూనివర్సిటీలోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో రోబోడాగ్‌ను అభివృద్ధి చేశామని చెప్పారు.ఓరియన్ (orion) అనే పేరు పెట్టామని దానిని ప్రదర్శించారు. ఆమె మీడియాతో మాట్లాడిన తీరు, ప్రదర్శనకు ఉంచిన రోబోటిక్ డాగ్ వీడియోలు వైరల్‌గా మారాయి. అయితే, ఆ వీడియోల్లో చైనా రోబోటిక్ కంపెనీ యూనిట్రీ తయారు చేసిన యూనిట్రీ జోవో2 రోబోటిక్ డాగ్‌గా గుర్తించారు. అందుకు కారణంగా ప్రపంచ దేశాల్లో ఆ సంస్థ రోబోటిక్ డాగ్‌లను పలు కార్యాక్రమాల్లో విస్తృతంగా వినియోగిస్తుంటారు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. ఏఐ ఇంపాక్ట్ నిర్వహిస్తున్న కేంద్ర ఐటీ శాఖ విభాగం ప్రతినిధులు సైతం స్పందించారు. వెంటనే సదస్సును ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. యూనివర్సిటీ ప్రతినిధులు సదస్సును ఖాళీ చేశారు. ఈ క్రమంలో ఏఐ సదస్సులో జరిగిన తప్పిదానికి క్షమాపణలు చెబుతూ ఓ నోట్‌ను విడుదల చేసింది. ఆ నోట్లో యూనివర్సిటీ గురించి వివాదం తలెత్తడానికి కారణం ప్రొఫెసర్ నేహాసింగ్‌ది తప్పు. యూనివర్సిటీ తరుఫున సదస్సులో స్టాల్ నిర్వహిస్తున్న మా ప్రతినిధుల్లో ఆమె ఒకరు. సదస్సు గురించి, రోబోటిగ్ డాగ్ గురించి సరైన సమాచారం లేదు. మీడియాతో మాట్లాడే అధికారం కూడా ఆమెకు లేదు’అని పేర్కొంది. ఇదే అంశంపై మీడియా ఆమె వద్ద ప్రస్తావించగా.. నా వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్నారని, రోబోట్ డాగ్‌ను మా యూనివర్సిటీ తయారు చేయలేదని స్పష్టం చేసింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ప్రపంచ దేశాల్లో యూనివర్సిటీ పరువు పోవడంతో యాజమాన్యం చర్యలకు ఉపక్రమించింది. ప్రొఫెసర్ నేహాసింగ్‌ను యూనివర్సిటీ నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. లింక్డిన్ ప్రొఫెల్ సైతం ఆమె మరో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుపుతుంది. People like Galgotias University "professor" Neha Singh are the face of "artificial" intelligence who make a fool of themselves and the entire country. Will talk about the absolute collapse of "cute little and naughty" DD News as India's public broadcaster in the next debate. pic.twitter.com/UdW0psuum6— Piyush Rai (@Benarasiyaa) February 17, 2026 -
ఇక ‘జియో ఏఐ స్టాక్’.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లో ముందడుగు
కృత్రిమ మేధా (AI) రంగంలో భారతదేశ స్థాయిని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో రిలయన్స్ జియో ‘నేషన్-ఫస్ట్ ఏఐ స్టాక్’ బ్లూప్రింట్‌ను ప్రకటించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు (India AI Impact Summit) వేదికగా ‘జియో ఏఐ స్టాక్’ పేరుతో ఈ సమగ్ర, స్వదేశీ ఏఐ ఎకోసిస్టమ్ రూపకల్పనను సంస్థ వెల్లడించింది.జియో ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ కింద అభివృద్ధి చేస్తున్న ఈ ఏఐ స్టాక్, కేవలం డేటా సెంటర్లకే పరిమితం కాకుండా పూర్తి స్థాయి సమగ్ర ఏఐ వ్యవస్థగా రూపుదిద్దుకుంటోంది. భారతదేశ జనాభా పరిమాణం, భాషా వైవిధ్యం, సామాజిక-ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని దీన్ని రూపొందిస్తున్నట్లు సంస్థ తెలిపింది.గిగావాట్ స్థాయి గ్రీన్ డేటా సెంటర్లుజియో ఏఐ స్టాక్‌లో ప్రధాన భాగంగా గిగావాట్ స్థాయి గ్రీన్ డేటా సెంటర్లు, అధిక సామర్థ్య గణన వసతులు (HPC), ఏఐ ప్లాట్ఫార్మ్లు, డెవలప్మెంట్ ఫ్రేమ్‌వర్క్‌లు, భారతీయ భాషల ఆధారిత డేటా ఫౌండేషన్లు, మల్టీలింగ్వల్ ఇంటెలిజెన్స్ లేయర్, రంగాల వారీ అప్లికేషన్ మాడ్యూల్స్ ఉంటాయని వెల్లడించింది.ఈ డేటా సెంటర్లు పూర్తిగా పునరుత్పాదక శక్తితో నడిచేలా నిర్మాణం చేయనున్నట్లు జియో తెలిపింది. దేశవ్యాప్తంగా స్థిరమైన, సుస్థిర ఏఐ మౌలిక సదుపాయాలను సృష్టించడమే లక్ష్యమని పేర్కొంది.జియో ఏఐ స్టాక్‌ను “సార్వభౌమ ఏఐ ఎకోసిస్టమ్”గా సంస్థ అభివర్ణించింది. దేశీయంగా అభివృద్ధి చేయబడిన ఈ వ్యవస్థ, డేటా పరిరక్షణ, డిజిటల్ మౌలిక వసతులు, వ్యూహాత్మక స్వయం నియంత్రణ వంటి జాతీయ ప్రాధాన్యతలతో అనుసంధానమై ఉంటుంది.ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, సూక్ష్మ-చిన్న వ్యాపారాలు, పౌర సేవలు వంటి రంగాల్లో ఏఐ ఆధారిత పరిష్కారాలను అందించేలా ఈ వేదిక రూపుదిద్దుకుంటుందని సంస్థ పేర్కొంది.భారతీయ భాషలకు ప్రాధాన్యంఈ ప్రాజెక్ట్‌లో భాగంగా వివిధ భారతీయ భాషల్లో విస్తృత డేటా సేకరణ జరుగుతోందని జియో తెలిపింది. స్థానిక భాషలను అర్థం చేసుకునే ఏఐ వ్యవస్థలు, ఫేఫ్టీ మల్టీలింగ్వల్ వాయిస్ ఏఐ సొల్యూషన్లు, వినియోగదారులు తమకు ఇష్టమైన భాషలో సహజంగా సంభాషించగలిగే ఏజెంటిక్ ప్లాట్‌ఫార్మ్‌ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. -
ఢిల్లీ AI సదస్సులో చైనా రోబో వివాదం
-
ఏఐ.. మనిషికి సూపర్ పవర్!
భారత్‌లోని ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో కృత్రిమ మేధ ప్రభావంపై తీవ్రంగా చర్చ సాగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) అనేది ఎన్నటికీ మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయం కాబోదని కొందరు నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ మార్పు క్రమంలో సాంప్రదాయ ఉద్యోగాలకు మాత్రం ముప్పు పొంచి ఉందన్నది కాదనలేని వాస్తవమని ఇంకొందరు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏఐ ప్రభావం ఉద్యోగాలపై ఎలా ఉంటుందో, నిపుణులు ఏం అంటున్నారో చూద్దాం.సాంప్రదాయ ఉద్యోగాలకు పొంచి ఉన్న ముప్పుఏఐ వల్ల పునరావృతమయ్యే పనులు చేసే విభాగాల్లో భారీ మార్పులు వస్తున్నాయి. డేటా ఎంట్రీ, అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ల వల్ల క్లరికల్ పనుల అవసరం తగ్గుతోంది. కస్టమర్ సర్వీసులో చాట్‌బాట్స్, ఏఐ వాయిస్ అసిస్టెంట్లు ప్రాథమిక కస్టమర్ సమస్యలను సెకన్లలో పరిష్కరిస్తున్నాయి. ప్రాథమిక స్థాయి సాఫ్ట్వేర్ కోడింగ్‌ను ఏఐ మోడల్స్ సమర్థవంతంగా చేస్తున్నాయి. ఫ్యాక్టరీల్లో రోబోటిక్స్ ఏఐ ఏకీకరణ వల్ల మానవ ఆధారిత లేబర్ అవసరం తగ్గుతోంది.కొత్త తరం అవకాశాలుపాత ఉద్యోగాలు పోతున్నా అంతకు రెట్టింపు స్థాయిలో సరికొత్త కెరీర్ మార్గాలు పుట్టుకొస్తున్నాయి. 2026 నాటికి మార్కెట్లో డిమాండ్ ఉన్న విభాగాలు కింది విధంగా ఉన్నాయి. ఏఐ నుంచి సరైన ఫలితాలను రాబట్టే ప్రాంప్ట్ ఇంజినీర్లకు భారీ వేతనాలు లభిస్తున్నాయి. అల్గారిథమ్స్‌లో పక్షపాతం లేకుండా చూసేందుకు ఏఐ ఎథిక్స్ ఆఫీసర్లు అవసరం పెరుగుతోంది. ఏఐ మోడల్స్‌కు శిక్షణ ఇవ్వడానికి అవసరమైన డేటాను ఉపయోగించేందుకు డేటా క్యూరేటర్లకు డిమాండ్ ఉంది. మనుషులు, ఏఐ కలిసి పనిచేసే ప్రక్రియను సమన్వయం చేసే మేనేజర్లకు మార్కెట్లో డిమాండ్ ఏర్పడుతోంది.ప్రస్తుత పరిస్థితులు: భారత్ సన్నద్ధతప్రస్తుతం భారతదేశం ‘ఏఐ ఫర్ ఆల్’ అనే నినాదంతో ముందుకు వెళ్తోంది. సమ్మిట్‌లో వెల్లడైన వివరాల ప్రకారం భారతీయ కంపెనీలు తమ ఉద్యోగుల కోసం భారీగా ‘రీ-స్కిల్లింగ్’(నైపుణ్యాభివృద్ధి) ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తున్నాయి. నైపుణ్యం లేని చోట మాత్రమే ఉపాధి ముప్పు కనిపిస్తోందని, నైపుణ్యం ఉన్న చోట ఉత్పాదకత పెరిగిందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.సవాళ్లను అధిగమించడం ఎలా?రాబోయే రోజుల్లో ఏఐ విప్లవాన్ని తట్టుకుని నిలబడాలంటే కొన్ని మార్పులు అవసరం.డిగ్రీతో విద్య ముగిసిందని అనుకోకుండా ఎప్పటికప్పుడు కొత్త ఏఐ టూల్స్ నేర్చుకోవాలి.సృజనాత్మకత, క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవడం వంటి పనులను ఏఐ చేయలేదు. వీటిని మెరుగుపరుచుకోవాలి.ప్రభుత్వం ఇండియా ఏఐ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏఐ అక్షరాస్యతను పెంచేలా చర్యలు తీసుకోవాలి.ఉద్యోగాల కోతను అరికట్టేలా కంపెనీలు సామాజిక బాధ్యతతో ఏఐని అమలు చేయాలి.అసలైన సవాలు..ఏఐ అనేది మనిషిని తొలగించే సాధనం కాదు, మనిషి సామర్థ్యాన్ని పెంచే ఒక ‘సూపర్ పవర్’. సాంకేతికతను చూసి భయపడటం కంటే, దాన్ని మన ఉపాధికి ఎలా వాడుకోవాలో నేర్చుకోవడమే ప్రస్తుతం అసలైన సవాలు.ఇదీ చదవండి: దిగొస్తున్న వెండి ధరలు.. ఒకేసారి రూ.5000 -
వేల కోట్ల బడ్జెట్ మూవీ.. ఏఐతో ఒక్కరోజులోనే తీస్తే?
సినిమాల తీయడంలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తూనే ఉన్నాయి. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్, కలర్ నుంచి యానిమేటెడ్, ఇప్పుడేమో కొత్తగా ఏఐ మూవీస్ రెడీ అయిపోతున్నాయి. ఓవైపు కెమెరాతో ఎప్పటిలానే సినిమాలు తీస్తున్నప్పటికీ కొందరు ఏఐ ఉపయోగించి వందలాది కోట్ల బడ్జెట్ అయ్యే చిత్రాల్ని ఎంచక్కా ఒక్కరోజులోనే తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇప్పుడు ఇదే విషయమై తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.(ఇదీ చదవండి: వాళ్లు తప్పు చేశారు.. నేను క్షమాపణలు చెబుతున్నా: రాజమౌళి తండ్రి)ఆర్జీవీ లేటెస్ట్గా ఓ ఏఐ మూవీకి సంబంధించిన చిన్న బిట్‌ని తన ట్విటర్లో షేర్ చేశాడు. 'సినిమాలకు ఇది అంతం కాకపోతే మరేంటి?' అని తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. దాదాపు మూడున్నర నిమిషాలున్న ఈ వీడియో చూస్తే.. ఎక్కడా ఏఐతో తెరకెక్కించారనే సందేహం రాదు. హాలీవుడ్ భారీ బడ్జెట్ మూవీస్ స్టైల్లోనే చాలా భారీగా ఉంది. బిల్డింగ్స్ కుప్పకూలడం, ఆకాశం నుంచి విమానం నేలకూలడం, అమెరికాలోని బ్రిడ్జ్ విరిగిపోవడం, ఇలా ప్రతి సీన్ ఎంతో రియలస్టిక్‌గా అనిపించింది. చూస్తుంటే రాబోయే రోజుల్లో ఏఐతో సినిమాలకు భారీ ప్రమాదమే పొంచి ఉంది.(ఇదీ చదవండి: హీరోయిన్‌తో క్లోజ్‌గా ఉండే పాత్ర అని పిలిచి అవమానించారు: సుహాస్)If this is not the end of films , I don’t know what is ?😳 Watch till END https://t.co/MVZA7mJKYH— Ram Gopal Varma (@RGVzoomin) February 18, 2026 -
‘యూపీఐ’ నిరసనలు.. ఔత్సాహికులకు చేదు అనుభవాలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభమైన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026' సందర్శకులకు పలు సమస్యలు ఎదురవుతున్నాయి. సాంకేతికత, డిజిటల్ వృద్ధి మేళవింపుగా నిర్వహిస్తున్న ఈ గ్లోబల్ ఈవెంట్లో ఫుడ్ కౌంటర్ల వద్ద యూపీఐ (UPI) చెల్లింపులను నిలిపివేయడం సందర్శకులను షాక్‌నకు గురిచేస్తోంది. క్యూఆర్ కోడ్లు పనిచేయకపోవడం, ఇంటర్నెట్ సిగ్నల్స్ బలహీనంగా ఉండటంతో అతిథులు, సందర్శకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో విదేశీ భాగస్వామ్యాన్ని ప్రదర్శించేందుకు ఈ ప్రదర్శనలో 600కు పైగా స్టార్టప్‌లు, 13 దేశాల పెవిలియన్లు ఏర్పాటు చేశారు. అయితే కనీసం యూపీఐ లేదా కార్డుల ద్వారా చెల్లింపులు చేసే అవకాశం లేకపోవడాన్ని నెటిజన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ‘యూపీఐ’తో చెల్లించే వీలు లేనప్పుడు ఇది డిజిటల్ ఇండియా ఈవెంట్ ఎలా అవుతుంది?’ అని ఒక ‘ఎక్స్’ యూజర్ ప్రశ్నించగా, మరొకరు ఈ సమిట్‌ను ‘అస్తవ్యస్త నిర్వహణకు నిదర్శనం’ అని అభివర్ణించారు. కనీసం వైఫై సదుపాయం కూడా లేకపోవడంపై అందరూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.నియోసేపియన్ సహ వ్యవస్థాపకునికి చేదు అనుభవంనియోసేపియన్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ ధనంజయ్ యాదవ్, భారతదేశ సాంకేతిక రంగానికి తన వంతు సహకారం అందించాలనే ఆశయంతో 'ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్'కు వచ్చారు. తన స్టార్టప్ రూపొందించిన ‘వేరబుల్ స్మార్ట్ ఏఐ’ పరికరాన్ని ప్రదర్శించడానికి ఒక చిన్న స్టాల్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే ప్రధాని మోదీ రాక సందర్భంగా.. భద్రతా కారణాలతో అతనిని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అధికారులు ఆదేశించారు. Bro is Dhananjaya YadavBro is co-founder and CEO of NeoSapienBro came to the AI Impact SummitBro wanted to do something for IndiaBro came to support India’s tech scene and believed in the governmentBro is building a smart AI wearable at NeoSapienBro set up a small… pic.twitter.com/1WFIPTerah— Dr Nimo Yadav 2.0 (@DrNimoYadav) February 17, 2026అతని ల్యాప్‌టాప్‌లు, ఇతర సాంకేతిక పరికరాలను అక్కడే వదిలి వెళ్ళాలని, సెక్యూరిటీ సిబ్బంది వాటికి బాధ్యత వహిస్తుందని వారు చెప్పడంతో వారి మాటలను నమ్మి బయటకు వెళ్ళిపోయారు. కాసేపటి తర్వాత ధనంజయ్ యాదవ్ తిరిగి వచ్చి చూసేసరికి అతని పరికరాలన్నీ మాయమయ్యాయి. దీంతో విమాన ప్రయాణం, హోటల్ వసతి, స్టాల్ ఏర్పాటు కోసం భారీగా ఖర్చు చేసిన ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎంతో కష్టపడి రూపొందించిన తన ప్రోటోటైప్‌ను కూడా ఆయన కోల్పోయారు. ఈ సంఘటన అక్కడి భద్రతా వైఫల్యాన్ని ఎత్తిచూపడమే కాకుండా, భారత్‌లో ఆవిష్కర్తలకు ఎదురయ్యే సవాళ్లకు ఉదాహరణగా నిలిచింది. Day 1 at the AI Summit:We’re apparently building the future.Meanwhile:– No water.– Traffic like it’s a festival + protest + wedding baraat combined.– AQI doing live demo of “real world simulation.”– Queues so long they need their own breakout session.– Cash only food…— Yavanika Shah (@yavanikashah) February 16, 2026 -
‘భారత ఏఐ రంగంలో వృద్ధి వేగవంతం’
గూగుల్ భారత్‌తో తన అనుబంధాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. న్యూఢిల్లీలో జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ సందర్భంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కొన్ని విషయాలను వెల్లడించారు. ఇండియా ఏఐ రంగంలో పురోగతి సాధిస్తున్న తరుణంలో గూగుల్ తన పూర్తి ఏఐవ్యవస్థలను స్థానికంగా అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు.గూగుల్, ఇండియా ఏఐ భాగస్వామ్యంగూగుల్ కేవలం ఒక టెక్నాలజీ ప్రొవైడర్‌గానే కాకుండా భారత ఏఐ పర్యావరణ వ్యవస్థలో ఒక సమగ్ర భాగస్వామిగా ఉండాలని నిర్ణయించుకుంది. కంప్యూట్ పవర్, మోడల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ, రీసెర్చ్ వంటి ఏఐకి సంబంధించిన అన్ని విభాగాల్లో గూగుల్ భారత్‌తో కలిసి పనిచేయనుంది. గూగుల్ తన గ్లోబల్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 185 బిలియన్ డాలర్ల భారీ మూలధన వ్యయ ప్రణాళికను ప్రకటించింది. ఇందులో గణనీయమైన భాగం భారత్‌లో డేటా సెంటర్లు, గిగావాట్ స్థాయి కంప్యూటింగ్ సామర్థ్యం, స్థిరమైన ఇంధన వనరుల కోసం కేటాయించనున్నారు.రిలయన్స్ జియో (క్లౌడ్ రీజియన్ల కోసం), అదానీ గ్రూప్, క్లీన్‌మ్యాక్స్ (పునరుత్పాదక ఇంధనం కోసం) వంటి దిగ్గజ సంస్థలతో గూగుల్ ఒప్పందాలు చేసుకుంది.ఈ పరిణామం ఎందుకు కీలకం?ఈ భాగస్వామ్యం దేశ డిజిటల్ భవిష్యత్తును మార్చబోయే ఒక వ్యూహాత్మక అడుగు. భారత ప్రభుత్వం నిర్దేశించుకున్న వికసిత్ భారత్ 2047 విజన్‌కు అనుగుణంగా ఆధునిక సాంకేతికతను సామాన్యులకు చేరవేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. గూగుల్ అత్యాధునిక ఏఐ పరికరాలు అందుబాటులోకి రావడం వల్ల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, స్టార్టప్‌లు తక్కువ ఖర్చుతో ప్రపంచస్థాయి ఆవిష్కరణలు చేయవచ్చు. గిగావాట్ స్థాయి కంప్యూటింగ్, సముద్రగర్భ కేబుల్ నెట్వర్క్ ద్వారా భారత్ ప్రపంచానికి ఏఐ సేవలను అందించే కేంద్రంగా మారుతుంది. ఇది భారత్-అమెరికా సాంకేతిక సహకారాన్ని మరింత బలపరుస్తుంది.భవిష్యత్తుపై అంచనాలు..ఈ సందర్భంగా సుందర్ పిచాయ్ మాట్లాడుతూ..‘భారతదేశం ఏఐ రంగంలో వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ పరివర్తనకు అవసరమైన మౌలిక సదుపాయాలను, క్లీన్ ఎనర్జీని, ఏఐకి సంబంధించి ఓపెన్ మోడల్స్‌ను అందించడమే మా లక్ష్యం’ అన్నారు. గూగుల్ ఇప్పటికే రాజస్థాన్‌లో 150 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు వంటి వాటితో తన మౌలిక సదుపాయాల కల్పనను ప్రారంభించింది.ఇదీ చదవండి: రష్యా డాలర్లలో వ్యాపారం? భారత్‌పై ప్రభావం.. -
ప్రధాని మోదీతో సుందర్ పిచాయ్ భేటీ
న్యూఢిల్లీ: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ బుధవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ప్రతిష్టాత్మకమైన ‘గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’లో పాల్గొనేందుకు భారత్ చేరుకున్న పిచాయ్, ప్రధానితో ప్రస్తుత సాంకేతిక పరిణామాలు, కృత్రిమ మేధ భవిష్యత్తుపై చర్చించారు. మరోవైపు ఏఎన్ఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ భారత్‌లో ఏఐ ప్రభావంపై మాట్లాడారు. భారత ఐటీ రంగం మన ఎగుమతులకు వెన్నెముక అని, ఏఐ దీనికి అపారమైన అవకాశాలను కల్పిస్తుందని పేర్కొన్నారు. ఏఐ ఆధారిత అవుట్సోర్సింగ్, ఆటోమేషన్ కారణంగా 2030 నాటికి భారత ఐటీ రంగం 400 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. ‘పీపుల్, ప్లానెట్, ప్రోగ్రెస్’ అనే మూడు సూత్రాల ఆధారంగా మానవ హక్కులను కాపాడుతూ, పర్యావరణహితంగా ఏఐని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని ప్రధాని పేర్కొన్నారు.గూగుల్, ఆల్ఫాబెట్ సంస్థల సీఈఓ సుందర్ పిచాయ్ ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇంపాక్ట్ సమ్మిట్’లో పాల్గొనేందుకు బుధవారం భారతదేశానికి చేరుకున్నారు. ఫిబ్రవరి 20న ఆయన ఈ సదస్సులో ప్రసంగించనున్నారు. చాలా కాలం తర్వాత మాతృభూమికి రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ‘భారతదేశానికి తిరిగి రావడం చాలా ఆనందంగా ఉంది.. ఇక్కడ లభించిన సాదర స్వాగతం నా మనసుని తాకింది’ అంటూ పిచాయ్ తన 'ఎక్స్’ ఖాతాలో పేర్కొన్నారు.న్యూఢిల్లీలోని ‘భారత్ మండపం’లో ఐదు రోజుల పాటు జరిగే ఈ అంతర్జాతీయ సదస్సు ఫిబ్రవరి 16న ప్రారంభమైంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ‘ఇండియా ఏఐ మిషన్’ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సామాన్యుల జీవితాల్లో ఎలా సానుకూల మార్పు తీసుకురావచ్చనే అంశంపై ఈ సదస్సు ప్రధానంగా దృష్టి సారించనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి టెక్ సీఈఓలు, దేశాధినేతలు పలు అంశాలపై ఈ వేదికపై చర్చించనున్నారు.ఈ సదస్సు ప్రారంభానికి ముందు ఒక జాతీయ మీడియాతో మాట్లాడిన సుందర్ పిచాయ్.. భారత్‌తో ఏఐ రంగంలో భాగస్వామ్యం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యంత డైనమిక్ దేశాల్లో భారత్ ఒకటి అని, ఇక్కడ ఏఐ రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. కేవలం సాంకేతికతను అందించడమే కాకుండా, మౌలిక సదుపాయాల కల్పన, స్థిరమైన ఇంధన వనరుల పెట్టుబడులు, ఓపెన్ డేటాసెట్స్, స్థానిక ప్రతిభను ప్రోత్సహించడం తదితర అంశాల్లో భారత్‌కు గూగుల్ పూర్తి సహకారం అందిస్తుందని ఆయన తెలిపారు.ఈ మెగా సదస్సులో సుందర్ పిచాయ్‌తో పాటు ప్రపంచ స్థాయి దిగ్గజాలు తమ గళాన్ని వినిపించనున్నారు. ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, ఆంత్రోపిక్ వ్యవస్థాపకులు డారియో అమోడై తదితర ప్రముఖులు ఈ వేదికపై ప్రసంగించనున్నారు. అధికారిక షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 20న ఉదయం 9:30 గంటలకు సుందర్ పిచాయ్ తన కీలక ప్రసంగాన్ని ప్రారంభించనున్నారు, దీనిపై టెక్ ప్రపంచంలో భారీ అంచనాలు ఉన్నాయి. Nice to be back in India for the AI Impact Summit - a very warm welcome as always and the papers looked great too:) pic.twitter.com/szM9g2wB4d— Sundar Pichai (@sundarpichai) February 18, 2026 -
ఏఐతో అద్భుతం.. రజినీకాంత్ మూవీ టీజర్ రిలీజ్
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వచ్చిన చిత్రం కొచ్చాడయాన్. 2014లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అభిమానులను అంతగా మెప్పించలేకపోయింది. ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీ బాలీవుడ్ భామ దీపికా పదుకొణె హీరోయిన్గా కనిపించింది. గతంలో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ సాయంతో ఈ సినిమాను తెరకెక్కించారు. అప్పట్లో ఈ మూవీపై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. కార్టూన్ సినిమాను తలపించేలా ఉందంటూ ఆడియన్స్ ట్రోల్స్ చేశారు.అయితే తాజాగా ఈ మూవీకి సరికొత్త హంగులతో టీజర్‌ను రిలీజ్ చేశారు. ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) సాయంతో రూపొందించిన టీజర్ తలైవా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా మొత్తాన్ని ఏఐ సాయంతో రీ జనరేట్ చేస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు రజినీకాంత్ కూతురు సౌందర్య దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. -
ఫేక్, ఏఐ కంటెంట్ నియంత్రణకు కేంద్రం కొత్త నిబంధనలు
కేంద్ర ప్రభుత్వం కీలకం నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ ఫేక్ కంటెంట్‌ను అరికట్టడానికి కొత్త నిబంధనలను ప్రకటించింది. ఇవి కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కంటెంట్‌కే పరిమితం కాకుండా, అన్ని రకాల కంటెంట్‌పై వర్తించనున్నట్లు తెలిపింది. ఈ కొత్త నిబంధనలు ఫిబ్రవరి 20 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇంటర్నెట్ యుగంలో వ్యక్తుల గోప్యత ఉల్లంఘన, నకిలీ సమాచారం, డీప్‌ఫేక్ వీడియోలు వంటి సమస్యలు పెరుగుతున్నాయి. అదే సమయంలో భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త నిబంధనల్ని అందుబాబులోకి తెచ్చింది. తద్వారా వినియోగదారులు ఎవరైనా సంబంధిత సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో చూసిన ఫేక్ కంటెంట్ గురించి సంబంధిత ఫ్లాట్‌ఫామ్ యాజమాన్యానికి నేరుగా ఆన్లైన్లో ఫిర్యాదు చేసే వెసులు బాటు కల్పించింది. ఉదాహరణకు, ఫేస్బుక్లో గోప్యత ఉల్లంఘించే వీడియో కనిపిస్తే, ఫేస్బుక్ గ్రివెన్సెస్ ఆఫీసర్‌కి ఆన్లైన్లో ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు చేసిన 24 గంటల్లోగా దాన్ని ఫ్లాట్‌ఫామ్ నుంచి తొలగిస్తుంది. అంతేకాదు, అశ్లీల కంటెంట్, పిల్లల లైంగిక నేరాలు, కులం లేదా మతం ఆధారిత ద్వేషం, నకిలీ సమాచారం వంటి వాటిని 36 గంటల్లో, వ్యక్తిగత నగ్నత్వం, లైంగిక సంపర్కం, డీప్‌ఫేక్ వీడియోలు వంటి వాటిపై ఫిర్యాదు వస్తే 2 గంటల్లో చర్య తీసుకోవాలి. కాపీరైట్, పేటెంట్, ట్రేడ్‌మార్క్ ఉల్లంఘనలపై ఫిర్యాదులు అయితే 7 రోజుల్లో పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం లేదా కోర్టు ఆదేశాలపై కంటెంట్ తొలగించడానికి గడువు 36 గంటల నుండి 3 గంటలకు తగ్గించారు. జాతీయ భద్రత, శాంతిభద్రతలు, పరువు నష్టం వంటి అంశాలకు ఇది వర్తిస్తుంది.మీరు ఫిర్యాదు చేసినా సదరు సోషల్ మీడియా యాజమాన్యం పట్టించుకోకపోతే 30 రోజుల్లో ప్రభుత్వ Grievance Appellate Committee (GAC)ని సంప్రదించవచ్చు. ఇది పూర్తిగా ఆన్లైన్లో ఉంటుంది. వెబ్సైట్ gac.gov.inలో మొబైల్ నంబర్, OTP, ఆధార్ ద్వారా నమోదు చేసి, ‘File New Appeal’ ద్వారా వివరాలు సమర్పించాలి. కమిటీ నిర్ణయం తప్పు అని భావిస్తే, కంటెంట్ తొలగించాలని ఆదేశించవచ్చు. ఏఐ కంటెంట్‌పై ప్రత్యేక నియంత్రణలు కూడా ఉన్నాయి. ఏఐ ద్వారా రూపొందించిన కంటెంట్‌కి తప్పనిసరిగా లేబుల్ (నోటీసు) ఇవ్వాలి. ఆడియో లేదా వీడియోలో ప్రారంభంలోనే ఇది AI కంటెంట్ అని స్పష్టంగా చూపించాలి. అశ్లీల కంటెంట్, చైల్డ్ పోర్నోగ్రఫీ, నకిలీ పత్రాలు, డీప్‌ఫేక్‌లు ఉత్పత్తి కాకుండా ఆటోమేటెడ్ టూల్స్ ఏర్పాటు చేయాలి. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు కంటెంట్ అప్లోడ్ చేసే సమయంలో వినియోగదారుల నుండి అఫిడవిట్ తీసుకోవాలి.ఇప్పటివరకు సోషల్ మీడియా సంస్థలకు సేఫ్ హార్బోర్ ప్రొటెక్షన్ ఉండేది. కొత్త నిబంధనలతో, ప్లాట్‌ఫారమ్‌లు కంటెంట్ తొలగించడంలో విఫలమైతే ఈ రక్షణ కోల్పోతాయి. అంటే, వినియోగదారులు రాసిన పోస్ట్‌పై కూడా కంపెనీలు న్యాయపరమైన బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనలు ఒకవైపు గోప్యత రక్షణను బలపరుస్తాయి, మరోవైపు భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడేలా రూపొందించబడ్డాయి. AI కంటెంట్‌కి ప్రత్యేక నియంత్రణలు ఉండటం వల్ల భవిష్యత్తులో డీప్‌ఫేక్‌లు, నకిలీ వీడియోలు వంటి సమస్యలు తగ్గే అవకాశం ఉంది. -
టెకీల ప్రైమరీ జాబ్ కోడింగ్ కాదు: నందన్ నీలేకని
ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వల్ల టెక్ ప్రపంచంలో కీలక మార్పులు సంభవిస్తాయని, ఉద్యోగులు జాబ్స్ కోల్పోతారని ఇప్పటికే చాలామంది నిపుణులు హెచ్చరించారు. ఇలాంటి సమయంలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నీలేకని చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.ఇటీవల జరిగిన ఇన్వెస్టర్ డే కార్యక్రమంలో నందన్ నీలేకని మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తులో సాఫ్ట్వేర్ రంగాన్ని పూర్తిగా మార్చివేస్తుందని పేర్కొన్నారు. ఇది సాధారణ సాంకేతిక మార్పు కాదు.. సంస్థల పని విధానం, వ్యాపార నమూనాలు, ఉద్యోగుల నైపుణ్యాలను మూలం నుంచి మార్చే 'రూట్ అండ్ బ్రాంచ్' మార్పు అని అన్నారు.ఇప్పటి వరకు సాఫ్ట్వేర్ రంగంలో మొదటి పని కోడ్ రాయడం. కానీ భవిష్యత్తులో మొదటి పని కోడ్ రాయడం కాదు, AI వ్యవస్థలను సమర్థంగా ఉపయోగించి వ్యాపార సమస్యలను పరిష్కరించడం అని నీలేకని అన్నారు. ఏఐ మోడళ్ల సామర్థ్యం వేగంగా పెరుగుతున్నప్పటికీ, వాటిని సంస్థల్లో సమర్థవంతంగా అమలు చేయడం సవాలుగా మారింది. కాబట్టి దీనిని పరిష్కరించుకోవడానికి.. ఇందులో ప్రత్యేకించి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: 'భారీ క్రాష్ మొదలైంది'.. కియోసాకి హెచ్చరిక!ఏఐ యుగంలో కొత్త నైపుణ్యాలు అవసరం అవుతాయి. ఏఐ ఇంజినీరింగ్, ఏజెంట్ ఆర్కెస్ట్రేషన్ మొదలైన రంగాల్లో నిపుణుల అవసరం ఏర్పడుతుంది. ఒకే ప్రాంప్ట్‌కు ప్రతి సారి వేర్వేరు ఫలితాలు రావడం వంటి వ్యవస్థలను సమర్థంగా నిర్వహించగల సామర్థ్యం.. ఉద్యోగుల్లో ఉండాలి. దీనిని అలవాటు చేసుకోవాలి. ఇది సంప్రదాయ సాఫ్ట్వేర్ అభివృద్ధి విధానంతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉంటుందని నందన్ నీలేకని అన్నారు. అయితే ఈ మార్పు అనుకున్నంత సులభం కాదు. నెమ్మదిగా అలవాటు చేసుకోవాలి. -
జియో ఏఐ డాక్టర్.. అద్దం ముందే ఆరోగ్య పరీక్ష!
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో.. జియో పెవిలియన్ ఎంతో మందికి ఆకట్టుకుంది. ఇక్కడ జియో ఏఐ స్టాక్, జియో సంస్కృతి ఏఐ, జియో ఆరోగ్యం ఏఐ, జియో శిక్షా, జియో ఏఐ హోమ్ వంటి వివిధ ఏఐ మోడల్స్ ప్రదర్శించారు. ఇందులో ప్రత్యేకంగా 'జియో ఆరోగ్య ఏఐ' మరింత ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.'జియో ఆరోగ్య ఏఐ' అనేది ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కోసం రూపొందించిన ఏఐ క్లినిక్ మోడల్. దీనిని దేశంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏఐ సాంకేతికతతో శక్తివంతం చేసి, గ్రామీణ ప్రాంతాల్లో కూడా వేగవంతమైన.. తక్కువ ఖర్చుతో కూడిన వైద్య సేవలను అందించడానికి తీసుకొచ్చారు.వీడియోలో మీరు గమనించినట్లయితే.. ఒక వ్యక్తి అద్దం మాదిరిగా ఉన్న ఒక పరికరం ముందు నిలబడితే.. తక్కువ వ్యవధిలోనే వారి కళ్లు, చర్మ రంగు, ముఖ కవళికలు & ఇతర దృశ్య సూచనలను ఆధారంగా తీసుకుని అవసరమైన ప్రాథమిక ఆరోగ్య సమాచారం ప్రదర్శిస్తుంది. ఆ తర్వాత AI సిస్టమ్.. ఈ డేటాను పరిశీలించి ఒక ప్రాథమిక ఆరోగ్య నివేదికను సిద్ధం చేస్తుంది.ఏఐ డాక్టర్.. అద్దం ముందే ఆరోగ్య పరీక్ష!'జియో ఆరోగ్య ఏఐ' అనేది ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కోసం రూపొందించిన ఏఐ క్లినిక్ మోడల్.దీనిని దేశంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏఐ సాంకేతికతతో శక్తివంతం చేసి, గ్రామీణ ప్రాంతాల్లో కూడా వేగవంతమైన.. తక్కువ ఖర్చుతో కూడిన వైద్య సేవలను… pic.twitter.com/QcblqE5UUF— Sakshi (@SakshiNews) February 17, 2026రోగులు తమ సమస్యలను వాయిస్ AI డాక్టర్‌కు మాటల ద్వారా కూడా వివరించవచ్చు. ఈ వాయిస్ సిస్టమ్ అవసరమైతే మరిన్ని ప్రశ్నలు అడిగి రోగి పరిస్థితిని స్పష్టంగా అర్థం చేసుకుంటుంది. ముఖ్యంగా, ఇది అనేక భారతీయ భాషల్లో సంభాషించడం వల్ల భాషకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయి. దీని ద్వారా గ్రామీణ ప్రజలు సులభంగా తమ ఆరోగ్య సమస్యలను చెప్పుకోవచ్చు.ఏఐ డాక్టర్ రోగుల పరిస్థితిని ముందుగానే గుర్తించి.. అవసరమైతే నిపుణుల వద్దకు రిఫర్ చేస్తుంది. అయితే.. ఈ ఏఐ సిస్టం కేవలం ప్రాథమిక అంచనా మాత్రమే. డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి మందులు లేదా చికిత్స అందించదు. దీనిని డిజిటల్ కనెక్టివిటీ ఉన్న ఎక్కడైనా ఏర్పాటు చేయవచ్చు. పోర్టబుల్ ఎక్స్-రేలు, పోర్టబుల్ ఈసీజీలు వంటి పరికరాలను కూడా ఈ వ్యవస్థతో అనుసంధానం చేయవచ్చు. ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. -
ఏఐ ఇంపాక్ట్ సదస్సు.. బిల్‌గేట్స్‌కు నో ఎంట్రీ?
ఢిల్లీ: ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ‘కీ స్పీకర్స్’ జాబితా నుంచి గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ పేరును కేంద్రం తొలగించినట్లు సమాచారం. బాధితుల పక్షాన నిలబడేందుకే బిల్ గేట్స్‌కు నో ఎంట్రీ అంటూ కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఎప్స్టీన్ ఫైల్స్‌లో బిల్ గేట్స్‌పై ఆరోపణల నేపథ్యంలో ఆహ్వానంపై కేంద్ర ప్రభుత్వం పునస్:సమీక్ష జరిపినట్లు సమాచారం. బిల్ గేట్స్ వివాహేతర సంబంధాలకు ఎప్స్టీన్ సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి.డ్రగ్స్, చిన్నారులు, వివాహితులపై లైంగిక సంబంధాలు పెట్టుకున్నారని బిల్‌గేట్స్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, బిల్‌గేట్స్‌పై ఏఐ ఇంపాక్ట్ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతుంది. ఎక్స్‌లో ప్రముఖ జర్నలిస్ట్ సుహాసిని హైదర్ పలు సందేహాలు లెవనెత్తారు. మరోవైపు, ఎప్స్టీన్ ఫైల్స్ వివాదంలో చిక్కుకున్న బిల్ గేట్స్‌కు బిల్ గేట్స్‌కు చంద్రబాబు, లోకేష్, పవన్‌కల్యాణ్ ఎదురెళ్లి స్వాగతం పలకడం ప్రజల నుంచి ఆగ్రహ వ్యక్తమవుతుంది.ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించిన బిల్‌గేట్స్‌పై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కూటమి పాలకుల తీరుపై కూడా నెటిజన్లు పంచ్‌లు వేస్తున్నారు. చిన్నారులను లైంగికంగా వాడుకున్నారన్న కేసులో దోషిగా ఎప్స్టీన్ ఉన్నారు. రష్యన్ గర్ల్సతో బిల్‌గేట్స్ లైంగిక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు నేపథ్యంలో బిల్‌గేట్స్‌కు మిలిండా గేట్స్ విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. బిల్‌గేట్స్ తన పొడ్రక్ట్స్కు భారత్ ల్యాబ్‌గా వాడుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.ఇదీ చదవండి: ట్రెండింగ్‌లో బిల్‌గేట్స్ క్విట్ ఇండియా హ్యాష్టాగ్లైంగిక నేరాల కేసులో దోషిగా తేలిన లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్ కుంభకోణానికి సంబంధించిన తాజా ఫైల్స్‌లో అనేక ప్రముఖుల పేర్లు ఉండటం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఎప్స్టీన్ ఫైల్స్ పేరుతో 2,000 వీడియోలు, 1,80,000 చిత్రాలతో సహా 30 లక్షలకు పైగా పేజీల పత్రాలను ఆమెరికా న్యాయ శాఖ విడుదల చేసింది. బిల్ గేట్స్‌పై సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. -
ఏఐతో నిజంగా ఉద్యోగాలు పోతాయా?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచాన్ని శాసిస్తున్న తరుణంలో అది మానవ ఉపాధిని ఏ మేరకు ప్రభావితం చేస్తుందనే అంశంపై ప్రముఖ టెక్ దిగ్గజం, జోహో వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏఐ వల్ల వైట్ కాలర్ ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయన్న ఆందోళనల నడుమ, ఈ సాంకేతికతను అర్థం చేసుకునే ప్రక్రియలో తాను ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ లూయిస్ గరికానో సామాజిక మాధ్యమాల్లో చేసిన ఒక విశ్లేషణాత్మక పోస్ట్‌పై స్పందిస్తూ వెంబు తన అభిప్రాయాలను పంచుకున్నారు.ఆటోమేషన్ అంటే ఉద్యోగం పోవడం కాదుఒక ఉద్యోగంలోని కొన్ని పనులను ఆటోమేట్ చేయడం అంటే, ఆ మొత్తం ఉద్యోగాన్ని ఏఐ భర్తీ చేస్తుందని అర్థం కాదని ప్రొఫెసర్ గరికానో తన పోస్ట్‌లో పేర్కొన్నారు. చాలా ఉద్యోగాల్లో సంక్లిష్టమైన మానవ తీర్పు (హ్యుమన్ జడ్జ్మెంట్), సామాజిక అవగాహన అవసరమని, వీటిని ఏఐ భర్తీ చేయలేదన్నారు. సాఫ్ట్వేర్ ఎప్పటికీ ఆ బాధ్యతను తీసుకోలేదని, సంస్థలు మనుషుల అధికారంపైనే ఆధారపడతాయని స్పష్టం చేశారు.శ్రీధర్ వెంబు ‘లెర్నింగ్ ఫ్రేమ్‌వర్క్’మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త టెక్నాలజీని ఎలా అర్థం చేసుకోవాలో వివరిస్తూ శ్రీధర్ వెంబు ఒక ఫ్రేమ్‌వర్క్‌ను ప్రతిపాదించారు. ‘ముందస్తు అంచనాలకు వెళ్లకుండా అన్ని రకాల వాదనలను (సానుకూల, ప్రతికూల) వినాలి. ప్రారంభంలో కొన్ని అభిప్రాయాలను ఏర్పరచుకోవాలి. అయితే కొత్త ఆధారాలు లభించినప్పుడు ఆ అభిప్రాయాలను వెంటనే సవరించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. కాలక్రమేణా అభిప్రాయాలు బలమైన నమ్మకాలుగా మారాలి. కానీ, ఆ నమ్మకంలోకి అహం (ఈగో) చేరకూడదు. అహం కొత్త విషయాలను నేర్చుకోనివ్వదు. కొత్త సాంకేతికతకు సంబంధించి కేవలం నమ్మకం ఉంటే సరిపోదు, దానిపై స్పష్టమైన వైఖరి ఉండాలి’ అన్నారు.‘ఏఐ మా కంపెనీని, ఉద్యోగాలను ఎలా ప్రభావితం చేస్తుందనే విషయంలో నేను ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాను. దీనిపై కచ్చితమైన నిర్ణయానికి రావడానికి ఇంకా సమయం పడుతుంది’ అని శ్రీధర్ వెంబు అన్నారు.The quoted post makes a strong argument that white collar jobs won't go away anytime soon due to AI.In rapidly changing times like this, here is a framework I use:1. Keep an open mind and absorb every kind of information (like the quoted post and the ones that argue the… https://t.co/P0UOemLiXe— Sridhar Vembu (@svembu) February 16, 2026సాంకేతికత పరిష్కరించలేని సమస్యలులండన్లో గృహ నిర్మాణ రంగంలోని సమస్యలను ఉదహరిస్తూ కేవలం ఏఐ డాక్యుమెంటేషన్‌ను సిద్ధం చేయగలదు కానీ, రాజకీయ వ్యవస్థను ఒప్పించడం లేదా సామాజిక వివాదాలను పరిష్కరించడం వంటి పనులు చేయలేదని గరికానో పేర్కొన్నారు. ఈ వాదనతో వెంబు ఏకీభవిస్తూ.. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి కామాండ్స్ రూపొందించే ముందు ఎంతో జాగ్రత్త అవసరమని సూచించారు. మొత్తానికి ఏఐ అనేది ఒక శక్తివంతమైన సాధనం అయినప్పటికీ మానవ మేధస్సు, సామాజిక నైపుణ్యాలు, జవాబుదారీతనం అవసరమైన వైట్ కాలర్ ఉద్యోగాలకు తక్షణమే వచ్చే ముప్పేమీ లేదని ఈ టెక్ నిపుణుల విశ్లేషణ సారాంశం.ఇదీ చదవండి: రష్యా డాలర్లలో వ్యాపారం? భారత్‌పై ప్రభావం.. -
అందరికీ ఏఐ ఫలాలు: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ నేటికి(మంగళవారం) రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా ‘కృత్రిమ మేధ (ఏఐ)ప్రయోజనాలు ప్రతి పౌరుడికీ అందాలన్నదే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమని అన్నారు. తెలివితేటలు, హేతుబద్ధత, నిర్ణయాత్మక సామర్థ్యం మొదలైనవాటిని ఏఐ సామాన్యులకు చేరువయ్యేలా చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ‘గ్లోబల్ సౌత్’లో జరుగుతున్న మొట్టమొదటి అంతర్జాతీయ స్థాయి ఏఐ సదస్సుగా ఇది చరిత్ర సృష్టిస్తోందని ప్రధాని పేర్కొన్నారు.ఈ ప్రతిష్టాత్మక సదస్సులో పాల్గొనేందుకు 20కి పైగా దేశాల అధినేతలు, 60 మంది మంత్రులు, 500 మందికి పైగా ఏఐ నిపుణులు ఢిల్లీకి చేరుకున్నారు. ఎస్టోనియా అధ్యక్షుడు అలార్ కారిస్ ఇప్పటికే ఢిల్లీ చేరుకోగా, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ దంపతులు కూడా ఈ సదస్సులో భాగస్వామ్యం కానున్నారు. అమెరికా-భారత్ వాణిజ్య మండలి (యూఎస్ఐబీసీ) ఒక ప్రకటనలో ఈ సదస్సు ఇరు దేశాల ఆర్థిక బంధాలను బలోపేతం చేసే కీలక వేదికగా అభివర్ణించింది. बुद्धिमत्ता, तर्कशीलता और निर्णय-क्षमता विज्ञान और टेक्नोलॉजी को जन-जन के लिए उपयोगी बनाती हैं। India AI Impact Summit का उद्देश्य भी यही है कि कैसे एआई का इस्तेमाल सर्वजन के हित में हो।शुश्रूषा श्रवणं चैव ग्रहणं धारणां तथा।ऊहापोहोऽर्थविज्ञानं तत्त्वज्ञानं च धीगुणाः॥ pic.twitter.com/qytLZxv1uh— Narendra Modi (@narendramodi) February 17, 2026సదస్సు రెండో రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో చోటు చేసుకునే కలిగే సామాజిక మార్పులపై చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలపై ఏఐ ప్రభావం, ప్రజారోగ్యం, పిల్లల భద్రత తదితర అంశాలపై ఐక్యరాజ్యసమితి ప్రతినిధి అమన్‌దీప్ సింగ్ గిల్, నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ వంటి ప్రముఖులు ప్రసంగించనున్నారు. అలాగే, విద్యా రంగంలో ఏఐ వినియోగంపై కేంద్ర విద్యాశాఖ ప్రత్యేక రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేస్తోంది. సదస్సుతో పాటు నిర్వహిస్తున్న భారీ ప్రదర్శనలో 600కు పైగా స్టార్టప్‌లు తమ సాంకేతికతను ప్రదర్శిస్తున్నాయి. ఈ ప్రదర్శనను సందర్శించేందుకు సుమారు 2.5 లక్షల మంది సందర్శకులు వస్తారనే అంచనాలున్నాయి.ఇది కూడా చదవండి: ‘తప్పులేదు.. దాచలేదు..’ అదే పాటలో ట్రంప్ -
టీసీఎస్‌తో ఏఎండీ బంధం బలోపేతం
అమెరికన్ దిగ్గజం ఎన్విడియాకి భారత మార్కెట్లో దీటుగా పోటీనిచ్చేందుకు ఐటీ దిగ్గజం టీసీఎస్, అడ్వాన్స్డ్ మైక్రో డివైజెస్ (ఏఎండీ) తమ భాగస్వామ్యాన్ని మరింతగా విస్తరించాయి. టీసీఎస్ అనుబంధ సంస్థ హైపర్‌వాల్ట్ ఏఐ డేటా సెంటర్ లిమిటెడ్‌తో కలిసి అమెరికన్ సంస్థ ఏఎండీ తమ హీలియోస్ ప్లాట్‌ఫాం ఆధారంగా పెద్ద కంపెనీలకు అవసరమయ్యే ‘ర్యాక్–స్కేల్ ఏఐ’ మౌలిక సదుపాయాలను డిజైన్ చేయనుంది. పనితీరును మరింత మెరుగుపర్చుకునేందుకు, ఎంటర్ప్రైజ్ ఏఐని అమలు చేసేందుకు పట్టే సమయాన్ని తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుంది.సోమవారం న్యూఢిల్లీలో ప్రారంభమైన ఏఐ ఇంపాక్ట్ సమిట్ సందర్భంగా కంపెనీలు దీన్ని ప్రకటించాయి. భాగస్వామ్యం ప్రకారం ఏఎండీ తమ ఫుల్–స్టాక్ ఏఐ కంప్యూట్ ప్లాట్‌ఫాంను, టీసీఎస్ తమ డేటా సెంటర్ ఇంజినీరింగ్, ఇంటిగ్రేషన్ సామర్థ్యాలను ఉపయోగించనున్నాయి. లార్జ్ ల్యాంగ్వేజ్ మోడల్స్, ఏఐ శిక్షణ మొదలైన వాటి కోసం కంపెనీలు, ప్రభుత్వాలు కంప్యూట్ సామర్థ్యాన్ని పెంచుకుంటున్న నేపథ్యంలో ఏఐ మౌలిక సదుపాయాల సెగ్మెంట్లో ఏఎండీ నేరుగా జీపీయూల తయారీ దిగ్గజం ఎన్విడియాతో పోటీపడనుంది.ఇదీ చదవండి: నకిలీ రెజ్యూమెతో కంపెనీకి కుచ్చుటోపీ -
జియో ఏఐ పెవిలియన్ సందర్శించిన మోదీ
ఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 (India AI Impact Summit 2026) అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ జియో ఇంటెలిజెన్స్ పెవిలియన్‌ను సందర్శించారు. ఇక్కడ జియో ఏఐ స్టాక్, జియో సంస్కృతి ఏఐ, జియో ఆరోగ్యం ఏఐ, జియో శిక్షా, జియో ఏఐ హోమ్ వంటి వివిధ ఏఐ మోడల్స్ వీక్షించారు.జియో ఏఐ మోడల్స్ అన్నీ కూడా ఎంటర్ప్రైజ్ ఇంటెలిజెన్స్‌ను నడిపించడానికి, భారతీయ భాషలు & సాంస్కృతిక కంటెంట్‌ను ప్రోత్సహించడానికి, ఆరోగ్య సంరక్షణ డెలివరీని మెరుగుపరచడానికి, విద్యా వ్యవస్థలను బలోపేతం చేయడానికి & ఏఐ బేస్డ్ స్మార్ట్ లివింగ్‌ను ప్రారంభించడానికి ప్రత్యేకంగా రూపొందించారు.ఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 (India AI Impact Summit 2026) అట్టహాసంగా ప్రారంభమైంది.ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ జియో ఇంటెలిజెన్స్ పెవిలియన్‌ను సందర్శించారు.ఇక్కడ జియో ఏఐ స్టాక్, జియో సంస్కృతి ఏఐ, జియో ఆరోగ్యం ఏఐ, జియో శిక్షా, జియో ఏఐ హోమ్ వంటి వివిధ ఏఐ… pic.twitter.com/oDzwTW4SUg— Sakshi (@SakshiNews) February 16, 2026ఏఐ ఎకోసిస్టమ్ & వివిధ రంగాల్లో డిజిటల్ మార్పును వేగవంతం చేయడంలో ఏఐ పాత్ర గురించి జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాష్ అంబానీ.. ప్రధాని నరేంద్ర మోదీకి వివరించారు. సంస్థ 'ఏఐ ఫర్ ఆల్' (అందరికి ఏఐ) అనే దృక్పథాన్ని ప్రతిపాదిస్తూ, ఆధునిక సాంకేతికతలను అందరికీ చేరువయ్యేలా చూస్తోందని అన్నారు. -
డేంజర్లో ఉద్యోగాలు!.. 2026లో ఇదే జరుగుతుందా?
పోటీ ప్రపంచంలో చదివి ఉద్యోగం తెచ్చుకోవడం ఒక సాహసం అయితే.. ఉన్న జాబ్ ఎప్పుడు ఊడిపోతుందో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఓరాకిల్, గూగుల్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థలు సైతం.. ఖర్చులను తగ్గించుకోవడానికి, పునర్వ్యవస్థీకరణ పేరుతో లెక్కకు మించిన ఉద్యోగులను తొలగించేస్తున్నాయి. ఇప్పుడు దీనికి ఏఐ కూడా తోడైంది. దీంతో టెక్ రంగంలో తీవ్రమైన అలజడి మొదలైపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉద్యోగులను భర్తీ చేస్తుందని కొందరు చెబుతుంటే.. ఏఐ వల్ల కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని ఇంకొందరు చెబుతున్నారు. ఈ సమయంలో బాబా వంగా అంచనాలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతున్నాయి.బాల్కన్ ప్రాంతపు నోస్ట్రడామస్ అని పిలువబడే బాబా వంగా.. అంధురాలైనప్పటికీ, భవిష్యత్తును ముందుగానే చూడగల శక్తి తనకు ఉందని అనేక మంది విశ్వసించారు. రెండో ప్రపంచ యుద్ధం, సెప్టెంబర్ దాడులు, హిందూ మహాసముద్రం సునామీ వంటి కొన్ని ప్రధాన సంఘటనలు.. ఆమె అంచనాలకు సరిపోలినట్టు కొందరు భావించారు. ఈ కారణంగానే ఈమె పేరుకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.బాబా వంగా 1996లో మరణించినప్పటికీ.. ఆమె అంచనాలు ఇప్పటికీ చర్చకు దారి తీస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఆమె చేసిన ఒక టెక్ ప్రపంచానికి సంబంధించిన విషయం వైరల్ అయింది.2026 సంవత్సరం AI రంగంలో ఒక కీలక మలుపు అవుతుందని, అది మన రోజువారీ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతూ మానవ నియంత్రణకు మించి వెళ్లే అవకాశం ఉందని బాబా వంగ చెప్పినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.ఇదీ చదవండి: మరో ఐదేళ్లలో ఆ ఉద్యోగాలన్నీ మాయం!ప్రస్తుతం ఏఐ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. మెషీన్ లెర్నింగ్, ఆటోమేషన్, చాట్‌బాట్స్, ఆటోమాటిక్ వాహనాలు వంటి సాంకేతికతలు ప్రజల జీవితాలను సులభతరం చేస్తున్నాయి. అయితే.. ఇవన్నీ ఉద్యోగాలపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. AI మనుషులను భర్తీ చేస్తుందా? లేక మానవులకు తోడ్పడే సాధనంగా మారుతుందా? అనే ప్రశ్నలు ప్రజలలో ఆందోళన కలిగిస్తున్నాయి.బాబా వంగా అంచనాలు పక్కన పెడితే.. ప్రస్తుత పరిస్థితులు కూడా ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనే చెబుతున్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త & వెంచర్ క్యాపిటలిస్ట్ 'వినోద్ ఖోస్లా' కూడా ఏఐ కారణంగా.. మరో ఐదేళ్లలో వైట్ కాలర్ ఉద్యోగాలలో భారీ మార్పులు చోటు చేసుకుంటాయని, ముఖ్యంగా ఐటీ సర్వీస్, బీపీఓ రంగాలు దాదాపు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడవచ్చని హెచ్చరించారు. -
మరో ఐదేళ్లలో ఆ ఉద్యోగాలన్నీ మాయం!
ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్ రంగంలోని ఉద్యోగుల్లో తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది. కొన్ని స్టార్టప్స్.. టెక్ కంపెనీలతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుని కొత్త ఏఐ టూల్స్ లాంచ్ చేస్తున్నాయి. ఇవి మానవ ప్రమేయం లేకుండా పనులను వేగంగా చేసేస్తున్నాయి. కాబట్టి చాలా సంస్థలు ఏఐలో పెట్టుబడులు పెడుతూ.. తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. ఈ సమయంలో ప్రముఖ పారిశ్రామికవేత్త & వెంచర్ క్యాపిటలిస్ట్ 'వినోద్ ఖోస్లా' ఏఐ భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.ఖోస్లా అభిప్రాయం ప్రకారం.. AI అభివృద్ధి వేగంగా జరుగుతున్నందున వైట్ కాలర్ ఉద్యోగాలలో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐటీ సర్వీస్, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ (BPO) రంగాలు వచ్చే ఐదు సంవత్సరాలలో దాదాపు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడవచ్చని అన్నారు.ప్రస్తుతం ఏఐ సాధనాలు సాధారణ డిజిటల్ సహాయకుల స్థాయి నుంచి స్వయం నియంత్రిత కలిగిన AI వర్కర్స్ స్థాయికి ఎదుగుతున్నాయి. ఇవి అనేక పనుల్లో మానవులను సైతం మించిపోయే అవకాశం ఉందని ఖోస్లా వెల్లడించారు. అకౌంట్స్, లా, మెడిసిన్స్, చిప్ డిజైన్ వంటి రంగాల్లో.. ఏఐ పురోగతి చాలా వేగంగా ఉంటుందని హెచ్చరించారు.ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్లో అడుగుపెట్టి వ్యాపార విధానాలను మార్చివేశాయి. మానవ మేధస్సుపై ప్రత్యక్ష ప్రభావం చూపించలేకపోయాయి. కానీ ఏఐ మనిషి ఆలోచనా శక్తిని అనుకరిస్తూ.. చాలా పనులను వేగంగా చేస్తోంది. కాబట్టి ఇది సాధారణ సాంకేతిక పరివర్తన కాదు, ఒక తరం మొత్తాన్ని ప్రభావితం చేసే విప్లవాత్మక మార్పు అని ఆయన అభివర్ణించారు.ఏఐ కంపెనీ వీడిన సేఫ్టీ హెడ్ఆంథ్రోపిక్ కంపెనీలో సేఫ్‌గార్డ్ రీసెర్చ్ టీమ్‌కు నాయకత్వం వహించిన మృణాంక్ శర్మ రాజీనామా చేశారు. ఆయన ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడిస్తూ.. ప్రపంచం ప్రమాదంలో ఉందని చెబుతూ.. దీనికి కారణం కేవలం ఏఐ లేదా బయో వెపన్స్ మాత్రమే కాదు. ఒకదానితో ఒకటి ముడిపడిన అనేక సంక్షోభాల వల్ల ప్రమాదంలో ఉందని పేర్కొన్నారు. అయితే ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయికి మన జ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అప్పుడే మనం ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోగలం అని పేర్కొన్నారు. లేకుంటే.. తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. -
ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 (ఫోటోలు)
-
ప్రపంచంలోనే తొలి AI మహాశివరాత్రి, 5వేలకు పైగా శైవభక్తిగీతాలు
సాక్షి, హైదరాబాద్ : ఆధ్యాత్మికత,సాంకేతికతల సమన్వయానికి నిదర్శనంగా సూపర్ ఏఐ అకాడమీ (SUPER AI Academy) మహాశివరాత్రి 2026ని ప్రపంచంలోనే తొలి AI మహాశివరాత్రిని నిర్వహించింది . ఈ సందర్బంగా ‘డిజిటల్ నాద యజ్ఞం” ద్వారా 50 నిమిషాల్లో 5,700కు పైగా తెలుగు శివ భక్తి గీతాలను రూపొందించడం విశేషంగా నిలిచింది. కేవలం 50 నిమిషాల్లో 5,700కు పైగా తెలుగు శివ భక్తి గీతాలలో 108 గీతాలను ప్రత్యేక ప్రసారం చేసింది.Zoom వెబినార్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఈ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒకే సమయంలో శివతత్వాన్ని ఆధారంగా చేసుకుని గీతాలను సృష్టించారు. క్రమబద్ధమైన సాహిత్య రూపకల్పన కోసం ChatGPT Custom GPT వినియోగించగా, సంగీత నిర్మాణానికి AI ఆధారిత సంగీత సాధనాలను ఉపయోగించారు. అలాగే దీన్ని వాణిజ్య కార్యక్రమంలా కాకుండా పరమశివునికి సమర్పించిన సమూహ భక్తి నాదార్పణగా భావించామని నిర్వాహకులు ప్రకటించారు. “డిజిటల్ నాద యజ్ఞం”కార్యక్రమంలో శివుని విభిన్న రూపాలైన శివ, రుద్ర, నటరాజ, అర్ధనారీశ్వర, లింగ రూపాలు, శివ తాండవం వంటి ఉత్సాహభరిత భావాలతో కూడిన గీతాలను సృష్టించారు. భాషా, సాంస్కృతిక భక్తి పట్ల ఉన్న నిబద్ధతకు ప్రతిబింబంగా అన్ని గీతాలు తెలుగులోనే ఉండటం విశేషం. వీటిని సమయపాలన, సమన్వయంతో రియల్‌టైమ్ ట్రాకింగ్ వంటి పద్ధతులతో కార్యక్రమం సజావుగా నిర్వహించామన్నారు.ఈ కార్యక్రమం Impact Foundation సహకారంతో, District Governor 320H గంపా నాగేశ్వర్ రావు నాయకత్వంలో Impact International ట్రెజరర్ గంపా ఆదిత్య భారత్ సహకారం అందించారు. SUPER AI Academy కోర్ టీమ్ సభ్యులు దాసా అఖిల్, అక్షయ్ కుమార్, సుమంత్, శ్రీధర్ స్వామి, జయ శ్రీ తదితరులు పాల్గొనేవారి సమన్వయం మరియు సాంకేతిక నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.ఆధ్యాత్మిక, సాంస్కృతిక సందర్భాల్లో కృత్రిమ మేధస్సును సృజనాత్మకంగా వినియోగించడం సులభమనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరించినట్లు సూపర్ ఏఐ అకాడెమీ వ్యవస్థాపకులు Nikeelu Gunda తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పాల్గొనేవారికి నమోదు, సమాచారం అందించేందుకు AIMahashivaratri. com అనే ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా ఏర్పాటు చేశారు.ప్రాంతీయ భాషల్లో AI అవగాహన పెంపొందించి, సృజనాత్మకత, ఉపాధి, సాంస్కృతిక పరిరక్షణకు సాంకేతికతను సాధనంగా మార్చడమే తమ ప్రధాన ధ్యేయమని, గ్రామీణ , ప్రాంతీయ భాషా వర్గాల వరకు కృత్రిమ మేధస్సు విద్యను చేర్చాలని తమ లక్ష్యమని సూపర్ ఏఐ అకాడమీ ప్రకటించింది. -
ఏఐ భయాలు నిజమే.. కానీ..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో వస్తున్న మార్పుల వల్ల ప్రస్తుతం భారతీయ సాఫ్ట్వేర్ రంగం సందిగ్ధంలో ఉంది. ఏఐ కారణంగా సాఫ్ట్వేర్ అభివృద్ధిలో ఆటోమేషన్ పెరుగుతుందనే భయాలు ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ, ‘వయానాయి’(Vianai) వ్యవస్థాపకులు విశాల్ సిక్కా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మానవ ఆధారిత సాఫ్ట్వేర్ అభివృద్ధి పనుల్లో ఏఐ అంతరాయం నిజమైనదేనని అయితే దాన్ని ఎదుర్కొనే సత్తా భారతీయ మేధోశక్తికి ఉందని ఆయన స్పష్టం చేశారు.మార్కెట్ పతనానికి కారణం ఏఐ భయంగత వారం రోజులుగా భారత ఐటీ స్టాక్స్ తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఫిబ్రవరి నెలలోనే ఐటీ ఇండెక్స్ దాదాపు 15% పతనం కావడం గమనార్హం. గత వారంలోనే టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు దాదాపు 9 శాతం మేర నష్టపోయాయి. సాఫ్ట్వేర్ బడ్జెట్ల్లో ఏఐ ఏజెంట్లు అధిక వాటాను కలిగి ఉన్నాయని, తద్వారా సాంప్రదాయ ఐటీ సేవల బిజినెస్ మోడల్ దెబ్బతింటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.వేగమే అసలు సవాలుఓ ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడిన విశాల్ సిక్కా.. ప్రస్తుత పరిస్థితులపై విశ్లేషించారు. ‘సాఫ్ట్వేర్ అభివృద్ధిలో మానవ ఆధారిత పనులకు అంతరాయం కలగడం ఖాయం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అయితే, ఈ మార్పు పరిశ్రమలన్నింటికీ వ్యాపించడానికి సమయం పడుతుంది’ అన్నారు. సిక్కా అభిప్రాయం ప్రకారం, గతంలో భారత ఐటీ రంగం మొబైల్ కంప్యూటింగ్, క్లౌడ్ సర్వీసెస్ వంటి అనేక మార్పులను తట్టుకుని నిలబడింది. కానీ, ఈసారి ఇది వేగంగా మార్పు చెందుతుందన్నారు. మన మెదడు ఇంత వేగవంతమైన మార్పులను అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేకపోవడమే అసలు సమస్య అని ఆయన పేర్కొన్నారు.అపరిమిత అవకాశాలుభారత ఐటీ రంగంలో పనిచేస్తున్న సుమారు 17 లక్షల మంది ఉద్యోగుల సమష్టి సామర్థ్యం అనంతమని సిక్కా కొనియాడారు. కంపెనీలు ట్రెండ్‌కు తగినట్టుగా కొత్త సాంకేతికతను అలవరుచుకుని నూతన ఆవిష్కరణలు చేయాలన్నారు. ఏఐ వల్ల కలిగే అంతరాయాన్ని ఒక ‘టెయిల్ విండ్’ (సానుకూల శక్తి)గా మార్చుకున్న కంపెనీలే ఈ పోటీలో విజేతలుగా నిలుస్తాయని చెప్పారు.ఇదీ చదవండి: ఈ-రూపీ ఆధారిత రేషన్ పంపిణీ ప్రారంభం -
శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ ముందడుగు: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: భారత్ ఆతిథ్యమిస్తున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ దేశ యువతలోని ప్రతిభను, నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటిచెబుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సదస్సులో ప్రపంచ దేశాలన్నీ భాగస్వాములు కావాలంటూ సోమవారం ఆయన పిలుపునిచ్చారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో భారత్ ఎంత వేగంగా పురోగమిస్తోందో చెప్పడానికి ఈ సదస్సే నిదర్శనమని, ఈ రంగంలో దేశం సాధిస్తున్న వృద్ధిని ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు.‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు భారత్‌కు రావడం మనందరికీ గర్వకారణం. ఇది మన దేశ యువత శక్తిసామర్థ్యాలను ప్రతిబింబిస్తోంది’ అని ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ అగ్రగామిగా ఎదుగుతూ, ప్రపంచ అభివృద్ధిలో తనదైన ముద్ర వేస్తోందనడానికి ఈ సందర్భమే ఒక గొప్ప నిదర్శనమని ఆయన కొనియాడారు. यह हमारे लिए अत्यंत गर्व की बात है कि India AI Impact Summit के लिए दुनियाभर से लोग भारत आ रहे हैं। इससे हमारे देश के युवाओं के सामर्थ्य का भी पता चलता है। यह अवसर इस बात का भी प्रमाण है कि हमारा देश विज्ञान और टेक्नोलॉजी के क्षेत्र में तेजी से प्रगति कर रहा है और वैश्विक विकास… pic.twitter.com/7gxXJEtpOz— Narendra Modi (@narendramodi) February 16, 2026న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఫిబ్రవరి 16 నుండి 19 వరకు ఈ సదస్సు జరగనుంది. ప్రధాని మోదీ దీనిని ప్రారంభించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సులో సుమారు 600 స్టార్టప్‌లు, వివిధ సంస్థలు పాల్గొంటున్నాయి. ఆస్ట్రేలియా, జపాన్, రష్యా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాంwestడ్, సెర్బియా, ఎస్టోనియా, తజికిస్తాన్, ఆఫ్రికా తదితర 13 దేశాలు ఈ ప్రదర్శనలో తమ ప్రత్యేక పెవిలియన్లను ఏర్పాటు చేయడం విశేషం.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ప్రపంచ దేశాల నేతలు తమ అభిప్రాయాలను పంచుకునేందుకు ఇది ఒక వేదికగా నిలవనుంది. సుమారు 300 పైగా ఎగ్జిబిషన్ పెవిలియన్లు, 500 పైగా సెషన్లు నిర్వహించనుండగా, దాదాపు 2.5 లక్షల మంది సందర్శకులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా, యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తదితర ప్రపంచ నేతలు ఈ సదస్సులో పాల్గొంటున్నారు.ఇది కూడా చదవండి: ‘SIR’ విధుల్లో అక్రమాలు.. ఏడుగురిపై ఈసీ వేటు! -
హీరో నిఖిల్ కౌంటర్ ఎవరికి? ఎందుకీ కామెంట్స్
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో 'ఏఐ' అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. తమ చిత్రాల్లో ఎలాంటి సీన్లు.. ఈ టెక్నాలజీ ఉపయోగించి రూపొందించాలేదని హీరోలు దర్శకనిర్మాతలు చెప్పుకొంటున్నారు. కష్టపడి విజువల్ ఎఫెక్ట్స్ చేయించామని అంటున్నారు. ఇక్కడివరకు బాగానే ఉంది. యువహీరో నిఖిల్ మాత్రం ఏఐ గురించి చెబుతూనే మరో మూవీ గురించి కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది.(ఇదీ చదవండి: ఓటీటీ రివ్యూ: గుండె లోతుల్లో నిలిచిపోయే మలయాళ సినిమా)నిఖిల్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'స్వయంభు'. నాలుగు రోజుల క్రితం టీజర్ రిలీజ్ చేశారు. ఏమంత గొప్ప రెస్పాన్స్ అయితే రాలేదు. కంటెంట్ పర్లేదు అన్నప్పటికీ ఎక్కువమంది 'బాహుబలి'తో పోల్చి చూస్తున్నారు. హీరోహీరోయిన్ పాత్రలు అలానే ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. అలానే టీజర్ క్వాలిటీపైనా కొన్ని విమర్శలు వచ్చాయి. దీంతో హెచ్డీఆర్ క్వాలిటీతో ఇప్పుడు మరోసారి టీజర్ అప్లోడ్ చేశారు. ఇదే విషయాన్ని ట్విటర్లో చెప్పిన నిఖిల్.. రీసెంట్గా వచ్చిన ఓ సినిమాలా మా దానిలో ఎలాంటి ఏఐ ఉపయోగించలేదు అని అన్నాడు.మరి నిఖిల్ ఏ సినిమా గురించి అన్నాడా? అనేది ఇక్కడ ప్రశ్నగా మారింది. సరిగ్గా నిఖిల్ ట్వీట్ చేసే సమయానికి 'నాగబంధనం' మూవీ టీజర్ రిలీజైంది. మరి ఈ చిత్రంపైనే నిఖిల్ కౌంటర్ వేశాడా అనిపిస్తోంది. ఎందుకంటే రెండు కూడా విజువల్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యమున్న సినిమాలే. ఈ వేసవిలోనే థియేటర్లలోకి వస్తున్నట్లు ప్రకటించుకున్నారు. ఈ క్రమంలోనే నిఖిల్.. కావాలనే నెగిటివ్ అర్థం వచ్చేలా ట్వీట్ చేశాడా అనిపిస్తుంది. బహుశా ఇదో రకం పబ్లిసిటీ టెక్నిక్ కావొచ్చేమో? చూడాలి మరి దీని గురించి నిఖిల్ ఏమని క్లారిటీ ఇస్తాడో?(ఇదీ చదవండి: థియేటర్లలో రిలీజైన 6 రోజులకే ఓటీటీలోకి తెలుగు సినిమా) -
రూ .300 లకు కొన్న 2 అక్షరాలు.. ఇప్పుడు రూ .634 కోట్లు
అక్షరాలకు అదృష్టం వరించడమంటే ఇదోనేమో. మూడు దశాబ్దాల క్రితం కేవలం రూ.300కి కొనుగోలు చేసిన ఏఐ.కామ్ (AI.com) అనే రెండు అక్షరాల డొమైన్ నేమ్ నేడు సుమారు రూ.634 కోట్ల విలువైన డిజిటల్ ఆస్తిగా మారింది. కృత్రిమ మేధస్సు (AI) విప్లవం సాధారణ వందల రూపాయల పెట్టుబడిని వందల కోట్ల మహా సంపదగా ఎలా మార్చగలదో ఈ స్టోరీ తెలియజేస్తోంది.1993లో అర్సయాన్ ఇస్మాయిల్ అనే ఎంటర్ప్రెన్యూర్ ఈ డొమైన్‌ను సుమారు రూ.300కి రిజిస్టర్ చేశారు. ఆ సమయంలో ఇంటర్నెట్ ప్రారంభ దశలో ఉండగా, కృత్రిమ మేధస్సు ప్రధానంగా విద్యా పరిశోధనలకే పరిమితమైంది. రెండు అక్షరాల డొమైన్ పేర్లకు అప్పట్లో పెద్దగా వాణిజ్య విలువ లేకపోవడంతో, AI.com సంవత్సరాల పాటు నిశ్శబ్దంగానే ఉంది.ఏఐ బూమ్‌తో పెరిగిన విలువగత కొన్నేళ్లలో జనరేటివ్ AI, మెషిన్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌లు, వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిన AI సాధనాల పెరుగుదలతో “AI” అనే పదానికి అపారమైన ప్రాధాన్యం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా శోధించే టెక్నాలజీ పదాల్లో ఇది ఒకటిగా మారింది. దీంతో చిన్నగా, సులభంగా గుర్తుపట్టే డొమైన్ పేర్లు పరిమిత డిజిటల్ ఆస్తులుగా మారాయి. AI.com కూడా ఈ ట్రెండ్‌తో క్రమంగా భారీ విలువను సంపాదించింది.రూ.634 కోట్ల డీల్2025 నాటికి AI.com అమ్మకం సుమారు రూ.634 కోట్లకు పూర్తయింది. దీన్ని కొనుగోలు చేసిన వ్యక్తి క్రిస్ మర్స్జలెక్ (Kris Marszalek). ఆయన ఈ డొమైన్‌ను కేవలం పెట్టుబడిగా కాకుండా వినియోగదారుల కోసం కృత్రిమ మేధస్సు ఆధారిత ప్లాట్‌ఫారమ్‌గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. డొమైన్ పేర్లు ఇప్పుడు కేవలం వెబ్ చిరునామాలు కాదు.. అవి వ్యూహాత్మక డిజిటల్ ఆస్తులు. రెండు అక్షరాల డొమైన్లను అత్యంత అరుదైనవిగా పరిగణిస్తారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాలతో అనుసంధానమైతే, అవి తక్షణ బ్రాండ్ గుర్తింపు, విశ్వసనీయతను అందిస్తాయి. ఏఐ రంగంలో స్టార్టప్‌లు, పెద్ద సంస్థలు పోటీ పడుతున్న నేపథ్యంలో, సరళమైన, ప్రభావవంతమైన వెబ్ చిరునామాల యాజమాన్యం ఇప్పుడు దీర్ఘకాలిక బ్రాండింగ్ వ్యూహంగా మారింది. -
ఫేక్లొద్దు.. రాబర్ట్ కియోసాకి హెచ్చరిక!
ప్రఖ్యాత ఆర్థిక రచయిత, వ్యాపారవేత్త రాబర్ట్ కియోసాకి తన పేరుతో సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న ఏఐ ఆధారిత నకిలీ (డీప్‌ఫేక్) వీడియోల గురించి హెచ్చరించారు. ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత అయిన కియోసాకి, తాను గతంలో “రియల్ ఎస్టేట్ గైస్ సెమినార్ అట్ సీ” టీ-షర్ట్ ధరించిన విషయం నిజమేనని తెలిపారు. అయితే యూట్యూబ్‌లో ప్రస్తుతం కనిపిస్తున్న, అదే టీ-షర్ట్ ధరించి ఉన్నట్లు చూపిస్తున్న కొన్ని వీడియోలు ఏఐ ద్వారా సృష్టించిన నకిలీవని స్పష్టం చేశారు. ఆ వీడియోల్లో ఉన్న సందేశాలు కూడా అసత్యమని ఆయన పేర్కొన్నారు.“టీ-షర్ట్ నిజమే, సెమినార్ కూడా నిజమే. కానీ వీడియోలు, సందేశాలు ఏఐతో సృష్టించిన నకిలీలు” అని కియోసాకి (Robert Kiyosaki) సోషల్ మీడియాలో వెల్లడించారు. డీప్‌ఫేక్ సాంకేతికత కృత్రిమ మేధస్సు (AI)ను ఉపయోగించి నిజమైన వ్యక్తి మాట్లాడుతున్నట్లుగా కనిపించే నకిలీ వీడియోలను రూపొందిస్తుంది. ఇటీవలి కాలంలో ఈ సాంకేతికతను ఉపయోగించి ప్రముఖుల పేరుతో మోసపూరిత పెట్టుబడి ప్రకటనలు రూపొందించే ఘటనలు పెరుగుతున్నాయి. ఈ తరహా నకిలీ వీడియోలు రూపొందిస్తున్న వారిపై కియోసాకి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి పనులకంటే సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని సూచించారు.అదేవిధంగా, ఈ సందర్భాన్ని ఉపయోగించి ఆయన తన ఆర్థిక దృక్పథాన్ని మరోసారి ప్రస్తావించారు. ప్రభుత్వ ఫియాట్ కరెన్సీని “నకిలీ డబ్బు”గా పేర్కొంటూ, బంగారం, వెండి, రియల్ ఎస్టేట్, బిట్‌కాయిన్, ఈథిరియం వంటి “నిజమైన ఆస్తుల్లో” పెట్టుబడి పెట్టాలని ఆయన సూచించారు.ఏఐ సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, నిజమైన సమాచారాన్ని నకిలీ కంటెంట్ నుండి వేరు చేయడం సాధారణ ప్రజలకు కష్టతరమవుతోంది. అందువల్ల పెట్టుబడులకు సంబంధించిన వీడియోలు లేదా ప్రకటనలను అధికారిక వనరుల ద్వారా ధ్రువీకరించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.FYI: if you see YouTube videos with me wearing a Real Estate Guys Seminar at Sea T-shirt on….the T - shirt is real and so is the seminar.The problem is the videos are AI Fakes. So are the messages.Why someone waste their time doing fake AI videos is beyond me.To those…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 11, 2026 -
ఐటీ కంపెనీలను వణికిస్తున్న ఆ ‘పేరు’ మాదే..
అమెరికా ఆధారిత ఏఐ సంస్థ ‘ఆంథ్రోపిక్’ భారత విస్తరణ ప్రణాళికలు చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. అదే పేరుతో పనిచేస్తున్న భారతీయ సంస్థ ‘ఆంథ్రోపిక్ సాఫ్ట్వేర్’.. తమ బ్రాండ్‌కు గందరగోళం కలుగుతోందని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ కేసు భారత కోర్టులో పెండింగ్‌లో ఉండటం వల్ల, దేశంలో ఆంథ్రోపిక్ వ్యూహాత్మక ప్రణాళికలు క్లిష్టతరం అయ్యే అవకాశముంది.అమెరికా ఆంథ్రోపిక్ Vs ఇండియా ఆంథ్రోపిక్టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం.. ఆంథ్రోపిక్ సాఫ్ట్వేర్ గత నెలలో కర్ణాటక వాణిజ్య కోర్టులో ఫిర్యాదు దాఖలు చేసింది. 2017 నుంచే తమ సంస్థ "ఆంథ్రోపిక్" పేరును ఉపయోగిస్తోందని, అమెరికా సంస్థ భారత మార్కెట్లో ప్రవేశించడం వల్ల వినియోగదారుల్లో గందరగోళం ఏర్పడుతోందని కంపెనీ పేర్కొంది.స్థానిక సంస్థ తన ముందస్తు వినియోగాన్ని అధికారికంగా గుర్తించాలని, అలాగే మరింత గందరగోళం నివారించేందుకు తగిన ఉపశమనం ఇవ్వాలని కోరుతోంది. అదనంగా, రూ.1 కోటి నష్టపరిహారం కూడా డిమాండ్ చేసినట్లు సమాచారం.భారతీయ సంస్థ వాదన ఏమిటంటే..ఆంథ్రోపిక్ సాఫ్ట్వేర్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ మొహమ్మద్ అయ్యాజ్ ముల్లా టెక్ క్రంచ్‌తో మాట్లాడుతూ, ఈ ఫిర్యాదు వెనుక ఉద్దేశం ఘర్షణ కాదని, తమ ముందస్తు వినియోగానికి అధికారిక గుర్తింపు పొందడమేనని తెలిపారు. గుర్తింపు లభించకపోతే, చట్టపరమైన పోరాటాన్ని కొనసాగించవచ్చని ఆయన స్పష్టం చేశారు.భారతీయ సంస్థ తమ వెబ్సైట్లో “ఆంథ్రోపిక్ సాఫ్ట్వేర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (అప్లికేషన్ పెండింగ్) ట్రేడ్‌మార్క్” అని పేర్కొంది. ట్రేడ్‌మార్క్ నమోదు ఇంకా పెండింగ్‌లో ఉన్నందున, ఇది నేరుగా ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన కేసుగా పరిగణించబడకపోవచ్చు. అయితే కోర్టు భారతీయ సంస్థకు అనుకూలంగా తీర్పు ఇస్తే, అమెరికా సంస్థ భారతదేశంలో తన పేరును మార్చాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశముంది.ఇదీ చదవండి: పేరు మార్చుకున్న ప్రముఖ ఐటీ కంపెనీకేసు ప్రస్తుత స్థితిజనవరి 20న కోర్టు ఆంథ్రోపిక్ ఇండియాకు సమన్లు జారీ చేసింది. అయితే ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు. అంటే, సంస్థ తన కార్యకలాపాలను తక్షణం నిలిపివేయాల్సిన అవసరం లేదు. తదుపరి విచారణ ఫిబ్రవరి 16న జరగనుంది.ఇదిలా ఉండగా, ఆంథ్రోపిక్ ఏఐ భద్రతా విభాగాధిపతి మృణక్ శర్మ రాజీనామా చేశారు. ఇలీవల ‘ఎక్స్’ (ట్విట్టర్)లో తన రాజీనామాను ప్రకటించారు. తాను వెంటనే కొత్త వెంచర్ ప్రారంభించడం లేదని, తదుపరి నిర్ణయం తీసుకునే ముందు స్వల్ప విరామం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. -
భవిష్యత్తులో పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇదే..
సాంకేతిక ప్రపంచంలో ప్రస్తుతం కృత్రిమ మేధ (ఏఐ) సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో ఎన్విడియా అధినేత జెన్సెన్ హువాంగ్ భవిష్యత్తు ప్రోగ్రామింగ్ గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. భవిష్యత్తులో అత్యంత శక్తివంతమైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సీ++ లేదా పైథాన్ వంటివి కాదని, అది మన ‘సహజ భాష’(ఇంగ్లీష్) అని ఆయన పేర్కొన్నారు.సాంప్రదాయకంగా కంప్యూటర్లతో సంభాషించాలంటే క్లిష్టమైన సింటాక్స్ కలిగిన కోడింగ్ భాషలు అవసరం. అయితే జనరేటివ్ ఏఐ రాకతో ఈ పరిస్థితి వేగంగా మారుతోంది. హువాంగ్ అభిప్రాయం ప్రకారం.. వినియోగదారులు క్లిష్టమైన కోడ్ రాయడానికి బదులు తమకు కావాల్సిన అంశాన్ని సాధారణ ఇంగ్లీషులో వివరిస్తే చాలు. ఏఐ వ్యవస్థలు ఆ ఆదేశాలను అర్థం చేసుకుని డిజిటల్ ఉత్పత్తులను సృష్టిస్తాయి. గతంలో కోడ్‌లోని లోపాలను మాన్యువల్‌గా టెస్టింగ్‌లో వెతకాల్సి ఉండేది. ఇప్పుడు వినియోగదారులు ఏఐ సిస్టమ్‌లతో సంభాషిస్తూ అవుట్‌పుట్‌ను సరిచేయమని ఆదేశిస్తే సరిపోతుంది. ఈ లూప్ సాఫ్ట్వేర్ అభివృద్ధిని మరింత సులభతరం చేస్తోంది.అధికారిక కోడింగ్ పరిజ్ఞానం లేని వారు కూడా తమ వ్యాపార ప్రక్రియలను ఆటోమేట్ చేసుకోవడానికి, డేటాను విశ్లేషించడానికి, కొత్త ప్రోటోటైప్లను రూపొందించడానికి ఈ మార్పు దోహదపడుతుందని చెబుతున్నారు.డెవలపర్లు, పరిశ్రమపై ప్రభావంజెన్సెన్ హువాంగ్ వ్యాఖ్యల తర్వాత, ఇకపై ప్రోగ్రామింగ్ భాషలు అదృశ్యమవుతాయా? అనే సందేహం కలగడం సహజం. కానీ వాస్తవానికి సీ++, పైథాన్ వంటి కంప్యూటర్ భాషలు ఆపరేటింగ్ సిస్టమ్స్, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కీలక పాత్ర పోషిస్తూనే ఉంటాయని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే డెవలపర్లు ఇకపై కేవలం సింటాక్స్ రాయడంపై కాకుండా సమస్యను స్పష్టంగా నిర్వచించడం, ఏఐని సమర్థవంతంగా మార్గనిర్దేశం చేయడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. తార్కిక, కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరింత కీలకం కానున్నాయి.ఇదీ చదవండి: బీహెచ్ఈఎల్లో వాటాల విక్రయానికి భారీ స్పందన -
ఉద్యోగం వద్దనుకుంటే.. గూగుల్ ఆఫర్ ఇదే..
గూగుల్ తన గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్ (GBO) ఉద్యోగుల కోసం మరోసారి స్వచ్ఛంద నిష్క్రమణ ప్యాకేజీలను (Voluntary Exit Packages - VEP) ప్రకటించింది. ఏఐ (AI) ఆధారిత భవిష్యత్తుకు పూర్తిగా కట్టుబడి ఉన్న సంస్థగా మారేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.“కొత్త సంవత్సరాన్ని మనం బలమైన స్థితిలో ప్రారంభిస్తున్నాం. 2025లో మీరు అందించిన సహకారానికి కృతజ్ఞతలు. అయితే టెక్నాలజీ రంగం వేగంగా మారుతోంది. పోటీ తీవ్రంగా ఉంది. కాబట్టి మన ఏఐ మిషన్‌కు పూర్తిగా అనుగుణంగా పనిచేసే శ్రామిక శక్తి అవసరం” అని గూగుల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ షిండ్లర్ అంతర్గత మెమోలో ఉద్యోగులకు తెలిపారు.ఏఐ-ఫస్ట్ దిశగా అడుగులుగూగుల్ ఇప్పుడు పూర్తిగా “ఏఐ-ఫస్ట్” సంస్థగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే వ్యాపార విభాగంలోని ప్రతి ఉద్యోగీ ఏఐని స్వీకరించి, ఎక్కువ ప్రభావాన్ని చూపాలని సంస్థ స్పష్టం చేసింది. “ఈ వేగానికి సరిపోలలేనివారు లేదా ముందుకు సాగడానికి సిద్ధంగా లేనివారు స్వచ్ఛందంగా నిష్క్రమించేందుకు కంపెనీ అవకాశం ఇస్తుంది” అని షిండ్లర్ పేర్కొన్నారు.ఎవరిపై ప్రభావం?ఈ స్వచ్ఛంద నిష్క్రమణ ప్యాకేజీలు ముఖ్యంగా సొల్యూషన్స్ టీమ్స్, సేల్స్ విభాగం, కార్పొరేట్ డెవలప్మెంట్, ఇతర సంబంధిత వ్యాపార విభాగాల వారికి వర్తిస్తాయి. అయితే, అమెరికాలోని పెద్ద కస్టమర్ సేల్స్ టీమ్స్, కొన్ని కస్టమర్-ఫేసింగ్ పాత్రలకు ఈ ఆఫర్ వర్తించదని స్పష్టం చేశారు. “మా వినియోగదారులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండటానికి ఈ నిర్ణయం తీసుకున్నాము” అని షిండ్లర్ తెలిపారు.ఏడాదిలో మూడోసారి.. ఇది గూగుల్ అమలు చేస్తున్న మూడో స్వచ్ఛంద నిష్క్రమణ ప్రణాళిక. గతంలో కూడా ఇలాంటి చర్యలు తీసుకుంది. 2025 జూన్‌లో ‘రిటర్న్-టు-ఆఫీస్’ విధానం కఠినతరం చేసిన సమయంలో యూఎస్ ఉద్యోగులకు ఇలాంటి ఆఫర్లు ఇచ్చింది. మళ్లీ 2025 అక్టోబర్‌లోనూ యూట్యూబ్ విభాగంలో పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ఎగ్జిట్ ప్యాకేజీలు ప్రకటించింది.వీఈపీ ప్యాకేజీలో ఏం ఉంటాయంటే..గూగుల్ వీఈపీ (Voluntary Exit Program) ప్యాకేజీని ఎంచుకుని స్వచ్ఛందంగా నిష్క్రమించే ఉద్యోగులకు సాధారణంగా వారి సర్వీస్ పీరియడ్, దా ఆధారంగా లంప్సమ్ సెవరెన్స్ పే (కొన్ని వారాలు/నెలల జీతం), ప్రోరేటెడ్ బోనస్ చెల్లింపు, ఉపయోగించని సెలవులకు నగదు, కొంతకాలం వరకు ఆరోగ్య బీమా కొనసాగింపు, ఇప్పటికే వెస్ట్ అయిన RSUs/స్టాక్‌లపై హక్కులు, అలాగే కొత్త ఉద్యోగం కోసం కెరీర్ ట్రాన్సిషన్ లేదా అవుట్‌ప్లేస్‌మెంట్ సపోర్ట్ వంటి ప్రయోజనాలు అందిస్తారు. -
ఎయిర్టెల్ సరికొత్త ఏఐ ఫ్రాడ్ అలర్ట్ ప్రారంభం
దేశంలో వేగంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, ముఖ్యంగా వన్-టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) లీకేజీల ద్వారా జరుగుతున్న బ్యాంకింగ్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. కృత్రిమ మేధ(ఏఐ) ఆధారంగా పనిచేసే అత్యాధునిక ‘ఫ్రాడ్ అలర్ట్’ ఫీచర్‌ను కంపెనీ ఆవిష్కరించింది.ఏమిటీ ఏఐ ఫ్రాడ్ అలర్ట్?సాధారణంగా డెలివరీ బాయ్స్ లేదా సర్వీస్ ఏజెంట్ల పేరుతో ఫోన్ చేసే మోసగాళ్లు వినియోగదారులను మాటల్లో పెట్టి వారి బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన ఓటీపీలను కాజేస్తుంటారు. ఇలాంటి దాడుల నుంచి కస్టమర్లను రక్షించడమే ఈ ఏఐ వ్యవస్థ ప్రధాన ఉద్దేశం.ఒక కస్టమర్ కాల్లో ఉన్నప్పుడు అవతలి వ్యక్తి బ్యాంకింగ్ ఓటీపీ కోసం ప్రయత్నిస్తున్నాడని ఏఐ గుర్తించినట్లయితే నెట్వర్క్ స్థాయిలో ఎయిర్టెల్ వెంటనే జోక్యం చేసుకుంటుంది. కాల్ సమయంలో కస్టమర్‌కు వెంటనే ‘ఫ్రాడ్ అలర్ట్’ ద్వారా హెచ్చరిక పంపుతుంది. తద్వారా కస్టమర్ అప్రమత్తమై తన సమాచారాన్ని పంచుకోకుండా జాగ్రత్త పడవచ్చు.ఈ సందర్భంగా ఎయిర్టెల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ శాశ్వత్ శర్మ మాట్లాడుతూ.. ‘ఎయిర్‌టెల్‌ను దేశంలోనే అత్యంత సురక్షితమైన నెట్‌వర్క్‌గా మార్చాలన్నదే లక్ష్యం. డిజిటల్ లావాదేవీల్లో ఓటీపీలు కీలకమే అయినప్పటికీ నేరగాళ్ల చేతికి చిక్కితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అందుకే నెట్వర్క్ స్థాయిలోనే ఈ మోసాలను అడ్డుకునే ఏఐ పరిష్కారాన్ని తీసుకొచ్చాం. ప్రయోగాత్మక పరీక్షల్లో ఇది మంచి ఫలితాలను ఇచ్చింది’ అని పేర్కొన్నారు.అందుబాటులోకి ఎప్పుడు?గత రెండేళ్లుగా స్పామ్ కాల్ హెచ్చరికలు, హానికరమైన లింక్‌లను కట్టడి చేయడం వంటి చర్యలు తీసుకుంటున్న ఎయిర్టెల్ ఇప్పుడు ఈ ఓటీపీ ప్రొటెక్షన్‌ను మరింత బలోపేతం చేసింది. ఎయిర్టెల్ ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ ప్రస్తుతం ప్రారంభ దశలో భాగంగా హరియాణా రాష్ట్రంలోని వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ సదుపాయాన్ని కేవలం ఒక ప్రాంతానికే పరిమితం చేయకుండా రాబోయే రెండు వారాల్లో దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్టెల్ కస్టమర్లందరికీ ఈ సర్వీసును విస్తరించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.ఈ రక్షణ వ్యవస్థ పూర్తిగా నెట్వర్క్ స్థాయి ఏఐ సాంకేతికతపై ఆధారపడి పనిచేస్తుంది. వినియోగదారుల మొబైల్ ఫోన్లలో ప్రత్యేకంగా ఎలాంటి యాప్‌లు ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండానే నెట్వర్క్ స్థాయిలోనే మోసపూరిత కాల్స్, ఓటీపీ లీకేజీలను గుర్తించి అడ్డుకుంటుంది.ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప ఊరట -
ఏఐ వినియోగంలో భారత్ జోరు
దేశీయంగా కృత్రిమ మేథ (ఏఐ) వినియోగం గణనీయంగా పెరుగుతోంది. ఎంటర్ప్రైజ్ విభాగంలో ఏఐ/ఎంఎల్ (మెషిన్ లెర్నిగ్) కార్యకలాపాలకు సంబంధించి అమెరికా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. క్లౌడ్ సెక్యూరిటీ సేవల దిగ్గజం జీస్కేలర్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. భారత్‌లో ఏఐ వినియోగం వేగంగా పెరుగుతున్నప్పటికీ భద్రతాపరమైన సవాళ్లు గణనీయంగా ఉంటున్నాయని రిపోర్ట్ పేర్కొంది. ఏజెంటిక్ ఏఐని ఆయుధంగా ఉపయోగించకోవడం, నవకల్పనలు–భద్రత చర్యల మధ్య అంతరం భారీగా ఉండటం మొదలైనవి ఇందులో ఉన్నాయని వివరించింది. 2025 జనవరి–డిసెంబర్ మధ్య జీస్కేలర్ జీరో ట్రస్ట్ ఎక్సే్చంజ్ ప్లాట్‌ఫాంపై నమోదైన లక్ష కోట్ల ఏఐ, మెషిన్ లెరి్నంగ్ లావాదేవీల విశ్లేషణ ఆధారంగా జీస్కేలర్ ఈ రిపోర్టును రూపొందించింది. ఫిబ్రవరి 16–20 మధ్య భారత్‌లో ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026 జరగనున్న నేపథ్యంలో ఈ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. ఎని్వడియా సీఈవో జెన్సన్ హువాంగ్, ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, ఆంథ్రోపిక్ సీఈవో డేరియో, క్వాల్కామ్ సీఈవో క్రిస్టియానో ఎమోన్ తదితర దిగ్గజాలు ఈ సదస్సులో పాల్గోనున్నారు. నివేదిక ప్రకారం..దేశీ కంపెనీలు 2025 జూన్–డిసెంబర్ మధ్య కాలంలో ఏకంగా 8,230 కోట్ల ఏఐ/ఎంఎల్ లావాదేవీలు నిర్వహించాయి. ఆసియా–పసిఫిక్ (ఏపీఏసీ) ప్రాంతంలో నమోదైన మొత్తం ఏఐ లావాదేవీల్లో ఇది 46.2 శాతం కావడం గమనార్హం. దీనితో ప్రాంతీయంగా భారత్ అగ్రస్థానంలో నిలిచింది.డిజిటల్ పరివర్తనకు ప్రభుత్వం దన్నుగా నిలవడంతో పాటు ఏఐ మౌలిక సదుపాయాలు–నైపుణ్యాల అభివృద్ధిపై ప్రభుత్వ–ప్రైవేట్ పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఏఐ సామర్థ్యాలున్న సిబ్బంది పెరుగుతుండటం, ఏఐ సేవలను వేగంగా, భారీ స్థాయిలో వినియోగంలోకి తెచ్చేందుకు వీలు కలి్పంచే క్లౌడ్–ఫస్ట్ విధానాలనేవి గతంతో పోలిస్తే భారత్ చాలా వేగంగా వృద్ధి చెందేందుకు తోడ్పడ్డాయి. దేశీయంగా ఏఐ కార్యకలాపాలకు దన్నుగా నిలుస్తున్న రంగాల్లో టెక్నాలజీ–కమ్యూనికేషన్ (3,130 కోట్ల లావాదేవీలు), తయారీ (1,570 కోట్లు), సరీ్వసులు (1,260 కోట్లు), ఫైనాన్స్–ఇన్సూరెన్స్ (1,220 కోట్ల లావాదేవీలు) ఉన్నాయి. కంపెనీల పర్యవేక్షణ సామర్థ్యాలకు మించిన వేగంతో ఎంటర్ప్రైజ్ ఏఐ వినియోగం పెరుగుతోంది. కానీ చాలా సంస్థల్లో కీలకమైన డేటా ఏ దశలో బహిర్గతమయ్యే అవకాశం ఉందో కనిపెట్టలేని భద్రతపరమైన లోపాలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం నెలకొంది. ఏఐని దేనికోసం వినియోగిస్తున్నారు, ఏ డేటాను షేర్ చేస్తున్నారనే దానిపై ఓ కన్నేసి ఉంచుతూ, లీకేజీలను కట్టడి చేసేందుకు ఎప్పటికప్పుడు తగు చర్యలను అమలు చేస్తూ ఉండాలి. మార్కెట్ డిమాండ్‌కి తగ్గట్లుగా సురక్షితమైన ఏఐ వైపు మళ్లాలంటే డేటా భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వడం చాలా అవసరం. ప్రతికూల పరిస్థితులను సృష్టించి ఎంటర్ప్రైజ్ ఏఐ సిస్టంలను పరీక్షించినప్పుడు కేవలం నిమిషాల వ్యవధిలోనే వాటి బలహీనతలు బయట పడిపోతుండటమనేది సెక్యూరిటీపరంగా నెల కొన్న రిస్క్‌లను సూచిస్తోంది.స్వతంత్రంగా ప్రణాళికలు వేసుకుని, చర్యలు కూడా తీసుకోగలిగే సామర్థ్యాలున్న ఏజెంటిక్ ఏఐ వినియోగం పెరుగుతోంది. ఈ టెక్నాలజీని ఇప్పటికే ఆయుధంగా మార్చుకుంటున్నారు. సైబర్క్రిమినల్స్, నిఘా గ్రూప్‌లు ఏఐని ఉపయోగించుకుని దాడులకు పాల్పడుతున్నాయనడానికి స్పష్టమైన ఆధారాలు తెరపైకి వస్తున్నాయి. ఏఐ ఏజెంట్లు నిఘా, చొరబాటు, విస్తృత దాడుల బాధ్యతలు తీసుకుంటున్నాయి. స్వతంత్రంగా, మెషిన్ వేగంతో, భారీ స్థాయిలో సైబర్ దాడులకు దిగుతున్నాయి. ఏఐ కేవలం ఉత్పాదకతను పెంచుకునేందుకు ఉపయోగపడే సాధనంగానే ఉండటం లేదు, నేరగాళ్లకు ఆయుధంగా కూడా మారుతోంది. డేటా చౌర్యం తీవ్ర ఆందోళనకర అంశంగా మారుతోంది. 2025లో అంతర్జాతీయంగా ఏఐ అప్లికేషన్స్‌లోకి 18,000 టెరాబైట్స్ డేటా వచ్చి చేరింది. ఇది దాదాపు 360 కోట్ల డిజిటల్ ఫొటోలకు సమానం. ఏజెంటిక్ ఏఐ చొరబడిందంటే, సంప్రదాయ రక్షణ పద్ధతులు అడ్డుకోలేవు. నిమిషాల వ్యవధిలో భారీ స్థాయిలో డేటా చౌర్యం జరిగిపోతుంది. ఈ రిస్క్‌లను ఎదుర్కొనాలంటే ఏఐని కట్టడి చేసేందుకు కంపెనీలు ఏఐనే ఆయుధంగా మార్చుకోవాలి. దాడులకు ఉపయోగపడే ఆస్కారమున్న అన్ని మార్గాలను మూసివేసేందుకు ప్రతి దశలోనూ భద్రతకు ప్రాధాన్యతనిచ్చే ఇంటెలిజెంట్ జీరో ట్రస్ట్ వ్యవస్థను వినియోగించుకోవాలి.ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల అప్డేట్స్ -
ఏఐ కంపెనీ వీడిన సేఫ్టీ హెడ్.. రాజీనామాలో హెచ్చరిక!
ప్రముఖ ఏఐ కంపెనీ ఆంథ్రోపిక్ మరోమారు వార్తల్లో నిలిచింది. కంపెనీలో సేఫ్‌గార్డ్ రీసెర్చ్ టీమ్‌కు నాయకత్వం వహించిన మృణాంక్ శర్మ రాజీనామా చేశారు. ఆయన ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించారు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.మృణాంక్ శర్మ తన పోస్టులో.. ఉపయోగించిన భాష, కవులు రిల్కే & విలియం స్టాఫర్డ్‌ల ప్రస్తావనలు, ఈ రాజీనామా వెనుక ఉన్న లోతైన కారణాలపై అనేక అనుమానాలకు తావిచ్చాయి. ప్రపంచం ప్రమాదంలో ఉందని చెబుతూ.. దీనికి కారణం కేవలం ఏఐ లేదా బయో వెపన్స్ మాత్రమే కాదు. ఒకదానితో ఒకటి ముడిపడిన అనేక సంక్షోభాల వల్ల ప్రమాదంలో ఉందని పేర్కొన్నారు. అయితే ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయికి మన జ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అప్పుడే మనం ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోగలం అని పేర్కొన్నారు. లేకుంటే.. తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.మృణాంక్ శర్మ తన రాజీనామాకు సంబంధించిన స్పష్టమైన కారణాలను నేరుగా వెల్లడించలేదు. కానీ.. నిరంతర ఒత్తిళ్ల కారణంగా తనకు అత్యంత ముఖ్యమైన విలువలను పక్కన పెట్టాల్సి వచ్చిందని చెప్పారు. ఈ ఒత్తిళ్లు కేవలం తనలోనే మాత్రమే కాకుండా, సంస్థలో కూడా కనిపించాయని, నిర్ణయాలు తీసుకునే సమయంలో విలువల కంటే ఇతర అంశాలకు ప్రాధాన్యం ఇచ్చే పరిస్థితి తరచూ ఎదురవుతుందని పేర్కొన్నారు.ఆంథ్రోపిక్ సంస్థను ప్రముఖ పరిశోధకులు హర్ష్ మెహతా, బెహ్నామ్ నెయ్షబూర్ వంటి వారు ఇప్పటికే విడిచిపెట్టారు. వీరు కొత్తదేదో ప్రారంభించేందుకు వెళుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి సేఫ్‌గార్డ్ రీసెర్చ్ టీమ్ హెడ్ మృణాంక్ శర్మ చేరారు.Today is my last day at Anthropic. I resigned.Here is the letter I shared with my colleagues, explaining my decision. pic.twitter.com/Qe4QyAFmxL— mrinank (@MrinankSharma) February 9, 2026 -
ఒక్కనైట్ హోటల్ రూ. 11 లక్షలు..?
ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్ (AI)కి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బడాబడా కార్పోరేట్ కంపెనీలతో పాటు సాధారణ ప్రజలు సైతం ఏఐని ఉపయోగిస్తున్నారు. అయితే భారత్ ఈనెలలో దీనికి సంబంధించి ఏఐ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తుంది. దీంతో దీని కున్న క్రేజ్ దృష్యా ఢిల్లీలో హోటళ్ల ధరలు ఆకాశాన్నంటాయి.సాధారణంగా న్యూఇయర్ సందర్భంగానో లేదా క్రికెట్ మ్యాచులు, సెలబ్రేటీల ఈవెంట్స్ సాధారణంగా ఇటువంటి సందర్భంలోనే హోటళ్ల ధరలు ఆకాశాన్నంటుతాయి. అది కూడా వేలల్లో లేదా రూ. లక్ష ఉంటుంది. అయితే ఫిబ్రవరి 16 నుంచి 20 వరకూ ఢిల్లీలోని భరత మండపంలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. దీనికి దేశ విదేశాల నుంచి అంతర్జాతీయ ప్రముఖులు రానున్నారు. ఇందులో పెద్ద ఆశ్చర్యమేముంది అనుకుంటున్నారా? ఏఐ సమ్మిట్ దృష్ట్యా ఆ రోజుల్లో అక్కడి ఢిల్లీలోని హోటళ్ల ధరలు మైండ్ బ్లాక్ అయ్యే విధంగా పెరిగిపోయాయి. ది ఇంపీరియల్ అనే ఫైవ్‌స్టార్ హోటల్లో బాత్హాబ్తో ఉన్న లగ్జరీ సూట్ ధర అక్షరాల రూ. 11.64 లక్షలుగా ఉంది. దీంతో కస్టమర్స్ మైండ్ బ్లాక్ అయ్యింది. లీలా మహాల్‌లోని మహారాజ సూట్ ధర రూ.7.34 లక్షలు పలికింది. అదేవిధంగా ఒబేరాయిలో రూ.5.84లక్షలు, తాజ్ ప్యాలెస్‌లో రూ.4 లక్షలుగా ఉంది. ఈ కామర్స్ వెబ్సైట్ మేక్ మైట్రిప్‌లో ధరలు ఈ విధంగా చూపించాయి దీంతో యూజర్స్ ఆ ధరలు చూసి కంగుతిన్నారు.అయితే ఏఐ సమ్మిట్ దృష్యా ఆ ప్రాంతంలోని అన్ని ఫైవ్ స్టార్ హోటళ్లలో విపరీతంగా పెరిగాయని ఇక్సిగో చీఫ్ ఎగ్జిక్యూటివ్ అలోక్ బాజ్‌పేయ్ తెలిపారు.కాగా ఫ్రాన్స్‌లో జరిగిన AI యాక్షన్ సమ్మిట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత్‌లో AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026ను నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. ఈసమ్మిట్ గ్లోబల్ సౌత్‌లో నిర్వహించబడుతున్న మొట్టమొదటి గ్లోబల్ AI సమ్మిట్. -
భారత్‌కు త్వరలో టెక్ కంపెనీ సీఈఓలు రాక
న్యూఢిల్లీ వేదికగా భారత్‌లో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సు జరగనుంది. కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో ప్రపంచ గమనాన్ని నిర్దేశించే ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు. న్యూఢిల్లీ ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో జరగనున్న ఈ ఐదు రోజుల సదస్సు గ్లోబల్ సౌత్‌లో నిర్వహిస్తున్న మొదటి అతిపెద్ద ఏఐ సదస్సుగా రికార్డు సృష్టించనుంది.దిగ్గజ కంపెనీల సారథులుఈ సదస్సులో పాల్గొనేందుకు ప్రపంచ టెక్ రంగంలోని అత్యంత ప్రభావవంతమైన నేతలు ఢిల్లీకి రాబోతున్నారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఎన్విడియా వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్, మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్, బిల్‌గేట్స్, క్వాల్కామ్ సీఈఓ క్రిస్టియానో అమోన్, గూగుల్ డీప్ మైండ్ సీఈఓ డెమిస్ హసాబిస్ వంటి ప్రముఖులు హాజరవుతున్నారు. ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ సైతం భారత్ చేరుకోనున్నారనే వార్తలొస్తున్నాయి. అధికారిక జాబితాలో తన పేరు లేకపోయినప్పటికీ ఆయన క్లోజ్డ్ డోర్ సమావేశాల్లో పాల్గొంటారని, ఫిబ్రవరి 19న ప్రత్యేక ఓపెన్ఏఐ ఈవెంట్ నిర్వహించే అవకాశం ఉందని సమాచారం.దేశీయంగా కూడా ఈ సమ్మిట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, భారతీ ఎంటర్ ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతీ మిట్టల్, ఇన్ఫోసిస్ నందన్ నీలేకని, సలీల్ పరేఖ్, హెచ్‌సీఎల్ టెక్ సీఈఓ సి.విజయకుమార్ వంటి దేశీయ పారిశ్రామిక వేత్తలు భారత ఏఐ విజన్ గురించి ప్రసంగించనున్నారు.సదస్సు ప్రత్యేకతలుప్రభుత్వం ఈ సమ్మిట్‌ను కేవలం చర్చలకే పరిమితం చేయకుండా వాస్తవ ఫలితాల సాధన దిశగా రూపొందించింది. పీపుల్ (ప్రజలు), ప్లానెట్ (భూమి), ప్రోగ్రెస్ (పురోగతి) అనే మూడు అంశాల ఆధారంగా ఈ చర్చలు జరుగుతాయి. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, సుపరిపాలన.. వంటి ఏడు కీలక రంగాల్లో ఏఐ అప్లికేషన్లను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించనున్నారు. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే 35,000కు పైగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. 100కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు, 500కు పైగా స్టార్టప్‌లు ఈ ఈవెంట్లో పాల్గొంటున్నాయి.ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల అప్డేట్స్ -
33 ఏళ్ల క్రితం సాధారణ వెబ్ అడ్రస్‌గా రిజిస్టర్.. ఇప్పుడు రూ. 600 కోట్లు!
పేరులో నేముంది అని అనుకుంటే పొరపాటు. ఒక చిన్న పదం. కేవలం రెండే రెండక్షరాలు. కానీ దాని విలువ భారత కరెన్సీలో అక్షరాల 600 కోట్లు. ఆ రెండక్షరాల పదం ఏంటి? దానిని రూ.600కోట్లకు కొనుగోలు చేయాల్సిన అవసరం ఏంటి? దాని కథా కమా మిషు ఏంటో తెలుసుకుందాం పదండి.ఇంటర్నెట్లో డొమైన్ అడ్రస్ చాలా విలువైంది. వెబ్సైట్ డొమైన ట్రెండింగ్‌లో ఉన్నా డిమాండ్ ఉండే బిజినెస్‌కు చెందినదైనా దాని ధర కోట్లు పలుకుతుంది. ఎంత ధరపెట్టైనా సరే దాన్ని కొనుగోలు చేస్తారు. అలాంటి వెబ్సైట్ డొమైన్ కళ్లు చెదిరే ధరకు అమ్ముడుపోయింది. క్రిప్టో.కామ్ వ్యవస్థాపకుడు క్రిస్ మార్జాలెక్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ డొమైన్ ఏఐ డాట్ కామ్‌ను 70మిలియన్ డాలర్లు వెచ్చించి మరీ కొనుగోలు చేశారు. అంటే భారత కరెన్సీలో అక్షరాల రూ.600కోట్లు.ఇదే అత్యధికర ధర పలికిన డొమైన్లలో తొలి స్థానంలో నిలిచింది.ఏఐ ఇండస్ట్రీలో ప్రవేశించాలనుకున్నా క్రిప్టో.కామ్ సీఈవో క్రిస్ మార్జాలెక్ సూపర్ బౌల్ సమయంలో ఏఐ.కామ్‌ను అధికారికంగా లాంచ్ చేయనున్నారు. ఈ వెబ్సైట్లో ఏఐ పర్సనల్ అసిస్టెంట్ లాంచ్ కానుంది. ఈ ఏఐ అసిస్టెంట్ పర్సనల్ మెసేజ్‌లు పంపడంతో పాటు క్రిప్టో ట్రేడింగ్,యాప్స్ మేనేజ్ చేయడంతో పాటు ఇతర కార్యకలాపాల్ని చక్కబెడుతోంది. చాట్‌జీపీటీ రాకతో టెక్నాలజీ కొంతపుంతలు తొక్కుతోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం ఎప్పటి నుంచో ఉన్నా.. చాట్‌జీపీటీ రాకతో సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చింది. దీంతో ఏఐ వినియోగం రోజురోజుకి పెరిగిపోతుంది. ప్రతిరంగంలో ఏఐ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఈ తరుణంలో ఏఐ.కామ్ డొమైన్‌ను అంత భారీ మొత్తంలో వెచ్చించారు. భవిష్యత్ మొత్తం ఏఐదేనని,అన్నీ రంగాల్లో ఏఐ పెత్తనం చెలాయిస్తుందంటున్నారు.ఇది స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ అయినప్పటికీ రానున్న 20ఏళ్లలో పెట్టుబడులు అమాంతం పెరుగుతాయని క్రిస్ చెబుతున్నారు. ఏఐతో ప్రిమీయం డొమైన్లు బ్రాండింగ్‌ను పెంచుతాయని అంటున్నారు.2016లో క్రిస్.. క్రిప్టో.కామ్‌ను ప్రారంభించారు. అప్పటికే మార్కెట్లో క్రిప్టోఫ్లాట్ఫారమ్స్ ఉన్నాయి. అయినప్పటికీ కంపెనీ వేగంగా వృద్ధి సాధించింది. ప్రస్తుతం, ఏడాదికి 1.5బిలియన్ డాలర్ల ఆదాయం వస్తోంది. మార్కెటింగ్ బ్రాండింగ్‌పై భారీ ఇన్వెస్ట్ చేసింది.2021లో స్టేడియం బ్రాండింగ్‌పై సుమారు 700 మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. ట్రంప్ మీడియాతో బిజినెస్ డీల్స్ కూడా చేసింది. ఇవన్నీ గ్లోబుల్ బ్రాండింగ్ రికగ్నైజేషన్ను పెంచాయి. ఇప్పుడు ఏఐ.కామ్ కొనుగోలుతో సరికొత్త రికార్డులు సృష్టించారు క్రిస్ మార్స్జాలెక్.ఇక క్రిస్ మార్స్జాలెక్ ఏఐ.కామ్ డొమైన్‌ను మలేషియన్ టెక్ ఎంట్రప్రెన్యూర్ అర్స్యాన్ ఇస్మాయిల్ నుంచి కొనుగోలు చేశారు. ఈ డొమైన్‌ను ఇస్మాయిల్ 1993లో 100 డాలర్లు చెల్లించి రిజిస్టర్ చేసుకున్నారు. ఆ సమయంలో ఇది సాధారణ వెబ్ అడ్రస్ మాత్రమే. కానీ కాలక్రమేణా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రాధాన్యం పెరిగిన కొద్దీ, ఈ డొమైన్ విలువ ఆకాశాన్ని తాకింది.2025 ఏప్రిల్‌లో అర్స్యాన్ ఇస్మాయిల్ ఈ డొమైన్‌ను క్రిస్ మార్జాలెక్కి విక్రయించారు. ధర? అక్షరాల 70 మిలియన్ డాలర్లు.అంటే భారత కరెన్సీలో సుమారు రూ.600 కోట్లు. ఇది ఇప్పటివరకు పబ్లిక్‌గా వెల్లడైన అత్యధిక ధర పలికిన డొమైన్ ట్రాన్సాక్షన్‌గా గుర్తింపు పొందింది.ఒకప్పుడు 100 డాలర్ల విలువైన ఈ డిజిటల్ ఆస్తి 30 ఏళ్ల తర్వాత 70 మిలియన్ డాలర్లకు అమ్ముడవడం, ఇంటర్నెట్లో డొమైన్ల ప్రాధాన్యం ఎంత పెరిగిందో చూపించే అద్భుత ఉదాహరణ. ఏఐ భవిష్యత్తు అన్నీ రంగాల్లో ఆధిపత్యం చెలాయిస్తుందని భావిస్తున్న ఈ తరుణంలో ఏఐ.కామ్‌పై వంటి ప్రీమియం డొమైన్‌ను సొంతం చేసుకోవడం ఒక వ్యూహాత్మక పెట్టుబడిగా మారింది. ఇది కేవలం ఒక వెబ్ అడ్రస్ కాదు, భవిష్యత్ టెక్నాలజీకి ప్రతీకగా నిలిచే బ్రాండింగ్ ఆస్తి. -
హోటల్లో ఒక్క రోజుకి రూ.30 లక్షలు.. ఎందుకంటే?
భారతదేశంలో కృత్రిమ మేధ (AI) రంగానికి పెరుగుతున్న అంతర్జాతీయ ప్రాధాన్యతను ప్రతిబింబిస్తూ.. ఇండియా 'ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026' న్యూఢిల్లీలో ఫిబ్రవరి 16 నుంచి జరగనుంది. నాలుగు రోజుల పాటు సాగే ఈ సదస్సు ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన నాలుగు ఏఐ సమ్మిట్లలో అతిపెద్దదిగా నిలవనుంది.ఈ సమ్మిట్‌కు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విస్తృత స్పందన లభించింది. ఇప్పటి వరకు ఈ కార్యక్రమానికి 35,000 మందికి పైగా రిజిస్టర్ చేసుకోగా.. ప్రభుత్వాలు, దేశీయ & అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థలు, యూనివర్సిటీలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు.సుమారు 100 కంటే ఎక్కువ దేశాల నుంచి ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతారని అంచనా. అంతే కాకుండా 15 నుంచి 20 మంది దేశాధినేతలు, 50 మందికి పైగా మంత్రులు, అలాగే ప్రముఖ భారతీయ మరియు అంతర్జాతీయ కంపెనీలకు చెందిన 40 మందికి పైగా సీఈఓలు ఈ సదస్సులో పాల్గొనే అవకాశం ఉంది.ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ప్రారంభం కావడానికి ముందే.. దేశ రాజధానిలో హోటళ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ముఖ్యంగా ఫిబ్రవరి 15 నుంచి 19 వరకు నగరంలోని లగ్జరీ హోటళ్ల గదుల ధరలు భారీగా పెరిగాయి. ఫిబ్రవరి 16న ఢిల్లీలోని ఇంపీరియల్ హోటల్లో ఒక రాత్రి గది ఛార్జీ.. ఒక వ్యక్తి రూ. 1,97,049 ఖర్చవుతుంది. దీనికి అదనంగా రూ. 35,469 పన్ను చెల్లించాలి. తాజ్ ప్యాలెస్‌లో, ప్రెసిడెన్షియల్ సూట్ ఒక రాత్రికి రూ. 30 లక్షలు అని సమాచారం. సాధారణ రోజుల్లో దీని ధర సుమారు రూ. 2,37,500.హయత్ రీజెన్సీ ఒక రాత్రికి దాదాపు రూ.50,000 వసూలు చేస్తుండగా, లీలా ప్యాలెస్ పన్నులతో సహా రాత్రికి రూ. 78,000 వసూలు చేస్తోంది. ది ఓబెరాయ్ హోటల్లో అయితే కొన్ని గదుల ధరలు రూ.5 లక్షల వరకు ఉండటంతో పాటు, కనీసం రెండు రాత్రులకు బుక్ చేసుకోవాలనే రూల్ కూడా ఉంది. -
ఏఐ రేసులో భారత్.. మూడేళ్లలో రూ.6 లక్షల కోట్లు!
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో ప్రపంచ దేశాల మధ్య పోటీ వేగంగా పెరుగుతున్న వేళ.. పెట్టుబడుల పరంగా భారత్ కూడా ఈ రేసులో ముందంజలోనే ఉందని వరల్డ్ ఎకనమిక్ ఫోరం వెల్లడించింది. 2010 నుంచి 2024 వరకు ఏఐలో అత్యధిక పెట్టుబడులు (జీడీపీలో శాతంగా లెక్కించినప్పుడు) పెట్టిన 11 దేశాల జాబితాలో భారత్‌కు 8వ స్థానం దక్కింది. మరోపక్క.. ఏఐ మనదేశ ఆర్థిక వ్యవస్థకు భారీ ఊతమివ్వనుందని పీడబ్ల్యూసీ ఇండియా తెలిపింది. 2035 నాటికి ఏఐ వల్ల దేశ జీడీపీలోకి సుమారు రూ.50 లక్షల కోట్లు అదనంగా చేరే అవకాశం ఉందని అంచనా వేసింది.ఇటీవల దావోస్‌లో.. ప్రముఖ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ బెయిన్ అండ్ కంపెనీతో కలిసి వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఓ శ్వేత పత్రం విడుదల చేసింది. దాని ప్రకారం.. 2010 నుంచి 2024 వరకు ఏఐలో పెట్టుబడుల పరంగా అమెరికా, సింగపూర్, దక్షిణ కొరియా, చైనా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఇదే సమయంలో.. భారత్‌లో ఏఐ పెట్టుబడులు జీడీపీలో 1.2 నుంచి 1.8 శాతం వరకు ఉన్నాయి. అమెరికాలో ఇది రికార్డు స్థాయిలో 3.4 నుంచి 5.1 శాతం, సింగపూర్‌లో 3.1 నుంచి 4.6 శాతం వరకు ఉంది.అమెరికా, చైనా దూకుడు2010–2024 మధ్య కాలంలో ఏఐ రంగంలో పెట్టుబడులు ఏడాదికి సగటున 33 శాతం చొప్పున పెరిగాయని శ్వేతపత్రం తెలిపింది. ఏఐ రంగం అత్యంత ఖరీదైనదనీ, భారీగా పెట్టుబడులు అవసరమైనప్పటికీ తక్షణ లాభాలపై స్పష్టత లేదని పేర్కొనడం విశేషం. కానీ, అమెరికా, చైనా ఈ రంగంలో భారీ పందాలు కాస్తున్నాయి. 2010 నుంచి ఇప్పటివరకు పెట్టిన మొత్తం ఏఐ పెట్టుబడుల్లో 65 శాతం ఈ రెండు దేశాలదే కావడమే అందుకు నిదర్శనం.మూడేళ్లలో రూ. 6 లక్షల కోట్లుభారత్‌లో వచ్చే మూడేళ్లలో రూ.6.14 లక్షల కోట్లకుపైగా ఏఐ పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చనున్నాయని వరల్డ్ ఎకనమిక్ ఫోరం అంచనా వేసింది. అలాగే ఏఐకి అవసరమైన అధునాతన చిప్‌లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, హార్డ్‌వేర్ రంగంలో పెట్టుబడులు ఏటా 15 నుంచి 25 శాతం వరకు పెరిగే అవకాశముందని తెలిపింది.ఆర్థిక వ్యవస్థకూ ఊతంభారత్ ఆర్థిక వ్యవస్థకు ఏఐ భారీ ఊతమివ్వనుందని పీడబ్ల్యూసీ ఇండియా అంచనా వేసింది. 2035 నాటికి ఏఐ వల్ల దేశ జీడీపీలోకి రూ.50 లక్షల కోట్లకుపైగా అదనంగా వచ్చి చేరే అవకాశం ఉందని వెల్లడించింది. వ్యవసాయం, విద్య, ఇంధనం, ఆరోగ్యం, తయారీ రంగాల్లో ఏఐ వినియోగం వేగంగా పెరిగితే ఈ వృద్ధి సాధ్యమవుతుందని పేర్కొంది. 2050 నాటికి 160 కోట్ల జనాభాకు ఆహారం అందించాలంటే వ్యవసాయ ఉత్పత్తిని 70 శాతం వరకు పెంచాల్సి ఉంటుందని, దీనికి డిజిటల్ సాంకేతికతలు, ముఖ్యంగా ఏఐ అవసరమని పేర్కొంది. అలాగే విద్య, వైద్య రంగాల్లోనూ ఏఐ కీలకపాత్ర పోషించనుందని వివరించింది. -
ఏఐతో టెక్ సర్వీసుల్లో సరికొత్త మార్పులు
న్యూఢిల్లీ: అధునాతన కృత్రిమ మేథ (ఏఐ) రాకతో దేశీ టెక్నాలజీ సరీ్వసుల రంగంలో విపత్కర పరిణామాలు ఉంటాయన్న ఆందోళనలను ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ తోసిపుచ్చింది. ఇది పరిశ్రమను సరికొత్తగా తీర్చిదిద్దుతుందని పేర్కొంది. దేశీ ఐటీ కంపెనీలు సంక్లిష్టమైన టెక్నాలజీలపై అంతర్జాతీయ సంస్థలతో కలిసి పని చేస్తుంటాయని వివరించింది.ఏఐ నుంచి సిసలైన ప్రయోజనాలు పొందాలంటే మనుషులతో కూడా సమన్వయం చేసుకోవడం కీలకంగా ఉంటుందని తెలిపింది. వారికి పరిశ్రమపైన, నిర్దిష్ట వ్యాపారాలపైన లోతైన అవగాహన అవసరమని నాస్కామ్ పేర్కొంది. ఏఐని ప్రయోగాత్మకంగా పరీక్షించడం నుంచి భారీ స్థాయిలో వినియోగంలోకి తేవడం వైపు మళ్లించడంలో టెక్నాలజీ సేవల సంస్థలు తోడ్పడతాయని వివరించింది. -
సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆలోచించాల్సిందే!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే అంశంపై దేశంలో విస్తృత చర్చ జరుగుతోంది. ఈ సమయంలో.. భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వీ. అనంత నాగేశ్వరన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.ఏఐ ఉద్యోగాలపైన ఎలాంటి ప్రభావం చూపిస్తుందో.. ఖచ్చితమైన అంచనాలు వేయడం కష్టం. అయినప్పటికీ.. దీని పురోగతి వల్ల కోడింగ్ వంటి ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని ఆయన హెచ్చరించారు. ఉద్యోగుల తొలగింపులకంటే ఎక్కువగా.. నియామకాలపై ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ మార్పు కొంతకాలంగా మొదలైందని.. శ్రీధర్ వెంబు వంటి వారు కూడా ఏఐ సాధనాలు కోడింగ్‌లో చాలా బాగా ఉపయోగపడుతున్నాయని చెప్పిన మాటలు గుర్తు చేశారు.సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసేవారు తమ భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని అనంత నాగేశ్వరన్ అన్నారు. ఏఐ ప్రభావానికి గురికాని ఉద్యోగాలు కూడా ఉన్నాయని ఆయన వెల్లడించారు.ఇందులో టూరిస్ట్ గైడ్స్, కేర్ ఎకానమీ (వృద్ధులు, పిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారి సంరక్షణ), ఆరెంజ్ ఎకానమీ (సంస్కృతి, సృజనాత్మకత, కంటెంట్ ఆధారిత రంగాలు) ఉన్నాయని పేర్కొన్నారు.ఇదీ చదవండి: భారత్ - అమెరికా డీల్.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన!రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ పూనమ్ గుప్తా మాట్లాడుతూ.. ఏఐ మొత్తం ఉద్యోగాలపై సానుకూల ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నారు. కొన్ని ఉద్యోగాలు నశించినా, కొత్త అవకాశాలు కూడా ఏర్పడతాయని అన్నారు. ముఖ్యమైన సవాలు ఏమిటంటే.. ఈ మార్పును సక్రమంగా నిర్వహిస్తూ.. యువత సిద్ధంగా ఉండాలని తెలిపారు.#NDTVProfitConclave2026 | V. Anantha Nageswaran, Chief Economic Adviser to @TamannaInamdar on AI and its impact Co-presented by: @NSEIndiaCo-powered by: @LICIndiaForever & @apollotyres Special Partners: @Niva_Bupa, APIS & Adani AirportsEnergy Partner: @kpgroupgujarat NBFC… pic.twitter.com/2LBMuPNI54— NDTV (@ndtv) February 7, 2026 -
భయంకరమైన భవిష్యత్తు! రానున్నది ‘ఆకలి రాజ్యం’మేనా?
వైట్ కాలర్ ఉద్యోగాలకు గడ్డుకాలం మొదలైందా? రానున్నది ‘ఆకలి రాజ్యం’మేనా? విజృంభిస్తున్న ‘ఏఐ(AI) మహమ్మారి’ మానవ ఉద్యోగాలను మింగేస్తోందన్న భయాలు నిజమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఐటీ దిగ్గజాలను సైతం వణికిస్తున్న ‘ఆంథ్రోపిక్’ సీఈవో డారియో అమోడేయి చేసిన తాజా హెచ్చరికలు ఉద్యోగ మార్కెట్ భవిష్యత్తుపై భయాన్ని రేకెత్తిస్తున్నాయి.ఉద్యోగ అవకాశాల్లో తీవ్ర పతనంఅమోడేయి వ్యాఖ్యల తర్వాత విడుదలైన యూఎస్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ తాజా గణాంకాలు ఆయన అంచనాలకు అనూహ్యంగా సరిపోలడం ఆందోళనలను మరింత పెంచుతున్నాయి. తాజా లేబర్ డేటా ప్రకారం.. గత డిసెంబర్ ఆఖరు నాటికి అమెరికాలో ఉద్యోగ ఖాళీలు 65.4 లక్షలకు పడిపోయాయి. 2020 సెప్టెంబర్ తర్వాత ఇదే అత్యల్ప స్థాయి కావడం గమనార్హం.ఏఐ వల్ల భారీ ఉద్యోగ నష్టంజనవరి చివరలో అమోడేయి “ది అడోలెసెన్స్ ఆఫ్ టెక్నాలజీ” అనే పేరుతో సుమారు 20,000 పదాల సుదీర్ఘ వ్యాసాన్ని ప్రచురించారు. అందులో ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు ఇవీ..“రాబోయే 1–5 సంవత్సరాల్లో ఏఐ వల్ల ఎంట్రీ-లెవల్ వైట్ కాలర్ ఉద్యోగాల్లో 50 శాతం వరకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. అంతేకాదు, 1–2 సంవత్సరాల్లో మనుషుల కంటే ఎక్కువ సామర్థ్యం గల ఏఐ కూడా సాధ్యమే”2021లో ఆంథ్రోపిక్‌ను సహ-వ్యవస్థాపకుడిగా స్థాపించిన అమోడేయి, ఏఐ అభివృద్ధి వేగం కారణంగా లేబర్ మార్కెట్లో ‘అసాధారణ, బాధాకరమైన షాక్’ తప్పదని హెచ్చరించారు.“ఏఐ పురోగతి వేగం గతంలో వచ్చిన ఇతర సాంకేతిక విప్లవాల కన్నా వేగంగా ఉంది. ఉద్యోగం చేసే విధానం మారడమే కాదు, కొత్త ఉద్యోగాలకు మారాల్సిన అవసరం కూడా ప్రజలకు తీవ్ర సవాల్‌గా మారుతుంది”ఏఐ ఏదో ఒక్క ఉద్యోగాన్ని భర్తీ చేయడం కాదు.. ‘మానవ కార్మిక శక్తికే ప్రత్యామ్నాయం’గా మారుతోంది’ అని ఆయన స్పష్టం చేశారు. న్యాయ శాఖ, ఫైనాన్స్, కన్సల్టింగ్ వంటి రంగాలు కూడా దీని ప్రభావానికి లోనవుతాయని హెచ్చరించారు.తరువాత ఎన్బీసీ న్యూస్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలోనూ, ఉద్యోగ మార్కెట్‌పై ఏఐ ప్రభావం తీవ్రంగానే ఉంటుందని ఆయన తన అభిప్రాయాన్ని పునరుద్ఘాటించారు.నియామకాలు కనిష్టానికి.. తొగింపులు గరిష్టానికి..ఈ వారం విడుదలైన తాజా డేటా, కోవిడ్-19 మహమ్మారి తర్వాత ఉద్యోగ మార్కెట్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభాన్ని సూచిస్తోంది. 2025 డిసెంబర్ చివరి నాటికి ఉద్యోగ ఖాళీలు మళ్లీ 65.4 లక్షలకే పరిమితమయ్యాయి. అదే రోజు విడుదలైన ‘ఛాలెంజర్, గ్రే & క్రిస్మస్’ నివేదిక ప్రకారం.. జనవరిలో యూఎస్ కంపెనీలు కేవలం 5,306 నియామక ప్రణాళికలను మాత్రమే ప్రకటించారు. 2009 నుంచి డేటా సేకరణ ప్రారంభించిన తర్వాత ఇదే అత్యల్ప సంఖ్య.ఇదిలా ఉండగా, జనవరి 31తో ముగిసిన వారంలో 2.31 లక్షల మంది తాము నిరుద్యోగులుగా ఉన్నట్లు క్లెయిమ్ చేశారు. ఇది గత వారంతో పోలిస్తే 22,000 పెరుగుదల. అమెజాన్, యూపీఎస్ వంటి సంస్థలు ప్రకటించిన భారీ తొలగింపులు ఈ జనవరిని గ్రేట్ రిసెషన్ తర్వాత మళ్లీ అంత చెత్త నెలగా మార్చాయని ఛాలెంజర్ నివేదిక పేర్కొంది.నెలవారీ గణాంకాల ప్రకారం.. జనవరిలో యూఎస్ కంపెనీలు 1,08,435 ఉద్యోగ కోతలను ప్రకటించాయి. ఇది డిసెంబర్‌తో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ కాగా, 2025 జనవరితో పోలిస్తే రెండింతలకుపైగా ఉంది. ఈ తొలగింపుల్లో అమెజాన్, యూపీఎస్ సంస్థల వాటా 40 శాతం. రవాణా, టెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ, రసాయనాలు, ఆర్థిక రంగాల్లో ఈ కోతలు ఎక్కువగా నమోదయ్యాయి.ఏఐ పాత్ర ఎంతవరకు?ఏఐ కారణంగా నేరుగా 7,624 ఉద్యోగ కోతలు జరిగినట్లు నివేదిక పేర్కొంది. అయితే, “తొలగింపులపై ఏఐ ప్రభావం ఎంతవరకు ఉందో ఖచ్చితంగా చెప్పడం కష్టం” అని ‘ఛాలెంజర్, గ్రే & క్రిస్మస్’ ఛీఫ్ రెవెన్యూ ఆఫీసర్ ఆండీ ఛాలెంజర్ చెప్పారు. అయినా, చాలా సంస్థలు ఏఐ అమలుపై దృష్టి పెడుతున్నాయని, మార్కెట్ కూడా ఏఐని ప్రస్తావించే కంపెనీలను ప్రోత్సహిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
ఐటీ పెట్టుబడిదారుల్లో ఆందోళన
కృత్రిమ మేధ (ఏఐ) విభాగంలో ఆంథ్రోపిక్ సంస్థ తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పు భారత ఐటీ రంగాన్ని వణికిస్తోంది. ఆంథ్రోపిక్ తన ‘క్లాడ్ కోవర్క్’ ఏజెంట్ కోసం సరికొత్త ఆటోమేషన్ ప్లగ్ఇన్లను విడుదల చేసింది. దాంతో శ్రమ ఆధారిత సర్వీసులపై ఆధారపడిన భారత ఐటీ కంపెనీల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ పరిణామం ఫలితంగా స్టాక్ మార్కెట్లో ఇటీవల ఐటీ షేర్లు భారీగా కుప్పకూలాయి.ఐటీ రంగానికి సవాలు..ఆంథ్రోపిక్ విడుదల చేసిన కొత్త ప్లగ్ఇన్లు కేవలం సాధారణ చాటింగ్ కోసం మాత్రమే కాదు, ఒక సంస్థలోని కీలక విభాగాలను స్వయంచాలకంగా నిర్వహించేలా రూపొందించారు. వీటి ప్రభావం ప్రధానంగా కింది విభాగాలపై ఉండనుంది.లీగల్, ఫైనాన్స్: కాంట్రాక్ట్ రివ్యూ, కంప్లయన్స్ వంటి సంక్లిష్ట ప్రక్రియలను ఏఐ వేగంగా పూర్తి చేస్తుంది.కస్టమర్ సపోర్ట్: టికెట్ల వర్గీకరణ, సమాధానాలు ఇవ్వడం.. వంటి అంశాలపై మనుషుల ప్రమేయం లేకుండానే సమస్యల పరిష్కారాన్ని క్లాడ్ నిర్వహిస్తుంది.సేల్స్, మార్కెటింగ్ వ్యూహాలను రూపొందించి వాటిని సమర్థంగా అమలు చేస్తుంది.ఎంటర్ప్రైజ్ సెర్చ్: ఒక కంపెనీలోని ఈ-మెయిల్లు, క్లౌడ్ స్టోరేజ్, చాట్ డేటాను విశ్లేషించి నివేదికలు తయారు చేస్తుంది.ఇప్పటివరకు ‘సాస్’ ఆధారిత సర్వీసుల ద్వారా పై పనులను నిర్వహించేవారు. ఏదైనా సాఫ్ట్‌వేర్‌ను మన కంప్యూటర్ లేదా ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోకుండా, నేరుగా ఇంటర్నెట్ ద్వారా వాడుకోవడాన్ని సాస్ అంటారు. ఇప్పుడు చర్చల్లో ఉన్న క్లాడ్ కోవర్క్ వంటి ఏఐ సాధనాలు వస్తే భవిష్యత్తులో సాప్ వంటి ప్రత్యేక సాఫ్ట్వేర్ల అవసరం లేకుండా ఏఐతోనే పనులు చేయిస్తారని ఇన్వెస్టర్లు భయపడుతున్నారు.భారత ఐటీ రంగంపై ప్రభావం..భారత ఐటీ కంపెనీల ప్రధాన ఆదాయ వనరు ‘అవుట్సోర్సింగ్’. అంటే విదేశీ కంపెనీలకు అవసరమైన కస్టమర్ సపోర్ట్, డేటా ఎంట్రీ, సాఫ్ట్వేర్ టెస్టింగ్ వంటి పనులను తక్కువ ఖర్చుతో కూడిన మానవ వనరుల ద్వారా అందిస్తున్నారు. ఆంథ్రోపిక్ క్లాడ్ వంటి ఏఐ వ్యవస్థలు ఇప్పుడు నేరుగా ఈ పనులనే తక్కువ ఖర్చుతో, వేగంగా పూర్తి చేస్తున్నాయి.గతంలో ఏఐని ఒక కేవలం ఒక సహాయక సాధనంగా చూసిన కంపెనీలు ఇప్పుడు దాన్ని ఒక ప్రత్యామ్నాయంగా భావిస్తున్నాయి.ఏఐ వాడకం పెరిగితే క్లయింట్లు ఐటీ కంపెనీలకు ఇచ్చే ప్రాజెక్టుల విలువ తగ్గించే అవకాశం ఉంది.భారత కంపెనీలు ప్రధానంగా సర్వీసులపై దృష్టి పెట్టాయి కానీ, సొంత ఏఐ ఉత్పత్తులను తయారు చేయడంలో వెనుకబడి ఉన్నాయి.ఇదీ చదవండి: వ్యక్తిగత సంపదలో 75 శాతం విరాళం -
Stock Market: ఐటీ షేర్లు తలకిందులు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతో ఫ్లాట్‌గా ముగిశాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో పురోగతి గురించి ఆందోళనలు ఇన్వెస్టర్లను భయపెట్టడంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) స్టాక్స్ అమ్మకాల ఒత్తిడితో తలకిందులయ్యాయి. మార్కెట్ ముగింపు సమయానికి నిఫ్టీ 48.45 పాయింట్లు లేదా 0.19 శాతం లాభంతో 25,776.00 వద్ద, సెన్సెక్స్ 78.56 పాయింట్లు లేదా 0.09 శాతం లాభపడి 83,817.69 వద్ద ముగిసింది. ఏఐ స్టార్టప్ ఆంత్రోపిక్ అంతర్గత న్యాయవాదుల కోసం ఉత్పాదకత సాధనాన్ని విడుదల చేసిన తరువాత వాల్ స్ట్రీట్ సాఫ్ట్ వేర్ సంస్థల షేర్లు పడిపోవడంతో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 6 శాతం పడిపోయింది. అటువంటి ఏఐ సాధనాల అభివృద్ధి సాఫ్ట్వేర్ కంపెనీలను దెబ్బతీస్తుందని, పరిశ్రమ అంతటా లాభదాయకతను దెబ్బతీస్తుందని పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. సెన్సెక్స్ లో ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్ర, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. మరోవైపు ఎటర్నల్, ట్రెంట్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, అదానీ పోర్ట్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.63 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.27 శాతం పెరిగాయి. నిఫ్టీ ఐటీని పక్కన పెడితే నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 0.34 శాతం నష్టపోయింది. నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ వరుసగా 2.6 శాతం, 2 శాతం లాభాలతో అగ్రస్థానంలో ఉన్నాయి. -
‘భారత్-విస్తార్’తో డిజిటల్ అండ!
భారతీయ వ్యవసాయ రంగంలో సాంకేతిక విప్లవానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విడివిడిగా ఉన్న వ్యవసాయ పరిశోధనలను, డేటాను ఏకీకృతం చేస్తూ కృత్రిమ మేధ (ఏఐ) ఆధారంగా రైతులకు నేరుగా సలహాలు అందించేలా ‘భారత్-విస్తార్’ అనే సరికొత్త డిజిటల్ వ్యవస్థను రూపొందించింది. అగ్రిస్టాక్ పోర్టల్స్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐకార్) ప్యాకేజీలను ఏఐ సిస్టమ్‌లతో అనుసంధానించడం ద్వారా సాగును మరింత లాభసాటిగా మార్చడమే దీని ప్రధాన లక్ష్యం.ఏఐ టూల్ ఎందుకు?ప్రస్తుతం మన దేశంలో అనేక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, స్టార్టప్‌లు విత్తన అభివృద్ధి నుంచి సప్లై చైన్ వరకు వేర్వేరు ప్రాజెక్టులపై పనిచేస్తున్నాయి. అయితే ఈ సమాచారం అంతా ఒకే చోట లేకపోవడం వల్ల ఆశించిన ఫలితాలు అందడం లేదు. భారత్-విస్తార్ ద్వారా ఈ వనరులన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొస్తారు. అగ్రిటెక్ స్టార్టప్‌లు, పరిశోధనా సంస్థలు ఉత్పత్తి చేసే భారీ డేటాను ఏఐ విశ్లేషించి రైతులకు అర్థమయ్యేలా వివరిస్తుంది.రైతులకు చేకూరే ప్రయోజనాలుదీని ద్వారా సాధారణ సమాచారం కంటే నిర్దిష్టమైన, ధ్రువీకరించిన శాస్త్రీయ సలహాలు రైతులకు అందనున్నాయి.ఐకార్ శాస్త్రీయ పరిశోధనలను నేరుగా డిజిటల్ రికార్డులతో అనుసంధానించడం ద్వారా పొలంలోని పరిస్థితిని బట్టి సలహాలు అందుతాయి.సంక్లిష్టమైన శాస్త్రీయ డేటాను రైతులకు వారి స్థానిక భాషల్లోనే సులువుగా అర్థమయ్యేలా ఈ ఏఐ టూల్ సర్వీసులు అందిస్తుంది.కరువు, వరదలు లేదా తెగుళ్ల దాడుల గురించి అగ్రిస్టాక్ ద్వారా ముందస్తుగా హెచ్చరికలు అందుతాయి.ఇది కేవలం సమాచారానికే పరిమితం కాకుండా ప్రభుత్వ పథకాల అమలు, రుణాలు అందజేయడం, బీమా సేవలను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది.ప్రైవేట్ సంస్థలకు భాగస్వామ్యంఈ వ్యవస్థ కేవలం ప్రభుత్వానికే పరిమితం కాదు. యూనిఫైడ్ ఫార్మర్ సర్వీస్ ఇంటర్ ఫేస్ (యూఎఫ్‌ఎస్‌ఐ), ఏపీఐల ద్వారా ప్రైవేట్ కంపెనీలు, స్టార్టప్‌లు కూడా ఈ ప్లాట్‌ఫారమ్‌తో అనుసంధానం కావచ్చు. దీనివల్ల మార్కెట్ కనెక్షన్లు మెరుగుపడటమే కాకుండా రైతులకు మరిన్ని వినూత్నమైన సేవలు అందుబాటులోకి వస్తాయి.డేటా భద్రతకు ప్రాధాన్యంరైతుల డేటా విషయంలో ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చింది. డేటాపై పూర్తి హక్కు రైతుకే ఉంటుంది. ఐటీ చట్టం, ఆధార్ చట్టం ప్రకారం ఈ సమాచారం భద్రంగా ఉంటుంది. ఏదైనా ప్రైవేట్ సంస్థ రైతు డేటాను యాక్సెస్ చేయాలంటే కచ్చితంగా ఆ రైతు నుంచి ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: భారమైన బహుమతులు.. దూరమవుతున్న బంధాలు -
క్యాన్సర్ చికిత్స.. వయొలెంట్ కణంపై సైలెంట్ రణం!
ఇప్పటికే క్యాన్సర్ చికిత్సారంగంలో విప్లవాత్మకమైన మార్పులొచ్చాయి. ఇక కృత్రిమ మేధ (ఏఐ)ను కనుగొన్న తర్వాత వచ్చిన, వస్తున్న పురోగతులు చెప్పడానికీ, వినడానికీ, చదవడానికే ఆశ్చర్యం కలిగించేలా ఉంటున్నాయి. ఇది ‘సైన్స్ ఫిక్షన్ కాదు... మెడిసిన్’ అని అనుక్షణం నిరూపితమవుతోంది. ఈ ఏడాది క్యాన్సర్ డే థీమ్ ‘యునైటెడ్ బై యునీక్’! ఈ నినాదం అర్థమేమిటంటే... ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ రోగులందరికీ (యునైటెడ్‌గా) చికిత్స అందేలా చేస్తూనే... ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా... వ్యక్తిగతంగా నిర్దిష్టమైన (యూనిక్) చికిత్స అందేలా చూడటం. ఈరోజు ‘వరల్డ్ క్యాన్సర్ డే’.ఈ సందర్భంగా ఈ అంశాలన్నింటితో ప్రత్యేక కథనం...ఒక చిన్న అంశాన్ని ఊహించండి... మన దేహమంతా ఓ నగరం అనుకోండి. అప్పుడు మన ఒంట్లోని ప్రతి కణమూ ఒక ఇల్లవుతుంది. అప్పుడు మన ఇంట్లోని జన్యువు (జీన్) స్విచ్ అనుకుందాం...బాగా పనిచేసే ఆ ‘స్విచ్చు’ ఆన్ చేసినప్పుడల్లా ‘లైట్’ వెలుగుతుంది. అది నార్మల్ పెరుగుదలకు సంకేతం! ∙కొన్నిసార్లు వాటిని ఆన్ చేసినప్పుడు అలారం మోగుతుంది. అంటే రిపేర్లు అవసరమనే సూచన. ∙కొన్ని స్విచ్చులు అవసరాన్ని బట్టి పోలీస్‌ను పిలుస్తాయి. అది కణం మరణం!ఈ పోలికలతో చెప్పాలంటే... క్యాన్సర్ ఎప్పుడు పుడుతుందంటే...?⇒ కొన్ని స్విచ్చులు అలా ఆన్ అయ్యాక ‘స్ట్రక్’ అయిపోయి... ఆఫ్ కాకుండా ఇరుక్కుపోయినప్పుడు... అంటే... ఆన్ అయిన ఆ స్విచ్చు అలాగే జామ్ అయిపోతే... లైట్ అలా కంటిన్యువస్‌గా వెలుగుతూనే ఉంటుంది!... అది అప్రతిహతమైన పెరుగుదల.... ఎంతకూ ఆగకుండా పెరిగే క్యాన్సర్ పెరుగుదల! ∙అలారం మెకానిజం దెబ్బతిని అలారం మోగకుండా పోవడమంటే... కణంలో ఏదో తప్పు జరిగి... అది జరిగిందనే హెచ్చరికలు అందకుండా పోవడం. ⇒ ఇక సెల్ డెత్‌కు కారణమయ్యే పోలీస్ ఇన్స్పెక్టర్ తన పని మానేసి నిశ్శబ్దంగా ఉండిపోయినప్పుడూ... అంటే నార్మల్ కణం కాస్తా క్యాన్సర్ కణంగా మారినప్పుడు... అది మరో నార్మల్ కణానికి అడ్డంకి కాకుండా ఉండేందుకూ, పొరుగుదాన్ని దెబ్బతీయకుండా ఉండటానికి నిశ్శబ్దంగా తనంతట తానే మరణించడం జరగకపోవడం.ఇలా జీన్ అనే స్విచ్చులో ఏవైనా మార్పులు వచ్చి అది ‘జామ్’ అయిపోయిందంటే... అది క్యాన్సర్‌కు దారితీసినట్టేనని తెలుసుకోవాలి. ఇలా కణాల్లోని ‘పీ–53’ అనే ఓ ్రపోటీన్... ఈ స్విచ్చులన్నింటికీ ఓ (మాలెక్యులార్) ‘మాస్టర్ స్విచ్’గా పనిచేస్తుంది. అంటే ఇది మెయిన్‌బోర్డు దగ్గర ఉంటుంది. దీన్నే ‘గార్డియన్ ఆఫ్ జీనోమ్’ గానూ చెప్పవచ్చు. అదే అవసరాన్ని బట్టి డీఎన్ఏ రిపేర్లు జరిగేలా చూస్తుంది. అప్పటికీ పని జరగకపోతే ఆ తప్పుడు కణం తనంతట తానే చనిపోయేలా చూస్తుంది. (దీన్నే ‘్రపోగ్రామ్డ్ సెల్ డెత్’ అంటారు). అలా చేయడం ద్వారా మిగతా దేహాన్ని క్యాన్సర్ బారిన పడకుండా రక్షిస్తుంది.అంటే ఇంట్లో షార్ట్ సర్క్యుట్ అయితే... దానివల్ల ప్రమాదం జరగకుండా మెయిన్ బోర్డు దగ్గరే ఆఫ్ అయిపోయే మాస్టర్ స్విచ్‌లా పనిచేస్తుందన్నమాట. ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆవిష్కరణ తర్వాత క్యాన్సర్ చికిత్సా రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆ కొత్త ఆవిష్కరణలేమిటో... వాటితో వచ్చిన మార్పులేమిటో చూద్దాం. మొదటి ఆవిష్కరణ: ఆలిగో న్యూక్లియటైడ్ థెరపీగతంలో ఒంట్లోని ఏదైనా స్విచ్ చెడిపోయిం దంటే... డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చేది. అప్పుడు డాక్టర్‌గారు తన పరికరాల (కీమోథెరపీ) సహాయంతో ఓ ఎలక్ట్రీషియన్‌లా లేదా ఓ మేసన్ (మేస్త్రి)లా పనిచేస్తూ చెడిపోయిన స్విచ్‌ను రిపేరు చేసేవారు. ఆ క్రమంలోనే బోర్డులో మరికొన్ని స్విచ్చులూ మార్చాల్సి వచ్చేది. కానీ ఇప్పటి తాజా ఆవిష్కరణతో... కణం నుంచి అది చెడిపోయినట్లు సిగ్నల్ రాగానే పేషెంటే ఆ చెడిపోయిన కణానికి సందేశాలు పంపుతాడు. ‘‘చెడిపోయినట్లు వస్తున్న ఆ సిగ్నల్స్‌ను పరిగణనలోకి తీసుకోకు’’ ‘‘నీ సేఫ్టీ రూల్స్‌కు అనుగుణంగా చెడిపోయిన కణాన్ని రిపేర్ చేయ్యి’’ ‘‘ఇలా చేయడం ద్వారా చెడిపోయిన కణం వరకే పరిమితం అవ్వు. దేహంలోని మిగతా కణాలను చెడగొట్టకు’’... లాంటి సందేశాలను కణానికీ, కణంలోని రిపేర్లు చేసే అంశాలకు పంపడం ద్వారా...దేహంలోని మిగతా కణాలన్నీ ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. దాంతో క్యాన్సర్ మిగతా కణాలకు వ్యాపించదు. ఇప్పుడు ఇదెలా జరుగుతుందంటే... మానవ కణాల్లో ‘న్యూక్లియటైడ్స్’ అనే ఇటుకలు (బిల్డింగ్ బ్లాక్స్) ఉంటాయి. అయితే డాక్టర్లు ‘ఆలిగోన్యూక్లియటైడ్స్’ అనే కృత్రిమ ఇటుకలను తయారు చేసి... క్యాన్సర్‌తో చెడిపోయిన ఇటుకల స్థానంలో వీటిని పెట్టి ఈ రిపేర్లు జరుగుతాయి. ఇంకా మరొక పోలిక చెప్పాలంటే... మనకు ఇష్టం లేనిదీ, ఏదో అశ్లీలమైన ఎస్ఎమ్ఎస్ వచ్చిందంటే... చిరాకు పుట్టి ఫోన్‌ను విసిరికొట్టి దాన్ని ధ్వంసం చేయడం కంటే... కేవలం ఆ మెసేజ్ వరకే డిలీట్ చేయడం లాంటిదన్నమాట.రెండో ఆవిష్కరణ: కార్టి / ఎన్కే సెల్ థెరపీఅత్యంత కన్నింగ్ మోసగాడు... ఈ క్యాన్సర్ కణం! ఈ నేపథ్యంలో ‘క్యాన్సర్ కణం’ తాలూకు ఓ గుణాన్ని చూద్దాం. క్యాన్సర్ కణమనేది అత్యంత కన్నింగ్ మోసగాడిలాంటిది. వాడెంత కన్నింగ్ అంటే... ఎక్కణ్ణుంచో ఓ ‘ఆర్మీ యూనిఫామ్’ను కొట్టేసి, ఫేక్ ఐడీ కార్డునొకదాన్ని పట్టేసి... తానూ ఓ రక్షణ కణంలా కనిపించేలా మారువేషం వేసుకుని మరీ ఆరోగ్యకరమైన కణాలను ధ్వంసం చేస్తుంటాడు. అయితే ఇప్పటి సరికొత్త ఆవిష్కరణతో వచ్చిన ఈ అత్యంత నూతన, అధునాతన చికిత్స ప్రక్రియలో ఎన్కే అంటే... ‘నేచురల్ కిల్లర్’ అని అర్థం. ఇలా పిలిచే ఆర్మీ కమాండోస్ లాంటి ఈ ‘ఎన్కే సెల్స్ థెరపీ’లో ఏం జరుగుతుందో చూద్దాం. ∙గతంలోని ఆర్మీ కమేండోలు డేంజర్ సిగ్నల్స్ వచ్చేదాకా ఆగేవి. కానీ ఇప్పటి ఎన్కే సెల్స్ మాత్రం ఎవరి ఆదేశాల కోసం ఆగవు. అనుమానం వచ్చిందంటే చాలు ఆ క్యాన్సర్ సెల్‌ను అప్పటికప్పుడు ధ్వంసం చేసేస్తాయి. ∙⇒ నిశితంగా ఎంచుకుని... నిర్దిష్టంగా కేవలం చెడిపోయిన లేదా క్యాన్సర్ కణంగా మారబోతున్న కణాన్నే తుదముట్టించేస్తాయి. ∙ఇమ్యూనిటీ సెల్స్ అయిన బీ సెల్, టీ సెల్ లా తాను రక్షణ కవచాన్ని అని చెప్పే యూనిఫామ్ వేసుకోవు. సివిల్ డ్రస్‌లో ఉన్న సోల్జర్లా విరుచుకుపడి క్యాన్సర్ కణాన్ని ముట్టడించేస్తాయి. ఈ క్రమంలో అవి యూనిఫామ్ వేసుకుని మోసం చేసే క్యాన్సర్ కణం కన్నింగ్ వేషాల ట్రాప్‌లో పడిపోవు. సదరు క్యాన్సర్ కణాల కుయుక్తులనూ ముందే పసిగట్టేసి... వాటిని తుదముట్టిస్తాయి.మూడో ఆవిష్కరణ: యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్ (ఏడీసీ) «థెరపీ ఓ పొలంలో చీడ పట్టిందనుకోండి. ఆ చీడపురుగులను అంతం చేయడానికి మొత్తం పొలమంతా మందుకొట్టడం మామూలే. అలాగే ఊళ్లో ఉన్న దోమలను తుదముట్టించడానికి అత్యంత ఘాటుగానూ, ఊపిరి పీల్చుకోడానికే ఇబ్బంది పడేలా సఫకేట్ చేసేసే దోమలమందును ఊరంతా కొట్టడం సాధారణంగా జరిగేదే. తాజా ఆవిష్కరణలతో వచ్చిన చికిత్స ఎలాంటిదంటే... ఇది చాలా ఖచ్చితంగా పనిచేసే కొరియర్ బాయ్ లాంటిది. ఆ ఊళ్లో ఆ వీధి ఎక్కడుందో... ఆ వీధిలో ఆ ఇల్లు ఎక్కడుందో కనుక్కుని... బాగా ΄్యాక్ చేసి ఉన్న ఆ ‘క్యాన్సర్ మందు’ను సరిగ్గా ఆ ఇంట్లోకి డెలివరీ చేసే ఓ కొరియర్ బాయ్‌లా పనిచేస్తుంది. ఆ ఇంట్లోవాళ్లు ఆ ΄్యాక్‌ను తెరవగానే మందునంతా చిమ్మేసి క్యాన్సర్‌ను కమ్మేసి సైలెంట్‌గా చంపేస్తుంది. అలా పక్కనున్న ఇంటికి ఏమాత్రం ప్రమాదం జరగకుండా జాగ్రత్త పడుతుంది. ఈ తరహా కొత్త ఆవిష్కరణ ఫలితంగా బాధితుల్లో సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి. దాంతో మునపటి కీమోథెరపీల్లోని వేదనలూ, వెతల్లా కాకుండా చికిత్సను తేలిగ్గా తట్టుకోగలగడం సాధ్యమవుతుంది.నాలుగో ఆవిష్కరణ: కృత్రిమ మేధ + జీనోమిక్స్ఇది కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ప్లస్ జీనోమిక్స్ (జీనోమ్ చికిత్స)... ఈ రెండింటి సమన్వయంతో అందే అత్యంత అధునాతమైన సరికొత్త చికిత్స ప్రక్రియ.ఈ అంశాన్నీ తేలిగ్గా వివరించాలంటే... గతంలో నగరంలో ఎక్కడైనా అగ్నిప్రమాదం జరిగాక ఫైర్ అలారం మోగగానే ఫైర్ బ్రిగేడంతా నిప్పును ఆర్పడానికి ఉపక్రమించేవారు. ఇప్పుడు అలాకాదు.. ⇒ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓ సీసీటీవీ లా పనిచేసి... అగ్ని అంటుకునేందుకు అవకాశమున్న చోటిని పసిగట్టినట్టే... క్యాన్సర్ పుట్టే చోటిని ముందే పసిగడుతుంది. ⇒ రక్తం / జెనెటిక్ సిగ్నల్స్... నాయిస్ సెన్సర్ మాదిరిగా పనిచేసి క్యాన్సర్ పుట్టేందుకు అవకాశమున్న ప్రదేశాన్ని ముందే కనిపెట్టేస్తాయి. ∙ఇక్కడ మనుష్యులు ఆ స్వల్పాతి స్వల్పమైన అతి చిన్న తేడాను మిస్ కావచ్చేమోగానీ... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం కారణంగా ఆ అతిచిన్న తేడానూ పసిగట్టే వీలుంది.ఇది ఎక్కడ ఉపయోగపడుతుందంటే... ⇒ కుటుంబ చరిత్రలో క్యాన్సర్ ఉండి... హై–రిస్క్ ఉన్న కుటుంబాల్లో. ∙చాలాకాలం నుంచి పొగతాగే అలవాటున్న స్మోకర్లలో. ∙మహిళల్లోనే వచ్చే ఉమన్ క్యాన్సర్లను పసిగట్టే విషయంలో. ∙క్యాన్సర్ వచ్చేందుకు అవకాశమున్న జీవనశైలిని అనుసరించేవారిలో లేదా అలాంటి వాతావరణంలో పనిచేసేవారిలో.ఐదో ఆవిష్కరణ: పర్సనలైజ్డ్ థెరపీ (ప్రెసిషన్ ఆంకాలజీ) గతంలో ఎవరైనా బాధితుడిలో ఒక రకం క్యాన్సర్‌ను కనుగొన్నారంటే... ఆ రకం క్యాన్సర్ వచ్చినవారందరికీ ఇచ్చే మందును లేదా చికిత్స ప్రక్రియను అతడికి కూడా అందించేవారు. కానీ కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ – ఏఐ) సహాయంతో ఇప్పుడు అతడిలో క్యాన్సర్ కణం ప్రవర్తించే పద్ధతిని (బిహేవియరల్ మేనర్‌ను) బట్టి, అతడి జీవనశైలి ఆధారంగా, అతడి బ్లడ్ మార్కర్స్, అతడి స్కాన్లూ, అతడికే ప్రత్యేకమైన అతడిలోని ‘పీ–53’ ్రపోటీన్... అంటే... అతడి ‘మాలెక్యులార్ మాస్టర్ స్విచ్’ ఎంత బలహీనంగా ఉందీ, అది ఏ మేరకు పనిచేయడంలేదు... లాంటి అంశాలన్నీ తెలుసుకొని అతడికే ప్రత్యేకమైన, ఎంతో ప్రభావపూర్వకంగా పనిచేసేలా అతడికే వ్యక్తిగతమైన చికిత్స అందించవచ్చు. ఈ అధునిక ఆవిష్కరణలతో లాభాలివి...⇒ చాలా హాస్పిటల్స్‌లో ఇప్పటికే ఈ ప్రయోజనాలను పొందుతున్నారు. ∙తమ జీవన నాణ్యతను (క్వాలిటీ ఆఫ్ లైఫ్‌ను) మెరుగుపరచుకుంటున్నారు. ∙ఎంతో డబ్బునూ, టైమ్‌నూ ఆదాచేసుకోవడమే కాదు... గతంలో పేషెంట్లకు ఉండే ఎన్నో బాధలూ, వెతలూ, వేదనలకు దూరంగా ఉంచగలగడం సాధ్యమవుతోంది.నిర్వహణ: యాసీన్డాక్టర్ సురేశ్ ఏవీఎస్ సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్, కన్వీనర్, ఏఐ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ – మెడికల్ సైన్సెస్ -
ఒరాకిల్ నిధుల వేట.. రూ.14 లక్షల కోట్లు కావాలట!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో అగ్రగామిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న టెక్ దిగ్గజం ఒరాకిల్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఏఐ డేటా సెంటర్ల విస్తరణకు అవసరమైన భారీ నిధులను సమీకరించుకోవడానికి కంపెనీ దాదాపు 30,000 మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.నిధుల కొరతఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ టీబీ కోవెన్ పరిశోధన నివేదిక ప్రకారం.. ఒరాకిల్ తన ఏఐ మౌలిక సదుపాయాల కల్పన కోసం సుమారు 156 బిలియన్ డాలర్ల(సుమారు రూ.14 లక్షల కోట్లు) భారీ పెట్టుబడిని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ స్థాయిలో అప్పులు ఇవ్వడానికి అమెరికాలోని ప్రముఖ బ్యాంకులు వెనకడుగు వేస్తుండటం కంపెనీకి పెద్ద సవాలుగా మారింది. ఈ వ్యవహారంపై ఈక్విటీ, రుణ పెట్టుబడిదారులు అనుమానాలు వ్యక్తం చేస్తుండటంతో నిధుల కోసం కంపెనీ తన సొంత వనరులపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది.తొలగింపుల ద్వారా ఎంతంటే..ఒరాకిల్ తన కార్యకలాపాల పునరుద్ధరణలో భాగంగా 20,000 నుంచి 30,000 మంది ఉద్యోగులను తగ్గించాలని భావిస్తోంది. ఈ భారీ లేఆఫ్స్ ద్వారా కంపెనీకి సుమారు 8 బిలియన్ల డాలర్ల నుంచి 10 బిలియన్ డాలర్ల వరకు నగదు అందుబాటులోకి వస్తుందని టీవీ కోవెన్ అంచనా వేసింది. ఒకవేళ ఇదే జరిగితే ఒరాకిల్ చరిత్రలోనే ఇది అతిపెద్ద లేఆఫ్ అవుతుంది. గతంలో 2025 చివరలో కంపెనీ తన పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా 10,000 మందిని తొలగించింది. ఇటీవల అమెజాన్ కూడా తన ఏఐ వ్యూహంలో భాగంగా 16,000 మందిని తొలగించిన సంగతి తెలిసిందే.వ్యూహాత్మక మార్పులునిధుల సమీకరణ కోసం ఒరాకిల్ మరికొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. 2022లో 28.3 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన హెల్త్‌కేర్ సాఫ్ట్వేర్ యూనిట్ ‘సెర్నర్’ను విక్రయించే ఆలోచనలో కంపెనీ ఉంది. ‘బ్రింగ్ యువర్ ఓన్ చిప్’ అనే కొత్త విధానాన్ని కంపెనీ ప్రవేశపెట్టాలని భావిస్తోంది. దీని ప్రకారం కస్టమర్లే తమ సొంత హార్డ్‌వేర్‌ను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. తద్వారా ఒరాకిల్‌పై మూలధన భారం తగ్గుతుంది. మౌలిక సదుపాయాల నిర్మాణంలో నేరుగా పెట్టుబడి పెట్టాలని క్లయింట్లను ఒరాకిల్ కోరుతోంది.భారీ లక్ష్యాలుక్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సామర్థ్యాన్ని పెంచడానికి 2026 నాటికి 45 బిలియన్ డాలర్ల నుంచి 50 బిలియన్ డాలర్ల వరకు నిధులు సేకరించాలని ఒరాకిల్ లక్ష్యంగా పెట్టుకుంది. సామ్ ఆల్ట్మాన్ నేతృత్వంలోని ఓపెన్ఏఐ కోసం డేటా సెంటర్లను నిర్మించే బాధ్యతను కూడా ఒరాకిల్ గతంలో చేపట్టింది. అయితే ప్రస్తుత ఫైనాన్సింగ్ ఇబ్బందులు ఈ ప్రాజెక్టులపై ప్రభావం చూపే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: బంగారం ధరల యూటర్న్.. భారీ తగ్గుదల! -
ఏఐపై నమ్మకం కల్పించమే ప్రధానం
భారతదేశం డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) రంగంలో ప్రపంచానికి దిక్సూచిగా నిలుస్తోంది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆ వ్యవస్థపై నమ్మకాన్ని అందించే సమయం ఆసన్నమైందని ప్రముఖ ఏఐ సంస్థ థింక్360.ఏఐ వ్యవస్థాపకులు, సీఈఓ అమిత్ దాస్ పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ 2026 నేపథ్యంలో ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు.ఇండియా డిజిటల్ రంగంలో ఇప్పటికే ఆధార్, యూపీఐ, డేటా షేరింగ్ వంటి విభాగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని అమిత్ దాస్ గుర్తు చేశారు. ఇది కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అద్భుతాలు సృష్టిస్తోందని అన్నారు. డిసెంబర్ 2025లోనే యూపీఐ ద్వారా 21.6 బిలియన్ లావాదేవీలు జరగడం, వాటి విలువ సుమారు రూ.28 లక్షల కోట్లకు చేరడం భారత్ సాధించిన డిజిటల్ వృద్ధికి నిదర్శనమని చెప్పారు.ఈ విజయాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లాలంటే జాతీయ స్థాయిలో ఏఐపై నమ్మకాన్ని పెంపొందించే విధానం అవసరమని అభిప్రాయపడ్డారు. ఇది ఏఐ వ్యవస్థలను ప్రామాణీకరించడం, ఆడిట్ చేయడం, ఫలితాలను పారదర్శకంగా పర్యవేక్షించడం ద్వారా వ్యవస్థాగత ప్రమాదాలను తగ్గిస్తుందని వివరించారు.ఇదీ చదవండి: బంగారం, వెండి ధరలు క్రాష్వికసిత్ భారత్ 2047‘వికసిత భారత్ 2047’ లక్ష్యాన్ని చేరుకోవడానికి కేవలం పైలట్ ప్రాజెక్టులు సరిపోవని, ప్రభుత్వ, ఆర్థిక వ్యవస్థల మూలాల్లో డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవాలని దాస్ స్పష్టం చేశారు. నవంబర్ 2025లో డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) రూల్స్ నోటిఫై చేయడాన్ని ఆయన స్వాగతించారు. 18 నెలల అనుసరణ గడువు ఉన్న నేపథ్యంలో బడ్జెట్ 2026లో ఈ క్రింది అంశాలకు నిధులు కేటాయించాలని కోరారు.డేటా గోప్యతను కాపాడే సాంకేతికత అభివృద్ధి.పౌరుల అనుమతితో కూడిన డేటా నిర్వహణ వ్యవస్థల ఏర్పాటు.బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్) రంగంలో సంస్కరణలు. -
ఏజెంటిక్ ఏఐ నిపుణులకు డిమాండ్
దేశీయంగా ఏజెంటిక్ ఏఐ, స్పెషలైజ్డ్ జెన్ఏఐ నిపుణులకు గణనీయంగా డిమాండ్ పెరుగుతోంది. డిమాండ్–సరఫరా మధ్య 50 శాతం పైగా వ్యత్యాసం ఉండగా, ఆయా ఉద్యోగాల పోస్టింగ్‌ల ఏటా 35–40 శాతం పెరుగుతోంది. 28,000 జాబ్ పోస్టింగ్స్ ఆధారంగా క్వెస్ కార్ప్ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. రిపోర్టు ప్రకారం కంపెనీలు ప్రస్తుతం ఏజెంటిక్ ఏఐని ప్రయోగాత్మక పరీక్షలకే పరిమితం చేయకుండా, క్షేత్రస్థాయిలో వ్యాపార అవసరాలకు వినియోగించుకుంటున్నాయి. దీనితో పూర్తి స్థాయి సామర్థ్యాలున్న నిపుణులను నియమించుకోవడంపై దృష్టి పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో 2030 నాటికి భారతీయ ఏజెంటిక్ ఏఐ మార్కెట్ 3.5 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు నెలకొన్నాయి. 2024లో ఇది 276 మిలియన్ డాలర్లుగా నమోదైంది. సిస్టంలు స్వయంగా నిర్ణయాలు, చర్యలు తీసుకోగలిగే మరింత అధునాతన కృత్రిమ మేథను ఏజెంటిక్ ఏఐగా వ్యవహరిస్తున్నారు.నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు..సీనియర్ ఆర్కిటెక్చర్, సేఫ్టీ ఉద్యోగులకు జీతభత్యాలు సగటు స్థాయికంటే 20–28 శాతం అధికంగా ఉంటున్నాయి.70 –75 శాతం జీసీసీలు, భారీ కంపెనీలు అంతర్గతంగా నిర్మాణాత్మక ఏఐ శిక్షణ ప్రోగ్రాంల దన్నుతో 30–35 శాతం అడ్వాన్స్డ్ ఏఐ ఉద్యోగాలను భర్తీ చేసుకునే అవకాశం ఉంది. మొత్తం అధునాతన ఏఐ నియామకాల్లో రిమోట్ ఉద్యోగుల వాటా 15–20 శాతం ఉండనుంది.మొత్తం ఏజెంటిక్ ఏఐ హైరింగ్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల వాటా 54 శాతం స్థాయిలో ఉండనుంది.టెక్, సాస్ (సాఫ్ట్వేర్ యాజ్ ఎ సరీ్వస్) సంస్థలు తమ ఉత్పత్తుల్లో 68 శాతం ఏజెంటిక్ ఏఐని పొందుపరుస్తున్నాయి.ఏజెంటిక్ ఏఐ హైరింగ్‌లో మిడ్–సీనియర్ ప్రొఫెషనల్స్ వాటా 70 శాతం పైగా ఉంటోంది. కెరియర్ తొలినాళ్లలో ఉన్న వారి రిక్రూట్మెంట్ 20 శాతం మేర ఉంటోంది. గవర్నెన్స్, సేఫ్టీ, ప్రోడక్ట్ స్ట్రాటెజీ విభాగాల్లో లీడర్íÙప్ ఉద్యోగాలు పెరుగుతున్నాయి.72 శాతం ఉద్యోగార్హతల్లో టూల్–కాలింగ్, ఆర్కె్రస్టేషన్ మొదలైన నైపుణ్యాలు ఉంటున్నాయి. 63 శాతం ఉద్యోగాలకు రిట్రీవల్–ఆగ్మెంటెండ్ జనరేషన్ టూల్ సామర్థ్యాలు ఉండాలని కంపెనీలు అడుగుతున్నాయి. లాంగ్‌గ్రాఫ్, ఆటోజెన్, క్రూఏఐ నైపుణ్యాలకు డిమాండ్ 43 శాతం మేర పెరిగింది.మూడేళ్ల క్రితం కనిపించని చాలా మటుకు ఉద్యోగాలకు ప్రస్తుతం డిమాండ్ నెలకొంది. ఏఐ ఆర్కెస్ట్రేషన్ ఇంజినీర్లు, ఏజెంట్ బిహేవియర్ అనలిస్టులు, ఏజెంట్ సేఫ్టీ అండ్ గవర్నెన్స్ స్పెషలిస్టులు, వెక్టార్ డేటాబేస్ ఆర్కిటెక్టులు, ఏజెంట్ లైఫ్‌సైకిల్ మేనేజర్లు, ఏజెంటిక్ ఏఐ ప్రోడక్ట్ మేనేజర్లు మొదలైనవి ఇందులో ఉన్నాయి.భారత్‌లో టెక్నాలజీ నిపుణులకు సంబంధించి ఏజెంటిక్ ఏఐ అనేది కొత్త నైపుణ్యం మాత్రమే కాదు, కెరియర్‌కి దిశా నిర్దేశం చేస్తోంది. ప్రాంతాలవారీగా చూస్తే ఏజెంటిక్ ఏఐ హైరింగ్‌లో బెంగళూరు, హైదరాబాద్‌ల వాటా దాదాపు 62 శాతంగా ఉంది. గవర్నెన్స్, వినియోగం, వర్క్‌ఫ్లో నిర్వహణలకు కేంద్రాలుగా ఎన్సీఆర్, పుణె, చెన్నై ఎదుగుతున్నాయి. ప్రస్తుతం మొత్తం హైరింగ్‌లో కొచ్చి, కోయంబత్తూర్, జైపూర్, అహ్మదాబాద్‌లాంటి ద్వితీయ శ్రేణి నగరాల వాటా దాదాపు 10 శాతంగా ఉంది. -
చావును వెతుక్కుంటూ 70 కి.మి ప్రయాణించి.. చివరకు..The Nihilist Penguin సోర్టీ ఇదే
ప్రపంచం చాలా వేగంగా పరిగెడుతోంది.. డెడ్లైన్లు, బాధ్యతలు, బిల్లులు, stress… ఈ గందరగోళం మధ్య “ఇవన్నీ వదిలేసి ఎక్కడికైనా ఒంటరిగా వెళ్లిపోవాలి?” అనే భావన చాలామందిలో ఉంటుంది. ఇప్పుడు కనిపించబోయే ఈ సీన్… మీ మనసు లోతుల్లో ఉన్న భావనకి మౌనంగా సమాధానం.ఇంటర్నెట్లో ఓ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. అదే ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లే ఒక చిన్న పెంగ్విన్. దాన్ని నెటిజన్లు ప్రేమగా “ది నిహిలిస్ట్ పెంగ్విన్” అని పిలుస్తున్నారు, అంటే ఇక ఏదీ పట్టించుకోని పెంగ్విన్. ఎందుకంటే అది వెళ్లే దారిలో ఎవరూ లేరు, ఏ శబ్దం లేదు, ఏ గమ్యం కూడా లేదు.ఈ వీడియో కొత్తది కాదు. ఇది 2007లో వచ్చిన ప్రఖ్యాత జర్మన్ దర్శకుడు వెర్నర్ హెర్జోగ్ తీసిన Encounters at the End of the World అనే డాక్యుమెంటరీ నుంచి తీసుకున్న క్లిప్.డాక్యుమెంటరీ వీడియోలో డాక్టర్ డేవిడ్ ఎయిన్లే మాట్లాడుతూ.. ‘ఒక వేళ ఆ పెంగ్విన్ అక్కడి నుంచి తిరిగి కాలనీకి వచ్చేద్దామని అనుకున్నా కూడా సాధ్యపడదు. తిరిగి రావటం కూడా ‘డెత్ మార్చ్’ అవుతుంది. మార్గం మధ్యలోనే అది చనిపోయే అవకాశం ఉంది’ అని అన్నారు. ఆ డాక్యుమెంటరీ వీడియో తీసిన ఫిల్మ్ మేకర్ వెర్నర్ హెర్జోగ్ మాట్లాడుతూ...వీడియో తీసిన కొంత సేపటికే ఆ పెంగ్విన్ చనిపోయి ఉంటుంది. అది చనిపోవడానికి ముందు అంటార్కిటికా మంచు పర్వతాల్లో దాదాపు 70 కిలోమీటర్లు ఒంటరిగా నడిచింది’ అని చెప్పారు. అయితే, ఆ పెంగ్విన్ అలా అన్నిటినీ వదలి చావును వెతుక్కుంటూ వెళ్లిపోవటం వెనుక ఉన్న సరైన కారణం ఇంత వరకు తెలియరాలేదు. తన భాగస్వామి చనిపోవటం వల్ల ఆ పెంగ్విన్ డిప్రెషన్లోకి వెళ్లిపోయిందని, ఆ బాధలో డెత్ మార్చ్ చేసి ప్రాణాలు తీసుకుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఇప్పుడు ఈ క్లిప్ సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అయింది. ముఖ్యంగా దీనికి ఒక పాటను జోడించిన తర్వాత ఇది మరింత ఎమోషనల్ గా మారింది. కానీ అసలు ప్రశ్న ఇదే… ఈ పెంగ్విన్ వీడియోకి ఇంత క్రేజ్ ఎందుకు? ఎందుకంటే ఇది మనల్నే చూపిస్తోంది. ఆఫీసు కుర్చీలో కూర్చొని, ల్యాప్‌టాప్ ముందు కళ్ళు ముడుచుకుని “ఇక చాల్రా… అన్నీ వదిలేసి ఎక్కడికైనా వెళ్లిపోవాలి” అనిపించిన క్షణాల్ని ఇది గుర్తుచేస్తోంది. పెంగ్విన్ మాటలు మాట్లాడదు, కానీ దాని నడక చెబుతోంది – “నాకు శాంతి కావాలి, నాకు స్వేచ్ఛ కావాలి, నాకు కొంచెం ఒంటరితనం కావాలి.అని.ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్న ఈ పెంగ్విన్ వీడియో చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు..ఇది ఒక పెంగ్విన్ కథ కాదు, ఇది మన ఆత్మ కథ. అని కామెంట్లు పెడుతున్నారు. పెంగ్విన్ వీడియోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. ఆ పెంగ్విన్‌తో తాను కూడా నడుచుకుంటూ వెళుతున్నట్లు ఓ ఏఐ ఫొటో క్రియేట్ చేశారు. -
రిలయన్స్ జియో చొరవ.. ఏఐ ఎడ్యుకేషన్
విద్యా రంగానికి అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నైపుణ్యాలను అందించడం ద్వారా డిజిటల్ వ్యత్యాసాన్ని తగ్గించడానికి రిలయన్స్ జియో తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తృతమైన విద్యా ప్రచారాన్ని ప్రారంభించింది. ఆధునిక యుగంలో అభ్యాస & బోధనా పద్ధతులను మెరుగుపరచడానికి 'గూగుల్ జెమిని ప్రో' యొక్క ఆచరణాత్మక అప్లికేషన్‌పై ఈ చొరవ దృష్టి పెడుతుంది. అత్యాధునిక ఏఐ సాధనాలను తరగతి గదుల్లోకి తీసుకురావడం ద్వారా, సాంకేతికతతో కూడిన వృత్తిపరమైన రంగంలో రాణించగల డిజిటల్ నైపుణ్యం కలిగిన విద్యార్థులను మరియు ఉపాధ్యాయులను తయారు చేయడమే జియో లక్ష్యం.ఈ ప్రచారం ఇప్పటికే గణనీయమైన పురోగతిని సాధించి.. రెండు రాష్ట్రాల్లో 2200 కంటే ఎక్కువ పాఠశాలలకు విజయవంతంగా చేరుకుంది. జియో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల నేతృత్వంలో జరుగుతున్న ఈ ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలలో 27,000 కంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు & విద్యార్థులు పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో1500 కంటే ఎక్కువ పాఠశాలల్లో 20వేల మంది, తెలంగాణలో 700 పాఠశాలల్లో 7000 వేల మందికిపైగా ఈ శిక్షణ పొందుతున్నారు.ఈ ఇంటరాక్టివ్ వర్క్‌షాప్‌లు గూగుల్ జెమిని వ్యవస్థను పరిచయం చేయడానికి ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. పాఠ్యాంశాల నోట్స్ తయారు చేయడం, అసైన్మెంట్లు రాయడం & సంక్లిష్టమైన కోడింగ్ ప్రాజెక్ట్‌లలో సహాయం పొందడం వంటి పనులను ఈ సాంకేతికతతో ఎలా సులభతరం చేయవచ్చో ఇందులో వివరించారు. దీర్ఘకాలిక వృత్తిపరమైన వృద్ధి కోసం ప్రాజెక్ట్ ఐడియేషన్, గ్రాఫిక్ డిజైన్ మరియు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కోసం AIని ఉపయోగించడంపై కూడా ఈ శిక్షణ ప్రాధాన్యతనిస్తుంది.ఈ డిజిటల్ సాధికారత ప్రచారంలో ప్రధాన అంశం ఏమిటంటే, వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా ప్రీమియం సాంకేతికతను అందించడం. జియో తన అన్లిమిటెడ్ 5జీ సబ్స్క్రైబర్లకు రూ.35,100 విలువైన 'గూగుల్ జెమిని ప్రో ప్లాన్'ను 18 నెలల పాటు ఉచితంగా అందిస్తోంది. వినియోగదారులు నేరుగా మైజియో (MyJio) యాప్ ద్వారా యాక్టివేట్ చేసుకునే ఈ సబ్స్క్రిప్షన్, అత్యాధునిక 'జెమిని 3 ప్రో' మోడల్‌తో పాటు హై-ఎండ్ క్రియేటివ్ టూల్స్‌కు ప్రాప్యతను కల్పిస్తుంది.ఇందులో AI సహాయంతో చిత్రాలను రూపొందించే 'నానో బనానా ప్రో' (Nano Banana Pro), వీడియో జనరేషన్ కోసం 'వీయో 3.1' (Veo 3.1) వంటి సాధనాలు ఉన్నాయి. అకడమిక్ రీసెర్చ్ కోసం 'నోట్‌బుక్ ఎల్ఎమ్' (NotebookLM) మరియు డిజిటల్ డేటాను భద్రపరుచుకోవడానికి 2 TB క్లౌడ్ స్టోరేజ్ కూడా ఈ ప్లాన్‌లో భాగంగా ఉన్నాయి.యువత నైపుణ్యాభివృద్ధికి ఉన్న నిబద్ధతను మరింత ముందుకు తీసుకెళ్తూ, కంపెనీ 'జియో ఏఐ క్లాస్రూమ్' అనే ఉచిత నాలుగు వారాల ఆన్లైన్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌ను కూడా ప్రవేశపెట్టింది. విద్యార్థులు డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్ ద్వారా వారి స్వంత వేగంతో ఏఐ సాంకేతికతలపై ఆచరణాత్మక పరిజ్ఞానాన్ని పొందేలా ఈ కోర్సు రూపొందించబడింది. తెలంగాణ & ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులు Jio.com/ai-classroom పోర్టల్‌ను సందర్శించడం ద్వారా ఈ శిక్షణను పొందవచ్చు. ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో పోటీ పడటానికి అవసరమైన పునాది జ్ఞానాన్ని ఇది అందిస్తుంది, తద్వారా ప్రాంతీయ శ్రామిక శక్తి సాంకేతిక ఆవిష్కరణలలో ముందంజలో ఉండేలా జియో నిర్ధారిస్తుంది. -
ఆ ఘటన యావత్ సమాజానికి ఒక హెచ్చరిక
ఆర్టిఫిషియల్ ఇం టెలిజెన్స్ టెక్నా లజీ దుర్వి నియోగం ప్రపంచవ్యాప్తంగా పెనుముప్పుగా మారుతోంది. కేవలం సాంకేతిక ఆవిష్కరణగా భావించిన AI... మోసగాళ్ల చేతిలో ఓ ఆయుధంగా మారగా... బాధితులు... సామాన్యులకు మాత్రం ప్రాణం సంకటంగా మారుతోంది. వ్యక్తిగత రహస్యాలు... వారి గోప్య త... ఆత్మాభిమానాన్ని దెబ్బ తీసే ప్రమాదకర సాధనం గా రూపాంతరం చెందిం ది. ఈ కొత్త రకం సైబర్ నేరాలు మన దేశంలోనూ కలకలం సృ ష్టిస్తున్నా యి.ఇటీవల చోటు చేసుకుంటున్న విభిన్నమైన కేసులు AI ఆధారిత మోసాల గురించి జాగ్రత్తలు పాటించడం.. వాటి గురించి అవగాహన కలిగి ఉండటం ఎంత ముఖ్యమో తెలియజేస్తాయి.కేరళలో ఓ ప్రొఫెసర్‌కు వీడియో కాల్ వచ్చింది. సాధారణ కాల్ అని వీడియో ఆన్ చేశారు... అందమైన అమ్మాయి ప్రత్యక్షమైంది.. వీడియో ద్వారా సంభాషణ సాగిస్తూ... ఆయనను ట్రాన్స్‌లోకి తీసుకెళ్లింది. ఆయన వాస్తవాన్ని మరిచి ఊహాలోకాల్లోకి వెళ్లిపోయారు... సీన్ కట్ చేస్తే... ఆయన నగ్న వీడియోలు.. అమ్మాయితో మాట్లాడుతున్న సంభాషణ ఆయన ఫోన్‌కే వచ్చాయి. అసలు అది అమ్మాయి కాదు AI సృష్టించిన బొమ్మ అని తెలిసి... ప్రొఫెసర్ మాత్రం ఘోరంగా మోసపోయాడు. మోసగాళ్లకు రూ. 2 లక్షలు ఇచ్చిన తర్వాత వేధింపులు ఆగక పోవడంతో పోలీసులను ఆశ్రయించాడు.గతేడాది ఢిల్లీలో విద్యార్థినుల ఫొటోలను న్యూ డ్గా మార్ఫ్ చేయడం.... ఛత్తీస్‌గఢ్ ఐఐఐటీ విద్యార్థి.... 36 మం ది అమ్మాయిల ఫొటోలను మార్చి వాటిని వైరల్ చేసిన కేసు..అస్సాం లో ఇంజినీర్ ఆన్లైన్లో నకిలీ న్యూ డ్ కంటెం ట్ సృ ష్టిం చి డబ్బు సం పాదిం చిన విధానాలు చూస్తుంటే సాంకేతికతను అడ్డం పెట్టుకుని ఎలా మోసం చేస్తున్నారో గమనించవచ్చు.AI దుర్వి నియోగం ఎంతటి మానసిక క్షోభకు గురి చేస్తుందో హర్యానాలోని ఫరీదాబాద్‌లో జరిగిన ఘటన దేశాన్ని కుదిపేసింది. 19 ఏళ్ల డిగ్రీవిద్యార్థి... తన ముగ్గురు సోదరీమణులకు సంబంధించిన ఏఐ సృష్టించిన అశ్లీల ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌కు గురై.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఇలా ఒకటి రెండు ఘటనలు మాత్రమే కాదు... నిత్యం కొన్ని వందల సంఖ్యలో బాధితులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోసాల బారిన పడుతున్నారు. ఇలాంటి మోసాల నుంచి బయట పడాలంటే ప్రజలు... సమాజం సమష్టిగా కృ షి చేయాల్సిన అవసరం ఉంది. ఏఐ దుర్వినియోగం చేసిన వారిని గుర్తించి కఠిన శిక్షలు విధించాలి. ప్రజల్లో అవగాహన పెంచాల్సిన ఆవశ్యకత ఉంది. యువతలో డిజిటల్ భద్రత, ప్రైవసీ, సైబర్ నేరాలపై తప్ప నిసరిగా అవగాహన పెంచాలి.సోషల్ మీడియాలో కంటెంట్ తొలగిం పు వ్య వస్థ ఉండాలి. సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్ లు తమ వేదికలపై AI-జనరేటెడ్ అభ్యంతరకర కంటెంట్‌ను గుర్తిం చి, వెం టనే తొలగించేం దుకు బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి.బాధితులకు మద్దతుగా సహాయ కేంద్రాలు ఏర్పా టు చేయాలి. బాధితులకు మానసిక, చట్టపరమైన సహాయంఅం దిం చే కేం ద్రాలను ఏర్పా టు చేయాలి. మహిళలు ఎటువం టి భయం లేకుండాఫిర్యా దు చేసే వాతావరణాన్ని కల్పించాలి.ఫరీదాబాద్ ఘటప యావత్ సమాజానికి ఒక హెచ్చరిక లాంటిది... టెక్నా లజీ మనిషి జీవితాన్ని మెరుగుపరచాలి.... -
ఏఐ మైక్రోఫిల్మ్ హ్యాకథాన్‌లో యువ చిత్రకారుల ఉత్సాహం
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఆధారిత కథనానికి దారి చూపిస్తూ సినిక్ సంస్థ ఏర్పాటు చేసిన జెన్ ఏఐ మైక్రోఫిలిం హ్యాకథాన్‌లో యువ చిత్రకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆదివారం అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్లో నిర్వహించిన ఫిలిం హ్యాకథాన్‌లో 60 మందికి పైగా ప్రతిభావంతులైన ఫిలిం చిత్రాకారులు పాల్గొని సత్తా చాటారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు జరిగిన ఈ హ్యాకథాన్‌లో వారు ఏఐని వినియోగించి 90 సెకన్ల మైక్రో సినిమాలను రూపొందించారు. మొత్తంగా వచ్చిన మైక్రో ఫిలింలలో మూడింటిని ఉత్తమ చిత్రాలుగా గుర్తించి వారికి సినిక్ వ్యవస్థాపకుడు భరత్ గుప్తా, సహ వ్యవస్థాపకులు పద్వీ రెడ్డి దేవిరెడ్డి, ఆకాశ్ చోడే బహుమతులు అందజేశారు. -
అంధులకు చదివే అదృష్టిం!
సాక్షి, హైదరాబాద్: సాధారణ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు చదవడం మామూలు విషయమే. కానీ చూపులేని విద్యార్థులకు మాత్రం అదో పెద్ద ప్రహసనం. బ్రెయిలీ లిపిలో అందుబాటులో ఉన్న పుస్తకాలను చదవడమే వారికి వీలవుతుంది. ఒకవేళ బ్రెయిలీలో నూతన ఎడిషన్లు అందుబాటులో లేకపోయినా, పేలవమైన ఆడియో రికార్డింగ్‌లు ఉన్నా లేక ఖరీదైన సాఫ్ట్వేర్లు అవసరమైనా వారు సర్దుకుపోవాల్సి ఉంటుంది.అయితే ఈ సమస్యకు హైదరాబాద్ గచ్చి»ౌలిలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్–ఐటీ) పరిష్కారం చూపించింది. కృత్రిమ మేధ (ఏఐ), భాషా సాంకేతికతల ఆధారంగా ‘దృష్టి’పేరుతో డిజిటల్ ల్రైబరీని అభివృద్ధి చేసింది. పూర్తిగా ఉన్నత విద్యా సంబంధ పాఠ్యపుస్తకాలను బ్రెయిలీ, ఆడియోబుక్ ఫార్మాట్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎలా పనిచేస్తుందంటే..: దృష్టి లైబ్రరీలో ఉపయోగించేఆప్టికల్ క్యారెక్టర్ రికగి్నషన్ (ఓసీఆర్) వ్యవస్థ.. బొమ్మలు, డాక్యుమెంట్లు, పీడీఎఫ్ రూపంలో ఉన్న పాఠ్యాంశాలను స్కాన్ చేసి చూపులేని విద్యార్థులకు అను కూలమైన ఫార్మాట్లలో వాటిని అందిస్తుంది. అంటే వాటిని బ్రెయిలీ లిపితో కూడిన అక్షరాలుగా మారుస్తుంది. అలాగే టెక్స్ట్టు స్పీచ్ టూల్స్‌ను ఉపయోగించి ఆయా పాఠ్యాంశాలను ఆడియోబుక్స్లాగా మార్పిడి చేస్తుంది. ట్రిపుల్ ఐటీ అభివృద్ధి చేసిన రీడర్ అప్లికేషన్ ద్వారా ఆడియోబుక్స్‌ను దృష్టి లైబ్రరీ అందిస్తుంది. 12 భాషల్లో..: ప్రస్తుతం దృష్టి లైబ్రరీలో తెలుగుతోపాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మణిపురి, మరాఠీ, పంజాబీ, తమిళం, ఒడియా భాషల్లో పాఠ్యాంశాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పాఠ్యపుస్తకాలన్నింటినీ చూపులేని వారు సౌకర్యవంతంగా యాక్సెస్ చేసేందుకు వీలు కలగనుంది. అలాగే శ్రవణ అనుభవాన్ని సైతం పొందేందుకు వీలవనుంది. అంతేకాకుండా ఆడియో వేగాన్ని నచ్చినట్లుగా నియంత్రించడంతోపాటు బుక్మార్క్లు, పర్సనలైజ్ సెట్టింగ్స్, వాయిస్ ఆదేశాలతో నావిగేట్ చేసుకోవడం వీలవుతుంది.చూపులేని విద్యార్థులు, ఆయా విద్యాసంస్థలకు ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు వీలుగానే పరిశోధకుడు కృష్ణ తులసియన్ ట్రిపుల్–ఐటీ హైదరాబాద్‌లో ‘దృష్టి లైబ్రరీ’ని అభివృద్ధి చేశారు. ప్రొఫెసర్ సీవీ జవహర్, ప్రొఫెసర్ గురుప్రీత్ సింగ్ లెహల్ మార్గదర్శకత్వంలో ఈ ప్రక్రియ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ ఏఐ ఆధారిత భాషా వేదిక ‘భాషిణి’సాయంతో దీన్ని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ‘దృష్టి’ప్ర«దానంగా యూజీ, పీజీ పాఠ్య పుస్తకాలనే అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలోనే యూపీఎస్సీ వంటి పోటీ పరీక్షలకు సంబంధించిన పాఠ్యాంశాలు, పుస్తకాలను కూడా అందుబాటులోకి తీసుకురానుంది.వినియోగం ఉచితమే.. అంధుల పాఠశాలలు, అభ్యాసకులు, పరిశోధకులు, స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు ఎక్కడున్నా కంటెంట్‌ను పొందేందుకు వీలుగా ‘దృష్టి’ని అభివృద్ధి చేశాం. ఖరీదైన సాఫ్ట్వేర్లను కొనాల్సిన అవసరం లేకుండా ఉచితంగా వాటిని అంధ పాఠశాలలకు అందిస్తాం. – ప్రొఫెసర్ గురుప్రీత్ సింగ్ లెహల్ కంటెంట్‌ను అందించొచ్చు.. దృష్టి డిజిటల్ లైబ్రరీని ఓపెన్ ప్లాట్‌ఫాంపై రూపొందించడం వల్ల చూపులేని విద్యార్థులకు అవసరమైన కంటెంట్‌ను ఎన్జీవోలు, వలంటీర్లు, విద్యాసంస్థలు అందించేందుకు వీలవుతుంది. ఈ లైబ్రరీని విస్తరించాలంటే అందుకు అందరి తోడ్పాటు అవసరం. – ప్రొఫెసర్ జవహర్ -
హైదరాబాద్‌లో ఇప్పుడు హాట్ జాబ్స్ ఇవే..
హైదరాబాద్: దేశంలోని వృత్తి నిపుణులు నూతన ఏడాదిలో కొత్త అవకాశాల కోసం వేగంగా అడుగులు వేస్తున్నారు. లింక్డ్ఇన్ (LinkedIn) విడుదల చేసిన తాజా పరిశోధన ప్రకారం.. 2026 నాటికి 72 శాతం మంది ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్నట్లు వెల్లడైంది. అయితే, టెక్నాలజీ వేగంగా మారుతున్న నేపథ్యంలో అవసరమైన నైపుణ్యాలు (38%), పెరుగుతున్న పోటీ మధ్య తాము ఎలా నిలదొక్కుకోవాలో (37%) తెలియక మూడింట ఒక వంతుకు పైగా నిపుణులు ఆందోళన చెందుతున్నారు.ఈ అనిశ్చితిని అధిగమించేందుకు వృత్తి నిపుణులకు దిశానిర్దేశం చేయాలనే ఉద్దేశంతో, లింక్డ్ఇన్ తన ‘జాబ్స్ ఆన్ ది రైజ్ 2026’ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం.. హైదరాబాద్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఉద్యోగ పాత్రగా ‘ఏఐ ఇంజనీర్’ (AI Engineer) నిలిచింది. ఇది నగరం టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో బలమైన హబ్‌గా ఎదుగుతున్నదానికి నిదర్శనంగా నిలుస్తోంది.ఏఐ ఇంజనీర్ తరువాతి స్థానాల్లో మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ , సొల్యూషన్స్ అనలిస్ట్, వైస్ ప్రెసిడెంట్ – బిజినెస్ స్ట్రాటజీ, హ్యూమన్ రిసోర్సెస్ రిప్రజెంటేటివ్ వంటి ఉద్యోగ పాత్రలు చోటు దక్కించుకున్నాయి. ఇది హైదరాబాద్ జాబ్ మార్కెట్లో మార్కెటింగ్, బిజినెస్ స్ట్రాటజీ, పీపుల్ ఫంక్షన్స్‌తో పాటు ప్రత్యేక ప్రొఫెషనల్ రోల్స్‌లో కూడా వేగంగా వృద్ధి జరుగుతోందని సూచిస్తోంది.ఏఐపై ఆసక్తి ఉన్నా..లింక్డ్ఇన్ అధ్యయనం ప్రకారం.. భారతదేశంలోని 94 శాతం మంది నిపుణులు ఉద్యోగ వేటలో ఏఐని ఉపయోగించడానికి సౌకర్యంగా ఉన్నారు. అయితే, నియామక ప్రక్రియలో ఏఐ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, తమను తాము ఎలా ప్రత్యేకంగా నిలబెట్టుకోవాలో 48 శాతం మందికి స్పష్టత లేకుండాపోతోంది. అంతేకాదు, రిక్రూటర్ల దృష్టిని ఆకర్షించడంలో ఏఐ ఒక అడ్డంకిగా మారవచ్చని 54 శాతం మంది అభిప్రాయపడ్డారు.అయితే, ఈ ఆందోళనల మధ్య కూడా రిక్రూటర్–అభ్యర్థి మధ్య కమ్యూనికేషన్‌ను మెరుగుపరచడంలో, సమాచారం లోపాలను తగ్గించడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని 65 శాతం మంది నమ్ముతున్నారు.జాబ్ సెర్చ్‌ను ఈజీ చేస్తున్న లింక్డ్ఇన్ ఏఐ టూల్స్ఉద్యోగార్థుల అవసరాలకు అనుగుణంగా లింక్డ్ఇన్ పలు ఏఐ ఆధారిత టూల్స్‌ను అందిస్తోంది. అందులో ముఖ్యమైనది ‘ఏఐ-పవర్డ్ జాబ్ సెర్చ్’. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ మాటల్లోనే ఉద్యోగాలను వెతకగలుగుతున్నారు. అంతేకాదు, వారు ఎప్పుడూ ఊహించని కొత్త ఉద్యోగ అవకాశాలను కూడా ఇది పరిచయం చేస్తోంది.ప్రస్తుతం ఈ టూల్ ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, పోర్చుగీస్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది. ఇప్పటికే రోజూ 13 లక్షల మందికి పైగా దీనిని ఉపయోగిస్తుండగా, వారానికి 2.5 కోట్లకుపైగా జాబ్ సెర్చ్‌లు ఈ ఫీచర్ ద్వారా జరుగుతున్నట్లు లింక్డ్ఇన్ వెల్లడించింది.అదేవిధంగా ‘జాబ్ మ్యాచ్’ ఫీచర్ ద్వారా తమ నైపుణ్యాలు, అర్హతలకు ఏ ఉద్యోగాలు సరిపోతాయో తెలుసుకొని, ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్న పాత్రలకే దరఖాస్తు చేసుకునే అవకాశం కలుగుతోంది.హైదరాబాద్‌లో టాప్ 10 ఉద్యోగాలు1. ఏఐ ఇంజనీర్ 2. మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ 3. సొల్యూషన్స్ అనలిస్ట్ 4. వైస్ ప్రెసిడెంట్ – బిజినెస్ స్ట్రాటజీ 5. హ్యూమన్ రిసోర్సెస్ రిప్రజెంటేటివ్ 6. మర్చండైజర్7. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అనలిస్ట్ 8. ఫైనాన్స్ స్పెషలిస్ట్9. ప్రొక్యూర్మెంట్ స్పెషలిస్ట్10. సర్వీస్ డెలివరీ మేనేజర్ -
డేంజర్లో వైట్ కాలర్ జాబ్స్.. బిల్‌గేట్స్ హెచ్చరిక
ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శరవేగంగా విస్తరిస్తోంది. ఈ కృత్రిమ మేధ (AI) నేడు ప్రతి రంగాన్ని విప్లవాత్మకంగా మార్చేస్తోంది. అయితే ఈ ఏఐ కారణంగా వైట్ కాలర్ జాబ్స్ ప్రమాదంలో పడనున్నాయని మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్‌గేట్స్ హెచ్చరించారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు."రాబోయే నాలుగైదు ఏళ్లలో అటు వైట్ కాలర్, ఇటు బ్లూ కాలర్ ఉద్యోగ రంగాల్లో ఏఐ ప్రభావం స్పష్టంగా కన్పిస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు ముందుకు వచ్చి ఈ అసమానతల సమస్యను పరిష్కరించాల్సి ఉంటుంది. న్యూ స్కిల్స్‌ను నేర్పించడం లేదా పన్ను వ్యవస్థలో మార్పులు చేయడం వంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పటివరకు ఏఐ ప్రభావం తక్కువగానే ఉన్నప్పటికి.. భవిష్యత్తులో ఎక్కువగా మార్పులు కనిపిస్తాయి. ఇప్పటికే ఏఐ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, లాజిస్టిక్స్, కాల్ సెంటర్లలో లోయర్ స్కిల్ ఉద్యోగాలను భర్తీ చేసింది. ఈ సమస్యలను పరిష్కరించకోకపోతే సంపద, అవకాశాలు కొద్దిమంది చేతుల్లోకి మాత్రమే వెళ్లిపోతాయి. దీంతో సమాజంలో అసమానతలు పెరిగే అవకాశముంది" అని బిల్‌గేట్స్ పేర్కొన్నారు. -
ఐటీకి కొత్త బూమ్ ఖాయం: విప్రో సీఈవో
ఐటీ సేవల పరిశ్రమ భవిష్యత్తుపై విప్రో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీని పల్లియా గట్టి ఆశావాదాన్ని వ్యక్తం చేశారు. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) సమావేశంలో మాట్లాడిన ఆయన, రాబోయే సంవత్సరాల్లో ఐటీ రంగం గణనీయమైన మార్పును ఎదుర్కోనుందని చెప్పారు.పల్లియా ప్రకారం.. 2025 సంవత్సరం ప్రయోగాలు, చిన్న స్థాయి ట్రయల్స్‌కు పరిమితమైతే, 2026 పూర్తి స్థాయి అమలు, జవాబుదారీతనానికి కేంద్రబిందువుగా మారనుంది. ఇప్పటికే సంస్థలు ఏఐ (AI) టెక్నాలజీని కేవలం పరీక్షించే దశను దాటేశాయని, చిన్న ప్రూఫ్-ఆఫ్-కాన్సెప్ట్ (PoC) ప్రాజెక్టుల నుంచి పెద్ద ఎంటర్ప్రైజ్-వైడ్ అమలు వైపు వేగంగా కదులుతున్నాయని ఆయన తెలిపారు.ఈ మార్పు భారతీయ సాఫ్ట్వేర్ ఎగుమతిదారులకు బలమైన కొత్త అవకాశాలను తెస్తోందని పల్లియా చెప్పారు. మెగా డీల్స్‌తో పాటు ప్రత్యేకమైన, చిన్న ఏఐ ప్రాజెక్టుల కోసం కూడా పోటీ పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.ఏఐ ఐటీ రంగ ఆర్థిక వ్యవస్థనే మార్చేస్తోందని ఆయన అంగీకరించారు. ఏఐ-సహాయక సాఫ్ట్వేర్ అభివృద్ధి వల్ల కోడింగ్, టెస్టింగ్ ఖర్చులు సుమారు 25 శాతం వరకు తగ్గుతాయని అంచనా వేశారు. దీని వల్ల ధరలపై ఒత్తిడి ఏర్పడినప్పటికీ, ఆ పొదుపును మరిన్ని డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్టులకు వినియోగిస్తారని ఆయన తెలిపారు.గత కొన్నేళ్లుగా ప్రపంచ ఆర్థిక అనిశ్చితి కారణంగా టెక్నాలజీ వ్యయాలు తగ్గినప్పటికీ, ప్రస్తుత ఏఐ ధోరణి ఐటీ పరిశ్రమకు స్థిరత్వాన్ని తీసుకువస్తుందని విప్రో భావిస్తోంది.ఇదీ చదవండి: ఉద్యోగులకు రూ.37 కోట్లు.. ఓ సీఈవో మంచి మనసు -
ఏఎం గ్రూప్ కొత్త ప్రాజెక్ట్.. వేలాదిమందికి ఉద్యోగాలు!
కృత్రిమ మేధస్సు (AI) ప్రపంచమంతా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇలాంటి తరుణంలో AI కంప్యూట్ హబ్‌ను ఏర్పాటు చేయడానికి AM గ్రూప్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి ఒక పెద్ద ప్రాజెక్ట్ ప్రారంభించింది. ఈ ఏఐ హబ్ సామర్థ్యం 1 గిగావాట్ ఉంటుంది. దీని కోసం సుమారు 25 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నారు. ఇది భారతదేశంలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద ఏఐ పెట్టుబడుల్లో ఒకటి.ఈ ప్రాజెక్ట్‌ను దశలవారీగా అభివృద్ధి చేస్తారు. మొదటి దశ 2028 నాటికి ప్రారంభమవుతుంది. 2030 నాటికి ఇది పూర్తవుతుందని చెబుతున్నారు. ఇందులో సుమారు 5 లక్షల అత్యాధునిక కంప్యూటర్ చిప్‌లు ఉంటాయి. ఇవి భారీ ఏఐ పనులను వేగంగా చేయడానికి ఉపయోగపడతాయి.ఈ ఏఐ హబ్‌లు పెద్ద కంపెనీలకు, పరిశోధనా సంస్థలకు, స్టార్టప్‌లు & ప్రభుత్వ ఏఐ ప్రాజెక్టులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దీని వల్ల ఏఐ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి వస్తుంది. ప్రజలకు ఏఐను దగ్గర చేయడానికి ఏఎం సంస్థ ఈ ప్రాజెక్ట్ ప్రారంభించింది. చిన్న డెవలపర్లు కూడా పెద్ద ఏఐ టూల్స్‌ను ఇందులో ఉపయోగించుకోవచ్చు.ఈ ప్రాజెక్ట్ వల్ల ఉత్తరప్రదేశ్‌లో వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయి. విదేశీ పెట్టుబడులు పెరుగుతాయి. టెక్నాలజీ రంగం మరింత బలపడుతుంది. మొత్తం మీద.. ఈ ఏఐ కంప్యూట్ హబ్ భారతదేశాన్ని ప్రపంచ ఏఐ రంగంలో ముందుకు తీసుకెళ్లే కీలక ప్రాజెక్ట్‌గా నిలుస్తుందని పలువురు భావిస్తున్నారు. -
భారతీయ భోజనాన్ని డీకోడ్ చేసే కృత్రిమమేధ
భారతీయ ఆహారం అంటే కేవలం రుచి మాత్రమే కాదు.. సంస్కృతి, సంప్రదాయం, ప్రాంతీయ వైవిధ్యాల సమాహారం. దేశంలోని క్లిష్టమైన ఆహార పద్ధతులను అర్థం చేసుకోవడానికి ఇప్పుడు కృత్రిమ మేధ (ఏఐ) రంగ ప్రవేశం చేసింది. ట్రిపుల్ఐటీ-హైదరాబాద్ పరిశోధకులు కంప్యూటర్ విజన్ సాంకేతికతను ఉపయోగించి భారతీయ థాలీ భోజనంలోని కేలరీలను ట్రాక్ చేయడం, బిర్యానీ వంటి ఐకానిక్ వంటకాలను విశ్లేషించేలా పరిశోధనలు చేస్తున్నారు.థాలీని అర్థం చేసుకోవడం ఎందుకు కష్టం?ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా ఫుడ్ ట్రాకింగ్ యాప్స్‌ను బర్గర్, శాండ్విచ్.. వంటి పాశ్చాత్య వంటకాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. కానీ భారతీయ థాలీ అందుకు భిన్నమైంది. ఒకే ప్లేట్లో అన్నం, పప్పు, కూర, పెరుగు, చట్నీ, అప్పడం.. వంటి చాలా పదార్థాలు కలిసి ఉంటాయి. దాంతో అందులో ఎన్ని కేలరీలు ఉన్నాయో తెలుసుకోవడం కష్టంగా మారుతుంది. ట్రిపుల్ఐటీలోని సెంటర్ ఫర్ విజువల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (CVIT) పరిశోధకులు దీనిపైనే దృష్టి పెట్టారు.ఈ ప్రాజెక్ట్‌కు నేతృత్వం వహిస్తున్న ప్రొఫెసర్ సి.వి. జవహర్ ప్రొఫెసర్ జవహర్ మార్గదర్శకత్వంలో యశ్ అరోరా, ఆదిత్య అరుణ్ రూపొందించిన ‘What is there in an Indian Thali’ అనే పరిశోధన పత్రం ఇటీవలే 16వ ఇండియన్ కాన్ఫరెన్స్ ఆన్ కంప్యూటర్ విజన్, గ్రాఫిక్స్ అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్ (ICVGIP 2025)లో సమర్పించారు. భారతీయ భోజనంలోని వివిధ రకాల పదార్థాలను ఏఐ ఎలా గుర్తించగలదనే అంశంపై ఈ పరిశోధన సాగింది.పరిశోధనలోని ముఖ్యాంశాలుసాధారణంగా ఏఐ మోడళ్లకు ప్రతి కొత్త వంటకం కోసం మళ్లీ శిక్షణ ఇవ్వాలి. కానీ, భారతీయ వంటల్లో విభిన్న రకాల పప్పులు వివిధ రంగులు ఉంటాయి (ఉదాహరణకు పాలక్ పప్పు ఆకుపచ్చగా ఉంటుంది). దీనికోసం ట్రిపుల్ఐటీ హైదరాబాద్ బృందం ‘జీరో-షాట్ లెర్నింగ్’ విధానాన్ని అభివృద్ధి చేసింది. ఇది కఠినమైన వర్గీకరణకు బదులుగా ‘ప్రోటోటైప్ మ్యాచింగ్’ ద్వారా పదార్థాలను గుర్తిస్తుంది. అలా థాలీ భోజనంలోని అన్ని పధార్థాలను గుర్తించి దానివల్ల ఎన్ని కేలరీలు సమకూరుతాయో తెలియజేస్తుంది.గర్భిణీ స్త్రీల పోషకాహారాన్ని పర్యవేక్షించాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ పరిశోధన సాగినట్లు నిర్వాహకులు చెప్పారు. ప్రస్తుతం ఇది ఓవర్‌హెడ్ కెమెరాతో కూడిన కియోస్క్ సెటప్‌లో పనిచేస్తోంది. భవిష్యత్తులో దీన్ని మొబైల్ యాప్‌గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశవ్యాప్తంగా మసాలాల వినియోగం, వంట శైలిలోని తేడాలను విశ్లేషిస్తూ ‘ఇండియన్ ఫుడ్ మ్యాప్’ను పరిశోధకులు సిద్ధం చేస్తున్నారు.బిర్యానీపై ప్రత్యేక దృష్టిభారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బిర్యానీని టెస్ట్ కేస్‌గా తీసుకుని దేశంలో బిర్యానీ ఎలా తయారు చేస్తారనే అంశంపై పరిశోధన చేశారు. ఇందుకోసం వేలకొద్దీ యూట్యూబ్ వీడియోలను ఏఐ ద్వారా విశ్లేషించారు. హైదరాబాదీ బిర్యానీ, ఇతర బిర్యానీల మధ్య నూనె, మసాలాల వాడకంలో ఉన్న తేడాలను ఈ వ్యవస్థ గుర్తించగలదు. ‘ఉల్లిపాయల కంటే ముందు ఏ పదార్థం వేశారు?’ వంటి క్లిష్టమైన ప్రశ్నలకు కూడా ఇది సమాధానం ఇస్తుంది.వంట గదిలో ఏఐ అసిస్టెంట్ఈ సాంకేతికత భవిష్యత్తులో వంట చేసేటప్పుడు మన పక్కనే ఉండి మార్గనిర్దేశం చేసే ఏఐ అసిస్టెంట్‌గా మారనుంది. ‘మీ అమ్మమ్మ పక్కన ఉండి వంట నేర్పించినట్టే, అవసరమైనప్పుడు మాత్రమే సూచనలిచ్చే ఏఐని తయారు చేస్తున్నాం’ అని ప్రొఫెసర్ జవహర్ తెలిపారు. ఇది కేవలం వంటకే కాకుండా నృత్యం, హస్తకళలు వంటి నైపుణ్య ఆధారిత విద్యను బోధించడానికి కూడా ఉపయోగపడనుంది. భారతీయ సంస్కృతిని, ఆధునిక సాంకేతికతను జోడించి ట్రిపుల్ఐటీ-హైదరాబాద్ చేస్తున్న ఈ పరిశోధన ఆహార విశ్లేషణ రంగంలో ఒక మైలురాయిగా నిలవనుంది.ఇదీ చదవండి: ఐపీఓ పెట్టుబడుల పేరుతో రూ.2.5 కోట్ల టోకరా! -
‘బిడ్డా.. మీ అయ్య చూస్తే ఊకోడు’
కృత్రిమ మేధస్సు (AI)తో సృష్టించే కంటెంట్‌ను ఈ మధ్యకాలంలో ఎందుకూ పనికి రాని విషయంగా(AI slop) చాలామంది తిడుతున్నారు. అడ్డదిడ్డంగా, అడ్డగోలుగా.. అందునా అశ్లీలమైన కంటెంట్ వైరల్ అవుతుండడమే అందుకు కారణం. పైగా ఒరిజినాలిటీని దెబ్బ తిస్తోందని విమర్శిస్తున్నారు. కానీ అదే సాంకేతికతను వినోదం కోసం ఉపయోగిస్తే ఆ కిక్కే వేరప్పా. ఏఐ కంటెంట్‌ను ఇప్పుడున్న యూత్ ఎలా ఉపయోగించుకుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలూ వాళ్ల పనితీరు ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. అయితే.. ఇక్కడ మాత్రం ఓ కూతురు తన తల్లిని ఆటపట్టించింది. లేని బాయ్‌ఫ్రెండ్‌ను సృష్టించి.. తల్లికి పిచ్చి కోపం తెప్పించింది. అలా నెట్టింట నవ్వులు పూయించింది. అసలు విషయంలోకి వెళ్తే.. యూపీ లక్నోకు చెందిన పావని అవస్థి తన తల్లిని సరదాగా మోసం చేసింది. చాట్‌జీపీటీ ద్వారా ఎడిట్ చేసిన ఫొటోను తల్లికి చూపించి బిత్తర పోయేలా చేసింది. ఆపై వాళ్ల మధ్య సంభాషణ ఇలా జరిగింది. ఆ ఫొటోలోని వ్యక్తి ఎవరు అని తల్లి ప్రశ్నించగా.. తన బాయ్‌ఫ్రెండ్ అని ఆమె బదులిచ్చింది. అవునా.. అతను నీ స్నేహితుడా?.. ఎప్పటి నుంచి మీరు స్నేహితులు? అంటూ ఆందోళనలతో ప్రశ్నలు గుప్పించి.. చాలాకాలంగా తెలుసని, మంచోడు అని, ఇంకా కొన్నిరోజుల్లో ఇంటికి వస్తాడు కదా అంటూ పావని సమాధానం ఇచ్చింది. అయితే ఈ విషయం నీ తండ్రికి తెలిస్తే బాగోదని.. ఆయన ఏమాత్రం సంతోషించరని కోపంగా మాట్లాడి లాగిపెట్టి కొట్టింది. ఫోన్ విసిరేయబోతుండగా.. సీన్ కట్ అయ్యింది. View this post on Instagram A post shared by Pawani (@pawani_awasthi_)తన తల్లిని ఏఐతో ఎలా బురిడీ కొట్టించిందో తెలియజేస్తూ పావని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ఈ వీడియోకు ఇన్‌స్టాగ్రామ్‌లో దగ్గర దగ్గర 4 మిలియన్ల(4M) వ్యూస్ వచ్చాయి. ఈ ప్రాంక్‌ను ఆస్వాదించిన వాళ్లంతా.. సరాదాగా కామెంట్లు పెడుతున్నారు. నేను AIని అసహ్యించుకునే వాడిని. కానీ ఇది అద్భుతమైన వినియోగం అంటూ ఓ నెటిజన్ చేసిన కామెంట్ హైలైట్ అవుతోంది. ఇదిలా ఉంటే.. మరో ఘటనలో ఒక మనవడు తన తాతయ్య 90వ పుట్టినరోజు సందర్భంగా AI సాంకేతికతను వినియోగించి ప్రత్యేకమైన వీడియోను రూపొందించాడు. పాత కుటుంబ ఫోటోలను ఉపయోగించి, వాటిని కదిలే జ్ఞాపకాలుగా మార్చి తాతయ్య జీవితకథను చూపించాడు. ఆ వీడియో చూసిన తాతయ్య మాటలు రానంతగా భావోద్వేగానికి లోనయ్యాడు. కుటుంబ సభ్యులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. AIని కేవలం నిరుపయోగమైన కంటెంట్ సృష్టించే సాధనంగా కాకుండా, సరదా, భావోద్వేగం, కుటుంబ బంధాలను మరింత బలపరచే సాధనంగా కూడా ఉపయోగించవచ్చని ఈ వీడియో చూసిన వాళ్లు కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Generative AI | Discover, Learn & Grow (@generativeai_official) -
ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు భవిష్యత్తులో సవాళ్లు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో ప్రస్తుతం కొనసాగుతున్న డేటా సెంటర్ల నిర్మాణ వేగాన్ని అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తీవ్రంగా తప్పుబట్టారు. 2026 న్యూయార్క్ టైమ్స్ డీల్ బుక్ సమ్మిట్ వేదికగా ఆయన మాట్లాడుతూ, ప్రైవేట్ కంపెనీలు తమ సొంత డేటా సెంటర్లను నిర్మించుకోవడాన్ని 110 ఏళ్ల క్రితం నాటి విద్యుత్ రంగ పరిస్థితులతో పోల్చారు.చారిత్రక తప్పిదమే పునరావృతం?మెటా, ఓపెన్ ఏఐ వంటి దిగ్గజ సంస్థలు తమ సొంత కంప్యూటింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవడాన్ని బెజోస్ తప్పుబట్టారు. 20వ శతాబ్దం ప్రారంభంలో పవర్ గ్రిడ్లు అందుబాటులోకి రాకముందు కర్మాగారాల్లో తమకు అవసరమైన విద్యుత్తును తామే ఉత్పత్తి చేసుకునేవారని, ఇప్పుడు ఏఐ రంగంలోనూ అదే జరుగుతోందని ఆయన గుర్తు చేశారు. ‘ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ సొంత డేటా సెంటర్లు నిర్మించుకుంటున్నారు. కానీ ఇది శాశ్వతం కాదు. దీనికి ఎన్నో సవాళ్లు ఉన్నాయి. రాబోయే రోజుల్లో భారీగా విద్యుత్తు వనరుల అవసరం పెరగనుంది. భవిష్యత్తులో టెక్ ఇండస్ట్రీ అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) వంటి కేంద్రీకృత క్లౌడ్ కంప్యూటింగ్ సేవల వైపు మళ్లడం అనివార్యం. అప్పుడే వనరుల దుర్వినియోగం తగ్గుతుంది’ అని ఆయన అంచనా వేశారు. గతంలో విద్యుత్ రంగం ఎలాగైతే కేంద్రీకృతమై సమర్థవంతంగా మారిందో, ఏఐ మౌలిక సదుపాయాల్లో కూడా అదే రకమైన విప్లవం రావాలని హెచ్చరించారు.పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ఏఐ వినియోగం పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ వినియోగం గణనీయంగా మారుతోంది. 2024లో డేటా సెంటర్లు 415 టెరావాట్ల విద్యుత్తును వాడగా, 2030 నాటికి ఇది 945 టెరావాట్లకు చేరుతుందని అంచనా. అమెరికా జాతీయ విద్యుత్ డిమాండ్‌లో డేటా సెంటర్ల వాటా 4 శాతం నుంచి 12 శాతానికి పెరిగే అవకాశం ఉంది. ఒక సాధారణ గూగుల్ సెర్చ్‌తో పోలిస్తే, ఒక్క చాట్ జీపీటీ ప్రాంప్ట్ 10 రెట్లు ఎక్కువ శక్తిని తీసుకుంటుంది. అలాగే ఒక లార్జ్ ఏఐ మోడల్ శిక్షణకు ఏడాదికి సుమారు 200 గృహాలకు సరిపడా విద్యుత్ అవసరమవుతుందని అంచనా.శక్తి వనరులే అసలైన అడ్డంకికేవలం బెజోస్ మాత్రమే కాకుండా, ఇతర టెక్ దిగ్గజాలు కూడా విద్యుత్ కొరతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఒక సందర్భంలో ‘తగినంత విద్యుత్ లేక జీపీయూ చిప్స్ ఖాళీగా ఉంటున్నాయి’ అని అంగీకరించారు. సుందర్ పిచాయ్ (గూగుల్ సీఈఓ) గతంలో మాట్లాడుతూ విద్యుత్ లభ్యత అనేది ఏఐ వృద్ధికి దీర్ఘకాలిక అడ్డంకి అని పేర్కొన్నారు. ఈ సమస్యను అధిగమించడానికి మెటా సంస్థ ఒహియోలో ఏర్పాటు చేస్తున్న తన సూపర్ క్లస్టర్ కోసం ఏకంగా అణు విద్యుత్ ఒప్పందాలను కుదుర్చుకోగా, ఆల్ఫాబెట్ సంస్థ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 4.75 బిలియన్ డాలర్లను వెచ్చించింది.ఇదీ చదవండి: లక్షకు పైగా యూఎస్ వీసాల రద్దు.. -
ఆశ్చర్యపోయాను!.. శ్రీధర్ వెంబు ట్వీట్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లో విస్తరిస్తున్న తరుణంలో.. జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు ఒక ట్వీట్ చేశారు. కృత్రిమ మేధస్సు (AI).. సాఫ్ట్వేర్ అభివృద్ధి చేసే విధానాన్ని పూర్తిగా మార్చేస్తోందని ఇందులో ఒక ఉదాహరణతో వివరించారు.సంస్థలోని R&D బృందంలో పనిచేసే ఇంజనీర్.. నెల రోజుల తన ఖాళీ సమయంలో తయారు చేసిన ఒక పరికరాన్ని నాకు చూపించారు. అతను దానిని తయారు చేస్తున్నట్లు నాకు తెలియదు. కానీ దానిని చూడగానే నేను ఆశ్చర్యపోయాను.మూడు లేదా నలుగురు వ్యక్తులు.. ఆ పరికరాన్ని తయారు చేయడానికి కనీసం ఒక ఏడాది సమయం పడుతుంది. కానీ అతను కేవలం నెల రోజుల్లోనే దాన్ని అభివృద్ధి చేశారు. ఇంత వేగంగా దీనిని రూపొందించడానికి ప్రధాన కారణం Opus 4.5 అనే AI మోడల్ అని ఆ ఇంజనీర్ చెప్పారు.ఒకప్పుడు ఏఐ ద్వారా రాసే కోడ్‌పై అతనికి (ఇంజినీర్) అంతగా నమ్మకం లేదు. కానీ Opus 4.5 వచ్చాక తన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని వెంబు వివరించారు. అంతే కాకుండా జోహో కంపెనీలో ప్రయోగాత్మక సంస్కృతిని ప్రస్తావించారు. మేము సంస్థలో తెలివైన వాళ్లకు స్వేచ్ఛ ఇస్తాం, వాళ్లే కొత్త మార్గాలు కనుగొంటారని శ్రీధర్ వెంబు పేర్కొన్నారు.ఇంతవరకు సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది చేతితో నేసే చేనేత (Handloom) లాంటిదైతే, ఇప్పుడు AI రూపంలో శక్తివంతమైన యంత్ర మగ్గాలు (Machine Looms) వచ్చేశాయని అన్నారు. ఇది సాఫ్ట్వేర్ కంపెనీల మీద పెద్ద ప్రభావం చూపిస్తుంది. జోహో కూడా దీనికి అనుగుణంగా మారాల్సిన అవసరం ఉందని అన్నారు. తాను చీఫ్ సైంటిస్ట్‌గా ఉన్నందున ఈ మార్పులను ఎదుర్కోవాల్సిన బాధ్యత తనపై ఉందని వెంబు వెల్లడించారు.Yesterday one of our experienced engineers who works in my R&D team, showed me an assembly and machine code security tool he built in his spare time over the past month. I did not know he was building it. I was blown away by the depth and breadth of the tool. He has developed…— Sridhar Vembu (@svembu) January 8, 2026 -
CES 2026: లాలిపాప్‌తో మ్యూజిక్.. అదిరిపోయే గాడ్జెట్స్ మీకోసం
వాషింగ్టన్ డీసీ: హలో టెక్ లవర్స్. అమెరికాలో కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES 2026)లో జరుగుతుంది కదా. మరి ఈ టెక్ షోలో మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసే గాడ్జెట్స్పాటు ఇతర ప్రొడక్ట్‌ల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే, తెలుసుకుందాం పదండి.ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో తమ తాజా ఆవిష్కరణలను ప్రదర్శించాయి. ఈ ప్రదర్శనలో సాధారణ గాడ్జెట్లు మాత్రమే కాకుండా, వినియోగదారులను ఆశ్చర్యపరిచే విచిత్రమైన ఉత్పత్తులు చూపరులను కట్టిపడేశాయి.వాటిల్లో ఐపాలిష్ డిజిటల్ మేనిక్యూర్మగువుల కోసం ప్రత్యేకంగా ఐపాలిష్ డిజిటల్ మేనిక్యూర్‌ను డిజైన్ చేశారు. ఇదే ప్రపంచంలోనే మొదటి డిజిటల్ మేనిక్యూర్ సిస్టమ్.ఇందులో ప్రెస్-ఆన్ నెయిల్స్‌లో మైక్రో డిస్ప్లే ఉంది. స్మార్ట్‌ఫోన్‌లోని యాప్ సాయంతో 400 షేడ్స్‌ను వెంటనే మార్చుకోవచ్చు. యాప్‌లో 400 వేర్వేరు షేడ్స్/రంగులు అందుబాటులో ఉంటాయి. యూజర్ యాప్‌లో తనకు నచ్చిన రంగును ఎంచుకుంటే, ఆ రంగు వెంటనే నెయిల్పై డిస్ప్లేలో కనిపిస్తుంది.అంటే,నెయిల్ పాలిష్ మార్చుకోవడానికి మళ్లీ కొత్తగా అప్లై చేయాల్సిన అవసరం లేదు. కేవలం యాప్‌లో టచ్ చేస్తే సరిపోతుంది. సింపుల్‌గా చెప్పాలంటే, స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా గోళ్ల రంగు డిజిటల్‌గా మారుతుంది. ఇది ఫ్యాషన్‌కి టెక్నాలజీని జోడించిన వినూత్న ఆవిష్కరణ.వైబ్రేటింగ్ కిచెన్ బ్లేడ్లు C-200 అల్ట్రాసోనిక్ చెఫ్స్ నైఫ్వైబ్రేటింగ్ కిచెన్ బ్లేడ్. దీని స్పెషాలిటీ ఎంతో తెలుసా?.ఈ కత్తి సాధారణ కత్తి కాదు. ఇందులో అల్ట్రాసోనిక్ వైబ్రేషన్ టెక్నాలజీ అమర్చబడి ఉంది.సెకనుకు 30వేల సార్లు వైబ్రేట్ అవుతుంది. కఠినమైన కూరగాయలు, పండ్లు కూడా రెప్పపాటు కాలంలో కోయగలదు. ఆహారం బ్లేడ్‌కు అంటకుండా సాఫీగా కట్ అవుతుంది.ఈ కత్తి వంటగదిలో సులభంగా, వేగంగా, శుభ్రంగా కట్ చేయడానికి సహాయపడుతుంది. టమోటాలు, స్క్వాష్, దోసకాయ వంటి కూరగాయలు మాంసం, చేపలు,బ్రెడ్, పండ్లు ఇవన్నీ రెప్పపాటు కాలంలో కోయగలదు.సీ-200 అల్ట్రాసోనిక్ చెఫ్ వంటగదిలో టెక్నాలజీని జోడించిన వినూత్న ఆవిష్కరణ. ఇది కేవలం కత్తి మాత్రమే కాదు, వంటను మరింత సులభం, వేగం, శుభ్రంగా చేసే స్మార్ట్ కిచెన్ టూల్. ఇందులో 1100 ఎంఏహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ, యూఎస్బీ-సీ టైప్ ఛార్జింగ్ సౌకర్యం, అలాగే ఐపీ65 వాటర్ రెసిస్టెన్స్ ఉన్నాయి. వంటగదిలో వినియోగించడానికి ఇది చాలా సులభంగా, సురక్షితంగా ఉంటుంది.లాలిపప్ స్టార్లాలిపాప్. స్ట్రెస్ నుంచి రిలీఫ్ ఇచ్చే ఓ తియ్యటి పదార్ధం. పిల్లలు, పెద్దలకు ఫన్ ట్రీట్ ఇచ్చే లాలిపప్కు ఓ టెక్ కంపెనీ బోన్ కండీషన్ టెక్నాలజీని జోడించింది. అంతే ఈ తరహా టెక్నాలజీ ఉన్న లాలిపాప్‌ను తిన్నప్పుడల్లా పాటలు వినొచ్చు. అదెలా అంటే లాలిపాప్‌ను కొరుక్కునప్పుడు, దాని హ్యాండిల్‌లోని చిన్న ఎలక్ట్రానిక్ మాడ్యూల్ వైబ్రేషన్లు సృష్టిస్తుంది. ఆ వైబ్రేషన్లు మీ దవడ ఎముకల ద్వారా నేరుగా లోపలి చెవి భాగాలకు చేరుతుంది.పాటలు వినగలుగుతారు.ఎలక్ట్రానిక్ భాగం ఉన్నందున, పూర్తిగా తినకూడదు. కేవలం లాలిపాప్ భాగం మాత్రమే తినదగినది. సాధారణ హెడ్ఫోన్లతో పోలిస్తే శబ్దం తక్కువ స్పష్టంగా ఉండవచ్చు.వీరల్ సోలార్ ఛార్జింగ్ కోప్లౌ పవర్ హాట్ఈకోఫ్లో పవర్ హ్యాట్ (EcoFlow Power Hat) అనేది సోలార్ సెల్స్‌తో కూడిన వైడ్ బ్రిమ్ హ్యాట్. ఇది కేవలం సూర్యరశ్మి నుండి రక్షణ ఇవ్వడం మాత్రమే కాదు, బయట నడుస్తూ లేదా అవుట్డోర్ యాక్టివిటీల్లో ఉన్నప్పుడు స్మార్ట్‌ఫోన్ వంటి చిన్న గాడ్జెట్లను ఛార్జ్ చేసే ప్రత్యేకతను కలిగి ఉంటుంది. హ్యాట్ చుట్టూ అమర్చిన సోలార్ ప్యానెల్స్ సూర్యరశ్మిని గ్రహించి, గరిష్టంగా 12 వాట్స్ పవర్ ఉత్పత్తి చేస్తాయి. ఈ పవర్‌ను యూఎస్బీఏ,యూఎస్బీ సీ పోర్టుల ద్వారా ఒకేసారి రెండు డివైస్‌లకు అందించవచ్చు. ఈటోపీ తేలికైన మెటీరియల్‌తో తయారు చేసింది. బరువు అనిపించదు. ఐపీ65 వాటర్‌ప్రూఫ్, డస్ట్‌ప్రూఫ్ రేటింగ్‌తో హైకింగ్, బీచ్ ట్రిప్స్, ఫిషింగ్ వంటి అవుట్డోర్ యాక్టివిటీలకు అనుకూలంగా ఉంటుంది. ఔట్‌డోర్‌లో ఉన్నప్పుడు పవర్ బ్యాంక్ లేకపోయినా, ఈ హ్యాట్ ద్వారా ఫోన్ లేదా చిన్న గాడ్జెట్లను ఛార్జ్ చేసుకోవచ్చు.ఈ హ్యాట్ కేవలం సూర్యరశ్మిలో ఉన్నప్పుడు మాత్రమే పవర్ ఉత్పత్తి చేస్తుంది. 12డబ్ల్యూ పవర్ పరిమితి కారణంగా ల్యాప్‌టాప్‌లు లేదా పెద్ద గాడ్జెట్లను ఛార్జ్ చేయడం సాధ్యం కాదు.ఏఐ స్మార్ట్ క్లిప్పర్Glyde Smart Hair Clipper అనేది ఏఐ ఆధారిత పనిచేసే హెయిర్‌కట్ పరికరం. ఇది తల ఆకారాన్ని గుర్తించి బ్లేడ్ యాంగిల్, స్పీడ్‌ను ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేస్తుంది. మొబైల్ యాప్ ద్వారా విజువల్ గైడెన్స్ అందిస్తూ, ఇంట్లోనే సలూన్-క్వాలిటీ హెయిర్‌కట్ చేస్తుంది. ఈ ఎయిర్ క్లిప్పర్ను తాజా ఈవెంట్లో పరిచయం చేశారు. ఇది ప్రపంచంలోనే మొదటి ఏఐ ఆధారిత హెయిర్ క్లిప్పర్గా గుర్తింపు పొందింది. దీని లక్ష్యం ఒకటే ఎవరైనా, ఎలాంటి అనుభవం లేకపోయినా, 10 నిమిషాల్లో ఇంట్లోనే సెలూన్ క్వాలిటీ హెయిర్‌కట్ చేసేందుకు ఉపయోగపడటం. ఈ క్లిప్పర్లో ఎఐ స్టైలిస్ట్ అనే సిస్టమ్ ఉంటుంది. ఇది తల ఆకారాన్ని స్కాన్ చేసి, బ్లేడ్ యాంగిల్, స్పీడ్‌ను ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేస్తుంది. కాబట్టి కత్తిరింపు సమయంలో పొరపాట్లు జరగకుండా, సాఫ్ట్‌గా, సమానంగా హెయిర్‌కట్ అవుతుంది.సాధారణ క్లిప్పర్ కంటే ఖరీదు ఎక్కువగా ఉంటుంది. యాప్ లేకుండా పూర్తి ఫీచర్లు ఉపయోగించలేరు. మొదటిసారి ఉపయోగించే వారికి కొంత సమయం పట్టవచ్చు.


