మృణాల్ కొత్త సినిమా.. 'ఏఐ'తో ఫస్ట్ లుక్ టీజర్ | Hai Jawani Toh Ishq Hona Hai Movie First Look With AI | Sakshi
Sakshi News home page

Mrunal Thakur: దాపరికాల్లేవు.. 'ఏఐ'ని యథేచ్ఛగా వాడేశారు

Apr 14 2026 1:24 PM | Updated on Apr 14 2026 1:42 PM

Hai Jawani Toh Ishq Hona Hai Movie First Look With AI

రీసెంట్ టైంలో భారీ బడ్జెట్ విజువల్ ఎఫెక్ట్స్ సినిమాల నుంచి ప్రమోషనల్ కంటెంట్ ఏమైనా రిలీజ్ అయిందంటే చాలు.. తమ చిత్రంలో ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ)ని ఉపయోగించలేదని హీరోలు చెప్పుకోవాల్సిన పరిస్థితి. అయితే అవసరాన్ని బట్టి ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో తప్పులేదు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ తన కొత్త మూవీ కోసం ఏఐని అధికారికంగా వాడేశాడు. తాజాగా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేయగా అందులో ఈ టెక్నాలజీతో చేసిన ఔట్‌పుట్ దర్శనమిచ్చింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

వరుణ్ ధావన్, పూజా హెగ్డే, మృణాల్ ఠాకుర్ జంటగా నటించిన లేటెస్ట్ హిందీ సినిమా 'హే జవానీ తో ఇష్క్ హోనా హై'. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లని ప్రేమించే వ్యక్తిగా హీరో కనిపిస్తాడు. సదరు హీరోయిన్లకు పుట్టిన పిల్లలిద్దరూ మాట్లాడుకునే సీన్స్ అన్ని ఏఐలో సృష్టించారు. వాటినే తాజాగా వదిలిన ఫస్ట్ లుక్ టీజర్ వీడియోలో చూపించారు. ఇది ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో మరిన్ని హిందీ, తెలుగు, పాన్ ఇండియా చిత్రాల్లో ఈ టెక్నాలజీని అధికారికంగానే ఉపయోగించేయనున్నారు.

(ఇదీ చదవండి: కుమారస్వామి కథతో ఎన్టీఆర్ సినిమా.. టైటిల్ ఫిక్సయిందా?)

Advertisement
 
Advertisement
Advertisement