''ఒరాకిల్‌ ఉద్యోగం పోయింది.. మేకలు పెంచాలనుకుంటున్నా'' | Laid Off Oracle Engineer Seeks Career Advice Considers Goat Farming | Sakshi
Sakshi News home page

''ఒరాకిల్‌ ఉద్యోగం పోయింది.. మేకలు పెంచాలనుకుంటున్నా''

Apr 11 2026 8:36 PM | Updated on Apr 11 2026 9:24 PM

Laid Off Oracle Engineer Seeks Career Advice Considers Goat Farming

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లోనూ విస్తరిస్తున్న తరుణంలో.. టెక్ రంగంలో ఉద్యోగాల కోతలు పెరుగుతున్నాయి. ఈ తరుణంలో ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తన భవిష్యత్ గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో సలహాలు కోరాడు.

''ఒరాకిల్‌లో సీనియర్ SDEగా ఉద్యోగం కోల్పోయాను. మా సొంత ఊరిలో ఏదైనా జాబ్ చేద్దామంటే? వచ్చే జీతం నేను ఇంతకుముందు పొందుతున్న దానికి ఏమాత్రం సరిపోదు, ఆ డబ్బుతో ప్రతి నెలా నా కార్ లోన్ కూడా కట్టలేను. నేను సుమారు 15 లక్షల రూపాయలు పొదుపు చేశాను. నేను భారతదేశంలో ఏ వ్యాపారం చేయగలను? నేను మేకల పెంపకం చేయవచ్చా? నేను కష్టపడి పనిచేసే వ్యక్తిని, ఒక చిన్న చవకైన భూమి కొని ఒక చిన్న ఆఫీసు పెట్టుకుని, ఫ్రీలాన్స్‌గా పని వెతుక్కుంటూ, మేకలను పెంచుకుంటూ జీవించగలను. నాకు ఏం చేయాలో పాలుపోవడం లేదు, దయచేసి సహాయం చేయండి'' అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

దీనిపై స్పందించిన కొందరు నెటిజన్లు, అతను టెక్నాలజీ రంగంలోనే కొనసాగాలని సూచించారు. ముఖ్యంగా AIపై నైపుణ్యాలు పెంచుకుని, కొత్త అవకాశాలను వెతకాలని సూచించారు. మరికొందరు గోట్ ఫార్మింగ్ మంచి వ్యాపారమని చెప్పినప్పటికీ, అందులో స్థిరపడడానికి ఒకటి.. రెండు సంవత్సరాలు పట్టవచ్చని హెచ్చరించారు.

ఇంకొంత మంది మరింత జాగ్రత్తగా ఆలోచించాలని సూచిస్తూ, ముందుగా ఒక స్థిరమైన ఉద్యోగం సంపాదించి, ఆ తర్వాత మీ పొదుపును అదనంగా ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టండి. మీ అనుభవంతో, దాన్ని నడపడానికి మీరు వ్యక్తులను నియమించుకోవచ్చు. ఆ వ్యాపారం మీ జీతం కంటే ఎక్కువ స్థిరమైన ఆదాయాన్ని సంపాదించడం ప్రారంభించిన తర్వాత, మీరు దానిని పూర్తికాల ఉద్యోగంగా పరిగణించవచ్చు'' అని సూచించారు.

ఇదీ చదవండి: బంగారం ధరల్లో భారీ మార్పు: ఏడు రోజుల్లో ఇంతలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement