టీసీఎస్‌లో కొత్త ఉద్యోగాలు: ఈ ఏడాది ఎన్నంటే? | TCS Makes Only 25000 Fresher Offers This Fiscal Know The Details Here | Sakshi
Sakshi News home page

టీసీఎస్‌లో కొత్త ఉద్యోగాలు: ఈ ఏడాది ఎన్నంటే?

Apr 12 2026 5:36 PM | Updated on Apr 12 2026 7:17 PM

TCS Makes Only 25000 Fresher Offers This Fiscal Know The Details Here

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరంలో ఫ్రెషర్స్ నియామకాలపై స్పష్టత ఇచ్చింది. FY27లో ఇప్పటికే 25,000 ఫ్రెషర్స్‌కు ఆఫర్లు ఇచ్చామని, మార్కెట్ డిమాండ్ పరిస్థితిని బట్టి మరిన్ని నియామకాలు చేపట్టే అవకాశముందని సంస్థ సీఈఓ కే కృతివాసన్ తెలిపారు.

2026 ఆర్ధిక సంవత్సరంలో 44,000 మంది ఫ్రెషర్స్‌ను నియమించి, ప్రైవేట్ రంగంలో అత్యధిక నియామకాలు చేపట్టిన కంపెనీల జాబితాలో ఒకటిగా నిలిచిన టీసీఎస్.. ఈ ఏడాది నియామకాలను తగ్గించే అవకాశం ఉందని సమాచారం.

FY26లో సంస్థ 12,000 మంది ఉద్యోగులను తొలగించినప్పటికీ, అది ఏఐ ప్రభావం వల్ల కాదని, ప్రాజెక్టుల అమలు విధానంలో మార్పులు రావడం వల్ల ముఖ్యంగా సీనియర్ స్థాయి ఉద్యోగుల అవసరం తగ్గినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కృతి వాసన్ తెలిపారు. అయితే.. సంస్థ భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టడం కొనసాగిస్తుందని, ప్రస్తుత వ్యాపార పరిస్థితి స్థిరంగా ఉందని, కొత్త ప్రాజెక్టులు విభిన్న రంగాలు, ప్రాంతాల్లో పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి: వెండి రేటు జోరు: కేజీ రూ.2.65 లక్షలు!

Advertisement
 
Advertisement
Advertisement