ఆర్టిఫిషియల్ ఇం టెలిజెన్స్ టెక్నా లజీ దుర్వి నియోగం ప్రపంచవ్యాప్తంగా పెనుముప్పుగా మారుతోంది. కేవలం సాంకేతిక ఆవిష్కరణగా భావించిన AI... మోసగాళ్ల చేతిలో ఓ ఆయుధంగా మారగా... బాధితులు... సామాన్యులకు మాత్రం ప్రాణం సంకటంగా మారుతోంది. వ్యక్తిగత రహస్యాలు... వారి గోప్య త... ఆత్మాభిమానాన్ని దెబ్బ తీసే ప్రమాదకర సాధనం గా రూపాంతరం చెందిం ది. ఈ కొత్త రకం సైబర్ నేరాలు మన దేశంలోనూ కలకలం సృ ష్టిస్తున్నా యి.
ఇటీవల చోటు చేసుకుంటున్న విభిన్నమైన కేసులు AI ఆధారిత మోసాల గురించి జాగ్రత్తలు పాటించడం.. వాటి గురించి అవగాహన కలిగి ఉండటం ఎంత ముఖ్యమో తెలియజేస్తాయి.
కేరళలో ఓ ప్రొఫెసర్‌కు వీడియో కాల్ వచ్చింది. సాధారణ కాల్ అని వీడియో ఆన్ చేశారు... అందమైన అమ్మాయి ప్రత్యక్షమైంది.. వీడియో ద్వారా సంభాషణ సాగిస్తూ... ఆయనను ట్రాన్స్‌లోకి తీసుకెళ్లింది. ఆయన వాస్తవాన్ని మరిచి ఊహాలోకాల్లోకి వెళ్లిపోయారు... సీన్ కట్ చేస్తే... ఆయన నగ్న వీడియోలు.. అమ్మాయితో మాట్లాడుతున్న సంభాషణ ఆయన ఫోన్‌కే వచ్చాయి. అసలు అది అమ్మాయి కాదు AI సృష్టించిన బొమ్మ అని తె
లిసి... ప్రొఫెసర్ మాత్రం ఘోరంగా మోసపోయాడు. మోసగాళ్లకు రూ. 2 లక్షలు ఇచ్చిన తర్వాత వేధింపులు ఆగక పోవడంతో పోలీసులను ఆశ్రయించాడు.
గతేడాది ఢిల్లీలో విద్యార్థినుల ఫొటోలను న్యూ డ్‌గా మార్ఫ్ చేయడం....
ఛత్తీస్‌గఢ్ ఐఐఐటీ విద్యార్థి.... 36 మం ది అమ్మాయిల ఫొటోలను మార్చి వాటిని వైరల్ చేసిన కేసు..
అస్సాం లో ఇంజినీర్ ఆన్‌లైన్‌లో నకిలీ న్యూ డ్ కంటెం ట్ సృ ష్టిం చి డబ్బు సం పాదిం చిన విధానాలు చూస్తుంటే
సాంకేతికతను అడ్డం పెట్టుకుని ఎలా మోసం చేస్తున్నారో గమనించవచ్చు.
AI దుర్వి నియోగం ఎంతటి మానసిక క్షోభకు గురి చేస్తుందో హర్యానాలోని ఫరీదాబాద్‌లో జరిగిన ఘటన దేశాన్ని కుదిపేసింది. 19 ఏళ్ల డిగ్రీ
విద్యార్థి... తన ముగ్గురు సోదరీమణులకు సంబంధించిన ఏఐ సృష్టించిన అశ్లీల ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌కు గురై.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇలా ఒకటి రెండు ఘటనలు మాత్రమే కాదు... నిత్యం కొన్ని వందల సంఖ్యలో బాధితులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోసాల బారిన పడుతున్నారు.
ఇలాంటి మోసాల నుంచి బయట పడాలంటే ప్రజలు...
సమాజం సమష్టిగా కృ షి చేయాల్సిన అవసరం ఉంది. ఏఐ దుర్వినియోగం చేసిన వారిని గుర్తించి కఠిన శిక్షలు విధించాలి. ప్రజల్లో అవగాహన పెంచాల్సిన ఆవశ్యకత ఉంది.
యువతలో డిజిటల్ భద్రత, ప్రైవసీ, సైబర్ నేరాలపై తప్ప నిసరిగా అవగాహన పెంచాలి.
సోషల్ మీడియాలో కంటెంట్ తొలగిం పు వ్య వస్థ ఉండాలి.
సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ లు తమ వేదికలపై AI-జనరేటెడ్ అభ్యంతరకర కంటెంట్‌ను గుర్తిం చి, వెం టనే తొలగించేం దుకు బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
బాధితులకు మద్దతుగా సహాయ కేంద్రాలు ఏర్పా టు చేయాలి.
బాధితులకు మానసిక, చట్టపరమైన సహాయం
అం దిం చే కేం ద్రాలను ఏర్పా టు చేయాలి. మహిళలు ఎటువం టి భయం లేకుండాఫిర్యా దు చేసే వాతావరణాన్ని కల్పించాలి.
ఫరీదాబాద్ ఘటప యావత్ సమాజానికి ఒక హెచ్చరిక లాంటిది...
టెక్నా లజీ మనిషి జీవితాన్ని మెరుగుపరచాలి....


