పరీక్షలు ముగిశాయి. అసలైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇది . మీకు వచ్చిన మార్కులు, ర్యాంకు కంటే మీరు తీసుకోబోయే ఈ నిర్ణయమే చాలా ముఖ్యం.
- రాహుల్ అత్తులూరి (సిఈఓ & కో-ఫౌండర్, నెక్స్ట్ వేవ్)
ఇంటర్ పూర్తయిన సందర్భంగా ఆ సంతోషాన్ని ఎంజాయ్ చేయండి. ఈ రెండేళ్లు మీరు పడ్డ కష్టం, నిద్రలేని రాత్రులు, ఒత్తిడి.. వీటన్నిటికీ తగిన ఫలితం మీరు పొందారు.
కానీ, రిజల్ట్స్ వచ్చిన మరుక్షణమే సెలబ్రేషన్స్‌తో పాటు ఒక కొత్త రకమైన టెన్షన్ మొదలవుతుంది. చుట్టాల ప్రశ్నలు, పక్కింటోళ్ల పోలికలు, పేరెంట్స్ ఆందోళన.. ఈ గందరగోళం మధ్యలో మీ లైఫ్ మొత్తాన్ని ప్రభావితం చేసే ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది.
ఒక విషయం క్లియర్‌గా చెప్తాను వినండి. మీ ఇంటర్ మార్కులు గానీ, పర్సంటేజీ గానీ, జేఈఈ ర్యాంకు గానీ.. ఇవేవి కూడా మీరేంటో నిర్ణయించలేవు. ఉదాహరణకి ప్రతి ఏటా సుమారు 14.5 లక్షల మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ రాస్తారు, కానీ అందులో కేవలం 18 వేలు మాత్రమే ఐఐటీ సీట్లు పొందుతున్నారు. అంటే ప్రతి వంద మందిలో 99 మందికి ఐఐటీ సీటు రాట్లేదు. దానికి కారణం వాళ్లకు టాలెంట్ లేకపోవడం కాదు, అక్కడ సీట్లు లేకపోవడమే. జేఈఈ అనేది సీట్ల కోసం పెట్టే ఒక ఫిల్టర్ మాత్రమే, అంతే తప్ప అది మీ టాలెంట్‌నో లేదా మీ ఫ్యూచర్ సక్సెస్‌నో నిర్ణయించేది కాదు.
ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ లో మంచి మార్కులు రాకపోయినా, ఐఐటీ లేదా ఎన్ఐటీల్లో సీటు రాకపోయినప్పటికీ, లైఫ్ లో అద్భుతంగా రాణిస్తున్న వాళ్లు వేలల్లో ఉన్నారు. వాళ్లు పెద్ద పెద్ద కంపెనీలకు సీటీఓ లుగా, స్టార్టప్ ఫౌండర్లుగా, గ్లోబల్ టెక్ కంపెనీల్లో ఏఐ టీమ్స్ లీడర్లుగా ఉంటూ.. ఏటా 30 నుంచి 40 లక్షల ప్యాకేజీలు సంపాదిస్తున్నారు. వాళ్లు సక్సెస్ అవ్వడానికి కారణం 18 ఏళ్ల వయసులో వాళ్లకు వచ్చిన ర్యాంకు కాదు, ఆ తర్వాత నాలుగేళ్ల వాళ్లు గడిపిన విధానం.
మీ జీవితంలో ఒక కొత్త మలుపు
చాలామంది స్టూడెంట్స్ ఏదో హడావిడిగా, పక్కవాళ్లను చూసి తమ కెరీర్ నిర్ణయాన్ని తీసుకుంటారు. సరిగ్గా అక్కడే సరిదిద్దుకోలేని పొరపాటు జరుగుతుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు తీసుకోబోయే నిర్ణయమే మీ జీవితం ఎలా ఉండాలో నిర్ణయిస్తుంది.
ఇక నుంచి కేవలం మీ చదువులోనే కాదు, మీ సక్సెస్ను కొలిచే పద్ధతిలో కూడా ఒక పెద్ద మార్పు మొదలవుతుంది. గత 18 ఏళ్లుగా, టెన్త్ క్లాస్ పర్సంటేజీ, ఇంటర్ పర్సంటేజీ, జేఈఈ ర్యాంకు ఇలా అంతా అంకెల చుట్టూనే తిరిగింది…ఒకటే ఎగ్జామ్, ఒకటే రోజు, ఒక్కటే ఛాన్స్. కానీ, ఆ ఆట ఇక్కడితో అయిపోయింది.
ఇప్పుడు మొదలయ్యే కొత్త ఆటలో నియమాలు పూర్తిగా వేరుగా ఉంటాయి. మీరు ఏం తయారు చేయగలరు? ఎలాంటి సమస్యలను పరిష్కరించగలరు? మీరు ఎంత విలువను సృష్టించగలరు? అనేదే ఇక్కడ ముఖ్యం. నిజానికి ఇది మీకు ఎంతో స్వేచ్ఛను ఇచ్చే విషయం. ఎందుకంటే, ఇప్పటి వరకు మీకు ఒక్కటే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు, ప్రతి రోజూ మీకు ఒక కొత్త అవకాశమే. ఏదో ఒకటి నేర్చుకోవడానికి, ఏదైనా నిర్మించడానికి, మీ సత్తా ఏంటో నిరూపించుకోవడానికి ప్రతి రోజూ ఛాన్స్ ఉంటుంది. ఈ మార్పును ఎవరైతే ముందుగా గుర్తిస్తారో, వాళ్లు రాబోయే నాలుగేళ్లు కేవలం అందరిలా గడపడమే కాదు, ఆ కాలాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని చరిత్ర సృష్టిస్తారు.
రాబోయే నాలుగేళ్లు అసలు ఏం నిర్ణయిస్తాయి?
ఈ ఏడాది మొదట్లో దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు వెళ్ళినప్పుడు… అక్కడ ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన ఎడ్యుకేషన్ మినిస్టర్లు, పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలు, ప్రపంచ స్థాయి ఏఐ రీసెర్చర్లతో కలిసి చర్చిస్తుంటే, వాళ్లందరూ ఒకే మాట చెప్పారు. ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థలు విద్యార్థులను భవిష్యత్తు కోసం సిద్ధం చేయడం లేదు. యూనివర్సిటీల్లో ఇంకా 15-20 ఏళ్ల క్రితం నాటి టెక్నాలజీలనే బోధిస్తున్నారు. కేవలం డిగ్రీ ఉంటే సరిపోదని రిక్రూటర్లు స్పష్టంగా చెప్తున్నారు. అభ్యర్థులు సొంతంగా ఏం బిల్డ్ చేయగలరో చూడాలనుకుంటున్నారు.
అన్స్టాప్ టాలెంట్ రిపోర్ట్ 2025 ప్రకారం ఈ రోజుల్లో 73 శాతం మంది రిక్రూటర్లు కాలేజీ పేరు కంటే, మీకు ఉన్న స్కిల్స్కే ప్రాధాన్యత ఇస్తున్నారు. మీ గిట్హబ్ ప్రొఫైల్, మీరు చేసిన ప్రాజెక్టులే మీ కాలేజీ పేరు కంటే ముఖ్యం కాబోతున్నాయి. రాబోయే నాలుగేళ్లు కేవలం డిగ్రీ అనే ఓక పేపర్ సంపాదించడం గురించి మాత్రమే కాదు, భవిష్యత్ కి తగిన స్కిల్ బిల్డ్ చేసుకోవడం గురించి. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న విద్యార్థులు 2030 నాటికి అందరికంటే ముందుంటారు.
మరి మీరు ఏం చేయాలి?
మీరు ఏదైనా కాలేజీని లేదా ప్రోగ్రామ్ను ఎంచుకునేటప్పుడు కేవలం బ్రోచర్లు, క్యాంపస్ ఫోటోలు చూసి నిర్ణయం తీసుకోకండి. వాటికి బదులు ఈ మూడు ప్రశ్నలు అడగండి:
1. పదేళ్ల క్రితం నాటిది కాకుండా, ప్రస్తుతం ఇండస్ట్రీకి ఏం కావాలో దానికి తగ్గట్టుగా సిలబస్ ఎప్పటికప్పుడు మారుస్తున్నారా? లేదా?
2. నేర్చుకునే టైమ్ లో 60 నుంచి 70 శాతం కేవలం థియరీ చదవడం మాత్రమే కాకుండా, ప్రాజెక్టులు చేయడానికి కేటాయిస్తున్నారా? లేదా?
3. లాస్ట్ ఇయర్ వరకు ఆగకుండా, ఫస్ట్ ఇయర్ నుంచే ఇంటర్న్షిప్స్ చేసేలా ప్రోత్సహిస్తున్నారా? లేదా?
ఆ తర్వాత, ప్రపంచం ఏ దిశగా వెళ్తుందో గమనించండి. ఏజెంటిక్ ఏఐ వచ్చేసింది. ఫిజికల్ ఏఐ ప్రపంచాన్ని మార్చేస్తోంది. క్వాంటం కంప్యూటింగ్ మన కళ్లముందే ఉంది. వ్యవసాయం, ఆరోగ్యం, మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఇలా ప్రతి రంగం ఐదేళ్లలో ఈ టెక్నాలజీల వల్ల పూర్తిగా మారిపోబోతున్నాయి. ఎవరైతే విద్యార్థులు ఇప్పుడే ఈ కొత్త టెక్నాలజీలతో ప్రాజెక్టులు చేయడం మొదలుపెడతారో, వాళ్లకు 2030 నాటికి అసలు పోటీ అనేదే ఉండదు.
మార్పు ఎంత వేగంగా ఉందో చూడండి. ఇప్పుడు థర్డ్ ఇయర్ లో ఉన్న స్టూడెంట్స్ 2022లో కాలేజీలో చేరినప్పుడు అసలు చాట్ జీపీటీ, క్లాడ్, లేదా జెమిని లేనే లేవు. ఈ నాలుగేళ్లలోనే ప్రపంచం మొత్తం మారిపోయింది. రాబోయే నాలుగేళ్లలో ఇది ఇంకా వేగంగా మారుతుంది. మీ బాధ్యత ఏంటంటే.. రాబోయే మార్పుకు సిద్ధంగా ఉండటం, అంతే తప్ప జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం కాదు.
సరైన మార్గాన్ని ఎంచుకోవడం
సరైన కాలేజీ లేదా ప్రోగ్రామ్ ఏది అంటే.. స్కిల్స్ బిల్డింగ్ కి పెద్దపీట వేసేవే. అంతే తప్ప అది ఎప్పుడో ఫైనల్ ఇయర్ లో చూసుకోవచ్చులే అనేలా ఉండకూడదు. మొదటి సెమిస్టర్ నుంచే స్టూడెంట్స్ రియల్ ఏఐ ప్రాజెక్టులు, రోబోటిక్స్ మరియు కొత్త టెక్నాలజీలపై పనిచేసేలా వీలు కల్పిస్తున్న చోట చేరండి. ఎక్కడైతే ఇండస్ట్రీ నిపుణులు నేరుగా క్లాస్రూమ్లోకి వచ్చి, వాస్తవ ప్రపంచంలోని సమస్యలను, టూల్స్ను మరియు వారి అనుభవాన్ని పంచుకుంటారో అలాంటి వాటిని వెతకండి.
ఇప్పుడు మీతో కొంత మంది మీలాంటి స్టూడెంట్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను, వాళ్లు ఇంటర్ అయిపోయిన తర్వాత వాళ్ళ మార్కుల గురించి గానీ, ర్యాంకుల గురించి గానీ దిగులుపడలేదు. స్కిల్స్ బిల్డ్ చేసుకోవడమే ముఖ్యం అని తెలుసుకొని దానికి అనుగుణంగా దారిని ఎంచుకున్నారు.
ఉదాహరణకు విశ్వకసేన అనే ఒక స్టూడెంట్ ఇంటర్ తరువాత స్కిల్స్ ముఖ్యమని గ్రహించి ఎన్ఐఏటి అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్ లో చేరి జెనెరేటివ్ ఏఐ పై పట్టు సాధించాడు. తన ఫస్ట్ ఇయర్ లోనే ఏఐ ని వాడుతు ఇన్ఫిల్ అనే ఒక స్టార్టప్ స్టార్ట్ చేశాడు.
అలానే సాయి నవతేజ్ అనే స్టూడెంట్ సరిగ్గా కంపెనీలకు ఏ స్కిల్స్ కావాలో అవి నేర్చుకుంటూ ఫస్ట్ ఇయర్ లోనే స్టైపెండ్ తో కూడిన ఇంటర్న్షిప్ సాధించాడు. ఇలా సాధించడం చాలా అరుదు. అది స్కిల్స్ కి ఉన్న పవర్.
ముంబైలోని 'లెన్డెన్క్లబ్' కార్పొరేట్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ‘ది మేట్రిక్స్ ప్రోటోకాల్ ఏఐ హ్యాకథాన్'లో కొందరు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ తాము నేర్చుకున్న స్కిల్స్ ద్వారా ఎంతో అనుభవం ఉన్న సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్తో, దేశంలోని టాప్ యూనివర్సిటీల విద్యార్థులతో పోటీపడి మరీ తమ సత్తా చాటారు.
అంతే కాదు అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్స్ ఇండియా లో తక్కువగా జరుగుతాయి అదీ ఐఐటీల వంటి టాప్ ఇన్స్టిట్యూట్ లలో ఉన్న లాబ్ లలో మాత్రమే జరుగుతాయి అని చాలా మంది అనుకుంటారు. కానీ… పురుజిత్, నయీమ్, అఖిల మరియు కౌశిక్ కలిసి ‘ఎన్ఐఏటి 5.0 లాబ్స్’ ని ఉపయోగించుకొని ఏఐ ద్వారా కోమా పేషెంట్స్ మనసులోని భావాలను తెలియజేసే గొప్ప ఏఐ ఇన్నోవేషన్ తయారు చేశారు. అంతే కాదు…ఇంకొంత మంది స్టూడెంట్స్ మనుషులు వెళ్లలేని ప్రమాదకరమైన ప్రదేశాల్లోకి వెళ్లగలిగేలా హ్యూమనాయిడ్ రోబోట్ ని ప్రోగ్రామ్ చేశారు, ఏఐ డ్రోన్స్ నిర్మిస్తున్నారు.
ఇలా రాస్తూ వెళ్తే సక్సెస్ స్టోరీస్ వందల్లో ఉంటాయి. వీళ్ళందరిలో కామన్ పాయింట్ ఒకటే... స్కిల్స్ ముఖ్యం అని గ్రహించారు. ఇంటర్ తర్వాత ఎన్ఐఏటి ని ఎంచుకున్నారు.
ఎన్ఐఏటి వంటి అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రీకి అవసరమైన స్కిల్స్ నేర్చుకునేలా డిజైన్ చేయబడ్డాయి. ఇవి విద్యార్థులకు కావాల్సిన ప్లాట్ఫామ్స్ మరియు వాతావరణాన్ని అందిస్తూ, మొదటి రోజు నుండే వారిని 'టెక్ బిల్డర్స్'గా మారుస్తున్నాయి.
చివరగా ఒక మాట
మీ ఇంటర్ రిజల్ట్ అనేది ఒక మైలురాయి మాత్రమే, అది మీ జీవితానికి ఇచ్చే తీర్పు కాదు. ఇది మీ లైఫ్ లో ఎంతో ఉత్సాహంగా ఉండాల్సిన సమయం. దీన్ని ఒత్తిడిగా మార్చుకోవద్దు. మీ ముందు ఎన్నో దారులు ఉన్నాయి. మీరు ఎంచుకునే వాతావరణం, మీరు నేర్చుకునే స్కిల్స్, మీరు పరిష్కరించే సమస్యలే మీ కెరీర్‌ను నిర్ణయిస్తాయి.
భారతదేశపు తర్వాతి తరం 'టెక్ బిల్డర్స్' ఇప్పుడే మొదలవుతున్నారు. ఆ లిస్టులో మీరు కూడా ఒకరు.
అల్ ది బెస్ట్!
For more details: https://rebrand.ly/be7c36


