టెక్‌ ఇండస్ట్రీలో ఏఐ ప్రకంపనలు | Global Tech Layoffs 2026: 51,000 Jobs Lost As AI Reshapes Industry | Sakshi
Sakshi News home page

టెక్‌ ఇండస్ట్రీలో ఏఐ ప్రకంపనలు

Apr 7 2026 12:43 PM | Updated on Apr 7 2026 1:01 PM

Global Tech Layoffs 2026: 51,000 Jobs Lost As AI Reshapes Industry

గ్లోబల్ టెక్నాలజీ రంగంలో కొలువుల కోత కొనసాగుతోంది. 2026 ప్రారంభం నుంచే టెక్ దిగ్గజాలు లేఆఫ్స్ మంత్రాన్ని జపిస్తుండటంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలోకి మళ్లుతున్న పెట్టుబడులు, కంపెనీల పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 51,000 మంది నిపుణులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. నియామకాలు మందగించడం, కేవలం నైపుణ్యం కలిగిన స్వల్ప శ్రామిక శక్తితోనే గరిష్ట ఉత్పాదకత సాధించాలనే లక్ష్యంతో కంపెనీలు అడుగులు వేస్తున్నాయి.

రంగంలోకి ఏఐ

ప్రస్తుత సంక్షోభంలో క్లౌడ్ కంప్యూటింగ్, హార్డ్‌వేర్, గేమింగ్ రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా ఈ ఏడాది చోటుచేసుకున్న ప్రధాన తొలగింపులు కింది విధంగా ఉన్నాయి.

  • ఒరాకిల్.. టెక్ చరిత్రలోనే అతిపెద్ద సింగిల్ డే లేఆఫ్స్‌లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 30,000 మందిని తొలగించింది. ఇందులో భారత్‌కు చెందిన 12,000 మంది ఉండటం గమనార్హం. ఏఐ మౌలిక సదుపాయాల పటిష్టతకే తమ ప్రాధాన్యమని సంస్థ స్పష్టం చేసింది.

  • అమెజాన్.. కొవిడ్‌ సమయంలో పెరిగిన అదనపు సిబ్బందిని తగ్గించుకునే క్రమంలో సుమారు 16,000 మందికి ఉద్వాసన పలికింది. రోబోటిక్స్ విభాగంలోనూ కోతలు విధించడం ద్వారా కార్యకలాపాల క్రమబద్ధీకరణపై దృష్టి పెట్టింది.

  • డెల్.. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా 11,000 ఉద్యోగాలను తొలగించడంతోపాటు కొత్త నియామకాలపై కఠిన ఆంక్షలు విధించింది.

  • బ్లాక్(Block).. జాక్ డోర్సే నేతృత్వంలోని ఈ సంస్థ 4,000 మందిని తొలగిస్తూ ఇంటెలిజెన్స్ టూల్స్ వినియోగం పెరగడమే ఇందుకు కారణమని బహిరంగంగా ప్రకటించింది.

  • మెటా, అట్లాసియన్.. మెటా తన రియాలిటీ ల్యాబ్స్‌లో 10 శాతం సిబ్బందిని తగ్గించగా, అట్లాసియన్ 1,600 మందిని ఇంటికి పంపింది. మారుతున్న ఏఐ నైపుణ్య అవసరాలే ఇందుకు కారణమని అట్లాసియన్ పేర్కొంది.

కారణాలేంటి?

కంపెనీలు తమ మూలధనాన్ని సాధారణ నిర్వహణ నుంచి ఏఐ, ఆటోమేషన్ వైపు మళ్లిస్తున్నాయి. అధిక వడ్డీ రేట్లు, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో ఎఫిషియన్సీ (సామర్థ్యం) పేరుతో ఖర్చులను తగ్గిస్తున్నాయి. సంప్రదాయ కోడింగ్, సపోర్ట్ ఉద్యోగాల కంటే ఏఐ డెవలప్‌మెంట్, డేటా సైన్స్ తెలిసిన వారి కోసమే కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి.

మానవ మేధ vs కృత్రిమ మేధ

ఈ లేఆఫ్స్ పరంపర ఉద్యోగ భద్రతపై పెద్ద చర్చకు దారితీసింది. ఏఐ వల్ల సాధారణ ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఇదే సమయంలో ఏఐ నైపుణ్యం కలిగిన వారికి కొత్త అవకాశాలు వస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ‘టెక్ రంగం ఇప్పుడు ఉద్యోగుల సంఖ్య కంటే సాంకేతిక సామర్థ్యానికే పెద్దపీట వేస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న తొలగింపులు కేవలం ఖర్చు తగ్గింపు మాత్రమే కాదు, అది పరిశ్రమ నిర్మాణంలో వస్తున్న పెను మార్పు. ఉద్యోగులు తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేసుకోకపోతే ఈ డిజిటల్ రేసులో వెనుకబడే ప్రమాదం ఉంది’ అని నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: చల్లారిన పసిడి వేడి! తులం ఎంతంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement