ఉద్యోగులకు ఏఐ ట్రైనింగ్‌.. పియర్సన్‌తో టీసీఎస్‌ జట్టు | TCS Partners with Pearson for AI Driven Workforce Training | Sakshi
Sakshi News home page

ఉద్యోగులకు ఏఐ ట్రైనింగ్‌.. పియర్సన్‌తో టీసీఎస్‌ జట్టు

Mar 22 2026 10:34 AM | Updated on Mar 22 2026 12:38 PM

TCS Partners with Pearson for AI Driven Workforce Training

ముంబై: గ్లోబల్‌ లెర్నింగ్‌ సర్వీసుల సంస్థ పియర్సన్‌తో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) జట్టు కట్టింది. కృత్రిమ మేథతో సిబ్బందికి శిక్షణనిచ్చి, వారిని భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవడంలో కంపెనీలకు తోడ్పాటు అందించేందుకు ఈ భాగస్వామ్యం ఉపయోగపడనుంది. ఇందుకోసం ఇరు సంస్థలు ఏఐ ఆధారిత లెర్నింగ్‌ ప్రోడక్టులు, సర్వీసులను రూపొందిస్తాయి.

నియామకాల్లో, సిబ్బంది అభివృద్ధి ప్రోగ్రాంలలో అభ్యర్ధుల సామర్థ్యాలను మదింపు చేసే ప్రక్రియలో పియర్సన్‌కి చెందిన వెర్సాంట్‌ ఇంగ్లీష్‌ ప్రొఫీషియెన్సీ విధానాన్ని టీసీఎస్‌ ఉపయోగించనుంది. మరోవైపు అంతర్జాతీయ ట్రావెల్‌ సర్వీసులను డిజిటలీకరించే దిశగా ప్రముఖ ట్రావెల్‌ టెక్నాలజీ సంస్థ అమెడ్యూస్‌తో టీసీఎస్‌ చేతులు కలిపింది.

మరోవైపు, ఐటీ ఇన్‌ఫ్రా, డేటా సెంటర్లు, ఇతరత్రా టెక్నాలజీల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకునే దిశగా ఆటోమేషన్‌ దిగ్గజం ఏబీబీ, టీసీఎస్‌ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement